Madhavan
-
24 ఏళ్ల తర్వాత కలిసిన హీరోహీరోయిన్
రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' క్రేజ్ వేరే లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన మాధవన్, షాలినీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది దాదాపు 24 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సందర్భంగా ఏంటో తెలీదు గానీ మాధవన్‌ని చాన్నాళ్ల తర్వాత కలిసి షాలినీ.. రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి 'ఎండ్రెండుం పున్నాగై' అని క్యాప్షన్ పెట్టింది. 'ఎప్పటికీ నవ్వడం' అని తెలుగులో దీనికి అర్థం. తమ అభిమాన జోడీని దాదాపు 24 ఏళ్ల తర్వాత చూసిన ఫ్యాన్స్.. సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. కామెంట్స్ పెడుతూ తమ ప్రేమని చూపిస్తున్నారు.ఇక మాధవన్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉండగా.. షాలినీ తమిళ హీరో అజిత్ ని 2000లో పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!
సినీ నటులకు గ్లామర్ ఎంతో ముఖ్యమో తెలిసిందే. అందుకోసం ఫుడ్ దగ్గర నుంచి ఫిట్నెస్ వరకు ప్రతి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరూ ప్రత్యేకంగా డైటిషన్లు, ఫిటెనెస్ శిక్షకుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వాళ్ల లైఫ్‌స్టైలే చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇక వాళ్లు మనలా ఇడ్లీ, దోసలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ల జోలికిపోరు వెజ్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్స్, స్మూతీ వంటి వాటిని తీసుకుంటుంటారు. కానీ ఈ కోలీవడ్ నటుడు మాధవన్ మాత్ర మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తింటాడట. అదేంటంటే..కేరళ రాష్ట్రమంతటా ఇష్టంగా ఆస్వాదించే 'పజంకంజి'నే మాదవ్ ఎంతో ఇష్టంగా తింటారటా. ఇదే తన అల్పాహారమని ఆయన చెబుతున్నారు. పజమ్కంజి అంటే మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పొచ్చు. వాళ్లు పొద్దుపొద్దనే తినే రాత్రి భోజనం. తెలుగు నాట దీన్ని చద్దిన్నం అని పిలుస్తారు. కేరళలో దీన్ని 'పజంకంజి' అని పిలుస్తారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే..రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజి నీటిలో పులియబెట్టి పొద్దునే కొద్దిగా పెరుగు, తగినన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని తింటారు. ఇక్కడ మనం అన్నం వండగా వేరు చేసేదాన్ని గంజి అని అంటాం. దీన్నే కేరళలో కంజి అని పిలుస్తారు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. చెప్పాలంటే సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట ఇదే. ఆరోగ్య ప్రయోజనాలు..శరీరానికి తక్షణ శక్తిన అందిస్తుంది. ఇందులో 340 కేలరీలు ఉన్నాయి.విటమిన్ బీ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. నీరసం నుంచి త్వరితగతిన కోలుకోవడానకి ఉపయోగపడుతుంది. అలసట, జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పులియబెట్టిన గంజి అన్నాన్ని కేరళలో ఒకప్పుడూ చాలామంది ఇష్టంగా తినే వంటకంగా పేరుగాంచింది. రాను రాను దీనికి ఆదరణ కోల్పోయింది. అలాంటి పూర్వకాలం నాటి వంటకాన్ని నటుడు మాధవన్ ఇష్టంగా తింటానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేగాదు ఇటీవల దీనిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి పలు రెస్టారెంట్లు తమ మెనూలో దీన్ని కూడా చేర్చి సర్వ్ చేయడం ప్రారంభించాయి. (చదవండి: రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ మృతి..మరో రైడింగ్ గ్రూప్..!) -
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్ వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో మాధవన్ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్ నుంచి మాధవన్ మళ్లీ తన సాధారణ లుక్కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్‌గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్‌లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024 -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!
కోలీవుడ్ నటుడు రంగనాథ్ మాదవన్ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, విమర్శకుల ప్రశంసలందకున్నారు. మాధవన్ తన అభినయ నటనకుగానూ రెండు ఫిలింఫేర్ పురస్కరాలు అందుకున్నాడు. దాదాపు ఏడు భాషల్లో నటించారు. ఆయన రచయిత కూడా. మాధవన్ సినీ ప్రయాణం టీవీ సీరియల్ నుంచి మొదలై అలా 2000లో వచ్చిన 'అలై పాయుదే; అదే తెలుగులో 'చెలి'(2001) మూవీ నుంచి వెనుతిరిగి చూడకుండా విజయపథంలోకి దూసుకుపోయారు. ఐదు పదుల వయసుకు చేరువైన మాధవన్ ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా మంచి స్మార్ట్ లుక్‌లో కనిపిస్తారు. అంతలా గ్లామరస్‌గా కనిపించడానికి మాధవన్ ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా! వర్కౌట్లు.. మాదవన్ ఫిట్నెస్కి పెట్టింది పేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. చక్కటి బాడీ మెయింటెయిన్ చేసేందుకు కఠిన వర్కౌట్లు డైలీ లైఫ్‌లో భాగం. దాదాపు 30 నిమిషాల పాటు కార్డియో సెషన్ ప్రారంభిస్తాడు. ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, ఎలిప్టికల్ మెషీన్ వంటివి ఉంటాయి. ఆయన స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుల్ అప్స్లు తప్పనిసరిగా చేస్తాడు. అవి అతని హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని కనీసం మూడు నుంచి నాలుగు సెట్ల వారీగా ప్రతిసెట్లో కనీసం ఎనిమిది నుంచి 12 కసరత్తుల చొప్పున చేస్తారు. అలాగే ఒత్తడిని దూరం చేసుకునేలా ధ్యానం వంటివి చేస్తారు సముతుల్య ఆహారం, పోషకాలతో కూడిన ఆహారాలను డైట్లో ఉండేలా చూసకుంటారు. కానీ తినాలనుకున్నది మాత్రం కడుపు నిండుగా తింటాని చెబుతున్నాడు మాధవన్. అయితే అందుకు తగ్గట్టుగానే కసరత్తులు కూడా చేస్తానని అంటున్నాడు. డైట్.. చికెన్, చేపలు, కాయధాన్యాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. శక్తినిచ్చేలా బ్రౌన్ రైస్, క్వినోవా, చిలగడదుంప, తదితరాలను తీసుకుంటారు. అలాగే ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయాలు ఉండేలా చూసుకుంటారు. పైగా శరీరానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అందేలా జాగ్రత్త పడతారు. తన వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణుడు సాయంతోనే మంచి డైట్ ఫాలో అవుతారు మాధవన్. (చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?) -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్‌కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న బృందా శివకుమార్‌కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్‌ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఆ టాలెంట్ మళ్లీ చూపిస్తున్న స్టార్ హీరో
మాధవన్ నిజంగా అదృష్టవంతుడే. బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత. తాజాగా కథకుడిగానూ మారారు. రన్, ఆలైపాయుదే, ఆయుధ మిన్నలే, ఎళుత్తు, యావరుమ్ నలమ్ ఇలా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈయన.. హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఇటీవల 'రాకెట్రీ' మూవీతో దర్శకుడిగాను సక్సెస్ అయ్యారు. తమిళ, హిందీ భాషల్లో తీసిన ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత, హీరో ఇతడే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) మాధవన్ ప్రస్తుతం తమిళంలో 'టెస్ట్' చిత్రం చేస్తున్నాడు. మరో మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇంతకు ముందు ధనుష్ హీరోగా 'తిరు' అనే సూపర్‌హిట్ తీసిన మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి హీరో మాధవన్ కథ అందించడం విశేషం. కాగా ఈ చిత్రానికి 'అదృష్టశాలి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కన్నడ బ్యూటీ షర్మిళ మంద్రే నైతిక హీరోయిన్. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
వరుస ఫ్లాపులు.. ‘తగ్గేదేలే’ అంటున్న హీరోయిన్!
కొందరు హీరోలు మాత్రమే ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పాపులారిటీ పొందుతుంటారు. ఇక అలాంటి హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ఒకరు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తరచూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా బహుభాషా నటిగా రాణిస్తున్న కంగనా రనౌత్‌లో ఒక నిర్మాత, దర్శకురాలు ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇటీవల అన్ని అపజయాలను ఎదుర్కొన్నారు. హిందీలో తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ మధ్య తమిళం, హిందీ భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది. ఇటీవల కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి–2 చిత్రం ప్లాప్ అయ్యింది. అయినా ఈమెకు అవకాశాలు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం కంగనా రనౌత్‌ను వరించింది. ఇందులో నటుడు మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీ చిత్రం తను వెడ్స్ మను తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. కాగా ఇంతకు ముందు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హిందీలో కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రం విజయం కంగనా రనౌత్‌కు చాలా ముఖ్యం. -
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
ప్రభాస్,రష్మిక,నాగ్ ఏం చదివారు.. ఏ కాలేజీనో తెలిస్తే ఆశ్చర్యపోతారు
దక్షిణ భారత చలనచిత్రంలో చాలా మంది నటీనటులు అద్భుతమైన నటనతో మిలియన్ల కొద్ది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలో ప్రతిభావంతులైన నటులకు కొదువ లేదు.. ఒక రకంగా నటీనటుల ఆయుధాగారం అని కూడా చెప్పవచ్చు. వారి నటనా నైపుణ్యాలతో ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఈ నటీనటుల విద్యాపరమైన విషయాలు చాలా మందికి అంతగా తెలియదు. దక్షిణ భారతదేశంలోని కొంతమంది పాపులర్ యాక్టర్స్ విద్యాపరమైన విజయాలను మీరూ తెలుసుకోండి. సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయిపల్లవి. ఈ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది సాయిపల్లవి. ఆమె సహజమైన నటనా శైలికి అనేక రకాల భావోద్వేగాలను చిత్రీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆమె జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల (TBILISI State Medical University) నుంచి MBBS లో పట్టా పొందారు. వైద్యవిద్య పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రభాస్ సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్‌ను దాటి హాలీవుడ్‌పై కన్నేసిన స్టార్ హీరో ప్రభాస్. మొదట బాహుబలితో తన రేంజ్ ఏంటో భారతీయ సినిమాకు పరిచయం చేశాడు ప్రభాస్. కల్కి చిత్రంతో హాలీవుడ్లో కూడా పాగా వేయాలనే ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో టెక్నాలజీ (బీటెక్)లో బ్యాచిలర్ డిగ్రీని పొందారని మీకు తెలుసా..? గోపిచంద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ ప్రభాస్‌కు మంచి స్నేహితులు రకుల్ ప్రీత్ సింగ్ మనలో చాలా మందికి గణితం ఎప్పుడూ భయంకరమైన సబ్జెక్ట్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. ఆమె జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాదించింది. రష్మికా మందన్న నేషనల్ క్రష్ రష్మికా మందన్న సౌత్ ఇండియాలో మొదటి గుర్తింపు వచ్చినా పుష్ప సినిమాతో బాలీవుడ్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత బెంగళూరులోని M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అలా ట్రిపుల్ గ్రాడ్యుయేట్ సాదించింది. నాగార్జున అక్కినేని భారతీయ సినిమాకు నటుడు, నిర్మాత నాగార్జున అక్కినేని అందించిన సహకారం అసాధారణమైనది. ఆయన ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఆయన విద్యా ప్రయాణం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. USAలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.S.) పూర్తి చేశాడు కార్తీ తమిళ స్టార్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. అతను చెన్నైలోని క్రెసెంట్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. USAలోని న్యూయార్క్‌లోని బింగ్హామ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. విక్రమ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో విభిన్నమైన నటుడిగా చియాన్ విక్రమ్‌కు గుర్తింపు ఉంది. తన సహజమైన నటనా శైలికి ప్రేక్షకులు ఫిదా అవుతారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. చియాన్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి MBA పట్టా పొందాడు. మాధవన్ రంగనాథన్ మాధవన్ ప్రముఖ భారతీయ నటుడే కాదు ఒక రచయిత, సినీ నిర్మాత కూడా. ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు. బీహార్‌లో తమిళ కుటుంబంలో ఆయన జన్మించారు. , కొల్హాపూర్‌లోని రాజారాం కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తర్వాత ముంబైలోని కిషిన్‌చంద్ చెల్లారం కళాశాల నుంచి పబ్లిక్ స్పీకింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పొందాడు ఆయన ఒక వక్త కూడా. -
ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనూ సూర్య సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తోన్న సూర్య కొన్ని నెలలుగా ముంబయిలో ఉంటున్న సంగతి తెలిసిందే. తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్నారు. సూర్యకి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలో చెన్నై వదిలిపెట్టి.. పూర్తిగా ముంబయికి షిఫ్ట్ అయ్యారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ వీటిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా ముంబయిలో ఓ ఫ్యాన్స్ మీట్‌కు హాజరైన సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడో తెలుసుకుందాం. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) అభిమానుల మీట్లో సూర్య మాట్లాడుతూ..' తాను ముంబైలో ఉండడం లేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తన కూతురు, కొడుకు చదువు కోసమే ఇక్కడ ఉంటున్నాం. తాను ఇప్పటికీ తమిళనాడులోనే ఉంటున్నానని నటుడు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జీవితంలో కొత్తది నేర్చుకోవాలనే తపనతో ఉన్నానని వెల్లడించారు. అందుకే తన సహచరుడు మాధవన్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాట్లు తెలిపారు. కాగా.. మాధవన్, సూర్య మంచి స్నేహితులు. కాగా.. జ్యోతికను 2006లో సూర్య వివాహం చేసుకున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ విక్రమ్‌లోని రోలెక్స్ క్యారెక్టర్ ఆధారంగా ఒక సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తనను సంప్రదించారని సూర్య పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!) -
మరో శాస్త్రవేత్త బయోపిక్‌లో మాధవన్
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా పాత్రపై ఆసక్తి చూపే నటుడు మాధవన్. మొదట్లో లవర్‌బాయ్‌గా అలరించిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటున్నారు. అలా ఇటీవలే ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్ జీవిత చరిత్రను రాకెట్రీ నంబి ఎఫెక్ట్ పేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించి టైటిల్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా మరో తమిళ ప్రముఖ శాస్త్రవేత్త జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. ఈ చిత్రాన్ని మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా జీడీ నాయుడు పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సంఘాలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు మాధవన్ ప్రస్తుతం యారడీ నీ మోహిని, తిరుచిట్రంఫలం చిత్రాల ఫేమ్ మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఆయన జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. -
కొత్త కబురు
హీరో మాధవన్ కొత్త కబురు చెప్పా రు. తన తర్వాతి సినిమా డైరెక్టర్ మిత్రన్‌తో చేయనున్నట్లు పేర్కొన్నారాయన. తమిళ చిత్ర పరిశ్రమలో గత ఏడాది హిట్ కొట్టిన చిత్రాల్లో ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) ఒకటి. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిట్ కావడంతో మిత్రన్‌కి మరో మంచి అవకాశం లభించింది. మాధవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘దర్శకుడు మిత్రన్‌తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. -
రాకెట్రీ సినిమా కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్మేశాడా?
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్. హీరో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా అందరికీ చేరువవ్వాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు మ్యాడీ. అనుకున్నట్లే అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడరి సదరు కథనం పేర్కొంది. మరోవైపు అతడి కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మ్యాడీ కుటుంబాన్ని కీర్తించింది. తాజాగా దీనిపై హీరో మాధవన్ స్పందించాడు.. 'ఓరి దేవుడా.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!' అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ. Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert — Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022 చదవండి: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ తీసే ధ్యైర్యం చేస్తారా? -
రజనీకాంత్ కాళ్లు మొక్కిన హీరో మాధవన్
కోలీవుడ్ హీరో మాధవన్ నటించిన తాజా చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్. అనంతరం మాధవన్‌కు శాలువా కప్పి సత్కరించాడు. ఈ ఆనందకర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు మాధవన్. 'ఒక లెజెండ్ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ రజనీకాంత్ నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోలేను' అంటూ వీడియో షేర్ చేశాడు మాధవన్. ఈ వీడియోలో రజనీకాంత్ పాదాలను తాకి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు మ్యాడీ. ప్రస్తుతం రాకెట్రీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. When you get the blessings from a one man industry & the Leagend himself in the presence on @NambiNOfficial -it’s a moment etched for eternity-Thank you for you kindest words on #Rocketry & the affection @rajinikanth sir.This motivation has completely rejuvenated us. We love you pic.twitter.com/ooCyp1AfWd — Ranganathan Madhavan (@ActorMadhavan) July 31, 2022 View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) చదవండి: నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వారియర్! హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు! -
ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
విలక్షణ నటుడు ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. మాధవన్ టేకింగ్,యాక్టింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 40 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. (చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ) ఇప్పటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. రితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD — amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022 (చదవండి: చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ) -
థియేటర్లో ఆ సీన్ మళ్లీ మళ్లీ ఎలా చూశావు?: నెటిజన్‌కు హీరో ప్రశ్న
కోలీవుడ్ స్టార్ మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాధవన్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తీయడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన అభిమానులైతే గొప్ప సినిమా చేశావంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. 'నిన్న రాకెట్రీ సినిమా చూశాను. చివరి సీన్ ఏదైతే ఉందో దాన్ని పదేపదే చూశాను. మీ తొలి దర్శకత్వమే అద్భుతంగా ఉంది. ఇక నటనకు కొంచెం కూడా వంక పెట్టాల్సిన పని లేదు' అంటూ హీరో మాధవన్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో మాధవన్ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. 'నువ్వు ఒక్క సన్నివేశాన్నే పదే పదే ఎలా చూడగలిగావు?' అని ప్రశ్నించాడు. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న నెటిజన్ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇతర నెటిజన్లు నెట్టింట వైరల్ చేశారు. సినిమా వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ మూవీ ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి అతడు నచ్చిన సన్నివేశాన్ని పదే పదే చూశాడంటే అది థియేటర్లో సాధ్యపడదు. అంటే అతడు పైరసీ ద్వారా సినిమా చూశాడని ఇట్టే తెలిసిపోతుంది. అతడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా మ్యాడీ కౌంటర్ ఇవ్వడంతో నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. 😂😂 nice question pic.twitter.com/kY9a8um3Bb — Praveen Kumar (@by_PraveenKumar) July 8, 2022 చదవండి: ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా? తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి -
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ నటీనటులు : ఆర్. మాధవన్, సిమ్రన్ , సూర్య, గుల్షన్ గ్రోవర్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర తదితరులు నిర్మాణ సంస్థలు : కలర్ ఫిల్మ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చరర్స్ నిర్మాతలు: సరితా మాధవన్, మాధవన్, వర్ఘీస్ మూలన్, విజయ్ మూలన్ రచన,దర్శకత్వం : ఆర్ మాధవన్ సంగీతం : శ్యామ్. సీఎస్ సినిమాటోగ్రఫీ : సిర్షా రే ఎడిటర్ : బిజిత్ బాలా విడుదల తేది : జులై 1, 2022 ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరాడు. ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 1)థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? నంబి నారాయణన్‌గా మాధవన్ ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమ కథంతా ఇంటర్వ్యూగా సాగుతుంది. ఓ టీవీ చానల్లో హీరో సూర్య నంబి నారాయణన్(మాధవన్)ని ఇంటర్వ్యూ చేస్తూ.. తన జీవితం ఎలా సాగింది? ఇస్రోలో ఎలా చేరారు? తనపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలను అడుగుతారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరుతాడు నంబి నారాయణన్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. అక్కడ సానా ఆఫర్ వచ్చిన సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియాకు వచ్చిన మళ్లీ ఇస్రోలో చేరుతారు.. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజన్స్‌ని భారత్ తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత నంబి నారాయణన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల చేతిలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నుంచి ఎలా విముక్తి పొందారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. దేశం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్‌ని తిరస్కరించి ఇస్రోలో చేరారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు.తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది.నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.ఫస్టాఫ్ అంతా స్వదేశీ రాకెట్లను అభివృద్ది కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని చూపించారు. సెకండాఫ్‌లో తప్పుడు కేసు వల్ల ఆయనతో కుటుంబ సభ్యులు ఎలాంటి అవమానాలకు గురయ్యారు? చివరకు నిర్థోషిగా ఎలా బయటకు వచ్చారనే విషయాలను చాలా భావోద్వేంగా చూపించారు.అయితే ఫస్టాఫ్ అంతా అంతరిక్ష పరిశోధన, ప్యూయల్ టెక్నాలజీ, వికాస్ ఇంజన్ అభివృద్ది తదితర అంశాలను లోతుగా చూపించడంతో డ్యాక్యూమెంటరీ ఫీల్ కలుగుతుంది. రాకెట్ సైన్స్ సామాన్య ప్రేక్షకులకు అంతగా అర్థం కాదు..కానీ దానితోనే నంబి నారాయణన్ జీవితం సాగింది కాబట్టి కచ్చితంగా వాటిని చూపించాల్సిందే. దర్శకుడు అదే పని చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా భావోద్వేగంగా సాగుతుంది. దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నంబి నారాయణన్.. దేశద్రోహి కేసు కింద అరెస్ట్ కావడం.. ఆ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక క్షోభని అనుభవించారు, నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్న సీన్స్ చాలా భావోద్వేగాన్ని కలిగించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ‘ఒక రాకెట్ కూలిపోతే రియాక్ట్ అయ్యే మాకు.. ఒక మనిషి కూలిపోతే రియాక్ట్ అవడం తెలియదు’ అంటూ తోటి సైంటిస్టుల గురించి నంబి చెప్పె డైలాగ్, ఒక వీధి కుక్కను కొట్టి చంపాలనకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది..అదేవిధంగా ఒక మనిషిని తనకు తెలియకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’ అని హీరో సూర్య చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. దేశం కోసం కష్టపడిన మీ ఓ గొప్ప శాస్త్రవేత్తని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారే అనే ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ.. మాధవన్ చాలా నిజయతీగా, ఉన్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడం కంటే ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం దర్శకుడిగా, నటుడిగా మాధవన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యంగ్ లుక్‌తో పాటు ప్రస్తుతం నంబి నారాయణన్ ఎలా ఉన్నారో.. అలానే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాని కోసం మాధవన్ చాలా కష్టపడ్డారు. పొట్టపెంచడం, పంటి వరుసను మార్చుకోవడం.. గెడ్డం పెంచడం ..ఇలా చాలా విషయాల్లో మాధవన్ డేరింగ్ స్టెప్స్ వేశాడు. ఎమోషనల్ సీన్స్‌ని చక్కగా పండించారు. అబ్దుల్ కలాంగా గుల్షన్ గ్రోవర్ , నంబిని ఇంటర్వ్యూ చేసే హీరోగా సూర్య(హిందీలో షారుఖ్) చక్కగా నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం శ్యామ్. సీఎస్ సంగీతం. చక్కటి నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
1994 నవంబర్ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్ భారత్ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్’ ఇంజన్ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. ఆయనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. విలక్షణ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్ గురించి.. నాసా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి.. నంబి నారాయణన్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. 1966లో నంబి నారాయణన్ నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. న్యాయమే గెలిచింది దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ అనుమానం వ్యక్తం చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్
వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరిస్తుంటాడు మాధవన్. తాజాగా ఆయన రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. అచ్చం నంబి నారాయణ్‌లా తెల్ల జుట్టు, కళ్లద్దాలతో కనిపించనున్నాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరో సూర్య షూటింగ్ చూసేందుకు నంబి నారాయణ్‌తో కలిసి సెట్‌కు వెళ్లిన ఓ దృశ్యం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సెట్లోకి అడుగుపెట్టగానే నంబి నారాయణన్ గేటప్ ఉన్న మాధవన్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్ లుక్ ఇచ్చాడు. ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ. అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు. చదవండి: కొత్త కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా? ఇక ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు. అంతేకాదు మీ నాన్నగారు(శివకూమార్) దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా తమిళం, తెలుగులో చేస్తున్న సూర్య పాత్రలో హిందీలో షారుక్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇక నంబి నారాయణ్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ కనిపించనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పి.పి. మాధవన్(71)పై ఢిల్లీ పోలీసులు అత్యాచార కేసు నమోదైంది. జాబ్ ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాధవన్ తనను బెదిరించి లోబర్చుకున్నారంటూ ఓ మహిళ (26) ఫిర్యాదు చేసిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆమె భర్త కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసేవాడని, 2020లో చనిపోయాడని అన్నారు. భర్త చనిపోయాక ఆర్థిక పరిస్థితి బాగోలేక.. కాంగ్రెస్ ప్రతినిధులను కలిశానని, వాళ్లు మాధవన్ నెంబర్ ఇచ్చారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు జూన్ 25వ తేదీన ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఒకరోజు నన్ను కలవడానికి పిలిచాడు. అతను నన్ను కారులో ఎక్కించుకోవడానికి వచ్చి.. తన డ్రైవర్‌ను కారు వదిలి వెళ్ళమన్నాడు. నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేను అభ్యంతరం చెప్పడంతో కోపం వచ్చి నన్ను ఒంటరిగా రోడ్డుపై వదిలేశాడు అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ పరువు తీసేందుకే ఇది నిరాధారమైన ఆరోపణ. అందులో వాస్తవం లేదు. ఇది పూర్తి కుట్ర అని పీపీ మాధవన్ చెప్తున్నారు. -
సూర్య, షారుక్ పైసా కూడా తీసుకోలేదు: హీరో
ప్రఖ్యాత ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణన్లోని నెగెటివ్ కోణాన్ని తమ సినిమాలో చూపించినట్లు నటుడు మాధవన్ తెలిపారు. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటించిన రాకెట్రీ చిత్రాన్ని పాన్ఇండియా మూవీగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా జులై ఒకటో తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మాధవన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర తెరకెక్కించే ముందు తాను ఆయన్ని కలిశానని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలు తనను ఆశ్చర్యచకితుడిని చేశాయన్నారు. భారతదేశానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారన్న ఆరోపణతో జైలులో చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన తరువాత తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్న నంబి నారాయణన్ గొప్పతనాన్ని మాత్రమే కాకుండా ఆయనలోని నెగెటివ్ కోణాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. సహజత్వం కోసం తాను ఎలాంటి విగ్గు లేకుండా నంబి నారాయణన్‌లా తయారయ్యానని చెప్పారు. ఇందులో నటుడు షారుక్‌ఖాన్, సూర్య అతిథి పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా మరీ నటించారని చెప్పారు. చదవండి: ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్' రికార్డు.. ‘సమ్మతమే’ మూవీ రివ్యూ -
థామస్ కుక్‌లో ప్రమోటర్ వాటా అప్
ముంబై: ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్(మారిషస్).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. దీంతో ఫెయిర్‌బ్రిడ్జ్ వాటా 70.58 శాతం నుంచి 72.34 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. మిగిలిపోయిన దాదాపు రూ. 133 కోట్ల విలువైన ఐచ్చిక మార్పిడికి వీలు కల్పించే క్యుమిలేటివ్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లకు బోర్డు సబ్‌కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ తాజాగా పొందినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 47.3 ధరలో మొత్తం రూ. 436 కోట్ల విలువైన రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పు చెందినట్లు వెల్లడించింది. వెరసి ప్రమోటర్ల వాటా 72.34 శాతానికి చేరినట్లు వివరించింది. ట్రావెల్, తత్సంబంధ సర్వీసుల విభాగాలలో కనిపిస్తున్న వేగవంత వృద్ధిపట్ల ప్రమోటర్లకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిఫలిస్తున్నట్లు థామస్ కుక్ (ఇండియా) ఎండీ మాధవన్ మీనన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో థామస్ కుక్(ఇండియా) షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 56 దిగువన ముగిసింది. -
ఆ సినిమా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు: మాధవన్
Madhavan Rocketry The Nambi Effect Showing In Cannes Festival 2022: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు మాధవన్. ఇప్పటి వరకు హీరోగా, నటుడిగా అలరించిన మాధవన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మాధవన్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మాధవన్ చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'ను ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో భాగంగా మాధవన్‌తోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, నంబి నారాయణ్ చిత్ర నిర్మాత శేఖర్ కపూర్, గీత రచయిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాధవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఆర్యభట్ట నుంచి సుందర్ పిచాయ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన అనేక వ్యక్తులకు ఎన్నో అసాధరణమైన చరిత్ర ఉంది. వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. యువతకు వారెంతో స్ఫూర్తి. కానీ ఇలాంటి వారిపై మేము సినిమాలు తీయడం లేదు.సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందిన వ్యక్తులను సినీ ప్రొడ్యూసర్స్ గుర్తించడం లేదు. క్రిస్టోఫర్ నోలాన్ సినిమాకు రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అర్థంకాకో, ఏదో ఒకటి రాసి ఫూల్ అవ్వడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆయన తెరకెక్కించిన 'ఇన్సెప్షన్' నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆయనకు సైన్స్‌పై ఉన్న పరిజ్ఞానం వల్ల ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది.' అని మాధవన్ తెలిపాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది.