Life Sciences
-
కేన్సర్లను ముందుగా గుర్తించే 'రక్ష ఆధారిత పరీక్ష'..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్ స్పాట్‌గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్ కణితికి సంబంధించిన డీఎన్ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్ ప్రొఫైలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. రక్తంలో డీఎన్ఏ మిథైలేషన్ని గుర్తించడానికి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్ కట్టుబడి ఉంది. భారత్‌లో కేన్సర్ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది. ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ. అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్‌తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్‌ని జయించేలా ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్స్పాట్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ మాయం..!) -
హైదరాబాద్‌లో ఇండిజీన్ కొత్త సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ సైన్సెస్ కమర్షియలైజేషన్ కంపెనీ ఇండిజీన్ తమ అంతర్జాతీయ డెలివరీ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించింది.నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సహాయం అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించగలదని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా తమకు 6 హబ్‌లు, 18 కార్యాలయాలు ఉన్నట్లు వివరించింది. -
సోరియాసిస్‌ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..
పర్పుల్ లైఫ్ సైన్సెస్ సోరియాసిస్ నుంచి ఉపశమనం కలిగించేలా ప్రకృతి సహజస్ధిమైన వాటితో తయారుచేసిన సరికొత్త ఆయిల్ PSOCAREని ప్రారంభించింది. ఈ సంస్థ సంప్రదాయ వైద్య విధానానికి పెద్దపీట వేసేలా.. ప్రకృతిసిద్ధమైన వాటిపై దృష్టిసారించిన ఏకైక సంస్థ. ఈ సంస్థ ప్రవేశపెట్టిన అనేక ఉత్పత్తుల్లో ఇలాంటి ప్రొడక్ట్ మొదటిదని సంస్థ పేర్కొంది. ఇది సోరియాసిస్ లక్షణాలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. దీనిలో మొక్కల ఆధారిత ఆంథోసైనిన్, బాకుచియోల్, సోరాలిడిన్, ప్సోరాలెన్ ఉన్నాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపుని నయం చేయడమే గాక దీనికి కారణమైన ఆక్సీకరణ ఒత్తిడిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా ఆవ్యాధి లక్షణాలను తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్ కోసం పర్పుల్ మొక్కజొన్నను వాణిజ్యపరంగా పండిస్తున్న ఏకైక భారతీయ కంపెనీ కూడా ఇదే. ఈ PSOCARE అనేది సింథటిక్ పదార్థాలు లేదా దుష్ప్రభావాలు లేకుండా అందించే సహజ సిద్దమైన ఆయిల్. దీర్ఘకాలికి వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించి, తగ్గించే లక్ష్యంతో ఈ ఉత్పత్తిని తీసుకొచ్చామని సంస్థ డైరెక్టర్ మొహలి, ఫార్మాస్యూటికల్ డైరెక్టర్ రాఘవ్ రెడ్డి చెబుతున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాంప్రదాయ చికిత్స విధానంతో చక్కటి ఆరోగ్యాన్ని అందివ్వాలన్నదే మా లక్ష్యం అని ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ కే మణికంఠ రెడ్డి అన్నారు. అలాగే ప్రకృతి శక్తికి సాంకేతికతను జోడించి ఎలాంటి దుష్ప్రభావాలు ఇవ్వని సాంప్రదాయ వైద్యాన్ని సమర్థవంతంగా అందించడమే తమ సంస్థ లక్ష్యం అని చెబుతున్నారు.(చదవండి: ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!) -
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అవకాశాలు అపారం : పల్సస్ సీఈవో
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో ఇన్ఫ్యూజన్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌స్కిల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఇంజనీరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లోని అవకాశాలపై చర్చించేందుకు రఘు ఫార్మసీ కాలేజీ, ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఇంజనీరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రావిణ్యాల్ని పెంపొందించుకోవాలని తెలిపారు. తద్వారా అవకాశాల్ని అందింపుచ్చుకోవచ్చన్నారు. టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న గణణీయమైన మార్పులపై దృష్టిసారించాలని .. ఫార్మాస్యూటికల్స్ , ఏఐ వ్యాప్తి, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల గురించి హైలైట్ చేశారు. ఇంజినీరింగ్ టెక్నిక్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఇండియా, ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్లు, ఉపాధి, గ్లోబల్ హెల్త్‌కేర్ సపోర్ట్ విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఖరీదైన మెడిసిన్ తయారు చేయడం ఖర్చతో కూడుకుంది. అయినప్పటికీ భారత్ ఫార్మా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. -
అడ్వెంట్ @ రూ.16,550 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ ‘అడ్వెంట్ ఇంటర్నేషనల్’హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.16,550 కోట్లు (రెండు బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో శుక్రవారం అడ్వెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పటా్వరీ, ఆపరేటింగ్ భాగస్వామి వైదీష్ అన్నస్వామి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కేటీఆర్‌తో జరిగిన ఈ భేటీలో తమ సంస్థ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ఆసియా ఖండంలోనే అడ్వెంట్ పెట్టుబడిని అతి పెద్దదిగా భావిస్తున్నారు. యాక్టిఫ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు తమ పెట్టుబడి దోహదం చేస్తుందని అడ్వెంట్ అంచనా వేస్తోంది. 50 వేల చదరపు అడుగుల్లో ల్యాబ్ ఇదిలా ఉంటే హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల్లో పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (ఆర్ అండ్ డీ ల్యాబ్)ను అడ్వెంట్ ఏర్పాటు చేస్తోంది. తమ అధీనంలోని ఆర్ఏ కెమ్ ఫార్మా, జెడ్సీ కెమికల్స్, అవ్రా లేబొరేటరీ వంటి సంస్థలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంటుంది. హైదరాబాద్ సువెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో రూ.9,589 కోట్లతో పాటు ఇతర సంస్థల్లోనూ అడ్వెంట్ పెట్టుబడులు పెడుతుంది. ఐటీ, లైఫ్‌సైన్సెస్ బలానికి నిదర్శనం అడ్వెంట్ ఇంటర్నేషనల్ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించడం ఇక్కడి లైఫ్‌సైన్సెస్, ఐటీ రంగాల బలానికి అద్దం పడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులతో వస్తున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. తన అమెరికా పర్యటనలో భాగంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మల్డోనాతో జరిగిన సమావేశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
పెట్టుబడులు ఆకర్షించేలా వసతుల కల్పన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాలతోపాటు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా చేపట్టిన మౌలిక వసతుల కల్పన ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనం కోసం మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చింది. శనివారం వారు టీ–హబ్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సదుపాయాల కారణంగానే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ వరుసగా రెండేళ్లు దాటేసిందన్నారు. ఐటీ ఎగుమతులతోపాటు ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామన్నారు. టీఎస్–బీ పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై ఒక్కరోజే 7 జీవోలను జారీ చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాయన్నారు. అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుందని అంటున్నారని చెప్పారు. మహారాష్ట్రతో అనుబంధం వీడనిది విద్యార్థిగా పుణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చరిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ, మహారాష్ట్ర మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ముంబై తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి: మహారాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ గత పదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని మహారాష్ట్ర ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి తమకు గుర్తుందని, పాలకులకు సరైన విజన్ ఉంటే అభివృద్ధి చెందుతుందనడానికి హైదరాబాద్ నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. -
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్‌లో ‘స్టెమ్ సెల్’ ల్యాబ్!
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో దేశంలోనే అతి పెద్ద స్టెమ్ సెల్ తయారీ ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ‘స్టెమ్ క్యూర్స్ కంపెనీ’ప్రకటించింది. సుమారు 54 మిలియన్ డాలర్ల (సుమారు రూ.440 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ తయారీ యూనిట్‌తో 150 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మన దేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కాగా ప్రపంచ వైద్య ఆవిష్కరణలకు తన సొంత నగరమైన హైదరాబాద్ హబ్‌గా మారిందంటూ సాయిరాం సంతోషం వ్యక్తం చేశారు. నల్లగొండలో సొనాటా కార్యకలాపాలు నల్లగొండలో ప్రారంభం కానున్న ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సొనాటా సాఫ్ట్వేర్ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఐటీ టవర్‌లో సొనాటా సాఫ్ట్వేర్ 200 ఉద్యోగాలు కల్పిస్తుంది. బోస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సొనాటా సాఫ్ట్వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీని వీరవెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఇందుకూరి తదితరులు భేటీలో పాల్గొన్నారు. నగరానికి ప్లూమ్, సనోఫీ, పై హెల్త్ కమ్యూనికేషన్స్ సర్విస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ), వారి సబ్‌స్రై్కబర్లకు సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) అనుభూతిని కలిగించిన వేదిక ‘ప్లూమ్’హైదరాబాద్‌లో వంద మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. జయేశ్ రంజన్‌తో ప్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ ఈదర భేటీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ ఫార్మా సంస్థ సనోఫీ 350 ఉద్యోగులతో ఒక సెంటర్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో సమగ్ర కేన్సర్, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ‘పై హెల్త్’సహ వ్యవస్థాపకులు డాక్టర్ బాబీ రెడ్డి ప్రకటించారు. నిక్కీ హేలీతో కేటీఆర్ భేటీ ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతో కేటీఆర్ భేటీ అయ్యారు. భారత్, యూఎస్ సంబంధాల్లో హైదరాబాద్, తెలంగాణకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతపై చర్చించారు. ఆర్థిక, ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా లోతుగా చర్చించడంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ హేలీని మంత్రి అభినందించారు. -
మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. లైఫ్‌సైన్సెస్‌తోపాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. బేగంపేటలో మంగళవారం ఏర్పాటుచేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల బయో ఆసి యా సదస్సును విజయవంతంగా నిర్వహించుకున్నామని, లైఫ్‌సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నా యని కేటీఆర్ తెలిపారు. 2013తో పోలి స్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని, 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామ ని మంత్రి వివరించారు. ఉపాధి కల్పనకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రపంచ టీకాల్లో సగం హైదరాబాద్‌లోనే తయారీ.. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, 900 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ఉత్పత్తి 1,400 కోట్ల డోస్‌లకు పెరగవచ్చన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం తెలంగాణలోని డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని, ఇది దేశానికే మొబిలిటీ కేంద్రంగా మారుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని పారిశ్రామిక పార్కులు గత ఎనిమిదేళ్లలో 28,500 ఎకరాల్లో 55 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. గత 40 ఏళ్లలో 26 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన 109 పారిశ్రామిక పార్కులకంటే ఇవి ఎక్కువన్నారు. ప్రస్తుతం మరో 72 ఇండ్రస్టియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబో యే ఐదేళ్లలో 30 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. సాంకేతిక పురోగమనం.. నేడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ పరిణామం దేశవ్యాప్తంగా ప్రతి భావంతులను, మేధావులను ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత, సాంకేతిక పురోగమనం పెద్దవారికే కాకుండా చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు సహాయపడేలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాపారాల కోసం ప్రారంభించిన ఇండియన్ బిజి నెస్ పోర్టల్ గ్లోబల్‌లింకర్ ప్రత్యేకంగా ఎగుమతుల ను ప్రోత్సహించడం కోసం రూపొందిందన్నారు. విద్యుత్, టెక్స్టైల్ రంగాలకు ఊతం.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. టెక్స్టైల్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉందన్నా రు. భారీస్థాయిలో కాకతీయ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్ సుచిత్ర ఎల్లా, సీఐఐ తెలంగాణ చైర్మన్ వాగీష్ దీక్షిత్, కిటెక్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం.జాకబ్, గ్లోబల్ లింకర్ డైరెక్టర్ మాళవిక జగ్గీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రీస్ అవార్డ్స్–2022’విజేతలను ప్రకటించింది. 28 మంది అవార్డు గ్రహీతలను ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ అత్యుత్తమ వేదిక.. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సుల్తాన్పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందని, ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామని, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాయని కేటీఆర్ వివరించారు. -
బయో ఆసియా విజేతలుగా ఐదు స్టార్టప్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు బయో ఆసియా–2023లో రెండో రోజు జరిగిన చర్చా గోష్టిలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేషన్లు, పేరొందిన ఆరోగ్య రక్షణ రంగ నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, స్టార్టప్‌ల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు ఐదు కీలక అంశాలపై చర్చా గోష్టులు జరగ్గా ఆపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి మధ్య ఫైర్‌సైడ్ చాట్ జరిగింది. 50కి పైగా దేశాల నుంచి రెండువేల మందికిపైగా ప్రతినిధులు హాజరు కాగా, రెండు రోజుల్లో రెండు వేల ముఖాముఖి వాణిజ్య సమావేశాలు జరిగాయి. 76 స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, అత్యంత వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించిన ఐదు స్టార్టప్‌లను విజేతలుగా ప్రకటించారు. విజేతలైన ఎక్సోబోట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాంబ్డాజెన్ థెరాప్యుటిక్స్, ప్రతిభ హెల్త్‌కాన్, రాంజా జీనోసెన్సర్, సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ స్టార్టప్‌ల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సదస్సు ఆదివారం ముగియనుంది. -
వైద్యంలో దేశానికే దిక్సూచి..
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోందని, దేశానికే దిక్సూచిగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. దేశంలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రస్తుతం 80 బిలియ¯న్ డాలర్లుగా ఉన్న తెలంగాణ భాగస్వామ్యం... 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు ‘ఐ’లు భారత్‌కు నాలుగో కన్నుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. సాంకేతికతను ఉపయోగించి వైద్య పరికరాలు, లైఫ్ సైన్సెస్‌లో నూతన ఆవిష్కరణలను తీసుకురాగల అర్హతలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు, వనరులు భారత్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక అసమానతల సరిహద్దులకు అతీతంగా దేశం ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా సదస్సుకు 50 దేశాల నుంచి 215 మంది ప్రతినిధులు హాజరయ్యారని, 175 స్టార్టప్ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న స్టార్టప్స్ కంపెనీలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా వైస్ మినిస్టర్ కరోలిస్, ఈస్టోనియా రాయభారి కత్రిన్ కియి, ఒడిశా మంత్రి అశోక్‌చంద్ర పాండే, మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య, రెడ్డి ల్యాబ్స్ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. జీవశాస్త్రాలకు నెపుణ్యపు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. ‘బయో ఆసియా’20వ వార్షిక సదస్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం..అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) ప్రాంగణంలో ఉదయం 10.30కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభిస్తారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’అనే నినాదంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆరోగ్య రంగాన్ని మరింత మానవీయంగా మార్చడం అనే అంశంపై సుదీర్ఘ చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు చోటు చేసుకోనున్నాయి. ఆయా రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు 70 మందికి పైగా ప్రసంగించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి సుమారు 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో సుమారు 800 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య వేయికి పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నారు. సదస్సు నిర్వహణలో బ్రిటన్ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్నర్గా ప్లాండర్స్ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్’తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్ హాచెట్ ప్రసంగిస్తారు. 5 ఆవిష్కరణలు వివరించనున్న సార్టప్‌లు జీవ శాస్త్ర (లైఫ్ సైన్సెస్) రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బయో ఆసియా సదస్సును నిర్వహిస్తోంది. 2021 నాటికి హైదరాబాద్ సహా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో పనిచేస్తున్న కంపెనీల నికర విలువ రూ.50 బిలియన్ డాలర్లు కాగా.. 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రంగంలో ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి 8 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ సదస్సులో బయోటెక్, లైఫ్‌సైన్సెస్ విభాగంలో స్టార్టప్‌లకు పోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 స్టార్టప్‌లు బయో ఆసియాలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 75 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీటి నుంచి ఐదింటిని ఎంపిక చేసి నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు వాటి ఆవిష్కరణలను వివరించేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన బయో ఆసియా సదస్సు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో సత్య నాదెళ్ల వంటి ప్రముఖ కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు ప్రసంగించగా, 20 వేలకు పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. 250కి పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరగా, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్, అనుబంధ రంగాల్లోకి వచ్చాయి. లైఫ్‌సైన్సెస్‌పై సర్కారు కీలక ప్రకటన! 20వ సదస్సులోనూ ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశముందని భావిస్తున్నారు. ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు, లైఫ్ సైన్సెస్ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది. -
హైదరాబాద్‌లో శాండోస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కంపెనీ కార్యకలాపాలకు ‘విజ్ఞానపరమైన సేవలు’ (నాలెడ్జ్ సర్వీసెస్) అందించేందుకు హైదరాబాద్‌లో ‘గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ ‘శాండోస్’ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో ఆరంభంలో 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, దశలవారీగా ఈ సంఖ్య 1,800కు పెరుగుతుందని శాండోస్ ప్రకటించింది. కంపెనీ సీఈఓ రిచర్డ్ సెయినోర్ నేతృత్వంలోని శాండోస్ ప్రతినిధి బృందం మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో సమావేశమైంది. ఇప్పటికే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉన్న తమ ఆధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తామని, ఆటోమేషన్తో పనిచేసే ప్రపంచస్థాయి ప్రయోగశాలను ఏర్పాటుచేస్తామని సంస్థ సీఈఓ ప్రకటించారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగానికి ఉన్న అనుకూలత వల్లే గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేయికి పైగా మాలిక్యూల్స్‌ను కలిగిన తమ సంస్థ 10 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతోందని శాండోస్ సీఈఓ తెలిపారు. నోవార్టిస్ స్థాయిలో శాండోస్ కార్యకలాపాలు: కేటీఆర్ హైదరాబాద్‌లోని వ్యాపార అనుకూలత, మానవ వనరుల లభ్యతతో లైఫ్ సైన్సెస్ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని శాండోస్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద కార్యాలయం కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ శాండోస్ కూడా అదేస్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, భవిష్యత్తు ప్రణాళికలపై శాండోస్ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ వివరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ శాండోస్ తరహా కంపెనీల పెట్టుబడికి గమ్యస్థానంగా ఉంటుందని, ఫార్మాసిటీలో తయారీ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించాలని కేటీఆర్ కోరారు. ఈ భేటీలో శాండోస్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ క్లేర్ డిబ్రూ హేలింగ్, డాక్టర్ వందనాసింగ్, నవీన్ గుల్లపల్లి, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డైరక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలతో లైఫ్ సైన్సెస్ రంగం బహుముఖంగా విస్తరిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్నా రు. ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం)తోపాటు లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాల ప్రముఖు లతో మంగళవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ వాతావరణాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషించడంతోపాటు విశ్వవ్యాప్త ంగా హెల్త్ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌ను అనుసంధానించేందుకు అనుసరించాల్సిన విధానాలే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం విలువ, ప్రభావాన్ని మరింత పెంచేందుకు ప్రపంచ ఆర్థిక వేదికతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యరక్షణ రంగాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉపయోగపడు తుందని ఈ వేదిక బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. సమావేశంలో ప్రపంచ ఆర్థిక వేదిక హెల్త్‌కేర్ విభాగం అధిపతి డాక్టర్ శ్యామ్ బిషెన్, భారత్, దక్షిణాసియా డిప్యూటీ హెడ్ శ్రీరామ్ గుత్తా, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్తోపాటు రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చేతికి డెన్మార్క్ సంస్థ!
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ విభాగంలో పట్టున్న డెన్మార్క్ కంపెనీ బేస్(బీఏఎస్ఈ) లైఫ్ సైన్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి నగదు రూపేణా 11 కోట్ల యూరోలు(రూ. 875 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలు ద్వారా లైఫ్ సైన్సెస్ డొమైన్లో మరింత నైపుణ్యాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా యూరోప్‌లో సేవలు విస్తరించనున్నట్లు పేర్కొంది. యూరప్, నార్డిక్స్ ప్రాంతంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యాలు, క్లౌడ్ ఆధారిత పరిశ్రమ సొల్యూషన్స్ విస్తరణకు దోహదపడనున్నట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు అంచనా వేస్తోంది. బేస్ లైఫ్‌కు 200 మంది అత్యుత్తమ పరిశ్రమ నిపుణులున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇన్ఫీ షేరు 0.7% పెరిగి రూ.1,448 వద్ద క్లోజైంది. -
ఏషియాలోనే అతిపెద్ద స్టెంట్ ఫ్యాక్టరీ మన హైదరాబాద్‌లో
ఏషియాలోనే అతి పెద్ద స్టెంట్ ఫ్యాక్టరీ మన హైదరాబాద్‌లో రెడీ అయ్యింది. నగర శివార్ల సంగారెడ్డి జిల్లా సూల్తాన్‌పూర్‌లో సిద్ధమైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ పార్కుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 2022 ఏప్రిల్ 15న ప్రారంభించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కుని 302 ఏకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రాంగణంలో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా సహజానంద్ సంస్థ ఇక్కడ భారీ స్టెంట్ తయారీ కర్మాగారంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను నిర్మించింది. Yet another milestone for Hyderabad Medical Devices Park & Life Sciences ecosystem in Telangana Delighted and looking forward to inaugurating Asia's largest stent manufacturing and R&D facility of Sahajanand Medical Technologies @SMTStents tomorrow at Sultanpur in Sangareddy pic.twitter.com/HtRBLSYkVR — KTR (@KTRTRS) April 14, 2022 చదవండి: ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి -
‘కెమ్ వేద’ పరిశోధన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటన తొలిరోజు విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ ‘కెమ్ వేద’ముందుకొచ్చింది. శాండియాగోలోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ భీమారావు పారసెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్ర ముఖ పరిశోధన సంస్థగా ‘కెమ్ వేద’కంపెనీకి పేరు ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కంపెనీని మరింత విస్తరించేందుకు రూ.150 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ పేర్కొంది. కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు సంస్థ సీఈవో తెలిపారు. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్.. హైదరాబాద్ నగరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంలో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకొని ప్రత్యే కంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కెమ్ వేద నిర్ణయించుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఎకో సిస్టంను ఈ కంపెనీ మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ వేగంగా విస్తరిస్తోందని కెమ్ వేద సీఈవో భీమారావు పారసెల్లి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది హై స్కిల్డ్ నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. కాగా శాండియాగోలో మంత్రి కేటీఆర్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాండియాగోలో ఉన్న వ్యాపార అవకాశాలపై మంత్రి ఆరా తీశారు. ఫార్మా వర్సిటీలో భాగమవ్వండి: హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూని వర్సిటీలో భాగంకావాలని ప్రముఖ పరిశోధన సంస్థ ‘స్క్రిప్స్’ను కేటీఆర్ కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పి డి, రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో ‘స్క్రిప్స్’తన భాగస్వామ్యాన్ని అందించా లని విజ్ఞప్తి చేశారు. శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి.. స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా.జేమ్స్ విలియమ్సన్, మేరీవాంగ్, డాక్టర్ అర్నాబ్ ఛటర్జీ, ప్రొఫెసర్ సుమిత్ చందాలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారితో కేటీఆర్ పంచుకున్నారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్క్రిప్స్ హామీ ఇచ్చింది. కాగా స్క్రిప్స్ రీసెర్చ్ టీమ్, తెలంగాణ ప్రభుత్వంతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు. సైన్స్ పరిశోధనల్లో 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బందితో పాటు 200కు పైగా ప్రయోగశాలలు ఈ సంస్థకు ఉన్నాయి. -
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏసియా 19వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్ రెడీ’ నినాదంతో జరిగే ఈ సదస్సు లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్ కంపెనీలు, బయోటెక్ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషి స్తారు. నోబెల్ గ్రహీతలు డాక్టర్ కుర్ట్ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్ జుర్ హుస్సేన్, బారీ మార్షల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు హాజరుకానున్నారు. -
హైదరాబాద్ సిగలో మరో నగ.. దేశంలోనే అతి పెద్ద మెడికల్ ఇండస్ట్రియల్ పార్కు
దేశంలోనే అతి పెద్దదైన మెడికల్ డివైజ్ ఇండస్ట్రియల్ పార్కు హైదరాబాద్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నగర శివారులోని సుల్తాన్‌పూర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏడు మెడికల్ డివైజ్ ఇండస్ట్రీస్‌ని మంత్రి కేటీఆర్ డిసెంబరు 15న ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల కిందట ఈ పార్కుకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మెడికల్ హబ్‌గా ప్రొమియా థెరాప్యూటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆకృతి ఒకులోప్లాస్టీ, అర్కా ఇంజనీర్స్, ఎస్వీపీ టెక్నో ఇంజనీర్స్, ఎల్వికాన్ అండ్ డీస్మెడిలైఫ్ సంస్థలు తమ ఫ్యా్టక్టరీలను నేడు ప్రారంభించనున్నాయి. దీంతో ఫార్మా సెక్టార్‌కే కాకుండా మెడికల్ డివైజెస్‌కి కూడా హైదరాబాద్ హబ్‌గా మారనుంది. తయారయ్యేవి ఇవే మెడికల్ రంగానికి సంబంధించి కేర్ డివైజెస్, విట్రో డయాగ్నోస్టిక్ పరికరాలు, అనలైజర్స్, ఒక్యులర్ ఇంప్లాంట్స్, సర్జికల్, డెంటర్ ఇంప్లాంట్స్, డ్రెసింగ్ తదితర మెడికల్ ఉత్పత్తులు ఈ ఫ్యాక్టరీల నుంచి రాబోతున్నాయి. 1300ల మందికి ఉపాధి ఈ మెడికల్ డివైజ్ పార్కులో ప్రస్తుత పెట్టుబడులు రూ.265 కోట్లకు చేరుకోగా ప్రత్యక్షంగా 1300ల మందికి ఉపాధి లభిస్తుంది. 2030 నాటికి హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ విలువల వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు (మెడికల్ డివైజెస్ పార్క్) సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒకే రోజు ఏడు కంపెనీలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS గారు ప్రారంభించనున్నారు. #TriumphantTelangana pic.twitter.com/cnJhPOZO8L — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 15, 2021 చదవండి:Hyderabad: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ విస్తరణ.. కొత్తగా మరో డెలివరీ సెంటర్ -
టార్సన్స్ ప్రోడక్ట్స్‌కు 77 రెట్లు సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ సంస్థ టార్సన్స్ ప్రోడక్ట్స్ ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఆఖరు రోజు నాటికి 77.49 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం 1.08 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా 84.02 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల కేటగిరీ దాదాపు 185 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 116 రెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ)కేటగిరీ 11 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. షేరు ధర శ్రేణి రూ. 635–662గా ఉంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ రుణాలను తీర్చేందుకు, ఇతరత్రా పెట్టుబడి అవసరాలకు ఉపయోగించుకోనుంది. ప్రయోగ శాలల్లో, ఫార్మా సంస్థల్లో, డయాగ్నోస్టిక్ కంపెనీల్లో ఉపయోగించే ల్యాబ్ వేర్‌ను టార్సన్స్ ప్రోడక్ట్స్ తయారు చేసి, విక్రయిస్తోంది. -
రూ.లక్ష కోట్ల పరిశ్రమగా లైఫ్ సైన్సెస్
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్లస్టర్‌గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ రూపొందించిన ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్–2030’నివేదికను కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ కమిటీ చైర్మన్, రెడ్డీస్ ల్యాబ్స్ అధిపతి సతీశ్‌రెడ్డితో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, నిపుణులు, విద్యాసంస్థల అధిపతులు సమావేశంలో పాల్గొన్నారు. నివేదికలోని వివరాలను సతీశ్‌రెడ్డి కేటీఆర్‌కు వివరించారు. పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నివేదిక ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మానవ వనరులు, సాంకేతిక వసతులు, అత్యుత్తమ మౌలిక వసతులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు లైఫ్ సైన్సెస్ రంగం పురోగతికి దారితీసేలా ఉన్నాయని కమిటీ చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. నివేదికలోని ప్రధానాంశాలు.. జనాభా సంఖ్య, జీడీపీ వృద్ధిరేటు, ఫార్మా ఎగుమతులు, మెడికల్ టూరిజం రంగం వృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌కు ఉన్న అవకాశాలు రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి దోహదం చేసేదిగా ఉంది. జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి విద్యా, పరిశోధన సంస్థలు రాష్ట్రంలో ఉండటం కలిసొచ్చే అంశాలు. రాష్ట్ర జీడీపీలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2016లో రూ.900 కోట్లు కాగా, 2020 నాటికి రూ.1,300 కోట్లకు చేరింది. దీన్ని 2030 నాటికి మూడింతలు చేయాలనేది లైఫ్ సైన్సెస్ విజన్ లక్ష్యం. దేశీయ ఫార్మా ఎగుమతుల్లో తెలంగాణ వాటా 30 శాతం కాగా, ప్రస్తుతం రాష్ట్రాన్ని వ్యాక్సిన్ హబ్‌గా పరిగణిస్తున్నారు. దేశీయ వ్యాక్సిన్ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 33 శాతంగా ఉంది. దేశీయ బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం, బల్క్ డ్రగ్ తయారీలో 40 శాతం తెలంగాణ నుంచే జరుగుతోంది. వచ్చే పదేళ్ల పాటు లైఫ్‌సైన్సెస్ రంగంలో ఏటా 15 శాతం వృద్ధిరేటుతో 2030 నాటికి రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, రూ.50 వేల కోట్ల రెవెన్యూ సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలోని 10 ప్రతిష్టాత్మక బహుళ జాతి సంస్థల్లో కనీసం 3 నుంచి 5 సంస్థలను రాష్ట్రానికి రప్పించాలి. కొత్త ఔషధాలపై పరిశోధన, తయారీ, ఫార్మా, బయో ఫార్మా, మెడికల్ డివైజెస్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు, దేశీయ పబ్లిక్ హెల్త్ డేటా సేకరించి క్లినికల్ పరిశోధన పెంచడం ద్వారా లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమివ్వడం సాధ్యమవుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు ఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు బయో ఫార్మా హబ్, డయాగ్నస్టిక్ హబ్(డీ హబ్) వంటివి ఏర్పాటు చేయాలి. లైఫ్ సైన్సెస్ రంగం తయారీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, మార్కెటింగ్, పరిశోధనశాలల ఏర్పాటు వంటి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రైవేటు సంస్థల ద్వారా కార్పస్ నిధి, పరిశ్రమకు విద్యా సంస్థలకు నడుమ అనుసంధానంతో పాటు లైఫ్‌సైన్సెస్ రంగం పరిధిని విస్తరించేందుకు ‘తెలంగాణ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్, సైన్స్, టెక్నాలజీ ఏర్పాటు చేయాలి. లైఫ్ సైన్సెస్ సాంకేతికతను విద్యా సంస్థలకు బదిలీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలి. కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల కోసం రెగ్యులేటరీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. ఫార్ములేషన్, పరిశోధన, అభివృద్ధి కోసం సమీకృత లైఫ్ సైన్సెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ రంగంలో పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ‘డిజిటల్ తెలంగాణ’ నివేదిక విడుదల డిజిటల్ మీడియా విభాగం రూపొందించిన ‘డిజిటల్ తెలంగాణ– డిజిటల్ మీడి యా ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మేనేజ్మెంట్’నివేదికను మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్టెక్ లైఫ్- బ్లూడార్ట్.. ఎక్స్‌ప్రెస్ స్పీడ్
ఉదయం సెషన్లో జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా పతన బాట పట్టాయి. తొలుత లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ ప్రస్తుతం 328 పాయింట్లు కోల్పోయింది. 39,422కు చేరింది. నిఫ్టీ సైతం 82 పాయింట్ల నష్టంతో 11,589ను తాకింది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఓవైపు బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్.. మరోపక్క హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నికర లాభం 189 శాతం జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 8 శాతం పెరిగి రూ. 867 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 17.5 శాతం పుంజుకుని రూ. 57 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 3,767కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం లాభంతో రూ. 3,603 వద్ద ట్రేడవుతోంది. ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ నికర లాభం 238 శాతం జంప్‌చేసి రూ. 18 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 155 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 205 శాతం ఎగసి రూ. 24 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 1,185కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 1,168 వద్ద ట్రేడవుతోంది. -
వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా లైఫ్ సైన్సెస్
సాక్షి, హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రంగాన్ని వచ్చే దశాబ్దకాలంలో వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండేళ్ల కాల పరిమితితో కూడిన లైఫ్ సైన్సెస్ సలహా నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ లైఫ్ సైన్సెస్ సలహా కమిటీ తొలి సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2016లో నియమించిన కమిటీ కాల పరిమితి ముగియడంతో పరిశ్రమల శాఖ అధికారులు, ఫార్మా, బయో టెక్నాలజీ, వైద్య ఉపకరణాలు, డిజిటల్ హెల్త్ రంగాలకు చెందిన ప్రముఖులతో అధికారులు ఈ కొత్త కమిటీ ఏర్పాటుచేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన సతీష్‌రెడ్డి చైర్మన్‌గా, ‘బయోలాజికల్ ఈ’ఎండీ మహిమా దాట్ల వైస్ చైర్మన్‌గా, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్‌ను కన్వీనర్‌గా నియమిస్తూ కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల నడుమ ఈ కమిటీ సంధానకర్తగా పనిచేయనుంది. -
ఫార్మాసిటీ ఆవశ్యకత మరింత పెరిగింది
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాధాన్యం, అవసరం మరింతగా పెరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ పరిశ్రమలకు ఇప్పటికే దేశ రాజధానిగా హైదరాబాద్ ఖ్యాతి గడించిందని, ఫార్మాసిటీ ద్వారా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కరోనాకి అవసరమైన మందుతో పాటు వ్యాక్సిన్ తయారీకి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, వ్యాధులకు ఫార్మాసిటీ పరిష్కారం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ.. యూఎస్ఎఫ్డీఏ నుంచి వరుసగా అత్యధిక అనుమతులు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ఏర్పడబోతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఉంటుందన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు పురోగతిపై గురువారం మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మాసిటీకి రూపకల్పన చేస్తున్నామన్నారు. కొన్ని నెలల్లో ఫార్మాసిటీ తొలి దశ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి వివరించారు. రోడ్లు, ఇతర మౌలికవసతుల పనులు జరుగుతున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఏడాదికాలం నుంచి ఐదేళ్ల పాటు ఎప్పుడెప్పుడు ఏయే పనులు చేపడతారు, ఎలాంటి పురోగతి ఫార్మాసిటీ సాధించబోతున్నదో తెలిపేలా నిర్దిష్ట కాలావధితో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఔషధ ఉత్పత్తుల కంపెనీలు మొదలుకొని అందులో పనిచేసే కార్మికులకు అవసరమైన నివాస సౌకర్యాల వరకు అన్ని ఒకేచోట ఉండే విధంగా స్వయంసమృద్ధి కలిగిన టౌన్‌షిప్‌గా ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో ముందుకు పోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో కేవలం ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా... ఫార్మా పరిశోధన, లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ, సాధ్యమైనంత ఎక్కువగా గ్రీన్ కవర్ వంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయన్నారు.