GPS
-
సాంకేతికతతో వాహన చోరీకి చెక్
గుడ్లవల్లేరు: మన ఇంటి ఎదుట సీసీ కెమెరాలున్నా.. లాక్ చేసిన వాహనాలు సైతం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల చోరీని అరికట్టవచ్చు. ఒకవేళ వాహనాలు చోరీకి గురైనా దొంగలను ఇట్టే పట్టించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. అదే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతమైంది. మన దేశంలో పట్టణాల్లో ఉపయుక్తమవుతోంది. లక్షల వ్యయంతో లారీలు, కార్లు, బైకులు కొనుగోలు చేసే వాహనదారులు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కొంతఖర్చుతో అమర్చుకోవాలని పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీపీఎస్ శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ జీపీఎస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వీటీఎస్కు వచ్చి అక్కడి నుంచి సెల్ టవర్ ద్వారా సర్వర్‌కు వస్తాయి. వీటీఎస్ పూర్తిగా వెబ్ ద్వారా పని చేస్తుంది. మన వాహనంలో జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్డీ యూనిట్‌ను అమర్చుకోవాలి. సర్వర్ నుంచి యూజర్‌కు వివరాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్లకు అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాహనం ఎక్కడికి వెళ్తున్నా.. మొబైల్లో చూసుకోవచ్చు. మార్కెట్లో సెక్యూర్టీ డివైజ్లుటూ వీలర్స్‌కు సైతం సెక్యూర్టీ డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా వెహికల్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాహనాలకు అమర్చితే చోరీలకు కళ్లెం వేసినట్లే. చోరీ చేసినా డివైజ్ యాక్టివేట్ అయి ఇంజిన్ స్టార్ట్ కాకుండా పోతుంది. ఒకవేళ బైక్‌లో డివైజ్‌ను తొలగించినా బైక్ హారన్ మోగటంతో పాటు బండి స్టార్ట్ అవ్వదు. జీపీఆర్ఎస్ ద్వారా బైకిస్ట్ ఫోనుకు అనుసంధానం చేయటం వలన ఆ మొబైల్‌కు సమాచారం వెళుతుంది. ఫోనుకు అలెర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఎన్నెన్నో ప్రయోజనాలు...👉మహిళల ప్రయాణంలో వెహికల్ ట్రాకింగ్‌తో ఎంతో మేలు చేకూరుతుంది. ప్రయాణంలో వారు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. గమ్యస్థానం చేరేంతవరకు ఆందోళన చెందకుండా ఉండవచ్చు. 👉 బ్యాంకులకు భారీ మొత్తం నగదును తరలించేటపుడు ఆ వాహనం ఎక్కడుందో బ్యాంకర్లు తెలుసుకోవచ్చు. 👉 దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, కార్లు, విలువైన వస్తువులు తీసుకువెళ్లే భారీ కంటైనర్లు ఎక్కడి వరకు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.దొంగల్ని ఇట్టే పట్టేయవచ్చు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ దొంగల్ని సైతం ఇట్టే పట్టించేస్తుంది. కార్లు, లారీల యజమానులంతా రక్షణగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకుంటే చోరీలను అరికట్టవచ్చు. మా శాఖతో పాటు రవాణా శాఖ వారు కూడా అన్ని వాహనాలకు సాంకేతికతను వినియోగించుకోవలసిందిగా ప్రచారం చేస్తున్నాం. – ఎన్.వి.వి.సత్యనారాయణ, గుడ్లవల్లేరు ఎస్.ఐ -
జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది. ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకుని తెలంగాణ వాసి మృతి
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖలీ అనే ఎడారిలో చిక్కుకుని 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఎడారిలో దారితప్పి..ఎటు వెళ్లాలో తెలియక.. మరోవైపు తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం లేక ఐదు రోజులుపాటు నరకయాతన అనుభవించి అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. వివరాల్లోకెళ్తే..కరీంనగర్‌కి చెంఇన 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు.జీపీఎస్ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్మెంట్కు చెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు.దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.(చదవండి: వైద్యుడి రూపంలోని రాక్షసుడు) -
చిచ్చు రేపిన జీపీఎస్... బాబు, పవన్ ల మధ్య దూరం
-
జీపీఎస్ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి
అనకాపల్లి/భీమవరం: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళన బాటపడ్డాయి. రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తుందని ఆశించామని.. కానీ, మా ఆశలను వమ్ముచేస్తూ జీపీఎస్‌కు చట్టబద్ధత తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడం చాలా అన్యాయమంటూ ఆదివారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చినబ్బాయిలు విమర్శించారు. గెజిట్ కాపీలను దగ్థంచేశారు. పైగా.. జీపీఎస్ విధానాన్ని అమలుచేస్తూ పాత తేదీలతో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమని చెప్పారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలుచేస్తామని పవన్‌కళ్యాణ్, నారా లోకేశ్‌లు కూడా హామీ ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లయ్యబాబు, ఎంవీ అప్పారావు, జిల్లా కార్యదర్శి శేషుబాబు, కోశాధికారి జోగా రాజేష్, మున్సిపల్ ఉపాధ్యాయుల నాయకులు సతీ‹Ù, మోడల్ స్కూల్ నాయకులు ఆశాలత, ఏపీసీపీఎస్ఈఏ నాయకులు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేస్తుందని భావించామని.. కానీ, అందుకు విరుద్ధంగా కొత్త ప్రభుత్వం జీపీఎస్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అన్నారు. భీమవరంలో ఆదివారం వారు జీఓ కాపీలను దగ్థం చేశారు. కొలువుదీరిన ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలుచేయడం దేనికి సంకేతమని వారు ప్రశి్నంచారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు సీహెచ్ కుమారబాబ్జి, డి. ఏసుబాబు, ఎస్.రత్నరాజు, జి. రామకృష్ణంరాజు పాల్గొన్నారు. -
ఇంత ఘోరంగా మోసం చేస్తారా?
సాక్షి, అమరావతి/నూజివీడు/సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి పార్టీలు మాట తప్పి తమను నిలువునా మోసం చేశాయని మండిపడ్డాయి. వెంటనే గెజిట్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఇది దుర్మార్గం: ఎస్జీటీఎఫ్ ఎన్నికల ప్రచారంలో జీపీఎస్ దుర్మార్గమని ప్రచారం చేసి.. ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అని కూటమి ప్రభుత్వంపై సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం జీపీఎస్‌పై ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయన్నారు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేశాయని మండిపడ్డారు. మాట తప్పడం అన్యాయం: సీపీఎస్ ఉద్యోగుల సంఘం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీపీఎస్, జీపీఎస్‌పై సమీక్ష జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఎలాంటి సమీక్ష లేకుండా గెజిట్ జారీ చేశారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు గార్లపాటి సునీల్ మండిపడ్డారు. గెజిట్ రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సహనాన్ని పరీక్షించొద్దు: ఆప్టా ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న జీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా) డిమాండ్ చేసింది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకా‹Ùరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. మేం కోరుకున్నది ఓపీఎస్: బీటీఏ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వంపై బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోజ్ కుమార్, సీహెచ్.రమేశ్ మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకున్నది పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్) మాత్రమేనన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పిన కూటమి పారీ్టలు.. అధికారంలోకి వచ్చాక జీపీఎస్ గెజిట్ జారీ ద్వారా ముంచేసిందని మండిపడ్డారు. 16, 17 తేదీల్లో నిరసన: ఏపీటీఎఫ్ జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. 2004లోపు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన టీచర్లు, పోలీసులు, ఉద్యోగులకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 16, 17 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్టు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి తెలిపారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టే లా, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, 12వ పీఆర్సీ ప్రక్రియ మొదలుపెట్టాలని, ఆలోగా 30 శాతం మధ్యంతర భృతి విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానమే కావాలి: పీఆర్టీయూ ఏపీ పాత పెన్షన్ విధానమే కావాలని.. జీపీఎస్ గెజిట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని, అంతవరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
YS Jagan: కేంద్రంలోనూ జీపీఎస్..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీం (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం–సీపీఎస్) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుల వేస్తోంది. 2004 నుంచి అమల్లోకి వచి్చన జాతీయ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు రిటైరయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, పాత పెన్షన్ స్కీంను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.నిజానికి.. 2004లో తీసుకొచి్చన సీపీఎస్ ప్రకారం.. ఉద్యోగులు పది శాతం, ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమచేస్తాయి. మార్కెట్ అధారిత రిటర్న్‌ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది. మార్కెట్లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు. కొందరు ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం 20 శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ మేరకు సీపీఎస్‌ను రద్దుచేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.అయితే, సీపీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం.. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి. అలాగని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విదానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆరి్థక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడటమే కాకుండా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో.. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్‌ను)ను రూపొందించింది. దీని ప్రకారం.. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రిటైరైన తర్వాత రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. 62 ఏళ్లకు రిటైరైతే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచారు.సీపీఎస్‌లో మార్పులకు కేంద్రం కమిటీ.. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీం విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆరి్థక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటుచేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం తమతమ కంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తూనే 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేíÙంచింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమరి్పంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్‌లోని అంశాలనే సిఫార్సు చేసిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీంను అమలుచేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమవుతోంది. జగన్ సర్కార్ చేసిన మార్పులివే.. 2004 పెన్షన్ సంస్కరణలను కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీంలో మార్పులు చేస్తూ జీపీఎస్‌ను తీసుకొచ్చింది. – ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ గ్యారెంటీని జగన్ సర్కారు ఇచ్చింది. – తద్వారా ఏపీజీపీఎస్లో ఉద్యోగులు రిటైరయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. – అలాగే, ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి హమీ ఇచ్చిన పెన్షన్‌లో 60 శాతం పెన్షన్ వస్తుంది.– ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. – అంతేకాక.. ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తిస్తుంది. -
దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్ పాలన
-
ఆకాశంలో శాటిలైట్ల లెక్క తెలుసా?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా..వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఓసారి తెలుసుకుందామా.. మూడు కక్ష్యల్లో.. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈఓ), మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. జీఈఓభూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. ఎంఈఓభూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.ఎల్ఈఓభూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. స్టార్ లింక్ శాటిలైట్లతో.. ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్ లింక్’శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్‌లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
అప్పుల్లో అడుగునే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. పేదలను ఆదుకున్న డీబీటీ.. కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే. -
మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలుండవ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్ అవర్స్‌లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆ వాహనాలకు GPSలు
-
ఉద్యోగుల జీపీఎస్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానిపై లోతుగా అధ్యయనం చేస్తారు. నిబంధనలను అనుసరిస్తూనే, లబ్ధిదారులకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేసేలా దానిని రూపొందిస్తారు. ఇటువంటిదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్ స్కీము (ఏపీజీపీఎస్). కేంద్ర ప్రభుత్వం 2004లో చేసిన పింఛను సంస్కరణలను కాపాడుతూనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అటు ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేసేలా ఆంధ్రఫ్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయి పత్రికలు కూడా వైఎస్ జగన్ తెచ్చిన జీపీఎస్‌ను మంచి పథకంగా అభివర్ణిస్తున్నాయి. దీనిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘మింట్’ బ్యానర్ కథనమే ప్రచురించింది. ఏపీజీపీఎస్ పింఛను సంస్కరణలను ఎలా కాపాడుతోందో ఈ కథనం వివరించింది. పదవీ విరమణ చేసిన తరువాత చివరి నెల డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పింఛను వచ్చేలా ఉద్యోగులకు ఏపీజీపీఎస్ ద్వారా గ్యారెంటీ కల్పిస్తూనే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం పడకుండా సరికొత్త సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిందని మింట్ పత్రిక ప్రశంసించింది. వివేచనతో వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం పాత పింఛను పథకంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భవిష్యత్‌లో మోయలేని ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పెన్షన్ స్కీము ద్వారా పింఛను సంస్కరణలు తెచ్చింది. మెజారిటీ రాష్ట్రాలు కూడా 2004 నుంచి జాతీయ పెన్షన్ స్కీమును అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 2004 నుంచి ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ జాతీయ పెన్షన్ స్కీము అమలు చేస్తున్నారు. దీనినే ఎంప్లాయీస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముగా (సీపీఎస్) కూడా పేర్కొంటారు. ఇందులో పింఛను ఎంత వస్తుందనేది మార్కెట్ పరిస్థితులనుబట్టి ఉంటుంది. కచ్చితంగా ఎంత వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పాత పెన్షన్ స్కీము అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వీటిపై లోతుగా అధ్యయనం చేసింది. భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పెన్షన్ సంస్కరణలపై రాజీపడకుండా మధ్యే మార్గంగా ఏపీజీపీఎస్ను తీసుకువచ్చిందని మింట్ పత్రిక ప్రశంసించింది. ఒక వేళ భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయకుండా పాత పింఛను పథకాన్నే అమలు చేస్తే పదేళ్ల తరువాత ఉద్యోగులకు జీతభత్యాలిచ్చే పరిస్థితి కూడా ఉండదని, మొదటికే మోసం వస్తుందని తెలిపింది. రాజకీయం కోసం ఆలోచన చేయకుండా భవిష్యత్ తరాల కోసం, ఉద్యోగుల డిమాండ్‌లో కూడా న్యాయం ఉందని భావించి సుదీర్ఘ కసరత్తు చేయడంతోపాటు వివేచనతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఇటు ఉద్యోగులకు పెన్షన్ గ్యారెంటీ ఇస్తూనే, మరోపక్క రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఏపీజీపీఎస్ను హైబ్రీడ్ మోడల్లో అమలుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా 2004 పెన్షన్ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడింది. పాత పింఛను స్కీమును అమలు చేస్తే 2041 కల్లా అప్పు కూడా పుట్టని దశకు రాష్ట్రం చేరుతుంది. అంతే కాకుండా 2050కల్లా ద్రవ్యలోటు 8 శాతానికి చేరుతుంది. ఇవీ పింఛను స్కీములు పాత పింఛను విధానంపాత పెన్షన్ స్కీము అమలు చేయడం కేంద్రంపైన, రాష్ట్రాలపైన ఆర్థికంగా పెనుభారం పడుతుంది. దీన్ని భవిష్యత్‌లో కొనసాగించడం సాధ్యం కాదు. పెన్షన్ల భారం 4.5 రెట్లు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో జీతభత్యాలు కూడా ఇవ్వలేనంతగా భారం అవుతుంది. 2004లో తెచ్చిన జాతీయ పింఛను పథకం జాతీయ పెన్షన్ స్కీము కింద ఉద్యోగులకు వచ్చే పెన్షన్ పరిమాణాన్ని మార్కెట్ పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఎంత పెన్షన్ వస్తుందనేది కచ్చితంగా చెప్పలేరు. అయితే ఈ స్కీము రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీజీపీఎస్ ఉద్యోగుల పదవీ విరమణ చేసిన తరువాత చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి ఆ పెన్షనలో 60 శాతం వస్తుంది. ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. హెల్త్ స్కీము కూడా వర్తిస్తుంది. -
ఉద్యోగులకు మేలు చేసే జీపీఎస్
-
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
'బ్రా' ధరించిన పాక్ కెప్టెన్.. షాక్ తిన్న ఫ్యాన్స్; వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని అడగ్గానే జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన గిఫ్ట్ కంటే బాబర్ ఆజం తాను వేసుకున్న ఇన్నర్ వేర్‌ను చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. సాధారణంగా పురుషులు బనియన్ లేదా ట్రక్ వేసుకోవడం చూస్తుంటాం. అయితే మహిళలు ధరించే బ్రాను పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ధరించడం ఆశ్చర్యపరిచింది. నిజానికి బాబర్ ఆజం వేసుకున్నది స్పోర్ట్స్ బ్రా. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బ్రా మార్కెట్లో ట్రెండింగ్ లిస్టులో ఉంది. స్పోర్ట్స్ బ్రా లాగా ఉండే దీనిని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ధరించిన వ్యక్తి కూడా దానిని గుర్తించలేనంత తేలికగా ఉంటుంది. ఈ పరికరంలో GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్‌ని లెక్కించుకునేందుకు వాడుతుంటారు. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. దీని నుంచి అందుకున్న సమాచారంతో సెంట్రల్ డేటాబేస్ అనుసంధానిస్తుంటారు. ఇది విశ్లేషకులు పరిశీలన చేసి, ప్లేయర్ ఫిట్నెస్ను అంచనా వేస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 2018లో భారత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీనిని టీమిండియాకు తీసుకువచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టు ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి లంకకు గట్టిషాక్ ఇచ్చింది. సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. లంకతో సిరీస్ ముగిశాకా పాక్‌కు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ వరకు ఆ జట్టుకు విశ్రాంతి లభించినట్లే. Babar Azam Gifted his Test Jersey to a Young Fan So Cute🇵🇰💯. #BabarAzam #NoChangeNeededPCB pic.twitter.com/KBMtBAYFcE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 27, 2023 చదవండి: Major League Cricket 2023: 'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!' -
‘థ్యాంక్యూ సీఎం సార్’.. సీపీఎస్‌కు బదులు మెరుగైన జీపీఎస్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలను ఉదారంగా పరిష్కరించిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ బదులు మెరుగైన పెన్షన్ వచ్చేలా జీపీఎస్ తేవడం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇవన్నీ ధైర్యం గల ముఖ్యమంత్రిగా జగన్ చేశారని తెలిపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారని, పీఆర్సీ కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయారని, ప్రభుత్వ ఉద్యోగులుగా వీటిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జీపీఎస్ దేశానికే రోల్‌మోడల్ జీపీఎస్‌లో ఉద్యోగులకు తొలుత బేసిక్‌లో 30 శాతం వరకే పెన్షన్ వచ్చేలా ప్రతిపాదనలు చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా బేసిక్‌లో 50 శాతం పెన్షన్ వచ్చేలా మార్పులు చేశారని, అలాగే సీపీఎస్‌లో లేని డీఆర్‌ను జీపీఎస్‌లోకి తెచ్చారని, గతంలోకన్నా మెరుగ్గా ఉందని సీపీఎస్ ఉద్యోగలు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారని, ఏ రాష్ట్రంలోనూ జీపీఎస్ ప్రయోజనాలు లేవని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 15 వేల కుటుంబాలకు మేలు చేశారని అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లో అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. జీపీఎస్ విధివిధానాలు వచ్చిన తరువాత ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలిగిపోతాయని చెప్పారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి వేతనాలు ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటే వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించారని గుర్తు చేశారు. 12వ పీఆర్సీని ముందుగానే ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతులు తెలిపినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. అశోక్‌బాబుకు సవాల్ ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ నేత అశోక్‌బాబు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని, ఆయన బహిరంగ చర్చకు వస్తే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ, ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసిందని, ఇంకా ఏమైనా ఉంటే అమలు చేయడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం రైగ్యులరైజ్ చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా 10 వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చదవండి: ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో.. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్‌తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్‌లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్‌తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మీరు బాగుంటేనే ప్రజలు బాగు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా సరే చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారంతా చిరునవ్వుతో ఉండేలా చూస్తామని అన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని, ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్తగా.. జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీం) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, 12వ పీఆర్సీ ఏర్పాటు సహా పలు అంశాలపై ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సదర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే.. పరిష్కారాల కోసం తపనపడ్డాం ♦ ఉద్యోగుల మనసు కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే పెన్షన్ సహా కొన్ని సమస్యల పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. గతంలో ఎవరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంతగా తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి.. అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలనే ఆలోచన చేశాం. వీటన్నింటి దృష్ట్యా జీపీఎస్ తీసుకువచ్చాం. ♦ రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్ అయిన తర్వాత పింఛన్ వస్తుంది. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని ఆలోచన చేశాం. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం. ♦ ఉద్యోగులకు న్యాయం జరగాలి.. మరోవైపు నడపలేని పరిస్థితులు రాకుండా కూడా చూడాలని ఆలోచించాం. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు ఆర్థిక శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఫలితంగా జీపీఎస్‌కు రూపకల్పన చేశాం. చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి మంచి జరిగేలా అడుగులేశాం ♦ న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం. అసలు చాలా మంది ఎఫర్ట్ కూడా పెట్టరు. ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. అందుకే తొలిసారిగా పరిష్కారం దిశగా అడుగులు వేశాం. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మంచి ఆలోచన చేశాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం. నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా అధికారులు నిర్ణయించారు. అలాగైతే మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. తద్వారా గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. చిరునవ్వుతో ఉండేలా చేస్తాం ♦ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. 010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకున్నాం. ♦ ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో (ఉద్యోగులు) చిరునవ్వు ఉండేలా చేస్తాం. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ♦ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఊహించినట్లే విషం కక్కారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రామోజీ?
ప్రభుత్వ నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బదులు జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తే, దానిలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ పాయింట్లను విశ్లేషించవలసిన ఒక వర్గం మీడియా దారుణమైన రాతలకు పాల్పడింది. అసలు వార్తను కాకుండా, ఉద్యోగులకు దగా..దగా.. అంటూ పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టిన ఈనాడు మీడియాను ఏమనాలి!. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా చండాలంగా మాట్లాడడానికి సాహసించలేదు. కాని ఈనాడు మాత్రం ఏదో విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టాలని విశ్వయత్నం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా అసంతృప్తి చెంది ఉంటే ఈపాటికి ఎంత ఆదోళన వచ్చేది. అది జరగలేదనే బాధతో ఈనాడు మీడియా తనే ప్రతిపక్షం అనుకుని జర్నలిజం విలువలకు పాతరేస్తూ రాసింది. మామూలుగా అయితే ఏమి చేయాలి?. ముందుగా అసలు క్యాబినెట్ నిర్ణయం ఏమిటి? దాని పరిణామం ఏమిటి? అన్నదాని గురించి తొలుత వార్తను ఇవ్వాలి. ఆ తర్వాత నిజంగా ఎన్.జి.ఓ.లకు అన్యాయం జరిగితే దాని గురించి ఇవ్వవచ్చు. అవేమీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు దగా చేశారని నీచంగా రాశారు. గత ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట నిజమే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై గట్టిగా పరిశీలన చేశారు. అదే సందర్భంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇంతగా ఉంటాయని ఊహించలేదని, అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన జీపీఎస్‌ను తీసుకు వస్తున్నామని కొంతకాలం క్రితమే ప్రకటించారు. ఇలా నిజాయితీగా ఎంతమంది చెబుతారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్ని విన్యాసాలు చేశారో గుర్తు లేదా!. చివరికి రుణమాఫీ చేసేశాం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలా అసత్యాలు చెప్పినవారేమో గొప్పవారట. ఇప్పుడు నిజాయితీగా సమస్యను వివరించినవారేమో దగా చేసినట్లట. ఇలా ఉంది ఈనాడు మీడియా సూత్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జగన్ ఇచ్చిన హామీలు పదింటిలో ఎనిమిదిని నెరవేర్చితే దాని గురించి చెప్పరు. మిగిలిన రెంటిలో కొంతమేర తీర్చారు. అయినా సీపీఎస్ రద్దు చేయలేదని, దగా అని చెడరాశారు. మరి చంద్రబాబు టైమ్‌లో ఎందుకు దానిని రద్దు చేయలేదు?. పోనీ ఎన్.జి.ఓలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్ని అమలు చేశారు? వాటిపై ఎప్పుడైనా సమీక్షకు ఎల్లో మీడియా సిద్దం అవుతుందా? ఆ పని చేయరు. కేవలం బురదచల్లుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: జగన్ దూకుడు.. పచ్చ బ్యాచ్‌కి కడుపులో మంట దీని అంతటికి ఒకటే కారణం. తమకు కావల్సినవారు అధికారంలో లేరన్న దుగ్దతో పాటు , తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలోని ఆర్ధిక అక్రమాలన్నిటిని జగన్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోందన్న కసి, కక్షతో ఇలాంటి నీచమైన రాతలకు పాల్పడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా ఈ మీడియాది ఏడుపుగానే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు.. వారికి అన్యాయం చేశారు అని రాస్తారు. ముందుగా ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆ తర్వాత రాస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు. సీపీఎస్ బదులు వచ్చిన జిపిఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి నెల బేసిక్ లో ఏభై శాతం మొత్తాన్ని పెన్షన్ తో పాటు ఏటా రెండు రెండు కరువు భృతి(డి.ఆర్.) ఇవ్వాలని సంకల్పించారు. దీనివల్ల ఉద్యోగికి నష్టం ఏమీ ఉండదు. తొలుత చివరి జీతం బేసిక్ లో 33శాతం పెన్షన్ గా ఇవ్వాలని ప్రతిపాదించినా, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ దానిని ఏభై శాతంగా చేశారు. ఉన్నంతలో మెరుగైన స్కీమ్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. దానికి ప్రధాన ఉద్యోగ సంఘాలు కూడా దాదాపుగా ఓకే చేశాయి. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో ఈ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. అయినా ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నట్లుగా ఈనాడు, జ్యోతి వంటి తెలుగుదేశం మీడియా శక్తి వంచన లేకుండా దుష్ప్రచారం చేశాయి. ఒక విషయాన్ని విశ్లేషించడం వేరు. విషపూరితంగా రాయడం వేరు. ఎల్లో మీడియా చేస్తున్నది విషపూరిత ప్రచారమే తప్ప ఇంకొకటి కాదు. కొంతకాలం క్రితం టీచర్లు తమ డిమాండ్ ల కోసం విజయవాడకు వచ్చారు. అప్పుడు ఈ మీడియాలు పండగ చేసుకున్నాయి. కాని ఆ తర్వాత ప్రభుత్వం ఆయా అంశాలలో తీసుకుంటున్న శ్రద్ద కారణంగా అలజడి పెద్దగా లేదు. అది ఈనాడుకు, జ్యోతికి కడుపు మంటగా ఉంటోంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వారు ప్రభుత్వంపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో అసలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించింది ఆయనే. తత్ఫలితంగానే ఒకే పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇప్పుడు జగన్ దానిని తొలగించే యత్నంచేస్తే అది కూడా వెన్నుపోటే అని తప్పుడు వార్తలు రాశారు. చంద్రబాబు 2004 కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూసివేశారు. అప్పుడు ఆయనను గొప్ప సంస్కరణవాదిగా ఈనాడు ప్రచారం చేసింది. ఇప్పుడేమో టిడిపి పూర్తిగా తిరోగమనంలో ఉన్నా ఈనాడుకు తియ్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటోంది. వారిని తన కుటుంబ సభ్యులని జగన్ పలుమార్లు ప్రకటించారు. అదే చంద్రబాబు టైమ్‌లో అయితే ఉద్యోగులను ఎన్ని రకాలుగా యాతనలకు గురి చేసేవారో అనుభవించినవారందరికి తెలుసు. కేవలం కొద్ది మంది నాయకులను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కధ నడిపేది. కాని జగన్ ఉద్యోగుల అవసరాలను తీర్చే క్రమంలో ముందుకు వెళుతున్నారు. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంతగా గగ్గోలు పెడుతోంది కదా! తన సంస్థలలో ఉద్యోగుల పట్ల ఇలాగే కనికరంతో ఉంటున్నదా? వారికి కూడా మంచి పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ఎప్పుడైనా భావించిందా?ఈనాడుకు మంచి లాభాలే వస్తాయి కదా! కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల జీతాలపై అప్పుడప్పుడు ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తుంటుంది. వారి సిఫారస్‌లను యాజమాన్యాలు అమలు చేయవలసి ఉంటుంది. కాని ఎప్పుడూ ఆ సిఫారస్ లను యాజమాన్యాలు ఒప్పుకునేవి కావు. ఈనాడు రామోజీరావు అయితే తన సంస్తలోని జర్నలిస్టులందరితో తమకు సగం జీతాలు ఇస్తే చాలని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడాచేయించుకున్న ఘట్టాలు ఉన్నాయి. అసలు తమ సంస్థలలో యూనియన్లనే అనుమతించని రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల గురించి మాత్రం చాలా బాదపడుతున్నారు. వీరి రాతలను చూసి ఉద్యోగులు మోసపోకూడదనే ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. వారికి ఇంకేమైనా కోరికలు ఉంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవచ్చు. ఈనాడు, జ్యోతి రాసే అబద్దాలు నమ్మి భిన్నమైన మార్గంలోకి వెళితే, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేధింపులు కాని, సమయం మించి పని కాని పెద్దగా లేవు. అదే చంద్రబాబు టైమ్ లో అయితే ఆయన సోది ఉపన్యాసం వినలేక చచ్చేవారమని పలువురు అధికారులు, ఉద్యోగులు వాపోతుండేవారు. జగన్ తాను మాట ఇచ్చిన నేపధ్యంలో దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే చంద్రబాబు అయితే దానిని ఎలా ఎగవేయాలా అని ఆలోచిస్తుంటారు. ఎన్నికల ప్రణాళికలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. కనుక ఉద్యోగులు వీటన్నిటిని గమనించి ప్రభుత్వంతో ఏర్పడిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? -
ఉప్పొంగిన ఉద్యోగి!
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల విశ్రాంత జీవనానికి పూర్తి భరోసా కల్పిస్తూ జీపీఎస్ తేవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ, వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం తదితర నిర్ణయాలను కేబినెట్ ఆమోదించటాన్ని స్వాగతిస్తున్నారు. 20 ఏళ్ల కల నెరవేరిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సంబరాలు చేసుకున్నారు. వేతనాలు, సెలవుల రెగ్యులరైజేషన్, ఇతర అంశాల్లో జాప్యానికి ఇక తెరపడనుందని పేర్కొంటున్నారు. గొల్లపూడిలోని ఏపీవీవీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ డాక్టర్ పి.సరళమ్మ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, వైద్య విధాన పరిషత్ డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ రోహిత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డిని కలిసి యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలియచేస్తూ రాçష్ట్రవ్యాప్తంగా వారం పాటు సంబరాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. ♦ దివంగత వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్చిత్రపటాలకు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఎన్జీవోలు, కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం సార్ ధన్యవాదాలంటూ కృతజ్ఞతను చాటుకున్నారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ఉరేగింపు నిర్వహించారు. పీఆర్సీ, బకాయిల చెల్లింపు తదితర నిర్ణయాలపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఎస్.చలం పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్లోని ఎన్జీవో హోమ్‌లో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భట్లవెల్లిలో సీఎం జగన్ చిత్రపటానికి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఇందులో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. ♦ తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలని నిర్ణయించటం సంతోషకరమన్నారు. ♦ చిత్తూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట, తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు సీఎం చిత్రపటానికి క్షీభిషేకం నిర్వహించారు. ♦ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెల్లూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 115 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులరైజ్ కానున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డితో కలసి నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాల ఎదుట సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ♦ ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలును జన్మలో మరువలేమని రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రతినిధులు ఎస్.దొరబాబు, వేణుగోపాలరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పట్టించుకోకపోగా జీతాలు పెంచిన పాపాన పోలేదని చెప్పారు. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధి కరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విజయవాడ సత్యనారాయణపురంలోని కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ట్రేడ్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్, తిరుపతి జోనల్ ఇన్చార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ నిర్ణయంపై ఏపీ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకుంది. సుమారు 3,500 మంది రెగ్యులర్ కానున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు నల్లా అప్పారావు తెలిపారు. ♦ ఉత్తరాంధ్రలో జియ్యమ్మవలస, కురుపాం, బొబ్బిలిలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేయాలంటూ కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి పుష్పగుచ్ఛం అందజేశారు. -
Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి
(సాక్షి, అమరావతి) : ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలివ్వటం... తీరా ఆ ఓట్లతో గెలిచాక హామీలను పక్కనబెట్టడం!. దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది అదే. అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం... ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు. వాటినసలు చూడకుండానే పక్కనబెట్టేస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో... ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్ సీపీ తరఫున ఒకే ఒక పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని స్పష్టంగా చెప్పారు. జనం జై కొట్టారు. ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ జరిగింది. మరి సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా? దీనికి నిజాయితీగా వినవచ్చే సమాధానం ఒక్కటే. అది... ‘ఆ రెండూ తప్ప’ అని!. ఎందుకంటే మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకున్న జగన్... తొలి ఏడాదే దాన్లో పేర్కొన్న 95 శాతం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను (సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (ఓపీఎస్) తిరిగి అమల్లోకి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయారు. ఓపీఎస్‌ను తిరిగి తేవటం ఆచరణ సాధ్యం కాదని తేలినా... ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు మెరుగైన పెన్షన్ పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం రెండేళ్లుగా రకరకాల గ్రూపులతో చర్చించి కసరత్తు చేస్తూ వచ్చింది. చివరకు వారి ప్రయోజనాలను కాపాడేలా గ్యారంటీడ్ పెన్షన్ పథకానికి (జీపీఎస్) రూపకల్పన చేసింది. ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కూడా. ఇక అమలు కాని హామీల్లో రెండవది మద్య నియంత్రణ. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ చివరకు దాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా... రకరకాల సాంకేతిక, ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఆ హామీ అమలు కాలేదు. కాకపోతే నియంత్రణ దిశగా బలమైన అడుగులుపడ్డాయి. 2018–19తో పోలిస్తే విక్రయాలు 50 శాతానికన్నా తగ్గాయంటే నియంత్రణ దిశగా అడుగులు పడ్డాయన్నది స్పష్టంగా తెలియకమానదు. కాకపోతే ఈ రెండంశాలూ హామీ ఇచ్చినట్లుగా నూటికి నూరు శాతం అమలు కాలేదు కనక... మేనిఫెస్టోలో 99 శాతమే అమలయ్యిందని చెప్పాలి. నూటికి 99 శాతం మార్కులే ఇవ్వాలి. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను మనమెన్నడైనా చూశామా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదని? 2014లో ఆయన ఇచ్చిన ఏ హామీనైనా గెలిచాక అమలు చేశారా? అసలు మేనిఫెస్టోనే పార్టీ వెబ్సైట్లో నుంచి తొలగించిన చరిత్ర ఆయనది. ఒకటికాదు రెండు కాదు... వందలకొద్దీ హామీలనిచ్చారు. కానీ తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదు. మళ్లీ 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ప్రయత్నించారు. కొద్ది మంది ఖాతాల్లో రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని జమచేయటం... పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు వేయటం... ఇవన్నీ ఎన్నికలకు కేవలం రెండుమూడు నెలల ముందు చేశారు. అంతేకాదు! ఈ రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహా రమంటూ రకరకాల గ్రాఫిక్‌లు చూపించి... ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపనలంటూ హడావుడి చేశారు. భోగాపురం విమానాశ్రయానిదీ అదే కథ. విచిత్రమేంటంటే ఇలా ఏ హామీనీ అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు... 2019 ఎన్నికల్లో మాత్రం తాను చెప్పివన్నీ చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇంకేదో చేస్తానంటూ స్వర్గాన్ని గ్రాఫిక్‌లలో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజాయితీగా తన పనితీరుకు మార్కులు వేసుకుంటున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేయటానికి ప్రయత్నించటంతో పాటు రెండంశాలు తప్ప మిగిలివన్నీ 100 శాతం అమలు చేశారు. 99 శాతం మార్కులు సాధించగలిగారు. రాజకీయ వర్గాలు ఈ రెండు మేనిఫెస్టోలనూ ‘విశ్వసనీయత– వంచన’తో పోలుస్తున్నది కూడా అందుకేనేమో!!. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే.. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించాక 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ.. వృద్ధాప్య పింఛన్‌ను పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులు ఇచ్చి సామాజిక విప్లవానికి తెరతీశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా వాటిని కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం... సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) విధానానికి ఆమోదం తెలపటం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో మేనిఫెస్టో అమల్లో మరింత ముందడుగు వేసినట్లయింది. 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది. ఇబ్బందుల్లోనూ చెప్పిన దాని కంటే మిన్నగా.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో సీఎం వైఎస్ జగన్ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతులకు ఇస్తాన ని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్.. దాన్ని మరో వెయ్యి పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చేలా అమలు చేస్తున్నారు. అంటే.. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు అదనంగా రూ. 17,500 ప్రయోజనం చేకూరుస్తున్నారు. మేనిఫె స్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు, బద్వే లు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడమే ఆయనపై జనానికున్న నమ్మకానికి నిదర్శనం. అర్హతే ప్రామాణికం కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.16,786 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే (డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ) లబ్ధిదారులకు రూ.3.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి పేరిట ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన దాఖాలు గతమెన్నడూ లేవు. -
సెల్యూట్ సీఎం సార్
సాక్షి, అమరావతి/లబ్బీపేట/రామచంద్రపురం/గుంటూరు మెడికల్/గాంధీనగర్: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చి ఎన్నో వేల కుటుంబాలకు మేలు చేకూర్చారని పేర్కొంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 13,000 మంది ఉద్యోగులకు మేలు ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వ శాఖగా మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో 13,000 ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు చేపడతారని వెల్లడించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఊరట ఏపీలోని నిరుద్యోగులకు ఊరట కలిగించేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు 10,000 పోస్టులను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. టెట్ కమ్ డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్, ఎస్ఐ, ఫైర్, జైల్ వార్డెన్స్, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, వర్సిటీల్లో ఉన్న బోధన,బోధనేతర సిబ్బంది భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామమన్నారు. జీపీఎస్ అమలుపై కృతజ్ఞతలు ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా జీపీఎస్ అమలుతో పెన్షన్ భరోసా కల్పించినందుకు ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌కు తాము మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, రామకృష్ణా రెడ్డి, హరీంద్ర, కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుభాని, పుల్లారావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం వైఎస్ జగన్‌కు పీటీడీ(ఆర్టీసీ) వైఎస్సార్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 50 శాతం కనీస పింఛన్‌తో పాటు డీఏలు వర్తించే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా లబ్ధి చేకూరుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేఎం నాయుడు, ఉపాధ్యక్షురాలు లత తెలిపారు. జీపీఎస్‌తో ఎంతో మేలు కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించి 5 అంశాలకు ఆమోదం లభించింది. డీఏ కోసం ఇచ్చిన జీవోను ర్యాటిఫై చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు సమానంగా 16% హెచ్ఆర్ఏ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కొత్త పీఆర్సీ కమిషన్ వేయడం అభినందనీయం. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్ తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కిందకు వచ్చే వారికి చివరి పే స్కేల్లో 50% ఇస్తూ, దానికి అదనంగా డీఏ ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పాత పెన్షన్ స్కీమ్‌కు, జీపీఎస్‌కు మధ్య ఒకటే తేడా ఉంది. పీఆర్సీ ఒక్కటే లేదు. డీఏ కూడా ఫిక్స్ చేశారు. ప్రతీ ఆర్నెల్లకు 2% డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. హౌస్‌సైట్స్ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. జగనన్న లేఅవుట్లలో 10% కేటాయించారు. 20% డి స్కౌంట్ ఇచ్చారు. ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకూ సుముఖంగా ఉన్నారు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన అవుట్సోర్సింగ్ ఉ ద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం జగన్‌ది సంక్షేమ సంతకం ఇచ్చిన హామీల అమల్లో పేటెంట్ రైట్ ఏదైనా ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌దే. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం జగన్ సంతకమే సంక్షేమ సంతకం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో వారంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు. – పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ దశాబ్దాల కలను నెరవేర్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ఈ మేలును ఎన్నటికీ మరువలేము. కేబినెట్లో క్రమబద్ధీకరణ తీసుకున్న క్షణం మా ఇళ్లలో పండుగ వాతావరణం కనిపించింది. సుధీర్ఘ నిరీక్షణకు సీఎం జగన్ చరమగీతం పలికారు. – రవికుమార్, కొలకలూరి రత్నాకర్‌బాబు, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉన్నాం సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం ఎంతో సంతోషానిచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తోన్న వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడు 1,500 మందిని క్రమబద్ధీకరిస్తారు. వీరితోపాటే మిగిలిన వారినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. – గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రుణపడి ఉంటాము చంద్రబాబు సీఎంగా ఉండి 1994లో పోస్టుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మా కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. – ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త డీఏ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. –డీ శ్రీను, రాష్ట్ర అధ్యక్షుడు, డీపీఆర్టీయూ 10వేల కుటుంబాల్లో వెలుగులు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాము. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. – అరవ పాల్, అధ్యక్షుడు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పీఆర్సీ ఏర్పాటు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన 12వ పేరివిజన్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. – వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 7 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 నాటికి సర్వీస్‌లో ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించినట్లయితే మరో 4 వేల మందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 110 మంది రెగ్యులర్ అవుతున్నారు. – బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ -
ఉద్యోగికి ‘గ్యారెంటీ’ భరోసా.. సీపీఎస్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా జీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత, కాంట్రాక్టు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను రూపొందించింది. దీనిద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరనుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కరువు భృతి (డీఆర్) ఇవ్వడం ద్వారా మెరుగైన పెన్షన్‌ను అందించనుంది. దీంతోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి కీలక అంశాలకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాట ప్రకారం సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రతనిచ్చేలా రూపొందించిన జీపీఎస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగుల జీతాలను దాటేస్తుంది.. సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ఆ తర్వాత ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను తీసుకొచ్చాం. సీపీఎస్‌తో అనిశ్చితి.. ప్రస్తుత సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండటం లేదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు. జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా.. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుంది. ఇందులోనూ సీపీఎస్‌లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తుంది. ఉదాహరణకు రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా రూ.1,10,000 పెన్షన్‌గా తీసుకుంటారు. తద్వారా రిటైర్డ్ ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటు లేదు. దేశానికే ఆదర్శంగా జీపీఎస్ దేశంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమల్లోకి తీసుకురాలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్‌ను తీసుకొస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. మాట ఇచ్చి.. నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కటాఫ్ తేదీకి 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే సీఎం జగన్ ఐదేళ్లకు తగ్గించారు. దీంతో మేనిఫెస్టో హామీల్లో 99.50 శాతం అమలు చేసినట్లైంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఒకేలా హెచ్ఆర్ఏ ఉండేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా కొన్ని జిల్లా కేంద్రాల్లో 12 «శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ 16 శాతానికి పెరుగుతుంది. 2022 జనవరి 1వతేదీ నుంచి డీఏ, డీఆర్ 2.73 శాతం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. 6,840 కొత్త పోస్టుల మంజూరు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. వీటిల్లో 3,920 రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు సహా నూతన వైద్య కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున కొత్త పోస్టులను కల్పించింది. ప్రభుత్వంలోకి వైద్య విధాన పరిషత్ ఏపీ వైద్య విధాన పరిషత్ 1986 యాక్ట్‌ను రద్దు చేసి ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ శాఖగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ స్వయం ప్రతిపత్తి నుంచి ప్రభుత్వంలోకి మారడం ద్వారా 14,658 మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలను చెల్లించనుంది. -
జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్వీఎస్–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచింగ్ప్యాడ్ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్ఎల్వీ రాకెట్ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందాయి. జీఎస్ఎల్వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు. అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్ తరహాలో భారత సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావ్ఐసీ(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు. GSLV-F12/ NVS-O1 Mission is accomplished. After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit. Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit. — ISRO (@isro) May 29, 2023 తొలిసారిగా దేశీ అణుగడియారం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్–01 ఉపగ్రహంలో ఎల్–1, ఎల్–5, ఎస్–బ్యాండ్ సిగ్నల్స్ వ్యవస్థను అమర్చారు. ఎల్–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు. సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు. కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.