hyderabad cricket
-
షేక్ రషీద్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ షేక్ రషీద్ (372 బంతుల్లో 203; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ , తో చెలరేగడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 147 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్ స్కోరు 168/2తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. కరణ్ షిండే (221 బంతుల్లో 109; 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... షేక్ రషీద్ ద్విశతకంతో విజృంభించాడు. తాజా రంజీ సీజన్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రషీద్ ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేయగా... హైదరాబాద్ బౌలర్లు అతడిని కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రషీద్... పరిస్థితులను ఆకలింపు చేసుకున్న అనంతరం ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు కరణ్ షిండేతో కలిసి రషీద్ 236 పరుగులు జోడించి జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు. హనుమ విహారి (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (33; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 4 వికెట్లు... చామా మిలింద్, రక్షణ్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం యరా సందీప్ (73 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), లలిత్ మోహన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
రాణించిన రషీద్, కరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న పోరు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 244/5తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు చివరకు 105.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (287 బంతుల్లో 159; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22) క్రితం రోజు స్కోరు వద్దే అవుట్ కాగా.. చామా మిలింద్ (5), తనయ్ త్యాగరాజన్ (10), అనికేత్ రెడ్డి (10) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 5, మొహమ్మద్ రఫీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.కెప్టెన్ షేక్ రషీద్ (161 బంతుల్లో 79 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కరణ్ షిండే (41 బ్యాటింగ్; 4 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (38; 4 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. రషీద్‌తో పాటు కరణ్ షిండే క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) సందీప్ (బి) రఫీ 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (ఎల్బీ) (బి) శశికాంత్ 22; మిలింద్ (బి) విజయ్ 5; తనయ్ (సి) రషీద్ (బి) విజయ్ 10; అనికేత్ రెడ్డి (సి) భరత్ (బి) రఫీ 7; రక్షణ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 301. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, 6–245, 7–253, 8–265, 9–288, 10–301. బౌలింగ్: శశికాంత్ 19–4–38–1; రఫీ 24.4–4–5–59–2; విజయ్ 31–5–118–5; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: హేమంత్ (సి) నితీశ్ (బి) రక్షణ్ 9; అభిషేక్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 38; షేక్ రషీద్ (బ్యాటింగ్) 79; కరణ్ షిండే (బ్యాటింగ్) 41; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (58 ఓవర్లలో 2 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–17, 2–84, బౌలింగ్: మిలింద్ 8–2–21–0; రక్షణ్ రెడ్డి 10–0–35–1; అనికేత్ రెడ్డి 22–5–56–1; తనయ్ త్యాగరాజన్ 9–0–39–0; రోహిత్ రాయుడు 9–2–16–0. -
Ranji Trophy 2024-25: హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా కొత్త ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదుర్కొంది.కాగా హైదారాబాద్ గ్రూప్ ‘బి’ ఎలైట్ డివిజన్ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా హైదరాబాద్ తొలుత.. మాజీ చాంపియన్ గుజరాత్‌తో తలపడింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 126 పరుగుల తేడాతో ఓడిపోయింది. 170 పరుగులకేచివరిరోజు ఆటలో భాగంగా.. 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 59.1 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్ అభిరత్ రెడ్డి (59 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... ఇతర బ్యాటర్లు క్రీజులో నిలదొక్కులేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రియజీత్సింగ్ జడేజా, రింకేశ్ వాఘేలా 3 వికెట్ల చొప్పున తీయగా... సిద్ధార్థ్ దేశాయ్, అర్జన్ నాగ్వాస్వలా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.ఇక ఈ విజయంతో గుజరాత్‌కు 6 పాయింట్లు లభించాయి. గుజరాత్ బ్యాటర్ మనన్ హింగ్రాజియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 18 నుంచి డెహ్రాడూన్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో హైదరాబాద్ తలపడుతుంది.స్కోరు వివరాలు వేదిక: జింఖానా గ్రౌండ్, హైదరాబాద్టాస్: గుజరాత్.. తొలుత బ్యాటింగ్గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 343హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 248గుజరాత్ రెండో ఇన్నింగ్స్: 201హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: 170ఫలితం: హైదరాబాద్‌పై 126 పరుగుల తేడాతో గుజరాత్ విజయంతన్మయ్ అగర్వాల్ (బి) అర్జన్ నాగ్వాస్వాలా 1; అభిరత్ రెడ్డి (సి) సిద్ధార్థ్ దేశాయ్ (బి) రింకేశ్ వాఘేలా 51; రాహుల్ సింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్జన్ నాగ్వాస్వాలా 0; రోహిత్ రాయుడు (బి) రింకేశ్ వాఘేలా 26; హిమతేజ (సి) రిషి పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 29; రాహుల్ రాధేశ్ (సి) ఉర్విల్ పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 17; తనయ్ త్యాగరాజన్ (సి) ఉరి్వల్ పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 1; సీవీ మిలింద్ (సి) ప్రియాంక్ పాంచాల్ (బి) సిద్ధార్థ్ దేశాయ్ 28; అనికేత్ రెడ్డి (సి) రిషి పటేల్ (బి) సిద్ధార్థ్ దేశాయ్ 2; రక్షణ్ రెడ్డి (సి) ప్రియాంక్ పాంచాల్ (బి) రింకేశ్ వాఘేలా 7; నిశాంత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–76, 4–83, 5–127, 6–130, 7–133, 8–145, 9–170, 10–170. బౌలింగ్: సిద్ధార్థ్ దేశాయ్ 16.1–3–47–2, అర్జన్ నాగ్వాస్వాలా 12–4–28–2, చింతన్ గజా 9–3–16–0, ప్రియజీత్ సింగ్ జడేజా 10–1–23–3, రింకేశ్ వాఘేలా 12–2–52–3. చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి... -
ఐదేసిన అనికేత్.. హైదరాబాద్ విజయలక్ష్యం 296
సాక్షి, హైదరాబాద్: లెఫ్టార్మ్ స్పిన్నర్ అనికేత్ రెడ్డి (5/36) సత్తా చాటడంతో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గుజరాత్ 62.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఉమంగ్ కుమార్ (113 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా... సిద్ధార్థ్ దేశాయ్ (32), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మనన్ హింగ్రాజియా (25) ఫర్వాలేదనిపించారు.హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 5, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 93.4 ఓవర్లలో 343 పరుగులు చేయగా... హైదరాబాద్ 89.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (90 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హిమతేజ (184 బంతుల్లో 66; 11 ఫోర్లు), సీవీ మిలింద్ (83 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు.ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (0), అభిరథ్ రెడ్డి (2) నాలుగు ఓవర్లలోపే పెవిలియన్‌కు చేరగా... వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (8), తనయ్ త్యాగరాజన్ (1) ప్రభావం చూపలేకపోయారు. అప్పటికే గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగా... హైదరాబాద్‌కు సరైన ఆరంభం దక్కలేదు. స్కోరు బోర్డు మీద రెండు పరుగులు నమోదయ్యేసరికి రెండు వికెట్లు పడ్డాయి.ఈ దశలో రోహిత్ రాయుడు (23)తో కలిసి కెప్టెన్ రాహుల్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత హిమతేజ, మిలింద్ చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడటంతో హైదరాబాద్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఏడో వికెట్‌కు మిలింద్‌తో కలిసి హిమతేజ 99 పరుగులు జోడించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 95 పరుగులతో కలుపుకొని ఓవరాల్‌గా గుజరాత్ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... మరి ఈ లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాటర్లు చేధిస్తారా చూడాలి!చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే -
దుమ్ములేపిన తిలక్ సేన.. చాంపియన్‌గా హైదరాబాద్
రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. మేఘాలయ టీమ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్- మేఘాలయ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 17న మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బ్యాటింగ్ చేసింది. 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లతో చెలరేగగా.. రోహిత్ రాయుడు మూడు, రిషభ్ బస్లాస్, కెప్టెన్ తిలక్ వర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది. కె.నితేశ్‌రెడ్డి సెంచరీ(122)తో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ ప్రజ్ఞయ్‌రెడ్డి అజేయ శతకం(141 బంతుల్లో 102 పరుగులు) సాధించాడు. మరోవైపు.. కెప్టెన్ తిలక్ వర్మ 44 పరుగులతో రాణించాడు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మేఘాలయను లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ మరోసారి దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు తీసి మేఘాలయ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో 243 పరుగులకే మేఘాలయ కథ ముగిసింది. ఈ క్రమంలో 198 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(62), కెప్టెన్ తిలక్ వర్మ(64) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. తాజా సీజన్లో ప్లేట్ గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్, మేఘాలయ ఇప్పటికే ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధించాయి. వచ్చే ఎడిషన్‌లో ఎలైట్ గ్రూపులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, మంగళవారం ముగిసిన ఫైనల్లో మేఘాలయపై పైచేయి సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది హైదరాబాద్. తద్వారా ప్లేట్ గ్రూపు చాంపియన్‌గా అవతరించింది. -
Ranji Trophy: ఆంధ్ర సహా క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు ఇవే
Ranji Trophy 2023-24- Quarter Finals: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ఎలైట్ డివిజన్లో మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా (ఎ, బి,సి,డి; 8 జట్ల చొప్పున) విభజించారు. గ్రూప్ ‘బి’లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 ‘డ్రా’, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌కంటే ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఎలైట్ డివిజన్‌కు హైదరాబాద్ అర్హత కాగా 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవా జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోగా... ‘ప్లేట్’ డివిజన్లో ఫైనల్ చేరిన హైదరాబాద్, మేఘాలయ ఎలైట్ డివిజన్‌కు అర్హత పొందాయి. ఫిబ్రవరి 23 నుంచి క్వార్టర్ ఫైనల్స్ ►ఇక ఈనెల 23 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటకతో విదర్భ (నాగ్‌పూర్‌లో- Vidarbha vs Karnataka, 1st Quarter Final) ►ముంబైతో బరోడా (ముంబైలో- Mumbai vs Baroda, 2nd Quarter Final) ►తమిళనాడుతో సౌరాష్ట్ర (కోయంబత్తూరులో- Tamil Nadu vs Saurashtra, 3rd Quarter Final) ►మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర (ఇండోర్‌లో- Madhya Pradesh vs Andhra, 4th Quarter Final ) తలపడతాయి. ఆటకు వీడ్కోలు ఇక రంజీ తాజా సీజన్ సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. మనోజ్ తివారి(బెంగాల్), ధవళ్ కులకర్ణి(ముంబై), సౌరభ్ తివారి(జార్ఖండ్), ఫైజ్ ఫజల్(విదర్భ), వరుణ్ ఆరోన్(జార్ఖండ్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
Ranji Trophy: విజయం దిశగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మరో 127 పరుగులు సాధిస్తే హైదరాబాద్ క్రికెట్ జట్టు 2023–2024 రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్‌గా అవతరిస్తుంది. ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ప్లేట్ డివిజన్ టైటిల్ పోరులో మేఘాలయ జట్టు హైదరాబాద్‌కు 198 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు సాధించింది. తన్మయ్ అగర్వాల్ (0) ఖాతా తెరవకుండా అవుటవ్వగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (29 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (35 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 0/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మేఘాలయ జట్టు 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆర్ఆర్ బిస్వా (100; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... జస్కీరత్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. ఈ రంజీ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన తనయ్ మొత్తం 56 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. తనయ్ ఏడుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. -
Hyd: 7 వికెట్లతో చెలరేగిన బౌలర్.. మనోళ్లదే ఆధిపత్యం
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తన్మయ్, తిలక్ సెంచరీలు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. 462 డిక్లేర్డ్ ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్‌కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్ నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్‌పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ -
Plate 1st Semi Final: తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు. శతక్కొట్టిన తన్మయ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీ వన్‌డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు. మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
5 వికెట్లతో చెలరేగిన తనయ్.. హైదరాబాద్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలు సాధించి 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆరు జట్లున్న ప్లేట్ డివిజన్లో భాగంగా మిజోరం జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 458/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 9 వికెట్లకు 465 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిజోరం 43.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 74 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈనెల 9 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో నాగాలాండ్‌తో హైదరాబాద్; మేఘాలయతో మిజోరం ఆడతాయి. ఫైనల్ చేరిన రెండు జట్లు వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో ఆడతాయి. చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో -
అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ తేడాతో హైదరాబాద్ విజయం
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ప్లేట్ గ్రూపులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో మిలాంద్, కార్తీకేయ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగరాజన్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 615 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 147 బంతుల్లోనే 300 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 181 బంతులు ఎదుర్కొన్న అగర్వాల్.. 34 ఫోర్లు, 26 సిక్స్‌లతో 366 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ హ్లోత్ 105 బంతుల్లో 185 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 443 పరుగుల అధిక్యం సాధించింది. 443 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అరుణాచల్.. 256 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌ను హైదరాబాద్ కేవలం రెండు రోజుల్లోనే ముగించింది. చదవండి: IND vs ENG: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. శ్రీనాథ్ రికార్డు బద్దలు -
ఇషాన్ కిషన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. 442 రన్స్ ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్- Ranji Trophy 2023-24- Hyderabad vs Arunachal Pradesh: దేశవాళీ క్రికెట్లో అనామక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్, 33 ఫోర్లు, 21 సిక్స్‌లు), కెప్టెన్ రాహుల్ సింగ్ గహ్లోత్ (105 బంతుల్లో 185; 26 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా సొంతగడ్డపై జరుతున్న నాలుగు రోజుల లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిరోజు ‘సూపర్‌ఫాస్ట్’ ప్రదర్శన కనబరిచింది. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 529 పరుగులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా అరుణాచల్ ఇన్నింగ్స్‌ను కూల్చడం మొదలు, హైదరాబాద్ బ్యాటింగ్ అంతా మెరుపు వేగంతో సాగిపోయింది. హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో తూంకుంటలోని నెక్స్‌జెన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తెచీ డోరియా (127 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (3/36), కార్తికేయ (3/28), తనయ్ త్యాగరాజన్ (2/53) అరుణాచల్ జట్టును కట్టడి చేశారు. తొలి వికెట్‌కు 449 పరుగుల భాగస్వామ్యం అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, రాహుల్ అరుణాచల్ బౌలర్లపై విధ్వంసరచన చేశారు. ఇద్దరూ చెలరేగిన తీరుతో ప్రతీ ఓవర్ హైలైట్స్‌ను తలపించింది. తొలుత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ తన్మయ్‌తో రాహుల్ తొలి వికెట్‌కు 40.2 ఓవర్లలో 449 పరుగుల భాగస్వామ్యం జోడించాక అవుటయ్యాడు. రాహుల్ అవుటయ్యాక కూడా తన్మయ్ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా తన్మయ్ నిలిచాడు. తన్మయ్ 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా... 1985లో బరోడా జట్టుపై రవిశాస్త్రి (ముంబై) 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక కూడా తన్మయ్ విధ్వంసం కొనసాగింది. ఫాస్టెస్ట్ ‘ట్రిపుల్ .. ఇషాన్ సిక్సర్ల రికార్డు బద్దలు ఈ క్రమంలో తన్మయ్ ఫస్ట్‌క్లాస్ ఫాస్టెస్ట్ ట్రిపుసెంచరీ’ సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ 147 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించి ... 2017లో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో 191 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన మార్కో మరైస్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. శుక్రవారం నాటి మొదటిరోజు ఆట ముగిసేసరికి తన్మయ్ 21 సిక్స్‌లు కొట్టగా... జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (2016లో ఢిల్లీపై 14 సిక్స్‌లు), హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడు శక్తి సింగ్ (1990లో హరియాణాపై 14 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. Day 2- 366 పరుగులు చేసి అవుట్ తన్మయ్ అగర్వాల్ వీరవిహారానికి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ నబం టెంపోల్ బ్రేక్ వేశాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 366 పరుగుల వ్యక్తిగత స్కోరు(34 ఫోర్లు, 26 సిక్సర్లు) వద్ద తన్మయ్ క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.. అభిరథ్ రెడ్డి(37), నితేశ్ రెడ్డి(12) రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 59 ఓవర్లు ముగిసే సరికి 614-4 స్కోరు చేసిన హైదరాబాద్ ప్రస్తుతం 442 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ranji Trophy: హనుమ విహారి, రికీ భుయ్ సెంచరీలు -
మనోళ్లు దంచికొట్టారు.. ఒక్కడే 323 నాటౌట్! 357 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Arunachal Pradesh- Hyderabad lead by 357 runs: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన సాగుతోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో తిలక్ వర్మ కెప్టెన్సీలో నాగాలాండ్‌పై 194 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో రాహుల్ సింగ్ గహ్లోత్ సారథ్యంలో మేఘాలయను 81 రన్స్‌తో చిత్తు చేసింది. 172 పరుగులకే ఆలౌట్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుత ఆట తీరుతో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు మరో భారీ గెలుపుపై కన్నేసింది. ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ మొదలైంది.సొంతగడ్డపై నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది. సంచలన ఆరంభం.. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు తీయగా.. టి.త్యాగరాజన్ రెండు, సాకేత్, ఇల్లిగరం సంకేత్ తలా ఓ వికెట్ తీశారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, గహ్లోత్ రాహుల్ సింగ్ సంచలన ఆరంభం అందించారు. 33 ఫోర్లు, 21 సిక్సర్లు తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగా.. గహ్లోత్ 105 బంతుల్లో 185 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తన్మయ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. రంజీ మ్యాచ్‌లో తన్మయ్ టీ20 తరహా ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ మొదటి రోజు వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తన్మయ్‌కు తోడుగా అభిరథ్ రెడ్డి 19 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అరుణాచల్ ప్రదేశ్‌తో అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. తన్మయ్ 147 బాల్స్‌లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. రవిశాస్త్రి పేరును చెరిపేసి.. ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే అంతకుముందు తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరిట చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని తన్మయ్ ఈ ఘనత సాధించాడు. కాగా ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
బ్యాట్‌తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్‌గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్‌కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
Hyd: రెండ్రోజుల్లోనే టెస్టు ఖతం.. వరుసగా రెండో విజయం
రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్‌సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. టెస్టుల్లో అరంగేట్రానికి ‘సై’!
Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు. తిలక్ వర్మ అజేయ సెంచరీ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది. చిత్తుగా ఓడిన నాగాలాండ్ అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. ఇక నాగాలాండ్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు. కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్‌గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్ గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ గుర్తింపు పొందాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
చరిత్ర సృష్టించిన రాహుల్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! రెండో ఆటగాడిగా
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ సింగ్ గహ్లోత్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రాహుల్ 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 157 బంతులు ఎదుర్కొన్న రాహుల్ సింగ్.. 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్ సింగ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1985లో వాంఖడేలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో బాంబే (ప్రస్తుతం ముంబై) తరఫున 123 బంతుల్లో శాస్త్రి తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 76.4 ఓవర్లలో 5 వికెట్లకు 474 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేశాడు. చదవండి: #David Warner: ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ? -
సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. ధనాధన్ ఇన్నింగ్స్
Ranji Trophy 2023-24 Hyd Vs NGL: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ దుమ్ములేపాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా దేశవాళీ టెస్టు ఫార్మాట్ టోర్నీ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ శుక్రవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో తలపడుతోంది. దిమాపూర్ వేదికగా మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య నాగాలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, అతడి స్థానంలో వన్‌డౌన్‌లో దిగిన గహ్లోత్ రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(80)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 214 పరుగులు సాధించాడు. రాహుల్ సింగ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా తెలుకపల్లి రవితేజ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి హైదరాబాద్ 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. నాగాలాండ్ బౌలర్లలో కరుణ్ తెవాటియా, నగాహో చిషి, ఇమ్లివటి లెమ్టూర్, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్ రొంగ్సెన్ జొనాథన్ ఒక్కో వికెట్ తీశారు. -
తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్
దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్ తిలక్ వర్మకు తొలిసారి హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించారు. తిలక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో తిలక్ దుమ్మురేపాడు. అంతకుముందు తను అరంగేట్రం చేసిన వెస్టిండీస్ సిరీస్‌లో తిలక్ అకట్టుకున్నాడు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తిలక్‌కు హెచ్‌సీఏ అప్పగించింది. ఈ టోర్నీ అక్టోబర్ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఈ టోర్నీలో అజింక్యా రహానే, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. హైదరాబాద్ టీ20 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ది, రాహుల్ రాధేశ్, రోహిత్ రాయుడు, చందన్ సహని, భవేశ్ సేథ్, రవితేజ, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, అమన్ రావు. చదవండి: WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో ఓటమి -
50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. రెండు రోజుల లీగ్‌లో భాగంగా కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ వర్గీస్ అనే కుర్రాడు ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో కాంకర్డ్ తరపున ఆడిన ఆరోన్ వర్గీస్ మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. కేవలం 260 బంతుల్లో 50 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు సాధించాడు. ఆరోన్ అద్భుత బ్యాటింగ్‌కు తోడుగా అయాన్ అహ్మద్(52), రామ్ రేపాల(50) రాణించడంతో కంకార్డ్ 85.5 ఓవర్లలో(నిర్ణీత 90 ఓవర్లు) 560 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు చేసిన 560 పరుగుల్లో 321 పరుగులు ఆరోన్ వర్గీస్వే కావడం విశేషం. చదవండి: కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల చేధన -
మిమ్మల్ని చివరిగా ఒక్కసారైనా కలవాలనుకున్నా.. కానీ: సిరాజ్ భావోద్వేగం
Mohammed Siraj Dedicates POTM To Late Hyderabad Cricketer: ‘‘ప్రియమైన అజీం సర్. నాకు, నాలాంటి ఎంతో మందికి మీరు అందించిన ప్రోత్సాహం గురించి నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. మీ మనసు ఎంతో మంచిది. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారు. తోచిన సహాయం చేస్తారు. నాకు మిమ్మల్ని పరిచయం చేసినందుకు ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ మీ కడచూపునకు నోచుకోలేకపోయాను. ఈనాటి ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను మీకు అంకితం ఇస్తున్నాను’’ అంటూ హైదరాబాదీ స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. చివరిగా ఒక్కసారైనా అజీం సర్‌ను కలవాలనుకున్నానని.. అయితే, అంతకంటే ముందే ఆయన శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నాలుగు వికెట్లతో మెరిసి ఐపీఎల్-2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ ఆర్సీబీ స్టార్.. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పంజాబ్ ఓపెనర్ అథర్వ టైడే(4), పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(2), హర్‌ప్రీత్ బ్రార్(13), నాథన్ ఎల్లిస్ (1)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అదే విధంగా హర్‌ప్రీత్ సింగ్ భాటియాను రనౌట్ చేశాడు. ఇలా మొహాలీ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు దక్కిన అవార్డును.. ఇటీవల మరణించిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీంకు అంకితమిచ్చాడు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కోచ్‌గా, సెలక్టర్‌గా 62 ఏళ్ల అబ్దుల్ అజీం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 80,90 దశకాల్లో హైదరాబాద్ జట్టు తరఫున మేటి ఓపెనర్‌గా ఎదిగిన ఆయన మొత్తంగా తన కెరీర్లో 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 4644 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఆటగాడిగా కెరీర్ ముగించిన తర్వాత అజీం హైదరాబాద్ కోచ్‌గా, సెలక్టర్‌గా పని చేశారు. చదవండి: సర్జరీ సక్సెస్... టీమిండియాకు గుడ్‌న్యూస్! మెగా టోర్నీకి అందుబాటులోకి! ఒకప్పుడు టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్! 𝘽𝙖𝙘𝙠 𝙩𝙤 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙬𝙖𝙮𝙨 😎@RCBTweets clinch a 24-run victory over #PBKS in Mohali 🙌🙌 Scorecard ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/RGFwXXz5eC — IndianPremierLeague (@IPL) April 20, 2023 Dear Azeem Sir, m going to alwz appreciate what you have done for me & many others like me. You were so generous, kind & helpful, cant thank god enough to make me meet you. Wish I had gotten one last chance to meet u but nevertheless I’d like to dedicate today’s POTM award to you pic.twitter.com/XIp08EnybF — Mohammed Siraj (@mdsirajofficial) April 20, 2023 -
హైదరాబాద్ రాత మారలేదంతే! ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘోర ఓటమి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Delhi: రంజీ ట్రోఫీ 2022-23ని హైదరాబాద్ క్రికెట్ జట్టు మరో ఓటమితో ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఢిల్లీ జట్టుతో ఉప్పల్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆట మూడో రోజు(గురువారం) ఓవర్‌నైట్ స్కోరు 223/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు ఆయుశ్ బదోని వీరోచిత సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసింది. అదరగొట్టిన ఆయుశ్ బదోని నిజానికి 277 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల్లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే ఆయుశ్ బదోని (191; 24 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణరీతిలో ఆడి భారీ సెంచరీ సాధించాడు. పదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (58; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆయుశ్ ఢిల్లీ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆయుశ్, హర్షిత్ తొమ్మిదో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ‘డబుల్ సెంచరీ’కి చేరువైన దశలో.. అనికేత్ రెడ్డి బౌలింగ్‌లో ఆయుశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దివిజ్ మెహ్రా (8 నాటౌట్)తో కలిసి హర్షిత్ చివరి వికెట్‌కు 34 పరుగులు జత చేశాడు. అజయ్‌దేవ్ గౌడ్ బౌలింగ్‌లో హర్షిత్ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 143 పరుగులిచ్చి 5 వికెట్లు, అజయ్‌దేవ్ గౌడ్ 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ భారీ స్కోరు ఈ నేపథ్యంలో 433 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి కేవలం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 124 వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా ఇక తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ రాయుడు.. రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో హైదరాబాద్ బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లలో తోల్కంటి గౌడ్ (21), ప్రణీత్ రాజ్ మాత్రమే (27) 20 పైగా పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్ హర్షిత్ రాణా ధాటికి బెంబేలెత్తి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 124 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. కాగా 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కూల్చి హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించిన హర్షిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరో ఢిల్లీ బౌలర్ దివిజ్ మెహ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్ హైదరాబాద్ కేవలం ఒక్క పాయింట్‌తో గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఎలైట్ లీగ్‌లోని నాలుగు గ్రూప్‌ల్లో కలిపి చివరి స్థానంలో నిలిచింది. కాగా ఎలైట్ గ్రూప్‌ల్లో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోతాయి. రంజీ ట్రోఫీ 2022-23 హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ స్కోర్లు హైదరాబాద్- 355 & 124 ఢిల్లీ- 433 & 47/1 చదవండి: Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
Ranji Trophy: 28 బంతుల్లోనే 78 పరుగులు సహా.. 8 వికెట్లు కూల్చి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Assam: రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో తొలి విజయం సాధించాలన్న హైదరాబాద్ ఆశలపై అస్సాం నీళ్లు చల్లింది. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 18 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీ వృథాగా పోయింది. రాణించిన బౌలర్లు! కాగా ఎలైట్ బీ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అస్సాం జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మంగళవారం టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రవితేజ(4/53), కార్తికేయ(3/43)కు తోడుగా అజయ్ దేవ్ గౌడ్, త్యాగరాజన్, భగత్ వర్మ ఒక్కో వికెట్‌తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అస్సాంను 205 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 60, తొమ్మిదో స్థానంలో వచ్చిన భగత్ వర్మ 46 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 208 పరుగుల వద్ద ముగించగలిగింది. తన్మయ్ ఒంటరి పోరాటం వృథా ఇక రెండో ఇన్నింగ్స్‌లో అస్సాం 252 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 61 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిన హైదరాబాద్.. శుక్రవారం కార్తికేయ అవుట్ కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జట్టును గెలిపించాలని తాపత్రయపడ్డ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (158 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 126 పరుగులు- నాటౌట్) ఒంటరి పోరాటం వృథాగా పోయింది. అదరగొట్టిన రియాన్ పరాగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించిన అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 88 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 28 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేయడం విశేషం. అంతేకాదు రియాన్.. ఏకంగా 8 వికెట్లు కూల్చడం గమనార్హం. కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అస్సాం గెలుపొందడంలో తన వంతు సాయం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రియాన్ ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌లో సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: Rishabh Pant Health: ప్లాస్టిక్ సర్జరీ?! పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమన్నారంటే.. Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. -
ఆర్యన్ అద్భుత శతకం.. హైదరాబాద్‌పై ఉత్తరప్రదేశ్ ఘన విజయం
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ బుద్ధి (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా...శివమ్ మావి 3, సౌరభ్ కుమార్ 2 వికెట్లు తీశారు. అనంతరం యూపీ 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగులు సాధించింది. ఆర్యన్ జుయాల్ (136 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) శతకం బాదగా...రింకూ సింగ్ (48 బంతుల్లో 78 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాధవ్ కౌశిక్ (92 బంతుల్లో 70; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రోహిత్ రాయుడుకే 3 వికెట్లు దక్కాయి. చదవండి: IND Vs NZ 1st T20: ఆగని వర్షం.. భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు