gangrape
-
అస్సాంలో ఆ కిరాతకుడు మృతి
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అత్యాచార ఆరోపణలు.. అండమాన్ మాజీ సీఎస్ అరెస్ట్
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్‌ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది. నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. -
యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి
ఓవైపు సమాజం, టెక్నాలజీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు మహిళలకు రక్షణ సన్నగిల్లుతోంది. మైనర్ బాలికల నుంచి యువతులు, గర్భవతి మహిళలను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా అత్యాచార బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి గౌరవమైన పోలీస్ వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు తెలియజేసి న్యాయం కావాలని కోరిన బాధితురాలిపై పోలీస్ స్టేషన్లోనే ఓ పోలీస్ లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. 13 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అఘాత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్టేషన్ ఇంఛార్జ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కేసు వివరాలను లలిత్పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ వివరిరంచారు. పాలికి చెందిన నలుగురు యువకులు బలికను మభ్యపెట్టి ఏప్రిల్ 22న బోపాల్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చి పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తిలక్ధారి సరోజ్‌కు అప్పగించి పరారయ్యారు. చదవండి: భార్యను వదిలి మరో మహిళతో వెళ్లిపోయి.. స్టేషన్ అధికారి బాలిక నుంచి సమాచారం సేకరించి తన బంధువుల మహిళతో కలిపి చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు. రెండు రోజుల తర్వాత బాలికను స్టేట్మెంట్ రికార్డు చేయాలనే పేరుతో స్టేషన్‌కు పిలిపించి వేరే గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మళ్లీ బాలికను చైల్డ్‌లైన్ సెంటర్‌కు పంపించాడు. తరువాత కౌన్సెలింగ్ సెషన్లో బాలిక తనకు జరిగిన విషయం చెప్పడంతో చైల్డ్‌లైన్ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పాలి స్టేసన్ ఇంఛార్జ్ సహా ఆరుగురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న లలిత్పూర్ ఎస్పీ బాలిక అత్తను కూడా నిందుతురాలిగా చేర్చారు. స్టేషన్ ఇంఛార్జ్ తిలక్‌ధారిని సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిఐజి స్థాయి అధికారి కూడా ఈ విషయంపై 24 గంటల్లో నివేదికను కోరారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చదవండి: వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్ -
వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలో ఒక వివాహితపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 35 సంవత్సరాల వయసున్న బాధితురాలు ఈనెల 11న గొర్రెలను తీసుకొని మేతకు వెళ్లింది. అక్కడ తొలుత రాజు అనే నిందితుడు ఆమెపై బలత్కారానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా అడ్డుకుంది. అనంతరం అక్కడే ఉన్న పుట్టణ్ణ, రవిలు రాజుకు తోడయ్యారు. అనంతరం ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. పశువుల్లా మీదపడి అకృత్యానికి పాల్పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. గొర్రెల మంద ఇంటికి వచ్చినా భార్య రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించారు. అస్వస్థతకు గురైన ఆమెను మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం ఆ రోజు జరిగిన ఉదంతాన్ని భర్తకు వివరించింది. మరుసటి రోజు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు రాజును శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..) -
మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..
వేలూరు (చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడి–తిరువలం రోడ్డులోని ఒక సినిమా థియేటర్లో గత నెల 17వ తేదీన వేలూరులోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసే మహిళా డాక్టర్‌తో పాటు ఆమె స్నేహితుడు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో ఇద్దరూ థియేటర్ ముందు ఆటో కోసం వేచి ఉండగా ఐదుగురు యువకులు వారిని ఆటోలో ఎక్కించుకుని కలెక్టరేట్ సమీపంలో ఉన్న పాలారు వద్దకు తీసుకెళ్లి మహిళా డాక్టర్‌తో వచ్చిన వ్యక్తి గొంతుపై కత్తి పెట్టి బెదిరించి మహిళా డాక్టర్‌పై నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం వారిని అదే ఆటోలో ఎక్కించుకుని వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డులో నుంచి రూ.40 వేలు డ్రా చేయించుకుని, వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని లాక్కున్నారు. అయితే ఈ ఐదుగురు యువకులు డబ్బులు పంచుకోవడంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆంజనేయులు స్వామి ఆలయం ముందు మద్యం మత్తులో ఘర్షణ పడుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వావుసి నగర్‌కు చెందిన పార్తీబన్(20), సంతోష్‌కుమార్(22), నెహ్రూ నగర్‌కు చెందిన భరత్(18), మణిగండన్(22), 17 ఏళ్ల మైనర్ బాలున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మహిళా డాక్టర్ వద్ద నుంచి ఆన్లైన్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు మైనర్ నిందితున్ని చెన్నైలోని బాలుర శిక్షణా కేంద్రంలోకి చేర్చారు. నలుగురు యువకులపై రౌడీషీట్ నమోదు చేయాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ ఆదేశించారు. చదవండి: (నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్) -
హర్యానాలో యువతిపై సామూహిక అత్యాచారం
-
పెళ్లిచేసుకుంటానని..15 రోజులు బంధించి..
రాయ్‌పూర్: పెళ్లి పేరుతో మోసం చేసి బాలిక, ఆమె స్నేహితురాలిపై దారుణానికి ఒడిగట్టారు కొందరు యువకులు. ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కొరియా జిల్లా జాగ్రాఖండ్కు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలతో నమ్మించాడు. స్నేహితులతో కలిసి పథకం ప్రకారం పెళ్లి పేరుతో బాలికను, ఆమె స్నేహితురాలిని వేరే ఊరికి తీసుకెళ్లాడు. తొమ్మిది మంది యువకులు ఆ బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 15 రోజులపాటు కీచకుల చెరలో ఉన్న బాలికలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. చికిత్స నిమిత్తం బాలికలను ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదుచేసుకుని ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు ఏఎస్పీ నివేదిత శర్మ చెప్పారు. -
దారుణం: రెండు గంటల పాటు కారులో అత్యాచారం
హరియానా: హరియాణాలో 15 ఏళ్ల బాలికపై పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చి ఓ కాలువలో పడేసిన ఘటన మరవకముందే ఫరీదాబాద్‌లో మరో ఘటన వెలుగుచూసింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ 22 ఏళ్ల మహిళను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అనతరం నడుస్తున్న కారులో ఆ నలుగురు ఆమెపై రెండు గంటలపాటు సామూహిక లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెను బల్లాబ్‌ఘర్ సమీపంలో పడేసి వెళ్లారు. బాధితురాలు తన సోదరునికి విషయం తెలియజేయడంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. బాదితురాలు స్కార్పియో కారులో వచ్చిన ముగ్గురు, కారు డ్రైవర్ తనపై అత్యాచారం చేశారని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితులు దొరలేదు. ఈ ఘటన కూడా గత శనివారం జరగడం గమనార్హం. -
దారుణం: కేన్సర్ బాధితురాలిపై గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ మైనర్ బాలికపై శనివారం ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాలు సాయం కోసం అర్థించడంతో అటుగా వచ్చిన మరో వ్యక్తి మానవత్వం మరిచి ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. చివరికి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని సరోజినీనగర్‌లో ఉంటున్న బాధితురాలు(15) రక్తకేన్సర్తో బాధపడుతోంది. యువతికి పరిచయస్తుడైన శుభమ్ అనే వ్యక్తి శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో నూడుల్స్ తినేందుకు ఆమెను ఆహ్వానించడంతో బైక్‌పై అతనితో బయలుదేరింది. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన శుభమ్, తన స్నేహితుడు సుమిత్తో కలిసి ఆమెను బంధించాడు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం యువతి సాయం కోసం అర్థించడంతో.. అటుగా వెళ్తున్న వీరేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆమెపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వీరేంద్ర యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శుభమ్, సుమిత్‌ల కోసం గాలింపు చేపట్టామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులూ సరోజినీనగర్‌కు చెందిన వారేనన్నారు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హిస్సార్: హరియాణాలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. ఉక్లానాలోని ఆరేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారం చేసి ఆపై ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. హిస్సార్ పోలీసుల కథనం ప్రకారం... ఫతేబాద్ జిల్లా తొహనా పట్టణానికి చెందిన దంపతులు కూలీ పనులు చేస్తుంటారు. రైల్వే లైన్ పక్కనే నివసించే వీరికి ఇద్దరు సంతానం. అందులో ఆరేళ్ల చిన్నారి శుక్రవారం రాత్రి తన తల్లి, అక్కతో కలసి నిద్రిస్తుం డగా..గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యార్థినిపై స్కూల్లో గ్యాంగ్‌రేప్
జైపూర్(రాజాస్థాన్): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయులే ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని శికార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. షాపురా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలికపై అదే స్కూలు డైరెక్టర్ జగదీస్ యాదవ్, ఉపాద్యాయుడు జగత్ సింగ్ గుర్జార్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అదనపు క్లాసులు ఉన్నాయంటూ సాయంత్ర సమయంలో బాలికను పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో వారు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. అది వికటించటంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలికకు తెలియకుండానే గర్భస్రావం చేయటంతోపాటు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన వైద్యులు రజినీష్ శర్మ, ఆయన భార్య కానన్లపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నింధితుల కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామని అజీత్ఘడ్ ఎస్‌హెచ్‌వో మంగళ్‌రాం ఓలా తెలిపారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య
పార్వతీపురంటౌన్/ సీతానగరం: టెన్త్ విద్యార్థినిపై నలుగురు యువకులు లైంగికదాడి చేసి హత్య చేశారు. విజయ నగరం జిల్లా గాదెల వలసలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు సీతానగరం మండలంలోని గాదెలవలసలో 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం చేసేందుకు సైకిల్‌పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గంమధ్యలో గాదెలవలసలోని వైన్‌షాపు సమీపంలో పోతల శంకరరావు ఆమెను ఆపి భయపెట్టాడు. గాదెలవలస, బడేవలస మధ్యన ఉన్న మామిడితోటలోకి బాలికను తీసుకెళ్లి సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజతో కలసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎక్కడ చెబుతుందోనని గొంతునులిమి హత్యచేసి.. మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్కూల్ నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. ఇందుతో శంకరరావు మధ్యాహ్నం మాట్లాడినట్లు, ఇందును బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షి పి.అచ్చుత్ వారికి తెలిపారు. గ్రామ పెద్దలతో కలసి శంకరరావును నిలదీయగా.. జరిగిన విషయాన్ని శంకరరావు పెద్దల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇందు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి తరలించారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. -
ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
ఖమ్మం: జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. బీ.కాం సెకండియర్ చదువుతున్న తోటి విద్యార్థినిని బర్త్ డే పార్టీకి ఆహ్వానించిన నలుగురు విద్యార్థులు ఆమెపై గ్యాంగ్‌రేప్ పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడియో తీసి బయటకు చెబితే నెట్లో పెడతామని బెదిరించారు. ఇంటికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులతో జరిగిన దారుణాన్ని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లినట్లు భావిస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విద్యార్థులు అందరూ మైనర్లు కావడంతో పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
మహిళపై గ్యాంగ్ రేప్
సంభాల్(యూపీ): బరేలి రైల్వే స్టేషన్ నుంచి ఓ మహిళను బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈనెల 16న పానిపట్ వెళ్లేందుకు బరేలి స్టేషన్‌కు వచ్చిన 40 ఏళ్ల మహిళకు ముగ్గురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి గిన్నార్ ప్రాంతంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. ఆమెతోపాటు 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. తన కుమారుడితో ఎలాగో బయటపడ్డానని, తన కుమార్తె ఇంకా అక్కడే ఉందని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమెపై నాలుగు రోజులుగా ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ పాండే తెలిపారు. చాందౌసి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్
గుర్గావ్/నోయిడా: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో మరో సామూహిక అత్యాచారం జరిగింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు మృగాళ్లు కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాజస్తాన్‌కు చెందిన మహిళ గుర్గావ్లోని సోహ్న ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తుండగా ఆమెను దుండగులు స్విఫ్ట్ కారులోకి లాగారు. అనంతరం ఐదు గంటలపాటు ఆమెపై అత్యాచారం చేస్తూ ఢిల్లీ మీదుగా నోయిడా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆమెను నోయిడాలో వదిలేశారు. నిందితులు అత్యాచారం చేస్తూ కారులో గుర్గావ్ నుంచి ఢిల్లీ మీదుగా నోయిడా వరకు వచ్చినా..ఏ ఒక్క పోలీసూ గుర్తించకపోవడం రాజధాని ప్రాంతంలోని భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై నోయిడా, గుర్గావ్ పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు గౌతమ బుద్ధ నగర్ ఎస్సెస్పీ లవ్ కుమార్ చెప్పారు. 2012లో నిర్భయ ఘటన సమయంలో పెద్ద ఉద్యమమే జరిగినా ఎన్సీఆర్లో మహిళలకు నేటికీ భద్రత కరువైంది. ఎన్సీఆర్ ప్రాంతంలో తరచూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. -
ఢిల్లీలో మరో దారుణం
-
ఢిల్లీలో మరో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్న ఢిల్లీలో ఒకమహిళపై నిన్న బిహార్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆందోళన రేపగా, దేశ రాజధానిలో మరో అఘాయిత్యం వెలుగు చూసింది. మహిళ (35)ను కిడ్నాప్ చేసిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటలు కొనసాగిన భయానక అకృత్యాన్ని సాగించిన ఈ ముఠా అనంతరం మహిళను గ్రేటర్ నోయిడా సమీపంలో కారులోంచి బయటకు విసిరి వేయడం కలకలం రేపింది. రాజస్థాన్ భరత్పూర్ నగర్‌కు ఈమె పది రోజుల క్రితం హర్యానాలోని సోహనాకు వచ్చింది. గుర్గావ్లోని సోహనా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటలకు మారుతి స్విఫ్ట్ కారులో మహిళను ఎత్తుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు కదిలే కారులో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం గ్రేటర్ నోయిడాకు తరలించి కారులోంచి విసిరివేసి పారిపోయారు. రోడ్డుపై పడివున్న ఈమెను గమనించిన స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్టు సీనియర్ పోలీపు అధికారులు ధృవీకరించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్ట గౌతమ్ బుద్ధ్‌నగర్ సీనియర్సూపరింటెండెంట్ లవ్ కుమార్ చెప్పారు. గ్రేటర్ నోయిడాలో చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత తిరిగి బాధిత మహిళను సోహనాకు తీసుకువెళ్లినట్టు తెలిపారు. అనుమానితులు పరారీలో ఉన్నారనీ , ఈ విషయాన్ని దర్యాప్తు చేసేందుకు నోయిడా పోలీస్ బృందం సోహానాకు పంపించామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. కాగా ఢిల్లీలో ఈ నెలలోనే పసిపాపను ఆటోలో తోసేసి మరీ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆందోళన రేపింది. ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్ 14ఏళ్ల మైనర్‌బాలికపై 6గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను రైల్లో తరలిస్తుండగా, ఆమె స్పృహలోకి రావడంతో రైల్లోంచి తోసేశారు. -
బిహార్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్
లఖీసరాయ్/పట్నా: బిహార్‌లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లఖీసరాయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై విచారించడానికి బిహార్ ప్రభుత్వం సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుల్లో ఇద్దరిని గుర్తించిన పోలీసులు ఆదివారం ఒకరిని అరెస్టు చేశారు. అతను మైనర్ కావడంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. బాలిక శుక్రవారం రాత్రి బహిర్భూమికి బయటకు వెళ్లినప్పుడు నిందితులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం దగ్గరలోని బన్షీపూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి బలవంతంగా రైలు ఎక్కించారు. అనంతరం కదులుతున్న రైలు నుంచే ఆమెను క్యూల్ స్టేషన్ వద్ద బయటకు తోసేశారు. ఆమెకు నడుము భాగంలో ఫ్రాక్చర్ అయ్యిందనీ, బాగా రక్తం పోయిందనీ వైద్యులు తెలిపారు. -
‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’
గురుగ్రామ్: ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దులో మరో నిర్భయలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి వెళ్లి తన స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగొస్తున్న మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి మరోమారు అక్కడ కూడా దాడికి దిగారు. దాదాపు ఐదుగంటలపాటు వారి వికృత క్రీడను కొనసాగించారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు బ్రతిమాలుకోవడంతో ఓ రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు. ఈ ఘటన శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం 26 ఏళ్ల సిక్కింకు చెందిన మహిళ ఢిల్లీలోని కనౌట్ సమీపంలోని శాదారా ఏరియాలో ఉండే తన స్నేహితుడి ఇంటికి శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో వెళ్లింది. అనంతరం అతడితో కలిసి ఢిల్లీలో రాత్రి 7.30 గంటల నుంచి 10.00గంటల మధ్య అతడితో కలిసి సినిమా చేసింది. ఆ తర్వాత 1.30 నుంచి 2గంటల ప్రాంతంలో తన స్నేహితుడు ఆమె కలిసి ఓ క్యాబ్ తీసుకొని గుర్గావ్కు బయలుదేరి వచ్చారు. ఇంటికి కొద్ది దూరంలో ఆమెను దించి స్నేహితుడు వెళ్లిపోగా స్విప్ట్ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి లాగేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. అనంతరం 6.30గంటల ప్రాంతంలో ఆమెను వదిలేయగా ఓ బైకిస్టు సహాయంతో తిరిగి ఢిల్లీకి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి పాల్పడే ఇద్దరు వ్యక్తులు మాత్రం మూడో వ్యక్తిని దీపక్ అని పిలిచారని చెప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. -
మరణ శిక్షా.. జీవిత ఖైదా?
సాక్షాత్తు దేశ రాజధానిలోనే కదులుతున్న బస్సులో అత్యంత ఘోరంగా.. పాశవికంగా సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులకు ఐదేళ్ల తర్వాత శిక్ష ఖరారు కానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఎట్టకేలకు తీర్పు రానుంది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష విధించాలా, లేదా జీవిత ఖైదుతో సరిపెట్టాలా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. వాస్తవానికి ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. దాంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు. 16-18 ఏళ్ల మధ్య వయసున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లు గానే భావించాలని చెప్పారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సు ఎక్కగా, అతడిని చితక్కొట్టి ఆమెపై ఆరుగురు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తన తుది తీర్పును శుక్రవారం వెల్లడించబోతోంది. న్యాయమూర్తులిద్దరూ వాళ్ల అప్పీలును తిరస్కరిస్తే, ఇక వారికి ఉరిశిక్ష దాదాపు ఖరారవుతుంది. అయితే అప్పటికీ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు అవకాశం ఉంటుంది, లేదా రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయొచ్చు. -
విద్యార్థినిపై కొరియోగ్రాఫర్ గ్యాంగ్‌రేప్
వెస్ట్‌మారేడ్‌పల్లిలో దారుణం.. హైదరాబాద్: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లిలో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థిని నగరంలో సందర్శించేందుకు వచ్చింది. బీకామ్ విద్యార్థి అయిన ఆమెకు ఎయిర్‌పోర్టులో పింకీ అనే మహిళ పరిచయం అయింది. తనతో వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి చూపిస్తానని మాయమాటలు చెప్పి.. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన అపార్ట్మెంటుకు తీసుకెళ్లింది. అక్కడ ఆమె స్నేహితుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రీత్ సెర్గిల్ విద్యార్థినికి నరకం చూపించాడు. ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత హించించాడు. మరునాడు తన స్నేహితులతో కూడా గ్యాంగ్‌రేప్ చేయించాడు. తనపై జరిగిన దారుణాన్ని టిష్యూ పేపర్ మీద రాసి బయటకు విసరడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపారని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ సెర్గిల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిపై కక్షతో కూతురుపై దారుణం
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిలో ఆమెకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కూడా ఉన్నాడు. దాదాపు వారం రోజులపైగా ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల(మార్చి) 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి తొలుత బాధితురాలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. మరో నలుగురు ఆ సమయంలో బయట ఎదురుచూశారు. అనంతరం ఆమె నోరు, చేతులు, కాళ్లు కట్టేసి ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తిస్తూ దాదాపు తొమ్మిది రోజులపాటు లైంగికదాడికి తెగబడి అనంతరం విడిచిపెట్టారు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, స్థానిక పోలీసులకు కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, స్థానిక పోలీసులపై నమ్మకం లేకే ఇలా చేసినట్లు చెప్పారు. తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే వారు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. గత పంచాయతీ ఎన్నికల్లో వారు వ్యతిరేకించిన వ్యక్తికి తన తండ్రి మద్దతిచ్చాడనే కక్షతో తనపై దుర్మార్గానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. -
కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం!
కొత్తగా పెళ్లయిన ఓ యువతిని ఆమె భర్త, అతడి స్నేహితులు ఇద్దరు కలిసి తుపాకి చూపించి బెదిరించి, అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. పల్మావు జిల్లాలోని రహయ్యా గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయిందని డీఎస్పీ హీరాలాల్ రవి తెలిపారు. అతడు, అతడి స్నేహితులు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. ఒక రోజు రాత్రి తన స్నేహితులు బబ్లు సింగ్, అఫ్జల్ మియాలతో కలిసి అన్సారీ ఇంటికి వచ్చాడని, ముందుగా తాను అత్యాచారం చేసి.. తర్వాత తన స్నేహితులతో కూడా చేయించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని అన్సారీయే వీడియో తీయించి, ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడట. తర్వాతి రోజు ఉదయం ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే.. స్థానిక పోలీసు అధికారి మాత్రం కేసు పెట్టకుండా వాళ్లను వెనక్కి పంపేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు. -
పోలీసులుగా వచ్చి ముగ్గురు మహిళలపై..!
గ్రేటర్ నోయిడా: ఇటుకబట్టీ కార్మికులైన ముగ్గురు మహిళలపై ఆరుగురు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. తాము పోలిసులమంటూ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన దోపిడీదారులు ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోని కోళ్లను ఎత్తుకొని పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని కరోలి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు గ్రేటర్ నోయిడా ఎస్పీ సుజాతాసింగ్ తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ‘దుండగులు పోలీసుల పేరిట అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. అక్రమంగా సారా ఉందా అనేది తనిఖీ చేసేందుకు వచ్చామని బెదిరించారు. అనంతరం ఇంట్లో ఉన్న మగవారిని కట్టేసి.. వస్తువులన్నిటినీ దోచుకున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను తిని.. ముగ్గురు మహిళలపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోతూపోతూ ఆరు కోళ్లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు’ అని బాధిత మహిళ భర్త ఒకరు తెలిపారు. -
అక్కను కట్టేసి.. చెల్లెలిపై దారుణం
బదాన్: ఉత్తరప్రదేశ్‌లోని బదాన్ జిల్లా సహస్వాన్ ప్రాంతంలో ఐదుగురు దుండగులు ఓ మైనర్ అమ్మాయిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సోమవారం బాధిత బాలిక (14) తన అక్కతో కలసి ఓ వివాహ వేడుకకు వెళ్లింది. నిందితులు వీరిద్దరిని కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. దుండగులు బాధిత బాలిక అక్కను కట్టేసి, ఆమెపై దారుణానికి పాల్పడినట్టు బద్నాన్ ఎస్పీ సంజయ్ రాయ్ చెప్పారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
కర్నూలు: ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం క్రాస్ రోడ్డు వద్ద ఈనెల 22వ తేదీన వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న గుట్టలోకి బలవంతంగా తీసుకువెళ్లి మద్యం తాపించి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ, వినోద్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బోయ రాముడు, గొల్ల దశరథ, బోయ మధుకృష్ణ, లొద్దిపల్లె గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు తదితరులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు విచారణలో తేల్చారు. సోమవారం ఆటోలో ప్రముఖ న్యాయవాది వద్దకు వెళ్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు మాటు వేసి నంద్యాల రోడ్డులోని రాగమయూరి బస్‌స్టాప్ వద్ద అరెస్టు చేశారు. నేరం జరిగిన రోజు కూడా అదే ఆటోను నిందితులు వినియోగించారు. దర్యాప్తులో భాగంగా ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు.