Industrial Park
-
విశాఖలోనే ప్రమాణ స్వీకారం.. అక్కడి నుంచే పాలన: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి వైజాగ్ గ్రోత్ ఇంజన్ లాంటిదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా సమగ్రాభివృద్ధి చెందాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు చెప్పారు. అయితే తాను ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలున్న విశాఖ నగరంపై కొద్దిగా శ్రద్ధ పెడితే పదేళ్లల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడుతుందన్నారు. ‘విజన్ విశాఖ’సదస్సులో భాగంగా మంగళవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో 2 వేల మందికిపైగా పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ‘ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎం’అంశంపై ప్రసంగించి విజన్ విశాఖ డాక్యుమెంటరీని తిలకించారు. రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధి ప్రణాళికతో కూడిన ‘విజన్ విశాఖ’పుస్తకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన రాజధాని విశాఖలో ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, అంతర్జాతీయ స్టేడియంతో పాటు ఐకానిక్ సెక్రటేరియట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఐకానిక్ సెక్రటేరియట్ భవన నమూనాను కూడా సీఎం జగన్ ఆయన ఆవిష్కరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆర్థికాభివృద్ధిలో నగరాభివృద్ధి కీలకం రాష్ట్రానికి విశాఖ ఎందుకు అవసరం? నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశవ్యాప్తంగా జీఎస్డీపీలో వ్యవసాయం వాటా సగటున 17–18 శాతం ఉంటే మన రాష్ట్రంలో 35 శాతం ఉంది. ద్వితీయ, తృతీయ రంగాలైన తయారీ, సేవా రంగాలు వృద్ధి చెందకుంటే రాష్ట్రం ఆర్థికంగా నిలబడలేదు. అవి శరవేగంగా వృద్ధి చెందితేనే మన ముందున్న సవాళ్లను అధిగమించి ఆశించిన మేరకు ఆర్థికాభివృద్ధిని సాధించగలం. విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడింది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదక శక్తి అయిన హైదరాబాద్‌ను మనం కోల్పోయాం. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఐడీపీఎల్, ఎన్ఎండీసీ, ఎన్ఎఫ్సీ, ఐఐసీటీ లాంటివన్నీ అక్కడే ఉండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సంస్థలు వస్తే అభివృద్ధి పరంగా వెంటనే మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యోగులు ఉంటారు. మంచి సంస్థలు రావడం, మంచి ఆర్థిక ప్రగతి నమోదు ఒక సైకిల్ లాగా జరుగుతుంది. తద్వారా ఆ నగరం బాగా విస్తరిస్తుంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం హైదరాబాద్‌లోనే స్థాపించడంతో అది వేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అలా జరగలేదు. విశాఖతో సేవా రంగం వాటా పెరుగుతుంది.. ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపేది సేవారంగమే. జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో సేవారంగం వాటా 55 శాతంగా ఉంది. తెలంగాణలో సేవా రంగం వాటా దాదాపు 62.87 శాతం. ఇందులో మెజార్టీ హైదరాబాద్ నుంచే వస్తోంది. మన రాష్ట్రంలో సేవారంగం వాటా 40 శాతం మాత్రమే ఉంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే సమాన స్థాయి లో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో మనం గణనీయ ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. అది పెరిగినప్పుడే మన ఎకానమీ పెరుగుతుంది. 2022–23లో ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 కాగా తెలంగాణలో రూ. 3,12,398 గా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఏపీలో సేవా రంగం వాటా పెరగాలంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవాలి. మహానగ రాలతో పోటీపడే సత్తా ఉన్న నగరం విశాఖ మాత్రమే. మన బలం.. మన తీరమే దేశంలోనే రెండో అతిపెద్ద సముద్రతీర ప్రాంతం మనకు ఉంది. 974 కి.మీ పొడవైన తీరం వల్ల పోర్టు ఆధారిత అభివృద్ధికి అవకాశం ఉంది. తద్వారా తయారీ రంగానికి మంచి అవకాశాలుంటాయి. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి సహకారాన్ని అందిస్తూ తీరం వెంట పారిశ్రామిక వాడలు, విశాఖను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. 2019కు ముందు ఏపీలో కేవలం 4 చోట్ల నుంచే ఎగుమతులు జరగ్గా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.16 వేల కోట్లతో మరో 4 పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రూ.4 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేశాం. రామాయపట్నం పోరు్టకు వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి ఉంది. కాకినాడలోని ప్రైవేట్ పోర్టుతోపాటు మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తీరం వెంట ప్రతి 50 కి.మీ లకు పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నాం. భారీ పారిశ్రామిక పార్కులు.. పారిశ్రామిక నోడ్స్లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తిలో ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను నెలకొల్పాం. అచ్యుతాపురం, ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రమంతటా సమతుల్య అభివృద్ధి ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వ చర్యలు, వ్యాపార అనుకూల వాతావరణం వల్ల మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. విశాఖ జీఐఎస్‌లో రూ.13 లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. స్వయం ఉపాధికి ప్రోత్సాహం... కొత్తగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం భారీ పరిశ్రమల ద్వారా మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ స్వయం ఉపాధి మార్గాల వైపు నడిపిస్తోంది. లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా డీబీటీ పద్ధతిలో ప్రయోజనాన్ని అందిస్తున్నాం. ఉదాహరణకు చేయూత పథకాన్నే తీసుకుంటే క్రమం తప్పకుండా ఒక్కో మహిళకు రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం. లబ్ధిదారులైన ఆ మహిళలను బ్యాంకులతో అనుసంధానం చేశాం. అమూల్, ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇలాగే అమలు చేసింది. ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ రంగ వాటా కొద్ది శాతమే. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4 లక్షలు కాగా మేం వచ్చాక మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అదనంగా కల్పించాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4 లక్షలే కాగా 50 శాతం కొత్త ఉద్యోగాలను మేం వచ్చాక సృష్టించగలిగాం. ఉపాధిలో వ్యవసాయానిది కూడా ప్రముఖ పాత్ర. మన వ్యవసాయ రంగంపై 62 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. 52 శాతం మంది రైతులకు అర హెక్టారు లోపే భూమి ఉంది. 70 శాతం మందికి హెక్టారు లోపే పొలం ఉంది. ఏపీలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోతుంది. అందుకే రైతులకు ఆర్బీకే లు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా తోడుగా నిలుస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు అండగా.. అతి భారీ, భారీ పరిశ్రమల వల్ల 3 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తే ఎంఎస్ఎంఈలు 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 1.5 కోట్ల మందికి స్వయం ఉపాధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వెనుక వీటి పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధికి సహకారాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మన ప్రభుత్వం రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు, ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉంటే ఇప్పుడు 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. సొంతంగా కార్లు, వాహనాలు నడుపుతూ జీవించేవారికి వాహనమిత్ర ద్వారా అండగా నిలుస్తున్నాం. కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు లాంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఎంఎస్ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదల చేసి ప్రభుత్వం ఆదుకుంది. అందుకే వృద్ధి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. 2018–19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరిలో ఉండగా గతేడాది మొదటి 5 రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. ఎందుకీ ఏడుపులు..? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. విశాఖ విషయంలో మనం ఏం చేయాలి? నగర అభివృద్ధి చరిత్రను ఎలా మార్చాలి? వచ్చే పదేళ్లలోగా మనం మహా నగరాలతో ఎలా పోటీపడాలన్నదానిపై దృష్టి సారించాలి. ఇదే విజన్ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం, నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్తశుద్ధి లేకపోతే ఈ విజన్¯ సాకారం కాదు. వాస్తవంలోకి రాదు. అన్నిటికంటే ముందు.. ఒక సీఎంగా ఉన్న నేను ఇక్కడకు వచ్చి నివాసం ఉండాలి. నేను ఈ మాట చెప్పగానే ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలున్న నెగెటివ్ మీడియా ఒక్కసారిగా భోరున విలపిస్తాయన్న సంగతి మీకు తెలిసిందే. వైజాగ్‌కు మారుస్తున్నామంటే చాలు.. భూములు కబ్జా చేయడానికే వస్తున్నారంటూ సిగ్గు లేకుండా కథనాలు వ్యాప్తి చేస్తున్నారు. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారు. ఇవన్నీ వాళ్లు ఎందుకు చేస్తున్నారంటే?..సీఎం అనే వ్యక్తి ఇక్కడకు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది! ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పురోగతి సాధిస్తుంది! అందుకే సీఎం ఇక్కడకు రాకూడదని అడ్డుపడుతున్నారు. దీనివెనుక వారికి స్వార్థ ప్రయోజనాలున్నాయి. అమరావతి రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలను బినామీల పేర్లతో కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారు. విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు ‘వైజాగ్ విజన్’డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అవి ఏమిటంటే... ► కనెక్టివిటీలో భాగంగా రూ.8,980.82 కోట్లతో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణం, 6 లైన్ల బీచ్ కారిడార్ ప్రాజెక్టు, సబ్బవరం నుంచి షీలానగర్‌కు 6 లైన్ల రహదారి, షీలానగర్ నుంచి పోర్టు వరకు రోడ్డు నిర్మాణం. మరో రూ.1906.15 కోట్లతో నగరంలో వివిధ రోడ్ల నిర్మాణం. ► ప్రైట్ కారిడార్‌లో భాగంగా రూ.196 కోట్లతో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, శోంఠ్యాం నుంచి సింహాచలం వరకు ఫ్రైట్ కారిడార్. ► రూ. 14,309 కోట్లతో విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు ► రూ. 4,727 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం. ► పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రూ.2,633.47 కోట్లతో కనమాం వద్ద ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు, మురుగునీరు శుద్ధి ప్లాంటు, కోడూరు వద్ద ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం వగైరా. ► రూ. 10,823 కోట్ల పారిశ్రామిక పెట్టుబడుల్లో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు టీవీఎస్ లాజిస్టిక్స్, జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు తదితరాలు. ► రూ. 975 కోట్లతో విశాఖలో 24 గంటలు మంచినీటి సరఫరా పథకం ► రూ. 1,703 కోట్లతో నగరంలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు ► సోషల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్లో భాగంగా రూ. 50 కోట్లతో 100 పార్కుల అభివృద్ధి, రూ. 250 కోట్లతో 151 చెరువుల అభివృద్ధి ప్రాజెక్టును రానున్న 5 ఏళ్లలో చేపట్టనున్నారు. ► రూ. 300 కోట్లతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం ► నగరంలో రూ.169.3 కోట్లతో ఇండోర్ స్టేడియంల నిర్మాణం ► రూ. 33.33 కోట్లతో అత్యాధునిక శ్మశానవాటికల నిర్మాణం ► రూ.40 కోట్లతో అమ్యూజ్మెంట్, ఫన్ జోన్లు ఏర్పాటు. ► రూ. 87.5 కోట్లతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం. ► రూ. 108 కోట్లతో నేచురల్ హిస్టరీ పార్కు, రూ. 220 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, రూ. 18 కోట్లతో నేచురల్ కాటేజెస్ నిర్మాణం, రూ. 394.8 కోట్లతో బీచ్ డెక్, సైన్స్ మ్యూజియం నిర్మాణం. ► రూ.178.22 కోట్లతో ఎకో వైజాగ్ పేరుతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు నిర్మాణం, వనాల నిర్మాణం, రూ.16 కోట్లతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ► వీటితో పాటు రూ.4,039.20 కోట్లతో జగనన్న కాలనీల నిర్మాణం. రూ.1250 కోట్లతో మాల్స్, గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు స్వప్రయోజనం ఆశిస్తే కడప అనలేనా? హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో మనం పోటీపడాలంటే వైజాగ్ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లాంటిది. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక చోదకశక్తి కావాల్సిందే. నిజంగా నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది? ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి? దేనివల్ల ఆర్థికంగా పురోగమిస్తాం? అనే ఆలోచన చేయకపోతే అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ఈ కోణంలో మనం వైజాగ్ గురించి ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అని అంతా ప్రశ్నించుకోవాలి. నాయకుడి దార్శనికత సరిగా లేకపోతే వైజాగ్ అభివృద్ధి చెందదు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కోసం ఎవరైనా గట్టిగా నిలబడ్డారంటే.. అది నేను మాత్రమే. విశాఖ కోసం ప్రతిపక్షాలతో, ఎల్లో మీడియాతో పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుంటున్నారు. కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటా. నా ప్రమాణ స్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది. వైజాగ్ పట్ల నాకున్న కృతనిశ్చయం ఇది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన విశాఖలో రూ.1,528.92 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు నిర్వహించారు. ► రూ. 595 కోట్లతో మధురవాడలో పారిశ్రామిక, గృహ అవసరాల కోసం నీటి సరఫరా ప్రాజెక్టు పనులు ► రూ. 553 కోట్లతో మధురవాడలో సమగ్ర మురుగునీటి వ్యవస్థ పనులు, రూ. 99.47 కోట్లతో ముడసర్లోవ ప్రాంతంలో జీవీఎంసీ కొత్త సమీకృత కార్యాలయ నిర్మాణం. ► రూ. 231.04 కోట్లతో అమృత్ పథకం కింద వివిధ జోన్లలో సమగ్ర నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు పనులు. ► రూ. 15.65 కోట్లతో సాగర్‌నగర్ తాబేలు బీచ్ నిర్మాణ పనులు. ► రూ. 34.76 కోట్లతో ఎన్‌హెచ్–16కి సమాంతరంగా గిరి ప్రదక్షిణ రహదారి విస్తరణ పనులు. పదేళ్ల విజన్‌తో విశాఖ విశాఖ అభివృద్ధి కోసం పదేళ్ల విజన్‌తో వాస్తవిక దృక్పథంతో ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం,పీపీపీ పద్ధతుల్లో అందరూ ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖను తీర్చిదిద్దేలా ఈ విజన్ ఉంటుంది. రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయ రాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేమీ ఎలాంటి వ్యతిరేకతా లేదు. ముందుగానే రూ.లక్ష కోట్లు ఖర్చు అమరావతి అనేది 50 వేల ఎకరాల ఖాళీ భూమి. రోడ్లు, నీళ్లు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికే వాళ్లు ఇచ్చిన డీపీఆర్ ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే ముందు కనీసం రూ.లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం ఒక లక్ష కోట్లు అనుకుంటే 20 ఏళ్లలో ఏటా రూ.5 వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా రూ.10 లక్షల కోట్లో, ఖర్చులు పెరిగి రూ.15 లక్షల కోట్లో అయినా అవుతుంది. అందుకనే అక్కడ అది చేయలేమని అంటున్నాం. అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు. వైజాగ్‌లో ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలున్నాయి. మంచి రోడ్లు, కరెంటు, తాగునీటి సదుపాయం.. ఇలా అన్నీ ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్ సెక్రటేరియట్ ఉండాలి. అది దేశం దృష్టిని ఆకర్షించాలి. దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, అహ్మదాబాద్ తరహాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉండాలి. వాటి రాకతో వైజాగ్ స్ధాయి పెరుగుతుంది. దేశమే కాకుండా ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంశాలను బోధించేలా ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా రావాలి. రానున్న 15–18 నెలల్లో పూర్తి చేసేలా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టును అనుసంధానించేలా 6 లేన్లతో అందమైన బీచ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది. మెట్రో రైలు ప్రాజెక్ట్, ఏడాదిలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టుతో హారిజాంటల్ గ్రోత్ కారిడార్ ఏర్పడుతుంది. డేటా సెంటర్‌తో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఆతిథ్య రంగంలో ఒబెరాయ్, మై ఫెయిర్ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. నగరానికి అత్యుత్తమ ఫైవ్ స్టార్ సదుపాయాలు సమకూరుతాయి. ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ రూపంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ప్రధాని తాజాగా దీనికి వర్చువల్‌గా శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ సాధ్యం కానివేమీ కాదు. ఇవన్నీ వాస్తవ రూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబోతున్నాయి. హైస్పీడ్ రైలు కారిడార్లపై కూడా ప్రధానితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్ – వైజాగ్, విజయవాడ– బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీ రావడమే కాకుండా సీఎం కూడా ఇక్కడకు వస్తే పదేళ్లలో వైజాగ్ ప్రపంచంలో అత్యుత్తమ నగరాలతో పోటీపడుతుంది. ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలున్నా విశాఖ నగర వాసులకు నేను ఒకటే చెబుతున్నా.. మనం తప్పకుండా విజయం సాధిస్తాం. -
శృంగవరపుకోటలో ఎంఎస్ఎంఈ పార్కు..ఉత్తరాంధ్రకు ఊతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పారిశ్రామికంగా వెనుకబడిన విజయనగరం జిల్లాకే కాదు ఉత్తరాంధ్ర ప్రగతికే ఊతమిచ్చేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా వృథాగా ఉన్న జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్) సంస్థ భూముల సద్వినియోగం చేయాలని సంకల్పించింది. 1,166 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా సుమారు రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు ఈ జిల్లాకు రానున్నాయి. తద్వారా 45 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాదు.. పరోక్షంగా వివిధ అనుబంధ వ్యాపార, సేవా రంగాల ద్వారా మరింత మందికి ఉపాధి చేకూరుతుంది. ఈ పార్కు జిల్లా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో కీలకమవుతుందనడంలో సందేహం లేదు. తొలుత అల్యూమినియం శుద్ధి కర్మాగారం మహానేత వైఎస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంతో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తూనే మరోవైపు పారిశ్రామికంగానూ విజయనగరం జిల్లాకు ఊతమివ్వాలని తలపోశారు. అదే సమయంలో విశాఖ–విజయనగరం జిల్లాల సరిహద్దు (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా)లో విరివిగా ఉన్న బాక్సైట్ నిక్షేపాల సద్వినియోగంతో అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుచేయడానికి జిందాల్ గ్రూప్ యాజమాన్యం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో 2005లో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 14 లక్షల టన్నుల అల్యూమినియం ఉత్పత్తి లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సంస్థను 2005 జూలై 8న ఏర్పాటుచేసింది. అప్పట్లోనే భూసేకరణ పూర్తి అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకోసం జిందాల్ సంస్థ శృంగవరపుకోట మండలంలో కొనుగోలు చేసిన 180 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 985 ఎకరాలను కేటాయించింది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి కాగా ఎక్కువ భాగం అసైన్డ్ భూములు. వాటిపై ఆధారపడిన రైతులకు చట్టప్రకారం పరిహారాన్ని జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (జేఎస్డబ్ల్యూఏఎల్) యాజమాన్యం చెల్లించింది. 2007–08 నాటికల్లా భూసేకరణ పూర్తయింది. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పురోగతి ఆగిపోయింది. తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ ఆ ప్రాజెక్టుపై దృష్టిపెట్టలేదు. గిరిజనుల సంక్షేమం కోసం.. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ గిరిజనులు చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సైట్ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. నాడు సేకరించిన విలువైన భూమిని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో జిందాల్ యాజమాన్యం ఇటీవల ఎంఎస్ఎంఈ పార్కు లేదా లాజిస్టిక్స్ పార్కు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఏయే పరిశ్రమలకు అవకాశమంటే.. టెక్స్టైల్స్, అపెరల్స్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఇథనాల్ మాన్యుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, కాయిర్ ఇండస్ట్రీ, లిథియం–ఆయాన్ బ్యాటరీ రీసైక్లింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, టాయ్ ఇండస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు. వ్యూహాత్మక ప్రాంతంలో పార్క్ ► ఎంఎస్ఎంఈ పార్క్‌కు ప్రతిపాదించిన ప్రదేశం వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ► రాజమహేంద్రవరం–విజయనగరం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ► విశాఖపట్నం–అరకు రోడ్డుతో శరవేగంగా నిర్మాణమవుతున్న విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే ఉంది. ► విశాఖపట్నం పోర్టుకు, భోగాపురంలో నిర్మాణమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉంది. ► చెన్నై–హౌరా రైల్వేలైన్, విశాఖ–కిరండూల్ (కేకే) రైల్వేలైన్లకు సమీపంలో ఉంది. ► తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇది సమీపంలో ఉంది. .. ఇలా అన్నివిధాలా కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతంలో రూ.531 కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతిపాదించింది. తద్వారా రూ.15వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 45 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
రామాయపట్నం చెంత 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు
-
పోర్టుల చుట్టూ పారిశ్రామిక ప్రగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని వెలకట్టలేని సంపదగా భావిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి అనుకూలతగా మార్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఆ పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదచల్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న పోర్టుల పక్కన పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది. ముందుగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొత్త సంవత్సరంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో పోర్టు అందుబాటులోకి రానుండటంతో రామాయపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును ఏపీమారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తోంది. పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ మొదలు పెట్టినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు ఎండీ, సీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరు గ్రామంలో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ ఈ ఏడాది చివరినాటికి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టీపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్పస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు పక్కనే కార్గో ఎయిర్ పోర్ట్ కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో కార్గో ఆధారిత ఎయిర్‌పోర్టు నిర్మాణంపైన కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన దగదర్తి స్థానంలో కార్గో ఆధారిత విమానాశ్రయాన్ని రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెట్టు వద్ద అభివృద్ధి చేయనున్నారు. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కి తూర్పువైపు పోర్టు ఉంటే, పడమర వైపు ఎయిర్‌పోర్టు ఉండే విధంగా డిజైన్ చేశారు. -
హిందూపూర్‌లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
Andhra Pradesh: ‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే, సీఎం సమక్షంలో టెక్నోడోమ్ (టీవీ యూనిట్), వర్చువల్ మేజ్, సంస్థలకు సీఎం శంకుస్థాపన చేయగా.. టెక్నోడోమ్ (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.అంతకుముందు.. కడప గడపలో రూ.5.61 కోట్లతో ఆధునికీకరించిన రాజీవ్‌మార్గ్, రూ.1.37 కోట్లతో ఏర్పాటుచేసిన రాజీవ్ పార్కునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొప్పర్తిలో పారిశ్రామికరంగం ఊపందుకుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురావిురెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ సుధా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్‌బాబు, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్, ఎస్పీ అన్బురాజన్, ట్రెయినీ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీటీసీ నరేన్ రామాంజనేయరెడ్డి, అల్ డిక్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగిసిన మూడ్రోజుల పర్యటన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న వైఎస్సార్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగు, పులివెందుల, కడపలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు జగన్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 2.05 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరి వెళ్లారు. సంస్థల వివరాలు.. – అల్ డిక్సన్ టెక్నాలజీస్.. అల్ డిక్సన్ కంపెనీలో సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తారు. ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.127 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సంస్థలో 1,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్పత్తి సామర్థ్యం పెంపులో భాగంగా మరో రూ.80 కోట్ల పెట్టుబడితో ‘ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సెక్యూరిటీ కెమెరాలు మొదలైన పరికరాలు తయారుచేస్తారు. తద్వారా మరో 1,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, రూ.125.26 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే మరో యూనిట్ ద్వారా 630 మందికి ఉద్యోగావకాశాలు అందించే లక్ష్యంతో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు సాగుతోంది. మొదటి దశలో ఉత్పత్తులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ 860 మందికి ఉపాధి కల్పిస్తోంది. వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్న ‘వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీ వంటి అధునాతన డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రూ.71 కోట్ల పెట్టుబడితో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 1,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నోడోమ్ సంస్థ.. అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా ‘టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రూ.52 కోట్లతో ఏర్పాటవుతోంది. దుబాయ్‌లో వీరి ప్రధాన కార్యాలయం ఉండగా, నోయిడాలో భారత్ ప్రధాన కార్యాలయం ఉంది. ట్రేడింగ్ కంపెనీగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. బ్రాండెడ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ ఐటీ ఉత్పత్తుల సరఫరాదారులలో ఒకటిగా మారిన ఈ సంస్థ.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. గృహోపకరణాలు, గృహ వినోదం, వంటగది ఉపకరణాలు, ఐటీ వస్తువులు, కార్ ఆడియో, గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ వాచీలను ఉత్పత్తి చేయనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగాలను ఉత్పత్తి చేయనున్న ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎగ్జిక్యూషన్లో నైపుణ్యం కలిగి 8,000 పైగా ప్రాజెక్టు సిబ్బందితో మంచి వార్షిక ఆదాయంతో పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడ 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేల్స్ ఫోర్స్ ఔట్సోర్సింగ్, విజువల్ మర్చండైజింగ్, లాయల్టీ ప్రోగ్రాంలు వున్నాయి. అలాగే, వీరి ముఖ్య ఉత్పత్తులు సౌండ్బార్లు, వూఫర్లు, మల్టీమీడియా స్పీకర్లు, పార్టీ స్పీకర్లు, టవర్లు వంటివి తయారుచేస్తారు. -
Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023–27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించడం విశేషం. పాత పాలసీ గడువు ముగియకముందే కొత్త పాలసీని ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాధ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 31తో పాత విధానం ముగియనుండటంతో ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఏపీ :మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి కొంత సమయం తీసుకుంటాయి. దీనివలన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని, పాత పాలసీ ముగియకముందే కొత్తది అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనపై తనకున్న నిబద్ధతను సీఎం జగన్ చాటుకున్నారు. కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రంగాలకు పెద్దపీట వేశాం. పారిశ్రామిక రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనవనరుల రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో రూ.15 వేల కోట్ల జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. జల రవాణాను కూడా ప్రోత్సహిస్తున్నాం. పీపీపీ కింద ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నాం. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌ని అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాం. ఇన్నోవేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్ పేరుతో ఐకానిక్ టవర్ నిర్మించనున్నాం. నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి. దుబాయ్ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్ : స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు అన్ని వర్గాల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే అత్యుత్తమ పారిశ్రామిక విధానమిది. పరిశ్రమల్ని ఏపీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇక్కడి ప్రత్యేకతలు, వనరులు మొదలైన అంశాలన్నీ తెలిసేలా నూతన విధానాన్ని రూపొందించాం. కొత్త పాలసీ ద్వారా వైజాగ్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణల్ని, స్టార్టప్‌లకు చేయూతనందిస్తాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆర్ అండ్ డీ సెంటర్స్‌ని ప్రోత్సహిస్తాం. పాలసీ అద్భుతంగా ఉంది:సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ ప్రస్తుత పాలసీకంటే అద్భుతంగా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక పారిశ్రామికవేత్త ఏం కోరుకుంటారో వాటన్నింటినీ ఇందులో పొందుపరిచారు. లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యమివ్వడం అద్భుతం : శ్రవణ్ షిప్పింగ్ ఎండీ సాంబశివరావు 2023–27 పారిశ్రామిక విధానంలో అనేక నూతన అవకాశాలు, వనరులు, ప్రోత్సాహకాలు అందించారు. ఇది పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసినట్లే. దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తన్న లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట : ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణప్రసాద్ నూతన విధానం అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఎస్జీఎస్టీ 100 శాతం రీయింబర్స్మెంట్ మంచి సంకేతం. పరిశ్రమలకు కావాల్సింది మౌలిక వసతులే:ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర పరిశ్రమలు ఆర్థిక రాయితీలకంటే మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి అనుగుణంగా నూతన పాలసీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక మౌలిక వసతులు, సులభతర వాణిజ్యంకు పెద్ద పీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. పరిశ్రమలకు ఊతమిచ్చే పాలసీ :సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ ఎం.లక్ష్మీ ప్రసాద్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉంది. భారీ పరిశ్రమల నుంచి ఎంఎస్ఎంఈల వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమలకు చెందిన 96 అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్సార్ ఏపీ వన్ యాప్‌ను తేవడం హర్షణీయం. పోర్టు ఆధారిత వ్యాపారాభివృద్ధి, ప్రపంస్థాయి మౌలిక వసతులు, రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీల నిర్మాణం, ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టార్టప్‌ల కోసం ఐ–స్పేస్ పేరుతో టవర్ నిర్మాణం వృద్ధికి దోహదం చేస్తాయి. నూతన విధానంలో ప్రధానాంశాలు.. ♦ ప్లగ్ అండ్ ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ ♦ వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ♦ వ్యాపారాన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం ♦ పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ♦ తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాలపరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు ♦ ఎర్లీబర్డ్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ♦ ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం ♦ లో కాస్ట్, లో రిస్క్ బిజినెస్ ♦ పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి ♦ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ♦ అంతర్జాతీయ కనెక్టివిటీ, తయారీ రంగంలో ఎకో సిస్టమ్ ♦ దుబాయ్ తరహాలో బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ♦ పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ ♦ తొలిసారిగా ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి -
పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు
ఇది పెనుకొండ మండలం గుడిపల్లి ఇండస్టియల్ పార్క్‌లో ఏర్పాటైన ఎస్ఆర్ఎం కంపెనీ. 2021లో దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నెలకొల్పారు. కార్ల సంబంధిత పరికరాలను రోబోల సహాయంతో తయారు చేసి కంపెనీలకు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా వందల సంఖ్యలో కార్మికులు లబ్ధి పొందుతున్నారు. సాక్షి, అనంతపురం: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఉమ్మడి అనంతపురం జిల్లా స్వర్గధామంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారమందుతుండడం, పెద్ద నగరాలకు సులువుగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మూడేళ్లలోనే 900 పరిశ్రమలు.. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కల్పించారు. వీటిల్లో పుట్టపర్తి మండలం కప్పల బండ, రాప్తాడు, ఆర్.అనంతపురం, కొటిపి గ్రామాల్లోని పార్కుల్లో 50 శాతానికి పైగా రాయితీతో పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించారు. దీంతో గత మూడేళ్లలోనే రూ.300 కోట్ల పెట్టుబడితో 990 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఒక్క శ్రీ సత్యసాయి జిల్లాలోనే 800కి పైగా పరిశ్రమలు రూపుదిద్దుకున్నాయి. 6,200 మందికి ఉపాధి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. 990 పరిశ్రమల ద్వారా దాదాపు 6,200 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుందన్నారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఈ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. హిందూపురం డివిజన్ పరిధిలోని గొల్లాపురం గ్రామంలో గతేడాది రూ.7 కోట్ల పెట్టుబడితో ప్రైమ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏర్పాటు చేశారు. గృహోపకరణాలైన డోర్లు, కిటికీలతోపాటు వివిధ రకాల వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 250 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పారిశ్రామిక హబ్‌ల తయారీ లక్ష్యం.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాలను పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా మార్చి పారిశ్రామిక హబ్‌లుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక సంకల్పంతో సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నుంచి సులువుగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కారిడార్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు సైతం పరిశ్రమిస్తుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, సమీపంలోనే ఉపాధి దొరుకుతుండడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాల ప్రోత్సాహం పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. భూముల కేటాయింపుతోపాటు విద్యుత్ రాయితీలను సైతం అందిస్తోంది. హిందూపురం పారిశ్రామికవాడ పరిధిలోని గొల్లాపురం, కొటిపిలో ప్రత్యేకంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే భూములను అభివృద్ధి చేశాం. మౌలిక వసతులు కల్పించాం. యువ పారిశ్రామికవేత్తలు యూనిట్ ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి. – మురళీమోహన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతూ.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కేంద్రంగా లాజిస్టిక్ రంగం అభివృద్ధికి కీలకమైన అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధితో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసేలా 110 ఎకరాల విస్తీర్ణంలో మరో ఇండ్రస్టియల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ సంస్థ ఆంగ్లియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐడీపీఎల్) సిద్ధమవుతోంది. విశాఖ ఎన్టీపీసీ సమీపంలో భారీ హబ్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే విశాఖపట్నంలో లాజిస్టిక్ ఎఫిషియన్సీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం (లీప్) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు (ఎంఎంఎల్పీ) ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో లాజిస్టిక్ పార్క్‌ను నిర్మించాలని భావిస్తోంది. తాజాగా ఏఐడీపీఎల్ ఇక్కడ ఇండ్రస్టియల్ కమ్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు విస్తరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు మధ్య ఎన్టీపీసీకి సమీపంలో సుమారు 110 ఎకరాల్లో ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది రెండు పోర్టులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొంది. చదవండి: (అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు) ఇందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. స్టార్టప్‌లు, ఇతర పరిశ్రమలకు ఇందులో లీజుకు లేదా పూర్తి హక్కులతో స్థలాలను ఇస్తారు. ఈ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి, వాటికి అవసరమైన వస్తువుల దిగుమతులకు ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా.. పక్కనే లాజిస్టిక్ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. సమీపంలో ఫార్మా సిటీ కూడా ఉండటంతో.. ఫార్మా ఉత్పత్తుల నిల్వకు మెగాసైజ్ కోల్డ్ చైన్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ పార్క్‌లో మౌలిక వసతులతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు ఏఐడీపీఎల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఆంగ్లియాన్ గ్రూపు ప్లగ్ అండ్ ప్లే విధానంలో వేర్‌హౌస్, కోల్డ్ చైన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో విశాఖ, కాకినాడల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2030 నాటికి దేశంలోనే అతి పెద్ద వేర్ హౌస్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు విశాఖపట్నం తరహా నగరాల్లో విస్తరణ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఎలక్ట్రికల్ లాజిస్టిక్ రంగంలో ఆంగ్లియాన్ ఒమేగా పేరుతో ఒక టన్ను బరువును మోయగలిగే బ్యాటరీతో నడిచే ఆటోలను ఉత్పత్తి చేస్తోంది. -
TS: ఏళ్లకేళ్లు గడిచిపోతున్నా పరిశ్రమలు లేవు.. వేల ఎకరాల భూమి నిరుపయోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడం, పరిశ్రమల స్థాపనతో ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం వేల ఎకరాలను కేటాయించింది. కానీ ఏళ్లకేళ్లు గడిచిపోతున్నా.. ఆ స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటుకావడం లేదు. అలాగని తిరిగి ప్రభు త్వం చేతిలోకీ రావడం లేదు. వేల ఎకరాలు ఎటూ కాకుండా నిరుపయోగంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే దీనిపై దృష్టి పెట్టి పారిశ్రామిక పార్కుల్లోని ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టినా ఫలితం మాత్రం కానరావడం లేదు. మంత్రి ఆదేశాలు జారీచేసి రెండేళ్లు కావొస్తున్నా.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోని పారి శ్రామిక వాడల్లో ఉన్న భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియ అంగుళం కూడా ముందుకు కదలలేదు. 55 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భూమి ధర నిర్ణయం, ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) చూసుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ 1973 నుంచి 2014 వరకు సుమారు 27 వేల ఎకరాలను అభివృద్ధి చేయగా.. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్ఐఐసీ 28వేల ఎకరాల్లో 152 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక చట్టం టీఎస్ఐపాస్ ద్వారా 2014 నుంచి ఇప్పటివరకు 20,909 పరిశ్రమలకు అనుమతు లు ఇవ్వగా.. రూ.2.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.81 లక్షల మందికి ఉపాధి లభించినట్టు అధికార వర్గాల అంచనా. అయితే పారిశ్రామికవాడల్లో భూములు కేటాయించినా పరిశ్రమలు స్థాపించకపోవడంతో ఇటు భూములకు, అటు ఉపాధికి గండిపడుతోంది. రెండేళ్ల కింద ఆదేశించినా.. భూకేటాయింపులు పొందినా కార్యకలాపాలు ప్రారంభించని పరిశ్రమలను గుర్తించి, నోటీసులు జారీ చేయాలని.. ఆయా భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 2020 ఆగస్టులో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన టీఎస్ఐఐసీ 65 పరిశ్రమలకు సంబంధించి సుమారు రెండు వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని గుర్తించింది. ఒక ఎకరం మొదలుకుని 250 ఎకరాల మేర విస్తీర్ణం వరకు ఈ ప్లాట్లు ఉన్నట్టు తేలి్చంది. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని రావిర్యాలలో ఉన్న ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్ పార్క్, కరకపట్లలోని బయోటెక్ పార్క్, నానక్‌రామ్‌గూడలోని పారిశ్రామికవాడల్లో ఉన్న ఈ భూముల కేటాయింపులను రద్దు చేసి.. ఇతర పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా పరిశ్రమల యజమానులకు 2020 సంవత్సరం చివరిలోనే నోటీసులు ఇచి్చంది. కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా తిరిగి ప్రభుత్వపరం కాలేదు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో.. వాటిని వదులుకోవడానికి సంబంధిత పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. నోటీసులు అందుకున్నవారిలో కొందరు పనులు ప్రారంభించేందుకు ఒకటి, రెండేళ్లు గడువు ఇవ్వాలని కోరగా.. మరికొందరు టీఎస్ఐఐసీకి కొంత మొత్తాన్ని అపరాధ రుసుముగా చెల్లించినట్టు తెలిసింది. కానీ చాలా మంది టీఎస్ఐఐసీ తమకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అసలు గడువు రెండేళ్లే అయినా.. నిబంధనల ప్రకారం పారిశ్రామిక వాడల్లో భూకేటాయింపులు జరిగిన రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు భూకేటాయింపులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టిన టీఎస్ఐఐసీ ఆయా భూముల్లో కార్యకలాపాల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్లను ఇతర అవసరాలకు వినియోగిస్తుండగా.. మరికొందరు ఖాళీగా వదిలేశారు. రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరగడం, పారిశ్రామిక పెట్టుబడులు, స్థాపన వేగవంతం కావడంతో.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. సేల్ డీడ్ ఇవ్వక.. రుణాలు రాక.. అయితే టీఎస్ఐఐసీ కొన్నేళ్ల కింద భూకేటాయింపుల నిబంధనలను మార్చింది. కేటాయింపులు పొందిన వారికి నేరుగా ‘సేల్ డీడ్’ ఇవ్వకుండా ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తోంది. తాము ఏళ్ల తరబడి కార్యకలాపాలు ప్రారంభించక పోవడానికి ఈ నిబంధనే కారణమని నోటీసులు అందుకున్న కొందరు పరిశ్రమల యజమానులు చెప్తున్నారు. పెట్టుబడి వ్యయంలో 70 శాతం దాకా భూమి కొనుగోలు, భవన నిర్మాణాలకే ఖర్చవుతోందని.. యంత్ర సామగ్రి, పరికరాలకు రుణాల కోసం బ్యాంకులకు వెళితే అప్పు పుట్టడం లేదని అంటున్నారు. భూములకు సంబంధించి ‘సేల్ డీడ్’ ఉంటేనే రుణాలు ఇస్తామంటున్నాయని వాపోతున్నారు. టీఎస్ఐఐసీ ఎన్వోసీ ఇస్తామన్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. దాంతో పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభించలేక పోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పారిశ్రామికవేత్తల ఇబ్బందిని తొలగించడం, ఇటు ఖాళీ ప్లాట్ల స్వా«దీనంలో ఇక్కట్లను అధిగమించడం కోసం.. భూకేటాయింపు నిబంధనల్లో సవరణలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు టీఎస్ఐఐసీ వర్గాలు చెప్తున్నాయి. -
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నగర శివారు మేడ్చల్ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు తొలి అడుగుపడింది. 150కి పైగా కంపెనీల స్థాపన.. శివారుల్లో ఇప్పటికే గ్రీడ్ పాలసీలో భాగంగా ఉప్పల్ జెన్‌ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు స్థాపనకు పునాది రాయి పడింది. నగరానికి ఉత్తరం వైపు కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండు పార్కుల ఏర్పాటుతో 150కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. భూ పరిహారం సైతం చెల్లింపు... గ్రేటర్‌కు తూర్పు దిశలో ఘట్కేసర్ మండలం మాదారంలో త్వరలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కానుండటంతో... జిల్లా నిరుద్యోగ యువతలో ఉపాధిపై ఆశలు చిగురించాయి. ఈ పార్కు స్థాపనకు రైతుల అంగీకారంతో 226 ఎకరాల భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం వారికి చెల్లించాల్సిన భూ పరిహారాన్ని కూడా అందజేసింది. జిల్లా పరిశ్రమల శాఖ కూడా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు అన్నీ అనుమతులు ఇప్పించింది. భూ నిధి ఎక్కువే... నగర శివారు మేడ్చల్ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూనిధి ఉంది. జిల్లా పరిధిలో 66.8 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 65 కిలోమీటర్ల రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా పారిశ్రామికాధిపతులు భావిస్తున్నారు. రహదారుల సమీపంలో దాదాపు 10వేల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 6,084 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా 5వేల ఉద్యోగాలు మేడ్చల్ జిల్లాలో కరోనా కష్టకాలం (2021–22 ఆర్థిక సంవత్సరం)లో రూ34.95 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 685 పరిశ్రమలు ఏర్పడగా, 5,536 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీంతో పరోక్షంగా జిల్లాలో వందలాది మందికి ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపనతో 1.93 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో రూ.14,762 కోట్ల పెట్టుబడులతో 8,461 సూక్ష్మ, చిన్న, మధ్యతరహ, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తద్వారా 1,93,050 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. (క్లిక్: ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..) -
వైఎస్సార్ వరమిస్తే.. సీఎం జగన్ సాకారం చేశారు
మడకశిర.. జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని జనం. అందుకే యువత ఉపాధి కోసం పెద్దసంఖ్యలో సమీపంలోని కర్ణాటకకు వలసవెళ్తోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నియోజవకర్గంలోని అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపేందుకు రూ. 214.కోట్లు విడుదల చేసింది. తాజాగా ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు పారిశ్రామికవాడ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. మడకశిర: మండలంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడకు దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే బీజం పడింది. అప్పట్లోనే మడకశిర మండలం గౌడనహళ్లి, ఛత్రం, ఆర్. అనంతపురం గ్రామ పంచాయతీల పరిధిలో 800 మంది రైతుల నుంచి 1,600 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. భూములిచ్చిన రైతులకు చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా చెల్లించ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బకాయిపడ్డ రూ.25 కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వసతులు పుష్కలం పారిశ్రామిక వేత్తలు సౌకర్యాలన్నీ చూశాకే పరిశ్రమల స్థాపనకు ముందుకువస్తారు. మడకశిరపరంగా చూస్తే కావాల్సిన వసతులన్నీ అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాశ్రయమున్న బెంగళూరు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చే అవకాశ ముంది. అదే విధంగా రాయదుర్గం నుంచి మడకశిర మీదుగా తుమకూరు వరకూ ప్రస్తుతం రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇప్పటికే పారిశ్రామికవాడకు చుట్టుపక్కలున్న చెరువులకు ఏటా కృష్ణా జలాలు అందుతున్నాయి. వీటితో పాటు మడకశిర–కర్ణాటకలోని ముఖ్యమైన పట్టణాల మధ్య జాతీయ రహదారుల అనుసంధానం పెరిగింది. ఇవన్నీ పారిశ్రామికవాడ అభివృద్ధికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. చదవండి: (CM Jagan: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) ఏపీఐఐసీకి 1,443 ఎకరాల భూమి అప్పగింత మడకశిర కేంద్రంగా ఏర్పాటు చేసే పారిశ్రామికవాడ వేగంగా ప్రగతి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి అవసరమైన చర్యలను చేపట్టింది. పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జాప్యం జరగకుండా భూ కేటాయింపునకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు 1,443 ఎకరాల భూమిని వెంటనే అప్పగించింది. రెండు పరిశ్రమలకు భూమి కేటాయింపు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అర ఎకరా చొప్పున భూమిని కేటాయించింది. అంతేకాకుండా బెంగళూరు చెందిన పలువురు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరుతూ ఏపీఐఐసీకి దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. వీరికి కూడా భూమి కేటాయించడానికి ఏపీఐఐసీ ప్రక్రియను ప్రారంభించింది. ఇలా ఒక్కో పరిశ్రమ ఏర్పాటవుకు అడుగులు పడుతుండగా...నిరుద్యోగుల కల సాకారమయ్యే రోజు ఎంతో దూరం లేదని తెలుస్తోంది. చదవండి: (వారానికోసారి కట్టించేసుకోండి) పారిశ్రామికవాడ అభివృద్ధికి చర్యలు మడకశిర పారిశ్రామికవాడ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం 1,443 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే రెండు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎకరా భూమి కేటాయించాం. పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దరఖ>స్తులు కూడా సమర్పించారు. వారికి నిబంధనల మేరకు భూములు కేటాయిస్తాం. పారిశ్రామికవాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఉంది. – మల్లికార్జున్, జిల్లా మేనేజర్, ఏపీఐఐసీ మడకశిర సమగ్రాభివృద్ధి మడకశిరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ నేతృత్వంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగుల జీవితాలు బాగు పడుతాయి. యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. –డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్యే, మడకశిర స్థానికంగానే ఉపాధి మడకశిర కేంద్రంగా పారిశ్రామికవాడ ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెస్సీ పూర్తి చేశా. ఉద్యోగ వేటలో ఉన్నా. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటైతే తప్పకుండా ఇక్కడే ఉద్యోగం దొరుకుతుంది. అమ్మానాన్నలను చూసుకుంటూ ఇక్కడే ఉండవచ్చు. ఇంతటి అవకాశమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – శోభ, దొక్కలపల్లి, అగళి మండలం కల నెరవేరింది నిరుద్యోగులు ఏళ్ల తరబడిగా పారిశ్రామికవాడ కోసం ఎదురు చూస్తున్నాం. మాలాంటి వారి కలను వైఎస్ జగన్ నెరవేరుస్తుండడం ఎంతో గొప్ప విషయం. నేను బీటెక్ పూర్తి చేసినా సరైన ఉద్యోగం దొరకలేదు. పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటైతే మంచి ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా. – మంజునాథ్, మడకశిర 75 శాతం ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చిన జీఓ ప్రకారం పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడు పారిశ్రామికవాడ ఏర్పాటై పరిశ్రమల స్థాపన జరిగితే వీరందరూ తిరిగి స్వగ్రామాలకు వస్తారు. – కృష్ణయాదవ్, ఆర్ గొల్లహట్టి, రొళ్ల మండలం -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’
దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి. – కేటీఆర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు... కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు. ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం పటాన్చెరు టౌన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ వారం పటాన్చెరు పట్టణంలోని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్ వివరించారు. ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు. -
పెట్టుబడుల పట్టుగొమ్మ
సాక్షి, అమరావతి: ఓ వైపు కోవిడ్ భయాలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆదానీ, ఆదిత్యా బిర్లా, ఓఎన్జీసీ, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్, సెంచరీ పైబోర్డ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తోడు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏసీలు, మొబైల్ విడిభాగాల ఉత్పత్తులను తయారు చేయడానికి బ్లూస్టార్, డైకిన్, యాంబర్, డిక్సన్, ఫాక్స్‌కాన్, సెల్కాన్, కార్బన్ వంటి సంస్థలు ముందుకు రావడంతో 2021ని ‘ఎలక్ట్రానిక్ ఇయర్’గా పిలుచుకోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక మౌలిక వసతులను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఆంక్షలు ఉన్నప్పటికీ రికార్డు సమయంలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి అదనంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద 2,134 ఎకరాల్లో క్రిస్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కు తొలి దశలో భాగంగా రూ.1,190 కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి డీపీఆర్ రూపొందిస్తోంది. ఇదే సమయంలో రూ.13,254 కోట్లతో రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో మూడు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. దేశంలోనే తొలిసారిగా రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదం తెలపడమే కాకుండా 4 హార్బర్ల పనులు మొదలుపెట్టి మరో 5 హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన కొన్ని ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనలు ► విశాఖలో ఆదాని గ్రూప్ రూ.14,634 కోట్లతో 200 ఎంవీ సామర్థ్యంతో డేటా పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం 130 ఎకరాల భూమిని కేటాయించింది. ► కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామ్యం కావడానికి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చింది. ఈ యూనిట్లో సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ► కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద రూ.3,600 కోట్ల పెట్టుబడితో ఈపీసీఎల్ ఎల్ఎన్జీ టెర్మినల్. ► నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్. ► కొప్పర్తిలో రూ.401 కోట్లతో పిట్టి రెయిల్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్, పరిశ్రమల పరికరాల తయారీ యూనిట్. ► కొప్పర్తిలో రూ.486 కోట్లతో నీల్కమల్ ఫర్నిచర్ తయారీ యూనిట్ ► నాయుడుపేటలో గ్రీన్‌టెక్ రూ.627 కోట్లతో విస్తరణ పనులు. ► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో రూ.2,868.6 కోట్ల పెట్టుబడులతో హోటల్స్ ఏర్పాటు. ► కొప్పర్తిలో రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ యూనిట్ ► వైఎస్సార్ జిల్లా బద్వేలులో రూ.2,600 కోట్లతో సెంచరీ ప్లైబోర్డ్స్ తయారీ యూనిట్. ► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.861 కోట్లతో గ్రాసిం ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా తయారీ యూనిట్. ► కొప్పర్తిలో రూ.207 కోట్ల పెట్టుబడితో ఏఐఎల్ డిక్సన్ తయారీ యూనిట్. ► కొప్పర్తిలో రూ.75 కోట్లతో డీజికాన్ సొల్యూషన్స్ యూనిట్ ఏర్పాటు. ► రూ.100 కోట్లతో సెల్కాన్ రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.109 కోట్లతో ఆస్ట్రం టెక్నికల్ భాగస్వామి చంద్రహాస్ ఎంటర్‌ప్రైజస్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.112 కోట్లతో యూటీఎన్పీఎల్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.365 కోట్లతో వీవీడీఎన్ యూనిట్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ యూనిట్. ► రూ.1,800 కోట్లతో కార్బన్ హార్మనీ యూనిట్. ► శ్రీ సిటీలో డైకిన్ రూ.1,000 కోట్లతో ఏసీ తయారీ యూనిట్. ► శ్రీ సిటీలో రూ.540 కోట్లతో బ్లూస్టార్ ఏసీ తయారీ యూనిట్. ► శ్రీ సిటీలో రూ.250 కోట్లతో యాంబర్ ఏసీ తయారీ యూనిట్. -
Andhra Pradesh: పారిశ్రామిక విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పారిశ్రామిక విప్లవం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక గతిని మార్చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన రెండు భారీ పారిశ్రామిక పార్కుల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సకాలంలో పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లను ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది. గరువారం వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. డిక్సన్ సంస్థకు తొలి దశలో అభివృద్ధి చేసిన నాలుగు షెడ్లను అందించనున్నారు. కొప్పర్తి డిక్సన్ యూనిట్లో పని చేయడానికి తీసుకున్న ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తారు. కీలక ఒప్పందాలు ► ఈఎంసీలో డిక్సన్ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది. ► వీటితో పాటు ఫాక్స్‌కాన్, డీజీకార్న్, రెసల్యూట్, ఆస్ట్రమ్ వంటి పలు సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తైవాన్‌కు చెందిన ప్రభుత్వ రంగ ప్రమోషన్స్ ఏజెన్సీ, రష్యాకు చెందిన ఏజెన్సీ, మన దేశంలోని ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అసోసియేషన్స్ (ఐఈఎస్ఏ)లతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ► వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో ఏర్పాటైన 18 ఫార్మా, సిమెంట్, పెయింట్స్ తయారీకి చెందిన యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ 18 యూనిట్ల ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ► వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ముఖద్వారం రెండు భారీ యూనిట్లకు శంకుస్థాపన ► రెండు పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవంతో పాటు మరో రెండు భారీ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. బద్వేల్ వద్ద రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ప్లైబోర్డ్ ఇండియా లిమిటెడ్ యూనిట్ పనులకు డిసెంబర్ 23 ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ► ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతోపాటు రైతులకు ప్రయోజనం కలగనుంది. సుమారు 22,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.315 కోట్ల విలువైన యూకలిప్టస్ చెట్లను ఈ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. ► పులివెందులలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ యూనిట్ పనులకు డిసెంబర్ 24న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,122 మందికి ఉపాధి లభించనుండగా అందులో అత్యధికంగా మహిళలకు అవకాశం రానుంది. 23న ప్రారంభించే కంపెనీలివే.. స్వర్ణముఖి కాంక్రీట్స్, శ్రీ దుర్గా సిమెంట్స్, ఫిలెమన్ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్, అవన్ని ఆర్గానిక్స్, రాయలసీమ ఎన్విరాన్ కేర్, బీఎస్ ల్యాబొరేటరీస్, యునోటెక్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గణేష్ శానిటేషన్, ఎస్ పెయింట్స్ మాన్యుఫాక్చరర్స్, అక్షర నోట్‌బుక్ అండ్ బైండింగ్ ఇండస్ట్రీ, ఆర్డీఎల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుమిత్ర ల్యాబ్స్, మణి కెమ్ ఫార్మా, శ్రీ లక్ష్మి మేఘన ఎంటర్ప్రైజెస్, ఎస్ఎన్ఆర్ ఫార్మా, శ్రీ లక్ష్మీ బయో ఆర్గానిక్స్, ఒబ్లి ఇండస్ట్రీస్, స్టార్ పేపర్ బోర్డ్స్. -
AP: ‘కొప్పర్తి’ పరిశ్రమలకు అన్నీ చౌకే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కు బ్రాండింగ్‌పై ఏపీఐఐసీ దృష్టిసారించింది. కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్జేఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్‌ఈఎంసీ)లలో భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వీటి ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రచురించింది. కొప్పర్తి పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గుతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, అభివృద్ధి చేస్తున్న మౌలికవసతులు వంటి విషయాలను ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించింది. నాలుగు విధాలుగా తగ్గనున్న వ్యయం దేశంలోని ఇతర పారిశ్రామిక పార్కులతో పోలిస్తే ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు నిర్వహణ వ్యయం భారీగా తక్కువగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు ఇతర రాష్ట్రాల కంటే చౌకగా భూమి, విద్యుత్, నీరుతో పాటు చౌకగా కార్మికులు అందుబాటులో ఉన్న విషయాన్ని ఏపీఐఐసీ గణాంకాలతో వివరించింది. దేశంలో అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కుల్లో సగటున ఎకరం ధర రూ.85 లక్షలు ఉంటే ఇక్కడ రూ.25 లక్షలకే కావాల్సినంత భూమి అందుబాటులో ఉంది. దీనివల్ల పెట్టుబడిలో భూ వ్యయం 64 శాతం తగ్గనుంది. అదేవిధంగా యూనిట్ల నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్‌ను కూడా చౌకగా అందిస్తోంది. దేశంలో సగటు పారిశ్రామిక యూనిట్ ధర రూ.8.2గా ఉంటే వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో 21 శాతం తక్కువగా యూనిట్ రూ.5.5కే అందిస్తున్నారు. అదే వైఎస్సార్ఈఎంసీలో అయితే యూనిట్ రూ.4.5కే ఇస్తున్నారు. అంటే దేశ సగటుతో పోలిస్తే 45 శాతం చౌకగా వైఎస్సార్ఈఎంసీలో విద్యుత్‌ను అందిస్తున్నారు. దేశంలో సగటున కిలోలీటరు నీటిని రూ.70కి ఇస్తుంటే 24 గంటలు కావాల్సినంత నీటిని గండికోట రిజర్వాయర్ నుంచి రూ.55కే ఇస్తున్నారు. దీనివల్ల నీటి నిర్వహణ వ్యయం 15 శాతం తగ్గనుంది. దేశంలో సగటున కార్మికులకు నెలకు రూ.8,500 కూలి లభిస్తుంటే ఇక్కడ రూ.7,500కు కావాల్సినంతమంది అందుబాటులో ఉన్నారు. ఈ నాలుగు అంశాలే పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించనున్నాయని ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. కలిసొచ్చే అంశాలు 6.. కొప్పర్తి పారిశ్రామికవాడలో పెట్టుబడులకు మరో ఆరు అంశాలు కలిసివస్తాయని ఏపీఐఐసీ ఆ పుస్తకంలో పేర్కొంది. పూర్తిగా పర్యావరణ అనుమతులు పొందిన 6,914 ఎకరాలు అందుబాటులో ఉండటం, నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకునే విధంగా రెడీ టు బిల్డ్ షెడ్లతో పాటు రోజుకు 46 ఎంఎల్డీ నీరు, 132 కేవీ సబ్‌స్టేషన్, 2.6 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం, ఆరు, నాలుగు, రెండు లైన్ల రహదారులు వంటి అనేక మౌలికవసతులు కల్పిస్తున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే 50 వేలమందికిపైగా ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కార్గో సర్వీసుల కోసం ప్రత్యేక టెర్మినల్ కలిసొచ్చే అంశం. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో ఇతర ప్రయోజనాలు ఇవేగాకుండా వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్‌చేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వైఎస్సార్ ఎంఐహెచ్ పాలసీ–2020–23ని విడుదల చేసింది. అలాగే వైఎస్సార్ ఈఎంసీలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పించే యూనిట్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ► 100 శాతం స్టాంప్/ట్రాన్సఫర్ డ్యూటీ తిరిగి చెల్లింపు ► ప్రాజెక్టు విలువలో 20 శాతం చొప్పున గరిష్టంగా రూ.10 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ► అదే మైనార్టీలు అయితే 25 శాతం చొప్పున గరిష్టంగా రూ.25 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ► సరుకు రవాణా వ్యయంలో 25 శాతం చొప్పున ఏడాదికి రూ.50 లక్షల వరకు.. ఐదేళ్లు ఇస్తారు ► ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీ రాయితీ చొప్పున ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు చెల్లింపు ► ఐదేళ్లపాటు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ సబ్సిడీ ► ఎనిమిదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ తిరిగి చెల్లింపు -
పరిశ్రమలకు పుష్కలంగా నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు తగినంత నీరు అందించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు ఒప్పందం కుదుర్చుకునే సమయానికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఐఐసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా కోసం సుమారు రూ.2,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం ఏపీ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం విశాఖ నగర వాసులతో పాటు అక్కడి పరిశ్రమలకు నీటిని అందించడానికి జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కో) సేవలను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా, మరికొన్నింటికి 2022లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని ఏపీఐఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఏ పారిశ్రామిక పార్కుకు ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలి.. అందుకు అయ్యే వ్యయం ఎంత.. అన్నది లెక్క తెల్చారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు సోమశిల నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా.. కృష్ణపట్నం, నాయుడుపేట, చిత్తూరు జిల్లాలోని పార్కులకు కండలేరు నుంచి.. విశాఖకు గోదావరి జలాలను.. అనంతపురానికి హంద్రీ–నీవా నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని వినియోగంచుకునే విధంగా కృష్ణపట్నం వద్ద పైలెట్ ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చౌకగా నీటిని అందిస్తాం రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ఇతర రాష్ట్రాలకంటే తక్కువ రేటుకే నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారానే రాష్ట్రంలోని అన్ని కంపెనీలకు నీటిని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అవాంతరాలు లేకుండా నీటిని పుష్కలంగా అందిస్తే కిలో లీటరుకు ఎంత ధరైనా చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చౌకగా నీటిని అందించే విధంగా ఏపీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. – కే.రవీన్ కుమార్ రెడ్డి, వీసీ, ఎండీ, ఏపీఐఐసీ -
రాష్ట్రానికి రూ.60 కోట్ల విలువైన ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న పరిశ్రమలు–క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్ఈ–సీడీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.59.83 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.37.59 కోట్లతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎంఎస్ఈ–సీడీపీ స్టీరింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్, మాచవరంలో పప్పులు తయారీ, వాటి ఉత్పత్తుల క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.30.07 కోట్లు ఇవ్వనుంది. దీనికి అదనంగా ఇప్పటికే ఉన్న మూడు పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. మచిలీపట్నంలోని ఆభరణాల పారిశ్రామిక పార్కు, హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్ ఇండ్రస్టియల్ పార్కులను రూ. 22.24 కోట్లతో ఆధునీకరించడానికి కేంద్రం తుది ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.15.57 కోట్లు సమకూర్చనుంది. మంగళవారం కేంద్ర ఎంఎస్ఎంఈ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఎంఎస్ఈ–సీడీపీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జే.సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ, ఎండీ కె.రవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొప్పర్తి పార్క్: 2.50 లక్షల మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక పార్కులో పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. సుమారు 7 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మల్టీ ప్రొడక్ట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్‌కు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా నామకరణం చేశారు. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా ఇండస్ట్రియల్ పార్కు (ఎంఐపీ) ద్వారా కనీసం రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. కనీసం 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించగలమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో 24 గంటల విద్యుత్, నీరు, మురుగు నీటి శుద్ధి, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నెలకొల్పే యూనిట్లకు రాష్ట్ర పారిశ్రామిక పాలసీ 2020–23లో ఇచ్చే రాయితీలకు అదనంగా మరికొన్ని రాయితీలను అందిస్తోంది. చదవండి: (అభివృద్ధిలో పైపైకి) ప్రత్యేక రాయితీలు ఇలా.. ►వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలకు పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు తొలుత భూమిని 33 సంవత్సరాలకు లీజు పద్ధతిలో ఏపీఐఐసీ కేటాయిస్తుంది. ►గరిష్టంగా 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించుకోవచ్చు. వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన పదేళ్ల తర్వాత భూమిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ►అమ్మకం, లీజు ఒప్పందాలపై చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీలపై తొలిసారి నూరు శాతం, రెండోసారి నుంచి 50 శాతం తిరిగి చెల్లిస్తారు. ►24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీ. ►స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.10 కోట్ల సబ్సిడీ ►ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీ రాయితీ. ఏడాదికి గరిష్టంగా రూ.1.50 కోట్లు. ►స్థిర మూలధన పెట్టుబడికి సమానంగా 8 ఏళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ తిరిగి చెల్లింపు. ►ఐదేళ్లపాటు సరుకు రవాణా వ్యయంలో 25 శాతం సబ్సిడీని ఐదేళ్ల పాటు అందిస్తారు. ఏడాదికి గరిష్టంగా రూ.50 లక్షలు ఇస్తారు. ►కనీసం రూ.500 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే సంస్థలను మెగా ప్రాజెక్టులుగా గుర్తించి వాటి వ్యాపారం, ఉద్యోగ కల్పన ఆధారంగా మరిన్ని అదనపు రాయితీలు అందిస్తారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదు
సాక్షి, విశాఖపట్నం: భూములిచ్చిన ఏ ఒక్క రైతుకూ పరిహారం విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. విశాఖ జిల్లాలోని నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై బుధవారం రాజయ్యపేట వద్ద ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డితో పాటు నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారి షేక్ సుభాన్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తో పాటు స్థానికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక పార్కు ఏర్పాటును స్వాగతించారు. పర్యావరణ కాలుష్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ పరిహారానికి సంబంధించి ఇంకా కొందరికి బకాయిలు చెల్లించాల్సి ఉందని.. కొన్నిచోట్ల ఇళ్లకు, చెట్లకు తక్కువ పరిహారమిచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారికి కూడా నష్టపరిహారమివ్వాలని కోరారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి జేసీ హామీ ఇచ్చారు. నక్కపల్లి మండలంలో భూ సేకరణ జరిగిన బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట గ్రామాల్లో పరిహారం సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. -
యువతకు ఉపాధే లక్ష్యం
సాక్షి, యాదాద్రి: యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో టీఎస్ఐఐసీ–టీఐఎఫ్–ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సహచర మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడారు. రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్–టు–వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా? అని ఎగ తాళి చేసిన వాళ్లే ఇవాళ రాష్ట్ర విధానాలను అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ పరిశ్రమల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ‘మాది తెలంగాణ’అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు. పక్షం రోజుల్లోనే అనుమతులు... సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అఫ్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు అనుమతులివ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెం ట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. పెద్ద పరిశ్రమల్లో యాంత్రీ కరణ ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లోనే 70 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరణ... గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ తెలిపారు. 440 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని, పార్క్ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. గ్రీన్ ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించుకున్నామని, పెరిగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర 132 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను, సంగారెడ్డి జిల్లా లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ పార్క్, మైక్రో ప్రాసెసింగ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పా రు. చౌటుప్పల్ ప్రాంతంలో 40 కాలుష్యకారక పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. కాలుష్య నివారణకు ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. మరో 3 చోట్లా ఇండస్ట్రియల్ పార్క్‌లు... నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు. ఖాయిలా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. పార్క్‌కు భూములిచ్చిన వారికి కుటుంబానికో ఉద్యోగమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10 ఎకరాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రానికి అన్నీ చిన్న పరిశ్రమలే వస్తున్నాయని, భారీ పరిశ్రమలను తీసుకురావాల్సిన అవ సరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. స్థానిక యువతకు ప్రాధాన్యత: మంత్రి జగదీశ్‌రెడ్డి మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దేశానికే ఆదర్శంగా ఉంటుందని, ఇందులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యతిస్తా మని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ తన ప్రతిభతో రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చివేశారన్నారు. -
‘పచ్చని’ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరి శ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లా చౌటు ప్పల్ మండలం దండు మల్కాపూర్‌లో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సహకారంతో రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు’ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు నవంబర్ 1న ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివర్ణిస్తున్న దండుమల్కాపూర్ పారిశ్రామికవాడలో తొలి దశలో ఏర్పాటవుతున్న 450 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రెండేళ్ల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించాలనే నిబంధన విధించారు. సుమారు రూ. 1,500 కోట్ల పెట్టుబడి అంచనాతో 35 వేల మందికి ఉపాధి కల్పించే ఈ పారిశ్రామికవాడ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుందని రాష్ట్ర పారి శ్రామికవేత్తల సమాఖ్య వర్గాలు చెబుతు న్నాయి. ప్రస్తుతం 438 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయగా, భవిష్యత్తులో 1,200 ఎకరాల్లో విస్తరిం చేందుకు టీఎస్ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అద్దె స్థలాల్లోనే ఎక్కువ ఎంఎస్ఎంఈలు.. రాష్ట్రంలో సుమారు 25 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉండగా వాటిలో 40 శాతం పరిశ్రమలకే సొంత స్థలాలు ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోని 142 పారిశ్రామిక వాడల్లో 20 శాతంలోపే ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఫ్ కోరింది. దీంతో దండుమల్కాపూర్‌లో తొలి దశలో 371 ఎకరాలు, రెండో దశలో 67 ఎకరాలు కలుపుకొని మొత్తంగా 438 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఎకరాకు రూ. 14 లక్షల చొప్పున టిఫ్కు కేటాయించింది. ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల నుంచి 1,200 మంది దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 450 మందికి ప్లాట్లు కేటాయించారు. టిఫ్ సమర్పించిన నివేదికను అనుసరించి పారిశ్రామిక పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన ప్రణాళికను రూపొందించారు. ఈ పార్కుకు హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిని అనుసంధా నిస్తూ 2.5 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ రోడ్డుతో పాటు రోడ్లు, మురుగు, వర్షపునీటి కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేశారు. అప్రోచ్ రోడ్డును 100 అడుగుల వెడల్పు తో నిర్మించారు. బాహ్య మౌలిక సౌకర్యాల కల్పన కు టీఎస్ఐఐసీ రూ.35 కోట్లు, అంతర్గత మౌలిక సౌకర్యాలకు టిఫ్ రూ.150 కోట్లు ఖర్చు చేశాయి. సకల సౌకర్యాలు... రెడ్ కేటగిరీకి చెందిన కాలుష్యకారక పరిశ్రమలకు పార్కులో అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించడం తోపాటు గ్రీన్ కేటగిరీ పరిశ్రమలనే ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం మురుగు నీటి, వాననీటి కాలువలు, సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. భగీరథ ద్వారా పార్కుకు నీటి సరఫరాకు ప్రత్యేక పైపులైన్లు నిర్మించారు. భవిష్యత్తులో ఉమ్మడి సౌకర్యాల కేంద్రం, పోలీసు స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, ట్రక్ టర్మినల్, బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసు ఏర్పాటు చేయనున్నారు. ‘మల్టీ ప్రోడక్ట్’ మార్కెటింగ్ మెళకువలపై పారిశ్రామికవేత్తలకు శిక్షణ, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. పార్కులోనే టౌన్‌షిప్‌లు... ‘వాక్ టు వర్క్ ప్లేస్’ నినాదంతో పారిశ్రామిక పార్కులో సమీకృత జనావాసాలు (ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు) నిర్మించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం టీఎస్ఐ పాస్‌తోపాటు కొత్త మున్సిపల్ చట్టం నిబంధనల మేరకు పారిశ్రామికవాడల్లోనే టౌన్‌షిప్‌లు నిర్మించే యోచనకు దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ గ్రీన్ పార్కులో శ్రీకారం చుడుతున్నారు. దండుమల్కా పూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 1,242.36 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని టీఎస్ఐఐసీ ప్రతిపా దించగా ఇప్పటివరకు 1,087 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 155 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మరో 700 ఎకరాల భూసేకరణకు అనుమతివ్వాలని టీఎస్ఐఐసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. భూసేక రణ ప్రక్రియ పూర్తయ్యాక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును దశలవారీగా అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ ప్రణాళికలు రచిస్తోంది. పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలు.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, ఆహార శుద్ధి, డ్రిల్లింగ్, రక్షణ రంగం. కాలుష్యరహిత పరిశ్రమలకే చోటు.. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత పరిశ్రమలకే అనుమతి ఇస్తాం. పార్కులో పరిశ్రమల స్థాపనకు అనేక మంది ముందుకు వస్తుండటంతో ప్లాట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో 2 వేల ఎకరాల భూసేకరణ దిశగా టీఎస్ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పార్కుతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల దశ, దిశ పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు లభిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకంగా ఉంది. అతి తక్కువ ధరలో పరిశ్రమల యజమానులకు ఇక్కడ ప్లాట్లు కేటాయించాం. చదరపు గజం ధర రూ. 1,600 లోపే ఉంది. చవకగా ప్లాట్లు లభిస్తుండటంతో పెట్టుబడి భారం తగ్గుతుంది. -కొండవీటి సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు దేశంలోనే మోడల్ ఇండస్ట్రియల్ పార్కు భారీ పరిశ్రమలకు దీటుగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. టిఫ్ అభ్యర్థన మేరకు రెండేళ్ల క్రితం ప్రారంభమైన దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు పనులు ముగింపు దశకు చేరకున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ దండుమల్కాపూర్ పార్కు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. – గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ చైర్మన్ -
ఇండస్ట్రియల్ పార్క్‌కు హరీశ్‌రావు శంకుస్థాపన
సాక్షి, సిద్దిపేట : నగరంలోని అనేక ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మిట్టపల్లికి సమీపంలో రూ. 27.50 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '322 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 5 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటువల్ల ఈ ప్రాంత రైతుల భూములకు విలువ పెరగుతుంద'న్నారు. ఈ సందర్భంగా రోడ్డు కోసం భూములు కోల్పోయిన రైతులకు మంత్రి రూ.1.25 కోట్ల చెక్కును అందజేశారు. యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు : సిద్దిపేట పట్టణం టీటీసీ భవన్లో స్కూల్ గేమ్స్ పేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 65వ తెలగాణా రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'యోగా మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి యోగా పోటీల్లో పాల్గొనబోతున్న విద్యార్థులందరికీ అవార్డులు రావాలని కాంక్షించారు. రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే సిద్ధిపేటలో జాతీయస్థాయి యోగా పోటీల నిర్వహణకు కృషిచేస్తామన్నారు. యోగా అనేది భారతదేశంలో ప్రాచీన కాలంలో ప్రముఖంగా ఉండేదని, నేడు పూర్వ వైభవం సంతరించుకున్నట్లు' మంత్రి తెలిపారు. -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వడివడిగా..!
సాక్షి, చౌటుప్పల్: తెలంగాణకే తలమానికమైన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో చేపట్టిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అయితే పార్క్ శంకుస్థాపన ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడడంతో ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగవంతమయ్యాయి. తెలంగాణలోనే ప్రప్రథమ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే వివిధ రకాల కారణాలతో రెండు పర్యాయాలు శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వాయిదా పడొద్దన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటికే 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు రేయింబవళ్లు పనులను కొనసాగిస్తున్నారు. పార్క్ కోసం 1,144 ఎకరాల భూసేకరణ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1.144ఎకరాల భూమిని సేకరించారు. సీలింగ్, అసైన్డ్, పట్టా భూములకు సంబంధించి మూడు దఫాలుగా భూసేకరణ చేశారు. మొదటి విడతలో 682, 693, 695, 697, 699, 701, 702, 704, 705, 706, 707, 708, 709, 711, 712, 713, 714, 715, 716, 717 సర్వే నంబర్లలోని 128మంది రైతుల వద్ద 377ఎకరాల సీలింగ్ అసైన్డ్ భూమిని సేకరించారు. రెండో విడతలో 644 సర్వేనంబర్‌లో 98మంది రైతుల నుంచి 194.04ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని సేకరించారు. మూడో విడతలో 727, 735, 736, 737, 753, 755, 756, 757, 765, 758, 754 సర్వేనంబర్లలోని 207మంది రైతుల వద్ద 472 ఎకరాల సీలింగ్, పట్టా భూములను సేకరించి పరిహారం అందజేశారు. అదే విధంగా 698, 701, 703, 704, 705, 710 సర్వేనంబర్లలోని 24మంది రైతుల వద్ద 101.19ఎకరాల పట్టా భూమిని సైతం సేకరించగా పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారు. గత ఏడా ది ఆగస్టు నెలలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కాగా త్వరలోనే పార్క్ శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయి. ముమ్మరంగా నిర్మాణ పనులు ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు, ఇతర వసతుల కోసం ప్రభుత్వం గత ఏడాది రూ.36కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధానంగా 65వ నంబరు జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.18కోట్లు కేటాయించగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్క్‌లోని అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా పార్క్‌లోని భూమిని చదును చేస్తున్నారు. రూ.12వేల కోట్ల పెట్టుబడులు ఇండస్ట్రియల్ పార్క్‌లో సేకరించిన భూమిలో ఇప్పటికే 377ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 396మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆ మేరకు వారికి అవసరమైన స్థలాల కేటాయింపు సైతం జరిగింది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రభుత్వానికి 12వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 20వేలు, పరోక్షంగా మరో 20వేల మందికి ఉపాధి లభించనుంది. -
ఇండస్ట్రియల్ పార్క్‌కు గ్రీన్‌సిగ్నల్
రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం సిగలో మరో పరిశ్రమ రాబోతోంది. శనివారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ వనజాదేవి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా వనరుల లభ్యత (బొగ్గు, నీరు, విద్యుత్, రోడ్డు, రైలు రవాణా)ఉండడంతో ఉత్పాదక శక్తి మెరుగ్గా ఉంటుందని నిర్ణయించారు. ఫలితంగా అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్‌కు టీఎస్ఐఐసీ అధికా రుల బృందం అప్పటికప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్‌కు కేటాయించిన స్థల వివరాలను తెలియజేస్తూ.... అంతర్గాంలోని ఖాయిలాపడిన స్పిన్నింగ్, వీవింగ్ టెక్స్టైల్ విభాగానికి చెందిన 548.26 ఎకరాల విస్తీర్ణంలోని వంద ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్‌కు కేటాయించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేయగా జేసీ వనజాదేవి ప్రత్యేక చొరవ తీసుకొని అంతర్గాంలోని టెక్స్టైల్ భూములు అనువైందిగా గుర్తించి సర్వే చేయించారు. వివిధ సర్వే నెంబర్లలో 102.20 ఎకరాల విస్తీర్ణం ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనకు అనువుగా ఉంటుం దని గుర్తించారు. పార్క్‌కు కేటాయించిన స్థలంలో 57.23 ఎకరాలు గోలివాడ శివారు, మిగతా 44.37 ఎకరాలు రాయదండి శివారు స్థలంగా గుర్తించారు. ఇందులో ఏలాంటి నిర్మాణాలు లేకపోగా భూమి చదునుగా మైదాన ప్రాంతంగా ఉండడంతో ఇండస్ట్రియల్పార్క్కు అనువుగా ఉంటుందని జేసీ వనజాదేవి టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డికి వివరించారు. త్వరలోనే స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్ (సీసీఎల్ఏ)కు బదిలీ చేసి టీఎస్ఐఐసీకి భూ బదలాయింపు చేయనున్నామన్నారు.ఇప్పటికే ఇండస్ట్రియల్పార్క్లో పది కంపెనీలతో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు చేపట్టనున్నారని, ఇందులో ఇప్పటికే ఐదుగురు పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరిపామని మరో ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. ఇందులో ప్రధానంగా అర్హులైన బర్మా, కాందీశీకుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనే ధ్యేయంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ యువకులు వేలాది ఉండడంతో అంతర్గాంలోని ప్రభుత్వ స్థలాల్లో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సీఎం కేసీఆర్ సైతం భూమి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని పేర్కొనడంతో తాను ఆ దిశగా అడుగులు వేశానన్నారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో కనీసం ఆరు వేల మందికి ప్రత్యక్షంగా, పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమ స్థాపనకు స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతీ నియోజకవర్గానికిఒక పరిశ్రమ ఏర్పాటు.. ఉమ్మడి ప్రభుత్వ హయంలో రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల మాత్రమే పరిశ్రమలను స్థాపించడంతో ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుండేదని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించడంతో నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది ఆయన ధ్యేయమన్నారు. ఆ దిశగా తాము చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో పరిశ్రమ స్థాపనకు అంతర్గాం టెక్స్టైల్ భూములు అనువుగా ఉండడంతో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు బీజం పడనుంది. దశల వారీగా భూ లభ్యతను బట్టి పరిశ్రమలను విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. మ్యాప్ సిద్ధం చేసి అప్పగించండి అంతర్గాం టెక్స్టైల్ భూములు పరిశ్రమల స్థాపనకు చాలా అనువుగా ఉందని టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి అన్నారు. సదరు భూమి నుంచి రైల్వేస్టేషన్, రాజీవ్ రహదారి, నేషనల్ హైవే, ఏయిర్పోర్టు, నీటి లభ్యత, బొగ్గు లభ్యత తదితర వివరాలతో కూడిన నూతన మ్యాప్‌ను సిద్ధం చేసి తమకు అప్పగించాలని కోరారు. అదే విధంగా ఇక్కడ వంద ఎకరాలు పోను మరో మూడు వందల ఎకరాలు తమకు అప్పగిస్తే మరో పెద్ద పరిశ్రమ స్థాపించేందుకు చర్యలు చేపడతామని ఎండీ నర్సింహారెడ్డి జేసీ వనజాదేవిని కోరగా సానుకూలంగా స్పందించారు. తమకు జేసీ భూనివేదికలు అందజేసిన మరుక్షణం నుంచే పరిశ్రమ స్థాపనకు చర్యలు చేపట్టనున్నామని ఎండీ పేర్కొన్నారు. స్థల పరిశీలనలో టీఎస్ఐఐసీ డీజీఎం విఠల్, కరీంనగర్ జోనల్ మేనేజర్ అజ్మీర, అంతర్గాం తహశీల్దార్ వంగల మోహన్‌రెడ్డి, టీటీఎస్ అంతర్గాం సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, అంతర్గాం, పాలకుర్తి జెడ్పీటీసీలు ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, ఎంపీపీ దుర్గం విజయ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు బాదరవేణి స్వామి, ధర్ని రాజేష్‌లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రూ.600కోట్లు గోదావరిఖని(రామగుండం): ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 600కోట్లు వెచ్చిస్తోందని టీఎస్ఐఐసీ చైర్మెన్ బాలరాయమల్లు, ఎండీ వెంకటనర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్‌తో కలిసి మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 42 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 3,500ఎకరాల భూమిని గుర్తించగా, తెలంగాణా ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియల్ పార్కుల కోసం 1.43లక్షల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇండస్ట్రియల్ పార్కులు కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు తర్వాత అగ్రి పొడక్ట్ ఏర్పాటు చేసే పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. దీనికోసం 15చోట్ల భూమిని గుర్తించామన్నారు. ఫుడ్, అగ్రికల్చర్, ఇన్ఫాస్ట్రక్చర్ కోసం 14ట్రస్టీ ఏరియాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు. టెక్స్టైల్స్, ఇంజినీరింగ్, ఏరోస్పేస్, పార్మా పార్కుల ఏర్పాటు కోసం మ్యాపింగ్ తయారు చేస్తున్నామన్నారు.