english
-
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
మేమూ ఇంగ్లిష్‌లో మాట్లాడతాం!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ సులువుగా అర్థం చేయించడం.. ఆపై మాట్లాడేలా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్తోపాటే విద్యార్థులు మాట్లాడేలా గతనెల 28 నుంచి జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను నిర్వహిస్తున్నారు. 1,252 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 16 పాఠశాలలను స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థులు 1,252 మంది ఉండగా.. 16 మంది టీచర్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానర్ (ఐఎప్పీ) డిజిటల్ బోర్డులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌కి చెందిన భారత్ దేఖో, మంత్రా పర్ చేంజ్, అలోకిట్, శిక్షా లోక్ స్వచ్ఛంద సంస్థలు రోజూ 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈ పాఠశాలలకు ఆన్లైన్లో పంపిస్తుండగా.. వీడియో చూశాక మరో 15 నిమిషాలు విద్యార్థుల నడుమ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తున్నారు. వీడియోలోని బొమ్మలు, వాటి నడుమ సంభాషణ గుర్తుండి ఇంగ్లిష్ మాట్లాడటం సులువవుతుందని భావిస్తున్నారు. వీటిద్వారా విద్యార్థులు ఉత్సాహంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. 15 రోజులకోసారి సమీక్షిస్తున్న కలెక్టర్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్ధికి ఇంగ్లిష్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు మంచి అవకాశం ఇంగ్లిష్ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. ఆడియో, వీడియోల ద్వారా పిల్లలు ఉత్సాహంతో ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు. ఇప్పటికే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడుతున్నారు. కలెక్టర్, డీఈఓ ఆదేశాలతో త్వరలోనే ఇంకొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తాం. –జక్కంపూడి జగదీష్, జిల్లా కోఆర్డినేటర్, ఉయ్ కెన్ లెర్న్ ప్రోగ్రాం ఇంగ్లిష్ అంటే భయం పోతోంది.. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం తగ్గింది. కథల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడటం జరుగుతోంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు. –బి.రామనాథం, టీచర్, జెడ్పీహెచ్ఎస్, చిన్న కోరుకొండి, కల్లూరు మండలం చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. – డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి, కొణిజర్ల మండలం కలెక్టర్ సార్‌కు ధన్యవాదాలు.. స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోగలుగుతున్నాం. రోజూ వినడం వల్ల కొంతకాలం తర్వాత మాట్లాడగలుగుతాం. మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ మొదలు పెట్టినందుకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సార్‌కు ధన్యవాదాలు. –బి.దేవిక, 7వ తరగతి, జెడ్పీఎస్ఎస్, కల్లూరు, ఖమ్మం జిల్లా త్వరలోనే 200 పాఠశాలల్లో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్ మాట్లాడగలమనే విశ్వాసం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం 16 పాఠశాలలను ఎంపిక చేసినా త్వరలోనే 200 పాఠశాలలకు విస్తరిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాక డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు ఇంగ్లిష్‌లో రాణించలేక ప్రైవేట్ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ‘వుయ్ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం జిల్లా చక్కగా నేర్చుకుంటున్నా.. ఈ కోర్సు వల్ల ఇంగ్లిష్ నేర్చుకున్నా. ప్రస్తుతం చిన్నచిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా. త్వరలోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతాననే నమ్మకం ఏర్పడింది. మాలాంటి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.– డి.బ్యూలా, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కొణిజర్ల మండలం -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్‌ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్‌ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్‌లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్‌ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్‌గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
ఇంగ్లీష్‌తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం
అక్కినేని నాగేశ్వరావు జీవితంలో తక్కువగా తెలిసిన, కానీ ఎంతో లోతైన అంశం ఆయనకు ఇంగ్లీష్ భాషతో ఉన్న అనుబంధం. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాషలో ప్రవేశం లేనందుకు ఆయనని హేళన చేశారు. ఆ అవమాన భారంతో గుండెలు మండి బాత్ రూమ్‌లోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఆయన జీవితంలో ఓ మలుపుగా మారింది. నాగేశ్వరరావు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లీష్ పత్రికలను ప్రధాన వనరుగా చేసుకొని, ప్రతిరోజూ పత్రిక చదువుతూ, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేశారు. కొంత కాలం పిదప ఆయన తన ఆంగ్ల భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ, చక్కటి శైలితో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాధ పెట్టిన విషయమే ఆయనకు విజయంగా మారింది.స్కూల్‌కు వెళ్లలేదు, కానీ తానే విశ్వవిద్యాలయం అయ్యాడుఅక్కినేని పాఠశాలకు వెళ్లలేదు. పెద్ద చదువులు చదవలేదు. కానీ సినీ కళపై ఉన్న అంకితభావంతో స్కూల్‌కు వెళ్లకపోయినా, నటన కళలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. సినిమాను తన తరగతి గది అనుకున్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఆయనకు ఓ పాఠం. అంచలంచెలుగా ఎదిగారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, శ్రద్ధతో నేర్చుకోవడం వలన ఆయన తానే ఓ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించారు. ఎంతో మందికి ఆదర్శవంతులయ్యారు.-సందీప్ ఆత్రేయ, సాక్షి పోస్ట్ -
మట్టిలో మాణిక్యం..! ఈ బుడ్డాడు మామూలోడు కాదు
-
ఇంగ్లిష్ యాదవ్ చాచా
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్. -
ఆటోవాలా ఆంగ్లం : అదుర్స్ అంటున్ననెటిజన్లు, వైరల్ వీడియో
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు ఇదే విషయాన్ని ఒక ఆటో ఆటోడ్రైవర్ మరోసారి నిరూపించాడు. అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తున్న సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఒక ఆటోడ్రైవర్ తన అత్యద్భుతమైన ఇంగ్లిష్ స్కిల్స్‌తో అటు ప్రయాణీకులను, ఇటు ఇంటర్నెట్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విదేశాల్లో చదువుకుని వచ్చినట్టుగా ఈ ఆటోవాలా ఇంగ్లీష్ భాషను దంచి పడేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన ప్యాసెంజర్, ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆయన ఇంగ్లిష్‌లో అంత సులువుగా మాట్లాడుతుండటం చూసి నేనే ఆశ్చర్యపోయాను.కొద్దిసేపు అలా ఉండిపోయాను’’వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలా ఇంగ్లిష్‌కు ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by BHUSHAN🐻🧋 (@kon_bhushan1222)అంతేకాదు ఇది ఇంటర్నేషన లాంగ్వేజ్.. ఇంగ్లీష్ వస్తే లండన్, అమెరికా, ప్యారిస్ లాంటి ప్రాంతాలకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. -
ఆంగ్ల ఆధ్యాత్మికవాది
ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్టన్. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్‌లో జన్మించిన గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ద మ్యాన్ హూ వజ్ థర్స్డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్టన్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్ చెస్టర్టన్ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్ అహ్లిక్విస్ట్. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్టన్ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్ రచయిత సి.ఎస్.లూయిస్‌ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్టన్ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్టన్ బీటిఫికేషన్కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్ రచయిత జోసెఫ్ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, బెర్ట్రాండ్ రసెల్ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్టన్ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్ డిటెక్టివ్ ‘ఫాదర్ బ్రౌన్’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్ హోమ్స్‌లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్ బ్రౌన్. చెస్టర్టన్ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్ ప్రజలు ఇంగ్లిష్‌వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్‌గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్టన్ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్ బెల్లోక్ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్ చనిపోయాక చెస్టర్టన్ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్.సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్టన్ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో చెస్టర్టన్ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్ ఒపీనియన్’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్‌వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్టన్. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్‌లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్ కాదు, ఇంగ్లిషిస్థాన్ అవుతుంది’ అని రాశారు.విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్‌టన్‌కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా చెస్టర్టన్ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్టన్ను ఎడ్గార్ అలెన్ పోతో పోల్చారు బోర్హెస్. ‘చెస్టర్‌టన్‌కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. అయితే జాన్ పైపర్ వ్యాఖ్యానం చెస్టర్‌టన్‌కు తగిన నివాళి: ‘చెస్టర్టన్ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. -
న్యూజిలాండ్ వీసా నిబంధనలు కఠినతరం
వెల్లింగ్టన్: వలసలను నియంత్రించేందుకు వీసా నిబంధనలను న్యూజిలాండ్ కఠినతరం చేసింది. ఇకపై తక్కువ నైపుణ్యమున్న పనివారు కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి ఐదేళ్ల నివాస పరిమితిని మూడేళ్లకు తగ్గించింది. వీసాదారులకు నైపుణ్యం, అనుభవాలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. వెల్డర్లు, ఫిట్టర్లు, టర్నర్లు తదితర 11 కేటగిరీల వారిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. అవసరమైతే వీసా నిబంధనలను మరింత కఠినం చేయెచ్చని కూడా సంకేతాలిచ్చింది. -
మన దేశంలో బెస్ట్ ఇంగ్లీషు ఎవరు మాట్లాడతారు? ఈ వీడియో చూడండి!
భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపు భారత దేశం. అయితే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటినుంచి మన దేశంలో ఇంగ్లీషు భాష ప్రభావం, ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారతీయుల ఇంగ్లీషుపై హింగ్లీష్,టింగ్లీషులాంటి సెటైర్లు ఉన్నప్పటికీ, 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 10శాతం మంది భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడతారు. రెండు లేదా మూడో భాషగా ఇంగ్లీషు మాట్లాడేవారు కూడా ఎక్కువే ఉన్నారు. గ్రామీణులతో పోలిస్తే పట్టణ, విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఇంగ్లీషు భాష మాట్లాడతారు. అయితే తాజాగా చక్కటి ఇంగ్లీషు భాష ఏ భాష ప్రజలు మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం కన్నడిగులు మంచి ఇంగ్లీషు మాట్లాడతారట. మాతృభాష కన్నడగా ఉన్న ప్రజల యావరేజ్ ఇంగ్లీషు స్పీకింగ్ టెస్ట్ స్కోరు 74 శాతంగా నిలిచింది. వావ్.. ఆసక్తికరమైన పరిశోధన.. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే కన్నడ నేర్చుకోవాలన్నమాట, లేదంటే కన్నడ ఫ్రెండ్ అయినా ఉండాలి అంటూ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాత్రమే కాదు బహుశా కన్నడ మాట్లాడేవారు ఇతర భాషలను కూడా తేలికగా నేర్చుకుంటారు. నా దృష్టిలో కన్నడ ఇటాలియిన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు కన్నడిగులు దేశంలోని ఇతర రాష్ట్ర భాషలను సులభంగా నేర్చుకుంటారు అంటూ ఒకరు కమెంట్ చేయడం విశేషం. Guess who speaks the best English in India by mother tongue? 😊👏 pic.twitter.com/MfSlNAiGjR — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) March 11, 2024 మిగిలిన భాషల ర్యాంకులు పంజాబీ - 63 శాతం గుజరాతీ - 65 శాతం బెంగాల్ - 68 శాతం హిందీ,మళయాళం, తెలుగు - 70శాతం తమిళం - 71 శాతం మరాఠా- 73శాతం -
భాషలన్నింటిలో టాప్ ఏవో తెలుసా మీకు?
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి. భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు ఇంగ్లీష్: 1,500,000,000 మాండరిన్: 1,100,000,000 హిందీ: 609,500,000 స్పానిష్: 559,100,000 ఫ్రెంచ్: 309,800,000 ప్రామాణిక అరబిక్: 274,000,000 బెంగాలీ: 272,800,000 పోర్చుగీస్: 263,600,000 రష్యన్: 255,000,000 ఉర్దూ: 231,700,000 ఇండోనేషియన్: 199,100,000 జర్మన్: 133,200,000 -
ఈ అన్న ఇంగ్లీష్ చూసి నోరెళ్లబెట్టిన ఫారెనర్స్
-
'జానీ జానీ యస్ పాపా" శాస్త్రీయ సంగీతంలో వింటే ఇలా ఉంటుందా?
ఆంగ్లంలో బాగా సుపరిచితమైన రైమ్ ఏదంటే ఎవ్వరైన ఠక్కున్న చెప్పే రైమ్ అది. దీనికి పేరడీగా తెలుగులో ఎన్నో రైమ్‌లు వచ్చాయి కూడా. అయితే ఈ రైమ్‌ని క్లాసికల్ మ్యూజిక్‌లో పాడితే..అస్సలు ఎవ్వరూ అలా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ శాస్త్రీయ సంగీతంలో పాడితే ఎలాం ఉంటుందో పాడి చూపించాడు ఓ వ్యక్తి. ఈ పాట నిమిషాల్లో వైరల్ కావడమే గాక అశేష ప్రజాధరణ పొందింది. నెటిజన్లు కూడా వావ్ అని కితాబిచ్చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే..ఈ వీడియోని భారతీయ రైల్వే అకౌంట్స్ సర్వీస్(ఐఆర్ఏఎస్) అధికారి అనంత్ రూపనగుడి నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తుండగా మరొక వ్యక్తి తబల వాయిస్తూ కనిపించారు. మధ్యలో కూర్చొన్న వ్యక్తి హిందూస్తానీ సంగీతంలో ఆంగ్ల రైమ్ 'జానీ జానీ యస్ పాపా'ను ఆలపించారు. శాస్త్రీయ సంగీతంలో ఆంగ్ల సాహిత్యాన్ని చాలా శ్రావ్యంగా ఆలపించడం ఆశ్చర్యాన్ని కలిగించడమే గాక అత్యద్భుతంగా ఉంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. అంతేగాదు ఇలా వందేళ్ల క్రితమే ఆలపించి ఉంటే.. దెబ్బకు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కదా! అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా క్లాసికల్ టచ్‌తో కూడిన ఆ రైమ్‌ని వినేయండి.! यह अगर 100 साल पहले आता, तो अंग्रेज़ अपना देश खुद छोडकर चले जाते! 😀😛😂 #English #rhymes #Music pic.twitter.com/uolJqbEwde — Ananth Rupanagudi (@Ananth_IRAS) January 20, 2024 (చదవండి: అతడి ఐదుగురు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్..వాళ్లందరికీ..: మండిపడుతున్న నెటిజన్లు) -
12th ఫెయిల్.. అమెరికన్ యాసలో ఇరగదీసే ‘ఇంగ్లీష్’ టాలెంట్
గలగల స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడాలని అందరికీ ఆశ ఉంటుంది. అమెరికా వాళ్లనే తలదన్నేలా మంచి అమెరికన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండని కూడా కొందరు తాపత్రయ పడుతుంటారు. అలాగే ప్రయత్నం చేస్తూ.. ఓ యువకుడు అమెరికన్ యాసలో ఇంగ్లీష్‌ను స్టైలీష్‌గా మాట్లాడి ఇన్స్టాగ్రామ్ సంచలనంగా మారాడు. అతను అమెరికా యాసతో ఇంగ్లీష్ మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఒడిశాకు చెందిన 21 ఏళ్ల ధీరజ్ ఠాక్రీ ఇంగ్లీష్ మాట్లాడిన వీడయోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ముందు అతను మాట్లాడే ఇంగ్లీష్, అమెరికన్ యాసపై నెటిజనన్లు విమర్శిస్తూ కామెంట్లు చేసేవారు. కానీ, ఇప్పుడు అతని అమెరికన్ ఇంగ్లీష్ యాస.. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్ల కంటే అద్భుతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్ ‘ఇంగ్లీష్ టీచర్’గా మారిపోయాడు. View this post on Instagram A post shared by Dhiraj Takri (@dhirajtakri) 12వ తరగతి ఫెయిల్ అయిన ధీరాజ్.. ఇంగ్లీష్ కోసం ఎటువంటి కోచింగ్‌కు వెళ్లలేదు. 2019 నుంచి అతను ఇంగ్లీష్ నేర్చుకోవటం ప్రారంభించాడు. దాదాపు రెండు ఏళ్లు.. 2021 వరకు ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం తరచూ చర్చ్ పాటలు పాడేవాడినని ధీరజ్ తెలిపాడు. స్థానిక యాసతో ఇంగ్లీష్ మాట్లాడేవారి మాటలు శ్రద్ధగా వినేవాడినని చెప్పాడు. అలా తాను ఇంగ్లీష్ నేర్చుకున్నానని తెలిపాడు. అక్కడితో ఆగకుండా తనకు వచ్చిన ఇంగ్లీష్‌ను ఇతరులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మీమ్స్, ఫన్నీ వీడియోల రూపంలో దేశీయ స్టైల్లో నేర్పిస్తూ ఇన్‌స్టా టీచర్ అవతారం ఎత్తాడు. మొదట్లో తాను అప్లోడ్ చేసిన విడియోలపై చాలా కామెంట్లు వచ్చేవి.. తన ఇంగ్లీష్ స్పష్టత (అమెరికన్ యాస) మెరుగుపడటంతో కామెంట్లు కూడా తగ్గిపోయినట్లు చెప్పుకొచ్చాడీ ఇన్‌స్టా ‘ఇంగ్లీష్ టీచర్’. View this post on Instagram A post shared by Dhiraj Takri (@dhirajtakri) తనది చాలా పేద కుంటుంబమని తల్లి గాజులు అమ్ముతుందని తెలిపాడు. తన సోదరుడు ఇంగ్లీష్ వీడియోల విషయంలో తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఇంగ్లీష్ భాషపై మరింత నైపుణ్యం మెరుగుపరుకుంటానని అన్నాడు. ప్రస్తుతం ఇండియన్, బ్రిటన్, అమెరికన్ మూడు యాసలను కలిపి మాట్లాడుతున్నాని చెప్పాడు. భవిష్యత్తులో వేరువేరుగా ఇంగ్లీష్‌ను మాట్లాడతానని అన్నారు. View this post on Instagram A post shared by Dhiraj Takri (@dhirajtakri) ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్ ఇప్పటివరకు 94 వీడియోలు పోస్ట్ చేశారు. అతనికి ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే అలస్యం ఎందుకు మీరు కూడా ధీరజ్‌లా అమెరికన్ ఇంగ్లీష్ యాసతో ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. చదవండి: Ram Janmabhoomi: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం! -
ఏపీ బాటలో కర్ణాటక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పిక్టోరియల్(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది. పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్–తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్ ఏ వర్డ్’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. పూర్తి శాస్త్రీయంగా తయారీ ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని ఇంగ్లిష్–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
అక్క ఇంగ్లీష్ కి ఫిదా అవ్వాల్సిందే !
-
మనోనేత్రంతో ముందడుగు...
జ్యోత్స్న ఫణిజ... తెలుగమ్మాయి. ఢిల్లీ... ఏఆర్ఎస్డీలో అసిస్టెంట్ ప్రోఫెసర్. దేశవిదేశాల్లో అవార్డులందుకున్న కవయిత్రి మిస్ కాలేజ్... బెస్ట్ హాఫ్ శారీ విజేత. ర్యాంప్ వాకరే కాదు... మారథాన్ రన్నర్ కూడా. కర్ణాటక, హిందుస్థానీ సంగీత గాయని... చిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న చదువరి. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాసిన జ్యోత్స్న... ఆత్మస్థయిర్యం... ఆత్మవిశ్వాసమే నా కళ్లు అంటోంది. జ్యోత్స్న ఫణిజ సొంతూరు ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, కైకలూరు. ఆమె పుట్టినప్పుడు ఆమెలోని జన్యు సమస్యను డాక్టర్లు గుర్తించలేకపోయారు. కంటి సమస్య గురించి ఆరు నెలలకు తెలిసింది. మేనరికపు వివాహం కారణంగా ఇలా జరిగిందని, వైద్యచికిత్సలతో ప్రయోజనం లేదన్నారు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు. అమ్మాయి చదువు కోసం నర్సాపురంలో ఉన్న స్పెషల్ స్కూలు గురించి కూడా వాళ్లే చెప్పారు. ఊహ తెలిసినప్పటి నుంచి తన జీవనప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు జ్యోత్స్న ఫణిజ. అంతులేని ఆప్యాయత ‘‘నా సమస్య తెలిసిన తరవాత ఇంట్లో అందరూ నా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నా చదువు కోసం అమ్మమ్మ నర్సాపురంలో ఇల్లు తీసుకుని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సంరక్షించింది. అమ్మ సాహిత్యాభిలాష్. నన్ను సాహిత్యానికి దగ్గర చేయడానికి కథలు, హిందీ పాటల క్యాసెట్లు తెచ్చేది. నాకు అనేక ప్రదేశాలు తెలియడం కోసం తరచూ టూర్లకు తీసుకెళ్లేవారు. వాళ్లు కళ్లతో చూసినవన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటే నేను మనోనేత్రంతో చూసేదాన్ని. డిగ్రీ వరకు బ్రెయిలీలో చదివాను. డిగ్రీ విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజ్‌లో చదివాను. బ్రెయిలీలో త్వరగా పేజీ నిండిపోతుంది. లెక్చరర్లు నోట్స్ డిక్టేట్ చేసేటప్పుడు నన్ను గమనిస్తూ నాకు పేపర్ మార్చుకునే విరామం ఇచ్చేవారు. పరీక్ష రాయడానికి కొన్నిసార్లు లెక్చరర్లే స్క్రైబ్‌గా సహకరించేవారు. ఎగ్జామ్ రాయడానికి నాకు మామూలు వాళ్లకంటే ఎక్కువ సమయం ఇచ్చేవారు. నా పరీక్ష పూర్తయ్యే వరకు నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేసేవాళ్లు. క్లాస్ మేట్స్ నుంచి క్లాస్ లీడర్, లెక్చరర్లు, ప్రిన్సిపల్ అందరూ ఆప్యాయంగా చూశారు. వారందరి సహకారం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరగలిగాను. హైదరాబాద్‌లో ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్ లిటరేచర్, పీహెచ్డీ చేశాను. పీజీకి వచ్చిన తర్వాత మొత్తం బ్రెయిలీలో రాయడం కుదరదని టైపింగ్ నేర్చుకున్నాను. దాంతో కంప్యూటర్ ఆపరేట్ చేయడం సులువైంది. చదువుతోపాటు కర్ణాటక, హిందూస్థానీ సంగీతం నేర్చుకుని టీవీ ్రపోగ్రాముల్లో పాటలు పాడాను. కాలేజ్‌లో బ్యూటీ కాంటెస్ట్‌లు, ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేశాను. ఇప్పుడు ఢిల్లీలో కూడా మారథాన్లు చేస్తున్నాను. దేనికీ ‘నో’ చెప్పను. అందరూ చర్మచక్షువులతో చూస్తే నేను మనోనేత్రంతో చూస్తాను. రన్లో మాత్రం హెల్పర్ల సహాయం తీసుకుంటాను. పాఠాలు... పేపర్లు ఢిల్లీలో ఏఎస్ఆర్డీ కాలేజ్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కూడా సహోద్యోగులు, ప్రిన్సిపల్, స్టూడెంట్స్ ఎంతగా స్నేహపూర్వకంగా ఉంటారో చెప్పలేను. పాఠాలు చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ స్టూడెంట్స్ పేపర్లు దిద్దడంలో మాత్రం మా వారి సహకారం తీసుకుంటాను. రొటేషన్‌లో భాగంగా ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాధ్యతలు వచ్చాయి. అప్పుడు కొలీగ్స్ ‘చేయలేనని చెప్పకు. అది కెరీర్లో పెద్ద అడ్డంకి అవుతుంది. బాధ్యతలు తీసుకో, మేమున్నాం’ అన్నారు. ఆ భరోసాతో అడ్మినిస్ట్రేషన్బాధ్యతలు తీసుకున్నాను. ‘నువ్వు పేరుకి ఉంటే చాలు, పని మేము చేసి పెడతాం’ అన్నారు. కానీ నా మనసే అంగీకరించలేదు. టైమ్‌టేబుల్ సెట్టింగ్ నుంచి స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ వరకు స్వయంగా చేశాను. పేపర్ వర్క్ అయితే కష్టమయ్యేదేమో, టెక్నాలజీతో అప్డేట్ అవుతుంటాను కాబట్టి మొత్తం డిజిటల్‌గానే చేయగలిగాను. రాష్ట్రపతి పురస్కారం ఇంగ్లిష్ పాఠాలు చెప్పడం నా వృత్తి అయితే, ఇంగ్లిష్ సాహిత్యం నా ప్రవృత్తి అని చెప్పవచ్చు. తెలుగులో నాకు నచ్చిన సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తున్నాను. నెల్లూరులో పెన్నా రైటర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ రచయిత మోపూరు పెంచల నరసింహం గారి ఎర్రదీపం రచనను క్రిమ్సన్ ల్యాంప్ పేరుతో, రాతిపాటను స్టోన్సాంగ్ పేరుతో అనువదించాను. వివిధ సామాజికాంశాల మీద జర్నల్స్‌లో 12 వ్యాసాలు రాశాను. రచయితల సదస్సుకు హాజరవుతుంటాను. రచయితల నుంచి ‘దృష్టిలోపం’ అనే ఇతివృత్తం ఆధారంగా రచనలను ఆహ్వనించి ప్రచురించడం, కలకత్తా రైటర్స్ వర్క్‌షాప్‌లో పోయెట్రీ కలెక్షన్‌ను ప్రచురించడంలో కీలకంగా పని చేశాను. డిసెంబర్ మూడవ తేదీ ఇంటర్నేషనల్ డిజేబులిటీ డే సందర్భంగా 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్గారి చేతుల మీదుగా ‘రోల్‌మోడల్’ జాతీయ పురస్కారం అందుకోవడం, ప్రధానమంత్రి నుంచి ప్రశంసాపూర్వకమైన అధికారిక ఉత్తరం అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందం. ఏడు కవితలకు అవార్డులు వచ్చాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, నాటా సభలకు ఆహ్వనం, దర్భంగా, మైథిలీ రీజియన్‌లో కుల అణచివేత, ఆదివాసీ సాహిత్యం, దళితుల సమస్యల మీద రాయడం... వంటివి నేను నా జీవితాన్ని ఆదర్శవంతంగా జీవిస్తున్నాననే సంతోషాన్ని కలిగించిన సందర్భాలు. స్ట్రీట్ చిల్డ్రల్డన్ గురించి రాసిన ‘వీథిచుక్క’ రచనకు తెలుగు వాళ్ల నుంచి అందుకున్న ప్రశంసలకు లెక్కలేదు. అందమైన కుటుంబం కుటుంబం విషయానికి వస్తే... డిగ్రీ కాగానే పెళ్లయింది. మా వారు బంధువులబ్బాయే. ఆయనది ఫైనాన్స్ సెక్టార్. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం ఉన్నాం. అప్పుడు పీజీ, పీహెచ్డీ చేశాను. నాకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఉంటున్నాం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఫ్రెంచ్‌లో అడ్వాన్స్డ్ డిప్లమో చేశాను. నిత్యం చదువుతూ, రాస్తూ ఉండడం ఇష్టం. అలాగే పిల్లలకు కథలు చెప్పడం ఇంకా ఇష్టం’’ అన్నారు జ్యోతి ఫణిజ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!
‘ఇక నీకు పూర్తిగా వచ్చేసినట్లే’ అని ఆంగ్లం ఎప్పుడూ అభయం ఇవ్వదు. ఆంగ్లభాషను ఎప్పటికప్పుడూ శోధిస్తూ పట్టు సాధిస్తూనే ఉండాలి... ఈ విషయంలో స్పష్టతతో ఉన్న యువతరం ఆంగ్ల మహాసముద్రంలో కలుస్తున్న నదులు, వాగులు, వంకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. నిత్యావసర భాష అయిన ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిట్‌కామ్స్ నుంచి చాట్‌జీపీటి టూల్స్ వరకు ఎన్నో దారులలో ప్రయాణిస్తోంది... సిట్కామ్ (సిచ్యువేషనల్ కామెడీ షో)తో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనేది పాత మాట. నవ్వుకోవడమే కాదు పదసంపద, నేటివ్ స్పీచ్‌పై పట్టు సంపాదించడానికి, పదాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిట్కామ్లలోని విజువల్ ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి అనేది నేటి మాట. అలాంటి సిట్కామ్స్లో కొన్ని... చీర్స్ (1982–1993) థీమ్ సాంగ్ ‘ఎవ్రీబడీ నోస్ యువర్ నేమ్’ నుంచి చివరి డైలాగ్ వరకు ఏదో ఒక కొత్తపదం పరిచయం అవుతూనే ఉంటుంది. రకరకాల సెట్లలో కాకుండా ఒకటే లొకేషన్లో చిత్రీకరించడం వల్ల ఒకేచోట పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. ‘చీర్స్’లోని హాస్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రైజర్ (1993–2004) చీర్స్లోని ఎపిసోడ్లను అర్థం చేసుకున్నవారికి ఫ్రైజర్ కష్టమేమీ కాదు. ఈ సిట్కామ్లోని ప్రధాన పాత్రలైన ఫ్రైజర్, నీల్ మార్టిన్ల క్లీన్ యాక్సెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ‘ప్రైజర్’ నిండా ఇంటెలిజెంట్ హ్యూమర్ వినిపించి కనిపిస్తుంది. ది సింప్సన్స్ (1980) ది సింప్సన్ టీవీ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ యానిమేటెడ్ సిట్‌కామ్‌లో క్యారెక్టర్ల మధ్య నడిచే సంభాషణలు ఫ్యామిలీ టాపిక్స్‌పై ఉంటాయి. రియల్–లైఫ్ ఫ్రేజ్లపై అవగాహనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల కంటే సహజమైన భాషను నేర్చుకోవచ్చు. ది వండర్ ఇయర్స్ (1988–93) మధ్యతరగతి కుటుంబానికి చెందిన కెవిన్ అర్నాల్డ్ అనే టీనేజర్ ప్రధాన పాత్రలో కనిపించే సిట్కామ్ ఇది. యువత మానసిక ప్రపంచానికి అద్దం పడుతుంది. కెవిన్ అతని ఫ్రెండ్స్ ఎదుర్కొనే రకరకాల సమస్యలతో యూత్ ఆటోమేటిక్‌గా రిలేట్ అవుతారు. యంగ్ పీపుల్ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేసే పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్–ఎయిర్ (1990–1996) ఈ హిట్ కామెడీ షోలో ఎక్కువమందిని ఆకట్టుకునే క్యారెక్టర్ విల్ స్మిత్. ఫన్నీ డైలాగులు, జోక్స్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ క్లాస్ స్పీకింగ్ ఇంగ్లిష్ నుంచి స్ట్రీట్ ఇంగ్లీష్ వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్ (1989–1998) ఈ సిట్‌కామ్‌లో కనిపించే రకరకాల ఎక్స్ప్రెషన్లు, గెశ్చర్ లెర్నర్న్కు ఉపయోగపడతాయి. స్పష్టమైన, సంక్షిప్తమైన యాక్సెంట్ వినిపిస్తుంది. కుటుంబ జీవితానికి సంబంధించి ఇళ్లల్లో వినిపించే ఇంగ్లిష్ ఇడియమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ది నానీ (1993–1999) రకరకాల యాక్సెంట్లను ఈ సిట్‌కామ్‌లో వినవచ్చు. సామాన్య ప్రజలతో పోల్చితే ధనవంతులు ఎలా మాట్లాడతారో చూడవచ్చు... ఇవి మచ్చుకు కొన్ని సిట్కమ్స్ మాత్రమే. ఎన్నో కోణాలలో భాషను మెరుగు పరుచుకునే సిట్కామ్లు ఎన్నో ఉన్నాయి. అప్–టు–డేట్ ఇంగ్లిష్ లెసన్స్ ఫ్లాట్‌ఫామ్ ‘సెన్సేషన్ ఇంగ్లిష్’పై కూడా యూత్ ఆసక్తి చూపుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ వీడియోలు, ఆర్టికల్స్ ద్వారా 5 లెవెల్స్‌లో భాషను మెరుగు పరుచుకోవచ్చు. ప్రాక్టీస్ యువర్ ఇంగ్లిష్ టుడే’ అంటోంది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రోమోవ. మూడువేల పదాలతో కూడిన 40 థీమ్డ్ టాపిక్స్, ఇడియమ్స్, స్లాంగ్ వర్డ్స్, ఎవ్రీ డే ఎక్స్ప్రెషన్స్ ప్రోమోవలో ఉన్నాయి. లైవ్ లెసన్స్, కాన్వర్జేషన్ ఈవెంట్స్, ఏఐ ్ర΄ాక్టీస్ టాస్క్స్, సోషల్ లెర్నింగ్ గేమ్స్, లెర్నింగ్ జర్నీ తమ ప్రత్యేకతగా చెబుతుంది విజువల్ వరల్డ్స్ ఇమార్స్. లాంగ్వేజ్ లెర్నింగ్‌లో కీలక పరిణామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). స్థానిక, స్థానికేతరులను భాష నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి, పర్సనలైజ్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉదా: లెర్నర్స్ బలాలు, బలహీనతల ఆధారంగా పర్సనలైజ్డ్ కరికులమ్‌ను, లాంగ్వేజ్ లెర్నింగ్ గేమ్స్‌ను రూపొందిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతుంది. ఇంగ్లిష్ లిరిక్స్ వినడం ద్వారా కూడా భాషలో నైపుణ్యాన్ని పెపొందించుకునే ధోరణి పెరుగుతోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల యాక్సెంట్లను అర్థం చేసుకోవచ్చు. పదసంపద పెంచుకోవచ్చు. బెటర్ ప్రోనన్సియేషన్కు ఉపయోగపడుతుంది. అలనాటి ప్రసిద్ధ ఇంగ్లిష్ పాటల్లో ఎన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. ఎల్విన్ ప్రెస్లీ, మైకెల్ జాక్సన్ నుంచి నిన్న మొన్నటి కుర్రకారు సంగీతకారుల వరకు ఎంతోమంది పాత పదాలను కొత్తగా ప్రయోగించారు. ‘ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే మాటలు’ అంటూ ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సిఫారసు చేస్తున్నారు ఆంగ్ల భాషా నిపుణులు. ‘ఇక నాకు అంతా వచ్చేసినట్లే’ అనే మాట ఆంగ్లం విషయంలో ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే... ఆంగ్ల భాష అనగానే వినిపించే ప్రసిద్ధ మాట... వర్క్ ఇన్ప్రోగ్రెస్. అందుకే ఆంగ్లంలో ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి యువతరం వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!) -
తర్ఫీదు ఇవ్వకుంటే చిక్కులే!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా, ఇందుకు సంబంధించిన సన్నద్ధత ఎక్కడా కన్పించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. అసలీ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయా? ఉండవా? అనే అనుమానం విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచీ వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సాధారణ క్లాసులే కొనసాగుతుండటం, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై ఏ విధమైన కసరత్తు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అధ్యాపకులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలుంటాయని, మొదట్నుంచీ సరైన శిక్షణ లేకుంటే పరీక్షలు ఎలా రాస్తారని కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్స్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మాక్ టెస్టులు నిర్వహించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. దసరా తర్వాత కార్యాచరణ ఈ ఏడాది నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. దసరా తర్వాత అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రయల్పింస్తున్నాం. అధ్యాపకులకూ దీనిపై స్పష్టత వచ్చేలా చేస్తాం. ఇంటర్ ప్రవేశాలు ఇంకా జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్స్‌కు సమయం ఉంది. –జయప్రదాభాయ్ (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) విధివిధానాలు విడుదలైతే స్పష్టత ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్ తీసుకురావాలన్న ప్రయోగం మంచిదే. దీనిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విధివిధానాలపై బోర్డు త్వరలో స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కన్వీనర్) ఆఖరులో హడావుడితో నష్టం ఆంగ్ల సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. విద్యార్థి ఒక నిమిషంలో తనకు నఇంగ్లీష్ న టాపిక్‌లో మాట్లాడటం, రికార్డు రాయడం, విద్యార్థులు ఇంగ్లీష్‌లో ముచ్చటించడం, ఇంగ్లీష్ చదవడం అనే అంశాలు ప్రాక్టికల్స్‌లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా అంశం గురించి మాట్లాడటం అనే దానిపై తరగతి గదిలో తర్ఫీదు అవ్వాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. లేనిపక్షంలో అప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్‌పై బట్టీ పట్టి వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రయోజనం ఏమిటని ప్రన్పిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌పై పట్టు పెరగాలంటే విద్యార్థులు పరస్పరం ఇంగ్లీష్‌లో సంభాషించుకోవడం ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే దాన్ని ప్రాక్టికల్స్‌లో చేర్చారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు జరగనుండగా ఇప్పటికీ ఈ తరహా ప్రయోగాలు కాలేజీల్లో జరగడం లేదు. రికార్డుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. తీరా పరీక్షల ముందు హడావుడి చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తయి రివిజన్‌కు వెళ్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌పైనా విద్యార్థులకు శిక్షణ నడుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
Rameshwar Goud: గురుబోధకుడు
తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్‌లో మెరికలు కావాలంటే... వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్ టీచర్. ‘మంచి ఇంగ్లిష్ రావాలంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్ గౌడ్. ‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్ గౌడ్ టీచర్స్ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ. శ్రద్ధగా నటించాను! రామేశ్వర్ గౌడ్ సొంతూరు షాద్‌నగర్ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండేవి. ఐల్ట్స్ (ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను. లెక్చరర్లు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్‌పోర్టును డ్రాప్ బాక్స్‌లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్ సర్ సురేందర్ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు. ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్స్టిట్యూట్ ‘విల్ టూ కెన్, ద స్ట్రైడ్’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్‌స్టిట్యూట్‌ని అమీర్‌పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను. వాళ్లకు ఇంగ్లిష్ వచ్చు... కానీ! నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్‌లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే. ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ‘రియల్ లైఫ్ ఇంగ్లిష్, స్పోకెన్ ఇంగ్లిష్’ అని రెండు పుస్తకాలు రాశాను. గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు! ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్‌కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్ గౌడ్. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి. మా వాళ్లది ధర్మాగ్రహమే! ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్లు, డిఫెన్స్ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం... అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు. నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్ ‘వీడు లైఫ్‌ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్‌గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. – ఎ. రామేశ్వర్ గౌడ్, ఫౌండర్, విల్ టూ కెన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
బాపట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇంగ్లిష్ అదుర్స్
తాము చెప్పాలనుకున్న భావాన్ని వ్యక్తీకరించలేక, ఎలా వ్యక్తం చేయాలో తెలియక విద్యార్థులు సతమతమవుతుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కమ్యూనికేషనే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత కొలువులు సాధించడంలో విఫలమవుతుంటారు. మరికొందరు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించలేక ఉన్నచోటే ఉండిపోతుంటారు. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ ఇంగ్లిష్ టీచర్.. విద్యార్థులు ఇకపై తమ భావాన్ని వ్యక్తపరచలేక ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే పెన్ పాల్ కార్యక్రమం. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోనే దర్శనమిస్తోంది. వాట్సప్ చాటింగ్, ఈ-మెయిల్స్ ద్వారానే ఒకరినొకరు కమ్యూనికేట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో సదరు ఇంగ్లిష్ టీచర్ లెటర్ల(ఉత్తరాలు)కు పనిపెట్టారు. విద్యార్థులు తాము చెప్పాలనుకున్న భావాన్ని, విషయాన్ని ఉత్తరాల్లో రాయాలని సూచిస్తున్నాడు. ఇలా రాయడం వల్ల ఇంగ్లిప్ ప్లూయెన్సీగా రావడంతో పాటు, విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని ఐలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పచ్చారు హరికృష్ణ పనిచేస్తున్నాడు. విద్యార్థుల్లోని హ్యాండ్ రైటింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారి భావాలను స్పష్టంగా వ్యక్తీకరించాలని సూచిస్తున్నాడు. ఇందుకోసం నాలుగేళ్ల కిందట ప్రారంభించిన పెన్‌పాల్ కార్యక్రమం క్రమేణా సత్ఫలితానిస్తోంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమెరికాలోని Nebraska ప్రాంతంలో ఉన్న రీగాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కమ్యూనికేట్ అవుతున్నారు. దీంతో మన విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. విద్యార్థులు తమ దినచర్య, పండుగలు, సెలవులు, తాము చదువుకునే పాఠాలు ఇలా.. ప్రతీ ఒక్కదాన్ని అమెరికాలోని తమ మిత్రులతో పంచుకుంటున్నారు. ఐలవరం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె.రాగనందిని మాట్లాడుతూ "ఒకసారి నేను అమెరికా జెండాను చూడలేదని నా పెన్ స్నేహితుడితో చెప్పాను. అతను మాకు ఆ దేశ జెండాలను పంపాడు. అలాగే స్థానికంగా లభించే చాక్లెట్లు, టీ-షర్టులు పంపించాడు. వారికి నేను భారత జెండాలు, బిస్కెట్లు, ఇతర వస్తువులను పంపించా' అని తన అనుభవాన్ని పంచుకుంది. అమెరికా టు బాపట్లకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఖర్చుతో కూడుకున్నవి. విద్యార్థులు రాసే ఉత్తరాలను కొరియర్ ద్వారా పంపడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతోందని.. ఈ మొత్తాన్ని తానే పెట్టుకుంటున్నట్లు హరికృష్ణ చెబుతున్నాడు. ప్రతీ ఏటా మూడు దఫాలుగా ఉత్తరాలను పంపిస్తున్నారు. పెన్ పాల్ ప్రోగ్రామ్‌తో పాటు మన విద్యార్థులు యుఎస్, కెనడా, మెక్సికో, స్వీడన్, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, పోలాండ్, ట్యునీషియా, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, టర్కీతో సహా 60 దేశాలలోని సుమారు 300 పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్పేస్ సైన్స్, సోషల్ స్టడీస్ గురించి విద్యార్థులు చర్చించుకుంటారని ఉపాధ్యాయుడు హరికృష్ణ చెబుతున్నారు. హరికృష్ణ ఇలా ఇప్పటివరకు స్కైప్ ద్వారా నాసా ప్లానెటరీ సైన్స్ విభాగంలో ప్రోగ్రామ్ సైంటిస్ట్ హెన్రీ థ్రోప్, నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ జేమ్స్ ఆడమ్స్, ఎక్స్‌ఫ్లోర్ మార్స్ ప్రెసిడెంట్ జానెట్ ఐవీ, స్విట్జర్లాండ్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త క్లెయిర్ లీలతో విద్యార్థులు సంభాషించారు. ఫేస్‌బుక్‌ను ప్రధాన సాధనంగా ఉపయోగించుకుని, తాను ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు హరికృష్ణ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, వారి అనుమతితో పెన్ పాల్ ఏర్పాటు చేశానని పేర్కొంటున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం కోసమే తాను ఈ వినూత్న పద్ధతిని రూపొందించినట్లు చెప్పారు. తాను రూపొందించిన కార్యక్రమం వల్ల విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయని, స్నేహితులతో తమ భావాలను చక్కగా వ్యక్తీకరించుకోగలుగుతున్నారని... ఒక ఉపాధ్యాయుడిగా తనకు ఇతకంటే ఏంకావాలని అంటున్నారు హరికృష్ణ. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్‌ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్‌కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్‌తో ఎలిజబెత్‌కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్‌డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
ఈ ఒక్క ఫీచర్ చాలు.. గ్రామర్‌లో తప్పులు ఇట్టే పట్టేస్తుంది!
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. -
78 ఏళ్ల తాతకు నైన్త్‌లో అడ్మిషన్.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..
మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్ ఈస్ట్ లైవ్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్‌రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది. ప్రస్తుతం లాల్‌రింగథర హువాయికోన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించిన లాల్‌రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు. ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. లాల్‌రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్‌కిమా మాట్లాడుతూ ‘లాల్‌రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్‌రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు.. -
గురుకుల పరీక్షలకు 86.54 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్టీ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం.. ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు.