fifth test
-
ధూమ్ ధామ్
హిమాలయాల చెంత భారత టెస్టు క్రికెట్ ప్రదర్శన మరింత ఉన్నతంగా శిఖరానికి చేరింది...ధర్మశాలలో అంచనాలకు అనుగుణంగా చెలరేగిన మన జట్టు ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టి టెస్టు సిరీస్‌ను 4–1తో సగర్వంగా గెలుచుకుంది... 259 పరుగుల ఆధిక్యం అంటేనే టీమిండియా గెలుపు లాంఛనం అనిపించింది... కానీ ఇంగ్లండ్ కనీస స్థాయి పోరాటపటిమ కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. బజ్‌బాల్ ముసుగులో అసలు టెస్టును ఎలా ఆడాలో మరచిపోయిన ఆ జట్టు ఆటగాళ్లు గుడ్డిగా బ్యాట్లు ఊపి పేలవ షాట్లతో వేగంగా తమ ఓటమిని ఆహ్వానించారు. తన వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా...విజయంతో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఓటమితో మొదలైన ఈ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌కు ఇన్నింగ్స్ విజయంతో భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. ధర్మశాల: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు. 7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రూట్ మినహా... వెన్నునొప్పితో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కెపె్టన్ రోహిత్ మైదానంలోకి దిగలేదు. దాంతో బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఆలస్యం చేయకుండా రెండో ఓవర్లోనే అశ్విన్ కు బౌలింగ్ బాధ్యత అప్పగించాడు. అంతే...ఐదో బంతికి డకెట్ (2) అవుట్‌తో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. కొద్ది సేపటికి క్రాలీ (0) కూడా వెనుదిరగ్గా, ఒలీ పోప్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో జానీ బెయిర్‌స్టో (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూట్ మాత్రమే 56 పరుగుల భాగస్వామ్యంతో కొద్దిసేపు ప్రతిఘటించారు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, స్టోక్స్ (2) పేలవ ఫామ్ కొనసాగింది. లంచ్ వరకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత ఫోక్స్ (8)ను పడగొట్టి అశ్విన్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టగా...తర్వాతి వికెట్ జడేజా ఖాతాలో చేరింది. మరో ఎండ్‌లో పోరాడుతున్న రూట్ ఇక లాభం లేదనుకొని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌కు లాంగాన్ వద్ద బుమ్రా క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. టెస్టు క్రికెట్‌కు ప్రోత్సాహకాలు... యువ ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు బీసీసీఐ కొత్త తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టెస్టులు రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుతో పాటు ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ పేరుతో భారీ మొత్తం అందించనుంది. 2022–23 సీజన్‌నుంచే దీనిని వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఏడాదిలో భారత జట్టు ఆడే టెస్టుల్లో కనీసం సగానికి పైగా టెస్టులు ఆడితే రూ. 30 లక్షలు అందిస్తారు. 75 శాతం పైగా మ్యాచ్‌లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. తుది జట్టులో లేని ప్లేయర్‌కు ఇందులో సగం లభిస్తుంది. ఉదాహరణకు భారత జట్టు ఏడాదిలో 10 టెస్టులో ఆడితే ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగితే అతనికి రూ.4.50 కోట్లు లభిస్తాయి. ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.15 లక్షల ద్వారా వచ్చే రూ.1.50 కోట్లకు ఇది అదనం. సగంకంటే తక్కువ టెస్టులు ఆడితే ఇది వర్తించదు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్ 477; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) సర్ఫరాజ్ (బి) అశ్విన్ 0; డకెట్ (బి) అశ్విన్ 2; పోప్ (సి) యశస్వి (బి) అశ్విన్ 19; రూట్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 84; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; స్టోక్స్ (బి) అశ్విన్ 2; ఫోక్స్ (బి) అశ్విన్ 8; హార్ట్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 20; వుడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; బషీర్ (బి) జడేజా 13; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–2, 2–21, 3–36, 4–92, 5–103, 6–113, 7–141, 8–141, 9–189, 10–195. బౌలింగ్: బుమ్రా 10–2–38–2, అశ్విన్ 14–0–77–5, జడేజా 9–1–25–1, కుల్దీప్ 14.1–0–40–2, సిరాజ్ 1–0–8–0. జిమ్మీ@ 700 ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా, తొలి పేసర్‌గా ఘనతకెక్కాడు. శనివారం కుల్దీప్ను అవుట్ చేయడంతో ఈ వికెట్ అతని ఖాతాలో చేరింది. అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే అతనికంటే ముందున్నారు. 41 ఏళ్ల 7 నెలల వయసులో తన 187వ టెస్టులో అతను ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. మే 2003లో జింబాబ్వేపై అండర్సన్ తన తొలి టెస్టు ఆడాడు. 178 = 178 భారత జట్టు టెస్టు చరిత్రలో తొలి సారి విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా వచ్చింది. ఇప్పటివరకు మన విజయాలకంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. భారత్ మొత్తం 579 టెస్టులు ఆడగా 222 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. 36 అశ్విన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 36వ సారి. రిచర్డ్ హ్యాడ్లీ (36)ని సమం చేశాడు. ‘ఒక టెస్టు గెలవాలంటే అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ సారి మేం అలాగే చేయగలిగాం. కొందరు ఆటగాళ్లు ఏదో ఒక దశలో సిరీస్‌లో అందుబాటులో ఉండరని తెలుసు. టెస్టులు ఎక్కువగా ఆడకపోయినా ఈ కుర్రాళ్లందరికీ మంచి అనుభవం ఉంది. మ్యాచ్‌కు అనుగుణంగా వారిని వాడుకున్నాం. ఒత్తిడి ఎదురైనప్పుడు అంతా సరిగా స్పందించారు. ఇది సమష్టి విజయం. పరుగులు చేయడం గురించే చర్చిస్తాం కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మా బౌలర్లు దానిని చేసి చూపించారు. కుల్దీప్, యశస్వి గొప్పగా ఆడారు’ –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
IND VS ENG 5th Test Day 2: 15 ఏళ్లలో తొలిసారి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 102 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 433/8గా ఉంది. యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56), రవీంద్ర జడేజా (15), దృవ్ జురెల్ (15), అశ్విన్ (0) ఔట్ కాగా.. కుల్దీప్ (6), బుమ్రా (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 215 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4 వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ట్లీ 2, ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. Historic - Team India's Top 5 scored 50+ scores in a Test innings for the first time after 15 years. - TEAM INDIA WRITTEN HISTORY AT DHARAMSHALA...!!!! 🇮🇳 pic.twitter.com/S32yzlfHx6 — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 15 ఏళ్లలో తొలిసారి.. భారత తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు టపార్డర్ బ్యాటర్లు 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు (యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56)) నమోదు చేశారు. భారత్‌కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. 1998లో తొలిసారి ఐదుగురు భారత టాపార్డర్ బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. కోల్‌కతా వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఆసీస్‌పై ఈ అరుదైన ఫీట్ నమోదైంది. ఆతర్వాత 1999లో ఓసారి (మొహాలీలో న్యూజిలాండ్‌పై), ఆతర్వాత 2009లో ముంబై వేదికగా శ్రీలంకపై మరోసారి భారత టాపార్డర్ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత మరోసారి భారత టాపార్డర్‌లోని ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. -
అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన పడిక్కల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్.. తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్.. సిక్సర్ సాయంతో అర్దసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 103 బంతులు ఎదుర్కొన్న అతను.. 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 పడిక్కల్‌కు ఇది మొదటి టెస్ట్ మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోని టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును తాకారు. భారత్‌కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. గతంలో ఆసీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ల్లో భారత టపార్డర్లోని ఐదుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ మార్కును దాటారు. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), సర్ఫరాజ్ ఖాన్ (56) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (14), దృవ్ జురెల్ (15) క్రీజ్‌లో ఉన్నారు. 100 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 426/5గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
కుల్దీప్ ఫటాఫట్...ఓపెనింగ్ ధనాధన్!
ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్‌కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లండ్ అరవై ఓవర్ల లోపే పది వికెట్లనూ స్పిన్నర్లకే అప్పగించింది. టాస్ గెలిచిన సానుకూలత, శుభారంభం తర్వాత ఒక దశలో 175/3తో మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తన వందో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు. మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్‌లో భారత్‌కు తొలిసారి ఓపెనింగ్‌లో సెంచరీ భాగస్వామ్యం... ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం. ధర్మశాల: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో భారత్‌కు అన్ని విధాలా సరైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించగా... రోహిత్‌తో పాటు శుబ్‌మన్ గిల్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పటిదార్ స్థానంలో భారత్ దేవ్‌దత్ పడిక్కల్‌ను తొలిసారి తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కు కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపిక అందించింది. టపటపా... ఓపెనర్లు క్రాలీ, డకెట్ (27) ఇంగ్లండ్‌కు మరోసారి శుభారంభం అందించారు. అయితే కుల్దీప్ రాకతో పరిస్థితి మారిపోయింది. గిల్ అద్భుత క్యాచ్‌తో తన తొలి ఓవర్లోనే డకెట్‌ను వెనక్కి పంపిన కుల్దీప్... కొద్ది సేపటికే పోప్ (11)ను కూడా అవుట్ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 100/2 కాగా, క్రాలీ కొన్ని చక్కటి షాట్లతో క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డాడు. అయితే రెండో సెషన్లో భారత స్పిన్నర్లు మరింతగా చెలరేగిపోగా... ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి క్రాలీ వికెట్లను ఎగరగొట్టగా, 100వ టెస్టు ఆడుతున్న బెయిర్‌స్టో (29) వికెట్ కూడా కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. శుభారంభం... భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 20 పరుగుల వద్ద రోహిత్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో అతను నాటౌట్‌గా తేలడం కలిసొచ్చింది. తొలి 27 బంతుల్లో 6 పరుగులే చేసి ఓపిక ప్రదర్శించిన యశస్వి స్పిన్నర్ల రాకతో చెలరేగిపోయాడు. బషీర్ వేసిన తొలి ఓవర్లో అతను 3 సిక్సర్లు బాదాడు. అయితే బషీర్ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీని దాటిన యశస్వి అదే ఊపులో మూడో బంతికి ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. అనంతరం 77 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, మరోవైపు గిల్ కూడా దూకుడుగా ఆడాడు. పడిక్కల్@ 314 ఈ మ్యాచ్‌తో కర్ణాటకకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటికే 2 టి20లు ఆడిన పడిక్కల్... టెస్టులు ఆడిన 314వ భారత ఆటగాడిగా నిలిచాడు. 17 ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన 17వ ప్లేయర్‌గా బెయిర్‌స్టో గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అండర్సన్ (187), స్టువర్ట్ బ్రాడ్ (168), కుక్ (161), జో రూట్ (140), స్టివార్ట్ (133), బెల్ (118), గూచ్ (118), గోవర్ (117), అథర్టన్ (115), కొలిన్ కౌడ్రే (114), బాయ్‌కాట్ (108), పీటర్సన్ (104), బోథమ్ (102), స్టోక్స్ (102), స్ట్రాస్ (100), థోర్ప్ (100) ఉన్నారు. 14 భారత్ తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న 14వ ప్లేయర్‌గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్‌దేవ్ (131), గావస్కర్ (125), వెంగ్‌సర్కార్ (116), గంగూలీ (113), కోహ్లి (113), ఇషాంత్ శర్మ (105), సెహ్వాగ్ (103), హర్భజన్ (103), పుజారా (103) ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 79; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 27; పోప్ (స్టంప్డ్) జురేల్ (బి) కుల్దీప్ 11; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 26; బెయిర్‌స్టో (సి) జురేల్ (బి) కుల్దీప్ 29; స్టోక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫోక్స్ (బి) అశ్విన్ 24; హార్ట్లీ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 6; వుడ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; బషీర్ (నాటౌట్) 11; అండర్సన్ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (57.4 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–64, 2–100, 3–137, 4–175, 5–175, 6–175, 7–183, 8–183, 9–218, 10–218. బౌలింగ్: బుమ్రా 13–2–51–0, సిరాజ్ 8–1–24–0, అశ్విన్ 11.4–1–51–4, కుల్దీప్ 15–1–72–5, జడేజా 10–2–17–1. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బ్యాటింగ్) 52; గిల్ (బ్యాటింగ్) 26; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (30 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–104. బౌలింగ్: అండర్సన్ 4–1–4–0, మార్క్ వుడ్ 3–0–21–0, హార్ట్లీ 12–0– 46–0, షోయబ్ బషీర్ 11–2–64–1. -
రాకాసి బౌన్సర్.. రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్‌ను ఎవరూ ఆడలేరు..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలుత ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. 151.2kmph delivery from Mark Wood. But Rohit Sharma says I'll play my favourite shot and send it out of the ground. 🫡pic.twitter.com/cuajTdxVHH — Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ ఆడిన ఓ షాట్ రోజు మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌కు రోహిత్ తగు రీతిలో సమాధానం చెప్పాడు. 151.2 కిమీ వేగంతో నిప్పులు గక్కుతూ వచ్చిన ఆ బౌన్సర్‌కు హిట్‌మ్యాన్ తన ఫేవరెట్ పుల్‌షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలిచాడు. రోహిత్ ఆడిన ఈ సాహసోపేతమైన షాట్‌ను చూసి బౌలర్, ఫీల్డర్లు సహా మైదానంలో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. హిట్‌మ్యాన్ అభిమానులు ఈ షాట్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ తమ ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్‌ను ఎవ్వరూ ఆడలేరన్న విషయాన్ని ఒప్పుకోవాలి. -
Viral Video: ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలుత ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. First Kuldeep Yadav give the ball to Ravi Ashwin but Ashwin return the ball to Kuldeep Yadav to celebrate his 5-Wicket haul. - Beautiful moments of the day...!!!! pic.twitter.com/64ev9CFM4f — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత మైదానంలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన అనంతరం భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్తుండగా వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్‌ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ ఇన్నింగ్స్ హీరో కావడంతో అశ్విన్ సహచరుల మాటకు ఒప్పుకోలేదు. కుల్దీప్నే ముందుగా నడవాల్సిందిగా కోరాడు. ఇలా నువ్వు-నేను అంటూ అశ్విన్, కుల్దీప్ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి అశ్విన్.. కుల్దీప్ను ఒప్పించాడు. కుల్దీప్ టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరలవుతుంది. వందో టెస్ట్ ఆడుతూ 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Yashasvi Jaiswal: సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. ఆసీస్‌పై 74 ఇన్నింగ్స్‌ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు. ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన సచ్‌క్లిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా.. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై 774 పరుగులు సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌పై 732 పరుగులు యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్‌పై 712 పరుగులు విరాట్ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు డబ్యూటీసీ 2023-25 సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్ -
4–1 వేటలో... ఘనమైన ముగింపుపై భారత్ దృష్టి
భారత జట్టు హైదరాబాద్‌లో తొలి టెస్టును కోల్పోయిన తీరు చూస్తే నాలుగో టెస్టు ముగిసే సరికి మన జట్టు సిరీస్ గెలుచుకోగలదని ఎవరూ ఊహించలేదు. తర్వాతి మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ మెరుగ్గానే ఆడినా, వెనుకబడిన ప్రతీసారి కోలుకుంటూ టీమిండియా వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు సిరీస్ సొంతం కావడంతో చివరి మ్యాచ్‌నూ గెలిచి ఘనంగా ముగించాలని రోహిత్ బృందం భావిస్తుండగా... సిరీస్ ఓడినా మరో మ్యాచ్ గెలిచి అంతరాన్ని 2–3కు తగ్గిస్తూ స్వదేశం వెళ్లాలని స్టోక్స్ జట్టు పట్టుదలగా ఉంది. ధర్మశాల: భారత గడ్డపై ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లను టీమిండియా 4–0తో, 3–1తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 3–1తో పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఆఖరి సమరంలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ సిరీస్‌ను 4–1తో ముగిస్తుందా లేక తాము నమ్ముకున్న ‘బజ్‌బాల్’తో ఇంగ్లండ్ రెండో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. బుమ్రా వచ్చేశాడు సిరీస్ గెలుచుకున్న ఉత్సాహంతో భారత శిబిరంలో ప్రస్తుతం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఆటగాళ్లంతా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓపెనర్లు రోహిత్, యశస్విలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సిరీస్‌లో ఇప్పటికే 655 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను నిలువరించడం ఇంగ్లండ్ వల్ల కావడం లేదు. ఒక్క రజత్ పటిదార్ మాత్రమే ఇప్పటి వరకు విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 63 పరుగులే చేసినా... అతనికి మరో మ్యాచ్‌లో అవకాశం దక్కుతోంది. గత టెస్టులో విఫలమైన సర్ఫరాజ్ ఈసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కీపర్ ధ్రువ్ జురేల్ రాంచీ టెస్టుతోనే తానేంటో చూపించగా... జడేజా, అశ్విన్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా తన 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. నాలుగో టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండటంతో మన పేస్ మరింత పటిష్టంగా మారింది. సిరాజ్‌తో పాటు గత మ్యాచ్‌లో రాణించిన ఆకాశ్‌దీప్‌కు మూడో పేసర్‌గా అవకాశం ఇస్తారా లేక మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను ఎంచుకుంటారా అనేది మ్యాచ్ రోజే తేలుతుంది. రాబిన్సన్ స్థానంలో వుడ్ ఇంగ్లండ్ తుది జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పాటు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్‌కు ఇంగ్లండ్ చోటు కల్పించింది. తన 187వ టెస్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైన సీనియర్ అండర్సన్ 700 వికెట్ల మైలురాయికి మరో రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లండ్ ఇద్దరు స్పిన్నర్లు హార్ట్లీ, బషీర్‌లను ఎంచుకుంది. అయితే బ్యాటింగే ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. ప్రతీ ఒక్కరు సిరీస్‌లో ఒక్కో సమయంలో రాణించినా సమష్టిగా ఆడకపోవడం వరుస ఓటములకు కారణమైంది. ఓపెరన్లు క్రాలీ, బెన్ డకెట్‌లతో పాటు పోప్ రాణించాల్సి ఉంది. జో రూట్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా కెప్టెన్ బెన్ స్టోక్స్ తన స్థాయికి తగినట్లుగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సిరీస్‌లో ఇప్పటి వరకు విఫలమవుతూనే ఉన్న బెయిర్‌స్టో తన 100వ టెస్టులోనైనా ఆకట్టుకుంటాడా లేదా వేచి చూడాలి. 1 ధర్మశాల స్టేడియంలో ఇప్పటి వరకు ఒకే ఒక టెస్టు జరిగింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్, వాతావరణం ధర్మశాలలో చల్లటి వాతావరణం, పిచ్ సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే దాని ప్రభావం కొద్ది సేపే ఉండవచ్చు. పచ్చిక దాదాపుగా తొలగించడంతో బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా కనిపిస్తోంది. -
ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ విరామ సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. England cricketer James Anderson and his teammates enjoying a refreshing dip in a local khadd in Dharamshala 😍 pic.twitter.com/JQravFPLvM — Go Himachal (@GoHimachal_) March 6, 2024 ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిలో మమేకమైపోయారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా కనెక్టైనట్లుంది. హిమాచల్ ప్రదేశ్ శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతలస్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లీష్ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగిస్తుంటుంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహపరిచింది. బజ్‌బాల్ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్ సేన దెబ్బకు తోకముడిచారు. బెన్ డకెట్, ఓలీ పోప్, రూట్ సెంచరీలు మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు లేవు. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. -
‘వంద’కు అటు ఇటు...
ధర్మశాల: టి20ల మెరుపులతో సంప్రదాయ టెస్టు సిరీస్‌లే కుదించబడుతున్నాయి. 3, 5 టెస్టుల సిరీస్ నుంచి 2, 3 టెస్టుల సిరీస్ లేదంటే అనామక జట్లయితే మొక్కుబడిగా ఏకైక టెస్టుతో ఐదు రోజుల ఆటను కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా ధనాధన్ ఆట మాయలో అసలైన ఫార్మాట్‌కు మంగళం పాడి లీగ్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లతోనే కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక క్రికెటర్ 100వ టెస్టు ఆడటం ఆ ఆటగాడికే కాదు... ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌కే మైలురాయిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రత్యర్థి జట్ల నుంచి చెరొకరు 100వ టెస్టు ఆడటమైతే అనూహ్యం! ఆతిథ్య భారత్ నుంచి దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బృందం నుంచి బెయిర్‌స్టోలకు రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరు 99 మ్యాచ్‌లాడి టెస్టు క్రికెట్‌కు అభి‘వంద’నం పలుకేందుకు సిద్ధమయ్యారు. 14వ భారత క్రికెటర్‌గా... భారత క్రికెట్లోనే విజయవంతమైన సారథులుగా వెలుగొందిన అజహరుద్దీన్ (99), ధోని (90)లు కూడా 100 టెస్టులు ఆడలేకపోయారు. జహీర్ ఖాన్ (92) సైతం ‘వంద’ భాగ్యానికి నోచుకోలేకపోయాడు. కొందరికే సాధ్యమైన ఈ మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ సిద్ధమయ్యాడు. ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ ... కుంబ్లే తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2011లో వెస్టిండీస్‌పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా ఘనవిజయాల్లో భాగమైన అశ్విన్ ... ధోని సారథ్యంలో తురుపుముక్కగా రాటుదేలాడు. 99 టెస్టులాడి 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత వహిస్తాడు. 17వ ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్‌స్టో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గురించి మనవాళ్లకి, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకి బాగా తెలుసు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా వార్నర్‌తో కలిసి మెరిపించాడు. టెస్టుల్లో నిలకడైన బ్యాటర్. 2012లో వెస్టిండీస్‌తో అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో 99 టెస్టుల్లో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 26 అర్ధ శతకాలున్నాయి. కీపర్‌గా 242 క్యాచ్‌ల్ని పట్టడంతో పాటు 14 స్టంపౌట్లు చేశాడు. వందోటెస్టు ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ ఈ ఘనతకెక్కనున్న 17వ ఇంగ్లండ్ క్రికెటర్. వన్డేల్లో వందో మ్యాచ్ కూడా ధర్మశాలలోనే ఆడిన బెయిర్‌స్టో ఇప్పుడు అక్కడే మరో 100కు సై అంటున్నాడు. ఇది అతిపెద్ద సంబరం. ఎందుకంటే నా కెరీర్లో ఇది గమ్యాన్ని మించిన పయనం. ఎప్పటికీ ప్రత్యేకం. ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాను. ఎంతో నేర్చుకున్నాను. 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. నాలుగు టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్ల పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్నా. కెరీర్ ఆరంభంలోనే పనైపోయిందనుకున్న ప్రతీసారి నన్ను నేను మార్చుకుంటూ సరికొత్త బౌలింగ్ అస్త్రాలతో ఇక్కడిదాకా ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. –అశ్విన్ ఇది నాకు భావోద్వేగానికి గురిచేసే మ్యాచ్. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే అందరూ కలలు కంటారు. నేనైతే ఆ కలల్ని నిజం చేసుకొని కెరీర్లో వందో ఆటకు రెడీ కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లే సర్వస్వం. అందుకే ఈ ఘనత ఆమెకే అంకితం. –బెయిర్‌స్టో -
ప్రత్యేక హెలికాప్టర్‌తో ధర్మశాలలో ల్యాండ్ అయిన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో టెస్ట్ అనంతరం లభించిన విరామంలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన రోహిత్.. తిరిగి టీమిండియాతో జత కట్టాడు. Jamnagar ✈️Dharamsala Captain Rohit Sharma's normal duties resume.pic.twitter.com/4CKlGqjW5H — CricTracker (@Cricketracker) March 5, 2024 ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు వేదిక అయిన ధర్మశాలలో హిట్‌మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యాడు. మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐయే స్వయంగా రోహిత్‌కు హెలికాప్టర్‌ను అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ముందస్తు వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు రోహిత్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరందరిలో భారత క్రికెటర్లు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. -
Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (476), మార్టిన్ గప్తిల్ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్ మోర్గన్ (352), ఏబీ డివిలియర్స్ (346), జోస్ బట్లర్ (328) వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. హిట్‌మ్యాన్ ముంగిట మరో రికార్డు.. ధర్మశాల టెస్ట్‌లో రోహిత్ శర్మ మరో సిక్సర్ కొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్ మ్యాచ్ నామమాత్రం సాగనుంది. సిరీస్ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లకు 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ జానీ బెయిర్‌స్టో తమ కెరీర్లలో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో ఇద్దరు ఆటగాళ్లు (వేర్వేరు జట్లకు చెందిన వారు) 100 టెస్ట్‌ల మార్కును తాకడం ఇది మూడోసారి మాత్రమే. అశ్విన్, బెయిర్‌స్టోలకు చిరకాలం గుర్తుండిపోయే ఈ మ్యాచ్ కోసం వారితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా, కెరీర్లో అత్యంత ముఖ్యమైన మైలురాయిని (100వ టెస్ట్) చేరుకునే ముందు ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఫామ్ లేమి సమస్య తెగ కలవరపెడుతుంది. భారత్‌తో సిరీస్‌లో అతను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ALERT 🚨. In the next match, both Ravi Ashwin and Jonny Bairstow will play their 100th Test match. This will be only the 3rd time in 147 years of Test history that players from two different teams will play their 100th Test in the same match. pic.twitter.com/nYq4ytbhHm — Vishal. (@SPORTYVISHAL) February 29, 2024 తొలి టెస్ట్‌లో 47 పరుగులు (37, 10) చేసిన బెయిర్‌స్టో.. రెండో టెస్ట్‌లో 51 (25, 26), మూడో టెప్ట్లో 4 (0, 4), నాలుగో టెస్ట్‌లో 68 పరుగులు (30, 38) మాత్రమే చేసి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. బెయిర్‌స్టో వందో మ్యాచ్‌లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. బెయిర్‌స్టో ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 36.43 సగటున 5974 పరుగులు చేశాడు. అశ్విన్ విషయానికొస్తే.. యాష్ ఇదే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో 500 వికెట్ల మార్కును తాకి చరిత్రపుటల్లోకెక్కాడు. ప్రస్తుతం అతను ఓ మోస్తరు ఫామ్‌తో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో యాశ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి, సిరీస్ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు, 3309 పరుగులు చేశాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు, 5 సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మార్చి 7 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభంకానుంది. -
ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్.. భారత జట్టు ప్రకటన
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే చివరాఖరి (ఐదు) టెస్ట్ కోసం అప్డేట్ చేసిన భారత్ జట్టును ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించారు. నాలుగో టెస్ట్‌కు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతని స్థానం ఖరారైనట్లే. బుమ్రా.. ఆకాశ్‌దీప్‌తో కలిసి భారత పేస్ బౌలింగ్ దళాన్ని లీడ్ చేస్తాడు. బుమ్రా పునరాగమనంతో నాలుగో టెస్ట్‌లో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయిన సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండటంతో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేదు. 🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5th @IDFCFIRSTBank Test against England in Dharamsala announced. Details 🔽 #INDvENG https://t.co/SO0RXjS2dK — BCCI (@BCCI) February 29, 2024 భారత తుది జట్టు విషయానికొస్తే.. నాలుగో టెస్ట్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. వరుసగా మూడు టెస్ట్‌ల్లో విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ తుది జట్టులోకి రావచ్చు. సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైపోయింది. ఐదో టెస్ట్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, అశ్విన్‌కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. ధర్మశాల టెస్ట్ అశ్విన్‌కు 100వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే ఈ ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. రోహిత్ అప్డేట్ చేసిన జట్టులో ఉన్నాడంటే తుది జట్టులో ఉన్నట్లే. మొత్తంగా చూస్తే బుమ్రా రీఎంట్రీ మినహా ఐదో టెస్ట్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఐదో టెస్ట్ కోసం అప్డేట్ చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మొమమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఐదో టెస్ట్‌లో భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శస్వి జైస్వాల్, శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆకాష్ దీప్ -
ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్.. టీమిండియాకు శుభవార్త
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త తెలిసింది. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి మ్యాచ్‌కు పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ మింగుడుపడని వార్త కూడా వినిపిస్తుంది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఖరి మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. మెరుగైన చికిత్స కోసం రాహుల్‌ను అతి త్వరలో లండన్‌కు పంపించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు ఆడిన రాహుల్.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా తొడ కండరాల సమస్య తలెత్తడంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా సమాచారం నిజమైతే రాహుల్ ఆఖరి టెస్ట్‌లో ఆడటం అనుమానమే. కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియాను గాయాల బెడద వేధిస్తూనే ఉంది. సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత కారణాల చేత విరాట్ కోహ్లి, గాయం కారణంగా మొహమ్మద్ షమీ దూరం కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా గాయాలు, ఇతరత్రా కారణాల చేత మధ్యలో పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. సీనియర్ల గైర్హాజరీ, గాయాల సమస్య వేధిస్తున్నప్పటికీ.. యంగ్ ఇండియా అద్భుత ప్రదర్శనలు చేసి సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. -
ముందే సంబరపడితే ఇలాగే ఉంటది.. కీలకమైన స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టి వదిలేసిన స్టోక్స్
యాషెస్ సిరీస్ 2023 ఐదో టెస్ట్ చివరి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో (లంచ్‌కు ముందు ఓవర్ తొలి బంతికి) మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్టీవ్ స్మిత్ (40) క్యాచ్‌ను జారవిడిచాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో స్మిత్ గ్లవ్స్‌ను తాకిన బంతిని లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అతికష్టం మీద (చాలా ఎత్తుకు ఎగిరి) పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేశాడు. STOKES 😒pic.twitter.com/OUD88ZWZkF — CricTracker (@Cricketracker) July 31, 2023 సంబురాలు చేసుకునే తొందరలో స్టోక్స్ మోకాలికి తగిలి బంతి నేలపాలైంది. ఇంతటితో ఆగకుండా స్టోక్స్ రివ్యూకి వెళ్లి ఇంకో ఘోర తప్పిదం చేశాడు. రీప్లేలో బంతి స్మిత్ గ్లవ్స్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్ చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇంగ్లండ్ అప్పీల్‌కు నాటౌట్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్‌కు వికెట్ దక్కకపోగా, రివ్యూ కోల్పోయింది. It's lunch on Day 5. Steve Smith and Travis Head keep Australia steady as teams head for Lunch. pic.twitter.com/8mTKpA0eXZ — CricTracker (@Cricketracker) July 31, 2023 కాగా, స్టోక్స్.. స్టీవ్ స్మిత్ క్యాచ్ జారవిడిచాక ఆట మరో 5 బంతుల పాటు సాగింది. అనంతరం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 238/3గా ఉంది. స్టీవ్ స్మిత్ (40), ట్రవిస్ హెడ్ (31) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ గెలవాలంటే 146 పరుగులు, ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉంది. లంచ్ విరామ సమయం పూర్తయ్యాక కూడా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను పాక్షికంగా నిలిపివేశారు. ఇదిలా ఉంటే, 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్‌నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. -
Ashes 5th Test Day 5: ఆసీస్‌ను వణికిస్తున్న ఇంగ్లండ్ పేసర్లు.. తొలి సెషన్లోనే..!
యాషెస్ సిరీస్-2023లో ఆఖరి (ఐదవది) టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికిస్తున్నారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్‌నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. Chris Woakes gets David Warner early on Day 5. 📸: Sony LIV pic.twitter.com/yvj0U7KmiE — CricTracker (@Cricketracker) July 31, 2023 ఐదో రోజు ఆట ప్రారంభమయ్యాక 4వ ఓవర్ రెండో బంతికి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ పెవిలియన్‌కు చేరగా.. ఆ వెంటనే ఆరో ఓవర్ రెండో బంతికి అదే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 49వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్ వుడ్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆసీస్ 34 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి (169/3) బిక్కుబిక్కుమంటుంది. Chris Woakes is in the act for England.pic.twitter.com/UlekQeEhqX — CricTracker (@Cricketracker) July 31, 2023 లబూషేన్ ఔటయ్యాక కాస్త దూకుడు పెంచిన ఆసీస్ వేగంగా పరుగులు చేస్తూనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్టీవ్ స్మిత్ (35 బంతుల్లో 21; 4 ఫోర్లు, ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 57 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 210/3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. అదే ఇంగ్లండ్ విజయం సాధించలాంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. తొలి సెషన్లో ఇప్పటివరకు 19 ఓవర్లు జరిగాయి. ఈ రోజు ఇంకా 71 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
అదరగొట్టిన ఇంగ్లండ్
లండన్: తొలి రోజునుంచే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌లో మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధమైంది. చివరిదైన ఐదో టెస్టును గెలుచుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ బలంగా పట్టు బిగించింది. పదునైన బ్యాటింగ్‌తో చెలరేగి ఆస్ట్రేలియా ముందు దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచేందుకు సిద్ధమైంది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అండర్సన్ (8 బ్యాటింగ్), బ్రాడ్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 377 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు రోజులు ఆసీస్ బ్యాటర్లు నిలబడి లక్ష్యాన్ని ఛేదిస్తారా లేక ఇంగ్లండ్ 2–2తో సిరీస్‌ను సమం చేస్తుందా చూడాలి. ఇంగ్లండ్ మరోసారి తమ బ్యాటింగ్‌లో తొలి బంతినుంచే ‘బజ్‌బాల్’ దూకుడును ప్రదర్శించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (76 బంతుల్లో 73; 9 ఫోర్లు), బెన్ డకెట్ (55 బంతుల్లో 42; 7 ఫోర్లు) ఎప్పటిలాగే ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 17 ఓవర్లలోనే 79 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచి్చన కెప్టెన్ బెన్ స్టోక్స్ (67 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం జో రూట్ (106 బంతుల్లో 91; 11 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో (103 బంతుల్లో 78; 11 ఫోర్లు) ఇన్నింగ్స్‌లు ఇంగ్లండ్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చాయి. రూట్, బెయి ర్స్టో ఐదో వికెట్‌కు 110 పరుగులు జత చేశారు. 2019లోనూ ఇంగ్లండ్ గ డ్డపై జరిగిన ‘యాషెస్’ సిరీస్ 2–2తో సమంగా ముగిసింది. ఇరు జట్లు చెరో 2 టెస్టులు గెలవగా, మరో టెస్టు ‘డ్రా’ అయింది. ఆ తర్వాత 2021లో తమ సొంతగడ్డపై జరిగిన ‘యాషెస్’లో ఆ్రస్టేలియా 4–0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ‘దెమెంతియా’ బాధితులకు మద్దతుగా... మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు భిన్నమైన రీతిలో దెమెంతియా (మతిమరపు) వ్యాధిగ్రస్తులకు సంఘీభావం ప్రకటించారు. ప్రతీ ఆటగాడు తమ పేరు రాసి ఉన్న జెర్సీ కాకుండా జట్టులోని మరో సభ్యుడి జెర్సీని ధరించి మైదానంలోకి దిగారు. మతిమరపు కారణంగా తమ వస్తువులను గుర్తించడంలో గందరగోళానికి గురి కావడం ‘దెమెంతియా’ లక్షణాల్లో ఒకటి. బ్రాడ్ పేరుతో అండర్సన్, స్టోక్స్ పేరుతో బెయిర్‌స్టో, వోక్స్ పేరుతో అలీ...ఇలా ఆటగాళ్లు టీ షర్ట్లు ధరించి ఆడారు. -
రాణించిన స్మిత్.. 295 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ ఆఖరి ఐదో టెస్టులో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కమిన్స్ (36; 4 ఫోర్లు), మర్ఫీ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లు వోక్స్ 3 వికెట్లు... బ్రాడ్, వుడ్, రూట్ తలా 2 వికెట్లు తీశారు. -
ఇంగ్లండ్ 283 ఆలౌట్
లండన్: ఆ్రస్టేలియాతో గురువారం మొదలైన యాషెస్ సిరీస్ చివరిదైన ఐదో టెస్టును ఇంగ్లండ్ అదే దూకుడుతో ప్రారంభించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 54.4 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు డకెట్ (41; 3 ఫోర్లు), జాక్ క్రాలీ (22; 3 ఫోర్లు), మొయిన్ అలీ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (91 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. ఆసీస్ పేస్ బౌలర్ స్టార్క్ (4/82) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. వార్నర్ (24) అవుటయ్యాడు. -
టీమిండియాకు పరాభవం.. ఇంగ్లండ్‌కు చిరస్మరణీయం
‘ఇంగ్లండ్‌ను ఉతికి ఆరేస్తాం’... ఎన్నో రోజులుగా టెస్టు మ్యాచ్ గురించి ప్రసారకర్తలు సాగించిన ప్రచారమిది! చివరకు చూస్తే అంతా తలకిందులైంది. మూడు రోజులకు పైగా ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా ఆఖరికి ప్రత్యర్థికి మ్యాచ్‌ను అప్పగించింది. ఇంగ్లండ్ తమ టెస్టు చరిత్రలోనే అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించగా... మన జట్టు భారీ స్కోరుతో సవాల్ విసిరి కూడా దానిని కాపాడుకోలేకపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 119 పరుగులు చేయాలిæ్స ఉన్నా... మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తారేమో అనుకున్నా ఎలాంటి సంచలనం సాధ్యం కాలేదు. మరో వికెట్ కూడా కోల్పోకుండా గంటన్నరలోనే ఛేదన పూర్తి చేసిన ఇంగ్లండ్ సొంతగడ్డపై సిరీస్ చేజారిపోకుండా కాపాడుకోగలిగింది. బర్మింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మధ్య ‘పటౌడీ ట్రోఫీ’ ఐదు టెస్టుల సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మంగళవారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 76.4 ఓవర్లలో 3 వికెట్లకు 378 పరుగులు చేసి గెలిచింది. నాలుగో రోజే 259 పరుగులు చేసిన ఆ జట్టు మిగిలిన 119 పరుగులను కూడా వికెట్ నష్టపోకుండా సాధించింది. అజేయ సెంచరీలు సాధించిన జో రూట్ (173 బంతుల్లో 142 నాటౌట్; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (145 బంతుల్లో 114 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 269 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో టీమ్‌ను గెలిపించారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాదిన బెయిర్‌స్టో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ సిరీస్‌లో 4 సెంచరీలు సహా 737 పరుగులు చేసిన రూట్ ఇంగ్లండ్ తరఫున... 22.47 సగటుతో 23 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ మొదలవుతుంది. 19.4 ఓవర్లలోనే... ఛేదనలో నాలుగో రోజే దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్ మంగళవారం కూడా ఎక్కడా తగ్గలేదు. చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ వేగంగా ఆట ముగించింది. ఇక ఏమీ చేయలేమన్నట్లుగా భారత బౌలర్లు కూడా ముందే చేతులెత్తేశారు. దాంతో ఓవర్‌కు 6 పరుగుల చొప్పున బాదుతూ తొలి సెషన్లో ఇరవై ఓవర్ల లోపే ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో 136 బంతుల్లో రూట్, 138 బంతుల్లో బెయిర్‌స్టో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సిరాజ్ ఓవర్లో బెయిర్‌స్టో మూడు ఫోర్లు బాది లక్ష్యానికి చేరువ చేయగా, తర్వాతి ఓవర్లో జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో సింగిల్ తీసి రూట్ జట్టును గెలిపించాడు. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఐదు (4.93) రన్‌రేట్‌తో పరుగులు తీస్తూ 76.4 ఓవర్లలోనే ఛేదించడం ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని సూచిస్తోంది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 భారత్ రెండో ఇన్నింగ్స్: 245 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
IND VS ENG 5th Test: కోహ్లి, స్మిత్‌లను దాటేసిన రూట్
బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్ట్‌లో (రీ షెడ్యూల్డ్) ఇంగ్లండ్ 7 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జో రూట్ (142), జానీ బెయిర్‌స్టో (114) అజేయ శతకాలతో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ 2-2తో సమం చేసుకుంది. ఇదిలా ఉంటే, కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న జో రూట్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్‌లను అధిగమించాడు. రెండున్నరేళ్లుగా సెంచరీల మోత మోగిస్తున్న (11 శతకాలు) రూట్.. తాజా శతకంతో కోహ్లి (27), స్మిత్ (27) సెంచరీల రికార్డును దాటేశాడు. ఇప్పటివరకు 121 టెస్ట్‌లు ఆడిన రూట్ 28 శతకాలను బాదాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రూట్ బాదిన శతకాలే ఇప్పటివరకు అత్యధికం. ఫాబ్ ఫోర్‌గా చెప్పుకునే విరాట్, స్మిత్, విలియమ్సన్ గణాంకాలతో పోలిస్తే రూట్ గణాంకాలు అత్యుత్తమంగా ఉన్నాయి. A modern-day Great - Joe Root, what an unbelievable consistency since 2021.pic.twitter.com/bZdu696ibQ — Johns. (@CricCrazyJohns) July 5, 2022 కోహ్లి.. 102 టెస్ట్‌ల్లో 7 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 49.53 సగటున 8074 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 86 టెస్ట్‌ల్లో 3 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 36 అర్ధసెంచరీల సాయంతో 59.38 సగటున 8016 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సారధి విలియమ్సన్.. 88 టెస్ట్‌ల్లో 4 డబుల్ సెంచరీలు, 24 సెంచరీలు, 33 అర్ధసెంచరీల సాయంతో 52.63 సగటున 7368 పరుగులు చేయగా.. రూట్ 121 టెస్ట్‌ల్లో 5 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 54 అర్ధసెంచరీల సాయంతో 50.77 సగటున 10458 పరుగులు స్కోర్ చేశాడు. చదవండి: IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్ -
IND VS ENG 5th Test: బాగా ఆడలేదు, ఓడాం.. పరాజయానికి సాకులు చెప్పదల్చుకోలేదు..!
గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా తీవ్రత, ప్రదర్శన, ఫిట్నెస్ మ్యాచ్ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. తుది జట్టుపై చర్చ సహజం. శార్దుల్ బాగానే ఆడుతున్నాడు కాబట్టే మరో అవకాశమిచ్చాం. అశ్విన్ స్థాయి ఆటగాడిని పక్కన పెట్టడం అంత సులువు కాదు. అయితే తొలి రోజు పిచ్ చూసినప్పుడు పేసర్లకు అనుకూలిస్తుందని అనిపించింది. మ్యాచ్ చివరి వరకు కూడా బంతి పెద్దగా స్పిన్ కాలేదు. పిచ్‌లో కూడా పెద్దగా మార్పు రాలేదు కాబట్టి రెండో స్పిన్నర్ ఉన్నా ఫలితం మారకపోయేదేమో. తొలి నాలుగు టెస్టుల సమయంలో నేను లేను. అప్పుడు ఇంగ్లండ్ కొంచెం ఇబ్బంది పడ్డా, ఇప్పుడు వరుసగా మూడు విజయాల తర్వాత ఇక్కడకు వస్తే, మనం టెస్టులు ఆడి చాలా రోజులైంది. అయినా ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ఇంగ్లండ్ కీలక సమయాల్లో బాగా ఆడింది కాబట్టి టెస్టు గెలవగలిగింది. –రాహుల్ ద్రవిడ్, భారత్ హెడ్ కోచ్ -
IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్
అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 245; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
IND VS ENG: పంత్ సెంచరీ చేశాడంటే టీమిండియాకు ఓటమి తప్పదా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ ఆఖరి రోజు టీమిండియా గెలుపుకు మరో 7 వికెట్లు అవసరముండగా.. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగులు కావాల్సి ఉంది. వరుణుడు ఆటంకం కలిగిస్తేనో లేక ఏదైనా అద్భుతం జరిగితేనో తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని ఆపడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీమిండియా అభిమానులు తమ బౌలర్లపై ఏ మూలనో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆఖరి రోజు తమ పేసర్లు చెలరేగి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందిస్తారని వారు భావిస్తున్నారు. ఏదో మూలన భారత విజయావకాశాలు మినుకుమినుకుమంటున్నా ఫాన్స్‌ను ప్రస్తుతం ఓ అంశం కలవరపెడుతంది. అదేంటంటే.. విదేశాల్లో రిషబ్ పంత్ సెంచరీ బాదిన సందర్భాల్లో టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇదే విషయం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. పంత్ తన టెస్ట్ కెరీర్లో మొత్తం 5 సెంచరీలు బాదగా.. అందులో నాలుగు విదేశీ పిచ్‌లపై సాధించినవే ఉన్నాయి. ఈ నాలుగింటిలో పంత్ సిడ్నీలో సెంచరీ చేసిన మ్యాచ్ డ్రా కాగా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను మినహాయించి) టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాకు మరో ఓటమి తప్పదని భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. పంత్ సెంచరీల వివరాలు.. 1. 2018 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 114- టీమిండియా ఓటమి 2. 2019 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (నాలుగో టెస్ట్) పంత్ 159 నాటౌట్- మ్యాచ్ డ్రా 3. 2021 ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (నాలుగో టెస్ట్) పంత్ 101- ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో టీమిండియా విజయం 4. 2022 ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా (మూడో టెస్ట్) పంత్ 100 నాటౌట్- టీమిండియా ఓటమి 5. 2022 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 146, 57- ? ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..