interim bail
-
కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్‌ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు. ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కుఆయనకు ఉంటుంది. – హైకోర్టు న్యాయమూర్తిసాక్షి, హైదరాబాద్: పుష్ప–2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ (ఏ11)కు హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య చేయాలన్న ఉద్దేశం, పదునైన ఆయుధాలతో దాడి చేయడానికి సంబంధించిన సెక్షన్లు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది. పోలీసులు అనుమతి ఇచి్చన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారని, ఆయన్ను రావొద్దని పోలీసులు చెప్పారనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మరణం చోటుచేసుకున్నా, గరిష్టంగా ఐదేళ్లు శిక్ష పడే నేరంలో బెయిల్‌కు ఆయన అర్హు డని పేర్కొంది. పలు తీర్పులను ప్రస్తావి స్తూ.. 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలర్‌కు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమరి్పంచాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యా ప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు సూచించింది. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. భద్రత కల్పించని పోలీసులదే బాధ్యత: అల్లు అర్జున్ తరఫు న్యాయవాది పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయడంతో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశాం. అది ఇంకా ధర్మాసనం ముందుకు రాకముందే అరెస్టు చేశారు. క్వాష్ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో నటుడు షారుక్‌ఖాన్‌కు గుజరాత్ హైకోర్టు ఊరటనిచి్చంది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దానిని సవరించింది. కిందికోర్టు రిమాండ్ విధించినా.. దాన్ని నిరాకరించే అధికారం హైకోర్టుకు ఉంటుంది (బండి సంజయ్ కేసును ప్రస్తావించారు).రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. అందుకు ఆయన్ను బాధ్యున్ని చేయలేదు కదా. పుష్ప ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. హీరో, హీరోయిన్ వస్తారంటూ పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచి్చంది. అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉండగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి ఆయన బాధ్యుడెలా అవుతారు? ఇది ఉద్దేశపూర్వంగా లేదా కావాలని చేసింది కాదు. దురదృష్టవశాత్తు మహిళ మృతి చెందింది. 118 (1) బీఎన్ఎస్తో పాటు సెక్షన్ 105 ఈ కేసులో వర్తించదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో భద్రత కల్పించని పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. తొక్కిసలాటను ఆపే ప్రయత్నం వారు చేయలేదు. పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు. విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి..’అని కోరారు. లంచ్‌మోషన్ అనుమతించవద్దు: పీపీ ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదు. బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి. కోరగానే లంచ్‌మోషన్ ఇవ్వడం తప్పుడు సంకేతం ఇస్తుంది. లంచ్‌మోషన్ మధ్యాహ్నం వేయడాన్ని అనుమతించకూడదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్లో ఎక్కడా కోరలేదు. కనీసం పిటిషన్ చదువుకునే సమయం అయినా ఇవ్వకుండా వాదనలు వినిపించాలంటే ఎలా? విచారణ సోమవారానికి వాయిదా వేయాలి. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పారు. ఆయన్ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించాం..’అని తెలిపారు. హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? ‘లంచ్ మోషన్ విచారణకు అనుమతి ఇవ్వొద్దని తొలుత భావించా. సామాన్యులైతే ఇద్దామనుకున్నా. అయితే సినీ హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? అనే సందేహం వచి్చంది. అతని హోదా కారణంగా స్వేచ్ఛను కోల్పోవడం సరికాదని అనిపించింది. అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇదే హైకోర్టు పలువురికి బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్‌కు పంపిన తర్వాత బీజేపీ నేత బండి సంజయ్‌కి, అలాగే 489ఏ వ్యవహారంలో ఒక సామాన్యునికి ఊరట దక్కింది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం, తదితరులు దాఖలు చేసిన మరో పిటిషన్లో అరెస్టయిన మరో ఇద్దరిని (ఏ–1, ఏ–2) కూడా విడుదల చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. ఇతర పిటిషనర్లపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
కన్నడ స్టార్ దర్శన్ కు మధ్యంతర బెయిల్
-
ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండ్ అయిన సివిల్ సర్వెంట్ సౌమ్య చౌరాసియాకు ఆమె కస్టడీలో గడిపిన సమయం, ఆరోపణలు నమోదు చేయకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఈరోజు(గురువారం) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణలో ఉన్నవారిని ఎన్నాళ్లు జైలులో ఉంచుతారని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిందిఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాజీ డిప్యూటీ సెక్రటరీగా చౌరాసియా పనిచేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమె నిందితురాలు. సుప్రీం న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సౌమ్య చౌరాసియాకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ఇప్పటికే ఒక సంవత్సరం తొమ్మిది నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఆమె సహ నిందితుల్లో కొందరు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.ట్రయల్ కోర్టుకు హాజరుకాక పోవడం, నిందితులలో కొందరిపై నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేయకపోవడం వల్ల అభియోగాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఛత్తీస్ హైకోర్టు గతంలో పేర్కొంది. ఈ దరిమిలా, తదుపరి తేదీలో విచారణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో, తాము పిటిషనర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆమె మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున తిరిగి సర్వీస్‌లో చేర్చుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌లో ఉంచాలని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.చౌరాసియా తదుపరి కోర్టు విచారణకు హాజరుకావాలని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని, ఆమె తన పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసుల్లో నేరారోపణ రేటు ఎంతని? నిందితులను ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించగా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది పల్లవి శర్మ ఈ కేసులో చౌరాసియా తరపున వాదించారు. సౌమ్య చౌరాసియా 2022 డిసెంబర్లో బొగ్గు కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలను చౌరాసియా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.ఇది కూడా చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..! -
బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్‌దాస్ షా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు. ‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ను కూడా కోరారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్
-
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ,సాక్షి: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో జైల్లోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్ అరెస్టుకు తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే 90 రోజులపాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేయాలా లేదా అన్నది ఆయన (కేజ్రీవాల్) నిర్ణయానికే వదిలేస్తున్నాం అని వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం ఈడీ కేసులో సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ దక్కినా..ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆయన జ్యుడిషయల్ కస్టడీ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు. ఈనెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఈడీ అరెస్ట్ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మార్చి 21న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అక్రమమని ఈడీని సవాల్ చేస్తూ ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది. అందులో ఎలాంటి చట్టవిరుద్దం లేదని, కేసు నిమిత్తం దర్యాప్తుకు రావాలని కోరుతూ పదే పదే జారీ చేసిన సమన్లపై స్పందించ లేదు కాబట్టే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సమర్దించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు ఈడీ స్పందన కోరింది. విచారణ సందర్భంగా,మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అతనికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువడిన తర్వాత,కేజ్రీవాల్ అరెస్టుకు ముందు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాలని, సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఈడీకి సూచించింది.ఈ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా,దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు ఇవాళ వెలువరించింది. -
పిన్నెల్లికి ముందస్తు బెయిల్ 20 వరకు పొడిగింపు..
సాక్షి, అమరావతి: పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆ మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.తరువాత ఈ వ్యాజ్యాలు గత వారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో వాదనలు రాత్రి 10.30 గంటల వరకు సాగడంతో అదే రోజు ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానానికి సమయం దొరకలేదు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పిన్నెల్లి వ్యాజ్యాలు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ విజయ్ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు విన్నప్పటికీ, నిర్ణయం వెలువరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.ఈలోగా కోర్టుకు వేసవి సెలవులు ముగుస్తాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలను రెగ్యులర్ బెంచ్ ముందు వచ్చేలా విచారణను వాయిదా వేస్తానని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల అభిప్రాయాన్ని కోరారు. ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. -
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్..కోర్టులో నో రిలీఫ్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్2) తీహార్ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. -
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్య చాలా తీవ్రమైనదిఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు...ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇవీ షరతులు..పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్‌పోర్ట్ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్ రోజున ఎస్పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్‌తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు. -
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్‌ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్‌సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్జేడీ ఎంపీ 'మనోజ్ ఝా' హర్షం వ్యక్తం చేశారు. సరైన విచారణ లేకుండానే హేమంత్ సోరెన్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం సంతోషంగా ఉంది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభిస్తే జార్ఖండ్‌లో కూడా బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మనోజ్ ఝా అన్నారు.ఎక్సైజ్ పాలసీ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి 50 రోజుల జైలులో ఉంచారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ తరపున ప్రచారం చేయడానికి కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నిలకు పూర్తయిన తరువాత జూన్ రెండున ఆయన స్వచ్చందంగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడానికి ముందు.. ఏప్రిల్‌లో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత సింగ్ బయటకు వచ్చారు.#WATCH | On interim bail to Delhi CM Arvind Kejriwal, RJD MP Manoj Kumar Jha says, "The way he was arrested without solid investigation, the way it was done to Hemant Soren ji and being done with others...We are happy that he has got bail, he will campaign also. If he (Hemant… pic.twitter.com/G9jXUcKyNP— ANI (@ANI) May 11, 2024 -
Aravind Kejriwal: నేను వచ్చేశా...
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు. ‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’ – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘హనుమాన్జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’ – సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’ – శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత -
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి. 2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్‌స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది. కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్ ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్ ఏడోది కానుంది. -
సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తిహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
కవితకు బెయిల్‌పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తీహార్ అధికారుల తీరుపై.. ఇదిలా ఉంటే.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సందర్భంలో కవిత కొన్ని విజ్ఞప్తులు చేశారు. జైల్లో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మంగళసూత్రం ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. అయినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటికి అనుమతివ్వడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విచారణ సందర్భంగా కవిత తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఊరట దక్కని పక్షంలో.. జైల్లో రిమాండ్ ముగిసేవరకు ఆ వసతులైనా కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది. -
క్యాన్సర్ బారిన పడ్డ నరేష్ గోయల్! - కోర్టు కనికరిస్తుందా..
మనీలాండరింగ్ కేసులో వేలకోట్ల మోసానికి పాల్పడ్డ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు 'నరేష్ గోయల్' గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయ్యారు. అయితే క్యాన్సర్ భారిన పడి.. దాని చికిత్స కోసం ఇటీవల మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ కోసం నరేష్ గోయల్ అభ్యర్థనను కోర్టు పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి.. సంబంధిత వివరాలను ఈ నెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది. నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిపోర్ట్ అందించిన తరువాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. నరేష్ గోయల్ గత జనవరిలో కోర్టుకు హాజరైన తనకు బ్రతకాలనిగానీ, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదని, జైల్లోనే చనిపోవాలనుకున్న ప్రతిసారీ విధి కాపాడుతోంది, ఇలాంటి జీవితం భరించడం కంటే చనిపోవడం మేలని తనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించవద్దని కన్నీరు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నారు. 1990 నుంచి 2000 వరకు భారతీయ వైమానిక రంగంలో ఓ మెరుపు మెరిసిన సంస్థ ఈ రోజు అధో పాతాళానికి పడిపోయింది. అయితే ఈ నెల 20న నరేష్ గోయల్ బెయిల్ పొందుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్ -
మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయంది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరీంగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్ చేసింది. చదవండి: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఊరట -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు.