dish
-
రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!
టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి వార్త విని వ్యాపార దిగ్గజాలే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఎన్నో దాతృత్వ సేవలతో అందరి మనుసులను దోచుకున్న మహనీయుడు. నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే రతన్ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయనే ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్.పర్వేజ్‌కు టాటా పరిశ్రమలతో దీర్థకాల అనుబంధం ఉంది. అంతలా పర్వేజ్ రతన్‌టాటాకు ఇష్టమైన చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైలో పుట్టి పెరగిన పర్వేజ్ ప్రస్థానం గ్యారెజీ రెస్టారెంట్ నుంచి మొదలయ్యింది. తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది. మొదట్లో అతడి రెస్టారెంట్ మోటార్ సైకిల్ గ్యారెజ్ వాళ్లకు పేరుగాంచింది.కాలక్రమేణ పార్సీ ఆహార ప్రియులకు హాట్‌స్పాట్‌గా మారింది. సాంప్రదాయ పార్సీ వంటకాలపై పర్వేజ్‌కి ఉన్న ప్రావీణ్యం టాటా గ్రూప్‌తో సహా పలువురిని ఆకర్షించింది. అలా ఆయన టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్లో వంటలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత చెఫ్‌గా మారాడు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో పర్వేజ్ రతన్ టాటాకు హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపాడు. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం తదితారాలంటే ఫేవరెట్ ఫుడ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక పర్వేజ్ వివిధ నగరాల్లో పార్సీ వంటకాలను అందించారు. అలాగే ఐటీసీ ఫుడ్ ఫెస్టివల్స్‌లో భాగంగా చాలామందికి పార్శీ సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు. (చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!) -
ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్
నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వుతోంది. అందులో విదేశాల్లోని రెస్టారెంట్లో మన దక్షిణభారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌ల పేర్లు, ధరలు గురించి షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌లో.. తాను అమెరికాలోని ఓ రెస్టారెంట్ మన దక్షిణ భారతదేశ అల్పహారాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. వాటి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం అన్నారు. నిజంగా ఆ పేర్లు వింటే గనుక ఖానే కా మజా ఖతం(ఇలాంటి పేర్లతో తింటే..తినడంలో ఉండే ఆనందం పోతుంది) అని క్యాప్షన్ జోడించి మరీ సదరు రెస్టారెంట్ మెనుని కూడా జత చేసి మరీ పోస్ట్ చేశారు. అందులో మన దక్షిణ భారతదేశపు అల్పాహారాల పేర్లుకు ఆ మెనులో ఉన్న ఫ్యానీ పేర్లు వరుసగా..వడకి "డంక్డ్ డోనట్ డిలైట్", ఇడ్డీకి "డంక్డ్ రైస్ కేక్ డిలైట్", దోసకి "నేక్డ్ క్రేప్" ఫ్యాన్సీ పేర్లు పెట్టి విక్రయించేస్తున్నారు. ఇక వాటి ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. ప్లేట్ దోసె ధర రూ. 1400/-, ఇడ్లీ సాంబార్ ధర రూ. 1300/-, వడ ధర రూ.1400/-గా మెనులో ధరలు ఉండటం విశేషం. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బహుశా వాళ్లు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పనివాళ్లను పెట్టుకున్నారో అందుకే కాబోలు చుక్కలు చూపించేలా ఈ ధరలు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. Who knew vada, idli, and dosa could sound so fancy? With these strange names khaane ka mazaa khatam! Agree 😂? pic.twitter.com/Px94gQGUAd— Harsh Goenka (@hvgoenka) July 2, 2024 (చదవండి: 'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
ది బెస్ట్ సీఫుడ్ డిష్‌గా ఈ భారతీయ కర్రీకి చోటు!..ఎన్నో స్థానం అంటే..?
భారతదేశంలోని తీర ప్రాంతాలు సీఫుడ్‌కి పేరుగాంచినవి. మన దేశంలో సముద్రపు ఆహారానికి సంబంధించిన అనేక ఐకానిక్ కూరలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ వెజ్ కర్రీ, బెస్ట్ స్వీట్స్,బెస్ట్ రెస్టారెంట్స్ వంటి జాబితాను అందించింది.అలానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ సీఫుడ్స్ డిష్‌ల జాబితాను విడుదల చేసింది.భారతదేశంలోని తీరప్రాంతాలు మంచి రుచికరమైన సీఫుడ్లను అందించడంలో అపారమైన పాక నైపుణ్యం కలిగి ఉంది. ఇవి ఎల్లప్పుడు ది బెస్ట్ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును కూడా దోచుకుంటాయి. అయితే టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ది బెస్ట్ సీ ఫుడ్ జాబితాలో మన భారతీయ సీఫుడ్ కర్రీకి స్థానం దక్కడం విశేషం. జూలై 2024న విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో మన భారతదేశంలోని బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీ 31వ స్థానంలో నిలిచింది. ఇది మంచి ఘుమఘమలాడే రొయ్యల కర్రీ. దీన్ని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మాసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి, అల్లం పేస్టు, దాల్చిన చెక్కె, చక్కెర, ఏలుకులు చేర్చి.. చిక్కటి గ్రేవితో సర్వ్ చేశారు. ఇది దశల వారీగా ఓపికతో తయారు చేయాల్సిన రుచికరమైన వంటకం. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?) -
ఈద్ ఉల్ అధా 2024: బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటీ..?
బక్రీ ఈద్గా పిలిచే ఈద్ ఉల్ అధా ఈ ఏడాది ఇవాళే(జూన్ 17) బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి గుర్తుగా జరుపుకునే విందు. అబ్రహం ప్రవక్త కొడుకు ఇస్మాయిల్ని బలి ఇవ్వమని కోరడం..దేవుడు జోక్యం చేసుకుని బలిగా పొట్టేలుని ఇవ్వడం గురించి ఖురాన్లో ఒక కథనం ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ రోజున పొట్టేలు(మేక) బలి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ..ఒక వ్యక్తి స్థానంలో మరోక జీవిని బలి ఇవ్వడం అనేది.. త్యాగం లేదా ఖుర్బానీ చరిత్రను గౌరవించేందుకు గుర్తుగా ఈ రోజుని ముస్లింలంతా జరుపుకుంటారు. ఈ రోజు మాంసంతో కలిపి వండే బిర్యానీని తయారు చేసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పంచుకుని తింటారు. ఈ పండుగ పురుస్కరించుకుని అసలు ఈ బిర్యానీ ఎక్కడ పుట్టింది..? ఎలా మన భారతదేశానికి పరిచయం అయ్యింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!భారతదేశంలో అత్యంత మంది ఎక్కువగా ఆర్డర్ చేసే వంటకంగా ప్రసిద్ధ స్థానంలో ఉంది బిర్యానీ. కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఇష్టంగా తినే వంటకం కూడా బిర్యానీనే. ఇంతలా ప్రజాధరణ కలిగిన ఈ వంటకం చరిత్ర గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!. బిర్యానీ అన్న పదం 'బిరింజ్ బిరియాన్' (ఫ్రైడ్ రైస్) అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్లో పుట్టలేదన్న వాదనా వినిపిస్తుంటుంది. కానీ ఇరాన్లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలా సేపు దాన్ని ఉడికించి, ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి, ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారుచేస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బిర్యానీ మొఘల్ చక్రవర్తుల ద్వారానే భారత్‌లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి సరైన ఆధారాలు లేవు. అంతేగాదు దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులూ, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కుమంది చెబుతున్న వాదన. ఏదీఏమైనా..నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ, నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా విభిన్న సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కమ్మని రుచితో చేరువైంది. ఇక చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం..ఈ బిర్యానీ వంటకం మొఘల్ శకం, చక్రవర్తి షాజహాన్ భార్య బేగం ముంతాజ్ మహల్ కాలం నాటిదని ప్రసిద్ధ కథనం. ఆమె ఒకసారి పోషకాహార లోపంతో కనిపించిన సైనిక అధికారులను చూసి, వారి కోసం పోషకమైన, చక్కటి సమతుల్య భోజనాన్ని తయారు చేయమని తన రాజ ఖన్సామాలను (వంటచేసేవాళ్లుకు) ఆదేశించింది. దాని ఫలితంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ బిర్యానీ వంటకం రూపొందిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం..1398లో టర్క్-మంగోల్ విజేత తైమూర్ భారత సరిహద్దులను చేరుకున్నప్పుడు అతని సైన్యం కోసం ఈ బిర్యానీని వినియోగించారిని చెబుతారు. సైనికులు కోసం బియ్యం, సుగంధద్రవ్యాలు, మాంసంతో నిండిన కుండను వేడి గొయ్యిలో పాతి పెట్టేవారట. కొంత సమయం తర్వాత తీసి చూడగా బిర్యానీ తయారయ్యి ఉండేదట. ఇది యోధులకు మంచి పోషకాహార భోజనంగా ఉండేదట. ఎక్కువ సేపు ఆకలిని తట్టుకుని ఉండేవారట. ఇక పర్షియన్ పదంలో బిరియన్ అనే పదానికి అర్థం కాల్చడం. బిరింజ్ అంటే అన్నం. పూర్వకాలంలో చాలమంది గొప్ప పండితులు పర్షియా దేశం నుంచి భారతదేశానికి రావడం వల్లే ఈ ప్రత్యేకమైన వంటకం మనకు పరిచయమయ్యిందని చెబుతారు. అయితే మన దేశంలో మాత్రం ఈ బిర్యానీ మాంసం, బియ్యం సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని మాన్సోదన్ అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశం అంతటా అనేక రూపాల్లో బిర్యానీ లభిస్తుంది. మన హైదరాబాద్ బిర్యానీ ఉత్తర, దక్షిణ అంశాలను టర్కిష్ ప్రభావాన్ని మిళితం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, లక్నోలలో బాస్మతీ వంటి పొడవైన బియ్యంతో తయారు చేయగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీరగ సాంబ లేదా కైమా బియ్యం వంటి పొట్టి ధాన్యాలతో తయారు చేస్తారు. ప్రతి బిర్యానీ సుగంధ్ర ద్రవ్యాలు, మాంసంతో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన శైలిలో రూపొందుతుంది. ఈ బిర్యానీ వంటకం ఎలా ఏర్పడిందన్నది తెలియకపోయిన మన రోజూవారీ ఆహారంలో అందర్భాగం అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి ఈద్ సమయంలో ప్రతి ముస్లిం ఇంట ఘుమఘమలాడే మటన్ బిర్యానీ ఉండాల్సిందే. (చదవండి: Eid Al-Adha 2024: మౌలిక విధులు..) -
'వరల్డ్ దోస డే'!: దోస రెసిపీని మొదటగా ఎవరు చేశారంటే..?
భారతదేశంలోని పలు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల్లో దోసదే అగ్రస్థానం. దీన్ని దోస లేదా దోసే/ దోసై వంటి పలు రకాల పేర్లతో పిలుస్తారు. దక్షిL భారతదేశ వంటకమైన ఈ దోసని బియ్యం, మినప్పులను నానబెట్టి రుబ్బగా వచ్చిన మిశ్రమంతో తయారు చేస్తారు. ఎలా పాపులర్ అయ్యిందో తెలియదు గానీ. ప్రపంచమంతా ఇష్టంగా తినే వంటకంగా 'దోస' మొదటి స్థానంలో ఉంది. అందువల్లో దీనికంటూ ఓ రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మార్చి 3ని ఈ వంటకానికి అంకితమిచ్చారు. అందువల్లే ప్రతి ఏడాది ఈ రోజున 'వరల్డ్ దోస డే' గా జరుపుకుంటున్నారు. ఈ వంటకం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యిన వంటకంగా నిలిచింది. ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోసకు క్యాపిటల్‌గా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతలా ఫేమస్ అయిన ఈ దోస వంటకం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామా!. దోస చరిత్ర.. మొదటగా తమిళనాడులో దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత క్రిస్పీగా ఉండే దోసెను కర్ణాటకలో తయారు చేయడం మొదలు పెట్టారు. ఉడిపి అనే రెస్టారెంట్ దోసెను ఇలా క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాల ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. ఈ దక్షిణ భారత వంటాకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. 1930లలో ఉడిపి హోటల్ మద్రాస్‌కి విస్తరించడంతో అక్కడ నుంచి ఢిల్లీకి ఇలా పాకింది. ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్‌లు తమ పాకనైపుణ్యానికి పదును పెట్టి మరీ రకరకాల దోసెలను తీసుకొచ్చారు. ప్రజలు వాటిని కూడా ఆస్వాదించడం విశేషం. అలా దోసెలు కాస్త..మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్‌లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ వంటకం ఎలా వచ్చిందనేదనేందకు కచ్చితమైన ఆధారాలు లేవు కానీ సాహిత్య గ్రంథాల్లో వాటి ప్రస్తావన మాత్రం వచ్చింది. వాటి ఆధారంగా దోస మూలం ఆ రాష్టలేనని భావిస్తున్నారు చరిత్రకారులు. దక్షిణ భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే.. ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తూ శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయపేర్కొన్నాడు. అంతేగాదు కన్నడ సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్లు అచాయ వెల్లడించాడు. అందువల్లే ఈ దోస మూలం ఏ రాష్టం అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. "ది స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్" అనే పుస్తకంలో కర్ణాటక రాజు సోమేశ్వర III గురించి ఉంది. ఆయన తన ప్రాచీన సాహిత్య రచన మానసోల్లాసలో దోసను 'దోసకా' అని సంబోధించాడు. పైగా ఆ వంటకం ఎలా తయారు చేస్తారో కూడా వివరించాడు. ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఉద్భవించిందని ఉంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఏదీఏమైన నోరూరించే ఈ రెసిపీని అందరూ ఇష్టంగా ఆస్వాదించడం విశేషమైతే చెఫ్‌లు వాటి పాకనైపుణ్యంతో వెరైటీ దోసలు పరిచయం చేయంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యి, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలో మంచి క్రేజ్‌ని దక్కించుకున్న టాప్ వంటకంగా నిలిచిపోయింది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్‌లో ఏది ఇష్టపడతారంటే..) -
అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఇదే..!
అందరూ అన్ని కూరగాయలు తినరు. చాలావరకు ఎక్కవ మంది కాకరకాయ, వంకాయ తినని చెబుతుంటారు. వంకాయల్లో తెల్ల వాటినే ఇష్టంగా ఎక్కువ మంది తినడం విశేషం. కానీ ఊదారంగులో ఉండే వంకాయలంటే చాలామంది నచ్చదు. దీంతో ప్రముఖ చెఫ్‌లు చాలా రకాల వంటకాలు కూడా చేస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఊదారంగు వంకాయతో చేసే భారతీయ వంటకమే అత్యంత వరస్ట్ కర్రీగా చెత్త ఆహారాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఎందువల్లా అనే కదా? ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ పోర్టల్ 'టేస్ట్ అట్లాస్' ప్రతి ఏడాది ప్రపంచంలోనే టాప్ వంద చెత్త ఆహారాల జాబితాలను విడుదల చేస్తుంది. అలానే ఈసారి కూడా విడుదల చేయగా.. మనదేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొందిన ఆలు భైంగైన్ ఆ జాబితా స్థానం దక్కించుకుంది. ఇది దాదాపు వంద వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది. దీన్ని బంగాళదుంప, వంకాయ, ఉల్లిపాయ, టమాటాలు, అల్లం వెల్లులి పేస్టు వేసి చేస్తారు. ఇది గ్రేవీ వంటకం. దీన్ని ఇష్టపడే వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే దీనికి తక్కువ రేటింగ్ వచ్చింది. చెప్పాలంటే ఈ రకమైన వంటకాన్ని ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా తింటారట. ప్రపంచంలో అత్యంత వరస్ట్ కర్రీ అత్యంత తక్కువ రేటింగ్‌తో తొలి స్థానం దక్కించుకున్న వంటకంగా హాక్లర్ నిలిచింది. ఇది ఐస్లాండ్కి చెందిన వంటకం. దీన్ని షార్క్ మాంసంతో మూడు నెలల పాటు పులియబెట్టి చేస్తారట. ఇది చాలా ఘాటైన రుచిన కలిగి ఉండటంతో అంత తేలిగ్గా ఎవరికీ నచ్చదట. పైగా తినేవారి సంఖ్య కూడా తక్కువ. ముఖ్యంగా ఐస్లాండ్లో ఉండే స్థానిక ప్రజలే దీన్ని ఇష్టంగా తింటారట. పర్యాటకులు మాత్రం ఆ కూర జోలికి పోనేపోరట. ఇక రెండో స్థానంలో అమెరికాకు చెందని రామన్ బర్గర్ నిలిచింది. దీన్ని రామన్ న్యూడిల్స్‌తో చేసే బర్గర్ ఇది. మధ్యలో మాంసాన్ని నింపి తయారుచేస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది నచ్చుతుంది. కాగా, ఈ టేస్టీ అట్లాస్ పోర్టల్‌లో ఎవరికీ ఏ ఆహారం నచ్చలేదో ప్రతి దేశానికి చెందిన ప్రజలు పాల్గొని చెప్పొచ్చు. అయితే ఏ వంటకాలు బాగోవని తక్కువ రేటింగ్ ఇస్తారో వాటన్నంటిని వంద చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా మన దేశం నుంచి ఆలు భైంగైన్ ఈసారి చోటు దక్కించుకుంది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!
విదేశాల్లో కొన్ని రకాల సముద్ర జాతులు చూసేందుకే చాలా భయంకరంగా ఉంటాయి. ఐతే వాటిని కొంతమంది తింటుంటారు. ఇలాంటివి తినేటప్పుడూ అజాగ్రత్తతో తింటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలానే ఓ వృద్దుడు లైవ్ ఆక్టోపస్‌ని తింటూ.. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఎలా జరిగింది? ఏవిధంగా చనిపోయాడు తదితరాల గురించే ఈ కథనం!. అసలేం జరిగిందంటే..ఆక్టోపస్ ఎలా ఉంటుందో తెలిసిందే. మెలికలు తిరిగిన కాళ్ల మాదిరి చాలా ఉంటాయి. అది వాటితోటే ఏదైన జీవిపై అటాక్ చేసి చంపి తింటుంది. దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ సాన్ నాజ్కి వంటను ఆస్వాదించాడు. ఈ వంకాన్ని పచ్చిగా ఉన్న ఆక్టోపస్ మాంసలపై నువ్వులు వేసి కొన్ని రకాల సుగంధద్రవ్యాలను కలిపి నేరుగా తినేస్తారు. ఆ వృద్ధుడు కూడా ఇలానే తిన్నాడు వృద్ధుడు. ఐతే అతను తింటున్నప్పుడూ ఆ ఆక్టోపస్‌కు ఉండే టెన్టకిల్స్(కాళ్ల మాదిరిగా ఉండే భాగాలు) మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఆనందంగా తినడంపైనే దృష్టి పెట్టాడు. ఇంతలో ఆ టెన్టకిల్ ముక్క ఒకటి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయాడు. అందుకే ఆరోగ్య నిపుణులు పలుమార్లు ఈ ఆక్టోపస్ రెసిపీలు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఇలానే వ్యవహరించి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని అన్నారు. నిజానికి ఇలా లైవ్ ఆక్టోపస్ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ఈ రెసిపీ అందరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ ఇలానే టేస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా లైవ్ ఆక్టోపస్ డిషిని తిని సుమారు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కూడా. వాస్తవానికి సజీవంగా ఉన్న ఆక్టోపస్ ముక్కలు చేసినా.. దాని భాగాలు ఇంకా కదులుతూనే ఉంటాయి. అందులోని ఈ రకమైన సాన్‌నాజ్కి డిష్‌ని వండకుండా పచ్చిగానే తింటారు. అలాంటప్పుడు అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్టు గురవ్వడం జరుగుతోంది. ఊపిరాడకపోతే కార్డియాక్ అరెస్టు జరుగుతుందా..? ఒక వస్తువు గొంతులో ఇరుక్కుపోతే వాయు మార్గాన్ని మూసేస్తుంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దీంతో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ప్రభావం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సమీపంలో ఉన్నవాళ్లు బాధితులకు ఊపిరి ఆడేలా ఆక్కిజన్ అందించేలా చూడాలి. లేదా ఆ అడ్డంకి తొలగించే యత్నం అయినా చేయాలి. కొందరికైతే గొంతులో ఇరుక్కుపోయి పెద్ద పొలమారిన దగ్గులా వచ్చి రక్తపోటు పెరగిపోవడం జరుగుతంది. చివరికి గుండె మీద ప్రభావం ఏర్పడి ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే గొంతులో ఉన్న అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసీ సీపీఆర్ చేస్తే మనిషి బతికే అవకాశాలు ఉంటాయి. (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
అక్కడ చేపలు జస్ట్ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్ ఖాయం!
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు. పైగా చేపనూనె లేదా చేపతో చేసిన రెసిపీలు కనీసం వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలా మంచిదని పదేపదే ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు కూడా. కానీ ఆ దేశంలోని చేపలు గురించి వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు వింటే వెంటనే మీ నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే చేపలను జస్ట్ తినాలని ట్రై చేసినా చాలు మందులతో కూడా నయం చేయలేని భయానక క్యాన్సర్ రావడం పక్కా అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. అక్కడ చేపలతో చేసిన వంటకాలనే అక్కడ ప్రజలు చచ్చేంత ఇష్టంగా తింటారట. ఆ చేప కథకమామీషు ఏంటో చూద్దాం!. థాయ్ వంటకాలకు అత్యంత రుచికర, ఆరోగ్యకరమైన వంటకాలుగా మంచి ప్రసిద్ధి. కానీ అక్కడ ఓ చేప వంటకం మాత్రం చాలా డేంజర్ అని దాదాపు 20 వేల మంది మరణాలకు కారణమైందని వైద్యులు షాకింగ్ విషయాలు చెబుతున్నారు. థాయ్‌లోని కోయి ప్లా అనే మంచి నీటి చేప చాలా ప్రమాదకరమైందని ఒక్కసారి తిన్నా చాలు ఆ క్యాన్సర్ బారిన పడటం ఖాయం అంటున్నారు వైద్యులు. కానీ అక్కడ ఈ చేపకు సంబంధించి వివిధ రకాల వంటకాలకు చాలా ప్రసిద్ధి. పైగా ప్రజలు కూడా ఆ చేప వంటకాలను తెగ ఇష్టంగా తింటుంటారు. థాయ్‌లోని ఖోన్‌సాన్, ఇసాన్ వంటి ప్రాంతాల్లో ఈ చేప వంటకాలను ఎక్కువగా తింటారట. ఈ వంటకానికి సంబంధించి కొంచెం తిన్నా చాలు ఆ భయనక క్యాన్సర్ కచ్చితంగా వస్తుందని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తిన్న వారికి కొద్ది రోజులు లేదా నెలల్లోనే కాలేయ సంబంధ క్యాన్సర్ వ్యాధి బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ చేపలో లివర్ ఫ్లూక్ అనే ఫ్లాట్ వార్న్ పరాన్నజీవి ఉందని ఇది కాలేయం పిత్తాశయం, చిన్నపేగులను కలిపి ఉండే ప్రాంతంలో దాడి చేసి పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్‌కి దారితీస్తుందని అంటున్నారు. ఈ చేపలను తినే ఆయా ప్రాంతాల్లో సర్వే చేయగా..దాదాపు 80 శాంత మంది శరీరంలో ఆ పరాన్నజీవి ఉందని వారంతా కూడా పిత్తాశయం లేదా కాలేయం క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందని వెల్లడైంది. ఆయా బాధితులకు చికిత్స అందించడం కూడా ఓ సవాలుగా ఉందన్నారు. అంతేగాదు బాధితుల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందన్న నిర్థారణ ఆధారంగానే ఆ వ్యక్తలు నెలలు లేదా సంవత్సరాలు బతకగలరని అంచనా వేసి చెప్పగలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్యాన్సర్ లక్షణాలు.. పిత్తాశయం లేదా కాలేయ క్యాన్సర్ వచ్చే వ్యక్తుల్లో కళ్లు చర్మం పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది, చర్మం చాలా దురదగా ఇరిటేషన్‌గా ఉంటుంది. ఆకలిని కోల్పోవడం. ఏ ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం సడెన్‌గా అధిక ఉష్ణోగ్రత లేదా వణుకుపోతున్న ఫీలింగ్ ఈ చేపల్లోని ఫ్లాట్ వార్మ్ పిత్తవాహికలో ఏళ్ల తరబడి నివశిస్తాయని చెబుతున్నారు వైద్యులు. వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా కాలేయ వాపుగానే కనిపిస్తుందని వాటిని గుర్తించలేం అని తెలిపారు ఆరోగ్య నిపుణులు. మనిషి బలహీనపడినప్పుడూ ఒకేసారి ఆ పరాన్నజీవి విజృంభించడం మొదలు పెట్టి క్యాన్సర్ బారిన పడేల చేస్తుందని చెబుతున్నారు. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
అంతరిక్షంలో చెత్త వదిలినందుకు రూ.1.24 కోట్ల జరిమానా
వాషింగ్టన్: అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్ నెట్వర్క్ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్‌సీసీ) 1,50,000 డాలర్ల(రూ.1.24 కోట్లు) జరిమానా విధించింది. అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. డిష్ నెట్వర్క్ కంపెనీ 2002లో ఎకోస్టార్–7 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరుకున్న ఈ ఉపగ్రహం కాలపరిమితి 2022లో ముగిసింది. నిరుపయోగంగా మారిన ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి 299 కిలోమీటర్ల దూరం పంపించాల్సి ఉంది. 122 కిలోమీటర్లు వెళ్లాక ఇంధనం నిండుకోవడంతో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది. ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారింది. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలను చెత్తగానే పరిగణిస్తారు. 1957 నుంచి ఇప్పటిదాకా 10 వేలకుపైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించారు. వీటిలో సగం శాటిలైట్లు పనిచేయడం లేదు. -
ఆ పీతల కూర ఎంత పనిచేసింది..చివరికి పోలీస్‌స్టేషన్..
మాములుగా అత్యంత అరుదుగానే వేరే ప్రాంతానికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అయితే బాగా ఖరీదుగా ఉంటాయి. అది కూడా మహా అయితే వెయ్యి లేదా ఆపైన ఉంటుంది. కానీ మనకు తెలిసిన ఐటెం అందుబాటులో ఉండేది అంత ధర ఉండదు. పోనీ ఓ పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ఘోరమైన ధర ఫలకదు. కానీ ఇక్కడొక జపాన్ టూరిస్ట్‌కి మాత్రం తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెం ధర విని మాటలు రాలేదు. ఏడుపుఒక్కటే తక్కువ అన్నంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. చివరికి పోలీసులను కూడా ఆశ్రయించింది. జపాన్‌కి చెందిన షిన్బా తన స్నేహితులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ఆగస్టు 19న ప్యారడైజ్ రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా ఆమె చిల్లి క్రాబ్ ఆకర్షించడంతో వెంటనే దాన్ని కూడా ఆర్డర్ చేసింది. అయితే సర్వర్ దాని ధర కేవలం 20 డాలర్లు(రూ.1,661/-) చూపించాడు. దీంతో అంత పెద్ద మొత్తం ఏం కాదుకదాగా అని ధైర్యంగా ఆర్డర్ చేసింది తీరా తిన్నాక సర్వర్ ఇచ్చిన బిల్లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఒక్కరు తింటే అంతే అయ్యేది కాని ఇక్కడ తిన్నది నలుగురు కాబట్టి దాని ధర అంతేనని తేల్చి చెప్పారు రెస్టారెంట్ సిబ్బంది. దీంతో ఒక్కసారిగా ఆమె షాకయ్యింది. అది అలస్కాన్ కింగ్ చిల్లీ క్రాబ్ అని దాని ధర అంతే ఉంటుందని చెప్పడంతో ఆమెకు ఒక్కసారిగా అయోమయంగా అనిపించింది. ముందుగానే సర్వర్‌ని ఆ పీతల కూర రెసిపీ ధర అడిగే ఆర్డర్ చేస్తే ఇలా అనడం అర్థం కాలేదు. అది కూడా ఆ బిల్లు ఏకంగా రూ. 56,603 అని ఉండేటప్పటికీ ఏమని ప్రశ్నించాలో తెలియలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారు వచ్చి ఆ రెస్టారెంట్ అధికారులను అడిగితే..అంతకుముందు అదే రెసిపీకి వెరొక కస్టమర్ పే చేసిన బిల్లు చూపించి దీని ఖరీదు ఎక్కువ అని చెప్పారు. ఇక ఆ పీతను కూడా తీసుకొచ్చి ఇది చాలా బరువుగా ఉంటుందని, కస్టమర్ ఆర్డర్ చేయంగానే అప్పటికప్పుడు వండి పెడతామని చెప్పడంతో ఆమెకు నోటి మాట రాలేదు. అయితే అంత ఖరీదైన పీతలు గురించి క్లియర్‌గా మెనులో ఎందుకివ్వలేదు. సర్వర్ నాకు ఇలా 20 డాలర్లని ఎందుకు చూపించాడు అని వాదనకు దిగింది. ఆ రెసిపీ వందగ్రాములే 20 డాలర్లు అని అర్థం అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. ఇక కాసేపటి చర్చల అనంతరం సదరు రెస్టారెంట్ సహృద్భావంతో 70 డాలర్లు (రూ. 6.749) తగ్గించేందుకు ముందుకు వచ్చింది. కానీ సదరు కస్టమర్ కట్టేందుకు నిరాకరించింది. పైగా సదరు రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాదు ఈ విషయమై సింగపూర్ టూరిజం బోర్డుని కూడా సంప్రదించింది. వారు ఆమెన సింగపూర్ వినయోగాదారుల అసోసీయేషన్ని సంప్రదించమని చెప్పారు. ఇష్టంగా తిన్న పీతల కూర రగడ కాస్త కేసుల వరకు వెళ్లి తీరని చేదు అనుభవాన్ని మిగిల్చింది. (చదవండి: అత్యంత అరుదైన పావురం!చూస్తే..షాకవ్వడం ఖాయం) -
వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరట..!
ముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మన్యంలో అయితే మరెన్నో రకాల కూరగాయలు లభ్యమవుతాయి. వెదురు నుంచి తీసిన కూరని ఎప్పుడైన వండుకొని తిని ఉంటారా? వినడానికే ఎంతో కొత్తగా ఉన్న మన్యం వాసులు మాత్రం వెదురు నుంచి తీసిన చిగురును కూర వండుకొని తింటారు. దీనిని మన్యం వాసులు వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. కానీ వెదురు కంజి కూర టేస్టే వేరు. వెదురు కొమ్ములు సీజన్ మొదలైయింది. ప్రస్తుతం మన్యంలో మండల కేంద్రాలు, వారపు సంతల్లో వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా జరుగుతున్నాయి. అటవీ, కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని సంతల్లో రూ.20 నుంచి రూ.50 లు వరకు వాటాలుగా విక్రయిస్తారు. వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారికి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఒక రకంగా కూర తయారు చేస్తారు. వెదురు కంజిని ఎండబెట్టి మరో విధంగా కూర తయారికీ వినియోగిస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కూర తయారు చేసుకోవాలి. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజినీ బాగా కడుగుకోవాలని గిరిజనులు చెబుతున్నారు. ఎండబెట్టుకొని ఉంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారికి వినియోగించుకోవచ్చు. ఈ వెదురు కంజి కూరను మన్యం వాసులంతా చాలా ఇష్టంగా తింటారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరును తయారు చేస్తారు. ఎన్నో ఉపయోగాలు వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు, మూడు సార్లు నీటితో శుభ్రం చేస్తారు. అప్పుడు వెదురు కంజిలో ఉండే చేదుపోతుంది. బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తీసుకుంటారు. దీంతో రక్తం శుద్ధి అవుతుందని, శరీరానికి తక్షణ శక్షి అందుతుందని, జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు నులిపురుగులను నివారిస్తుందని గిరిజనులు చెబుతారు. వెదుర కంజి ద్రావణాన్ని మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా సైతం వినియోగిస్తారు. వెదురు కంజి ఉపయోగాలెన్నో అని గిరిజనులు చెబుతారు. సంతల్లో జోరుగా అమ్మకాలు వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ20, రూ.50 చొప్పున అమ్ముతున్నాము. గతంలో మా గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగాను, ఉడకబెట్టి విక్రయిస్తున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. – కె.దొణ, పెదతమ్మెంగుల గ్రామం, ముంచంగిపుట్టు మండలం రుచికరంగా వంటకాలు వెదురు కొమ్ములతో తయారుచేసిన వంటకాన్ని ఎక్కువగా గర్భిణులకు అందజేస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం వెదురు కంజి కూరల్లో ఉంటుంది. వెదురు కొమ్ముల కూర రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి.అడవీ, కొండ ప్రాంతాల్లో లేత వెదురు నుంచి వెదురు కొమ్ములను సేకరిస్తారు .వారపు సంతలో విక్రయిస్తారు. – రాధమ్మ, సుజనకోట గ్రామం, ముంచంగిపుట్టు మండలం (చదవండి: పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!) -
ఇదేం వంటకం రా అయ్యా!.. తినడం కాదు చూస్తేనే వణుకొస్తోంది
భోజన ప్రియులు, కుకింగ్ వీడియోలు చేసేవాళ్లు చిత్ర విచిత్రాల ఫుడ్ కాంబినేషన్లు ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా వాటిని వీడియోల రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంటారు. వీటిలో కొన్ని వంటకాలు నెటిజన్లకు నచ్చుతుండగా.. మరికొన్ని మాత్రం ఇవేం వంటకాలంటూ పెదవి విరుస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఓ తైవానీస్ రెస్టారెంట్ వంటకం బయటకు వచ్చింది. ‘గాడ్జిల్లా రామెన్’గా పిలువబడే ఆ వంటకంలో మొసలి కాలు చూసి ప్రజలు వణుకుతున్నారు. ఇదేం వంటకం రా అయ్యా! వింత అంటే చాలు తక్షణమే అది సోషల్ మీడియాలో తక్షణమే కావాల్సిందే. ఈ మధ్యకాలంలో కొందరు వెరైటీ కాంబినేషన్లో తయారు చేస్తూ సరికొత్త రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వీటిలో కొన్ని వంటకాలు చూసేందుకు బాగున్నట్లు అనిపించగా.. మరికొన్ని కాంబినేషన్లు తింటే ఏమౌతుందో అని ఫుడ్ లవర్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. తాజాగా తైవానీస్ రెస్టారెంట్ చేసిన ఓ వంటకం విచిత్రంగా, వికారంగా కనపడుతూ ఉన్నప్పటికీ అది ప్రజాదరణ పొందుతోంది. ‘గాడ్జిల్లా రామెన్’ అని పిలువబడే ఈ వంటకంలో ప్రధాన ఆకర్షణగా మొసలికాలు నిలుస్తోంది. మీరు విన్నది నిజమే. మొసలి కాలును ఆవిరి చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారట. ఈ వంటకంలో 40 రకాల మసాలాలు వాడతారట. తైవాన్ నుంచి వంటలు వైరల్ కావడం ఇది మొదటిసారి కాదు. కానీ చూడటానికి భయం కలిగించేలా ఉన్న ఈ వంటకంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేయగా.. మరికొందరు ఇలాంటి కాంబినేషన్లు విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: అసలేం జరుగుతోంది.. డిగ్రీ పట్టా అందుకొని ‘శవాలు’గా మారుతున్న విద్యార్ధులు! -
SpaceX Starlink: ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!
వాషింగ్టన్: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు వాటిని ఆఫ్ చేసి తిరిగి మళ్లీ ఆన్ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి తిరిగి ఇంటర్నెట్ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్‌తో అమెరికాలో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది. భూమిపై ఏర్పాటుచేసిన డిష్ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్ సేవలను పొందుతారు. కాగా అప్పుడప్పుడు డిష్ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్‌లింక్ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది. డిష్ ఆంటెన్నాలు తిరిగి కూల్ డౌన్ అయ్యే వరకు ఇంటర్నెట్ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్‌లింక్. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్‌లింక్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్ డిష్‌పై నీళ్లను స్ప్రే చేశాడు. వాటర్ పోయడంతో డిష్ ఆంటెన్నా త్వరగా కూల్ డౌన్ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్ షట్‌డౌన్ అవ్వకుండా ఉండాలంటే డిష్ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై.. -
వైరల్ వీడియో: వంటను పెంట చేసిన రకుల్ ప్రీత్ సింగ్
-
వంటను పెంట చేసిన రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సరదాగా వంటగదిలోకి వెళ్లింది. నోరూరించే ప్యాన్‌కేక్స్ చేద్దామని స్టవ్ వెలిగించింది. తనకు తెలిసిన పద్ధతిలో వంటను రెడీ చేసింది. అప్పటికే రకుల్ వంటశాస్త్ర ప్రావీణ్యం గురించి తెలిసిన తమ్ముడు ఆ వంటను ఏం చేస్తుందో చూద్దామని వెయిట్ చేశాడు. అతడు ఊహించినట్లుగానే అవి ప్యాన్ కేక్స్ కాకుండా మరో కొత్త డిష్‌లా తయారవడం గమనార్హం. అయితే వాటి టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందంటోంది రకుల్. కానీ ఆమె తమ్ముడు మాత్రం ఆ వంటను పెంట చేసినట్లు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే రకుల్ ప్రస్తుతం హిందీలో బాగా బిజీగా మారింది. ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జీ’, జాన్ అబ్రహాం ‘ఎటాక్’, అజయ్ దేవగన్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ బీ టౌన్లో ఫుల్‌ఫామ్‌లో ఉంది. వీటితో పాటు మరాఠీ దర్శకుడు తేజస్ దియోస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కండోమ్ టెస్టర్ పాత్ర చేయనుంది. చదవండి: వచ్చే ఏడాదే రకుల్ ప్రీత్ పెళ్లి : మంచు లక్ష్మీ -
వావ్! బెండర్‌ఫుల్
బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా... అని సామెత బ్రహ్మచారి సంగతేమో కానీ... బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండాలి దీనిలో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషకాలతోపాటు అయోడిన్ కూడా ఉండటం వల్ల అనేక వ్యాధులను దరిచేరనివ్వదు అన్నట్లు ఓపిక ఉండి వండాలేకానీ బెండతో రకరకాల వెరయిటీలు చెయ్యొచ్చు రుచి చూశారంటే బెండర్‌ఫుల్ అనాల్సిందే! బెండకాయ 65 కావలసినవి: అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 4; బెండకాయలు – అర కిలో; సెనగ పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి కొబ్బరి – పావు కప్పు. తయారీ: అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగ పిండి, బియ్యప్పిండి, జీలకర్ర పొడి, మిరప కారం, కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు వేసి డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచాలి అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మీడియం మంట మీద సుమారు పావు గంట సేపు వేయించి దింపాలి గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు , పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలపాలి. బెండకాయ రైస్ కావలసినవి: బెండకాయ ముక్కలు – పావు కేజీ; ఎండు కొబ్బరి – పావు కప్పు; పుట్నాల పప్పు – అర కప్పు; కారం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగ పప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూన్; ఎండు మిర్చి – 3; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 4 టేబుల్ స్పూన్లు; అన్నం – పావు కేజీ బియ్యం ఉడికించాలి. తయారీ: మిక్సీలో ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి, మూత ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి, చిటికెడు ఉప్పు జత చేసి ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి అదే బాణలిలో పల్లీలు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి అన్నం జత చేయాలి పుట్నాల కారం జత చేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూడు నిమిషాల తరువాత దింపేయాలి. బెండకాయ మసాలా కర్రీ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; బెండకాయలు – పావు కిలో; జీలకర్ర – ఒక టీ స్పూన్; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్; పసుపు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్; ధనియాల పొడి – ఒక టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: బెండకాయలను శుభ్రంగా కడిగి తడి పోయే వరకు ఆరబెట్టాక పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి అదే బాణలిలో జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఉల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి పసుపు, మిరపకారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి టొమాటో తరుగు జత చేసి, బాగా కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి పెరుగు జత చేసి, కలియబెట్టి, కొద్దిసేపు మూత ఉంచాలి బెండకాయ ముక్కలు జత చేసి, ముక్కలకు మసాలా పట్టే వరకు మీడియం మంట మీద ఉడికించి, కొద్దిగా నీళ్ళు జత చేసి మరి కాసేపు ఉడికించాలి కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి. స్టఫ్డ్ బెండకాయ ఫ్రై కావలసినవి: బెండకాయలు – పావు కేజీ; పల్లీలు – 100 గ్రా. (వేయించి పొట్టు తీసేయాలి); ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్; ధనియాలు – ఒక టేబుల్ స్పూన్; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూన్; నువ్వులు – ఒక టేబుల్ స్పూన్; ఎండు మిర్చి – 10; పసుపు – కొద్దిగా. తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక సెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి జీలకర్ర, ధనియాలు జత చేసి మరోమారు వేయించాలి నువ్వులు కూడా వేసి బాగా కలపాలి ∙ఎండుమిర్చి, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి, మంట ఆపేయాలి పల్లీలు జత చేసి కలపాలి ∙బాగా చల్లారాక ఉప్పు, పసుపు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బెండకాయ తొడిమలు తీసేసి, పొడవునా ఒక వైపు చీల్చాలి ∙తయారు చేసిన మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక స్టఫ్ చేసిన బెండ కాయలు వేసి వేయించాలి కొద్ది సేపటి తర్వాత మూత ఉంచి మీడియం మంటలో మగ్గనిచ్చి దింపేయాలి. బెండకాయ పులుసు కావలసినవి: బెండకాయ ముక్కలు – పావు కేజీ; ఉల్లి తరుగు – కప్పు; టొమాటో తరుగు – కప్పు; పచ్చిమిర్చి – 3; నూనె –3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర –కొద్దిగా; పసుపు – చిటికెడు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; వేయించిన ధనియాల పొడి – ఒక టీ స్పూన్; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూను; చింతపండు రసం – అర కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి పచ్చిమిర్చి, ఉల్లి తరుగు జత చేసి వేయించాలి అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి మూత ఉంచాలి ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి చింతపండు రసం కూడా జత చేసి మరోసారి కలపాలి ఉల్లి తరుగు బంగారు రంగులోకి వచ్చాక కరివేపాకు జత చేయాలి కలిపి ఉంచుకున్న టొమాటో, చింతపండు రసం జత చేసి మూతపెట్టి, సన్నటి మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి బెండకాయ ముక్కలు జత చేసి కలపాలి రెండు కప్పుల నీళ్ళు జత చేసి, మూత ఉంచి, ఏడు నిమిషాలు మరగనివ్వాలి ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలపాలి కొత్తిమీర జత చేసి, మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. బెండకాయ టొమాటో కూర కావలసినవి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – ఒక రెమ్మ; ఎండు మిర్చి – 2; టొమాటో తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; బెండకాయలు – పావు కేజీ; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి టొమాటో తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించాలి బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి, మిరప కారం, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు కలపాలి కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి. -
"మ్యాగీ పానీపూరి"
-
'ఛీ, వినడానికే దరిద్రంగా ఉంది'
న్యూఢిల్లీ: జనాలు అస్సలు మొహమాట పడని ఏకైక చోటు పానీపూరి బండి. అబ్బాయిలకు పానీపూరి ఇష్టం ఉంటుంది, కానీ అమ్మాయిలకు పానీపూరి పిచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ బండి దగ్గరకు ఎప్పుడూ వెళ్లే రెగ్యులర్ కస్టమర్స్ వీళ్లు. ఇప్పుడు చెప్పబోయే ఈ వార్త కచ్చితంగా పానీపూరి ప్రియులకు కోపం తెప్పిస్తుంది. ఇప్పటివరకు నెట్టింట్లో వెరైటీ వంటకాల పేరుతో ఎన్నో ఘోరాలను చూశాం. అందులో గులాబ్‌జామూన్ పావ్ బాజీ, కుర్కురే మిల్క్‌షేక్, స్వీట్ మ్యాగీ, ఓరియో సమోసా, న్యూటెల్లా బిర్యానీ ఇలా పేర్లు వింటేనే గుండెలదిరే వంటకాల గురించి విన్నాం. (2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి) తాజాగా భోజనప్రియులను బెంబేలెత్తించే మరో కొత్త వంటకం పుట్టుకొచ్చింది. అదే "మ్యాగీ పానీపూరి". ఇది ఎలా తయారుచేయాలో వివరిస్తూ బన్నీ అనే వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో పూరీలో పప్పు, పానీకి బదులుగా రెడీ చేసి పెట్టిన మ్యాగీని వేసి ఉంచాడు. దీన్ని చూసి షాక్‌కు లోనైన నెటిజన్లు 'ఇది హారర్ చిత్రంలోని దృశ్యంలా ఉంది', 'ఇది 2020 ఏడాది కన్నా పెద్ద ఘోరం', 'ఛీ, ఈ రెసిపీ పేరు వినడానికే దరిద్రంగా ఉంది', 'నువ్వు ఎవరో తెలీదు కాని నువ్వంటే నాకు పరమ అసహ్యం' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత) -
సోనూ సూద్‌కు కానుక: ‘మోగా’వంటకం
‘వాళ్లు మన ఇళ్లు కట్టడానికి వాళ్ల ఇళ్లను వదిలిపెట్టి వచ్చారు’ అంటాడు నటుడు సోనూ సోద్ నేడు దేశ వ్యాప్తంగా కాలినడకన ఇళ్లకు మరలిన లక్షలాది వలస కార్మికుల అవస్థను చూసి. ‘వారి బాధను చూస్తుంటే మనందరం మనుషులుగా ఫెయిల్ అయ్యామని చెప్పక తప్పదు’ అని కూడా అన్నాడు అతను. ‘నాకు నిద్ర పట్టలేదు. వారే కళ్లల్లో మెదల సాగారు. వారి బాధ చూస్తూ ఏసి రూముల్లో కూచుని ట్వీట్ చేస్తే సరిపోదు. మనం కూడా రోడ్లమీద పడి ఏదైనా చేయాలి అనుకున్నాను’ అన్నాడు. అందుకే సోనూ సూద్ ఇవాళ దేశ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. అతడు ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి ఇళ్లకు పంపించాడు. అంతే కాదు, దానికి ముందే పంజాబ్‌లోని వైద్యులకు పిపిఇ కిట్లు బహూకరించాడు. ముంబైలోని తన హోటల్‌ను కోవిడ్ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. సోనూ సూద్ వలస కార్మికుల కోసం చేసిన పని చూసి అనేక మంది తమకు సహాయం చేయమని అతనికి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. ముంబైలోనే కాకుండా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్లలో చిక్కుకుపోయిన అనేక మందిని వారి స్వస్థలాలకు పంపించే పనిలో సోనూ సూద్ ఉన్నాడు. ‘చివరి వలస కార్మికుడు ఇల్లు చేరేవరకు నా చేతనైన పని చేస్తాను’ అని అతను చెప్పాడు. ఇదంతా చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే అమెరికాలో ఉంటున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తన కృతజ్ఞతను చాటుకోవడానికి ఒక కొత్త వంటకం చేసి దానికి సోనూ సూద్ సొంత ఊరి పేరు ‘మోగా’ అని పెట్టాడు. వికాస్ ఖన్నా చూపిన ఈ స్పందనకు సోనూ చాలా సంతోషపడ్డాడు. ‘మీరు చేసిన పనికి నా సొంత ఊరు గర్వపడుతుంది’ అని బదులు ఇచ్చాడు. చదవండి: దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్ కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం! -
జత కట్టిన వాటిని.. కోసి కూర వండుకున్నారు..
బొర్నియో ద్వీపం, మలేసియా : నాలుక ఒకసారి రుచి మరిగితే మళ్లీ మళ్లీ దాన్నే తినాలనిపిస్తుంది. పాముల మాంసానికి అలవాటుపడిన ఓ గ్రామ ప్రజలు జత కట్టిన రెండు కొండచిలువలను చంపి, కోసి కూర వండుకున్నారు. ఈ సంఘటన మలేసియాకు చేరువలోని బొర్నియో ద్వీపంలో చోటు చేసుకుంది. పాముల వేటకు బయల్దేరిన బొర్నియో ద్వీప గ్రామస్థులు.. దగ్గరలో వింత శబ్దం రావడం విన్నారు. కూలిపోయిన చెట్టు దుంగ నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించారు. కొండచిలువ దుంగలో ఉందని అనుమానం రావడంతో.. వెంట తెచ్చుకున్న రంపంతో దుంగను మధ్యలోకి కోశారు. లోపల 20 మీటర్ల పొడవున్న ఆడ కొండచిలువ, చిన్నదైన మగ కొండచిలువతో జత కట్టి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్థుల గ్రూపులో కొందరు రెండు కొండచిలువలను విడదీసి రోడ్డు మీదకు లాక్కొచ్చారు. అనంతరం తుపాకీలతో రెంటినీ కాల్చి చంపారు. ట్రక్కులో వాటిని గ్రామానికి తరలించారు. అనంతరం గ్రామంలోని మహిళలు అందరూ కలసి రెండు కొండచిలువలను ముక్కలుగా కోశారు. స్థానిక ఆచారం ప్రకారం.. కొండచిలువలను మంటపై కాల్చారు. కొండచిలువల మాంసంతో పాటు సంప్రదాయ వంటకాలతో కలసి భోజనం చేశారు. ఒక్కసారి వేటకు వెళ్తే వచ్చే పాముల ఆహారంతో కొన్ని రోజుల పాటు గ్రామస్థులు జీవిస్తారని గ్రామ పెద్ద ఒకరు తెలిపారు. -
'ఛీ.. ప్రియాంక వంట కుక్కలు తింటాయి'
లాస్ఏంజెల్స్: బాలీవుడ్లో తనదైన ముద్ర వేసి హాలీవుడ్‌కు పరిచయమై ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రియాంక చోప్రా వంటను ఓ చెఫ్ వెక్కిరించాడు. అది కూడా ప్రియాంకా చేసిన వంట కుక్కలకు పెట్టేదిలా ఉందని. జోర్డన్ రామ్సే.. ఓ బ్రిటీష్ సెలబ్రెటీ చెఫ్. ఆయన వంటలు నలభీమ పాకంలో ఉంటాయి అంటారు చాలా మంది సెలబ్రిటీలు. రామ్సే వంట ఎంత బాగా చేస్తాడో ఇతరులు చేసే వంటకాలను అంతే ఆక్షేపిస్తూ ఉంటాడు. రామ్సే తాజాగా మన ప్రియాంక చోప్రా చేసిన వంటపై కామెంట్ చేశాడు. హాలీవుడ్ ప్రాజెక్టుల కోసం ప్రియాంక ఏడాదిగా అమెరికాలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ టాక్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక సరదాగా కిచిడి, చికెన్ సూప్ చేసి సదరు షోలో చూపించింది. ఆ షోలో రామ్సే కూడా ఉన్నాడు. ప్రియాంక వండింది రుచి చూసి కనీసం ఆమె కూడా ఓ సెలబ్రెటీనే అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ‘ఛీ.. ఇది కుక్కకు పెట్టే ఫుడ్‌లా ఉంది’ అనేశాడు. అంతే ఒక్కసారిగా ప్రియాంక అభిమానులు రామ్సేపై ట్వీటర్ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రియాంకను అంత మాట అంటావా? అంటూ తిట్టి పోశారు. అయితే, రామ్సే కామెంట్‌పై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు. -
బతికున్న జలగలను నమిలి తినేశాడు!
బతికున్న జలగలను ఓ వ్యక్తి నమిలి తినేశాడు. దాదాపు 6 నుంచి 7 అంగుళాల పొడవు ఉన్న పెద్ద జలగలను సాస్ లో ముంచుకుని అవి కదులుతుండగానే నమిలి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనాకు ఓ చెందిన వ్యక్తి స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. వాటిని నములుతున్న సమయంలో అతను జలగల రుచి చాలా బాగుంది అంటూ కామెంట్ కూడా చేశాడు. చైనీయులు అన్ని రకాల ఆహారాలను తీసుకుంటారు. అయితే జలగలను ఓ మనిషి తినడమనేది సాధ్యమేనా అనిపిస్తుంది. ఎందుకంటే జలగలు రక్తం తాగి జీవిస్తాయి. ఒకే ఒక జాతికి చెందిన జలగలు మాత్రమే రక్తాన్ని తమ ఆహారంగా తీసుకుంటాయి. జలగల్లో కొన్ని జాతులు రక్తాన్ని ఆహారంగా తీసుకోవు. ఉత్తర అమెరికాలో రక్తాన్ని ఆహారంగా తీసుకోని జలగల జాతులు అగుపిస్తాయి. ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో జలగల జాతులు ఉన్నాయి. కొన్ని జాతుల జలగలను వైద్యరంగంలో వినియోగిస్తున్నారు. అవసరమైనప్పుడు జలగలను ఉపయోగించి వాటి ద్వారా మనిషి శరీర భాగంలో కావలసిన చోటు నుంచి చెడు రక్తాన్ని పీల్చేలా చేస్తారు. జలగలు 18 అంగుళాల వరకూ పెరుగుతాయి. వీటి జీవనకాలం 20 సంవత్సరాలు. జలగలు కుటుంబాలుగా జీవిస్తాయి. ఒక జలగ గుడ్లు పెడితే ఆ కుటుంబం మొత్తం తమ శరీరాలతో వాటికి ఎలాంటి వ్యాధులు సోకకుండా కాపాడుకుంటాయి. చైనాలో ఉండే కాంటోనీస్ క్యూజీన్ లలో అన్ని రకాల తినే ఆహారాలు లభ్యమవుతాయి. వీటిలో బొద్దింకలు తదితర కీటకాల ఆహారాలు కూడా ఉంటాయి. -
బతికున్న జలగలను నమిలి తినేశాడు!
-
ఏవండోయ్... ఇది విన్నారా?
కథనత్రయోదశి శ్రీమతి ఇచ్చిన చిక్కటి ఫిల్టర్ కాఫీని గుటక వేస్తూ, మధ్యమధ్యలో పేపర్లోని వార్తలు చప్పరిస్తూ, టీపాయ్ మీదున్న రిమోట్ అందుకుని, టీవీ ఆన్ చేశాడు సుబ్రావ్. ఇంతలో శ్రీమతి ప్లేటులో పొగలు కక్కుతున్న వేడివేడి ఉప్మాపెసరట్టు తీసుకొచ్చి చేతికిచ్చింది. తనకిష్టమైన టిఫిన్ కావడంతో ఆత్రంగా అందుకున్నాడు కానీ అంతలోనే గతుక్కుమన్నాడు. ఎప్పుడూ లేనిది ప్రేమతో ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. ఆ వెంటనే తను ఎన్నిసార్లు అడిగినా, ఆర్డర్ వేసినా విసుక్కునే భార్యామణి ఇవ్వాళ అడక్కుండానే ఉప్మాపెసరట్టు చేసి చేతికి అందించింది.... అంటే ఏదో విశేషం ఉండి ఉండాలి... ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నాడు... ఇంతలోనే శ్రీమతి గొంతు సవరించుకుంటున్నట్టుగా గాజుల చేతితో సవ్వడి చేసింది. తలెత్తి చూశాడు సుబ్రావ్. ప్రేమతో పెసరట్టు మీద నెయ్యి వేసి, అల్లప్పచ్చడి, పల్లీచెట్నీ రెండూ వేర్వేరు డిష్‌లలో పెట్టి టీపాయ్ మీద పెట్టి, తినండన్నట్టు చూసింది. భార్యాసుందరి టెండర్ పెట్టబోయే వస్తువు ఏమై ఉంటుందబ్బా... అని ఆలోచిస్తూనే పెసరట్టు తుంచి అందులో ఉప్మా పెట్టుకుని, ఆ పక్కనే ఉన్న అల్లప్పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలా రెండు మూడు ముక్కలు తుంచుకుని తింటున్నా అటునుంచి సౌండ్ ఏమీ రాకపోయేసరికి త నే అనవసరంగా అనుమానపడుతున్నాడేమో అనిపించి, మనసులోనే లెంపలు వేసుకున్నాడు. నాలుగో ముక్క తినేసరికి ‘ఏవండీ‘ అని పిలవనే పిలిచింది సుందరి. ఏమిటన్నట్టుగా చూశాడు సుబ్రావ్. ‘‘ఇవ్వాళ్టి పేపర్ చూశారా?’’ ‘‘చూస్తూనే ఉన్నా కదా’’ మీరు చూసేదల్లా జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఆ తర్వాత సాహిత్యం పేజీలో పుస్తక సమీక్షలేగానీ, నిలువెత్తు యాడ్స్ ముఖం ఎప్పుడు చూశారు గనక?’’ సౌమ్యంగానే అన్నా ఎత్తిపొడుపులానే ధ్వనించింది. ‘‘అబ్బా! నీ నోటితో చెప్పు సుందూ, వింటాను’’ తను కూడా ప్రేమగానే అన్నాడు సుబ్రావ్. సమాధానంగా ఓ యాడ్ చూపించింది సుబ్రావ్‌కి. ‘‘ఈ ధనత్రయోదశినాడు మీ పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకోండి, బదులుగా ప్రతి గ్రాముకీ వందరూపాయలు అదనంగా పొందండి. పది గోల్డ్ కాయిన్స్ కొనండి. పదకొండో కాయిన్‌ను ఫ్రీగా పట్టుకెళ్లండి. 25 గ్రాముల బంగారు ఆభరణాలు కొంటే మజూరీలో పదిశాతం డిస్కౌంట్. పాత ఆభరణాల ఎక్స్చేంజ్పై 5 శాతం తరుగుదల ఉచితం. కేవలం పదిశాతం ముందు చెల్లించండి, అనూహ్యమైన గిఫ్ట్ పట్టుకెళ్లండి’’ దానితోబాటు మేమేమీ తక్కువ తినలేదన్నట్టు వందన సిస్టర్స్, కేజీ బ్రదర్స్, వర్మాస్ యాడ్స్... పక్క పేజీలో బిగ్ మార్కెట్, బిగ్ మొబైల్స్, లాట్సి యాడ్స్... అన్నింటిలోనూ ఈ ధనత్రయోదశినాడు కొనుగోలు చేయండి, 1కి రెండు, రెండుకి మూడు, మూడుకి ఐదు ఉచితంగా తీసుకెళ్లండి... లాంటి టెంప్టింగ్ ఆఫర్లు. అయితే సుబ్రావ్ను అధికంగా ఆకర్షించిందల్లా ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై అర కేజీ కందిపప్పు, అరకేజీ మినప్పప్పు ఉచితం అన్నదే. కేజీ కందిపప్పు రెండువందలు, మినపగుళ్లు పదో, ఇరవయ్యో తక్కువగా ఇంచుమించు అంతే ఉంది. ఇంకా ఎండుమిర్చి, పల్లీలు, పెసరపప్పు, చింతపండు, రవ్వలు, శనగపిండి, బ్రాండెడ్ గోధుమపిండి, ఆయిల్ ప్యాకెట్లు... ఇవే కాదు, ఇంచుమించు నిత్యావసరాలన్నింటిధరలూ చుక్కల్తో పోటీపడుతున్నాయి. కూరల సంగతి సరే సరి, నానాటికీ పెరగిపోతున్న ధరలతో క్రూరగాయాలు చేస్తున్నాయి. నాన్ వెజ్ సరేసరి. పోనీ, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ ధరాఘాతాలు సంధిస్తున్నాయి. ఒక మోస్తరుగా ఉండే బియ్యం పాతిక్కేజీల బ్యాగ్ వెయ్యికి పైనే! అంతకన్నా కిందికి దిగట్లేదు. నానాటికీ పెరుగుతున్న ధరలతో నెలవారీ బడ్జెట్ ఏకంగా పదిహేనువందలకు పైగా పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పప్పన్నం తినేవాళ్లంటే అందరికీ చులకనగా ఉండేది. ఇప్పుడు రోజూ పప్పన్నం తినడమూ గొప్పగా మారింది. ఆలోచిస్తుంటే... ఆ మధ్య ఫేస్బుక్లో కార్టూన్లు, జోకులు గుర్తొచ్చాయి. ఉల్లిధర ఒక్కసారిగా చెట్టెక్కి కూర్చున్నప్పుడు ఉల్లిపాయల బస్తాలు పక్కన ఉన్నవాడిని శ్రీమంతుడంటూ కామెంట్ చేసేవాళ్లు, ఉల్లిదండలు వేసుకు తిరిగేవాళ్లని కుళ్లుగా చూసేవాళ్లు, ఉల్లి దోసె, ఉల్లిపాయ పకోడీలు తినేవాళ్లని గొప్పవాళ్లని చెప్పుకునేవాళ్లూ... ఇలా... ఇప్పుడు ఉల్లి కాస్త దిగొచ్చి, కందిపప్పు చెట్టు మీద కాదు, ఏకంగా ఆకాశానికెగబాకింది. దాంతో ఆ కార్టూన్లు కాస్తా కందిపప్పు మీదికి మళ్లాయి. సుబ్రావ్ ఆలోచనాధారకు సుందరి ఠపీమని టీపాయి మీద పెట్టిన కప్పు చప్పుడుతో బ్రేకు పడింది.‘‘కాఫీ తీసుకోండి’’ అంటూ కప్పు వైపు చెయ్యి చూపించి, కళ్లు సుబ్రావ్ వైపు తిప్పింది సుందరి. ఆ చూపులో ‘యాడ్ చూశారా, అనడిగితే అలా వెర్రిమొహం వేసుకుని చూస్తారేం’ అన్నట్లు కనిపించింది సుబ్రావ్‌కి. చూశానన్నట్లుగా కళ్లతోనే సమాధానం చెప్పాడు సుబ్రావ్. ‘‘అది కాదండీ, ప్రస్తుతం నేను వేసుకుంటున్న చంద్రహారం పాతబడిపోయింది. అది ఎక్స్ఛేంజ్ చేసి, కాసులపేరు తీసుకుంటే ఎలా ఉంటుందంటారు, ఎందుకంటే ఇప్పుడు పాత బంగారం ఎక్స్ఛేంజ్ మీద ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారట... అలాగే చిట్టితల్లి చెయిన్ కూడా! అప్పుడు సరిగా చూసుకోలేదు, ఓల్డ్ మోడల్. అది కూడా ఎక్స్ఛేంజ్ చేసి పడేద్దాం... అన్నట్టు మీ ఉంగరం కూడా..’’ ఇంకా ఏదో చెబుతోంది కానీ సుబ్రావ్ చెవికెక్కడం లేదు... ఓ ఆధ్యాత్మిక ఛానల్లో స్వాములవారు ధనత్రయోదశి గురించి చెబుతున్న ప్రవచనం మీదికి వెళ్లింది. కళ్లతోనే భార్యను అది వినమన్నట్టు సైగ చేశాడు. ‘‘ధనత్రయోదశి అంటే ధన్వంతరి పుట్టిన రోజు. ధన్వంతరి అంటే వైద్యుడు. అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఔషధ భాండాన్ని చేతితో పట్టుకుని ఉద్భవించాడు ధన్వంతరి. ఆయన వల్లే లోకానికి ఔషధాలు తెలిశాయి. ఆరోగ్యభాగ్యం కలిగింది. అందరికీ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆయన పుట్టింది ఆశ్వయుజ బహుశ త్రయోదశినాడు కావడం వల్ల ధన్వంతరి పుట్టిన త్రయోదశి కాస్తా ధన త్రయోదశిగా మారింది. ఈ శుభ వేళ ధన్వంతరిని పూజించడం మంచిది...’’ యాంకర్ అందుకుని, ‘‘మరి లక్ష్మీదేవి పుట్టినరోజు అంటారు, ఈ రోజున తక్కువలో తక్కువగా గ్రాము బంగారమైనా కొనడం మంచిదంటారు, అది నిజం కాదంటారా స్వామీ’’ అని అడిగింది. అక్కడికే వస్తున్నాను తల్లీ, పూర్వం హేమ అనే ఓ యువరాజుకు చిన్న వయస్సులోనే మరణిస్తాడని శాపం. తమ కుమారుణ్ణి ఆ శాపం నుంచి బయట పడవెయ్యడానికి సకల శుభలక్షణాలూ కలిగిన ఓ యువతితో పెళ్లి జరిపించారు రాజదంపతులు. ఆమె దేవీ భక్తురాలు కావడంతో అమ్మవారు ఆమెకు కలలో కనిపించి, ‘‘బిడ్డా! ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు యముడు కాలసర్ప రూపంలో వచ్చి, నిద్రపోతున్న నీ భర్త ప్రాణాలను తన కాటుతో తీసుకుంటాడు. నువ్వు నీ భర్తను ఆ పాముకాటు నుంచి తప్పించగలిగితే అతనికి ఇక మరణభయం ఉండదు’’ అని చెప్పింది. లక్ష్మీ అమ్మవారు చెప్పిన రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం యువరాణి అంతఃపురంలోని బంగారం, వెండి, నగలు, వజ్రాభరణాలు అన్నింటినీ తెప్పించి రాశులుగా పోసింది. ఇంటినంతటినీ దీపాలతో నింపి వేసింది. భర్త నిద్రలోకి జారుకోకుండా రకరకాల కథాశ్రవణాలు, వినోద కాలక్షేపాలు పెట్టించింది. అర్ధరాత్రి కావస్తుండగా యముడు కాలసర్పరూపంలో ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. అయితే ఆ పాము కళ్లు మిరుమిట్లు గొలిపే బంగారు ఆభరణాలు, దీపకాంతులతో కళ్లు కనబడక, దీపాల వేడి భరించలేక, కుప్పగా పోసి ఉన్న ధనరాశుల మీదికి చే రి, అందరూ ముక్తకంఠంతో పఠిస్తున్న లక్ష్మీ అష్టోత్తరాలను, సహస్రనామాలను, కథాకాలక్షేపాలను తన్మయత్వంతో వింటూ ఉండిపోయింది. ఈలోగా తెల్లవారింది. కాటు వేసే సమయం మించిపోవడంతో చేసేదేమీ లేక యముడు కాస్తా జారుకున్నాడు. యువరాజుకు ప్రాణగండం తప్పిందన్న ఆనందంతో రాజ్యప్రజలందరూ పండగ జరుపుకున్నారు. గండం గడవడానికి ఇంటి నంతటినీ ధనరాశులతో నింపింది కాబట్టి ఆ త్రయోదశికి ధనత్రయోదశిగా పేరొచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రజలందరూ లక్ష్మీదేవిని ఇంటిలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పూజించడం సంప్రదాయంగా ఏర్పడింది. ధనత్రయోదశినాడు అమ్మవారిని పూజించాలి అనే అసలు విషయాన్ని కాస్తా పక్కన బెట్టి జనమందరూ వేలం వెర్రిగా అప్పు చేసి మరీ బంగారం, వెండి, ఆభరణాలు కొనడం మొదలు పెట్టారు. అది కాస్తా దుస్తులు, ఇతర గృహోపకరాణాలకు కూడా పాకింది... చెబుతుంటే ఇంటినుంచి వచ్చేటప్పుడు ‘ధన్ తేరస్ నాడు ఎలాగైనా సరే రవ్వల నెక్లెస్ చేయించాల్సిందే’ అంటూ భర్తతో గొడవ పెట్టుకుని వచ్చిన యాంకరమ్మ చెంపలు సిగ్గుతో కెంపులయ్యాయి. అది చూస్తున్న సుందరి చెంపలు కూడా! తనను గండం నుంచి గట్టెక్కించిన స్వాములవారికి సుబ్రావ్ జోడించిన చేతులు మాత్రం ఇంకా విడివడలేదు. - డి.వి.ఆర్. ‘‘అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఔషధ భాండాన్ని చేతితో పట్టుకుని ఉద్భవించాడు ధన్వంతరి. ఆయన వల్లే లోకానికి ఔషధాలు తెలిశాయి. ఆరోగ్య స్పృహ పెరిగింది. ధన్వంతరి పుట్టిన త్రయోదశి కాస్తా ధన త్రయోదశిగా మారింది. ఆ వేళ ధన్వంతరిని పూజించడం, ఔషధ సేవ చేయడం మంచిది...’’ యాంకర్ అందుకుని, ‘‘మరి లక్ష్మీదేవి పుట్టినరోజు అని అంటారు, బంగారం కొనడం మంచిదంటారు, అది నిజం కాదంటారా స్వామీ’’ అని అడిగింది. -
బాదం భరోసా
రోజుకు నాలుగైదు పలుకులను తింటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని నేరుగా తినొచ్చు లేక ఏదైనా వంటకంలో వేసుకోవచ్చు. వీటితో అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం. ఆరోగ్యం: రోజూ గుప్పెడు బాదం పలుకులను తింటే శరీరానికి కావాల్సిన మినరల్స్, ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్స్ అందుతాయి. అందులో ఉండే మెగ్నీషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆల్మండ్స్‌లో షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహంతో బాధపడే వారు వీటిని స్వేచ్ఛగా తినొచ్చు. అలాగే ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి. చిట్కా: రాత్రి పడుకునే ముందు 6-8 బాదం పలుకులను నీళ్లలో కానీ పాలలో కానీ నానబెట్టాలి. ఉదయం లేచాక వాటిపై ఉండే పొట్టును తీసేసి తింటే చాలు. ఏ రకమైన వ్యాధులు మీ చెంతకు రాకుండా ఉంటాయి. జుట్టు సౌందర్యం: బాదం నూనె జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని మాత్రమే తగ్గించకుండా చుండ్రు, తెల్ల వెంట్రుకల బారి నుంచి కూడా కాపాడుతుంది. ఈ నూనె జుట్టును ఆరోగ్యంగా ఉంచుతూ నిగనిగలాడేలా చేస్తాయి. చిట్కా: తలస్నానం చేసే రెండు గంటల ముందు ఈ చిట్కాను పాటించాలి. మూడు టేబుల్ స్పూన్ల బాదం నూనెలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలిపి కొద్దిగా వేడి చేయాలి. ఆ గోరువెచ్చని మిశ్రమంతో మాడుపై 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత వేడినీళ్లలో ముంచిన టవల్‌ను తలకు కట్టుకొని రెండు గంటలు ఆగి చల్లటి నీటితో తలస్నానం చేస్తే సరి. అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. చర్మ కాంతి: బాదం నూనె లేక బాదంతో తయారు చేసిన మాయిశ్చరైజర్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం నూనెలో ఉండే ఒలీన్ గ్లిజరైడ్, లినోలిక్ యాసిడ్ ముఖంపై మొటిమలు, నల్లమచ్చలను రాకుండా సంరక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్-ఇ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చిన్న పిల్లలకు బాదం నూనెతో బాడీ మసాజ్ చేస్తే కండరాలకు బలం, చర్మానికి మృదుత్వం వస్తుంది. చిట్కా: పావుకప్పు బాదం పౌడర్ (ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడి చేసు కోవా లి) లో పావుకప్పు బ్రౌన్ షుగర్ వేయాలి. అందులో తేనె, బాదం నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో రోజుకు రెండుసార్లు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే రెండు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.