karuna nidhi
-
ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు టీవీకి ముద్దుపెట్టేవారు: కనిమొళి
దివంగత మహానటుడు శివాజీ గణేషన్ తొలి అభిమాని కలైంజ్ఞర్ కరుణానిధి అని డీఎంకే పార్టీ ఉప కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేర్కొన్నారు. కరుణానిధి శత జయంతి సందర్భంగా డీఎంకే పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ గణేషన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రాన్ని స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కరుణానిధి సంభాషణలు అందించడం గమనార్హం. కాగా ఈ చిత్ర ప్రదర్శనకు కనిమొళి, దయానిధి మారన్, పూచి మురుగన్ మొదలగు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ శివాజీ గణేషన్‌కు తొలి అభిమాని కలైంజ్ఞర్ అని చెప్పవచ్చును. శివాజీ గణేషన్ ఎలా నటిస్తున్నారో చూడు అంటూ ఇంటిలో టీవీ చూస్తూ వెళ్లి అమాంతం టీవీకి ముద్దుపెట్టే వారని చెప్పారు. అలాంటప్పుడు తన తల్లి కూడా పరిహాసం ఆడేవారని అయినా శివాజీ గణేషన్ నటన చూసి కరుణానిధి నిగ్రహించుకునేవారు కాదన్నారు. కథానాయకులకు బహు తెలివిని, మార్గదర్శకాన్ని చూపిన చిత్రం పరాశక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటికీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వారిగానే కథానాయికలు ఉన్నారని, అయితే అప్పటి హీరోయిన్ పాత్రలు ఆలోచింపచేసేవిగానూ, సామాజిక సందేశాన్ని ఇచ్చేవి గానూ ఉండేవని అభిప్రాయపడ్డారు. Kalaignar - Sivaji Ganesan’s #Parasakthi Special screening is happening now at Woodlands Theatre, Chennai. pic.twitter.com/pLJj5Vmcrm — Christopher Kanagaraj (@Chrissuccess) June 4, 2023 చదవండి: మహాభారత్ నటుడు కన్నుమూత -
భాషను శ్వాసించిన... కలం, గళం!
తమిళనాడుకు ఐదు విడతలు ముఖ్యమంత్రిగా ఉన్నా, జీవితాంతం మనసంతా సాహిత్యం చుట్టూ తిరుగుతూ ఉండటం ముత్తువేల్ కరుణానిధికే చెల్లింది. ద్రావిడ ఉద్యమంలో తొలి విద్యార్థి సంఘం నాయకుడై ఉద్యమంతో బాటే రచనకూ శ్రీకారం చుట్టారాయన. 13 ఏళ్ల వయసులోనే ‘సెల్వచంద్ర’ చారిత్రక నవల రాశారు. చదువు హైస్కూల్ స్థాయి దాటక పోయినా చారిత్రక నవలలు, జీవిత చరిత్రలు, కవితలు, కథలు, వ్యాసాలు, నాటకాలతో బాటు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడం ఆయన అద్భుతమైన రచనాశక్తికి నిదర్శనం. ఆలయాలలో, గ్రామ వేడుకల సమయంలో మేళం వాయించే ‘ఇసై వేళాళర్’ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవటానికి వెళ్ళిన ప్పుడు అక్కడి కుల వివక్ష ఆయన మీద బలమైన ముద్ర వేసింది. సంగీతం నేర్పేవారు చులకన భావం చూపటం సహించలేకపోయారు. తన అభ్యుదయ భావాలను వెల్లడించటానికి రచనల బాట పట్టారు. చారిత్రక చిత్రాలలో కట్టిపడేసే సంభాషణలు రాయటంలో, ప్రేక్షకులలో ఉద్వేగం నింపి ఆసక్తి పెంచే స్క్రీన్ ప్లే సిద్ధం చేయటంలో కరుణానిధి దిట్ట. తరువాతి కాలంలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిన ఎంజీ రామచంద్రన్ కథా నాయకుడిగా నటించిన మొదటి సినిమా ‘రాజకుమారి’ (1950)కి కథ, మాటలు సమకూర్చినవారు కరుణానిధి. శివాజీ గణేశన్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టి, సినిమా పరిశ్రమలో నెలబెట్టిన ఆయన మొదటి చిత్రం ‘పరాశక్తి’ (1952)లో శక్తిమంతమైన మాటలు రాసింది కూడా కరుణానిధి. దాదాపు 40 సినిమాలకు రాయటమే కాదు, ఆయన నవలలు కూడా సినిమాలుగా మారాయి. పెరియార్ నాయకత్వంలో హిందీ వ్యతిరేక ఆందోళన జరుగుతున్న రోజుల్లో కరుణానిధిలోని అసలైన నాయకుడు బైట పడ్డాడు. దాల్మియాపురం స్టేషన్ దగ్గర రైలుపట్టాల మీద పడుకొని ఆయన ఇచ్చిన నినాదం ‘ఉడల్ మన్నుక్కు... ఉయిర్ తమి ళుక్కు’ (దేహం మట్టికి, ప్రాణం తమిళా నికి) ఇప్పటికీ తమిళనాట ప్రతిధ్వనిస్తూనే ఉంది. 1965లో హిందీ ఉద్యమంలోనే శివలింగం అనే యువకుడు ఆత్మాహుతి చేసుకుంటూ రాసిన లేఖలోని ఇవే మాటలను... మణిరత్నం ‘ఇరువర్’ (1997– తెలుగులో ‘ఇద్దరు’గా రిలీజ్) సినిమాలో వైరముత్తు వాడటం, ఆ తరువాత అదే పేరుగా సాయి కుమార్, రంజిత జంటగా ఒక సినిమా రావటం... అలా అదే ఉద్విగ్నత తమిళ ప్రజల్లో కొనసాగుస్తూ వస్తోంది. 70 ఏళ్ళు గడిచినా, తమిళ ప్రసంగాలలో వినిపించే శక్తిమంతమైన నినాదమిది. అధికారంలో ఉన్నా, లేకపోయినా సాహితీ వ్యాసంగానికి ఆయన విరామం ఇవ్వలేదు. డీఎంకే ప్రచార పత్రిక ‘మురసొలి’ (తెలుగు అర్థం: శంఖారావం)లో ఆయన రాయని రోజంటూ లేదు. కథో, కవితో, వ్యాసమో లేదా కార్యకర్తలకు ఒక లేఖ అయినా రాయాల్సిందే. నాగపట్టణం జిల్లాలోని ఆయన సొంత ఊరు తిరుక్కువలైలో ఉన్న పూర్వీకుల ఇంటిని గ్రంథాలయం కోసం ఇచ్చారు. చెన్నైలోని పార్టీ కార్యాలయ భవనం అన్నా అరివాలయంలో మ్యూజియం, లైబ్రరీ ఆయన అభిరుచికి అద్దం పడతాయి. కరుణానిధి ప్రసంగాలు ఎంతో ఆకట్టుకుంటాయి. అడుగడుగునా మెరుపులు, విరుపులు ఆయన ప్రత్యేకం. ఒకసారి తమిళనాడు తెలుగు సంఘాలు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా సత్కరించి వాటి సమ స్యలు ఏకరవు పెట్టాయి. అందులో కొన్ని ప్రభుత్వం మీద ఆర్థిక భారం వేసేవి, ఇంకొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సినవి. తెలుగు సంఘాలు ఆయనను పొగడ్తలలో ముంచెత్తి ఆయన వరాల కోసం ఎదురుచూశాయి. కరుణా నిధి తన సత్కారానికి ధన్యవాదాలు చెబుతూ, ‘‘కరుణ ఎంత కావాలన్నా తీసుకోండి, నిధి మాత్రం అడక్కండి’’ అని తన మనసులో మాట చమత్కారంగా చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి ఆయన సెక్యూరిటీని వదిలేసి అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయారు.ఇంటలిజెన్స్ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. రాత్రి 10 గంటలకు అదృశ్యమైన ముఖ్యమంత్రి తెల్లవారు జామున నాలుగు గంటలకు ఇంటికి చేరారు. ఎక్కడికి వెళ్ళారన్నది రహస్యం. రెండు రోజుల తరువాత ఆయన ‘మురసొలి’లో రాసిన సుదీర్ఘ సాహిత్య వ్యాసం చదివిన తరువాతగానీ అసలు విషయం తెలియలేదు. ఆ ముందురోజు రాత్రి ఆయన వైరముత్తును వెంటబెట్టుకొని మహాబలిపురం రోడ్డులో సమద్రతీరానికి వెళ్ళి సాహిత్య చర్చలు జరిపారు. ఆ సంభాషణ సారాంశాన్ని ఆ వ్యాసంలో రాశారు. తమిళ భాష మీద కరుణానిధికి ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. తిరువళ్ళువర్ మీద అభిమానంతో ఆయన స్మారక చిహ్నంగా చెన్నై నగరం నడిబొడ్డున ‘వళ్ళువర్ కొట్టం’ నిర్మించారు. ప్రారంభానికి కొద్ది వారాల ముందు అకస్మాత్తుగా ప్రభుత్వం రద్దవటంతో 13 సంవత్సరాల తరువాత ప్రారంభించటమే కాదు, అక్కడే ప్రమాణ స్వీకారోత్సవం జరిపారు. కన్యాకుమారిలో 133 అడుగుల తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళానికి శాస్త్రీయ భాష హోదా కల్పించటంలో విజయం సాధించారు. పారిస్, కౌలాలంపూర్ మొదలు కోయంబత్తూరు, మదురై దాకా జరిగిన ప్రపంచ తమిళ సదస్సులలో పాల్గొనటంతో బాటు స్వయంగా థీమ్ సాంగ్ రాశారు. 1924 జూన్ 3న పుట్టిన కరుణానిధికి ఇది శతజయంతి సంవత్సరం. ఈ జూన్ 3 నుంచి వచ్చే జూన్ 3 వరకు అనేక కార్యక్రమాలు జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సాహిత్యాభిలాషకు చిహ్నంగా చెన్నై మెరీనా తీరంలో 42 మీటర్ల ఎత్తుండే ఒక కలాన్ని పంచలోహ విగ్రహంగా నెలకొల్పుతున్నారు. తీరానికి 360 మీటర్ల దూరంలో సముద్రంలో ఏర్పాటు చేస్తున్న ఈ కలం విగ్రహం, ఇప్పటికే ఉన్న కరుణానిధి సమాధికి చేరువ లోనే ఉంది. గ్లాస్ ఫ్లోరింగ్‌తో నిర్మించే ల్యాటిస్ బ్రిడ్జ్ మీదుగా సందర్శకులు వెళ్ళే విధంగా మొత్తం 80 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. స్వీయ ప్రసంగాలలోనూ, లేఖలలోనూ ‘ఎన్ ఉయిరి నుమ్ మేలాన అన్బు ఉడన్ పిరప్పుగళే’ (నా ప్రాణం కంటే మిన్నయైన ప్రియమైన తోబుట్టువులారా) అని సంబోధించే కరుణానిధిని కార్యకర్తలు స్మరించుకోవటానికి ఇది తగిన ప్రదేశంగా మారుతుంది. వందకు పైగా రచనలు చేసిన కరుణానిధికి ఇది సరైన నివాళి. తోట భావనారాయణ, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు (జూన్ 3 నుంచి కరుణానిధి శతజయంతి వేడుకలు ప్రారంభం) -
కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి
సాక్షి, చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. డీఎంకే నుంచి తన పెద్దకుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించిన విష యం తెలిసిందే. కరుణానిధి మరణం తదుపరి డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలోకి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వడంతో డీఎంకే సీనియర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అళగిరి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరగడం డీఎంకేలో చర్చకు దారి తీసింది. మద్దతుదారులతో భేటీ రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే రజనీ పార్టీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యను సంతరించుకుంది. చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు.. దక్షిణ తమిళనాడులో అళగిరికి మద్దతు గణం అధికంగా ఉండడం, ప్రస్తుత డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం వెరసి అళగిరి ఏ ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే కలైంజర్ డీఎంకే ఏర్పాటుకు గతంలో తమ నేత సిద్ధంగా ఉన్నట్టుగా మద్దతుదారులు ప్రకటించిన నేపథ్యంలో అదే నినాదాన్ని అందుకుని డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
తాత టీవీ ఇచ్చారు.. నాన్న సెటాప్ బాక్స్ ఇస్తారు
తమిళనాడు, పెరంబూరు: ఇంతకు ముందు తాత కరుణానిధి ఉచితంగా టీవీలు ఇచ్చారని, ఈ సారి నాన్న స్టాలిన్ ఎన్నికల్లో గెలిస్తే సెటాప్ బాక్స్‌లు ప్రజలకు ఉచితంగా అందిస్తారని నటుడు, డీఎంకే నేత స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్ వాగ్దానం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లడం మొదలెట్టారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి, ఉదయనిధిస్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. అలా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరి కొందరి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు కూడా. కాగా మంగళవారం నటుడు ఉదయనిధిస్టాలిన్ తూత్తుక్కుడి జిల్లాలో పర్యటించారు. అక్కడు ఒక యువతి ఇం తకు ముందు కరుణానిధి ఉచితంగా టీవీలు పంచి పెట్టారని, అప్పట్లో కేబుల్ ప్రసారాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నా తక్కువ ధరకే చానళ్లలో కార్యక్రమాలు చూసే వారమని, ఇప్పుడు కేబుల్ ప్రసారాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడంతో ఎక్కువ చానళ్లు రావడం లేదని చెప్పిం ది. అందుకు సెటాప్ బాక్స్ తీసుకోవాలని, అందుకు అధిక డబ్బును వసూలు చేస్తున్నారని చెప్పింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అప్పుట్లో తాత టీవీలను ఉచితంగా ఇచ్చారని, నాన్న స్టాలిన్ అధికారంలోకి వస్తే ఉచితంగా సెటాప్ బాక్స్‌లను పంచుతారని హామీ ఇచ్చారు. -
రసవత్తరం.. ఈయేటి భారతం
2018 సంవత్సరం భారత రాజకీయాల్లో పలు మార్పులకు నాంది పలికింది. సంవత్సర ఆరంభంలో బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా.. సంవత్సరాంతానికి వచ్చేసరికి మూడు రాష్ట్రాల్లో పరాజయంతో కుదేలైంది. అయితే.. బీజేపీకి జరిగిన నష్టాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు తమ సత్తాచాటుకోవడం దేశ రాజకీయాల్లో మరో మలుపునకు నాంది పలికింది. మరోవైపు ప్రధానిగా మోదీ జనాదరణ తగ్గకపోయినా.. వివిధ రాజకీయ పరిణామాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నాటికి బీజేపీ, దాని మిత్రపక్షాలు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, సంవత్సరం చివరకు వాటి సంఖ్య 16కు పడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎదురులేని స్థితి నుంచి బీజేపీ జోరు నెమ్మదించింది. ఒకప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైనా.. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. పదిహేనేళ్లుగా అధికారంలో లేని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మళ్లీ ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఎన్డీయే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం వంటి పరిణామాలు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం.. మళ్లీ ఎన్డీఏకే అధికారం రావచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఫలితాన్ని ఇప్పుడే ఊహించడం కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. మొదట బీజేపీ విజయ పరంపర ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో.. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. త్రిపురలో కమ్యూనిస్టుల బలమైన కోటను కూల్చి మరీ అధికారాన్ని కమలనాథులు కైవసం చేసుకున్నారు. త్రిపుర తొలి కాషాయపార్టీ సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. మేఘాలయాలో కాంగ్రెస్ పరాజయంపాలైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎన్పీపీకి చెందిన కన్రాడ్ సంగ్మా సీఎం అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఓడిపోయింది. బీజేపీతో కలిసి నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) మెజారిటీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ నేత నెయిఫియూ రియో ప్రమాణం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య భారతంలో బీజేపీకి మొదలైన విజయాలు ఇలా ముందుకు కొనసాగాయి. కర్ణాటకతో కథ మారింది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన కాంగ్రెస్ మళ్లీ మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు దక్కపోయినా.. బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పక్షంగా అవతరించింది. గవర్నర్ ఆహ్వానంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప శాసనసభలో మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిని సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమకు వచ్చిన సీట్లలో సగం కూడా గెలుచుకోని జేడీఎస్‌తో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధమవడంతో.. కూటమి సర్కారు ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే సందర్భంగా.. బీజేపీ వ్యతిరేకపార్టీలు (జాతీయ, ప్రాంతీయ) బెంగళూరులో బలప్రదర్శన చేశాయి. సోనియా, రాహుల్లతోపాటుగా మమతా బెనర్జీ (తృణమూల్), కేజ్రీవాల్ (ఆప్), చంద్రబాబు (టీడీపీ) అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) సహా సీపీఎం, సీపీఐ నాయకులు సహా అనేక మంది ప్రతిపక్షాల నేతలు కుమారస్వామి ప్రమాణానికి హాజరయ్యారు. ఇంత మంది ప్రతిపక్ష నేతలు ఒకే వేదిక మీద కనిపించడం 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అన్ని సీట్లలో బీజేపీపై ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థి ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. అప్పటినుంచి ఈఅంశం ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒకే బీజేపీ వ్యతిరేక మహాఘట్ బంధన్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం) జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ పార్టీ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేష్ బాఘేల్ సీఎం అయ్యారు. మధ్యప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కన్నా బీజేపీ ఒక శాతం ఓట్లు ఎక్కువ సాధించినా.. కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాకపోవడంతో బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. సీఎం సీటుకోసం యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీపడినప్పటికీ.. వయసు, అనుభవం, రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కమల్‌నాథ్‌కే ఈ పీఠం దక్కింది. రాజేను తిరస్కరించిన రాజస్తాన్ రాజస్తాన్‌లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు అధికారపీఠం నుంచి కిందకు దించారు. రాజేపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుందనుకున్నప్పటికీ.. బీజేపీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు వచ్చాయిగానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 101 సీట్లు రాకున్నా చిన్న పార్టీలు, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం సీటును ఆశించిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు ఆశాభంగం తప్పలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌కే అధిష్టానం సీఎల్పీ నాయకత్వం అప్పగించింది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు పైలట్ అంగీకరించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వం కోసం రగిలిన వివాదం సమసిపోయింది. మొత్తంమీద కాంగ్రెస్ కన్నా ఒక శాతం తక్కువ ఓట్లు సంపాదించిన బీజేపీ 73 సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతి ఐదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా రాజస్తాన్ కొనసాగించింది. ‘చే’జారిన ఈశాన్యం ఐదేళ్లుగా ఈశాన్యంలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న కాంగ్రెస్.. ఈ ప్రాంతంలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలోనూ ఓటమిపాలైంది. కాంగ్రెస్ సీఎం లాల్ థాన్వాలా పోటీచేసిన రెండు సీట్లలోనూ ఓటమిపాలయ్యారు. మెజారిటీ సీట్లు సాధించిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నేత జోరంతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంత లోకాలకు అటల్జీ... ఆగస్టు 16న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కన్నుమూశారు. దేశ ప్రధానిగా ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగిన మొదటి కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. 1996లో 13 రోజులు, 1998–99 మధ్య 13 నెలలపాటు ఆయన ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1999–2004 మధ్యలో మూడోసారి ప్రధానిగా (ఐదేళ్లపాటు) పని చేశారు. 1924, డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయి తన వాక్చాతుర్యంతో పార్టీలకతీతంగా అభిమానం సంపాదించారు. అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారు. సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా ఉంటూ భాగస్వాముల్లో ఎలాంటి అసంతృప్తి రేగకుండా వ్యవహరించడమే.. వాజ్‌పేయి రాజకీయ సమర్థతకు నిదర్శనం. ఇరుగుపొరుగు దేశాలతో సయోధ్యకు ప్రయత్నించడం ద్వారా ప్రపంచ దేశాల నేతలకు కూడా అభిమానపాత్రుడయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అటల్.. ప్రధాని హోదాలో లాహోర్ బస్సుయాత్ర చేపట్టి ఇరు దేశాలమధ్య సత్సంబంధాలకు కృషి చేశారు. కరుణానిధి అస్తమయం తమిళనాడుకు దాదాపు రెండు దశాబ్దాలు సీఎంగా పని చేసిన డీఎంకే అధినేత కరుణానిధి ఆగస్టు 7న చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ప్రబలడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. 1924, జూన్ 3న జన్మించిన కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు సినీ రచయితగా ఉన్నారు. 1969లో డీఎంకే తొలి సీఎం అన్నాదురై ఆకస్మిక మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. 1976లో అవినీతి తదితర ఆరోపణలపై కరుణానిధి సర్కారును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేశారు. 13 ఏళ్ల తర్వాత 1989లో మళ్లీ కరుణ అధికారంలోకి వచ్చారు. శ్రీలంక తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై 1991లో ఆయన ప్రభుత్వాన్ని కేంద్రంలోని చంద్రశేఖర్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.1989లో కేంద్రంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటులో కరుణానిధి కీలక పాత్ర పోషించారు. మళ్లీ 1996–98 మధ్య కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. రఫేల్‌పై కాంగ్రెస్‌కు మొట్టికాయలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధ విమానాల విషయంలో భారత్–ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రధానిపై రాహుల్ గాంధీ పలు వేదికల ద్వారా తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా మోదీ వ్యవహరించారని విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈ ఒప్పందంలో అవినీతిపై విచారించాలంటూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. ఈ ఒప్పందంలో అవినీతి కనిపించడం లేదని.. లోపాలేమీ లేవని, దీనిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం లేదని డిసెంబర్ 14న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రఫేల్ పేరుతో రెండు ఇంజన్లు కలిగిన యుద్ధవిమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ డసో ఏవియేషన్ సంస్థ నుంచి 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భాగస్వామ్యంతో భారతదేశంలో తయారు చేయాలని 2012లో యూపీఏ ప్రభుత్వం, డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ.526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మోదీ.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో చర్చలు జరిపారు. 126కి బదులుగా 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. 59 వేల కోట్లకు రఫేల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను ఇండియాకు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో మోదీ తెలపాలని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందంపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణలో వైమానిక దళం అధికారులు సహా పలువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందాన్ని సమర్థిస్తూ, కాంగ్రెస్ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ కారణంగా సుప్రీం తీర్పు వచ్చిందని, దీనిపై జేపీసీని నియమించాలని కోరుతూ విపక్షాలు పార్లమెంటులో రోజూ గొడవ చేస్తూనే ఉన్నాయి. కౌగిలింత ఆపై కన్నుగీత.. జూలై 20న పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను కౌగలించుకున్నారు. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన తర్వాత రాహుల్ అనూహ్యంగా మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దాంతో మోదీ సహా పార్లమెంటు సభ్యులంతా క్షణకాలం అవాక్కయ్యారు. ఆ తరువాత తన సీటు వద్దకు తిరిగొచ్చిన రాహుల్.. సన్నిహితులవైపు చూసి కన్నుగీటారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
2018.. కేరళను ముంచెత్తిన వరదలు
2018 ఆరంభంలో చప్పగా సాగినప్పటికీ చివరికొచ్చే సరికి దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. పలు రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికలు, 2019 సంవత్సరం అత్యంత ఆసక్తికర సన్నివేశాలకు శ్రీకారం చుట్టనుంది. సీబీఐలో జగడం, సుప్రీం జడ్జీల మధ్య వివాదం... పలు రాష్ట్రాల్లో ప్రజా తీర్పులు... 2018 ని ఒక్కసారి తరిచి చూస్తే.... (సాక్షి రౌండప్) థియేటర్లలో జాతీయ గీతం (జనవరి 9) సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్ర ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30 న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సుప్రీంకోర్టులో సంక్షోభం (జనవరి 12) దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయముర్తులు మీడియా ముందుకు వచ్చారు. సీజేఐ తీరును ఆక్షేపిస్తూ సీనియర్ జడ్జిలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. కొద్ది నెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంధించిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కీలక కేసుల కేటాయింపుల విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఆరోపణలు సంధించారు. కావేరీ జలాలపై కీలక తీర్పు (ఫిబ్రవరి 16) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఇచ్చింది. కమల్ హాసన్ కొత్త పార్టీ (ఫిబ్రవరి 21) ప్రఖ్యాత హీరో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధురైలో తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కల్ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం (మార్చి09) సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ (48) ప్రమాణం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 35 స్థానాలు గెలుచుకుని సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం సంపాదించుకుంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) 8 సీట్లు గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 39 మందిని చంపిన ఉగ్రవాదులు (మార్చి 20) ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం( జూన్ 15, 2014) ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణ సమీపంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సల్మాన్‌కు ఐదేళ్ల జైలు (ఏప్రిల్ 5) కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (52)కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. సల్మాన్‌ను దోషిగా నిర్దారిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. హమ్ సాథ్ హై షూటింగ్ సమయంలో (1998) రాజస్తాన్‌లోని కంకిణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. కర్ణాటకలో కొలువుతీరిన సంకీర్ణం (మే 15) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకోగా, జేడీఎస్ 37 స్ధానాల్లో గెలుపొందింది. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. స్టెరిలైట్ ఆందోళనలు హింసాత్మకం (మే 23) స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో వంద రోజుల పాటు సాగిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తూత్తుకుడి ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, 60 మందికి గాయాలయ్యాయి. దుమ్ము తుపాన్‌తో 17 మంది మృతి (జూన్ -3) యూపీలో చెలరేగిన దుమ్ము తుఫానులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాన్ దాటికి 24 గంటల్లోనే 13 మంది చనిపోయారు. సీతాపూర్ జిల్లాలో ఆరుగురు, గొండాలో ముగ్గురు, కౌశాంబిలో ఇద్దరు చనిపోగా, ఫైజాబాద్, హర్డొయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీని ప్రభావంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో బస్పులో... 48 మంది మృతి (జూలై 1) ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోయలో పడటంతో 48 మంది మరణించారు. 28 సీట్లుండే బస్సులో 58 మంది ప్రయాణించడంతో ప్రమాదం సంభవించింది. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు (జూలై 18) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళలు కూడా పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును పలు రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా సంఘాలు స్వాగతించగా.. సంప్రదాయవాదులు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరుణానిధి అస్తమయం (ఆగస్ట్ 7) డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి (94) మరణంతో యావత్ తమిళనాడు శోకసంద్రంలో మునిగింది. ద్రవిడ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన దిగ్గజం సెలవంటూ అనంతలోకాలకు తరలింది. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన కరుణానిధికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళను కుదిపిన భారీ వర్షాలు (ఆగస్ట్ 8) కేరళను భారీ వర్షాలు కుదిపివేశాయి. తీరప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 26 మంది మరణించారు. వరద తాకిడికి 24 డ్యాముల గేట్లు ఎత్తివేశారు. కనీవినీ ఎరుగని వరదలతో 26 ఏళ్ల తర్వాత చెరుతోని డ్యాం గేట్లు తెరుచుకున్నాయి. వాజ్‌పేయి కన్నుమూత (ఆగస్టు 16) మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మరణంతో యావత్‌దేశం శోకసంద్రంలో మునిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు వారం రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించాయి. స్వలింగ సంపర్కం నేరం కాదు (సెప్టెంబర్ 6) స్పలింగ సంపర్కం ఇక నేరం కాదని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెక్షన్ 377తో సమానత్వపు హక్కుకు విఘాతమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో శృంగారం చేసుకోవడం నేరం కాదని పేర్కొంది. సీబీఐలో జగడం (అక్టోబర్ 24) సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలపై కేంద్రం వేటు వేసింది. కీచులాటలతో దర్యాప్తు ఏజెన్సీని దిగజార్చినందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలకు కత్తెర వేసి ఆయనను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. అయోధ్య వివాదంపై విచారణ..!! (అక్టోబర్ 29) అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. పటేల్ విగ్రహావిష్కరణ (అక్టోబర్ 31) భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ 143 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల (597అడుగులు) పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంక్ సమీపంలో సాధజెట్ అనే దీవిలో ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. శబరిమల తీర్పు నిలిపివేతకు నో (నవంబర్ 13) శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్లు జనవరి 22న విచారిస్తామని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు (నవంబర్ 21) జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీడీపీ - కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సెమీఫైనల్స్‌లో సత్తా చాటిన కాంగ్రెస్ (డిసెంబర్ 11) సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టగా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి భంగపాటు ఎదురైంది. కీలక హిందీ రాష్ట్రాల్లో పట్టుసాధించిన కాంగ్రెస్ మూడు చోట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి పాలన షురూ.. (డిసెంబర్ 20) డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. జూన్‌లో విధించిన గవర్నర్ పాలన డిసెంబర్ 19తో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి కేంద్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. -
ముగ్గురు ధీరుల మహాభినిష్క్రమణం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి, ప్రజలను ప్రభావితం చేసిన నేతల పదికాలాల పాటు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి నేత మహా నేతల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, సోమనాథ్ చటర్జీ, కరుణానిధి ఉంటారు. ఈ మహోన్నత నేతలను పది రోజుల వ్యవధిలోనే దేశం కోల్పోయింది. భిన్న సంస్కృతులు, విభిన్న సిద్ధాంతాలు, రాజకీయ వ్యవహారాలను కలిగిన వారైనప్పటికీ దేశవ్యాప్త గుర్తింపు, మన్ననలను అందుకోవడమే వారి విశిష్టత. ఒకరు ప్రధానమంత్రిగా దేశానికి దిశానిర్దేశం చేస్తే, మరొకరు లోక్‌సభ స్పీకర్‌గా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారు. ఇంకొకరు ముఖ్యమంత్రిగా ప్రజల్లో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా పాలన అందించారు. అత్యున్నత స్థానాలను అలంకరించిన వారు ఆ పదవులకే వన్నెలద్దారు. స్వాతంత్య్రానికి ముందే జన్మించిన ఈ ముగ్గురిలో ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసించగా.. ప్రాథమిక విద్యతోనే సరిపెట్టినా ప్రజాస్వామ్య విలువలను ఔపోసన పట్టారు. విభిన్న సిద్ధాంతాలతో ప్రజలను ప్రభావితం చేశారు. వాక్ఫటిమతో సభికులను సమ్మోహితుల్ని చేయడం, ఉత్తేజితుల్ని కావించడం, ఉత్తమ నాయకత్వంతో అనేకమంది యువతకు మార్గదర్శకులుగా నిలవడం వారికే చెల్లుబాటైంది. రాజకీయేతర కుటుంబాల నుంచి వచ్చినా స్వయంశక్తితో ఎదిగి రాజకీయాలకే సొబగులు అద్దారు. ఈనెల 7న కరుణానిధి, 13న సోమనాథ్, 16న వాజ్‌పేయి తుదిశ్వాస విడిచారు. నిజమైన భారతరత్నం వాజ్‌పేయి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేకుండా భారత ప్రధానిగా పదవిని అలంకరించిన తొలి నేత వాజ్‌పేయి. అదే పదవిని మూడు పర్యాయాలు అధిష్టించారు. కవిగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజాప్రతినిధులను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసే నేతలున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఒక్క ఓటును తక్కువైనా విలువలకు కట్టుబడి ప్రధాని పదవినే తృణప్రాయంగా వదులుకున్నారు. పదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అటల్.. స్వపక్షం నుంచి మాత్రమే కాదు విపక్షం నుంచి మన్ననలు అందుకుని ఉత్తమ పార్లమెంటేరియన్ అయ్యారు. జనతాపార్టీ పతనానంతరం 1980లో భారతీయ జనతాపార్టీని ఏర్పాటుచేసి తొలి అధ్యక్షుడయ్యారు. ఆయన నేతృత్వంలో 1984లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన పార్టీ అనతి కాలంలోనే అధికారం చేపట్టే దిశగా ఎదగడంలో వాజ్‌పేయి కీలకపాత్ర పోషించారు. అటల్జీ ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా దేశ రాజకీయాల్లో అందరికీ ఇష్టులైన భారతరత్నగా మిగిలిపోయారు. ప్రజల్లో నిలిచిన కలైజ్ఞర్ దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ముత్తువేల్ కరుణానిధిది అత్యంత ప్రత్యేక స్థానం. పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించిన ఆయన తొలిసారి 1957లో 33వ ఏట ఎమ్మెల్యే అయ్యారు. అయిదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా, 13 పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. కవిగా, కథా రచయితగా, సంభాషణల రచయితగా, సినీ ప్రముఖునిగా, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా, పాలనాదక్షుడిగా తనదైన పాలన సాగించి ప్రజల మనసుల్లో కలైజ్ఞర్‌గా నిలిచిపోయారు. ద్రవిడ ఉద్యమ నేతగా దేశ రాజకీయాలలో దక్షిణాది వారి ప్రత్యేకత చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు లభించింది కరుణానిధి కృషివల్లే. సంక్షోభ సమయాల్లో ఎంత నిబ్బరంగా ఉండాలో, ఎలా ఆచితూచి ప్రవర్తించాలో కరుణానిధిని చూసి నేర్చుకోవాలని ఆయన సమకాలికులు చెపుతుంటారు. ద్రవిడ ఉద్యమ నేతైనా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో సన్నిహితంగా మెలుగుతూ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేవారు. ఎంజీఆర్ కేంద్రంతో చేతులు కలిపి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించినా, జయలలిత అరెస్టు చేయించినా పార్టీని చెక్కుచెదరకుండా నిలబెట్టిన ఘనుడిగా వినుతికెక్కారు. సోమనాథ్ ది జెంటిల్మన్ పది సార్లు పార్లమెంటేరియన్‌గా, లోక్‌సభ స్పీకర్ హోదాలో అన్ని పార్టీల నేతల వద్ద జెంటిల్మన్గా సోమనాథ్ ఛటర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయలో చదివిన ఆయన.. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నేతగా ఎదిగారు. సుప్రీం కోర్టు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. సీపీఎంలో చేరి 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిని అలంకరించిన తొట్టతొలి కమ్యూనిస్టు నేతగా ఛటర్జీ చరిత్రలో నిలిచిపోయారు. 2008లో అమెరికా–భారత అణు ఒప్పందం నేపథ్యంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయాలన్న సీసీఎం అధినాయకత్వం ఆదేశాలను భేఖాతరు చేశారు. స్పీకర్ పదవిలో ఉన్న వారికి పార్టీ ఆదేశాలు వర్తించవనే అభిప్రాయంతోనే ఆ పనిచేశారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నెలకొల్పినప్పుడు తొలిసారి ఆయననే ఆ అవార్డు వరించింది. స్పీకరుగా పార్టీలకు అతీతంగా వ్యవహరించిన ఆయన సభలో సభ్యుల తీరును ఎత్తిచూపుతూ ‘పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమం అనుకుంటున్నాను. మీకందరికీ వృధాగా జీతభత్యాలివ్వడం శుద్ధదండుగ’ అని ఘాటుగా వ్యాఖ్యానించిన ధీశాలి. లోక్‌సభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు ఆయన పట్టుపట్టడం వల్లనే సాధ్యమయ్యాయి. స్పీకర్ పదవిని వదులుకోనందుకు పార్టీ బహిష్కరించిన రోజును తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు. -
‘కరుణానిధికి భారతరత్న ఇవ్వాలి’
-
ఆయన నిజమైన లెజెండ్
సాక్షి, హైదరాబాద్: ద్రవిడ అభిమానంకోసం, ద్రవిడ జాతికోసం విప్లవాత్మక పోరాటం చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయంతో దేశం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ,ఇ తర రంగాల ప్రముఖులు సంతాపం వెలుబిచ్చారు. నటుడు , కవి, రచయిత, హేతువాది అయిన కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా, గొప్ప రాజకీయవేత్తగా చేసిన ఎనలేని సేవలను గుర్తు చేసుకున్నారు. అటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా కరుణానిధి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. నిజమైన లెజెండ్, మాస్ నాయకుడు, నిరంతరం స్పూర్తిగా నిలిచిన నాయుకుడు కరుణానిధి. ఆయనలేని లోటు పూడ్చలేనిదని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. సోదరుడు స్టాలిన్, అళగిరి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి. తన విధానాలతో లక్షలాదిమంది ప్రజలకు చేరువయ్యారు. తన రచనలతో లక్షలామంది ప్రజలకు కరుణానిధి ప్రేరణగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుఒక ఫోటోనుకూడా షేర్ చేశారు. ఈ భువిని వీడిన ఆయన నిజంగా ఎప్పటికీ మనల్ని వీడిపోని మనిషి కరుణాధి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే వుంటారు. మన ద్వారా ఆయన బతికే వుంటారంటూ కరుణానిధి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు మరో ప్రముఖ నటి రమ్యకృష్ణన్. అన్ని అసమానతలను ఎదుర్కొన్న ధీరుడు కరుణా నిధిగారు. ఈ అంతులేని విషాదంనుంచి కోలుకునే శక్తిని ఆయన కుటుంబం, తమిళ సోదర, సోదరీ మణులకు ఆ దేవుడు ప్రసాదించాలంటూ తెలుగు హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇంకా హీరో విశాల్ కూడా కరుణానిధి మృతిపట్ల ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. కాగా తమిళ రాజకీయ యోధుడు, ద్రవిడ గడ్డ లెజెండరీ నేత, డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) కన్నుమూశారు. నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులు, డీఎంకే శ్రేణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న తమిళ సోదరులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు. A true legend, a leader of masses and always lead by example, Sri. Karunanidhi leaves a huge void. My condolences to Brothers Stalin and Alagiri and their families. He touched millions of lives with his policies, gave hope to millions and inspired millions with his writing. — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 One of my Cherished Photo with Sri. Karunanidhi pic.twitter.com/gcATjLpTVf — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 A person that departs from this earth never truly leaves, for they are still alive in our hearts, through us, they live on. My condolences. #RIPKalaingr pic.twitter.com/qIfflYsgm1 — Ramya Krishnan (@meramyakrishnan) August 7, 2018 -
మళ్లీ ఆ రోజులు రావు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94)మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనను కడసారి చూడాలని కోరికతో అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలి వస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. అటు కళైంగర్ మరణంపై తమిళ నటి రాధికా శరత్ కుమార్ స్పందించారు. తనకు సంబంధించినంతవరకు, తమిళనాట మళ్లీ అలనాటి రాజకీయాలను, ఆ రోజులను మళ్లీ చూడలేమని ట్వీట్ చేశారు. మనకిది చీకటి రోజు, నా మనస్సు, హృదయం ఆ అధినాయకుడి జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల ఆత్మగౌరవం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడాయన. ఆయన ఆత్మ శాశ్వతమంటూ రాధిక కన్నీటి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఫోటోను షేర్ చేశారు. తమిళ హీరో, రాజకీయ నాయకుడు రజనీకాంత్ కూడా కరుణానిధి మరణంపై ట్విటర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇది చీకటిరోజు. ఆ కళాకారుడి జీవితంలోని ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ట్వీట్ చేశారు. హీరో సిద్ధార్ద్ స్పందిస్తూ..తమిళ దిగ్గజం నేలకొరిగింది. తమిళనాట ఆయనకు ఆయనే సాటి. ఒక గొప్ప సమకాలీన రాజకీయనాయకుడిని, ఇటు సృజనాత్మక దురంధరుడిని కోల్పోయింది. ఆయన లేని లోటు పూడ్చలేదని ట్విట్ చేశారు. అటు కరుణానిధి ఆరోగ్యం ఈ రోజు మధ్యాహ్నం నుంచి బాగా విషమించడంతో రాష్టంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆయన ఇక మనకు లేరని చివరికి వైద్యులు ధృవీకరించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. Dark day for us, my mind and heart is full of memories of this tall leader @kalaignar89 , man who instilled and strived for the pride of Tamils. His spirit will always live on, will miss him terribly. A tall and great leader gone, bid him a tearful adieu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/zk6GlwLG2v — Radikaa Sarathkumar (@realradikaa) August 7, 2018 The Last #Tamil Titan has fallen. Former TN CM #MKarunanidhi was an incomparable man. #TamilNadu has lost at once its greatest contemporary political and creative enigma. Our beautiful language #Tamil will miss #Kalaignar #Karunanidhi This void he has left will take ages to fill. — Siddharth (@Actor_Siddharth) August 7, 2018 -
కరుణానిధిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
-
మళ్లీ విషమంగా మారిన కరుణానిధి ఆరోగ్యం
-
వారు నాకు బలం కాదు!
పెరంబూరు: తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ నాకు బలం కాదని, బలహీనతని వారి వారసుడు, నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్. ఈయన మంగళవారం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాతకు, తండ్రికి ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన తాను రాజకీయాల్లోకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నిం చారు. తక్కువ సమయంలోనే ప్రజల్లో పేరు సంపాదించుకోవడం ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ మీకు బలమా..? అన్న ప్రశ్నకు కచ్చితంగా బలహీనతే అన్నారు. ఒకరు పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పాటు పడుతుంటే ప్రశంసలు లభిస్తాయన్నారు. తన విషయంలో అలా జరగడంలేదన్నారు. డీఎంకే అంటేనే కుటుంబ పాలన అనే విమర్శ ఉందే? అన్న ప్రశ్నకు దీనికి నాన్న విషయంలోనే సమాధానం ఉందన్నారు. నిరంతర శ్రమతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కఠిన శ్రమతోనే నాన్నకు అధ్యక్షుడి అర్హత వచ్చిందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. -
ఆత్మీయ పెన్నిధి!
► ఘనంగా కరుణ జన్మదిన వేడుకలు ► వజ్రోత్సవానికి వెల్లువెత్తిన అభిమానులు ► అభినందనలతో ముంచెత్తిన రాజకీయ నేతలు ► కరుణది ప్రజల వాణి: రాహుల్ ► అవిశ్రాంత నాయకుడు నాన్న : స్టాలిన్ తమిళనాట శనివారం పండగ వాతావరణం నెలకొంది. రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి 94వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ సంబరాలు అంగరంగవైభవంగా సాగాయి. చెన్నై రాయపేట వైఎమ్‌సీఏ మైదానం అభిమానులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ నాయకులు కరుణానిధి సేవలను కొనియాడారు. ఆయన మరిన్ని సేవలు చేయాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లు, ఈమెయిళ్ల ద్వారా దేశం మొత్తం నుంచి 60 లక్షల మంది శుభాభినందనలు తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజావేదికపై కరుణానిధి చేసేది రాజకీయ ప్రసంగాలు కాదు, ప్రపంచం నలుమూలలా ఉన్న తమిళప్రజల వాణిగా అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్షుడు కరుణానిధి 94వ జన్మదిన వేడుకలు, 60 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా వజ్రోత్సవ వేడుకలు చెన్నై రాయపేట వైఎంసీఏ మైదానంలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ నాయకులు కరుణానిధిని కీర్తిస్తూ ప్రసంగించారు. రాహుల్ మాట్లాడుతూ శరద్‌పవార్, నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీరి మాటలు, వారివారి రాష్ట్రాల ప్రజల మనోభావాలకు అద్దంపడతాయని అన్నారు. పార్టీలు, సిద్ధాంతాలువేరు కావచ్చు, కానీ తామంతా దేశ ప్రజల సంక్షేమ కోసమే పాటుపడుతున్నామని అన్నారు. కరుణానిధి సైతం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తారు, అవన్నీ కల్పనలు కాదు వాస్తవాల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. గత 70 ఏళ్లుగా తమిళ భాష ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా చాటుతున్నారు. తమిళభాష బలమే దేశ బలమని అన్నారు. దేశంలోసాగుతున్న ఏకపక్ష పాలనకు చరమగీతం పాడేలా భారతదేశం తామంతా సమష్టిగా పోరాడుతాం, పాటుపడతామని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు చేతలతో చూపెట్టాలని ప్రధాని మోదీని అయన ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద సభను నిర్వహించిన స్టాలిన్‌ను అభినందిస్తున్నా, ఒక గొప్ప మనిషి బాధ్యతలను స్టాలిన్ త్వరలో చేపట్టబోతారని చెప్పారు. స్టాలిన్ సరైన బాటలో పయనిస్తున్నారు. ఒకనాడు నేడు కరుణలా స్టాలిన్ గురించి మాట్లాడుకోవడం ఖాయమని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అధ్యక్షతన, కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సభకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరై కరుణకు జేజేలు పలికారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయస్థాయి ప్రతిపక్షనేతలు కరుణానిధి రాజకీయ జీవితాన్ని ప్రస్తావించి కీర్తించారు. ఒక రాజకీయ వేత్తగా 60 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగడం ద్వారా తమిళనాడు ప్రజల్లో ఆయనకున్న సముచిత స్థానాన్ని చాటుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేసిన కీర్తి కరుణకు సొంతమని అన్నారు. 94 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆయనలోని రాజకీయ చతురత, పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి ఏ మాత్రం తగ్గలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే అనారోగ్యకారణంగా ఈ వేడుకల్లో మనమధ్య ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ముందుకు కరుణ గళం: స్టాలిన్ తమ అభిమాన నేతను కలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు, చూడాలని ప్రజలు ఎంతోకాలంగా తహతహలాడుతున్నారి స్టాలిన్ అన్నారు. త్వరలో ఈ ఆశ తీరుతుంది, కరుణ గళాన్ని వినే అవకాశం ముందుందని చెప్పారు.ప్రజల మేలు గురించి కరుణానిధి ఆలోచనలకు విశ్రాంతి లేదని స్టాలిన్ అన్నారు. రాజకీయాల్లోకి అడుగిడిన నాటి నుంచి ప్రజలకు అంకితమయ్యారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలకు ఆయన ఒక దిక్సూచీ అని అన్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే జన్మదిన బహుమతి అని అన్నారు. కరుణకు 60 లక్షల మంది శుభాకాంక్షలు: భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేరళ గవర్నర్ సదాశివం, తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మూర్ము, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పీఎంకే అధినేత రాందాస్, సహా మొత్తం 60 లక్షల మంది కరుణానిధికి శుభాకాంక్షలు అందజేశారు. సోనియా పంపిన సందేశాన్ని కరుణకు చదివి వినిపించారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, వీసీకే అధినేత తిరుమావళవన్, పుదియనీది నిరువణ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం, పెరుంతలైవర్ మక్కల్ కట్చి అధ్యక్షులు ఎన్ఆర్ ధనపాళన్, సమత్తువ మక్కల్ కళగ నేత ఏ నారాయణన్, చెంగల్పట్టు ఎమ్మెల్యే వరలక్ష్మి మధుసూదనన్ తన సొంతూరైన అంబూరులో పార్టీ జెండా ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఎక్కడిక్కడక డీఎంకే అనుబంధ కార్మిక సంఘాలు మిఠాయిలు పంచుకుని సంబరం జరుపుకున్నాయి. తన తండ్రిపై ఎంపీ కనిమొళి కవితను రాసి విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు కరుణ జీవితంపై ఒక డాక్యుమెంటరీ తీశారు. -
దేశంలో ఏకపక్ష పాలన: రాహుల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోట్లాదిమంది భారతీయులను ఒకే వ్యక్తి తన ఏకపక్ష నిర్ణయాలతో శాసిస్తున్నారని ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఎవ్వరికీ చెప్పకుండా తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా తిరోగమనం వైపు నెట్టేసిందని దుయ్యబట్టారు. రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 94వ జన్మదినంతోపాటు ఆయన ఎమ్మెల్యే అయ్యి 60 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలను శనివారం చెన్నైలో వైభవంగా నిర్వహించారు. అనారోగ్యంతో కరుణానిధి వేడుకకు రాలేదు. ఈ వేడుకలకు రాహుల్‌తోపాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, సీపీఐ, సీపీఎంల ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకర రెడ్డి, సీతారాం ఏచూరి తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాని కనీసం ఆర్థికమంత్రికి కూడా చెప్పలేదని, కేవలం ఒకే వ్యక్తి ఆలోచనలతో ఈ దేశం నడుస్తోందని విమర్శించారు. -
కరుణోత్సవం
► ఒకే రోజు రెండు పండుగలు ► జన్మదినోత్సవానికి భారీ ఏర్పాట్లు ► రాహుల్ సహా జాతీయ నాయకుల రాక ► రాయపేట వైఎంసీఏ మైదానం వేదిక రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి శనివారం 94వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. అలాగే తమిళనాడు అసెంబ్లీలో 50 ఏళ్లుగా ఎమ్మెల్యే జీవితాన్ని పూర్తిచేసుకుని వజ్రోత్సవ సంబరాలకు సిద్ధమయ్యారు. ఒకే రోజు రెండు పండుగలు రావడంతో డీఎంకే కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : నాగపట్నం జిల్లా తిరుకువాలైలో ముత్తువేల్, అంజుగం దంపతులకు 1923 జూన్ 3వ తేదీన జన్మించిన దక్షిణామూర్తి కాలక్రమంలో కరుణానిధిగా మారారు. సినిమా రైటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ద్రవిడ ఉద్యమనేత, ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) వ్యవస్థాపకులు సీఎన్ అన్నాదురై వద్ద రాజకీయ శిష్యరికం చేశారు. 1969 అన్నాదురై చనిపోయిన తరువాత డీఎంకే అధ్యక్షుడిగా మారారు. రాజకీయ అరంగేట్రంలో గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుడిగా తొలి అడుగు వేసినా రాష్ట్ర రాజధాని స్థాయిలో సీఎం కావడమే ప్రతినేత లక్ష్యం అంటే అతిశయోక్తి కాదేమో. పంచాయతీలు, వార్డులు దాటుకుని ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం రాజకీయాల్లో ఒక పెద్ద ప్రమోషన్. దీంతో ఆయా నేతలకు చెప్పలేనంత ఎమోషన్. తమిళనాడు రాజకీయాల్లో ఎమోషన్‌తో కూడిన ప్రమోషన్లను అదేపనిగా అందుకున్న వారిలో డీఎంకే అధినేత కరుణానిధి అగ్రగణ్యుడని చెప్పక తప్పదు. ఓటమిని ఎరుగని వీరుడుగా వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై 60 ఏళ్ల ఎమ్మెల్యే జీవితాన్ని అనుభవిస్తూ తమిళనాడు రాజకీయాల్లో ఒక రికార్డును నెలకొల్పారు. 1957లో తొలిసారిగా కులిత్తలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962లో తంజావూరు, 1967, 1971లో చెన్నై సైదాపేట, 1977, 1980లో చెన్నై అన్నానగర్, 1989, 1961లో చెన్నై హార్బర్, 1996, 2001, 2006లో చెన్నై చేపాక్, 2011లో తిరువారూరులో గెలుపొందారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువారూరు నుండి పోటీచేసి గెలుపొందారు. ఇలా వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ రికార్డును బహుశా తమిళనాడులో మరెవ్వరూ బద్దలు కొట్టలేక పోవచ్చు. రాజకీయాలేగాక రచనాశైలితో సైతం తమిళనాడు ప్రజలను మెప్పించి ‘కలైంజ్ఞర్’ అనే ముద్దుపేరును సంపాదించుకున్నారు. ద్రవడి ఉద్యమాన్ని ప్రజల్లో ఉవ్వెత్తున తీసుకెళ్లడంతోపాటూ హిందీ భాషా వ్యతిరేకోద్యమంతో జాతీయ భాషపై కూడా దండెత్తారు. నిలువెల్లా తమిళభాషాభిమానాన్ని కలిగి ఉన్న కరుణానిధి 2006లో నిర్బంధ తమిళ చట్టాన్ని ప్రవేశపెట్టి అన్ని భాషలవారిని తన భాషా చట్రంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 92 ఏళ్ల వృద్దాప్యంలోనూ ప్రచారం చేసి ప్రజలను ఆశ్చర్యపరిచారు. 94 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని 60 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అనుభవాన్ని తమిళనాడులో మరో రాజకీయవేత్తకు దక్కక పోవచ్చు. సీఎంగా ఐదుసార్లు రికార్డు : ఎమ్మెల్యేగానే కాదు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పీఠం ఎక్కిన రికార్డు కూడా ఉంది. తమిళనాడు 3, 4, 10, 12, 16 ముఖ్యమంత్రిగా పనిచేశారు. వ్యక్తిగత జీవితంలోనూ రికార్డే : రచనారంగం, రాజకీయ రంగాల్లోనే గాక వ్యక్తిగత జీవితంలో కూడా కరుణానిధి నెలకొల్పిన రికార్డులు చెప్పుకోదగ్గవి. తొలిగా పద్మావతిని వివాహమాడి ఆ తరువాత దయాళూ అమ్మాళ్లను పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా మారారు. ప్రస్తుతం కరుణానిధి కలిసి జీవిస్తున్న రాజాత్తి అమ్మాళ్తో ఆయనకు సంబంధాలపై కొందరు రకరకాల వ్యాఖ్యానాలు చేసినా, ఆయన మాత్రం ఆమెను తన సహచరిణిగా చెప్పుకుంటారు. కరుణానిధి మొదటి భార్య పద్మావతి యుక్తవయస్సులోనే చనిపోయారు. ఎంకే ముత్తు, ఎమ్కే అళగిరి, ఎమ్కే స్టాలిన్, తమిళరసు కుమారులు కాగా, సెల్వి, కనిమొళి కుమార్తెలున్నారు. పెద్ద భార్య పద్మావతికి ఎంకే ముత్తు (చిన్న వయసులోనే చనిపోయాడు ) జన్మించగా, అళగిరి, స్టాలిన్, సెల్వి, తమిళరసు దయాళూ అమ్మాళ్కు జన్మించారు. రాజాత్తి అమ్మాళ్కు కనిమొళి జన్మించారు. స్టాలిన్‌కు పగ్గాలు : వృద్దాప్యం సమీపిస్తుండగా తన రాజకీయ వారసులు ఎవరనే విషయంలో ఒకే తల్లికి పుట్టిన అళగిరి, స్టాలిన్ మధ్య ఘర్షణలు తలెత్తగా కరుణ మాత్రం స్టాలిన్‌వైపే నిలిచారు. అళగిరిని పార్టీ నుండి బహిష్కరించారు. తనకు సరైన వారసుడు స్టాలినే అని పలుమార్లు ప్రకటించడంతోపాటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించి పగ్గాలు అప్పగించారు. వృద్దాప్యంతో తీవ్ర అస్వస్థతకు గురైన కరుణానిధి నేడు 94 ఏళ్ల బర్త్‌డే బాయ్‌గా మారుతున్నారు. తమిళనాడులో సీనియర్ రాజకీయవేత్త కరుణానిధి 94వ జన్మదినోత్సవాలు డీఎంకే అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చెన్నై రాయపేట వైఎమ్‌సీఏ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల కోసం భారీ వేదిక సిద్ధమైంది. చెన్నై సచివాలయాన్ని తలపించే రీతిలో వెనుకవైపు సెట్టింగ్ వేయడం ద్వారా రాబోయేది డీఎంకే ప్రభుత్వమేనని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరుణ జన్మదిన వేడుకల్లో 156 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నట్లు చెన్నై జిల్లా కార్యదర్శి ఎం సుబ్రమణియన్ తెలిపారు. ఈ జన్మదినంతో ఎమ్మెల్యేగా 50 ఏళ్లుపూర్తి చేసుకున్న నేతగా వజ్రోత్సవ పండుగను కూడా జరుపుకుంటున్నారు. అలాగే ఐదేళ్లు సీఎం అయిన ఘనతను సంతరించుకున్నారు. పార్టీలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్, గుడిసెల, పేదరిక నిర్మూలన, తాగునీటి శాఖలు ప్రవేశపెట్టిన ఘనత కరుణకు మాత్రమే సొంతమని పార్టీ చెబుతోంది. అంతేగాక తన పాలనలో రైతు రుణాల రద్దు, పౌష్టికాహార పథకంలో వారానికి మూడుసార్లు కోడిగుడ్డు, అన్నదాతలు, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమపథకాలకు కరుణానిధే శ్రీకారం చుట్టినట్లుగా పార్టీశ్రేణులు కీర్తిస్తున్నారు. కరుణానిధి వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలని డీఎంకే భావిస్తోంది. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలను కూడగట్టడం ద్వారా యూపీఏకు పూర్వవైభవం తేవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ దృష్టితోనే అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, పుదుచ్చేరీ సీఎం నారాయణస్వామి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్లతోపాటూ శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితర పది మంది ప్రముఖ జాతీయ నేతలను ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండు రోజుల క్రితమే ఫోన్ ద్వారా కరుణకు శుభాకాంక్షలు చెప్పారు. రాహుల్‌గాంధీ తన చెన్నై పర్యటనలో భాగంగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఇంటికి వెళ్లనున్నారు. త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల తరఫున ఒక అభ్యర్థిని సూచించేందుకు ఈ ఉత్సవాలను అవకాశంగా తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇది కేవలం కరుణ జన్మదిన వేదికగా కాక జాతీయస్థాయి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో అధికార బీజేపీ ఈ వేడుకలపై దృష్టిపెట్టి విపక్ష నేతల కదలికలను గమనించడం ప్రారంభించింది. -
కరుణానిధి జన్మదిన వేడుకలకు దూరం
హొసూరు : తమిళనాడులోప్రాంతీయ పార్టీలు తమ నాయకుల జన్మదిన వేడుకలను ప్రచార ఆర్భాటంతో ఘనంగా జరుపుకొని సంతోషపడడం ఆనవాయితీ. అయితే డీఎంకే సీనియర్ నాయకుడు, కురవృద్ధుడు కరుణానిధి 93వ జన్మదిన వేడుకలను జూన్ 3వ తేదీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ క్రిష్ణగిరి పడమర జిల్లా డీఎంకే నేతలు ఎందుకో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా డీఎంకే పార్టీ స్టాలిన్, కరుణానిధి వంటి అగ్రనేతల జన్మదినవేడుకల నిర్వహణకు గతంలో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించి చర్చించడం, ఆ తర్వాత సమితి స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలను, నాయకులను చైతన్యం చేసేవారు. గోడలపై ప్రచారం, రంగు రంగుల ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసేవారు. 15 రోజులు, ఒక్కొక్క సారి నెలరోజుల ముందుగానే ప్రచారం చేసేవారు. ప్రస్తుతం క్రిష్ణగిరి జిల్లా పడమర డీఎంకే కార్యదర్శి వై.ప్రకాష్ మొక్కుబడిగా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. క్రిష్ణగిరి జిల్లాలో పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాలు కూడా అమలు జరపడంలో జిల్లా కమిటీ ఎందుకో మౌనంగానే ఉంది. డీఎంకే పార్టీలో జోడు పదవుల విషయంలో క్రిష్ణగిరి పడమర జిల్లా కార్యదర్శి వై.ప్రకాష్‌కు ఇష్టం లేనట్లుందని విమర్శలు వస్తున్నాయి. హొసూరు మున్సిపాలిటీలోఅనేక మంది డీఎంకే నాయకులు జోడు పదవులపై స్వారీ చేస్తున్నారని, వీరిపై పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడం లేదనే వాదన డీఎంకేలోనే బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. జిల్లా పార్టీ కార్యదర్శి పదవి, జిల్లా పార్టీ యువజన అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడంతో పార్టీలో ఇతర సామాజిక వర్గాలు గుసగుసలాడుతున్నాయి. క్రిష్ణగిరి జిల్లాను తూర్పు, పడమర జిల్లాలుగా విభజించి, ఇద్దరు జిల్లా కార్యదర్శులను నియమించడంతో పార్టీలో విభేదాలు ఎగిసిపడ్డాయి. క్రిష్ణగిరిలో యువత చేతికి పార్టీ పగ్గాలను(వై.ప్రకాష్)కు అందించడంతో సీనియర్లు కొంత అలకలో ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కరుణానిధి 93వ జన్మదిన వేడుకలను ఘనంగా జరపడానికి నిశ్చయించకపోవడంపై ఆయన అభిమానులు, సీనియర్ డీఎంకే నాయకులలో తీవ్ర అసహనం చోటు చేసుకొందంటున్నారు. ఆ పార్టీలో కొందరు రేపటి తరం స్టాలిన్‌దే, కరుణానిధి అవసరం ఏముంటుందనే ఆలోచనలో పడ్డారా అనే ధోరణిలో అంతా ఉన్నారని ప్రస్తుత నాయకత్వంపై పార్టీలో ఉన్న అసమ్మతివాదులు ఎత్తిచూపుతున్నారు. -
ధర్మమే గెలిచింది: జయ
కుట్రలు తాత్కాలికంగా గెలవొచ్చు.. తుది విజయం మాత్రం ధర్మానిదే చెన్నై: హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యక్తిగత విజయంగా భావించడం లేదని, ఈ తీర్పుతో ధర్మం గెలిచిందని అన్నాడీఎంకే అధినేత జయలలిత పేర్కొన్నారు. తనపై రాజకీయ శత్రువులు వేసిన నింద దీనితో తొలగిపోయిందన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు తీర్పు నాకెంతో సంతృప్తినిచ్చింది. నేను ఏ తప్పూ చేయలేదని నిరూపితమైంది. రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్లుగా చేసిన పూజలకు దేవుడిచ్చిన వరం ఈ తీర్పు. దీన్ని నా విజయంగా అనుకోవడం లేదు. న్యాయం, ధర్మం నెగ్గాయి. కుట్రలు తాత్కాలికంగా నెగ్గవచ్చు. కానీ నిజాయతీ, ధర్మానిదే తుది విజయం’’ అని ఆమె పేర్కొన్నారు. డీఎంకే కుట్రపూరితంగా తనపై ఈ కేసు మోపిందని జయ మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ఇప్పటికైనా విడనాడాలని ఆ పార్టీకి హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు. కిందికోర్టులో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును తట్టుకోలేక కొన్ని నెలల వ్యవధిలో 233 మంది కార్యకర్తలు బలవన్మరణాలకు పాల్పడడం కలచి వేసిందని జయ ఆవేదన వ్యక్తం చేశారు. వారు కాస్త ఓపిక పట్టి ఉంటే ఇప్పుడు అందరితో కలసి ఆనందం పంచుకునేవారన్నారు. ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి చెన్నై: జయ కేసులో కర్ణాటక హైకోర్టు వెలువరించిందే తుది తీర్పు కాదని డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి వ్యాఖ్యానించారు. ‘అన్ని కోర్టులకు మించి మనస్సాక్షి అనే కోర్టు ఉంటుందని మహత్మాగాంధీ అన్న మాటలను గుర్తుచేస్తున్నా. ఈ తీర్పే అంతిమం కాదు. కిందికోర్టు లేవనెత్తిన అనేక అంశాలను తప్పని నిరూపిస్తూ ఆధారాలు చూపాలని జస్టిస్ కుమారస్వామి అన్నాడీఎంకే న్యాయవాదిని విచారణలో కోరారు. వాటన్నింటికీ ఆ పార్టీ న్యాయవాది ఆధారాలు చూపారా?’ అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
డీఎంకే చీఫ్ కరుణానిధిపై ఎఫ్ఐఆర్ నమోదు
చెన్నై: జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో శనివారం అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి డీఎంకే చీఫ్ కరుణానిధి, ఆయన తనయుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్లపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీరితోపాటు పలువురికి వ్యతిరేకంగా ఐపీసీలోని అల్లర్లు, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద వీటిని నమోదు చేశారు. గోపాలపురంలోని కరుణ ఇంటి వద్ద డీఎంకే కార్యకర్తలు తమపై మారణాయుధాలతో దాడి చేశారని అన్నాడీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేశారని రాయపేట పోలీసులు తెలిపారు. శనివారం బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలితను నాలుగేళ్ల శిక్ష పడింది. ఈ తరుణంలో అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలకు దిగారు. డీఎంకే నాయకులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. -
అళగిరికి ఉద్వాసన
డీఎంకే నుంచి బహిష్కరించినకరుణానిధి కోర్టుకు వెళతానని అళగిరి ప్రకటన సస్పెండ్ అయిన ఎంపీ, పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.అళగిరిని డీఎంకే బహిష్కరించింది. అళగిరికి శాశ్వతంగా ఉద్వాసన పలుకుతున్నట్టు పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ మంగళవారం ప్రకటించారు. పార్టీ వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడటం.. క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి కారణాలతో పార్టీ దక్షిణాది జిల్లాల కార్యదర్శిగా ఉన్న అళగిరిని కొద్దిరోజులక్రితం తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఎన్నికల్లో టికెట్ సైతం నిరాకరించారు. దీంతో స్వరం పెంచిన అళగిరి డీఎంకేకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కోట్లు దండుకుని అభ్యర్థులకు సీట్లు ఇచ్చారని ఆరోపించడమే కాక పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానని సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో తమకు మద్దతివ్వాలని కోరుతూ బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు మదురైలోని అళగిరి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ ఆయా పార్టీల అభ్యర్థులకు అళగిరి హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అళగిరి చర్యల్ని తీవ్రంగా పరిగణించిన డీఎంకే అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారంమీడియాకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై వివరణ ఇవ్వనందునే అళగిరిపై చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. కరుణానిధి బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో క్రమశిక్షణపై పార్టీ శ్రేణులకు హెచ్చరిక ఇచ్చేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బహిష్కరణపై కోర్టుకు వెళతా: అళగిరి తనను డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమను బహిష్కరించినంత మాత్రాన తాను, తన మద్దతుదారులు పార్టీని వీడేది లేదని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్టు మంగళవారం మదురైలో ప్రకటించారు. పార్టీ తనను ఎలాంటి వివరణ కోరలేదని, ఆయా పార్టీల నాయకులు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తుంటే అందులో తన తప్పేముందని ప్రశ్నించారు. -
ప్రచారానికి కని, ఖుష్బు సిద్ధం
సాక్షి, చెన్నై: డీఎంకే సినీ గ్లామర్లు ప్రచారానికి సిద్ధం అయ్యారు. నటి ఖుష్బు, నటుడు వాగై చంద్రశేఖర్ పర్యటన వివరాలను డీఎంకే ప్రకటించింది. డీఎంకే ఎంపీ, కరుణానిధి గారాలపట్టి కనిమొళి పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో డీపీఏ పేరుతో కూటమిగా డీఎంకే ఎన్నికల్లోకి వెళ్లిన విషయం తెలి సిందే. డీఎంకే 35 స్థానాల్లో, ఆ కూటమిలోని వీసీకే రెండు చోట్ల, ఇండియ యూనియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ నిధి కట్చిలు తలా ఓ చోట బరిలో దిగాయి. కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. పార్టీ అధినేత కరుణానిధి ప్రచారానికి సిద్ధమయ్యారు. తమ పార్టీలో ఉన్న నటీ, నటులను ఎన్నికల ప్రచారంలోకి పంపించేందుకు డీఎంకే అధిష్టానం సిద్ధం అయింది. అలాగే, తన గారాల పట్టి కనిమొళి సైతం ప్రచార బాట పట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో వారి పర్యటనల వివరాలను డీఎంకే కార్యాల యం అన్నా అరివాళయం సోమవారం ప్రకటించింది. ప్రచారం నిమిత్తం ప్రత్యేక వాహనాలు సిద్ధం అయ్యాయి. ప్రచార బాట: ఏప్రిల్ ఐదు నుంచి కనిమొళి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఆ రోజు ఉత్తర చెన్నైలో ఆమె ప్రచారానికి శ్రీకారం చుడతారు. విరామం లేకుండా ఆమె పర్యటన 22వ తేదీ వరకు సాగనున్నది. ఏడో తేదీన కంచి, కడలూరు, చిదంబరం, 9న శ్రీ పెరంబతూరు, పదిన అర్కోణం, 11న తిరువళ్లూరు,12నవేలూరు, 13నఆరణి, 14న సేలం, 15న నామక్కల్, 16న ఈరోడ్, 17న దిండుగల్, 18న విరుదునగర్, 19న తెన్కాశి, 20న తూత్తుకుడి, 21న తిరునల్వేలి, 22న కన్యాకుమారిలో ఆమె పర్యటించనున్నారు. నటి ఖుష్బు ఏప్రిల్ ఐదో తేదీన తిరుచ్చి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఆరున కరూర్, 7న ఈరోడ్, 8న నీలగిరి,9న పొల్లాచ్చి, 10న కోయం బత్తూరు,11న తిరుప్పూర్, 12న సేలం, 13న ధర్మపురం, 14న కృష్ణగిరి, 15న వేలూరు, 17న ఆరణి, 18న తిరువణ్ణామలై,19న కాంచీపురం,20 అరక్కోణం, 21న శ్రీపెరంబదూరు , 22న తిరువళ్లూరుల్లో ఖుష్బు ప్రచారం సాగునున్నది. వాగై : ఏప్రిల్ ఒకటి నుంచి వాగై చంద్ర శేఖర్ ప్రచారం సాగనున్నది. తిరుచ్చిలో తన పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రెండు దిండుగల్, మూడున శివగంగై, 4న రామనాథపురం, 5న మదురై, 6న తేని, 7న దిండుగల్, 8న కరూర్, 9న తంజావూరు, 10న మైలాడుతురై, 11న చిదంబరం, 12న పుదుచ్చేరి, 13న కడలూరు, 14న దక్షిణ చెన్నై, 15న సెంట్రల్ చెన్నై, 16న కాంచీపురం, 17న వేలూరు, 18న తిరువళ్లూరు, 19న తిరువణ్ణామలై , 20న ఆరణి, 21న విల్లుపురం, 22న శ్రీ పెరంబదూరుల్లో పర్యటించనున్నారు. -
అళగిరి తో జర భద్రం!
సాక్షి, చెన్నై: పార్టీ నుంచి ఎంకే అళగిరిని ఇటీవల డీఎంకే అధిష్టానం తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చాక అళగిరి తన స్వరాన్ని పెంచుతూ వస్తున్నారు. మద్దతుదారులతో మంతనాల్లో బిజీబిజీగా ఉన్నారు. డీఎంకేను చీల్చే వ్యూహం తో దూసుకెళుతున్న అళగిరి రెండు రోజుల క్రితం మదురై వేదికగా జరిగిన మద్దతుదారుల మంతనాల అనంతరం తాను పార్టీ పెట్టబోనంటూ ప్రకటించారు. డీఎంకేను రక్షించుకోవడం, కరుణానిధికి అండగా నిలబడటం తన కర్తవ్యంగా ప్రకటించారు. కొందరి చెప్పు చేతుల్లోకి డీఎంకే వెళ్లిందని, వారి నుంచి పార్టీని రక్షించుకుందామని అళగిరి ఇచ్చిన పిలుపు డీఎంకే వర్గాల్ని ఆలోచనలో పడేసింది. పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి దుందుడుకు చర్యలు ఉండటం, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాక పోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే విధంగా అళగిరి వ్యాఖ్యలు ఉండడంతో డీఎంకే అధిష్టానం మేల్కొంది. అదే సమయంలో డీఎంకే నుంచి ఆహ్వానం వస్తే, వెళ్లేందుకు తాను సిద్ధమంటూ పరోక్ష సంకేతాన్ని అళగిరి ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో గందరగోళ పరిస్థితిని సృష్టించడం లక్ష్యంగా దక్షిణాది కింగ్ మేకర్ అళగిరి చక్రం తిప్పుతున్నట్టు అధిష్టానం గుర్తించింది. దీంతో కింగ్ మేకర్‌కు షాక్ ఇచ్చేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా అధినేత కరుణానిధి హెచ్చరికలు జారీ చేశారు. జర భద్రం: బుధవారం డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆదేశాల మేరకు అన్నా అరివాళయం వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. అందులో అళగిరిని టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. పార్టీలో గందరగోళం సృష్టించడం లక్ష్యంగా, పార్టీ వర్గాల్ని పక్కదారి పట్టించే రీతి లో అళగిరి చర్యలు ఉన్నాయని వివరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతోనే అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించామని గుర్తు చేశారు. అయితే, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతోపాటుగా, పార్టీలో గందరగోళం సృష్టించే లక్ష్యంగా ఆయన ముందుకెళుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీతో అళగిరికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంతనాలు, సమావేశాల పేరుతో పార్టీ నాయకులను, కార్యకర్తలను అళగిరి కలుస్తూ వస్తున్నట్టుగా అధిష్టానం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అళగిరి చర్యలు పార్టీకి నష్టం తెప్పించే అవకాశాలు ఉన్నాయని, దీన్ని గుర్తెరిగి ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యవహరించాలని సూచించారు. మరో మారు స్పష్టం చేస్తున్నామని అళగిరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన పిలుపు మేరకు సమావేశాలు, సభలకు పార్టీ వర్గాలెవ్వరు వెళ్లడానికి వీలు లేదని హెచ్చరించారు. ఒక వేళ ఎవరైనా వెళ్లినట్టు తేలిన పక్షంలో క్రమ శిక్షణ చర్యలు తప్పదని, వారెంతటి వారైనా సరే ఉపేక్షించబోమన్నారు. అరుుతే అధిష్టానం హెచ్చరికతో అళగిరి స్పందిస్తూ, తాను డీఎంకే వ్యతిరేకిని కాను అని స్పష్టం చేశారు. -
ఎలక్షన్ వాచ్
ప్రధానితో అళగిరి భేటీ న్యూఢిల్లీ: డీఎంకే నుంచి సస్పెండైన ఎంపీ, కరుణానిధి కుమారుడు ఎం.కె.అళగిరి గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ఆయనతో సమావేశమయ్యానని భేటీ అనంతరం విలేకరులతో అన్నారు. మీరు కొత్త పార్టీ పెట్టనున్నారా అని ప్రశ్నించగా.. తన మద్దతుదారులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. కాగా, ఆయన కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. దీనిపై స్పందించడానికి అళగిరి తమ్ముడు స్టాలిన్ నిరాకరించారు. ఇలాంటి అనవసర వార్తలను తాను చదవనని, చర్చించనని అన్నారు. గుజరాత్లో ఒక స్థానం నుంచి మోడీ పోటీ అహ్మదాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ గుజరాత్ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి విజయ్ రూపానీ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. మోడీ గుజరాత్లో ఒక స్థానం నుంచి పోటీ చేసేది ఖాయమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మోడీ పోటీ చేసే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చలేదు. రాష్ట్రం నుంచి మోడీ తప్పక పోటీచేయాలని కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని రూపానీ తెలిపారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఒక స్థానం నుంచి మోడీ పోటీ చేయాలని తమ(రాష్ట్ర బీజేపీ) పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసిందని వివరించారు. అయితే ఏ స్థానం నుంచి మోడీ పోటీ చేసేదీ నిర్ణయించలేదన్నారు. యూపీలోని వారణాసి నుంచి కూడా మోడీ పోటీ చేసే అవకాశముందా? అని ప్రశ్నించగా.. ఆ స్థానం గురించి తనకేమీ తెలియదని రూపానీ బదులిచ్చారు. శ్రీరాములుకు బీజేపీ టికెట్ సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: సీనియర్ నేత సుష్మాస్వరాజ్ వ్యతిరేకించిన నేపథ్యంలో.. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు నాయకత్వంలోని బీఎస్‌ఆర్‌సీపీని విలీనం చేసుకోరాదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. అదే సమయంలో ఆయన్ను బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీఎస్‌ఆర్‌సీపీ విలీనం అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీఎస్ఆర్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి సమావేశంలో అయిష్టత వ్యక్తమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే శ్రీరాములును బళ్లారి నుంచి పోటీకి దింపేందుకు మాత్రం ఆమోదం లభించడం విశేషం. శ్రీరాములును బళ్లారి నుంచి పార్టీ టికెట్‌పై బరిలోకి దింపాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్టు పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తెలిపారు. శ్రీరాములు ఈ నెల 14న లాంఛనంగా బీజేపీలో చేరతారు. యూఐడీఏఐకి నీలేకని రాజీనామా బెంగళూరు: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ నందన్ నీలేకని గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమర్పించినట్టు ఆయన చెప్పారు. నీలేకని బెంగళూరు దక్షిణ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. బీజేపీ తరఫున ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అనంతకుమార్‌తో ఆయన తలపడుతున్నారు. పరిశీలకులుగా 700 మంది ఐఆర్ఎస్లు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార వ్యయం ఎక్కువగా ఉండొచ్చని గుర్తించిన నియోజకవర్గాల్లో పరిశీలకులుగా 700 మంది ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్) అధికారులను ఎన్నికల కమిషన్ నియమించనుంది. తగిన అధికారుల పేర్లతో జాబితాను ఖరారు చేసి పంపాలని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డును ఆదేశించిది. -
యువతకే చాన్స్
కరుణ నిర్ణయం మరికొద్ది రోజుల్లో తొలి జాబితా అధికారుల జాబితా కోసం ఈసీకి వినతి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేయడానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. యువజన విభాగానికి చెందిన నాయకులతో తొలి జాబితాను మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను డీఎంకే కోరింది. సాక్షి, చెన్నై: ఓ వైపు కూటమి ప్రయత్నాలు, మరో వైపు అభ్యర్థుల ఎంపికలో డీఎంకే అధిష్టానం బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహులను ఈనెల 20 నుంచి ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు వేగం పుంజుకున్నారుు. సగం నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు ముగిశాయి. ఇందులో ఎక్కువ శాతం యువతను అభ్యర్థులుగాఎంపిక చేయడానికి కరుణానిధి నిర్ణయించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ల కన్నా, యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో కరుణానిధి ఉన్నారు. పార్టీకి వెన్నెముకగా యువజన విభాగం ఉండటం, దానికి స్టాలిన్ నేతృత్వం వహిస్తుండటంతో ఆ విభాగంలోని నాయకులకు మెజారిటీ శాతం సీట్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అన్నాడీఎంకే జాబితాలో కొత్త ముఖాలు ఉండటంతో, తాము యువతకు పెద్ద పీట వేసే రీతిలో జాబితాను సిద్ధం చేస్తున్నట్టు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. ఈసీకి లేఖాస్త్రం: కరుణానిధి సూచన మేరకు డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకోబోమని ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, తమిళనాడు ప్రభుత్వం జిమ్మిక్కులు చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు ఉపయోగ పడే అధికారుల జాబితాను ఎన్నికల యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ జాబితాలో ఉన్న అధికారుల పేర్లు, వివరాల్ని వెబ్ సైట్లో తప్పని సరిగా పొందు పరచాల్సిందేనని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు గత అనుభవాల్ని ఎత్తి చూపుతున్నదని, ఈ దృష్ట్యా, ఎన్నికల అధికారుల పేర్లు, వివరాలు ముందుగానే తెలియజేయాలని డిమాండ్ చేశారు. -
వ్యతిరేకం కాదు.. అనుకూలమూ కాదు
సాక్షి, చెన్నై : తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెన్నైలో పాతపాటే పాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను గురువారం చంద్రబాబు చెన్నైలో కలుసుకున్నారు. జయతో 45 నిమిషాలు, కరుణానిధితో 30 నిమిషాలు సమాలోచనలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇంతకూ మీరు తెలంగాణకు అనుకూలమా.. ప్రతికూలమా, పార్లమెంటులో బిల్లుపెడితే మీ పార్టీ మద్దతు పలుకుతుందా? అంటూ మీడియా ప్రశ్నించగా ‘వాట్ అయామ్ సేయింగ్, అయామ్ వెరీ క్లియర్’ అంటూ పొంతన లేని ఇంగ్లిష్ ముక్కలను చెప్పారు. ఇంతకూ మీరు దేనికి మద్దతు ఇస్తున్నారని ఒక మహిళా విలేకరి సూటిగా ప్రశ్నించగా సమాధానం ఇవ్వాల్సిందిపోయి ‘నీవు చాలా తెలివిగలదానివి. అదే చెబుతున్నా’ అంటూ మరోసారి దాటవేశారు. ఇరుప్రాంతాల వారికీ న్యాయం జరగాలి అని బాబు అనగానే, న్యాయం అంటే మీ దృష్టిలో ఏమిటని మరో విలేకరి ప్రశ్నించగా, ఐ యామ్ వెరీ క్లియర్ అంటూ తప్పించుకున్నారు. తాను తెలంగాణకు అనుకూలం కాదు, అలాగని వ్యతిరేకం కూడా కాదని, రాజ్యాంగం దుర్వినియోగం అవుతోందని అంటున్నాను.. అంటూ పాతపాట పాడారు. ఇంతకూ మీ వైఖరి ఏమిటో చెప్పలేదని మరో విలేకరి ప్రశ్నించగా, ‘‘నేను ఒకవైపు ఎలా నిలబడగలను. తెలుగువారందరి కోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారు, మా పార్టీ రెండు ప్రాంతాల్లోనూ బలంగా ఉంది.’’ అని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఆరునెలల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తానని బదులిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడిన అంశాలు.. - రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తోందని చెప్పడానికే జయలలితను, కరుణానిధిని కలుసుకున్నాను. - ఇప్పుడు తెలంగాణ అంశం జాతీయ సమస్యగా మారిందని. దీనిపై కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ఓట్లు సీట్లుకోసమే విభజన చేస్తోందని విమర్శించారు. - ఇప్పటికైనా భారత రాష్ట్రపతి చొరవతీసుకుని ఇరు ప్రాంతాలవారు చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చేలా చూడాలని కోరారు. - మరో 15-20 రోజుల్లో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో కీలకమైన విభజన అంశాన్ని ఎలా చేపడతారని ప్రశ్నించారు. - రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందన్న విషయంపై వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మాట్లాడడం లేదని, ఆయన రాష్ట్ర విభజననే కోరుకుంటున్నారని విమర్శించారు.