Hollywood actor
-
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న హాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?
లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'నిన్ను వదలను'. యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అశోక్ కుల్లర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో రష్యాకు చెందిన లియుబా పామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సింగర్‌గా రాణించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు నిర్మాతగా.. లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్‌కు రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నిన్ను వదలను అంటూ హారర్ థ్రిల్లర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కాగా.. వాక్టర్ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్'లో అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'వెస్ట్‌వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే', క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్‌లలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా పనిచేశాడు. 2016లో వచ్చిన చిత్రం 'యూఎస్ఎస్ ఇండియానాపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మారియో వాన్ పీబుల్స్ దర్శకత్వం వహించాడు. -
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు రోజర్ విలియం కోర్మన్ (98) కన్నుమూశారు. 1926 ఏప్రిల్ 5న డెట్రాయిట్లో జన్మించారు రోజర్ కోర్మన్ . కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఈ నెల 9న ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో కాస్త ఆలస్యంగా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. 1950లో స్టోరీ రీడర్‌గా ఆయన సినీ కెరీర్ మొదలైంది. కెరీర్ మొదట్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత రోజర్ కోర్మన్ తొలిసారిగా ‘మాన్ స్టర్ ఫ్రమ్ ది ఓషియన్ ఫ్లోర్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ నిర్మించగా మంచి విజయం సాధించింది. రోజర్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 350కిపైగా సినిమాలను నిర్మించారు. అలాగే 20కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 30 సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ చేశారు. రోజర్ కెరీర్లో ‘ఫైవ్ గన్స్ వెస్ట్’, ‘డే ది వరల్డ్ ఎండెడ్’, ‘ది అన్ డెడ్’, ‘టార్గెట్స్’, ‘వార్ ఆఫ్ ది శాటిలైట్స్’, ‘ఎక్స్: ద మ్యాన్ విత్ ది ఎక్స్ రే ఐస్’, ‘డెత్ రేస్’ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి. హాలీవుడ్ పరిశ్రమ రోజర్‌ను ‘΄ోప్ ఆఫ్ ΄ాప్ సినిమా’, ‘ది కింగ్ ఆఫ్ కల్ట్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంది. రోజర్‌కు భార్య జూలీ కోర్మన్, కుమార్తెలు కేథరీన్, మేరీ ఉన్నారు. ఆయన మృతిపట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఇండస్ట్రీలో విషాదం.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రంలో కెవాన్ లన్నిస్టర్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బెన్ డేనియల్స్ ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.ఇయాన్ గెల్డర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పాటు సర్జ్, క్వీర్స్, షేక్స్పియర్ గ్లోబ్, హిజ్ డార్క్ మెటీరియల్స్. అండర్డాగ్ లాంటి చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కాగా.. ఇటీవలే టైటానిక్ నటుడు సైతం మరణించిన సంగతి తెలిసిందే. -
విషాదం.. ఆస్కార్ విజేత లూయిస్ గోసెట్ కన్నుమూత
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. అమెరికన్ ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లూయిస్ గోసెట్ జూనియర్ (87) కాలిఫోర్నియాలో కన్నుమూశారు. లూయిస్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇక 1936లో లూయిస్ గోసెట్ సీనియర్, హెలెన్ రెబక్కా దంపతులకు మే 27న న్యూయార్క్‌లో జన్మించారు లూయిస్ గోసెట్ జూనియర్. చిన్నతనంలోనే లూయిస్‌కు నటన పట్ల ఆసక్తి ఉండేది. అలా 17ఏళ్ల వయసులోనే రంగస్థల నటుడిగా మారాడు లూయిస్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ‘ఎ రైసిన్ ఇన్ ది సన్, ది బ్లాక్స్, ది పనిషర్, స్కిన్గేమ్’ వంటి సినిమాల్లో నటించారు. ‘ది బుక్ ఆఫ్ నీగ్రోస్’ వంటి టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించారు లూయిస్. ఇక 1982లో వచ్చిన ‘యాన్ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్‌మేన్’ సినిమాలోని నటనకుగాను 55వ ఆస్కార్ అవార్డ్స్‌లో లూయిస్ ఉత్తమ సహాయనటుడు విభాగంలో అవార్డు అందుకున్నారు. కాగా ఈ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి నటుడు లూయిస్నే అని హాలీవుడ్ సమాచారం. అలాగే ఇదే సినిమాకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. 1977లో వచ్చిన మినీ సిరీస్ ‘రూట్స్’లోని నటన లూయిస్‌కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ఎమ్మీ అవార్డు కూడా అందుకునేలా చేసింది. -
ఐదేళ్లుగా ఆ వ్యాధి.. 'కెప్టెన్ మార్వెల్' నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు చనిపోయాడు. కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కెన్నెత్ మిచెల్(49) ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచాడు. తాజాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఏఎల్ఎస్ (అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇతడు.. ఆ వ్యాధితో పోరాడుతూ చనిపోయాడు. (ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) 2000 నుంచి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తున్న కెన్నెత్ మిచెల్.. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, ఘోస్ట్ విస్పరస్ తదితర చిత్రాల్లో నటించాడు. అలానే పలు వెబ్ సిరీసుల్లో హీరోగా, సహాయ పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ విషయానికొస్తే 2006లో నటి సుసాన్ మే ప్రాట్ని పెళ్లి చేసుకున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్‌కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ (39) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 11న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను ఆయన సన్నిహితులు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు. కాగా డారెన్ కెంట్ ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించారు. 2007లో ఇటాలియా కాంటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఆ మరుసటి ఏడాది మిర్రర్స్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ద లిటిల్ స్ట్రేంజర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. 'Game of Thrones' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ ఇతడికి విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితోపాటు అనేక HBO డ్రామా సిరీస్‌లలోనూ నటించారు. సన్నీబాయ్ సినిమాకు గాను కెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. What a privilege it was to be your friend and to work together on so many projects over the years. Life won’t be the same without you 💔I will miss you so much. RIP darling Darren Kent xxxx pic.twitter.com/Fz81LszZkF — Jane Gull (@GullJane) August 14, 2023 Love and thoughts to the friends and family of our talented, caring soul of a friend, Darren Kent, who sadly passed away on Friday. Darren, an Essex writer, actor and director, directed our award winning short You Know Me. A true character who was Always creating and forever… pic.twitter.com/y3IWbJxi6I — Ben Trebilcook (@BenTrebilcook) August 13, 2023 -
83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే దాదాపు 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు. అది కూడా తనకంటే వయసులో చిన్నదైన 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. జూన్‌లో నూర్ అల్ఫాల్లా బిడ్డకు జన్మనివ్వగా.. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. అల్ పాసినో అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు. ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!) ప్రెగ్నెన్సీ సమయంలో అనుమానాలు? అయితే గతంలో నూర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.. నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు. నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరాడని తెలిసింది. అంతేకాకుండా తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు. అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది. మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి చేసుకోకుండానే ముగ్గురితో సహజీవనం? అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ అనే మహిళతో సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు. వీరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్‌లో కలిసి డిన్నర్ చేస్తుండగా.. మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. కొవిడ్ లాక్ డౌన్లో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా.. అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) + Al and his girlfriend, Noor Alfallah, after dinner in Santa Monica. pic.twitter.com/6kCrePMDuf — Pacino's World 👑 (@worldpacino) August 2, 2023 -
అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఇండియాలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది! ) అయితే భారత్‌లో ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఐమాక్స్‌లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర రూ.2450 పలుకుతోంది. గతంలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 సినిమా టికెట్ ధర బెంగళూరులో గరిష్ఠంగా రూ.1700 మాత్రమే పలికింది. అంతటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అవతార్‌ను సినిమాను మించి టికెట్ ధరలు ఉండడంతో సినీ ప్రియులు ఆశ్చర్య పోతున్నారు. మనదేశంలో సాధారణంగా టిక్కెట్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. తాజాగా ముంబయిలో ఓపెన్ హైమర్ మూవీ టికెట్ ధర రూ.2450 ( ఎలాంటి పన్నులు లేకుండా) ఇప్పటికే అమ్ముడయ్యాయి. ముంబయిలోని పీవీఆర్ ఐకాన్, ఫీనిక్స్ పల్లాడియంలో సాయంత్రం ఏడు, రాత్రి పది గంటల షో కోసం సినిమా రిలీజ్ రోజున టిక్కెట్స్ బుక్ కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ భారీ టికెట్ ధరలు చూస్తే ఓపెన్ హైమర్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. గతవారంలో టామ్ క్రూజ్ మూవీ మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ఇండియాలో మొదటి రోజు రూ.12.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా సిలియన్ మర్ఫీ నటించిన ఓపెన్‌హైమర్ ఆ చిత్రాన్ని అధిగమిస్తోందేమో వేచి చూడాల్సిందే. అసలేంటీ ఓపెన్‌హైమర్? ఒపెన్‌హైమర్ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన మొదటి అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త. కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన రాబర్ట్ జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్ ఆధారంగా రూపొందించారు. కాగా.. ఇప్పటికే హాలీవుడ్ సమ్మె ప్రభావం ఈ చిత్రంపై ఉండదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!) -
సినీ కార్మికుల సమ్మె.. రిలీజ్‌కు సిద్ధమైన భారీ బడ్జెట్ మూవీ!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!) మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించగా.. ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. ప్రభావం ఉండదన్న మేకర్స్ ఇప్పటికే ఏఐ వల్ల వచ్చే ముప్పుపై సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఇప్పటికే హాలీవుడ్లో అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం ఉండదని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. ఆందోళనల నడుమ ఓపెన్ హైమర్ రిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! ) -
వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్!
4 వేల అడుగుల ఎత్తున్న ఒక పర్వతం.. అక్కడ ఫుట్‌పాత్ సైజులో ఉన్న స్టీల్ ర్యాంప్.. దానిపై ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకెళ్తున్నాడు.. అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.. అంతే.. ఒక్కసారిగా పర్వతం మీద నుంచి జంప్ చేసేశాడు.. అందరి గుండెలు దడదడలాడుతున్నాయి.. మృత్యువుకు అతనికి మధ్య ఉన్నది ఒక్క పారాచూట్ మాత్రమే.. దాన్ని సమయానికి తెరవకుంటే.. అతడి శవం ఆనవాలు కూడా దొరకదు.. పారాచూట్ తెరుచుకుంది. అతడు క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టంట్‌గా పేరొందిన ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆ వ్యక్తి.. టామ్ క్రూజ్.. హాలీవుడ్ డాషింగ్ హీరో.. వయసు జస్ట్ 61 ఏళ్లు!!! మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లోని తాజా చిత్రం డెడ్ రెకనింగ్ పార్ట్ 1 కోసం ఈ సాహసాన్ని చేశారు. సినిమాలో కేవలం 60 సెకన్లు ఉండే ఈ సన్నివేశం కోసం రిహార్సల్స్ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయని ఈ చిత్ర స్టంట్ కోఆర్డినేటర్ ఈస్ట్‌వుడ్ చెప్పారు. శిక్షణలో భాగంగా మన హీరో 13 వేల మోటార్ క్రాస్ జంప్స్, 500 స్కైడైవ్స్ చేశారట. ‘200 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్లి.. పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. అదే సమయంలో గాలిలో కరెక్టు టైంకి బైక్‌ను వదిలేయాలి.. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్‌ను తెరవాలి. సరిగా బాలెన్స్ చేసుకుంటూ నేలపై దిగాలి. ఇందులో ఏ ఒక్క విషయంలో చిన్నపాటి తేడా జరిగినా ఇక అంతే.. టామ్‌కు చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’ అని ఈస్ట్‌వుడ్ తెలిపారు. మీకో విషయంలో తెలుసా..? ఒక బైక్ మీద వేగంగా వెళ్లి.. పర్వతంపై నుంచి దూకి.. వెంటనే పారాచూట్ తెరిచి.. ల్యాండ్ అవ్వాలన్నది టామ్ క్రూజ్ చిన్నప్పటి కల అట. చిన్నప్పుడు ఇంట్లో ర్యాంప్లాంటిది ఏర్పాటు చేసుకుని.. సైకిల్ మీద ఇలా జంప్ చేసిన ఘటనలు ఎన్నోనట. అలాగే దెబ్బలు తిన్న ఘటనలు కూడా.. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ స్టంట్తో ఇన్నాళ్లకు ఆయన కల తీరిందన్నమాట. ఈ వీడియోను నెట్లో చూసినోళ్లంతా సూపర్ అనేస్తున్నారు. ఏంటీ సింపుల్‌గా సూపరా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారీస్థాయిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు రూపమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ భారత ప్రధానితో కొద్దిసేపు మాటామంతీ జరిపిన తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను ఓ మీడియా ప్రతినిధి కార్యక్రమం గురించి స్పందించమని కోరగా.. "ఇదొక ప్రేమ పూర్వకమైన సందేశమని.. ఆయన అసలైన సంస్కృతికి పుట్టినిల్లయిన భారత్ నుండి వచ్చారు. ఆయన భారతీయ సాంప్రదాయానికి ప్రతిబింబం. ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందని అన్నారు. #WATCH | It is a lovely message. He (PM Modi) is a product of Indian culture and comes from a vast place like Indian culture does. This message of universal brotherhood and sisterhood is the one we want to hear again and again, says Richard Gere after Yoga Day event in New York pic.twitter.com/9fKXLpCYyh — ANI (@ANI) June 21, 2023 భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ తో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ "వసుదైక కుటుంబం" పేరుకు తగ్గట్టుగానే ప్రపంచ ప్రతినిధులంతా ఒకేచోట చేరి కుటుంబ వేడుకను తలపించారు. ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం.. -
కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు!
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్‌లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. (ఇది చదవండి: స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి) మైక్ బటాయే కెరీర్ మైక్ బటాయే సూపర్‌హిట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్లో మూడు ఎపిసోడ్లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్‌హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. (ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!) -
అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డానీ మాస్టర్సన్ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీనిపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించగా.. 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా 2003 ఏడాది చివర్లో ఓ యువతిని హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది. ఇకపోతే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్ 2017లో ద రాంచ్ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది చదవండి: ఆలియా భట్ ఇంట విషాదం.. నువ్వే నా హీరో అంటూ పోస్ట్ -
83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న హీరో
హాలీవుడ్ సీనియర్ హీరో, ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. 29 ఏళ్ల యువతి, నిర్మాత నూర్ అల్పల్లాతో ఈ సీనియర్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) కోవిడ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ తర్వాత పాసినో.. అల్పల్లాతో డేటింగ్ ప్రారంభించాడు. అల్పల్లా కూడా అంతకు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేసింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పాసినోతో సహజీవనం కొనసాగించింది. అల్పల్లాకు ఇది మొదటి సంతానం కాగా, పాసినోకు నాలుగో సంతానం. అంతకు ముందు నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు. -
మూడోసారి సహజీవనం, 83 ఏళ్ల వయసులో నాలుగోసారి..
హాలీవుడ్ స్టార్, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న హీరో రాబర్ట్ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన విషయం తెలిసిందే కదా! తాజాగా ఇదే వయసులో ఉన్న మరో హాలీవుడ్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడ్ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్ పచినో 29 ఏళ్ల వయసున్న నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇకపోతే అల్ పచినో ఏప్రిల్‌లో 83వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. మూడు రిలేషన్స్- ముగ్గురు పిల్లలు పెళ్లి అంటే ముఖం చాటేసే అల్ పచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడిపాడు. మొదటగా యాక్టింగ్ కోచ్ జన్ తరంత్తో డేటింగ్ చేయగా వీరికి 1989లో జూలీ పుట్టింది. ఆ తర్వాత నటి బెవర్లీ డియాంగిలోతో సహజీవనం చేయగా వీరికి ఆంటన్, ఒలీవియా కవలలు జన్మించారు. అయితే వీరి రిలేషన్ కూడా ఎంతో కాలం సాగలేదు. 1997-2003 మధ్యకాలంలోనే కలిసి ఉన్నారు, తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం అల్.. నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటికే ఆమె మిక్ జాగర్, నికోలక్ బెరగ్రూన్లతో ప్రేమలో పడటం, బ్రేకప్ చెప్పడం కూడా అయిపోయింది. అంటే ఇద్దరికీ ఇది మూడో డేటింగే! ఎప్పుడూ ప్రేమ, సహజీవనం వరకే వచ్చి ఆగిపోయిన అల్ పచినో పెళ్లికి మాత్రం మొగ్గచూపలేదు. మరి ఈసారైనా తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి! సినిమాల విషయానికి వస్తే.. అల్ పచినో ప్రస్తుతం 'డేవిడ్ మామెట్స్ అసాసినేషన్' సినిమా చేస్తున్నాడు. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షియా లేబఫ్, రెబెకా పిడ్జియాన్, కోర్ట్నీ లవ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. చదవండి: కోపంతో నయనతారను రావద్దని చెప్పా: పార్థిబన్ -
'ఆర్ఆర్ఆర్' నటుడు స్టీవెన్ సన్ మృతికి కారణమిదే!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ విలన్‌గా(స్కాట్ దొర) నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ 58 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వాళ్లకు సుపరిచతమైన ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. స్టీవెన్ సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్ఆర్ఆర్ టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్ చేస్తుండగానే ఆయన మిస్టరీ ఇల్నెస్కు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన మరణించారు అంటూ సదరు వార్తాసంస్థ తెలిపింది. కాగా థోర్ సిరీస్‌తో పాపులర్ అయిన ఆయన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్,ది ట్రాన్స్పోర్టర్ వంటి పలు సినిమాల్లో నటించారు. చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.స్టీవెన్ సన్ 1997లో బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకోగా 8ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. -
12 రకాల సర్జరీలు.. లక్షల డాలర్లు ఖర్చు..తీరా చూస్తే ప్రాణం పోయింది!
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కెనడాకు చెందిన నటుడు సెయింట్ వాన్ కోలుచి(22) కన్నుమూశారు. అయితే ముఖానికి సర్జరీ చేయించుకోవడం వల్లే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఉదయం దక్షిణ కొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సెయింట్ వాన్ కొలూచి 12 ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో దవడకు అమర్చిన ఇంప్లాంట్లను తొలగించుకోవడానికి ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అది ఇన్ఫెక్షన్కు దారి తీయడంతో కొద్ది గంటలకే మృతి చెందాడు. వాన్ కొలూచి సినీ ఇండస్ట్రీలో రావడానికి 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు అతని సన్నిహితులు తెలిపారు. అతను దక్షిణ కొరియా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. మార్వెల్ స్టార్ నటుడు అరెస్ట్
మార్వెల్ స్టార్, హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలిపై దాడి చేసిన కేసులో న్యూయార్క్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బ్రూక్లిన్‌లోని బార్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా టాక్సీలో ఇద్దరి మధ్య గొడవ జరిగనట్లు జోనాథన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది. తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ప్రియురాలి తల, మెడకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. జోనాథన్ తన మొబైల్ ద్వారా మరొక మహిళకు మేసేజ్ పంపడం ప్రియురాలు చూసింది. దీంతో అతని ఫోన్‌ను పరిశీలించాలని ఆమె అడిగింది. దీనికి అతని కోపం కట్టలు తెచ్చుకుంది. ఆమెను చేయి పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. వెంటనే అతని ప్రియురాలు పోలీసులను కాల్ చేసింది. జోనాథన్ మేజర్స్ చివరిగా క్రీడ్-3, యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియాలో కనిపించారు. అతను రెండు వారాల ముందు ఆస్కార్స్‌లో తన క్రీడ్-3 సహనటుడు మైఖేల్ బి. జోర్డాన్‌తో పాటు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. కానీ జోనాథన్ ప్రతినిధి మాట్లాడుతూ అతను ఏ తప్పు చేయలేదని అన్నారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ‘హ్యారీపోటర్’ నటుడు హఠాన్మరణం
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘హ్యారీపోటర్’ ఫేం పాల్ గ్రాంట్(56) కన్నుమూశారు. బ్రిటిష్ నటుడైన పాల్ గ్రాంట్ లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ స్టేషన్లో ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చెర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు స్థానికి మీడియా పేర్కొంది. దీంతో ఆయన మృతిపై పలువురు హాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? కాగా పాల్ గ్రాంట్ 1980ల టైంలో విల్లో, లైబరన్త్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో హ్యారీపోటర్, స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. ఈ పరిస్థితుల్లోనూ డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోయిమంది. ఈ క్రమంలో 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. NEW: Paul Grant, who played an Ewok in Star Wars: Return of the Jedi and a goblin in Harry Potter and the Philosopher's Stone, died after collapsing outside a London train station. He was 56 years old. #diedsuddenly pic.twitter.com/NmjTkyhGrl — DiedSuddenly (@DiedSuddenly_) March 20, 2023 -
ఆర్ఆర్ఆర్ ఎక్కవ సార్లు చూశా.. హాలీవుడ్ నటుడు ప్రశంసలు
హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చాలా సార్లు చూశానని తెలిపారు. చూడటంతో తన అనుభవాన్ని తెలిపారు. ఈ వారంలో జోనాథన్ నటించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇవాళ భారత్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్ను ఆయన కొనియాడారు. జోనాథన్ మేజర్స్ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జోనాథన్.. తాను భారతీయ సినిమాలకు అభిమానినని.. అలాగే బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశానని వెల్లడించారు. జోనాథన్ జేమ్స్ మాట్లాడుతూ.. 'నేను భారతీయ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఎస్ఎస్ రాజమౌళి చిత్రం కాంగ్ ది కాంకరర్ దృష్టిని 'జయించిందని' చెప్పడం విశేషం. నేను ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశాను. ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించా. ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై చూడటం నాకు చాలా నచ్చింది.' అని అన్నారు. భారతీయ చిత్రాలను చూడటానికి నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. జోనాథన్ మేజర్స్ ప్రకటనతో ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ, అంతర్జాతీయ ప్రేక్షకులపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా.. మార్వెల్ స్టూడియోస్ ఇండియా నిర్మించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా సినిమా ఫిబ్రవరి 17 ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. -
ఇంట్లో విగతజీవిలా మారిన యంగ్ హీరో
హాలీవుడ్ యంగ్ హీరో కాడి లాంగో (34) మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్ నగరం ఆస్టిన్లోని ఆయన ఇంట్లో శవమై కనిపించారు. ఈ విషయాన్ని మేనేజర్ అలెక్స్ గిట్టెల్సన్ తన ట్విట్టర్లో వెల్లడించారు. లాంగో కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేశారు. అలెక్స్ గిట్టెల్సన్ ట్వీట్ చేస్తూ.. 'నా ప్రియమైన స్నేహితుడు, నా క్లయింట్ కాడి లాంగో ఇక లేరన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మిస్ యూ బ్రదర్.' అంటూ ట్వీట్ చేశారు. అయితే లాంగో చాలా సంవత్సరాలుగా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. 2022లో రిహాలిబిటేషన్ కేంద్రానికి కూడా వెళ్లివచ్చినట్లు సమాచారం. తన భర్త పిల్లల కోసం చాలా కష్టపడేవారని దివంగత నటుడి భార్య స్టెఫానీ లాంగో తెలిపింది. లాంగోకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్, వైల్డ్‌ఫ్లవర్, నాట్ టుడే, హాలీవుడ్ హైట్స్‌లో లాంగో తన పాత్రలకు బాగా పేరు సంపాదించారు. Devastated beyond words at the tragic loss of my dear friend and client, Cody Longo. My heart breaks for his beautiful family. You will be missed, brother. https://t.co/D0lKsUnBmK — Alex Gittelson (@alexgittelson) February 10, 2023