Karthika Deepam Today Episode
-
Karthika Deepam: మోనితకు ఊహించని ట్విస్ట్, గీతలు చెరిపేసిన దీప
కార్తీకదీపం జూలై 8వ ఎపిసోడ్: కార్తీక్ సౌందర్య అమెరికా వెళ్లిందని చెప్పగానే మోనిత సాక్షి సంతకాల పెట్టడానికి తప్పించుకోడానికే వెళ్లిందా? అంటుంది. ఇక తను మౌనంగా ఉండే పని కాదని, ఎదోకటి చేయాలంటూ కార్తీక్ వెళ్లిపోమ్మని చెబుతూ కారు ఎక్కబోతుంటే కార్తీక్ ఆమె చెయి పట్టుకుని ఆపుతాడు. ఆ తర్వాత ఇక తాను చేయని తప్పుకు దోషిలా ఉండలేనని, తన ప్రేమయేయం లేకుండా జరిగింది తన తప్పుల జాబితాలో చేరదు అని గట్టిగా అరిచి చెబుతాడు కార్తీక్. అంతేగాక ‘నీ నాపై ప్రేమ, వదిలేస్తాననే భయం లాంటివి కనిపించడం లేదు. కావాల్సిన దాని కోసం ఎంత దూరమైన వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తుంది’ అని అనడంతో మోనిత ఆశ్చర్యంగా చూస్తుంది. అలాగే ‘స్నేహం కావాలంటే ముందు వరుసలో ఉంటా. అంతేగాని న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచను. మౌనంగా భరిస్తున్న కదా అని ఈ దోషాన్ని దీప, మా అమ్మకు అంటగట్టాలని చూస్తే అది సహించను. నా తప్పు లేకుండా జరిగిందానికి నేను నైతిక బాధ్యత వహించలేను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత షాక్ అవుతూ ప్రియమణి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ బాబు అందరిలాంటి మగాడు కాదని, తన భార్య, తల్లి, కుటుంబం జోలికి వస్తే ఊరుకోడని ఆమె అన్న మాటలను తలచుకుని కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ హిమ, శౌర్యలకు కొత్త బట్టలు కొనుక్కుని తీసుకువెళతాడు. హిమ, శౌర్యను పిలిచి నాన్న డాడీ మీకు బట్టలు తెచ్చాడని అవి వేసుకోమ్మని చెబుతాడు. పిల్లలు అవి వేసుకోని రాగానే సెల్ఫీ తీసుకుందామని, దీపను కూడా పిలిచి తన భుజంపై చేయి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలతో ఈ ఫొటో మన సెల్‌ఫోన్ అన్నింటిలో ఆ ఫొటోనే వాల్‌పేపర్‌గా ఉండాలని చెబుతాడు. ఆ తర్వాత వారికి తెచ్చిన బట్టలను మీ స్నేహితులకు చూపించుకోమ్మని వెళ్లండని చెప్పి పిల్లలను బయటకు పింపిస్తాడు. ఆ తర్వాత దీపను కుర్చీలో కూర్చోబెట్టి ‘నా ప్రవర్తన నీకు కొత్తగా అనిపించోచ్చు దీప. కానీ ఇన్ని రోజులు నా తప్పు లేకుండానే నేను తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉన్నాను. ఇక నుంచి అలా ఉండదు. ఈ 25 తేదీలోపు ఈ సమస్య తప్పకుండా పరిష్కారం దొరుకుంది. నన్ను నమ్ము దీప’ అంటూ ఆమె మీద ఒట్టు వేస్తాడు. తరువాయి భాగం.. ఆదిత్య, దీప దగ్గరికి వచ్చి వదినా అన్నయ్య తప్పు చేశాడో లేదో అది నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి నీకు చెబుతాను అంటూ దీప విజనగరం వెళ్లినప్పుడు కార్తీక్‌ను నిలదీసిన విషయం చెబుతాడు. అప్పుడు అన్నయ్య మరోసారి పరీక్షలు చేయించుకుంటానని తనతో అన్నది చెబుతాడు. అంతేగాక అన్నయ్య ల్యాబ్ కూడా వెళ్లాడు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అనగానే ఇందులో ఏమైనా ఉందేమో? ఇప్పుడు మనం ఏం చేద్దాం వదిన అనగానే, ఆదిత్యను ఆ ల్యాబ్‌కు వెళ్లి కనుక్కొమ్మంటుంది. అంతేగాక గోడ మీద మోనిత గీసిన గీతలను తడి గుడ్డతో చెరిపేస్తుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: అర్జెంటుగా అమెరికా వెళ్లిన సౌందర్య, షాక్‌లో మోనిత
కార్తీకదీపం జూలై 7వ ఎపిసోడ్: తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్‌గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ‘నా తల్లి ముందు సుపుత్రుడిగానే నిలబడాలి. మోనిత ముందు తప్పుచేసిన వాడిలా తలదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పొగొట్టుకుంటున్నాను. ఇక ముందు అలా జరగకూడదంటే ఈ కడుపు సంగతేంటో తెల్చుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరోవైపు మోనిత కార్తీక్‌ను కలవడానికి రెడీ అవుతూ ఉండగా మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. నా భర్త తప్పులేకపోతే మోనిత ఎందుకు గర్భవతి అవుతుంది మా వంటలక్క అనుకుంటోంది. ఇక ఇప్పుడు వాళ్ల జుట్టు, ఇంటి గుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది. దీంతో ప్రియమని అని మీరు అనుకుంటున్నారని మోనితకు షాక్ ఇస్తుంది. ‘దీపమ్మ ఇంటి నుంచి వచ్చేసినా డాక్టర్ బాబు తోకలాగే ఆమె వెనక వచ్చాడు. పోనీ దీపమ్మ ఏం అయిన కార్తీక్ అయ్యాను గెంటెయ్యలేదు కదా.. అటూ తల్లి కూడా కార్తీక్ అయ్యా గురించే బాధపడుతున్నారు తప్ప మీ మీద జాలి చూపించడం లేదు కదా’ అని లాజిక్‌గా మాట్లాడుతుంది. కార్తీక్ అయ్య కూడా అందరి లాంటి మగాడేనని, ఆయన ఏ మహానుభావుడు కాదంటుంది. ఏదైనా తన దాక రాకపోతే ఆడదానితో ఎంత గౌరవంగానైనా ఉంటాడు. అదే కుటుంబానికి, వంశగౌరవానికీ ముప్పు రాబోతుందని తెలిస్తే మాత్రం దెబ్బకు ప్లేట్ పిరాయిస్తాడు. తప్పు చేశానని కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారని, అందులో కార్తీక్ అయ్యా ఉంటారని తనకు నమ్మకం లేదు అంటుంది ప్రియమణి. కాబట్టి మీకే అన్ని తెలుసు అని ధైర్యంగా ఉండకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందా అని ఆలోచించండని మోనితకు హిత బోధ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కాల్ చేస్తాడు. అది చూసి మోనిత ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా దీప గోడ మీద ఉన్న గీతల వంకే చూస్తూ మోనిత తనవైపు వెక్కిరింతగా చూస్తున్నట్లు తలుచుకుంటోంది. పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది. ఇదిలా ఉండగా కార్తీక్, మోనితలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటారు. చూడు కార్తీక్ నువ్వు నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటుంది మోనిత. ‘పదేళ్లు అబద్దాని నిజమని నమ్మి దీపను దూరం పెట్టావు, ఇప్పుడు నిజాన్ని అబద్దమంటూ నన్ను ఎన్నాళ్లు దూరం పెట్టాలనుకుంటున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటాడు. దీంతో మోనిత నీ ఫ్రెండ్గ్, శ్రేయోభిలాషిగా, నీ వెల్ విషర్‌గా చెబుతున్నాను.. నువ్వు మోనితని పెళ్లి చేసుకోవడమే న్యాయం అంటుంది మోనిత. కార్తీక్ మౌనంగా ఉండటంతో మోనిత ప్రేమగా కార్తీక్ భజం మీద చెయ్యి వేసి ఇవన్నీ వద్దని, తను పెళ్లి వాయిదా వేయను అని చెబుతుంది. నువ్వు నన్ను తల్లిని చేశావు, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి పెళ్లి కావాలంటున్నాను, తన బిడ్డకు తండ్రివి నువ్వే అని సమాజానికి చెప్పుకోవడం కోసం పెళ్లి చేసుకుందాం అంటుంది. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది. తరువాయి భాగం.. కార్తీక్ అనుకున్నట్లు గానే పిల్లలతో సంతోషంగా ఉంటాడు. పిల్లలకు బహుమతులు కొనితెచ్చిస్తాడు. సరదాగా వాళ్లతో మాట్లాడం చూసి దీప ఏంటి ఈ సడెన్ మార్పు అని ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ సెల్ఫీ తీస్తుండగా ఇందులో ఒకరూ మిస్సయ్యారు, నిన్నే దీప నువ్వు కూడా ఉంటే బాగుంటుందంటూ దీపను రాగానే భుజం మీద చేయ్యి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలు బయటకు వెళ్లగానే ‘ఈ నెల 25వ తేదీలోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను నీవాడిని దీప నన్ను నమ్ము. ఇది నాటకం కాదు అని దీప తలపై చెయి పెడతాడు’ కార్తీక్. -
దీపతో మోనిత కండీషన్ గురించి చెప్పి ఎమోషనలైన కార్తీక్
కార్తీకదీపం జూలై 5ఎపిసోడ్: మోనిత వీడియో కాల్ చేసి కార్తీక్ పెళ్లి చీరలు ఎలా ఉన్నాయో నిన్ను అడగమంది అనడంతో దీప రగిలిపోతుంది. ఎంటీదని సౌందర్యను దీప ప్రశ్నిస్తుంది. దీంతో సౌందర్య ఆ మోనిత కావాలనే నిన్ను రెచ్చగోట్టాలని కాల్ చేసి వాడిని ఇరికించిందని నా మనసు చెబుతుంది అంటుంది. అంతేగాక వాడు నిజంగా తప్పు చేశాడంటే తను నమ్మలేకపోతున్నానని, ఇందులో ఏదో తెలియని గూడుపుఠాని ఉందని నా మనసు చెబుతుంది దీప, ఒకసారి మనసుతో ఆలోచించు నువ్వు అంటూ తనతో చివరి వరకు కలిసి పోరాడటానికి సాటి స్త్రీగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపకు భరోసా ఇచ్చి వెళ్లిపోతుంది సౌందర్య. ఇక కార్తీక్.. మోనిత దీపకు కాల్ చేసి ఇరికించిన సంఘటననే గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచకుంటూ వస్తాడు. అటు వైపే వెళుతున్న సౌందర్య కార్తీక్‌ను చూసి కారు ఆపుతుంది. కార్తీక్‌కు ఎదురుగా వెళ్లి ఏమైందరా అని అడగ్గా నా బతుకులాగే కారు కూడా పాడైందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆ మోనిత దగ్గరి నుంచే వస్తున్నావా? అని సౌందర్య ప్రశ్నించడంతో నీకేలా తెలుసంటూ ఆశ్చర్యంగా చూస్తాడు కార్తీక్. అప్పుడు కాల్ చేసినప్పుడ దీప పక్కనే ఉన్నానని మరిచిపోయావా? అంటుంది. అవునంటూనే మునిగిపోయాను మమ్మీ సుడిగుండంలో ఊపిరి ఆడనడల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు కార్తీక్. కార్తీక్ నుంచి ఆ మాటలు విని సౌందర్య తట్టుకోలేకపోతుంది. జాలిగా పెద్దోడా అంటూ పెళ్లి బట్టల గురించి ఆరా తీస్తుంది. టైం దగ్గర పడుతోందని కార్తీక్ అనగానే స్నేహానికి పరిమితులు ఉంటాయిరా అని అప్పడే చెప్పాను నువ్వు వినలేదని కార్తీక్‌ను మందలిస్తుంది. అలాగే జరిగిన దాని గురించి ఏం చేయలేమని, జరగబోయేదంటీ? ఆ పెళ్లి, ముహుర్తం సంగతేంటని సౌందర్య కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ ఏదీ తన ప్రమేయం లేకుండానే జరుగుతోంది మమ్మీ.. నమ్మండని.. తను నటించడం లేదు అంటూ భావోద్వేగానికి లోనవుతాడు. ‘నేను మనసులో ఏం అనుకుంటున్నానో అదే చెబుతున్నాను మమ్మీ. నా తప్పు లేకుండానే బాధ్యున్ని అయ్యాను. దీపకు గుడి కట్టి దేవతలా చూసుకోవాలనుకున్నాను. కానీ తన ఆశలకి నేను సమాధి కట్టాను. ఇది పాపమా.. శపమా అర్థం కావడం లేదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. సౌందర్య అలా బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా భాగ్యం ఇంటికి వెళ్లిన హిమ, శౌర్య అమ్మనాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదని భాగ్యాన్ని అడుగుతారు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగుతిని త్వరలోనే కలుస్తారంటూ పిల్లలకు సర్థిచెబుతుంది. మరోవైపు దీప మోనిత వీడియో చేసి చీరలు చూపించిన సీన్ గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీప ముందు నిలబడతాడు. జరిగినదానికి క్షమాపణలు కోరుతూ పెళ్లి బట్టలు తను కొనలేదని చెబుతాడు. దీంతో ఆ మోనిత సంగతి తనకు తెలుసని, మీరే ఏంటన్నది తనకు అర్థం కావడం లేదంటూ పెళ్లి డేటు, రిజిస్టర్ మ్యారేజ్‌పై నిలదీస్తుంది. తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అది విని కార్తీక్ షాక్ అవుతాడు. తడబడుతూనే ఏది తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుందంటూ బాధపడుతుంటాడు. దీంతో దీప కోపంగా చూస్తూ అంత కీలు బొమ్మల ఎలా మారిపోయారంటుంది. 25 తారిఖున పెళ్లి అంటున్నారు దాని మాటేంటి అనగానే కార్తీక్ నాకు ‘నా భార్య పిల్లలె ముఖ్యం’ అంటాడు. దీంతో మరీ మోనిత ఒక్కతే వెళ్లి తాళి, పూల దండ వేసుకుని వస్తుందా అని అని చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయానని, మోనితను ఫ్రెండ్‌లాగే చూశాను కానీ తను నాకు నరకం చూపిస్తుందంటాడు. నువ్వు అన్నట్లుగా నన్ను కీలు బోమ్మను చేసి ఆడుకుంటోందని, ఫోన్ ఎత్తకపోతే బెదిరింపులు, కలవకపోతే హెచ్చరికలు, తనతో కలిసి బయటకు వెళ్లకపోతే సాధింపలు పదే పదే తప్పును అడ్డం పెట్టుకుని నన్ను మరబోమ్మలా మార్చేసింది దీప దగ్గర విలపించుకుంటాడు కార్తీక్. అంతేగాక ఈ పెళ్లికి నిన్ను, అమ్మను తీసుకువెళ్లి సాక్షి సంతకం పెట్టించమని కండీషన్ కూడా పెట్టిందని దీపతో చెప్పడంతో షాక్ అవుతుంది. ఇలా వారి మధ్య వాదన జరుగుతుండా హిమ, శౌర్యలు వస్తారు. వారు రాగానే కార్తీక్ తల దించుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: కార్తీక్, మోనితల పెళ్లిపై సౌందర్యను నిలదీసిన దీప
కార్తీకదీపం జూలై 2: కార్తీక్, మోనితల పెళ్లి విషయం తెలుసుకున్న దీప తండ్రి మురళీ కృష్ణ సౌందర్య దగ్గరికి వస్తాడు. ఈ విషయంపై సౌందర్యను నిలదీయడంతో ఆమె మౌనంగా ఉండిపోతుంది. చెయ్యని తప్పుకు నా బిడ్డ పదేళ్లు శిక్ష అనుభవించింది.. ఇప్పుడు కూడా ఏం చెయ్యారా మీరు? అని ప్రశ్నిస్తాడు. దీనిపై సౌందర్యతో వాదించి చివరకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లగానే సౌందర్య ‘ఓ కన్నతండ్రిగా ఆయన అడిగిన ఏ ప్రశ్నలకే నా దాగ్గర సమాధానం లేదు. మరీ ఇవే ప్రశ్నలు దీప అడిగితే, ఈ పెళ్లి విషయం గురించి తనకు తెలిస్తే ఏంటి పరిస్థితి’ అంటూ మనసులోనే మదనపడుతుంది. ఇదిలా ఉండగా పిల్లలతో కలిసి కార్తీక్ భోజనం చేస్తుంటే దీప వడ్డిస్తుంది. హిమ మాట్లాడుతూ మధ్యలో డాడీ మనం బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా అని అంటుంది. దీంతో వెంటనే శౌర్య కూడా అవునవును.. మనం నలుగురం కలిసి బయటికి వెళ్దాం.. చాలా బాగుంటుందని అంటుంది. అలాగే దీపతో అమ్మా నువ్వు కూడా వస్తావు కదా అని అడగ్గానే ఎందుకు రాను.. తప్పకుండా వస్తాను అంటుంది. అందరం కలిసి బయటి వెళదామని అనగానే కార్తీక్, పిల్లలు సంతోషిస్తారు. అలాగే తనకు కొన్ని పనులు ఉన్నాయని, ఈ నెల 25 తేదీన మనం నలుగురం కలిసి బయటికి వెళ్దామని, ఆ రోజు డాడీని ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పండి అనగా కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీపకు నిజం తెలిసిందా అని కంగారు పడుతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనిత ఉదయం లేవగానే పొట్టపై చెయి పెట్టుకుని గుడ్ మార్నింగ్ బంగారం అంటూ మురిసిపోతుంది. 16 ఏళ్లు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ నువ్వు కడుపులో పడిన మూడు నెలలకే ఈ తల్లి పెళ్లి చేస్తున్నావు. నువ్వు గ్రేట్ బేటా అంటూ సంబరపడిపోతుంది మోనిత. మరోవైపు సౌందర్య దీప ఇంటికి వస్తుంది. మురళీ కృష్ణ దీపకు పెళ్లి విషయం చెప్పేసి ఉంటాడా? అని భయపడుతూనే లోపలికి వెళ్లేసరికి దీప గుమ్మం దగ్గరే ఎదురు పడుతుంది. రండి అత్తయ్యా అంటూ దీప అతి మార్యాదు చేయడం చూసి సౌందర్య అనుమాన పడుతుంది. ఆ తర్వాత దీప మోనిత, కార్తీక్‌ల పెళ్లి విషయం గురించి తనకు ఎందుకు చెప్పలేదని దీప సౌందర్యను నిలదీస్తుంది. చివరకు తనలాగే తన పిల్లలకు కూడా సవతి తల్లి పెంపకం రాసినట్లున్నాడు ఆ దేవుడు కానీ దీప బతికి ఉండగా.. నా పిల్లలకు ఎలాంటి చీడపట్టనివ్వను అని ఆవేశంగా అంటుంది. అంతేగాక ఇన్నాళ్లు తను పడ్డ కష్టాల గురించి మాట్లాడుతుంది. ‘కొన్నేళ్ల పాటు దారుణమైన నిందను మోశాను. అది చెరిగిందో లేదో తెలియదు కానీ మళ్లీ జీవితాంతం అనుభవించడానికి దారుణమైన పరిస్థితి వచ్చింది. నా మానసిక పరిస్థితి నాకు అర్థమవుతుంది. నా భర్త తప్పు చేశాను తప్పు చేశాను అంటే.. దేవుడు లాంటి మనిషి తప్పు చెయ్యడం ఏంటీ అనుకున్నాను.. ఏదో చెబుతారు ఏదో చెబుతారు అనుకుంటే మోనితోచ్చి కడుపు వచ్చింది అని చెప్పింది. లోపల నా గుండె రగిలిపోతుంది, కడుపు మండుతుంది అత్తయ్యా.. నేను సగటు స్త్రీనే కదా’ అంటూ సౌందర్యతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది దీప. దీంతో సౌందర్య బాధగా దీపా నేనే కాదు.. ఈ విషయం వాడు నీతో చెప్పలేక నలిగిపోతున్నాడే అంటుంది. కానీ దీప మాత్రం అవును, పాపం నిజంగానే నలిగిపోతూనే నిసహాయంగా చూస్తూనే.. దానితో కలిసి 25 తేదీ రిజిస్టర్ ఆఫీస్‌లో ముహూర్తం నిర్ణయించుకుని వచ్చారు అని వెటకారంగా అంటుంది. ఇంతలో కార్తీక్ కంగారుగా బయటకు వెళతాడు. ఎక్కడికి అని అడిగిన అర్జేంట్ పనుందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: నిజం తెలుసుకున్న దీప, కోపంతో రగిలిపోతున్న మోనిత..
కార్తీకదీపం జూలై 1వ ఎపిసోడ్: కార్తీక్ మనసు బాగాలేక సౌందర్య దగ్గరికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోనిత తన దగ్గరికి వచ్చి వెళ్లిన విషయం సౌందర్య కార్తీక్‌తో చెబుతుంది. అంతేగాక ఆశీర్వదించండి అంటూ కాబోయే అత్త దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్లిందని కార్తీక్, మోనితకు రిజిస్టర్ మ్యారేజ్ అనే విషయం తనకు తెలిసిందని కార్తీక్ స్పష్టం చేస్తుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలని ధీనంగా అడగ్గా ఏం చేసిన దీప, పిల్లలు, తల్లిదండ్రులైన తమకు, మోనితకు జావాబుదారిగా ఉండాలని అంటుంది సౌందర్య. దీంతో కార్తీక్ తనకే ఎందుకు ఇలా జరుగుతుందని అనగానే ‘నువ్వు చేసిన పాపమే’ అంటుంది సౌందర్య. ‘నా కోడలు ఏ తప్పు చేయకపోయిన పదేళ్లు అనుమానించి తనని బాధపెట్టావు, నీ కన్న బిడ్డే నిన్ను నాన్న అని పిలవడానికి సంకోచించేల చేశావు. ఇన్నాళ్ల దాని ఏడుపే నీకు శాపంగా మారింది’ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయలేను మై డియర్ స్టుపిడ్ సన్ అంటూ సౌందర్య కార్తీక్‌కు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే కార్తీక్‌కు తల తిరిగినట్టు అయ్యి అక్కడే కూలబడతాడు. మరోవైపు నిజం తెలుకున్న భాగ్యం దీపకు వచ్చి చెప్పేస్తుంది. దీపతో నీ తలరాత ఇలా ఉందేంటే, నీకు జీవితాంతం కష్టాలు తప్పవా? అంటూ మోనిత, కార్తీక్‌లకు 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అనే విషయం చెబుతుంది. అది విని షాక్ అయిన దీప ఇదేలా సాధ్యమని, దీనికి డాక్టర్ బాబు ఒప్పుకున్నారా? అని అనుమానంగా ప్రశ్నించగా మోనిత రసీదు కూడా చూపించిందని ఏడుస్తూ చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ రోడ్డు పక్కన కారు ఆపి ‘ఈ పెళ్లి ఎలా ఆపాలి. దీపకు ఈ విషయం తెలియకముందే ఇది జరగాలి. అది మోనిత చెప్పినట్లు వింటేనే సాధ్యం అవుతుంది. కానీ మోనిత వినే పరిస్థితిలో లేదు. నా జీవితం ఇలా అయిపోయిందేంటీ? ఇంకా ఈ నరకం ఎంతకాలం’ అంటూ కార్తీక్ మదనపడుతుంటాడు. మరోవైపు నిజం తెలుసుకున్న దీప కలవరపడుతూ ఉంటుంది. ‘డాక్టర్ బాబుకు, మోనితకు పెళ్లి జరిగితే, నా పిల్లల భవిష్యత్తు, నా సంసారం, నేను ఏం కావాలి’ అని తలచుకుంటూ బాధపడిపోతుంది. ఈ నిజం తనతో ఎందుకు చెప్పలేదని, ఎవరో బయటి వాళ్లు వచ్చి చెబితే కానీ తెలియలేదు అని ఆలోచిస్తుంది. మోనిత అంటే చెప్పదు పెళ్లి ఆపేస్తానని, మరీ డాక్టర్ బాబు ఎందుకు చెప్పలేదు ఆపకూడదనా? అని అనుకుంటూ మరీ అత్తయ్యా ఎందుకు చెప్పలేదు, చెప్పాలకున్న చెప్పలేకపోయారా? ఎప్పుడు నాకు తల్లిలా తోడు ఉండే ఆమె ఈ సారి కొడుకు నిస్సహయత చూసి ఆమెలోని తల్లి మనుసు చలించి కొడుకు వైపు మళ్లిందా? అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మోనిత అద్దంలో చూసుకుంటూ ‘నా భార్య దీప గుడి కట్టాలి’ అని కార్తీక్ అన్న మాటాలను తలచుకుని రగిలిపోతుంది. అక్కడే ఉన్న పూల ప్లాస్క్‌తో అద్దాన్ని పగలగోడుతుంది. ఆ శబ్థం అక్కడికి వచ్చిన ప్రియమణి మోనిత సీరియస్‌గా ఉండటం చూసి భయపడుతుంది. ఏమైందని భయంతోనే అడుగుతుంది. ఇంతలో కాస్తా కూల్ అయిన మోనిత ఇంటి, వంటి పనితోనే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లీన్ చేయి అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక దీప పిల్లలకు భోజనం పెడుతుండా నాన్న వచ్చాక తింటామని చెబుతారు. దీంతో దీప నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీరు తినేయండి చెప్పిన వినకుండా లేట్ అయిన వేయిట్ చేస్తామంటూ మారాం చేస్తారు. ఏ పని మీద వెళ్లారో తెలియదు కదా ఎందుకు వేయిట్ చేయడం అనేలోపే కార్తీక్ వచ్చేస్తాడు. కార్తీక్ రాగానే తోందరగా ఫ్రెష్ అయి వస్తే కలిసి తిందాం డాడీ అని హిమ, శౌర్య అడగ్గా సరే అని వెళతాడు. దీంతో పిల్లలు నాన్న చల్ల నీళ్లతో స్నానం చేయడని చెప్పావు కదమ్మా మరేందుకు డాడీకి వేడి నీళ్లు పెట్టలేదని హిమ అడుగుతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకే పెట్టలేదని దీప అనడంతో మరీ ఇప్పుడు వెళ్లి పెట్టు అనగానే అది విన్న కార్తీక్ వద్దని సమాధానం ఇస్తాడు. -
మోనితకు పిండివంటలు చేసి తీసుకెళ్లిన భాగ్యం
కార్తీకదీపం జూన్ 30 ఎపిసోడ్: ప్రియమణి కంగారుగా మోనితకు ఫోన్ చేస్తుంటే. అప్పటికే ఇంటికి చేరుకున్నమోనిత..వస్తున్నానని చెప్పాను కదే, మళ్లీ మళ్లీ చేస్తావేంటి అని విసుగ్గా అంటుంది. దీంతో ప్రయమణి వచ్చినావిడకి ఏం ఇవ్వమంటారని ఫోన్ చేశానమ్మా అంటుంది. ఎవరు వచ్చారు కార్తీక వాళ్ల అమ్మా.. అనగానే ఆవిడ నాకు తెలుసు కదమ్మా ఈవిడను నేను ఎప్పుడు చూడలేదు అని సమాధానం ఇస్తుంది. దీంతో ఎవరబ్బా నాకు చుట్టాలు ఎవరూ కూడా లేరు కదా ఎవరో చూద్దాం పదా అని లోపలికి వెళ్తారు ఇద్దరు. వెళ్లగానే లోపల భాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చిందాని అనుమానంగా చూస్తుంది. మోనితను చూసి భాగ్యం రారా మోనిత ఏమైన తిన్నావా? అసలే వట్టి మనిషివి కాదు ఎదోకటి తినాలి ఖాళీ కడుపుతో ఉండద్దు అని వెటకారంగా అంటుంది. మంచినీళ్లు తాగుతావని మోనితకు మర్యాదలు చేస్తుంటే ‘హాలో ఇది నా ఇల్లు’ అంటుంది మోనిత, దీంతో ఓహో నీ ఇల్లు అయితే మర్యాద చేయకూడదా? అని వెటకారంగా అంటుంది. వెంటనే ఈ ఇళ్లు ఎవరిది నీదేనా, డాక్టర్ బాబు కొనిచ్చాడా? అని అడుగుతుంది. తన డబ్బుతోనే కొనుక్కున్నానంటూ అసహనం చూపిస్తుంది మోనిత. అవునా... ఇప్పటి దాక డాక్టర్ బాబు నుంచి శాంతం లాగేశావ్ అనుకుంటున్నారంతా అంటూ భాగ్యం మోనితకు చురకలు అట్టిస్తుంది. సరేలే.. ఉత్తమనిషివి కాదని ఉత్తి పుట్టిళ్లు క్రియేట్ చేసి నీకు సున్నుండలు, మైసూరు పాక్, రవ్వలడ్డూలు తెచ్చాను అంటుంది. దీంతో ప్రియమణి ఎవరమ్మా మీ పిన్నిగారా? అని అడగ్గానే మోనిత కాదు దీప పిన్ని అని చెప్పతుంది. దీంతో ప్రియమణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత మోనితతో ఎలాగు నీ డబ్బుతోనే ఇళ్లు కొనుక్కున్న అన్నావుగా నీకు పుట్టబోయే బిడ్డను కూడా నువ్వే పెంచుకోమని, కావాంటే డాక్టర్ బాబు చదివిస్తాడని మోనితకు సలహా ఇస్తుంది భాగ్యం. నా అల్లుడు అందులో బంగారం నువ్వే చూశావుగా శౌర్య ఎవరో తెలియకుండానే చదివించాడు, ఇక సొంత బిడ్డ అని తెలిసి చదివించకుండా ఉంటాడా? అంటుంది. అలాగే కార్తీక్‌కు దూరంగా ఉంటూ తన మానని తనని బతకమని చెప్పడంతో మోనిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. భాగ్యం తెచ్చిన రవ్వలడ్డూలు తెప్పించి అవి తింటుంది. అందులో చక్కర తక్కువగా ఉందని భాగ్యం స్టైల్ చెబుతుంది మోనిత. సరేలే తను చెప్పే గుడ్ న్యూస్ వింటే చాలా స్వీట్ ఉంటుందంటూ కార్తీక్‌కు తనకు పెళ్లని, ఈ నెల 25వ తేదీన రిజిస్టర్ ఆఫీసులో అని చెప్పి రసీదు చూపిస్తుంది మోనిత. దీంతో భాగ్యం షాక్ అయ్యి ఏడుస్తూ దీపకు అన్యాయం జరుగుతుంది అంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీప కార్తీక్‌ను భోజనానకి పిలవడానిక వెళుతుంది. కార్తీక్ తనకు ఆకలిగా లేదని, మీ ముగ్గురు తినేయండి అంటూ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెబుతాడు. ఎక్కడికి వెళుతున్నారని లేను అడగలేదే అని దీప వెటకారంగా అంటుంది. దీంతో కార్తీక్ నువ్వు ఏం అనుకున్న నేను మాత్రం మా అమ్మ దగ్గరికే వెళుతున్నానని, పిల్లలు అడిగితే అర్జెంట్ సర్జరీ ఉంటే వెళ్లానని చెప్పమంటాడు. దీప తను అబద్దం చెప్పలేను అనగాను నీకు ఎలా వీలైయితే అలా చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప ఇంతలా మదనపడుత్ను వ్యక్తి ఆ తప్పు ఎలా చేశాడు అంటూ దీప ఆలోచనలో పడుతుంది. కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లి దోషిలా నిలబడతాడు. సౌందర్య దేశోద్దారకుడు, సుపుత్రుడు ఎక్కడ ఆ బిరుదులు, ఏ ఇంటి వాకిట్లో తాకట్టు పెట్టివచ్చావు అంటూ కార్తీక్‌కు చివాట్లు పెడుతుంది. అలాగే మోనత, కార్తీక్ పెళ్లి అనే విషయం కూడా తీయడంతో ఎలా తెలుసని కార్తీక్ ఆశ్చర్యపోతూ అడుగుతాడు. మోనిత వచ్చి, వెళ్లిన విషయం చెబుతుంది. ఏం చేయాలి అని సౌందర్యను కార్తీక్ సలహా అడగ్గా.. ఏం చేసిన జవాబుదారిగా ఉండాలని చెబుతుంది. దీపకు, పిల్లలకు, తమకు మోనితకు జవాబుదారిగా ఉండాలని కార్తీక్‌ను హెచ్చరిస్తుంది. -
Karthika Deepam: మోనితతో కారెక్కి వెళ్లిన కార్తీక్, కోపంతో రగిలిపోతున్న దీప
కార్తీకదీపం జూన్ 26వ ఎపిసోడ్: దీప పిల్లలు కనబడకపోవడంతో కంగారుగా ఆటూ ఇటూ వెతికగా ఎక్కడ కనిపించకపోవడంతో సౌందర్యకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. పిల్లలు ఇక్కడే ఉన్నారని సౌందర్య చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటుంది దీప. అనంతరం కార్తీక్ గురించి అడగ్గా ఏం సమాధానం చెప్పకుండా ఉంటాను అత్తయ్య అని ఫోన్ పెట్టెస్తుంది. వెంటనే కార్తీక్ వంక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప లోపలికి వెళ్లిపోవడంతో గతంలో కార్తీక్ ఆమెను అవమానించిన సంఘనలను గుర్తు చేసుకుంటాడు. తన జీవితం ఇలా అయిపోయిందేంటని, శౌర్యను రౌడీలా, హిమను అనాధల చూశాను, తాళి కట్టిన భార్యను కళంకితల చూశాను అంటూ కుమిలిపోతాడు. ఇప్పుడు దీపను ప్రేమగా చూసుకున్న నమ్మదు.. ఎలా అంటూ బాధపడుతుంటాడు కార్తీక్. ఇదిలా ఉండగా పిల్లలు సౌందర్య దగ్గర దీప, కార్తీక్‌ల తీరు గురించి చెప్పి బాధపడుతుంటారు. ఈ మధ్య వాళ్లలో చాలా తేడా వచ్చిందని, వారి పద్దతి మాకు అసలు నచ్చడం లేదని, అమ్మ-నాన్నను చూస్తుంటే విసుగోస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తారు. వారి మాటలకు సౌందర్య షాక్ అవుతుంది. కన్న తల్లిదండ్రుల మీద విసుగు రావడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. అలాగే కార్తీక్ గురించి నిజం తెలిస్తే ఆ విసుగు స్థానంలో అసహ్యం వస్తే కార్తీక్ ఏం అవుతాడని తలుచుకుని కంగారు పడుతుంది. వెంటనే వారితో ‘ఏ అమ్మ-నాన్నలు పిల్లలకు విసుగు వచ్చేలా ఉండరని, మీ అమ్మ-నాన్నకు మీరంటే ప్రాణమని, వాళ్ల మూడ్ బాగాలేదనుకుంటా అందుకు అలా ఉండిఉంటారని శౌర్య, హిమలకు నచ్చజేప్పుతుంది సౌందర్య. మరోవైపు భాగ్యం దీపకు ఈ పరిస్థితి రావడానికి తానే కారణమంటూ చెంపలు కొట్టుకుంటుంది. ఒకప్పుడు దీప తను హింసించిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. తనే గనుక దీపను బాగా చూసుకుంటే అసలు డాక్టర్ బాబును పెళ్లి చేసుకునేదే కాదనీ, బాగా చదివిస్తే ఈ వంటలు, దోసలు వేసుకొకుండా ఏం చక్క ఓ ఆఫీసరు పెళ్లి చేసుకునేదంటూ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది భాగ్యం. వెంటనే దీప కాపురం ఎలాగైనా సెట్ చేస్తానని, ఆ మోనితకు బుద్ధి చెప్పి కార్తీక-దీపలు దగ్గరయ్యాలా చూస్తునంటూ గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక మోనిత వీధి చివరన కారు ఆపి కార్తీక్ రమ్మన్నానని చెప్పి వారణాసిని పంపిస్తుంది. కార్తీక్ బస్తి వాళ్లకు వైద్యం అందిస్తుండగా దీప బట్టలు ఉతికి ఆ పక్కనే ఆరెస్తుంటుంది. ఇంతలో వారణాసి వచ్చి మోనిత పిలుస్తుందని చెప్పగానే దీప ఒక్కసారిగా ఆగి చూస్తుంది. కార్తీక్ కూడా దీప వంక మెల్లిగా చూస్తాడు. మోనిత మేడమ్ పిలుస్తుందని వీధి చివరన ఉందని చెప్పడంతో కార్తీక్ అక్కడికి వెళతాడు. కార్తీక్ రావడంతో మోనిత నవ్వుతూ పలకరించావా అని మోనిత అనగానే నువ్వు వచ్చావని పులకరించి పలకరించాలా? అని కోపంగా అంటాడు కార్తీక్. కాల్ చేసి రమ్మని ఉంటే వచ్చేవాడిని కదా ఇలా గోలచేసి పోతానంటే వచ్చాను. ఎందుకీ బెదిరింపులు.. నాకు దీపకు మధ్య కంచె వేసే ప్రయత్నమా? నన్ను ఒక పంజరంలో బందించే ప్రయత్నమా? అని కార్తీక్ ఆవేశపడుతాడు. మరోవైపు దీప చాటుగా ఆటోలో కూర్చుని వాళ్ల మాటల్ని వింటుంది.కార్తీక్ మాటలకు మోనిత ‘నువ్వు నా కోసం రావట్లేదు కాబట్టి.. నేను నీకోసం వచ్చాను.. నన్ను అవైడ్ చేద్దాం అనుకుంటున్నావా’ అంటుంది బాధగా. ‘నాకు తెలియని కొన్ని క్షణాలని నా జీవితంలో బలవంతంగా నువ్వు రాస్తుంటే.. పుస్తకం మూసేసినట్లు నా ఆలోచనలు మూసేశాను’ అని అంటున్న కార్తీక్ మాటలకు దీప ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక మోనిత తను సౌందర్య దగ్గరికి వెళ్లోచ్చిన విషయం చెబుతుంది వెంటనే కార్తీక్ ‘మా అమ్మ ఇంకా సంస్కారాన్ని మోస్తూనే ఉందా నాలాగా’ అంటాడు కోపంగా. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని మోనిత అనగానే కార్తీక్ నువ్వే నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావని, పరిచయం లేని ప్రమాదంలా కనిపిస్తున్నావు అంటాడు. ‘ఇంతకు ముందు నువ్వు స్నేహితురాలిగా కనిపించేదానివి.. ఇప్పుడు అలా లేవు.. నడిచే విస్పోటనంలా కనిపిస్తున్నావు’ అంటాడు. అలాగే ‘దీప మీద అప్పట్లో ఉన్న కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే.. కాని అది ఆసరాగా తీసుకుని ఏనాడైనా నిన్ను తాకానా?నీతో ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా? మన మధ్య ఈ తప్పు జరిగిందని నువ్వు వచ్చి చెప్పే వరకూ నాకు తెలియలేదు అంటే అందులో నా ప్రమేయం ఎంతవరకూ ఉందనేది నువ్వే ఆలోచించు’ అంటాడు కార్తీక్. ఆ తర్వాత మోనిత తనదైన శైలిలో తెలివిగా కార్తీక్‌కు సమాధానం ఇచ్చి నోరు మూపిస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్లాలి కారు ఎక్కమని అడగ్గానే కార్తీక్ కారు ఎక్కుతాడు. అది చూసి దీప ఆవేశంగా ఇంటికి వెళ్లిపోతుంది. కోపంతో రగిలిపోతూ వారణాసి ఆటోను కడుగుతూ తన కసి చూపిస్తుంది. ఇంతలో సౌందర్య రాగానే ‘మీరా నేను అవసరమైన పనిలో ఉన్నాను మీరు వెళ్లి లోపల కూర్చోండిని అంటుంది’ దీప. -
25వ తేదీన ఏం చేయబోతుందో సౌందర్యకు వివరించిన మోనిత
కార్తీకదీపం జూన్ 25 ఎపీసోడ్: కార్తీక్, దీపలు కూర్చుని మాట్లాడుకునే సీన్‌తో నిన్నటి ఎపిసోడ్ ముగిసన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్ అదే సీన్‌తో ప్రారంభమవుతుంది. దీప మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నేను చేయని తప్పుకు ఎన్నో అనరాని మాటలు పడ్డాను. ఇప్పుడు అలాంటి మాటలు మిమ్మల్ని అనలేను. అలాగే ఇంకేవరు అన్న వినలేను. మీకు నాకు అదే తేడా. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంట దీప ఎందుకు స్పందించడం లేదో’ అని అంటుంది. ఆ తర్వాత మీ భార్యగా మీకు ఏ విధంగా సాయపడగలను? నాకు నేను సర్దిచెప్పుకోవాలా? లేక నా తలరాత ఇంతేనని రాజీ పడాలా? అని కార్తీక్‌ని ప్రశ్నస్తుంది. దీంతో కార్తీక్ నువ్వు నువ్వుగానే ఉండని, తనని నమ్ము అంటాడు. నా మీద కోపంగా ఉంటే తిట్టు.. ఇంకా కసి తీరకపోతే చెంప పగలగొట్టు దీప అంటుండగా దీప అలా మాట్లాడకు అన్నట్లుగా రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ ‘నేను తప్పు చేయలేదు అనట్లేదు.. కానీ ఆ తప్పు నా ప్రమేయం లేకుండా జరిగిందని నమ్ము. ఇదంతా నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పడంలేదు దీప’ అంటాడు. దీంతో ఇప్పడే నా ప్రమేయం లేకుండ జరిగిందని చెబుతూనే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదంటున్నారే అని ప్రశ్నించింది. ‘అవును మళ్లీ మళ్లీ అదే చెబుతాను ఎందుకంటే అదే నిజం కాబట్టి. కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండోద్దని వేడుకుంటాడు కార్తీక్. మరోవైపు మోనిత సౌందర్య ఇంటికి వెళ్లి తనకు న్యాయం చేమని అడగ్గా ‘నా కొడుకు నాకో విషయం చెప్పాడు’ అని చెప్పి మోనితలో కంగారు పుట్టిస్తుంది సౌందర్య. ఇక శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తెప్పిస్తుంది. అది తాగిన మోనిత టెన్షన్‌గా ఇప్పటికైనా చెప్పండి ఆంటీ.. కార్తీక్ మీతో ఏం చెప్పాడని నిళ్లు నములుతూ అడుగుతుది. వెంటనే సౌందర్య నీకు తెలిసి తెలియనట్లు నటించడకు మోనితా.. వాడు చెప్పింది నిజమని నా మనసు చెబుతోంది అంటూ కార్తీక్ సౌందర్యతో ‘నేనుఆ తప్పు చేశానంటే నమ్మలేకపోతున్న మమ్మీ. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు’ అని అన్నాడని అంటుంది. ఆ తర్వాత మోనితతో.. ఇంకా వివరంగా ఇంకా లోతుగా దీనిపై చర్చించగలను కాకపోతే నువ్వే ఒక గైనకాలజిస్ట్వి కాబట్టి అంత వివరంగా చెప్పాల్సిన పనిలేదు.. అయినా ఇప్పుడు నువ్వు కన్నెపిల్లవి కాదంటే.. దానికి కారణం మా వాడికి తెలియదు అంటే.. అయినా సరే వాడేనని నువ్వు అంటే.. మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందని అని సౌందర్య అనడంతో మోనిత అయోమయంగా చూస్తుంది. అంతేగాక ఈ తప్పు గురించి తప్పుడు సమాచారం క్రియేట్ చేశావా? అని, తప్పటడుగు వెనుక తప్పని సరైన కారణం కనిపెట్టావా? అని నిలదీస్తుంది. అలాగే పూజ రోజు నువ్వు దీప ముందే ఈ విషయం బయటపెట్టగానే.. వాడు తలదించుకోలేదు సరికదా.. నీకే చివాట్లు పెట్టాడు.. ఆ నిజాయితీ వాడి కళ్లల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాను అని సౌందర్య ప్రశ్నలతో కడిగిపారేసే సరికి మోనిత షాక్ అవుతుంది. అయితే మోనిత కాసేపటికి తేలుకుని ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో మీకు తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయినా క్రియేట్ చెయ్యడానికి నేనేం పురాణకాలనాటి స్త్రీని కాదు..ఇది నిజం.. దీన్ని నిరూపించుకోవడానికి ఏ వేదిక కావాలంటే ఆ వేదికను ఆశ్రయించొచ్చు అని సవాలు చేస్తుంది. దీప విషయంలో మీ కొడుకుని నమ్మని మీరు నా విషయంలో మీ కొడుకునే నమ్ముతున్నారా? ఇంతకాలం మీరు చాలా ఫర్ఫెక్ట్ అనుకున్నాను.. నాకు సపోర్ట్ చేసి మొదటి వ్యక్తి మీరే అవుతారు అనుకున్నాను.. కానీ మీరు సగటు తల్లిగా మారిపోయారు.. మీ కొడుకుతో కలిసి నాకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక నా జీవితం గురించి ఎవరితోనూ సలహాలు తీసుకోదలుచుకోలేదు. నిజం నా కడుపులో ఉంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తున్నాను.. ఈ నెల 25 తారీఖున కార్తీక్‌తో నా పెళ్లికి స్లాట్ రిజిస్టర్ చేసుకోబోతున్నాననంటూ సౌందర్యకు షాక్ ఇస్తుంది. అయితే ఏ ఊరికో వెళ్లి తల దాచుకోమనే చవకబారు సలహాలు ఇవ్వద్దని మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను.. అదే జరిగితే.. పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి.. గుర్తుపెట్టుకోండి ఆంటీ అంటూ హెచ్చరిస్తుంది. అలాగే 25 తేదీన మీ కొడుక్కి నాకు పెళ్లి.. నన్ను ఆశీర్వదించండి అత్తయ్యగారు అంటూ సౌందర్య కాళ్లకు దండం పెట్టుకుంటూ ఆశీర్వదించమని మోనిత అంటుండగా సరిగ్గా అప్పుడే హిమ, శౌర్యలు ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే మోనిత ఆంటీ ఎందుకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందని అడడంతో సౌందర్య పిల్లలు ఏం వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. -
karthika Deepam: మోనిత ప్లాన్‌ను సౌందర్య తిప్పి కొట్టబోతుందా?!
కార్తీకదీపం జూన్ 24వ ఎపిసోడ్: తమ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ వివరించడంతో దీప ఆలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోనిత కార్తీక్‌కు పెట్టిన గడువు రెండు రోజుల్లో పూర్తైయిపోతుందని, ఎల్లుండి ఈ టైంకి ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే ఒళ్లు పులకరిస్తుందంటూ మురిసిపోతుంది. అంతేగాక తనని తిట్టిన దీప, సౌందర్యల నోళ్లు ఈ దెబ్బకు మూతపడతాయని తెగ సంబరపడిపోతూ ప్రియమణిని పిలిచి వేడి నీళ్లు తీసుకురమ్మని చెబుతుంది. ఇదిలా ఉంగా భాగ్యం మురళీ కృష్ణతో దీప ఇంటికి వెళ్లోస్తానని చెబుతుంది. ఎందుకని అడగ్గా దీపను ఇంటికి తీసుకువచ్చేస్తానని, అది డాక్టర్ బాబుతో ఉండేలా కనిపించడంలేదంటుంది. అంతేగాక ఇక దీప కష్టాలు పడింది చాలు ఇకనైనా దాని కష్టాలను దూరం చేద్దామని అనడంతో దీప గురించి భాగ్యం అంతగా ఆలోచించడం చూసి మురళీ కృష్ణ ఆనందపడిపోతాడు. మరోవైపు మోనిత కార్తీక్‌కు ఫోన్ చేస్తూనే ఉంటుంది. అయినా కార్తీక్ లిఫ్ట్ చేయడు. అలా దాదాపు మోనితవి 25కు పైగా మిస్డ్ కాల్స్ ఉండటం చూస్తాడు కార్తీక్. దీంతో ఆలోచనలో పడతాడు. మోనిత ఏంటీ ఇన్నిస్లార్లు కాల్ చేస్తుందని, ఏం మాట్లాడాలి. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఏమైన రచ్చ చేస్తుందా అంటూ ఆలోచిస్తుండగా శౌర్య అప్పడే వస్తుంది. నాన్న.. నాన్న అని ఎన్నిసార్లు పలిచిన కార్తీక్ పలకడు. దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మరోవైపు దీప కూడా అంతే తీవ్ర ఆలోచనలో పడుతుంది. డాక్టర్ బాబు మీద తను పెట్టుకున్న నమ్మకానికి ఎందుకింత ఎదురు దెబ్బ తగిలిందని, మోనిత ఎంత జానతనం చూపించిన ఆయన చలించడని గట్టిగా నమ్మాను.. అయినా ఈ తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తుండగా మధ్యలో హిమ వచ్చి అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిన పలకకపోవడంలో అక్కడి నుంచి హిమ వెళ్లిపోతుంది. ఇక ఇందులో మోనిత కుట్ర ఏదో ఉందని అది ఎలా తెలుస్తుందంటూ ఆలోచిస్తూ దీప ప్రియమణిని నిలిదీస్తే చెబుతుందా? అని అనుకుంటుంది. చెప్పదు.. మరి ఏం జరిగింది అన్నది ఎలా తెలుస్తుందని మదనపడుతుంది దీప. ఇక కార్తీక్ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోనిత రగిలిపోతుంది. తనని అవాయిడ్ చేస్తున్నాడా? ఇంత చెప్పిన కార్తీక్ తన మాటలను చెవికి ఎక్కించుకోవడం లేదని మండిపోడుతుంది. ఇంకా దీపనే కోరుకుంటే ఆ తర్వాత తను చేసేది చూసి బుర్ర తిరగడమే కాదు.. తనే నా చుట్టు తిరిగేలా చేస్తా అనుకుంటూ క్యాలెండర్లో 25 తారీఖుని స్కెచ్‌తో మార్క్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియమణి వచ్చి ఈ సున్నా ఏంటని అడగ్గా.. ఇది సున్నా కాదే వెర్రి మొహమా.. సునామీ.. ఆ రోజు తను క్రియేట్ చెయ్యబోయే సునామీ అని సమాధానం ఇస్తుంది. మరోవైపు సౌందర్య కూడా దీప, కార్తీక్‌ల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా.. మోనిత చీర కట్టుకుని ఇంటికి వస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే అత్త ఎదురైందంటే మంచి శకునమే అంటూ నమస్తే ఆంటీ అంటూ లోపలికి వెళుతుంది. సౌందర్యతో తనకు న్యాయం చేయమని, కార్తీక్ తననుంచి మొహం చాటేస్తున్నాడని చెబుతూ, సాటి స్త్రీగా తన దరపున పోరాడాల్సిన సమయం వచ్చింది ఆంటీ అంటూ సౌందర్య దగ్గర అమాయకంగా నటిస్తుంది మోనిత. దీంతో సౌందర్య అవును పోరాడే సమయం వచ్చందని, కార్తీక్ తనతో ఓ మాట చెప్పడంటూ సౌందర్య మోనితలో కంగారు పుట్టిస్తుంది. దీంతో అదేంటని భయంగా అడగడంతో మోనిత వంక సౌందర్య అనమానంగా చూస్తుంది. అదేం లేదని నువ్వు కంగారు పడకు అంటూ శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్ తీసుకురమ్మని చెబుతుంది సౌందర్య. వెంటనే శ్రావ్య అయ్యో.. కడుపుతో ఉన్నానంటుంది కదా అత్తయ్యా.. ఏ పుల్ల మామిడి కాయలో, చింతకాయ ఏమైనా అడుగుతుందేమో అని వెటకారంగా అంటుంది. ‘అంత వికారంగా ఏం కనిపించడటం లేదులే.. జ్యూస్ చాల్లే’ అని అంతే వెటకారంగా అంటుంది సౌందర్య. ఏం చెప్పి ఉంటాడు కార్తీక్.. ఈవిడేంటీ? ఏ మాత్రం తొణక్కుండా ఉంది’ అని మోనిత మాత్రం చేతులు నలిపేసుకుంటూ కంగారుపడుతుంది. మరోవైపు దీప కార్తీక్‌లు కూర్చుని ఉండగా.. నిన్ను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకోవడానికి ఎంతసేపు బతిమలాడాల్సి వచ్చిందో.. నా పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు దీపని కార్తీక్ అంటాడు. అంతేగాక నీ మౌనాన్ని భరించలేకపోతున్నానని, నాతో మాట్లాడు దీపని కార్తీక్ వేడుకుంటాడు. దీంతో దీప చెప్పండి డాక్టర్ బాబు.. మీరే నాతో మళ్లీ ఏదో చెబుతానంటున్నారు.. విన్నదే అయితే వినడం ఎందుకు? ఉన్నదే అయితే చెప్పడం దేనికీ?’ అంటుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: ఇదేమైన మోనిత డ్రామా? అని అనుమానిస్తున్న దీప
కార్తీకదీపం జూన్23వ ఎపిసోడ్: మోనితకు గట్టిగా బుద్ది చెప్పాలని సౌందర్యకు సలహా ఇవ్వడానికి వెళ్లిన భాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఇంటివ దగ్గర మురళీ కృష్ణ ఎదురు చూస్తుంటాడు. ఇంతలో భాగ్యం వస్తుంది. రాగానే చెప్పావా అంటూ ఆత్రుతగా అడుగుతాడు మురళీ కృష్ణ. దీంతో భాగ్యం అక్కడ జరిగిన విషయం, సౌందర్య ఏం చెప్పిందో అన్ని వివరిస్తుంది. ఇదిలా ఉండగా కార్తీక్ ఫుల్‌గా తాగి ఆ రోజు మోనిత ఇంట్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ మోనిత గీసిన గీతలు చూస్తూ మనసులో తప్పు చేసిన భావనతో పశ్చాతాప పడతాడు. మరోవైపు దీప పిల్లలు పడుకుని ఉండగా వారిని చూస్తూ హిమా ఆటోలో తనతో బాధపడిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది.హిమ అడిగిన ఏ ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదని ఆలోచిస్తుంది. చిన్నప్పుడు సవతి తల్లి కారణంగా లేకుండా ఎందుకు కొడుతుందని నాన్న అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు, నా మీద డాక్టర్ బాబుకు అనుమానం ఎందుకంటే సమాధానం లేదు, ఇప్పుడు నాన్న ఎందుకు అలా ఉంటున్నాడంటే నా దగ్గర సమాధానం లేదంటూ మనసులో అనుకుంటు కుమిలి పోతుంది. నా కడుపున పట్టినందుకే మీకు ఇన్ని కష్టాలంటూ దీప మదనపడుతుండగా బయట నుంచి శబ్థం వినిపిస్తుంది. దీంతో దీప వెళ్లి చూడగా కార్తీక్ తను ఏ తప్పు చేయలేదని నన్ను నమ్ము దీప అంటూ బాధపడుతుంటాడు. ‘నాతో మాట్లాడూ దీప, వాదించు.. తిట్టూ.. నేను చెప్పేది విను దీప’ అంటూ తల పట్టుకుని ఏడుస్తుంటాడు కార్తీక్. దీంతో దీప మనసులో తను ఏం చేసిన కరెక్ట్ అని వాదించి మనిషి ఎందుకు ఇలా ఉంటున్నాడు. తప్పు చేశాననే భావన ఆయనలో కనిపిస్తుంది. ఎలాగు మోనితను పెళ్లి చేసుకుంటా అనుకున్నాను కదా అందుకే ఇద్దరం కలిసిపోయామని ఆయన చెప్పోచ్చు.. కానీ అలా కాకుండా తప్పు చేసిన వాడిలా అసలు నోరు కూడా మెదపడం లేదంటూ దీప కార్తీక్‌ను చూస్తూ మనసులోనే మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ కింద కూర్చోని బాధపడుతుంటే దీప వెళ్లి మంచినీళ్లు ఇస్తుంది. గ్లాస్ తీసుకుని నీళ్లు తాగిన అనంతరం కార్తీక్ తనతో మాట్లాడమని, తాను ఏ తప్పు చేయలేదంటూ దీపతో అంటాడు. ‘దేవుడు నాకు పిల్లలు పుట్టే యోగం ఉందని మరో రకంగా అయినా తెలియజేయోచ్చు కదా. ఎవరైతే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారో నా క్లోజ్ ఫ్రేండ్కే అలా జరగడం ఏంటి’ అంటూ కుంగిపోతాడు. అంతేగాక ఆ రోజు ఫుల్‌గా తాగి ఉన్నానని అసలు ఏం జరిగిందో తనకు తెలియదంటాడు. అంతేగాక మ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్ చెప్పగానే దీప ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా ఆదిత్య సౌందర్యతో హిమా, శౌర్యలను చూసోస్తానని సౌందర్యతో అనగానే ఆమె వద్దని చెబుతుంది. కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడని అన్నయ్యను చూడగానే నీ మాటలు అదుపులో ఉండవని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావని చెబుతుంది సౌందర్య. ఇక దీప కార్తీక్ తనతో చెప్పిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇదంతా నిజమేనా లేక మోనిత ఏదైనా డ్రామా ఆడుతుందా? అనుకుంటుంది. డాక్టర్ బాబులో మోనితపై అభిమానం కనిపించడం లేదని ఆమె చేతిలో మోసపోయిన వ్యక్తిలా చూస్తున్నాడనుకుంటుంది. దీని వెనక ఎదో రహస్యం ఉందని కనిపెట్టాలని దీప నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
ఏదైనా దీవిలో ఇరుక్కుపోయామా అని భయమేస్తోంది అమ్మ: హిమా
కార్తీకదీపం జూన్ 22 ఎపిపోడ్: కార్తీక్ దీప ఇంటి ముందు జనత ఉచిత వైద్యశాల పేరుతో క్టీనిక్ నడుపుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ పేషెంట్స్‌ను చూస్తుండగా సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. కార్తీక్ అతడి రిపోర్ట్స్ చూసి మందులు రాసి ఇస్తాడు. అంతేగాక తన దగ్గర పని చేయాలని అందుకు తనకు రూ. 25 వేల జీతం ఇస్తానని కార్తీక్ చెప్పడంతో లక్ష్మణ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ దేవుడు అంటూ పొగుడుతుండగా సరిగ్గా అదే సమయానికి దీప బయటకు వస్తుంది. లక్ష్మణ్ దీపను చూసి దీపమ్మా ఇలా రమ్మా అంటూ పిలిచి వారిద్దరి కాళ్లకు దండం పెట్టుకుంటాడు. మీరిద్దరూ ఆదర్శ దంపతులంటూ మీలో రాముడు, సీత.. శివుడు, పార్వతిలు కనిపిస్తున్నారంటాడు. దీంతో కార్తీక్ ‘ప్రపంచానికి గొప్పగా కనిపిస్తున్న ఈ మనిషి లోపల ఎంత దుర్మార్గుడో వీళ్లకేం తెలుసు అనుకుంటున్నావా దీపా’ అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే హిమ బయటికి వచ్చి అమ్మా వెళ్దామా అంటుంది. కార్తీక్ ఎక్కడికి అనడంతో మార్కెట్‌కు వెళ్తున్నామని చెబుతుంది దీప. ఇదిలా ఉండగా భాగ్యం సౌందర్యతో రహస్యంగా మాట్లాడుతుంది. మోనితకు ఇలా సాఫ్ట్‌గా చెబితే పని జరగదని, తను వెళ్లి తన తీరులో మోనితకు వార్నింగ్ ఇస్తానని చెబుతుంది భాగ్యం. లేదంటే మీరైనా క్లాసుగా కాకుండా మాస్‌గా వార్నింగ్ ఇవ్వండి అంటూ సలహా ఇస్తుంది. అది జరగని పని.. మన దగ్గర తప్పు పెట్టుకుని మోనితని ఏం చేయలేమని సౌందర్య అంటుంది. అంతేగాక తన దగ్గర ఇప్పుడు బ్రహ్మస్త్రం ఉందని ఇప్పుడు మోనిత భయపెట్టడం జరగదంటుంది. కానీ భాగ్యం మాత్రం మనసైడు తప్పు ఉన్న తల వంచకుండా తెలివిగా ఆలోచించి మోనిత పని చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ ఒంటరిగా కూర్చుని.. గోడపై మోనిత గీసిన గీతలని చూస్తూ టెన్షన్ పడుతూ ఉండగా లోపల నుంచి శౌర్య వస్తుంది. కార్తీక్ ఆ గీతలను చూస్తుండటం చూసి అవి నీ భవిష్యత్తు అన్నావు కదా నాన్న ఇప్పుడు వాటి వల్ల ఎమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమాయకంగా. అప్పుడే కార్తీక్‌కు అన్ని గుర్తు చేసుకుంటాడు. దీప ప్రెగ్నెట్ అని తెలియగానే ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని గట్టిగా అరిచి చెప్పిన సంఘటన, అలాగే శౌర్య గతంలో నాన్న పిలిచి నువ్వే మా నాన్నవని ఎప్పుడో తెలుసు అనడం, కార్తీక్ హిమని ఎత్తుకుని తిరిగింది అన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అవుతాడు. దీంతో శౌర్యను దగ్గరకు తీసుకుని ఎత్తుకుని తీప్పుతుండగా అప్పుడే సౌందర్య వస్తుంది. అదంతా చూసి ఆనందిస్తుంది. ఇంతలో కార్తీక్ సౌందర్య చూసి నానమ్మ వచ్చిందని చెప్పగానే శౌర్య సంతోషిస్తుంది. లోపలికి వచ్చిన సౌందర్య గోడ మీద ఉన్న గీతలను చూసి శౌర్యతో గ్లాసులో నీళ్లు తెమ్మని చెబుతుంది. ఆ లోపు కార్తీక్‌తో ఆ గీతల్ని చెరపకుండా అలేనే ఉంచుతావా అని ప్రశ్నిస్తుంది. అయినా కార్తీక్ మౌనంగా ఉంటాడు. ‘ఆ గీతల్ని చెరిపి నీ రాతను మార్చుకోరా’ అంటుంది అనడంతో తన వల్ల కాదేమో మమ్మీ అంటాడు కార్తీక్ నిరాశగా.. ఆ మోనిత నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని, తనని బెదరిస్తుంది కానీ దీపకు భయపడుతుంది అంటుంది. అందుకే. సమస్యని దీపకు చెప్పు.. దీప చేతిలో పెట్టు.. ఆ గీతల్ని దీపే చెరిపేస్తుంది అని సౌందర్య చెబుతుంది. దీంతో ఆ కార్తీక్ దీప చూసే చూపుల్లో ఆ గీతల్ని చెరిపే బాధ్యత నీదే అన్నట్టు నాకు అర్థమవుతుంది మమ్మీ.. ఇంకా ఆ గీతల్ని ఎలా చెరిపేస్తుంది అంటాడు కార్తీక్. మరోవైపు ఆటో వస్తుండగా హిమ దీపతో వారణాసి ఎందుకు రాలేదని, ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నాడని ప్రశ్నిస్తుంది. దీంతో ఏదో పని మీద బయటకు వెళ్లాడని దీప సమధానం ఇస్తుంది. ఆ తర్వాత హిమ నాకు చాలా భయంగా ఉందని, ఏదో మనసులో తెలియని బాధ ఉంటోందంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మనం అందరం కలిసే ఉన్నా ఏంటో భయం భయంగా అనిపిస్తుందంటూ బాధపడుతుంది. వారణాసి కూడా ఫోన్ ఎత్తకపోతే.. ఇక మీదట వారణాసి కూడా మనతో మాట్లాడడేమోననే భయమేస్తోందని, ఈ ప్రపంచంలో మనషులంతా వేరు, మన నలుగురం వేరేమో.. ఏదైనా దివిలో ఇరుక్కుపోయామోనని అనిపిస్తుంది అమ్మ అంటూ హిమ కన్నీరు పెట్టుకోవడంతో దీప హిమను దగ్గరకు తీసుకుని తాను కూడా ఎమోషనల్ అవుతుంది. -
Karthika Deepam: అసలేం జరిగిందో దీపకు వివరించిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 21వ ఎపిసోడ్.. సౌందర్యని కలవడానికి వెళ్లిన దీప.. తిరిగి రావడం, కార్తీక్ తింటూ రా దీపా.. నీకు ఇడ్లీ తీసిపెట్టాను అని చెప్పడంతో.. మరి నాకు అంటూ మోనిత ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. నవ్వుతూ.. లోపలికి వచ్చి.. టిఫిన్ తింటాను అంటూ కూర్చుంటుంది. అంతేగాక దీపను కూడా తిను అని అడగడంతో.. ఇప్పుడు తినను తర్వాత తర్వాత తింటానని దీప సమాధానం ఇస్తుంది. వెంటనే మోనిత ‘చెప్పాను కదా దీప నీలాగా నేను వేయిట్ చేయలేను’ అంటూ పిల్లలకు అర్థం కాకుండా తెలివిగా మాట్లాడుతుంది. ఇండ్లీ పెట్టుకుని ‘కార్తీక్ ఇడ్లీ సూపర్ నీ చేతుల్లానే భలే మెత్తగా ఉంది’ అని మాట్లాడుతూ దీప ఉడుక్కునేలా చేస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటోంది, అందుకే టైమ్‌కి తింటున్నాను. లేకపోతే కళ్లు తిరుగుతున్నాయి. ఈ మధ్య వికారంగా ఉంటోందంటూ తన మాటలతో కార్తీక్‌ను, దీపను ఇబ్బంది పెడుతుంది మోనిత. ఇక హిమ, శౌర్యలకు తెచ్చిన చాక్లెట్స్ బ్యాగులోంచి తీసి మనపిల్లలే కదా అని తీసుకొచ్చాను అంటుంది. ఇక మోనిత తీరు చూసి కార్తీక్ మనసులో ‘నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదు.. గిల్టీగా ఫీల్ కాలేదు.. అందుకే నాకు తల దించుకోవడం అలవాటు లేదు.. ఇప్పుడు అర్థమవుతుంది చెయ్యని నేరానికి దీప పాపం ఎంత నరకం అనుభవించుంటుంది?’ అనుకుంటాడు బాధగా. పిల్లలను బయటకు వెళ్లమని చెప్పి మోనిత గోడ మీద గీసిన 10 గీతల్లో రెండో గీత కొట్టేసి వెళ్లిపోతుంది. ఇక సౌందర్య ఇంటికి వెళ్లి పరువు గురించి, దీప జీవితం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రావ్య కూల్ చేసే ప్రయత్నం చేస్తే.. శ్రావ్యతో కూడా అదే బాధను పంచుకుని బాధపడుతుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన మోనిత అద్దంలో చూసుకుంటూ దీప తనకంటే అందంలో, చదువులో, డబ్బు సంపాదనలో ఎందులో ఎక్కవ కాదు మరేందుకు కార్తీక్ దీపనే ఇష్టపడుతున్నాడని ప్రియమణిని అడుగుతుంది. ప్రియమణి అన్నింట్లోనూ మీరే ఎక్కువ అంటూనే మోనితకు కౌంటర్ వేస్తుంది. మోనిత చేతిని తీసి ఆమె గుండెల మీద పెట్టి.. ‘ఇప్పుడు చెప్పండమ్మా.. దీపమ్మ మంచిదా.? మీరు మంచివారా’ అంటుంది. దాంతో మోనితకి తను చేసిన నేరాలన్నీ గుర్తొస్తాయి. మీ కళ్లలోనే తెలుసిపోతుందమ్మా.. మీరు మంచివారైతే కార్తీక్ అయ్యే మీ దగ్గరకు వస్తాడని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది. అయితే మోనిత మాత్రం మనసులో.. ‘ఎవరు ఎన్ని చెప్పినా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను’ అనుకుంటుంది. ఇదిలా ఉండగా దీప దగ్గరకు వారణాసి కంగారు వస్తూ అక్కా.. డాక్టర్ మోనిత ఇక్కడికి వచ్చి వెళ్లిందా?’ అని అడుగుతాడు. దీంతో ఏం అయ్యిందని దీప అడగ్గా.. మోనిత తనని తమ్ముడని పిలిచిందని, నిన్ను బాగా చూసుకోమ్మని ఇక నుంచి ఏ కష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలని అన్నదని చెబుతాడు.అదంతా విన్న కార్తీక్ అక్కడి రాగానే వారణాసి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ దీప వంక జాలిగా చూస్తూ దీపకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నస్తాడు. ఇంతలో పిల్లలు వాళ్లిదరికీ ఫోటోస్ తీసి.. ‘సూపర్ నాన్నా.. సూపర్ డాడీ.. మీరు ఇలా కలిసి ఉంటేనే మాకు చాలా ఇష్టం.. ఇంతకన్నా మాకు ఏం అవసరం లేదు’ అంటారు. తరువాయి భాగంలో కార్తీక్ అసలు ఏం జరిగిందనేది ఏడుస్తూ చెపుతాడు. తనకు పిల్లలు పుట్టరని మోనిత చెప్పిందనే విషయంతో పాటు ఆరోజు రాత్రి మోనిత ఇంట్లోనే ఫుల్‌గా తాగి పడిపోయిన విషయం చెబుతాడు. ఆ మైకంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని ఈ విషయం మోనిత తనకు చెప్పేవరకు తెలియదని కార్తీక్ దీపకు వివరిస్తాడు. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్: ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్ -
9 రోజుల తర్వాత అలా చేస్తా: ప్రియమణికి వివరించిన మోనిత
కార్తీకదీపం జూన్ 19: అబార్షన్ చేసుకోమ్మని సర్దిచెప్పడానికి వెళ్లిన కార్తీక్‌కు మోనిత షాక్ ఇస్తుంది. కార్తీక్‌నే ఎదోక నిర్ణయం తీసుకోవాలని లేదంటే తానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. అంతేగాక భార్య స్థానం ఇవ్వమంటుంది. ఇదే విషయాన్ని కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్లిన చెప్పి సలహా అడుగుతాడు. సౌందర్య తానేం చేయలేనని, నువ్వు తప్పు చేశాడు ఫలితం అనుభవించాల్సిందే అంటూ హితవు పలుకుతుంది. మరీ కార్తీక్ మోనిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నాడో నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య దగ్గరికి వెళ్లి సలహా అడిగిన కార్తీక్‌కు ఆమె చివాట్లు పెడుతుంది. తానేం చేయలేనని చేతులెత్తెస్తుంది. దీంతో కార్తీక్ తిరిగి దీప ఇంటికి వచ్చేస్తాడు. ఉదయం దీప లేచేసరికి కార్తీక్ బయట పడుకుని కనిపిస్తాడు. అలా కార్తీక్‌ను చూడటంతో దీప మనసు కరుగుతుంది. ఆ తర్వాత కాఫీ పెట్టి తీసుకేళ్లి కార్తీక్‌ను లేపుతుంది. దీప పిలుపుతో కళ్లు తెరిచిన కార్తీక్ ఆమెను చూసి ఏంటి ఇంత ఉదయాన్నే రేడి అయ్యావని కంగారు పడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావా? ప్లీజ్ దీప అలా చేయకు అని తను తట్టుకోలేనని, పిల్లలు మమ్మీ ఏదని అడిగితే ఏం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు కార్తీక్. దీంతో దీప ఎక్కడికి వెళ్లడం లేదని, కాస్తా పనుండి బయటకు వెళ్తున్నట్లు చెబుతుంది. అలాగే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదంటూ గంటలో వస్తానని చెబుతుంది. దీంతో కార్తీక్ మన కారులో డ్రాప్ చేస్తానంటాడు. కానీ దీప వారణాసి ఆటోలో వెళ్తానని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప, సౌందర్యలు పార్కులో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మోనిత, ప్రియమణితో కలిసి వాకింగ్‌కు వస్తుంది. అదే సమయంలో మోనిత తొమ్మిది రోజుల తర్వాత తను ఏం చేయనుందో ప్రియమణికి వివరిస్తుంది. దీంతో ప్రియమణి అది జరిగే పని కాదని, దీప, సౌందర్యలు అడ్డుకుంటారనగానే మోనిత అక్కడ దీపను, సౌందర్యను చూస్తుంది. సౌందర్య దీపతో కార్తీక్ తన దగ్గరికి వచ్చి సలహా అడిగిన విషయం చెబుతుంది. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి వారిని పలకరిస్తుంది. ఆ తర్వాత ‘ఓ కాలమా ఇది నీ గాలమా’ కాలానికి అద్భుతమైన శక్తి ఉంది ఆంటీ అంటూ దీప విజయనగం వెళ్లిన రోజులను గర్తు చేస్తుంది. అంతేగాక హిమను వెతికి పెడితే కార్తీక్ తనని పెళ్లి చేసుకుంటానని అడమేంటని, చావుబతుకుల్లో ఉన్న దీపను కార్తీక్ బతికించుకోవడం ఏమిటి? పాపం ఇన్ని చేసిన కార్తీక్‌ను దీప ఛీ కొట్టే పరిస్థితి రావడం ఏంటీ? అంటూ ఇది మోనిత మహత్యం కాదని, కాల మహత్యం అంటుంది. ఇప్పుడు కాలం గాలి రెండూ ఇప్పుడు మోనిత వైపే ఉన్నాయంటూ విర్ర వీగుతుంది మోనిత. ఆ తర్వాత మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో సౌందర్య కార్తీక్ చేసిన పనికి కోపం తెచ్చుకుంటూ ఏం చేయాలేని పరిస్థితి తీసుకోచ్చాడని, కాళ్లు చేతులు కట్టేశాడంటూ అహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే నీకు అన్యాయం జరగనివ్వనని, కష్టం కలగనివ్వను అంటుండగా.. దీప తనకు జరిగిన నష్టానికి ఖరీదు ఎంతుంటుంది అత్తయ్యా తన మాటలతో సౌందర్యను బాధపెడుతుంది. ఇక తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం కార్తీక్‌కు, దీపకు సాయం చేస్తానంటుంది. ఇలాంటి విషయాలను డీల్ చేయాలంటే ఆ సౌందర్య, దీప, కార్తీక్ ఎవరి వల్ల కాదని తనలాంటి వాళ్ల వల్లే అవుతుంది అంటుంది. నేనోంటో చూపిస్తా అని మురళీ కృష్ణతో చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మొక్కలకు నీళ్లు పడుతుండగా.. పిల్లలు దీప గురంచి అడుగుతారు. బయటికి వెళ్లిందని అనడంతో ఏంటి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా? అని అడుగుతుంది. నిజంగా అమ్మ మీతో చెప్పిందా? ఏ గోడకో, చెట్లకో చెప్పిందా అంటూ కార్తీక్, దీపలు ఎందుకు మాట్లాడుకోవడం లేదని, దీప తనపై ఎందుకు కోపంగా ఉందని పిల్లలు కార్తీక్‌ను ప్రశ్నిస్తారు. దీంతో ప్రశ్నలు ఆపి ఫ్రెష్ అయ్యి రండని, టిఫిన్ చేసి పెడతా అంటాడు కార్తీక్. దీప వచ్చేసరికి పిల్లలు బయట ఆడుకుంటారు. కార్తీక్ అప్పడే టిఫిన్ చేస్తాడు. దీపను చూసి నువ్వే వచ్చేసరికి లేటు అవుతుంది తను తినేస్తున్నానని అంటుండగా.. అప్పుడే మోనిత మరీ నాకు అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో చూద్దాం. -
Karthika Deepam: భార్య స్థానం కోరిన మోనిత, సౌందర్యను సలహా అడిగిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 18: మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్‌ని బెదిరిస్తుంది. పది అంటే పదే రోజుల్లో తనకు న్యాయం జరిగే నిర్ణయం చెప్పాలని గోడ మీద 10 గీతలు గీసి కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ హెచ్చరించి వెలుతుంది. ఆ తరువాత కార్తీక్ మోనితకు ఆబార్షన్ చేయించుకోమ్మని చెప్పేందుకు ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ మోనిత కార్తీక్ చెప్పేది వినకుండా తనని పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వమని అడుగుతుంది. దీంతో కార్తీక్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మోనితతో పదేళ్లుగా దీపను అనుమానించానని, ఇప్పుడది తప్పని తేలింది. ఈ సయమంలో అంటూ నానుస్తుండగా.. అయితే దానికి నాకు సంబంధం ఏంటని నిలదీస్తుంది మోనిత. ‘నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? నేనే చేయను. దీప కంటే ముందు నుంచి నిన్న ప్రాణంగా ప్రేమిస్తున్న, మరీ నా మీద ఎందుకు నీ ప్రేమ రాలేదు. కనీసం జాలి అయినా చూపించు కార్తీక్. అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. నీ ప్రమేయం ఉన్నా లేకున్నా జరిగిన దానికి న్యాయం చెయ్యమంటున్నాను.. అంతే’ అంటుంది మోనిత. త్వరలో కార్తీక్‌ను తన నిర్ణయం చెప్పాలని, లేదంటే తనే ఏదోక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటుంది. ఆ తర్వాత ‘నీ యాక్షన్‌ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని చెప్పు’ అంటూ హెచ్చరిస్తుంది మోనిత. మరోవైపు పిల్లలు దీప బెండకాయలు కట్ చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి ఇంతకుముందు నాన్న వస్తే ఇష్టమైనవవి వంటలు అన్ని చేసి పెట్టెదానివి. ఇప్పుడు నాన్న వచ్చి మనతోనే ఉంటున్నా ఈ పిచ్చి వండి పెడుతున్నావు? ఏమైంది అమ్మ నీకు కొన్ని రోజుల నుంచి ఏం మాట్లాడకుండ మౌనంగా ఉంటున్నావు. నాన్నకు, నీకు మధ్య ఏం జరిగిందని పిల్లలు ఆరా తీస్తారు. అలాగే గోడ మీద గీతలు గురించి అడుగుతూ.. కార్తీక్ తన చేతి గీతలని, భవిష్యత్ చెప్పిన మాటలకు అర్థం ఏంటని దీపను ప్రశ్నిస్తారు. అయినా దీప ఏం మట్లాడదు. దీంతో హిమ మీరు చెప్పకపోతే మేమే కనిపెడతామని, శౌర్యతో నువ్వు ఇవన్ని తెలుసుకుంటావు కదా అనగానే ‘నాన్ననే కనిపెట్టిన దాన్ని ఇది నాకు పెద్ద విషయం కాదు’ అంటుంది. శౌర్య తెలుసుకుంటా ఖచ్చితంగా కనిపెడతా అని అక్కడ నుంచి వెళ్లిపోగానే దీప ‘పిల్లలకి నిజంగానే ఆయన చేసిన తప్పు గురించి తెలిస్తే.. ఆయన్ని క్షమిస్తారా? కచ్చితంగా క్షమించరు. అసహించుకుంటారు’ అంటూ మనసులో మదన పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మోనిత దగ్గర జరిగిందంతా సౌందర్యకు చెబుతాడు. ‘ఇందులో నేను చెయ్యగలిగింది ఏం లేదు’ అని సౌందర్య అంటే.. ‘అలా అనకు మమ్మీ.. ఊబిలో కూరికుపోయాను.. చెయ్యి అందించి గట్టుకు చేర్చు మమ్మీ’ సౌందర్యను సలహా అడుగుతాడు. కార్తీక్.. చిన్నప్పుడు నీకు గాజేంద్ర మోక్షం చదివి వినిపించాను గుర్తుందా.. మోనిత ఇప్పుడు నీళ్లలో ఉన్న ముసలిరా.. అది చాలా శక్తివంతురాలు. దాని నోటికి చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నావు. నా దగ్గరకి వచ్చి మొరపెట్టుకుంటే కాపాడటానికి నేను విష్ణుమూర్తిని కాదు.. దాని తల ఛేదించి నిన్ను రక్షించడానికి నా దగ్గర విష్ణు చక్రమూ లేదు’ అని అంటుంది. అలా అనకు మమ్మీ ఎలాగైన నన్ను దీని నుంచి బయట పడే మార్గం చూపించమని కార్తీక్ అడగ్గా.. దీనికి ఒకేట మార్గం ఉందని, మోనిత స్వయంగా తన కడుపు నాటకమని లేదా ఆ కడుపులో బిడ్డకు నువ్వు తండ్రివి కాదని చెప్పాలని అంటుంది. అదే జరిగే పనేనా? అని మోనిత నీళ్లలో ఉన్న మొసలి అని అది నిన్ను ముంచెడయం ఖాయం, నువ్వు తప్పు చేశావు ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దానికి మోక్షం ఆ పైవాడు చూపిస్తాడు అంటూ కార్తీక్‌కు చివాట్లు పెడుతుంది సౌందర్య. రాత్రి ఇంటిక తిరిగి వచ్చేస్తాడు. పిల్లలకు చాక్లేట్స్, బిస్కెట్స్ తీసుకుని వెళుతాడు కార్తీక్. ఇక తెల్లారి దీప లేచి చూసేసరికి కార్తీక్ బయట పడుకుని ఉంటే కాఫీ తీసుకుని వెళ్లిని డాక్టర్ బాబు అంటూ దీప కార్తీక్‌ని నిద్ర లేపుతుంది. ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. -
karthika Deepam: మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్, భార్య స్థానం అడిగిన మోనిత
కార్తీకదీపం జూన్ 17: మోనిత దీప ఇంటికి వస్తుంది. దీప గొప్పది. పురాణాల్లో విన్నామే మహా పతివ్రతల గురించి.. అలాంటిది దీప. భర్త ఎలాంటి వాడైనా పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే పాతకాలం నాటి మనిషి.. భూదేవి అంత సహనం ఉంది కాబట్టి నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి పదేళ్లగా ఎదురు చూసింది.. కానీ నాకు అంత ఓపిక లేదందూ గోడ మీద 10 గీతలు గీసి అవి చూపిస్తూ.. పది రోజులు నీకు టైమ్ ఇస్తున్నాను.. పది రోజుల్లో నాకు న్యాయం జరిగే సమాధానం కావాలని లేదంటే నీ కుటుంబం గడగడ వణికిపోయేలా చేస్తానంటూ హెచ్చరిస్తుంది. ఇక మోనిత వెళ్లిపోతూ వెనక్కి తిరిగి ఎక్కువగా ఆలోచించకు దీప.. ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఏం లేదు.. ఆరోగ్యం బాగా చూసుకో.. ఎందుకంటే రేపు నాకు పురుడు పొయ్యాల్సింది నువ్వే.. పది మందికి అన్నం పెట్టిన చెయ్యి.. నీ చేత్తో పురుడు పోస్తే చాలా మంచిది అంటూ దిప ఉడికించి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం దీప దగ్గరకు వెళ్లి భర్త రాజీపడమని చెబుతానంటూ మురళీ కృష్ణతో చెబుతుంది. దీంతో అతను వద్దని భాగ్యంకు నచ్చజెప్పిన వినకుండా వెళ్తనని మొండిగా అంటుంది. ఇక పిల్లలు ఆడుకుంటూ మోనిత గీసిన గీతల దగ్గరకు వెళ్లి ఏంటవి అని మాట్లాడుకుంటుంటారు. మ్యాథమెటిక్స్ హా, ఆల్జిబ్రా గీతలు అంటూ వాళ్లు మాట్లాడుకుంటుంటే గుమ్మం దగ్గర నుంచి దీప, సోఫాలో కూర్చున్న కార్తీక్ వింటుంటారు. ఆ తర్వాత పిల్లలు దీపని ‘ఇవి ఎవరు గీసారని అడగ్గా దీప కార్తీక్ వైపు చూస్తుంది. దాంతో పిల్లలు కార్తీక్‌ని నువ్వు గీశావా? నాన్న అని అడగ్గా... అవి నా భవిష్యత్ అమ్మ అంటాడు. దాంతో దీప కార్తీక్ తానో తప్పు చేశానని, నా భవిష్యత్‌కి సంబంధించింది. రేపు చెబుతాను అన్ని విషయం గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ చెబుతానన్న నిజం మోనిత ప్రెగ్నెంట్ విషయం అయ్యి ఉంటుందని, మోనిత ద్వారానే కార్తీక్ తన పతివ్రత అనే నిజాన్ని నమ్ముతున్నాడని ఆలోచిస్తూ బాధపడుతుంది. మొత్తానికి పిల్లలు కార్తీక్ చెప్పిన పెద్ద పెద్ద మాటలు అర్థం చేసుకోలేక.. ‘మన లెక్కలే బెస్ట్ అర్థమవుతాయి’ అనుకుంటూ వెళ్లిపోతారు. ఇక సౌందర్య దీప, కార్తీక్‌ల గురించి దిగులు పడుతూ ఉండగా.. దీపకు బహుమతిగా ఇవ్వడానికి కార్తీక్ గిఫ్ట్ పేపర్‌తో కవర్ చేసిన శ్రీశ్రీ పుస్తకం సౌందర్య కంటపడుతుంది. ‘దాన్ని తీసి పైన ఉన్న ‘దీపకు ప్రేమతో నీ డాక్టర్ బాబు’ అనేది చదివి.. ఓపెన్ చేసి.. అందులో ఉన్న పుస్తకం చూసి.. ‘అంటే ఈ గిఫ్ట్ వాడి చేతులతో దానికి ఇద్దాం అనుకున్నాడా..? ఎప్పుడు ఇద్దాం అనుకున్నాడు? ఎందుకు ఇవ్వలేదు?’ అని ఆలోచనలో పడుతుంది. బహుశా ఇదే ఆధారాన్ని కార్తీక్ ముందు ఉంచి కార్తీక్‌ని నిలదీస్తే.. దీప పవిత్రత అనే విషయం కార్తీక్‌కి ముందే తెలిసిందని బయటపడుతుంది. అప్పుడు దీప కార్తీక్ కాస్తైనా దగ్గరవుతారని ఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ మోనిత ఇంటికి వెళతాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తోంది మోనిత అని అంటాడు. ఏ విషయం అని అడుగుతుంది మోనిత. ‘అదే.. ఇంటికి వచ్చి పదిరోజులు గడువు ఇచ్చావు కదా అంటుండగా అందులో తప్పేముంది కార్తీక్ అంటుంది. ఆ తర్వాత కార్తీక్ మన మధ్య జరిగింది అది ప్రేమతోనో, ఇష్టంతోనో కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అలా అని ఏం తెలియనట్లు ఎలా ఉండమంటావని మోనిత అంటుంది. అలాగే దీప మీద ఉన్న ప్రేమతో ఇప్పుడు నాకు అన్యాయం చెయ్యాలని చూడకు కార్తీక్ అంటూ మోనిత రిక్వెస్ట్‌గా అడుగుతుంది. నా ఉద్దేశం అది కాదు అని కార్తీక్ అంటుండగా ‘నేను చెప్పిన మాటల్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవట్లేదు.. అందరి ముందు నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చినట్లే నాకు భార్య స్థానం ఇవ్వు’ అంటుంది మోనిత. దీంతో కార్తీక్ మోనితా ప్లీజ్ అంటాడు ధీనంగా. తానేం తప్పు మాట్లాడలేదని ఎదురు తిరుగుతుంది మోనిత. అది కాదు మోనితా.. గత పదేళ్లుగా నా భార్యని నేను అనుమానించాను.. ఇప్పడు అది తప్పు అని తెలిసింది.. ఇప్పుడు ఈ టైమ్‌లో అని అంటూ కార్తీక్ ఆగిపోతాడు. దీంతో ‘దానికీ నాకు సంబంధం ఏంటీ కార్తీక్.. నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? సారీ కార్తీక్ నా వల్ల కాదు అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే నేను అన్యాయం అయిపోతాను.. ఏం కార్తీక్.. ఇప్పుడు దీప మీద ప్రేమ కలిగింది సరే.. మరి దీపకంటే ముందు నుంచే నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే.. మరి నా మీద నీకెందుకు ప్రేమ కలగడం లేదు?’ అని కార్తీక్‌తో అంటుంది. -
karthika Deepam: నాన్న ఏదో తప్పు చేసిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు..
కార్తీకదీపం జూన్ 15: దీప దీర్ఘంగా ఆలోచిస్తూ బయట కూర్చుంటే హిమ వచ్చి ఏమైందని, నువ్వు డాడీ ఎందుకలా ఉంటున్నారని ప్రశ్నిస్తుంది. ఈ లోపు అక్కడికి శౌర్య కూడా వస్తుంది. వచ్చిరాగానే ఏంటి ఇక్కడ ఉన్నారంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి దీపతో ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావని అడగడంతో పనుందంటూ లోపలికి వెళ్లిపోతుంది దీప. ఆ తర్వాత పిల్లలిద్దరూ ‘అమ్మకు ఏమైంది? నాన్న కూడా ఈ మధ్య ఎలానో ఉంటున్నారు. ఎప్పుడు అమ్మ గురించి అడిగిన చికాకు పడే నాన్న.. నిన్న మనం అడగ్గానే తలదించుకుని ఉన్నాడు. నాతో రండి అంటూ ఇక్కడికి తీసుకువచ్చాడు. ఏదో తప్పు చేసిన వాడిలా సైలెంట్‌గా ఉంటున్నాడు’ అని అనుకుంటారు. దీంతో రౌడీ అదేంటో నేను తెలుసుకుంటా అని హిమతో అంటుంది. అయితే లోపలి నుంచి వాళ్లిద్దరూ మాట్లాడుకునేదంతా దీప వింటుంది. మరోవైపు సౌందర్య దీప ఇంట్లో నిన్న ఏం జరిగి ఉంటుందా? అని ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తాడు. శ్రావ్య కార్తీక్‌తో టిఫిన్ తీసుకురమ్మంటారా బావగారు అని అడగ్గానే.. ‘వద్దమ్మా నేను మీ అక్క ఇంట్లో.. అదే మా ఇంట్లో చేస్తాను’ అని కార్తీక్ అంటాడు. వెంటనే సౌందర్యతో ‘మీ అక్కా పిల్లలతో కలిసి మా ఇంట్లో భోజనం చేస్తాను.. ఆహా వినడానికి ఎంత సంస్కారవంతంగా ఉందిరా.. ఈ మాట చెప్పడానికి నీకు పదేళ్లు పట్టింది’ అని అంటుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటూ అవును మమ్మీ పెద్ద తప్పు చేశాను.. అదే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని అనగానే వెంటనే సౌందర్య మరి ఆ తప్పుని(మోనిత ప్రెగ్నెన్సీ విషయం) అంటూ ప్రశ్నిస్తుంది. అలాగే సౌందర్య మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది కార్తీక్.. నిన్ను చూస్తే కాదు.. దీప, పిల్లలు గుర్తోస్తే అంటుంది. అంతేగాక పిల్లలు, దీపా పదేళ్లుగా పడిన కష్టాలను ఆమె కార్తీక్‌కు గుర్తు చేస్తుంది. ‘శౌర్య సొంత తండ్రిని నాన్న అని పిలవడానికి ఎంతలా ఆలోచిందిరా, ఇంత ఐశ్యర్యం ఉన్నా బస్తిల్లో లేనివాళ్లలా ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు నువ్వు మారిపోయి అంతా బాగుంటుందని సంతోషించే సమయానికి పెద్ద ప్రళయాన్ని సృష్టించావు. రేపు మోనితను కడుపుతో చూసి పిల్లలు ఆమె భర్త ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతవురా’ అని నిలదీస్తుంది సౌందర్య. దీంతో పరిస్థితి అంతవరకు రానివ్వను మమ్మీ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య కోపంతో ‘పళ్లు రాలగోడతాను’ అని కార్తీక్‌పై అరుస్తుంది. మోనిత అంటే ఆడబొమ్మ కాదురా.. ఆడపల్లి ఆమె ఎలాంటిదైన కానీ ఒక మాగాడి వల్ల తల్లి అవ్వడం అంటే చిన్న విషయం కాదురా. మోనిత పొగరుదే కావచ్చు, పరాయి అడదాని భర్తను కోరుకున్నదే కావచ్చు. పదహారేళ్లుగా చూస్తున్నా మోనితా నిన్ను తప్పా మరే మగాడిని వేరే దృష్టితో చూడలేదు. నువ్వే ప్రాణంగా బతికింది. అందుకే అది ప్రమాదకారి అని ఎన్నోసార్లు హెచ్చరించిన వినలేదు. ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు. అందరిని పడేశావు. నువ్వు ఇప్పుడు నా భార్య, పిల్లలు అంటే ఆమె ఊరుకుంటుందా? నా పరిస్థితి ఏంటని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది’ అంటుంది సౌందర్య మధ్యలో మోనిత ఫోన్ చేయడంతో కార్తీక్ కట్ చేస్తాడు. అయినా పదే పదే ఫోన్ చేస్తుండటంతో కార్తీక్ ఫోన్ స్విచ్చావ్ చేస్తాడు. దీంతో మోనిత ‘నా ఫోన్ కట్ చేస్తాడా? ఇంతకు ముందు చేస్తున్నాడంటే ఒకే కానీ ఇప్పుడు నా గురించి తెలిసి కూడా కాల్ కట్ చేస్తున్నాడేంటి?’ అంటే కార్తీక్ నన్ను కట్ చేస్తున్నాడా? అలా జరగకూడదు’ అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తన చీర ఐరన్ చేయమని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప పిల్లను తీసుకుని గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కార్తీక్ జనతా హాస్పిటల్ అనే బోర్డు పెట్టి ఉచిత వైద్యం అందించబడును అనే బోర్డు పెడతాడు. అది చూసి పిల్లలు దీప షాక్ అవుతారు. లోపలి నుంచి కార్తీక్ బయటకు వస్తాడు. పిల్లలు ఇక ఇక్కడే ఉంటావా నాన్నా అని అడగ్గానే ‘అవునమ్మా ఇక నుంచి ఇక్కడే ఉంటాను.. ఇక్కడే వైద్యం చేస్తాను’ అంటూ దీపను చూస్తూ సమాధానం ఇస్తాడు. ఇక పేదవారికి ఉచిత వైద్యం చేస్తానంటూ దీపతో లక్ష్మణ్‌కు ట్రీట్మ్మెంట్ చేస్తానని చెప్పి రమ్మని చెప్పుమంటాడు. దీంతో హిమ అమ్మా నువ్వు ఇప్పుడు హ్యాపీనేగా అని అడుగుతుంది. దీప మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో శౌర్య నాన్న చాలా మంచివాడని తనకు చిన్పప్పుడే తెలుసని, భలబద్రాపురంలో ఉన్నప్పుడు నాన్నని క్యాంప్‌లో చూశాని అప్పటి విషయం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు నీతో పాటు మోనిత ఆంటీ కూడా వచ్చింది కదా నాన్నా అని శౌర్య అనగానే దీప రెండు కనుబొమ్మలు పైకి లేపి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
కార్తీక్‌కు మోనిత వార్నింగ్, 10 రోజులు డెడ్‌లైన్.. లేదంటే నీ ఫ్యామిలీ..
కార్తీకదీపం జూన్ 14: కార్తీక్ దీపతో మాట్లాడుతూ తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దీప మాత్రం కార్తీక్ వంక కోపంగా చూస్తుంటే అలా చూడకు దీప.. ఆ చూపులు తట్టుకోలేను అంటాడు. అదంతా చాటుగా హిమ, శౌర్యలు వింటారు. కానీ దీప మాత్రం కరగదు. సీరియస్‌గా ఒకటి అడుగుతా చేస్తారా? అని అంటుంది. అదేంటో.. దీప కార్తీక్ మాటలకు కరిగిపోతుందా? లేదా! అనేది నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ‘నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు.’ అంటాడు దీప కళ్లల్లోకి చూస్తూ. ‘నువ్వు, పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఏదీ ముఖ్యం కాదు దీపా.. నాకు నువ్వు కావాలి పిల్లలు కావాలి. అంతకంటే ఏమీ వద్దు దీప.. ’ అనే కార్తీక్ మాటలు విని పిల్లలు సంతోషిస్తుంటే.. దీప మాత్రం అవునా అన్నట్లు వెటకారంగా చూస్తుంది. ‘నా మాటల నమ్మనట్టుగా అలా చూడకు దీపా.. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపా.. నేను భరించలేకపోతున్నాను.. ఏదో ఒకటి మాట్లాడు.. ప్లీజ్’ అంటాడు కార్తీక్. కార్తీక్ తను ఏ తప్పు చేయలేదు నమ్ము దీప అని ప్రాధేయపడ్డ కూడా దీప కరగదు. దీంతో కార్తీక్ ‘నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం తిట్టు దీపా.. మనసులోని ఉన్న కోపాన్ని మాటల ద్వారా చూపించి నీ కసి తీర్చుకో’ అంటాడు. దీంతో దీప ఒక మాట అడుగుతాను చేసిపెడతారా? అని అడుగుతుంది. దీంతో కార్తీక్ సంబరపడిపోతూ నువ్వు నోరు తెరిచి అడిగావ్ అది చాలు నాకు.. నువ్వు ఏం అడిగిన సరే అది చేసి పెడతాను.. చెప్పు ఏం చెయ్యమంటావు ఈ దేశాన్నే వదిలి విదేశాలకు వెళ్లిపోదామా? అని అంటాడు. ‘నీకు ఏ దేశమంటే ఇష్టమో చెప్పు పిల్లలని తీసుకుని అక్కడే సెటిలైయిపోదాం.. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోదాం. మనమిద్దరం మనకిద్దరు అన్నట్లు బతుకుదాం’ అంటాడు. దానికి దీప అప్పుడు మోనితకి అన్యాయం చేసినట్లు అవుతుందిగా.. నేను మన సంగతి మాట్లాడటం లేదు.. మాట్లాడను కూడా అంటూ సరోజక్క మరిది లక్ష్మణ్ విషయం అడుగుతుంది. మీ చెయ్యి మీ మనసు మంచిదని నమ్ముతున్నాడు అంటుంది. ఆ నమ్మకాన్ని పోనివ్వకూడదని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నమ్మకాన్ని నిలబెడతారా? మిమ్మల్ని దేవుడు అన్నాడు. వైద్యం చేస్తారా? అతడిని మీ దగ్గరకు పంపించమంటారా? అంటుంది దీప. దీంతో కార్తీక నిరాశగా లేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సౌందర్య, ఆదిత్య, శ్రావ్యలు కార్తీక్ పిల్లల్ని తీసుకుని తీసుకొస్తాడని నిద్రపోకుండా ఎదురు చూస్తుంటారు. ఆదిత్య కార్తీక్ చేసిన తప్పు గురించి ఎత్తడంతో సౌందర్య కార్తీక్ వైపే మాట్లాడుతుంది. దీంతో ఆదిత్య నేను తప్పుగా అన్నానా మమ్మీ, అన్నయ్య తప్పు చేయలేదంటావా? అని ప్రశ్నించగా సౌందర్య ‘నేను తప్పు కాదు అనడం లేదురా వాడు తిరగబడి నా ఇష్టం అనట్లేదుగా. చేసిన తప్పుకు పశ్చాతాప పుడుతున్నాడు, సిగ్గుతో తలవంచుకుంటున్నాడు. అందుకే వాడంటే జాలి కలుగుతోంది’ అంటుంది బాధగా. కార్తీక్ నిద్రపోతున్న హిమ, శౌర్యను లేపి ఎక్కడ ఉంటారని అడగ్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అని సమాధానం ఇస్తారు. దీంతో నేను వెళ్లి మీ బట్టలు తెస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఇక తెల్లారి హిమకు ఏదో వాసన రావడంతో మెలుక వస్తుంది. కిచెన్‌లోకి వెళ్లి చూడగా పాలన్నీ పొంగి కింద వరకూ ఒలిగిపోతాయి. అది చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తుంది హిమ. దీప బాధగా బయట కూర్చుని ఉండటం చూసి దగ్గరికి వెళ్లి ‘అమ్మా నీకు ఏమైంది. నాన్న మీద ఎందుకు కోపం’ అని అడుగుతుంది. తరువాయి భాగంలో.. మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా పదోరోజులోగా నాకు సరైన సమాధానం, నాకు న్యాయం జరిగే నిర్ణయం రాకపోతే.. మొత్తం నీ ఫ్యామిలీ గడగడా వణికిపోయేలా చేస్తాను బీ రేడి అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. -
హిమ తర్వాత అంతగా నేను ప్రేమించింది నిన్నే దీప: కార్తీక్
కార్తీకదీపం జూన్ 12: అమ్మని మళ్లీ తిట్టి పంపేశావా డాడీ, అమ్మ అంటే నీకు జాలి లేదా?’ అంటూ ఎమోషనల్‌గా ప్రశ్నిస్తుంటారు పిల్లలు. దీంతో నాతో రండీ అని పిల్లల్ని తీసుకుని దీప ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. ఇక మోనిత తన ఫోన్లో పిల్లల ఫొటోలు చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి పాలు తీసుకుని రావస్తుంది. అవి తాగుతూ.. ‘కడుపుతో ఉన్నాను కదా కాస్త కారం, ఉప్పు, మసాలాలు తగ్గించు’ అంటుంది. సరేనమ్మ అన్న ప్రియమణి అనుమానంగా ‘మీరు నిజంగానే కడుపుతో ఉన్నారా? లేక నాటకం ఆడుతున్నారా’ అనడంతో మోనిత ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ‘ఏం మాట్లాడుతున్నావే. ఈ విషయంలో నేనేందుకు అబద్దం ఆడతాను, నేను కడుపుతో ఉన్నాననేది నిజం.. నా ఈ కడుపుకి మీ కార్తీక్ అయ్యే కారణం అన్నది ఇంకా పచ్చినిజం’ అటూ ఆవేశ పడుతుంది మోనిత. మరోవైపు దీప పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండగా హిమ, శౌర్య అమ్మా.. అంటూ వచ్చి ఆనందంగా పట్టుకుంటారు. వెంటనే గుమ్మం దగ్గరే ఆగిపోయిన కార్తీక్‌ని చూసి ‘పిల్లలు రాగానే నన్ను అడిగి ఉంటారు.. నా దగ్గర వదిలపెట్టడానికి తీసుకొచ్చి ఉంటారు’ అని మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి మళ్లీ ఎందుకచ్చావమ్మా నాన్న నిన్ను ఏమైనా అన్నాడా? అని పిల్లలు అడగ్గా దీప నాకెందుకో అంతపెద్ద ఇంట్లో కంఫర్ట్‌గా ఉండటం లేదని సమాధానం ఇస్తుంది. వెంటనే హిమ బాధగా.. ‘మరి డాడీకి ఇక్కడ కంఫర్ట్‌గా ఉండరు కదమ్మా’ అని అనగానే దీప కోపంగా కార్తీక్‌వైపు కళ్లు తిప్పి ‘ఆయనకి ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే.. అక్కడుండొచ్చు’ అంటుంది. దీంతో కార్తీక్ వెంటనే మీ అందరితో కలిసి తను ఇక్కడే ఉంటానని అంటాడు. ఆ తర్వాత కార్తీక్‌తో దీపతో కాస్తా మాట్లాడాలని చెప్పి పిల్లలను పడుకొమ్మంటాడు. అయితే కార్తీక్ భోజనం చేశావా? అని అడగ్గానే తిన్నాని అబద్ధం చెబుతుంది దిప. ఇదిలా ఉండగా మోనితకు తను పురిటినొప్పులతో చనిపోయినట్లు పిడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఇలాంటి పీడకల వచ్చిందేంటని కంగారు పడుతుంది. అన్నట్టు చనిపోయినట్లు కలొస్తే మంచి జరుగుతుంది అంటారు కదా.. నాకూ మంచే జరుగుతుంది. అయినా నేను అంత త్వరగా ఎందుకు చస్తాను.. నా కార్తీక్‌తో సంతోషంగా ఉంటాను అనుకుంటూ పడిపడి నవ్వుకుంటుంది. వెంటనే కార్తీక్ వంటగదిలోకి వెళ్లి గిన్నెలో అన్నం ఉండటం చూసి దీప తినలేదని తెలుసుకుంటాడు. దీపతో మాట్లాడాలని హాల్‌కు తీసుకుని వస్తాడు కార్తీక్. అన్నం పెట్టుకుని కలుపుతూ దీపను తినమన్నట్లు ముద్ద పెడతాడు. కానీ ఆమె సీరియస్‌గా చూసేసరికి చేయి తీసుకుని దీప చేతిలో అన్నం ముద్ద పెడతాడు. ప్లీజ్ తిను దీప అని చెప్పడంతో ఆమె తింటుంది. కార్తీక్ అన్నం కలుపుతూ ‘నేను నటించడం లేదు దీపా.. నా కసలు నటించడం చేతకాదు.. మనసుకి అనిపించింది పైకి అనేస్తాను.. లోలోపల ఏది దాచుకోను. కార్తీక్ అంటే కచ్చితం.. కార్తీక్ అంటే స్పష్టత’ అని తన క్యారెక్టర్ ఏంటో దీపకు చెప్పాలనుకుంటాడు. ఇక కార్తీక్ కాలేజీ రోజుల్లో హిమను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానని, ఆ తర్వాత అంతగా ప్రేమించింది నిన్నే దీప అని చెబుతాడు. ‘హిమ చనిపోయాక కొన్నాళ్లు పిచ్చొడిని ఆయ్యాను, జీవితంలో ఇక పెళ్లి అనే మాటే లేదు అనుకున్నాను నిన్ను చూసేదాక.. నీ ఆత్మ సౌందర్య నాకు నచ్చి.. హిమ తర్వాత నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్నే. నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించదని తెలిసినా నీ మెడలో తాళి కట్టాను.. నెమ్మదిగా కన్విన్స్ చెయ్యొచ్చు అనుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు’ అంటూ దీప కళ్లలోకే చూస్తూ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
దీప ఇంట్లో లేదని కనిపెట్టిన శౌర్య, కార్తీక్‌ను నిలదీసిన హిమ..
కార్తీకదీపం జూన్ 11: హిమ, శౌర్యలు ఇంటికి తిరిగి వస్తారు. వారిని చూసి అంతా షాక్‌లో ఉండిపోతారు. అది గమనించిన పిల్లలు మీలో మేము వచ్చి ఆనందంగా కనిపించకపోగా అప్పుడే ఎందుకొచ్చారా? అన్నట్టు చూస్తున్నారని ప్రశ్నిస్తారు. కాసేపటికి అమ్మ కనిపించడం లేదని అడగ్గానే అందరు ఒకరి మొహలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(జూన్ 11వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడగ్గానే అందరు కంగుతింటారు. ఆ తర్వాత సౌందర్య ముందు ఫ్రెష్ అయ్యి రండి అనడంతో శ్రావ్య బ్యాగ్స్ తీసుకుని పిల్లల్ని పైకి తీసుకుని వెళుతుంది. హిమ మాత్రం కార్తీక్‌నే గమనిస్తూ వెనక్కి వచ్చి ఏం అయ్యింది డాడీ బాగా డల్‌గా కనిపిస్తున్నావని అడగ్గా.. ‘మీ మీద బెంగ పెట్టుకున్నాడే.. ప్రశ్నలు ఆపి వెళ్లు’ అని సౌందర్య పంపిస్తుంది. దీంతో కార్తీక్ కాస్త రిలాక్స్ అవుతాడు. మురళీ కృష్ణ దీప ఇంటి నుంచి తిరిగి వచ్చి అన్ని మర్చిపోయి కార్తీక్‌తో ఉండమని, కాపురం చక్కదిద్దుకొమ్మని చెబుతామనుకుంటే అసలు ఆ విషయమే నాతో చెప్పనివ్వలేదంటూ సలహాలు ఏం ఇవ్వద్దు నాన్నా తినేసి వెళ్లు అందని భాగ్యంతో చెబుతూ బాధపడతాడు. దాంతో భాగ్యం ఆ మోనిత అనుకున్నది మాత్రం సాధించింది అంటూ తిట్టిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత ఇంట్లో వాంతులు (వేగుళ్లు) చేసుకుంటుంది. ప్రియమణి చెవులు మూసి సాయం చేస్తుంది. ఆ తర్వాత మీది ఎవరి పోలిక అమ్మాని మోనితని అడుగుతుంది. మోనిత.. నవ్వుతూ ‘ఈ ప్రపంచంలో నాకు ఎవరితో పోలికే లేదే. నేనో స్పెషల్ అంతే.. కాకపోతే ఇంకా ఆరో నెలల్లో నా పోలికలతోనే మరో ప్రాణి ఈ భూమ్మిద పడదుతుంది’ అంటు మురిసిపోతుంది. దీప సరోజక్క మరిది లక్ష్మణ్ గురించి అతడి రిక్వస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో సరోజక్క వచ్చి ఆమె మరిది లక్ష్మణ్ వచ్చిన విషయం గరించి అడుగుతుంది. ‘అది నువ్వేమీ పట్టించుకోకు దీప, డక్టర్ బాబు, నువ్వు బాగుంటే ఇక్కడకి నువ్వేందుకు వస్తావు. అది కూడా ఆలోచన లేని అమాయకుడు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నువ్వు డాక్టర్ బాబుతో ఏం చెబుతావు? పక్క మనిషి గురించి పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో.. అన్నింటికీ సిద్ధపడే ఉండాలి. అందరితో పాటే ఇతడు కూడా భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే.. బతుకుతాడు. లేదంటే లేదు. పాపం మా చెల్లెల్ని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. సరేలే నువ్వేం ఆలోచించకు. వస్తాను దీపా’ అంటూ వెళ్లిపోతుంది. ఇక సరోజక్క వెళ్లగానే దీప లక్ష్మణ్‌కి వైద్యం చేయించమని డాక్టర్ బాబుతో చెప్పాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో.. ఈ టైమ్‌లో ఈ గోలంతా ఏంటీ అంటారా? అంటూ ఆలస్యం చేయకుండా లక్ష్మణ్ విషయం ఎలగైనా ఆయనకు చెప్పాలని మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా శౌర్య తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప గదికి వెళ్లి ఆమె బ్యాగు, కబోర్డ్‌లో బట్టలు చూస్తుంది. అవి ఉండకపోయేసరికి అమ్మ ఇంట్లోంచి మళ్లీ వెళ్లిపోయింది అని తెలిసి ఏడుస్తుంది. అసలు ఎందుకు వెళ్లిందని, నాన్న ఏమైనా అన్నాడా? నాన్న తిట్టి అమ్మను పంపిచాడా? అసలు ఎక్కడ ఉన్నావమ్మా అంటు కుమిలి కుమిలి ఏడుస్తుంది. వెంటనే కార్తీక్‌ని నిలదీయడానికి వెళుతుంది. సరిగ్గా అప్పుడే హిమ తల్లి గురించి కార్తీక్‌ని, సౌందర్యని నిలదీస్తుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన శౌర్య ‘లేదు హిమా.. అమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది’ అంటుంది. ఆ తర్వాత శౌర్య, హిమలు ఏడుస్తూ అమ్మ ఎక్కడికి వెళ్లిందని, నువ్వే పంపించావా నాన్న? అంటు రకరకాల ప్రశ్నలు వేస్తూ కార్తీక్‌ను నిలదీస్తారు. ఏం సమాధానం చెప్పలేక కార్తీక్ తల దించుకుంటాడు. -
కార్తీక్‌ని మాటలతో చంపేసిన సౌందర్య, చివరికి ట్విస్ట్ ఏంటంటే..
కార్తీకదీపం జూన్ 10: దీపను ఇంటికి తీసుకువద్దామని వెళ్లిన కార్తీక్‌కు నిరాశ ఎదురైంది. కార్తీక్ మాట్లాడుతున్న పట్టించుకోనట్లుగా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ కార్తీక్ తప్పు చేశాడన్న విషయాన్ని నమ్ముతున్నట్లు చెప్పకనే చెబుతుంది. దీంతో కార్తీక్ బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వస్తాడు. మరోవైపు మోనిత వీడియో మెసెజ్ పంపి బుల్లి కార్తీక్ పుడతాడంటు మురిసిపోతుంది. కార్తీక్ తన తప్పుకు కుమిలిపోతు బాధతో మేడపైకి వెళ్లగా అప్పటికే సౌందర్య అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మేడపైకి వెళ్లగా అక్కడ సౌందర్యను చూసి తలదించుకుని వెనక్కి తిరుగుతాడు. కొడుకుని చూసి సౌందర్య పెద్దోడా.. ఇలా రా అని పిలిసి ‘నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు.. నా కొడుకు యోగ్యుడు, శ్రీరామచంద్రమూర్తి అని మురిసిపోయేదాన్ని. నీ దగ్గర నుంచి ఇది ఊహించలేదురా’ అంటుంది సౌందర్య బాధగా. దీంతో కార్తీక్ తను కూడా ఇది ఊహించలేదు మమ్మీ అంటూ ధీనంగా మొహం పెడతాడు. సౌందర్య ప్రతి ఒక్కరిలోనూ దైవత్యమూ ఉంటుంది రాక్షత్వమూ ఉంటుంది. కానీ బలహీనక్షణాల్లో కూడా లోపలి రాక్షసుడ్ని బయటికి రానివ్వని వాడినే సంస్కారవంతుడు అంటు కార్తీక్‌తో నా కొడుకు సంస్కారవంతుడు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఒక మామూలు మగాడివే అని నిరూపించుకున్నావు అంటుంది. అంతేగాక నీలో అనుమానం తప్ప ఇంకేలోపం లేదని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దీప గర్వంగా తల ఎత్తుకుంది, నువ్వు తలదించుకుని పాతాళానికి దిగజారవు అంటు మట్లాడుతుంది సౌందర్య. అలాగే మీ నాన్నగారు ఫోన్ చేసి పిలలు ఇంటికి వెళ్లిపోదామంటు గోల చేస్తున్నారని చెప్పారు, ఇవాళ రేపో వాళ్లు వస్తే అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం ఇస్తావని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు దీప ఏ తప్పు చేసిందని నిందించావో, దూరం పెట్టావో అదే తప్పు నువ్వు చేశావని పిలలతో చెప్పగలవా? ఈ సారి కాలుష్యం నావైపు వీచింది అని చెబుతావా? ఏం చెప్పాలో తెలియక తప్పు వాళ్ల అమ్మ మీదకు మాత్రం నెట్టకురా.. ఆడవాళ్లంటే నీకు లోకువ కదా.. మగబుద్ధి చూపిస్తావేమోనని చెబుతున్నాను అంటు మాటలతో కార్తీక్‌ను బాధపెడుతుంది సౌందర్య. ఒకవేళ పిల్లలను తీసుకురాకని మీ నాన్నతో చెబితే ఆయన ఎందుకని అడిగితే ఏం చెప్పాలి, మళ్లీ మీరు తాత కాబోతున్నారని నువ్వు చేసిన ఘనకార్యం చెప్పమంటావా? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్ వెంటనే సౌందర్య చేతులు పట్టుకుంటాడు. సౌందర్య ‘భయపడకు కార్తీక్.. చెప్పనులే.. అంతటి శుభవార్త విని ఆయనకు ఏదైనా అయితే భరించాల్సింది నేనే కదా.. నాకంత ధైర్యం లేదు కార్తీక్’ అంటూ సౌందర్య ఏడుస్తుంటే కార్తీక్ కూడా ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.కార్తీక్ తన పాపానికి ప్రాయిశ్చిత్తం లేదని, ఒక పవిత్రమూర్తిని ఏ విషయంలో క్షోభపెట్టానో వాస్తవానికి ఆ నేరం తాను చేసినందుకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తోందంటు ప్రశ్చాతాప పడతాడు. ఈ నరకం అనుభవించే కంటే ఒక్కసారిగా ప్రాణం పోతే బాగుంటుందనిపిస్తోంది మమ్మీ.. నన్ను చంపెయ్ మమ్మీ అంటాడు కార్తీక్. కానీ ఒక్కటి మాత్రం నిజం మమ్మీ.. ఇది ఏదో పొరపాటువల్ల జరిగింది కానీ దీప మీద ప్రేమ లేకో.. మోనిత మీద మోజుతోనూ కాదు నన్ను నమ్ము మమ్మీ.. కోడలు తప్పు చేసిందంటేనే నమ్మని దానివి.. కొడుకు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేశాడంటే నమ్ముతున్నావా అని ధీనంగా అడిగే సరికి సౌందర్య మనసు కాస్త కరుగుతుంది. ‘నువ్వు కావాలని ఈ తప్పు చెయ్యలేనది నేను నమ్ముతాన.. కానీ అది అక్కడ అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుకుని ఉందిరా.. బలహీన క్షణంలో నిన్ను రెచ్చగొట్టి ఉండొచ్చు.. కానీ తప్పు తప్పే కదా కార్తీక్.. ఏదో చిన్న తప్పు అని చెరుపేసుకోలేం కాదుకదా.. ఆ మోనిత మంచిది కాదురా కాపురంలో నిప్పులు పోసే ఆడదిరా అలాంటి వారికి దూరంగా ఉండరా ఎంతటి నీచానికైనా దిగజారుతుందిరా అని నేను నీ భార్య చిలక్కి చెప్పినట్లు చెప్పాం. కానీ నువ్వు పెడచెవిన పెట్టావు. చివరికి ఫలితం అనుభవిస్తున్నావు’ అంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా దీప సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. గతంలో డాక్టర్ బాబు తన వైద్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తాడు. మళ్లీ తనకు కాస్త నీరసం పెరిగిందని, కార్తీక్ దగ్గర వైద్యం ఇప్పించాలని కోరతాడు. దీంతో తనకు కొంచం టైం కావాలంటుంది దీప. సరేనంటు అతడు వెళ్లిపోతాడు. కార్తీక్, సౌందర్య భోజనం చేస్తుంటే సడెన్‌గా శౌర్య, హిమలు వస్తారు. వారిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో పిల్లలు మేము ఎందుకు వచ్చామా అన్నట్లు చూస్తున్నారెంటి, మేము ఇంతా ఆనందంగా ఉంటే అంటు ప్రశ్నిస్తారు. దీంతో సౌందర్య వాళ్లకు ఏదో చెప్పి నచ్చజెబుతుంది. ఆ తర్వాత అమ్మ ఏది అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
బుల్లి కార్తీక్ పుడతాడంటూ.. కార్తీక్‌కు మోనితా వీడియో మెసెజ్
కార్తీకదీపం జూన్ 9: దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి దీప ఇంట్లో లేదని తెలుసుకున్న సౌందర్య, ఆదిత్యలతో మీరు ఆపలేదా? అని అడగ్గా ఏందుకు ఉండాలి ఇక్కడ? అని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీంతో అసలేం జరిగిందో కార్తీక్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సౌందర్య వినిపించుకోకుండా... ఇది నాకు కాదు నీ భార్యకు, నీ వల్ల గర్భవతి అయిన ఆ మోనితకు అంటుంది. ఇక కార్తీక్ దీపను తీసుకురావడానికి శ్రీరాంనగర్ బస్తీకి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(మంగళవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. దీప శ్రీరామ్ నగర్ బస్తీలో ఇంటి ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటే వారణాసి ఇళ్లంతా కడుగుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వారణాసితో మీ అక్క నాతో ఇంటికి వస్తుందని చెబుతాడు. దీంతో దీప వెంటనే వద్దులే డాక్టర్ బాబు ఎవరు ఎక్కడుండాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు.. మీరు నేను కాదు అంటుంది. కార్తీక్ ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. దీప మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ‘అసలు నీ మనసులో ఏం ఉంది దీపా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అంటు వివరిస్తుంటాడు. కానీ దీప వినదు. కుర్చీ వెయ్యనా.. భోజనం చేశారా? అంటూ పొంతన లేని సమాధానాలిస్తూ, ఆ విషయం అనవసరం అన్నట్టు ప్రవర్తిస్తుంది. అయినా కార్తీక్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే వారణాసిని అడ్డు పెట్టుకుని ‘ఇక చాలు వారణాసీ.. ఎంతసేపు కడుగుతావు.. వదిలెయ్’ అంటు కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. దీంతో కార్తీక్ తనని అర్థం చేసుకునే అవకాశమే లేదని అర్థమైందని తలదించుకుంటాడు. ‘నన్ను క్షమించే ప్రసక్తే లేదని క్లియర్‌గా తెలుస్తోంది.. నీకంటే నేనే దురదృష్టవంతుడ్ని దీపా.. నీకంటే ఎక్కువగా నేనే నష్టపోయాను’ అంటు పశ్చాత్తాపపడతాడు కార్తీక్. అయినా దీప తన తీరు మార్చుకోకుండా ‘మంచి నీళ్లు కూడా తేవాలి వారణాసీ’ అంటుంది. సీన్ వారణాసికి కూడా అర్థమై బాధగా, మౌనంగా చూస్తాడు. ఇక కార్తీక్ వెళ్లొస్తాను అని ముందుకు కదలడంతో భోజనం చెయ్యరా? అని అడుగుతుంది దీప. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కార్తీక్ అనగా.. ‘ఈ ఇంట్లో అయినా..ఆ ఇంట్లో అయినా.. మరింకెక్కడైనా భోజనం మాత్రం మానకండి’ అని దీప సమాధానమిస్తుంది. కార్తీక్ తప్పు చేశాడని తాను కూడా నమ్మతున్నట్లు చెప్పకనే చెబుతుంది దీప. మురళీ కృష్ణ దీప గురించి బాధపడుతుంటే.. భాగ్యం వచ్చి దీప జీవితం నిలబడే మార్గం ఒకటుందయ్యా అంటూ.. ‘అల్లుడు తప్పు చేశాడని దీప తనతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు.. ఆ మాటకొస్తే నీ మొదటి పెళ్లాం చచ్చిపోతే నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదా? నేను నీతో కాపురం చెయ్యట్లేదా? ఇదీ అంతేనయ్యా.. కాకపోతే దీప ఉండగానే మోనితకి కడుపు చేశాడు.. ఇప్పుడు గొడవలకు పోయి జీవితం నాశనం చేసుకోవడం కంటే.. రాజీ పడి కలిపోవడం మేలు.. లేదంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. కొంచెం ఆలోచించయ్యా’ అని సలహా ఇస్తుంది భాగ్యం. అది విని మురళీ కృష్ణ నిజమే అంటూ ఆలోచనలో పడతాడు. కార్తీక్ తన రూమ్‌లో జరిగిందంతా తలుచుకుని కుమిలిపోతూ.. ఆ రోజు రాత్రి మోనిత ఇంట్లో డ్రింక్ చేసిన సీన్ గుర్తు చేసుకుని.. అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటాడు. ‘బుద్ది లేదా రా నీకు.. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక ఆడపిల్ల ఇంట్లో డ్రింక్ చెయ్యడమేంట్రా.. ముందు కొడితే.. సంస్కారం ఏం అయిపోయింది.. మమ్మీ ఎప్పుడూ అంటుంది నువ్వు స్టుపిడ్ అని.. నిజంగానే నేను స్టుపిడ్‌ని..’అని తిట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే మోనిత ఓ వీడియో మెసెజ్ పంపిస్తుంది. ఇంతలో మోనిత కార్తీక్‌కు వీడియో మెసేజ్ పంపిస్తుంది. ‘హాయ్ కార్తీక్.. ఎలా ఉన్నావ్.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడా? మగా? అని డౌట్ వచ్చింది. నేను గైనకాలజిస్ట్ కాబట్టి స్కాన్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అది నేరం.. అయినా డెలివరీ అయ్యేదాకా ఆగితేనే థ్రిల్ అంటుంది. ఇంతకీ నీకు ఎవరు కావాలి పాపా? బాబా? పాప వద్దులే.. ఆల్ రెడీ మనకు ఇద్దరున్నారు కదా.. మనకు బాబే కావాలి. దేవుడ్ని నేను అదే కోరుకుంటాను.. బుల్లి కార్తీక్‌ని ఇవ్వమని.. ఐ లవ్ దట్ ఫీలింగ్ బై' అంటుంది వీడియోలో. అది చూసి కార్తీక్ తలపట్టుకుని మరింత కుంగిపోతాడు. మోనిత మాత్రం సంబరపడిపోతూ ‘ఇదేంటి కార్తీక్ నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు..నన్ను దూరం పెడుతుతున్నాడా? అంటే కార్తీక్ కూడా కొంత మంది మగాళ్లలా అవసరం తీరాక వదిలెయ్యాలనుకుంటున్నాడా? అని ఓ సెకన్ కంగారుపడుతుంది. కానీ అంతలోనే నా కార్తీక్ అలా చేయడు. ఏదో కంగారులో ఉండి సమాధానం ఇవ్వలేదనుకుంటా’ అంటూ సరిపెట్టుకుంటుంది మోనిత. -
kathika Deepam: తప్పు చేశావంటు మోనితను నిలదీసిన కార్తీక్..
కార్తీకదీపం జూన్ 7: మోనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి వెళ్లిపోతుంది. మురళీ కృష్ణ దీపకు అన్యాయం జరిగిందనే బాధలో కార్తీక్‌ని కడిగిపాడేస్తాడు. ఆ తర్వాత దీపను వీళ్ల దగ్గర ఉండోద్దని, మన ఇంటికి పొదామని చేయి పట్టుకుంటాడు. మరీ దీప వెళుతుందా? కార్తీక్ మోనిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నాడో నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. మురళీ కృష్ణ వెళ్లిపోదాం పదమ్మా అని దీప చేయి పట్టుకోగానే ఆమె కార్తీక్, సౌందర్యల వంక చూస్తుంది. ఆ తర్వాత తండ్రి చేయిని విడిపించుకుని దండం పెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నట్లు చేయి చాచి చూపింది. దాంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్లగానే కార్తీక్, దీపల ఫొటో కనిపిస్తుంది. అది నేలపై విసిరికొట్టి కోపంతో రగిలిపోతుంటాడు. భాగ్యం ఏమైందిని అడగ్గా జరిగిన విషయం చెబుతాడు. దీనికి భాగ్యం కూడా ‘నువ్వు చేసిందే కరెక్ట్ అయ్యా.. నేను కూడా రావాల్సింది మోనితను, అల్లుడిని కలిపి కడిగిపారాశేదాన్ని’ అని కోపంగా అంటుంది. మరోవైపు కార్తీక్ మోనిత దగ్గరికి వెళతాడు. అక్కడ ‘తప్పు చేశావ్ మోనిత తాగిన మైకంలో నేను ఏదో తప్పు చేయబోతే కనీసం నువ్వైనా నా చెంపలు చెడామడా కొట్టి ఆపాల్సింది కదా. నువ్వు తప్పు చేసిందే కాక నాతో కూడా తప్పు చేయించావు’ అని అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో మోనిత ‘అదేంటి కార్తీక్ తప్పు అంతా నేను చేసినట్లు మాట్లాడుతున్నావు. నువ్వే కదా హిమను తీసుకువస్తే పెళ్లి చేసుకుంటా అన్నావ్, హిమ వచ్చింది. కానీ నువ్వు పెళ్లి ఊసే ఎత్తలేదు. పైగా వెత్తుక్కుంటు నువ్వే వెళ్లి నీ భార్య, పిల్లలని తెచ్చుకున్నావు’ అంటుంది. అంతేగాక అయినా ఆ రోజు నిన్ను వద్దంటు ఆపాను కానీ నువ్వు పెళ్లి చెసుకుంటానని చెప్పావు అని చెబుతుంది. అలాగే.. ‘పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తూ మరో మగాడికి నా మనసులో చోటు ఇవ్వలేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నాకు నువ్వు పెళ్లి చేసుకుంటా అనేసరికి ఉప్పోంగి పోయాను. అందుకే నిన్ను దూరం పెట్టలేక నన్ను నేను అర్పించుకున్నానంటూ కన్నీరు పెట్టుకుని దీపలా నన్ను వదిలేయకు కార్తీక్ నీకు దండం పెడతాను’ అంటూ కార్తీక్ కాళ్లపై పడుతుంది. కార్తీక్ అలానే షాక్‌లో చూస్తూ, భారంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదిలా ఉండగా.. దీప ఒంటరిగా కూర్చుని పూజ రోజు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటుంది. కార్తీక్ పెద్ద తప్పు చేశానని, సరిదిద్దుకోలేని నేరం చేశాను అంటు దీప కాళ్లు పట్టుకోబోయింది, మోనిత ప్రెగ్నెంట్ అనగానే షటప్ అంటు తిట్టు పంపిచింది అంతా తలచుకుంటుండగా అక్కడికి సౌందర్య వస్తుంది. కొడుకు చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడుస్తూ ఇన్నాళ్లు దీప పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంటుంది. వాడు నువ్వు ఏ తప్పు చేయాలేదని నిరూపించుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిపోయావు, గుడి దగ్గర ప్రసాదాలు తిని బతికావ్.. చివరకు నమ్మే సమయం వచ్చిన అది ఇంత నీచంగానా? వీడి వల్ల ఆ మోనిత కడుపు పండితే నీ సంతానం వాడి సంతానమని నమ్మడమా? ఏంటిది అంటూ దీప భుజంపై వాలి ఏడుస్తుంది. -
karthika Deepam: మోనితపై కార్తీక్ ఫైర్, నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది..
కార్తీకదీపం జూన్ 5: కార్తీక్ దీప కాళ్లు పట్టుకుని, నిజం చేప్పేలోపే మోనిత వచ్చి కథ అంతా మారుస్తుంది. తాను గర్భవతిని అని దీవించండి అంటూ సౌందర్యతో అంటుంది. అది విన్న వారంత ఒక్కసారిగా షాక్ అవుతారు. మరీ మోనిత చెప్పింది నమ్ముతారా! మరీ దీప ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నదనేది నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. నేను నెల తప్పాను ఆంటీ అని చెప్పగానే సౌందర్య కోపంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్’ అంటుంది ఆవేశంగా. ‘ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ..? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అంటుంది మోనిత. దాంతో అంతా షాక్ అవుతారు. వెంటనే కార్తీక్ కోపంగా ‘స్టాపిట్ మోనితా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇది జోక్ చేసే విషయమా? నీ గురించి అమ్మా దీపా ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ళ్లారా చూస్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలవని పేరంటంలా వచ్చేస్తావ్.. రసాబస చెయ్యాలని చూస్తావ్.. నువ్వు నా ఫ్రెండ్‌వా శత్రువ్వా.. ఎందుకింత దారణంగా మాట్లాడుతున్నావ్?’ అంటాడు ఆవేశంతో ఊగిపోతూ. వెంటనే మోనిత నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ అంటు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అందరిని నమ్మించేందుకు కార్తీక్ పురషాహంకారం చూపించుకుంటున్నావా ఆడదంటే అంత అలుసా? ప్రెగ్నెంట్ అని అబద్దం చెబుతున్నా అనుకుంటే అది దాస్తే దాగే విషయమా? అంటుంది. పోనీ నా ప్రెగ్నెన్సీకి నువ్వు కారణం కాదంటావా? రేపు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే అది కూడా బటయపడుతుంది కదా.. ఏ ఆడదైనా ఈ విషయంలో అబద్దం చెబుతుందా కార్తీక్.. ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారణం. నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్ కార్తీక్.. అది అబద్దం అని ఇవాళ నా వల్ల నిర్ధారణ అయ్యింది’ అంటుంది మోనిత. దీప బాధగా తలవంచి నిలబడగా.. మోనిత దీపని చూసి లోలోపల నవ్వుకుంటూ దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ‘నన్ను క్షమించు దీప కార్తీక్ నీ విషయంలో తప్పు జరిగిందని గట్టిగా నమ్మేసరికి.. ఒక ఫ్రెండ్‌గా అతడ్ని సపోర్ట్ చేశాను.. సాటి ఆడదానిగా నీకు అన్యాయం చేశాను.. నువ్వు కళంకితవు కాదు.. పరమ పవిత్రురాలు.. కార్తీక్ ఒక్క క్షణం కాదంటేనే నేను భరించలేకపోయాను. నువ్వు 10 ఏళ్ల పాటు ఈ నింద నువ్వు ఎలా తట్టుకున్నావో ఎలా మోశావో ఊహిచడం నావల్ల కాదు. నువ్వు చాలా గ్రేట్ దీపా హ్యాట్సాప్ టు యూ’ అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక సౌందర్య వైపు తిరుగుతుంది. ‘మీరు చాలా మంచివారు ఆంటీ.. కొడుకు మాట కూడా నమ్మకుండా కోడలికి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తిత్వం మీది.. నేను ఆడపిల్లనే నాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే ఆలోచించి మీ అబ్బాయికి చెప్పండి.. ఇంకా మీకు ఎవరికీ నమ్మకం కుదురకపోతే.. ఇదిగో నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్’ అని దేవుడు దగ్గర పెట్టి వెళ్లిపోతుంది. మోనిత వెళ్లిపోగానే మురళీ కృష్ణ పెద్దగా నవ్వుతూ.. ‘దీన్ని ఏం అంటారు? మోసమా? కుట్రనా నయవంచనా? ఇంత దారుణమా.. ఇంత నీచత్వమా? ఎలాగో నాకు పిల్లలు పుట్టరనే సాకుతో ఇలా ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటావా? ఇప్పుడు ఆవిడ వల్ల ఈ నిజం బయటపడింది.. బయటపడని బాగోతాలు ఎన్నో? ఇంకెంత మంది అభాగ్యులు ఉన్నారో మీ లిస్ట్‌లో? అంటూ కార్తీక్‌ని ప్రశ్నిస్తాడు. ‘మురళీ కృష్ణ గారు..’ అని అరుస్తాడు కార్తీక్. ‘ఆపవయ్యా.. ఆయనకి మూడ్ వస్తే మావయ్యా అంటాడు.. కోపమొస్తే మురళీ కృష్ణా అంటాడు.. మావయ్యా అంటే మురిసిపోవాలి.. నోరుమూసుకుని పోవాలంటే పోవాలి.. ఎందుకంటే దీనికి పెళ్లి ముందు నాకు పిల్లలు పుట్టరు.. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పండి అభ్యంతరం లేదంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇతడిలోని నిజాయితీకి మురిసిపోయాను’ అంటూ మురళీ కృష్ణ ఏడుస్తూ అంటుంటే కార్తీక్ తలదించుకుంటాడు. దీప బొమ్మలా నిలబడి ఉంటుంది. ‘ఎంతైనా మధ్యతరగతి వాడిని కదా.. పిల్లలు పుట్టకపోతే ఏంటిలే దత్తత తీసుకుంటారులే అనుకుని, నా కూతురు ఇంతటి వాడ్ని మిస్ అయిపోకూడదని.. ఆ విషయం నా కూతురుకి కూడా చెప్పకుండా పెళ్లి చేశాను.. వరమో శాపమో దీని కడుపు పండింది. అప్పటి నుంచి దీపను చేడిపోయావంటు కార్తీక్ అవమానించిన రోజులను గుర్తు చేస్తూ కార్తీక్‌పై అసహనం వ్యక్తం చేస్తాడు మురళీ కృష్ట. ఇక వెంటనే సౌందర్య వైపు తిరిగి.. ‘చెయ్యని తప్పుకుని ఇన్నేళ్లు నరకం చూపించిన నీ కొడుక్కి ఎలాంటి శిక్ష వేస్తావమ్మా.. నీ కొడుకు వల్ల జీవితమే నాశనం అయిన నా కూతురికి ఏం న్యాయం చేస్తావమ్మా? అని అడుగుతాడు. దీపతో నువ్వు నా కడుపున పుట్టడమే నీకు శాపం, అంతకన్నా ఏం లేదమ్మా.. పదమ్మా వీళ్లందరికీ దూరంగా వెళ్లిపోదాం అనడంతో దీప కార్తీక్ వైపు చూస్తుంది. ఆ తర్వాత దీప ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, నెక్ట్ మోనిత వేసే ప్లాన్ ఏంటో సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: దీప కాళ్లు పట్టుకున్న కార్తీక్, మోనిత ఎంట్రీ, షాక్‌లో సౌందర్య
కార్తీకదీపం జూన్ 4: పూజకు అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెబుతాడోనన్న టెన్షన్‌తో ఉంటుంది. కార్తీక్ దీపకు గిప్ట్ ఇవ్వాలని శ్రీశ్రీ పుస్తకాన్ని ప్యాక్ చేసి.. ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి పెట్టుకుంటాడు. అదే టైమ్‌కి మోనిత తన ఇంట్లో పూజకు వెళ్లడానికి బాగా రెడీ అవుతుంది. ప్రియమణీతో త్వరలోనే పప్పు అన్నం పెడతానంటు ఏవేవో కబుర్లు చెబుతుంది. ఇక పూజాలో దీపకు చెబుతాన్న విషయం కార్తీక్ చెప్పనున్నాడా? లేదా ఇలోపు మోనిత ఎలాంటి ట్వీస్ట్ ఇవ్వబోతోంది అనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య ఇంట్లో పూజకు అన్ని రేడి చేస్తారు. దీంతో పూజారి పూజకు టైం అవుతుంది అనడంతో అంతా కిందకి వస్తారు. కానీ కార్తీక్ మాత్రం కిందకు రాడు. దీంతో కార్తీక్ రాకపోవడంతో సౌందర్య ఆదిత్యను అన్నయ్య ఎక్కడ అని అడగడంతో ఇంకా గదిలోనే ఉన్నాడంటూ పైకి చూస్తుండా అప్పడే కార్తీక మెట్లు తిగుతూ వస్తాడు. వస్తూనే క్షమాపణలు ఎలా అడగాలో తెలియడం లేదంటు దీప దగ్గరికి వెళ్లతాడు. వెంటనే కార్తీక్‌కు తను దీపకోసం పెట్టిన గిఫ్ట్ గుర్తొచ్చి దీపకు ఇష్టమైన శ్రీశ్రీ పుస్తకం ఇచ్చి క్షమాపణలు కోరతాను అంటు వెళ్లి తెద్దామని వెనక్కి వెళ్లబోతాడు. దాంతో సౌందర్య ‘టైమ్ అవుతుందిరా.. దేవుడికి దన్నం పెట్టుకుని కూర్చోండి’ అంటుంది. వెంటనే కార్తీక్ వెనక్కి తిరిగి.. దీపవైపు చూస్తూ దేవుడికి కాదు మమ్మీ.. ముందు దేవతకు దండం పెట్టుకోవాలి అంటు దీప ముందు మోకాళ్లపై కూర్చుని తన కాళ్లకు దండం పెట్టబోతాడు కార్తీక్. పడ్డాడు. దీప వెనక్కి జరిగిపోతుంది కంగారుగా. అంతా షాక్‌లో ఉంటారు. తెలియకుండా నవ్వుముఖాలుగా ఉంటాయి ఆదిత్య, శ్రావ్య, దీప తండ్రి, సౌందర్య అంతా ఆనందంతో ముఖాలు వెలిగిపోతాయి. ‘నేను చేసిన తప్పుకు శిక్ష ఏ కోర్టులోనూ ఏ జడ్జ్ వెయ్యలేడు..బయటికి కనిపించని చెప్పుకోలేని నేరం చేశాను.. మాటలతో గుండెల్లో పొడిచి పొడిచి చిత్రవథ చేశాను. అందరినీ క్షోభ పెట్టి జీవితాలతో ఆడుకున్నాను.. నేను చేసిన అపరాధం హత్యానేరం కన్నా పెద్దది. దానికి ఉరిశిక్షవేశానా సరిపోదు.. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప’ అని కార్తీక్ క్షమాపణలు చెప్పడంతో దీప ఎంటో అర్థం కానట్లు అయోమయంలో ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత సడెన్ ఎంట్రీ ఇస్తుంది. రాగానే ‘అంత తప్పు నువ్వేం చేశావ్?’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ షాక్‌తో వెనక్కి తిరిగి చూస్తు దీప పక్కన నిలబడతాడు. ‘చెప్పు కార్తీక్ అంత పెద్ద తప్పు ఏం చేశావ్? తప్పు తెలుసుకున్నావ్.. సరిదిద్దుకుంటావ్.. ఇన్నాళ్లు నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్.. రిపోర్ట్స్ అలా వచ్చాయ్.. అందుకు నువ్వేం చేస్తావ్? ఎవరిదో రిపోర్ట్ నీవనుకుని ల్యాబ్ టెక్నీషియన్ మార్చేస్తే. నువ్వేం చేస్తావ్? అది మానవ తప్పిదం.. అందులో నిన్ను తప్పు బట్టడానికి ఏం లేదు’ అంటుంది మోనిత. మోనిత మాటలకు అంతా బిత్తరపోతారు. వెంటనే మోనితే మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఇవాలే తేలింది.. 100 పర్సెంట్ నీకు ఆ అర్హత ఉంది.. ఇది సంతోషించాల్సిన విషయమే కాదా? దీనికి క్షమాపణలు కోరుకోవడం దేనికి? నీకు పిల్లలు పుడతారు కార్తీక్.. హిమ, సౌర్య నీ కన్నబిడ్డలు. నీ సంతానమే’ అంటుంది నవ్వుతూ. ‘మోనితా నువ్వేం మాట్లాడుతున్నావ్?’అంటాడు కార్తీక్ అయోమయంగా. ‘శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్.. అసలు అందరికీ ఈ విషయం స్వీట్స్ తినిపించి చెప్పాలనుకున్నాను.. కానీ పట్టరాని ఆనందంలో ఈ వార్త అందరికీ అందజెయ్యాలనే కంగారులో స్వీట్స్ తీసుకుని రావడం మరిచిపోయాను. పోనీలెండీ.. ఇక్కడ అక్షింతలు ఉన్నాయిగా.. అవి నా నెత్తిన వేసి నన్ను ఆశీర్వదించండి ఆంటీ’ అంటూ సౌందర్య కాళ్ల మీద పడుతుంది మోనిత. అంతా షాక్‌లోనే ఉండిపోతారు. సౌందర్య అయోమయంగా.. ‘వాడికి పిల్లలు పుడతారని నువ్వు చెప్పడమేంటీ? నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటీ? నాకేం అర్థం కావట్లేదు’ అంటుంది. వెంటనే పైకి లేచిన మోనిత.. నవ్వుతూ.. ‘నేను నెల తప్పాను ఆంటీ.. ఎస్ అయామ్ ప్రెగ్నెంట్.. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది..’ అంటుంది. వెంటనే సౌందర్య ఆవేశంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్..’ అని అరుస్తుంది. ‘ఇంతచెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అని చెప్పడంతో అందరి మొహాలు తెల్లబోతాయి. ఇక ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: దీపకు కార్తీక్ ప్రత్యేక బహుమతి, ఇంతలో ఫోన్ రింగ్..
కార్తీకదీపం జూ 2: కార్తీక్ రేపు ఏం చెప్పబోతున్నాడో తెలియక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటు కంగారు పడిపోతుంటుంది దీప. ఇంతలో సౌందర్య వచ్చి ధైర్యం చెప్పి కార్తీక్ కాసేపు మాట్లాడమంటు గదిలోకి పంపిస్తుంది. ఆ సమయానికి కార్తీక్ కవితల పుస్తకం చూస్తు కనిపిస్తాడు. మరోవైపు కార్తీక్ చేసిన అవమానానికి మోనిత రగిలిపోతుంది. కార్తీక్ చేతి ఆ పుస్తకం చూసి దీప ఎల స్పందించనుంది, పగతో ఉన్న మోనిత ఏం చేయబోతుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. భాగ్యం ఇస్తీ చేసుకుంటూ దీప ఎందుకు ఫోటోను గోడకు పెట్టనివ్వాలేదు? డాక్టర్ బాబు చేసేది కూడా అలానే ఉంటుందిల.. దీప అనుమానం నిజమే అయ్యి ఉంటుందా? లేక డాక్టర్ బాబు మారిపోయి ఉంటాడా అని తనలో తనే మాట్లాడుకుంటుంది. మరోవైపు దీప కార్తీక్ గదికి వెళ్లేసరికి అతడు ఏదో ఆలోచిస్తు మందు తాగడం చూస్తుంది(కానీ కార్తీక్ దీపని అవమానించిన క్షణాలను తలుచుకుని కుమిలిలోతుంటాడు). అలా కార్తీక్‌ను చూసి తలుపు దగ్గరి నుంచే తిరిగి వెనక్కివచ్చేస్తుంది దీప. కింద సౌందర్య భర్త ఆనందరావుతో మాట్లాడుతుంటే దీప కిందికి రావడం గమనించి ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది అని అడగ్గా డాక్టర్ బాబు ఏదో టెన్షన్లో ఉన్నంటున్నాడు, మందు తాగుతున్నాడని చెబుతుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. వాడు తాగడం మానేశాడే.. మొన్నెప్పుడో తాగొస్తే.. మనసు బాలేదు అన్నాడు.. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా మోనిత పొద్దున్నే లేచి కాఫీ చేసి ప్రియమణిని లేపి తాగమని ఇస్తుంది. దీంతో షాక్ అయిన ప్రియమణి కోపం వస్తే కొట్టండి, తిట్టండి కానీ ఇలాంటివి చేయకండని అని అనడంతో.. భవిష్యత్తులో కార్తీక్‌కి పెట్టి ఇవ్వాలిగా.. ప్రాక్టీస్‌గా ఉంటుందని పెట్టాను చెబుతుంది. ఆ తర్వాత ఆ కాఫీ తాగి పైన ఉన్న తన చీర ఇస్తీ చేయి అంటు ‘నేను కార్తీక్ దగ్గరకు వెళ్లాలి.. త్వరగా చేసిపెట్టు అంటుంది. ప్రియమణి మనసులో.. ‘ఈమె హడావుడి చేస్తే దీపమ్మ కొంప ముచ్చేలానే ఉంది’ అనుకుంటుంది. ఇక అటు సౌందర్య ఇంట్లో పూజకు అన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భాగ్య కాలు జారిపడిందని, కాలు నెప్పి పెడ్డటంతో రాలేదని మురళీ కృష్ణ మాత్రమే వస్తాడు పూజకు. ఇక అటు దీప, ఇటు కార్తీక్‌లు వేరు వేరు రూమ్స్‌లో రెడీ అవుతూ ఉంటారు. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెప్పబోతున్నాడోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ పంచెకట్టుకుని. శ్రీ శ్రీ పుస్తకాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి.. దానిపై స్లిప్ అంటించి ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి.. మళ్లీ ఆ స్లిప్ చించి ‘దీపకు ప్రేమతో కార్తీక్’ అని రాసి మురిసిపోతుంటాడు. ఇంతలో కార్తీక్‌కు ఫోన్ రావడంతో ఆ గిఫ్ట్ బెడ్ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అయితే దీపకు శ్రీశ్రీ కవితలంటే పచ్చి. ఆ పిచ్చి కారణంగానే కార్తీక్ దీపను అవమానించేందుకు దారితీసింది. దీంతో అప్పటి నుంచి శ్రీశ్రీ కవితలు వింటేనే రగిలిపోయే కార్తీక్ అదే శ్రీశీ కవిత పుస్తకాన్ని దీపకు బహుమతి ఇచ్చి.. తనలోని అనుమానం నిజం కాదని చేప్పాలని అనుకుంటున్నాడు. అయితే ఆ ఫోన్ ఎవరి దగ్గరి నుంచి వచ్చింది. ఈలోపు మోనిత ఎంట్రి ఇచ్చి కార్తీక్ ప్లాన్ మొత్తం తారుమారు చేయనుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.