Khammam district
-
మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఓవరాక్షన్..
-
చిత్తశుద్ధి, దూరదృష్టితోనే అభివృద్ధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని.. దూరదృష్టి, చిత్తశుద్ధితోనే అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు దక్కుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శుక్రవా రం ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య పండితులు ఆయనకు పరివట్టం కట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ రమా దేవి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.తర్వాత రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్ ప్రత్యేక వార్డులను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా అమూల్యమైన సేవలు అందటం అభినందనీయమని అన్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిని కేంద్రం నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లలో భేటీలు: ఈ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ల లో అధికారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీ అయ్యారు. అలాగే, శాఖల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించి వారు మెరుగైన జీవితం గడి పేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించా రు. భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు బాగుందని అభినందించారు. ఖమ్మంలో గవర్నర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాదిరిగా తాను సైతం పర్యావరణ వేత్తగా కెరీర్‌ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన అందరిలో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే లు వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రెండు జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, ముజమ్మిల్ ఖాన్, ఎస్పీ రోహిత్‌రాజ్, సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. -
జడ్జి గుర్తింపు కార్డు లాక్కున్నారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్గేట్ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద డ్రైవర్.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు. దీంతో డ్రైవర్ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్గేట్ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్గేట్ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్గేట్ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం. -
కన్నీరు మున్నేరు
-
ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఖమ్మం, సాక్షి: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా బొడ్రాస్ కుంట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో కారేపల్లి మండలం గుట్ట కింద గుంపుకు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.చదవండి: మతపరమైన ర్యాలీల్లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం: సీవీ ఆనంద్ -
8 శాఖలు.. రూ.339.46 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అ«ధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15,201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లెక్కగట్టింది. రెవెన్యూ, పశుసంవర్థక శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, మత్స్య శాఖల పరిధిలో నష్టంపై ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది. ముఖ్యంగా 53,528 మంది రైతులకు సంబంధించి 79,914 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 111.87 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా వరదలతో 76 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే 45 చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోయిన తమకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తే ఎలా సరిపోతుందని ప్రశి్నస్తున్నారు. -
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
-
5 లక్షలకు మనవడిని అమ్మేసిన నాయనమ్మ
-
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు
సాక్షి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంప్ హౌస్‌లను మంత్రులు పరిశీలించారుఅనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామన్న ఉత్తమ్.. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ అన్నారు.‘‘గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఎటువంటి అనుమతులు లేవు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు తీసుకుని వచ్చాం. సీతారామ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నాం. 2026న ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తాం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా లక్షా 52 వేలు సాగులోకి వస్తుంది. పాలేరు లింకు కెనాల్‌కి నీళ్లు అందిస్తాం. పాలేరు కింద నాగార్జున సాగర్ కింద భూములకు నీరు అందుతుంది. భద్రాచలం, ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు వచ్చేలా చేస్తాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు కాగా, 9,18,164 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.కాగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. -
ఖమ్మం: లేడీ టీచర్ వికృత చేష్టలు.. విద్యార్థుల జుట్టు కత్తిరించి...
సాక్షి, ఖమ్మం జిల్లా: జుట్టు పెంచుకొని స్కూల్‌కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తెర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేనుకొరుకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృత చేష్టలకు పాల్పడింది. ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాక్కైన తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుని స్కూల్‌కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయురాలు శిరీషనే బార్బర్ అవతారమెత్తింది.ఓ కత్తెర తీసుకొని తనకి వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్టుగా మారింది. అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని,అవమానభారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. -
చనిపోయిన తర్వాత వస్తారా?
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్టుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ భూసమస్యతో ఆత్మహత్య చేసుకోగా.. ఆయన వ్యవసాయ భూమిని పరిశీలించేందుకు బుధవారం తహసీల్దార్ రమేశ్ గ్రామానికి వచ్చారు. దీంతో ప్రభాకర్ కుటుంబసభ్యులు ఆయనను అడ్డుకున్నారు. భూసమస్యపై ఫిర్యాదు అందగానే అధికారులు స్పందిస్తే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఆయన తండ్రి బోజెడ్ల పెద్దవీరభద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు హడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. గత వేసవిలో సుమారు రూ.8 లక్షలు వెచ్చించి తమ భూమిలోకి మొరం మట్టి తోలించగా, చెరువు శిఖాన్ని ఆక్రమించారంటూ మత్స్యశాఖ సొసైటీ మూడు ఎకరాల్లో మట్టి తొలగించిందని తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ను పొలంలోకి రాకుండా అడ్డుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎస్సై నాగుల్‌మీరా వారికి సర్దిచెప్పి తహసీల్దార్‌ను కారు ఎక్కించారు. అయినప్పటికీ వారు కారుకు అడ్డుగా కూర్చోవడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పగా వారు శాంతించారు. విచారణలో వేగం: రైతు ప్రభాకర్ ఆత్మహత్యను సీరియస్‌గా పరిగణించిన సీఎం రేవంత్‌రెడ్డి, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేÔశారు. రైతు ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకునేందుకు సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక పోలీసులు తమకు లభించిన వీడియోలను సైతం పరిశీలిస్తున్నారు. -
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్‌రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్‌రావు.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
Farmer Suicide: సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి...
చింతకాని/జనగామ /లింగాల/గద్వాల రూరల్: వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యతి్నంచారు. నాలుగు జిల్లాల పరిధిలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి... ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ (45) కుటుంబానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో రూ.8 లక్షలు వెచి్చంచి మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని మట్టిని తొలగించారు. దీనిపై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి మట్టి తొలగించొద్దని సొసైటీ సభ్యులకు చెప్పారు. అయినా వారు దౌర్జన్యంగా మట్టి తొలగించగా, గ్రీవెన్స్‌లో కలెక్టర్, సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు తన తండ్రితో కలిసి ప్రభాకర్ సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌కు వెళ్లాడు. అక్కడ కలెక్టర్ కలవకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్.. భోజనం చేసి వస్తానంటూ తండ్రితో చెప్పి ఖమ్మంలోని గొల్లగూడెం – కొత్తగూడెం మార్గంలో గల చెరుకూరి గార్డెన్ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. గ్రామంలోని కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తన పొలాన్ని నాశనం చేశారని వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు పంపించాలని, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభాకర్ కోరాడు. గోలీలు మింగి...కిరోసిన్ డబ్బాతో... ⇒జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు దేవులపల్లి జ్యోతి, స్వప్నల పేరిట తాత లక్ష్మయ్య 1.04 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి గార్డియన్‌గా ఉన్నాడు. ఆ విషయం అక్కాచెల్లెళ్లకు తెలియదు.2014లో లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జ్యోతి, స్వప్నలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ట్రంకు పెట్టె సర్దుతుండగా, భూమి విషయం తెలిసింది. వెంటనే జ్యోతి గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని భూమి విషయం అడగ్గా, మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. న్యాయం కోసం జ్యోతి గతంలో నర్మెట పీఎస్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కేసు నడుస్తోంది. భూమి వస్తుందో రాదో అన్న ఆవేదనతో జ్యోతి కొన్ని మందుగోలీలు మింగి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచి్చంది. ప్రజావాణి ప్రారంభమయ్యే క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యతి్నంచగా, పోలీసులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇతరుల పేరిట పట్టా చేశారని... ∙నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన మహిళారైతు గాలేటి జయమ్మకు గ్రామ శివారులో 1.37 ఎకరాల భూమి వారసత్వంగా దక్కాల్సి ఉంది. ఆ భూమిని పదేళ్ల కిందట అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన జయమ్మ సోమవారం పెట్రోల్‌తో లింగాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పోసుకునేందుకు ప్రయతి్నంచింది. గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. నేతలు భూమి కబ్జా చేశారని... ∙జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడికి అదే గ్రామ శివారులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామనేతలు కబ్జా చేశారు. దీనిపై పరుశరాముడు పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం.సంతోష్ ఆ«ధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవం కొనసాగుతుండగానే పరుశరాముడు తన వెంట తీసుకొచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
మత్తులో.. చిత్తు కావొద్దు
ఖమ్మం: దేశాభివృద్ధిలో కీలకమైన యువత మాదకద్రవ్యాల బారిన పడుతోంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుండడంతో పదిహేనేళ్ల లోపు పిల్లలు మొదలు యువత వరకు పలువురు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాలు వివిధ రూపాల్లో లభిస్తుండడంతో ధూమపానం, మద్యపానం వంటివి క్రమంగా జీవితంలో భాగమై పలువురు విచక్షణ మరిచి నేరాలకు పాల్పడుతున్నారు.అంతేకాక ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పడు మారుమూల పల్లెలకు సైతం పాకింది. ఈనేపథ్యాన నేడు(బుధవారం) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు.విద్యాసంస్థలే లక్ష్యంగా దందా..యువతే టార్గెట్‌గా ఉమ్మడి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కౌమారదశలో ఉన్న విద్యార్ధులు మంచి, చెడు గుర్తించలేక త్వరగా అలవాటయ్యే అవకాశముండడంతో సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల కన్ను వారిపై పడింది. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇన్నాళ్లు పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మాదకద్రవ్యాల అమ్మకం, వాడకం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుండడం.. ప్రతీ పాన్‌షాపు, కిరాణ షాపుల్లోనూ లభిస్తున్నట్లు తెలుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.సరదాగా మొదలు.. ఆపై వ్యసనంయుక్తవయస్సు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంటుంది. దీంతో ఇలాంటి వారిని మత్తు పదార్థాలు ఆకర్షించే అవకాశముంది. ధూమపానం, మద్యపానం ఇతర మత్తుపదార్థాలు తొలినాళ్లలో సరదాగా అలవాటవుతున్నా ఆ తర్వాత వ్యసనంలా మారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. గంజాయిలో ఉండే టెట్రా హైడ్రోకెనబినాయిడ్(టీహెచ్‌సీ) రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది.అది మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీయడమే కాక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన తర్వాత వ్యక్తుల్లో భ్రమలు మొదలై నేరప్రవృత్తి పెరగడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు సైతం వస్తుంటాయి. దీంతో తమను తాము గాయపర్చుకోవడమే కాక దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదముంది.తల్లిదండ్రులు గమనించాలి..పిల్లలు, యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా అడ్డుకోవడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం లేదంటే మౌనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వారి గదులు, బ్యాగులను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఎవరిరెవరితో తిరుగుతున్నారో పరిశీలిస్తే అవసరానికి మించి డబ్బు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని చెబుతున్నారు.మెదడుపై తీవ్ర ప్రభావం..మత్తుపదార్థాల వాడకం సరదాగా ప్రారంభమైనా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తుపదార్థాలు తీసుకున్న వారి మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. తద్వారా శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపించి.. కాసేపటికి మళ్లీమళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. క్రమంగా తీవ్రమైన మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. – డాక్టర్ అప్పారావు ఎండీ, డీఎం (న్యూరాలజీ)అందరూ భాగస్వాములు కావాలి : సీపీ సునీల్ దత్ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నివర్గాల ప్రజలు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరాలని కోరారు.ఈమేరకు వారం పాటు మాదకద్రవ్యాల వినియోగం, దుష్పలితాలపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించడమే కాక ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. అలాగే, ఐసీడీఎస్, పోలీస్ శాఖలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యాన బుధవారం ఉదయం 7గంటలకు సర్ధార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. -
పోలీస్ ఇన్స్పెక్టర్ రాసలీలలు?
హసన్‌పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు. యువతితో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని చింతగట్టు సమీపాన ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సదరు అధికారి ఖమ్మం జిల్లాలో ఎస్ఐబీ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2014లో ఎస్సైగా, ఆతర్వాత ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయితే, మంగళవారం సదరు ఇన్స్పెక్టర్ తన ప్రియురాలితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి చింతగట్టు సమీపాన ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఓ గదిలో స్నేహితులు మద్యం సేవిస్తుండగా, ఇంకో గదిలో యువతితో ఆ సీఐ రాసలీలల్లో మునిగి తేలినట్లు తెలిసింది.ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు వెళ్లి యువతితో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ను చూసి షాక్‌కు గురైనట్లు సమాచారం. అయితే, టాస్క్‌ఫోర్స్ పోలీసులను గమనించిన ఇన్స్పెక్టర్ స్నేహితులతోపాటు యువతి పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, సదరు ఇన్స్పెక్టర్ స్నేహితులను, యువతిని పోలీసులే తప్పించారా లేక పరారయ్యారా అన్నది చర్చ జరుగుతోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్.. కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్
వరంగల్, ఖమ్మం, నల్లగొంఎ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్ డేట్నల్లగొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్ డేట్ఇంకా కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్సాయంత్రం మూడున్నరకు ప్రారంభమైన మొదటి రౌండ్ కౌంటింగ్నాలుగు రౌండ్ల పాటు సాగనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఒక్కో రౌండ్ లో 96 వేల చొప్పున లెక్కింపునల్లగొండప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియమధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన బండిల్స్ కట్టె ప్రక్రియమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభంఇంకా కొనసాగుతున్న బెండల్స్ కట్టే ప్రక్రియసాయంత్రం 5 తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రారంభంపట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లలో బ్యాలెట్ ఓట్ల బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి అయింది ఇంకా మూడు రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడు గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందిఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లానేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుతిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపుఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులుమొత్తం ఓటర్లు: 4,63,839పోలైన ఓట్లు: 3,36,013పోలింగ్ శాతం: 72.44రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపుఒక్కో షిఫ్టులో 900 సిబ్బందిమొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశంఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న సిబ్బందిచెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటనమొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటననేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ఖమ్మం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. -
విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు
సాక్షి, ఖమ్మం: వరంగల్-విజయవాడ రైలు మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్ రైలును నిలిపివేశారు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగినట్లు గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారాయన. -
సైబీరియన్ కొంగలు ఎక్కడ ?
-
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
ఎందుకిలా జరిగింది?.. బీఆర్ఎస్కు ఆ జిల్లా గుదిబండగా మారిందా?
బీఆర్ఎస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా అసలు కలిసి రావటంలేదు.. గత మూడు ఎన్నికల్లో కూడ ఒక్క సీటు మాత్రమే గెలుపోందింది. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఈసారి కూడ అదే సెంటిమెంట్‌లో భాగంగా ఒక్క సీటు వచ్చిన రివర్స్‌గా అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రక్షాళన అవసరమని సొంత పార్టీ నేతలే నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమాయనికి అయిన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి మారుతుందా? రాష్ట్రంలో బీఆర్ఎస్కు అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని చెప్పాలి. ప్రతిసారి ఇక్కడి ఫలితాలు గులాబీ పార్టీ అధిష్టానంకు నిరాశ గురిచేస్తున్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు ఒక గుదిబండలాగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నేత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని శపథం చేసి మరి పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో గెలిపించడం బీఆర్ఎస్ పార్టీకి అసలు మింగుడుపడటంలేదు. సవాల్ చేసి మరి మాట నిలబెట్టుకున్నాడన్ వాదన బీఆర్ఏస్ పార్టీలో సైతం వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్తితి ఉందంటేనే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. గత మూడు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితమవుతూ వస్తుంది.. ఏమాత్రం మార్పు రావటంలేదు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఏమ్మేల్యే జలగం వెంకట్రావు గెలుపోందగా.. 2018 ఎన్నికల్లో సైతం అవే ఫలితాలు రిపిట్ అయ్యాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు. అయితే ఈసారి అయిన పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న గులాబీ అధిష్టానానికి మళ్లీ దెబ్బ పడింది. అతి కష్టం మీద మళ్లీ ఉమ్మడి జిల్లాలో ఒకే స్థానం గెలుపొందింది.. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. అయితే ఏప్పుడు సెంటిమెంట్‌లో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానం వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినబడుతు వచ్చింది. దానిలో భాగంగానే 2014,2018లో ఓకే స్థానం గెలిచిన రాష్ట్రంలో అధికారంలో మాత్రం బీఆర్ఏస్ వచ్చింది. అయితే ఈసారి కూడ ఒకే స్థానం గెలిచిన రివర్స్‌గా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో అటు సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు ఇటు మళ్లీ ఒకే స్థానం గెలిచిందన్న భావన ఏర్పడిందన్న గుసగుసలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. భట్టి విక్కమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు బలమైన నేతలు మంత్రులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచకొవాలంటే ఆషామాషీ వ్యవహరం కాదు.. జిల్లాలో నాయకత్వాన్ని మరింత గ్రౌండ్ లెవల్లో పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో పార్టీ మరింత వీక్ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు అసలు కలిసిరావటంలేదనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల సమయానికి అయిన గాడినపడుతుందో చూడాలి ఇదీ చదవండి: భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల -
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఒప్పుకోలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ జిల్లాకు చెందిన ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్కను అదనంగా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశంపై గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై త్వరలో రాష్ట్ర శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ: భట్టి విక్రమార్క సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.792 కోట్లతో రాజీవ్‌సాగర్, రూ.760 కోట్లతో ఇందిరాసాగర్ మిగులు పనులు పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.3లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించేదన్నారు. మొత్తం రూ.1552 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కలిపేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చడంతోపాటు అంచనా వ్యయం రూ.13,057 కోట్లకు చేరిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. అదనపు నీటినిల్వ సామర్థ్యం కోసం రూ.3481 కోట్లతో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టి తర్వాత దీని వ్యయం సైతం రూ.4481 కోట్లకు పెంచిందన్నారు. ఇలా సీతారామ–సీతమ్మప్రాజెక్టుల అంచనాలను మొత్తం రూ.22,981 కోట్లకు పెంచారని విమర్శించారు. రూ.1552 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టు అంచనాలను రూ.22,981 కోట్లకు పెంచి ఇప్పటికే రూ. 8వేల కోట్లను ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. శబరి, గోదావరి కలిసే చోట పోలవరం వద్ద ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఇందిరాసాగర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం విరమించుకోవడంతో 365 రోజులు ప్రవహించే శబరి నదిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. దేశ చరిత్రలో ఇంత దోపిడీ జరిగి ఉండదు: ఉత్తమ్ భారతదేశ చరిత్రలో ఇలాంటి దోపిడీ జరగడం చాలా అరుదు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.10, రూ.20 కోట్లకే ఉద్యోగాలు పోతాయని, ప్రభుత్వాలు కూలుతాయన్నారు. రోజురోజుకు బయటకు వస్తున్న విషయాలను చూసి నీటిపారుదలశాఖ మంత్రిగా నిర్ఘాంతపోతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారణకు ఎంత మందో జడ్జిలు కావాలో అన్న అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు సీజేకు లేఖ రాశామని, కేసీఆర్, హరీశ్‌రావులు నీటిపారుదలశాఖ మంత్రులుగా వ్యవహరించి ఆ శాఖను ధ్వంసం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులనే ఇంకా కొనసాగించడంపై విలేకరులు ప్రశ్నించగా, త్వరలో మార్పులు చూస్తారని బదులిచ్చారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కలి్పంచే విధానం లేదని, బదులుగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర పథకాల కింద 60శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతీయ హోదాపై మాట్లాడేందుకు హరీశ్‌రావుకు సిగ్గుశరం ఉండాలన్నారు. గతంలో 2–4శాతం వడ్డీలతో ప్రభుత్వాలు రుణాలు తెచ్చాయని, తెలంగాణ వచ్చాక 10.5శాతం వరకు అధిక వడ్డీలతో గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి మనందరి జీవితాలను తాకట్టు పెట్టిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రుణాల తిరిగి చెల్లింపులకే రూ.18వేల కోట్లు, జీతాలకు మరో రూ..2వేల కోట్లు, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులకు మరో రూ. 9500 కోట్లు అవసరమన్నారు. తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో వడ్డీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కర్ణాటకకు వెళ్లి తాగునీటి అవస రాల కోసం 10 టీఎంసీలను విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా? శ్రీశైలం ప్రాజెక్టు వెనుకభాగంలో ఏపీ లిఫ్ట్‌లు కట్టుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కసారైనా కేసీఆర్, హరీశ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతోపాటు సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీకి కేటాయించినా ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.