Indian 2 Movie
-
ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు సంతోషం: రేణు దేశాయ్
భారతీయుడు సినిమా ఎంత హిట్టో దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 అంత ఫ్లాప్‌గా నిలిచింది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదలవగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ వీక్షించిన నటి రేణు దేశాయ్ సినిమా టీమ్‌పై ఫైర్ అయింది. ఇటువంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. చాలా సంతోషంఆమె ఇలా మాట్లాడటానికి అందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్ ఉంటుంది. ఆ క్లిప్పింగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రేణు దేశాయ్.. తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు ఏమైంది? అని మండిపడింది. ఇకపోతే ఇండియన్ 2తో ట్రోలింగ్ బారిన పడ్డ శంకర్ తర్వాతి పార్ట్ విషయంలో అయినా జాగ్రత్త వహిస్తే బెటర్ అని నెటిజన్లు సూచిస్తున్నారు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఇండియన్-2ను అధిగమించిన విజయ్ చిత్రం!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌లతో కమల్ హాసన్'ఇండియన్- 2' మూవీని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 12.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. అంతకుముదు ఇండియన్-2 మూవీకి ముందస్తు బుకింగ్స్ ద్వారా రూ. 11.20 కోట్లు మాత్రమే వచ్చాయి. విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉడండంతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశముంది. కేవలం బాక్సాఫీస్ వద్ద ప్రీ టికెట్ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా బిజినెస్ జరగవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే అత్యధిక వసూళ్లతో ది గోట్ కోలీవుడ్‌లో రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ చివరిసారిగా లియో చిత్రంలో నటించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. -
వీకెండ్లో ఓటీటీ చిత్రాలు.. ఆ ఒక్క సినిమాపైనే అందరి చూపులు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. స్టార్ హీరోల సినిమాలన్నీ ఆగస్టు 15న రానున్నాయి. దీంతో ఈ వారం చిన్న చిత్రాలు సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. వాటిలో కమిటీ కుర్రోళ్లు, సింబా, భవనం, తుఫాన్ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు.దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం ఏయే చిత్రాలు రానున్నాయని తెగ ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్లో ఓటీటీలో అలరించేందుకు ఇండియన్-2 వచ్చేస్తున్నాడు. కమల్‌హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కించారు. దీంతో పాటు మలయాళ, తమిళ డబ్బింగ్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.వీకెండ్ ఓటీటీ చిత్రాలునెట్ఫ్లిక్స్భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమాగుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9డిస్నీ ప్లస్ హాట్స్టార్లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఆహాడెరిక్ అబ్రహాం(మలయాళ సినిమా) - ఆగష్టు 107/జీ (తమిళ సినిమా)- ఆగస్టు 9సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9సింప్లీ సౌత్అన్నపూరణి ఆగస్టు 9(ఇండియాలో స్ట్రీమింగ్ లేదు) -
భారతీయుడు 2 ఫ్లాప్.. నా వల్లే అంటున్నారు: హీరోయిన్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్.ముందే తెలిస్తే..హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.వర్కవుట్ కాకపోతే..అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్ 2 హిట్ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్ -శంకర్ సర్ కాంబినేషన్లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..ఒక్కరే కారణం కాదుసినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 జులై 12న విడుదలైంది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.భారతీయుడు 2 సినిమాను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కోలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ధరతో ఈ సినిమా రైట్స్‌ను వారు తీసుకున్నట్లు సమాచారం. విడుదల సమయం నుంచి సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావలనే షరతుతో నెట్‌ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుందట. వారి ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 12 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటి వరకు కనీసం రూ.70 కోట్లు కూడా దాటలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో నిర్మాతలకు కూడా తీరని నష్టాన్ని ఇండియన్ 2 సినిమా మిగిల్చిందనే చెప్పవచ్చు.భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పటికే చాలాచోట్ల తొలగించేశారు. ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. దీంతో ఈ చిత్రాన్ని అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. ఆగష్టు 2న భారతీయుడు 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ మంతనాలు జరుపుతుందట. ఈమేరకు అధికారికంగా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. -
'ప్రతి ఒక్కరూ మేధావులు అనుకుంటారు'.. బాబీ సింహా షాకింగ్ కామెంట్స్!
అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారతీయుడు-2. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీని 1996లో భారతీయుడుకు సీక్వెల్‌గా తీసుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడంతో అందరి చూపు ఇండియన్-2 పైనే ఉంది. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని షాకిచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాబీ సింహాకు నెగెటివ్ రివ్యూలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇండియన్-2కు నెగెటివ్ రివ్యూలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.బాబీ సింహా మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరూ తమకు తాము తెలివైన వారని అనుకుంటారు. సినిమాను విమర్శించడానికి కారణాలను వాళ్లే వెతుక్కుంటారు. మేము అలాంటి వాటిని అస్సలు పట్టించుకోం. కేవలం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను మాత్రమే గుర్తుంచుకుంటాం. రివ్యూలు ఇచ్చే కొందరు మేధావుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతే కాకుండా ఇండియన్-3 చూసే వరకు ఇండియన్ -2ని అంచనా వేయకూడదని సూచించారు. అయితే బాబీ సింహా కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమా నచ్చకపోతే మీ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అయితే మరికొందరు బాబీని సమర్థించారు. ఎప్పుడూ నెగెటివ్ రివ్యూలు ఇచ్చే మేధావుల గురించే ఆయన స్పష్టంగా మాట్లాడారని అంటున్నారు.కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్‌హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్‌గా బాబీ మెప్పించారు. ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్, సముద్రఖని కూడా నటించారు. #BobbySimha rather than you blaming audiences, admit the flaws in the movie and try to entertain audiences genuinely. Please re-watch your brilliant performances in #Indian2 again. Don't underestimate audiences.@actorsimha https://t.co/e8l52b9L9y pic.twitter.com/ndyPJNnYhi— Tharan (@jayshah_my) July 19, 2024Bobby Simha criticize the Audience 😐pic.twitter.com/sCBdXzlrDd— Ayyappan (@Ayyappan_1504) July 18, 2024 -
దారుణంగా ఇండియన్-2 కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. భారతీయుడు సీక్వెల్‌గా తీసుకొచ్చిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రెండు కలెక్షన్స్ ఫర్వాలేదనిపించినప్పటికీ... ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. వీక్ డేస్‌లో ఊహించనా కలెక్షన్స్ రాలేదు. తాజాగా ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఏడో రోజు ఇండియాలో కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు సాధించింది. ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడం కలెక్షన్స్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారం రోజుల్లో రూ. 121.65కిపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. -
ఇండియన్-2 పై నెగెటివ్ టాక్.. మేకర్స్ కీలక నిర్ణయం!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్‌కు రన్ టైన్ తగ్గించిన ఇండియన్-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. పడిపోయిన వసూళ్లుఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe— Lyca Productions (@LycaProductions) July 17, 2024 -
సెప్టెంబరులో స్టార్ట్?
ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్, కల్కి 2898 ఏడీ, కమల్‌హాసన్ ‘విక్రమ్’, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, యశ్ ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా చేసిన అన్బరివ్ (అన్బు, అరివు ద్వయం)దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ మూవీని ప్రకటించారు. అయితే ‘ఇండియన్ 2’, ‘థగ్ లైఫ్’ సినిమాలతో కమల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ‘ఇండియన్ 2’ విడుదలవడం, ‘థగ్ లైఫ్’ చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో అన్బరివ్ల సినిమాపై కమల్ దృష్టిసారించారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు నుంచి మొదలయ్యేలా కమల్ అండ్ కో సన్నాహాలు చేస్తున్నారట. కమల్‌హాసన్ , ఆర్.మహేంద్రన్ నిర్మించనున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్.. డైరెక్టర్‌పై నెటిజన్స్ ఫైర్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇండియన్-2 సినిమాపై ట్వీట్ చేశారు. శంకర్ సార్ నిబద్ధతకు.. కమల్ హాసన్ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్‌కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ లోకేశ్ కనగరాజ్ ట్వీట్‌పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండని లోకేశ్‌కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్-2పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. #Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️Can’t wait for #Indian3 🔥🔥— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024 -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి
కమల్‌హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2 థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వీక్షించిన బిగ్‌బాస్ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతీయుడు-2 మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.భోలే షావలి మాట్లాడుతూ..' ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశా. ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఇండియన్-2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. #Kalki2898AD రేంజ్ లో #Bharateeyudu2 ఎంజాయ్ చేస్తారు - Audience ReactionWatch Full public response here ▶️ https://t.co/rez0iLsFFFRead review here 🔗 https://t.co/8I8RV7o8em#KamalHaasan #Shankar #Indian2 #TeluguFilmNagar pic.twitter.com/XnxlwRPuXr— Telugu FilmNagar (@telugufilmnagar) July 12, 2024 -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్‌కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
భారతీయుడు 2 రిలీజ్.. టెన్షన్లో రామ్ చరణ్ ఫ్యాన్స్!
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది రేపటి టాక్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్ టాక్ వస్తే.. ఆటోమేటిక్‌గా బుకింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.(చదవండి: తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్ ధరల్లో ఇంత తేడాలేంటి?)ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్ అయితే గేమ్ ఛేంజర్‌కి ప్లస్ అవుతుంది. (చదవండి: కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు)ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్‌కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. అసలే శంకర్‌కి సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్‌కి కూడా భారతీయుడు2 హిట్ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
ఇదేంటి భయ్యా?.. ఇండియన్-2 టికెట్స్ అక్కడే చీపా?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న తాజా ఇండియన్-2. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 టికెట్‌పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐌𝐚𝐧𝐚 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐓𝐫𝐨𝐥𝐥𝐬 🤗 (@mana_telugu_trolls) -
ఇండియన్-2 బుకింగ్స్.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే?
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవ్వగా.. చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్-2 చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయుడు2 టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 చొప్పున టికెట్‌పై పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది.కాగా.. ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోను తయారు చేసి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీని కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లాంటి యాంటి డ్రగ్స్‌పై వీడియోను రిలీజ్ చేశారు. దీంతో టికెట్స్ పెంపుతో పాటు బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతులు జారీ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
రిలీజ్ ముందు షాక్.. చిక్కుల్లో ఇండియన్-2!
శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఇండియన్-2 చిక్కుల్లో పడింది. తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ చిత్రంలో వాడుకున్నారని మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాను రిలీజ్ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.కాగా.. ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివిన డైరెక్టర్ శంకర్ గతంలో వచ్చిన భారతీయుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్‌హాసన్‌కు రాజేంద్రన్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే తాజాగా సీక్వెల్‌గా వస్తోన్న ఇండియన్-2లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ వాడారని రాజేంద్రన్ ఆరోపిస్తున్నారు. -
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
-
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
ఇండియన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వానికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సిద్ధార్థ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని తెలిపారు. వారి కాపాడాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. బెటర్ సొసైటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నా కెరీర్లో సామాజిక బాధ్యతను తనవంతుగా భావిస్తానని పేర్కొన్నారు. కాగా.. సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా పేరు సిద్ధార్థ్. నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నా.. తెలుగు సినిమాలో ఒక చేతిలో కండోమ్ పట్టుకుని బిల్ బోర్డ్స్‌లో నా ఫోటో వచ్చేలా గతంలోనే ప్రభుత్వానికి సహకరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 నుంచి 2011 వరకు ఎక్కడా హోర్డింగ్ కనిపించినా కండోమ్ పట్టుకుని మీకు సిద్ధార్థ్ కనిపిస్తాడు. ఆ సామాజిక బాధ్యత నాది. ఒకరు చెబితే నాకు గుర్తుకు రాదు. ఎవరైనా చెప్తే చేయాల్సిన అవసరం నాకు రాలేదు. మాకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇది చేస్తేనే అది చేస్తాం అని చెప్పలేదు' అని అన్నారు. -
భారతీయుడు సందేశం సమాజానికి చేరాలి: కమల్‌హాసన్
‘‘ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కరప్షన్ పెరిగిపోతోంది. లంచాల నిర్మూలనకు మనం గట్టిగా ప్రయత్నించడం లేదు. ఈ అంశాలతో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాలోని సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలి’’ అని కమల్‌హాసన్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు.ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేస్తున్నాయి. సోమవారం జరిగిన సమావేశంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ ఆరంభంలో తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన హిట్టు పడలేదు. తెలుగులో నాకు ‘మరోచరిత్ర, ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం’ వంటి ఎన్నో హిట్స్ వచ్చాయి.తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ని చేశారు. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు నన్నెంతో ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘భారతీయుడు’కి సీక్వెల్ తీయాలని ముందు అనుకోలేదు. అయితే కరప్షన్ వార్తలు చదివినప్పుడు నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. ఆ ఆలోచనతో ‘భారతీయుడు 2’ తీశాను’’ అన్నారు శంకర్. ‘‘వినోదం, సందేశంతో తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ‘భారతీయుడు’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు. -
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ చూశారా? ఆయన ముందే మిమిక్రీ..
భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందంఈ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్‌లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు. మాటలు రావడం లేదుచాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్‌ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024 చదవండి: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక -
'మా సినిమాను అమ్ముతున్నాం'.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం ఇండియన్-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నేను ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే మేము రూపొందించిన ప్రొడక్ట్ గురించి తెలియాలి. ఏ వ్యాపారి అయినా తన ప్రొడక్ట్ గురించి ప్రజలకు వివరించాలి. అలాగే మా ప్రొడక్ట్ ఇండియన్-2 అమ్ముతున్నా. మంచి క్వాలిటీగా తయారు చేశాం. ఇందులో నాకు ఎలాంటి సిగ్గు, మొహమాటం లేదు. ఇది మా పని.' అని అన్నారు. ఇది విన్న నెటిజన్స్ కమల్ హాసన్ సింప్లీసిటీని మెచ్చుకుంటున్నారు. కాగా.. ఇండియన్-2 ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషించారు. -
Kamal Haasan: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఇకపై నా లక్ష్యం అదే: కమల్‌హాసన్
‘‘యాభై రెండేళ్ల క్రితం నేను హైదరాబాద్‌కు ఓ సాంకేతిక నిపుణుడిలా వచ్చాను. నటుడిగా మూడుతరాలుగా నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంతకాలం నన్ను ప్రేక్షకులు స్టార్డమ్లో ఉంచారు. ఇక నాకు ఏదైనా లక్ష్యం ఉందా? అంటే బాలచందర్గారిలా చాలామందిని చిత్ర పరిశ్రమకు తీసుకురావాలి. నాలాంటి నటులను తయారు చేయాలి. అలా ప్రేక్షకుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను’’ అని కమల్‌హాసన్ అన్నారు.శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్ర ఖని, బాబీసింహా, గుల్షన్ గ్రోవర్ ఇతర రోల్స్‌లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ‘భారతీయుడు 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీలక్ష్మి మూవీస్ దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ–‘‘కమ్‌బ్యాక్ ఇండియన్ ’ అంటే ఇండియన్ తాత గురించి కాదు.. మనవడు రావాలి.. వస్తాడు. ‘ఇండియన్ 2’ను హిట్ చేయండి.. త్వరగా ‘ఇండియన్ 3’ చూస్తారు. ‘భారతీయుడు’ నిర్మించిన ఏఎయం రత్నంగారికి ధన్యవాదాలు. శంకర్గారిలాంటి విజన్ ఉన్న దర్శకులు ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయి సినిమా చేశారు. ఇందులో తెలుగు సినిమాకు పెద్ద భాగం ఉంది. కళాకారులు భాష సరిహద్దులను చేరిపేశారు. అలాంటి వారిలో కె.విశ్వనాథ్, బాలచందర్, శంకర్గార్ల వంటి దర్శకులు, ఆర్టిస్టులు ఉన్నారు’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ–‘‘లంచగొండి వార్తలను చదివిన ప్రతిసారి ‘భారతీయుడు’ మళ్లీ రావాలని నాకు అనిపించేది. కానీ స్టోరీ కుదరలేదు. ‘2.ఓ’ తర్వాత కమల్‌గారికి ‘భారతీయుడు’ సీక్వెల్ కథ చె΄్పాను. నేను రాసిన ఓ సన్నివేశాన్ని తన నటనతో పదింతలు గొప్పగా ఉండేలా చేస్తారు కమల్‌గారు. బ్రహ్మానందంగారికి నేను అభిమానిని. ‘ఇండియన్ 2, గేమ్‌చేంజర్’లో ఆయన అతిథి పాత్ర చేశారు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సునీల్, తిరుపతి ప్రసాద్‌గార్లకు థ్యాంక్స్. రామ్‌చరణ్‌తో ‘గేమ్‌చేంజర్’ చేస్తున్నాను. త్వరలోనే రిలీజ్ డేట్ లాక్ చేస్తాం’’ అన్నారు. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం నాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు’’ అన్నారు ఏస్జే సూర్య. ‘‘నా అభిమాన నటుడు కమల్‌గారితో నటించాలన్న నా కల నిజమైంది.కమల్‌హాసన్ గారికి నేను ఎప్పటికీ విద్యార్థినే. యువతరానికి కోపం వస్తే ఏం జరుగుతుంది? అన్నది ‘భారతీయుడు 2’లో ఉంటుంది’’ అన్నారు సిద్ధార్థ్. ‘‘కమల్‌హాసన్ గారితో నటించడం హ్యాపీ’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ‘‘ఈ విశ్వంలో కమల్గారిలాంటి నటుడు మరొకరు లేరు. ఆయనతో నటించానని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. ఈ వేడుకలో నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్, నటులు బాబీసింహా, సముద్రఖని, గీత రచయితలు సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండియన్-2 బాగాలేదా?.. అసలు కమల్ హాసన్ ఏమన్నారంటే?
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా కమల్ హాసన్ సింగపూర్‌కు వెళ్లారు. తనకు భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 ఎక్కువగా నచ్చిందని అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియన్-2 బాగాలేదా అని చర్చ మొదలెట్టారు. తాజాగా ఈ కామెంట్స్‌పై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.కమల్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. రెండో పార్ట్ కంటే మూడో పార్ట్ బాగుందని చెప్పా అంతే. అంటే ఇక్కడ పార్ట్-2 బాగాలేదని కాదు. మనం సాంబార్, రసం లాంటి వాటితో భోజనం చేస్తున్నప్పుడు ఆ తర్వాత తినే పాయసం గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. నా కెరీర్లో ఇండియన్-2 కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు స్వీకరించా. కొవిడ్ లాక్డౌన్, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యంతో కొందరు నటులు మరణించడం లాంటి ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్ జాగ్రత్తలు తీసుకున్నారు' అని అన్నారు. కాగా.. ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆరు నెలల్లోనే పార్ట్- 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.