huge discounts
-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిన నెక్సన్.ఈవీ, టియాగో.ఈవీ మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యాటరీ వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. నెక్సన్.ఈవీ ధర రూ.1.2 లక్షల వరకు తగ్గింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.14.49 లక్షలు ఉంది. టియాగో.ఈవీ ధర రూ.70,000 వరకు తగ్గడంతో ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి లభిస్తోంది. బ్యాటరీ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని పంచ్.ఈవీ ధర నిర్ణయించడంతో తాజాగా ఎటువంటి సవరణ చేయలేదని టాటా మోటార్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ 8 శాతం వృద్ధి చెందింది. అయితే ఈవీ విభాగం 90 శాతం దూసుకెళ్లడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 2024 జనవరిలో ఈవీ విభాగం ఏకంగా 100%పెరగడం విశేషం. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో భారత్‌లో 70%పైగా వాటాతో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రస్థానంలో నిలిచింది. -
TS: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది. అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. రాయితీలు ఇలా.. ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80% కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60% ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90% -
ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌పై కచ్చితమైన డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే. -
తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పండుగ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! పాత ద్విచక్రవాహనాల ఎక్స్చేంజ్పై భారీగా.. ప్రస్తుతం ఓలా ఎస్1 వేరియంట్‌పై రూ.2వేలు, ఎస్1 ప్రో వేరియంట్‌పై రూ.4 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇక పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6,999 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లన్నీ మార్చి 8 నుంచి 12 వరకే. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్ల పండుగ ఆనందం మరింత పెరుగుతుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్‌వాలా పేర్కొన్నారు. ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఓలా కేర్ సర్వీసుల్లో ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అని రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ఇక ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కాగా డీ2సీ(డైరెక్ట్ టు కస్టమర్) సేవలను విస్తరించే పనిలో ఉన్న ఓలా మార్చి 2023 నాటికి అన్ని ప్రధాన నగరాల్లో 500 కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరుస్తోంది. -
ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!
తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. రూ.80 వేల విలువైన ఐఫోన్ 14ను రూ.14 వేలకే అందిస్తోంది యాపిల్. ఐఫోన్ 14ను ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్‌లతో యాపిల్ గతేడాది విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.79,999. యాపిల్ స్టోర్ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఐఫోన్ 14పై మాత్రం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్ ఎక్సేంజ్, రెండోది బ్యాంక్ ఆఫర్. వీటిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఐఫోన్14 కొనుక్కోవచ్చు. అది ఎలాగో చూడండి... అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్ స్టోర్‌లో ఐఫోన్ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్‌ను యాపిల్ ప్రాథమిక ఆఫర్‌తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్లో ఉన్న మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్ లభిస్తుంది. ఇక్కడ బయటకు కనిపించని ఒక సీక్రెట్ ఏంటంటే.. పైకి ఎంతో ఆసక్తికరంగా కనిపించే ఈ ఆఫర్ లో కొన్ని లిటిగేషన్ లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ అనగానే మనం వాడే ఫోన్ తీసుకెళ్తే దానికి అంతగా విలువ కట్టరు. యాపిల్ ఫోన్లను ప్రతీసారి అప్ డేట్ చేసుకునే కస్టమర్లు కొందరు ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీసారి వారు తమ వద్ద ఉన్న మోడల్ ను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. అలాగే ఐఫోన్ 14 విషయంలోనూ ఇలాంటి షరతే వర్తిస్తుంది. మీ దగ్గర మంచి కండీషన్ లో ఉన్న ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 మోడల్ ఉంటే.. దానికి గరిష్టంగా కట్టే విలువ దాదాపు రూ.35 వేలు. ఇక హెచ్డీఎఫ్సీ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్ 14 మీ సొంతం అవుతుంది. పైకి సులభంగా అనిపించినా.. షరతులన్నీ చూసుకుంటే.. లాభమా? నష్టమా? వినియోగదారులే నిర్ణయించుకోవాలి. (ఇదీ చదవండి: హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
శుభవార్త..పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన మహీంద్రా...!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను మహీంద్రా విడుదల చేసింది. ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో కస్టమర్లు గరిష్టంగా రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చును. అయితే ఆఫ్ రోడ్ కార్ థార్, బొలెరో నియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లపై ఎలాంటి తగ్గింపు లేదు. కాగా ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. పలు కార్లపై మహీంద్రా అందిస్తోన్న తగ్గింపులు ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు మొత్తంగా రూ. 61, 055 వరకు కొనుగోలుదారులు ఆదా చేసుకోవచ్చును. దీని ధర రూ.6.15 లక్షల నుంచి రూ.7.81 లక్షల వరకు ఉంది మహీంద్రా బొలెరో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 3000, అదనంగా మరో రూ. 6 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. దీని ధరను రూ.8.99 లక్షల నుండి రూ.9.99 లక్షల వరకు ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 4000, అదనంగా మరో రూ. 15 వేల వరకు, ఇలా మొత్తంగా రూ. 34 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. మహీంద్రా స్కార్పియోను రూ. 13.18 లక్షల నుంచి రూ. 18.14 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,003 వరకు నగదు తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు అదనంగా రూ. 10 వేల వరకు నగదు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 8.16 లక్షల నుంచి రూ. 13.67 లక్షల వరకు ఉంది. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై కంపెనీ ఏకంగా రూ. 81,500 భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైనఅదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. మహీంద్రా తన పూర్తి-పరిమాణ SUVని రూ. 28.84 లక్షల నుంచి రూ. 31.84 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఈ ఎమ్‌పివి ధరను రూ. 12.8 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు నిర్ణయించింది. చదవండి: గుడ్‌న్యూస్...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...! -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్...స్మార్ట్‌ఫోన్స్,ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుదారుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్ - 2022ను ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, ఆఫర్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు 12 గంటల ముందుగానే బిగ్ సేవింగ్ డేస్ సేవింగ్స్‌లో పాల్గొనే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఈ సేల్ భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుతో కొనుగోలుచేసే ఉత్పత్తులపై 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఇక పలు స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. శాంసంగ్, రెడ్మీ, షావోమీ, రియల్మీ, మోటరోలా, ఇన్ఫీనిక్స్ కంపెనీల స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై తగ్గింపు వర్తించనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్-2022లో పలు మొబైల్ ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న డీల్స్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 15, 999కు లభించనుంది. దీని లిస్టెడ్ ధర రూ. 22, 999. ఇదిలా ఉండగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో ఈఎంఐలో కొనుగోలుచేస్తే అదనంగా రూ. 1,000 తగ్గింపున పొందవచ్చును. రెడ్మీ నోట్ 10టీ 5జీ భారత్‌లో అత్యంత సరసమైన 5G స్మార్ట్ఫోన్లలో రెడ్మీ నోట్ 10టీ 5జీ కూడా ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 13,999 కు రానుంది. దీని అసలు ధర రూ.16,999. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే...రూ. 1000 వరకు తక్షణ తగ్గింపు కూడా రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,499 కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 25,999. పోకో ఎం4 ప్రో 5జీ పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. రూ. 12, 999 అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 16,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ధర రూ. 19,999కు రానుంది. దీని అసలు ధర రూ. 27, 999. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 24,999కు రిటైల్ అవుతోంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..! రూ. 60 వేల విలువైన ఐఫోన్ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్ -
గుడ్‌న్యూస్...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను టాటా మోటార్స్ విడుదల చేసింది. Tiago , Tigor , Harrier , Safari వంటి టాటా కార్లపై ఈ నెలలో కస్టమర్లు రూ. 65,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలపై ఎలాంటి ఆఫర్లు లేవు. కాగా ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. టాటా మోటార్స్ ఆయా కార్లపై అందిస్తోన్న ఆఫర్స్..! ► టాటా మోటార్స్ ఇటీవలే టాటా హారియర్ కొత్త ఎడిషన్ కాజిరంగాను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రత్యేక ఎడిషన్‌పై ఎలాంటి తగ్గింపు ఆఫర్స్ లేవు. హారియర్ అన్ని వేరియంట్లపై రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా గరిష్టంగా రూ. 65,000 వరకు తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ► టాటా సఫారీ అన్ని మోడళ్లలో రూ. 45,000 వరకు ప్రయోజనాలతో రానుంది. ఈ కారుపై కార్పోరేట్ తగ్గింపు లభించదు. ► టాటా టిగోర్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో పనిచేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌పై రూ.21,500 వరకు తగ్గింపుతో అందించబడుతోంది. దాంతో పాటు అదనంగా రూ. 10,000 తగ్గింపు కూడా అందిస్తుంది. టాటా టిగోర్ అన్నీ వేరియంట్లపై రూ. 11,500 కార్పొరేట్ తగ్గింపు లభిస్తాయి. ► టాటా టియాగో కొనుగోలుపై రూ. 31,500 వరకు తగ్గింపును టాటా మోటార్స్ అందిస్తోంది. ఇందులో అన్ని వేరియంట్లకు రూ. 11,500 కార్పొరేట్ తగ్గింపు లభించనుంది. అయితే, సీఎన్జీ వేరియంట్స్‌పై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ లేవు. ► టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 6,000, డీజిల్ నెక్సాన్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపులను అందిస్తోంది టాటా మోటార్స్. చదవండి: బంపరాఫర్..! కారు కొనుగోలుపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపు..! -
ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..! రూ. 60 వేల విలువైన ఐఫోన్ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శాంసంగ్, గూగుల్, రెడ్మీ వంటి సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిష్డ్ (Refurbished) స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరలకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ ధీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. తక్కువ ధరలో ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న పలు రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. యాపిల్ ఐఫోన్ 6ఎస్ రిఫర్బిష్డ్ గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ వేరియెంట్ కేవలం రూ. 10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 రిఫర్బిష్డ్ యాపిల్ ఐఫోన్ 7 రూ. 14,529 ధరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 59, 999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ 64జిబి ర్యామ్ గల రిఫర్బ్రిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ రూ. 13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పిక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ రూ. 10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..! -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్‌ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్‌కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
అమెజాన్ బంపరాఫర్..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..!
హోలీ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్‌ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో భాగంగా కెమెరా, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, వెయిరబుల్స్, ఇంకా మరెన్నో వాటర్‌ఫ్రూఫ్ గాడ్జెట్స్‌పై కొనుగోలుదారులకు 60 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ కార్డులపై అతి తక్కువ ధరలకు ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది అమెజాన్. ఈ ఆఫర్ కొన్ని రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పలు ఉత్పత్తులపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ ఆఫర్స్..! హెడ్‌ఫోన్స్ నాయిస్ బడ్స్ వీఎస్103 ఇయర్ బడ్స్‌ను కేవలం రూ. 1,499కు పొందవచ్చును. బోట్ ఎయిర్‌డోప్స్ 441 టీడబ్ల్యూఎస్ను రూ. 1,999కు లభించనుంది. స్పీకర్లు జేబీఎల్ గో2 వైర్లేస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ రూ. 2,184 ధరకు రానుంది. బోట్ స్టోన్ గ్రెనేడ్ స్పీకర్ రూ. 1,499కు లభించనుంది. బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ స్పీకర్ రూ. 1,299కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. స్మార్ట్‌వాచ్ boAt Xtend స్మార్ట్‌వాచ్ ఈ సేల్‌లో రూ. 2,999కు రానుంది. Noise ColorFit Pulse Grand స్మార్ట్‌వాచ్ రూ. 2,699కు లభించనుంది. కెమెరా GoPro HERO10 బ్లాక్ కెమెరా కొనుగోలుదారులకు రూ. 50 వేలకే లభించనుంది. Insta360 ONE R ట్విన్ ఎడిషన్ కెమెరా 5.7K రిజల్యూషన్‌తో వీడియోల, చిత్రాలను షూట్ చేస్తుంది. H.265 ఎన్కోడింగ్, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ , AI-ఆధారిత అల్గారిథమ్‌తో రానుంది. ఇది రూ. 40,499కు అందుబాటులో ఉండనుంది. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్! -
అమెజాన్ బంపరాఫర్..! టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై 55 శాతం మేర తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్‌లో ఉంది. ఈ సేల్ మార్చి 14తో ముగియనుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌ను హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్‌టీవీలపై ఏకంగా 55 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్‌పై 70 శాతం మేర, వైర్లెస్ హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్స్‌కు ఏకంగా రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రానున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్: స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus 9R(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 15 శాతం తగ్గింపుతో రూ.33,999కు రానుంది. OnePlus 9 Pro(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 12 శాతం తగ్గింపుతో రూ. 56,999 కోనుగోలుచేయవచ్చును. ► OnePlus 9(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 14 శాతం తగ్గింపుతో రూ.42,999. అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, స్మార్ట్‌ఫోన్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 16,550 రానుంది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 26,449కే కోనుగోలు చేయవచ్చును. ► Realme Narzo 50A (4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ రూ. 1500 తగ్గింపుతో రూ.11,499కు రానుంది. ► Samsung Galaxy M52 5G 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్‌పై రూ. 10 వేల తగ్గింపుతో 24,999కు రానుంది. ► Redmi 9A Sport స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 తగ్గింపుతో రూ. 6,999కు రానుంది. Redmi Note 11 స్మార్ట్‌ఫోన్‌పై 25శాతం తగ్గింపుతో రూ. 13,499కు రానుంది. ► Tecno Spark 8 Pro స్మార్ట్‌ఫోన్‌పై రూ.3500 తగ్గింపుతో రూ. 9999కు రానుంది. Tecno Camon 17 స్మార్ట్‌ఫోన్‌పై రూ . 2,000 తగ్గింపుతో రూ. 13,999కు అందుబాటులో ఉంది . అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్: టీవీ మోడళ్లపై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus (32-అంగుళాల) Y-సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీను రూ.15,999.కి కొనుగోలు చేయవచ్చు. ► Redmi TV (32-అంగుళాల నుంచి 55-అంగుళాల) స్మార్ట్‌టీవీలు తగ్గింపు ధరలలో రానున్నాయి. ► Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ. 36,990 లభించనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
టాటా మోటార్స్ బంపరాఫర్.. ఈ కార్లపై భారీ తగ్గింపు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. టాటా మోటార్స్ మార్చి నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను విడుదల చేసింది. Tiago , Tigor , Nexon , Harrier , Safari, Altroz వంటి కార్లపై భారీ తగ్గింపును టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. టాటా హారియర్ టాటా మోటార్స్ అందిస్తోన్న ప్రసిద్ధ ఎస్‌యూవీల్లో టాటా హారియర్ ఒకటి. ఈ కారు కొనుగోలుపై రూ. 85,000 వరకు విస్తృతమైన తగ్గింపును టాటా అందిస్తోంది . 2021 టాటా హారియర్ మోడల్‌పై రూ. 60,000 తగ్గింపు రానుంది. ఇందులో రూ. 20,000 నగదు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక 2022 మోడల్‌పై రూ. 40,000 ఎక్స్చేంజ్ ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ రెండు మోడళ్లకు రూ. 25,000 వరకు కార్పొరేట్ తగ్గింపు కూడా వస్తోంది. టాటా హారియర్ ధర రూ. 14.49 నుంచి రూ. 21.70 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్ ధర ). టాటా సఫారి 2021 టాటా సఫారి మోడల్‌పై రూ. 60,000 వరకు తగ్గింపు రానుంది. టాటా సఫారి 2022 మోడల్‌పై రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారుపై ఎలాంటి కార్పోరేట్ తగ్గింపు రావడం లేదు. టాటా సఫారీ ధర రూ. 14.99 నుంచి రూ. 23.29 లక్షలు గా ఉంది. (ఎక్స్-షోరూమ్). టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్‌పై కొనుగోలుదారులు రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు. సాధారణ పెట్రోల్ ఇంజన్ రూ. 7,500 తగ్గింపు రానుంది. మారుతి సుజుకి బాలెనో లేదా హ్యుందాయ్ ఐ20 పోటీగా ఈ కారు నిలుస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ధర). టాటా టిగోర్ టాటా మోటార్స్ స్టైలిష్ సెడాన్ టిగోర్ రూ. 35,000 తగ్గింపుతో రానుంది. 2021, 2022 టాటా టిగోర్ మోడల్స్‌పై వరుసగా రూ. 25,000, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ కారుపై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు కూడా రానుంది. టాటా టిగోర్ ధర రూ. 5.79 నుంచి రూ. 8.41 లక్షలు గా ఉంది (ఎక్స్-షోరూమ్ ధర). టాటా టియాగో టాటా టియాగో కొనుగోలుపై రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటార్స్ . ఇందులో 2021 మోడల్‌పై రూ. 25వేల వరకు, 2022 మోడల్‌పై రూ. 20వేల వరకు తగ్గింపు ఉంటుంది.ఈ కారుపై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు కూడా వర్తిస్తుంది. టాటా టియాగో కారు ధర రూ. 5.19 నుంచి రూ. 7.64 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ధర). టాటా నెక్సాన్ పెట్రోల్/డీజిల్ వేరియంట్ల టాటా నెక్సాన్ రూ. 25,000 వరకు తగ్గింపును పొందుతుంది. 2021 డీజిల్ మోడల్‌పై కొనుగోలుదారులు రూ. 15,000 తగ్గింపును పొందుతారు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది. కాగా డీజిల్ వేరియంట్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. టాటా నెక్సాన్ ధర రూ. 7.39 నుంచి రూ. 13.73 లక్షలు గా ఉంది. (ఎక్స్-షోరూమ్ ధర). గమనిక: కార్లపై లభించే తగ్గింపులు, పలు ఆఫర్స్ వివిధ రాష్ట్రాలలో మారుతూ ఉంటాయి. చదవండి: ఎలక్ట్రిక్ మైక్రోబస్‌ను లాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్..! -
క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తాజాగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్‌పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడల్స్‌పై మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు. ఈ కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ఇతర ట్రిమ్ వేరియంట్స్‌పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..! -
త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 7న ప్రారంభమవ్వగా...జనవరి 10 తో ముగియనుంది. సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్, టీవీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలపై 48 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,000 వరకు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా ఆర్నెల్ల స్క్రీన్ రిప్లేస్మెంట్, మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐతో పాటుగా రూ. 20 వేల వరకు క్యాష్ బెనిషిట్స్ను పొందవచ్చును. ఈ సేల్ ముగిసిన వెంటనే అమెజాన్ ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 మొదలుపెట్టనుంది. ఈ సమయంలో కస్టమర్లు తక్కువ ధరకే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు కూపన్ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్‌లో అమెజాన్ అందిస్తోన్న పలు ఆఫర్స్..! ► Mi 11X స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 23,499కు లభించనుంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 19,999కు రానుంది. వీటిపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ► Redmi 9A స్మార్ట్‌ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దీనిపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా రానుంది. ► Samsung Galaxy S20 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు. ► OnePlus 9R స్మార్ట్‌ఫోన్ రూ. 33,999, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 36,999 మరియు వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999 కు రానుంది. ► iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు. ► Realme Narzo 50A, Samsung Galaxy M52 5G, OnePlus Nord 2 5G స్మార్ట్ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ కూపన్స్‌ను అమెజాన్ అందిస్తోంది. ► AmazonBasics 50-అంగుళాల 4K TV 40 శాతం డిస్కౌంట్‌తో రూ. 32,999కు రానుంది. ► Sony 50-inch 4K UHD Google స్మార్ట్‌టీవీ 30 శాతం డిస్కౌంట్‌తో రూ. 77, 990కు లభించనుంది. ► iFFalcon 43-inch 4K UHD స్మార్ట్‌టీవీ ఏకంగా 48 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ► Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ► Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఆయా ఎస్యూవీ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడళ్లపై సుమారు రూ. 82 వేల వరకు కార్పోరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఎక్సేచేంజ్ బోనస్‌ను కొనుగోలుదారులకు అందించనుంది. ఈ ఆఫర్ 2022 జనవరి 31 వరకు అందుబాటులో ఉండనుంది. అల్టురాస్, స్కార్పియో, మొరాజో, ఎక్స్‌యూవీ300, మహీంద్రా కేయూవీ100 ఎన్ఎక్స్టీ, వాహనాలపై ఈ తగ్గింపు వర్తించనుంది. మహీంద్రా ఆయా మోడల్స్‌పై అందిస్తోన్న ఆఫర్స్..! మహీంద్రా Alturas SUV మహీంద్రా అల్టురాస్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 81, 500 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్బోనస్ రూ. 50,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 11, 500, సుమారు రూ. 20 వేల వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చును. మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్ మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్పై గరిష్టంగా రూ. 61, 055 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్బోనస్ రూ.20,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 3, 000, క్యాష్ డిస్కౌంట్ రూ. 38, 055 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియోపై గరిష్టంగా రూ. 29, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.10,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 4, 000, సుమారు రూ. 15 వేల వరకు ఇతర ప్రయోజనాలు కొనుగోలుదారులకు లభిస్తాయి. మహీంద్రా మొరాజో మహీంద్రా మొరాజో గరిష్టంగా రూ. 40,200 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.15,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 5,200,క్యాష్ బెనిఫిట్ రూ. 20, 000 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 మహీంద్రా ఎక్స్‌యూవీ300 గరిష్టంగా రూ. 69, 002 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.25,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 4, 500, క్యాష్ బెనిఫిట్స్ రూ. 30,002 వరకు అందబాటులో ఉండనున్నాయి. ► వీటితోపాటుగా మహీంద్రా బోలెరో ఎస్యూవీ కొనుగోలుపై రూ. 13,000; సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 10, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! -
న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ మోడల్ లైనప్‌లో అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ కార్లపై లాభదాయకమైన డీల్‌లను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, ఎఫ్ఓసీ ఉపకరణాలు, కార్పొరేట్ బోనస్‌లను హోండా అందిస్తోంది. ఆయా కార్లపై హోండా అందిస్తోన్న ఆఫర్స్..! హోండా అమేజ్ డిసెంబర్ 2021లో హోండా కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా హోండా అమేజ్ నిలిచింది. న్యూ ఇయర్ ఆఫర్లో భాగంగా రూ. 15,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000గా ఉంది. హోండా సిటీ 5 జనరేషన్ జపనీస్ కార్‌మేకర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీ మోడల్‌పై ఏకంగా రూ. 35,596 తగ్గింపుతో రానుంది. క్యాష్ బెనిఫిట్ రూ. 10,000. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000 కొనుగోలుదారులు పొందవచ్చు. ఎఫ్ఓసీ యాక్సెసరీస్‌పై సుమారు రూ. 10, 596 ప్రయోజనాలను హోండా అందిస్తోంది. హోండా సిటీ 4 జనరేషన్ హోండా సిటీ 4 జనరేషన్ కారుపై సుమారు రూ. 20వేల వరకు తగ్గింపును హోండా అందిస్తోంది. లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7,000, హోండా సిటీ కొనుగోలుపై 8,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. హోండా డబ్ల్యూఆర్-వీ ఈ కారు కొనుగోలుపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10, 000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ బెనిఫిట్లను రూ. 4,000 అందిస్తోంది. హోండా జాజ్ హోండా జాజ్ కొనుగోలుపై రూ. 33,147 వరకు నగదు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది, ఇందులో క్యాష్ బెనిఫిట్స్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 4000 వరకు లభిస్తాయి. ఎఫ్ఓసీ యాక్సెరీస్పై రూ. 12,147 మేర ప్రయోజనాలను హోండా అందిస్తోంది. చదవండి: దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు.ఈ ఒక్క ఏడాదిలో 15 ఏళ్ల రికార్డు బద్ధలయ్యేనా? -
యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై భారీ క్యాష్‌బ్యాక్..!
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ దిగ్గజం విజయ్ సేల్స్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. యాపిల్ డేస్ సేల్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను విజయ్ సేల్స్ ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. విజయ్ సేల్స్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఆఫర్స్ లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 10 వేల వరకు క్యాష్ బ్యాక్‌ను కొనుగోలుదారులకు సొంతం చేసుకోవచ్చును. విజయ్ సేల్ ఆఫర్లో అందిస్తోన్న మోడల్స్ ఇవే..! ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 , ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్స్తో పాటుగా మాక్ బుక్ ఎయిర్ (ఎమ్1), మ్యాక్‌బుక్ ప్రో (ఎమ్1), మ్యాక్‌బుక్ ప్రో (ఎమ్1 ప్రో) వాటితో పాటుగా ఐప్యాడ్ (2021), ఐప్యాడ్ ఎయిర్ 2020)పై కూడా తగ్గింపు ధరలు అందిస్తోంది. ఎయిర్‌పాడ్స్(3వ తరం), ఎయిర్‌పాడ్స్ ప్రో, ఎయిర్ పాడ్ మ్యాక్స్, హోమ్ పాడ్ మినీపై వర్తించనున్నాయి. ఆయా ఐఫోన్లపై రూ. 5000 వేల వరకు క్యాష్‌బ్యాక్, మ్యాక్ బుక్స్‌పై రూ. 10 వేల క్యాష్‌బ్యాక్, ఐపాడ్స్‌పై రూ. 4 వేల వరకు, యాపిల్ వాచ్స్పై రూ. 3 వేల వరకు, మ్యాగ్సేఫ్పై రూ. 2 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను విజయ్ సేల్ అందిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఆయా మోడల్స్ ధరల వివరాలు చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
ఇయర్ ఎండ్ సేల్: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..!
ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సోనీ ఇయర్ ఎండ్ సేల్‌ను గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ఆఫ్‌లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్స్‌తో పాటుగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..! ►Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది. ►సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990 ►సోనీ WH-CH710N హెడ్‌ఫోన్స్ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది. ►సోనీ వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి. ►సోనీ SRS-XB13 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్‌పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!
తైవాన్‌కు చెందిన ప్రముఖ ల్యాప్‌ట్యాప్ తయారీదారు ఏసర్ భారత్‌లో ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. ‘లూట్ అవర్ స్టోర్ సేల్’ పేరుతో గేమింగ్ ల్యాప్టాప్స్, ఉపకరణాలపై, కంప్యూటర్ గాడ్జెట్స్‌పై ఏసర్ భారీ ఆఫర్లను ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌ట్యాప్స్‌పై సుమారు రూ. 40 వేల వరకు, గేమింగ్ ఉపకరణాలపై 67శాతం మేర తగ్గింపును ఏసర్ ప్రకటించింది. ఈ సేల్ ఏసర్ అధికారిక వెబ్సైట్లో డిసెంబర్ 16-17 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్..! సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైన ఐబీఎమ్, శాంసంగ్ ఏసర్ ల్యాప్‌ట్యాప్స్ రూ. 23,990 నుంచి తక్కువ ధరలోనే ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ, బ్రాండ్ వారంటీని ఏసర్ అందిస్తుంది. ఏసర్ మానిటర్స్ రూ. 7,690 నుంచే ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు సంవత్సరాల వారంటీ, ఒక ఏడాది పాటు యాక్సిడెంటర్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్‌లో భాగంగా ఏసర్ నైట్రో హెడ్‌సెట్స్, బ్యాక్‌ప్యాక్స్, అడాప్టర్స్‌పై 67 శాతం వరకు తగ్గింపును ఏసర్ అందించనుంది. దాంతో పాటుగా ఎక్సేచేంజ్ ఆఫర్లను కూడా ఏసర్ అందిస్తోంది. ఏసర్ ట్యాబ్ కొనుగోలుపై రూ. 2,999 విలువైన ఏసర్ నైట్రో హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు ఉచితంగా పొందవచ్చును. ఈ టాబ్లెట్ ధర రూ. 11,999. చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..! -
నిస్సాన్ బంపర్ ఆఫర్..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. కాగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2021 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నిస్సాన్ అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్ ఇంజన్‌తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్‌ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్‌లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..! -
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై రూ. 13 వేల వరకు భారీ తగ్గింపు..!
Oneplus 9 Pro, Oneplus 9. Oneplus Nord CE 5G Discounts Up To 13000: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డ్సుతో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తే రూ. 8000 తక్షణ తగ్గింపు రానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 డిస్కౌంట్ రానుంది. వీటితో పాటుగా కొనుగోలుదారులకు రూ. 5000 అమెజాన్ కూపన్‌ను కూడా అందిస్తోంది. ఈ కూపన్ వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై రానుంది. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కూడా లభించనున్నాయి. వన్‌ప్లస్ 9 ప్రో డీల్ వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 10 వేల తగ్గింపు రానుంది. వన్‌ప్లస్ 9 డీల్ వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 8,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది.అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 13 వేల తగ్గింపు రానుంది వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5G డీల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీపై అమెజాన్ రూ. 1,500 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై మూడు నెలల నో-కాస్ట్ సౌకర్యం ఉంది. చదవండి: The Best Smartphones Of 2021: ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! -
పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. పేటీఎం యాప్‌తో విమాన టికెట్ల బుకింగ్‌పై 15 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సాయుధ దళాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు, సీనియర్ సీటిజన్లకు అందుబాటులో ఉండనుంది. వీటిపై వర్తిస్తాయి..! పేటీఎం అందిస్తోన్న ఆఫర్స్ ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ఎసియా సర్వీసులపై తగ్గింపు ధరలు వర్తిస్తాయి. కాలేజ్ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్ట్రా బ్యాగేజ్‌ను తీసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చును. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.... “ ట్రావెల్ టికెటింగ్ మాకు చాలా ముఖ్యమైన సెగ్మెంట్. ట్రావెలింగ్ విషయంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను రిజర్వ్ చేయడానికి సులభతరమైన అనుభూతిని వారికి అందిస్తున్నామని అన్నారు. పేటీఎం ప్రముఖ మేజర్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కస్టమర్లు ఫ్లైట్ టికెట్లను, ఇంటర్సిటీ బస్సులను, రైల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి పేటీఎం వీలు కల్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణాలపై ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పేటీఎం ప్రారంభించింది. చదవండి: Paytm: 50 కోట్ల మంది టార్గెట్ -
ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..!
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 12 ప్రో కొనుగోలు ఏకంగా రూ. 25,000 భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిస్కౌంట్ అన్ని స్టోరేజ్ వేరియంట్లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అంటే వినియోగదారులు తమ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 12 ప్రో ధరను మరింత దిగిరానుంది. అమెజాన్‌లో రూ 1,19,000 ఖరీదైన ఐఫోన్ 12 ప్రొ 128జీబీ రూ 95,900కే రానుంది. దీంతో పాటుగా రూ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ 14,900 తగ్గింపు వర్తించనుంది. ఐఫోన్ 12 ప్రో ఫీచర్స్..! 6.1 ఇంచ్ సిరామిక్ షీల్డ్ కోటెడ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఏ14 బయోనిక్ చిప్ 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా 4 కె డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్ 4x ఆప్టికల్ జూమ్ రేంజ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చదవండి: మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు..!