fiscal
-
లక్ష్యంలో 45 శాతానికి చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం.. ద్రవ్యలోటు అక్టోబర్‌తో ముగిసిన నెలకు ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 45 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ విలువ ర.8.03 లక్షల కోట్లని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు ర.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. రూ.8.03 లక్షల కోట్లు లోటు ఎలా? అక్టోబర్ 2023 వరకు ప్రభుత్వానికి ర. 15.90 లక్షల కోట్ల పన్ను నికర రాబడి (బడ్జెట్ అంచనాల్లో 58.6 శాతం) లభించింది. ఇందులో 13.01 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. ర. 2.65 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం. ర. 22,990 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయం. రుణాల రికవరీ (ర.14,990 కోట్లు, మూలధన ఆదాయాలు (రూ.8,000 కోట్లు) నాన్–డెట్ క్యాపిటల్ పద్దులో ఉంటాయి. ఇక ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ప్రభుత్వ వ్యయాలు ర.23.94 లక్షల కోట్లు (బడ్జెట్లో నిర్దేశించుకున్న మొత్తంలో 53 శాతం). వ్యయాల్లో ర.18,47,488 కోట్లు రెవెన్యూ అకౌంట్కాగా, ర. 5,46,924 కోట్లు క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ వ్యయాలు ర.18,47,488 కోట్లలో ర.5,45,086 కోట్లు వడ్డీ చెల్లింపులు. ర.2,31,694 కోట్లు సబ్సిడీ అకౌంట్ వ్యయాలు. వెరసి ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ర.8.03 లక్షల కోట్లుగా నవెదయ్యింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.54 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ స్థూల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత, కార్పొరేట్) వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి రూ.10.54 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 31 శాతం ఎగసినట్లు పేర్కొంది. ఇక ఇందులో రిఫండ్స్ విలువ రూ.1.83 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం బడ్టెట్ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఇది 61.31 శాతం. స్థూల పన్నుల వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం పెరిగితే, వ్యక్తిగత పన్ను వసూళ్లు 40.64 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు: బీఓఏ సెక్యూరిటీస్ కాగా చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్ వెలువరించింది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
ఎకానమీని గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్!?
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గట్టెకించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజ్ తప్పదని భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి సహాయక ప్యాకేజ్ని ప్రకటించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చిన్న పరిశ్రమలకు హామీ రహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలించాలని ఒక ఇంటర్వ్యూలో కోరారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్‌లో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్, మే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపివేసిందని కొటక్ అన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను కొటక్ ప్రస్తావిస్తూ, ‘‘నిజానికి బేస్ ఎఫెక్ట్‌తో చూసుకున్నా, వృద్ధి రెండంకెల దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని వేచి చూడాల్సి ఉంది’’ అని అన్నారు. ఇప్పటికి ప్యాకేజ్‌లు ఇలా... 2020లో కేంద్రం కరోనాను ఎదుర్కొనడానికి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ని ప్రకటించింది. ఈ విలువ రూ. 27.1 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ విలువ 13 శాతం అని కేంద్రం ప్రకటించినప్పటికీ, ద్రవ్య పరంగా ఇది 2 శాతం దాటబోదని అంచనా. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ. 30 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీలను దశలవారీగా ప్రకటించింది. ఈ మొత్తం జీడీపీలో దాదాపు 15%. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమేనని పేర్కొంది. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయని విశ్లేషించింది. లాక్డౌన్లు సడలించే సమయంలో ప్రకటించే అవకాశం: బెర్న్‌స్టెయిన్ సెకండ్ వేవ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న లాక్డౌన్లు, సంబంధిత ఆంక్షలు సడలించే సమయంలో కేంద్రం మరోదఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంచనావేసింది. ఏప్రిల్, మే నెలల్లో భారత్ ఆర్థిక క్రియాశీలత తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని తన సూచీలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఇంధన వినియోగం, విద్యుత్ డిమాండ్, ఈ–వే బిల్లులు, పారిశ్రామిక ఉత్పత్తి వంటి అంశాల్లో ప్రతికూల గణాంకాలు నమోదవుతున్నట్లు వివరించింది. అలాగే సరఫరాల సమస్యలూ తీవ్రమైనట్లు పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం పరిస్థితులు కొంత అదుపులో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా, అది మొదటివేవ్ అంత తీవ్రంగా లేదని విశ్లేషించింది. -
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి. డిజిటల్‌తో వినూత్న ప్రయోగాలు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్‌కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్‌వర్క్‌కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్‌తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు. శాఖల్లో ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం.. డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు. యాక్సిస్ ఏటా 400 శాఖలు.. వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి. 2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్‌వర్క్‌పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది. -
మార్చి తరువాతే పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీవో!
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) తన బీమా విభాగం పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటోంది. తనకున్న 30 శాతం వాటాల నుంచి 4 శాతం వాటాల విక్రయంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. 2016 నుంచీ పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీవోకు రావాలనుకుంటోంది. జాయింట్ వెంచర్ నుంచి అమెరికా కంపెనీ మెట్‌లైఫ్ పూర్తిగా బయటకు వెళ్లిపోవాలని భావిస్తుండడంతో ఐపీవో అనివార్యం కానుంది. 2001లో ముంబై కేంద్రంగా పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు కాగా, ఇందులో పీఎన్బీకి 30%, మెట్‌లైఫ్‌కు 26%, ఎల్ప్రోకు 21 శాతం, ఎం పల్లోంజి అండ్ కంపెనీకి 18%, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకుకు 5 శాతం చొప్పున వాటాలున్నాయి. ‘‘పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీవోతో సరైన సమయంలో మార్కెట్లోకి వస్తాం. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉంది. కనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తాం’’ అని పీఎన్బీ ఎండీ, సీఈవో సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. ఐపీవో సైజుపై ఆయన వివరాలేవీ చెప్పలేదు. సరైన ధరను గుర్తించేందుకు పీఎన్బీ మెట్‌లైఫ్ తన వాటాల నుంచి 4 శాతాన్ని విక్రయించే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉంది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో బ్యాంకుకున్న వాటాలను కొనుగోలు చేసేందుకు బిడ్లు వచ్చాయని, వీటిపై -
త్వరలో బ్యాంక్ ఈటీఎఫ్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్)ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లతో కూడిన బ్యాంక్ ఈటీఎఫ్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ బ్యాంక్ ఈటీఎఫ్‌లో చేర్చాల్సిన బ్యాంక్ షేర్లు, వాటి వెయిటేజీపై కసరత్తు చేస్తున్నామని ఆ అధికారి వివరించారు. బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ బ్యాంక్ ఈటీఎఫ్ మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ఒక్కో బ్యాంక్‌షేర్ పట్ల ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపకపోయినా, బ్యాంక్ షేర్లతో కూడిన ఈటీఎఫ్‌కు మంచి డిమాండ్ ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు. 20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం వాటాలు 63–83 శాతం రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే రెండు ఈటీఎఫ్‌లు... కేంద్రం ఇప్పటికే రెండు ఈటీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న రెండు ఈటీఎఫ్‌లు–సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్–22 ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనే లభించింది. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం 2017 నుంచి రూ.32,900 కోట్లు, సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా 2014 నుంచి రూ.28,500 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ రూ.53,558 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. -
రాయల్టీ చెల్లింపులు @రూ.7,100 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో 32 లిస్టెడ్ ఎంఎన్సీల చెల్లింపులు ఇవి న్యూఢిల్లీ: భారత్‌లో లిస్టైన దాదాపు 32 బహుళ జాతి కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం(2015–16)లో తమ మాతృ కంపెనీలకు రాయల్టీగా రూ.7,100 కోట్లు చెల్లించాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపులు(రూ.6,300 కోట్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికమని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఐఐఏఎస్ సంస్థ వెల్లడించింది. దీని ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో ఈ 32 కంపెనీల నికర అమ్మకాలు 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 32 బహుళజాతి కంపెనీలు రూ.7,100 కోట్లు రాయల్టీని చెల్లించగా, దీంట్లో కేవలం ఐదు ప్రముఖ కంపెనీలు(మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యునిలివర్, ఏబీబీ, నెస్లే ఇండియా, బాష్) చెల్లించిన రాయల్టీలు రూ.5,540 కోట్లు(78 శాతం) ఉండడం విశేషం. రాయల్టీల చెల్లింపుల వల్ల మార్జిన్లు 7% తగ్గుతున్నాయి. -
హిందుస్తాన్ జింక్ స్పెషల్ డివిడెండ్ 13,985 కోట్లు
రికార్డు తేదీ ఈ నెల 30 ⇒ ఈ ఏడాది మొత్తం 27,157 కోట్లు ⇒ ఏడాదిలో ఇంత భారీ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ ఇదే న్యూఢిల్లీ: వేదాంత గ్రూ ప్నకు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13,985 కోట్ల ప్రత్యేకమైన వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.27.50 (1,375 శాతం) చొప్పున ఈ డివిడెండ్‌ను చెల్లించాలని బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశం నిర్ణయించిందని హిందుస్తాన్ జింక్ పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్ తేదీగా ఈ నెల 30ని నిర్ణయించామని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది ఏప్రిల్‌లో గోల్డెన్ జూబ్లీ డివిడెండ్‌ను చెల్లించాం. తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించాం. ఇప్పుడు స్పెషల్ వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మేం చెల్లించే మొత్తం డివిడెండ్ రూ.27,157 కోట్లకు (డీడీటీ–డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకొని) చేరుతుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లించలేదు’’ అని వివరించారు. తమ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉన్నందున రూ.11,259 కోట్లు దక్కుతాయని పేర్కొన్నారు. 2002లో ఈ కంపెనీని ప్రభుత్వం విక్రయించిందని, అప్పటి నుంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకుంటే తాము రూ.37,517 కోట్ల డివిడెండ్‌ను చెల్లించామని తెలిపారు. ఈ కంపెనీ వెండి, జింక్, సీసం లోహాలను ఉత్పత్తి చేస్తోంది. -
మొండి బకాయిల సమస్య...బడా కార్పొరేట్లవల్లే!
ఎన్పీఏల పరిష్కారం అతిపెద్ద సవాలు ⇒ రంగాలవారీగా రికవరీకి చర్యలు ⇒ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడం పెద్ద సవాలుగా మారిందని.. ‘బడా కార్పొరేట్లే’ ఈ సమస్యకు మూలకారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల సమస్యను పరిష్కరించడం పెద్ద సవాలుగా మారింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక శాఖలో భాగమైన సంప్రదింపుల కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. మొండిబకాయిలు(ఎన్పీఏ) ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఎన్‌పీఏల్లో ముఖ్యంగా ఉక్కు, విద్యుత్, ఇన్ఫ్రా, టెక్స్టైల్ రంగాల సంస్థలే ఉన్నట్లు వివరించారు. ఉక్కు రంగం క్రమంగా రికవరీ బాట పట్టిందని.. ఇక ఇన్ఫ్రా, విద్యుత్, టెక్స్టైల్ రంగాల సమస్యల పరిష్కారానికి కూడా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. 2003–08 మధ్య బూమ్ నెలకొన్నప్పుడు కార్పొరేట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని విపరీతంగా పెంచేసుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, మందగమనం ధాటికి ఎదురు నిలవలేకపోయాయని జైట్లీ చెప్పారు. పరిష్కారానికి కమిటీలు..: భారీ రుణాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వివిధ రంగాలవారీగా తగు చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు. బ్యాంకులు తన వద్దకు పంపే కేసులను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా ఓవర్‌సైట్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని పనితీరు, వస్తున్న స్పందనను బట్టి ఇలాంటి కమిటీలు మరిన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఎన్పీఏల సమస్య పరిష్కారం కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఇటువంటి ప్రత్యామ్నాయాలు అనేకం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు. పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ (పారా) ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకెళ్లాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు సూచించారు. రంగాలవారీగా ప్రవేశపెట్టే సంస్కరణలు కూడా పనిచేయని ఎన్పీఏ కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే స్పెషల్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలన్నింటిని దానికి బదలాయించాలని సభ్యులు సూచించారు. పెరుగుతున్న ఎన్పీఏల ప్రతికూల ప్రభావాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకుల అధికారుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించే చర్యలు కూడా అవసరమని వివరించారు. తద్వారా వారు మళ్లీ సహేతుకమైన, వ్యాపారపరంగా ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగేలా తోడ్పాటు అందించాల్సి ఉందని సభ్యులు సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ వివరించారు. ఇప్పటికే దివాలా బోర్డును ఏర్పాటు చేసినట్లు, దేశీ ఉక్కు రంగాన్ని ఆదుకునేందుకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ)ని గతేడాది డిసెంబర్లో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. -
వచ్చేసారి లాభాలు అంతంతే!
⇒ రెండంకెల స్థాయిని దాటని ఆదాయ వృద్ధి ⇒ పెరిగే కమోడిటీ ధరలతో మార్జిన్లపై ఒత్తిడి ⇒ 2017–18లో దేశీ కార్పొరేట్లపై క్రిసిల్ నివేదిక ముంబై: అంచనాలకు తగ్గట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల లాభదాయకత 100 బేసిస్ పాయింట్లు పెరిగాక.. వచ్చేసారి (2017–18)లో మాత్రం వృద్ధి అంతంతమాత్రంగానే ఉండగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఇక ఆదాయాల వృద్ధి కూడా క్రమంగానే ఉండొచ్చని ఇండియా అవుట్‌లుక్ నివేదికలో తెలిపింది. సింగిల్ డిజిట్ ఆదాయ వృద్ధి రేటు ఇకపై సర్వసాధారణం కాగలదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఎనిమిది శాతం మేర పెరగవచ్చని వివరించింది. ఫలితంగా మరోసారి కార్పొరేట్లు రెండంకెల స్థాయి వృద్ధిని సాధించలేకపోవచ్చని తెలిపింది. పెరుగుతున్న కమోడిటీల ధరల కారణంగా ఆపరేటింగ్ మార్జిన్లపై ఒత్తిడి తప్పదని అంచనా వేసింది. అన్నీ అనుకూలిస్తే.. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ), టెలికం.. సిమెంట్ తదితర రంగాల్లో కన్సాలిడేషన్, తక్కువ వడ్డీ రేట్లు మొదలైనవి వృద్ధికి ఊతమిచ్చేందుకు తోడ్పడగలిగే సానుకూల అంశాలని క్రిసిల్ వివరించింది. జీడీపీకి డిమాండ్ ఊతం.. పెద్ద నోట్ల రద్దు కారణంగా తగ్గిన డిమాండ్ క్రమక్రమంగా మళ్లీ మెరుగుపడగలదని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఇది తోడ్పడగలదని క్రిసిల్ అంచనా వేసింది. దీంతో 2017 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉండే వృద్ధి రేటు 2018 ఆర్థిక సంవత్సరంలో పుంజుకుని 7.4 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. సాధారణ వర్షపాతం, ఓ మోస్తరు ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు మొదలైనవి కూడా జీడీపీ పెరుగుదలకు దోహదపడే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. అన్ని రంగాలకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ అమలు కీలకమని వివరించింది. ఇక విధానపరమైన చర్యలు, తీవ్రమైన పోటీ మొదలైనవి ఎదుర్కొంటున్న రంగాల్లో (టెలికం, సిమెంట్) కన్సాలిడేషన్ చోటు చేసుకోవడం కూడా సానుకూల పరిణామమేనని క్రిసిల్ తెలిపింది. ఆటోమొబైల్, ఐటీ కీలకం.. ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్ల సారథ్యంలో ఆటోమొబైల్ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు, నిర్మాణ రంగం (ముఖ్యంగా ఇన్ఫ్రా సంబంధమైన ప్రాజెక్టులు) వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాల వృద్ధికి కీలకంగా ఉంటాయని క్రిసిల్ తెలిపింది. అయితే, గడిచిన అయిదేళ్లతో పోలిస్తే సిమెంటు, ఉక్కు రంగాల్లో పెట్టుబడులు... రానున్న అయిదేళ్లలో తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. డీమోనిటైజేషన్ ప్రభావాలు తగ్గుతున్నప్పటికీ.. రియల్ ఎస్టేట్, సిమెంట్, ఉక్కు తదితర రంగాలపై ఒత్తిళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగవచ్చునని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఒకవైపు ధరలు మరోవైపు అమ్మక పరిమాణాల తగ్గుదలతో కుదేలవుతున్న సిమెంటు రంగం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే 2018–19 ఆర్థిక సంవత్సరం దాకా ఆగక తప్పదని వివరించింది. ఏడాది కిందట మెల్లిగా మొదలైన కమోడిటీ ధరల పెరుగుదల.. అంతిమంగా వాటిని వినియోగించే సంస్థల నిర్వహణ మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని క్రిసిల్ రీసెర్చ్ అనలిస్టులు అంచనా వేశారు. ప్రైవేట్ పెట్టుబడులు ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చని తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేసుకుని ఉండటం, డిమాండ్ మాత్రం అంతంతమాత్రంగానే పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా పెట్టుబడి ప్రణాళికలు 2018–19 ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడ్డారు. -
పరోక్ష పన్ను వసూళ్లలో 22% వృద్ధి
ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి 11% న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే) గడిచిన 11 నెలల్లో 22.2 శాతం వృద్ధిని సాధించాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్ల విషయంలో ఈ రేటు 11 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు ... ⇔ ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు మొత్తంగా రూ.13.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 బడ్జెట్ సవరించిన అంచనాల లక్ష్యం (రూ.16.99 లక్షల కోట్లు)లో ఇది 81.5 శాతం. ⇔ వేర్వేరుగా చూస్తే... ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) 11.9 శాతంవృద్ధి సాధించగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) విషయంలో ఈ వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంది. రిఫండ్స్‌ను భర్తీ చేసి, నికరంగా చూస్తే– ఈ శాతాలు వరుసగా 2.6 శాతం, 19.5 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో రిఫండ్స్ రూ. 1.48 లక్షల కోట్లు. వార్షికంగా 40.2 శాతం పెరుగుదల రిఫండ్స్ విషయంలో నమోదయ్యింది. ⇔ కాగా, పరోక్ష పన్ను వసూళ్లు రూ.7.72 లక్షల కోట్లు. తయారీ రంగం క్రియాశీలతకు సూచికయిన ఎక్సైజ్ సుంకాల వసూళ్లు 36.2 శాతం వృద్ధితో రూ.3.45 లక్షల కోట్లకు చేరాయి. సేవల విభాగం పన్ను వసూళ్లు కూడా భారీగా 20.8 శాతం పెరిగి రూ.2.21 లక్షలకు ఎగశాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు 5.2 శాతం వృద్ధితో రూ.2.05 లక్షల కోట్లకు ఎగశాయి. -
హెచ్‌యూఎల్ లాభం 1,038 కోట్లు
క్యూ3లో 7 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,038 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.972 కోట్లు)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. అసాధారణ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.80 కోట్ల అసాధారణ వ్యయాలు ఉండగా, ఈ క్యూ3లో రూ.153 కోట్ల అసాధారణ ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం ఆదాయం రూ.8,385 కోట్ల నుంచి 0.8% క్షీణించి రూ.8,318 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. హోమ్ సెగ్మెంట్ రాబడులు 1 శాతం వృద్ధితో రూ.2,689 కోట్లకు, రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్ రాబడి స్వల్పంగా పెరిగి రూ.279 కోట్లకు, ఆహార పదార్థాల విభాగం రాబడి 8 శాతం వృద్ధితో రూ.1,164 కోట్లకు పెరిగాయని హరీశ్ చెప్పారు. వ్యక్తిగత ఉత్పత్తుల ఆదాయం 3 శాతం తగ్గి రూ.3,980 కోట్లకు, ఎగుమతులు, నీరు. ఇన్ఫాంట్ కేర్ వ్యాపారాల రాబడులు 27% తగ్గి రూ.195 కోట్లకు తగ్గాయని వివరించారు. మార్జిన్ల మెరుగుదలపై దృష్టి.. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దెబ్బతీసిందని హరీశ్ మన్వాని పేర్కొన్నారు. అయితే తాము ఈ ప్రభావాన్ని తట్టుకోగలిగామని వివరించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని, మార్జిన్ల మెరుగుదలపై దృష్టిని కొనసాగిస్తున్నామని చెప్పారు. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ స్వల్పంగా తగ్గి రూ.863 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
ఈ ఏడాది వృద్ధి 6.5 శాతమే..!
• నోట్ల రద్దుతో జీడీపీపై తీవ్ర ప్రభావం • మరింతగా వడ్డీ రేట్ల కోతకు అవకాశం • డారుుష్ బ్యాంక్ అంచనా న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాతం స్థారుులోనే ఉండవచ్చని డారుుష్ బ్యాంక్ ఒక నివేదికలో అంచనా వేసింది. మరోవైపు, ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున, పాలసీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి క్రమంగా కోలుకుని 7.5 శాతం స్థారుుకి చేరవచ్చని వివరించింది. రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు నేపథ్యంలో డారుుష్ బ్యాంక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సమీప భవిష్యత్‌లో ఆర్థిక వృద్ధి ఒక మోస్తరు స్థారుులోనే ఉండొచ్చని, ప్రభుత్వం ప్రకటించిన తాత్కాలిక డీమానిటైజేషన్ కారణంగా ప్రస్తుత క్వార్టర్లో, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడగలదని డారుుష్ బ్యాంక్ తెలిపింది. నివేదిక ప్రకారం అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో మందగమన ప్రభావాలను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ప్రజోపయోగ కార్యక్రమాలపై వ్యయం చేయడం మరింతగా పెంచే అవకాశం ఉంది. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఉదార ఆర్థిక విధానాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించవచ్చని నివేదిక పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేట్ వినియోగం కోలుకోవచ్చని తెలిపింది. ఈ చర్యల ఊతంతో 2017-18లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5% స్థారుులో ఉండగలదని వివరించింది. 5 శాతం దిగువనే ద్రవ్యోల్బణం వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 5% కన్నా దిగువనే కొనసాగవచ్చని, తద్వారా వడ్డీ రేట్ల కోతకు కొంత ఆస్కారం ఉండగలదని డారుుష్ బ్యాంక్ తెలిపింది. వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాల దరిమిలా డిసెంబర్ 7న జరిగే పాలసీ సమీక్ష సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పారుుంట్లు, వచ్చే ఏడాది అదనంగా మరో 50 బేసిస్ పారుుంట్ల మేర తగ్గించవచ్చని పేర్కొంది. ‘25 బేసిస్ పారుుంట్ల చొప్పున ఫిబ్రవరిలో (బడ్జెట్ తర్వాత) ఒకసారి, ఏప్రిల్‌లో (వార్షిక పాలసీ సమీక్షలో) మరోసారి ఆర్బీఐ రేట్లు తగ్గించవచ్చు’ అని డారుుష్ బ్యాంక్ వివరించింది. స్వల్పకాలికంగా ప్రతికూలం: ఫిచ్ నోట్ల రద్దు పరిణామం.. స్వల్పకాలికంగా భారత్ వృద్ధిపై కాస్త ఎక్కువగానే ప్రతికూల ప్రభావం చూపినా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఒక మోస్తరుగానే ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స పేర్కొంది. మధ్యకాలికంగా మాత్రం భారత్ జీడీపీ వృద్ధి చైనాను మించి నమోదు కాగలదని వివరించింది. సంస్కరణలు, పాలసీ రేట్ల తగ్గుదల తదితర అంశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింతగా పుంజుకోగలదని ఫిచ్ తెలిపింది. నగదు కొరత కారణంగా వినియోగం, పెట్టుబడుల రాకకు కొంత జాప్యం జరగవచ్చని, ఉత్పాదకత కాస్త తగ్గడం, సరఫరాపరమైన సమస్యలు తలెత్తడం, రైతులు పంటలకు అవసరమైన ముడివస్తువులు కొనుగోలు చేయలేకపోవడం మొదలైన తాత్కాలిక పరిణామాలు చోటుచేసుకోవచ్చని పేర్కొంది. ఇక డీమానిటైజేషన్ వల్ల చేకూరే లబ్ధిని ప్రస్తావిస్తూ.. మరింత ఆదాయాలతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగలవని ఫిచ్ వివరించింది. -
30 వేల కోట్లకు ఎం-వాలెట్ మార్కెట్!
అసోచామ్ నివేదిక బెంగళూరు: దేశీ ఎం-వాలెట్ మార్కెట్ 141 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో 2022 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి స్మార్ట్ఫోన్స వినియోగం పెరుగుదల, మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తి, ఈ-కామర్స్ రంగ జోరు, ఆదాయం వృద్ధి వంటి పలు అంశాలు కారణంగా నిలువనున్నారుు. పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్ సంస్థ ఆర్‌ఎన్‌సీవోఎస్ సం యుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యారుు. నివేదికలోని ముఖ్యాంశాలివీ... ⇔ 2015-16లో ఎం-వాలెట్ మార్కెట్ దాదాపు రూ.154 కోట్లుగా ఉంది. ⇔ దేశంలో ఎం-వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల మార్కెట్ విలువ 2015-16 నుంచి 2021-22 నాటికి 154 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో రూ.20,600 కోట్ల నుంచి రూ.55 లక్షల కోట్లకు చేరుతుంది. ⇔ ఎం-వాలెట్ మార్కెట్లో మనీ ట్రాన్సఫర్ (వాలెట్-వాలెట్/వాలెట్-బ్యాంక్/బ్యాంక్-వాలెట్) 38% వాటాను.. మొబైల్, డీటీహెచ్, కరెంట్ వం టి బిల్లులు చెల్లింపులు 31% వాటాను.. ఆన్లైన్ షాపింగ్ 31% వాటాను ఆక్రమించారుు. ⇔ 2015-16లో మొబైల్ పేమెం ట్స్‌లో 21 శాతంగా ఉన్న ఎం-వాలెట్ సర్వీసుల వాటా 2021-22 నాటికి 79%కి పెరుగుతుంది. ⇔ ఆర్బీఐ లెసైన్సింగ్ నిబంధనలు ఎం-వాలెట్ వృద్ధికి సహకరించేలా లేవు. వీటిని సవరించాలి. ⇔ అలాగే చాలా మంది యూజర్లు వైరస్, హ్యాకింగ్ వంటి పలు అంశాల పట్ల ఆందోళనతో ఉన్నారు. ఇది ఎం-వాలెట్ మార్కెట్ వృద్ధికి విఘాతం కలిగిస్తోంది. కంపెనీలు మంచి వృద్ధిని నమోదుచేయాలంటే ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. -
ఈసారి రూ. 260 కోట్ల పెట్టుబడులు
నాట్కో ఫార్మా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కార్యకలాపాలపై దాదాపు రూ. 260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇప్పటికే ప్రథమార్ధంలో సుమారు రూ. 111 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ వీసీ రాజీవ్ నన్నపనేని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరికొన్ని ఔషధాలకు సంబంధించి 6-7 దరఖాస్తులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే సుమారు నాలుగు ఔషధాల కోసం దరఖాస్తులు చేసినట్లు పేర్కొన్నారు. వైజాగ్‌లో ఫార్ములేషన్‌స ప్లాంటు వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రాగలదని భావిస్తున్నామని, ఆ తర్వాత ఫైలింగ్‌స సంఖ్య ఏటా 10కి పైగా పెరగవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 30-40 కోట్లుగా ఉన్న హెపటైటిస్ సీ చికిత్స ఔషధ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 100 కోట్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. వియత్నాం, ఇండొనేషియాలో విక్రయాలకు సంబంధించి ఆయా దేశాల నుంచి వచ్చే ఏడాది అనుమతులు లభించగలవని తెలిపారు. డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు వచ్చే నెలలో కూడా కొనసాగిన పక్షంలో దేశీయంగా అమ్మకాలపై కొంత మేర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రాజీవ్ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నాట్కో ఫార్మా ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 243 కోట్ల నుంచి రూ. 467 కోట్లకు, లాభం రూ. 30 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎగుమతులు... రెండో నెలా పెరిగాయ్
• అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి; 23.5 బిలియన్ డాలర్లు • వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించారుు. వార్షికంగా చూస్తే... అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి నమోదరుు్యంది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమరుు్యంది. ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదరుున సంగతి తెలిసిందే. మంగళవారం అక్టోబర్ నెలకు సంబంధించి అధికారిక లెక్కలు విడుదలయ్యారుు. వార్షికంగా వివిధ రంగాల తీరు... ⇔ ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి 13.86 శాతం నమోదరుు్యంది. ⇔ రత్నాలు, ఆభరణాల విభాగంలో ఎగుమతుల వృద్ధి 21.84 శాతం. ⇔ పెట్రోలియం విషయంలో ఇది 7.24 శాతంగా ఉంది. ⇔ రసాయనాల ఎగుమతుల వృద్ధి 6.65 శాతం. ⇔ దిగుమతులు 8.11 శాతం వృద్ధి... ఇక అక్టోబర్‌లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదరుు్యంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతి-దిగుమతి విలువ మధ్య వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లుగా నమోదరుు్యంది. చమురు దిగుమతులు అక్టోబర్‌లో 3.98% పెరిగి 7.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యారుు. చమురుయేతర దిగుమతుల విలువ 9.28 శాతం ఎగసి 26.53 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడు నెలల్లో...: కాగా ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) గత ఏడాది ఇదే కాలంతో చూస్తే... ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా -0.17 శాతం క్షీణించారుు. విలువ 155 బిలియన్ డాలర్లుగా నమోదరుు్యంది. దిగుమతులు కూడా -11 శాతం పడిపోయారుు. వీటి విలువ 208 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 53.16 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశ ఎగుమతుల ధోరణి ఇదీ... 2014 డిసెంబర్ నుంచి 2016 మే వరకూ వరుసగా 18 నెలలు భారత్ ఎగుమతులు క్షీణిస్తూ వచ్చారుు. బలహీన గ్లోబల్ డిమాండ్, చమురు దిగుమతుల పతనం దీనికి కారణం. అరుుతే ఈ ఏడాది జూన్ నెలలో వృద్ధి కనబడినా... మరుసటి రెండు నెలలూ జూలై-ఆగస్టుల్లో ఎగుమతులు మళ్లీ క్షీణతలో పడ్డారుు. తిరిగి గడచిన రెండు నెలలో వృద్ధిలోకి మారారుు. -
దివీస్ ల్యాబ్స్ లాభం రూ. 224 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ ది వీస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రై మాసికంలో రూ. 1,005 కోట్ల ఆదాయంపై రూ. 224 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ ఆదాయం రూ. 972 కోట్లు కాగా రూ. 297 కోట్లు. సంస్థ ఏర్పాటు చేసి పాతికేళ్లు పూర్తరుున సందర్భంగా తాజా క్యూ2లో ఉద్యోగులు, డెరైక్టర్లకు రూ. 79 కోట్లు వన్ టైమ్ ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు దివీస్ ల్యాబ్స్ పేర్కొంది. ఫారెక్స్ పరంగా రూ. 11 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వివరించింది. -
పసిడి దిగుమతులు డౌన్
♦ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 55% తగ్గాయ్.. ♦ క్యాడ్ కట్టడికి దోహదం న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2016-17, ఏప్రిల్-సెప్టెంబర్) ఏకంగా 55 శాతం పడిపోయారుు. 7.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యారుు. ఇది కరెంట్ అకౌంట్ లోటుకు (క్యాడ్- ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) సానుకూల అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నారుు. 2015 ఇదే కాలంలో పసిడి దిగుమతుల విలువ 17.42 బిలియన్ డాలర్లు. ఒక్క సెప్టెంబర్‌లో చూస్తే, దిగుమతులు 10.3 శాతం పడిపోరుు, 1.8 బిలియన్ డాలర్లుగా నమోదరుునట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపారుు. 2015 సెప్టెంబర్‌లో క్యాడ్ 10.16 బిలియన్ డాలర్లుగా ఉందని, సెప్టెంబర్‌లో ఇది 8.33 శాతానికి పడిపోరుుందని పేర్కొన్న అత్యున్నత స్థారుు వర్గాలు, పసిడి దిగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపారుు. 2014-15 పూర్తి సంవత్సరంలో క్యాడ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3 శాతం (26.8 బిలియన్ డాలర్లు). 2015-16లో ఇది 1.1 శాతానికి (22.1 బిలియన్ డాలర్లు) పడిపోరుుంది. పసిడి దిగుమతులకు సంబంధించి ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2015-16లో దేశం 650 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది. వెండి కూడా...: గణాంకాల ప్రకారం వెండి దిగుమతులు కూడా భారీగా పడిపోయారుు. 2015 సెప్టెంబర్ నెలతో పోల్చితే 2016 సెప్టెంబర్‌లో 71 శాతం పడిపోరుు, 484.74 మిలియన్ డాలర్ల నుంచి 139.16 మిలియన్ డాలర్లకు చేరారుు. -
మరో 8 విమానాల కొనుగోలు: స్పైస్‌జెట్
• హైదరాబాద్ నుంచి మరిన్ని • చిన్న పట్టణాలకు సేవలపై దృష్టి • కంపెనీ సీఎండీ అజయ్ సింగ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కొత్తగా మరో ఎనిమిది దాకా విమానాలు సమకూర్చుకోనున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. వీటిలో మూడు బంబార్డియర్, నాలుగైదు బోయింగ్ విమానాలు ఉండగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 43 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. నిత్యం 320 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతున్నామని అజయ్ సింగ్ వివరించారు. రోజువారీ ఫ్లయిట్స్ సంఖ్యను 10 శాతం మేర పెంచుకోనున్నట్లు తెలిపారు. శుక్రవారమిక్కడ యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఓ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు అందించే విషయంలో తాము ముందుంటున్నామన్నారు. కొత్తగా హైదరాబాద్ నుంచి కాలికట్, భువనేశ్వర్, నాగ్‌పూర్ మొదలైన ప్రాంతాలకూ సర్వీసులు ప్రారంభించే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఆరు దేశాలకు సర్వీసులు నడుపుతున్నామని, మరికొన్ని వారాల్లో కొత్తగా మరో రెండు, మూడు ప్రాంతాలకు కూడా సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కొత్తగా మరిన్ని విమానాలు కొనుగోలు చేసే దిశగా ఎయిర్‌బస్, బోయింగ్‌లతో చర్చలు జరుగుతున్నాయని, దాదాపు నెల రోజుల వ్యవధిలో తుది నిర్ణయం తీసుకోగలమని అజయ్ సింగ్ చెప్పారు. ఈ ఆర్డరు సుమారు వందకి పైగా విమానాలకు ఉండవచ్చని ఆయన సూచనప్రాయంగా పేర్కొన్నారు. చౌక చార్జీలే ఊతం..: దేశ జనాభాలో ప్రస్తుతం 2.5 శాతం మంది మాత్రమే విమానసేవలు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఈ రంగంలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని అజయ్ సింగ్ చెప్పారు. ఈ ఏడాది విమాన టికెట్ల చార్జీలు సగటున 15-20% మేర తగ్గాయన్నారు. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 400 విమానాశ్రయాలు ఉండగా.. వీటిలో 80 మాత్రమే పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నాయని.. మిగతావీ అందుబాటులోకొస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
వచ్చే ఏడాది మెరుగ్గా అమ్మకాలు
♦ 7.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తి ♦ వైజాగ్ స్టీల్ సీఎండీ మధుసూదన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గణనీయంగా క్షీణించిన ఉక్కు ధరలు స్థిరపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అమ్మకాలు కొంత మెరుగవుతాయని, 2017-18లో మరింత పుంజుకుంటాయని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) సీఎండీ పి.మధుసూదన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,450 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారాయన. వైజాగ్ స్టీల్ గత ఆర్థిక సంవత్సరం రూ.1,421 కోట్ల నష్టం నమోదు చేసింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ప్రకటించేందుకు శనివారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయాలు చెప్పారు. ‘చైనా దిగుమతుల ప్రభావం గతేడాది ద్వితీయార్థంలో చాలా పడింది. అయితే, కనీస దిగుమతి ధర నిబంధనలతో దిగుమతులు సుమారు 30 % మేర తగ్గాయి. మేం అంతర్గత వ్య యాలు తగ్గించుకుని నిర్వహణ సామర్ధ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యం 6.3 మిలియన్ టన్నుల మేర ఉండగా.. ప్లాంటు ఆధునికీకరణతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 మిలియన్ టన్నులకు చేరగలదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్, స్మార్ట్ సిటీలు వంటి ప్రాజెక్టులతో ఉక్కుకు మరింత డిమాండ్పెరుగుతుందన్నారు. విజయవాడ, అమరావ తి మొదలైన చోట్ల నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సమీపంగా ఉన్నందున వ్యాపార అవకాశాల రీత్యా తమకు లాభించగలదని చెప్పారు. జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా యూపీలో రాయ్‌బరేలీలో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మధుసూదన్ వివరించారు. 2018 సెప్టెంబర్ నాటికి ఇది అందుబాటులోకి రాగలదని చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్‌గా పీవీ సింధు .. ఈ కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా సింధును ప్రకటించారు. -
వృద్ధి 7.8 శాతం: ఫిక్కీ సర్వే
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.8 శాతంగా నమోదవుతుందని ఆర్థికవేత్తలతో ఫిక్కీ నిర్వహించిన ఒక సర్వే పేర్కొంది. తగిన వర్షపాతం అంచనాలే దీనికి కారణమని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగం తగిన ఫలితాలు ఇవ్వడం వల్ల పారిశ్రామికవృద్ధీ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాలకు చెందిన వివిధ ప్రముఖుల అభిప్రాయాల ప్రాతిపదికన జూలై-ఆగస్టుల్లో ఫీక్కీ ఈ సర్వేను రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.6 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనావేస్తోంది. డిపాజిట్ల వృద్ధి రేటు 53 సంవత్సరాల కనిష్ట స్థాయి 9.9 శాతం వద్ద ఉండడం చూస్తుంటే.. ఈ రేట్లు తగ్గించడానికి బ్యాంకింగ్ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. -
జియోకి 4 కోట్ల యూజర్లు!
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ముంబై: రిలయన్స్ జియో సబ్స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. 2017-18లో జియో వల్ల రియలన్స్ ఇండస్ట్రీస్‌కు 2 బిలియన్ డాలర్లమేర ఆదాయం లభిస్తుందని అభిప్రాయపడింది. ఇది డేటా విభాగంలో 19 శాతం, వాయిస్ విభాగంలో 2 శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా వేసింది. ఒక యూజర్ నుంచి సగటున రూ.300 ఆదాయం పొందుతుందని తెలిపింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోకి 21 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేసింది. -
భారత్ వృద్ధి 7.9 శాతం: గోల్డ్ మన్ శాక్స్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.9% నమోదవుతుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- గోల్డ్‌మన్ శాక్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. తగిన వర్షపాతం, వేతనాల పెంపు, కీలక సంస్కరణలు, ఎఫ్‌డీఐలు వంటి అంశాలు తమ అంచనాకు కారణంగా తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7.9% వృద్ధి నమోదయినప్పటికీ, జూన్ త్రైమాసికంలో ఇది 7.8%కి తగ్గే అవకాశం ఉందని వివరించింది. జీఎస్టీ బిల్లు ఆమోదంసహా గడచిన రెండు నెలలుగా దేశంలో ఆర్థిక సంస్కరణల వేగం పుంజుకుంటోందని పేర్కొంది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు అవకాశాలు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన ప్రభావం, చైనా వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలనూ దేశీ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలుగా పేర్కొంది. -
రూ.వెయ్యి కోట్ల జీఎంవీ సాధిస్తాం
క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పోర్టల్ ద్వారా రూ.1,000 కోట్ల మేర గ్రాస్ మర్చండైజ్ వాల్యూను (జీఎంవీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించే క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ వెల్లడించారు. మూడేళ్ల క్రితం పోర్టల్ ప్రారంభించినప్పట్నుంచీ జీఎంవీ పరంగా (ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువ) ఏటా దాదాపు 300 శాతం మేర వృద్ధి సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. క్యాష్‌బాక్, కూపన్ల విభాగంలో తమకు దాదాపు 60 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. ఆన్లైన్ షాపింగ్ సైట్లలో జరిగే అమ్మకాల్లో సుమారు 20-25% వ్యాపారం తమ తరహా అనుబంధ పోర్టల్స్ నుంచే ఉంటోందని స్వాతి వివరించారు. ప్రస్తుతం దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈకామర్స్ మార్కెట్ 2020 నాటికి దాదాపు 100 బిలియన్ డాలర్లకు పెరగగలదని, తదనుగుణంగా క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు అందించే సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా క్యాష్‌బాక్‌ల రూపంలో సుమారు రూ. 35 కోట్లు వినియోగదారులకు అందచేయగలిగామన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర వెయ్యి ఈకామర్స్ సైట్లు తమ ప్లాట్‌ఫాంపై ఉన్నట్లు స్వాతి చెప్పారు. విస్తరణపై దృష్టి రుతున్న ఆన్లైన్ షాపింగ్ ధోరణులను ప్రస్తావిస్తూ గతంలో సింహభాగం ఎలక్ట్రానిక్స్‌దే ఉండగా.. ప్రస్తుతం ఇది 50 శాతం మేర ఉంటుండగా, సుమారు పాతిక శాతం ఫ్యాషన్ల వాటా ఉంటోందని స్వాతి చెప్పారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, కలారి క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటి దాకా దాదాపు 5 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించినట్లు స్వాతి తెలిపారు. అటు బ్రిటన్‌లో పోరింగ్ పౌండ్స్ పేరిట క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పోర్టల్ నిర్వహిస్తున్న తాము త్వరలోనే సింగపూర్, ఆగ్నేయాసియా దేశాలకూ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం తమ పోర్టల్ ద్వారా అత్యధికంగా లావాదేవీలు జరిగే టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందని స్వాతి చెప్పారు. -
ఇన్ఫీ ‘గెడైన్స్’ షాక్!
ఈ ఏడాది ఆదాయవృద్ధి అంచనాల్లో కోత... ♦ డాలర్ గెడైన్స్ 13.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు... ♦ క్యూ1లో నికర లాభం 3,436 కోట్లు; 13 శాతం వృద్ధి ♦ ఆదాయం 17 శాతం అప్; రూ.16,782 కోట్లు షేరు 11 శాతం క్రాష్... బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డాలర్ల రూపంలో అంతక్రితం ఆదాయ వృద్ధి గెడైన్స్‌ను 11.5-13.5 శాతంగా పేర్కొనగా.. దీన్ని ఇప్పుడు 10.5-12 శాతానికి పరిమితం చేసింది. ప్రధానంగా కరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులను ఇందుకు కారణంగా పేర్కొంది. మరోపక్క, తొలి త్రైమాసిక ఫలితాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ పరిణామాల కారణంగా శుక్రవారం ఇంట్రాడేలో ఇన్ఫీషేరు 11 శాతం మేర క్రాష్ అయింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(2016-17, క్యూ1)లో ఇన్ఫీ రూ. 3,436 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,030 కోట్లతో పోలిస్తే 13.4 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం 16.9 శాతం వృద్ధితో రూ. 16,782 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 14,354 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో నికర లాభం 7.4 శాతం వృద్ధి చెంది 51.1 కోట్ల డాలర్లకు, ఆదాయం 10.9 శాతం వృద్ధితో 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. సీక్వెన్షియల్‌గా లాభం డౌన్... గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లో లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) ఇన్ఫీ లాభం క్యూ1లో 4.5 శాతం దిగజారింది. ఆదాయం కూడా రూ.16,550 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.4 శాతం మాత్రమే పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫోసిస్ రూ.3,447 కోట్ల నికర లాభాన్ని, రూ. 17,089 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, రూపాయి ప్రాతిపదికన చూస్తే... ఈ ఏడాది ఆదాయం వృద్ధి అంచనాలను ఇన్ఫీ స్వల్పంగా 13.7-15.21 శాతానికి(జూన్ 30 నాటి డాలరుతో రూపాయి మారకం విలువ 67.53 ప్రకారం) పెంచడం గమనార్హం. అంతక్రితం ఈ గెడైన్స్‌ను 12.7-14.7 శాతంగా(మార్చి 31 నాటి రూపాయి విలువ 66.26 ప్రకారం) పేర్కొంది. ‘ప్రపంచంలో ప్రధాన కరెన్సీ విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు తీవ్ర ప్రభావం చూపినప్పటికీ.. మేం అనుసరిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలు క్యూ1లో తోడ్పాటును అందించింది’ అని కంపెనీ సీఎఫ్ఓ ఎం.డి. రంగనాథ్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ క్యూ1లో ఇన్ఫోసిస్ కొత్తగా 34 కాంట్రాక్టులను దక్కించుకుంది. 10 కోట్ల డాలర్ల విభాగంలో 3 కాంట్రాక్టులు ఉన్నాయి. ⇒ జూన్ క్వార్టర్లో స్థూలంగా 13,268 మంది ఉద్యోగులను నియమించుకుంది. 10,262 మంది వలసపోవడంతో(అట్రిషన్) నికర నియామకాలు 3,006కు పరిమితమయ్యాయి. ⇒ మరోపక్క, క్యూ1లో అట్రిషన్ రేటు ఏకంగా 21%కి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో అట్రిషన్ రేటు 19.2% కాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో 17.3 శాతంగా నమోదైంది. ⇒ జూన్ చివరినాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.97 లక్షలకు చేరింది. ⇒ నిరుత్సాహకరమైన ఫలితాలు, గెడైన్స్ కోతతో కంపెనీ షేరు కుప్పకూలింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో ఒకానొక దశలో 11 శాతం మేర క్షీణించి రూ.1,052 కనిష్టాన్ని తాకింది. చివరకు 8.85 శాతం నష్టపోయి రూ.1,072 వద్ద స్థిరపడింది. ‘కన్సల్టింగ్ సేవలు, ప్యాకేజ్‌ల అమలుకు సంబంధించి క్లయింట్ల వ్యయంలో అనుకోని ప్రతికూలతలు క్యూ1లో అంచనాలకంటే వృద్ధి తగ్గడానికి కారణమైంది. మరోపక్క, గడిచిన త్రైమాసికాల్లో మేం దక్కించుకున్న భారీ కాంట్రాక్టుల అమలు మందకొడిగా సాగడం కూడా ప్రభావం చూపింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన(బ్రెగ్జిట్) ప్రభావాన్ని ఈ ఏడాది గెడైన్స్‌లో మేం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుత మార్కెట్‌పై మా సొంత అంచనాల మేరకు తాజా గెడైన్స్ ఇచ్చాం. ప్రధానంగా కన్సల్టింగ్‌లో క్లయింట్ల వ్యయాల్లో తగ్గుదల, ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగానే డాలర్ గెడైన్స్‌ను తగ్గించాం’. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ