game of thrones
-
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్‌బాట్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్‌బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్‌పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
ప్రపంచంలోనే అద్భుతమైన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టాప్‌లో ఉంటుంది. 2011-18 మధ్య దాదాపు ఎనిమిది సీజన్లు వస్తే అవన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీనికి ప్రీక్వెల్‌గా 'హౌస్ ఆఫ్ డ్రాగన్' పేరుతో మరో సిరీస్ తీస్తే అది కూడా హిట్ అయింది. 2022లో తొలి సీజన్ రిలీజ్ కాగా, త్వరలో రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేయగా, అది అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' రెండో సీజన్లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. జూన్ 16 నుంచి ఒక్కో వారం ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేయనున్నారు. హెచ్‌బీవో మ్యాక్స్, జియో సినిమా ఓటీటీల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే తొలి సీజన్ చూసిన ప్రేక్షకులు.. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా) -
ఇండస్ట్రీలో విషాదం.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రంలో కెవాన్ లన్నిస్టర్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బెన్ డేనియల్స్ ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.ఇయాన్ గెల్డర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పాటు సర్జ్, క్వీర్స్, షేక్స్పియర్ గ్లోబ్, హిజ్ డార్క్ మెటీరియల్స్. అండర్డాగ్ లాంటి చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కాగా.. ఇటీవలే టైటానిక్ నటుడు సైతం మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోటో షేర్ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా!
టి20 ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్ పోరు ముగిసింది. శనివారం(అక్టోబర్ 22న) నుంచి సూపర్-12 సమరం మొదలుకానుంది. క్వాలిఫయింగ్‌లో రౌండ్లో దుమ్మురేపిన నాలుగు జట్లు టాప్-8 టీమ్స్‌తో పోటీ పడనున్నాయి.ఇంత వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా సాగనుంది. సూపర్-12 సమరం పురస్కరించుకొని ఐసీసీ తన ట్విటర్లో ఒక ఫోటోను షేర్ చేసింది. పాపులర్ వెబ్ సిరీస్ ''గేమ్ ఆఫ్ త్రోన్స్(Game Of Thrones)'' ఫాలో అయిన వారికి మాత్రమే ఐసీసీ పెట్టిన ఫోటో అర్థమవుతుంది. ఆ ఫోటోలో గేమ్ ఆఫ్ త్రోన్స్‌లో హీరోగా పిలుచుకునే జాన్ స్నో(John Snow) ఫోటోను మార్ఫింగ్ చేసిన ఐసీసీ వేరొకరి ఫోటోను పెట్టింది. ఆపై ''టి20 వరల్డ్‌కప్ సూపర్-12 ఈజ్ కమింగ్..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ ప్రధానంగా కథ మొత్తం కింగ్స్ ల్యాండిగ్ ఉన్న ఐరన్ త్రోన్ కోసం జరిగే యుద్దాలతో పాటు.. వైట్ వాకర్స్(Night King)తో పోరు ప్రధానంగా సాగుతుంది. ఈ సిరీస్ మొత్తంలో ''వింటర్ ఈజ్ కమింగ్(Winter Is Comming)'' అనే డైలాగ్ చాలా ఫేమస్. ఈ సిరీస్‌లో మంచికి పేరుగా ఉండే హౌస్ ఆఫ్ స్టార్క్స్(House Of Starks) విజయం సాధిస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకొనే ఆ సిరీస్‌లో ఐరన్ త్రోన్ కోసం ఎలా అయితే పోటీ పడతారో.. అచ్చం సూపర్-12 ఉన్న 12 జట్లు టి20 ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్నట్లు సింబాలిక్‌గా ఐసీసీ ఈ ఫోటోను షేర్ చేసినట్లు తెలిసింది. అయితే ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కాగా ఐసీసీ ఫోటోపై అభిమానులు కామెంట్స్ చేశారు. కింగ్ కోహ్లి ఎక్కడ.. రోహిత్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఐసీసీ షేర్ చేసిన ఫోటో ట్రెండింగ్‌గా మారింది. The Super 12 stage of #T20WorldCup is coming! 🏆 pic.twitter.com/tKR4PhuDLD — ICC (@ICC) October 22, 2022 -
ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్, 2 సార్లు చావు అంచుల వరకు..
ప్రముఖ పాపులర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం 73 ఎపిసోడ్స్, 8 సీజన్లుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఎమీలియా క్లార్క్. దీని అనంతరం వచ్చిన స్టార్‌వార్స్ సినిమాలతో ఈ నటి మరింత క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్రిటిష్ బ్యూటీ నటించిన చిత్రం ‘ది సీగల్’. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తనకున్న ప్రాణాంతక వ్యాధి గురించి బయటపెట్టింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, దీనివల్ల రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లివచ్చానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా నేను బ్రెయిన్ అనూరిజం అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. బ్రెయిన్ అనూరిజం వల్ల మెదడుకి సరిగ రక్తం సరఫరా కాదు. దానివల్ల ఓ ప్రదేశంలో బ్లడ్ క్లాట్ అయ్యి పెలిపోయే ప్రమాదం ఉంది. నాలో ఈ వ్యాధి బయటపడగానే సర్జరీ చేయించుకున్నాను. తొలిసారి 2011లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2013లో మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చదవండి: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్ వీడియో వైరల్ అప్పుడు కొన్ని అత్యవసర చికిత్సలు తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. సరిగ్గా మాట్లాడడం కూడా కష్టమే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సర్జరీల వల్ల తన మెదడులోని సగ భాగం పనిచేయదని చెప్పంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇకపై నేను నా మెదడుని పూర్తిగా ఉపయోగించలేను. కానీ.. స్పష్టంగా మాట్లాడగలగడం నా అదృష్టం. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఆ కొద్ది మందిలో నేను ఉడడం అదృష్టంగా భావిస్తోన్న. మీ మెదడులోని ఏ భాగానికైన రక్తం అందకపోతే అది పనికిరాకుండా పోతుంది. ప్రవహించే దారిలో ఏదైనా అడ్డువస్తే రక్తం వెంటనే వేరే దారి చూసుకుంటుంది. దానివల్ల రక్తం అందని భాగం పనిచేయదు’ అని వివరిచింది. -
గుడ్ న్యూస్.. త్వరలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' 9వ సీజన్ !
గేమ్ ఆఫ్ థ్రోన్స్.. వరల్డ్‌వైడ్‌గా అత్యధిక పాపులారిటీ పొందిన టీవీ షో. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ షోకు అభిమానులు అనేకం. ఇందులోని నటినటుల యాక్టింగ్, పోరాట ఘట్టాలు, ఎమోషన్స్, రిలేషన్స్, విజువల్స్, డ్రాగెన్స్, వైట్ వాకర్స్ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే. హెచ్‌బీవో నిర్మించిన ఈ టీవీ షో 8 సీజన్లతో ముగించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. అందులోను సూపర్బ్‌గా అలరించిన 7 సీజన్లతో పోల్చుకుంటే 8వ సీజన్ ఫ్యాన్స్‌ను అసంతృప్తికి గురిచేసింది. దీంతో చాలా మంది హర్ట్ అయి.. తమకు సీక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్‌కు హెచ్‌బీవో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. డేనెరియస్ టార్గారియస్ (ఎమిలీ క్లార్క్)ను హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్) హత్య చేసిన తర్వాత వెస్టెరోస్ను వదిలి నార్త్ ఆఫ్ ది వాల్‌కు ప్రయాణంచడంతో 8వ సీజన్ ముగుస్తుంది. ఈ ముగింపు ప్రేక్షకులకు ఎవరికీ అంతగా రుచించలేదు. దీంతో తన అసలు పేరు ఏగాన్ చటార్గారియస్ అని తెలుసుకున్న జాన్ స్నో పాత్రతో సీక్వెల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా కిట్ హరింగ్టన్ను హెచ్‌బీవో సంస్థ సంపద్రించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై హెచ్‌బీవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు ఇదంతా నిజమై వచ్చే 9వ సీజన్లో డేనెరియస్ టార్గారియస్/మదర్ ఆఫ్ డ్రాగెన్ ప్రాణాలతో తిరిగి వస్తుందా? లేదా చూడాలి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ డ్రాగెన్ తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో టార్గారియన్లోని అంతర్యుద్ధం చుట్టూ కథ ఉంటుందట. సుమారు 200 ఏళ్ల కిందట సింహాసనం కోసం జరిగిన యుద్ధాలను, వైట్ వాకర్స్ ఆవిర్భావం తదితర అంశాలకను చూపించే అవకాశం ఉందని సమాచారం. -
నెట్టింట హాట్ టాపిక్‌గా అఖిల్ లుక్.. అక్కడి నుంచి కాపీ కొట్టారా ?
Akhil Agent Looks Have Copy Allegations: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అఖిల్. మంచు పర్వతాల్లో మొహం నిండా గాయాలతో ఉన్న ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ లుక్ కాపీ కొట్టారని చర్చ నడుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పర్వతాలు, గిరజాల జుట్టు, పోనీటైల్‌తో స్టైలిష్‌గా ఉన్న అఖిల్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లోని హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్)ను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సిరీస్‌లో తరహాలోనే 'ఏజెంట్' మూవీలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఊల్ కోట్ ధరించి కనిపిస్తున్నాడు. చిన్నపాటి మార్పు తప్ప ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే 'ఏజెంట్' చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. ఈ క్రమంలో మరో హాలీవుడ్ సిరీస్‌లోని హీరోను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ఇది కోఇన్స్డెంట్గా జరిగిందా, లేక కావాలని చేసిందా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కండలు పెంచిన అఖిల్‌కు కొంచెం కిట్ హరింగ్టన్ పోలికలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో టాక్ నడిచింది. చదవండి: ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
ఆ స్టార్ 'ఎలుగుబంటి' ఇకలేదు..
Bart The Bear 2 Is Dead In Utah: సినిమాల్లో అప్పుడప్పుడు అలరించే జంతువులపై చిన్న పిల్లలకు, పెద్దవారికి ఒకరకమైన ఇష్టం ఏర్పడుతుంది. తెలుగు చిత్రం 'సిసింద్రీ'లో కనపడే జంతువులు ప్రేక్షకులకు ఎంత నచ్చాయో అందరికీ తెలిసిందే. కీలక పాత్రల్లో నటించే ఈ యానిమల్స్ అంటే పిల్లలకు మహాసరదా. హాలీవుడ్లో అయితే ఏకంగా వాటినే హీరోలుగా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది ఆ ఎలుగుబంటి. తనదైన యాక్టింగ్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. అనేకమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఎలుగు ఇకలేదు. అనారోగ్య సమస్యలతో 'బార్ట్ ది బేర్ 2' మరణించింది. 2000 సంవత్సరంలో అలాస్కాలోని అడవుల్లో ఈ ఎలుగు చిన్న వయసులోనే అధికారులకు దొరికింది. వేటగాడికి బలైన తన తల్లిపక్కన ఉన్న ఈ చిన్న ఎలుగును తీసుకొచ్చి సంరంక్షించారు. దీంతోపాటు 'బార్ట్ ది బేర్ 2' సిస్టర్ ఎలుగు 'హనీ బంప్' కూడా ఉంది. 'బార్ట్ ది బేర్ 2' పెరిగాక అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. చిత్రాల్లోనే కాకుండా అనేక టీవీ షోలు, ప్రకటనల్లో తళుక్కుమంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షాధరణ పొందిన హాలీవుడ్ మెగా వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ (జీవోటీ)'తో ఎంతోమంది అభిమానులను కూడగట్టుకుంది. అంతకుముందు కూడా చాలా సినిమాల్లో నటించిందీ ఎలుగు. యాన్ అన్ఫినిష్డ్ లైన్, విత్ఔవుట్ ఏ ప్యాడిల్, డాక్టర్ డూ లిటిల్ 2, ఇంటూ ది గ్రిజ్లీ మేజ్, హార్స్ క్రేజీ టూ, ఇంటూ ది వెస్ట్, ఇంటూ ది వైల్డ్, ఈవాన్ ఆల్మైటీ, జూకీపర్, హేవ్ యూ హియర్డ్ అబౌట్ మోర్గాన్స్, పీట్స్ డ్రాగన్, వీ బాట్ ఏ జూ వంటి చిత్రాల్లో మెరిసింది. 'బార్ట్ ది బేర్ 2' మరణంపై జీవోటీలో దానితో యాక్షన్ సీన్ చేసిన గ్వైండాలీన్ క్రిస్టీ విచారం వ్యక్తం చేసింది. ఎలుగు ఆత్మకు శాంతి కలగాలని కోరింది. తన సినీ కెరీర్లో అత్యుత్తమ కో-స్టార్ అని తెలిపింది. షూటింగ్లో ఎలుగుని శాంతింపజేయడానికి అది నటించిన సినిమా ట్రైలర్లు, పాశ్చాత్య సంగీతాన్ని సెట్స్‌లో ప్లే చేస్తుండేవారని గుర్తు చేసుకుంది. దాంతో నటించిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని, జీవోటీలో బార్ట్‌తో ఫైట్ చేసిన ఫొటోను షేర్ చేసింది. 'బార్ట్ ది బేర్ 2' ఒక గొప్ప ఎలుగని, దాంతో ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నామని 'ది వైటల్ గ్రౌండ్ ఫౌండేషన్' తెలిపింది. ఎలుగు సంరక్షణ బాధ్యతలు చేపట్టిన ఈ సంస్థ యూటాలోని డేనియల్ క్రీక్ ఒడ్డున ప్రశాంతంగా బార్ట్ కన్నుమూసిందని వెల్లడించారు. -
కేబుల్ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు..
వాషింగ్టన్: అమెరికన్ సింగర్, గేయ రచయిత మార్లిన్ మాన్సన్ కొంతకాలంగా తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాజీ ప్రియురాలు, ‘గేమ్ ఆఫ్ థ్రోన్’ నటి ఎస్మే బియాంకో సైతం అతడిపై లైంగిక ఆరోపణలు చేశారు. మార్లిన్తో కలిసి ఉన్న సమయంలో తనను చిత్రహింసలకు గురిచాశాడని, అవి తనకు చీకటి రోజులుగా చెప్పారు. అంతేగాక తనతో పాటు ఎంతో మంది మహిళలను కూడా మాన్సన్ లైంగికంగా వేధించించాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బియాంకో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫాంటస్మాగోరి’ థ్రిల్లర్ మూవీ సమయంలో తన మాజీ భర్త, డ్యాన్సర్ డిటా వాస్ టీసే ద్వారా మార్లిన్‌ను మొదటిసారి కలిశానని చెప్పారు. ‘2007లో నేను, వాస్ టీస్‌తో విడిపోయాక. మార్లిన్ నాకు మధ్య సన్నిహితం పెరిగింది. ఈ క్రమంలో 2009 ‘ఐ వాంట్ టూ కిల్ యు లైక్ దే ఇస్ ది మూవీస్’ అనే ఆల్బంలోని ఓ పాటలో నన్ను నటించాలని మాన్సన్ కోరాడు. అయితే ఈ సాంగ్‌లో ఓ సైకో ప్రియుడి చేత కిడ్నాప్ చేయబడిన బాధిత ప్రియురాలిగా నటించాలని చెప్పాడు. అది నిజమైప నటననే నమ్మాను. కానీ మాన్సన్ షూటింగ్ పేరుతో నిజంగానే నన్ను ఓ రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఆ సమయంలో అతడు కేబుల్ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు. అంతేగాక లైంగిక దాడికి పాల్పడుతూ ఎలక్ట్రిక్ సెక్స్ బోమ్మను ఉపయోగించాడు. ఇక మూడు రోజుల షూట్లో కేవలం నేను లోదుస్తులపైనే ఉన్నాను. ఆ సమయంలో మాన్సన్ నాకు ఆహారం కూడా ఇవ్వకుండా కేవలం కోకైన్ మాత్రమే ఇచ్చేవాడు’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక మాన్సన్‌తో డేటింగ్ సమయంలో తను ఒక ఖైదీలా ఉన్నానని పేర్కొన్నారు. ‘నేను పడుకునే సమయం, నా ఆహరపు ఆలవాట్లు, ధరించే దుస్తులు, చివరకు నేను ఎవరితో మాట్లాడాలో కూడా అతడే నిర్ణయించేవాడు. ఇక శృంగారం సమయంలో మాన్సన్ నన్ను కోరికేసి, శరీరాన్ని గాయపరిచేవాడు ఇప్పటికి ఆ గాయాలు ఉన్నాయి’ అంటూ చికటీ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక మాన్సన్‌తో విడిపోయాక కూడా తను క్షణం క్షణం భయంతో గడిపేదాన్ని, తన మాజీ భర్త కూడా ఆ సమయంలో నాతో ఆసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొన్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్’ మూవీ సమయంలో నా మానసిక పరిస్థితి బాగా లేదని, ఆ తర్వాత నాకు సినిమాల అవకాశాలు దొరకలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మార్లిన్ మాన్సస్ మాత్రం బియాంకో ఆరోపణలను కొట్టిపారేశాడు. (చదవండి: నాలుగేళ్ల సంపాదనతో ఈ డైమండ్ కొన్నాను: ర్యాపర్) (20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి.. కామెడీ రోల్లో షాలిని!) -
ఆ సూపర్ హీరో ఆకలి కష్టాలు తెలుసా?
న్యూయార్క్ : జాసన్ మొమోవా అంటే గుర్తురాకపోవచ్చు గానీ, ఆక్వామ్యాన్ అంటే మటుకు టక్కున గుర్తుపడతాం. ఆక్వామ్యాన్ సినిమా తర్వాత జాసన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారనటంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ హీరో అవతారమెత్తిన తర్వాత బాగానే సంపాదించారు కూడా. అయితే తను నటించిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టీవీ సిరీస్ అయిపోయిన తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ( బిగ్‌బాస్: దీపావళికి హోస్ట్ ఎవరంటే? ) ‘‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయిపోయిన తర్వాత నాకు పని లేదు. దీంతో మేము(కుటుంబం) తినడానికి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇద్దరు పిల్లలు, పీకల దాకా అప్పులు ఉన్నప్పుడు బ్రతుకు సాగించటం ఓ ఛాలెంజ్’’ అని చెప్పుకొచ్చారు. జాసన్ చాలా కాలం నుంచి కాలిఫోర్నియాలోని తన సొంత ఇంట్లో భార్య, నటి లీసా బోనెట్.. ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఖాల్ డ్రోగో పాత్రను చేశారాయన. 11 ఎపిసోడ్ల ఈ టీవీ సిరీస్‌కు 2012లో శుభం కార్డు పడింది. ( ‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ ) -
ఆయన కనిపిస్తే సెల్ఫీలు కోసం వెంటపడతారు
-
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కోసం ఆత్రుతగా ఉన్నా: స్మృతి ఇరానీ
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా.. పరిపాలన,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా స్మృతి ఇరానీ మాత్రం తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా ట్రెండింగ్ విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. వ్యంగ్యాస్త్రాలతోపాటు, ఫన్నీ పోస్ట్‌లతో తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు అలరిస్తారు. అయితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కి 300 ఏళ్ల ముందు ప్రీక్వెల్ సెట్ చేసి గ్రీన్ లైటింగ్ చేస్తున్నట్టుగా హెచ్‌బీఓ ప్రకటించింది. అయితే దీనిపై స్పందించిన స్మృతి.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానుల్లో తాను ఒకరినని పేర్కొన్నారు. అందులో జోన్ స్నో నటించిన ఒక సన్నివేశానికి సంబంధించిన మీమ్‌ను తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ జోన్ స్నోకు ఎవరైనా చెప్పారా? గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి ప్రీక్వెల్ చేస్తున్నారని, అతని ముఖం సంతోషంతో నృత్యం చేస్తున్నట్టు ఉంది’ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల దీపావళి రోజు తిన్న మిఠాయిలు, తాను రోజు తీసుకునే ఆహారం.. వాటి మధ్య తేడాలు గమనించుకొని ఒకరినొకరు చూసి నవ్వుకున్నట్టు ఉన్న మీమ్‌ను పెట్టడంతో అది కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. -
32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'
లాస్ ఎంజిల్స్ : ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్ సిరీస్‌లలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకటి. ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఎమ్మి అవార్డ్స్‌లో ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ ఎనిమిదో సీజన్ రికార్డుస్థాయిలో 32 నామినేషన్లను సంపాదించింది. ‘ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ’లో ఇదే చివరి సిరీస్. ఇక, దీంతోపాటు న్యూక్లియర్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన 'చెర్నోబిల్ '19, 'సాటర్డే నైట్ లైవ్' 18 నామినేషన్లు సాధించాయి. కామెడీ సిరీస్ విభాగంలో అమెరికన్ పిరియాడికల్ డ్రామా 'మార్వలస్ మిసెస్ మెయిసిల్' 20 నామినేషన్లతో తన సత్తా చాటింది. వ్యక్తిగత అవార్డ్స్ విషయానికొస్తే.. ఎమ్మీ ఉత్తమ నటి విభాగంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ ఎమిలియా క్లార్క్, 'కిల్లింగ్ ఈవ్' ఫేమ్ సండ్రా ఓ, 'హౌ టు గెట్ అవే విత్ మర్డర్'లో నటించిన విలోవా డేవిస్‌లు పోటీ పడుతున్నారు. 71వ ఎమ్మి అవార్డ్స్ వేడుకలు సెప్టెంబర్ 22న ఫాక్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీనికి సంబందించి ఇంతవరకు హోస్ట్‌ను మాత్రం ప్రకటించలేదు. 1994లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'ఎన్‌వైపీడీ బ్లూ' అప్పట్లోనే రికార్డుస్థాయిలో 27 నామినేషన్లు దక్కించుకుంది. తాజాగా ఆ రికార్డును గేమ్ ఆఫ్ థ్రోన్స్ చెరిపేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎమ్మి అవార్డ్స్‌లో తన ఆధిక్యతను నిలబెట్టుకొని వరుసగా నాలుగోసారి ట్రోఫీని సాధిస్తే గత 25 సంవత్సారాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్ డ్రామాలైన హిల్ స్ట్రీట్ బ్లూస్, ఎల్ఏ లా, ది వెస్ట్ వింగ్, మ్యాడ్‌మెన్ సరసన చోటు సంపాదించనుంది. -
బావగారి పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి!
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి సోఫియా టర్నర్- హాలీవుడ్ సింగర్ జో జోనస్‌ల వివాహం కొద్ది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. లాస్వేగాస్లో ఎల్విస్ ఇమ్పెర్సొనేటర్(ప్రఖ్యాత సింగర్ ఎల్విస్ ప్రెస్లీకి నివాళిగా పాటలు పాడే వ్యక్తి) సమయంలో వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుక అనంతరం జరిగిన ఈ సంప్రదాయేతర వివాహంలో జోనస్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తన భర్త నిక్ జోనస్‌తో బావగారి పెళ్లిలో సందడి చేశారు. వివాహ సమయంలో తోడి కోడలు డేనియల్ జోనస్‌తో కలిసి సోఫీ టర్నర్‌కు దగ్గరగా కూర్చున్న ప్రియాంక.. పెళ్లైన వెంటనే సోఫీని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇక కొత్త పెళ్లి కూతురు సోఫీ పూల బొకే కోసం వెతుకుతుండగా ఆమెకు సహాయం చేసేందుకు నిక్, ప్రియాంక పోటీ పడ్డారు. భార్య కంటే ముందుగానే పూలగుత్తిని కనుగొన్న నిక్.. దానిని సోఫీకి అందజేశాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు అధికారికంగా వెలువడకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీంతో జోనస్ బ్రదర్స్ అభిమానులు జో-సోఫీలపై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. కాగా ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌ల వివాహం రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సోఫీ టర్నర్ కూడా హాజరైంది. View this post on Instagram #priyankachopra from #joejonas and #sophieturner wedding last night ♥️ That huge😍 . #بريانكا_تشوبرا من حفل زفاف جو جوناس و صوفي تيرنر امس♥️ . شلون لمتها حيللل تهبل علاقتهم😍 . . #queenofbollywood#queenofhearts#queenpri#Bollywood#priyanka#بوليوود#nickjonas A post shared by Perfection Is?! PeeCee👑 (@priyanka.news) on May 2, 2019 at 4:41pm PDT -
చచ్చిపోవాలనుకున్నా; నటి భావోద్వేగం
‘ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బతికి ఉన్నందుకు అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నాను. ఈ కథ ముగింపును చూడగలుతున్నాను’ అంటూ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్, ఇంగ్లీష్ నటి ఎమిలియా క్లార్క్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, మెదడు వాపు వ్యాధి గ్రస్తుల కోసం చికిత్స కోసం కృషి చేయడానికి వెనుక గల కారణాలను వెల్లడించారు. ఫిబ్రవరి, 2011లో జిమ్ చేస్తున్న సమయంలో ఎమిలియా తొలిసారి బ్రెయిన్ ఎన్యూరిజం(మెదడు భాగంలో రక్తనాళాలు చిట్లడం)కు గురయ్యారు. అదే సమయంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్లో డెనెరీస తార్గరెయిన్ అనే పాత్రలో నటించాల్సి ఉంది. కానీ ఊహించని ఈ పరిణామానికి ఆమె షాకయ్యారు. అయితే మనోనిబ్బరం ఉంటే ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ఇట్టే జయించవచ్చు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని, ఒకవేళ మరణం సంభవించినా ఇక భయపడబోనంటూ న్యూయార్క్ మ్యాగజీన్లో స్ఫూర్తిదాయక కథనం రాసుకొచ్చారు. ఏ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ‘ఒక్కోసారి తీరని వేదన అనుభవించేదాన్ని. మాట పడిపోయేది. నా మెదడు పూర్తిగా నాశనమై పోయిందని అనుకునేదాన్ని. నా పేరు కూడా గుర్తుండేది కాదు. మొదటిసారి నాకు బ్రెయిన్ హేమరేజ్ వచ్చినపుడు నన్ను ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడు నా వయస్సు 24. నాకే ఎందుకిలా జరిగింది. జీవితం ఎందుకింత దుర్భరంగా మారిందని ఆవేదన పడ్డాను. అందుకే ప్లగ్‌లో చేయి పెట్టి చచ్చిపోవాలనుకున్నా. అందుకోసం ఆస్పత్రి సిబ్బందిని ఎంతగా వేడుకున్నా వారు అంగీకరించలేదు. మాట పడిపోయినప్పుడు..ఇక నటనా జీవితాన్ని కొనసాగించలేమోనని కుంగిపోయాను. కానీ అదృష్టవశాత్తు కఠిన పరిస్థితుల నుంచి ప్రస్తుతానికి బయటపడ్డా’ అంటూ ‘ఏ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్’ పేరిట ఎమిలియా క్లార్క్ తన అనుభవాలను పంచుకున్నారు. -
గేమ్ ఆఫ్ థ్రోన్స్ టెక్నీషియన్స్‌తో విక్రమ్ ‘కర్ణ’
విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణ. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ విక్రమ్ చేతికి రావటంతో బడ్జెట్ రేంజ్ కూడా మారిపోయింది. యునైటెడ్ ఫిలిం కింగ్ డమ్ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించనుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఓ గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. ఈ గంట సినిమాలో కీలంగా కనిపించనుందట. పూజల తరువాత ఆ గంటలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌కు తరలించారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. -
దేశీ గేమ్ ఆఫ్ థ్రోన్స్
ఇంగ్లీష్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ఎంత క్రేజ్ ఉందో హాలీవుడ్‌ను కొంచెం ఫాలో అయ్యేవాళ్లను కదిలించినా చెబుతారు. ఇప్పుడు ఇలాంటి సిరీస్‌నే ఇండియాకు తీసుకురానున్నారట బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్. ఎప్పటికప్పుడు టీవి, డిజిటల్, సిల్వర్ స్క్రీన్ పై కొత్త ఐడియాలు, సరికొత్త షోలు, న్యూ ఏజ్ సినిమాలు అందించే ఏక్తా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు దేశీ వెర్షన్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ టాక్. హాలీవుడ్ వెర్షన్‌కు ఇండియాలో పెరుగుతున్న క్రేజ్ చూసిన ఏక్తా.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిమిలర్ ఐడియాతో దేశీ వెర్షన్ రూపొందించాలనుకుంటున్నట్లు ఏక్తా సన్నిహితులు అంటున్నారు.. మరి దేశీ వెర్షన్ వస్తుందా? వేచి చూద్దాం. -
ఫైనల్ గేమ్ 2019లోనే!
2011లో మొదలైన ఒక సంచలనం ఏడేళ్లుగా అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఆ సంచలనం పేరే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’. 2011లో మొదలైందీ టీవీ సిరీస్. ఒక్కో ఏడాది ఒక్కో సీజన్‌తో ఇప్పటికి ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ని అభిమానులు ముద్దుగా ‘జీఓటీ’ అని పిలుచుకుంటారు. కోట్లల్లో ఉన్న అభిమానులు, సినిమాలకు మించి ఉన్న క్రేజ్, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, కట్టిపడేసే కథ.. ఇవన్నీ కలిపి జీఓటీకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. గతేడాది వచ్చిన సీజన్ 7 అయితే అభిమానులకు ఒక పండగలానే వచ్చి వెళ్లింది. సీజన్ 7 అయిపోవడమే అభిమానులంతా సీజన్ 8 కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇండియన్ సినిమా అభిమానులకు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ పిచ్చి పట్టిందంటే, అది గత రెండేళ్లుగానే! సీజన్ 8కు ఉన్న క్రేజ్‌కు మరో కారణం అంటే అది చివరి సీజన్ కావడం కూడా! సీజన్ 8తో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ అయిపోతుంది. దీంతో ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్లోకి ది బెస్ట్ అనిపించేలా ఇప్పుడొచ్చే సీజన్ ఉండాలని ప్లాన్ చేస్తోంది టీమ్. ఈ క్రమంలోనే 2018లోనే సీజన్ 8ను ప్లాన్ చేసినా ఇప్పుడది 2019కి షిఫ్ట్ అయింది. ఇప్పటివరకూ 2011 నుంచి ఏడేళ్లుగా ప్రతి ఏడాదీ ఒక సీజన్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 8.. 2019కి వెళ్లిపోవడంతో ఫస్ట్‌టైమ్ బ్రేక్ వచ్చినట్టు. అయితే ఆ బ్రేక్ తీస్కోవడానికి కూడా కారణం ఉందట. ఫైనల్ గేమ్ మేకింగ్‌కు మరి ఆ మాత్రం టైమ్ పడుతుంది. ఎంత లేటైనా ఎండింగ్ అదిరిపోవాలి అని!! -
అందమైన మహిళలను రేప్ చేయాలనే.. : నటుడు
హాలీవుడ్లో లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు బెన్ అఫ్లెక్.. ఓ మహిళా యాంకర్‌తో గతంలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఆ యాంకర్‌తో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించినందుకు అఫ్లెక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తాజాగా అతని సహా నటుడు జాసన్ మొమోవా రేప్ గురించి భయంకరమైన జోకులు వేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. అఫ్లెక్, మొమోవా 'జస్టిస్ లీగ్' సినిమాలో కలిసి నటించారు. 2011లో 'గేమ్స్ ఆఫ్ థ్రోన్స్' యూనిట్ ఓ కామెడీ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు యూనిట్ సమాధానం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన ఈ సిరీస్‌లో నటించడం ఎందుకు ఇష్టమని ఓ ప్రేక్షకుడు ప్రశ్నించగా.. మొమోవా దారుణమైన జోక్ వేశాడు. 'అందమైన మహిళలను రేప్ చేసేందుకే..' అంటూ ఎమిలీయా క్లార్క్ వైపు చూస్తూ వెకిలిగా చెప్పాడు. ఈ జోక్‌కు మిగతా వారు నవ్వినా.. యూనిట్లో భాగంగా ఉన్న నటీమణులు క్లార్క్, డీబీ వీసీ తదితరులు సిగ్గుతో ముఖం దాచుకున్నారు. 'గేమ్స్ ఆఫ్ థ్రోన్స్'లో గిరిజన తెగ నాయకుడిగా నటించిన మొమోవా.. యువ వధువు (క్లార్క్)ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. ఆమెపై మొదట బలత్కారం జరిపినా.. తర్వాత వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తాజాగా 'రేప్ జోక్' వీడియో వెలుగులోకి రావడంతో మొమోవాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్పందించిన మొమోవా క్షమాపణలు చెప్పారు. అత్యంత మొరటుగా తాను ఆ జోక్ వేశానంటూ సారీ చెప్పారు. -
గేమ్ ఆఫ్ థ్రోన్స్ లీక్: ఇంటి దొంగల పనే!
ముంబై: అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరిస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లీక్ చేసినందుకుగానూ నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల్లో ప్రసారం అవుతున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఆరు సిరీస్‌లతో అలరించిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ నాలుగో ఎపిసోడ్‌ను అధికారికంగా ప్రసారం చేయకముందే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. పైరసీ సీడీలు కూడా మార్కెట్లోకి రావడం ఈ సీరిస్ అభిమానులను ఆశ్చర్యానికిలోను చేసింది. ఎపిసోడ్ లీక్ కావడంపై స్థానికంగా ప్రసారం చేసే ముంబైకి చెందిన ఓ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాట్‌స్టార్ కంపెనీకి వెండర్‌గా పనిచేసే ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీకి చెందిన ఉద్యోగులు అధికారిక అకౌంట్ల వివరాలను కొందరికి వెల్లడించి పైరసీకి పాల్పడినట్లు తెలుస్తోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్7 ఇప్పటికే అభిమానులను కట్టిపడేస్తోంది. -
స్క్రిప్ట్‌లను హ్యాక్ చేస్తే.. భారీ రివార్డు
వాషింగ్టన్ : హ్యాకర్లకు హెచ్‌బీఓ భారీ రివార్డు ప్రకటించింది. తను నిర్మిస్తున్న టీవీ షో స్క్రిప్ట్‌లను దొంగలించిన వారికి భారీగా బౌంటీ పేమెంట్‌ను చెల్లించనున్నట్టు పేర్కొంది. కంపెనీలు తమ నెట్‌వర్క్స్‌లో హాని కలిగించే లోపాలను గుర్తించిన వారికి ఆఫర్ చేసే రివార్డు మాదిరి, హెచ్‌బీఓ కూడా తన టీవీ షో స్క్రిప్ట్‌లు దొంగతనం చేసే వారికి 2,50,000 డాలర్లు అంటే కోటిన్నరకు పైగా బౌంటీ పేమెంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. గతవారమే హెచ్‌బీఓ తమ డేటాలో ఉల్లంఘన జరిగినట్టు గుర్తించింది. తన టీవీలో వస్తున్న ఫేమస్ షో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఆదివారం ఎపిసోడ్ షోకి ముందే ఆన్లైన్లో లీకైంది. దీనికి స్పందనగా తమ టీవీ స్ట్రిప్ట్లను దొంగతనం చేసే హ్యాకర్లకు భారీ బౌంటీ పేమెంట్‌ను హెచ్‌బీఓ ప్రకటించింది. ''మిస్టర్ స్మిత్'' అనే హ్యాకర్ లేదా హ్యాకింగ్ గ్రూప్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు వెల్లడైంది. ఈ స్క్రిప్ట్‌లు మాత్రమే కాక, హెచ్‌బీఓ నుంచి 1.5 టెర్రాబైట్స్ల డేటాను పొందినట్టు ఆ హ్యాకర్ గ్రూప్ తెలిపింది. డేటాను దొంగతనం చేసిన హ్యాకర్లు కంపెనీ నుంచి ఆరునెలల వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే 6 మిలియన్ డాలర్లకు పైగా వారు కోరుతున్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఎక్కువ మొత్తంలో ఫైల్స్‌ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. హెచ్బీఓలో జరిగిన ఈ భారీ డేటా దాడిపై ఫోరెన్సిక్ నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. -
గేమ్ ఆఫ్ థ్రాన్స్ అభిమానులకు చేదువార్త
గేమ్ ఆఫ్ థ్రాన్స్ అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరియల్. ఈ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటి వరకూ ఆరు సిరీస్‌లో వచ్చిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ఈ సీరియల్ అభిమానులు ఇప్పుడు ట్విట్టర్లో హాట్‌స్టార్ యాజమాన్యంపై రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళ్తే సీజన్7 ఇప్పటికే అభిమానులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈసిరీస్ భారత్‌లో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటి మూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న గేమ్స్ ఆఫ్ థ్రాన్స్ నాలుగో ఎపిసోడ్ ఆగస్టు 7, సోమవారం ప్రసారం కావాల్సి ఉంది. అయితే హాట్‌స్టార్ అప్లికేషన్ తప్పిదం వల్ల ఆన్లైన్లో లీకైంది. వీడియోను పైరసీ చేసి ఇంటర్నెట్, టోరెంట్లో అప్లోడ్ చేశారు. దీంతో గేమ్ ఆఫ్ థ్రాన్స్ అభిమానులు ట్వట్టర్లో రెచ్చిపోయారు. హాట్‌స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. -
మూడు ముక్కలకు రూ.16.75 కోట్లు తీసుకుంది
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ గుర్తుంది కదా. అందులో చారి పాత్రలో విలన్ ఇంట్లో చేరిన ఎన్టీఆర్ మాట్లాడే మూడు ముక్కలు గుర్తున్నాయా..! 'ఏమో గుర్తులేదు తెలీదు మర్చిపోయా' అంటూ లక్షలు తీసుకుంటాడు. సేమ్ అలాంటి సన్నివేశమే గేమ్ ఆఫ్ థ్రాన్స్ ఎపిసోడ్లో జరిగింది. అందులో ఓ నటి మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియనల్ డాలర్లు తన ఖాతాలో వేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రాన్స్ అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరియల్. ఈ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటి వరకూ ఆరు సిరీస్‌లో వచ్చిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్ వసూల్లు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఇందులో నటించే వారి పారితోషికాలు చూస్తే మాత్రం సగటు అభిమాని ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రధాన నటులు ఎమిలియా క్లార్క్, కిట్ హరింటన్, లేనా హెడీ, పీటర్ డింక్లేజ్, నికోలస్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారు రెండు మిలయన్ డాలర్లు పుచ్చుకున్నారు. వారు మాట్లాడిన మాటలను బట్టీ రేటు పెరుగుతుంది. ఒక్కక్కరు ఎపిసోడ్‌కు 2.6 మిలియనల్ డాలర్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కిట్ హరింటన్ మాట్లాడిన పదాలు 560. అంటే ఒక్కక్క పదానికి సుమారు 4642 డాలర్లు తీసుకున్నారు. లీనా హెడీ పదానికి 6565 డాలర్లు, నికోలస్ కోస్టర్ పదానికి 7647 డాలర్లు తీసుకోగా, ఎమిలియా క్లార్క్ మాత్రం ఎపిసోడ్లో మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియన్ డాలర్లు తీసుకుంది. అది కూడా 'షల్ వీ బిగిన్' అని చిలక పలుకులు పలికింది. -
లేటు వయస్సులో నటుడి ఐదో పెళ్లి!
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' స్టార్ సీన్ బియాన్ మరోసారి పెళ్లి కొడుకు అయ్యాడు. 58 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు తాజాగా ఐదోసారి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రియురాలైన 38 ఏళ్ల ఆష్లే మూర్‌ను వివాహమాడాడు. బియాన్ గతంలో డెబ్రా జేమ్స్, మెలానీ హిల్, అబిగెయిల్ క్రుటెండన్, జార్జినా సక్లిఫ్లను మనువాడారు. కానీ ఈ నలుగురితో ఆయన వివాహబంధం ఎక్కువకాలం నిలువలేదు. ఆయనకు రెండో భార్యతో ఇద్దరు కూతుళ్లు, మూడో భార్యతో ఒక కూతురు ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఐదో వివాహ వేడుక అత్యంత సన్నిహితుల నడుమ అట్టహాసంగా జరిగిందని హాలీవుడ్ మీడియా తెలిపింది. సీన్ బియాన్ పలు హాలీవుడ్ సినిమాల్లో నటించాడు. 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' చిత్రంలో బోరోమిర్గా కనిపించిన అతను 'గేమ్స్ ఆఫ్ ది థ్రోన్స్' సిరీస్‌లో నెస్డ్ స్టార్క్ పాత్రతో ప్రఖ్యాతి పొందాడు. త్వరలో రానున్న 'ద ఫ్రాంకెన్‌స్టీన్ క్రోనికల్స్'లో జాన్ మార్లట్ పాత్రలో కనిపించనున్నాడు. -
పైరేటెడ్ షో కు.. గిన్నిస్ టైటిల్...!
లండన్ః ప్రపంచ రికార్డు సాధించాలంటే అంతకు ముందెన్నడూ లేని విధంగా కొత్తగా, విభిన్నంగా ఏదైనా చేసి చూపించాలి. లేదంటే సాహసాలు చేయాలి. అయితే.. భారీ అక్రమాలకు పాల్పడినా రికార్డు సాధించొచ్చునన్న విషయం ఇప్పుడు కొత్తగా తెరసైకి వచ్చింది. లండన్ లో ఎంతో ప్రాముఖ్యత పొందిన.. మోస్ట్ పైరేటెడ్ షో గా గుర్తించబడిన పాపులర్ సీరియల్.. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' గిన్నిస్ రికార్డులకెక్కింది. హెచ్ బీవో సంచలనాత్మక ఇంగ్లీష్ టీవీ ధారావాహిక... 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఫాంటసీ డ్రామా గేమ్.. వరల్డ్ రికార్డును సాధించింది. 2017 గిన్నిస్ సంచిక ప్రకారం.. ఈ పైరేటెడ్ హిట్ సీరియల్.. వరుసగా నాలుగోసారి టైటిల్ గెలుచుకుంది. ధారావాహికలోని ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు 14.4 మిలియన్ల అక్రమ డౌన్ లోడ్లను కూడా చేసుకొన్న ఈ సీరియల్.. ప్రపంచ రికార్డులకెక్కింది. టీవీ సిరీస్ ద్వారా మోస్ట్ ఎమ్మీ అవార్డ్స్ కు శీర్షిక గా మారిన ఈ ఫాంటసీ డ్రామా.. ఐదవ సీజన్ లో మొత్తం 12 అవార్డులను కూడా గెలుచుకుంది.