Hanuman Chalisa
-
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే
జైపూర్/రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత విశ్వాసాలు పాటించడం చాలా కష్టమని, కనీసం హునుమాన్ చాలీసా వినడం కూడా పెద్ద నేరం అవుతుందని అన్నారు. మంగళవారం రాజస్తాన్‌లోని టోంక్, ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి, ధామ్తారీ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల హనుమాన్ చాలీసా వింటున్న ఓ దుకాణదారుడిని దారుణంగా కొట్టారని గుర్తుచేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరారని చెప్పారు. రాళ్లు విసిరినవారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రక్షణ కల్పించారని, రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. రాజస్తాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మత విశ్వాసాలను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా హనుమాన్ చాలీసా పఠించవచ్చని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవచ్చని, ఇది బీజేపీ గ్యారంటీ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. రిజర్వేషన్లపై ఇదే నా గ్యారంటీ ‘‘మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టే పనికి శ్రీకారం చుట్టింది. 2004 నుంచి 2010 దాకా ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసేందుకు నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచింది. కానీ, చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్ ఉద్దేశం నెరవేరలేదు. 2011లో దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సాగించిన కుట్రలు ఫలించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొట్టి, మరో వర్గానికి ప్రయోజనం కల్పించాలని చూశారు. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ ఏనాడూ గౌరవించలేదు. దళితులు, వెనుకబడిన గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను విభజించి, ముస్లింలకు ఇచ్చేస్తామని బహిరంగంగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల నుంచి దొంగిలించి, ముస్లింలకు ఇచ్చిన కోటాను బీజేపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల గడువు 2020లో ముగిసిపోగా, మేము మరో పదేళ్లు పొడిగించాం. దళితులకు, వెనుకబడిన గిరిజనులకు రిజర్వేషన్లు ఎప్పటికీ అంతం కాబోవని నేను గ్యారంటీ ఇస్తున్నా. మతం పేరిట ఎవరైనా రిజర్వేషన్లను విభజించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. రాజ్యాంగానికి విధేయుడిగా నడుచుకుంటున్నా. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను ఆరాధిస్తున్నా’’ నక్సలిజం, మావోయిజాన్ని అంతం చేస్తాం ‘‘ఛత్తీస్‌గఢ్‌లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి హింసను ప్రోత్సహించింది. కాంగ్రెస్‌కు, అభివృద్ధికి పొత్తు పొసగదు. అవి రెండూ కలిసి ముందుకు సాగలేవు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పెరిగిపోతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నక్సలైట్ల హింసాకాండ విపరీతంగా పెరిగింది. హింసాకాండలో ఒకవైపు జనం మరణిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, మావోయిస్టు హింసాకాండ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు’’ కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముపై ఎక్స్–రే ‘‘దేశంలో వనరులపై మొదటి హక్కు మైనార్టీలకే ఉందని కాంగ్రెస్ పాలనలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ఇది యాదృచ్చికం కాదు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ సిద్ధాంతం. ప్రజల ఆస్తులను, కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకొని, కొందరు ఎంపిక చేసిన వ్యక్తులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. కాంగ్రెస్‌తోపాటు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెడుతున్నందుకే ఆ పార్టీ నాయకులు నన్ను దూషిస్తున్నారు. నిజం మాట్లాడితే వారు భయపడుతున్నారు. వారి రహస్య ఎజెండాలను బహిర్గతం చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకుంది. అందుకే రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను, సొమ్ములను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. అంటే ప్రజలు తమ దగ్గరున్న డబ్బులు, బంగారాన్ని పెట్టెలో దాచి, గోడల్లో రహస్యంగా భద్రపరిచినా కాంగ్రెస్ నాయకులు ఎక్స్–రే ద్వారా కనిపెట్టి, స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ఎంపిక చేసిన వ్యక్తులకు ఆ సొమ్ము పంపిణీ చేస్తారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునఃపంపిణీ వెనుక ఉన్న అసలైన అర్థం ఇదే’’ దేశాన్ని విభజించే కుతంత్రమే ‘‘కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని మతం పేరిట ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిరోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల ప్రజలు అధికారంలో భాగస్వాములు కావడాన్ని ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోంది. మరో నాటకానికి తెరతీసింది. దేశాన్ని విభిజించే కుట్రలకు పాల్పడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా మార్చాలని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు గోవాలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయొద్దని అంటున్నారు. ఇది ముమ్మాటికీ దేశాన్ని విభజించే కుతంత్రమే. రాజ్యాంగాన్ని అమలు చేయొద్దనడం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించినట్లు కాదా? తమపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయతి్నస్తున్నారంటూ గతంలో జమ్మూకశ్మీర్‌లో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతుండేవారు. మీరు(ప్రజలు) బీజేపీని ఆదరించాక ఆ వ్యక్తుల నోళ్లు మూతపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం కాంగ్రెస్‌ను తిరస్కరించింది. అందుకే దేశాన్ని చిన్నచిన్న దేశాలుగా, దీవులుగా విడగొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ నేడు గోవాలో రాజ్యాంగం అమలును అంగీకరించడం లేదు. రేపు దేశమంతటా అమలు చేయొద్దని చెప్పడం ఖాయం. దేశ అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఒక విజన్ లేదు. పేదల సంక్షేమం గురించి ఆ పార్టీకి ఏబీసీడీ కూడా తెలియదు. ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది. బీజేపీ సంగతి పక్కన పెట్టండి. సాక్షాత్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దిగొచ్చినా సరే రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు’’ -
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినటం కూడా నేరమే: మోదీ
జైపూర్: రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతిని సందర్భంగా హనుమాన్ చాలీసా వినడం కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తప్పు అని అన్నారు. ప్రజల సంపదను లాక్కుని కొందరికి పంచిపెట్టే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. శ్రీ రామనవమి రోజు రాజస్థాన్‌లో మొదటిసారి శోభా యాత్ర ఊరేగింపు జరిగింది. రామ్-రామ్ అని జపించే రాజస్థాన్ వంటి రాష్ట్రంలో, ప్రజలు రామనవమి జరుపుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పండుగను నిషేదించిందని మోదీ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మోదీ కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలున్నవారికి, చొరబాటుదారులకు పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. మీరు కష్టపడి సంపాదించిన మీ ఆస్తిని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? అని ప్రశ్నించారు. మహిళల దగ్గర ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు సేకరిస్తామని.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెబుతోంది. ప్రజల కష్టార్జితం, వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన సంపదని ఇతరులకు పంచిపెట్టడం ఎంతవరకు న్యాయమని మోదీ ప్రశ్నించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు విరుచుకుపడుతున్నారు. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్‌లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు. -
‘బీజేపీకి ఆప్‌కు మధ్య తేడా ఎంటీ?’
అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు. ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు. ఆప్‌లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు. చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’ -
లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం..
ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఉద్ధవ్ థాక్రే వర్గంపై నిప్పులు చెరిగారు. హిందుత్వ భావాజాలాన్ని, బాల్ థాక్రే ఐడియాలజీని వదిలేసినందుకు విరుచుకుపడ్డారు. ఇండియా కూటమితో కలిసి కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్న ఉద్ధవ్ థాక్రే వర్గంపై మండిపడ్డారు. అంతేకాకుండా లోక్‌సభలోనే హనుమాన్ చాలీసాను పఠించారు. కల్యాన్ నుంచి ఎంపీగా గెలుపొందిన శ్రీకాంత్ షిండే నేడు లోక్ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. వచ్చే రోజుల్లో యుద్ధం ఎన్డీయే వర్సెస్ ఇండియా కాదు.. స్కీం వర్సెస్ స్కాం అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అంటేనే అవినీతికి మరోపేరు అని విమర్శించారు. లోక్‌సభలో నేడు అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా షిండే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉద్ధవ్ వర్గం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత విడిపోయి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శివసేన కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించరని అన్నారు. చివరికి కరసేవకులపై దాడి చేసిన సమాజ్ వాదీ పార్టీతో కూడా కలిసిపోతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కనీసం హనుమాన్ చాలీషా కూడా చదవనీయలేదని ఉద్ధవ్ వర్గంపై మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు ఆయన నివాసం వద్ద హనుమాన్ చాలీసా పాఠనం చేస్తామని ప్రకటించిన ఎంపీ నవ్‌నీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసి షిండే.. లోక్ సభలోనే హనుమాన్ చాలీసా పఠించారు. తొందరగా ముగించాలని స్పీకర్ చెప్పడంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ -
'జైలులో నన్ను టార్చర్ పెట్టారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి..'
ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా తనను గతేడాది జైల్లో టార్చర్ పెట్టారని ఆరోపించారు. ఎంత హింసించినా తన నమ్మకాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. ఆ రోజులు తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. అసలు ఎందుకు జైలుకు వెళ్లావు? ఏం చేశావు? అని తన పిల్లలు తరచూ అడిగేవారని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది హనుమాన్ జయంతి సందర్భంగా అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హునుమాన్ చాలీసా చదువుతానని శపథం చేశారు నవనీత్ రానా. తనతో పాటు వేలాది మంది కలిసిరావాలని పిలుపునిచ్చారు. దీంతో శివసేన కార్యకర్తలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ముందుజాగ్రత్తగా చర్యగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నవనీత్ రానా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి సీఎం థాక్రేకు తగిన శాస్తి జరిగిందని, పదవి పోయిందని విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడు కూడా పార్టీని కాపాడలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తప్పుడు నిర్ణయమని తండ్రి ఆవేదన -
ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త.. వైరల్ వీడియో
ముంబై: తన భార్య నవనీత్ కౌర్ రాణా అనారోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా బైకుల్లా జైలు అధికారులు కనీసం పట్టించుకోలేదని ఎంపీ రవి రాణా ఆరోపించారు. తలోజా జైలు నుంచి గురువారం రవిరాణా విడుదలయ్యారు. రవిరాణా విడుదలకు రెండుగంటల ముందు బైకుల్లా మహిళా జైలునుంచి ఆయన భార్య నవనీత్ కౌర్ రాణా విడుదలయ్యారు. గత నెల 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో వీరిద్దరినీ ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు.అనంతరం నవనీత్ రాణా అనారోగ్య సమస్యలతో సబ్ అర్బన్ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు. చదవండి: ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత ఆరు రోజుల నుంచి నవనీత్ ఆరోగ్యం బాగోలేదని బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేసిందని, అయితే కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో రవిరాణాతో పాటు బీజేపీ నేత కృతి సోమయ్య వెంట ఉన్నారు. కాగా, వార్డులో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. pic.twitter.com/0Al31eJkCy — Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022 -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
లౌడ్ స్పీకర్లపై పోరాటం ఆగదు: రాజ్ ఠాక్రే హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్ వచ్చే లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లను బంద్ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. చదవండి: లౌడ్‌స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్‌స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
Navneet Rana: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్
ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సెషన్స్ కోర్టు. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు ఈ ఇండిపెండెంట్ ఎంపీ, ఎమ్మెల్యే భార్యాభర్తలు. ఈ తరుణంలో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ స్టేషన్ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ముంబై సెషన్స్ కోర్టు.. మీడియాతో మాట్లడవద్దని నవనీత్ కౌర్ దంపతులను ఆదేశించింది. చదవండి: ఎస్సీ కావడంతో నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు: నవనీత్ కౌర్ -
ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్
ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించాడాయన. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. థాక్రే వర్సెస్ థాక్రే మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్ఎస్ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్‌తో సేన ఓట్లను ఎంఎన్ఎస్ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది. చదవండి: 14 ఏళ్ల కిందటి కేసు.. రాజ్‌థాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ -
Sakshi Cartoon: కంగారు పడకండి స్వామీ! ఎన్నికల సమయంలో...
కంగారు పడకండి స్వామీ! ఎన్నికల సమయంలో ఇది కామన్!! -
ఎంపీ నవనీత్‌కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్
సాక్షి, ముంబై: ఎంపీ నవనీత్‌కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు హనుమాన్ చాలీసా వివాదంతో మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి ముంబైలోని ఖర్ పోలీస్టేషన్‌కు సైతం తరలించారు. అయితే పోలీసుల తీరుపై ఆమె సంచలన ఆరోపణలకు దిగారు. స్టేషన్లో పోలీసులు తనను వేధించారని, కులం పేరుతో అవమానించారంటూ ఎంపీ నవనీత్‌కౌర్, సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. రాత్రిపూట దాహం వేసి నీళ్లు అడిగినా ఇవ్వలేదని, పైగా తాను ఎస్సీ అయినందున వాళ్లు తాగే గ్లాసుల్లో నీళ్లు అస్సలు ఇవ్వలేమంటూ వేధించారంటూ ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్ స్టేషన్లో జంతువుల కన్నా హీనంగా తమను చూశారంటూ పేర్కొన్నారామె. కాబట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో లోక్‌సభ సెక్రెటేరియట్ ప్రివిలైజ్ అండ్ ఎథిక్స్ బ్రాంచ్.. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ నివేదిక కోరింది. అయితే ఈ ఎపిసోడ్లో ఊహించని పరిణామం జరిగింది. ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ పాండే ట్విటర్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. నవనీత్‌కౌర్, ఆమె భర్త రవి, కూడా ఉన్న యువతి రిలాక్స్‌గా టీ తాగుతున్న వీడియో పోస్ట్ చేసిన సీపీ సంజయ్ పాండే.. ఇంత కన్నా ఏమైనా చెప్పాలా? అంటూ క్యాప్షన్ ఉంచారు. Do we say anything more pic.twitter.com/GuUxldBKD5 — Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022 ఇదిలా ఉండగా.. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ నవనీత్‌కౌర్, ఆమె భర్త రవి రానాలు ఛాలెంజ్ చేసి నగరంలో తీవ్ర ఉద్రిక్తతలను కారణం అయ్యారు. దీంతో విద్వేషాలను రగిల్చే ప్రయత్నం, పోలీస్ ఆదేశాలను ఉల్లంఘించడం, విధుల్లో ఆటంకం కలిగించడం తదితర నేరాల కింద వీళ్లిద్దరిని అరెస్ట్ చేశారు. చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్ -
PM Modi: మోదీకి హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
దేశంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట(ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం) హనుమాన్ చాలీసా, నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిలో కోర్టులో హాజరు పరుచగా.. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్ -
Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్
Hanuman Chalisa Row: మాజీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. అయితే, హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత నవనీత్ రాణా దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. ఈ అభియోగంపై వారిద్దరి తరపు న్యాయవాది తప్పుబట్టారు. హనుమాన్ చాలీసా పఠించడం 153 (ఏ) కింది రాదని, ఇదో బోగస్ కేసు అని మండిపడ్డారు. వీరు బెయిల్‌పై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు. ఇది చదవండి: డ్రాగన్ దేశం చైనాకు బిగ్ షాక్ -
ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్
ముంబై: మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో..ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. ఆపై ఎమ్మెల్యే రవి రానా, ఆయన భార్య ఎంపీ నవనీత్ కౌర్‌లు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవనీత్ కౌర్ ప్రకటన, ఆ తర్వాత పోలీసుల చర్యలతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చదవండి👉🏾: బీజేపీ అండతో నవనీత్ కౌర్ రెచ్చిపోతోంది -
రెచ్చిపోవద్దు.. ఊరుకోం! నవనీత్ కౌర్‌కు హెచ్చరికలు
ముంబై: మహానగరంలో ‘హనుమాన్ చాలీసా’ ఛాలెంజ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీకి ఎలాగైనా చేరుకుని హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నగర వ్యాప్తంగా హై అలర్ట్ విధించారు. చాలెంజ్ ప్రకారం.. ఎలాగైనా మాతోశ్రీని తన అనుచరులతో చేరుకోవాలని ఎంపీ నవనీత్‌కౌర్, ఆమె భర్త రవి రానాలు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నవనీత్‌ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టనివ్వకుండా శివ సేన కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు. అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇక ఈ పరిణామాలపై సేన నేత, ఉద్దవ్ థాక్రే ముఖ్యఅనుచరుడు సంజయ్ రౌత్ స్పందించాడు. ఎవరైనా మాతోశ్రీని చేరుకునే ప్రయత్నాలు చేసినా చూస్తూ ఊరుకోవద్దంటూ శివ సైనికులకు సూచించాడు. ‘‘అలా చేస్తూ చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దమ్ముంటే రండి. మా సత్తా ఏంటో చూపిస్తాం. మీ భాషకు మీ భాషలోనే సమాధానం ఎలా ఇవ్వాలో శివ సైనికులకు బాగా తెలుసు. బీజేపీ అండతో ఆమె(నవనీత్‌కౌర్‌ను ఉద్దేశించి) రెచ్చిపోతున్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉంది’’ అంటూ స్పందించాడు ఎంపీ సంజయ్ రౌత్. అంతేకాదు రాష్ట్రపతి పాలన ప్రస్తావనపై స్పందిస్తూ.. కేంద్రం చర్యలకు బెదిరే ప్రసక్తే లేదంటూ బదులిచ్చాడు. ఆజాన్, లౌడ్‌స్పీకర్ వివాదాలు నడుస్తున్న వేళ.. ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు, సీఎం ఉద్దవ్ థాక్రేను హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా పఠించాలంటూ సవాల్ విసిరారు. లేకుంటే.. తాము మాతోశ్రీ ఎదుటకు వచ్చి హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ పేర్కొన్నారు. ఈ తరుణంలో అప్రమత్తమైన శివ సేన కార్యకర్తలు ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట నిరసనలు శనివారం మోహరించారు. దీంతో ఆమె, సీఎం ఉద్దవ్ థాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే వాళ్ల దాడి నుంచి మాతోశ్రీని రక్షించుకునే ప్రయత్నమే తమదని సేన కార్యకర్తలు చెబుతున్నారు. ఓ పక్క ముంబై పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పొలిటికల్ జంటకు శుక్రవారం నోటీసులు జారీ చేయగా.. మరోవైపు కేంద్రం అమరావతి లోక్‌సభ సభ్యురాలైన నవనీత్ కౌర్‌కు కేంద్ర సాయుధ కమాండోలతో వీఐపీ భద్రత కలిపించడం విశేషం. చదవండి👉🏼: మేం తగ్గం.. ఆ పని చేసి తీరతాం -
ఎంపీ నవనీత్ కౌర్‌కు పోలీసుల నోటీసులు
ముంబై: మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలకు కూడా నోటీసులు అందించారు. సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీ బయట హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఇలా స్పందించారు. శుక్రవారం ఉదయం ముంబై నగరం చేరుకున్న రానా దంపతులు.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. వాళ్ల సవాల్ నేపథ్యంలో.. ముంబైకి శివసేన కార్యకర్తలు, ప్రత్యేకించి మాతోశ్రీ దగ్గర గుమిగూడారు. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం కింద వాళ్లకు నోటీసులు జారీ చేశారు జోన్ 9 డీసీపీ మంజునాథ్ షింగే. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే.. దానికి ఈ భార్యాభర్తలే బాధ్యత వహించాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీచేశారు. ఇదిలా ఉంటే.. హనుమాన్ చాలీసా పఠించాలంటూ సీఎం ఉద్దవ్ థాక్రేకు సవాల్ విసిరాడు మహారాష్ట్ర స్వతంత్ర ఎమెల్యే రవి రానా. అది జరగని పక్షంలో తాను, తన భార్య నవనీత్ కౌర్ .. అనుచరగణంతో పాటు మాతోశ్రీ బయట హానుమాన్ చాలీసా పఠిస్తామని పేరొన్నారు. ఈ నేపథ్యంలో ఈ జంటను.. శివ సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో రైలు మార్గం గుండా ముంబైకి చేరుకోవాలనుకున్న జంట.. విమానంలో వచ్చింది. ఆపై నందగిరి గెస్ట్‌కు చేరుకోగా.. అక్కడికి చేరుకున్న శివ సైనికులు హనుమాన్ చాలీసాతో హోరెత్తించారు. ఈ వ్యవహారంలో రానా దంపతులు వెనక్కి తగ్గారా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సుమారు 500 మంది అనుచరులతో వాళ్లు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు గట్టి చర్యలే తీసుకున్నారు. చదవండి: కుష్బుకు రాజ్యసభ బెర్తు దక్కేనా? -
వీడియో: బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే హనుమాన్ చాలీసా చదివిన మహిళ
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎయిమ్స్ వైద్యులు 22 ఏళ్ల యుక్తి అగర్వాల్ అనే మహిళకు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా ఆమె హనుమాన్ చాలీసా పఠించారు. న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంటల పాటు ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించేవరకూ ఆమె స్ప్రహలోనే ఉన్నారు. అంతేకాదు, ఆమె చికిత్స మధ్యలో వైద్యులతో సహకరించడం విశేషం. మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగనట్లు తల అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ మహిళ బయటకొచ్చారు. కాగా మహిళకు అనస్తీషియాతో పాటు పెయిన్‌కిల్లర్ మందులు ఇచ్చామని వెద్యులు వెల్లడించారు. జులై 22న జరిగిన ఈ ఘటనను ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు దీపక్ గుప్తా వివరించారు. టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. In #AIIMS, a woman patient recite 40 verses of #Hanuman chalisa, while @drdeepakguptans and his neuro anaesthetic team conducts brain tumor surgery.#Delhi pic.twitter.com/MmKTJsKo95 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021 -
సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసా
రాజాం సిటీ: సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసాను చెక్కి ప్రతిభ నిరూపించుకున్నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, స్వర్ణకారుడు ముగడ జగదీశ్వరరావు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా రజత పుస్తకం రూపొందించానని తెలిపారు. మొత్తం 22 పేజీలు గల 11 వెండి రేకులలో 40 హనుమాన్ చాలీసా శ్లోకాలను చేతితో చెక్కినట్లు పేర్కొన్నారు. 1.060 మిల్లీ గ్రాముల బరువుతో 3.2 సెంటీమీటర్ల పొడవు, 2.3 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ పుస్తకం తయారు చేశానని తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం పట్టిందన్నారు. పుస్తకం మొదటి పేజీలో ఆంజనేయుడు, ఆఖరి పేజీలో శ్రీరాముడు చిత్రపటాలను చెక్కినట్లు చెప్పారు. గతంలోనూ దేశనాయకులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫొటోలను వెండి కాయిన్లపై చెక్కి అబ్బురపరిచారు. గిన్నిస్‌బుక్ లక్ష్యం.. గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించేందుకు ఈ మైక్రో ఆర్ట్‌ను ఎంచుకున్నాను. ప్రతి రోజు ఏదో ఒక చిత్రాన్ని వెండి కాయిన్‌పై రూపొందిస్తున్నా. భారతదేశ చిత్రపటాన్ని పెన్సిల్ ముల్లుపై 50 సెకన్లలో వేసినందుకు క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. మరింతగా సూక్ష్మమైన ఆర్ట్వేసి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదిస్తా. – ముగడ జగదీశ్వరరావు, మైక్రో ఆర్టిస్ట్, రాజాం -
మసీదు పెద్దకు భారీ జరిమానా: ఎందుకంటే..
లక్నో : మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయటానికి అనుమతించిన మసీదు పెద్దకు భారీ షాక్ తగిలింది. ఈ విషయంపై భగ్గుమన్న మసీదు కమిటీ మసీదు పెద్దకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, వినయ్‌పుర్‌కు చెందిన మనుపాల్ భన్సాల్ ‘జనసంఖ్య సమాధాన్ ఫౌండేషన్’కు జాతీయస్థాయి వైస్ ప్రెసిడెంట్. ఓ రోజు ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమం కోసం గ్రామంలోని మసీదులో కూర్చోవటానికి మసీదు పెద్ద అలీ హాసన్ అనుమతి అడిగాడు. ఆయన సరే నన్నాడు. కార్యక్రమం మొదలవగానే మనుపాల్ హనుమాన్ చాలీసా పారాయణం చేశాడు. అయితే కార్యక్రమం జరుగుతున్నంతసేపు పెద్దగా పట్టించుకోని మసీదు కమిటీ పెద్దలు ఆ తర్వాత సీరియస్ అయ్యారు. ( బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు ) అలీ, మనుపాల్‌లను పిలిచి పంచాయితీ పెట్టారు. ఇద్దరూ చెరో 5 లక్షల రూపాయలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చేసేదీమీ లేక సరేనని, కమిటీ చెప్పిన కాగితాలపై సంతకం చేసి వచ్చేశారు. దీనిపై అలీ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు మనుపాల్ నా దగ్గరకు వచ్చి మసీదు లోపల కూర్చోవటానికి అనుమతి అడిగాడు. నేనెలా కాదనగలను. ప్రతీ ఒక్కరికి దేవుడి సన్నిధిలో కూర్చునే హక్కు ఉంటుంది. ప్రస్తుతం నన్ను మసీదునుంచి బయటకు పంపేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ( గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! ) -
ఒకేసారి 50 దేశాల్లో హనుమాన్ చాలీసా పారాయణం
కరోనా మహమ్మారిని నుంచి మానవాళిని రక్షించుకునేందుకు.. జరిపే పోరులో విజయం సాధించడానికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా సాధించే లక్ష్యంతో అంతర్జాలంలో సిలికానాంధ్ర హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించింది. సాయిదత్తపీఠం, నాట్స్‌తో పాటు అనేక తెలుగు సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ లక్ష గళార్చనకు తమ సహకారాన్ని అందించాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒకేసారి లక్షమంది హనుమాన్ చాలీసా పఠించడంతో, హనుమాన్ చాలీసా లక్ష గళార్చన కార్యక్రమం గిన్నీస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి, ఆరెంజ్ మూన్ సాంకేతిక బృంద సమన్వయకర్త హరి దేవబత్తుని అకుంఠిత కార్యదీక్షతో లక్ష గళార్చన లక్ష్యాన్ని సాధించారు. 50 దేశాల నుంచి హిందు భక్త సమాజం ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. ఇందులో ఎందరో హిందు ప్రముఖులు కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్‌లు ఇది ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనియాడారు. ఒకేసారి ఇంతమంది ఆన్లైన్ వేదికగా గళార్చన చేయడంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కి యావత్ భారతీయులంతా గర్వపడేలా చేసింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదనేది ఈ లక్ష గళార్చన నిరూపించిందని... కరోనా పై పోరులో దైవబలం కూడా మానవాళికి తోడుగా ఉండి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యూజెర్సీ సాయిదత్త పీఠం ద్వారా భక్తులను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయడంలో రఘు శర్మ శంకరమంచి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ అందించిన సహకారం కూడా మరువలేనిదని ఆనంద్ కూచిభొట్ల అన్నారు. ఈ విషయంలో నాట్స్ నాయకులు మురళీకృష్ణ మేడిచర్లను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
కరోనా అంతానికి హనుమాన్ చాలీసా..
భోపాల్: కరోనా వైరస్ రాకూడదంటే భౌతిక దూరం, ఫేస్ మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవడం వంటికి అందరికీ తెలుసు. ఇప్పటికే కరోనా బారిన పడినవారు శక్తివంతమైన ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మహమ్మారితో పోరాడుతున్నారు. మరోవైపు వీరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్, మందులతో కాకుండా హనుమాన్ చాలీసా పఠిస్తే సరిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సెలవిచ్చారు. (అకృత్యం: నిందితుడికి పాజిటివ్.. ఆమెకు నెగటివ్) ఈమేరకు శనివారం ట్విటర్లో "కరోనాతో పోరాడేందుకు అందరూ జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు తప్పనిసరిగా రోజుకు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. ఆఖరి రోజు ఇంట్లో దీపాలను వెలిగించి రాముడికి హారతి పట్టండి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హనుమాన్ చాలీసాను ఒకే స్వరంలో పఠిస్తే దానికి కచ్చితంగా ఫలితం ఉంటుంది. కరోనా నుంచి మనం విముక్తి పొందుతాం.. ఇది రాముడికి చేసే ప్రార్థన" అని చెప్పుకొచ్చారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న భోపాల్‌లో వచ్చేనెల 4 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. "4న లాక్డౌన్ ముగుస్తుంది, 5న మనం చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమం ముగుస్తుంది. పైగా అదే రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఆ రోజును మనం పండగలా వేడుక చేసుకుందాం" అని పిలుపునిచ్చారు. (సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు) -
15న పిచ్చుకలంకలో హనుమాన్ చాలీసా యఙ్ఞం
-
'ఒవైసీ కూడా త్వరలో హనుమాన్ చాలీసా చదువుతారు'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతారని యూపీ సీఎం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇవాళ కిరారిలో జరిగిన ప్రచార సభలో యోగి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టారని, ఇక ముందు ఏం జరుగుతుందో కూడా మీకే తెలుస్తుందని, ఎంఐఎం నేత ఒవైసీ కూడా ఏదో ఒక రోజు హనుమాన్ చాలీసా చదువుతూ కనిపిస్తారని అన్నారు. ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలను ఆదిత్యనాథ్ ఖండించారు. సీఏఏ నిరసనకారులకు ఇలాంటి నేతలు బిర్యానీలు అందిస్తున్నారని, మరో వైపు చాలీసా వల్లిస్తున్నారని యోగి ఆరోపించారు. అయితే యోగి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఢిల్లీలో ప్రచారం నిర్వహించకుండా ఆయనపై నిషేదం విధించాలని ఆప్ ఆదివారం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.