India Cements
-
అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్.. శ్రీనివాసన్ రాజీనామా
సిమెంట్ (cement) రంగ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా ఇండియా సిమెంట్స్(India cements)లో ప్రమోటర్లకున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్.శ్రీనివాసన్ (srinivasan) సహా ఇతర ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఐసీఎల్‌లో 10.13 కోట్ల షేర్ల(32.72 శాతం వాటా)ను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ తాజాగా చేజిక్కించుకుంది. దీంతో ఐసీఎల్‌లో ఇప్పటికే 22.77 శాతం వాటా(7.05 కోట్ల షేర్లు) కలిగిన అల్ట్రాటెక్ దీంతో ప్రధాన ప్రమోటర్‌గా అవతరించింది.ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55.49 శాతానికి(17.19 కోట్ల షేర్లు) పెంచుకుంది. వెరసి ఈ నెల 24 నుంచి అల్ట్రాటెక్ (UltraTech)కు అనుబంధ సంస్థగా ఐసీఎల్ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో వైస్‌చైర్మన్, ఎండీ పదవులకు శ్రీనివాసన్ రాజీనామా చేసినట్లు ఐసీఎల్ వెల్లడించింది. అంతేకాకుండా ఆయన భార్య చిత్రా శ్రీనివాసన్, కుమార్తె రూపా గురునాథ్, వీఎం మోహన్ సైతం బోర్డు నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్వతంత్ర డైరెక్టర్లు ఎస్.బాలసుబ్రమణ్యన్ ఆదిత్యన్, కృష్ణ శ్రీవాస్తవ, లక్ష్మీ అపర్ణ శ్రీకుమార్, సంధ్యా రాజన్ సైతం బుధవారం(25న) రాజీనామా చేసినట్లు తెలియజేసింది. కొత్త డైరెక్టర్లు కొత్తగా కేసీ జన్వర్, వివేక్ అగర్వాల్, ఈఆర్ రాజ్ నారాయణన్, అశోక్ రామచంద్రన్ డైరెక్టర్లుగా ఐసీఎల్ బోర్డు ఎంపిక చేసింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్ బాలియా, సుకన్య క్రిపాలు ఎంపికయ్యారు. ఐసీఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు(రూ. 7,000 కోట్ల డీల్) ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ గత వారం అల్ట్రాటెక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఓపెన్ ఆఫర్ ద్వారా ఐసీఎల్‌లో మరో 26% వాటాను సొంతం చేసుకునేందుకు సైతం అనుమతించింది. ఏం జరిగిందంటే? ఈ ఏడాది జూలై 28న ఐసీఎల్‌లో ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతిపాదించింది. ఇందుకు రూ. 3,954 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. దీంతో నిబంధనల ప్రకారం ఐసీఎల్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలు(రూ. 3,142 కోట్ల విలువ)కు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించింది. తద్వారా వేగవంత వృద్ధితోపాటు, తీవ్ర పోటీ నెలకొన్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేసింది. మరోపక్క అంతకుముందే అంటే జూన్‌కల్లా ఐసీఎల్‌లో 23 శాతం వాటాను అల్ట్రాటెక్ సొంతం చేసుకుంది. ఈ బాటలో సుమారు రూ. 1,900 కోట్లు వెచ్చించి రెండు బ్లాక్‌డీల్స్ ద్వారా ఐసీఎల్‌లో డీమార్ట్ రిటైల్ స్టోర్ల దమానీ గ్రూప్‌నకు గల వాటాను చేజిక్కించుకుంది.కన్సాలిడేషన్ బాట..దేశీయంగా సిమెంట్ పరిశ్రమ కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పోటీ పడుతున్నాయి. చిన్న సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ 2026–27కల్లా వార్షికంగా 200 టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అదానీ గ్రూప్ 2027–28కల్లా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 ఎంటీపీఏకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది.అల్ట్రాటెక్ ప్రస్తుత సామర్థ్యం 156.66 ఎంటీపీఏగా ఉంది. ఇప్పటికే సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకున్న అదానీ సిమెంట్ ఇటీవలే సీకే బిర్లా గ్రూప్ కంపెనీ ఓరియంట్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది(2024–25) 100 ఎంటీపీఏను అందుకోనుంది. ఇదేవిధంగా అల్ట్రాటెక్ కేశోరామ్ ఇండస్ట్రీస్ సిమెంట్ బిజినెస్‌పై దృష్టి పెట్టింది. కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. -
లిస్టెడ్ కంపెనీగానే ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: దక్షిణాదిన కార్యకలాపాలు విస్తరించిన ఇండియా సిమెంట్స్(ఐసీఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుందని అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా పేర్కొంది. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదని ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం తెలియజేసింది. వారాంతాన ఐసీఎల్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించిన నేపథ్యంలో లిస్టింగ్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. డీల్ విలువ రూ.3,954 కోట్లుకాగా.. ఇప్పటికే ఐసీఎల్‌లో 23 శాతం వాటా కలిగిన అల్ట్రాటెక్ దీంతో నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ.390 ధరలో 8.05 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు అల్ట్రాటెక్ రూ.3,142 కోట్లకుపైగా వెచ్చించనుంది. అయితే ఐపీఎల్ క్రికెట్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) యాజమాన్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఐసీఎల్ ప్రమోటర్ ఎన్.శ్రీనివాసన్, కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అల్ట్రాటెక్ తరఫున ఓపెన్ ఆఫర్‌ను చేపట్టిన యాక్సిస్ క్యాపిటల్.. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదన్న విషయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. పూర్తిస్థాయిలో ఓపెన్ ఆఫర్ విజయవంతమైతే ఐసీఎల్‌లో అ్రల్టాటెక్ వాటా 81.49 శాతానికి చేరే వీలుంది! బీఎస్ఈలో ఐసీఎల్ షేరు 0.7 శాతం నీరసించి రూ. 372 వద్ద ముగిసింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 4.6 శాతం డిస్కౌంట్. -
అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ చేతికి తాజాగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్(ఐసీఎల్)లో 32.72 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. సంస్థ ప్రమోటర్ల నుంచి రూ. 3,954 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా పబ్లిక్ వాటాదారుల వద్ద నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. తద్వారా తీవ్ర పోటీతోపాటు.. వేగవంత వృద్ధిలోనున్న దక్షిణాది(ప్ర«దానంగా తమిళనాడు) మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించేందుకు అ్రల్టాటెక్‌కు వీలు చిక్కనుంది. కాగా.. దేశీ సిమెంట్ రంగంలో మరింత పోటీకి తెరతీస్తూ హైదరాబాద్ కంపెనీ పెన్నా సిమెంట్‌ను రూ. 10,422 కోట్లకు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న నెల రోజుల తదుపరి అ్రల్టాటెక్ సైతం సిమెంట్ కంపెనీ కొనుగోలుకి తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది! షేరుకి రూ. 390 షేరుకి రూ. 390 చొప్పున ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లు, సహచరుల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అ్రల్టాటెక్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ప్రమోటర్లు ఎన్.శ్రీనివాసన్, చిత్ర, రూపా గురునాథ్, ఎస్కే అశోక్ బాలాజీ నుంచి 28.42 శాతం, శ్రీ శారదా లాజిస్టిక్స్ నుంచి 4.3 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఇందుకు బోర్డు ఆమోదించినట్లు వెల్లడించింది. తాజా డీల్‌తో ఐసీఎల్‌లో అల్ట్రాటెక్ వాటా 55 శాతానికి జంప్ చేయనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 390 ధరలో 8.05 కోట్ల ఈక్విటీ షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనుంది. వారాంతాన ఐసీఎల్ షేరు రూ. 374.6 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ ధర 4 శాతం అధికం. 26 శాతం వాటాకు అల్ట్రాటెక్ రూ. 3,142 కోట్లు వెచి్చంచవలసి ఉంటుంది. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి తదుపరి ఐసీఎల్‌కు అల్ట్రాటెక్ ప్రమోటర్‌గా అవతరించనుంది. తొలుత ఇన్వెస్టర్‌గా.. మొత్తం 14.45 ఎంటీపీఏ సామర్థ్యంగల ఐసీఎల్‌లో ఈ ఏడాది జూన్‌లో అ్రల్టాటెక్ ఇన్వెస్టర్‌గా రెండు బ్లాక్ డీల్స్ ద్వారా 23 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీమార్ట్ ప్రమోటర్లు దమానీ కుంటుంబం నుంచి ఈ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ. 1,900 కోట్లుగా అంచనా. తాజా కొనుగోలుతో దక్షిణాది మార్కెట్లలోనూ కార్యకలాపాలు విస్తరించగలమని ఏబీ గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు.అదానీ పోటీ అంబుజాను సొంతం చేసుకోవడం ద్వారా 2022 సెపె్టంబర్లో సిమెంట్ పరిశ్రమలోకి అడుగు పెట్టిన డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సైతం దేశీయంగా దిగ్గజాలతో పోటీపడుతోంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ నుంచి 6.4 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 51,000 కోట్లు) అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసింది. తద్వారా ఏసీసీలోనూ మెజారిటీ వాటాను పొందింది. అంతేకాకుండా 2023లో మైహోమ్ ఇండస్ట్రీస్, సంఘీ ఇండస్ట్రీస్‌లను చేజిక్కించుకుంది. వెరసి 2028కల్లా 140 ఎంటీపీఏపై దృష్టిపెట్టి ముందుకు కదులుతోంది. ఇందుకు ప్రస్తుత యూనిట్ల విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితర ప్రణాళికలను అమలు చేస్తోంది. పెన్నా కొనుగోలుతో అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ సామర్థ్యం 14 ఎంటీపీఏ పెరిగి 93 ఎంటీపీఏకు చేరిన సంగతి తెలిసిందే. 155 ఎంటీపీఏ(కన్సాలిడేటెడ్) సామర్థ్యంతో దేశీ సిమెంట్ రంగంలో నంబర్ వన్‌గా నిలుస్తున్న ఆదిత్య బిర్లా గ్రూప్ తదుపరి రెండో ర్యాంకులో అదానీ గ్రూప్ నిలుస్తోంది. -
ఇండియా సిమెంట్స్‌లో అల్ట్రాటెక్ పాగా!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా చెన్నైకు చెందిన ఇండియా సిమెంట్స్‌లో భారీ వాటాను దక్కించుకుంది. ఇండియా సిమెంట్స్‌లో దమానీలకు ఉన్న 23 శాతం వాటాను సొంతం చేసుకుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఇందుకు రూ. 1,889 కోట్లు వెచి్చంచింది. తద్వారా ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల తదుపరి రెండో పెద్ద వాటాదారుగా అవతరించింది. రెండు బ్లాక్ డీల్స్ ద్వారా షేరుకి రూ. 265–283 ధరల శ్రేణిలో మొత్తం 7,05,64,656 షేర్లను కొనుగోలు చేసింది. ఇది 22.77 శాతం వాటాకు సమానం కాగా.. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లు 28.42 శాతం వాటాను కలిగి ఉన్నారు. వాటాను విక్రయించినవారిలో దమానీలు.. గోపీకిషన్ శివకిషన్, కిరణ్ దేవి, రాధాకిషన్ శివకిషన్, శ్రీకాంత దేవి ఉన్నారు. ఆర్కే దమానీకి చెందిన డిరైవ్ ఇన్వెస్ట్మెంట్స్, డిరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ సైతం షేర్లను విక్రయించాయి. గురువారం సమావేశమైన బోర్డు ఇండియా సిమెంట్స్‌లో దాదాపు 7.06 కోట్ల షేర్ల కొనుగోలుకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు అ్రల్టాటెక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఇండియా సిమెంట్స్‌లో 23% నియంత్రేతర వాటా కొనుగోలుని ఫైనాన్షియల్ పెట్టుబడిగా అ్రల్టాటెక్ పేర్కొంది. ఇండియా సిమెంట్స్ తీరిదీ... 2024 మార్చి31 కల్లా ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 28.42 శాతంగా నమోదైంది. కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్. శ్రీనివాసన్ 0.36 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఈడబ్ల్యూఎస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 21.56 శాతం వాటా ఉంది. కంపెనీ మొత్తం 16 ఎంటీపీఏ సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో అనుబంధ కంపెనీ త్రినేత్ర సిమెంట్‌కుగల 1.5 ఎంటీపీఏ సామర్థ్యం కలసి ఉంది.గతేడాది (2023–24) ఇండియా సిమెంట్స్ రూ. 5,112 కోట్ల ఆదాయం, రూ. 227 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2022–23)లో నమోదైన రూ. 127 కోట్లతో పోలిస్తే నష్టం పెరిగింది. 2023 సెపె్టంబర్లో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలోని కంటకాపల్లె, చిన్నిపాలెంలోగల 73.75 ఎకరాల భూమిని విక్రయించింది. వీటిని రూ. 70 కోట్లకు అ్రల్టాటెక్ సొంతం చేసుకుంది. 2022 అక్టోబర్‌లో స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు రూ. 477 కోట్లకు విక్రయించింది. అల్ట్రాటెక్ స్పీడ్.. అ్రల్టాటెక్ సిమెంట్ స్థాపిత సామర్థ్యం వార్షికంగా 152.7 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ)కాగా.. విస్తరణ బాటలో సాగుతోంది. మహారాష్ట్రలోని ఇండియా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ. 315 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏప్రిల్ 20న ప్రకటించింది. వైట్ సిమెంట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తయారీ కోసం యూఏఈ సంస్థ రాక్ సిమెంట్‌లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఈ వారం మొదట్లో ఆఫర్ ధరను సవరించింది. విస్తరణ నేపథ్యంలో గ్రే సిమెంట్ సామర్థ్యం 198.2 ఎంటీపీఏను తాకనుంది.ఈ వార్తలతో అ్రల్టాటెక్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 11,715కు చేరగా.. ఇండియా సిమెంట్స్ 11%పైగా దూసుకెళ్లి రూ. 293 వద్ద స్థిరపడింది. -
వైరల్‌గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కొన్నేళ్ల పాటు క్రికెట్లో అత్యంత ధనవంతమైన(Richest Cricketer) ఆటగాడిగా కొనసాగాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి ధోని వార్షిక ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1040 కోట్లు ఉండడం విశేషం. ధోని వార్షిక ఆదాయం.. కోహ్లి కంటే(రూ.1050 కోట్లు) కేవలం పది కోట్లు మాత్రమే తక్కువగా ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్మెంట్స్, ఎండార్స్మెంట్ల రూపంలో వద్దన్నా కోట్లు వచ్చి పడేవి. అలాంటి ధోని క్రికెట్లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా(TTE) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోని పేరిట 2012కు సంబంధించిన పాత అపాయింట్మెంట్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్(ఆఫీస్ కేడర్) పోస్టుకు ధోనిని ఎంపిక చేసినట్లుగా అపాయింట్మెంట్ లెటర్లో ఉంది. ఇక ఈ పోస్టు కింద ధోని నెల జీతం రూ. 43వేలు(రూ.12,650-47,650)గా ఉండడం ఆశ్చర్యపరిచింది. నెలజీతంతో పాటు అదనంగా స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్డ్ అలెవెన్స్ కింద మరో రూ. 21,970 ఉన్నాయి. ఇవీ గాక HRA(హౌస్ రెంటల్ అలెవెన్స్) కింద రూ.20,400.. స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400..(సబ్ ప్లాంట్స్‌లో పనిచేస్తే అదనంగా మరో రూ.8 వేలు).. ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 60వేలు, న్యూస్‌పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్లో పేర్కొన్నారు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ. లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అందుకున్నాడు. ఇక ఈ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) కాగా అప్పటికే వేల కోట్లు సంపాదిస్తున్న ధోని ఈ జాబ్ చేశాడా లేదా అన్నది పక్కనబెడితే.. అప్పటికి టీమిండియా కెప్టెన్‌గా ఉన్న ధోని బ్రాండ్‌వాల్యూ ఎంతలా ఉందనేది ఈ లెటర్ చెప్పకనే చెప్పింది. ఇక ఇండియా సిమెంట్స్ ఎవరిదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇండియా సిమెంట్స్ అనుబంధ సంస్థ. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే బంధం కొనసాగిస్తే వస్తోన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ధోని.. రోహిత్‌తో(ముంబై ఇండియన్స్)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. 2010, 2011, 201, 2021లో సీఎస్కేను విజేతగా నిలిపిన ధోని తాజాగా 2023లో సీఎస్కేకు ఐదోసారి టైటిల్ అందించాడు. ఇక 2024 ఐపీఎల్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. రానున్న తొమ్మిది నెలల్లో వచ్చే సీజన్ ఆడడంపై క్లారిటీ ఇస్తానని(అప్పటివరకు ఫిట్‌గా ఉంటే) ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని పేర్కొన్నాడు. చదవండి: Shaka Hislop Collapsed Video: లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్ Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
ఐపీఎల్ విక్టరీ: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఫ్రాంచైజీ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతం లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధ్యమంటూ కితాబిచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జట్టును ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారు ఉదయం ఆయన ధోనితో మాట్లాడారు. “అద్భుతమైన కెప్టెన్ మీరు. అద్భుతం చేసారు. మీరు మాత్రమే చేయగలరు. మీ టీంని చూసి గర్విస్తున్నాను అంటూ ఆయన ధోనీని అభినందనల్లో ముంచెత్తారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) అంతేకాదు గత కొన్ని రోజులుగా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్‌తో అలిసిపోయారు.. విశ్రాంతి తీసుకోండి అంటూ ధోనీకి సలహా ఇచ్చారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు జట్టుతో పాటు చెన్నైకి రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. (ఐపీఎల్ చాంపియన్ సీఎస్కే ఓనరు, నికర విలువ ఎంత? విషయాలు తెలుసా?) Mr N Srinivasan, former Chairman of the ICC, former President of BCCI and TNCA, Mrs. Chitra Srinivasan and Mrs Rupa Gurunath present @msdhoni with a special memento commemorating the very special 200th 👏#TATAIPL | #CSKvRR | @ChennaiIPL pic.twitter.com/nixs6qsq2P — IndianPremierLeague (@IPL) April 12, 2023 మరిన్ని బిజినెస్ వార్తల కోసం సాక్షిబిజినెస్ -
CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?
ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ను దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌పై ఘన విజయం సాధించింది. సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్లో పది పరుగులు కావాల్సిన సమయంలో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి జట్టును ఛాంపియన్‌గా మార్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియ ఫస్ట్ స్పోర్ట్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజ్‌గా అవతరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా నిలిచిన జట్టుగా పేరొందిన సీఎస్కేకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ క్రమంలో సీఎస్కే యాజమాని ఎవరు, పెట్టుబడి, నికర విలువ ఎంత అనేది విశేషంగా మారింది. ఎన్ శ్రీనివాసన్ సీఎస్కే టీం యజమాని, ప్రముఖ పారిశశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్. ఈయనకు క్రికెట్‌తో అనుబంధం చాలా సుదీర్ఘమైందే. అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్లో పాపులర్ నేమ్. పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం నికర నికర విలువ రూ.720 కోట్లుగా తెలుస్తోంది. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ప్రాథమిక విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఎన్ శ్రీనివాసన్ చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) క్రికెట్ పరిచయం బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన తర్వాత, శ్రీనివాసన్ 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. 2014లో శ్రీనివాసన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ ఎంపిక కావడంతో జగ్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్. 2008 సంవత్సరంలో సీఎస్కేను కొనుగోలు చేశారు. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో పాపులర్ అయిన ఇండియా సిమెంట్ ఓనర్ కూడా. బీసీసీఐ చీఫ్‌గా , ఐసీసీ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) 2016 Born Kids will Never Realise How Combination of Indian Captain MS Dhoni and BCCI President N. Srinivasan Was 💙🇮🇳 pic.twitter.com/t0APYnCvOm — Junaid Khan (@JunaidKhanation) March 29, 2023 చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు శ్రీనివాసన్ 2008లో చెన్నై ఫ్రాంచైజీని (చెన్నై సూపర్ కింగ్స్) సుమారు రూ. 752 కోట్లకు కొనుగోలు చేయడంతో జెంటిల్మన్ గేమ్‌తో ఆయన రిలేషన్ మరింత బలపడింది. ఫ్రాంచైజీ విలువ ఇప్పుడు దాదాపు సుమారు రూ. 7443 కోట్లుగా ఉంది. ప్రొఫెషనల్ జర్నీ చెన్నైకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇండియా సిమెంట్స్‌కి కో ఫౌండర్ తండ్రి నారాయణస్వామి తరువాత 1989లో శ్రీనివాసన్ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. బొగ్గు ,ముడిసరుకు ధరలపెరుగుదల కారణంగా మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.218 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఈక్రమంలోనే తిరునెల్వేలిలో 600 ఎకరాల భూమిని డబ్బు ఆర్జించే దిశగా సంస్థ ఉందని, ఈ ఏడాది (2023)వడ్డీతో సహా రూ. 500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని భావిస్తున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐపీఎల్ విజేతగా నిలివడంతో మార్కెట్లో ఇండియా సిమెంట్స్ షేర్ 3 శాతం లాభపడి. 199.50 వద్ద ముగిసింది. Attended the Platinum Jubilee celebrations of India Cements Ltd in Chennai today. India cement has played a crucial role in India’s growth under the leadership of N. Srinivasan Ji. Congratulated the entire team and also released a special postal stamp on this occasion. pic.twitter.com/xpWWj990Ye — Amit Shah (@AmitShah) November 12, 2022 ఇలాంటి ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
ఇండియా సిమెంట్స్ నష్టాలు పెరిగాయ్, ఆస్తుల అమ్మకానికి ప్లాన్స్
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర నష్టం పెరిగి రూ. 218 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం నమోదైంది. ఇంధనం, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,397 కోట్ల నుంచి రూ. 1,479 కోట్లకు ఎగసింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్‌లను నమోదు చేయడంతో క్యూ4 ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 189 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,730 కోట్ల నుంచి రూ. 5,415 కోట్లకు జంప్ చేసింది. కాగా.. గతేడాది క్యూ1లో రూ. 76 కోట్ల లాభం, క్యూ2లో రూ. 138 కోట్ల నష్టం, క్యూ3లో రూ. 91 కోట్ల లాభం ప్రకటించడంతో పూర్తి ఏడాదికి రూ. 218 కోట్ల నష్టం నమోదైనట్లు కంపెనీ వివరించింది. క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ. 294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో ఆస్తుల మానిటైజేషన్ తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు ఇండియా సిమెంట్స్ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకిగల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా మొత్తం రూ. 500 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు వివరించారు. కంపెనీకి మొత్తం రూ. 2,900 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) డోంట్ మిస్ టూ క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ -
ఇండియా సిమెంట్స్ ఆధునీకరణ
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ పాత తయారీ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తోంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ఆధునీకరణ ప్రణాళికలకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం పాత సిమెంట్ ప్లాంట్ల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 15–18 నెలల్లో రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాల కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. భూముల మానిటైజేషన్ ఇండియా సిమెంట్స్ చేతిలో 26,000 ఎకరాల భూమి ఉన్నదని, ల్యాండ్ బ్యాంక్‌ను మానిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు శ్రీనివాసన్ తెలియజేశారు. పాత ప్లాంట్ల ఆధునీకరణపై సలహాలకు క్రుప్ పాలిసియస్, ఎఫ్ఎల్ స్మిత్‌ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మల్కాపూర్, విష్ణుపురం ప్లాంట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభంకానున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తమిళానడులోని శంకరి, రాజస్తాన్‌లోని బన్సారాలోని ఆధునిక ప్లాంట్లను ఈ జాబితాలో చేర్చబోరని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్, యర్రగుంట్ల, తమిళనాడులో శంకరనగర్, శంకరి, దలవాయ్లలోనూ కంపెనీకి సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. చెన్నై, మహారాష్ట్రలలో రెండు గ్రైండింగ్ యూనిట్లను సైతం కలిగి ఉంది. ఈ యూనిట్లు ఉమ్మడిగా మొత్తం 16 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లాంట్లను రెండు దశాబ్దాల క్రితం సొంతం చేసుకుంది. క్యూ3లో రూ. 133 కోట్ల నికర లాభం ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 133 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 16 కోట్లు మాత్రమే ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రయివేట్(ఎస్‌ఎంపీఎల్) విక్రయం ద్వారా నమోదైన ఆర్జన లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 10 శాతంపైగా వృద్ధితో రూ. 1,281 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,161 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,153 కోట్ల నుంచి రూ. 1,458 కోట్లకు పెరిగాయి. 2022 అక్టోబర్ 10న దాదాపు రూ. 477 కోట్లకు ఎస్‌ఎంపీఎల్ విక్రయాన్ని పూర్తి చేసింది. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 191 వద్ద ముగిసింది. -
ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ కేసు కొట్టివేత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల నుంచి తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరొకరికి విముక్తి కలిగించింది. ఇండియా సిమెంట్స్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకొనేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఎన్ శ్రీనివాసన్‌పై ఇదే ఆరోపణలతో సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా సిమెంట్స్‌పై కేసు కొనసాగించడం న్యాయం కాదని స్పష్టం చేశారు. సీబీఐ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను రికార్డ్ చేయలేదని సీజే జస్టిస్ భుయాన్ ఆక్షేపించారు. అందువల్ల ఇలాంటి ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పారు. గతంలో శ్రీనివాసన్‌పై కేసును కొట్టేసిన న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీ ఓ కృత్రిమ వ్యక్తి అని, కంపెనీ వ్యవహారాలను చూసుకొనే వ్యక్తులు చేసే తప్పులకు కార్పొరేట్ కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చట్టం స్పష్టంగా నిర్దేశిస్తే తప్ప వ్యక్తులు చేసే తప్పులకు కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. క్విడ్ ప్రో కో ఆరోపణలతో సీబీఐ కేసు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు కృష్ణా జలాలను అదనంగా కేటాయించడంతోపాటు కడపలో ఆ సంస్థ ఫ్యాక్టరీకి ఉన్న 2.5 ఎకరాల స్థలం లీజును పొడిగించినందుకు ప్రతిఫలంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఇండియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ జరిపారు. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది చల్లా గుణరంజన్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ భుయాన్... శుక్రవారం ఆ వివరాలను వెలువరించారు. -
57 శాతం తగ్గిన ఇండియా సిమెంట్స్ లాభం
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 57 శాతం క్షీణించి రూ.32.53 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.69 కోట్లుగా ఉంది. రుతుపవనాలు ఎక్కువ కాలం పాటు కొనసాగడం, కొన్ని ప్రాంతాల్లో వరదలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలపై ప్రభావం చూపించాయి. ఆదాయం 13 శాతం పెరిగి రూ.1,235 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,090 కోట్లుగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్ క్వార్టర్లో ఉత్పత్తి 8 శాతం పెరిగినట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే కీలక మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు వర్షాలు ఉండడం, వరదలు రావడం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా రెండో విడత ప్రభావం కొనసాగడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో సంతృప్తికరమైన పనితీరునే చూపించాం’’ అని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. ఇంధనాలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ఒత్తిళ్లు కూడా ఎదుర్కొన్నట్టు తెలిపింది. అయినప్పటికీ విక్రయాలు పెంచుకోవడం ద్వారా మంచి పనితీరునే చూపించినట్టు పేర్కొంది. వ్యయాలు 22 శాతానికి పైగా పెరిగి రూ.1,201 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 6 శాతం వరకు నష్టపోయి రూ.210 వద్ద ముగిసింది. -
ఇండియా సిమెంట్స్ లాభం.. డబుల్
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో రెట్టింపునకు పైగా పెరిగి రూ.46.63 కోట్లుగా నమోదైంది. విక్రయాల ద్వారా ఆదాయం సైతం 37 శాతం వృద్ధితో రూ.1,045 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.20 కోట్లు, ఆదాయం రూ.763 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘లాక్డౌన్లు, రవాణాపై ఆంక్షలు, సరఫరా పరంగా సమస్యలు, ప్రయాణాలపై ఆంక్షలు, సామాజికంగా భౌతిక తూరం తదితర చర్యలు జూన్ త్రైమాసికంలో కంపెనీ సాధారణ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపించాయి’’ అని ఇండియా సిమెంట్స్ తెలిపింది. బీఎస్ఈలో ఇండియా సిమెంట్స్ షేరు 2 శాతం తగ్గి రూ.179 వద్ద క్లోజయింది. -
ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను
న్యూఢిల్లీ: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్‌తో రిటైల్ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ ఇన్వెస్టరు రాధాకిషన్ దమానీ తాజాగా ఇండియా సిమెంట్స్‌పై దృష్టి సారించారు. కంపెనీని టేకోవర్ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన షేర్‌హోల్డరు ఎన్ శ్రీనివాసన్‌తో సంప్రతింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఇండియా సిమెంట్స్‌లో నియంత్రణ స్థాయి వాటాలు దక్కించుకునేందుకు చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటాలు ఉన్నాయి. బలవంతపు టేకోవర్ల సమస్య ఎదురుకాకుండా శ్రీనివాసన్ ఇతర ఇన్వెస్టర్ల వైపు కూడా చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బలవంతపు టేకోవర్ కాకుండా మేనేజ్మెంట్లో స్నేహపూర్వక మార్పు జరిగే విధంగానే టేకోవర్ ఉండేట్లు చూస్తానంటూ దమానీ హామీ ఇచ్చినట్లు వివరించాయి. దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఇండియా సిమెంట్స్ ఈ సమాచారం సరైనది కాదంటూ పేర్కొంది. క్రమంగా షేర్లు పెంచుకుంటూ.. దమానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇండియా సిమెంట్స్‌లో గత కొన్నాళ్లుగా క్రమంగా షేర్లు పెంచుకుంటూ ఉన్నారు. మార్చి 31 నాటికి వారి వాటాలు సుమారు 20 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో దమానీ పోర్ట్‌ఫోలియోను మరింత డైవర్సిఫై చేసుకోవడానికి వీలవుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్, లఫార్జ్‌హోల్సిమ్ వంటి పోటీ దిగ్గజాలను ఎదుర్కొనేందుకు ఇండియా సిమెంట్స్‌కు కూడా గట్టి ఇన్వెస్టరు మద్దతు లభించగలదని పేర్కొన్నాయి. 74 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా సిమెంట్స్‌కు గతేడాది నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ షేర్ రయ్.. టేకోవర్ వార్తలతో బుధవారం ఇండియా సిమెంట్స్ షేరు ధర సుమారు 4.72 శాతం పెరిగి రూ. 131.95 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 2,342 వద్ద క్లోజయ్యింది. ఇండియా సిమెంట్స్ షేరు ఈ ఏడాది మార్చి నాటి కనిష్ట స్థాయిల నుంచి 74 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 95 శాతం ఎగిసింది. 2019 సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇండియా సిమెంట్స్ షేర్లను దమానీ గణనీయంగా కొనడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన వాటా 1.3 శాతంగా ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 4.73 శాతానికి పెరిగింది. మార్చి క్వార్టర్లో సోదరుడు గోపీకిషన్ శివకిషన్ దమానీతో కలిపి 15.16% వాటాలు కొనుగోలు చేయడంతో ఇది 19.89 శాతానికి చేరింది. -
ఇండియా సిమెంట్స్‌పై డీమార్ట్ కన్ను!
దక్షిణాది దిగ్గజం ఇండియా సిమెంట్స్‌పై రాధాకిషన్ ఎస్ దమానీ కన్నేసినట్లు తెలుస్తోంది. డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ అధినేత రాధాకిషన్ దమానీ ఇటీవల ఇండియా సిమెంట్స్‌లో వాటాలు కొంటూ వస్తున్నారు. తాజాగా దమానీ కుటుంబ సభ్యుల వాటా ఇండియా సిమెంట్స్‌లో 19.89 శాతానికి చేరింది. ఈ ఏడాది(2020) మార్చికల్లా ఇండియా సిమెంట్స్‌లో దమానీ కుటింబీకుల వాటా 19.89 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 140 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టానికి చేరింది. తదుపరి కొంతమేర వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 1 శాతం క్షీణించి రూ. 2384 వద్ద కదులుతోంది. 5 శాతం నుంచి నిజానికి రాధాకిషన్ దమానీ 2019 డిసెంబర్‌కల్లా ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం వాటాను పొందారు. తదుపరి మరింత వాటాను కొనుగోలు చేయడంతో ప్రస్తుతం 10.29 శాతానికి ఎగసింది. మరోవైపు సోదరుడు గోపీకిషన్ దమానీ సైతం ఇండియా సిమెంట్స్‌లో 8.26 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇండియా సిమెంట్స్ కంపెనీలో నియంత్రిత వాటాను సొంతం చేసుకునే యోచనలో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఉన్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. గతేడాది(2019-20) క్యూ3లో ఇండియా సిమెంట్స్ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 5.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అమ్మకాలు రూ. 1316 కోట్ల నుంచి రూ. 1191 కోట్లకు తగ్గాయి. క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. ఈ నెల 24న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో క్యూ4 ఫలితాలు వెల్లడించనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి తెలియజేసింది. 72 శాతం ర్యాలీ ఇండియా సిమెంట్స్ షేరు 2019 ఆగస్ట్ 23న రూ. 68 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ఇటీవల దమానీ వాటా కొనుగోలు వార్తలతో ర్యాలీ బాట పట్టింది. ఫలితంగా ఇప్పటివరకూ 72 శాతం ర్యాలీ చేసింది. ఇండియా సిమెంట్స్‌ను స్నేహపూర్వకంగా టేకోవర్ చేసే బాటలో కంపెనీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్‌తో రాధాకిషన్ దమానీ చర్చలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే డీమార్ట్ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించగా.. ఇండియా సిమెంట్స్ ప్రతినిధి తోసిపుచ్చినట్లు మీడియా పేర్కొంది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఇండియా సిమెంట్స్ కౌంటర్లో ఇప్పటివరకూ 8.52 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇది రెండు వారాల సగటు పరిమాణంకంటే రెండు రెట్లు అధికంకావడం గమనార్హం! -
ఎవర్గ్రీన్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఎవర్గ్రీన్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియా సిమెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్గ్రీన్ ఇన్నింగ్స్ 96 పరుగులతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 93/3తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎవర్గ్రీన్ 73.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎవర్గ్రీన్ జట్టుకు 243 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బి.మనోజ్ కుమార్ (75), జి. అనికేత్ రెడ్డి (79) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ 33.1 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మొహమ్మద్ ఒమర్ (57 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో వంశీకృష్ణ 4, శ్రవణ్ 6 వికెట్లతో జట్టును గెలిపించారు. ఇన్నింగ్స్ విజయం సాధించిన ఎవర్గ్రీన్ జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్‌ల వివరాలు జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 292 (ఫైజల్ 61, యుధ్వీర్ సింగ్ 62; శ్రవణ్ 5/50), జై హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 92/2 (అనురాగ్ 31 బ్యాటింగ్). ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 291 (ఆకాశ్ భండారి 7/95), ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 265/5 (అనిరుధ్ సింగ్ 54, డానీ డెరెక్ 74, బి. సుమంత్ 53 బ్యాటింగ్). ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 151 (51.2 ఓవర్లలో), ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 167 (అమోల్ షిండే 58; సురేశ్ 5/56), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ రెండో ఇన్నింగ్స్: 97 (హితేశ్ యాదవ్ 6/37), ఆంధ్రా బ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 85/1 (రోనాల్డ్ 47 నాటౌట్). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 303 (సాయి అభినయ్ 92; రాజు 6/58), ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 343 (హర్షవర్ధన్ 96, చరణ్ 74, సందీప్ 79). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 238 (వరుణ్ గౌడ్ 102, మిలింద్ 58; ముదస్సిర్ 7/83), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 176/4 (సింహా 70 బ్యాటింగ్, సంతోష్ గౌడ్ 50). ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 381 (ఒవైస్ 140 నాటౌట్; ఆశిష్ 6/111), కేంబ్రిడ్జ్ ఎలెవన్: 181/4 (పి. నితీశ్ రాణా 65). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 635/9 (మికిల్ జైస్వాల్ 186, శిరీష్ 52, నిఖిల్ 100 నాటౌట్, గిరీశ్ 52; అలీమ్ 5/183), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 74/4 (28 ఓవర్లలో). హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 170 (శ్రీచరణ్ 63, తాహా షేక్6/48), జెమినీ ఫ్రెండ్స్: 135 (అభిరత్ రెడ్డి 79 బ్యాటింగ్). -
స్ప్రింగ్‌వే మైనింగ్‌ను కొనుగోలు చేస్తున్న ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని రూ.183 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు ఇండియా సిమెంట్స్ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం గాను, స్ప్రింగ్‌వే మైనింగ్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది. స్ప్రింగ్‌వే ప్రధానంగా మైనింగ్, క్వారీయింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీ. -
సిమెంటు ఖర్చు అడుగుకు 150?
► రూ.5000 వసూలు చేస్తున్నారేం? ► రియల్టర్లకు సిమెంటు సంస్థల ప్రశ్న ► బస్తాకు 330–350 ఉంటేనే నిలదొక్కుకుంటాం ► కనీసం 10 శాతం రిటర్నులూ లేవు ► సిమెంటు కంపెనీల ప్రతినిధుల వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో సిమెంటుకయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు రూ.150–175 మాత్రమేనని, కానీ నిర్మాణ సంస్థలు ఫ్లాట్‌కు ఒక చదరపు అడుగుకు రూ.5,000 పైన వసూలు చేస్తున్నాయని సిమెంటు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. నిర్మాణానికి అంత ఖర్చు ఎందుకవుతోందో ఈ సంస్థలు చెప్పాలని వారు ప్రశ్నించారు. ‘‘ఒక చదరపు అడుగుకు 25 కిలోల సిమెంటు కావాలి. బస్తాకు రూ.50 అధికమైనా, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.25 మాత్రమే పెరగాలి కదా?’’ అని ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్ వ్యాఖ్యానించారు. సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. 2015తో పోలిస్తే తెలంగా ణ, ఏపీలో ఇప్పుడున్న సిమెంటు ధర తక్కువని చెప్పారాయన. అయిదేళ్లుగా సిమెంటు ధరల పెరుగుదల ఏటా 1% మాత్రమేనని, అదే రియల్టీ ధరల పెరుగుదల ఏటా 10% ఉందని తెలిపారు. అమ్ముడుపోకుండా పెద్ద సంఖ్యలో గృహాలు ఉన్నా, ధర మాత్రం తగ్గడం లేదని గుర్తుచేశారు. మార్కెట్ ఆధారంగానే ధర.. ‘‘గతేడాది పెట్ కోక్ ధర టన్నుకు 45 డాలర్లుంటే, ఇప్పుడు 100 డాలర్లు దాటింది. రవాణా వ్యయం బస్తాకు రూ.50 అవుతోంది. సిమెంటుపై 27% పన్నులున్నాయి. మార్కెట్ ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతోంది. పరిశ్రమపైన రూ.50,000 కోట్ల అప్పులున్నాయి. కంపెనీలపై వడ్డీల భారం ఉంది. సిమెంటు ధర పెరగడానికి గల కారణాలను చూడకుండా సిమెంటు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా సిమెంటు ధర రూ.270–330 ఉంది. కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడి మార్కెట్లో ధర రూ.330–350 ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయి’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సిమెంటుపై తక్కువ పన్నుంటుందని ప్రజలు, కంపెనీలు ఆశించినా, జీఎస్టీలో 28% శ్లాబులో చేర్చి ప్రభుత్వం నిరుత్సాహపరిచిందని అన్నారు. భారంగా ఉత్పత్తి సామర్థ్యం..: దేశంలో 1989కి ముందు 10 సిమెంటు కంపెనీలే ఉండేవి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.9 కోట్ల టన్నులు. ఇప్పుడు కంపెనీల సంఖ్య 70కిపైమాటే. సామర్థ్యం 42 కోట్ల టన్నులకు ఎగసింది. దక్షిణాదిన 50 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 150 మిలియన్ టన్నులు. ప్లాంట్ల వినియోగం దేశవ్యాప్తంగా 70% ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 60% లోపేనని రవీందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పడిపోయి సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, అధిక తయారీ వ్యయాలు కంపెనీలకు సమస్యగా మారిందని, పెట్టుబడిమీద రాబడి 10%లోపే ఉంటోందని కంపెనీల ప్రతినిధులు వాపోయారు. తెలుగు రాష్ట్రాలు బెటర్.. ‘‘సంయుక్త రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకు 24 లక్షల టన్నుల సిమెంటు అమ్మకాలు నమోదయ్యాయి. 2015–16లో ఇది 12–14 లక్షల టన్నులకు చేరింది. ఏడాదిగా తమిళనాడులో సిమెంటు విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. సిమెంటు వినియోగంలో వచ్చే మూడేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10–18 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’’ అని శ్రీకాంత్ తెలిపారు. తమిళనాడు స్థిరంగా, కర్ణాటకలో 2–5 శాతం వృద్ధి ఉండొచ్చని చెప్పారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు 5–7 శాతం అధికం అవుతాయని అంచనా వేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, వైట్ ట్యాపింగ్ రోడ్లు, అందుబాటు గృహాల నిర్మాణం వేగిరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు తక్కువ ధరకు సిమెంటును సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
ధోనీ జాబ్ వెనక వందల కోట్ల స్కామ్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఇండియా సిమెంట్స్ ఓనర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తన కంపెనీలో ధోనీకి ఉద్యోగం ఇచ్చిన వివరాలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ లీక్ చేశారు. ధోనీ, శ్రీనీకి మధ్య ఎన్నో కాంట్రాక్టులలో సంబంధాలు ఉన్నాయని ఈ జాబ్ వెనక అసలు ఉద్దేశమిదేనని అభిప్రాయపడ్డారు. ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు. 2012 జూన్‌లో ధోనీని ఇండియా సిమెంట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు ఓ ఆఫర్ లెటర్‌ను మోడీ బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్‌గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది. ఇండియా సిమెంట్స్‌లో పనిచేసిన ధోనీ శ్రీనివాసన్ కంపెనీ ఉద్యోగిగా వందల కోట్లు ఆర్జించానని అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు. రాజస్థాన్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లలిత్ మోడీ కుమారుడు రుచిర్ మోడీ ఈ ఆఫర్ లెటర్‌పై స్పందించారు. బీసీసీఐలో ఇలాంటివి జరగడంపై షాక్‌కు గురయ్యానని, చెన్నై సిమెంట్స్ ఉద్యోగిగా ధోనీ ఏడాదికి వందకోట్లు ఆర్జిస్తున్నాడని ట్వీట్ చేశారు. మరోవైపు రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఐపీఎల్ 11లో సందడి చేయనున్నాయి. -
11 రెట్లు పెరిగిన ఇండియా సిమెంట్స్ లాభం
పెరిగిన అమ్మకాలు, తగ్గిన ఉత్పత్తి వ్యయాలు న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ నికర లాభం(స్టాండోలోన్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 11 రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.3 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.35 కోట్లకు పెరిగిందని ఇండియా సిమెంట్స్ తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, అమ్మకాలు అధికంగా ఉండడం వల్ల ఈ స్థాయి లాభాలు వచ్చాయని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ, ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.1,066 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.1,271 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా, మంచి ఫలితాలే సాధించామని చెప్పారు. క్లింకర్, ఎగుమతులతో కూడా కలుపుకొని మొత్తం సిమెంట్ అమ్మకాలు 19 లక్షల టన్నుల నుంచి 22 శాతం వృద్ధి చెంది 24 లక్షల టన్నులకు చేరాయని వివరించారు. మరిన్ని విదేశీ మార్కెట్లలో ప్రవేశించనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల రుణాలు చెల్లించామని, దీంతో టర్మ్ రుణభారం రూ.1,900 కోట్లకు తగ్గిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.250 కోట్లు రుణాలు చెల్లించాలని యోచిస్తున్నామని, ఇప్పటికే రూ.180 కోట్లు చెల్లించామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే నికర లాభం రూ.142 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.79 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,521 కోట్ల నుంచి రూ.3,791 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
ఇండియా సిమెంట్స్ లాభం 16% అప్
తగ్గిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 16 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో రూ.38 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.44 కోట్లకు పెరిగిందని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.1,226 కోట్ల నుంచి రూ.1,206 కోట్లకు తగ్గిందని కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసన్ చెప్పారు. అమ్మకాలు పెరగడం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా నికర లాభం పెరిగిందని తెలియజేశారు. సిమెంట్ అమ్మకాలు 10 శాతం వృద్ధి చెందాయన్నారు. ‘‘కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన అమ్మకాలు తగ్గాయి. తమిళనాడులో ఎన్నికలు జరగడం కూడా దీనికొక కారణం’’ అని వివరించారు. గత క్యూ1లో 20.81 లక్షల టన్నులుగా ఉన్న సిమెంట్ అమ్మకాలు ఈ క్యూ1లో 23 లక్షల టన్నులకు పెరిగాయని, అయితే నికర ప్లాంట్ రియలైజేషన్ రూ.3,930 నుంచి రూ.3,461కు తగ్గిందని తెలిపారు. ఇబిటా రూ.200 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.205 కోట్లకు చేరుకున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి కారణంగా సిమెంట్ డిమాండ్ పెరగగలదని ఆయన అంచనా వేశారు. 2002 నాటి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు కంపెనీకి చెందిన రూ.120 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారని, దీనికి వ్యతిరేకంగా అప్పిలేట్ అధారిటీకి అప్పీల్ చేశామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 1.1 శాతం లాభపడి రూ.126 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి..రూ.131ను తాకింది. -
ఆదిత్యనాథ్ దాస్ కు హైకోర్టులో ఊరట
♦ ఆయనపై విచారణ ప్రక్రియ నిలిపివేత ♦ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌కు చేసిన నీటి కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టులో ఆదిత్యనాథ్ దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా, కాగ్నా నదుల నుంచి ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల విషయంలో అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆదిత్యనాథ్ దాస్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఆదిత్యనాథ్ దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయని తెలిపారు. అనుమతి లేనప్పుడు సీబీఐ చేసిన అభియోగాల్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. అంతర్రాష్ట్ర జలమండలి అనుమతుల్లేకుండా నీటి కేటాయింపులు చేశారన్నది సీబీఐ ఆరోపణ అని, అయితే అనుమతులున్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదని తెలిపారు. ఈ వాదనలతో సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు విభేదించారు. దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించినప్పటికీ ఐపీసీ కింద కేసుల్ని విచారించవచ్చునన్నారు. ఈ దశలో కేసు విచారణను నిలిపివేయరాదని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి సీబీఐ కోర్టులో దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేశారు. -
హిమాలయ్ మెరుపు సెంచరీ
సాక్షి, హైదరాబాద్ : ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎన్స్‌కాన్స్, ఇండియా సిమెంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఎన్స్‌కాన్స్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకోగా, ఇండియా సిమెంట్స్ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి. చివరి రోజు ఆటలో ఎన్స్‌కాన్స్ బ్యాట్స్‌మన్ హిమాలయ్ అగర్వాల్ (68 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు 110/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 93.2 ఓవర్లలో 295 పరుగులు చేసి ఆలౌటైంది. సాయిచరణ్ తేజ్ (58), చంద్రశేఖర్ (51), శాండిల్యా (43) రాణించారు. ఎన్స్‌కాన్స్ బౌలర్ అజారుద్దీన్ 5 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 441/6 (డిక్లేర్డ్) స్కోరు చేసిన ఎన్స్‌కాన్స్‌కు 146 పరుగుల ఆధిక్యం లభించింది. మిగతా లీగ్ మ్యాచ్‌లన్నీ డ్రాగానే ముగిశాయి. అయితే జైహనుమాన్ బ్యాట్స్‌మన్ జి.శశిధర్ రెడ్డి (260 బంతుల్లో 211; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) జెమినీ ఫ్రెండ్స్‌పై విరోచిత పోరాటం చేయగా, ఆర్.దయానంద్ బ్యాట్స్‌మెన్‌పై డెక్కన్ క్రానికల్ బౌలర్ జి.ప్రణీత్ కుమార్ (5/32) నిప్పులు చెరగడం మూడో రోజు ఆటలోని విశేషాలు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 279, డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 212, ఆర్.దయానంద్ రెండో ఇన్నింగ్స్: 222 (కోరపల్లి శ్రీకాంత్ 51, శ్రీకాంత్ రెడ్డి 50; ప్రణీత్ కుమార్ 5/32), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 159/4. జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 357, జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 335 (శశిధర్ రెడ్డి 211; యశ్‌పురి 3/39, సతీశ్ 3/76). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 307, ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 343 (బి. అనిరుధ్ 137, అనురాగ్ హరిదాస్ 99), ఈఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 158/4 (టి.రవితేజ 62, ఆకాశ్ 55). కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 346, ఎస్బీహెచ్: 310 (విశాల్ శర్మ 67, శ్రవణ్ కుమార్ 5/82, ఆరోన్ పాల్ 3/23). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 310, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 324 (అమోల్ షిండే 94; సూర్యప్రసాద్ 5/53). కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 228, ఎస్సీ రైల్వే: 174, కేంబ్రిడ్జ్ రెండో ఇన్నింగ్స్: 284/9 (సయ్యద్ అలీ హైదర్ 63, మీర్ జావిద్ అలీ 78), ఎస్సీ రైల్వే రెండో ఇన్నింగ్స్: 222/9 (త్రినాథ్ పల్లా 101). -
'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'
చెన్నై: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఐసీసీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు అని శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ క్రికెట్ రంగంపై ఎంఎస్ ధోని ప్రభావం ఎక్కువగా ఉంది అని ఆయన తెలిపారు. ధోని గొప్ప క్రికెటర్, భారత జట్టును ముందుకు నడిపించడంలో ఆయన వ్యూహాలు అమోఘమన్నారు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలతోపాటు అన్ని ప్రధాన టోర్నిల్లో భారత్ కు విజయాన్ని అందించారని శ్రీనివాసన్ తెలిపారు. క్రికెట్ రంగానికి ఇండియా సిమెంట్స్ ఎనలేని కృషి చేసిందని, ఎందరో క్రికెటర్ల భవిష్యత్ ను తీర్చిదిద్దందని శ్రీనివాసన్ తెలిపారు. -
స్వతంత్ర కంపెనీగా ‘సూపర్ కింగ్స్’
చెన్నై: ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమ మాతృసంస్థ ఇండియా సిమెంట్స్‌నుంచి వేరు కానుంది. ఈ ఐపీఎల్ జట్టును విడిగా నమోదు చేయాలని ఇండియా సిమెంట్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇండియా సిమెంట్స్‌కు అనుబంధ సంస్థే అయినా ఇకపై సూపర్ కింగ్స్ స్వతంత్ర కంపెనీగా వ్యవహరిస్తుంది. అయితే యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఎన్. శ్రీనివాసనే దీనికి కూడా వైస్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తారు. ఈ నెల 26న జరిగే సంస్థ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో దీనిని ప్రతిపాదించనున్నారు. ఇతర ఐపీఎల్ జట్లు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇదే విధంగా రిలయన్స్, యూబీ గ్రూప్ అనుబంధ సంస్థలుగా ఇప్పటికే కొనసాగుతున్నాయి.