Krishna mohan reddy
-
‘గద్వాల ఎమ్మెల్యేకు ప్రాణ హాని’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రాణహాని ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం కోరుట్లలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరికి ప్రభుత్వ పెద్దలందరూ వెళ్లి బెదిరింపులకు గురి చేశారు. నేను అయితే నా తల తీసివేసినా పార్టీ మారను. అభివృద్ధి కోసం పార్టీ మారవలసిన అవసరం లేదు. కోరుట్ల ప్రజలకు అవసరమైన 100 పడకల హాస్పిటల్ సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కేవలం తన స్వార్థం కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తప్పుడు నివేదికలు చదివి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు’అని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగుతారని వార్తలు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలను కలవటం తీవ్ర చర్చనీయంగా మారింది. ఆయన మనసు మార్చుకొని బీఆర్ఎస్లోనే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అనంతం కాంగ్రెస్ నేతలు రంగంలోకి ఆయన్ను బుజ్జగించిన విషయం తెలిసిందే. -
సీఎం రేవంత్ ఇంటికి ఎమ్మెల్యే బండ్ల...
-
మళ్లీ కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. మళ్లీ కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.కాగా, గురువారం ఉదయం మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో, మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టు సమాచారం. కాగా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.అయితే, మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. దీంతో, మంత్రి జూపల్లి రంగ ప్రవేశం చేసి ఆయనతో చర్చలు జరిపారు. ఇక, బండ్ల కృష్ణమోహన్‌తో నిన్న జీఎంఆర్ కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
అసెంబ్లీలో కేటీఆర్ ను కలిసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
-
అలా వెళ్లి, ఇలా వచ్చారు..
-
తెలంగాణ: కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్‌రెడ్డి షాకిచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. యూటర్న్ తీసుకున్నారు. తిరిగి బీఆర్ఎస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎల్‌వోపీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కృష్ణమోహన్‌రెడ్డి. ఇది ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.గద్వాల బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల.. ఈ నెల మొదట్లో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చే రారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెంది న మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇలావుండగా సీఎం రేవంత్ త్వరలోనే గద్వాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించనున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా అదే రోజు కృష్ణమోహన్‌రెడ్డి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది. జెడ్పీ చైర్మన్‌కు సీఎం సముదాయింపు మరోవైపు బండ్ల చేరికను వ్యతిరేకిస్తూ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆమె సీఎం రేవంత్‌తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి సముదాయించినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. గద్వాల, ఆలంపూర్ మినహా మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం 13కు పెరిగింది.నిధులు కేటాయించండిశ్రీధర్బాబుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతిఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు సచివాలయంలో మంత్రిని కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వారు మంత్రిని కోరారు. అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా.. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.కాగా, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. ఇక, ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సరితా తిరుపతయ్యతో రేవంత్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
గద్వాల కాంగ్రెస్‌లో లొల్లి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు రాజుకోగా.. నడిగడ్డలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆ పారీ్టలో అలజడి సృష్టిస్తోంది. ప్రధానంగా తాజా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ ఆమె వర్గానికి చెందిన అనుచరులు, అభిమానులు రోడ్డెక్కుతున్నారు.నియోజకవర్గంలోని గద్వాల మున్సిపాలిటీతోపాటు కేటీదొడ్డి, మల్దకల్, గట్టు మండలాల్లోని పలు ప్రాంతాల్లో సరిత వర్గానికి చెందిన నాయకులు గురువారం ధర్నాలకు దిగారు. గద్వాల పట్టణంలోని రాజీవ్‌మార్గ్‌లో ప్రసాద్ అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. సరిత గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. శనివారం స్పష్టత..ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం గద్వాల పట్టణంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు తన అభిమానులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరాలని మంత్రి జూపల్లిని సంప్రదించిన మాట వాస్తవమేనని చెప్పారు. కాగా, శనివారం హైదరాబాద్‌కు రమ్మని ఎమ్మెల్యే బండ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఏ రోజు కాంగ్రెస్‌లోకి వస్తారన్నది శనివారం తేలనుంది. -
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయినట్టు సమాచారం.బీఆర్ఎస్కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈనెల ఆరో తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్సీలు, మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. -
ఎమ్మెల్యేగా గెలిచినా..ఓడిపోతారు!
వనమా వెంకటేశ్వరరావు.. 2018లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని, కొన్నిచోట్ల ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని జలగం వెంకట్రావు హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినన్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. 2018లో గద్వాల్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.2.5 లక్షల జరిమానా కూడా విధించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆదేశించింది ఆ అభ్యర్థులిద్దరూ శాసనసభ్యులుగా విజయం సాధించిన వారే. ప్రజాఓటుతో గెలిచిన వారే. వారికి వచ్చిన ఓట్లను కోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. కానీ, అఫిడవిట్లో అన్ని అంశాలూ పేర్కొనలేదని, కొన్ని తప్పులుగా పేర్కొన్నారన్న కారణంగా వారిపై వేటు వేసింది. వారి తర్వాత రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు విజయం కట్టబెడుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఇలా ఈ రెండు పిటిషన్లే కాదు.. దాదాపు 30 వరకు పిటిషన్లు హైకోర్టులో నమోదయ్యాయి. వనమా, బండ్ల, శ్రీనివాస్‌గౌడ్ కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఇతర పిటిషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ ఒకసారి కంటే ఎక్కువసార్లు పోటీ చేస్తున్న అభ్యర్థులైతే గతంలో వేసిన అఫిడవిట్‌తో ఈసారిఅఫిడవిట్ను సరిచూసుకోవాలి. ♦ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కేసులున్నాయో.. లేదో..తెలుసుకోవాలి. ♦ సొంత ఆస్తులేకాదు.. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఇది స్థిర, చర ఆస్తులకు కూడా వర్తిస్తుంది. ♦ కంపెనీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు తదితర వివరాలను పొందుపర్చాలి ♦ ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, రుణాలు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం వివరాలను స్పష్టంగా పేర్కొనాలి ♦ మోటారు వాహనాలు, నగలు, బులియన్, ఇతర విలువైన వస్తువులు తూకంతో సహా వెల్లడించాలి 2018 ఎన్నికల తర్వాత 30కిపైగా పిటిషన్లు.. తప్పుడు అఫిడవిట్ల కారణంగా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలా ఒకటి రెండేళ్లు కాదు.. ఏళ్ల కొద్దీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఏ మాత్రం తప్పని తేలినా వేటు పడక తప్పదు. తీర్పు వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు. 2018 ఎన్నికలే కాదు... గతంలోనూ ఇలా కులం, ఆస్తుల విషయంలో కోర్టు చుట్టూ తిరిగిన వారున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైకోర్టులో 30కుపైగా పిటిషన్లు దాఖలు కాగా.. అందులో 25కుపైగా పిటిషన్లు ఒకే పార్టీకి చెందిన నేతలపై దాఖలయ్యాయి. పలువురు మంత్రులపై కూడా ఎన్నికల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్‌పై తీర్పు రాగా.. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఎన్నికపై వివాదం నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. స్టే తెచ్చుకున్నారు. ఇక చెన్నమనేని రమేశ్, మర్రి జనార్దన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై హైకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి. అన్నీ సరిచూసుకుని వివరాలివ్వాలి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న వెలువడనుంది. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నారు. వారి స్థిర, చర ఆస్తులు, అప్పుల అఫిడవిట్లు అందజేస్తారు. ఈ అఫిడవిట్ల సమర్పించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ తెలిపింది. కేసులు, తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు.. ఇలా అన్ని అంశాలను సరి చూసుకుని అఫిడవిట్ అందజేయాలి. లేదంటే తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తోంది. గత 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారంటూ పదుల సంఖ్యలో కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే దాఖలు చేసిన ఈ కేసులు ఇప్పటికి కొన్ని పూర్తవ్వగా, ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని అంశాలను పరిశీలించి అఫిడవిట్ వేయకుంటే శాసనసభ్యుడిగా గెలిచినా.. వేటు పడే అవకాశం ఉంది. - గండ్రాతి అరవింద్‌రెడ్డి -
అనర్హతపై స్టే.. గద్వాల్ ఎమ్మెల్యేకు ఊరట
ఢిల్లీ: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఏం జరిగిందంటే.. అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికపై హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పకపోవడం తన తప్పని అంగీకరించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. ఆ ఖాతాలు తన భార్యవని, సేవింగ్స్ ఖాతాలని తన తరపు న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. ఇక.. వ్యవసాయ భూమిని 2018 ఎన్నికలకు ముందే అమ్మానని, దానివల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడలేదని కోర్టుకు విన్నవించారు. అయితే.. వివరాలు వెల్లడించకపోవడం కచ్చితంగా చట్ట ఉల్లంఘన అని డీకే అరుణ తరఫున న్యాయవాది వాదించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు డీకే అరుణ. -
TS Election 2023: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా.. మారి..
మహబూబ్‌నగర్: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా మారి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయిలో వారి మధ్య రాజకీయ వైరం ఏర్పడింది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టు తీర్పు సంచలనం రేపగా.. డీకే వర్సెస్ బండ్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే డీకే భరత్‌సింహారెడ్డికి సొంత అక్క కొడుకే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. డీకే భరత్‌సింహారెడ్డి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని చేరదీశారు. ఈ క్రమంలో ఆయన అటు రాజకీయంగా, ఇటుఅధికార వ్యవహారాల్లో అన్నీ తానై చక్రం తిప్పారు. ఒకానొక దశలో గద్వాలలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తు న్నాడనే గుసగుసలు సైతం విన్పించాయి. అయితే 1999లో గద్వాల పట్టణంలో కరాటే శ్రీను హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా.. రాజకీయ దుమారం చెలరేగింది. 1999లో శాసనసభ ఎన్నికల్లో గట్టు భీముడి చేతిలో డీకే భరత్‌సింహారెడ్డి భార్య డీకే అరుణ ఓటమిపాలు కాగా.. రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. తన ఓటమికి బండ్ల కృష్ణమోహన్రెడ్డే కారణమని భావించి.. డీకే కుటుంబం ఆయనను రాజకీయాల నుంచి దూరం పెట్టడంతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్ తలిగింది. గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ధర్మవరపు కొట్టం అరుణ.. 2004 నుంచి 2018 మధ్య మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా పని చేశారు. 1999లో కాంగ్రెస్ తరపున గద్వాల నుంచి పోటీ చేసి ఓడారామె. 2004లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి నెగ్గిన ఆమె.. ఆపై కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రోశయ్య హయాంలోనూ మంత్రిగా పని చేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన బంధువు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆమె కృష్ణమోహన్‌రెడ్డిని ఓడిచడం గమనార్హం. 2019లో బీజేపీలో చేరిన ఆమె.. సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ అధిష్టానం ఆమెను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించింది. తాజాగా ఈ మధ్యే కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావుపై అనర్హత వేటు పడగా, ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అందుకే వరుసగా.. తెలంగాణ హైకోర్టు ఈ మధ్య వరుసబెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. మంత్రుల కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కేసులతో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేటు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 90 శాతం పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ జాబితాను పరిశీలిస్తే.. అనర్హత కేసుల్లో.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్ రవీంద్రకుమార్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్, ధర్మపురి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ సతీశ్, మహబూబ్ నగర్ శ్రీనివాస్‌రెడ్డి, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్, కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, సికింద్రాబాద్ పద్మారావు, ఖైరతాబాద్ దానం నాగేందర్, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఈస్ట్ నరేందర్, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, మల్కాజిగిరి మైనంపల్లి హన్మంత్, వికారాబాద్ మెతుకు ఆనంద్, నాంపల్లి జాఫర్ హుస్సేన్, పటాన్ చెరువు మహిపాల్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం. -
జోగులాంబ గద్వాల్లో ప్రజల ఓట్లను ఎవరు గెలుస్తారు?
గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా పేరున్న అరుణ 2018లో తనకు మేనల్లుడు అయ్యే కృష్ణవెెూహన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత అరుణ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం. కృష్ణమోహన్ రెడ్డికి 100415 ఓట్లు రాగా అరుణకు 72155 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఎస్.ఎప్.బి తరపున పోటీచేసిన అబ్దుల్ మొహిన్ ఖాన్ ఏడువేల ఓట్లకు పైగా తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన డి.కె.అరుణ మూడుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక డాక్టర్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవిని పొందారు. తదుపరి రోశయ్య, కిరణ్‌ల మంత్రివర్గాలలో కొనసాగారు. 2014లో ఆమె తన మేనల్లుడు టిఆర్ఎస్ అభ్యర్ధి అయిన కృష్ణమోహన్‌రెడ్డిపై 8260 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. గద్వాలలో పదిహేను సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎన్నికైంది. ఒకసారి మాత్రం బిసి (బోయ) ఎన్నికయ్యారు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు గెలిచినా, కోర్టు తీర్పు కారణంగా ఒకసారి కాంగ్రెస్ ఐ వశం అయింది. ఒకసారి టిఆర్ఎస్, ఒకసారి జనతా, ఒకసారి సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. మూడుసార్లు ఇండి పెండెంట్లు గెలిచారు. డి.కె. అరుణ 2004లో కాంగ్రెస్ ఐ టిక్కెట్ రాకపోవడంతో సమాజవాది పక్షాన పోటీచేసి గెలుపొంది కాంగ్రెస్ ఐ అనుబంధ సభ్యులయ్యారు. గద్వాలలో డి.కె. కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబానికి చెందిన సత్యారెడ్డి రెండుసార్లు, ఈయన పెద్ద కుమారుడు డి.కె.సమరసింహారెడ్డి నాలుగుసార్లు, రెండో కుమారుడు భరతసింహారెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య అరుణ మూడుసార్లు గెలుపొందారు. అంటే మొత్తం తొమ్మిది సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందారు. అయితే 1994లో అన్నదమ్ములిద్దరూ పోటీపడితే టిడిపి మద్దతుతో ఇండిపెండెంటుగా ఉన్న భరత్ సింహారెడ్డి గెలవగా, 1999లో బావా మరదళ్ళు పోటీపడి ఇద్దరూ పరాజితులయ్యారు. ఒకసారి టిడిపి అభ్యర్ధి గట్టు భీముడు గెలుపొందారు. 2004,2009లో అరుణ గెలుపొందారు. 2009లో డి.కె. అరుణ, ఆమెకు మేనల్లుడు అయ్యే టిడిపి పక్షాన కృష్ణమోహన్‌రెడ్డి పోటీపడటం విశేషం. 2014లో ఆయన టిఆర్ఎస్లోకి మారారు కాని ఫలితం దక్కలేదు. 2018లో గెలవగలిగారు. 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచిన గోపాల్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, సమరసింహారెడ్డి ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. డి.కె. సమరసింహారెడ్డి గతంలో చెన్నా, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పి.పుల్లారెడ్డి అలంపూర్‌లో రెండుసార్లు గెలుపొందారు. కాగా మాజీమంత్రి డి.కె. సమరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరడం విశేషం. కాని2004లో ఇక్కడ బిజెపి మిత్రపక్షం పోటీచేయడంతో ఆయనకు అవకాశం రాలేదు.దాంతో ఆయన ఆ పార్టీని వదలివేశారు. గద్వాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. గద్వాలలో కారు డ్రైవర్ ఎవరు?
వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారే. ఒకరు జడ్పీ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. కాని ఒకరంటే ఒకరికి పడదు. సమన్వయంతో పనిచేయడం మానేసి.. ఆధిపత్య పోరుకు తెర తీసారు. ఒకరు మంత్రి మనిషి.. మరొకరికి మంత్రితో పడదు.. దీంతో ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఇంటా, బయటా.. వేడేక్కిన రాజకీయం నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం.. అధికార పార్టీలోని వారి మధ్యే జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు కొంతకాలంగా అంతర్గత వైరం కొనసాగుతుంది. గతంలో జడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆమె ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సైతం డీ అంటే డీ అన్నట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను ఎదుర్కొని నిలవటం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు నిత్యం సవాల్‌గా మారుతోంది. ఇప్పుడు స్వంత పార్టీ నేత నుంచి కూడా ప్రతికూల పరిస్ధితులు ఎదురు కావడంతో ఆయనలో ఆందోళన పెరుగుతోంది. మా దారి మాదే గద్వాల నియోజకవర్గంలో జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎవరికి వారుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధిలేని పరిస్ధితిలో జడ్పీ సమావేశంలో కలిసి పాల్గొన్నా అంటిముట్టనట్టే ఉంటున్నారు. వీరిద్దరి మద్య వైరానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుడిగా ముద్ర పడింది. దీంతో నిరంజన్‌రెడ్డితో ఆయనకు సఖ్యత లేదనే వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి తనకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ సరిత గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఓసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలను ఆహ్వానించారు. మంత్రుల ఫోటోలతో జిల్లా కేంద్రంలో స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు చైర్మన్ సరిత. తనకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఇదే విషయాన్ని మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి వర్గపోరు కారణంగానే ఆ ఇద్దరు మంత్రులు మీటింగుకు రాకుండా డుమ్మా కొట్టారు. కులాల కురుక్షేత్రం గద్వాల నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో వాల్మీకి బోయల తర్వాత కురువ సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. కురువ వర్గానికి చెందిన సరిత రాజకీయంగా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గద్వాలలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. చదవండి: బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బీసి కోటా కింద గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ వస్తే ఎంతైనా ఖర్చు చేస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారట. పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను చేరదీసి తన వర్గంలో కలుపు కుంటున్నారట. జడ్పీ చైర్పర్సన్ భర్త తిరపతయ్య కూడ గద్వాల రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. నన్నే పక్కనబెడతారా? ఇటీవల బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని తాను రాకముందే జడ్పీ చైర్‌పర్సన్‌తో ప్రారంభింప చేయటంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సంబంధిత శాఖ జిల్లా కోఆర్డినేటర్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్‌పర్సన్‌కు మద్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండటంతో ప్రభుత్వ అధికారుల పరిస్దితి డోలాయమానంలో పడింది. ఎవరిని కలిస్తే ఎవరికి కోపం వచ్చి తమను టార్గెట్ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు గద్వాల జిల్లాలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక కంట కనిపెట్టాలని.. విభేదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ కేడర్ కోరుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అధికారి కాలర్ పట్టుకున్న గద్వాల ఎమ్మెల్యే
గద్వాల రూరల్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారి చొక్కా కాలర్ పట్టి బూతులు తిట్టిన ఘటన మంగళవారం గద్వాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. గద్వాలలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితను అధికారులు ఆహ్వానించారు. నిర్దేశిత సమయానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ ఆ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకొని కోపంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై చిందులు తొక్కారు. ప్రొటోకాల్ ప్రకారం గురుకుల పాఠశాలలకు తాను చైర్మన్‌కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌తో దానిని ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ వెంగళ్‌రెడ్డి సర్దిచెప్పబోగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే ఆయన చొక్కా కాలర్ పట్టుకుని బలంగా వెనక్కి నెట్టేశారు. పత్రికలో రాయలేని విధంగా బూతులు తిడుతూ ఊగిపోయారు. దీంతో పక్కనే ఉన్న మహిళా అధికారులు, నాయకులు బిత్తరపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు అధికారి వెంగళ్‌రెడ్డిని పక్కకు తీసుకుపోయారు. ప్రజాప్రతినిధి దాదాగిరికి పాల్పడటంపట్ల అధికార, ఉద్యోగవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్లో ఉన్న గ్రూపుల మధ్య నలుగుతున్న అధికారులు తాజా ఘటనతో బెంబేలెత్తుతున్నారు. వారిలో భయాందోళన వ్యక్తమవుతోంది. -
అధికారి గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
-
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
న్యాయం జరగడమే కాదు, కనిపించాలి
ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయవ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధుల్లోకి చొచ్చుకుని వస్తోందని తరచూ విమర్శల పాలవుతుండటం విచారకరం. హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణలో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నత జరుగుతున్నదని వ్యాఖ్యానించడం, దానిపై ఆదేశాలు జారీచేస్తామనడంపై కనీవినీ ఎరుగని విమర్శలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ చూసి ఎరగమనీ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. చాలా కాలంగా అలాంటి విమర్శలు వస్తున్నా మంచి వాతావరణం నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్టు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ స్థితిలో సగటు మనిషి ఎలా స్పందించగలడో ఎవరైనా సులభంగా ఊహించగలరు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో న్యాయవ్యవస్థ ఒకటి. రాజ్యాంగం ప్రకారం శాసనాలపై వ్యాఖ్యానించి వాటి రాజ్యాంగబద్ధతను తేల్చడం, ప్రభుత్వాల చర్యలు సరిగా వున్నాయో లేదో చూడటం న్యాయవ్యవస్థ ప్రధాన బాధ్యత. ఈ క్రమంలో రాజ్యవ్యవస్థకూ వ్యక్తులకూ మధ్య, వ్యక్తులకూ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకూ మధ్య ఏర్పడే వివిధ వివాదాలను నిష్పాక్షిక రీతిలో పరిష్కరించడం కూడా న్యాయవ్యవస్థ బాధ్యతే. న్యాయస్థానాలు స్వతంత్రంగా ఉండాలి. అంటే ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వేతర వ్యక్తుల అసందర్భ ప్రభావాలకు న్యాయస్థానాలు గురికాకూడదని అర్థం. తమ ముందున్న కేసులను నిష్పాక్షికంగా నిర్ణయించడం న్యాయమూర్తుల బాధ్యత కాబట్టి అంతకు మించిన ప్రాధాన్యత వారికి దేంట్లోనూ ఉండదు కనుక నిజమైన న్యాయమూర్తులు ప్రజాకర్షణపై దృష్టి పెట్టరు. ప్రజాకర్షణకోసం వెంపర్లాడేవారు వివాదాలపై నిష్పాక్షిక నిర్ణయాలు వెలువరించలేరు. ఈ కారణం వల్లే న్యాయమూర్తులు ఏ పరిస్థితుల్లోనూ, ఏరకమైన అనుమానాలకూ తావీయకుండా గొప్ప సూక్ష్మగ్రాహ్యతతో, సున్నితత్వంతో పని చేయాల్సి ఉంటుంది. న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం చేసినట్లు కనిపించాలి అని సుప్రసిద్ధ నానుడి కూడా ఉంది. 1924లో ఆర్ వర్సెస్ సెషన్స్ జస్టి్టస్కి సంబంధించిన ఒక ఇంగ్లిష్ కేసును ఉదహరిద్దాం. ఒక మోటార్ సైకిల్ చోదకుడు రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. అతడిపై విచారణ సాగి అంతిమంగా తనను దోషిగా ప్రకటించారు. తర్వాత ప్రతివాది దీనిపై ట్రయల్ కోర్టుకు వెళ్లినప్పుడు కింది కోర్టు తీర్పును కొట్టివేశారు. న్యాయమూర్తుల వద్ద పనిచేస్తున్న ఒక క్లర్కు ఒక న్యాయవాద సంస్థలో సభ్యుడుగా ఉండేవాడు. ఒక పౌర దావాలో ఈ క్లర్కుకూ, ఆ మోటారు సైకిలిస్టుకూ వివాదం నడిచింది. దాంతో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును క్లర్కు ప్రభావితం చేసి ఉంటాడనే అనుమానంతో ప్రతివాది పైకోర్టుకు వెళ్లాడు. కానీ న్యాయమూర్తులు అతడి అభ్యర్థనను తిరస్కరిస్తూ, ఆ క్లర్క్ ఈ కేసులో ఏరకంగానూ న్యాయమూర్తులను ప్రభావితం చేయలేదని చెప్పారు. కానీ ఆ మోటారు సైకిలిస్టు పేర్కొన్న ఇతర అంశాలను ఎగువ కోర్టు ఆమోదించింది. అయితే అతడి అప్పీల్‌ని విచారించిన కింగ్స్ బెంచ్ అంతిమంగా ఇలా చెప్పింది. ‘నిస్సందేహంగా ఈ కేసు పూర్వాపరాలను చూసినట్లయితే క్లర్కు చాలా జాగ్రత్తగా ఈ కేసు విషయంలో దూరం పాటించాడని తెలుస్తోంది. అయితే అనేక కేసులు ఈ ఉదంతానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదని సూచిస్తున్నాయి, ప్రాథమిక విషయం ఏమిటంటే, న్యాయం జరగడమే కాదు, నిస్సందేహంగా న్యాయం జరిగినట్లు కనిపించాలి కూడా.’ ఈ కేసు పూర్వాపరాలు స్పష్టంగా నిరూపిస్తున్నది ఏమిటంటే, న్యాయమూర్తులను క్లర్క్ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది అనే. ఈ పరిశీలనతోటే కింగ్స్ బెంచ్ కింది కోర్టు తీర్పును కొట్టిపడేసింది. న్యాయ సోదరుల్లో ఒక సభ్యుడిగా, నేను న్యాయవ్యవస్థ శ్రేయస్సుకోసం తపిస్తాను, తీర్పు చెప్పే తన యంత్రాంగం ద్వారా ప్రజాస్వామిక సూత్రాలను ఎత్తిపట్టడంలో దానికి కీలక పాత్ర ఉండాలని కూడా కోరుకుంటాను. సంబంధిత ఆదేశాలను చదవకుండానే కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లోకి న్యాయవ్యవస్థ వాస్తవంగా చొరబడిందని నేను చెప్పలేను కానీ న్యాయవ్యవస్థ ఆదేశాలపై ప్రజల స్పందనలను గురించి చెప్పగలను. కలవరం కలిగించే విషయం ఏమిటంటే, 2019 మధ్యలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ తన నిర్ణయాధికారం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లోకి ఉద్దేశపూర్వకంగా చొరబడుతున్నదని విమర్శలకు పాత్రమవుతుండటం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ వస్తుగతంగా కాకుండా ఆత్మాశ్రయరీతిలో నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయం కలగడం దురదృష్టం. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రాథమికమైనది. కానీ మీడియా ఇప్పుడు వేరువేరు రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటున్నందువల్ల, న్యాయస్థానాల నిర్ణయాలతో సహా ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు బుద్ధిపూర్వకంగా గానీ అనుద్దేశంగా గానీ ఒక గ్రూప్‌లో పాపులర్ అవుతున్నారు. మరొక గ్రూపులో లేదా గ్రూపుల్లో చెడుగా ప్రచారానికి లోనవుతున్నారు. దీంతో ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు ఒక గ్రూప్ లేదా కొన్ని గ్రూపులకోసం పనిచేస్తున్నారని ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లిపోతున్నాయి. ప్రజల్లో ఏ వర్గంలోనూ న్యాయమూర్తులు ప్రాచుర్యం పొందకూడదన్న భావనకు ఇది సన్నిహితంగా లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 10 మంది కరోనారోగుల మృతికి కారణమైనట్లు ఆరోపణలకు గురైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కేసులో దాని యజమాని డాక్టర్ రమేష్ అరెస్టు, విచారణ ప్రక్రియపై స్టే ఆదేశాలు ఇవ్వడం కానీ, అమరావతి అసైన్డ్ భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఎమ్మార్వో సుధీర్ బాబు కేసులో విచారణను ఏపీ హైకోర్టు నిలిపివేయడం కానీ ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశాల్లో హైకోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదని విమర్శలు బయలుదేరాయి. తదనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు ఆదేశాల పట్ల అసంతృప్తిని ప్రకటించింది. క్రిమినల్ కేసుల దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని భావిస్తూ సుప్రీంకోర్టు అవసరమైన ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ హైకోర్టుపై విమర్శలకు బలాన్ని చేకూర్చినట్లయింది. మాజీ అడ్వొకేట్ జనరల్‌పై మరో పదిమంది ఇతరులపై భూకుంభకోణానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని మీడియాలో ప్రచురించకుండా హైకోర్టు నిషేధ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, ఈ కేసును దర్యాప్తుపై స్టే విధించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ బాబు పట్ల పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణపై సీబీఐ విచారణకు ఆదేశించడం, ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ కేంద్ర ట్రిబ్యునల్ తీర్పును సైతం పక్కనబెట్టడమే కాకుండా అతడికి వేతనం బకాయిలను కూడా చెల్లించాలని ఆదేశించినప్పుడు ఏపీ హైకోర్టు తీవ్ర విమర్శల పాలైంది. హైకోర్టు ఆదేశాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టిపడేయటమే కాకుండా కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ, అతడి సస్పెన్షన్ కొనసాగింపునకు ఆదేశాలిచ్చింది కూడా. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పేదలకు ఇళ్లపట్టాలివ్వడానికి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై ఏపీ హైకోర్టు విమర్శలను ఎదుర్కొంది. పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నత జరిగిందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడంపై కనీవినీ ఎరుగని విమర్శలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ చూసి ఎరగమనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టుపై, ఇలాంటి ఆదేశాలిచ్చిన న్యాయమూర్తిపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లిపోయాయి. సొంత అభిప్రాయాలు చొప్పించకుండా, నిష్పాక్షికంగా నిర్ణయాలు ప్రకటించాల్సిన న్యాయమూర్తులు ఇలాంటి విమర్శలకు ఎందుకు అవకాశమిస్తున్నారు? ఏదైనా కేసులో న్యాయమూర్తి నిర్ణయంపై తగుమాత్రం అనుమానం వచ్చినా సంబంధిత కేసులో నిజమైన న్యాయమూర్తి పాలు పంచుకోకూడదు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి అనే సూత్రాన్ని కోర్టులు విధిగా పాటించాల్సి ఉంది. చాలా కాలంగా అలాంటి విమర్శలకు గురవుతున్నప్పుడు మంచి వాతావరణం నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్టు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇలాంటప్పుడు సగటు మనిషి ఎలా స్పందించగలడో ఎవరైనా సులభంగా ఊహించగలరు. అలాంటి విమర్శకు కోర్టులు తావు కల్పించవని ఆశిద్దాం. అలాంటి విమర్శలు భవిష్యత్తులో ఎదుర్కోకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి, కోర్టుల పట్ల ప్రజల గౌరవం కొనసాగేలా చూడాలి. జస్టిస్ గురిజాల కృష్ణమోహన్ రెడ్డి వ్యాసకర్త, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి -
వ్యక్తులకన్నా వ్యవస్థలు గొప్పవి
-
ఆ ఆరోపణలపై విచారణ జరపాల్సిందే..
సాక్షి, అమరావతి : వ్యక్తుల కంటే వ్యవస్థలే గొప్పవని, ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గురిజాల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చిరుద్యోగి అయినా, ఉన్నతోద్యోగి అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని.. వారికి అనుమానాలు, సందేహాలు కలిగేలా వ్యవస్థలోని పెద్దలు వ్యవహరించకూడదన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, నలుగురు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి ఇటీవల ఫిర్యాదు చేయడం తదితర అంశాలపై జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విచారణ జరిపితేనే కదా అవి ఆరోపణలో.. వాస్తవాలో తెలిసేది సీఎం జగన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలను సమర్పించారు. వాటిపై సీజేఐ స్పందించి విచారణ జరిపించాలి. ప్రాథమిక ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి. సీఎంవి ఆరోపణలు అంటున్నాం. కాబట్టి విచారణ జరిపితే అవి ఆరోపణలా? లేక వాస్తవాలా అన్నది తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే కదా. ప్రజాస్వామ్య పరిరక్షణలో కోర్టులది చాలా ముఖ్య భూమిక. న్యాయస్థానాలు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే.. సమాజంలో చెడును నియంత్రించడంలో వాటిది కీలకపాత్ర. మనస్సులో ఏదో పెట్టుకుని చేస్తున్నాయన్న భావన, అనుమానాలు ప్రజల్లో కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. దీనివల్ల వ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుంది. న్యాయస్థానాలు సరిగ్గా ఉన్నప్పుడు తప్పులు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కోర్టులు సరిగ్గాలేవని నేను చెప్పడంలేదు. అలాగే, కేసులున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి వైఎస్ జగన్ ఈ ఫిర్యాదు చేశారని కొందరు అంటున్నారు. అవి అర్థంలేని మాటలు. తన దృష్టికి వచ్చిన వాటిపై సీజేఐకి ఫిర్యాదు చేసే హక్కు సీఎంకి ఉంది. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సీజేకు ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. కోర్టులూ చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలి కాగ్నిజబుల్ నేరం ఉంటే దర్యాప్తు అధికారి కానీ, ఎస్‌హెచ్‌వో కానీ దర్యాప్తు చేయాలి. ఈ అధికారాన్ని చట్టాలు, శాసనాలు సదరు అధికారికి కట్టబెట్టాయి. దర్యాప్తు చేయకుండా దర్యాప్తు అధికారిని అడ్డుకోవడానికి వీల్లేదు. దర్యాప్తును ఆపడానికి కూడా వీల్లేదు. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగం, పార్లమెంట్, అసెంబ్లీ చేసిన చట్టాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరూ నడుచుకోరాదు. వాటిని ఉల్లంఘించరాదు. దర్యాప్తు చేసే అధికారాన్ని ఓ చట్టం ఇచ్చినప్పుడు, ఆ అధికారాన్ని కోర్టులు ఎలా అడ్డుకుంటాయి? ఈ విషయంలో న్యాయస్థానాలు చాలా జాగరూకతతో, స్వీయ నియంత్రణతో పనిచేయాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం స్టేలపై ప్రజల్లో అనుమానాలు స్టే అన్నది తాత్కాలిక ఉపశమనం కింద న్యాయస్థానాలిచ్చే ఓ ఊరట మాత్రమే. వీటిని ఏళ్ల తరబడి అలా కొనసాగించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని ఇటీవల, తాజాగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే.. స్టేలు 15–16 ఏళ్లపాటు కొనసాగుతుండటంతో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వీటిని దూరం చేయడానికి కోర్టులు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతోంది. ఈ స్వల్ప కాలంలో హైకోర్టు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ జీఓలపై స్టేలు ఇచ్చింది. చాలా కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే తీర్పులిస్తోందా? అన్న సందేహాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా న్యాయస్థానాలు వ్యవహారశైలి ఉండకూడదు. కేసులు కూడా కొందరు న్యాయమూర్తుల వద్దకే వస్తున్నాయని, వారే కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇక ఇళ్ల స్థలాలపై స్టే గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇన్ని అనుమానాలు ప్రజల్లో ఎందుకు కలిగించాలి? అనుమానాలకు ఆస్కారం ఇవ్వనేకూడదు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ గోపాల్‌రావు, జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మరికొందరు రాజధానిపై పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను పూర్తిస్థాయిలో విచారించలేదు. కానీ, ఆ తరువాత దాఖలైన వ్యాజ్యాలు మాత్రం పరిష్కారం అవుతున్నాయి. రాజధానిపై అనేక కేసులను విచారిస్తున్నారు. ఇలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకూడదన్నదే నా అభిప్రాయం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఓ చిన్న ఉద్యోగి లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తే వాటిపై విచారణ జరపాల్సిందే కదా. అవి రుజువైనప్పుడు, దాని ప్రభావం వ్యవస్థపై తక్కువగా ఉంటుంది. అదే ఓ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రుజువైనప్పుడు దాని ప్రభావం వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంటుంది. వాటిని విచారించకుండా అలా వదిలేస్తే వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. ఇది అన్నింటికన్నా ప్రమాదం. కాబట్టి ఫిర్యాదు అందినప్పుడు విచారణ జరిపి నిజానిజాలు తేల్చడం వ్యవస్థకే మంచిది. అసలు తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. -
పాపం ఎద్దులు బెదరడంతో..
సాక్షి, ధరూరు (గద్వాల) : నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి ఎద్దుల బండితో సహా దూసుకెళ్లిన సంఘటన మండలంలోని మన్నాపురం శివారులో చో టుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కుర్వ తిమ్మన్న శనివారం ఉదయం ఎద్దులతో బండిని వ్యవసాయ పొలానికి తీసుకెళ్లి.. సా యంత్రం ఎద్దుల బండితో ఇంటికి తిరుగుపయాణమయ్యాడు. అయితే గ్రామ సమీపంలో ఓ రైతు కాల్వ వద్ద విద్యుత్ మోటార్‌ను ఆన్ చేసి మట్టి దిబ్బ పక్క నుంచి సడన్‌గా లేచాడు. దీం తో కాల్వ పక్కనే వెళ్తున్న ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయి.. నెట్టెంపాడు ప్రధాన కాల్వలోకి దూసుకెళ్లాయి. కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతు కుర్వ తిమ్మన్న ప్రాణాల ను కాపాడుకుని బయటకు రాగా.. ఎద్దులబండి కట్టి ఉండటంతో ఎద్దులు మృత్యువాత పడ్డా యి. ఈ విషయమై రైతులు వెంటనే ఘటనా స్థలానికి అర కిలో మీటర్ దూరంలో ఉన్న పంప్‌హౌస్ వద్దకు వెళ్లి పంపులను ఆఫ్ చే యాలని కోరగా అక్కడి అధికారులు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు చెబితేనే బంద్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవ డంతో ఈ విషయాన్ని రేవులపల్లి పోలీసులు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిలకు సమాచారం ఇవ్వడంతో వారు గుడ్డెందొడ్డి లిఫ్టు–1కు ఫోన్ చేసి నీటి పంపింగ్‌ను బంద్ చేయించారు. ట్రెయినీ ఎస్ఐ సందీప్‌రెడ్డి, ఏఎస్ఐ వెంకటేష్‌గౌడ్ అక్కడికి వచ్చి ఎద్దులు, బండిని తాళ్లతో కట్టి బయటకు తీశారు. అయితే మూడు నెలల క్రితమే పెబ్బేరు సంతలో ఎద్దులను రూ.80 వేలకు కొనుగోలు చేశామని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
సీఎం జగన్ ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం జీవో జారీ చేశారు. కృష్ణమోహన్ రెడ్డి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. మరోవైపు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తూ గవర్నర్ నరసింహన్ నోటీఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదనపు కార్యదర్శిగా కే. ధనుంజయరెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ధనుంజయ్ రెడ్డి గతంలో వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.