karate kalyani
-
రేవ్ పార్టీ.. హేమకు మెసేజ్ చేశా.. తన గొయ్యి తనే తీసుకుంది: కరాటే కల్యాణి
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా ఉందంటూ తొలుత ఆమె పేరు బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన హేమ.. తూచ్, అంతా అబద్ధం, నేను హైదరాబాద్‌లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసింది. అంతలోనే బెంగళూరు పోలీసులు తన ఫోటో మీడియాకు వదిలారు. అయినా ఒప్పుకోలేదు, ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో బయటకు వదిలింది. ఎవరినీ క్షమించేది లేదని..నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు శాంపిల్ టెస్ట్‌లో హేమ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయింది. హేమ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో స్పందించింది. 'సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినా.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినీ క్షమించొద్దని మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సూచించారు. తమవైపు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గొడవలు..ఇంతలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీలో తన పేరు వినిపించగానే ఏంటక్కా, ఇది నిజమేనా? అని మెసేజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో శివబాలాజీని కొరకడం.. రాజేంద్రప్రసాద్‌గారిని అడ్డగించడం, నా మీద కూడా కేసు పెట్టి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటుంది. నేను సరదాగా పేకాట ఆడితే ఎవరో ఇరికించారు. అయినా దీన్ని పెద్ద తప్పన్నట్లుగా హడావుడి చేసిన ఈమెకు దేవుడు వెంటనే శిక్ష వేశాడు.తన గోతి తనే తీసుకుందిఇప్పుడామె చేసిందే తప్పుడు పని.. తప్పుడు ప్లేస్‌లో దొరికి మళ్లీ బుకాయించడం దేనికి? హైదరాబాద్‌లో ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ సెల్ఫీ వీడియో తీసి పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించావు. ఇది ఇంకో కేసు. నీ పాపులారిటీ ఇంకా తప్పుగా వాడుకుంటున్నావు. నీ గోయి నువ్వే తీసుకున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల -
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
సూర్యకిరణ్ ఈ ఒక్క తప్పు చేయడం వల్లే మరణించారు: సీనియర్ నటి
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయిన సూర్యకిరణ్ మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. అదే సీజన్లో కంటెస్టెంట్‌గా ఉన్న సీనియర్ నటి కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చాలా వరకు కుంగిపోయాడని కరాటే కళ్యాణి తెలిపారు. 'భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు. ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్ తాగుతూ గడిపేవాడు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు. (మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్) టాలీవుడ్లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్ 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. సూర్యకిరణ్ టి.ఎస్.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు. -
నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్
ఏదో ఒక విధంగా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది నటి కరాటే కల్యాణి. గత కొద్ది కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్లో సంచలనంగా మారిన కళ్యాణి మరో సారి వార్తల్లో నిలిచారు. ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి తనకు ప్రాణ హాని ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని, ఆ విషయాన్ని గమనించకండా అదే కారులో ప్రయాణించినట్లు తెలిపింది. ఆపై కొంత దూరం వెళ్లిన తర్వాత కారు టైర్లు పేలిపోయి స్వల్ప ప్రమాదంతో భయటపడినట్లు తెలిపింది. అదే హైవే మీద ప్రయాణించి ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేది అని వాపోయింది. అనంతరం మెకానిక్ వద్దకు వెళ్తే.. ఎవరో కావాలనే కారు టైర్లను కోసేశారని తేలడంతో ఖంగుతిన్నట్లు తెలిపింది. ఖమ్మంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం .. కృష్ణుడి రూపంలో ఉంది అని ఆమె రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. చివరకు కోర్డు నుంచి స్టే కూడా తీసుకువచ్చింది. ఈ కోపంతోనే ఎవరో కావాలని టైర్లు కోసేసి ఉంటారని ఆమె ఆరోపించింది. (ఇదీ చదవండి: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్) -
కరాటే కల్యాణిని ‘మా’ సస్పెండ్ చేయడం దారుణం
పంజగుట్ట: మానవుడి రూపం దేవుడికి ఇవ్వరాదని పోరాటం చేసిన కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని.. మా వెంటనే ఆ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని పలు యాదవ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కళ్యాణి ఎన్టీఆర్‌ను, సినీ పరిశ్రమను ఎప్పుడూ కించపరచలేదని, శ్రీ కృష్ణునికి ఎన్టీఆర్ రూపం ఇవ్వరాదనే పోరాటం చేసిందన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రామచంద్ర యాదవ్, చలకాని వెంకట్ యాదవ్‌లు మాట్లాడుతూ... భగవంతునికి మానవరూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సంబంధంలేని ‘మా’ సస్పెండ్ చేయడం సరికాదన్నారు. బలహీనవర్గాలకు చెందిన ఓ మహిళను సస్పెండ్ చేయడంతో సినీ పరిశ్రమ ఒక సామాజిక వర్గానికి చెందిందిగా అర్థం అవుతుందన్నారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోకపోతే హైదరాబాద్‌లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఐక్యమై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే మంచు విష్ణును కలిసి ఈ విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ... తాను ఎన్టీఆర్‌ను ఎప్పుడూ కించపరచలేదని, తాను కూడా ఎన్టీఆర్ అభిమానినే అన్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంపై ‘మా’ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే వ్యాలిడిటీ కాదు సస్పెన్షన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను ఒక యాదవ సంఘం నాయకురాలిగా మాట్లాడానన్నారు. త్వరలో సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో పోరాడతానన్నారు. సమావేశంలో మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, రాధాకృష్ణ, మారుతి రామారావు, నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం రేపు ప్రభాస్ విగ్రహం నా పోరాటం మాత్రం ఆగదు..
-
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం
ప్రముఖ లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో వెల్లడించింది. 'దయచేసి కారులో అయినా, బైక్‌పై అయినా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఓ శాంతి' అని కల్యాణి ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టుపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ నటి కుమారుడి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటోంది. చదవండి: కథ వెనుక కథ టీజర్ చూశారా? -
అందరూ నన్ను వ్యభిచారిణిలా చూస్తున్నారు: కరాటే కల్యాణి ఆవేదన
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతరమైంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘బతుకుదెరువు కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సేవ కార్యక్రమాలకు వినియోగిస్తాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఎంతోమందికి సాయం చేశాను. కానీ జనాలు అవేవి చూడటం లేదు. తెరపై నేను పోషించిన పాత్రలను బట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తున్నారు. చెప్పాలంటే నన్ను ఓ వ్యభిచారిగా చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి. అవి విన్నప్పుడు నాకు చాలా పెయిన్‌గా ఉంటుంది. నేను తెరపై నటించానంతే, నిజంగా చేయలేదు. బతుకు దెరువు కోసం అలాంటి రోల్స్ చేశాను. నాలోని మంచిని గుర్తించకుండా నాపై అసహ్యమైన కామెంట్స్ చేస్తుంటారు’ అంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తాను అలాంటి దాన్ని కాదని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! రొమాంటిక్ సీన్స్‌లో హీరోలు అలా ప్రవర్తిస్తారు: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
నా భర్త నడిరోడ్డుపై కొట్టాడు, నాకు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది : కరాటే కల్యాణి
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, మాజీ భర్తతో చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. బతుకుదెరువు కోసం సినిమాల్లో నటిస్తున్నాను. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాణానికి మరోవైపు కూడా ఉందని చాలామందికి తెలియదు. నేను రియల్‌లైఫ్‌లో ఎంతోమందికి సహాయం చేశాను. ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. పెళ్లి చేసుకున్నాక ఎన్నో కష్టాలు అనుభవించాను. అతను పెట్టిన టార్చర్ మాటల్లో చెప్పలేను. ఎంత పీక్స్‌కు వెళ్లిందంటే.. బేగంపేట వద్ద నడిరోడ్డుపై నామీద బట్టలు లాగేసి దారుణంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇంక చాలా జరిగాయి. అయినా అతడిలో మార్పు కనిపించలేదు. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఇప్పటికీ నిజమైన ప్రేమకోసం తపిస్తున్నాను. మరో పెళ్లి చేసుకోవాలనుంది అంటూ చెప్పుకొచ్చింది. -
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
-
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో హిందువుల మనోభావాలు కించపరిచేలా చిత్రీకరించారని వారు ఆరోపించారు. (చదవండి: దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు) ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. -
దేవిశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు
-
దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు బుధవారం నాడు సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలంది. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి! చదవండి: నా కూతురి పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు ఆహ్వానం -
తేజస్వి 'కమిట్మెంట్' మూవీపై కరాటే కల్యాణి ఫిర్యాదు
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ సినిమా ట్రైలర్‌పై కేసు నమోదైంది. మూవీ ట్రైలర్లో భగవద్గీత శ్లోకాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వాడింది చిత్రయూనిట్. దీనిపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా ట్రైలర్ ఉందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమని స్పందిస్తుందో చూడాలి! కాగా కమిట్మెంట్ చిత్రాన్ని ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
కాళ్లు పైకెత్తి ఊపడమేంటి? బొట్టు లేదు, మెట్టెలు లేవు: కరాటే కల్యాణి
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె రిలీజ్ చేసిన ఒకపరి పాట పెద్ద వివాదంగా మారింది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి స్పందించింది. 'శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు. ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు. కె.విశ్వనాథ్ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు నేను పుట్టలేదు. వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే! భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే!' అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. మరోవైపు ఏదేమైనా సాంగ్ డిలీట్ చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు ఆ పాటను తొలగించడం గమనార్హం. చదవండి: నా జీవితంలో ఆనందం, ప్రశాంతత లేకుండా పోయాయి మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల -
20 యూట్యూబ్ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
-
20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కల్యాణి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు సైతం వచ్చాయి. చదవండి: పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
సీడబ్ల్యూసీ ఎదుట కరాటే కల్యాణి .. ‘అవమానించిన వారిని వదిలేది లేదు’
సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు. అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్‌లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. చదవండి: ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? నిబంధనలు పాటించాల్సిందే.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్‌లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన కరాటే కల్యాణి
-
చిన్నారిని ఇంత వరకు దత్తత తీసుకోలేదు : కరాటే కల్యాణి
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి హైదరాబాద్ కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. కల్యాణీతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని కలెక్టర్ ముందు కూడా చెప్పామని వివరించింది. 'ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు' అంటూ కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. కాగా యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం వంటి నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. -
నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం: కరాటే కల్యాణి
-
మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు
నటి కరాటే కల్యాణి అజ్ఞాతం వీడింది. యూట్యూబర్ శ్రీకాంత్‌తో వివాదం, పోలీసు కేసు అనంతరం ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుక వచ్చింది. తాను పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది. తాను పాప తల్లిదండ్రులను తీసురావడాని వెళ్లానని చెప్పింది. అనంతరం తాను ఎవరిని దత్తత తీసుకోలేదని, తన తల్లి విజలక్ష్మి తనతో ఉండరని అందుకే ఆమెకు ఏం తెలియదు అని చెప్పింది. పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? అంటూ పైర్ అయ్యింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రలను ఆమె మీడియాకు చూపించింది. దీంతో వారు చిన్నారి దత్తతపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, పిల్లలను పోషించలేక కరాటే కల్యాణి వద్ద ఉంచినట్లు అతడు తెలిపాడు. తన ఇంట్లోనే ఉన్నామని, స్టింగ్ ఆపరేషన్ చేసుకోండి ఆమె వ్యాఖ్యానించింది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి విరిద్దరు కొట్టుకోవడం చర్చ దారితీసింది. దీంతో ఇద్దరి ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కరాటే కల్యాణి కనిపించకుండపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదివారం చైల్డ్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అంతేగాక చిన్నారి పాప దత్తతపై తమకు వివరణ ఇవ్వాలంటూ గతంలో ఆమెకు నోటిసులు ఇవ్వగా తాను స్పందించలేదని అధికారులు మీడియాకు తెలిపిన విషయం విదితమే.