Feeding
-
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
ఫుడ్ సపోర్టింగ్
చిన్నారులకు ఆర్నెల్ల వయసు వచ్చాక, వారికి ఇచ్చే తల్లిపాలతో పాటు క్రమంగా ఘనాహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇలా తల్లిపాలతో పాటు చిన్నారిని ఘనహారం వైపునకు మళ్లించడానికి ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ డైట్‌గా చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఎలాంటి ఇతర ఆహారాలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఆర్నెల్ల వయసు వరకు పిల్లలకు నీళ్లు కూడా తాగించాల్సిన అవసరమూ ఉండదు. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఇలా చిన్నారులను ఘనాహారం వైపునకు మళ్లించేందుకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహారం గురించి మార్కెట్ ప్రకటనల హడావుడి ఇటీవలి రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంటోంది. నిజానికి కాంప్లిమెంటరీ డైట్ అనేది... తల్లిపాలతో పాటు పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం మాత్రమే. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమంటే అదేదో మార్కెట్లో మాత్రమే లభ్యమయ్యే ఆహారం అని అపోహపడాల్సిన అవసరం లేదు.కాంప్లిమెంటరీ డైట్ ఇవ్వాల్సిందిలా... ఘనాహారంలో భాగంగా పిల్లలకు ఉడికించిన అన్నం (రైస్), ఉడికించిన పప్పు (దాల్), అరటిపండు, ఉడకబెట్టిన కూరగాయలు (ఆలూ వంటివి) చిదిమి, మెత్తగా చేసి పెట్టాలి. అలాగే ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి వాళ్లకు కాచి చల్లార్చిన నీళ్లు పట్టాలి. ఇది మినహా మార్కెట్లో లభించే వాణిజ్య ప్రయోజనాలతో తయారు చేసిన ఎలాంటి ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ ఆహారాన్ని ఆర్నెల్ల పిల్లలకు రోజూ 150 నుంచి 200 ఎమ్ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... ఇకపై మెత్తగా చిదిమిన రోటీ, కాస్తంత గట్టిగా వండిన పప్పు, ఇడ్లీ, రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొ΄్పాయి వంటి ఆహారం ఇవ్వవచ్చు. ఇక్కడ మనం పైన పేర్కొన్న ఆహారం కూడా కాంప్లిమెంటరీ ఆహారమే.కాంప్లిమెంటరీ ఆహారానికి నిర్వచమిదీ... అసలు కాంప్లిమెంటరీ ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే... పిల్లలకు సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, భరించగలిగే ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే చవకగా లభించేది అని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడు దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా అభివర్ణిస్తున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. కానీ ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభి్రపాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ / నిలిపేస్తూ ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ... పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడం కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక ఆరు నెలలు నిండిన పిల్లలకు ఈ వయసు నుంచి ఎదుగుదలకు దోహదం చేసే ఆహారం అవసరం కాబట్టి ఈ టైమ్‌లో దీన్ని మొదలుపెట్టాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 30% నుంచి 35% మంది మాత్రమే పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అనుబంధ ఆహారాన్ని మొదలుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది.త్వరగా మొదలుపెట్టడమూ, లేట్ చేయడం ఈ రెండూ సరి కాదు... ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసు నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో తట్టుకోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆలస్యంగా మొదలుపెడితే అది వాళ్ల సాధారణ పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అలాగే ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మేలు. అదే ఆరోగ్యకరం కూడా. -
రామ్మా చిలుకమ్మా..
‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రతిరోజూ తమ ఇంటి టెర్రస్ మీద వందల కొద్ది చిలుకలకు దాణా వేస్తూ వాటితో ఆత్మీయానుబంధాన్ని అల్లుకుంటాడు! అలాంటి వ్యక్తులు రియల్ లైఫ్‌లోనూ ఉన్నారు. వాళ్లే నూర్‌బాషా బాబావలీ, లాల్‌బీ దంపతులు!ఆంధ్రప్రదేశ్, తెనాలిలోని గాంధీనగర్, ఎన్వీఆర్ కాలనీలో నివాసముంటారు నూర్‌బాషా బాబావలీ దంపతులు. వృత్తిరీత్యా నూర్‌బాషా టైలర్. తమ మేడ మీదకొచ్చి అరిచే కాకుల గుంపు కోసం నూర్‌బాషా భార్య లాల్‌బీ.. కాసిన్ని బియ్యం చల్లి.. ఓ గిన్నెలో నీళ్లనుంచడం మొదలుపెట్టింది. కాకులు ఆ దాణా తిని, నీళ్లు తాగి ఎగిరిపోయేవి. కొన్నాళ్లకు కొన్ని చిలుకలూ వచ్చి వాలాయి ఆ మేడ మీద.. ఇంచక్కా ఓ పక్క బియ్యం, మరోపక్క మంచి నీళ్లు కనిపించేసరికి సంతోషంగా బియ్యం గింజలు తిని, మంచినీళ్లు తాగి ఎగిరిపోయాయి. మర్నాడు మరిన్ని చిలుకలను వెంటబెట్టుకొచ్చి.. ఆ దాణాను ఆరగించసాగాయి. క్రమంగా అది వాటికి రోజువారీ కార్యక్రమం అయింది. వాటి సంఖ్యా వందల్లోకి పెరిగింది. ఒక్కపూట కాస్త రెండుపూటలకు మారింది. ప్రకృతి పంపుతున్న ఆ అతిథులను చూసి నూర్‌బాషా, లాల్‌బీ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వాటికోసం ఉదయం, సాయంకాలం రెండుపూటలా దాణా చల్లుతూ చక్కటి ఆతిథ్యమివ్వసాగారు. క్రమంగా అది ఆత్మీయానుబంధంగా బలపడింది. ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య, సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చిలుకలు ఆ మేడ మీద వాలి.. దాణా తిని, నీళ్లు తాగి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కొన్ని చిలుకలు దాణా తింటున్నప్పుడు మరికొన్ని గుంపులు గుంపులుగా అక్కడున్న దండేల మీద, లేదంటే పక్కనే ఉన్న చెట్ల కొమ్మల మీద వేచి చూస్తుంటాయి. తమ వంతు రాగానే టెర్రస్ ఫ్లోర్ మీద వాలి విందును ఆరగిస్తాయి. ఏటా గురు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఇలా ఆ చిలుకలు నూర్‌బాషా కుటుంబమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అవి బియ్యం గింజల్ని తింటున్నప్పుడు నూర్‌బాషా కుటుంబీకులు కాక కొత్తవారెవరు కనిపించినా రివ్వున ఎగిరిపోతాయి. వీటి కోసం ఉదయం మూడు కిలోలు, సాయంత్రం రెండు కిలోల చొప్పున రోజుకు అయిదు కిలోల బియ్యాన్ని ఆహారంగా పెడుతోందా కుటుంబం. అంటే నెలకు 150 కిలోలు. చిలుకలను ఇంత ప్రేమగా ఆదరిస్తున్న నూర్‌బాషా, లాల్‌బీ దంపతులను చూసి ముచ్చటపడిన లాల్‌బీ స్నేహితురాలు అంజమ్మ .. నెలకు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందిస్తోంది. ‘ఇప్పుడు కాకులు, చిలుకలతోపాటు పావురాలు కూడా వచ్చి దాణా తినిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత చిలుకల సంఖ్య బాగా తగ్గుతుంది. మళ్లీ గురు పౌర్ణమి నుంచి వాటి సంఖ్య పెరుగుతుంది. అలా కొన్ని వందల చిలుకలు మా మేడ మీద వాలుతుంటే భలేగా ఉంటుంది!’ – నూర్‌బాషా బాబావలీ. -
Delhi High Court: సంక్షేమం కాదు.. సంఘర్షణ
జనావాసాల మధ్య సంచరించే వానరాలకు ఆహారం అందుబాటులో ఉంచడం జంతు సంక్షేమం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది ఒక రకంగా మనుషులతో వాటి సంఘర్షణకు దారి తీస్తోందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం సెప్టెంబర్ 30వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. అడవుల్లో చెట్లపై సంచరిస్తూ కాయలు, పండ్లు లాంటివి తినే వానరాలు సహజ ఆవాసాలను వదిలి జనాల మధ్యకు, వీధుల్లోకి రావడానికి కారణం మనమేనని పేర్కొంది. బ్రెడ్, చపాతీ, అరటి పండ్లులాంటివి ఇస్తూ వాటికి హానిని, ప్రజలతో ఘర్షణ పడే స్థితికి వాటిని తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘పబ్లిక్ పార్కులు, హోటళ్లు, క్యాంటీన్లలో పోగయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో కోతులు అక్కడ పోగవుతున్నాయి. కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో అవి హాని కలిగిస్తాయి. ఈ పరిణామం మనుషులతో జంతు సంఘర్షణకు దారి తీస్తుంది. పౌర సంస్థలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సురక్షితంగా ఉండాలనుకునే వారు ఆహార వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ పడేయడం మానుకోవాలి’అని హితవు పలికింది. -
సీసాతో పాలు పడుతున్నారా?
బిడ్డకు ఎప్పుడూ తల్లి పాలు పట్టడమే చిన్నారికి మేలు చేస్తుంది. కేవలం తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రమే ΄ోత ΄ాలు పట్టాలి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.పాడి పశువుల పాలు: ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు.డబ్బా పాలు: మార్కెట్లో అమ్మే పిల్లల కోసం ఉద్దేశించిన పాల ΄పోడర్ను ఉపయోగించి కలిపి ఇచ్చేవి. గేదె వంటి ΄ాడి పశువుల ΄ాలైనా / డబ్బాపాలైనా సీసాలో పాసి తాగిస్తారు. సీసాతో పాలు పట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సీసానూ, పాలపీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. కడిగాక పాల సీసాను పదినిమిషాలు మరిగే నీళ్లలో ఉంచాలి. ΄ాల పీకనూ కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో ఉంచాలి. బిడ్డకుపాలు పట్టిన వెంటనే పక్కమీద పడుకోబెట్టకూడదు. మొదట బిడ్డను భుజంపై వేసుకుని వీపుపై నెమ్మదిగా తడుతూ ఉండాలి. తేన్పు వచ్చే వరకు ఇలా చేయాలి. ఒకసారి తాగాక సీసాలో మిగిలిన పాలను పారబోయాలి. నిద్రపోయే సమయంలో బిడ్డకు పాలు తాగించకూడదు. పాలు తాగించే సమయంలో బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు పట్టాలి. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
-
షాకింగ్ ఘటన: వీధి కుక్కలకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఎన్ని కట్టుదిట్టమైన వాహన చట్టాలను తీసుకొచ్చినా.. ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంటోంది. మొన్నటి మొన్న ఒక మహిళను కారుతో ఢీ కొట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక యువతి ఘోర రోడ్డుప్రమాదం బారిన పడింది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల తేజస్వీత, ఆమె తల్లి మంజీదర్ కౌర్‌లు ఇంటి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక ఎస్యూవీ కారు యూటర్న్ తీసుకుని వచ్చి మరి తేజస్వీతను దారణంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తేజస్వీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ కారు కనీసం ఆగకుండా అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ అనుహ్య ఘటనతో బిత్తరపోయిన ఆమె తల్లి మంజీదర్ కౌర్ వెంటనే తేరుకుని పోలీసుకు ఫోన్ చేసి తదనంతర కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోటుకుంటుందని తెలిపారు. బాధితురాలి తండ్రి ఓజస్వీ కౌల్ మాట్లాడుతూ..తేజస్విత ఆర్కిటెక్కర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఆమె వీధి కుక్కలకి ఆహారం పెట్టేందుక తన తల్లితో కలిసి వెళ్తుంటుందని ఆవేదనగా చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Caught On CCTV: Chandigarh Woman Hit By Car While Feeding Stray Dog https://t.co/xs6vfKpoPR pic.twitter.com/fgngCqWq4X — NDTV (@ndtv) January 16, 2023 (చదవండి: ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు) -
Viral Video: చేపల ఆకలి తీర్చిన హంస.. ఎలానో తెలుసా ..!
-
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
షాకింగ్ వీడియో: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై..
వైరల్: ఎవరైనా ఏ కుక్కనో, పిల్లినో సాదుకుంటారు. కొంచెం రిస్క్ అయినా సరే.. వన్య మృగాలను సైతం పెంచుకుంటారు కొందరు. కానీ, ఏ కండకు ఆ కండను పీక్కుతినే మొసలితో పరాచికాలు ఆడతారా? తాజాగా ఇంటర్నెట్ను పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో కుదిపేస్తోంది. ఏదో చంటిబిడ్డలా కాళ్ల సందులో మొసలిని ఉంచుకుని.. దాని నోటికి ఆడిస్తూ ఆహారం అందించాడు ఓ వ్యక్తి. పైగా దాని మూతి మీద తట్టి మరీ అభినందించడంతో ఆది నీళ్లలోకి తిరుగు టపా కట్టింది. ‘ఇదేం తరహా పెంపుడు జీవి బ్రో’ అంటూ ఫైజెన్ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. నాలుగున్నర మిలియన్ల వ్యూస్ పూర్తి చేసుకున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. What type of pet is that bro?pic.twitter.com/SjlJRYJsDA — Figen (@TheFigen) August 2, 2022 -
పాపం ఆ పెద్దాయన చేసింది నేరమా? నెటిజన్స్ ఫైర్
Charged with unlawfully feeding wildlife: నేరాలు సైతం విచిత్రంగా ఉండొచ్చు. వాటి గురించి విన్నప్పుడు.. అసలు అది ఒక నేరమేనా అని సందేహం కలుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాగే విచిత్రమైన ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. యూఎస్‌లోని 71 ఏళ్ల డోనాల్డ్ అంటాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొన్ని పక్షుల కోసం ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెడుతుంటాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు. పక్షుల కోసం చాలా ఆహార ట్రైలు పెడుతున్నాడు ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటి ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు మంచి చేసేవారిని అరెస్టు చేయాలనుకుంటున్నారంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్. (చదవండి: అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక) -
వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
పిఠాపురం(తూర్పుగోదావరి): కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం సమీపంలో మాధవపురం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక కూరగాయల దుకాణం వద్దకు రోజూ వస్తున్న ఒక కోతి ఒక పిల్లి పిల్లను తన కడుపునకు హత్తుకుని తీసుకువచ్చి తనకు పెట్టిన ఆహారాన్ని దానికి తినిపిస్తోంది. జాతి వైరం లేదని చాటుతున్న దీనిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చదవండి: ఖాకీ వనంలో ‘గోపాలుడు’ -
శునకాలకు అన్నం పెట్టి.. జైలు పాలయ్యాడు!
సాక్షి, చెన్నై : కుక్కలకు ఆహారం పెట్టే విషయంలో చోటు చేసుకున్న గొడవ కారణంగా ఓ ఇంటి యజమాని హత్యకు గురయ్యాడు. ఇక మానవత్వంతో వ్యవహరించిన పుణ్యానికి ఓ కార్మికుడు జైలు పాలయ్యాడు. వివరాలు.. చెన్నై కొరుక్కు పేట జేజే నగర్‌కు చెందిన సురేష్‌కుమార్(29) కూలి కార్మికుడు. ఇతడికి వీధి శునకాలకు ఆహారం పెట్టడం అంటే, ఎంతో ఇష్టం. రోజూ తన సంపాదనలో కొంత మొత్తాన్ని వీధి శునకాలకు వెచ్చించే వాడు. రోజూ రాత్రి వేళల్లో ఆకలితో ఉండే శునకాల్ని గుర్తించి ఆహారం పెట్టే వాడు. ఆ దిశగా శుక్రవారం రాత్రి ఓ చోట శునకాలు ఉండడంతో అక్కడి ఓ ఇంటి వద్ద ఆహారాన్ని ఉంచాడు. దీంతో అక్కడున్న శునకాలు ఆహారం కోసం పోటీ పడ్డాయి. అదే సమయంలో ఆ ఇంటి యజమాని గోవిందరాజ్(40) అక్కడకు వచ్చి శునకాల్ని తరిమే యత్నం చేశాడు. సురేష్కుమార్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శునకాల్ని తరిమేస్తావా..? అంటూ గోవిందరాజ్‌ను సురేష్ తోసేశాడు. కింద పడ్డ గోవిందరాజ్ తల పగిలి మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందరాజ్‌ను హతమార్చిన నేరానికి సురేష్‌కుమార్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్గ్రీన్ జోడి) -
మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు
‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్కాలనీలో ఎం.విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్‌కుమార్ కేబుల్ ఆపరేటర్. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు. ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్‌కుమార్ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్వయంగా వెళ్లి.. ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్‌కుమార్ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. వైద్యసేవలు ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్‌కుమార్. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్ షాక్‌కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు. కరోనా సమయంలో.. కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్ సెంటర్ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్‌కుమార్ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. మొదలైందిలా.. విజయ్‌కుమార్ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్‌కుమార్ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు. ఎంతో ఆనందాన్నిస్తోంది తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్‌కు ఫోన్ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను. – విజయ్‌కుమార్ -
Video Viral: ‘బాలుడు చేసిన పనికి.. హత్తుకొని ముద్దు ఇవ్వాలనుంది’
తల్లులు పిల్లలకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తారు. కాలేజీ, ఆఫీస్ క్యాంటిన్లో పలువురు తమ మిత్రులకు ప్రేమగా అన్నం కలిపి తినిపించటం కూడా చూశాం. ప్రియమైనవారికి ప్రేమతో అన్నం తినిపించటంలో కూడా కొంతమంది ఆనందాన్ని పొందుతారు. చిలిపిగా మారాం చేసినా.. ఇంకొంచం తినూ రా.. అంటూ గద్దించి మరీ ప్రేమతో నోటికి అన్నం ముద్దలు అందిస్తారు. అటువంటి కల్మషం లేని ప్రేమ.. ముఖ్యంగా బాల్యంలో అధికంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు! తాజాగా అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాఠశాలలో విద్యార్థులంతా లైన్లో కూర్చొని భోజనం చేస్తుంటారు. అయితే అందులో ఓ ఇద్దరు విద్యార్థుల ముందు అన్నం ప్లేట్ ఉంటుంది. అయితే అందులో ఒక విద్యార్థి మాత్రమే అన్నం తింటూ.. తన స్నేహితుడైన మరో విద్యార్థికి అన్నం కలిపి నోటికి అందిస్తాడు. ఎందుకంటే రెండో విద్యార్థికి కళ్లు కనిపించవు.. ఆ బాలుడు మారాం చేస్తున్నా తను తింటూ స్నేహితుడికి అన్నం తినిపిస్తాడు. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘సంస్కారం అనేది ప్రవర్తనలో కనిపిస్తుంది!’ అని కామెంట్ చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు అన్నం తినిపించే బాలుడి స్నేహాన్ని అభినందిస్తున్నారు. ‘ఆ బాలుడిని హత్తుకొని ఓ ముద్దు ఇవ్వాలని ఉంది’.. ఇదే స్వచ్ఛమైన స్నేహం.. బాలుడికి ఉన్న సంస్కారం అందరిలో ఉండాలి’.. ‘అద్భుతం! అలా పెంచిన పిల్లాడి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. If you get right Sanskars,it shows up in your behaviour ❤️🙏 pic.twitter.com/ruvH780YWb — Vikas Chopra (@Pronamotweets) November 28, 2021 -
కోతులకు ఆహారం పెట్టొద్దు!
కొరాపుట్: కోతులకు ఆహారం పెట్టొద్దంటూ కొరాపుట్-జయపురం ఘాటీలో జిల్లా అధికార యంత్రాంగం సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అక్తార్ ఆదేశాల మేరకు వీటిని సోమవారం ఏర్పాటు చేశారు. ఇదే మార్గంలోని మలుపుల వద్ద వాహనదారులు తమ వాహనాలను నిలిపి, ఇక్కడి కోతులకు ఆహారం ఇస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
Viral: ‘పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటింది’
సాధారణంగా అన్ని జీవాలకు ఆకలి బాధలు ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి తీవ్రమైన ఆకలితో వాటికి జాతి వైరం కూడా గుర్తుకురాదు. అలా కొన్ని జంతువుల పిల్లలు.. ఇతర జంతువుల చెంతకు చేరి పాలు తాగి తమ ఆకలి తీర్చుకున్న సందర్భాలను చూశాం. తాజాగా ఓ చిన్న పంది పిల్ల ఆకలి వేయడంతో శునకం పాలు తాగింది. ఆ పందిపిల్ల పాలు తాగుతున్న క్రమంలో శునకం మరో చోటుకి వెళ్లుతుంది. కానీ, పంది పిల్లకు ఎంత ఆకలి ఉందో? దాని వెంటనే పరుగెడుతూ మళ్లీ శునకం దగ్గరుకు వెళ్లీ పాలు తాగుతుంది. దీంతో శునకం అక్కడే ఉండి పంది పిల్ల ఆకలి తీర్చుతుంది. ఈ వింత ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని వీధిలో శునకం పంది పిల్లకు పాలు ఇచ్చింది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. జాతి వైరం వీడి పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటిందని పలువురు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Viral Video: డార్లింగ్ ఈ స్నాక్స్ తిను.. నీరసంగా ఉన్నావు...
మూగ జీవాల ప్రేమానుబంధాలు ఒక్కోసారి అమితాశ్చర్యాలకు గురయ్యేలా చేస్తాయి. అరే.. మనుషులమైన మనమే అంత ఇదిగా ఉండమే అనిపిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత వింతగా అవేం చేశాయో మీరు కూడా ఓ లుక్కెయండి. ఈ వీడియోలో కిటికీ పక్కన బెడ్‌షీట్‌పై కూర్చుని పప్పీలకు పాలు ఇస్తున్న తెల్ల కుక్క కనిపిస్తుంది. నల్లకుక్క (బహుశా పప్పీల నాన్నేమో) నడుచుకుంటూ దాని దగ్గరకు వచ్చి తినడానికి స్నాక్స్ పక్కన పెడుతుంది. పిల్లల సంరక్షణలో అలసిన తల్లికుక్క దాన్ని ఆబగా తింటుంది. ఆ తర్వాత ఒకదానిమరొకటి ఆలింగనం చేసుకుని పడుకోవడం కనిపిస్తుంది. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. ముచ్చట గొలిపేలా ఉన్న ఈ కుక్కల ప్రవర్తన జంతు ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తోంది. ఇంకేముంది కామెంట్ల రూపంలో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘అద్భుతం ఇప్పటివరకూ నేను చూసిన వాటిల్లో ఇదే స్వీటెస్ట్ ఫ్యామిలీ’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘కుటుంబాన్ని హత్తుకున్న మంచి అబ్బాయి’ అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదేమైనా జంతువులకు కూడా కుటుంబం పట్ల అనురాగ ఆప్యాయతలు ఉంటాయనిపించేలా ఉన్న ఈ వీడియోని వేల మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా.. -
గజేంద్రుడి ఆకలి తీర్చిన వృద్ధురాలు..
ఓ వృద్ధురాలు తనచేతితో ఏనుగుకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వృద్ధురాలి ఇంటి ముందు ఆవరణలో నిలబడి ఉన్న ఏనుగుకు, బకెట్లో నుంచి ఆహారాన్ని తీసి ముద్దగా చేసి ఏనుగు నోట్లో పెడుతుంది. చెవులు ఊపుతూ ఆస్వాదిస్తూ తింటున్నట్లుగా ఉన్న ఏనుగు హావభావాలు చూపరులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను వేల మంది వీక్షిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తల్లి ప్రేమతో చేసే ఏ పనికైనా విలువ కట్టలేం అని ఒకరు కామెంట్ చేస్తే, మంచి మనసున్న మహిళ సున్నితమైన భారీ కాయానికి ఆహారం తినిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు. అనేక మంది యూజర్లు వావ్ అని కామెంట్ చేసి, హార్ట్ సింబల్ ఎమోజీలతో తమ స్పందనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చదవండి: Chocolate Ganesha:చాక్లెట్ గణేశ్.. పాలల్లో నిమజ్జనం.. -
తల్లిపాలు... రకాలు!
రొమ్ము పాలు పట్టే తల్లి... తన బిడ్డకు పాలు తాగేటప్పుడు ఆమె నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిసారి వచ్చే పాలు. వీటిని ఫోర్ మిల్క్ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్ మిల్క్ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ హైండ్ మిల్క్ అన్నవి.. చిన్నారి కాసిన్ని పాలు తాగాక స్రవించడం మొదలవుతాయి. వాస్తవానికి ఫోర్ మిల్క్ కంటే... హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి, పుష్టికరమైనవి, మంచి పోషకాలను ఇచ్చేవి. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. అందుకే పిల్లలు పది పదిహేను గుటకలు వేశాక స్రవించే పాలు చాలా మంచివన్న విషయం తల్లి గ్రహించడం మేలు. ఫోర్ మిల్క్‌ను ముర్రుపాలతో పొరబడవద్దు... పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ మొదలు కాగానే... స్రవించే ఫోర్ మిల్క్‌ను... ప్రసవం కాగానే తొలి రెండు మూడు రోజుల్లో స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. నిజానికి ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. మంచి రోగనిరోధకతను ఇస్తాయి. అద్భుతమైన ఇమ్యూనిటీ వ్యవస్థను నిర్మించడానికి దోహదపడతాయి. ఫోర్ మిల్క్ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే తొలిసారి స్రవించేవి అనీ... ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్ మిల్క్ అనీ గుర్తుపెట్టుకుంటే చాలు. -
పెనుభారమైన గుర్రాల పోషణ
-
బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అసలే ఎండాకాలం.. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. మనుషులం.. మనమే ఎండవేడికి తాళలేకపోతున్నాం. ఇక నోరులేని జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక బాలుడు మాత్రం ఓ పక్షి దాహార్తి తీర్చి మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒక పిల్లవాడు తన ఇంటి బాల్కనీ పక్కన ఒక పావురాన్ని చూశాడు. చాలాసేపటి నుంచి అది ఎటు కదలకుండా అలాగే ఉండిపోయింది. పైగా అది చాలా నీరసంగా కనిపించింది. ఇది చూసిన ఆ బాలుడు చలించిపోయాడు. పాపం.. ఎంత దూరం నుంచి ఎగురుతుందో, ఆ పక్షికి కాసిన్ని నీళ్లు ఇద్దాం అనుకున్నాడు. అలా ఒక చిన్న స్పూన్‌ను నీటితో నింపి ఇనుప చువ్వల సందులో నుంచి పావురం ముందు పెట్టాడు. మొదట పావురం నీరు తాగడానికి తటపటాయించింది. దీంతో బాలుడు కొంత నీరు కింద పోశాడు. ఆ వెంటనే పావురం గాబరాగా ఆ నీరు తాగటం మొదలుపెట్టింది. కాసేపటికి చెంచాలో ఉన్న నీళ్లన్నీ తాగి తన దాహార్తిని తీర్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ బాలుడు చేసిన పనికి ‘హ్యట్సాఫ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
పసిబిడ్డకు సీసాతో పాలు పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
సాధ్యమైనంత వరకు బిడ్డకు తల్లిపాలే పట్టాలి. నిజానికి అవే చాలా మంచివి. అయితే తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రం పోత పాలు ఇవ్వవచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ►పాడి పశువుల పాలు : ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు. ►డబ్బా పాలు : పిల్లల కోసం ఉద్దేశించి అమ్మే పాల పౌడర్‌ను ఉపయోగించి కలిసి ఇచ్చేవి. పాడి పశువుల పాలైనా లేదా డబ్బాపాలైనా సీసా సహాయంతో ఇస్తారు. ఇలా సీసాతో పాలు పట్టాల్సివచ్చినప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... ►ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ►పాల సీసాను పదినిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో మరగనివ్వాలి. ►బిడ్డకు పాలు పట్టే సమయంలో సరైన విధంగా పట్టాలి. ►అంటే బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. అలాగే.. పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు. ►పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి. ►సీసాలో పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను తప్పక పారబోయాలి. ►బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు. -
మయూరానికి ప్రేమతో...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నెమలికి ఆహారం అందిస్తున్న దృశ్యమిది. ఇదే కాంపౌండ్‌లో ఆఫీసు భవనాలు ఉన్నాయి. వీటి మధ్య నిత్యం మోదీ మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ప్రధాని నడక, ఇతర వ్యాయామాలు చేస్తుంటే పరిసరాల్లో నెమళ్లు తచ్చాడుతుంటాయట. వీటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారాయన. ప్రకృతి ప్రేమికుడైన మోదీ తన నివాసంలో పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఎత్తైన స్తంభాలతో కూడిన ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం వాకింగ్ చేస్తున్నపుడు తన దగ్గరకు వచ్చిన నెమళ్లకు మోదీ కింద కూర్చొని మరీ ఇలా ఆహారం అందించారు. తన మార్నింగ్ వాక్ దృశ్యాలతో కూడిన 107 సెకన్ల నిడివిగల వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.