Electricity dues
-
కరెంటు లెక్క..అప్పుల కాక..రణరంగంలా మారిన అసెంబ్లీ
-
సుప్రీంకోర్టులో తెలంగాణ విద్యుత్ బకాయిల కేసు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం చెల్లించా ల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. విద్యుత్ బకాయిలు చెల్లింపులపై తెలంగాణకు ఆ రాష్ట్ర హైకోర్టులో అనుకూలంగా వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసిందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ చెల్లించా ల్సిన రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంటూ ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 లోబడి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీకి తెలంగాణ చెల్లించా ల్సిన రూ.3,441.78 కోట్లను అసలుతో పాటు రూ.3,315.14 కోట్ల లేట్ పేమెంట్ సర్‌చార్జీల రూపంలో చెల్లించాలని మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు వివరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఈ మేరకు 2022 ఆగస్టు 29న ఏపీకి తెలంగాణ చెల్లించా ల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలను కొట్టేస్తూ హైకోర్టు 2023 అక్టోబర్ 19న తీర్పు వెలువరించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ కొత్త పాఠ్య ప్రణాళిక ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జాతీయ మెడికల్ కమిషన్ కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఆగస్ట్ 1న జారీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. కొత్త బోధన ప్రణాళిక కింద వృత్తిపరంగా మొదటి సంవత్సరంలో ‘కుటుంబ దత్తత కార్యక్రమం–లక్ష్యాలు అందుకోవడం‘ అనే పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ స్థితిగతులను అర్థం చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 45,84,548 కిసాన్ క్రెడిట్ కార్డులు ఏపీలో సెప్టెంబర్ 2023 నాటికి రూ.60,576.14 కోట్లతో కో–ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డులు 45,84,548 ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భగవంత్ కరాద్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఎన్నికల కమిషనర్ల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామక బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికల సంఘానికి అప్పగించారన్నారు. ప్రధాని అధ్యక్షతన లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రివర్గ సభ్యుడితో ఏర్పాటు చేసే కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు నియామకంపై రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారని బిల్లు చెబుతోందన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా, ప్రజలు పరిరక్షించేలా బిల్లు ఉందని బోస్ పేర్కొన్నారు. ఉద్యాన రంగానికి మద్దతు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యాన రంగానికి కేంద్రం మద్దతు ఇవ్వడంతోపాటు అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తానరావు కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఏపీ పలు సవాళ్లు ఎదుర్కోంటోందన్నారు. రాష్ట్రంలో ఉద్యాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ముఖ్యమైన కేంద్రంగా మారిందన్నారు. పూర్ సాయిల్ మేనేజ్‌మెంట్‌తోపాటు రవాణా, కోల్డ్ స్టోరేజీలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్టంలో ఉద్యానరంగ అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. -
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిల వివాదంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92 కోట్లు (అసలు 3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) చెల్లించాలంటూ 2022, ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నోటీసులను కొట్టివేసింది. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు.. అలాగే ఏపీ ప్రభుత్వం, విద్యుదుత్పత్తి సంస్థలు మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని ఆశ్రయించే స్వే చ్ఛను ఇరు పక్షాలకు ఇస్తున్నామంది. తెలంగాణ వాదన కూడా వినకుండా కేంద్రం నోటీసులు జారీచేయడాన్ని తప్పుబట్టింది. వివాదం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జెన్కో/ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు 2000 నుంచి 2013 వరకు పలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నాయి. ఇవి రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు కొనసాగాయి. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు 2014 నుంచి 2017 వరకు తెలంగాణకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా చేశాయి. దీనికైన మొత్తాన్ని చెల్లించాలని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి. ఈ వివాదం కేంద్రం వద్దకు చేరడంతో రూ.6,756.92 కోట్ల బకాయిలను ఏపీకి చెల్లించాలని తెలంగాణకు విభజన చట్టం సెక్షన్ 92 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ డిస్కంలు, తెలంగాణ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే ఆర్బీఐలోనే తమ రాష్ట్ర ఖాతా నుంచి బకాయి మొత్తాన్ని మినహాయించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం రెండు వారాల క్రితం తీర్పును రిజర్వు చేసి.. గురువారం తుది ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం వైఖరి సమంజసం కాదు: తెలంగాణ తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై ముందుగా చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 92 ప్రకారం ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో డిస్కంలు: ఏపీ తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్నారు. విభజన తర్వాత విద్యుదుత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికీ.. పునర్వ్యవస్థీకరణ చట్టానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేంద్రం ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు ఏపీ డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తూనే ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించపోవడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, దీంతో తెలంగాణకు విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే కేంద్రం నోటీసులు జారీ చేసిందన్నారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని పేర్కొన్నారు. కేంద్రానికి అధికారం ఉంది: ఏఎస్జీ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సుందరేశన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులు హాజరై ఒప్పుకున్న తర్వాతే బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు జారీచేసే అధికారం కేంద్రానికి ఉందా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ఉత్తర్వులను కొట్టివేసింది. -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్‌లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్‌లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
‘ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను RBI ద్వారా ఇప్పిస్తాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను ఆర్బీఐ ద్వారా ఇప్పిస్తామని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీలు విజయసాయి రెడ్డి, జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమాధానం చెప్పారు. రూ. 6 వేల కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ, ఆర్థిక శాఖతో చర్చిస్తున్నామని తెలిపారు. ఆర్బీఐలో తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి ఈ బకాయిల మొత్తాన్ని చెల్లింపచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. విభజన సమయంలో తెలంగాణకు ఏపీ విద్యుత్తు సరాఫరా చేసిందని..కానీ తెలంగాణ నుంచి చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఆదేశించిందని.. అయితే రాష్ట్ర సర్కార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుందని చెప్పారు. ఇప్పుడు ఆ స్టే గడువు తీరిందని.. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చెల్లింపులకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ఉన్న తెలంగాణ ఖాతా నుంచి బకాయిలను ఏపీకి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. కేంద్ర న్యాయ శాఖ, ఆర్థిక శాఖ సహకారంతో త్వరలోనే ఏపీ బకాయిలు ఇప్పిస్తామని వెల్లడించారు. చదవండి: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు -
‘విద్యుత్ బకాయిల’పై కేంద్రం వివక్ష
విద్యుత్ బకాయిల చెల్లింపుల అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. అందులో భాగంగానే రూ. 6,757 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఏపీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్ చార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో కేంద్రం గతేడాది కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం అసలు, లేట్ పేమెంట్ సర్ చార్జీ కింద కలిపి మొ త్తం రూ.6,757 కోట్లను ఏపీకి చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 30 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభు త్వం ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఆదేశాలపై సీజే ధర్మాసనం గతంలో విచారించి స్టే విధించింది. కాగా, ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయా న్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం కూడా విచారణ జరిపింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. రావాల్సిన వాటిని పరిగణనలోకి తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే ఏపీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందని వైద్యనాథన్ పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటే, మరో రాష్ట్రం 10 ఏళ్ల వరకు సరఫరా చేయాలని ఏపీ పునరి్వభజన చట్టంలో ఉందని, అయినా విడిపోయిన తర్వాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా నిలిపివేసిందని నివేదించారు. దీంతో తెలంగాణ బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఈ కారణంగా రాష్ట్రంపై రూ.4,740 కోట్ల భారం పడిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
బలవంతపు చర్యలొద్దు.. విద్యుత్ బకాయిల చెల్లింపులపై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రూ.6,756.92 కోట్లు విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణపై బలవంతపు చర్యలొద్దని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92(అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) కోట్లు చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే స మస్యలపై ముందు చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ కేంద్రానికి సహకరించిందని, అందుకే ఆ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని నివేదించారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ పవర్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకున్నాయని వెల్లడించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికి పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బకాయిల చెల్లింపు కోసం తెలంగాణను ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. -
1,730 కోట్లు చెల్లించేలా ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: రూ.1,730 కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించి టీఎస్ ట్రాన్స్‌కో వేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ.. తదితరాలపై ఏపీ సర్కార్ తమకు రూ..1,730 కోట్లు బకాయి ఉందని, వాటిని చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ సి. శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగుల ట్రస్టు(పీఅండ్‌జీ, పీఎఫ్, ఈఎల్, గ్రాట్యుటీ) పెట్టుబడులకు సంబంధించి అసలు రూ.674 కోట్లు, వడ్డీ రూ.38 కోట్లు.. ట్రాన్స్మిషన్ అండ్ ఎస్ఎల్డీసీ చార్జీలకు సంబంధించి అసలు రూ.105 కోట్లు, వడ్డీ రూ.85 కోట్లు.. టీఎస్ డిస్కం బాండ్స్‌కు సంబంధించి అసలు రూ.359 కోట్లు, వడ్డీ రూ.253 కోట్లు.. ఐసీడీస్, డెబిట్ సర్వీసింగ్ తదితరాలకు సంబంధించి.. అసలు రూ.128 కోట్లు, వడ్డీ రూ.87 కోట్లు.. మొత్తంగా అసలు రూ.1,267 కోట్టు, వడ్డీ రూ.463 కోట్లు కలిపి రూ.1,730 కోట్లు ఏపీ బాకీ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత టీఎస్ ట్రాన్స్‌కో అడ్వొకేట్ వై.రామారావు వాదిస్తూ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం విద్యుత్ ఉద్యోగుల బకాయిలు ఏపీ ట్రాన్స్‌కో చెల్లించాలే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. షీలా బిండే కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆస్తులు, అప్పుల పంపిణీ జరగాలన్న రూల్స్ అమలు కాలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. గతంలో వేసిన ఇదే తరహా పిటిషన్‌తో పాటు దీన్ని కలిపి విచారణ చేస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
బకాయిలపై న్యాయ పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.6,756.92 కోట్లను నెలరోజుల్లో ఏపీ జెన్కోకు చెల్లించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని.. దీనిని కేంద్రం పట్టించుకోలేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు మండిపడుతున్నాయి. దీనిపై ఈ నెల 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలిపినట్టు గుర్తుచేస్తున్నాయి. కేంద్ర సహకారం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు చెబుతున్నాయి. ఆరేళ్లుగా పెన్షన్ ట్రస్ట్ వివాదం రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ ట్రస్ట్‌లో జమచేసి ఉన్న నిధుల పంపకాలు జరగలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీకి సంబంధించిన నిధులను విద్యుత్ సంస్థలు ఈ ట్రస్టులో జమ చేసేవి. విభజన నాటికి ట్రస్టులో దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు నిల్వ ఉండగా.. ట్రస్ట్ నిర్వహణ ఏపీకి వెళ్లింది. విద్యుత్ వివాదాల నేపథ్యంలో ఆరేళ్ల కింద ఈ ట్రస్టు నుంచి తెలంగాణకు చెల్లింపులను ఏపీ నిలిపివేసింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్ష న్లు, గ్రాట్యుటీ, ఈఎల్ మొత్తాలను తెలం గాణ విద్యుత్ సంస్థలు సొంత నిధుల నుంచే చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి రావాల్సిన పెన్షన్ ట్రస్ట్ బకాయిలను ఇప్పించాలని విద్యుత్ సంస్థలు తాజాగా హైకోర్టు ను ఆశ్రయించాయి. ఇక ఈ వివాదాల కారణంగా విద్యుత్ సంస్థలు పెన్షన్ ట్రస్ట్‌లో నిధులు జమ చేయడం లేదని.. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు ఇబ్బందికరంగా మారుతుందని ఉద్యోగ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు ఆదేశం
-
ఏపీ: విద్యుత్ బకాయిలపై కేంద్రం కీలక ఆదేశాలు
-
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తమ ఆదేశాల్లో పేర్కొంది. విభజన తర్వాత 2014-2017వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ. 3,441 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్, రూ. 3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీలు చెల్లించాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది. -
TS: ‘పవర్’ నిషేధం ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విద్యుత్ బకాయిలు, కొనుగోళ్లపై నిషేధం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకుంది. నిర్దేశిత గడువు ముగిసినా.. విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిలు చెల్లించలేదన్న ప్రకటనను వెనక్కి తీసుకుంది. గడువులోగానే చెల్లింపులు చేశామన్న తెలంగాణ వాదనను అంగీకరించింది. ఎనర్జీ ఎక్సేంజ్‌ల ద్వారా విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా రాష్ట్ర డిస్కంలపై విధించిన నిషేధాన్ని శనివారం ఎత్తివేసింది. కేంద్రం నిషేధాన్ని సడలించిందని, ఎనర్జీ ఎక్సేంజ్‌ల నుంచి విద్యుత్ కొనుగోళ్లను పునః ప్రారంభించామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. మూడుసార్లు మాట మార్చి.. నిర్దేశిత గడువు ముగిసినా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదంటూ.. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కంలను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ డిస్కంలు ఎనర్జీ ఎక్స్ఛేంజీల ద్వారా క్రయవిక్రయాలు జరపకుండా గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇందులో తెలంగాణ డిస్కంలు రూ.1,380 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొంది. అయితే తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్రాలు తాము గడువులోగానే బకాయిలు చెల్లించామని కేంద్ర ప్రభుత్వానికి వివరించాయి. దీనితో మరుసటి రోజు శుక్రవారమే ఏపీ సహా పలు రాష్ట్రాలపై నిషేధాన్ని కేంద్రం సడలించింది. తెలంగాణ బకాయిలను పునః సమీక్షించి రూ.52 కోట్లే చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మళ్లీ తెలంగాణ డిస్కంలు సంప్రదింపులు జరిపి, బకాయిలు చెల్లించేసిన ఆధారాలను చూపాయి. తిరిగి పరిశీలన జరిపిన కేంద్రం రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది. ఈ బకాయిని రాష్ట్ర డిస్కంలు వెంటనే చెల్లించేయడంతో నిషేధాన్ని సడలించింది. ప్రైవేటు కంపెనీల కోసం అనవసర జోక్యం! కేంద్ర విద్యుత్ శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం.. డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు 45రోజుల గడువులోగా బిల్లులు చెల్లించాలి. ఆ గడువు దాటి మరో నెల గడిచినా చెల్లించకుంటే.. ఆ తర్వాతి రోజును ‘డిఫాల్ట్ ట్రిగ్గర్ డేట్’గా పరిగణిస్తారు. అంటే ఆ రోజు నుంచి 75 రోజుల్లోగా బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోళ్లు జరపకుండా సదరు డిస్కంలను కట్టడి చేసే నిబంధనను కేంద్రం తెచ్చింది. ఈ అధికారాన్ని జాతీయ గ్రిడ్ నిర్వహణను పర్యవేక్షించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పోసోకో)’కు కట్టబెట్టింది. దీనిని తెలంగాణ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు ప్రయోజనం కల్పించడానికే కేంద్రం ఈ నిబంధనలు తెచ్చిందని ఆరోపిస్తున్నాయి. నిజానికి గడువులోగా బకాయిల చెల్లింపులో డిస్కంలు విఫలమైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని నిబంధనల ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీలు చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కంపెనీలు విద్యుత్ సరఫరాను నిలిపివేయొచ్చని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని, కోర్టుకు వెళ్లవచ్చని అంటోంది. అయినా కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని మండిపడుతోంది. బకాయిల చెల్లింపుతో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ)కి ఏ సంబంధం లేకపోయినా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం దానికి కట్టబెట్టడం సరికాదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. చదవండి: ఇవి పార్టీల ఎన్నికలు కావు.. మన బతుకుదెరువు ఎన్నికలు -
AP: భలే చాన్స్.. విద్యుత్ బకాయిలకు వన్ టైమ్ సెటిల్మెంట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాల మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా సర్ చార్జీలు లేకుండా విద్యుత్ బకాయిలు చెల్లించవచ్చని డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ.. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీలోగా బకాయిలను పూర్తిగా చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలకు మాత్రమే సర్ చార్జీ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నిరీ్ణత సమయంలో బకాయిలను చెల్లించకపోతే సర్ చార్జీలు కట్టాల్సివస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆరి్థకంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వినియోగదారులు బకాయిలను చెల్లించాలని, లేదంటే విద్యుత్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. చెక్‌డ్యాంల బలోపేతానికి రెండేళ్లుగా నిధులివ్వలేదు ఆంధ్రపద్రేశ్లో చెక్‌డ్యాంల బలోపేతానికి వాటర్ బాడీస్ రిపేర్ రెన్నోవేషన్, రీస్టోరేషన్ నిమిత్తం 2019–20, 2020–21ల్లో నిధులు విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. హస్తకళల ప్రోత్సాహానికే హున్నార్‌హాట్‌లు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హస్తకళలను ప్రోత్సహించడానికే హున్నార్‌హాట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో హాట్లు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ హస్తకళల పోటీపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు రెడ్డెప్ప, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్, సంజీవ్‌కుమార్, ఎం.వి.వి.సత్యనారాయణ, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఆర్‌ఐపీలో 31 ప్రాజెక్టులు డ్యాం రిహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డీఆర్ఐపీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 31 ప్రాజెక్టులకుగాను రూ.667 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. గ్రామ్ ఉజాలలో మూడు జిల్లాలు గ్రామ్‌ఉజాల ప్రోగ్రామ్‌లో ఏపీలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. తొలిదశలో గుర్తించిన జిల్లాల్లో లబ్ధిదారుల అవగాహనకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీసీఎస్‌ఎల్) చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనే అప్పర్‌భద్ర కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన జలాల్లో భాగంగానే తెలంగాణలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు ఉందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర అంశం సమసినట్లేనని భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
లక్ష బిల్లు.. గొల్లుమన్న యాక్టర్!
ముంబై: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి కరెంటు బిల్లు షాకిచ్చింది. అదానీ ఎలక్ట్రిసిటీ 1,03,564 రూపాయలు బిల్లుగా పంపడంతో ఆయన బిత్తరపోయారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. అదానీ ఆయనకు లక్ష రూపాయలు బిల్లు వేసిందని, ఎవరైనా తన పెయింటింగ్స్ కొని డబ్బిస్తే ఆ బిల్లు కడతానన్నారు. తన పెయింటింగ్స్‌పై వచ్చిన న్యూస్ ఆర్టికల్‌ను ఆ ట్వీట్‌కు జోడించారు. (కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి) వచ్చే నెలలో కూడా ఇలానే బిల్లు వస్తే ఇక కిడ్నీలు అమ్ముకోవాల్సిందేనంటూ జోక్ చేశారు. కొద్దిసేపటికి అదానీ తన బిల్లును సరి చేసిందంటూ మరో ట్వీట్ చేశారు. జూన్ నెలలో చాలా సినీ తారలకు, సామాన్యులకు కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయి. వీరిలో తాప్సీ పన్ను, రేణుకా షాహానే, హుమా ఖురేషి, నిమ్రత్ కౌర్, సోహా అలీ ఖాన్, అమైరా దస్తూర్, డినో మోరియా, కామ్యా తదితరులున్నారు. (పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు) -
పంచాయతీలకు పవర్ షాక్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. పాత బకాయిలు గుదిబండగా మారడంతో స్థానిక సంస్థల ఖజానాకు భారీ చిల్లు పడనుంది. ఏళ్ల తరబడి చెల్లించని బిల్లుల చిట్టాను వెలికితీసిన విద్యుత్ సంస్థలు.. గ్రామాల వారీగా జాబితాను పంచాయతీరాజ్‌శాఖకు అందజేశాయి. ఇందులో ఒక్కో పంచాయతీకి సగటున రూ.లక్షల్లో బిల్లులు రావడంతో పాలకవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. పాత బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేయడంతో ఈ మేరకు పెండింగ్ బిల్లుల వ్యవహా రానికి ముగింపు పలకాలని పీఆర్ శాఖ నిర్ణయించింది. భారీగా పెండింగ్.. రాష్ట్రవ్యాప్తంగా 12,571 గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ.700.68 కోట్ల మేర విద్యుత్ బకాయిలున్నాయి. ఇందులో రూ.280 కోట్ల మేర సర్‌చార్జీలే ఉండటం గమనార్హం. వీటిని వన్‌టైమ్ సెటిల్మెంట్ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ట్రాన్స్‌కోను పంచాయతీరాజ్ శాఖ అభ్యర్థించింది. వినియోగ చార్జీలను తగ్గించలేమని, బిల్లులు కట్టకపోవడంతో మోపిన అపరాధ రుసుం(సర్‌చార్జీ)ను తగ్గించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఏ శాఖ నుంచైనా కచ్చితంగా వసూలు చేయాలని సీఎం స్పష్టం చేయడం.. స్థానిక సంస్థలు కరెంట్ బిల్లుల క్లియర్‌కు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచడం పంచాయతీరాజ్ శాఖను ఇరకాటంలో పడేసింది. నిధుల కటకటతో కొట్టుమిట్టాడిన పంచాయతీలు.. పేరుకుపోయిన బిల్లులే కాదు.. నెలవారీ బిల్లులు కూడా చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చా యి. దీంతో మొత్తం తడిసి మోపెడయ్యాయి. కట్ చేయలేక..కాసులు రాక.. విద్యుద్దీపాలు, తాగునీటి అవసరాలకు స్థానిక సంస్థలు విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. వీటిని అత్యవసర సర్వీసులుగా గుర్తించినందున కరెంట్ సరఫరాను నిలిపివేయడం ట్రాన్స్‌కోకు ప్రతిబం ధకంగా మారింది. అయితే ప్రభుత్వ శాఖల నుంచి భారీ మొత్తంలో రావాల్సిన బిల్లు లు సకాలంలో రాకపోవడంతో సంస్థకు ఆర్థికంగా కష్టంగా మారిందని సీఎం దృష్టికి విద్యుత్ శాఖ తీసుకెళ్లింది. దీంతో విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలంటే ఏ శాఖ అయినా తప్పకుండా కరెంట్ చార్జీలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో స్థానిక సంస్థలకు మినహాయింపు లేకుండాపోయింది. తాజాగా గ్రామ సీమల అభివృద్ధికి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధుల నుంచి కరెంట్ చార్జీలు చెల్లించాలని సూచిస్తూ పీఆర్ కమిషనర్ రఘునందన్‌రావు డీపీవోలను ఆదేశించారు. కొత్త మీటర్ల అమరికకు రూ.1,600 కొత్త గ్రామ పంచాయతీల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు సర్వీస్ చార్జీ, ఇతరత్రా అవసరాలకు వన్‌టైమ్ కింద రూ.1,600 వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం స్పష్టం చేసిం ది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4 వేల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించిన విద్యుత్ సరఫరా, నిర్వహణ బాధ్యతలు విడిపోయినందున దానికి తగ్గట్టుగా నూతన జీపీల్లోనే కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బకాయిల భారం కష్టమే కాగా పెండింగ్ కరెంట్ బిల్లులను స్థానిక పంచాయతీలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చిన్న పంచాయతీలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి. ఇప్పటికే మల్టీ పర్పస్ వర్కర్, ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలు, 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు నిధుల్లేక తల్లడిల్లుతున్న తరుణంలో ఈ భారాన్ని ఎలా మోయాలనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. -
విద్యుత్ బిల్లు చెల్లించకపోతే వేటే!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి సంస్థలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను కూడా జీరో సైజుకు తెస్తాం. భవిష్యత్తులో వాడే విద్యుత్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలని, అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించట్లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలది కీలక పాత్ర.. తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని, నేడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్ కారణంగా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉం డేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ ‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ఉంటుంది. ఆ సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలను, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చూడటం తదితర పనులు నిర్వహిస్తాం. సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుంది.. ఎంత బిల్లు వస్తుందనే విషయాలను మదింపు చేయాలి’ అని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయని, ఇందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లేఅవుట్లలో విద్యుత్ అవసరాలకు తగినంత స్థలం కేటాయించేలా చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం.. దాన్ని ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్‌ను తట్టుకునేందుకు, సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని సూచించారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, íసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముళ్లా మజాకా!
అధికారంలో ఉండగా వాటర్ ప్లాంట్ల నిర్వహణను చేజిక్కించుకున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. ఎంచక్కా లాభాలను తమ జేబుల్లోకి వేసేసుకొని... వాటికి వచ్చే కరెంటు బిల్లులను మాత్రం చెల్లించకుండా విద్యుత్‌శాఖకు ఎగనామం పెట్టేశారు. – శింగనమల సాక్షి,శింగనమల: శింగనమలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను సప్తగిరి క్యాంపర్ సంస్థ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉచితంగా అందించారు. దీనిని రామాలయంలోని కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ గ్రామ పంచాయతీ చేపట్టాలని నిర్ణయించారు. కానీ అధికారం ఉందన్న నెపంతో టీడీపీ కార్యకర్త దాని బాధ్యతలను అప్పగించారు. తన సొంత మినరల్ వాటర్ ప్లాంట్‌గా ఆయన నీటిని అమ్ముకుంటూ వచ్చారు. ఇంతవరకూ గ్రామ పంచాయతీకి ఎలాంటి డబ్బు జమ చేయలేదు. వాటర్ ప్లాంట్ విద్యుత్ బకాయి ఇప్పటి వరకు రూ.1.50 లక్షకు చేరింది. నేటికీ ఈ బకాయిని విద్యుత్ అధికారులు వసూలు చేయలేదు. వచ్చే ఆదాయమంతా టీడీపీ కార్యకర్తే తీసుకున్నా, విద్యుత్ అధికారులు మాత్రం ఆయన్నుంచి వసూలు చేసుకోలేదు. విద్యుత్ మీటర్‌ను మాత్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు మీద తీసుకున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం గ్రామ పంచాయతీ చెల్లిస్తుందిలేననే ధీమాగా ఉన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తే నిర్వహిస్తుంటం గమనార్హం. విద్యుత్ అధికారులు మాత్రం బకాయిలు వసూలు చేయకపోవడం విశేషం. ఈవిధంగా శింగనమల నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరు మీద వసూలు చేసిన వాటర్ ప్లాంట్లకు విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ వాటర్ ప్లాంట్లకు దాతలు సహకరించడం, వాటర్ షెడ్ ద్వారా నిధులు కేటాయించడం, ఎంపీ ల్యాండ్స్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. శింగనమల మండలంలో సలకంచెర్వు, నాయనవారిపల్లి, లోలూరు గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. సలకంచెర్వులో వాటర్ షెడ్ కింద ఏర్పాటు చేయగా, గత సర్పంచ్ , వారి అనుచరులు నిర్వహించారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకున్నారు. ప్రస్తుతం అది నిలిచిపోయింది. దీనికి రూ.50 వేలు విద్యుత్ బకాయి ఉంది. నాయనవారిపల్లిలో వాటర్‌షెడ్ కింద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ మాత్రం మాజీ సర్పంచ్ చేస్తున్నారు. విద్యుత్ బకాయి రూ.4 వేలు దాకా ఉంది. లోలూరులోనూ రూ.4 వేలు బకాయి చెల్లించాల్సి ఉంది. ఇక ఎంపీ ల్యాడ్స్ కింద కల్లుమడి, రాచేపల్లి, నిదనవాడ, ఉల్లికల్లు, సోదనపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం రూ.2.40 లక్షల విద్యుత్ బకాయి చెల్లించాల్సి ఉన్నా ఎవరూ చెల్లించడంలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే తంతు నార్పల మండలంలోనూ గూగూడు, బండ్లపల్లి, పూలసలనూతలలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయగా, నార్పల, బి.పప్పూరు, బొందలవాడ గ్రామాల్లో ఏర్పాటు చేసినా అవి ప్రారంభం కాలేదు. పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి, చెర్లోపల్లి, ఓబుళాపురం గ్రామాల్లో వాటర్‌షెడ్ నిధుల కింద వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వీటికి రూ.1.80 లక్షలు విద్యుత్ బకాయిలున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పసూలూరు, సిద్దరాంపురం, కొర్రపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు రూ.1.50 లక్షలు విద్యుత్ బకాయి ఉన్నారు. గార్లదిన్నె మండలంలో మర్తాడు, కోటంక, గార్లదిన్నె గ్రామాల్లోనూ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటికి రూ. గార్లదిన్నెలో రూ.10 వేలు బకాయిలున్నాయి. మర్తాడులో విద్యుత్ మీటరు లేకుండానే నేటికీ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈవిధంగా నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లుకు సంబంధించి రూ.5.70 లక్షలు విద్యుత్ బకాయిలున్నాయి. ప్రభుత్వం మారడంతో ఈ బకాయిలు ఎగవేతకు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బకాయి వసూలు చేస్తాం వాటర్ ప్లాంట్లకు ఉన్న విద్యుత్ బకాయి వసూలుకు చుంటున్నాం. శింగనమల మండలంలో నిర్వహణలో ఉన్న వాటర్ ప్లాంట్లకు సంబంధించి ఎంత బకాయి ఉందో నిర్వాహకులతో వసూలు చేస్తాం. విద్యుత్ బకాయి చెల్లించకపోతే మాత్రం విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం. – ప్రసాద్, ట్రాన్స్‌కో ఏఈ, శింగనమల -
విద్యుత్ బకాయిలు రూ.430 కోట్లు
కొత్తపల్లి(కరీంనగర్): టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి. మొండి బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రాకపోవడంతో బకాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా బకాయిల భారంగా మిగిలిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించినా వాటిని ఇన్స్టాల్ చేయకపోవడంతో మొండి బకాయిలు నెలనెలా పెరుగుతున్నాయి. విద్యుత్‌సంస్థ ఉదాసీనత, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తగా ఇప్పటి వరకు 2,308 సింగిల్ ఫేజ్, 543 త్రీఫేజ్ ప్రీ పెయిడ్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ శాఖ బిగించింది. బిగించిన మీటర్లు ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.430,47,9700 కోట్లు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆలోచన అద్భుతం.. ఆచరణ శూన్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ సంస్థలు చేపట్టిన ప్రీ పెయిడ్ మీటర్ల ఆలోచన బాగున్నప్పటికీ వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. కరీంనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటి వరకు 727 సింగిల్ ఫేజ్, 295 త్రీ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా విద్యుత్ దుబారా అవుతున్నట్లు గుర్తించిన విద్యుత్ అధికారులు ప్రీ పెయిడ్ మీటర్ల ద్వారా అదుపు చేయాలని నిర్ణయించారు. లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అవసరానికి మించి వాడటంతో విద్యుత్ దుబారా కావడంతోపాటు బిల్లులు చెల్లించకపోవడం విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారింది. విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఉన్నతాధికారుల సిఫారసులతో విద్యుత్ పునరుద్ధరించుకోవడం పరిపాటిగా మారింది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అనేకమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ ఒత్తిడిలకు తలొగ్గి సరఫరా చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖలే కాదా.. అంటూ బకాయిలపై నిర్లక్ష్యం వహించడంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు తలకుమించిన భారంగా మారుతోంది. అయినా అడపాదడపా చర్యలు చేపడుతోంది. కానీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోతోంది. కనీసం ప్రీ పెయిడ్ మీటర్లనైనా ఇన్స్టాలేషన్ చేస్తే విద్యుత్ బకాయిల వసూలుతోపాటు వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ.430.47 కోట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో రూ.430,47,97 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదికేడాది ఈ బకాయిలు పెరుగుతున్నాయే తప్ప చెల్లింపులు మాత్రం చేయకపోవడం విద్యుత్ శాఖకు భారంగా మారుతోంది. విద్యుత్ సర్వీసులు నిలిపివేస్తే క్షణాల్లోనే పునరుద్ధరణ కోసం పైరవీలు.. దీంతో ఏం చేయలేని విద్యుత్ శాఖ తిరిగి సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని బకాయిలను నిలువరించాలంటే ప్రీ పెయిడ్ మీటర్లు పూర్తిస్థాయిలో పని చేయాల్సి అవసరం ఉంది. ఆ దిశగా విద్యుత్ అధికారులు అడుగులేస్తే తప్ప విద్యుత్ బకాయిల వసూళ్లు కష్టసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. బకాయిలు చెల్లించని శాఖల విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ప్రతినెలా నోటీసులిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రీపెయిడ్ మీటర్లను ఇన్స్టాలేషన్ చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించి సహకరించాలి. – కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
బకాయిలపై ‘పంచాయితీ’!
- పాత బకాయిలు చెల్లించని గ్రామాలకు కరెంట్ నిలిపేస్తున్న డిస్కంలు - 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ కోత పెడుతున్న ఈవో పీఆర్డీలు - 20 శాతం మినహాయింపుపై మంత్రి హామీ ఇచ్చినా జారీ కాని ఉత్తర్వులు - డిస్కంలు ఇచ్చిన పాత బిల్లులన్నీ అశాస్త్రీయమైనవేనంటున్న సర్పంచ్‌లు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల గ్రహణం ఇంకా వీడలేదు. పాత విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే నెపంతో డిస్కంలు పలు గ్రామాలకు కరెంట్ సరఫరాను నిలిపి వేస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో మోటార్లు పనిచేయక మంచినీటి సరఫరా జరగడం లేదు. రాత్రివేళల్లో వీధి లైట్లు కూడా వెలగడం లేదు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగా రెడ్డి జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలే విద్యుత్ బిల్లులు చెల్లించగా, తెలంగాణ వచ్చాక ఆ భారాన్ని పంచా యతీలపై వేయడమేంటని ఇటీవల సర్పంచుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ బకాయిల రూపేణా గ్రామ పంచాయతీ లపై పడుతున్న భారాన్ని కొంత మేరకు తగ్గిస్తామ ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ఇటీవల సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. గతంలో 30 శాతం నిధులను చెల్లించాలని ఆదేశాలుండగా.. ప్రస్తుతానికి 10 శాతం చెల్లిస్తే చాలని సర్పంచులతో మంత్రి పేర్కొన్నారు. అయితే.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాకపోవడంతో విద్యుత్‌బకాయిల వసూలుపై డిస్కంల సిబ్బంది, ఈవో పీఆర్డీలు భీష్మించుకుని కూర్చున్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు అందిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం విద్యుత్ బిల్లులకు చెల్లించాల్సిందేనని ఈవో పీఆర్డీలు అంటుండగా.. చెల్లించని గ్రామాలకు డిస్కంల సిబ్బంది కరెంటును నిలిపేస్తున్నారు. బకాయిలు రూ. 942 కోట్లు గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 942 కోట్ల పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని డిస్కంలు సర్కారుకు నివేదికను అందజేశాయి. పంచాయతీ లకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలను రాబట్టుకోవాలని డిస్కం లకు, పంచాయతీరాజ్ అధికారులకు సర్కారు సూచించింది. అయితే.. శాస్త్రీయ విధానం లేకుండా డిస్కంలు చెబుతున్న బకాయిల లెక్కలను గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను గతంలో సర్కారే చెల్లించిందని, ప్రస్తుతం కూడా బకాయిలను ప్రభుత్వం నుంచే డిస్కంలు రాబట్టుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్ బకాయిలకే వెచ్చిస్తే.. పంచాయితీల నిర్వహణ కష్టమని వారు వాపోతున్నారు. ముందుకు సాగని మూడోలైన్ పనులు గ్రామ పంచాయతీల్లో వీధిలైట్ల విద్యుత్ వినియోగం లెక్కలను తేల్చేందుకు మూడోలైన్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినా, క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగడం లేదు. రూ.వందల కోట్లలో విద్యుత్ బకాయిలంటూ గ్రామ పంచాయతీలను షాక్‌కు గురి చేస్తున్న డిస్కంలను నియంత్రించేందుకు పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు చేసిన మూడోలైన్ ప్రతి పాదనకు ఏడాది కిందటే సర్కారు ఆమోదం తెలిపింది. గృహావసరాల కోసం విద్యుత్ శాఖ వేసిన రెండు లైన్లకు సమాంతరంగా వీధిలైట్లకు ప్రత్యేకంగా మూడో లైన్ (వైర్) ఏర్పాటు చేయాలని, ఇందుకు సుమారు రూ.10 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. -
20 లోపు బకాయిలు చెల్లించాల్సిందే
ట్రాన్స్‌కో తిరుపతి జోన్ సీఈ నందకుమార్ చేజర్ల : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ఈ నెల 20వ తేదీ లోపు చెల్లించాలని, లేకపోతే చర్యలు తప్పవని ట్రాన్స్‌కో తిరుపతి జోన్ సీఈ నందకుమార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని బోడిపాడు సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి ఇంకుడుగుంతలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మంచచినీటి పథకాలు, ప్రభుత్వ పథకాలు వీధిలైట్లుకు సంబంధించి పంచాయతీలలో కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. 20 లోగా బకాయిలు చెల్లించకపోతే సంబంధిత పథకాలకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఆయన వెంట టెక్నికల్ జోన్ డీఈ జగదీశ్వర్‌రెడ్డి, రూరల్ డీఈ విజయ్‌కుమార్, ఎమ్మార్జీ డీఈ రఘు, ఏడీ జనార్దన్, ఏఈ ప్రభాకర్ పాల్గొన్నారు. -
రూ.125 కోట్ల విద్యుత్ బకాయిలు
విద్యుత్ శాఖ సీఈ నందకుమార్ చిల్లకూరు: జిల్లాలో సుమారు రూ.125 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయని విద్యుత్‌శాఖ సీఈ నందకుమార్ తెలిపారు. చిల్లకూరు సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, పంచాయతీల నుంచి రూ.80 కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. చిల్లకూరు మండలంలో రూ.2 కోట్ల మేర బకాయిలు ఉండగా, ఆక్వా రైతులు 50 శాతం మేర చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన బకాయిలు పరిశ్రమల నుంచి రావాల్సి ఉందన్నారు. కడివేడు ఫీడర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో మరో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా నెలఖారులోగా జీతాలు చెల్లిస్తామని తెలిపారు. విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం చిల్లకూరు సబ్‌స్టేషన్ సిబ్బందిపై సీఈ నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌కు ఎంత మేర విద్యుత్ వస్తుంది..ఏ ఫీడర్‌కు ఎంత సరఫరా చేస్తున్నారని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎందుకు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, బకాయిలు వసూళ్లపై దృష్టి సారిచంకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈలు అనీల్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి ఇస్మాయిల్, రాఘవేంద్రరావు, ఏడీలు శ్రీధర్, నరేంద్రరెడ్డి, ఏఈలు చినస్వామి నాయక్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, తదితరుల ఉన్నారు. -
బకాయి చెల్లించకుంటే కరెంట్ కట్
బాన్సువాడ : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు కోట్ల రూపాయల్లో విద్యుత్ బకాయిలు పడడంతో వాటి వసూలుకు ట్రాన్స్‌కో కార్యాచరణను రూపొందించింది. ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాల యాల బకాయిలపైనే చర్చించినట్లు సమాచారం. ఈ మేర కు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. మొండి బకాయిలను ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని సీఎండీ ఆదేశించడంతో జిల్లాలోని ట్రాన్స్‌కో అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కు విద్యుత్తు సరఫరా నిలిపివేతే మార్గమని భావిస్తున్నారు. ఇప్పటికే గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న వినియోగ దారులు ఒక నెల బిల్లు చెల్లించకున్నా విద్యుత్తు కనెక్షన్‌ను తొలగిస్తున్న అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ముక్కుపిండి మరీ బకాయిలను వసూలు చేయాలని భావిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ బాన్సువాడ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్)కు చెందిన ఎత్తిపోతల పథకాలు, మంచినీటి నిర్వహణ పథకాలకు సంబంధించి సుమారు రూ. 2 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల వసూలు కోసం పలుమార్లు ఎన్పీడీసీఎల్ బాన్సువాడ డివిజన్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. ఆరు నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో కార్యాలయంలో పని చేయాల్సిన సిబ్బంది ఇబ్బందుల పాలవుతున్నారు. వాస్తవానికి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు నెలనెలా చెల్లిస్తున్నారు. కానీ వివిధ పథకాలకు సంబంధించి విద్యుత్తు బిల్లును చెల్లించకపోవడంతో కార్యాలయ విద్యుత్తును తొలగించారు. మొదట వివిధ పథకాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయగా, గ్రామాల్లో మంచినీటి సరఫరా లేక ప్రజలు ఆందోళనలు చేశారు. దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరింపచేయించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే ఇబ్బంది కలిగించాలని, అప్పుడే విద్యుత్తు బకాయిలను చెల్లిస్తారని నిర్ణయించిన ట్రాన్స్‌కో డీఈ, డివిజనల్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో ట్రాన్స్‌కో-ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య పలుమార్లు వాగ్యుద్ధం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ట్రాన్స్‌కో బాన్సువాడ డివిజన్ పరిధిలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 20 కోట్ల బకాయి ట్రాన్స్‌కోకు ఉండడం గమనార్హం. ఇందులో గ్రామ పంచాయతీల ద్వారా రావాల్సిన బకాయి రూ. 15కోట్లు కాగా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల ద్వారా మరో రూ. 5 కోట్ల బకాయి రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీల నుంచి సుమారు 7 కోట్ల బకాయి, గృహ విద్యుత్తు కనెక్షన్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రావాల్సి ఉందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు రావాల్సి ఉండడంతో ఎలాగైనా వాటిని వసూలు చేయాలనే లక్ష్యంతో ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు.