jc prabakar reddy
-
నావల్లనే ప్రాబ్లమ్ అయితుంది అంటే వెళ్లిపోతా: జేసీ
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..బీటెక్ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.‘‘పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు. అమెజాన్, రెడ్‌బస్ ఓనర్లు.. ఎలాన్ మస్క్.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్ కంటే మున్సిపల్లో ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన. -
తాడిపత్రిలో వెలుగులోకి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దందా
-
దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం కలిశారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటికి వెళ్లేందుకు టీడీపీ నేతల అనుమతి అవసరమా? అంటూ ప్రశ్నించారు. అవసరమని ఎస్పీ చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ కోరేందుకు సిద్ధమని.. దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతానన్నారు.ఓ మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరించినా పోలీసులు మౌనంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా ఎస్పీ జగదీష్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా’’ అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా? -
చంద్రబాబుకు జేసీ ఝలక్
అనంతపురం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక ఆక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారాయన. ఏకంగా తన వర్గానికి చెందిన వాళ్లే ఈ పని చేస్తున్నారని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తన వర్గానికి చెందిన సుమారు 25 మంది టీడీపీ నేతలే ఇసుక తరలిస్తున్నారని చెప్పారు జేసీ. అయితే.. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా ఆపాలని అన్నారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెప్పుకునే చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వడం కొసమెరుపు. -
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత!
కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుంది అని ఒక సామెత. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభమైన తీరు అలాగే ఉందని చెప్పాలి. ఎవరైనా మంచి శుభ కార్యాలతో ,అభివృద్ది పనులతో ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అందుకు విరుద్దంగా నడక మొదలు పెట్టింది. దానికి తగినట్లే కొందరు నేతలు సాగిస్తున్న దూషణల పర్వం ప్రభుత్వ పరువును గంగపాలు చేస్తున్నట్లుగా ఉంది. టీడీపీ ఇంత భారీ మెజార్టీతో ఎలా గెలిచిందా? అని ప్రజలు అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలోనే ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చే ఐదేళ్లు ఎలా భరించాలో అని భయపడే పరిస్థితిని సృష్టిస్తున్నారు.ఎన్నికలలో గెలుస్తున్నట్లు కౌంటింగ్‌లో వెల్లడి కాగానే తెలుగుదేశం శ్రేణులు అనండి, ఆ పార్టీ గూండాలు అనండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు ఆ పార్టీ వారి ఆస్తులను ద్వంసం చేశారు.వీటిలో ఎక్కువగా నష్టపోయింది బలహీనవర్గాలు, పేదలే అని చెప్పాలి. టీడీపీ వారి కక్షలకు తేలికగా దొరికేది వారే కాబట్టి.కొంతమంది నేతల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని కూడా టీడీపీ రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే పంధా కొనసాగిస్తున్నారు. దీనిని చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఖండించకపోవడం ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చెప్పినట్లయింది. పోలీసులు నిష్క్రియాపరత్వం కారణంగా పరస్పర ఘర్షణలు కూడా సాగాయి. కొన్ని వందల చోట్ల వైఎస్సార్సీపీ క్యాడర్ నష్టపోతే, ఒకటి,రెండు చోట్ల టీడీపీ వారు కూడా ఎదురుదాడుల కారణంగా నష్టపోయారు. రెండువైపులా సంయమనం పాటించాలని చెప్పవలసిన ముఖ్యమంత్రి,మంత్రులు, టీడీపీవారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. మరి వందల చోట్ల టీడీపీ వారు చేసిన దాడులు,హింసాకాండ పై పల్లెత్తి మాట్లాడలేదు. ఒక పక్క కక్ష సాధింపు రాజకీయాలు చేయబోము అని చెబుతూనే, మరో వైపు తప్పు చేసినవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తుంటారు.దీంతో టీడీపీ క్యాడర్ కు ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. టీడీపీ నేతలు సైతం ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు.స్పీకర్ గా ఎన్నికైన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై కొందరు అధికారులను ఉద్దేశించి బూతులు తిట్టారు. వారికి అధికారులపై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. అయినా అధికారులు తప్పు చేశారని భావిస్తే,వారిపై చర్య తీసుకోవడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. ఆ విషయం అయ్యన్నకు తెలియనిది కాదు. ఎంతోకాలం మంత్రిగా కూడా పనిచేశారు. ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంత పద్దతిగా మాట్లాడాలి!అలాకాకుండా నోరుపారేసుకుని అధికారులను నైతికంగా దెబ్బతీశారు. కాకపోతే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కనుక, ఆ అధికారులు ప్రస్తుతానికి సర్దుకుపోవచ్చు. కాని సమయం సందర్భం వచ్చినప్పుడు వారుతమ నిరసన తెలుపుతారు. అంతదాకా తెచ్చుకోవడం అయ్యన్నకు అవసరమా?అధికారం రావడంతోనే అహంకారం తలకెక్కితే ఇలాగే చేస్తారన్న విమర్శలను ఆయన మూట కట్టుకున్నారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి చేసిన దూషణలు దారుణంగా విన్నాయి.అధికారులను నరుకుతా అని అంటున్నారు. వినడానికే భయంకరంగా ఉన్నాయి. ఆయన హాహాభావాలు ప్రదర్శిస్తూ తనను గతంలో జైలులో పెట్టిన అధికారుల సంగతి చూస్తానని చెప్పడం ద్వారా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఎలా ఉండబోతున్నారో చెప్పినట్లయింది.తాను చేసినవి చిన్న తప్పులని ఆయన అంటున్నారు. దానికే తనను ఇబ్బంది పెడతారా? ఇప్పుడు తమకు అధికారం వచ్చింది కనుక తమ బస్ లను బాగు చేసి తమకు అప్పగించాలని ప్రభాకరరెడ్డి డిమాండ్ చేయడం అంటే రాష్ట్రంలో అధికారులు ఎవరూ తమ పని తాము చేయకూడదని చెప్పినట్లయింది. ప్రభాకరరెడ్డిపై వచ్చిన ఆరోపణ ఏమిటి?ఆయన కేంద్ర ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకంగా బస్ లు కొని ఎక్కడో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశారన్నది అభియోగం.దీనిపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అది వారి బాధ్యత కదా! రాజకీయాలలో ఉంటే ఎలాంటి తప్పు చేసి అయినా చెలామణి అయిపోవచ్చా!అందులోను అధికార తెలుగుదేశంలో ఉంటే ఎవరూ వారి జోలికి రాకూడదా!మరి ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో జెసి ప్రభాకరరెడ్డి సంస్థపై కేసులు పెట్టింది కదా! ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తమ కంట్రోల్ లో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.మరి ఈడి అధికారులను కూడా అలాగే చేస్తారా?జేసీ ప్రభాకర్ రెడ్డి నిజంగానే తప్పు చేయకపోతే ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు. అలాకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఇలా తిట్లు లంఘించుకున్నారంటే ఏమని అనుకోవాలి.మరో నేత, మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రూల్ పాస్ చేశారు. ఎవరైనా టీడీపీ కార్యకర్త పసుపు బిళ్ల పెట్టుకుని వస్తే వారిని ఆయా ఆఫీస్ లలో అధికారులు స్వాగతం పలికి టీ ఇచ్చి మరీ వారు అడిగిన పనులు చేయాలంట.లేకుంటే వారి సంగతి ఈయన చూస్తారట.అచ్చెన్నాయుడుకు నోటు దురుసుతనం కొత్తకాదు. మరింత పెట్రేగి మాట్లాడారు.ప్రతి టీడీపీ కార్యకర్తకు అధికారులు గులాం అయి పనిచేయడం సాధ్యమేనా?అది చట్టబద్దమేనా?. కొత్తగా హోం మంత్రి అయిన వంగలపూడి అనిత ఏకంగా బ్లడ్ గురించి మాట్లాడుతున్నారు.వైఎస్సార్సీపీ బ్లడ్ ఉంటే పోలీసు అధికారులు రిజైన్ చేసి పోవాలట. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని చెప్పవలసిన మంత్రులు ఇలా దుడుకుతనంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి. అధికారులు ఎవరు ప్రభుత్వం లో ఉంటే వారు చెప్పినట్లు పనులు చేయడం సహజంగానే జరుగుతుంది. ఉదాహరణకు మంత్రి అనిత ఎవరైనా పోలీసు అధికారికి ఏదైనా పని చెబితే, అది సాధ్యం కాదని ఆ అధికారి అంటే ఒప్పుకుంటారా? వెంటనే ఆ అధికారికి రాజకీయ పార్టీ ని అంటగడతారా?పోలీసు అధికారులంతా పచ్చ రక్తం ఎక్కించుకోవాలని ఆమె చెబుతున్నట్లుగా ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాని మంచి మాట, మంచి పనులే ఎప్పటికి గుర్తుంటాయి. అందుకు విరుద్దంగా పనిచేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు. ఆ విషయం తెలిసినా రాజకీయ పార్టీల నేతలు యధాప్రకారం అహంభావంతో ప్రవర్తించి దెబ్బతింటుంటారు. సాధారణంగా మంత్రి పదవులలోకి వచ్చిన కొన్నాళ్లయినా సంయమనంగా ఉంటారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అరాచకాలకు తెగబడరు. కాని ఈసారి అధికారంలోకి రావడంతోనే విచ్చలవిడిగా టీడీపీ శ్రేణులు జనం మీద పడుతున్నాయి. మంత్రులు ,టీడీపీ నేతలు కసిగా సంభాషిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా తాడేపల్లి వద్ద వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాలను అధికారులు కూల్చివేయడం విద్వంస పాలనకు పరాకాష్టగా ఉంది. ఇప్పటికైనా అత్యంత సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయడు ఈ పెడపోకడలకు పుల్ స్టాప్ పెట్టాలి.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మంత్రులను,టీడీపీ నేతలను అదుపులో పెట్టాలి. లేకుంటే చంద్రబాబుకు మరింత అప్రతిష్ట అవుతుందని చెప్పకతప్పదు. ఈ నేపధ్యంలోనే కాపురం చేసే కళ పెళ్లినాడే తెలిసిపోతుందన్న సామెత టీడీపీకి అతుకుతుందనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తాడిపత్రిలో పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేశారు..
-
వంచకుడికి వంత పాడతారా?
తాడిపత్రి రూరల్: ‘ఓ ప్రజాప్రతినిధిగా మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి, మోసం చేసిన వాళ్లకే వంత పాడతారా? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ కౌన్సిలర్ చేతిలో వంచనకు గురైన బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు, తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమ పేరుతో వాడుకుని వదిలేయడంతో పాటు చంపుతానని బెదిరిస్తుండడంతో ఓ అభాగ్యురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మల్లికార్జునను మందలించి, ఆమెకు న్యాయం చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకు భిన్నంగా ఇటీవల టీడీపీ నాయకులతో కలిసి కౌన్సిలర్ మద్దతుగా స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దీనిపై సోమవారం బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వారం రోజుల క్రితం జేసీని కలిస్తే తనను అవమానించారని వాపోయారు. మల్లికార్జున తనను శారీరకంగా వాడుకుని, మోజు తీరాక మరో యువతితో తిరుగుతున్నాడని ఆయన దృష్టికి తీసుకెళ్తే హనీ ట్రాప్ అంటూ తనపైనే దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జునతో వివాహం చేయనని కరాఖండీగా చెప్పారని వెల్లడించారు.జేసీ చేసిన అవమానం భరించడం కంటే చనిపోవడమే మేలంటూ విలపించారు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నట్లు తెలిపారు. వారు న్యాయం చేయకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానన్నారు. తనకు మల్లికార్జునతో వివాహం చేయిస్తానని హామీ ఇచ్చేంతవరకు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. మహిళ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ టీడీపీ నాయకులు వేధిస్తున్నారని వాపోయారు. కాగా, బాధితురాలు సోమవారం రాత్రి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సిగ్గనిపించడం లేదా జేసీ? టీడీపీ కౌన్సిలర్ చేతిలో వంచనకు గురైన బాధితురాలికి న్యాయం చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆమైపెనే దౌర్జన్యం చేయడం దుర్మార్గం. మల్లికార్జున అమాయకుడంటూ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి సిగ్గుండాలి. పైగా వంచకుడి తప్పును కప్పిపుచ్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిస్తూ బాధితురాలిని మానసికంగా వేధించడం హేయం. ప్రజలు జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలను గమనిస్తున్నారు. వాళ్లే మళ్లీ తగిన గుణపాఠం చెబుతారు. – ఎమ్మెల్యే పెద్దారెడ్డి -
AP Politics: ఏం ‘జేసి’నా అభాసుపాలే!
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుంది జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు. అధికారమే అండగా ఒకప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు రాజేసిన ఆయన నేడు తనను తాను శాంతికాముకుడిలా బిల్డప్ ఇస్తుండడంపై జనం నవ్వుకుంటున్నారు. ఒళ్లంతా విషం నింపుకుని ఒంటిపై శాలువ, నుదుటిపై విబూది పెట్టినంత మాత్రాన అరాచకాలు మరచిపోగలమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిరూరల్: ‘శంఖారావం’ సభలో పాల్గొనేందుకు సోమవారం టీడీపీ నేత నారా లోకేష్ తాడిపత్రి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కంట్లో పడేందుకు జేసీ చేస్తున్న డ్రామా అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. పట్టణ పోలీసు స్టేషన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ అందరినీ పగలబడి నవ్వేలా చేస్తోంది. ‘దొంగే దొంగ.. దొంగ’ అన్న చందంగా ఉందని ఫ్లెక్సీని చూసి పలువురు విమర్శలు గుప్పించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అందులోని అక్షరాలు ఉన్నాయని మండిపడ్డారు. అరాచకాలు మరువగలమా జేసీ..! అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను తన ప్రాపకం కోసం రెండుగా చీల్చారు. కక్షలు, కార్పణ్యాలు రాజేశారు. తాడిపత్రి మండలం వీరాపుం గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజేసిన చిచ్చు ఇప్పటికీ చల్లారడం లేదంటే అతిశయోక్తి కాదు. తన రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గ్రామస్తులను రెచ్చ గొట్టి రెండు వర్గాలుగా చీలగొట్టారు. నిప్పు రాజేసి తమకు కావాల్సిన సమయంలో ఆజ్యం పోశారు. వీరి వికృత చేష్టలు గత ఎన్నికల సమయంలో ఏకంగా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు దారి తీశాయి. ప్రశాంతంగా ఉన్న ఇగుడూరు గ్రామంలో సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో వర్గ కక్షలకు తెరలేపారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పొలాల్లో చెట్లు పీకేయించడం, బోర్లు పగుల గొట్టడం తదితర చర్యలకు ఉసిగొల్పి రాక్షసానందం పొందారు. ► అధికార దాహంతో కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వగ్రామంలో చిచ్చు రాజేయాలని చూశారు. పెద్దారెడ్డి రాజకీయంగా ఎదుగుతుండడం చూసి ఎలాగైనా దెబ్బగొట్టేందుకు ఆయన స్వగ్రామం తిమ్మంపల్లివాసులను రెండు వర్గాలుగా విడగొట్టారు. గ్రామంలో తన అనుచరునికి ఇల్లు కొనుగోలు చేయించి కక్షలు రాజేశారు. పెద్దారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. అంతటితో ఆగక ‘నేను నీ ఊరొచ్చా, ధైర్యం ఉంటే నీవు తాడిపత్రికి రావాలంటూ’ పెద్దారెడ్డిని రెచ్చగొట్టారు. జేసీ చాలెంజ్‌ను స్వీకరించిన పెద్దారెడ్డి ఆయన కోరినట్లుగానే తాడిపత్రికి వచ్చారు. అప్పటికే జేసీ సోదరుల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు పెద్దారెడ్డికి జై కొట్టారు. ఎన్నికల్లో జేసీ తనయుడిని చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా, జేసీ ప్రభాకర్ రెడ్డికి బుద్ధి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటికీ నియోజకవర్గవ్యాప్తంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. తన అనుచరులను రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ అలజడులు రేకెత్తిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీ నాయకులను కవ్వించేందుకు తానేదో మంచికి మారు పేరు అన్నట్లుగా ఫ్లెక్సీలు కట్టించుకున్నారు. గతంలో ఆయన చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు. ఇతనికెప్పటికి బుద్ధి వస్తుందో అంటూ నిట్టూరుస్తున్నారు. -
సీనియర్లకు దిక్కేది?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసలే వర్గపోరుతో గందరగోళంగా ఉన్న పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, చివరి నిమిషం వరకూ ‘నీకే టికెట్’ అంటూ పలువురికి అధిష్టానం చెప్పడం నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓటికుండగా మారింది. చంద్రబాబును నమ్ముకున్న సీనియర్ నాయకులు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన జితేందర్‌గౌడ్‌కు టికెట్ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు. పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. జేసీ కుటుంబానికి కొమ్ములొచ్చాయా? నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గానికి ఏమైనా కొమ్ములొచ్చాయా అంటూ కొంతమంది నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పవన్‌కు టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న బాబు.. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది. బీసీ వర్గాల్లో అసమ్మతి రాగాలు బోయ, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం జిల్లాలో ఎక్కువ. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో హిందూపురం ఎంపీగా గెలిచిన నిమ్మల కిష్టప్ప తనను పక్కన పెట్టారని టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అవసరమైనప్పుడు వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా అంటున్నట్టు సమాచారం. నిమ్మల, బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ వంటి బీసీ నేతలతోపాటు శింగనమల, మడకశిర నియోజకవర్గాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేతలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు అధికార పక్షం దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దూసుకెళుతుండగా.. ఇప్పటివరకు చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు శనివారం ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్‌రా.. చెయ్!'
తాడిపత్రి అర్బన్, సాక్షి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు. రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు. ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్మహ్మద్లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్‌తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్‌ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్‌రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. జేసీపై కేసు నమోదు పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు. -
అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు
రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్ (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇది తొలిసారి కాదు... జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై... వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు. అనుచరులను ఉసిగొలుపుతూ... గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు. జేసీ తీరుపై పోలీసుల మౌనం జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదుకు ఆదేశం కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. – అన్బురాజన్, ఎస్పీ -
జేసీ అక్కసు రాజకీయాలు.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
‘కుక్కతోక వంకర ’ అన్న చందంగా ఉంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆయన బుద్ధిలో మాత్రం ఏ మార్పూ రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సేవ్ తాడిపత్రి పేరుతో మొసలి కన్నీరు కార్చి బోటాబోటీగా గెల్చి మున్సిపల్ చైర్మన్ పీఠమెక్కారు. చైర్మన్ స్థానంలో తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన జేసీ.. అందుకు భిన్నంగా అభివృద్ధి పనులకు మొకాలడ్డుతున్నారు. తాడిపత్రి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అభివృద్ధి పనులు పూర్తయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులన్నింటినీ తన పచ్చ మూకలను అడ్డుపెట్టుకుని అడ్డుకుంటున్నాడు. సొంత పార్టీ నేతల అసంతృప్తి.. జేసీ ఒంటెద్దు పోకడలు నచ్చక సొంత పారీ్టలోని కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీని వీడారు. మరికొందరు వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో? రాదోనన్న ఆందోళనతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షుద్ర రాజకీయాలతో పట్టణాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాత్రికి రాత్రే నిర్మాణాల కూల్చివేత.. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని జేసీ టీం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుందన్న ఆరోపణలున్నాయి. అయితే నాడు – నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉండడంతో ప్రహరీ వల్ల తన వారికి ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయోనని గత నెల 19న రాత్రి ప్రభుత్వ వ్యయంతో అప్పటి వరకూ చేపట్టిన ప్రహరీ పనులను కూలి్చవేó శారు. తన పచ్చబ్యాచ్‌తో రాత్రికి రాత్రే కాంక్రీట్ పిల్లర్లను కూలి్చవేసి, గుంతలను పూడ్చివేశారు. మరుసటి రోజు కూలీలు పని చేపట్టేందుకు ప్రదేశానికి వెళ్లగా మేస్త్రీ, కూలీలను పనులు చేపట్టకూడదని హుకుం జారీ చేశారు. మేస్త్రీ గురుశంకర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బందోబస్తు మధ్య తిరిగి కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు సాగేలా చూశారు. దీన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరుడి చేత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చి మరీ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అడ్డుపుల్లేశారు. మరికొన్ని ఇలా.... ► వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తాడిపత్రి పట్టణం, ఆంజనేయస్వామి మాన్యంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేద ప్రజలకు మేలు జరగడాన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు. ►పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉపకేంద్ర భవనం నిర్మించడం గిట్టక తన అనుచరుడు, ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్ వేయించి ఆ పనులకూ ఆటంకం కలిగించారు. ►తాడిపత్రిలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మంజూరుకు ఒప్పించారు. అప్పటి ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఎమ్మెల్యే సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణం చేపట్టడాన్ని ఓర్వలేక మళ్లీ ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్ వేయించారు. నిర్మాణ పనులు ముందుకు సాగకుండా స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► ఆటోనగర్ సమీపంలో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు గతంలో అక్రమంగా ఇళ్ల స్థలాలు పొంది, రద్దయిన పట్టాలను తిరిగి ఇవ్వాలంటూ వారిచే కోర్టులో కేసు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేసీ తీరుపై సర్వత్రా విమర్శలు.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుకోవడం సమంజసం కాదని పట్టణ ప్రజలు అంటున్నారు. ప్రశాంతత చెడగొట్టేందుకే... ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందిన అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, శాంతిభద్రతలను వారు అదుపులో ఉంచేలా కృషి చేశారు. అయితే మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితానికి చెక్ పడడంతో మింగుడుపడని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా తిరిగి పట్టు సాధించేలా నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు కుట్రపన్నుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. -
అనంత.. టికెట్లపై ‘తమ్ముళ్ల’ నిరసన గళం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నాయకులపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లకు టికెట్లిస్తే వచ్చే ఎన్నికల్లో మునిగిపోతాం అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. నాయకుల కంటే వర్గాలు ఎక్కువయ్యాయని, ఈ నాయకుల కొట్లాటలతో పిచ్చెక్కిపోతోందని వాపోతున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు ఇప్పటి వరకూ ఏం చేశామో చెప్పలేక.. భవిష్యత్‌లో ఏం చేయగలమో తెలియక ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. అధికార పక్షమే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశ చరిత్రలో తొలిసారి ప్రతి గడపకూ వెళుతున్న పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. కుల, మత, వర్గాలకతీతంగా 86 శాతం మందికి పైగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంక్షేమ ఫలాలు అందించిన ఘనతను సాధించింది. వాళ్లను ప్రోత్సహిస్తే పుట్టి మునుగుతుంది వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మి ఈడీ కేసులో ఇరుక్కోవడంతో పాటు తాడిపత్రిలో నిత్యం వివాదాలు సృష్టిస్తున్న జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)ను ప్రోత్సహించవద్దని జిల్లానుంచి పలువురు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. జేసీ సోదరుల చౌకబారు ఎత్తుగడలకు పార్టీ అథఃపాతాళానికి దిగజారిందని వాపోతున్నారు. ► పరిటాల రవి కుటుంబం పైనా అనేక ఆరోపణలు ఉన్నాయి. పరిటాల రవి హయాంలో ఆర్ఓసీ పేరిట జరిగిన దమనకాండ చెరగని మచ్చ అని..పైగా పరిటాల సునీత నాడు మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని, ఈ కుటుంబానికి రెండు టికెట్లు కాదు ఒక్కరికి టికెట్ ఇచ్చినా మునిగిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు. వీళ్లేమి జిల్లా అధ్యక్షులు బాబూ..! జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురానికి కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయికి బీకే పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా అయ్యారు. వీళ్లపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. జిల్లాలో కాలువ శ్రీనివాసులు ఎవరినీ కలుపుకుపోవడం లేదని, పైగా రాయదుర్గంలో ఆయన గెలవలేని పరిస్థితి ఉందని కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల చంద్రబాబు అనంతపురం వచ్చినప్పుడు బాగా గుర్తింపు ఉన్న ఓ కార్యకర్తను ‘చస్తే చావు’ అంటూ అన్న మాటలు అక్కడున్న వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. పైగా మూడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదని ఆరోపణలున్నాయి. దీంతో పాటు బీకే పార్థసారథి ఇంట గెలవ లేక రచ్చ రచ్చ చేస్తున్నారని, ఆయనకు జిల్లా మొత్తం ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ బీసీ సామాజికవర్గానికి చెందిన సవితమ్మతో పోరు కొనసాగిస్తూ పెనుకొండ నియోజకవర్గానికే పరిమితమయ్యారన్న చెడ్డపేరు ఉంది. జిల్లా అధ్యక్షులుగానే కాదు నియోజకవర్గ ఇన్చార్జ్లుగానూ వీరు పనికి రారన్న విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి కదిరిలో ఇప్పటికే కందికుంట వెంకట ప్రసాద్ కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వవద్దని మరో వర్గం పోరాడుతోంది. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఆయనకు గనుక టికెట్ కేటాయిస్తే ఓటమి తథ్యమని కొందరు కుండ బద్దలుకొడుతున్నారు. గుంతకల్లులో టీడీపీకి అభ్యర్థి ఉన్నారనే విషయమే ఎవరికీ తెలియదని, కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటే పరువు బజారున పడుతోందని, అసలు అనంతపురం జిల్లావైపు అధిష్టానం ఎప్పుడైనా చూస్తోందా అంటూ కిందిస్థాయి కేడర్ మండిపడుతోంది. దళిత నేతలకు గుర్తింపు ఏదీ? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ దళిత నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రెండు నియోజవర్గాల్లోనూ ఆధిపత్య కులాల నాయకులదే పెత్తనం. శింగనమలలో బండారు శ్రావణిని పట్టించుకునే దిక్కు లేదు. స్వయానా ఆమె తండ్రిపై టీడీపీ వారే దాడి చేస్తే లోకేష్ (పాదయాత్ర సమయంలో) జిల్లాలో ఉండికూడా పరామర్శించలేదు. ఇక మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. మైనింగ్ అవినీతిలో కూరుకుపోయిన గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లో ఆ నియోజకవర్గం ఉంది. దీంతో జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: బీఎస్–3 వాహనాలను బీఎస్-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులు, సీబీఐతో పాటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా మార్చి నడపడంపై తాను 2020 అక్టోబర్ 12న రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటూ ఏపీలోని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అక్రమాలు తేలడంతో పలు వాహనాలను సీజ్ చేశారని పేర్కొన్నారు. చదవండి: తీవ్ర వాయుగుండం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణలో మాత్రం వాహనాలను అక్రమంగా నడుపుతున్నారని వివరించారు. ఇది సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విచారణ జరిపి కేసు నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలని.. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేశారు. -
జేసీ ప్రభాకరరెడ్డి నీకు సిగ్గుందా?
తాడిపత్రి: ‘జేసీ ప్రభాకరరెడ్డి నీకు సిగ్గుందా? అసలు మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం జరిగింది నీ హయాంలో కాదా? ఈ విషయాన్ని కప్పిపెట్టి అధికారులపై నిందలు మోపుతావా?’ అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన జేసీ సోదరులు... రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో అధికారులు, పోలీసులను బెదిరించి గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు. తన మాట వినని అధికారులకు అవినీతి మరక అంటించడం జేసీ ప్రభాకర్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఒక్కసారి జేసీ ప్రభాకరరెడ్డి గత చరిత్రను పరిశీలిస్తే అక్రమాలు వెల్లువలా వెలుగులోకి వస్తాయన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా జేసీ ప్రభాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ వాడకం ఎంత మేరకు ఉందో... ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎంత మేరకు తగ్గిందో ఒక్కసారి గుర్తించాలన్నారు. అప్పట్లో మున్సిపల్ ఏఈ జయభారత్‌రెడ్డిని దొడ్డిదారిన కమిషనర్‌గా ఏర్పాటు చేయించుకుని మున్సిపాలిటీని నిలువునా దోచేశాడన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. గతంలో తాను సవాల్ చేసిన ప్రతిసారీ జేసీ ప్రభాకరరెడ్డి తోక ముడుస్తూ వచ్చాడన్నారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు సృష్టించేందుకు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుండడం సిగ్గుచేటన్నారు. కాలం చెల్లిన రాజకీయ నేత జేసీ ప్రభాకరరెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. తన అక్రమాలు వెలుగులోకి రాకుండా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుండా రెండు నెలలుగా జాప్యం చేస్తున్నాడన్నారు. ఇప్పటికై నా నీచ రాజకీయాలకు స్వస్తి పలకకపోతే పుట్టగతుల్లేకుండా పోతావని హెచ్చరించారు. -
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి జులుం
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చిందులు తొక్కారు. టీడీపీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించేందుకు నివాసం నుంచి బయల్దేరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేనిదే వార్డుల్లో పర్యటించకూడదని పోలీసులు ఆయన్ను ఒకటో వార్డు గాందీనగర్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. డీఎస్పీ వీఎన్కే చైతన్య జోక్యం చేసుకుని.. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టంచేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పంపించివేశారు. ఇదీ చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల రాళ్ల దాడి
-
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!
ఆయనో సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక నియోజకవర్గంలో దశాబ్దాలుగా చక్రం తిప్పినా.. గత ఎన్నికల్లో పరాజయం చెందారు. తనకు రాజకీయంగా సమాధి తప్పదని కుమిలిపోతున్న ఆ నేత.. ఇప్పుడు కనిపించిన వారందరిపైనా తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. కావాలనే వివాదాలు సృష్టించుకుంటూ అభాసుపాలవుతున్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పేరు తెలియనివారుండరు. సోదరులిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం తర్వాత పచ్చపార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా జిల్లా రాజకీయాలను శాసిస్తే.. తమ్ముడు ప్రభాకరరెడ్డి మాత్రం లోకల్‌గానే తన ప్రతాపం చూపించేవారు. నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి బరిలో లేకపోవడంతో.. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు అస్మిత్ రెడ్డి తో పోటీ చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొడుకు ఓటమి..తనకు వయోభారంతో పాటు గతంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు చుట్టుకుని గిలగిల్లాడుతున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసుల్లో 33 ఛార్జిషీట్లను, ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో సమర్పిస్తున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... తన ఫ్రస్ట్రేషన్ అంతా చుట్టూ ఉన్నవారిపైన చూపుతున్నారు. అలా ఊగిపోతారంతే..! ఇటీవలే తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకించి అభాసుపాలైన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురం కలెక్టరేట్లో ఓ వినతి పత్రాన్ని అందజేసేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సమస్యను చెప్పకుండానే.. కలెక్టర్ నాగలక్ష్మి పై అనుచితంగా ప్రవర్తించారు. ఆవేశం ఊగిపోతూ.... బీకేర్ ఫుల్ అంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు జేసీ. అంతటితో ఆగక.. గన్ మెన్ ను తోసేసి దాడికి యత్నించారు. అత్యంత సహనంతో వ్యవహరించిన కలెక్టర్ నాగలక్ష్మి పెద్దమనసుతో జేసీని క్షమించారు. ఆయన దురుసు ప్రవర్తనపై ఇప్పటిదాకా కలెక్టర్ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జేసీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే జేసీకి తెగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలోనూ ఓ రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఉన్నతాధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. పప్పులు ఉడకలేదు మరీ.! రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులు చేయించటం.. తనకు అనుకూలంగా వ్యవహరించని పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టించటం.. బెదిరించి పనులు చేయించుకోవటం జేసీ ప్రభాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ, ఎస్సై లను బెదిరించి తన మనుషులను విడిపించుకెళ్లిన చరిత్ర కూడా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ముక్కుసూటిగా విధులు నిర్వహిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ చైతన్యను టార్గెట్ చేశారు. డీఎస్పీపై ఇరవైకి పైగా ప్రైవేటు కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టించారు. ఈయన వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు కనుసన్నల్లోనే బ్లాక్ మెయిల్ జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని పలువురు టీడీపీ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యమయ్యాక గత్యంతరం లేక టీడీపీలో చేరిన ప్రభాకర్ రెడ్డి అవినీతి.. అక్రమాలు.. దౌర్జన్యాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చంద్రబాబుకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిన్నారని అనంతపురం టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం.. మహిళ కలెక్టర్‌తో దురుసు ప్రవర్తన!
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ హాల్లో ఏకంగా కలెక్టర్‌పైనే విరుచుకుపడ్డారు. కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ మహిళా అధికారినిని అవమానించారు. బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే, తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ భవన్లో కలెక్టర్‌ను జేసీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్‌మెన్.. ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన.. గన్‌మెన్‌ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలోనే మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్‌ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి.. మీడియాతో కూడా ఆయన దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కాగా, జూటూరులో వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో జేసీ వర్గీయులు దాడి చేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్‌పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
పొలిటికల్ కారిడార్ : వివాదాల మధ్యనే జీవిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
-
రెండు కోట్ల డైమండ్ నెక్లెస్.. జేసీ అక్రమ ఆస్తులు చూసి ఈడీ షాక్
-
మంత్రుల బస్సు యాత్రపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీ మంత్రులు చేపట్టనున్న బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశాలున్నాయని, అలా జరుగుతుందని తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. బస్సులకు సేఫ్ గార్డ్లు పెట్టుకుంటే మంచిదని తెలిపారు. పోలీసులు వాహనాలకు ఉపయోగించే విధంగా ఫెన్సింగ్ పెట్టుకుంటే బాగుంటుందన్నారు. కాగా రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘సామాజిక న్యాయభేరి’ పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుంది. యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే జేసీ వ్యాఖ్యలతో మంత్రుల బస్సు యాత్రను టీడీపీ భగ్నం చేసేందుకు ఏదైనా కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఎంగిలి పేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా