icc women cricket world cup 2022
-
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించారు. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మహిళా క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ రాచెల్ హేన్స్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మార్చి నెలకు గానూ వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో కరాచీ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్ ఆజమ్ రాణించాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 196 పరుగులు చేసి సత్తా చాటాడు. మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా(ఆసీస్ బ్యాటర్), అబ్దుల్లా షఫీక్ తర్వాతి స్థానంలో (టాప్-3 రన్ స్కోరర్) నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తంగా ఒక సెంచరీ, రెండు అర్ధ శతకాల సాయంతో 390 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమిన్స్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. The crowd cheers, the lion roars. @babarazam258 owns the day. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ndM0RNWPTG — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 రాచెల్ అద్బుతం! ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ రాచెల్ హేన్స్ పాత్ర కీలకం. మార్చి నెలలో ఆమె సాధంచిన మొత్తం పరుగుల సంఖ్య 429 పరుగులు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రాచెల్ చేసిన క్లాసీ సెంచరీ(130 పరుగులు) అన్నింటికంటే హైలైట్‌గా నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె మార్చి నెలకు గానూ ఆసీస్ స్టార్ అలిస్సా హేలీని, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్డ్‌లను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకున్నారు. నిలకడైన ఆట తీరుతో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఆ సమయంలో పూర్తి నిరాశలో కూరుకుపోయా'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్‌ను మరోసారి విజేతగా నిలుపుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. రోహిత్ శర్మను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇంటర్య్వూ చేసింది. కాగా ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు జెమిమా రోడ్రిగ్స్ టీమిండియా జట్టుకు ఎంపిక కాలేదు. తాను కచ్చితంగా జట్టులో ఉంటానని భావించిన రోడ్రిగ్స్‌కు భంగపాటే ఎదురైంది. ''నేను మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక కాలేదు. అది నన్ను బాధించింది. కానీ ఆ బాధ నాకంటే ముందు మీరు అనుభవించారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?'' అని రోడ్రిగ్స్ ప్రశ్నించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ''సరిగ్గా 11 ఏళ్ల క్రితం నాకు ఇలాగే జరిగింది. 2011 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నా. విషయం తెలియగానే నిరాశలో కూరుకుపోయాను. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న నేను ఎవరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయాను. కానీ అప్పుడు నా వయసు 23.. 24 ఏళ్లే అనుకుంటా. మంచి భవిష్యత్తు ముందున్న తరుణంలో ఇలా బాధపడితే ప్రయోజనం లేదని అనుకున్నా. వెంటనే 2015 వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాలకు సిద్దమయ్యా.'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Jemimah Jessica Rodrigues (@jemimahrodrigues) -
భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!
భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్-2022లో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్‌కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్‌కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్) -
అప్పుడు 75.. ఇప్పుడు 170 పరుగులు.. భర్త ఉంటే చాలు.. ‘తగ్గేదేలే..!’
మహిళల వన్డే ప్రపంచకప్-2022ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైన్లలో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి వరల్డ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 170 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టాండ్స్ నుంచి ఆమెను ఉత్సాహపరిస్తూ కనిపించాడు.ఈ మ్యాచ్‌లో ఆమె సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడూతూ స్టార్క్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా మిచెల్ స్టార్క్ హాజరై హీలీను ఉత్సాహపరిచాడు. ఆమె ఆ మ్యాచ్‌లో 75 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీతో పాటు రేచల్ హేన్స్ (68), మూనీ (62) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నతాలీ స్కీవర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ వికెట్లు,జెస్ జోనాస్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మెగాన్ షట్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో 170 పరుగలు, అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్లో 509 పరుగులు సాధించి అద్భుతంగా రాణించిన హీలీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వసంకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022 Final: వరల్డ్‌కప్ ఫైనల్‌కు రిఫరీగా ఆంధ్రప్రదేశ్ మహిళ
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- క్రైస్ట్‌చర్చ్‌లో ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి గతంలోనూ ఇలాంటి పాత్ర పోషించారు. 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్ లీగ్–2 మ్యాచ్‌లకు ఆమె మ్యాచ్ రిఫరీగా సేవలందించారు ఇక ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుకు రిఫరీగా సేవలు అందించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్-2022 ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్లుగా లారెన్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), థర్డ్ అంపైర్ (టీవీ)గా జాక్వెలిన్ (వెస్టిండీస్) వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో నలుగురు మహిళలు ఒకేసారి భిన్న బాధ్యతలు నిర్వర్తిస్తూ భాగం కావడం చరిత్రలో ఇదే తొలిసారి. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022: అదరగొట్టిన వ్యాట్.. 6 వికెట్లతో రాణించిన సోఫీ.. ఆసీస్‌తో పోరుకు సై
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 తుదిపోరుకు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ అర్హత సాధించింది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డా అవరోధాలు అధిగమించి ఫైనల్‌కు చేరుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి తుదిమెట్టుపై నిలిచింది. 137 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరకు సిద్ధమైంది. అదరగొట్టిన వ్యాట్.. రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రంమలో ఓపెనర్ టామీ బీమౌంట్(7) ఆదిలోనే అవుట్ కాగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ (19 బంతుల్లో ఒక పరుగు)సైతం ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 125 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 129 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. మరో బ్యాటర్ డంక్లే కూడా అర్ధ శతకం(50 పరుగులు)తో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ మహిళా జట్టు 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు లిజెలీ(2), లారా వొల్వార్డ్(0) పూర్తిగా నిరాశపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన లారా గుడాల్, కెప్టెన్ సునే లాస్ వరుసగా 28, 21 పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లు కాసేపు పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) వరుసగా వికెట్లు తీస్తూ చెలరేగిపోయారు. ముఖ్యంగా సోఫీ ఎక్లెస్టోన్ 8 ఓవర్లలో కేవలం 36 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ విజయం ఖారారైంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీకి ఆరు, అన్యాకు రెండు, కేట్ క్రాస్‌కు ఒకటి, చర్లోట్ డీన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక తన సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డానియెల్ వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 రెండో సెమీ ఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 293/8 (50) దక్షిణాఫ్రికా- 156 (38) చదవండి: IPL 2022: ప్చ్.. వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్‌లు చూస్తుంటే చిరాగ్గా ఉంది! నాకు ఛాన్స్ వస్తే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2022: అద్భుత సెంచరీతో మెరిసిన డానియెల్ వ్యాట్.. ఫైనల్లో ఇంగ్లండ్
Update: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 137 పరుగులతేడాతో విజయం సాధించింది. డేనియల్ వ్యాట్ అద్భుత ఇన్నింగ్స్‌తో తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ICC Women World Cup 2022 Eng Vs SA: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ డానియెల్ వ్యాట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. 125 బంతుల్లో 129 పరుగులు చేసి సత్తా చాటింది. క్రైస్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసింది. కాగా ప్రపంచకప్-2022 రెండో సైమీ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందులో భాగంగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఓపెనర్ టామీ బీమౌంట్(7) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ 19 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో డానియెల్ వ్యాట్ పట్టుదలగా నిలబడింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది రెండో వన్డే సెంచరీ కావడం విశేషం. ఇక వ్యాట్‌కు తోడు సోఫియా డంక్లే 60 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్‌కు మూడు, మరిజానే క్యాప్‌నకు రెండు, అయబోంగా ఖాకాకు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. చదవండి: RCB Vs KKR: ఒక్కసారి మైదానంలోకి దిగితే అంతే.. ఆ సెలబ్రేషన్స్ అందుకే: హసరంగ -
బ్యాట్‌తోనే అనుకుంటే.. స్టన్నింగ్ క్యాచ్తోనూ మెరిసింది
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ ఏడోసారి టైటిల్ గెలిచేందుకు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్ బ్యాటింగ్‌లో బెత్ మూనీ చివర్లో దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో మెరిసిన బెత్ మూనీ.. అనంతరం ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటింది. వర్షం అంతరాయంతో 45 ఓవర్లకు కుదించగా.. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఉమెన్స్‌కు ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ రషదా విలియమ్స్‌ను.. మేఘన్ స్కట్డకౌట్గా పెవిలియన్‌గా చేర్చింది. అయితే ఇక్కడ హైలైట్ అయింది మాత్రం బెత్ మూనీనే. విలియమ్స్.. కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడగా అక్కడే ఉన్న బెత్ మూనీ విల్లుగా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. చదవండి: అజేయ రికార్డును కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో ఫైనల్‌కు Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2022: వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో వరల్డ్‌కప్ ఫైనల్‌కు
ICC women World Cup 2021: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఓటమన్నదే ఎరుగని ఆసీస్.. సెమీస్‌లోనూ జయభేరి మోగించింది. అజేయ రికార్డును కొనసాగిస్తూ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే, వర్షం అంతరాయం కలిగించిన కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. 157 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 తొలి సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు ఆస్ట్రేలియా- 305/3 (45) వెస్టిండీస్- 148 (37) చదవండి: SRH Vs RR: 8 కోట్లు పెట్టి కొన్నది ఎనిమిదో స్థానంలో ఆడించడానికా? పూరన్‌పై మీకు నమ్మకం.. కానీ View this post on Instagram A post shared by ICC (@icc) -
Women World Cup 2022: సెమీస్ కూడా చేరలేదు.. హెడ్‌కోచ్ పదవికి రాజీనామా!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 టోర్నీలో న్యూజిలాండ్ వైఫల్యం నేపథ్యంలో ఆ జట్టు హెడ్‌కోచ్ బాబ్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైట్‌ఫెర్న్స్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించడంతో తన పదవికి రాజీనామా చేశారు. కాగా వుమెన్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్.. ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికే పరిమితమైంది. సోఫీ డివైన్ సారథ్యంలోని వైట్‌ఫెర్న్స్ సెమీస్ చేరకుండానే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్లో జట్టు పరాభవానికి బాధ్యత వహిస్తూ బాబ్ కార్టర్ తన హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఓటమి బాధించిందని, తను శిక్షణలో తమ జట్టు పలు విభాగాల్లో మెరుగైందని పేర్కొన్నారు. కాగా కార్టర్ ఇకపై న్యూజిలాండ్ క్రికెట్(పురుషులు, మహిళలు)కు హై పర్ఫామెన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా -
వెస్టిండీస్‌తో సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరగున్న తొలి సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ గాయం కారణంగా వెస్టిండీస్‌తో సెమీఫైనల్‌కు దూరమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన పెర్రీ ఇంకా కోలులేనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో వెన్ను నొప్పి కారణంగా మూడు ఓవర్లు వేసిన తర్వాత ఆమె మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లింది. ఈ క్రమంలో కీలకమైన సెమీఫైనల్‌కు పెర్రీ దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ వెల్లడించింది. "దురదృష్టవశాత్తూ పెర్రీ సేవలను సెమీఫైనల్లో కోల్పోతున్నాము. మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.ఆమె ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ప్రస్తుతం పెర్రీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. పెర్రీ స్థానంలో డెత్ బౌలర్‌ను జట్టులోకి తీసుకువస్తాం" అని లానింగ్ పేర్కింది. ఇక వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 29 న జరగనుంది. ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), రాచెల్ హేన్స్, మెగ్ లానింగ్ (కెప్టెన్) బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాస్సెన్ అలనా కింగ్, మేగాన్ స్కాట్, డార్సీ బ్రౌన్ చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! -
ఉత్కంఠభరితమైన దృశ్యాలు..ఊహకందని భావోద్వేగాలు!
-
అరుదైన దృశ్యాలు.. ఊహకందని భావోద్వేగాలు!
అందరి జీవితాల్లోనూ కొన్ని అపురూప క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని తడిమి చూసుకున్నప్పుల్లా ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాం. ఆటల్లోనూ ఇలాంటి అరుదైన క్షణాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రతిస్పందనగా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటాం. ముఖ్యంగా గెలుపోటములను నిర్ణయించే సమయంలో క్రీడాకారులతో ప్రేక్షకులు కూడా ఒత్తిడి, ఉత్కంఠ, ఆందోళన చెందుతుంటారు. ఆట చివరి క్షణాల్లోని నాటకీయతను మునివేళ్లపై నిల్చుకుని వీక్షిస్తుంటారు ఫ్యాన్స్. ఫలితాలకు అనుగుణంగా ఆనందం, నిరాశ, నిస్పృహ లాంటి భావావేశాలను ప్రకటిస్తుంటారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఎంతో పోటీ ఉంటుందో క్రీడాభిమానులందరికీ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా అలాంటి సందర్భమే ఈసారి ఎదురయింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి భారత జట్టు భారంగా నిష్ర్కమించింది. తుది అంకానికి చేరువయ్యేందుకు చివరి బంతి వరకు పడతులు పోరు సాగించినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే గెలుపు కోసం ఇరు జట్ల క్రీడాకారిణులు సాగించిన సమరం స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మార్చి 27న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీరాజ్ బృందం పోరాడి ఓడింది. చివరి బంతికి ఫలితం వచ్చిన ఈ మ్యాచ్‌లో అఖరి క్షణాలను ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా చూశారు. తమ జాతకం భారత్ టీమ్ చేతిలో ఉండడంతో వెస్టిండీస్ క్రీడాకారిణులు మరింత ఉత్కంఠగా మ్యాచ్‌ను వీక్షించారు. మిథాలీరాజ్ బృందం ఓడిన క్షణంలో డ్రెసింగ్స్లో రూమ్‌లో విండీస్ క్రీడాకారిణుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. (క్లిక్: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!) ఓడిపోయామనుకున్న మ్యాచ్‌లో గెలిచినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. విజయం సాధించేశామన్న సంతోషంతో భారత బృందం ప్రదర్శించిన ఆనంద క్షణాలు.. నోబాల్ నిర్వేదం, ఓటమి బాధతో నిర్వేద వదనంతో నిష్క్రమించిన క్షణాలు, కామెంటేటర్లు మాటలు మర్చిపోయి అవాక్కయిన దృశ్యాలు.. ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి. కెమెరాలో నిక్షిప్తమైన ఈ అరుదైన దృశ్యాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన అధికారిక ట్విటర్లో పేజీ షేర్ చేసింది. జయాపజయాలను పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రదర్శించిన పోరాట పటిమ అందరి మనసులను గెలిచింది. (క్లిక్: భారత్ కొంపముంచిన నోబాల్..) -
ఓటమిని తట్టుకోవడం కష్టమే.. అయితే: విరాట్ కోహ్లి ట్వీట్ వైరల్
Virat Kohli Message: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్తాన్ చేతిలో కనీవినీ ఎరుగని ఓటమి.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణ.. అప్పటి టీమిండయా సారథి విరాట్ కోహ్లికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. తాజాగా ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. మెగా ఈవెంట్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పట్టుదలగా పోరాడినా ఫలితం లేకపోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన వృథాగా మిగిలిపోవడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. అయితే, గెలుపు కోసం వారు పోరాడిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సైతం మిథాలీ సేనకు మద్దతుగా నిలిచాడు. ఈ మేరకు.. ‘‘గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. కానీ అలా జరుగలేదు. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం అమితంగా బాధిస్తుంది. అయినా, మీరు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. ఓటమిని తట్టుకోవడం కష్టమేనని , అయితే గెలిచేందుకు చివరి వరకు పోరాడటం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(88), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (41 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్ ఆడినా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. A spectacular run-chase by @PunjabKingsIPL in a high-scoring thriller sums up a Super Sunday 😍#TATAIPL #PBKSvRCB pic.twitter.com/7x90qu4YjI — IndianPremierLeague (@IPL) March 27, 2022 చదవండి: IPL 2022 MI Vs DC: 6,1,6,4,1,6.. ముంబై చేసిన అతి పెద్ద తప్పిదం అదే.. అందుకే ఓడిపోయింది! Always tough to bow out of a tournament you aim to win but our women's team can hold their heads high. You gave it your all and we are proud of you. 🙏🏻🇮🇳 — Virat Kohli (@imVkohli) March 28, 2022 -
World Cup 2022: ‘హమ్మయ్య భారత్ ఓడిపోయింది’.. వెస్టిండీస్ సంబరాలు.. వైరల్
ICC Women World Cup 2022: తెలిసో తెలియకో ఒకరికి ఎదురైన పరాభవం మరొకరి పాలిట వరమవుతుంది. ఒకరి బాధ పరోక్షంగా మరొకరి సంతోషానికి కారణం అవుతుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ భారత్, వెస్టిండీస్ జట్లకు ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. మెగా ఈవెంట్ సెమీ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆఖరి నిమిషంలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రిక్త హస్తాలతోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నో బాల్ రూపంలో దురదృష్టం వెంటాడంతో మిథాలీ సేనకు భంగపాటు తప్పలేదు. దీంతో భారత జట్టు బాధతో వెనుదిరగగా.. వెస్టిండీస్ మాత్రం సంబరాలు చేసుకుంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన దక్షిణాఫ్రికా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. మిథాలీ సేన ఓటమి పాలు కావడంతో ఎగిరి గంతేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో విండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4 అంటే సెమీస్ చేరే క్రమంలో ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌తో, భారత్ దక్షిణాఫ్రికాతో తలపడ్డాయి. ఆదివారం నాటి ఈ రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ విజయం సాధించి సెమీస్ చేరగా.. భారత్ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్ సెమీ ఫైనల్లో నిలిచింది. ఇదే వారి ఆనందానికి కారణమైంది. ఈ క్రమంలో వారి సంబరాలు అంబరాన్నంటాయి. హమ్మయ్య భారత్ ఓడిపోయిందన్నట్లుగా వారు సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అంతా నువ్వే చేశావు.. కానీ ఎందుకిలా? మా గుండె పగిలింది!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్ టోర్నీ-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత 48 పరుగులు చేసి మిథాలీ సేన భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆమె.. ‘బౌలర్’గానూ అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి బౌలింగ్ వేసిన హర్మన్.. రెండు వికెట్లు తీసింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేకాదు.. దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతున్న వేళ ఓపెనర్ లిజెలీ లీని రనౌట్ రూపంలో వెనక్కి పంపి భారత్‌కు శుభారంభం అందించింది. అదే విధంగా మరో రెండు రనౌట్లలోనూ భాగమైంది. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఇలా శాయశక్తులా కృషి చేసింది. కానీ సానుకూల ఫలితం రాలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ.. దక్షిణాఫ్రికా ఆఖరి బంతికి విజయం సాధించి మిథాలీ సేన సెమీస్ చేరకుండా అడ్డుకుంది. దీంతో హర్మన్ ‘హీరోచిత’ పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో హర్మన్ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) భారత్ కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ తీసినపుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగిన దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘నీ ఆట తీరు పట్ల మాకెంతో గర్వంగా ఉంది. ఆఖరి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగావు. అంతా నువ్వే చేశావు. కానీ దురదృష్టం వెంటాడింది. ఏదేమైనా ఆట పట్ల నీకున్న అంకితభావం అమోఘం. మరేం పర్లేదు హర్మన్.. ఓడినా మీరు మా మనసులు గెలిచారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలై భారత్ వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. After that wicket, Harman was in tears and was consoled by Smriti. This is what it meant to her.#CWC22 #CricketTwitter pic.twitter.com/rrKJxRRGew — Krithika (@krithika0808) March 27, 2022 -
World Cup 2022: భారత్ కొంపముంచిన నోబాల్.. లక్కీగా వెస్టిండీస్ సెమీస్‌లోకి!
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్ ప్రయాణం ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ సేన 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో గత వరల్డ్‌కప్ రన్నరప్ భారత మహిళా జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 274 పరుగుల భారీ స్కోరు చేసినా దురదృష్టం వెంటాడింది. ఇక ఆదిలో దక్షిణాఫ్రికా వికెట్ తీసిన ఆనందం అంతలోనే ఆవిరైపోగా.. 26వ ఓవర్ తర్వాత వికెట్లు పడటం ఊరటనిచ్చింది. ముఖ్యంగా 48 పరుగులతో రాణించిన భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతితోనూ అద్భుతం చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మొత్తంగా 8 ఓవర్లు బౌలింగ్ వేసిన హర్మన్ 2 వికెట్లు కూల్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేగాక మూడు రనౌట్లలో భాగమైంది. ఆమె అద్భుత ప్రదర్శనతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, చివర్లో దీప్తి శర్మ నోబాల్ భారత్ కొంపముంచింది. ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నన్ డు ప్రీజ్ సింగిల్ తీసి మిథాలీ సేన సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి వెస్టిండీస్‌కు వరంగా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా అంతకు ముందు గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ గెలుపొంది సెమీస్ చేరింది. విండీస్‌ను వెనక్కినెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన కారణంగా టాప్-4లోకి చేరలేకపోయింది. దీంతో మిథాలీ సేన సెమీస్ నుంచి నిష్క్రమించగా.. విండీస్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో వెస్టిండీస్ జట్టులో ఆనందాలు వెల్లివిరిశాయి. చదవండి: IPL 2022: శ్రేయస్ కెప్టెన్సీ భేష్.. అతడిని తుదిజట్టులోకి తీసుకోవడం తెలివైన నిర్ణయం: టీమిండియా మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్‌కప్: ఆఖరి వరకు పోరాడి ఓడిన మిథాలీ సేన(ఫొటోలు)
-
World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. తప్పని ఓటమి.. టోర్నీ నుంచి భారత్ అవుట్
ICC Women World Cup 2022 Ind W Vs Sa W: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్‌కు భంగపాటు తప్పలేదు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేనకు నిరాశే ఎదురైంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం దక్షిణాఫ్రికానే వరించింది. మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో భారత మహిళా జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి వరకు పోరాడిన మిథాలీ సేన పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి శుభారంభం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్ మిథాలీ రాజ్(68), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మెరుగైన స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్ రెండు, అయబోంగా ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్ రెండు వికెట్లు పడగొట్టారు. నరాలు తెగే ఉత్కంఠ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెలీ లీను హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ చేయడంతో భారత్‌కు మంచి బ్రేక్ వచ్చింది. కానీ మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ 80 పరుగులు సాధించి పటిష్ట పునాది వేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారా గుడాల్ సైతం 49 పరుగులు సాధించగా.. కీలక సమయంలో మిగ్నన్డు ప్రీజ్ 52 పరుగులతో రాణించి అజేయంగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆఖరికి మరోవైపు.. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో తొలిసారి బౌలింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్లు తీస్తూ.. రనౌట్లలో భాగం కావడం ముచ్చటగొలిపింది. హర్మన్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు భారత్ పోరాడగలిగింది. అయితే, 49.5వ ఓవర్లో దీప్తి శర్మ నోబాల్ వేయడంతో భారత్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతికి డు ప్రీజ్ సింగిల్ తీయడంతో భారత్ పరాజయం ఖరారైంది. దీంతో టోర్నీ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) స్కోర్లు: ఇండియా- 274/7 (50) దక్షిణాఫ్రికా- 275/7 (50) View this post on Instagram A post shared by ICC (@icc) -
డివిలియర్స్‌ను గుర్తు చేస్తూ.. అద్భుతమైన షాట్ ఆడిన భారత ఓపెనర్!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న కీలక మ్యాచ్‌లో భారత యువ సంచలనం షఫాలీ వర్మ అదరగగొట్టింది. 46 బంతుల్లో 53 పరుగులు చేసిన షఫాలీ వర్మ భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ అద్భుతమైన షాట్లుతో అలరించింది. కాగా ఈ మ్యాచ్‌లో షఫాలీ... దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్‌ను తలపించేలా స్కూప్ షాట్ ఆడింది. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇస్మాయిల్ బౌలింగ్‌లో.. షఫాలీ వికెట్లు విడిచి పెట్టి ఆఫ్ సైడ్ వచ్చి అద్భుతమైన స్కూప్ షాట్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), షఫాలీవర్మ(53) కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్‌కౌర్ (48) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయబోంగా ఖాకా,ట్రాయన్ ఒక్కో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2022 Ind W Vs SA W: కీలక మ్యాచ్.. అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం. View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి.. సెమీస్ చేరిన ఇంగ్లండ్.. ఇక భారత్!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీస్ చేరిన మూడో జట్టుగా హీథర్‌నైట్ బృందం నిలిచింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆదిలోనే డానియెల్ వ్యాట్(6) వికెట్ కోల్పోయినప్పటికీ... ఓపెనర్ బీమౌంట్ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ సైతం 6 పరుగులకే నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటర్ నటాలీ సీవర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 40 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) మరోవైపు వికెట్ కీపర్ అమీ జోన్స్ ఆమెకు అండగా నిలబడింది. ఇక 72 బంతుల్లో 67 పరుగులు సాధించిన సోఫియా డంక్లే ఇంగ్లండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో బ్రంట్ 24, ఎక్లెస్‌స్టోన్ 17 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు షమీమా సుల్తానా, షర్మిన్ అక్తర్ చెరో 23 పరుగులు సాధించి శుభారంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే మిడిలార్డర్ దీనిని కొనసాగించలేకపోయింది. దీంతో 48 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి బంగ్లా జట్టు ఆలౌట్ అయింది. దీంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. సరిగ్గా వంద పరుగుల తేడాతో హీథర్‌నైట్ బృందం గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే ఇంగ్లండ్‌తో పాటు టాప్-4లో నిలుస్తుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప- 2022 ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 234/6 (50) బంగ్లాదేశ్- 134 (48) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం..
Update: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో మిథాలీ సేన ప్రయాణం ముగిసింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన భారీ స్కోరు సాధించింది. కాగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(68) సైతం అర్ధ సెంచరీతో మెరిసింది. ఇక , వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్‌కు రెండు, అయబోంగా ఖాకు ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
India Vs South Africa: ఉత్కంఠ భరిత పోరులో భారత్ ఓటమి.. వరల్డ్‌కప్ నుంచి ఔట్
-
ఓటమితో ముగించిన పాకిస్తాన్.. కేవలం ఒక్క మ్యాచ్‌లో!
మహిళల వన్డే ప్రపంచకప్‌ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 71 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్ బ్యాటర్లలో నిదా ధార్(50), బిస్మా మరూఫ్(38) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక న్యూజిలాండ్ బౌలర్ హన్నా రోవ్ ఐదు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను దెబ్బతీసింది. అదేవిధంగా ఫ్రాన్సిస్ మాకే రెండు వికెట్లు, రోజ్మేరీ మెయిర్, కేర్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో బేట్స్ 126 పరుగులతో రాణించింది. పాకిస్తాన్ బౌలర్లలో నిదా ధార్ మూడు వికెట్లు, ఫాతిమా, ఆమీన్ చెరో వికెట్ సాధించారు. కాగా ప్రపంచకప్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఒకే ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్ కూడా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL 2022: తొలి సమరానికి సై.. చెన్నైపై కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా! -
World Cup 2022: వర్షం పడితేనే.. కానీ అలా జరుగలేదు..
Update: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 నుంచి మిథాలీ సేన సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు మరో రెండు స్ధానాల కోసం పోటీ పడుతున్నాయి. సోమవారం(మార్చి 28) క్రైస్ట్‌చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు చావోరేవో తేల్చుకోనుంది. మరోవైపు ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఆదివారం(మార్చి 27) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం లాంఛనమే అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును బంగ్లాదేశ్ వంటి పసి కూన ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి దక్షిణాఫ్రికాపై భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఓటమి చెందితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఎందుకంటే 7 పాయింట్లతో వెస్టిండీస్ సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. మరోవైపు రానున్న మూడు రోజులు పాటు క్రైస్ట్‌చర్చ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. ఒక వేళ దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లుకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో భారత్ జట్టు 7 పాయింట్లతో విండీస్‌తో సమంగా నిలుస్తుంది. అయితే వెస్టిండీస్(-0.890) రన్‌రేట్ కంటే భారత్(+0.768) మెరుగ్గా ఉంది. దీంతో భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. భారత్ 6 పాయింట్లతో ఐదో స్ధానంలో ఉంది. మరోవైపు శుక్రవారం(మార్చి 25)న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి అజేయ రికార్డును కొనసాగించి అగ్ర స్థానాన్ని పదిలం చేసుకుంది. చదవండి: World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఆసీస్.. ఏడింటికి ఏడు గెలిచి.. అజేయ రికార్డుతో