Mancherial District News
-
టాక్సి, మోటార్క్యాబ్లకు సబ్సిడీ నిలిపివేత
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ దళిత్ ఎంటర్ ప్రెన్యూసర్స్ పథఽకం(టీ ప్రైడ్) కింద ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ నిరుద్యోగులకు టాక్సి, మోటార్ క్యాబ్‌లకు ఇచ్చే సబ్సిడీని డిసెంబర్ నుంచి నిలిపి వేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని మంచిర్యాల జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మధుసూధనాచారి తెలిపారు. ఉపాధి కోసం బ్యాంకులు, ఫైనాన్స్‌ల ద్వారా రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేసి టాక్సి ప్లేట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సబ్సిడీ కోసం జిల్లా పరిశ్రమల కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత వాహన ధర ప్రకారం సబ్సిడీ మంజూరయ్యేది. మహిళా లబ్ధిదారులకు 45శాతం, పురుషులకు 35శాతం సబ్సిడీ లభించేది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతూ ఉపాధి పొందేవారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులకు సబ్సిడీ నిధులు సకాలంలో విడుదల చేయడం లేదు. 2020 నుంచి సబ్సిడీ నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలు నెలకొల్పే వారికి, ఇతర భారీ యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ యధావిధిగా మంజూరు అవుతుందని అధికారులు స్ప ష్టం చేశారు. నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చే సబ్సిడీ పథకం కొనసాగించాలని దళిత బహుజన సంఘాల ఐక్య వేదిక మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్ పలిగిరి కనకరాజు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు. -
ధైర్యంగా ఉండండి..అండగా ఉంటాం
బాసర: విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, సమస్యలు పరిష్కరించడానికి అండగా ఉంటామని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్థన్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం ఆర్జీయూకేటీ స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నిర్మల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయాన్ని అందుకునే సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించేందుకు అనేక మార్గాలు ఉంటాయన్నారు. ఉలిదెబ్బలు తట్టుకుంటేనే రాయి శిల్పంగా మారినట్టు జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకుంటే ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ పావని, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటు అధికారులు ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘మహా’ పోలింగ్
● వివాదాస్పద గ్రామాల్లో 62శాతం ఓటింగ్ నమోదు ● పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుకెరమెరి(ఆసిఫాబాద్): మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బుధవారం సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని 15 వివాదాస్పద గ్రామాల ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి తీవ్రత కారణంగా ఉదయం 10 గంటల వరకు మందకొడిగా సాగింది. పరంధోళి పోలింగ్ కేంద్రంలో 1273 ఓటర్లు ఉండగా 770 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే భోలాపటార్‌లో 914 మందికి 580 మంది, పుడ్యాన్ మొహదా 470 మందికి 282 మంది, మహరాజ్గూడలో 328 మందికి 230 మంది ఓటు వేశారు. ఆయా గ్రామాల్లో 1852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. 62 పోలింగ్ శాతం నమోదైంది. ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు ఆసక్తి చూపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పరంధోళి, భోలాపటార్, మహారాష్ట్రలోని పుడ్యాన్ మొహదా పోలింగ్‌కేంద్రాలకు గ్రామాలు దూరంగా ఉండటంతో ఓటర్లు కాలినడకన తరలివచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ భారీ భద్రత కల్పించారు. మీడియాకు కూడా అనుమతివ్వకపోడంతో కొందరు మహారాష్ట్ర పోలీసులతో వాగ్వాదానికి దిగారు.పరంధోళిలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లునడిచివచ్చి ఓటేశా.. పోలింగ్ కేంద్రానికి మా కోటా గ్రామం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి నడిచివచ్చి ఓటు వేశా. ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. – జాదవ్ శేశారావు, కోటా -
ఆరు అంతస్తులతో అధునాతన ఆసుపత్రి
కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మొత్తం రూ.360కోట్లతో 650పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. జీప్లస్ 6అంతస్తుల్లో రెండు ప్రధాన ఆసుపత్రి భవనాలు, సర్వీస్ బ్లాక్ ఉండనుంది. అంతేగాక ప్రస్తుతం గోదావరి ఒడ్డున ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. మొత్తంగా నాలుగు బ్లాక్‌లుగా ఆసుపత్రి కొనసాగనుంది. సెక్యూరిటీ, ఆక్సిజన్ ప్లాంట్, సర్వీస్ బ్లాక్‌లు, రవాణా, అంబులెన్సు, ఎస్టీపీ, ఈటీపీ, బయోవేస్టేజ్ తదితరవన్నీ ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనునున్నారు. మొత్తం 4.33ఎకరాల్లో ఈ మేరకు భవన నిర్మాణాన్ని అత్యాధునికంగా నిర్మించేందుకు సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో 1200పడకలకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తున్నారు. ఇక జిల్లా ఆసుపత్రి సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు, పట్టణ నడిబొడ్డున ఉండడంతో అందరికీ సులువుగా రవాణాకు వీలు కలుగుతుంది. ఇప్పటికే జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ప్రస్తుతం మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో వచ్చాయి. భవిష్యత్తులో ఇక్కడే వైద్య విద్యార్థులు వైద్యులుగా రాణించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో పీజీ కాలేజీగా అప్‌గ్రేడ్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రుల భవన నిర్మాణాలు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తయితేనే జిల్లా వాసులకు ఊరట కలుగనుంది. భవన నిర్మాణాల జాప్యం లేకుండా ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉంది. -

ఇక సూపర్ స్పెషాలిటీ సేవలు
● జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ● జీప్లస్ 6అంతస్తుల్లో 600పడకలతో నిర్మాణం ● నేడు భూమి పూజ చేయనున్న మంత్రులుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏళ్లుగా అరకొర వైద్య సేవలతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి రాబోయే రోజుల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాతోపాటు ఆసిఫాబాద్, మహారాష్ట్ర వాసులకు ఈ ఆస్పత్రి ఏర్పాటుతో ఎంతో ప్రయోజనం కలుగనుంది. జిల్లా నుంచి నిత్యం అనేక మంది వైద్య సేవల కోసం సాధారణ, అత్యవసర వేళల్లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలాసార్లు ఇక్కడి ఆస్పత్రుల నుంచి సౌకర్యాలు లేక నగరాలకు రెపర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఆవిర్భావం జరిగినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంకా ఎంతగానో వైద్య సేవలు మెరుగుపడాల్సి ఉంది. ఆపదలో మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షల ఫీజుల చెల్లించలేక ఆర్థికంగా చతికిల పడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులకే తమ కష్టార్జీతాన్ని దారపోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జబ్బులకు సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లు జిల్లా పరిధిలోనే అందుబాటులోకి రానున్నారు. ఈ సమస్యలన్నీ తీర్చేందుకు జిల్లా కేంద్రంలో ఐబీ పరిధిలోని ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలంలో ఈ మేరకు గురువారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం, మాతాశిశు సంరక్షణ కేంద్ర భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చొరవతో భవన నిర్మాణం కోసం ఇప్పటికే తొలి విడతలో రూ.50కోట్లు మంజూరయ్యాయి. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే పట్టుదలగా ఉండడంతో మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంది. -
రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ బుర్స పోచయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన తుడుం దెబ్బ జిల్లా మహాసభలకు నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తుడుం దెబ్బ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాలకు వలసవాదులు వచ్చి గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందడంతో పాటు అన్ని రకాలుగా వంచిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి పోరు ప్రారంభించిందని చెప్పారు. అనంతరం తుడుం దెబ్బ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా కమిటీని ఈ నెల 23న ఖానాపూర్‌లో జిల్లా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు తెలిపారు. నాయకులు గోడం నణేశ్, పుర్కబాపురావు, గోడం నగేశ్, కుడిమెత తిరుపతి, గుర్రాల రవీందర్, పంద్ర జైవంత్‌రావు, కోట్నాక్ విజయ్, ఆత్రం ఆనంద్‌రావు, పెందూర్ పుష్పరాణి, రేణుకాబాయి, ఆత్రం మోతీరాం, సిడాం సోనేరావ్, బాజీరావు తదితరులున్నారు. -
మత్తుకు బానిసైతే జీవితం చిత్తే
సారంగపూర్: గంజాయి, సిగరెట్, మద్యం, ఇతర డ్రగ్స్‌కు బానిసలుగా మారితే జీవితాలు చిత్తవుతాయని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్‌రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి అన్నారు. చించోలి(బి) ఎక్స్‌రోడ్డు సమీపంలోని మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు బుధవారం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలను తీసుకోవడం వలన క్రమేణా ఆరోగ్యం క్షీణించి క్యా న్సర్ బారిన పడతారన్నారు. తద్వారా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందన్నారు. వాటికి దూ రంగా ఉండి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తూసింగ్, జిల్లా మహిళా విభాగం చైర్మన్ అనూష, మండల చైర్మన్ పోలీస్ భీమేష్, ప్రతినిధులు సంజీవ్, మాటేగాం మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్, కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ అప్ప, పాల్గొన్నారు. -

బస్సు సౌకర్యం కల్పించాలని మహిళల రాస్తారోకో
దస్తురాబాద్: మండంలంలోని గోడిసీర్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన మహిళలు బుధవారం పాండ్వపూర్–కలమడుగు రహదారిపై రాస్తారోకో చేశారు. రేవోజీపేటలో కాంగ్రెస్ కార్యకర్త వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేకు విషయం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగ్రామానికి జగిత్యాల, ఉట్నూర్ డిపోలకు చెందిన బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలకు అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. దీంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో రూటు సర్వే చేసి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు రాస్తారోకో విరమించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, నాయకులు శ్రీనివాస్, మాన్కు, గోపి, సురేందర్, స్వామి, తదితరులు ఉన్నారు. -
ఆర్గానిక్ పత్తి.. విదేశాలకు ఎగుమతి
● ప్రతియేటా ఉమ్మడి జిల్లా నుంచి తరలింపు ● చెన్నయ్ మీదుగా జర్మనీకి.. బట్టలకు వినియోగం ● క్వింటాల్‌కు రూ.500 అదనంజన్నారం: పత్తి పంట చేతికి రావాలంటే రసాయన ఎరువులు వాడాల్సిందే. మొలక నుంచి మొదలు పత్తి పంట చేతికొచ్చే వరకు చీడపీడల నుంచి రక్షణకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి రసాయన మందులు పిచికారీ చేస్తారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల రైతులు పూర్తిగా సేంద్రియ ఎరువులతో పత్తి పండిస్తున్నారు. దిగుబడి వచ్చిన పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చేత్నా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ సంస్థ రైతులు, జర్మనిలోని డిబెల్ల టెక్స్టైల్ కంపెనీ ప్రతినిధులకు మధ్య వారధిగా నిలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు మండలాల్లో సుమారు 5,500మందికి పైగా రైతులు ఆర్గానిక్ పత్తి పంట పండిస్తున్నారని చేత్నా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ సంస్థ సీఈవో నందకుమార్ తెలిపారు. అ‘ధనం’ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, కెరమెరి, ఆసిఫాబాద్, సిర్పూర్–యూ, జైనూర్, ఉట్నూర్ మండలాల్లోని 170 గ్రామాల్లో ఆర్గానిక్ పత్తి పంట పండిస్తున్నారు. ఈ ఏడాది ఆయా గ్రామాల్లోని 5,500 మంది రైతులు 7,900 ఎకరాల్లో పత్తి సాగు చేసి 55,300 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ పత్తికి మార్కెట్ ధర కన్న పది శాతం ఎక్కువ ధర చెల్లిస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని గ్రహించి ఈ ధర చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,500 ఉండగా.. సంస్థ రూ.8వేలు చెల్లిస్తోంది. దీంతోపాటు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన సేంద్రియ ఎరువులకు సహకారం అందిస్తున్నారు. సేవా కార్యక్రమాలు జర్మనీ, నెదర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు రైతులతో ఆర్గానిక్ పంట పండించడమే కాకుండా వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. సిర్పూర్ మండలంలో కంప్యూటర్ ల్యాబ్, సిర్పూర్–యూ మండలం రాఘవాపూర్‌లో విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. జన్నారం మండలంలో ప్రోత్సాహం రైతులు ముందుకు వస్తే జన్నారం మండలంలో కూడా ఆర్గానిక్ పత్తి పంట పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ మండలంలోని గిరిజన గ్రామాలను ఎంచుకుని ఆర్గానిక్ పంటపై అవగాహన కల్పించి రైతులు ముందుకు వస్తే వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. చెన్నయ్ మీదుగా జర్మనీకి సరఫరా.. పత్తి పంట చేతికి వచ్చాక పత్తిని తీసే విధానంపై అవగాహన కల్పించడానికి జర్మనీ దేశస్తులు ప్రతీ సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. పత్తిని తీశాక ఇంద్రవెల్లి మండలంలో జిన్నింగ్ చేసి అక్కడి నుంచి చెన్నయ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సదన్ ఫాస్ట్ ఇండియా కంపెనీ నుంచి జర్మనీ దేశానికి తరలిస్తారు. ఈ పత్తితో జర్మనీలో టవల్స్, బెడ్షీట్లు తయారు చేసి విక్రయిస్తారు. ప్రతీ సంవత్సరం పత్తి పండించి ఎగుమతి చేస్తుండగా.. ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముందుగా 800 మందితో పంట పండించగా.. ప్రస్తుతం ఆ రైతులు సంఖ్య 5,500మందికి చేరింది. -
బస్సు సౌకర్యం కల్పించాలని మహిళల రాస్తారోకో
దస్తురాబాద్: మండంలంలోని గోడిసీర్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన మహిళలు బుధవారం పాండ్వపూర్–కలమడుగు రహదారిపై రాస్తారోకో చేశారు. రేవోజీపేటలో కాంగ్రెస్ కార్యకర్త వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేకు విషయం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగ్రామానికి జగిత్యాల, ఉట్నూర్ డిపోలకు చెందిన బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలకు అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. దీంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో రూటు సర్వే చేసి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు రాస్తారోకో విరమించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, నాయకులు శ్రీనివాస్, మాన్కు, గోపి, సురేందర్, స్వామి, తదితరులు ఉన్నారు. -
24న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్‌పోటీలు
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లా కేంద్రంలోని బాలికల ఆదర్శ క్రీడాపాఠశాలలో ఈ నెల 24న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఉపేందర్, టోర్నమెంట్ కన్వీనర్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 9, 11, 13, 14, 15 విభాగాల్లో ఓపెన్ టూ ఆల్ పద్ధతిలో ఈ పోటీలు కొనసాగుతాయన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు చీఫ్ ఆర్బిటెర్ అంబాల కల్పన, ఎం.శృతిలను 8978146456 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కారు ఢీకొని ఒకరి మృతిభీమారం: మండల కేంద్రంలోని ఇప్పలబొగుడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ మృతిచెందాడు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం నుంచి మంచిర్యాల వైపు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న జైపూర్ మండలం రసూల్‌పల్లి గ్రామానికి చెందిన ఆకుదారి మల్లేశ్(28)ను వెనుక నుంచి కారు అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో కిందపడి తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ను 108అంబు లెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కారు డ్రైవర్ పారిపోయాడని ఏసీపీ తెలిపారు. సంఘటన స్థలాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై తెలుసుకున్నారు. -

పకడ్బందీగా ధాన్యం సేకరణ
● మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులు, రైస్‌మిల్లర్లతో ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ దేవేంద్రసింగ్‌చౌహాన్ మాట్లాడుతూ రైస్‌మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం అందిస్తామని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా రైస్‌మిల్లులు పని చేయాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహించిన మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3,550 మెట్రిక్‌టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుందని, 1,241 మెట్రిక్ టన్నులు ఽకొనుగోలు చేశామని తెలిపారు. రైతులు మద్దతు ధర పొందాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వం ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం హాజీపూర్ మండలం గుడిపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్‌తో కలిసి సందర్శించారు. కమిషనర్ మాట్లాడుతూ 48గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీఓ కిషన్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్‌పాండే, ఏఓ కృష్ణ, గిర్దావర్ ప్రభు, ఎస్సై గోపతి సురేశ్, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. -
కారు అద్దం పగులగొట్టి నగదు చోరీ
● రూ.1.80 లక్షలు అపహరణ ● నిర్మల్ జిల్లా భైంసాలో ఘటన భైంసాటౌన్(ముధోల్): భైంసా పట్టణం నడిబొడ్డున నిలిపి ఉంచిన ఓ కారులో నుంచి నగదు ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. లోకేశ్వరం మండలంలోని గడ్చాందకు చెందిన బీడీ కంపెనీ నిర్వాహకుడు అల్లం భోజన్న రూ.50వేల నగదుతో కారులో భైంసాకు వచ్చాడు. ముందుగా నిర్మల్ రోడ్‌లోని ఎస్బీఐలో మరో రూ.90వేల నగదు డ్రా చేసుకున్నాడు. అక్కడి నుంచి బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ వద్దకు వెళ్లాడు. అక్కడ కారులో నగదు ఉన్న బ్యాగును ఉంచి పని నిమిత్తం బ్యాంక్లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా కారు అద్దం పగులగొట్టి ఉంది. అందులో నగదు బ్యాగ్ కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఎండీ గౌసుద్దీన్ వచ్చి వివరాలు సేకరించారు. సీసీ పుటేజీలు పరిశీలించగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుల కోసం గాలిస్తున్నారు. -

‘దళారులను నమ్మి మోసపోవద్దు’
చెన్నూర్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే పత్తి అమ్ముకోవాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూర్ కాటన్ కంపెనీలో సీసీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తినే సీసీఐ కొనుగోలు చేస్తుందని, రైతులు నిబంధనల ప్రకారం పత్తి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఎకరానికి 16 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి రామాంజనేయులు, సీపీవో రవీందర్ నాయక్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి పాల్గొన్నారు. జిన్నింగ్ మిల్లుల సందర్శన తాండూర్: మండలంలోని రేపల్లెవాడ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పత్తిలో అధిక తేమ శాతం లేకుండా చూసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఓటీపీ రావడం జాప్యం అవుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ బుర్స పోచయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన తుడుం దెబ్బ జిల్లా మహాసభలకు నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తుడుం దెబ్బ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాలకు వలసవాదులు వచ్చి గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందడంతో పాటు అన్ని రకాలుగా వంచిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి పోరు ప్రారంభించిందని చెప్పారు. అనంతరం తుడుం దెబ్బ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా కమిటీని ఈ నెల 23న ఖానాపూర్‌లో జిల్లా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు తెలిపారు. నాయకులు గోడం నణేశ్, పుర్కబాపురావు, గోడం నగేశ్, కుడిమెత తిరుపతి, గుర్రాల రవీందర్, పంద్ర జైవంత్‌రావు, కోట్నాక్ విజయ్, ఆత్రం ఆనంద్‌రావు, పెందూర్ పుష్పరాణి, రేణుకాబాయి, ఆత్రం మోతీరాం, సిడాం సోనేరావ్, బాజీరావు తదితరులున్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికే లోకల్కోర్ట్
● సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎరుకల నారాయణ ● వినియోగదారుల పరిష్కార వేదికకు విశేష స్పందనరామకృష్ణాపూర్: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ధ్యేయంగా సీజీఆర్ఎఫ్(కన్జూమర్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ ఫోరం) కృషి చేస్తోందని సీజీఆర్ఎఫ్(నిజామాబాద్) చైర్పర్సన్ ఎరుకల నారాయణ అన్నారు. క్యాతనపల్లిలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మంచిర్యాల రూరల్ సబ్ డివిజన్ పరిధి విద్యుత్ వినియోగదారుల లోకల్కోర్ట్కు విశేష స్పందన లభించింది. బిల్లులు, మీటర్ల మార్పు, మీటర్లు కాలిపోవడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, సకాలంలో స్పందించని సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై రైతులు 1912 టోల్‌ఫ్రీకి నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సాంకేతిక సభ్యుడు సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు లకావత్ కిషన్, మంచిర్యాల డీఈఈ కైసర్, ఏడీఈ మోహన్‌రెడ్డి, ఏఈలు ప్రభాకర్, బి.శ్రీనివాస్, ఏఈ మహేందర్‌రెడ్డి, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మంత్రుల పర్యటన భద్రత ఏర్పాట్ల పరిశీలన
మంచిర్యాలక్రైం: మంచిర్యాలలో గురువారం సూపర్ స్పెషాలిటీ, మాతాశిశు ఆసుపత్రి భవన నిర్మాణ భూమి పూజకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషర్ ఎం.శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్, భూమి పూజ జరిగే ప్రాంతం, బహిరంగ సభ వేదిక సందర్శించారు. రూట్మ్యప్ పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అడిషనల్ డీసీపీ రాజు, ఏసీపీ ఆర్ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావ్ పాల్గొన్నారు. -
బెస్ట్ ఫైరర్‌గా ఎంపికయ్యాను
నేను రెండో ప్రయత్నంలో కొలువు సాధించాను. మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని పెంచుకున్నాను. ఎస్సై ఉద్యోగం కొద్దిలో మిస్సయింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. జిల్లా కేంద్రంలోని డీటీసీలో శిక్షణ పొందిన నేను బెస్ట్ ఫైరర్‌గా ఎంపికయ్యాను. – ఎండీ యూనుస్, జగిత్యాలచాలా సంతోషంగా ఉంది మా మేనమామ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రోత్సాహంతో డిపార్ట్‌మెంట్‌పై మక్కువ పెంచుకున్నాను. రెండేళ్లు కష్టపడి కొలువు సాధించాను. శిక్షణ సమయంలో బాగా చూసుకున్నారు. విధుల్లో చేరబోతుండడం చాలా సంతోషంగా ఉంది. – రాజేశ్, సూర్యపేట బెటాలియన్ కానిస్టేబుల్ వదిలి.. 2018లో బెటాలియన్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. యూసుఫ్‌గూడలో రెండేళ్లు విధులు నిర్వర్తించాను. ఎస్సై ఉద్యోగం కొద్దిలో మిస్సైంది. ఆ తర్వాత కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. తొమ్మిది నెలలు శిక్షణ పొందాను. అన్ని విభాగాల్లో ఆల్‌రౌండర్‌గా రెండో స్థానం సాధించాను. – జీ వినోద్‌కుమార్, సూర్యపేట -
యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంజాబ్‌చౌక్ సమీపంలోగల లాడ్జిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంసి మండలంలోని ఓ గ్రా మానికి చెందిన సదరు యువకుడు వివాహితతో కలిసి లాడ్జికి వెళ్లాడు. వారి మధ్య వివాదం తలెత్తగా యువకుడు లాడ్జిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు సమాచారం. దీంతో సదరు మహిళ లాడ్జి సిబ్బందికి సమాచారమిచ్చింది. వారు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై టూ టౌన్ సీఐ కరుణాకర్ రావును సంప్రదించగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. పోక్సో కేసులో ఒకరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: బాలికను కిడ్నాప్ చేసిన కేసులో పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ అనే యువకుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ప్రేమ పేరిట నమ్మించిన సమీర్ బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సమీర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
టాటా ఏస్ వాహనానికి అగ్ని ప్రమాదం
జైపూర్: మండలంలోని ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బుధవారం అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులు సురక్షితంగా బయపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాల నుంచి చెన్నూర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏసీ వాహనంలో ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపాడు. ప్రయాణికులను కిందికి దింపేలోగానే మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. వాహనం మొత్తం అంటుకోగా ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో కొద్ది క్షేణాల్లోనే వాహనం కాలిబూడిదైంది. అటు వైపున వెళ్తున్న వాహనదారులు అంతా భయాందోళనకు గురయ్యారు. -
టీపీఏ జిల్లా కమిటీ ఎన్నిక
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్(టీపీఏ) జిల్లా నూతన కమిటీని బుధవారం మంచిర్యాలలో ఎన్నుకున్నారు. ఎన్నికల పర్యవేక్షకుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరావు కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా రంగు వేణుకుమార్, ప్రధాన కార్యదర్శిగా సుమన చైతన్య, ఉపాధ్యక్షులుగా మొగిలి, రజిత, కోశాధికారిగా సమ్మ య్య, సంయుక్త కార్యదర్శులుగా సృజన మోహన, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా కిరణ్‌కుమార్, నాగరాజ్, ప్రశాంతి, కవిత, గౌరవ సలహాదారులుగా పద్మచరణ్, యోగేశ్వర్, చంద్రమోహన్‌గౌడ్ ఎన్నికయ్యారు. వెంకటేశ్వర్లు, శశికిరణ్ న్నారు.