Hanamkonda District News
-
మౌలిక సదుపాయాలకు రూ.180 కోట్ల నిధులు
వరంగల్ అర్బన్: ఉమ్మడి జిల్లాలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.180.80 కోట్ల నిధులు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం జీఓ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలో ఐదు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50 కోట్లు విడుదల చేసింది. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ కేంద్రం నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.65 కోట్లు, మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి కేసముద్రం వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘాన్పూర్ ఇంటిగ్రేటెడ్ డివిజన్ భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరైంది. టెన్త్ పరీక్షల ఫీజు గడువు 28విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న టెన్త్ వార్షిక పరీక్షల ఫీజు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చని హనుమకొండ డీఈఓ డి.వాసంతి సోమవారం తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వరకు, రూ.200తో డిసెంబర్ 19వ తేదీవరకు, రూ 500తో డిసెంబర్ 30వ తేదీ వరకు సంబంధిత ఉన్నతపాఠశాలల హెచ్ఎంలకు చెల్లించాల్సింటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ పరీక్ష ఫీజుతోపాటు రూ.60 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఎస్సీ,ఎ స్టీ బీసీ విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలలోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ఫీజునుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ముగిసిన గ్రూప్ –3 పరీక్షలువిద్యారణ్యపురి: గ్రూప్–3 పరీక్షలు సోమవారం ముగిశాయి. హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, హసన్‌పర్తి, కాజీపేట మండలాల్లో రెండో రోజు సోమవారం జరిగిన పరీక్షకు 32,864మంది అభ్యర్థులకుగాను 17,292మంది (52.62శాతం) హాజరుకాగా, 15,572 మంది గైర్హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో మూడో పేపర్ పరీక్షకు 5,452 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై షార్ట్ టర్మ్ ప్రోగ్రాంకాజీపేట అర్బన్ : వరంగల్ నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిట్ వరంగల్, మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సౌజన్యంతో ‘ఆర్టిిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ హెల్త్‌కేర్ అప్లికేషన్స్’ అంశంపై షార్ట్‌టర్మ్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, కేఎంసీ ప్రిన్సిపాల్ కె.రామ్‌కుమార్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ మాజీ డీన్ కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షార్ట్‌టర్మ్ ప్రోగ్రాంను ప్రారంభించి, సావనీర్‌ను విడుదల చేశారు. నిట్ ప్రొఫెసర్ కిషోర్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా శక్తి మేళా ప్రారంభంహన్మకొండ చౌరస్తా: హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి సభను పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన మహిళా శక్తి మేళాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. సెర్ఫ్, మెప్మా ద్వారా మహిళలు స్వశక్తితో రూపొందించిన 40 రకాల వస్తువులతో కూడిన 20 స్టాళ్లను మేళాలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు మహిళలు డప్పు చప్పుళ్లతో, కోలాట విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు నాలుగు మండలాల స్కూళ్లకు సెలవువిద్యారణ్యపురి: కాజీపేట, హనుమకొండ, ధర్మసాగర్, హసన్‌పర్తి పరిధిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలకు డీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం సెలవు (లోకల్ హాలీడే) ప్రకటించారు. సీఎం రేవంత్ హనుమకొండ పర్యటనతో భారీగా ట్రాఫిక్ ఉంటుందన్న కారణంతో సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ నాలుగు మండలాల పరిధిలోని స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు సోమవారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పెట్టారు. -
ఇవి ఓకే.. మరి మిగతావి?
పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ రోడ్డు పనులుకాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ఐదు నెలల్లో కీలక పథకాలకు నిధులు ● భూగర్భ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్‌పోర్టుల్లో కదలిక ● ఇన్నర్ రింగ్‌రోడ్డుకు నిధుల పెంపు.. మాస్టర్‌ప్లాన్–2041కు ఆమోదం ● ఔటర్ రింగ్‌రోడ్డు, ‘స్మార్ట్’ సిటీ, సూపర్ స్పెషాలిటీపై మౌనం ● సెంట్రల్ జైలు ఊసే లేదు.. జీడబ్ల్యూఎంసీకి నిధుల కొరత ● సీఎం మొదటి సమీక్ష తర్వాతే ఫలితాలు.. ప్రత్యేక దృష్టి పెట్టాలని వేడుకోలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనంవీటి పరిష్కారంపై దృష్టి పెట్టండి..సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జూన్ 29న వరంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి... ‘గ్రేటర్’ అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇతర కీలక కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రాత్రి వరకు నిర్వహించిన ఈ సమీక్షలో ప్రధానంగా 8 అంశాలు చర్చకు వచ్చాయి. ఈమేరకు హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధికి ఆ 8 అంశాలపై ప్రాథమిక అంచనాలు రూపొందించి ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారు. వరంగల్ వేదికగా ‘ప్రజాపాలన విజయోత్సవం’ నిర్వహిస్తున్న తరుణంలో నాలుగైదు రోజులుగా ప్రభుత్వం జీఓల జారీ, నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మామునూరు ఎయిర్‌పోర్టు, భూగర్భ డ్రెయినేజీలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రారంభిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిధులు వెచ్చించి, వరంగల్ నగరపాలక సంస్థ భవన నిర్మాణం కోసం నిధులు కేటా యించింది. మాస్టర్‌ప్లాన్–2041పై ఆమోద ముద్ర వేసింది. కానీ, ఔటర్ రింగ్‌రోడ్డు, స్మార్ట్ సిటీ కోసం నిధుల విడుదల పెండింగ్‌లోనే ఉంది. ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ నిర్మాణం వేగం పుంజుకోవడం లేదు. నిధులు, సిబ్బంది కొరత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను వేధిస్తోంది. అభివృద్ధి పనులకు రూ.4,684.37 కోట్లు.. ముఖ్యమంత్రి కోసం జిల్లా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్టుగానే సమీక్ష జరిపిన 5 నెలల్లోనే కోట్ల రూపాయలు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అండర్ డ్రెయినేజీ వ్యవస్థకు, రూ.4,170 కోట్లు, మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.203 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాలకు రూ.28 కోట్లు, ఇంటర్నల్ రింగ్ రోడ్‌కు రూ.80కోట్లు, ఫ్లడ్ డ్రెయినేజీ సిస్టానికి రూ.160.3 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూనిర్వాసితులు 863 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రూ.43.15 కోట్లు.. ఇలా మొత్తం రూ.4,684.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లాయి. వివిధ కారణాలు వల్ల పనులు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం రూ.4170 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు సంబంధించి ఆయన మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కీలకమైన మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రూ.203 కోట్లు కేటాయించడం, మాస్టర్‌ప్లాన్–2041 ఆమోదం సాహసోపేతమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కొన్నింటిపై నిధుల వరద.. మరికొన్నింటిపై శీతకన్ను స్మార్ట్‌సిటీ పథకం కింద వివిధ ప్రాజెక్టుల కోసం రూ.2,278కోట్లతో డీపీఆర్‌లు రూపొందించారు. ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతిపెద్ద టెక్స్టైల్ పార్కుకు నిర్మాణం కోసం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట శివారులో 22 అక్టోబర్ 2017న భూమి పూజ చేశారు. 1,350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు లభించేవి. ఏడేళ్లుగా టెక్స్ టైల్ పార్కు నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వంతో 22 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నా సగం కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించాయి. 18 మార్చి 2023న కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర కింద వరంగల్ టెక్స్టైల్ పార్కును ఎంపిక చేసింది. కానీ పురోగతి కనిపించడం లేదు. సుమారు రూ.1,100 కోట్లతో చేపట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగం పుంజుకోవడం లేదు. కారణాలు చూపకుండా సమారు రూ.600 కోట్ల మేరకు అంచనాలు పెరగడంపై వేసిన విజిలెన్స్ కమిటీ విచారణ జరుపుతోంది. నగరం చూట్టూ నాలుగు వైపులా 74 కిలోమీ టర్ల రింగ్ రోడ్డు ఉంటుంది. కరుణాపురం నుంచి ఐనవోలు క్రాస్ రోడ్డు సింగారం వరకు 17 కిలోమీటర్లు ఉంటుంది. అందుకోసం గత ప్రభుత్వంలో రూ.669.59కోట్ల అంచనా వ్య యంతో పనులకు శంకుస్థాపన చేశారు. భూ సేకరణ కోసం రూ. 157.95 కోట్లు కేటాయించగా, రహదారి నిర్మాణం కోసం 551.64 కోట్లను మంజూరు చేసింది. అయితే విడుదల చేయక పనులు కాలేదు. రెండో ప్యాకేజీ కింద ఖమ్మం రోడ్డులోని(సింగారం) నుంచి ఆరేపల్లి క్రాస్ రోడ్డు వరకు 39 కిలోమీటర్లు ఎన్‌హెచ్ రూ. 776.54కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో 191.82 కోట్లు భూసేకరణ కోసం వ్యయం చేస్తుండగా, మిగిలిన రహదారి పనుల కోసం రూ. 584.72కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. కానీ ఆ పనులు పూర్తి కాలేదు. బల్దియా, ‘కుడా’ను సిబ్బంది కొరత వేధిస్తోంది. ట్రైసిటీలో 2013 మార్చిలో 42 శివారు గ్రామాలు విలీనమాయ్యయి. నగరం 110 చదరపుకిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా రెట్టింపవుతోంది. గ్రేటర్ హోదా దక్కింది. 2016 లెక్కల ప్రకారం బల్దియాలో శాశ్వత అధికారులు,ఉద్యోగుల సంఖ్య 1,531 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 741 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. కీలకమైన ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం, పన్నుల విభాగం, అర్బన్ మలేరియా విభాగాల్లో క్షేత్ర స్థాయి, వివిధ హోదాల్లో అధికారులు పూర్తి స్థాయిలో లేక ఉన్న వారిపై అదనపు భారంతో సతమతమవుతున్నారు. -
భద్రకాళిలో కార్తీక దీపోత్సవం
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నగరంలోని భద్రకాళి దేవాలయంలో సోమవారం కార్తీక దీపోత్సవం జరిగింది. ఈఓ శేషుభారతి దేవాలయ ఆవరణలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళాభక్తులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. కార్తీక సోమవారం పూజలు వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా మూడో సోమవారం పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తిష్టగణపతికి అభిషేకాలు, రుద్రేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. రాత్రి 8 గంటలకు మహా హారతి శోభాయమానంగా జరిగింది. భక్తులు కార్తీకదీపాలు వెలిగించి సందడి చేశారు. -
సీఎం టూర్ షెడ్యూల్
మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా ‘కుడా’ మైదానానికి చేరుకుంటారు ● 2.30 : కాళోజీ కళాక్షేత్రం ప్రారంభిస్తారు ● 3.10 : ఆర్ట్స్ కాలేజీ మైదానానికి బయలుదేరుతారు ● 3.20: ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు ● 3.50: జ్యోతి ప్రజ్వలన, రాష్ట్రీయ గీతాలాపన ● 3.55: సీఎస్ శాంతికుమారి చే స్వాగతోపన్యాసం ● 4.00: మంత్రుల ప్రసంగం ● 4.20: 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌కు శంకుస్థాపనలు, ఇందిరా మహిళా శక్తి ద్వారా వివిధ కార్యక్రమాలప్రారంభోత్సవం, లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, డిస్కం, ఆర్టీసీల ఎంఓయూల అందజేత ● 4.30: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగం ● 4.40: సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ● సాయంత్రం 5.00 గంటలకు హనుమకొండ కలెక్టర్ కృతజ్ఞత ప్రసంగం -
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్ క్రైం: సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా మంగళవారం వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, హుజూరాబాద్, ములుగు ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి బహిరంగ సభ ముగిసే వరకు కొనసాగుతాయని, ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున అవసరం ఉంటే తప్ప వాహనాల్ని బయటకు తీయొద్దని, భారీ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు. మళ్లింపు ఇలా.. హుజురాబాద్ నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం, ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మం వెళ్లాలి. ● పరకాల, ములుగు మార్గాల నుంచి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుంది. ● వర్ధన్నపేట వైపు నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పరకాల, భూపాలపల్లి వెళ్లే వాహనాలు పున్నేలు క్రాస్ నుంచి డైవర్షన్ తీసుకుని ఐనవోలు, కరుణాపురం ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలి. సభాస్థలికి వెళ్లేందుకు.. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఈ మార్గాల మీదుగా రావాల్సి ఉంటుంది. ● హుజూరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు చింతగట్టు వద్ద ఓఆర్ఆర్ పైకి ఎ క్కి ఉనికిచర్ల క్రాస్ రోడ్, వడ్డేపల్లి చర్చి, రిజిస్ట్రేషన్ కార్యాలయం, తెలంగాణ జంక్షన్ వడ్డేపల్లి రోడ్ నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజలను దింపి ఖాళీ వాహనాలను ఓల్డ్ బస్ డిపో వద్ద పార్క్ చేయాలి. ● హనుమకొండ, ములుగు, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ డైవర్షన్ నుంచి కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా గోపాలపూర్ జంక్షన్, తిరుమల జంక్షన్ ఎకై ్సజ్ కాలనీ ఐలాండ్ వద్ద దించి ఖాళీ వాహనాలను ఎకై ్సజ్ కాలనీ–1లో పార్కింగ్ చేయాలి. ● నర్సంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు చింతల్ బ్రిడ్జ్, హంటర్ రోడ్ మీదుగా నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దింపి వాహనాలను సూచించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి. ● మామునూరు నుంచి వచ్చే వాహనాలు ఆర్టీఓ జంక్షన్, ఉర్సు గుట్ట మీదుగా హంటర్ రోడ్ నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దించి ఖాళీ వాహనాలను విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిలపాలి. ● స్టేషన్‌ఘన్‌పూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉనికిచర్ల ఎక్స్ రోడ్, వడ్డేపల్లి చర్చి, ప్రశాంతినగర్ పార్క్ తెలంగాణ జంక్షన్ మీదుగా జనాలను దించి ఖాళీ వాహనాలను తెలంగాణ జంక్షన్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. -
నకిలీ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
ఎంజీఎం: హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రైవేట్ ఆప్పత్రుల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీజీఎంసీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్హత లేని పలువురు వైద్యులుగా చెలామణీ అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు నిర్వహించారు. హనుమకొండలోని దీన్‌దయాళ్ నగర్లో నకిలీ వైద్యుడు బండి సదానందం, ధన్వంతరి ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడు మిట్టపల్లి సాంబమూర్తి, కాజీపేటలోని దేవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు కె.ప్రభాకర్ క్లినిక్‌ను తనిఖీ చేసి సదరు నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈసందర్భంగా వరంగల్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ మియా మాట్లాడుతూ.. మెడికల్ షాప్ యజమానులెవరూ ఫార్మసిస్టులు లేకుండా, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యుల్(హెచ్) మందులు విక్రయించవద్దని సూచించారు. ఎవరైనా నకిలీ వైద్యులకు అనుబంధంగా మెడికల్ షాప్ అనుమతికి సర్టిఫికెట్ ఇచ్చినా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లపై తగు చర్యలు తీసుకోనున్నట్లు, వారి సర్టిఫికెట్ రద్దు చేయాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌కి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్‌కుమార్, కరీంనగర్ జిల్లా హెచ్ఆర్డీఏ సెక్రెటరీ డాక్టర్ రితేశ్, తదితరులు పాల్గొన్నారు. -
53 శాతం మంది హాజరు
విద్యారణ్యపురి/వరంగల్: గ్రూప్–3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. హనుమకొండ, కాజీపేట, హసన్‌పర్తి మండలాల పరిధిలో 83 సెంటర్లు ఏర్పాటు చేయగా.. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 32,864 మంది అభ్యర్థులు 17,572(53.47శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 3 నుంచి 5.30 గంటలవరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 17,437(53.06శాతం) మంది హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. హనుమకొండలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల సెంటర్‌ను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే పేపర్–3 పరీక్షతో గ్రూప్–3 పరీక్షలు ముగియనున్నాయి. వరంగల్‌లో.. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఆదివారం జరిగిన గ్రూప్–3 పరీక్షలకు 10,913 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. ఉదయం మొదటి పేపర్ పరీక్షకు 5,513 మంది, మధ్యాహ్నం రెండో పేపర్ పరీక్షకు 5,489 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆమె వాగ్దేవి కళాశాల, తాళ్ల పద్మావతి కళాశాల, సిల్వర్ క్రౌన్ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ బత్తిని చంద్రమోహన్, సహాయ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌బాబు, జిల్లా బయోమెట్రిక్ ఆఫీసర్ డాక్టర్ శ్యాం తదితరులు ఉన్నారు. గ్రూప్–3 పరీక్షలు ప్రారంభం సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్లు -
నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి గ్రీవెన్స్ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ ప్రజావాణి కూడా.. వరంగల్/హనుమకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను పరిపాలనా పరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈవిషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. ఆర్చ్ నిర్మాణానికి రూ.1.5 లక్షల విరాళంఐనవోలు: మల్లికార్జునస్వామి దేవస్థానం వారు చేపట్టనున్న ఆర్చ్ నిర్మాణానికి మల్లికార్జునస్వామి భక్తులు రూ.1.5 లక్షల చెక్కును మల్లన్న ఆలయంలో ఆదివారం అందజేశారు. కొట్టం రాజు, కొట్టం మోహన్, పెండ్లి ప్రశాంత్, పెండ్లి ప్రవీణ్, పెండ్లి నవీన్, పెండ్లి తిరుపతి, కడుదూరి సంతోశ్, పెంతల అశోక్, ఆకుతోట రాజు మల్లికార్జునస్వామి టీంగా ఏర్పడి వ్యాపారం నిర్వహించారు. తాము అనుకున్నట్లుగా వ్యాపారం సాగితే మల్లన్న ఆలయానికి రూ.1.5 లక్షలు విరాళం అందజేస్తామని గతంలో మొక్కుకున్నారు. ఈక్రమంలో ఆదివారం మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రూ.1.5 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. కాగా.. ఎండోమెంట్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రశ్నించే గొంతుక నర్సిరెడ్డివిద్యారణ్యపురి: ప్రశ్నించే గొంతుక అలుగుబెల్లి నర్సిరెడ్డి.. శాసనమండలి వేదికగా ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషిచేశారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్దం వెంకటరెడ్డి అన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విద్యారంగంపై ప్రస్తావించిన అంశాలు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు, పరిష్కారాలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని వెంకటరెడ్డి ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐ దున్నరేళ్లుగా టీచర్ ఎమ్మెల్సీగా వివిధ సమస్యల పరిష్కారానికి కృషిచేసిన నర్సిరెడ్డిని మ రోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎ ఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ పెండెం రాజు, ఉపాధ్యక్షుడు ఆజ్మీరా రాజారాం, కార్యదర్శులు లింగారావు, కె.సదానందం, మెరుగు ప్రసన్నానంద్ తదితరులు పాల్గొన్నారు. నిట్‌తో అగస్థ్య హైడ్రోజన్ ఎంఓయూ..కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో హైదరాబాద్ అగస్థ్య హైడ్రోజన్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఆదివారం నిట్‌లో నిర్వహించిన 18వ నేషనల్ ఫ్రంటీయర్ ఆఫ్ ఇంజ నీరింగ్ సదస్సులో అవగాహన కుదిరింది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, అగస్ధ్య హైడ్రోజెన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శశిరెడ్డి ఎంఓ యూను పరస్పరం అందజేసుకున్నారు. డాక్టర్ రామా చంద్రమౌళికి జీవన సాఫల్య పురస్కారంహన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ రా మా చంద్రమౌళి జీవన సా ఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు ఈనె ల 22, 24 తేదీల్లో ఖతర్ దేశంలోని దోహాలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తొమ్మిదో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రామా చంద్రమౌళికి పురస్కారాన్ని అందజేయనున్నారు. -
బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది..
హన్మకొండ చౌరస్తా: బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది.. వారు తక్షణమే సైకియాట్రిస్ట్‌కు చూపించుకోవడం మంచిదని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన హైదరాబాద్‌ను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగుల పడి పోతారు.. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని అన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని లక్షమంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు పరిశీలించి సభాస్థలి వద్ద వారు మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులను విదేషాల్లో దాచారని, కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలుంటాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని, అందుకే అధికారులపై దాడులు చేస్తూ.. తాము చేస్తున్న మంచి పనులు, హైడ్రాకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వే ఏమైందని ప్రశ్నించిన మంత్రులు.. లిమ్కా బుక్ రికార్డు కోసమే నాడు ఆ ప్రభుత్వం సర్వే చేసిందని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందించడానికే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తిడుతున్నారు.. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ను తెలంగాణ రెండో రాజధాని చేయడానికి అడుగులు పడుతున్నాయి.. ఇక్కడ రాహుల్‌గాంధీ సభ సక్సెస్ అయింది.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రుల వెంట హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు ఉన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆర్ట్స్ కాలేజీ సభా స్థలి పరిశీలన -
‘కామన్ విద్య’ అమలు చేయాలి
● టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ కాళోజీ సెంటర్: రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆది వారం జరిగిన వరంగల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యూ.అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఈదుల వీరస్వామి, ఉపాధ్యక్షులుగా స్వామి, డి.మల్లయ్య, ముజాహిద్ అలీ, కార్యదర్శులుగా బెల్లంకొండ పూర్ణ చందర్, పి.సురేశ్, మనుపాటి వెంకట్, బి.ప్రసాద్, ఆడిట్ కమిటీ కన్వీనర్లుగా కె.బుచ్చాచా రి, రాజన్న, జీఓ కమిటీ బాధ్యులుగా బి.జగన్మోహన్, పి.మల్లికార్జున్, అకడమిక్ సెల్ బాధ్యులుగా ఎంఏకే.తన్వీర్, కె.ఉమేశ్ ఎంపికైనట్లు ఎన్నికల పరిశీలకులు ఎస్.కవిత, కడారి భోగేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో బాధ్యులు జి.వెంకటేశ్వర్లు, మనోహర్, వి.విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ ట్రబుల్
వరంగల్ అర్బన్: కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు. మాకేంటి అన్నట్లుగా ప్రజాప్రతినిధులు. టెండర్ అగ్రిమెంట్, గడువులతోనైతే సంబంధమే లేదు. నోటీసులు చిత్తు కాగితాలే.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ. ఫలితంగా వరంగల్ తూర్పులోని 9 చోట్ల స్మార్ట్ సిటీ రోడ్డు పనులు అసంపూర్తిగా,ఆగమ్యగోచరంగా మారాయి. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే గడువు ఐదేళ్లు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ పనులు పూర్తి చేసేందుకు 9 నెలల గడువు పొడిగించగా సగం కాలం గడిచింది. వదిలేసిన అసంపూర్తి పనులు గడువులోగా పూర్తి చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆకర్షణీయమేది? స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. సప్లమెంటరీలో వరంగల్‌కు ఆకర్షణీయ నగరంగా చోటు దక్కింది. అనేక ప్రాజెక్టుల్లో భాగంగా నగరంలో ప్రధాన రహదారులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో 2020లో 11 రోడ్లు రూ. 52.49 కోట్లతో ప్రతిపాదించారు. కాగా.. పది కాలాల పాటు మన్నాల్సిన పనులు ఇష్టారాజ్యంగా మారాయి. సగానికి పైగా సీసీ రోడ్లు, మరో సగం తారు రోడ్లు నిర్మించారు. ఇక రోడ్డుకు ఇరువైపులా హనుమకొండలో నిర్మించిన స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల తరహాలో డక్ట్లు నిర్మించాల్సి ఉంది. భూగర్భ డ్రెయినేజీకి పైపులైన్లు ఏర్పా టు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించాల్సి ఉంది. కొంత మేరకు నిర్మించి మధ్యలోనే కూల్చివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్, ఇంజినీర్లతో జరిగిన ఒప్పందం మేరకు పనులు చేపట్టినట్లు సదరు ఏజెన్సీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. భూగర్భ డ్రెయినేజీ పైపులైన్ల అనుసంధానం అక్కడక్కడా పూర్తి చేయలేదు. పైపులైన్లపై పలు చోట్ల చాంబర్ల మూతలు బిగించలేదు. పుట్‌పాత్‌ల కోసం రోడ్డుకు ఇరువైపులా.. మార్కింగ్ ఇచ్చి సీసీ బ్రిక్స్ నిర్మించారు. కానీ.. ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టలేదు. అస్తవ్యస్తంగా వదిలేసిన ఫుట్‌పాత్‌లపై వ్యాపారులు చాలా చోట్ల కొందరు మెట్లు నిర్మించుకోగా.. మరికొందరు సీసీతో పూడ్చివేశారు. డెకరేటివ్ లైటింగ్ కోసం పోల్స్ ములుగు రోడ్డు నుంచి అక్కడక్కడా పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, ఎస్ఎన్ఎం క్లబ్ వరకు ఏర్పాటు చేశారు. పలు చోట్ల లైట్లను బిగించారు కానీ.. వెలగడం లేదు. మిగతా రోడ్లలో డెకరేటివ్ పోల్స్ వేసి, లైట్లు ఏర్పాటు చేయలేదు. పెడిస్ట్రేషన్ క్రాసింగ్‌లు తదితర పనులు చాలా మేరకు పెండింగ్‌లో ఉన్నాయి. అంతా మా ఇష్టం.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను పరిశీలించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఓ ప్రైవేట్ సంస్థను నియమించింది. ప్రాజెక్టుల మానిటరింగ్ కమిటీ (పీఎంసీ) ఇంజనీర్లు, నిపుణులు సైతం పనులు పరిశీలించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. సీసీ రోడ్ల పనులు జరిగిన కొన్ని నెలలకే కంకర తేలి, గుంతలు పడ్డాయి. ఇవేంటని ప్రశ్నిస్తే పూడ్చివేశారు. అసంపూర్తి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్లైన్లు వేసి, చాంబర్ల లింకులను కలపకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం కురిసిందంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా గుంతలు కలిగి ఉన్న చాంబర్ల వద్ద కనీసం రక్షణ చర్యలు, ప్రమాద హెచ్చరికలు లేకపోపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించకపోవడంతో వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. అంతేకాకుండా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒకతను తన పవర్‌ను ఉపయోగించి.. తన బంధుగణానికే ఈ పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అతడి ఎమ్మెల్యే పదవి పోయినప్పటికీ బల్దియా ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ రద్దు చేశాం.. వరంగల్‌లో 9 స్మార్ట్‌సిటీ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని పలుమార్లు ఏజెన్సీకి నోటీసులు జారీ చేశాం. స్పందించకపోవడంతో బోర్డుకు నివేదిస్తే రద్దు చేశారు. తిరిగి టెండర్ నిర్వహించేందుకు ఈఎన్సీకి లేఖ రాశాం. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయిస్తాం. – ప్రవీణ్ చంద్ర, బల్దియా ఎస్ఈ అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ ఫుట్‌పాత్‌లు లేక నడకదారుల్లో నరకయాతన ప్రజా ప్రయోజనాలు పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులుఅసంపూర్తి పనులు ఎక్కడెక్కడంటే.. వరంగల్ ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం సెంటర్ వరకు రోడ్డు, డ్రెయినేజీ, ఫుట్‌పాత్, డెకరేటివ్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సెంట్రల్ డివైడర్ నిర్మించాల్సి ఉంది. ఎంజీఎం సెంటర్ నుంచి పోచమ్మమైదాన్ కాశిబుగ్గ, వెంకట్రామా థియేటర్ వరకు.. వెంకట్రామ థియేటర్ నుంచి వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ అక్కడి నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు.. వరంగల్ రాంకీ ఎన్క్లేవ్ నుంచి ఎస్ఎన్ క్లబ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు. వరంగల్ చౌరస్తా నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు. హెడ్ పోస్టాఫీస్ నుంచి హంటర్ రోడ్డు వరకు. చౌరస్తా నుంచి మేదరి వాడ హంటర్ రోడ్డు వరకు. ఆర్ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు సుమారు 8.68 కిలో మీటర్ల మేరకు పనులు పూర్తి చేయాలి. -
ఎంజీఎంలో దళారులు
ఎంజీఎం: మంత్రులు వచ్చి పరిశీలించి దిశానిర్దేశం చేసినా.. కలెక్టర్ వరుస తనిఖీలు చేసినా.. వైద్య శాఖ ఉన్నతాధికారులు చివాట్లు పెట్టినా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పాలన గాడిన పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగికి సకాలంలో వైద్యమందించి జీవం పోస్తామనే నమ్మకాన్ని కల్పించడంలో పరిపాలనాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికారుల పర్యవేక్షణాలోపంతో ఆస్పత్రి అత్యవసర విభాగ సేవలు అధ్వానంగా తయారు కావడం ఒక ఎత్తు అయితే.. ఆస్పత్రిలో సేవల లోపాలను ఎత్తి చూపుతూ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా రెఫరల్ వైద్యం నడుస్తు న్న క్రమంలో ఇటీవల ఏకంగా ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వార్డుకు వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లడాన్ని బట్టి గమనిస్తే ఆస్పత్రి పరిపాలనాధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. డయాగ్నోస్టిక్స్లపై నిఘా కరువు.. ఎంజీఎం చుట్టూ ఉన్న డయాగ్నోస్టిక్ కేంద్రాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నిఘా పూర్తిగా కరువైంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్న మూడు, నాలుగు డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆస్పత్రిలో వారి ఏజెంట్లను పెట్టుకుని సిబ్బందితో చేతులు కలిపి ఇక్కడి శాంపిల్స్‌ను ప్రైవేట్‌కు తరలిస్తున్నారు. ఈ తతంగం గత కొన్ని నెలలుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పేద రోగులు వేడుకుంటున్నారు. అధికారుల పర్యటనలతోనూ మారని తీరు..‘ఎంజీఎం ఆస్పత్రిలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పర్యటించినా లాభం లేదు. మాకు రక్త పరీక్షలు బయటికి రాస్తున్నారు.. వందల నుంచి వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి’ అని రోగులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. పదుల సంఖ్యలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు సైతం సరిపోరంటూ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ల్యాబ్‌టెక్నీషియన్లను నియమించుకుంటున్నారు. దీనికితోడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రక్త పరీక్షలకు సంబంధించిన కెమికల్స్ సరఫరా చేస్తున్నా.. రక్త పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు ఎందుకు పంపిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి చుట్టూ నెలకొల్పిన కొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యసిబ్బందితో మిలాఖత్ అయి రోగులకు మాయమాటలు చెప్పి రక్తపరీక్షల శాంపిళ్లను పంపిస్తున్నార న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో గాడి తప్పిన పాలన ప్రాంగణంలో ప్రైవేట్ ఆస్పత్రుల ఏజెంట్లు ఏకంగా వార్డులనుంచే శాంపిళ్లు సేకరిస్తున్న ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు పర్యవేక్షణలో అధికారులు విఫలం.. -
నేడు ఇందిరా మహిళా శక్తి మేళా ప్రారంభం
వరంగల్: హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాను సోమవారం ఉద యం మంత్రి కొండా సురేఖ ప్రారంభించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వరంగల్, హనుమకొండతో పాటు పలు ప్రాంతాల చేనేత వస్త్రాలు, వివిధ సౌందర్య సాధనాలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. మహిళా స్వశక్తి సంఘాల సభ్యులచే తయారయ్యే విభిన్న ఉత్పత్తుల గురించి తెలుసుకునే ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈమేళా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కార్తీకం.. లక్ష దీపోత్సవం
– వివరాలు10లోమరిన్ని ఫొటోలు 11లోuనగరంలోని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని లక్షదీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం రుద్రేశ్వరుడికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి ఏర్పాటుచేసిన లక్షదీపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో రంగవల్లులు వేసి అరటి డొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10గంటల వరకు జరిగాయి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య కీర్తనల ఆలాపన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – హన్మకొండ కల్చరల్ -
సిబ్బందికి అదనపు భారం
శనివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2024వరంగల్ అర్బన్: బల్దియా కాశిబుగ్గ సర్కిల్ పరిధి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అదనపు పని భారంతో సతమతమవుతున్నారు. అధికారులు ఆదేశిస్తుండడంతో కాదనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజు ఒక్కో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ 20 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి స్థలాలు, డాక్యుమెంట్లు పరిశీలించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఇటీవలి సమీక్షలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా బిల్డింగ్ పర్మిషన్ల దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలతోనే వారు ఆగమాగమవుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కాశిబుగ్గ సర్కిల్ పరిధి ఐదుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను సూపర్వైజర్లుగా నియమించారు. సూపర్వైజర్ రోజూ 10 నుంచి 12 మంది ఎన్యుమరేటర్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, ఎదురవుతున్న సందేహాల్ని నివృత్తి చేయాలి. అటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, అదనంగా సూపర్వైజర్ డ్యూటీలతో అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట సర్కిల్ పరిధిలో పని చేస్తున్న ఆరుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు ఇంటింటా కుటుంబ సర్వే సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించలేదు. కాశిబుగ్గ పరిధిలో మాత్రమే అప్పగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు ఉన్నతాధికారులు టీపీఎస్, ఏసీపీలకు మాత్రం రోజువారీ విధులు మాత్రమే చక్కబెడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు కావడంతో అదనపు పనిభారంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. న్యూస్‌రీల్ -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
శాయంపేట: విధుల్ల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ అప్పయ్య.. వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాంగణాన్ని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల కోసం ఆన్లైన్లో ఇండెంట్ పెట్టాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు శుభ్రంగా లేవని పంచాయతీ కార్యదర్శి రత్నాకర్‌కు ఫోన్ చేసి మల్టీపర్పస్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో పీహెచ్‌సీల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డిసెంబర్ 10 నాటికి శాయంపేటకు 108 అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. -
డీఎల్ఎస్ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎల్ఎస్ఏ కార్యదర్శి జస్టిస్ యం.సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ. నిర్మలా గీతాంబ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. స్టెనోగ్రాఫర్ (1), టైపిస్ట్ (1), రికార్డ్ అసిస్టెంట్ (2) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్ని ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డిస్టిక్ర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ–వరంగల్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్‌కు పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు వరంగల్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. నియామక ప్రక్రియకు సంబంధించి అన్ని అంశాలను వరంగల్ జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. రేపు ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలువరంగల్ స్పోర్ట్స్: కమల్‌కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి జి.రాంప్రసాద్ తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగంలో నిర్వహించే పోటీల వాల్‌పోస్టర్లను శుక్రవారం ప్రభుత్వ న్యాయవాది కె.నర్సింహారావు ఆవిష్కరించారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించే ఈపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని రాంప్రసాద్ తెలిపారు. పేర్ల నమోదు, వివరాల కోసం 96760 56744 నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో షేక్సలీమ్, మార్టిన్ పాల్గొన్నారు. అభివృద్ధి బాటలో రైల్వే ఈసీసీఎస్కాజీపేట రూరల్: రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్)ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఈసీసీఎస్ ఎం.డి, మజ్దూర్ యూనియన్ ఏడీఎస్ చిలుకుస్వామి అన్నారు. కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ ఎదుట శుక్రవారం రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్.కె.జానీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈమీటింగ్‌లో చిలుకుస్వామి మాట్లాడుతూ.. డిసెంబర్ 4, 5 తేదీల్లో జరిగే ఎన్నికల్లో జెండా గుర్తుకు ఓటు వేయాలన్నారు. సీసీఎస్ సొసైటీలో మజ్దూర్ యూనియన్ పాలక మండలి ఎనిమిది నెలల్లో రెండు సార్లు డివిడెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైల్వే కార్మికుల సమస్యల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మజ్దూర్ యూ నియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ సెక్రటరీ పి.వేదప్రకాశ్, ట్రెజరర్ జి.రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్ సెక్రటరీ యాదగిరి, నరేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ తిరుపతి, భా స్కర్‌రెడ్డి, వి.యాదగిరి, నాగరాజు, వెంకట్, అశోక్, సంఘీ శ్రీనివాస్, శ్రీనివాస్, చేరాలు, శ్రీధర్, రవీందర్, శంకర్, చంద్రమౌళి, నళినికాంత్, జానీ, సుబానీ, అజీముద్దీన్, అంతయ్య పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియం అభివృద్ధికి కృషి: నాయినివరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎదురుగా ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఇండోర్ స్టేడియాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్టేడియంలోని సమస్యలను బ్యాడ్మింటన్ సంఘం బాధ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే మరమ్మతులకు రూ.20 లక్షల నిధులను డిసెంబర్లో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డీఎస్ఏ బ్యా డ్మింటన్ కోచ్ కూరపాటి రమేశ్, బ్యాడ్మింటన్ సంఘం బాధ్యులు పవన్, విజయ్‌కుమార్, శ్రీ నివాస్, బాలకృష్ణ, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, సంపత్‌రావు, కిరణ్‌రాజు, నా యకులు నాయిని లక్ష్మారెడ్డి తదితరులున్నారు. -
సంక్షేమం మాయం.. తెలంగాణ ఆగం
● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ● ‘ఇగ రణమే’ పాట ఆవిష్కరణ నయీంనగర్: కాంగ్రెస్ 11 నెలల పాలనలో సంక్షేమం మాయమై, తెలంగాణ ఆగమైందని మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు, శుక్రవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో సందేశ్ యాదవ్ కేటీఆర్‌పై రూపొందించిన ‘ఇగ రణమే’ పాటను వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. పాట రాసిన బలగం వేణు, సంగీతం నవీన్, సింగర్ రాంకీని ఆయన అభినందించారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు ఇస్తామని ఉన్న వాటినే కూల్చేస్తూ, రైతులను, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి మరోసారి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెస్తున్నారన్నారు. లగచర్ల ఘటన విషయంలో కేటీఆర్ జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందన్నారు. రైతు రుణమాఫీ, బీమా, పెట్టుబడి సాయం ఏమైందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లగచర్ల రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు వారు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటో వివరించాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో ‘కుడా’ మాజీ చైర్మన్లు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు రాజు నాయక్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, సంకు నర్సింగ్, నాయకులు జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, కుసుమ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఓటర్ల నమోదుపై కలెక్టర్ల ప్రత్యేక దృష్టి
● డ్రాఫ్ట్ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 30.33 లక్షల మంది ఓటర్లు ● ఎనిమిదిన్నర నెలల్లో కొత్త ఓటర్లు 55,219 మంది.. ● జనవరి వరకు మరింత పెరిగేలా కార్యాచరణ ● ఆర్హులు నమోదు చేసుకునేలా సదస్సులు సాక్షిప్రతినిధి, వరంగల్: కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులంతా ఓటుహక్కును నమోదు చేసుకునేలా కార్యాచరణను అమలు చేస్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా అవగాహన కల్పిచేందుకు క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు. అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈజాబితా ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 30,32,758లకు చేరింది. 2023 ఫిబ్రవరి 8 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 20 వరకు సుమారు ఎనిమిదిన్నర నెలల్లో కొత్తగా 55,219 మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అలాగే.. 27,338 ఓటర్లను అధికారులు వివిధ కారణాల చేత తొలగించారు. మరోమారు అర్హులైన వారు తమ ఓటును నమోదు చేసుకునేలా క్యాంపెయిన్లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అఽధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఈ నెల 9, 10 తేదీల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అర్హులైన వారంతా తమ ఓటుహక్కును నమోదు చేసుకునేలా చూడాలన్న సీఈఓ తాజా ఆదేశాల మేరకు జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. హనుమకొండ, వరంగల్‌పై దృష్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2025 జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. ఇందుకోసం గత నెల 28న ప్రకటించిన డ్రాఫ్ట్ జాబితాపై ఈనెల 28 వరకు డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తూనే.. కొత్త ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా ఎనిమిదిన్నర నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో కొత్తగా 55,219 మంది చేరగా... జనగామ 14,005, వరంగల్ 13,879, మహబూబాబాద్ 10,226, హనుమకొండ 8,708, ములుగు 4,475, భూపాలపల్లిలో 3926 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. తొలగించిన ఓట్లు, కొత్తగా చేరిన ఓటర్లతో పోలిస్తే వ్యత్యాసం ఉండగా.. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలతో పాటు అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అర్హులు నమోదు చేసుకోవాలి.. కొత్త ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఓటర్లను చైతన్యపర్చడం, భాగస్వామ్యం చేయడంపై కలెక్టరేట్లో స్వీప్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటుహక్కును నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు కలిగిన ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. – పి.ప్రావీణ్య, కలెక్టర్, హనుమకొండ మహిళా ఓటర్లే ఎక్కువ.. సుమారు ఎనిమిదిన్నర నెలల వ్యవధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లతో పాటు చనిపోయిన, ఇతర ప్రాంతాలకు మారిన వారిని తొలగిస్తూ.. అక్టోబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో 14,86,220 మంది పురుష ఓటర్లు, 15,46,039 మంది మహిళలు, 499 ఇతరులు కలిపి మొత్తం 30,32,758 మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఈజాబితాలోనూ పురుషలకంటే మహిళా ఓటర్లే 59,819 ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో చనిపోయిన, మరో ప్రాంతానికి మార్పిడి చేసుకున్న, రెండేసి ఓట్లు, ఇంకా ఇతర కారణాలతో 27,338 మంది పేర్లు తొలగించి, 55,219 మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ జాబితాలో వెల్లడైంది. కాగా.. జాబితాపై ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయవచ్చని, ఈనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించేలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్స్టేషన్లలో బూత్‌లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) అందుబాటులో ఉండేలా ఆదేశించింది. -
వరంగల్ వేదికగా... ప్రజాపాలన విజయోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ వేదిక కానుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ’సభను ఓరుగల్లులో నిర్వహించాలని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి... శుక్రవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులతో జరిపిన సమీక్షలో నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డిసెంబర్ 9 వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ తొలిసభకు వరంగల్‌ను వేదిక చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు వరంగల్ వేదిక నుంచి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల వరంగల్ పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభావేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాలకు సంబంధించి రూట్ మ్యాప్ తయారీలో అధికార యంత్రాంగం బిజీ అయ్యింది. హైదరాబాద్‌లో కలెక్టర్లతో సీఎస్ సమీక్ష.. ముఖ్యమంత్రి రేవంత్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు శుక్రవారం పరిశీలించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి వారు చర్చించారు. హెలిపాడ్‌తోపాటు సభను నిర్వహించే ఆర్ట్స్ కళాశాల మైదానం, బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రం, కాజీపేట ఆర్వోబీని పరిశీలించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో కలెక్టర్లు, కమిషనర్లతో సీఎస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హుటాహుటిన శుక్రవారం సాయంత్రం రెండు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సచివాలయ ఆవరణలో రాత్రి వరకు రాష్ట్ర అటవీ, పర్యాటకశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన, రూట్ మ్యాప్, సభావేదిక ఏర్పాటు తదితర అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది. నేడు హనుమకొండకు పీసీసీ చీఫ్, మంత్రులు ప్రజాపాలన విజయోత్సవ సభ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి శనివారం హనుమకొండకు వస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, రెండు రోజులుగా కలెక్టర్లు, పోలీస్, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌తో పాటు మంత్రులు హెలిపాడ్, సభావేదిక, కాళోజీ కళాక్షేత్రం, కాజీపేట ఆర్వోబీ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. విజయోత్సవ సభ, సీఎం పర్యటన సక్సెస్ కోసం జనసమీకరణపై చర్చించనున్నారు. 19న ఓరుగల్లుకు సీఎం రేవంత్.. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ సభ ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హాజరు 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు ఇక్కడినుంచే శ్రీకారం నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం సీఎం సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు.. కలెక్టర్లు, కమిషనర్లతో సీఎస్ అత్యవసర భేటీ.. ఏర్పాట్లపై నేడు వరంగల్‌కు టీపీసీసీ చీఫ్, మంత్రులు -
ఇంకా స్లాబు దశలోనే..
సాక్షి, వరంగల్: వరంగల్.. జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు దాటినా ఇప్పటికీ పరిపాలన అంతా హనుమకొండ జిల్లా నుంచే కొనసాగుతోంది. వరంగల్, ఖిలా వరంగల్ మండలాలతో కలిపి వరంగల్ రూరల్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాగా 2021 ఆగస్టు 12న ఏర్పడింది. పొరుగున ఉన్న హనుమకొండలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాకు ఆ జిల్లా కేంద్రంలోనే సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. కానీ, వరంగల్ జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆజంజాహి మిల్లు మైదానంలో చేపట్టిన కలెక్టరేట్ భవన పనులు 2025 జనవరి వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఇంకా స్లాబు దశలోనే ఉండడంతో మరో ఏడాది పట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. తన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే సమీకృత కలెక్టరేట్ భవన పనులు ఆలస్యంగా జరగడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 19న సీఎంవరంగల్కు రానుండడంతో ఈ భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని జిల్లావాసులు కోరుతున్నారు. పిల్లర్లకే పరిమితమైన డీ–బ్లాక్.. జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనం పనులు 2023 జూన్ 17న మొదలయ్యాయి. ఆజంజాహి మిల్లు మైదానంలో కేటాయించిన 18 ఎకరాల స్థలంలో అప్పటి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేసి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభించింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ దిశగా వేగవంతం చేయలేదన్న విమర్శలొస్తున్నాయి. ఏ, బీ, సీ, డీ–బ్లాక్‌లుగా జీప్లస్–2 తో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏ, బీ, సీ– బ్లాక్‌లలో పిల్లర్లు పూర్తయి స్లాబుల దశలో ఉన్నాయి. డీ–బ్లాక్ ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. మిగిలిన గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్, ప్లంబింగ్, విద్యుత్, పెయింటింగ్ తదితర పనులకు మరికొన్ని నెలలు పడుతుంది. జిల్లా ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యే నాటికి కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ‘సమస్యలు విన్నవించడానికి, కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్‌కు హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. అలాగే, ఎకై ్సజ్, పౌరసరఫరాల విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యాలయాలు విసిరేసినట్లుగా హనుమకొండలో అక్కడక్కడా ఉన్నాయి. దాదాపు అన్ని విభాగాల కార్యాలయాల పరిస్థితి ఇలానే ఉంది’ అని సామాజిక కార్యకర్త బాలరాజు అన్నారు. కొనసా...గుతున్న వరంగల్ సమీకృత కలెక్టరేట్ పనులు ఆజంజాహి మిల్లు ప్రాంగణంలో 17 నెలలుగా నిర్మాణం జిల్లాకేంద్రం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా హనుమకొండ నుంచే పాలన 19న సీఎం రేవంత్‌రెడ్డి రాక.. పనులు పుంజుకుంటాయని ఆశ -
గ్రూప్–3 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
వరంగల్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్–3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గ్రూప్–3 పరీక్షల నిర్వహణ రీజినల్ కో–ఆర్డినేటర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ప రీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించి అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడు తూ జిల్లాలో 10,919 మంది అభ్యర్థులకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32 మంది పరిశీలకులు, 82 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 28 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో టీజీ పీఎస్సీ రీజినల్ కో ఆర్డినేటర్ బత్తిని చంద్రమౌళి, డీసీపీ రవీందర్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీసీపీ (అడ్మిన్) రవి, ఏసీపీ నందిరాంనాయక్ పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద -
వైఎస్సార్ చొరవతో ఇంటర్నెట్ సేవలు
హన్మకొండ చౌరస్తా: దివంగత నేత వైఎస్సార్ చొరవతో రూ.5 కే గ్రంథాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైఎస్సార్ హయాంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేశారు. లైబ్రరీలో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న అభ్యర్థులు గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రంథాలయ సిబ్బంది వేతనాల్లో జాప్యం లేకుండా సమస్యల్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి శశిజాదేవి, లైబ్రేరియన్లు మల్సూర్, పురుషోత్తంరాజు, సామాజిక వేత్తలు నిమ్మల శ్రీనివాస్, సాగంటి మంజుల, జూనియర్ అసిస్టెంట్ సంతోశ్ పాల్గొన్నారు. మార్చి నెలాఖరులోగా బ్రిడ్జి పనులు పూర్తి కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. కాజీపేటలో రూ.78 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన మెటీరియల్‌ను గురువారం వారు పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలీ, నాయకులు ఈవీ శ్రీనివాస్ రావు, అబుబక్కర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం -
చెరువుకు జీవకళ
హన్మకొండ కల్చరల్: ఎత్తయిన గుట్టలు. చుట్టూ పచ్చందాలు. పక్కనే కొలువుదీరిన అమ్మవారు. జలసిరిని ఒడిసిపట్టినట్లుండే భద్రకాళి చెరువు పునర్జీవం పోసుకోనుంది. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. శతాబ్దాల చరిత ఉన్న భద్రకాళి చెరువు 15 ఏళ్ల క్రితం వరకు ప్రజలకు దాహార్తి తీర్చింది. చెరువు ఆక్రమణలు, అన్యాక్రాంతంతో ఇందులోని నీరు కలుషితమైంది. తాగునీరు, సాగునీరు సరఫరాకు దూరమైంది. స్థానిక ప్రజా ప్రతినిధుల విన్నపంతో చెరువుకు పునరుజ్జీవం పోయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇరిగేషన్ అధికారులు చెరువు శుద్ధీకరణకు చర్యలు చేపట్టారు. తొలుత చెరువులోని మురుగు నీటిని పూర్తిగా తొలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏడు రోజులుగా ఈప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. నీటి తొలిగింపునకు 15 రోజులు గడువు పెట్టినప్పటికీ గురువారం ఉదయం వరకు చెరువులోని 80 శాతం నీటిని దిగువకు వదిలేశారు. మరో మూడు రోజుల్లో చెరువులో నీటి చుక్క కనిపించకుండా ఖాళీ చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. శుద్ధీకరణతో పునరుజ్జీవంచెరువు శుద్ధీకరణ పూర్తయితే భద్రకాళి చెరువుకు మళ్లీ జీలకళ సంతరించుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి వరకు చెరువు శుద్ధి చేసి పూర్తి చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల నీరు పైపులైన్ల ద్వారా చెరువులో నింపి నగరానికి మళ్లీ తాగునీరందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ట్రై సిటీకి ఏకై క దిక్కుగా ధర్మసాగర్ చెరువు నిలిచింది. నీటి ఎద్దడిని అరికట్టేందుకు సమ్మర్ స్టోరేజీగా దీన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ ఒక్క చెరువుపైనే ఆధారపడకుండా భద్రకాళి చెరువును అభివృద్ధి చేసి శుద్ధ జలాలను నింపి తాగునీరందించేలా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాల్వ ల ద్వారా చెరువులోకి వచ్చే మురుగునీటిని రాకుండా కట్టడి చేసి శుద్ధీకరణ పనులకు శ్రీకారం చేపట్టారు. భద్రకాళి చెరువు నీటిని తూర్పు ప్రజలకు అందించి వేసవి తాపం తీర్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనేపథ్యంలో చెరువు పూడిక తీత పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చెరువును చెర పట్టలేరిక..భద్రకాళి చెరువును ఇక కబ్జా చేసే అవకాశం లేదు. ఇప్పటికే వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దీనిపై అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న చెరువు చుట్టూ ఎత్తయిన కట్ట పోసి దానిపై అధికారులు సుందరీకరణ పనులు చేపట్టి పార్క్‌గా ఏర్పాటు చేశారు. దీంతో చెరువు భూమిని ఇకపై ఎవరూ కబ్జా చేయలేరని నగరవాసులు పేర్కొంటున్నారు.భద్రకాళి చెరువులో 80 శాతం మురుగునీటి తొలగింపు మరో నాలుగు రోజుల్లో సరస్సు మొత్తం ఖాళీ వేసవిలో తాగునీటి సరఫరాకు కార్యాచరణ4 క్వింటాళ్ల చేపల అమ్మకం భద్రకాళి చెరువులో నీటి శాతం పూర్తిగా తగ్గిపోవడంతో మత్స్యకారులు చేపలను సులభంగా పట్టుకుంటున్నారు. చెరువు మత్తడి వద్ద మత్స్యకారుల సంఘం ప్రతినిధులు కేజీ రూ.120 నుంచి రూ.140 వరకు లైవ్ చేపలు విక్రయిస్తున్నారు. దీంతో చేపలను కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు. గురువారం ఒక్కరోజే సుమారు 4 క్వింటాళ్ల చేపలు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు. -
విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
న్యూశాయంపేట: విద్యను అందిపుచ్చుకుని ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు అన్నారు. గురువారం హనుమకొండ హంటర్‌రోడ్, హనుమకొండ–1, మైనార్టీ (బాలికలు) గురుకులంలో ప్రిన్సిపాల్ ఎం.నీరజ అధ్యక్షతన బాలల దినోత్సవం సందర్భంగా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో బాలల హక్కులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకార్మికులను ఎవరూ ప్రోత్సహించవద్దన్నారు. ఈసందర్భంగా గురుకులంలో ఇంటర్ చదువుతూ.. కరాటే పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థి ఆసియాకు జ్ఞాపిక అందించి అభినందించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. బాలికలు లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను తెలిపేందుకు గురుకులంలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు జడ్జి రమేశ్‌బాబు తెలిపారు. బాలికలు కంప్యూటర్ విద్యను అందిపుచ్చుకునేందుకు 10 కంప్యూటర్లు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, పీపీ శ్రీకాంత్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు