factory
-
మూతపడిన బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ తెరవాలి
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్‌గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.480 మందితో మొదలైన తవ్వకాలు...బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి. గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్‌షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్‌కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.తవ్వకాలు చేపట్టాలి నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది. – జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్జీవనశైలిలో మార్పు వస్తుందిప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం. – ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత -
పానాసోనిక్ 4680 బ్యాటరీ: ఎక్కువ రేంజ్ కోసం..
జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్ 21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
బరేలీ: యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారుల జాడ తెలియడం లేదు. వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.రెండు గంటల వ్యవధిలో బాణసంచా ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు గ్రామమంతా దద్దరిల్లింది. సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ ఘటన నేపధ్యంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.పేలుడు ఘటన గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బరేలీ రేంజ్) రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహకుడిని నాసిర్గా గుర్తించామన్నారు. అతనికిగల లైసెన్సు వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాసిర్‌కు భారీగా దీపావళి ఆర్డర్లు వచ్చాయని, దీంతో పగలు, రాత్రి టపాసుల తయారీ పని జరుగుతోందని, చాలా మంది కూలీలు పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐ -
టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ఒప్పందం.. తొలి చిప్ ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ: ధొలేరా చిప్ తయారీ ప్లాంటు కోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీని ప్రకారం ఈ ప్లాంటుకు సంబంధించి డిజైన్, నిర్మాణ, సాంకేతికాంశాల్లో పీఎస్ఎంసీ సహాయ, సహకారాలు అందిస్తుంది.పీఎస్ఎంసీ సాంకేతికత, నైపుణ్యాలు భారత్‌లో సెమీకండక్టర్ల తయారీని వేగవంతం చేయగలవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. గుజరాత్‌లోని ధొలేరాలో టాటా గ్రూప్ రూ. 91,000 కోట్లతో చిప్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 50,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. దీనితో 1,00,000 పైచిలుకు నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది. గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్‌పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్‌పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు. ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్‌లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్‌కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు. అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది. అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
మరో ఫార్మా సెజ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
రింగ్‌రోడ్ ఇంటర్చేంజ్
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ భారీ ప్రైవేటు పరిశ్రమ కోసం రీజనల్ రింగురోడ్డు ఇంటర్చేంజ్ డిజైన్ మారింది. ముందుగా ఎంచుకున్న డిజైన్‌లో రింగురోడ్ కూడలి నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. అది స్థానికంగా నిరసనకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఇంటర్చేంజ్ డిజైన్‌ను మార్చారు. నాలుగు లూప్‌లతో నిర్మించడానికి బదులు.. ఆ పరిశ్రమ వైపు లూప్ లేకుండా మూడింటితోనే ఇంటర్చేంజ్ డిజైన్‌ను ఖరారు చేశారు. - సాక్షి, హైదరాబాద్‌రోడ్డు లేఔట్ మార్చే వీలు లేక.. తూప్రాన్ నుంచి గజ్వేల్ పక్కగా వచ్చే రీజనల్ రింగురోడ్డు హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ప్రజ్ఞాపూర్‌కు కాస్త ముందుగా క్రాస్ చేస్తుంది. రాజీవ్ రహదారి మీద వాహనాల రద్దీ ఎక్కువ. ఇలా అధిక రద్దీ ఉన్న రోడ్లను రీజనల్ రింగ్‌రోడ్డు క్రాస్ చేసేచోట.. నాలుగు లూప్‌లతో ఉండే క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్చేంజ్ జంక్షన్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రజ్ఞాపూర్ సమీపంలో క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్చేంజ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంటర్ చేంజ్‌కు ఉండే నాలుగు లూప్‌లలో ఒక లూప్ కట్టాల్సిన చోట ఓ బ్రేక్ లైనర్స్ తయారీ పరిశ్రమ ఉంది. అదే డిజైన్‌తో నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. ఇలా జరగకుండా రింగ్‌రోడ్డును కాస్త అటువైపో, ఇటువైపో జరపడానికీ వీలు లేకుండా పోయింది. ఆర్ఆర్ఆర్ను హైదరాబాద్ వైపు జరపాలనుకుంటే.. ఓవైపు కొండపోచమ్మ సాగర్ జలాశయం, మరోవైపు వందల ఎకరాల్లో విస్తరించిన సామాజిక అటవీ ప్రాంతం అడ్డు వస్తున్నాయి. అదే గజ్వేల్ వైపు జరపాలనుకుంటే.. వేల ఇళ్లతో నిర్మించిన పునరావాస కాలనీ, గజ్వేల్ రింగురోడ్డు కూడలి అడ్డు వస్తున్నాయి. ఒకవేళ పరిశ్రమను తొలగించాలనుకుంటే.. దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధినిస్తున్న పరిశ్రమను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్చేంజ్ డిజైన్‌ను మూడు లూప్లకు మార్చారు. మరో లూప్‌కు బదులు.. పరిశ్రమ ప్రహరీని ఆనుకుని రెండు కారిడార్లను నిర్మించి, ఇటు రాజీవ్ రహదారికి, అటు ‘రీజనల్’ప్ర«దాన వేకు అనుసంధానం చేసేలా డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే మార్పుల వల్ల అదనంగా కొంత రోడ్డు, రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా వేశారు. -
పుంగనూరులో పరిశ్రమల కారిడార్ కనుమరుగు?
‘కరువుకు మారుపేరైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలి. డొక్కలు మాడ్చుకుని ఊరుగాని ఊరు వెళుతున్న నిరుపేదల వలసలను నివారించాలి. స్థానికంగానే ఉపాధి కల్పించి చేయూతనందించాలి..’ అనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుంగనూరు వేదికగా పరిశ్రమల కారిడార్ తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్, గ్రానైట్, ఫీడ్ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహారశైలితో ఆయా కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతల దమనకాండతో ఆయా పరిశ్రమల స్థాపన సందిగ్ధంలో పడింది. వేలాది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భవితకు ఆశనిపాతమైంది.పుంగనూరు: స్థానికంగా పదివేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి కల్పించే జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమ పుంగనూరు ప్రాంతం నుంచి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతంలో నిరుద్యోగం, వలసల నివారణకు పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో రూ.4.640 కోట్లతో 800 ఎకరాలలో బస్సుల పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు గత ఏడాది అనుమతులు కూడా మంజూరు చేసింది. అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, కంపెనీ సీఈఓ ఆండ్రియస్ హేగర్‌తో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ పరిశ్రమ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదట అతి పెద్ద భారీ పరిశ్రమగా నిలవనుందని స్థానికులు కలలుగన్నారు. ఈ ప్రాంత వాసులు తమ బతుకులు మారుతాయని, బిడ్డల భవిష్యత్ బాగుంటుందని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్లు కూడా నిలవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ ఏర్పాటు ఆశలపై నీరుచల్లినట్టయ్యింది. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అలజడులు, అల్లర్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు యాజమాన్యం పునరాలోచనలో పడింది.నాటి నుంచి అడ్డంకులేపుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కక్షగట్టారు. ఈ విభేదాలతోనే ఇన్నేళ్లుగా వారు అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా పుంగనూరులో ఊహించని అభివృద్ధి జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది.గతంలో ఎప్పుడూ అల్లర్లు లేవునియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి నుంచి పుంగనూరులో అల్లర్లు జరగలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఇలాంటి ప్రశాంతత కలిగిన పుంగనూరులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.కంపెనీలు వెనక్కే!పుంగనూరు మండలంలో సుమారు 20 వేల ఎకరాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్ పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. అలాగే జర్మన్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రానైట్ పరిశ్రమ, ఫీడ్ పరిశ్రమతో పాటు మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కసారిగా అధికార పార్టీ చేష్టలకు పరిశ్రమల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ప్రశాంతత లేని ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కష్టతరమేనని భావించి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఆగడాలే కారణంకర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుంగనూరులో పుష్కలమైన వనరులు లభిస్తాయని జర్మన్ కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బస్సుల కంపెనీని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి తరుణంలో టీడీపీ అఽధికారం చేపట్టింది. పరిశ్రమ స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అండతో ఆ పార్టీ శ్రేణులు అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి నియోజకవర్గంలో తిరగరాదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పుంగనూరు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. టీడీపీ నేతల ఆగడాలకు ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలతో బస్సుల కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. -
సియోల్: బ్యాటరీల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్‌ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్‌ను వినియోగించారు. నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్‌సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది. -
ఛత్తీస్‌గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పని చేసేవాళ్లు మృతి చెందారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీయగా.. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఆ శబ్ధం వినిపించిందని.. కొన్ని ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని అంటున్నారు. భారీగా మంటలతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించింది. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల దేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయని, ఫ్యాక్టరీ లోపల 20 అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు.కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడు ధాటికి గల కారణాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే మహారాష్ట్ర థానేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. -
బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిదిమంది మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలోని కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో చిక్కుకున్న 10 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. -
హిమాచల్‌లో అగ్ని ప్రమాదం.. దూకేసిన సిబ్బంది
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవివంచింది. ఓ కాస్మోటిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భవనంపై నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం 41 మంది సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. #Himachal: major fire in a cosmetic factory in Baddi factory. 32 injured rescued, 24 feared missing. pic.twitter.com/hhD0xakgDs — Diksha Verma (@dikshaaverma) February 2, 2024 Massive fire broke out in cosmetic & perfume manufacturing factory in Baddi, Himachal Pradesh. About 130 employees were working in the factory at the time & many are feared to be trapped. Fire brigade & health department teams reached the spot.#Baddi #HimachalPradesh #fire pic.twitter.com/AyDt6EyA5J — Mirror Now (@MirrorNow) February 2, 2024 -
వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్ ప్రభుత్వం తీసుకున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప కార్పొరేషన్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవే ట్ లిమిడెట్(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. 2019లో షెడ్ కన్స్ట్రక్షన్కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్, నీరు, ఇతర అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పేపర్ ప్లేట్లు, కప్పులకు డిమాండ్ పెరిగింది. స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరోవైపు ప్లాస్టిక్ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్ పేపర్ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్‌తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది. ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ శ్రీ పావన ఇండస్ట్రీస్‌లో క్రాఫ్ట్ పేపర్ రోల్స్, గమ్, ఫిల్మ్ తెచ్చి కారగేషన్ మిషన్‌లో వాటిని అతికించడం ద్వారా పేపర్ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు. అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్‌సేల్‌గా రూ.1.50, బహిరంగ మార్కెట్లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది. నీడ పట్టున ఉంటూనే సంపాదన పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! – భారతి, ప్రొద్దుటూరు ఉన్న ఊర్లోనే ఉపాధి ఈ పరిశ్రమలో నేను మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది. – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు -
‘ఇథనాల్’పై గ్రామస్తుల ఆగ్రహజ్వాల
దిలావర్పూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం–గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా తరలివచ్చిన గ్రామస్తులు, రైతులు ఫ్యాక్టరీపై దాడిచేసి, వాహనాన్ని తగులబెట్టడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు జిల్లా ఉన్నతాధికా రులు సముదాయించడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీపై మొదటి నుంచీ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమీప గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేయడంతోపాటు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫ్యాక్టరీ పనులు ఊపందుకోవడంతో బుధవారం దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా పరిశ్రమ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడ నిర్మిస్తున్న ప్రహరీని కూల్చేశారు. నిర్మాణా లను అడ్డుకున్నారు. వందలమంది మూకుమ్మ డిగా దాడికి పాల్పడటంతో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఓ కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. నిర్మల్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. మరోపక్క రైతులు, గ్రామస్తులు దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారిని సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీసులు వీడియో తీస్తుండగా వారు ఇథనాల్ కంపెనీ వారని అనుకున్న గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఇందులో పలువురు రైతులు, గ్రామస్తులకు గాయాలయ్యాయి. అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, తహసీల్దార్ సరిత అక్కడికి వచ్చి సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటివరకు శాంతియుతంగా ఉండాలని గ్రామస్తులను కోరగా, రైతులు శాంతించారు. కాగా, రైతులు, ప్రజలు గురువారం దిలావర్పూర్ మండల బంద్‌కు పిలుపునిచ్చారు. -
ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న చేతి గ్లౌజ్‌ల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చెలరేగిన భారీగా మంటలకు ఆరుగురు మృతి చెందారు. ‘తెల్లవారుజామూన 2.15 గంటలకు అగ్ని ప్రమాద సమాచారం అందింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాహయక చర్యలు చేట్టాం. అప్పటికే ఆరుగురు ఫ్యాకర్టీ మంటల్లో చిక్కున్నారు. దీంతో రెస్క్యూ చేసిన ఆ ఆరుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాం’ అని అగ్నిమాపక అధికారి మోమన్ మోంగ్సే తెలిపారు. ఘటన స్థలంలో సాయహక చర్యలు కొనసాతుగున్నాయని తెలిపారు. -
సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్‌పూర్‌లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్‌పూర్‌లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె? -
కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్లో గల ఒక కొవ్వొత్తుల తయారీ కర్మాగారంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 10 మంది గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలియజేశారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శేఖర్ సింగ్ ఈ ఉదంతం గురించి మీడియాతో మాట్లాడుతూ తల్వాడేలో గల కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మంటలు సంభవించినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఈ కర్మాగారంలో.. పుట్టినరోజు వేడుకల్లో ఉపయోగించే కొవ్వొత్తులను తయారు చేస్తుంటారని ఆయన తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్ యజమాని సంఘటన గురించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని, ఆ తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రమాదంలో ఆరు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, వాటిని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీచేశారు. అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ దేశ్‌ముఖ్ ససూన్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇది కూడా చదవండి: ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా! -
రూ.160 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఆదివారం అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.160 కోట్ల విలువైన 107 లీటర్ల మెఫెడ్రిన్ను గుర్తించారు. ఈనెల 20న ఇదే జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.250 కోట్ల విలువైన కెటమిన్, కొకైన్, మెఫెడ్రిన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
ఆరని ఇథనాల్ చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి
నారాయణ్‌పేట్: కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా.. ఇథనాల్ కంపెనీ ఆయా గ్రామాల్లో చిచ్చు పెట్టింది. ఆదివారం జరిగిన ఘటనతో చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల్లో సోమవారం దసరా పండుగ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఆయా గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి అడవులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. ఎక్లాస్పూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దగ్గర కంపెనీ నుంచి వ్యర్థాలతో వచ్చిన ఓ ట్యాంకర్‌ను అడ్డుకొని ధర్నా చేస్తున్న మూడు గ్రామాల ప్రజలు, పోలీసులకు నడుమ జరిగిన ఘర్షణలో 10 మంది గ్రామస్తులు, ఏడుగురు మంది పోలీసులు గాయపడ్డారు. సెల్ఫోన్లలో తీసిన వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి గాలింపు ప్రారంభించారు. ఇళ్లల్లో ఉన్న వారిని పోలీసు వాహనాల్లో ఇతర మండలాల పోలీస్స్టేషన్లకు తరలించి విచారిస్తున్నారు. మరింత మంది కోసం ప్రత్యేక పోలీసులు గాలింపు ప్రారంభించారు. చిత్తనూర్, ఎక్లాస్పూర్ సర్పంచులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనలో గ్రామస్తులు.. రాత్రిళ్లు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండటంతో చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్పూర్ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు గ్రామాలు వదిలి వెళ్లడంతో ఇళ్ల దగ్గర ఉన్న వృద్ధులు, చిన్నారులు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. జన సంచారం లేక ఆయా గ్రామస్తులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్లకు తాళాలు.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వారి కోసం పోలీసులు రెండ్రోజులుగా ఇల్లిల్లూ జల్లెడ పడుతుండటంతో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కొందరు, వ్యవసాయ పొలాలకు మరికొందరు తరలివెళ్లారు. ఇళ్ల వద్ద కేవలం వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. పండుగ కోసం గ్రామాలకు వచ్చిన బంధువులను సైతం రాత్రిళ్లు పోలీసులు చితకబాదినట్లు వివరించారు. ఐజీ, డీఐజీ ఆరా.. ఘర్షణ వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ యోగేష్ గౌతమ్ మరికల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నందుకు బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలను చర్చించినట్లు తెలిసింది. పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని మూసివేయాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కంపెనీ నుంచి వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలన్నారు. ఇథనాల్ కంపెనీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కంపెనీ వ్యర్థాలను సమీపంలోని మన్నె వాగులో వేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని.. మూగజీవాలు, మానవళికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించి బాధిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నర్సన్‌గౌడ్, తిరుపతిరెడ్డి, వేణు ఉన్నారు. గ్రామస్తులపై దాడిని ఖండిస్తున్నాం.. రెండేళ్ల నుంచి కంపెనీ రద్దు కోసం ఉద్యమిస్తున్న గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వీరన్న, కృష్ణయ్య పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. మూడు గ్రామాల ప్రజలపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. బాల్‌రాం, గోపాల్, సుదర్శన్, మల్లయ్య ఉన్నారు. కేసులు ఎత్తి వేయాలి.. గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ హేయమైన చర్యగా భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలను కూడా చూడకుండా పోలీసులు దాడి చేసి ఆ ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చారని, ఇందుకు వారే బాధ్యత వహించాలన్నారు. గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నారాయణ, కాళేశ్వర్ ఉన్నారు. 20 మందిపై కేసులు నమోదు.. పోలీసులపై దాడి ఘటనలో మూడు గ్రామాల్లోని 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. వీరిని నారాయణపేట కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి.. చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఘర్షణలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మంగళవారం టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను కలిసి విన్నవించారు. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీతో నీటి, వాయు కాలుష్యం ఏర్పడి సుమారు 26 గ్రామాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు కంపెనీని తరలించాలంటూ పోరాడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రజల విజ్ఞప్తులను వినిపించుకోకుండా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారని.. వ్యతిరేకిస్తున్న ప్రజలను కాపాడాలని కోరారు. నిజమైన దోషులను గుర్తించి మిగతా వారిని విడుదల చేయాలని కాంగ్రెస్‌పార్టీ తరఫున కోరారు. -
సమస్యలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?.. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు
ఆదిలాబాద్: ప్రజాసమస్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను నిలదీయడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో దిలావర్పూర్ మండలం గుండంపల్లి హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన శ్రీహరిరావును బుధవారం అరెస్ట్ చేసి సారంగపూర్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ సారంగపూర్ పోలీస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గుండంపల్లిలోని కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో.. చెప్పాలని డిమాండ్ చేశారు. దిలావర్పూర్ మండలంలో పచ్చని పంటపొలాల మధ్య విషవాయువు వెలువరించి ప్రజల ప్రాణాలు, పచ్చటి పంటపొలాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడం వెనుక మరమ్మమేమిటో తెలుపాలని పేర్కొన్నారు. వెంటనే దానిని రద్దు చేయాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో అక్రమంగా 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని తేలినప్పటికీ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెప్పలేని మంత్రులకు ప్రజలే తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన అందించే కాంగ్రెస్‌నే ప్రజలు కోరుకుంటున్నారని, తప్పకుండా రాష్ట్రంలో ఆ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంజేశారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకులు అరుగుల రమణ, విలాస్‌రావు, బొల్లోజి నర్సయ్య, రొడ్డ మారుతి, అబ్దుల్ హాదీ, న్యాయవాది మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వజీద్ అహ్మద్, పొడెల్లి గణేశ్ తదితరులున్నారు. -
భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే..
Tesla Battery Storage Factory: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ 'టెస్లా' (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు 'బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ' ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. సోలార్ ప్యానల్స్, గ్రిడ్ నుంచి పవర్ స్టోర్ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయి. టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం టెస్లా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఇదే జరిగితే టెస్లా భారతదేశంలో తన ప్రాభవాన్ని నిరూపించుకుంటుంది. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్.. బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పవర్ జనరేషన్ స్టోరేజి అవసరమైన అంశం.. ఈ అవకాశాన్ని టెస్లా అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.