Information Technology
-
టెకీ.. ఆరోగ్యం రిస్కీ..
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పరిశోధకులు మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్లో ఇటీవల వర్క్‌ప్లేస్ వెల్నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అంతర్గత అధ్యయనాల్లోనూ.. ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్ఓఐ హెల్త్‌కేర్ అనే ఒక వెల్నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్‌కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్ఫంక్షన్తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది. ఫలితం అంతంతే.. గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్.. నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది. ఆ అలవాట్లతో చేటు.. రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్‌లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.వాటిలో కొన్ని.. 👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్‌ప్లేస్‌ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్‌ను పరిచయం చేస్తున్నాయి. 👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. 👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది. 👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్‌ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది. 👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది. -
ఐటీలో మేటి..
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.57,258 కోట్లతో మొదలైన ఎగుమతులు.. 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్లలో నమోదైన ఐటీ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022–23లో దేశంలో ఐటీ ఎగుమతులు 9.36 శాతం వృద్ధి చెందగా.అదే ఏడాది తెలంగాణలో 31.44 శాతం పెరిగాయి. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల కాలంలో (2014–23) రూ.11.85 లక్షల కోట్ల ఎగుమతులు సాధించగా.. 54.47 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి..: తెలంగాణ ఏర్పడక ముందు దేశవ్యాప్తంగా ఐటీలో 32.90 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83 శాతం. అంటే 3,23,396 ఉద్యోగులున్నారు. గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 21.10 లక్షల మంది ఉద్యోగులు చేరగా.. రాష్ట్రంలోనే కొత్తగా 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. బ్రాండ్ హైదరాబాద్!ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరులో ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. గతేడాది ఉద్యోగ కల్పనలో భాగ్యనగరం గార్డెన్ సిటీ బెంగళూరుని దాటేసింది. కొత్తగా దేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు రాగా.. హైదరాబాద్‌లో 1.50 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. అదే బెంగళూరులో 1.46 లక్షల జాబ్స్ సృష్టించినట్లు నాస్కామ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ హైదరాబాద్ 2022 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్యకాలంలో బెంగళూరును అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది.ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇక వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, డ్రోన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం అనేక నూతన పాలసీలకు రూపకల్పన చేసింది. ఐటీ రంగంలో ఆవిష్కరణలు, వాణిజ్యం ప్రోత్సహించే లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ విజయం సాధించడంతో, మహిళల కోసం ప్రత్యేకంగా ‘వి హబ్’ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది.ద్వితీయ శ్రేణి పట్టణాలకూ ఐటీ.. జిల్లాల్లో ఐటీ టవర్లురాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కావడంతో నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేలా గ్రిడ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ పాలసీతో ఉప్పల్, పోచారం, కండ్లకోయ, శంషాబాద్ ప్రాంతాల్లోనూ కొత్త ఐటీ టవర్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ యువతకు స్థానికంగానే ఐటీ ఉద్యోగ అవకాశాలు కలి్పంచాలనే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోనే ఐటీ టవర్లను నిర్మించింది.వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఐటీ టవర్లలో పదుల సంఖ్యలో ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2019లో వరంగల్‌లో తొలి ఐటీ టవర్ ప్రారంభం కాగా.. ఇందులోని టెక్ మహీంద్రా, సైయంట్, క్వాడ్రంట్ వంటి 10 కంపెనీల్లో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగం పురోగతి, ప్రోత్సాహానికి సంబంధించి ఇప్పటివరకు నిర్దిష్ట ప్రణాళికలేవీ ప్రకటించలేదు. రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రకటిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. -
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్‌కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్‌లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్‌ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ? -
Nitish Rajput: వీడియో పెట్టు కోట్లు కొట్టు
వీడియోలు చేస్తే ఎంత వస్తుంది? యూట్యూబ్‌లో పెడితే ఎంత వస్తుంది? ఎంత టాలెంట్ ఉంటే అంత వస్తుంది. నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాల పై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ. 2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు. ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో... పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్పుట్ వీడియోలకు అంత డిమాండ్. అన్ని వైపుల సమాచారం నితిష్ రాజ్పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి. తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ కుర్రాడు నితిష్ రాజ్పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా. ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు. 50 లక్షల ఫాలోయెర్లు నితిష్ రాజ్పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే. -
‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)లో కామన్ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీవర్క్స్‌లో ఏర్పాటు చేసే క్లస్టర్కయ్యే వ్యయం రూ. 104.63 కోట్లుకాగా అందులో రూ. 75 కోట్లను గ్రాంట్–ఇన్–ఎయిడ్‌గా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ క్లస్టర్‌కు ఈ నెల 4న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రం త్వరలో అనుమతిస్తుందని... క్లస్టర్ మంజూరు చేయాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రధాన సమాచార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐటీఐఆర్, ఎల్రక్టానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందనగా కేంద్రం ఈ వివరాలు ఇచ్చింది. దివిటిపల్లిలో రూ. 568.9 కోట్లతో ప్రతిపాదించిన ఈఎంసీకి రూ. 264.6 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రెండింటిని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ 2.0 కింద మంజూరు చేసినట్లు పేర్కొంది. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రతిపాదనలు పంపలేదు.. ఏపీ విభజన హామీగా తెలంగాణకు ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ఏర్పాటు హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే ఐటీఐఆర్‌పై 2016లో సమావేశం జరిగిందని... ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వివరాలు ఇవ్వలేదని ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో కేంద్రం స్పష్టం చేసింది. 2013 నవంబర్ 13న ఐటీఐఆర్ క్లస్టర్‌ను నోటిఫై చేశారని, ఈ క్లస్టర్లో రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివర నివేదిక ఇవ్వాల్సి ఉందని, కానీ తదుపరి డీపీఆర్‌లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఐటీఐఆర్‌పై 2016లో ఒకసారి, 2017లో మరోసారి సమావేశం జరిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి తదుపరి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో తాము ఆమోదించలేకపోయామని ఆ సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది. 2017లో ఐటీఐఆర్ పాలసీ, కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీపై సమీక్షించగా ఐటీఐఆర్‌లో ఉన్నవే కేంద్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఉన్నందున ఐటీఐఆర్‌లను పక్కనపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఐటీఐఆర్ ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నుంచి 2021 జనవరి 7న లేఖ అందిందని, అప్పటికే హైదరాబాద్, మహేశ్వరంలో ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతిచ్చామని తెలియజేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఐటీఐఆర్‌తో సంబంధం లేకుండా ఈఎంసీ 2.0 కింద తాజాగా రెండు క్లస్టర్లను మంజూరు చేశామని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందిస్తూ బదులిచ్చింది. -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా? రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా. ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి. ఏఎన్ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్... 2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి. స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ... ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది. ♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది. టెక్నాలజీతో రైతుకు దన్ను... ‘ఈ–కర్షక్’ యాప్‌తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. అర చేతిలో ఆరోగ్యశ్రీ... ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది. ♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి చూపుతోంది. గత నాలుగేళ్లుగా మన విద్యాశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించారు. విద్యార్థి దినచర్యను పాఠశాల నుంచి రాష్ట్రస్థాయిలో ప్రిన్సిపల్ కార్యాదర్శి, ముఖ్యమంత్రి వరకు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు బడిబయటి పిల్లలను ట్రాక్ చేయడంలో సాధించిన విజయాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఏపీకి వచ్చిన తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఇక్కడి అధికారులతో సమావేశమై ఐటీ వినియోగంతో సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 58,685 పాఠశాలలు, 70.64 లక్షలమంది విద్యార్థులు, మూడులక్షలకు పైగా ఉపాధ్యాయులను నూరుశాతం పర్యవేక్షిస్తున్న తీరుకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్) ద్వారా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒక్కటి చేయడాన్ని అడిగి తెలుసుకున్నారు. యాప్స్ ద్వారా విద్యార్థుల హాజరు తీసుకోవడం, అదే సమయంలో మధ్యాహ్న భోజనం చేసేవారి సంఖ్యను లెక్కించడం, పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయడాన్ని అభినందించారు. రాష్ట్రస్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్ అమలును తమ రాష్ట్రంలోను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపించారు. సిమ్స్, యాప్స్ పనితీరును వివరించిన అధికారులు విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్), దానికి అనుసంధానంగా కీలక విభాగాలకు మొబైల్ యాప్స్ రూపకల్పన ద్వారా విద్యార్థి ట్రాకింగ్‌ను ఏపీ సమగ్ర శిక్ష అధికారులు తెలంగాణ అధికారుల బృందానికి వివరించారు. ఇందులో ప్రధానంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ విభాగంలో పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం అమలు, చేస్తున్న మార్పులను నమోదు చేస్తారు. టీచర్స్ ప్రొఫైల్‌లో వారి హాజరు, ఎన్వోసీ, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవులు, గ్రీవెన్స్ వంటివి, విద్యార్థుల విభాగంలో ఆధార్ నంబరు ఆధారంగా విద్యార్థి పాఠశాలలో ఉన్నారా, బడిబయట ఉన్నారా అని ట్రాకింగ్ చేసి, గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించి వారిని తిరిగి బడిలో చేరుస్తున్నారు. ఇలా గత విద్యాసంవత్సరంలో సుమారు లక్షమంది పిల్లలను తిరిగి బడిలో చేర్చారు. ఐటీ సంస్కరణలతో తక్కువ కాలంలోనే వేగవంతమైన విజయాలు నమోదు చేయడాన్ని తెలంగాణ అధికారులు అభినందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పాఠశాలను, విద్యార్థిని ప్రతిరోజు పర్యవేక్షించడం, వారి పనితీరును తెలుసుకోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తెలంగాణలోను అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి: నాడు–నేడు’ పథకాన్ని ప్రవేశపెట్టి సాధించిన విజయాన్ని పరిశీలించిన తెలంగాణ అధికారులు వారి రాష్ట్రంలో ‘మన ఊరు–మన బడి’ పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. -
బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్.. తెలంగాణ కొత్త రికార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఐటీ ఆధారిత సేవల రంగం ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఐటీ రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణ పోటీ పడుతున్నట్టయింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఐసీటీ పాలసీ (2021–26)లో రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2022–23 ఐటీ శాఖ ప్రగతి నివేదిక ప్రకారం.. తెలంగాణ ఈ లక్ష్యాన్ని రెండేళ్లు ముందుగానే అంటే 2024 నాటికే చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నద్ధమవుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022–23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్ధి రేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. 17.31% సీఏజీఆర్‌తో పురోగమనం తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సీఏజీఆర్ (సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధించగా, మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. 2022–23లో భారత్ ఐటీ ఎగుమతులు 9.36 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి. 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6%గా ఉంది. భారత్ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 2021–22లో 33 శాతం వస్తే, 2022–23లో 44 శాతం వచ్చాయి. అంటే దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు భావించవచ్చు. ఉద్యోగాల్లో బెంగళూరు తర్వాత .. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22లో దేశం నుంచి రూ.3.95 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.2 శాతం, మహారాష్ట్ర నుంచి 20.4 శాతం, తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోనే 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది. పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరు, హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఐటీ రంగం వృద్ధిలో పోటీ పడుతున్నాయి. బెంగళూరుతో పోలిస్తే స్టార్టప్ వాతావరణం, ఐటీ రంగంలో మౌలిక వసతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టుబడులకు హైదరాబాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరుకు పేరున్నా ఇటీవలి కాలంలో ఐటీ పార్కులు, ఎస్ఈజెడ్లు హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో ముంబయి, బెంగళూరు నగరాలకు మించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2021లో ఆఫీస్ స్పేస్ వినియోగం 129 శాతం పెరగ్గా, ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే 6 శాతం సగటు వృద్ధిరేటు నమోదైంది. బెంగళూరుతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువ కావడంతో ఐటీ నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం భారత్‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య: సుమారు 50 లక్షలు బెంగళూరు 15 లక్షలు హైదరాబాద్ 7.78 లక్షలు తమిళనాడు 10 లక్షలు పుణె 4 లక్షలు -
దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు, మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి ఐటీలోనూ మేటి.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ ల్యాండ్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ కొప్పర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది. ఇందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్ 2019 డిసెంబర్ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది. -
ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ - ప్రజలు సమ్మతిస్తారా..?
ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్‌ను ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలన్న ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గడువుని ఇప్పుడు మరో 15 రోజుల పొడిగించింది. గతంలో ఈ గడువు 2023 మే 05 వరకు మాత్రమే ఉండేది, కాగా ఇప్పుడు ఇప్పుడు మే 20 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆధార్‌ను ప్రామాణీకరించడానికి ప్రభుత్వేతర రాష్ట్ర సంస్థలను అనుమతించే ప్రతిపాదన కోసం ఒక ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ప్రజల అభిప్రాయాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇతర సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆధార్ ప్రామాణీకరణ కోసం అనుమతిని పొందవచ్చు. ఇది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధార్ ప్రామాణీకరణ కోసం కోరుతున్న ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ ఒప్పించినట్లయితే, అటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ ప్రతిపాదనపై కొంత మంది నిపుణులు, న్యాయవాదులు గతంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది వినియోగదారులను మోసాలకు గురించి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) రాష్ట్ర సంక్షేమం, నిజమైన గ్రహీతలను గుర్తించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించగలిగినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు అలాంటి ధృవీకరణను నిర్వహించలేవని ఒక తీర్పులో పేర్కొంది. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్‌గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా
ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లో టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను (వేలిముద్రలు) అప్డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్‌కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది. రోజుకు 70 మిలియన్ల మంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
భద్రం బ్రదర్.. సీవోడీనే బెటర్
మహేశ్వరి అనే మహిళ ఈ–కామర్స్ వెబ్సైట్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకున్న తరువాత తెరిచి చూస్తే ఆమె ఆర్డర్ పెట్టిన కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా వేరే సాఫ్ట్‌వేర్‌తో ఉన్న నకిలీ ల్యాప్‌టాప్ వచ్చినట్టు గ్రహించింది. ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ.. పట్టించుకోలేదు. కంపెనీ కార్యాలయానికి వెళితే ఆమె ఫిర్యాదును పరిష్కరించే బాధ్యులెవరూ కనిపించలేదు. చేసేది లేక అదనంగా సొమ్ము చెల్లించి ఆ ల్యాప్‌టాప్‌లోనే తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా ఎంతోమంది.. ఎన్నో విధాలుగా మోసపోతున్నారు. – సాక్షి, అమరావతి ఆన్లైన్ షాపింగ్ మారుమూల పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ చేస్తే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా వేరొకటి రావడం.. వస్తువును రిఫండ్ చేస్తే డబ్బులు తిరిగి రాకపోవడం వంటి మోసాలు పెరుగుతున్నాయి. నగదు చెల్లించినా వస్తువు రాకపోవడం.. క్రెడిట్, డెబిట్ కార్డులను తస్కరించి వేరొకరు ఆన్లైన్ షాపింగ్ చేయడం వంటి మోసాలెన్నో జరుగుతున్నాయి. ఇలా మోసపోతున్న వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మన దేశంలో ఈ–కామర్స్ వ్యాపారంపై నిర్దిష్ట నిబంధనలు లేవు. కానీ.. వినియోగదారుల రక్షణ చట్టం–1986, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం 2008, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలైన నియంత్రణ సంస్థలచే నిర్దేశించిన విధానాలు ఈ–కామర్స్ సంస్థలకు కూడా వర్తిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలంటే.. ఈ–కామర్స్ సంస్థల చేతిలో ఎవరైనా మోసపోతే.. ‘కన్సూమర్ కోర్ట్ ఆన్లైన్ ఇండియా’, కన్సూమర్ ఫోరమ్, కమిషన్లలో ఫిర్యాదు చేయొచ్చు. వీటికి వెబ్సైట్, యాప్, టీవీ షాపింగ్ షో ద్వారా ఆర్డర్ చేసి రిఫండ్ లేదా రీప్లేస్మెంట్ పొందకపోవడం, ఆలస్యంగా డెలివరీ చేయడం, తప్పుదారి పట్టించే ప్రమోషన్ల వంటి వాటిపై పైన పేర్కొన్న సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి ముందు ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి. ప్రతి ఈ–కామర్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిర్దేశించిన విధంగా ఫిర్యాదు అధికారిని అందుబాటులో ఉంచాలి. ఆ వివరాలు కంపెనీ వెబ్సైట్లో ఉండాలి. మీ ఫిర్యాదును సదరు అధికారికి తెలియజేయండి. కొన్ని ఈ–కామర్స్ కంపెనీలు మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరిస్తాయి. అది సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇలా చేసినా ప్రయోజనం లేకపోతే డీలర్, తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్ పేర్లు, చిరునామాలను సేకరించండి. ఆ చిరునామాలకు సమస్యను రిజిస్టర్ పోస్ట్ ద్వారా రాసి పంపండి. గడువు ముగిసిన తర్వాత మీకు ఎలాంటి స్పందన రాకపోతే వినియోగదారుల ఫోరమ్, కమిషన్‌ను ఆశ్రయించండి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ–కామర్స్ వినియోగదారులు తమ సొంత నగరంలోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. ‘సైబర్’ భద్రత ఇలా.. ఇటీవల రోగ్ (నకిలీ) వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా తప్పుడు వివరాలతో నకిలీ ఈ–కామర్స్ వెబ్సైట్లు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వీటిని గుర్తించి నిషేధించినా మరో పేరుతో మళ్లీ వస్తున్నాయి. వాటిని తెరిస్తే మనకు తెలియకుండానే మన కార్డుల్లో నగదు ఖర్చవుతుంటుంది. ఇలాంటి నకిలీ, పైరసీ వంటి నేరాల బారినపడిన బాధితులు 24 గంటల్లోపు ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’లో ఫిర్యాదు చేయాలి. సంబంధిత అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా సైబర్ మోసగాళ్లను కనిపెడతారు. నకిలీలను ప్రోత్సహించే డొమైన్‌పై నేషనల్ ఇంటర్నెట్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుకు వెళ్లి అనధికార లావాదేవీలపై ఫిర్యాదు చేయడం ద్వారా కార్డును బ్లాక్ చేసి, నగదును తిరిగి పొందవచ్చు. అన్నిటికంటే ముందు ఈ–కామర్స్ సైట్ అడ్రస్‌ను ప్రభుత్వం అందిస్తున్న రిజస్ట్రీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వెతికితే అది అసలైనదో, నకిలీదో తెలిసిపోతుంది. సురక్షిత ఆన్లైన్ షాపింగ్ కోసం.. ► తెలియని ఈ–కామర్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేయడానికి ముందు వాటిని పరిశోధించండి. అనుమానం ఉంటే కొనుగోలును ఆపేయాలి. ► మొదటిసారి సైట్ నుంచి కొనుగోలు చేస్తుంటే క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోండి. ► కొనుగోలు చేయడానికి ముందు నిబంధనలు, గోప్యతా విధానాన్ని చదవండి. ► డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్ థర్డ్ పార్టీతో షేర్ చేస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోండి. ► ఆర్డర్ రద్దు, వాపసు విధానాలను, నియమాలను చదివి అర్థం చేసుకోండి. ► ఈ–కామర్స్ కంపెనీ చిరునామా, ఈ–మెయిల్, ఫోన్ నంబర్, హెల్ప్‌లైన్ వంటి కస్టమర్ కేర్ వివరాలు వాస్తవమో కాదో నిర్ధారించుకోండి. ► ఉత్పత్తి, వారంటీ వివరాలు తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి. ► నగదు చెల్లించడానికి ముందు, ఆ వస్తువును కంపెనీ మీ పిన్‌కోడ్‌కు డెలివరీ చేస్తుందో లేదో చూసుకోండి. ► ఒకవేళ కంపెనీ ధర, వస్తువు వివరణను ఆర్డర్ చేసిన తర్వాత మార్చవచ్చు. కాబట్టి కొనుగోలు చేసిన వెంటనే ఆర్డర్ వివరాలు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ► ఎక్స్చేంజ్ , రిఫండ్ వంటి క్లెయిమ్‌ల విషయంలో జాగ్రత్త వహించండి. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వస్తువు లోపభూయిష్టంగా ఉంటే కంపెనీలు ఎక్సే్చంజ్, రిఫండ్ చేయాలి. -
ఇన్ఫినిటీ వైజాగ్.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ సమ్మిట్
సాక్షి,అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)తో కలిసి ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో విశాఖ వేదికగా 20, 21 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విశాఖను ఇండస్ట్రీ 4 టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’తో చెప్పారు. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా వివరిస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇండియన్ సొసైటీ ఫర్ అసెంబ్లీ టెక్నాలజీ(ఐశాట్), విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీధర్ చెప్పారు. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కంపెనీలకు ఎస్టీపీఐ అవార్డులతో పాటు స్టార్టప్‌లకు అవార్డులు అందిస్తున్నట్టు వెల్లడించారు. -
రాష్ట్రంలోని అన్ని మూలలకూ ఐటీ రంగం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తలపెట్టిన ఐటీ హబ్‌ల నిర్మాణ పురోగతిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ట్విట్టర్ వేదికగా వివరించారు. డిజిటైజ్, డికార్బనైజ్, డి సెంట్రలైజ్ నినాదంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్‌లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఐటీ హబ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయని, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్ధిపేట, ఆదిలాబాద్‌లో ఐటీ హబ్‌లు త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఫొటోలు షేర్ చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో సిద్దిపేట ఐటీ హబ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని, కొద్దినెలల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. నల్లగొండ ఐటీ హబ్ పనులు శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఐదారు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. రెండో ఐటీ కేంద్రంగా వరంగల్ వరంగల్ ఐటీ హబ్‌లో పేరొందిన కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రెండో అతిపెద్ద ఐటీ కేంద్రంగా మారిందని కేటీఆర్ తెలిపారు. ఎన్ఐటీ (వరంగల్), ఆర్జీయూకేటీ (బాసర) వంటి పేరొందిన విద్యా సంస్థల్లో గ్రామీణ విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారిని ఐటీ రంగం అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు టి– హబ్, టి –వర్క్స్, వి– హబ్ వంటి సంస్థల ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. -
Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్ఐఈఎల్ఐటీ..
తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్ఐఈఎల్ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. నైలెట్ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు ► ఎన్ఐఈఎల్ఐటీ(నైలెట్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం. ► ఎన్ఐఈఎల్ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం. ► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఐఈఎల్ఐటీ అందిస్తున్న కోర్సులు ఫార్మల్ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వి.ఎల్.ఎస్.ఐ డిజైన్, నాన్ ఫార్మల్ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్ వంటి కోర్సులు అందిస్తుంది. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్ ప్రత్యేకత. ఎన్ఐఈఎల్ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. – మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
ఐటీలో మేటి.. రైతుల సేవలో ఘనాపాటి
అనకాపల్లి: ఆధునిక పోకడలకు అనుగుణంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని జిల్లా ఏరువాక కేంద్రం అన్నదాతలకు వినూత్నమైన సేవలందిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలతోపాటు అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. అందరి చేతిలో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ఏరువాక కేంద్రం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) యాప్‌ను రూపొందించింది. ఏడాది పొడవునా కావలసిన సమాచారాన్ని రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. యాప్ పనిచేస్తుందిలా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏఎన్జీఆర్ఏయూఆర్బీకే (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రం) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో వెబ్ లింకును నొక్కితే ఎఫ్‌ఏఆర్‌ఎం ఆర్ఏడీఐవో.ఇన్ కింద ఫార్మ్ రేడియో ఓపెన్ అవుతుంది. ఇందులో నాలుగు స్లాట్లు ఉంటాయి. వ్యవసాయం, కాయగూరలు పండ్లు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వస్తుంది. దేనిపై ప్రెస్ చేసినా మూడు నిమిషాల నిడివిగల వాయిస్ వినిపిస్తుంది. అదే సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ నెలకు సంబంధించిన ఆ సమాచారం ఫార్మ్ రేడియోలో వినిపిస్తుంది. రైతుల ముంగిటకే సమాచారం రైతుల వద్దకే సమాచారాన్ని పంపిస్తున్నాం. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు వెబ్‌లింకు ద్వారా ఫార్మ్ రేడియోలో వ్యవసాయం, కాయగూరలు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ఆయా నెలల్లో వినవచ్చు. జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను రూపొందించాం. – ప్రదీప్‌కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త (చదవండి: -
యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం బారత్‌కి విరుద్ధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్న పాక్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్సైట్లు, ఒక ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్ సహాయ్ అన్నారు. ఈ మేరకు బ్లాక్ చేసిన ఖాతాలలో అప్నీ దునియా నెట్వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్...) -
ఐటీ అ‘ద్వితీయం’
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగమంటేనే కేరాఫ్ హైదరాబాద్.. బడా కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరైనా రాజధాని బాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడా లెక్క మారుతోంది. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుతో చదువుకున్న చోటికి, కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం వస్తోంది. స్థానిక యువతలో నైపుణ్యాలకు గుర్తింపు, వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్‌లు జిల్లాల్లోని యువత కలలను నెరవేరుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలకు విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా.. వచ్చే రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీహబ్‌ల కార్యకలాపాలు మొదలయ్యాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్ల నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలోగా ఈ రెండింటిని ప్రారంభించేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక సిద్దిపేటలో ఐటీహబ్ నిర్మాణ దశలో ఉండగా.. తాజాగా నల్లగొండ ఐటీ టవర్‌కు మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే తృతీయశ్రేణి పట్టణాలైన రామగుండం, వనపర్తిలలో ఐటీ హబ్‌ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఐటీ హబ్ జిల్లాల్లోని ఐటీ హబ్‌లకు బడా కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పెద్ద కంపెనీలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2016లో తొలిదశ కింద ఏర్పాటైన వరంగల్ ఐటీ హబ్‌లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలపాలతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. కరీంనగర్ ఐటీ హబ్‌లో ఐటీ కంపెనీలతో పాటు ‘టాస్క్’ రీజనల్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. వీటితోపాటు ఖమ్మం ఐటీ హబ్‌లో కలిపి సుమారు 3వేల మంది ఉపాధి పొందుతుండగా.. సీటింగ్ కెపాసిటీకి మించి కంపెనీల నుంచి డిమాండ్ ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశ టవర్ల నిర్మాణం కోసం ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లతోపాటు నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభమైతే మరో 4,200 సీటింగ్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లోని ఐటీ హబ్‌లో టెక్ మహీంద్రా కార్యాలయం నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా.. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లను కేవలం ఉద్యోగ కల్పన కేంద్రాలుగానే కాకుండా.. నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు ‘టాస్క్’ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు టీఎస్ఐఐసీ ద్వారా ఐటీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్‌ల వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఐటీ హబ్‌లను కేంద్రంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవనం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్ లు ప్రారంభించాం. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు త్వరలోకి అందుబాటులోకి వస్తాయి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారు. ఆ దిశలోనే ఈ చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది. – కె.తారక రామారావు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధి భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది 12శాతంగా నమోదైన ఐటీ రంగం వృద్ధి.. ఈసారి 16 శాతానికి చేరుకునే అవకాశముంది. కోవిడ్ పరిస్థితుల మూలంగా హైబ్రిడ్ పనివిధానంలో చాలా మంది ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల నుంచే పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున.. ఆయా చోట్ల ఐటీ హబ్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. – భరణి అరోల్, అధ్యక్షుడు, హైసియా ప్రభుత్వ చర్యలతో ఊతం రాష్ట్రంలోని సానుకూల వాతావరణం, ఐటీ విస్తరణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలు మా వంటి సంస్థలకు ఊతంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ కేం ద్రంగా మేం ప్రారంభించిన సంస్థలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ హబ్‌లతోపాటు లాజిస్టిక్స్‌కు పెద్దపీట వేస్తుండటంతో ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ఐటీని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిం చడం ద్వారా స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అందుబాటులోకి రావడంతోపాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. – మనోజ్ శశిధర్, సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్, కరీంనగర్ సొంత జిల్లాలో ఐటీ ఉద్యోగం.. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటుతో సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం దక్కింది. నేను చదువుకున్న కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఐటీ హబ్‌లో ఉద్యోగం సాధించాను. టెక్నోజన్ కంపెనీలో జావా ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా పనిచేస్తున్నా. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూ.. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాను. – మారేపల్లి కౌశిక్ శర్మ, ఐటీ ఉద్యోగి, టెక్నోజన్, గార్ల, ఖమ్మం జిల్లా -
ఫేస్‌బుక్‌కు పిలుపు
న్యూఢిల్లీ: కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... సెప్టెంబర్ 2న తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్బుక్ ప్రతినిధులతో చర్చించనుంది. పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్బుక్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్ నిలిపివేతలపై సెప్టెంబర్ ఒకటో తేదీన స్టాండింగ్ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్‌సభ సచివాలయం గురువారం ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. థరూర్‌ను తొలగించాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్‌ను, ఆ పదవి నుంచి తప్పించాలని, అదే కమిటీకి చెందిన సభ్యుడు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకి రాసిన లేఖలో కోరారు. లోక్‌సభ నియమాలను అనుసరించి, ఆయన స్థానంలో మరో సభ్యుడిని చైర్మన్‌గా నియమించాలని కోరారు. శశిథరూర్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ అయినప్పటినుంచీ, కమిటీ వ్యవహారాలను పద్ధతి ప్రకారం నిర్వహించడంలేదని, తన వ్యక్తిగత ఎజెండాని ముందుకు తీసుకెళుతూ, పుకార్లు వ్యాప్తిచేస్తూ, తమ పార్టీపై బురదచల్లుతున్నారని దూబే ఆ లేఖలో పేర్కొన్నారు. ఫేస్బుక్ ప్రతినిధులను స్టాండింగ్ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పకుండా శశిథరూర్ మొదట మీడియాకు వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని దూబే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ, ఫేస్బుక్ అధికారులు చర్యలు చేపట్టలేదని శశిథరూర్ ఆరోపించారు. -
ఐటీ, వైద్య సేవల్లో జోరుగా హైరింగ్..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో నియామకాలు భారీగా పడిపోయినా ఐటీ, వైద్య సేవలు, మార్కెటింగ్ రంగాల్లో హైరింగ్ ఊపందుకుంది. డెలివరీ, ఐటీ మేనేజర్ల నియామకాలు కూడా ప్రోత్సాహకరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం, నియామకాలను నిలిపివేస్తున్న పరిస్థితుల్లోనూ భారత్‌లో హైరింగ్ ప్రక్రియ పెద్దగా దెబ్బతినలేదని ఓ నివేదిక వెల్లడించింది. మార్చి రెండో వారం వరకూ నియామకాలు గత ఏడాది తరహాలోనే సాగాయని, మార్చి ద్వితీయార్ధం నుంచి ఏప్రిల్, మే వరకూ లాక్డౌన్ల ప్రభావంతో మందగించాయని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. జూన్‌లో ఇండీడ్ జాబ్ పోస్టింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 51 శాతం తగ్గాయని, బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరప్ దేశాల్లో 61 శాతం మేర తగ్గాయని నివేదిక పేర్కొంది. అయితే అమెరికాలో మాత్రం జాబ్ పోస్టింగ్స్ కేవలం 29 శాతం, సింగపూర్‌లో 32 శాతం, ఆస్ర్టేలియాలో 42 శాతం మేర తగ్గాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి మే వరకూ ఇండీడ్ వేదికపై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. కోవిడ్-19 ప్రభావంతో అత్యధికంగా చైల్డ్‌కేర్, ఆహార తయారీ రంగాల్లో 78 శాతం మేర జాబ్ పోస్టింగ్స్ తగ్గాయని, టూరిజం, ఆతిథ్య రంగాల్లో 77 శాతం, శానిటేషన్‌లో 74 శాతం చొప్పున జాబ్ లిస్టింగ్స్ తగ్గాయని నివేదిక తెలిపింది. చదవండి : ‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’ -
స్విగ్గీ, జొమాటో డ్రోన్ డెలివరీ..
ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ, డన్‌జోలు సరికొత్త రీతిలో వినియోగదారులను ఆకర్శించనున్నాయి. అందులో భాగంగానే త్వరలో డ్రోన్లను ఉపయోగించుకుంటు పుడ్ డెలివరీలు చేయనున్నాయి. దాదాపు 13 సంస్థల యాజమాన్యాలు డ్రోన్లను ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. డ్రోన్లను ఉపయోగించేందుకు భారత వైమానిక దళం గతంలోనే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కాగా జులై మొదటి వారంలోనే డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తామని త్రొట్టల్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు నాగేందర్ కందస్వామి పేర్కొన్నారు. తాము ఉపయోగించే ముందు డ్రోన్లును పరీక్షించాలనుకున్నాం.. కానీ కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ఆలస్యం జరిగిందని అన్నారు. అయితే, పరిస్థితులు కుదుటపడిన వెంబడే డ్రోన్ల పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. మరోవైపు డ్రోన్లను రూపొందించడానికి బిలియన్ డాలర్లు అవసరం ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో భారత్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పవర్ జెనరేటర్స్, ఆయిల్ కంపెనీలలో సాఫ్టవేర్‌ను ఉపయోగించడంలో దేశీయ ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని.. అలాగే డ్రోన్ల ఉపయోగించే క్రమంలో ఐటీ సేవల ద్వారా ఖర్చును తగ్గించవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు -
‘టీ వర్క్స్’ టెక్నాలజీతో ఎయిరోసోల్ బాక్సులు
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్ బాక్సులు, మాస్క్‌ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధ సంస్థ ‘టీవర్క్స్’అందించింది. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)తో పాటు బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థ కూడా ఎయిరోసోల్ బాక్సుల తయారీలో పాలుపంచుకుంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి నోరు, శ్వాసనాళం ద్వారా ఎండో ట్రాకియల్ ట్యూబ్‌ను అమర్చేందుకు పారదర్శకంగా ఉండే ఈ ఎయిరోసోల్ బాక్సులు ఉపయోగపడతాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో భాగంగా ట్యూబ్‌ను అమర్చే క్రమంలో వైద్యులు, సహాయ సిబ్బందికి ఈ బాక్సులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఎయిరోసోల్ బాక్సుల అవసరాన్ని గుర్తించిన నిమ్స్ విద్యార్థుల కోసం ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ సైన్స్ కిట్లు’(డీఐయూ కిట్స్) తయారు చేసే బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థకు బాధ్యత అప్పగించింది. ఈ కిట్ల నమూనాపై ఆన్లైన్లో శోధించిన సదరు సంస్థకు తైవాన్‌కు చెందిన ఓ వైద్యుడు తయారు చేసిన ఎయిరోసోల్ బాక్స్ నమూనా దొరికింది. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేయడంలో సాంకేతిక అవరోధాలు ఎదురవడంతో ‘టీ వర్క్స్’రంగంలోకి దిగి అవసరమైన సాంకేతికతను సమకూర్చింది. స్థానికంగా లభించే ముడివనరులు, సాంకేతికతతో ఎయిరోసోల్ కిట్లను తయారు చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ సంస్థ మరిన్ని నమూనాలు రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది. వాడిన కిట్లను పడేయడం (డిస్పోజల్), ఒకసారి ఉపయోగించిన బాక్సులను మళ్లీ వాడటం (రీ యూజబుల్) డిజైన్లు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో ఎయిరోసోల్ బాక్సు ధర రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిమ్స్‌కు పది కిట్లు సరఫరా చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అవసరానికి అనుగుణంగా బాక్సుల సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా టీ వర్క్స్ పనితీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తూ ‘అవసరాలే ఆవిష్కరణలకు మాతృక’అని వ్యాఖ్యానించారు. -
నకిలీ వార్తల ఏరివేతపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది. బుధవారం కేంద్ర హోం, ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 14న జరగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌లు భారత్‌లో తమ అధికార ప్రతినిధుల వివరాలను బహిర్గతపరిచేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ గుప్తా డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు స్వర్గ ధామాలైపోయినా సామాజిక మాధ్యమాల్లో చట్టాలను అమలు చేసే వ్యవస్థ పోతోందని, అందుకు జవాబుదారీ అయిన అధికారులు ఎవరనేది తెలియకపోవడమూ ఇందుకు కారణమని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్లకు, ఆస్తుల విధ్వంసానికి సామాజిక మాధ్యమాలు ఒక పనిముట్టుగా మారకూడదని, భావప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పుకోవడమూ సరికాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న భావనను ఈ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తున్నాయని, భారతీయ చట్టాలను పాటించడం లేదని ఆరోపించారు. తగిన చర్యలేవీ లేని కారణంగానే రెచ్చగొట్టే ప్రసంగాలూ ఎక్కువ అవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. -
పరిమితి దాటి అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ఆ కాలేజీలో 240 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులున్నారు.. కానీ కంప్యూటర్లు మాత్రం 50 లోపే! ఇదేకాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్ని కాలేజీలు విద్యార్థులు ఎక్కువగా చేరే కోర్సులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. విద్యార్థుల చేరికలకు, సెక్షన్ల పెంపునకు అనుగుణంగా ల్యాబ్‌లు, కంప్యూటర్లు ఉండటం లేదు. 10 నుంచి 20 మంది విద్యార్థులకు ఓ కంప్యూటర్ను అమర్చి మమ అనిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్న కాలేజీలు ఆమేరకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. అవన్నీ అంతో ఇంతో పేరున్న కాలేజీలు కావడంతో విద్యార్థులు వాటివైపు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. మరోపక్క కన్వీనర్ కోటా కింద కూడా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ భారీగా పొందుతున్నాయి. చివరకు అక్కడ చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రమాణాలూ పతనమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి అమ్మకానికి సీట్లు ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ఇటీవల పలు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇలాంటి పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐసీటీఈ, వర్సిటీల్లో పైరవీలు జరిపి కొన్ని యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. మరోవైపు ఇతర కాలేజీల్లో ఆయా కోర్సుల సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 32 విభాగాలకు సంబంధించిన కోర్సులున్నాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటా కింద 1,06,203 సీట్లు ఉండగా 60,315 సీట్లు భర్తీ అయ్యాయి. 45,888 సీట్లు మిగిలాయి. భర్తీ అయిన సీట్లన్నీ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ సివిల్ వంటి ముఖ్యమైన విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ సీట్లను కూడా కొన్ని కాలేజీల్లోనే అదనపు సెక్షన్ల పేరిట భర్తీ చేస్తున్నారు. ఇక మేనేజ్మెంట్ కోటాలోని 30 శాతం సీట్లను కూడా డిమాండ్‌ను బట్టి అమ్మకానికి పెడుతున్నారు. దెబ్బతింటున్న ప్రమాణాలు.. సరైన ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సెక్షన్లకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు మాత్రమే అదనపు సెక్షన్లకు అనుమతించాలని, పరిమితికి మించి మంజూరు చేయవద్దని ఏఐసీటీఈని కోరాలని కమిషన్ భావిస్తోంది.