Ice Cream
-
బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారెవరుంటారు. అయితే ఇప్పుడు వాటిలో రకరకాల ప్లేవర్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని టేస్ట్ బానే ఉన్నా చాలావరకు అంత బాగోవు. పండ్లు నుంచి స్వీట్స్‌తో తయారు చేసే ఎన్నో ఐస్‌క్రీంలు చూశాం కానీ ఇలాంటి ప్లేవర్డ్ ఐస్‌క్రీం మాత్రం చూసుండరు. అదికూడా అందరూ ఇష్టపడే బిర్యానీతో ఐస్‌క్రీం అంటే బాబోయ్ అనిపిస్తుంది కదూ..!. ఎలా ఉంటుందనే కదా డౌటు..?ఆకాశ్ మెహతా అనే సోషల్ మీడియా ఔత్సాహికుడు నెట్టింట ఒక రీల్ పోస్ట్ చేశాడు. అందుకోసం అని ఓ దుబాయ మాల్లోని ఐస్‌క్రీం స్టాల్లో వివిధ ఫ్లేవర్డ్ల ఐస్క్రీంలను ట్రై చేశాడు. ఆ దుకాణంలోని మెనూలో తనకు నచ్చిన కొన్ని ఐస్‌క్రీంలు సెలక్ట్ చేసుకున్నాడు. వాటి పేర్లు వరుసగా కెచప్, చిప్స్, బిర్యానీ, ఆలివ్ ఆయిల్, చాయ్ వంటి ఫ్లేవర్డ్ ఐస్‌క్రీంలు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ట్రై చేసి చూస్తున్నాడు. ముందుగా కెచప్ రుచి చూడగా..ఎలా ఉందనేది చెప్పలేను అని అన్నాడు. ఇక బిర్యానీ ప్లేవర్ చూడగానే ఈ ఐస్‌క్రీం కచ్చితంగా హిట్ అవుతుందని కితాబు ఇచ్చేశాడు. ఇక ఆలివ్ అద్భుతం అని, చిప్స్ ఆశ్చర్యపరిచేలా ఉందని, చాయ్ ఐస్‌క్రీం మాత్రం తనకిష్టమైన ఫ్లేవర్ అంటూ ఆ ఐస్క్రీంల రుచుల గురించి చెప్పుకొచ్చాడు. కానీ నెటిజన్లుమాత్రం ఇవేం ఐస్‌క్రీం ఫ్లేవర్డ్లు అని ఆకాశ్ పోస్ట్‌కి కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a)(చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!
నిజ జీవితంలో బరువు తగ్గి చూపించిన వ్యక్తుల స్టోరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబ్బా ఎంతలా అంకుంఠిత దీక్షతో బరువు తగ్గారు అనే ఫీల్ వస్తుంది. గ్రేట్ అనిపిస్తుంది కూడా. బరువు తగ్గాలనేకునే వాళ్లు ముఖ్యంగా డైట్లో షుగర్‌కి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు తగ్గాడు. అదెలా అనే కదా..!. అలా ఎలా సాధ్యమయ్యింది? నిజంగానే ఐస్‌క్రీం తింటూనే బరువు తగ్గాడా అంటే..?.ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైటింగ్ స్లైల్ ఉంటుంది. ఇక్కడ మిట్ సునాయ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరిలో తాను అధిక బరువు ఉన్నట్ల గుర్తించినట్లు తెలిపాడు. అలాగే వైద్యపరీక్షల్లో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయని తెలియడంతో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకోసం సరైన జీవనశైలిని పాటిచడం తోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పాడు. రెగ్యులర్‌గా వ్యాయామం, అన్ని రకాల పదార్థాలను మితంగా తీసుకునేలా మనసును సిద్ధం చేసుకుని డైట్ ప్రారంభించినట్లు తెలిపాడు. అయితే తన బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడింది నడక అని చెబుతున్నాడు. తాను రోజూ పదివేల అడుగులు వేసేలా చూసుకునే వాడట. అలా అన్ని స్టెప్లు నడిస్తేనే.. ఐస్‌క్రీం తినాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నట్లు వివరించారు. అలా అందుకోసమైన ఏ రోజు స్కిప్ చేయకుండా చేయగలిగానని చెబుతున్నాడు సునాయ్. ఆ విధంగా దాదాపు 150 రోజుల్లో అంటే.. ఐదు నెలల్లో సుమారు 16 కిలోలు పైనే బరువు తగ్గగలిగానంటూ తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే డైట్లో ముఖ్యంగా తాను ఇష్టపడే దాల్, రోటీ, అన్నం, పండ్లు, పిజ్జా, పాస్తా, పనీర్ కర్రీ, పనీర్ టిక్కా, శాండ్విచ్లు, స్మూతీస్ వంటివి అన్ని మితంగా తీసుకునేవాడనని అన్నాడు. ఇక్కడ మనకిష్టమైన ఫుడ్‌ని దూరం చేయకుండానే అవి తింటునే వర్కౌట్లతో కెలరీలు తగ్గించుకుంటూ బరువు తగ్గొచ్చని చెబుతున్నాడు మిట్ సినాయ్. బరువు తగ్గడం అంటే నోరు కట్టేసుకోవాల్సిందే అని భయపడే వాళ్లకు సునాయ్ వెయిట్ లాస్ స్టోరీ ఓ ఉదహరణ.(చదవండి: కాస్మటిక్స్తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఇలా..!) -
విస్కీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు
-
Hyderabad: డెలీషియస్ గోల్డ్ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్క్రీంను ఆరగించేయడమే. -
Rajni Bector: ఓ విజేత ప్రస్థానం
రజనీ బెక్టార్... సమైక్య భారతంలోని కరాచీ నగరంలో 1940లో పుట్టారామె. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమెకు ఏడేళ్లు నిండేలోపే దేశవిభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకుందామె. కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ఆమె జీవితంలో కీలకమైన ఘట్టాలు జరిగాయి. గానీ అప్పటికి ఆమె వయసు పదిహేడే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ అసంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. లూథియానాలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయయాత్రను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారామె.ఓ కొత్త ప్రపంచం ‘‘నేను లూథియానాకి వచ్చేనాటికి అది చాలా చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి వచ్చిన నాకు లూథియానాను పట్టణం అనడానికి కూడా మనసొప్పేది కాదు. పట్టణం మొత్తానికి నాలుగు కార్లుండేవి అంతే. మా అత్తగారింటివాళ్లు ఛాందసులు. మా పుట్టింట్లో అమ్మ వైపు, నాన్న వైపు వాళ్లందరూ ఉన్నత విద్యావంతులు, విశాల దృక్పథం కలిగిన వాళ్లు. అత్తగారిల్లు– పుట్టిల్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. దాంతో నేను కొత్త మనుషుల మధ్యకు మాత్రమే కాదు, ఏకంగా కొత్త ప్రపంచంలోకి వచ్చి పడ్డాననే చెప్పాలి. వంటతో స్నేహంనాకు రకరకాలు వండడం, కొత్త వంటలను ప్రయత్నించడం హాబీ. ఆ హాబీయే నాకు పెద్ద ఆలంబన అయింది. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించడం వారికి చేసి పెట్టడం, వారు ప్రశంసిస్తుంటే పొంగిపోవడమే జీవితంగా మారిపోయాను. హీరో మోటార్ కార్పొరేషన్‌కు చెందిన బ్రిజ్మోహన్ ముంజాల్, ఎవన్ సైకిల్స్ కంపెనీకి చెందిన పహ్వాస్లు ‘లూథియానా ప్రజలకు మంచి వంటలను రుచి చూపిస్తున్నావ్’ అన్నారు. అప్పటి ఎమ్ఎల్ఏ ఒకరు తన మనుమరాలి పెళ్లికి కేటరింగ్ చేసి పెట్టమని అడిగారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. స్థాణువులా ఉండిపోయాను. ఎలాగో ధైర్యం చేసి అంగీకారంగా తలూపాను. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో రెండు వేల మందికి వంటలు చేయించాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా నాకు కబురు వచ్చేది. అయితే అవేవీ కమర్షియల్ సర్వీస్‌లు కాదు, స్నేహపూర్వక సర్వీస్లే. కొంతకాలానికి ఇంట్లోనే కుకరీ క్లాసులు మొదలు పెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇంట్లో మగవాళ్లు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు, నువ్వు క్లాసులు చెప్పి సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కోప్పడ్డారు. మా వారు నాకు మద్దతుగా నిలవడంతో ఆ పెనుతుఫాను సమసిపోయింది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జైన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సలహాతో అందులో ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, బేకరీ కోర్సులో చేరాను. పిల్లలు కొంచెం పెద్దయి బోర్డింగ్ స్కూల్‌కెళ్లిన తర్వాత నేను కాలేజ్‌లో చేరడంతో ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. పెళ్లి కారణంగా చదువాపేసినప్పటి నుంచి మనసులో దాగి ఉన్న దిగులు ఒక్కసారిగా ఎగిరిపోయింది. కోర్సు పూర్తి కాగానే మా వారిచ్చిన ఇరవై వేలతో 1978లో క్రిమికా ఐస్‌క్రీమ్ యూనిట్ ప్రారంభించాను. ‘క్రీమ్ కా’ అనే అర్థంలో పెట్టానా పేరు. లూథియానాలో క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాల్ పక్కన నేను స్టాల్ తెరిచాను కాని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను కాదని మా యూనిట్‌కి ఎవరైనా వస్తారా అనే భయం చాలా రోజులు వెంటాడింది. అయితే నేను స్టాల్లో కూర్చోవడం లూథియానాలో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇంట్లో మగ్గిపోకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్లందరూ తమ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి నన్ను మోడల్‌గా చూపించేవారు. నా ఐస్‌క్రీమ్‌కి కూడా ఆదరణ పెరగసాగింది.ఐస్‌క్రీమ్‌తో మొదలు బిస్కట్ వరకు క్వాలిటీని కాదని మా స్టాల్‌కి రావాలంటే వాళ్లకంటే ఎక్కువగా చేయాలి. ఐస్‌క్రీమ్‌తోపాటు బ్రెడ్, బిస్కట్ వంటి బేకరీ ఫుడ్ చేయడం మొదలు పెట్టాను. మా స్టాల్‌ను విస్తరించి జీటీ రోడ్లోకి మార్చాం. అంతా గాడిలో పడిందనుకునే సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. అనంతరం దేశం మొత్తాన్ని కుదిపేసిన దుర్ఘటన ఇందిరాగాంధీ హత్య జరిగింది. అప్పటికి వందేళ్ల నుంచి మా కుటుంబం చేస్తున్న ధాన్యం, ఎరువుల వ్యాపారం స్తంభించిపోయింది. రైతులతో సంబంధాలు తెగిపోయాయి. బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా పెద్దబ్బాయి మీద అపహరణ ప్రయత్నం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే.. 1990 నుంచి నా ఫుడ్ బిజినెస్సే ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టింది. ఇంట్లో అందరమూ క్రిమికా కోసమే పని చేయడం మొదలుపెట్టాం. పదహారు గంటల పని ఇప్పుడు క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్బడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీ చెక్‌లో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తేనే విజయం మనదవుతుంది. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. జీవితాన్ని వెతుక్కున్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురస్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది’’ అన్నారు రజనీ బెక్టార్. మెక్‌డీ బర్గర్లో మా బన్నుమెక్ డొనాల్డ్ ఫుడ్ చైన్ మనదేశంలో అడుగుపెట్టింది. వాళ్లకు అవసరమైన బన్ కోసం బేకరీలన్నింటినీ సందర్శించారు. మా బేకరీని ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి కావల్సిన నియమాలు, పరిమితులకు లోబడి తయారు చేసి ఇవ్వడానికి ఒక ఏడాదిపాటు ఎక్సర్సైజ్ చేశాం. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్ వారి ఆమోదం పొందింది. మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇక మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అవసరమైన సాస్ ΄్లాంట్ కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. మా మనుమడు ఢిల్లీ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. -
ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్‌క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్‌క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. -
ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఆరోగ్యం మటాష్
సాక్షి, అమరావతి: ప్రాసెస్డ్, అల్డా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురి పెద్దల్లో ఒకరు, ప్రతి 8మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనపరులుగా మారుస్తోంది. ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్, రెడీ మీల్స్ (రెడీ టు ఈట్), ప్రాసెస్ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అడిక్షన్’ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్ ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. మద్యంతో సమానం ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కాహాల్ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్‌లో ఎక్స్ట్రా సెల్యులర్ డోపమైన్‌ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్టు తేల్చారు. తద్వారా తీవ్రమైన కోరికలు, స్థూలకాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక–మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. యూకే, యూఎస్‌లలో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణ కోసం ఏడాదికి 7 ట్రిలియన్ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థూలకాయం, నాన్–కమ్యూనికేబుల్ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాలలో గణనీయంగా పెరిగాయి. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులతోపాటు స్త్రీ, పురుషుల ఉద్యోగాలు, ప్రయాణ సమయాలు పెరగడంతో కొన్ని దేశాల్లో అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రాసెస్ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, నూడుల్స్, కృత్రిమ స్వీటెనర్లతో కార్డియో వాసు్కలర్, కార్డియో మెటబోలిక్ కోమోర్చిడిటీలు 9శాతం పెరుగుతోంది. అయితే రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని నివేదించింది. పౌష్టికాహార భద్రత లోపం ఇప్పటికే ఆసియా, లాటిన్ అమెరికాల్లో అత్యంత ప్రాసెస్‌తోపాటు సహా ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. ఇది ఆఫ్రికాకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కోవిడ్–19కి ముందు స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా పౌష్టికాహార లోపం భయపెడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 29.6 శాతం మంది (240 కోట్ల మంది ప్రజలు) 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 90 కోట్ల మంది (11.3 శాతం మంది) ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. ఇక 2030లో దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన చెందుతోంది. తొమ్మిది దక్షిణాసియా దేశాలలో పోషకాహార లోపం (24 కోట్ల మంది)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారత్‌లో పోషకాహార లోపం 2004–06లో 21.4 శాతం నుంచి 2020–22 నాటికి 16.6కి తగ్గింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడికక్కడ లభిస్తున్నాయి. నగరం/పట్టణం నుంచి 1–2 గంటలు, అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న గ్రామాల్లోనూ ఈ ఆహార విధానం వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
సంక్షోభంలో అవకాశాల్ని ఎలా సృష్టించుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లేదు. రోజూ వారి నిత్యం మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశంలోనూ ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. సరైన సమయంలో దాన్ని ఒడిసిపట్టుకుంటే అవకాశాలు అనంతం. చేతిలో డిగ్రీ లేదు. జేబులో చిల్లిగవ్వలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో నాడు 14ఏళ్ల వయస్సులో రైలెక్కి మంగళూరు నుంచి ముంబైకి వెళ్లిన రఘునందన్ కామత్ నేడు ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. ఎవరీ రఘునందన్ కామత్. మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలోగత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళూరులోని ఓ కుగ్రామంలో మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన కామత్.. నేడు రూ.400 కోట్ల విలువైన నేచురల్స్ అనే ఐస్ క్రీం కంపెనీ అధిపతిగా పేరు గడించారు. ఆయన ప్రయాణం ఎలా సాగింది?శ్రమ నీ అయుధం అయితే ఐస్ క్రీం మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించిన రఘునందన్ శ్రీనివాస్ కామత్ చిన్న నాటి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మామిడి పండ్ల వ్యాపారం చేసే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. చెట్టు మీద మామిడి పండ్లను కోయడం దగ్గర నుంచి అమ్మడం వరకు తెలుసుకున్నారు. అయితే, మామిడి పండ్ల వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్న కామత్‌కు బుర్ర నిండా ఆలోచనలే. శ్రమ నీ అయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నమ్మే ఆయనకు ఐస్‌క్రీం బిజినెస్ చేయాలని కోరిక ఆ వయస్సులో బలంగా నాటుకుంది.రైలు ఎక్కి ముంబైకిఐస్క్రీం బిజినెస్ అంటే కృత్తిమ ఫ్లేవర్లు, లేదంటే పాలు, షుగర్,ఐస్‌తో చేయడం కాకుండా రకరకాల పండ్లతో ఐస్‌క్రీం తయారు చేసే వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా 1984లో మంగళూరు నుండి రైలు ఎక్కి ముంబైకి పయనమయ్యారు. అక్కడే ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లారు. అదే రెస్టారెంట్లో కామత్ పనికి కుదిరారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారలో మెళుకువలు నేర్చుకున్నారు.ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటేమామిడి, అరటి పండు, పుచ్చకాయ ఇలా రకరకాల పండ్లతో ఐస్‌క్రీమ్‌లను ఎందుకు తయారు చేయకూడదు? అలా తయారు చేస్తే కస్టమర్లకు నచ్చుతుందో? లేదో? ఇలా రకరకలా ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటే.. ఉండబట్టలేక పావు బాజీ ప్రధాన వంటకంగా, మరోవైపు పండ్లతో ఐస్‌క్రీమ్‌లను అమ్మడం ప్రారంభించారు. 12 రుచులతోఅలా రఘునందన్ శ్రీనివాస్ కామత్ ముంబై జుహు అనే ప్రాంతంలో తన తొలి ఐస్ క్రీమ్ పార్లర్‌ను కేవలం ఆరుగురు సిబ్బందితో, 12 రుచులతో ప్రారంభించాడు. అప్పట్లో, దీనిని తరచుగా కస్టమర్లు ఐస్ క్రీమ్ ఆఫ్ జుహు స్కీమ్ అని పిలిచేవారు.మూడు పువ్వులు ఆరు కాయలుగారోజులు గడుస్తున్నాయి. వ్యాపారం జోరందుకు. కామత్ ఐస్‌క్రీమ్‌కి మౌత్ పబ్లిసిటీ ఎక్కువైంది. 37ఏళ్లలో ఇంతింతై వటుడింతై అన్న చందగా ప్రస్తుతం, నేచురల్స్ ఐస్ క్రీమ్ 15 నగరాల్లో 165కి పైగా అవుట్లెట్లతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. -
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత
దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్ పుట్టింది. -
ఓటర్లకు అల్పాహారం, ఐస్‌క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్‌లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్‌లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. -
ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్
ఐస్‌క్రీమ్‌లలో షుగర్ ఎంత ఉంటుందో తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవారు వాటిని అస్సలు దగ్గరకు రానియ్యరు. అయితే దీపిక పదుకొనే ఫిట్నెస్ ట్రైయినర్ మాత్రం ఐస్‌క్రీమ్‌లను ఆస్వాదిస్తూ బరువు తగ్గొచ్చని చెబుతోంది. అందుకోసం ఏం చేయాలో సవివరంగా చెప్పడమే గాకుండా ఆ ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలిపింది. సెలబ్రిటీ ఫిట్నెస్ శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా ఐస్క్రీంని ఇలా చేసుకుని తింటే కచ్చితంగా బరువు తగ్గుతారని చెబుతోంది. అదేంటి ఐస్‌క్రీంతో బరువు తగ్గడమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే హెల్తీగా చేసుకుని తింటే కచ్చితంగా బరవు తగ్గుతారని అంటోంది యాస్మిన్. ఆమె కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపీక పదుకొనే వంటి బాలీవుడ్ ప్రముఖుల ఫిట్నెస్ ట్రైనర్ ఆమె. ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడిని వారంటూ ఉండరు. ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం కోసం ఐస్‌క్రీమ్‌ని త్యాగం చేయాల్సిన పనిలేదంటోంది యాస్మిన్. బరువు తగ్గేలా ఐస్క్రీంని చేసుకుని తింటే చాలని చెబుతోంది. ఇలా చేస్తే ఆరోగ్యానకి ఆరోగ్యం, మంచి ఫిట్నెస్ కూడా మీ సొంతమని నమ్మకంగా చెబుతోంది. ఇంతకీ ఎలా చేయాలంటే..?కావాల్సిన పదార్థాలు..యాపిల్స్:4డార్క్ చాక్లెట్ సిరప్: తగినంతమాపుల్ సిరప్బిట్స్ వాల్నెట్లుఐస్క్రీం మౌల్డ్లుతయారీ విధానం: నాలుగు యాపిల్స్‌ని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కరిగించిన డార్క్ చాక్లెట్‌ని తీసుకోవాలి. దీన్ని ఉడికించిన యాపిల్ ముక్కల్లో వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ వచ్చేలా మాపుల్ సిరఫ్ వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీం మౌల్డ్‌లలో పోసి అలంకరణగా వాల్నెట్లు వేసి డీప్ ఫ్రీజ్‌లో పెట్టండి అంతే ఆరోగ్యకరమైన ఐస్‌క్రీం డెజర్ట్ రెడీ. పైగా ఇందులో ఎలాంటి షుగర్ వినయోగించ లేదు కాబట్టి బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అందులో ఉండే యాపిల్స్ బరువుని అందుపులో ఉంచుతుంది. పైగా రుచి రచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఐస్‌క్రీమ్ డెజర్ట్‌ని మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Yasmin Karachiwala | Celebrity Fitness Instructor (@yasminkarachiwala)(చదవండి: వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?) -
ఓటు వేస్తే టిఫిన్, తొలిసారైతే ఐస్‌క్రీమ్ కూడా..
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దుకాణాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. మే 13న ఇండోర్‌లో ఓటింగ్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహం అందించేందుకు స్థానిక ఫుడ్ మార్కెట్లలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. మరోవైపు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ జరిగే రోజున ఓటర్లకు ఉచితంగా ఐస్ క్రీం, పోహా, జలేబీ, శీతల పానీయాలు, ఇతర తినుబండారాలు అందించనున్నారు. ఈ ఆఫర్లలో వివిధ కేటగిరీలు, ఎంపికలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం వివిధ దుకాణాలకు ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఓటర్లు ఈ విధమైన ప్రయోజనం పొందేందుకు తమ ఓటరు కార్డుతో పాటు వారి వేలిపై ఇంక్ గుర్తును చూపించాల్సి ఉంటుంది.అంతే కాదు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9 గంటలలోపు ఓటు వేసే యువత, సీనియర్ సిటిజన్లకు పోహా, జిలేబీ, ఐస్ క్రీంలను ఉచితంగా అందించనున్నారు. అలాగే మంచూరియా, నూడుల్స్ కూడా ఉచితంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇండోర్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్‌లో పోలింగ్ జరిగే రోజున పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. -
అర్థరాత్రి నడి రోడ్డుపై నయనతార.. వీడియో వైరల్
కొందరు సెలబ్రిటీల చిన్న చిన్న కోరికలు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈ లేడీ సూపర్‌స్టార్ జీవితమే సంచలనం అని చెప్పవచ్చు. అన్నింటికీ మించి మనోధైర్యం నిండుగా ఉన్న నటి. కాకపోతే తన జీవితంలో ఎదురైన అవరోధాలను తట్టుకుని, ఈ స్థాయికి చేరుకునేవారే కాదు. వృత్తిని, వ్యక్తిగతాన్ని చాలెంజ్‌గా తీసుకుని, అత్యున్నత స్థాయికి చేరుకున్న నటి నయనతార. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ సంచలన తార ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినా కానీ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడంలో ఇప్పటికీ వెనుకాడడం లేదు. రెండు దశాబ్ధాలుగా అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న ఈ కేరళ భామ తల్లిదండ్రులు ఇప్పటికీ కేరళలోని కొచ్చిలోనే నివసిస్తున్నారన్నది తెలిసిందే. కాగా ఇటీవల తన తండ్రి కురియన్ పుట్టిన రోజు సందర్భంగా నయనతార కుటుంబ సమేతంగా కొచ్చికి వెళ్లారు. కాగా ఇటీవల ఒక రోజు అర్ధరాత్రి భర్తను, పిల్లల్ని వదిలి ఆ సమీపంలోని ఎంజీ రోడ్డుకు వచ్చారు. అంత అవసరం ఏమోచ్చిందంటారా? అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఐస్‌క్రీమ్ కొట్టుకు వెళ్లి ఐస్‌క్రీమ్ కొనుక్కొని హాయిగా తినడం మొదలెట్టారు. విశేషం ఏమిటంటే ఆ ప్రాంతంలో నయనతార భారీ కటౌట్ ఒకటి ఉంది. దాన్ని చూస్తూ నయనతార ఐస్‌క్రీమ్ తిన్నారు. అంతటి సెలబ్రిటీ అర్ధరాత్రి నడిరోడ్డుపై నిలబడి ఐస్‌క్రీమ్ తింటుంటే ఎవరి కంటా పడకుండా ఉంటుందా? అలా కొందరు అభిమానులు అక్కడికి వచ్చి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నయనతారను విష్ చేశారు. ఈమె కూడా వారితో ముచ్చటించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు అంత రాత్రిపూట ఆమెకు ఐస్‌క్రీమ్ తినాలని అనిపించడం ఏమిటీ, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు రావడం ఏమిటీ? అనే ఆశ్చర్యాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 🎥 pic.twitter.com/CdjCKle1bv — Nayanthara✨ (@NayantharaU) April 4, 2024 -
లాక్మే ఫ్యాషన్ వీక్ : స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ హీరో, ఫోటోలు వైరల్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 ఈ నెల (మార్చి) 17 ఆదివారం దాకా జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో మార్చి 13న ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్‌లో రకరకాల థీమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by Lakmē Fashion Week (@lakmefashionwk) మాగ్నమ్ ఐస్ క్రీం డిప్పింగ్ బార్ థీమ్ సెలబ్రిటీలు సందడి చేశారు. మాగ్నమ్ డిప్పింగ్ బార్లో తమ ఫ్యావరేట్ను ఫ్లావర్ను ఆస్వాదించారు. ఈ సెలబ్రిటీస్‌లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేస్తూ స్టయిలిష్ లుక్‌లో ఆకర్షణీయంగా నిలిచారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో సస్టైనబిలిటీ డేలో ప్రముఖ నటి, మోడల్, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ దియా మీర్జా మెరిసింది. -
కూతురితో నారాయణ మూర్తి - ఫన్ మిస్ అయిన రిషి సునాక్!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు 'నారాయణ మూర్తి' ఇటీవల తన కుమార్తె 'అక్షతా మూర్తి'తో కలిసి బెంగళూరులోని ఒక ఐస్‌క్రీమ్ పార్లర్లో సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు బ్రిటన్ ప్రథమ మహిళ, మరో వైపు టెక్ దిగ్గజం ఇద్దరూ చాలా సింపుల్‌గా కనిపించిన ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ షేర్ చేస్తూ.. బెంగళూరులోని జయనగర్ 5వ బ్లాక్‌లోని 'కార్నర్ హౌస్'లో బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణమూర్తితో కలిసి ప్రశాంతంగా ఐస్‌క్రీమ్ తింటున్నారు. ధనవంతులైనప్పటికీ సాధారణ వ్యక్తులు మాదిరిగా జీవితం గడుపుతున్నారు. ఇదే నారాయణమూర్తి గొప్పతనం అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో నారాయణ మూర్తి, అక్షతా మూర్తి ఇద్దరూ క్యాజువల్ దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇందులో రిషి సునాక్ పేరు కూడా ట్యాగ్ చేసి మీరు ఈ ఫన్ మిస్ అయ్యారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి పలువురు నెటిజన్లు వీరి సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి Britain's First Lady Akshata Murty with her Father Shri Narayan Murthy at Corner House in Jayanagar 5th block Bangaluru... Place was packed.... they came quietly and bought their ice cream . Rich but live a common life . This the greatness that Mr @Infosys_nmurthy carries along.… pic.twitter.com/QhYLikRbns — Devi Singh (@devipsingh) February 12, 2024 -
ఈ క్రిస్మస్ వేళ..సరదాగ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ట్రైం చేయండిలా!
ఐస్‌క్రీమ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఐస్‌క్రీమ్ – ఒకటిన్నర కప్పు పైనే (నచ్చిన ఫ్లేవర్) మినీ చాక్లెట్ చిప్స్ లేదా కలర్ స్ప్రింకిల్స్ – 2 టేబుల్ స్పూన్ల పైనే బిస్కట్స్ – కొన్ని (మార్కెట్లో దొరికే బిస్కట్స్ లేదా ఇంట్లో చేసుకునే కుకీస్ తీసుకోవచ్చు) తయారీ విధానం: ముందుగా నచ్చిన షేప్‌లో రెండేసి బిస్కట్స్ లేదా కుకీస్ తీసుకుని.. వాటి మధ్యలో.. సేమ్ షేప్‌లో ఐస్‌క్రీమ్ బిట్ పెట్టుకుని శాండ్‌విచ్‌లా చేసుకోవచ్చు. అనంతరం వాటిని చాక్లెట్ చిప్స్‌లో లేదా కలర్ స్ప్రింకిల్స్లో దొర్లించి వెంటనే సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వెరైటీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. (చదవండి: -
పీనట్ ఐస్‌క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..
క్లైమేట్‌తో సంబంధం లేకుండా ఇష్టపడే రుచుల్లో ఐస్‌క్రీమ్ ఎవర్గ్రీన్! అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్‌కి ఈ మెషిన్ తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో.. ఎక్కువ మోతాదులో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. ఇది ఒక్కసారికి సుమారు ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ని తయారు చేయగలదు. దీనిలోని సుపీరియర్ ఫంక్షన్స్ యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తాయి. ఇందులో రొటేటెడ్ లేడల్ (గరిటె) ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే కనెక్షన్‌తో రెండు గరిటెలుగా విడిపోయి.. లోపలున్న పదార్థాలను కలపడానికి సహకరిస్తుంది. ఇక దీని లోపల ఐస్‌క్రీమ్ స్పష్టంగా కనిపించడానికి ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. ఈ మేకర్ని క్లీన్ చేసుకోవడం.. వినియోగించుకోవడం చాలా ఈజీ. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం! ) -
అలోవెరాతో ఐస్‌క్రీమ్.. ఎప్పుడైనా తిన్నారా?
అలోవెరా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి) పుదీనా ఆకులు – 8 మిల్క్‌మెయిడ్ – అర కప్పు, మ్యాపుల్ సిరప్ – 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు (ఇవి మార్కెట్లో దొరుకుతాయి), ఫుడ్ కలర్ – గ్రీన్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్ క్రీమ్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్‌మెయిడ్, మ్యాపుల్ సిరప్, కొద్దిగా ఫుడ్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. -
ఒకప్పుడు రూ. 65 జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి బాస్! ఎలా అంటే?
ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలంటే కసి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరం. అయితే ఉన్నతమైన చదువులు, డాక్టరేట్లు మాత్రమే సక్సెస్ తీసుకువస్తాయనేది అపోహ మాత్రమే అంటున్నారు కొంతమంది నిపుణులు. మనం ఈ కథనంలో కాలేజ్ డ్రాపౌట్ అయిన ఒక వ్యక్తి దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 'RG చంద్రమోగన్' ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ భారతదేశంలోని బిలినీయర్ల జాబితాలో ఈయన ఒకరు. చంద్రమోగన్ బాల్యం మొత్తం తమిళనాడులోని చెన్నైలో గడిచిపోయింది. చిన్నప్పటి నుంచే లెక్కల మీద మంచి పట్టు ఉండటంతో అందరూ ఇతన్ని 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలిచేవారు. గణితంలో ఎంత పట్టు ఉన్నా.. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల 21 సంవత్సరాల వయసులోనే చదువుకు దూరమయ్యాడు. తన తండ్రి చిన్న ప్రొవిజనల్ స్టోర్ నడిపేవాడు, కానీ చంద్రమోగన్ అదికాదని ఒక టింబర్ డిపోలో కేవలం రూ. 65 జీతానికి ఉద్యోగం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తరువాత ఆ ఉద్యోగం మానేసి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాడు. కేవలం రూ. 13,000తో ప్రారంభమైన ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభంలో కొంత నష్టాలను చవిచూసింది. అప్పట్లో 15 తోపుడు బండ్ల మీద వ్యాపారం ప్రారంభించి మొదటి ఏడాదిలో రూ. 1.5 లక్షలు రావడంతో చంద్రమోగన్కు వ్యాపారం మీద కొంత నమ్మకం కలిగింది. 1981లో చిన్న పట్టణాలలో వ్యాపారం విస్తరించడం ప్రారంభించాడు. ఇదే ఆయన పురోగతికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఇదీ చదవండి: నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే! ఐస్ క్రీమ్ బిజినెస్ రోజురోజుకి వృద్ధి చెందుతూ 'అరుణ్' ఐస్ క్రీమ్ పేరుతో తమిళనాడులో మంచి ప్రజాదరణ పొందాడు. 1986లో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ పేరుతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకటిగా ప్రతిరోజూ 10,000 గ్రామాలలో 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు! ప్రస్తుతం హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ మార్కెట్ క్యాప్ రూ.18,889 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం RG చంద్రమోగన్ నేడు రూ. 13,000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. అతని కంపెనీ పాల ఉత్పత్తులను 42 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రమోగన్ ఛైర్మన్‌గా ఉండగా, ఆయన కుమారుడు సి సత్యన్ ఇప్పుడు హ్యాట్సన్ను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. -
రసగుల్లాతో ఐస్‌క్రీం..ఎప్పుడైనా ట్రై చేశారా? అదిరిపోద్దంతే!
రసగుల్లా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: వెనీలా ఐస్‌క్రీమ్ – నాలుగు కప్పులు; రసగుల్లాలు – ఎనిమిది; స్ట్రాబెరీ – ఆరు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి పదినిమిషాలు బయటపెట్టాలి ∙రసగుల్లాలను గట్టిగా పిండి సిరప్‌ను తీసేయాలి. పూర్తిగా పిండకూడదు. కొద్దిగా సిరప్ తేమ ఉండేలా పిండాలి ∙పిండిన రసగుల్లాలను చిన్నచిన్న ముక్కలు చేయాలి. స్ట్రాబెరీలను కూడా కడిగి సన్నగా తరగాలి ∙ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో రసగుల్లా ముక్కలు వేసి కలపాలి . దీనిలో స్ట్రాబెరీ ముక్కలు, బాదం పలుకులు వేసి మరోసారి చక్కగా కలపాలి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూతపెట్టి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి . రిఫ్రిజిరేటర్లో నుంచి తీసిన పదిహేను నిమిషాల తరువాత రసగుల్లా ఐస్‌క్రీమ్‌ను సర్వ్‌చేసుకోవాలి. -
దటీజ్ "మహాలక్ష్మీ ఐస్ క్రీం"! అద్గది.. టెక్నాలజీని వాడటం అంటే..!
మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్‌క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్‌క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్‌ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐసీక్రీంని కూల్‌గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్‌ని వాడాలన్న ఆలోచనే గ్రేట్గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్‌క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్‌క్రీం ట్రక్‌కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: -
ఐస్ క్రీంలో పురుగులు
-
ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తామంటే డాన్స్ చేయకుండా ఆగుతామా?
ఉచితంగా ఇస్తామంటే ఏ పని చేయడానికి వెనకాడరు కదా!. అందులోకి ఫుడ్‌కి సంబంధిచింది అంటే ఇంక జనాలు ఎలా ఎగబడతారో చెప్పనవసరం లేదు. అందుకు పెద్ద చిన్నా అనే తేడా లేదు. అలాంటి ఘటనే బెంగళూరు చోటు చేసుకుంది. ఓ ఐస్‌క్రీం ఫాపు వాళ్లు డ్యాన్స్ చేస్తే ఐస్‌క్రీం ఫ్రీ అని ఆఫర్ ఇచ్చింది. అంతే ఇక..ఆ ఉచిత ఐస్క్రీంల కోసం వృద్ధులు యువత అనే తేడా లేకుండా పోటాపోటీగా డ్యాన్సుల చేసి మరీ ఐస్క్రీంని ఆరగించి వెళ్తున్నారు. మాములుగా ఏదైన ఈవెంట్ పరంగా చేయాల్సి వస్తే డ్యాన్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటప్పుడూ మాత్రం డ్యాన్స్‌లు వచ్చినా రాకపోయినా రెండు స్టెప్లు ఏదోరకంగా వేసి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తారు. ఇలాంటి విచిత్రమైన ఆఫర్లు ఉంటే జనాల్లో దాగున్న అన్ని టాలెంట్లు బయటకు వచ్చేస్తాయి కూడా. అయితే ఎందుకిలా బెంగళూరుషాపు వాళ్లు ఈ ఆఫర్ పెట్టారంటే..ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఔనా! అయితే ప్రతి జూలై మూడోవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఐస్‌క్రీం డేని జరుపుకుంటారు. ఈ ఏడాది అదికాస్త జూలై 16న వచ్చింది. ఆ సందర్భంగా బెంగళూరులోని ప్రఖ్యాతిగాంచిన ఓ ఐస్‌క్రీం షాపు ఏదైన వినూత్న రీతిలో కస్టమర్లకు ఐస్క్రీంని సర్వ్ చేయాలనుకుంది. అందులో భాగంగా ఇలాంటి వైరైటీ ఆఫర్ ఇచ్చింది కస్టమర్లకు. ఆ షాపు వాళ్లు కస్టమర్లు అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తే ఐసీక్రీం ఫ్రీ అని బోర్డు పెట్టింది. అంతే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జనాలు ఇలా ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ టాలెంట్‌ని చూపించారు. ఈ మేరకు సదరు ఐస్‌క్రీం షాపు అందుకు సంబందించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో నెటిజన్లతో పంచుకుంది. ఈ వేడుక మీ ప్రేమతో దిగ్విజయం జరిగింది అందుకు మా కస్టమర్లకు ధన్యావాదాలు అని ఇన్‌స్టాలో పేర్కొంది సదరు ఐస్‌క్రీం షాపు యాజమాన్యం. View this post on Instagram A post shared by Corner House Ice Creams (@cornerhouseicecreams) (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
ఇస్మార్ట్ ఆఫర్ డ్యాన్స్ జెయ్యాలే... ఫ్రీగా ఐస్‌క్రీమ్ తినాలే!
‘డ్యాన్స్ చేయండి. ఐస్‌క్రీమ్ ఫ్రీగా తినండి’ అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎంత బాగుంటుంది! ఎవరో ఎందుకు సాక్షాత్తూ ఒక ఐస్‌క్రీమ్ కంపెనీ ఇలాంటి ఆఫర్‌ను కస్టమర్లకు ఇచ్చింది. ‘ఐస్‌క్రీమ్ డే’ను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ‘కార్నర్ హౌజ్ ఐస్‌క్రీమ్స్’ అనే ఐస్‌క్రీమ్ కంపెనీ షాప్ ముందు నుంచి కౌంటర్ వరకు డ్యాన్స్ చేస్తూ వచ్చే వాళ్లకు ఫ్రీ ఐస్‌క్రీమ్ ఆఫర్ ఇచ్చింది. ఇక డ్యాన్సులే డ్యాన్సులు! కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ‘ఫ్రీ ఐస్‌క్రీమ్ మాటేమిటోగానీ ఎంతోమంది డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూసే అవకాశం వచ్చింది’ ‘డ్యాన్స్ చేస్తే ఫ్రీగా టమాటాల ఆఫర్ ఎవరైనా ఇస్తే బాగుండేది’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి.