Home Guards
-
కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ ఎం.రవిప్రకాశ్ హైకోర్టుకు నివేదించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారంటూ పలువురు హోంగార్డులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కులు ఉండవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లందరికీ స్పష్టంగా తెలుసని, వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్‌ను తప్పుపడుతున్నారని తెలిపారు.నోటిఫికేషన్‌లోని పేరా–7లో పేర్కొన్న స్పెషల్ కేటగిరీలు హారిజాంటల్ రిజర్వేషన్ (హోంగార్డులు, ఎన్సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసుల పిల్లలు తదితరాలు) కిందకు వస్తాయన్నారు. ఈ హారిజాంటల్‡ రిజర్వేషన్ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని తెలిపారు.అలా చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయిరూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమవుతుందని రవిప్రకాశ్ వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారని పేర్కొన్నారు.అయితే, తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. -
మా వేతనాల్లో కోత వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
హోంగార్డులపై ‘కారుణ్య’మేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి విధుల్లో అత్యంత కీలకమైన హోంగార్డులు.. అరకొర జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నెలలో ఒక్కో తేదీన వేతనాలు వస్తున్నాయని.. ఒక్కోసారి సగం నెల గడిచినా జీతాలు అందని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. తమకు కనీస జీవన భద్రత లేదని, హోంగార్డు చనిపోతే కారుణ్య నియామకంగానీ, మరేదైనా తీరులోగాని వారి కుటుంబాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన బాట పట్టాలనే యోచనతో ఉన్నామని అంటున్నారు. సీఎం హామీలు అమలు చేయాలంటూ..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని హోంగార్డులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డుల వేతన సవరణతోపాటు సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారని చెప్తున్నారు. ఇక తాజాగా శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి.. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలు అందులో చదువుతారని పలుమార్లు పేర్కొన్నారు. అయితే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ జీవోలో మాత్రం హోంగార్డుల ప్రస్తావన లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి విధుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే తమకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు ఆశతో ఎదురుచూశామని, కానీ అలాంటి హామీ ఏదీ రాలేదని వాపోతున్నారు. యూనిఫాం అలవెన్స్, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ సహా పలు కీలక హామీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచీ పెండింగ్‌లో ఉన్నాయని... కాంగ్రెస్ ప్రభు త్వంలోనైనా అవి పరిష్కారం అవుతాయన్న ఆశతో ఉన్నామని చెప్తున్నారు. కదలని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ ఫైల్.. హోంగార్డులను సైతం లాస్ట్ పేగ్రేడ్ కింద తీసుకుని, వారిని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (ఎస్పీఏ)గా మార్చాలని 2017లో ప్రతిపాదన సిద్ధం చేశారు. రిక్రూట్మెంట్లో లోటుపాట్లను సరిదిద్ది, వారిని పర్మినెంట్ చేసి దీన్ని అమలు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పలు కారణాలతో ఇది పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13వేల మంది జనరల్ డ్యూటీ హోంగార్డులు, మరో 2,500 మంది వరకు ఓడీ (అదర్ డిపార్ట్మెంట్) హోంగార్డులు పనిచేస్తున్నారు. -
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మాజీ హోం గార్డులు..
-
సారూ.. ఉద్యోగం ఇప్పించండి
గోదావరిఖని: సమస్యలు పరిష్కరించాలని గొంతెత్తినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తనను విధుల నుంచి తొలగించిందని, జీవనోపాధి లేకుండా రోడ్డున పడేసిందని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేసినా, నాయకులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈమేరకు శనివారం సీఎం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వెళ్లారు. అక్కడ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగ భధ్రత కోసం ఆందోళన.. సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో 2016లో హోంగార్డులు ధర్నా చేశారు. గోదావరిఖనికి చెందిన హోంగార్డు మామిడి పద్మ ఆందోళనల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. పర్యవసనంగా ఆమె తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమెకు తన ముగ్గురు పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది. భర్త వదిలేయడంతో ఏ పనిచేసుకోవాలో తెలియక, తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని సీపీ, డీజీపీ, హోంమంత్రిని వేడుకున్నారు. హోంగార్డు పద్మ 2009లో వేములవాడలో తొలిపోస్టింగ్, రెండేళ్లు పనిచేసిన తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్ఫర్ అయ్యారు. జీతాలు పెంచి ప్రతినెలా చెల్లించాలనే డిమాండ్‌తో ఏడేళ్ల క్రితం వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రి వద్ద హోంగార్డులు ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్నందుకు పద్మ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈమెపై అనేక కేసులు బనాయించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈరోజు తన గోడును కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సమస్య పరిష్కరించి ఉద్యోగం ఇప్పించాలని ఆమె వేడుకున్నారు. -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్‌గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్‌కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్‌గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్‌తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్‌గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
హోంగార్డులను స్టేషన్లోనే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. హోంగార్డులంతా డ్యూటీలోనే ఉండాలని, డ్యూటీ అయిపోయిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయ్యింది. రవీందర్ మృతికి నిరసనగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయినట్టు తెలిసింది. ఆదేశాలు మీరితే విధుల నుంచి బహిష్కరణకు గురవుతారని ఓ దశలో బెదిరింపు ధోరణిలో హెచ్చరించినట్టు తెలిసింది. ’రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు’ ‘విధుల్లో ఉండే హోంగార్డులు, డ్రైవర్లు, ఆఫీసర్ల దగ్గర పనిచేసే వాళ్లయినా, డే డ్యూటీ చేసేవాళ్లు, ఇంకే డ్యూటీలో ఉండేవాళ్లయినా సరే ప్రతి ఒక్కరూ ఈ రోజు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. స్టేషన్ వదిలి బయటికి వెళ్లకూడదు. డ్యూటీ అయిపోయిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచండి..రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు. ఎవరెవరైతే ఆబ్సెంట్‌లో ఉన్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టండి. పది నిమిషాల తర్వాత మళ్లీ నాకు చెప్పండి. ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్లను మిస్కండక్ట్ కింద తీసుకోబడుతుంది. వాళ్ల ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్. అందరికీ పేరు పేరున ఫోన్ చేసి తెలపండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ...’అని ఓ పోలీస్ అధికారి సెట్లో ఆదేశాలిస్తున్న ఆడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లపై బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నా...హోంగార్డులు అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుట్రతోనే డీఎంకే వ్యాఖ్యలు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాజకీయకుట్రలో భాగంగా, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి, మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార డీఎంకే గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ నేత తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాలిన్‌తో పాటు కేంద్రమాజీమంత్రి ఎం.రాజాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...తాను యజ్ఞయాగాలకు కేరాఫ్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డులకు అధికారుల వార్నింగ్
-
హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించండి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించి.. ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరిగా పరిగణించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డులు చింతా గోపీ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.శీనాకుమార్ వాదనలు వినిపిస్తూ.. సాధారణ అభ్యర్థులకు నిర్ధేశించినట్లు హోంగార్డులకు కూడా కటాఫ్ మార్కులు నిర్ణయించడం తగదని.. ఇది గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. మొత్తం పోస్టుల్లో హోంగార్డులకు ప్రత్యేకంగా 15 శాతం కోటా ఉందని చెప్పారు. 2016 నాటి జీవో 97 ప్రకారం స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రత్యేక కేటగిరికి వర్తించని తెలిపారు. సాధారణ అభ్యర్థుల్లాగా ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో పిటిషనర్లు దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందని శీనాకుమార్ వివరించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ఆదేశించారు. కటాఫ్‌తో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేశారు. కౌంటర్లు దాఖలుకు గడువిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
నకిలీ హోంగార్డుల కుంభకోణం: అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసు శాఖను కుదిపేస్తున్న నకిలీ హోంగార్డుల కుంభకోణంలో వన్‌టౌన్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఆర్. మణిగండన్, టి.యువరాజ్, బీఆర్ కిరణ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు హోంగార్డులు, ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిని మీడియా ఎదుట హాజరుపరిచే అవకాశముంది. 87 మంది నిరుద్యోగులను దొడ్డిదారిన పోలీసు శాఖలోకి చొప్పించిన బాగోతం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి కుట్రలో భాగమైన జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ పొందేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక నకిలీ హోంగార్డుల వ్యవహారంలో అవకతవకలను గుర్తించిన చిత్తూరు ఏఆర్ ఆర్ఐ మురళీధర్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ నరసింహరాజు ఐపీసీ 420, 419, 409, 468, 471 రెడ్‌విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆ 87 మందికీ తొలగింపు ఉత్తర్వులు మరోవైపు.. పోస్టులు పొందిన 87 మందినీ డీఐజీ ఆదివారం విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు వీళ్లను తొలగించకపోతే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంగార్డు కోటా చూపించి వీరంతా ఉద్యోగాల్లో చేరిపోయే ప్రమాదాన్ని పసిగట్టి ఈ నిర్ణయం హుటాహుటిన తీసుకున్నారు. ఈ 87 మందిలో 28 మంది టీటీడీలో, చిత్తూరు, తిరుపతి అగ్నిమాపక శాఖలో 22 మంది, కాణిపాకం ఆలయంలో 15 మంది, చిత్తూరు, తిరుపతి రవాణాశాఖలో 10 మంది, లా అండ్ ఆర్డర్లో ఐదుగురు, చిత్తూరు జిల్లా జైల్లో ముగ్గురు, తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్, చిత్తూరు స్త్రీ–శిశు సంక్షేమశాఖలో ఒకొక్కరు, ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఒకరితోపాటు సర్వీసు నుంచి తొలగించిన మరొకరు ఉన్నారు. మరోవైపు ఈ కుట్రపై చిత్తూరు ఎస్పీ వై. రిషాంత్‌రెడ్డి స్పందిస్తూ లోతుగా దర్యాప్తు జరుగుతుందని, బాధ్యులందరిపైనా చర్యలుంటాయని స్పష్టంచేశారు. -
AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
సాక్షి, అమరావతి: హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ – ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. హోంగార్డులకు ముఖ్యమంత్రి వరం హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపునకు నోచుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డుల జీతాలు పెంచింది. అప్పటివరకు నెలకు రూ.18 వేలు మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వారికి మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారనుంది. చదవండి: ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. -
హోంగార్డుల వేతన వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలలో పదిహేను రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు అందకపోవడం ఆ కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలోకి లోనవుతున్నాయి. రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూళ్లు ప్రారంభంకావడంతో పుస్తకాలు, యూనిఫామ్‌ల ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని యూనిట్లు, జిల్లాల్లో హోంగార్డులదీ ఇదే పరిస్థితి. ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. రాష్ట్రవ్యాప్తంగా 16460 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి కొద్ది రోజుల క్రితమే వేతనాలు పెంచింది. ప్రతి నెలా రూ.26వేల చొప్పున చెల్లిస్తోంది. అయితే హైదరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న వారికి ఈ నెల 4నే వేతనాలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో ఇప్పటివరకు వేతనాలు అందలేదు. నెలలో 15వ తేదీ సమీపించినా జీతాలు రాకపోవడంతో అప్పులు చేస్తున్నట్టు హోంగార్డులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి వేతనాలు అందాయని, తమకు ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా రూ.10వేల కోత... ఎలాంటి కారణం చెప్పకుండానే ఏప్రిల్ నెల వేతనంలో రూ.10వేల కోత విధించినట్టు తెలిసింది. కరోనా సమయంలో కూడా వేతనాలు చెల్లించిన పోలీస్ శాఖ ఇప్పుడు ఏ కారణంతో రూ.10వేల కోత విధించిందో తెలియడం లేదని, మే నెల జీతమైనా సమయానికి వస్తుందిలే అనుకుంటే అదీ ఇంకా అందలేదని వారు వాపోతున్నారు. ఈ నెలలో కూడా కోత పెడితే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అంటున్నారు. అసోసియేషన్లు ఎక్కడున్నాయి... తమ సంక్షేమం కోసం ఏర్పడిన అసోసియేషన్లు ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని హోంగార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ఇప్పుడు రెండు మూడు సంఘాలుగా విడిపోవడంతో అసలు అసోసియేషన్లు ఉన్నాయా, లేవా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
మెరుగుపడింది జీతాలే... జీవితాలు కాదా!?
పోలీసు శాఖనుండి మొదలుకొని గిడ్డంగుల్లో, జెన్కో, ఫైర్, ఆర్టీవో, ట్రాఫిక్, జైళ్ళు ఇలా ప్రతీశాఖలో విస్తరించి పనిచేస్తున్న ఏకైక సంస్థ హోంగార్డ్స్. 1946 డిసెంబర్ ఆరున బొంబాయి ప్రావెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ శాఖల్లో అదనపు సహయార్థం స్వచ్చంద సంస్థగా దీన్ని స్థాపించారు. తర్వాత 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో వీరిని పునర్వ్యవస్థీకరించారు. ఈ పరంపరలోనే వీరి సేవలు గమనించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాలం టరీ ప్రక్రియ కింద నియామకాలు చేపట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి జీతాల్లో మార్పులు వచ్చాయి గానీ జీవితాలు మరింత చీకట్లోకి నెట్టివేయబడ్డాయనే చెప్పుకొని తీరాలి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ హోంగార్డుల జీతం రూ. 600 నుండి 710 రూపాయలకు పెంచగా తెలంగాణలో నెలకు 12 వేల నుండి 20 వేల రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతీ ఏడాదీ రూ. 1,000 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదెంతో ఆహ్వానించదగిన విషయం. కానీ, ఈ నిర్ణయంతోపాటు అంతకుముందున్న కారుణ్య నియామకాలను తొలగించడం పిడుగులాంటి వార్తనే. ఉద్యోగి సర్వీస్ కాలంలో మరణిస్తే, వైద్య కారణాలవలన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉద్యోగికి ఏర్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియమకాలను అమలు పరిచే అవకాశాన్ని హోంగార్డులకు తొలగించారు. దీనితో తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 17,490 మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అయితే ఈ కారుణ్య నియామకాలను ఆంధ్రప్రదేశ్‌లో హోం గార్డ్స్‌కు అమలు పర్చడమనేది హర్షించదగిన విషయం. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి 2019 తర్వాత హోంగార్డ్స్ జీతాలు పెంపుదల సందర్భంలో డబుల్ బెడ్రూం ఇంటి కలను సాకారం చేస్తానని చెప్పిన వాగ్దానం నేటికీ అలాగే ఉండిపోయింది. పోలీసులకు వర్తించే ఎటువంటి అలవెన్స్ వీరికి వర్తించవు. అనారోగ్యంతో బాధపడే క్షణాల్లో కూడ ఆరోగ్య భద్రత స్కీం వీరికి వర్తించకపోవడం, విధినిర్వహణలో చనిపోయినపుడు పోలీసులకు వర్తించే ఎక్స్‌గ్రేషియా హోంగార్డ్స్కు లేకపోవడం, పోలీసు శాఖలో కానిస్టేబుల్ వంటి ఉద్యోగులతో పోటీపడి విధినిర్వహణ చేస్తున్నప్పటికీ వీరికి అదనపు అలవెన్స్ లేకపోవడం, పైగా ఏధైనా పండుగ పబ్బానికి సెలవులు పెట్టుకునే సీఎల్(క్యాజువల్ లివ్) వెసులుబాటు లేకపోవడం, రోగమొస్తే మెడికల్ లీవ్ అవకాశం లేకపోవడం, హోంగార్డ్స్ ఏరోజు పనిచేస్తే ఆరోజుకే కూలీ చెల్లించే ధోరణిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుశాఖ అంటేనే డిసిప్లిన్ పేరుమీదుగా దర్జాగా సాగే వెట్టిచాకిరికి ప్రతిరూపంగా ఉంటుంది. హోంగార్డ్స్ ఉద్యోగ భద్రత లేని బానిసల్లాగే కుక్కిన పేనులాగా అధికారుల చేతిలో హింసపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఉన్నతాధికారుల ఆఫీసుల్లో, క్యాంపు కార్యాలయాల్లో, చివరికి వీరి ఇళ్ళలో పాకీ పనులకు, చివరకు సొంతపనులకు కూడ హోంగార్డులను వినియోగించే అధికారులు ఉండటం విచారకరం. ఇకపోతే మహిళ హోంగార్డ్స్ పరిస్థితి మరింత దారుణం. మహిళా హోంగార్డుల పట్ల మాతృత్వ విషయంలో కూడ వివక్ష చూపుతున్నారు. ప్రసూతి సెలవులు మహిళా పోలీసులకు జీతంతో కూడిన ఆరుమాసాల సెలవులైతే మహిళా హోంగార్డులకు మాత్రం మూడునెలల బాలింతగానే విధులకు హజరు కావాల్సిన దుస్థితి ఉన్నది. పైగా డెలివరీ సమయంలో ఎటువంటి భృతీ లభించే పరిస్థితి కూడ లేదు. ఇదికాక లైంగిక వేధింపులు షరామాములుగానే ఉంటాయనేది కాదనలేని విషయం!? ఇటీవల ఎస్ఐ స్థాయి మహిళా అధికారి ఉదంతమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక హోంగార్డులకు మెరుగుపడింది జీతాలే తప్ప జీవితాలు కావనేది చాలా స్పష్టంగా కన్పిస్తున్న యధార్థం. ముఖ్యంగా కారుణ్య నియమకాల విషయంలో కాఠిన్యంతో కాకుండా కరుణతో, మానవీయ కోణంలో తెలంగాణ ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. అలాగే హోంగార్డుల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు మల్లే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై మన ప్రభుత్వాలు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. వరకుమార్ గుండెపంగు వ్యాసకర్త కథా రచయిత ‘ మొబైల్ : 99485 41711 -
హోంగార్డులవి సివిల్ పోస్టులే
సాక్షి, అమరావతి: హోంగార్డుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హోంగార్డులు నిర్వర్తించే విధులు ‘సివిల్ పోస్టు’ కిందకే వస్తాయని, అందువల్ల వారిని ఎలా పడితే అలా సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని అధికరణ 311(2) ప్రకారం తగిన విచారణ జరపకుండా హోంగార్డులను శిక్షించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేగాక హోంగార్డుల చేరిక, వారు అందించే సేవలు స్వచ్ఛందం(వాలంటరీ) అంటూ ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఎవరు పడితే వారు హోంగార్డుగా చేరడానికి కుదరదని, ప్రభుత్వం కొన్ని అర్హతలను, ప్రమాణాలను నిర్దేశించి, అర్హులను మాత్రమే హోంగార్డులుగా ఎంపిక చేస్తుందని, అందువల్ల వారి సేవలను స్వచ్ఛందమని చెప్పజాలమని తెలిపింది. అలాగే హోంగార్డులకు ఏపీ పోలీస్ మాన్యువల్ చాప్టర్ 52 వర్తించదని స్పష్టం చేసింది. ఏపీ హోంగార్డుల చట్ట నిబంధనలే వర్తిస్తాయంది. పలు కేసుల్లో నిందితులుగా ఉండి నిర్దోషులుగా బయటకు వచ్చిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇది వారి జీవించే హక్కును హరించడమే అవుతుందని స్పష్టం చేసింది. హోంగార్డులను సర్వీసు నుంచి తొలగించే అధికారం కమాండెంట్‌కే ఉంటుంది తప్ప, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఉండదని తెలిపింది. వివిధ కారణాలతో పలువురు హోంగార్డులను సర్వీసు నుంచి తొలగిస్తూ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు జారీ చేసిన వేర్వేరు ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. హోంగార్డుల చట్టం, దాని నిబంధనలను అనుసరించి తగిన ఉత్తర్వులు జారీ చేసే స్వేచ్ఛను ఆయా కమాండెంట్లకు ఇచ్చింది. హోంగార్డులుగా తొలగించిన పిటిషనర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పలు ఆరోపణలతో తమను సర్వీసు నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు సవాలు చేస్తూ పలువురు హోంగార్డులు 2019, 20, 21 సంవత్సరాల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇటీవల ఉమ్మడి తీర్పు వెలువరించారు. ‘‘మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత మద్రాసు హోంగార్డుల చట్టాన్ని మనం అన్వయింప చేసుకున్నాం. అందువల్ల హోంగార్డుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు తదితరాలన్నీ కూడా 1948లో తీసుకొచ్చిన ఏపీ హోంగార్డుల చట్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలేవీ హోంగార్డులకు వర్తించవని చెబుతోంది. ఏపీ పోలీస్ మాన్యువల్‌లోని చాప్టర్ 52 ప్రకారం హోంగార్డులు నడుచుకోవాల్సి ఉంటుందని వాదిస్తోంది. వాస్తవానికి హోంగార్డులు పోలీసుల నియంత్రణలో పనిచేస్తున్నప్పటికీ, వాళ్లు పోలీసు విభాగంలో భాగం కాదు. హోంగార్డులది ప్రత్యేక వ్యవస్థ. వారి ఎంపికకు ప్రత్యేక అర్హతలు, నిబంధనలున్నాయి. ఏపీ హోంగార్డుల చట్టాన్ని అనుసరించి పోలీసు మాన్యువల్ నిబంధనలను రూపొందించలేదు. అందువల్ల హోంగార్డులకు పోలీసు మాన్యువల్ వర్తించదు’ అని తన తీర్పులో పేర్కొన్నారు. -
హోంగార్డులు నిస్వార్థ సేవకులు
సాక్షి, అమరావతి: హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా దృక్పథంతో హోం గార్డులు నిర్వహించిన విధులు, వారు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. హోంగార్డుల సంక్షేమం, వారి పిల్లల విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోజువారీ భత్యం రూ.710కి పెంచామన్నారు. 15 వేల హోం గార్డు కుటుంబాలను యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేశామన్నారు. ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.30 లక్షలకు ఇన్సూరెన్స్ చేశామని, భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచుతామని చెప్పారు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది రూ.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. మహిళా హోం గార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నామన్నారు. హోం గార్డుల ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. హోంగార్డులు అంకితభావంతో, మంచి సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని డీజీపీ ఆకాంక్షించారు. హోంగార్డుల కుటుంబాల్లో జగన్ వెలుగులు నింపారు హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.గోవిందు వేతనాలు పెంచి హోంగార్డుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారని హోం గార్డ్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవిందు పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతో పాటు సంఘం నాయకులు డి.బాబురావు, బి.చిరంజీవి, కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాసులు హోం మంత్రి సుచరితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హోం గార్డుల సమస్యలపై వినతి పత్రాన్ని హోం మంత్రికి అందజేశారు. హోంగార్డులకు రోజుకి రూ.600 నుండి రూ.710కి వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
వారికి ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహం
సాక్షి, విజయవాడ : హోంగార్డుల సామాజిక, ఆర్ధిక స్థితి అనేక రెట్లు పెంచడంతో పాటు ఎన్నడూ లేని విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. వేతనాల పెంపు, ప్రమాద భీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. రాష్ట్రానికి హోంగార్డులు అద్భుతమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. ఆదివారం 58వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు రూ.18 వేల నుంచి రూ. 21,300 పొందుతున్నారు. 15000 హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి ఏదైనా ఆకస్మిక మరణం సంభవిస్తే, హోంగార్డు కుటుంబానికి 60 లక్షల భీమా చెల్లించబడుతుంది. వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీని ఈ ఏడాది 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు మంది హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి. మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాము. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క హోంగార్డుకు ఈహెచ్ఎస్/ఆరోగ్యశ్రీ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “అందరికీ హౌసింగ్” పథకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. -
హోం గార్డ్స్.. ఫుల్ జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే హోంగార్డులకు వేతనాల పెంపు, బీమా వర్తింపు వంటి కీలక వరాలను అమల్లోకి తేవడంతో వారిలో జోష్ పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12 వేల మంది హోంగార్డులు ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం వారి నియామకాలు మరింత పెరిగి మన రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 16,650 మంది ఉన్నారు. పోలీస్ శాఖతోపాటు అగ్నిమాపక శాఖ, జైళ్లు, ఆలయాలు, ఎఫ్‌సీఐ, దూరదర్శన్, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తదితర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోను హోంగార్డులు సేవలందిస్తున్నారు. వేతనాల పెంపు కోసం వారు ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వచ్చారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలు జిల్లాల్లో కలిసిన హోంగార్డ్స్ ప్రతినిధులు వేతనాల పెంపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను అధికారం చేపట్టిన వెంటనే వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి వేతనం రూ.21,300కు పెరిగింది. ఏదైనా ప్రమాదంలో హోంగార్డు మరణిస్తే రూ.30 లక్షలు బీమా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తీవ్రవాదులు, మావోయిస్టుల దాడుల్లో మృతి చెందితే రూ.40 లక్షలు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకుంది. 1962 డిసెంబర్ 6 నుండి రాష్ట్రాల పరిధిలోకి.. దేశ వ్యాప్తంగా 1947 నుంచి హోంగార్డ్స్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 1962 డిసెంబర్ 6న హోంగార్డ్స్ వ్యవస్థను రాష్ట్రాల పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి డిసెంబర్ 6వ తేదీన హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి మా వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ప్రస్తుతం ఇస్తున్న నెలకు రెండు సెలవులను ఏడాది మొత్తానికి కలిపి 24 సెలవులను ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించాలి. కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తాం. పోలీస్ రిక్రూట్మెంట్లో హోంగార్డుల రిజర్వేషన్ పెంచాలని కోరతాం. – ఎస్.గోవిందు, అధ్యక్షుడు, ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం హోంమంత్రిని కలుస్తాం వేతనాల పెంపు, బీమా వర్తింపు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో హోంగార్డుల వెతలు తీరుతాయనే నమ్మకం ఉంది. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా హోంమంత్రి మేకతోటి సుచరితను ఆదివారం కలిసి విజ్ఞప్తి చేస్తాం. – దస్తగిరి బాబు,ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం -
వేతనాల్లో శాతాల వారీ కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పూర్తి వేతనాన్ని శాతాల వారీగా వాయిదా వేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నం. 27లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చికి సంబంధించి ఏప్రిల్‌లో రావాల్సిన పూర్తి వేతనంలో కోత విధించనున్నారు. ఈ కోత వాయిదా మాత్రమేనని, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేతన వ్యత్యాసాన్ని వాయిదా రూపంలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు ఈ పాటికే ఈ కుబేర్‌లో సమర్పించి ఉంటే ఈ వ్యత్యాసాన్ని ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా వర్తింపజేయాలని, ఇప్పటివరకు సమర్పించని బిల్లులను జీవోలో పేర్కొన్న వ్యత్యాసాన్ని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంలో 10% వేతనాన్ని వాయిదా వేయాలని, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు/హెల్పర్లు, వీఆర్ఏలు, విద్యావాలంటీర్లు తదితరులకిచ్చే గౌరవ వేతనానికీ ఈ వాయిదా వర్తిస్తుందన్నారు. నాలుగో తరగతి పెన్షనర్లకు 10%, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లో 50%, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పింఛన్లో 60% వాయిదా వేయాలన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన బిల్లులు, చెక్కులను వెనక్కు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యత్యాసాన్ని వర్తింపజేసి వేతనాన్ని వాయిదా వేయాలని, ఆ మేరకు మళ్లీ బిల్లులు, చెక్కులు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
హోంగార్డులకు స్థలయోగం
ఇన్నాళ్లకు వారి వెతలు తీరాయి. వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వారి గురించి పట్టించుకునే పాలకులు లభించారు. అచ్చంగా పోలీసు విధులే నిర్వర్తిస్తున్నా ఎలాంటి సౌకర్యాలకు నోచుకోక... అరకొర వేతనాలే లభిస్తున్నా కష్టాలకు వెరవక... ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని మునిపంటినే దాచుకుని విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వారికీ స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేనా... వాటిపై ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తున్న హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. అందుకోసం ఇటీవల జీఓ 77ను విడుదల చేసింది. దీని ప్రకారం హోంగార్డుల సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. ఇప్పటికే ఈ జీఓ ప్రకారం జిల్లాకేంద్రంలోని విజయనగరం నియోజకవర్గం పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. ఇంకా మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు దీనిపై దృష్టి సారించకపోవటంపై ఆయా మండలాల పరిధిలోగల హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన అవకాశాలు చేతికి అందకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తహసీల్దార్లకు ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం కలక్టర్ హరిజవహర్‌లాల్, గృహ నిర్మాణశాఖాధికారులకు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కొన్ని చోట్ల అసలు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా హోంగార్డులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరితో పాటు పట్టాలు అందజేయనున్నారు. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన స్కీం ద్వారా గృహ నిర్మాణానికి రూ.1.50లక్షలు అందజేయనున్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో హోంగార్డుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలను విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హోంగార్డులకు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ, ఆ తరువాత ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జీఓ నంబర్.77ను విడుదల చేశారు. సీఎంకు రుణపడి ఉంటాం... హోంగార్డుల సమస్యలపై చాలా సార్లు చాలా ముఖ్యమంత్రులకు వినతులు అందజేశాం. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మా సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు, మాకు గూడు కలి్పంచేందుకు ఇప్పుడు జీఓ నెం.77 విడుదల చేశారు. హోంగార్డులందరికీ గృహనిర్మాణంకోసం, ఇళ్ల స్థలాలు అందజేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివి. – పడగల బంగార్రాజు, జిల్లా అధ్యక్షుడు, హోంగార్డులసంక్షేమ సంఘం. విజయనగరం. బీమా పెంచారు. గతంలో కంటే ఇప్పుడు బీమా మొత్తం చాలా ఎక్కువ పెంచారు. హోంగార్డులు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.30లక్షలు బీమా సదుపాయం కల్పించారు. దీనివల్ల కొంత భరోసా లభించింది. హోంగార్డుల విషయంలో ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. – ఎస్.గోపాల్, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యుడు, పార్వతీపురం. జీతాలు పెంచారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హోంగార్డుల జీతాలు పెంచారు. వాటితో పాటు బీమా పెంచారు. ఇప్పుడు నివాసం కోసం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – ఎస్.రవి, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యులు,విజయనగరం. -
హోంగార్డుల అక్రమ వసూళ్ల వ్యవహారం
కర్నూలు, డోన్: పట్టణానికి చెందిన ఇద్దరు హోంగార్డులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో హల్చల్ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లు, లారీ, వ్యాన్ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్టణంలో పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కొందరు సరుకుల అన్లోడ్ చేస్తున్న వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం రివాజుగా మారిందంటున్నారు. వీరి చేష్టల వల్ల పెద్ద వాహనాలు రోడ్లకు అడ్డంగా నిలిపి సిమెంట్, నిత్యావసర వస్తువులు, ఐరన్లను అన్లోడ్ చేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని డ్రైవర్లపై ఆరోపణలున్నాయి. అయితే ఈ వీడియోల హల్‌చల్‌ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంతృప్తికరమైన రీతిలో ప్రభుత్వం వేతనాలు పెంచినా ఇలా లంచాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
హోంగార్డుల సంక్షేమంలో మనమే బెస్ట్
సాక్షి, అమరావతి: హోంగార్డ్‌ల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రభుత్వం హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతోపాటు పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షలకు ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు వివరించారు. హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
ఏపీలో 8మంది అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఏపీ పోలీసుశాఖకు చెందిన ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా టీవీ నాగరాజు, ఏసీబీ ఎస్పీగా జె.భాస్కర్‌రావు, విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీగా కె. బాల వెంకటేశ్వరరావులను నియమించింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె. సూర్యచంద్రరావును పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూన్ 18 నుంచి 2019 జూలై 16వ తేదీ వరకే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు నష్ట పరిహారం విడుదల చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 13 జిల్లాల్లో 63 మంది హోంగార్డు కుటుంబాలకు రూ. 3కోట్ల 15 లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆ రూమర్స్ నమ్మొద్దు: సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో మరోసారి హోంగార్డుల ఎంపిక ప్రక్రియ జరుగనుందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం వదంతులేనని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం స్పష్టం చేశారు. ఇలాంటివి నమ్మవద్దని, మోసగాళ్ల వలలో పడి మోసపోవద్దని కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన శుక్రవారం ట్విటర్లోనూ ట్వీట్ చేశారు. Someone is spreading rumour that Homeguard selection will take place. It is a false news. Please don't get cheated by anyone. There is no selection for Home Guard anywhere in Telangana. Anjani Kumar IPS, Commissioner Hyderabad. — Anjani Kumar, IPS (@CPHydCity) November 22, 2019 -
కొత్త వెలుగులు
సాక్షి, అమరావతి: వీక్లీ ఆఫ్ ఇవ్వడంతో పోలీసుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసినట్టుగానే వేతనాల పెంపుతో హోంగార్డుల జీవితాల్లోనూ కొత్త వెలుగులు ఉదయించాయి. వేతనాల పెంపుతోపాటు అనేక ప్రయోజనాలు కూడా కల్పించడంతో దుర్భర పరిస్థితుల నుంచి ధైర్యంగా విధులు నిర్వర్తించగలుగుతున్నామంటూ హోంగార్డులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో సమానంగా కష్టపడుతూ చాలీచాలని జీతాలతో తాము విధులు నిర్వర్తించామని.. ఇప్పుడు తమ కష్టాలు తీరుతున్నాయని చెబుతున్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం జూన్ 10న నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డులకు వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కి పెంచింది. దీంతో వారి నెల జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరిగింది. పెంచిన వేతనాన్ని అక్టోబర్ 1 నుంచి వర్తింపచేయాలని ఉత్తర్వులిచ్చింది. వేతన పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 16,616 మందికి మేలు కలుగుతుంది. వేతనం పెంపుతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఇప్పటివరకు పోలీసులకు మాత్రమే అమలవుతున్న బీమాను హోంగార్డులకు వర్తింపజేస్తూ తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు అకాల మరణం చెందితే రూ.30 లక్షలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షలు కలిపి రూ.40 లక్షలు ఇవ్వనుంది. ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు పరిహారం అందిస్తుంది. హోంగార్డు చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంచింది. అంతేకాకుండా వారి ఆరోగ్య సంరక్షణ కోసం అతి త్వరలోనే హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయనుంది. నిబంధనల ప్రకారం.. అర్హత ఉన్న హోంగార్డులకు గృహనిర్మాణ పథకంలో ఇళ్లు కేటాయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. జీవితంలో మరిచిపోలేం – ఎస్.గోవిందు, హోంగారŠుడ్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హోంగార్డుల వేతనాలు పెంచి సీఎం వైఎస్ జగన్ మా మనసు గెలుచుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మేలును మా జీవితంలో మరిచిపోలేం. ప్రతినెలా ఒకటినే జీతం అందుతోంది అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వేతనాలు పెంచడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రతి నెలా ఒకటినే మాకు జీతం అందుతోంది. దీంతో కుటుంబ సమస్యలు తీరుతున్నాయి. - సీహెచ్.శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ పీఆర్వో, హోంగార్డు అసోసియేషన్ గుంటూరు రూరల్ సీఎంను జీవితాంతం గుర్తుంచుకుంటాం కాళ్లరిగేలా తిరిగినా చంద్రబాబు మమ్మల్ని ఆదుకోలేదు. చివరకు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిశాం. ‘అన్నా మన ప్రభుత్వం వచ్చాక మీ వేతనాలు పెంచుతాం’ అని ఆయన మాకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయనను మా జీవితాంతం గుర్తుంచుకుంటాం. – రూప్‌కుమార్, హోంగార్డు, చిత్తూరు -
విధి నిర్వహణలో వివక్ష చూపొద్దు
మన రాష్ట్ర భద్రత కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. అలాంటి అమరవీరులకు సగర్వంగా సెల్యూట్ చేస్తున్నా.. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు అందరి కష్టం నాకు తెలుసు. ఎండ, వాన, రాత్రి, పగలు అని చూడకుండా వారానికి ఒక్కరోజు కూడా సెలవు లేకుండా కష్టపడుతున్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) ప్రకటించాం. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : చట్టం ఏ కొందరికో చుట్టం కాకూడదని, విధి నిర్వహణలో వివక్ష చూపొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పిలుపునిచ్చారు. మెరుగైన పోలీస్ సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలంటే అందరికీ సమన్యాయం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఎవరికైనా ఒకే రూలు, ఒకే చట్టం అయినప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయని ప్రతి పోలీస్ సోదరుడికి, పోలీస్ అక్కచెల్లెమ్మలకు గుర్తు చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. అమర వీరులందరికీ సెల్యూట్.. ‘‘పోలీస్ అమర వీరుల కుటుంబాలకు, పోలీస్ శాఖలోని సిబ్బంది, అధికారులు, ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ రోజు పోలీస్ అమర వీరులను గుర్తు చేసుకునే రోజు. 1959లో చైనా సరిహద్దులో ఎస్ఐ కరణ్ సింగ్ నేతృత్వంలో గస్తీ నిర్వహిస్తున్న 20 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిపై వందల సంఖ్యలో చైనా సైనికులు విరుచుకుపడ్డారు. వీరున్నది 20 మందే అయినా వీరోచితంగా ఎదురు దాడి చేశారు. ఈ దాడిలో పది మంది పోలీసులు వీర మరణం పొందారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ దేశమంతా పోలీసుల అమర వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఇటువంటి ఘటనలు మన రాష్ట్రంలో కూడా అనేకం వున్నాయి. మన రాష్ట్ర భద్రత కోసం అనేక సందర్భాల్లో ఎందరో ప్రాణాలు అర్పించారు. అలాంటి అమర వీరులకు ఇక్కడి నుంచి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు మన దేశ సార్వ¿ౌమాధికారానికి చిహ్నం. దానిని కాపాడే వారే పోలీసులు. అందుకే పోలీస్ స్టేషన్‌ను మనం రక్షకభట నిలయం అని పిలుస్తున్నాం. ప్రజల హృదయాల్లో నిలవాలి మెరుగైన పోలీసు సేవలు అందించాలన్నా, ప్రజల హృదయాల్లో నిలవాలన్నా శాంతిభధ్రతల విషయంలో పోలీసులు రాజీ పడకూడదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదని నా మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పాను. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పించడంలో ఏమరుపాటు వద్దని చెప్పాను. పౌరుల భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించాను. బడుగు, బలహీన వర్గాలు, పేదవారి మీద హింస జరుగుతుంటే.. కారకులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని చెప్పాను. న్యాయం, ధర్మం ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి. చట్టం ఏ కొందరికో చుట్టం కానప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయి. న్యాయం కోసం వచి్చన పేదలు, బలహీనవర్గాల వారు కూడా వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళితేనే పోలీసులు ప్రజల మన్ననలు, గౌరవాన్ని పొందగలుగుతారు. పోలీసులు వారానికి ఒక రోజు వారి రోజువారీ బాధ్యతలను పక్కన పెట్టి కుటుంబంతో గడిపితే.. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అందుకే వారంతపు సెలవు ప్రకటిస్తూ మార్పునకు శ్రీకారం చుట్టాం. తద్వారా మెరుగైన పోలీస్ వ్యవస్థ వస్తుందనే విశ్వాసం నాకుంది. పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద అంజలి ఘటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళిలోనూ సీఎం నిబద్ధత.. పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళి అర్పించడంలో చూపిన నిబద్ధత అందరి ప్రశంసలందుకుంది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీనియర్ ఐపీఎస్‌లు వెంట రాగా సీఎం వైఎస్ జగన్.. చెప్పులు పక్కన వదిలి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివిధ వర్గాల ప్రముఖులు, అధికారులు సీఎం చర్యను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారైనా మినహాయింపు వుండకూడదు. అందరికీ ఒకే రూల్ వర్తింప చేయాలి. అప్పుడే పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుంది. రాష్ట్రంలో లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తనపై నిజాయితీగా యుద్ధం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఆ దిశగా మీరు ముందడుగు వేయండి. మీకు అండగా నేనుంటాను. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు న్యాయం దేశంలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డు, పోలీసుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంగార్డ్‌ల జీతాలు మెరుగు పరిచాం. ఇంతకు ముందు రూ.18,000 ఇస్తున్న వేతనాన్ని రూ.21,300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. విధి నిర్వహణలో హోంగార్డ్ మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను మా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విధి నిర్వహణలో చనిపోతే.. హోంగార్డ్‌లకు, పోలీసులకు రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీని మన ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షల కవరేజీ అదనంగా వస్తుంది. దేశంలో మొదటిసారిగా ఏపీలోనే ఈ ఇన్సూరెన్స్ కవరేజీని పోలీస్ సిబ్బంది పదవీ విరమణ తర్వాత కూడా వర్తించేలా నిబంధనలు తీసుకొచ్చిన హోం మంత్రి, డీజీపీలకు నా అభినందనలు. హోంగార్డ్, కానిస్టేబుల్, ప్రతి అధికారికి ఒక్కటే చెబుతున్నా.. విధి నిర్వహణలో మీరు మంచి పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేయండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా వుంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. అంతకు ముందు ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.