gowda
-
సీరియల్స్‌లో చీరకట్టు.. ఇన్‌స్టాలో ఈ కన్నడ బ్యూటీని ఇలా చూస్తే ఏమైపోతారో..! (ఫోటోలు)
-
ఎవరీ విక్రమ్‌గౌడ?
విక్రమ్‌గౌడ కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కరావళి ప్రాంతంలో విక్రమ్‌గౌడ, మలెనాడు ప్రాంతంలో ముండగారు లతా బృందం చురుకుగా ఉండేవి. విక్రమ్‌గౌడ ఉడుపి జిల్లా హెబ్రి తాలూకా కూడ్లు నాడ్వాలు గ్రామ నివాసి. మొదట కార్మిక సంఘంలో పనిచేసిన విక్రమ్‌గౌడ ఆ తరువాత నక్సలైట్లలో చేరి అగ్రశ్రేణి నక్సల్‌గా ఎదిగారు. మూడుసార్లు కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నారు. 2016 నుంచి కేరళ అటవీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆయన మృతితో నక్సలైట్ నేతల సంఖ్య తగ్గింది. గతంలో పలువురి అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయి.బనశంకరి: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన నక్సల్స్ వ్యతిరేక దళం(ఏఎన్ఎఫ్) పోలీసులు సోమవారం రాత్రి ఉడుపి జిల్లాలో కబ్బినాలే అటవీ ప్రదేశంలో కూంబింగ్‌లో మట్టుబెట్టారు.ఎదురు కాల్పులు...విక్రమ్‌గౌడ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 50 కి పైగా నేరాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నారు. కొద్దిరోజులుగా ఉడుపి ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ఏఎన్ఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఐదుమంది నక్సలైట్లు నిత్యావసర వస్తువులను కొనడానికి కబ్బినాలెకు వచ్చినట్లు తెలిసి చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో విక్రమ్‌గౌడ (46) మరణించగా, మిగిలిన నక్సల్స్ పారిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు.రూ.5 లక్షల రివార్డువిక్రమ్గౌడ, ముండగారు లతా, జయణ్ణ, వనజాక్షి, సుందరి అనేవారు నక్సల్ నేతలు కాగా, వారిపైన ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. గత 20 ఏళ్లు నుంచి నక్సల్ కార్యకలాపాల్లో విక్రమ్‌గౌడ పాల్గొంటున్నాడు. ఆయనపై చిక్కమగళూరు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 50 కి పైగా దాడులు, విధ్వంసం కేసులు ఉన్నాయి.కేరళ నుంచి వచ్చి తూటాలకు చిక్కికేరళలో నక్సల్స్ కార్యకలాపాలు హెచ్చుమీరడంతో అక్కడ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది నక్సల్స్ పొరుగునే ఉన్న ఉడుపి, మంగళూరు జిల్లాల్లోకి వచ్చారు. పశ్చిమ కనుమల్లోని అటవీ గ్రామాల పరిసరాల్లో తలదాచుకున్నారు. ఇటీవల కస్తూరిరంగన్ నివేదిక అమలు, అటవీ ప్రాంతం ఆక్రమణల తొలగింపు అంశాలపై ప్రజలతో సమావేశాలు జరిపారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అడవుల్లో గాలింపు ప్రారంభించారు. విక్రమ్‌గౌడ మృతదేహాన్ని మంగళూరు ఆస్పత్రికి తరలించారు.లొంగిపోవాలని చెప్పాంబనశంకరి: ఎన్కౌంటర్ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ఆంతరిక భద్రతా విభాగం డీఐజీ రూపా మౌద్గిల్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ కదలికల గురించి తెలిసి గాలింపు మొదలైంది, నక్సల్స్ ఎదురుపడ్డారు, లొంగిపోవాలని సూచించినప్పటికీ కాల్పులకు దిగారు. ఈ సమయంలో ఏఎన్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో విక్రమ్‌గౌడ మృతిచెందారు. ఇతడిపై హత్య, దోపిడీలు, దొంగతనాలు తో పాటు 60 కి పైగా కేసులు ఉన్నాయి అని రూపా మౌద్గిల్ చెప్పారు. 10 రోజుల నుంచి గాలింపు జరుగుతోందని ఆమె చెప్పారు. -
Actor Darshan: కారాగారంలో 100 రోజులు
సాక్షి, బెంగళూరు: మెజిస్టిక్ సినిమా 100 రోజుల ప్రదర్శన తర్వాత ఆ చిత్ర హీరో దర్శన్ స్టార్ నటునిగా మారారు. అనేక హిట్ సినిమాలతో టాప్ హీరోలలో ఒకరిగా ఆయన వెలుగొందుతున్న సమయంలో సినిమాలో మాదిరిగానే కథ మలుపు తిరిగింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ జైలు పాలై 100 రోజులు పూర్తయింది. సినీ పరిశ్రమలో 100 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక నటునికి 100 రోజులు అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.. 100 రోజులు సినిమా ఆడితే చాలు వెంటనే అదృష్టం తిరగబడి రాత్రికి రాత్రి స్టార్ అయిపోతారు. 2001లో దర్శన్ తాను నటించిన మొదటి సినిమా మెజిస్టిక్ గాంధీనగరలో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో వంద రోజుల సినిమాల్లో నటించిన దర్శన్ జైలులోనూ వంద రోజుల జీవితాన్ని పూర్తి చేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది. జైలు నుంచి తమ అభిమాన నటుడు ఎప్పుడు బయటకు విడుదల అవుతారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.జూన్ 8న చెడు మలుపు...👉 జూన్ 8– దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు చెడుగా మెసేజ్ చేశాడనే కారణంతో చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి దారుణంగా భౌతిక దాడి చేసి దర్శన్ గ్యాంగ్ హత్య చేసింది.అదే రోజు రేణుకస్వామి చనిపోయిన విషయాన్ని దర్శన్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ రేణుకస్వామి మృతదేహాన్ని సుమనహళ్లి రాజకాలువలో విసిరేశారు.👉 జూన్ 9 – ఉదయం 8 గంటలకు రాజకాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఉదయం 8.30 గంటలకు కామాక్షిపాళ్య పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.👉 జూన్ 10 – దర్శన్ సూచనల మేరకు ఆయన గ్యాంగ్‌లోని ముగ్గురు సహచరులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దర్శన్, పవిత్ర గౌడ పేర్లు విచారణలో బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి మైసూరుకు బెంగళూరు పోలీసులు వెళ్లారు. దర్శన్ ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. కేసులో ఇతర నిందితులను అరెస్టు చేశారు.👉 జూన్ 11 – ఉదయం 6.30 గంటలకు మైసూరు ర్యాడిసన్ హోటల్లో జిమ్ చేస్తున్న దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరుకు తరలించారు. దర్శన్ అరెస్టు శాండల్‌వుడ్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. -
బుల్లితెర భామ తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు దర్శన్ కేసు?
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు దర్శన్‌కు రాచ మర్యాదలు అందించిన సంఘటనపై త్వరలో నివేదిక ఇస్తామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును శీఘ్రగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల కేసు విచారణ త్వరగా పూర్తవుతుంది. ఇక దర్శన్‌కు రాచ మర్యాదలు చేయడంలో జైలు అధికారుల పాత్ర, వారి వైఫల్యం తదితర అంశాలపై డీసీపీ సారా ఫాతిమా, సీసీబీ అదనపు కమిషనర్ చంద్రగుప్త ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో హైదరాబాద్ నుంచి కొన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.హత్య తరువాత పవిత్రగౌడ ఆరారేణుకాస్వామిని హత్య చేశాక పవిత్రగౌడ తనదైన రీతిలో ఫాలో అప్ చేసిందని తెలిసింది. శవాన్ని సుమనహళ్లి రాజకాలువలో పారవేశాక స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పవిత్రగౌడ స్నేహితురాలి భర్త సీనియర్ వైద్యునిగా పని చేస్తున్నాడు. వెంటనే స్నేహితురాలిని, ఆమె భర్తను ఒక కాఫీ రెస్టారెంట్‌కి పవిత్ర పిలిపించింది. తనకు తెలిసిన వారి బంధువు చనిపోయాడని, కారణాలు ఏమిటని ఆరా తీసింది. ఈ వివరాలను పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.టీవీ చానెళ్లలో ప్రసారం చేయొద్దుచార్జ్షీట్లోని సమాచారాన్ని కన్నడ టీవీ చానల్స్‌లో ప్రసారం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు చార్జిషీట్ వేయగానే అందులోని అంశాలపై టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో దర్శన్ ఇబ్బందిగా భావించి హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల గోప్యతను కాపాడాలంటూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.దర్శన్‌కు పవిత్ర బ్లాక్మెయిల్దర్శన్ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు.హీరోయిన్లకు అశ్లీల మెసేజ్‌లు చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. నటి పవిత్రగౌడకే కాకుండా ఇంకా ఇద్దరు హీరోయిన్లకు కూడా అతడు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్టు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితునిగా ఉన్న ప్రదోశ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయాలు చెప్పినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రేణుకాస్వామిని బెంగళూరులో షెడ్‌కు తీసుకువచ్చి కొట్టేటప్పడు అతని మొబైల్ఫోన్ని లాక్కుని పరిశీలించగా ఇన్‌స్టా గ్రామ్‌లో గౌతమ్ కేఎస్ పేరుతో చాలామంది మహిళలకు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్లు ఉంది. ముఖ్యంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, శుభ పుంజాలకు కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. -
క్యూట్‌గా మెరిసిపోతున్న 'బిగ్ బాస్' ఫేమ్ అమర్ దీప్ సతీమణి తేజశ్విని (ఫోటోలు)
-
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
Pavithra Gowda: పవిత్రకు అందని పెట్టె
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగా ఉంది. శనివారంనాడు పవిత్రగౌడను చూడడానికి ఆమె తల్లి వచ్చారు. కూతురికి ఒక బాక్స్‌ను ఇవ్వగా జైలు సిబ్బంది నిరాకరించారు. ఇంటి నుండి తెచ్చిన తినుబండారాలను పెట్టుకోవడానికి పవిత్రగౌడ ఒక పెట్టెను తీసుకురమ్మని తల్లిని కోరిందట. అందువల్ల పవిత్ర తల్లి బాక్స్‌ను తీసుకువచ్చింది. అయితే బయటి నుండి తీసుకువచ్చే పాత్రలను లోపలకు అనుమతించబోమని, అది జైలు నిబంధన అని సిబ్బంది అడ్డుకున్నారు. దాడి దృశ్యాలు వీడియో? రేణుకాస్వామిపై దాడిని హీరో దర్శన్, అనుచరులు ఐఫోన్లో రికార్డు చేసినట్టు తెలిసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రేణుకాస్వామి స్పృహతప్పి పడిపోగానే ఒక నిందితుడు తన ఐఫోన్లో వీడియో తీశాడు. నిందితులకు 5 సిమ్‌కార్డులు అందజేసిన వారిని పోలీసులు విచారణ జరిపి వాంగ్మూలాన్ని రికార్డు చేసారు. దర్శన్, పవిత్ర గౌడలు తలా ఒక సిమ్‌కార్డు తీసుకున్నారు. సీఎంతో రేణుకాచార్య తల్లిదండ్రుల భేటీశివాజీనగర: రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర, మరో 15 మంది అరెస్టు కావడం తెలిసిందే. సీఎంను కృష్ణా నివాసంలో కలిసి తల్లిదండ్రులు తమ బాధను వెలిబుచ్చారు. అనాథగా మారిన తమ కోడలికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిద్దరామయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
పవిత్రా గౌడకు అనారోగ్యం
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో జైలుపాలైన నటి పవిత్రా గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోనే ఆసుపత్రి వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తరువాత ఆమె కోలుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌తో పాటు 17 మంది నిందితులు పరప్పన జైలులో ఉన్నారు. జూన్ 11వ తేదీన నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండువారాల పాటు తీవ్రంగా విచారించి, తరువాత జైలుకు పంపారు. మరోవైపు దర్శన్ కూడా జైలులో ఆహారం సరిపడక ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. సరిగా నిద్రపోవడం లేదని, నిరంతరం చింతిస్తున్నాడని సమాచారం. ఫలితంగా బాగా బరువు కూడా తగ్గిపోయాడు. -
ఎమ్మెల్యే కారు డ్రైవర్ నిర్బంధం
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్ పురోహిత్ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు. గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పని చేస్తున్న కార్తీక్ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. పవిత్ర స్నేహితురాలు సమత విచారణ పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్‌కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు. ఈ డబ్బులతో ధనరాజ్ ఎలక్ట్రిక్ షాక్ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్‌తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్‌షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
రేణుకాస్వామి హత్య కేసు.. సీన్లోకి కమెడియన్ చిక్కణ్ణ
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు రోజుకొక కొత్త ముఖం పేరు వినిస్తోంది. తాజాగా కమెడియన్ చిక్కణ్ణను వెంటాడుతోంది. రేణుకాస్వామి హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 8వ తేదీన నగరంలోని స్టోని బ్రూక్ రెస్టారెంట్లో దర్శన్‌తో పాటు చిక్కణ్ణ కూడా ఉన్నట్టు సమాచారం. వారితో పాటు దర్శన్ అనుచరులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పార్టీలో పాల్గొన్న దర్శన్ సాయంత్రం వేళకు అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పారీ్టలో చిక్కణ్ణ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్ అనుచరునిగా పేరున్న ధనరాజ్ ఆలియాస్ రాజ అనే మరో నిందితున్ని అరెస్టు చేశారు. రేణుకాస్వామిపై దాడి చేసిన సమయంలో దర్శన్‌తో పాటు అతడు కూడా ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ధనరాజ్.. పవిత్రగౌడ ఇంట్లో పనిచేసేవాడు. మజా చేసిన పబ్‌లో విచారణ బెంగళూరు ఆర్ఆర్ నగరలోని స్టోని బ్రూక్ పబ్‌లో సోమవారం నాడు పోలీసులు మహజర్ చేపట్టారు. దర్శన్, రెస్టారెండ్ యజమాని వినయ్, ప్రదోశ్, పవన్ ఇతర నిందితులతో పాటు కమెడియన్ చిక్కణ్ణను కూడా పోలీసులు తీసుకువచ్చారు. హత్య జరిగిన 8వ తేదీన పబ్‌లో జరిగిన పారీ్టలో చిక్కణ్ణ కూడా ఉన్నాడని తెలిసి ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చి మహజర్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో పరిసరాల్లో బందోబస్తు పెంచారు. నన్ను వదిలేయండి ప్లీజ్ సినిమాలు, నిజ జీవితంలో దర్జా అనుభవించే దర్శన్‌కు పోలీస్ ఠాణా, విచారణ చాలా కష్టంగా ఉన్నాయి. కాళ్లు పట్టుకుంటాను... నన్ను వదిలేయండి అని పోలీసులను దర్శన్ వేడుకుంటున్నట్టు సమాచారం. ఈ హత్య తాను చేయమని చెప్పలేదని, ఏ తప్పూ చేయలేదని ప్లీజ్ వదిలేయండి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలిసింది. గత వారం రోజులుగా దర్శన్ ఏ ప్రశ్నలు వేసినా ఇదే సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. రాజకాలువలో మొబైల్ కోసం రేణుకాస్వామి మొబైల్‌ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణుకాస్వామిని హత్య చేశాక అతని మొబైల్‌ను సుమనహళ్లి అనుగ్రహ లేఔట్లో బ్రిడ్జ్ వద్ద ఉన్న రాజకాలువలో శవాన్ని, మొబైల్‌ని పారేసినట్టు నిందితుడు వినయ్ చెప్పడంతో, సోమవారంనాడు ఫోన్ కోసం రాజకాలువలో వెతికారు. బీబీఎంపీ పౌర కారి్మకులతోనూ గాలించినా ఫోన్ ఇంకా దొరకలేదు.తప్పు చేస్తే శిక్ష పడాలి: ఉపేంద్ర రేణుకాస్వామి హత్యపై కన్నడ హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సోమవారంనాడు ప్రముఖ హీరో ఉపేంద్ర ఎక్స్‌లో స్పందిస్తూ, ఈ హత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనంగా మారింది. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రమ్య, చేతన్, సుదీప్ తదితరులు ఇదివరకే స్పందిస్తూ రేణుకాస్వామి భార్యకి పుట్టబోయే బిడ్డకు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓ టీవీ నటి దర్శన్ చేసిన దానధర్మాలే ఆయనను కాపాడతాయని పోస్ట్ చేశారు. -
పవిత్రగౌడ ఇంట్లో సోదాలు.. దుస్తులు, చెప్పులు సీజ్
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆర్ఆర్ నగరలో ఉన్న పవిత్రగౌడ ఇంటికి ఆమెను, ఆమె అనుచరుడు పవన్‌ను తీసుకెళ్లారు. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పవిత్రగౌడ మేనేజర్ దేవరాజును పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన షెడ్ వద్దకు పవిత్రగౌడతో కలిసి దేవరాజు కూడా వెళ్లాడని దర్యాప్తులో తేలడంతో శనివారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది. రేణుకాస్వామి ఉంగరం, చైన్ తదితరాలను నిందితులు లాక్కున్నట్టు పోలీసులు తెలిపారు.దర్శన్‌ను కలిసిన నిందితులురేణుకాస్వామి మృతదేహం లభించగానే లొంగిపోవాలని డీల్ కుదుర్చుకున్న నిందితులు లొంగిపోవాలా, లేక కొన్ని రోజులు వేచి చూడాలా అనే మీమాంసలో పడిపోయారు. దీనిపై మైసూరులో ఒక హోటల్లో ఉన్న దర్శన్ వద్దకు వెళ్లి చర్చించారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు సదరు హోటల్లో కూడా మహజర్ చేయవచ్చని తెలుస్తోంది.కరెంటు షాకిచ్చి..రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తరువాత ఆ పరికరాన్ని బెంగళూరు–మైసూరు హైవేలో విసిరేశారు. దీంతో పోలీసులు విజయనగర ప్రాంతంలో హైవేలో పరికరం కోసం గాలింపు చేపట్టారు.సీఐ గిరీష్ నియామకంరేణుకాస్వామి కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలోకి సీఐ గిరీష్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలిక సీఐ గిరీష్ బదిలీపై వచ్చారు. తరువాత అక్కడే రేణుకాస్వామి హత్య వెలుగు చూసింది. దర్శన్ అరెస్టు సమయంలో గిరీష్‌ను మళ్లీ సీకే అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. అయితే కేసు విచారణకు అవసరమని గిరీష్‌ను తనిఖీ అధికారిగా నియమించారు. -
Darshan: రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..
బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతో పాటు 14 మందికి 5 రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు పరిచారు. దర్శన్, పవిత్రగౌడ, పవన్, రాఘవేంద్ర, నందీశ్, జగదీశ్, అనుకుమార్, వినయ్, నాగరాజ్, లక్ష్మణ, దిలీప్, ప్రదోశ్ , కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని, కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది.ప్రత్యేక న్యాయవాది నియామకంరేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రసన్న కుమార్‌ను సర్కారు నియమించింది.క్షమించమన్నాడు, డబ్బులు ఇచ్చి పంపించమన్నాదొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్ పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాచార్యను ఉంచిన షెడ్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దర్శన్ ఏం చెప్పారంటే... సార్.. నాకేం తేలీదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దీంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి వచ్చేశాను. నేడు షెడ్ నుండి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు. ఇంతకు మించి తనకేం తెలీదని చెబుతున్నాడు. షెడ్ వద్దకు దర్శన్, పవిత్ర కార్లు రావడం, శవం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది.రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..దొడ్డబళ్లాపురం: డి.బాస్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ఎలా హత్య చేసిందీ పోలీసులు వివరాలు లాగేకొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్లో బంధించి హింసించిన నిందితులు బిరియాని తెప్పించి మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి. ఆ సంగతి తెలిసి కావాలనే అతనితో చనిపోయే ముందు బిరియాని తినిపించారు. బాస్ వస్తారు, ముక్కలు తిని రెడీగా ఉండు, తన్నులు తినడానికి బలం కావాలి కదా.. అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు. నిందితుల్లో ఒకడైన దీపక్ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు. -
చీరలో కుందనపు బొమ్మలా సీరియల్ బ్యూటీ తేజస్విని (ఫొటోలు)
-
హత్య జరుగుతుందని ఊహించలేదు
దొడ్డబళ్లాపురం: తనకు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడని రేణుకాస్వామి గురించి దర్శన్‌కు చెప్పానే కానీ, హత్య చేస్తారని అసలు ఊహించలేదని రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ చెప్పుకొచ్చారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె.. రేణుకాస్వామిని హత్య చేస్తారని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేదాన్నని అన్నారు. అశ్లీల మెసేజ్ విషయం దర్శన్‌కు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనకు తెలుసని, అందుకే మొదట దర్శన్‌కు చెప్పకుండా ఆ మెసేజ్‌ను పవన్‌కు చూపించినట్లు చెప్పినట్లు సమాచారం. నోరు విప్పని దర్శన్ రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరెస్టైన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు గురువారం అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు. నగదు సీజ్ రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్‌కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు. అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్‌లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్‌గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు.మరో ఇద్దరి అరెస్ట్ దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. చిత్రదుర్గకు చెందిన అనుకుమార్ ఆలియాస్ అను, జగదీష్ ఆలియాస్ జగ్గును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 16కి చేరింది. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకురావడంలో వీరు ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. -
లంగా ఓణీలో తేజస్విని గౌడ.. ఇంత అందంగా ఉందేంటి! (ఫొటోలు)
-
Tejaswini Gowda: సముద్రతీరాన ఏంజెల్లా తేజస్విని (ఫోటోలు)
-
Tejaswini Gowda: ఉగాది సెలబ్రేషన్స్.. క్యూట్ పిక్స్‌తో సీరియల్ బ్యూటీ తేజస్విని సెన్సేషన్ (ఫోటోలు)
-
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
Tejaswini Gowda: అమర్దీప్ భార్య, నటి తేజస్విని బ్యూటిఫుల్ లుక్స్ (ఫోటోలు)
-
ఐక్యతే పెట్టుబడి.. గుర్తింపే లక్ష్యం..
రాజ్యాధికారం లేకే వెనుకబడిపోతున్నాం ఆత్మీయ సత్కార సభలో ప్రజాప్రతినిధులు గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : ఐక్యతే పెట్టుబడిగా బీసీలంతా నడవాలని, సంఘానికి నేనేమైనా చేశానా.. చేయగలనా అని ప్రతి బీసీ ప్రశ్నించుకోవాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. అధిక జనాభా కలిగిన బీసీలను ఆయా రాజకీయ పార్టీలు గుర్తించేలా మన ఉద్యమాలు, పోరాటాలు ఉండాలన్నారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసన మండలి ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావులకు ఆదివారం రాజమహేంద్రవరంలోని జేకే గార్డెన్స్‌లో రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ మంజునాథ కమిషన్ విచారణకు మనమంతా బాగా స్పందించామని, పార్టీలకు అతీతంగా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని, ఐక్యతే మన శక్తి... స్ఫూర్తి అని నినదించారు. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. మంత్రి పితాని మాట్లాడుతూ తమకు ప్రస్తుతం లభించిన పదవులు కేవలం బీసీ కులాలు, ఆ సంఘాల ప్రజలను చూసి ఇచ్చినవేనని, ఈ విషయాన్ని మరచిపోయి రాజకీయాలు చేయబోమని, బీసీల కోసం ఎల్లపుడూ తపిస్తామన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ, సంఘాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. తాము ఏ స్థాయిలో ఉన్నా సంఘాన్ని మరువబోమన్నారు. అంబేద్కర్ భవన్ లాగే ప్రతి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ల నిర్మాణానికి ప్రయత్నిస్తామని, అందుకు స్థల దాతలు ముందుకు రావాలన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. దీనిలో భాగంగా కొత్తపేటలో బీసీ కన్వెన్షన్ నిర్మిస్తున్నామన్నారు. అంగర రామ్మోహన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా బీసీలు ఒక శక్తిగా అవతరించాలన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమౌళి తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, విప్ అంగర రామ్మోహనరావులను సత్కరించారు. కార్పొరేటర్లు గుత్తుల మురళీధరరావు, బాపన సుధారాణి, పిల్లి నిర్మల, ఆత్మీయ అభినంద సత్కార సభ ఆహ్వాన కమిటీ సభ్యులు బుడ్డిగ శ్రీనివాస్, కుడుపూడి పార్థసారధి, వాసంశెట్టి గంగాధర్, ఆతిథ్య కమిటీ సభ్యులు సూరంపూడి శ్రీహరి, మార్గాని రామకృష్ణగౌడ్, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, పాలిక శ్రీను, పెంకే సురేష్, లక్ష్మితులసి తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే !
జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ బెంగళూరు : వేరే పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో బహిరంగ రహస్యమేనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ వ్యంగ్యంగా అన్నారు. ఇందుకు బంగారప్ప, రాజశేఖరమూర్తిల రాజకీయ జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు. బెంగళూరులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శ్రీనివాస్ ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే తన మద్దతు ఉంటుందన్నారు. ఇతర బీజేపీలోకి కాని, ఇతర పార్టీల్లోకి కాని వెళ్తే తాను ఏమీ చేయలేనని తెలిపారు. నాకు ఒక్కలిగ సంఘానికి సంబంధం ఏమి. నేను ఒక రాజకీయ వేత్తను. అరుునా ఒక్కలిగ సంఘాన్ని బాగు చేస్తానని మంత్రి డీ.కే శివకుమార్ చెప్పారు. కదా? చూద్దాం.’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు దేవెగౌడ సమాధానమిచ్చారు. -
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ నగరంలో బీజేపీ బృహత్ చైతన్య ర్యాలీ బెంగళూరు: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కేంద్ర మంత్రి డి.వి.సదానంద గౌడ విమర్శించారు. ఆదివారమిక్కడి బ్యాటరాయణపుర ప్రాంతంలో నిర్వహించిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశం, బృహత్ చైతన్య ర్యాలీని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సదానంద గౌడ మాట్లాడుతూ....‘ప్రధాని నరేంద్రమోదీ నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. 3-4నెలలకోసారి జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కేంద్రంతో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. అయితే ఈ సమావేశాలకు సీఎం సిద్ధరామయ్య హాజరు కావడమే లేదు. ఏదో ఒక సాకు చెప్పి ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. దీన్నేనా అభివృద్ధి మంత్రం అంటారు. బహుశా రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు అధికారుల ఆత్మహత్యలపై ప్రధాని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే సమావేశానికి గైర్హాజరయ్యారేమో!’ అని కేంద్ర మంత్రి సదానందగౌడ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైదని, అయినా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ....కాంగ్రెస్ ప్రభుత్వ అరచకాలతో ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందని మండిపడ్డారు. సిద్ధరామయ్య మంత్రి వర్గ సహచరులు రూ.11లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను గెలిచే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రచిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కార్యకర్తలు యడ్యూరప్పను వెండి కిరీటంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎస్.ఆర్.విశ్వనాథ్, మునిరాజు తదితరులు పాల్గొన్నారు.