Manju Warrier
-
విజయ్ సేతుపతి ‘విడుదల-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్ రిలీజ్
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ ' పావురమా పావురమా' మేకర్స్ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన 'విడుదల 2' చిత్రంలోని తొలిపాటను తాజాగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా విడుదల2 ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అని ఆయన తెలిపారు.విజయ్ సేతుపతి, మంజు వారియర్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. -
ప్రముఖ జ్యువెలర్స్ చొరవ.. ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్‌మీడియాలో ట్రెండింగ్ సాంగ్.. వీడియో చూశారా..?
రజనీకాంత్ వేట్టయాన్ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ 'మనసిలాయో'. తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. చాలా సింపుల్ కొరియోగ్రఫీతో దినేశ్ ఈ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. సోషల్‌మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ పాటలో రజనీకాంత్‌తో మంజు వారియర్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మలయాళంలో చాలా పాటలు ఆమె చేసినప్పటికీ ఇంత క్రేజ్ రాలేదని చెప్పవచ్చు. తన కెరీర్లో ఇంత పెద్ద హిట్ అయిన పాట ఇదేనని మంజు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
'వేట్టయాన్' భారీ ఆఫర్.. టికెట్ల రేట్లు తగ్గింపు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్‌కు మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే -
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్‌తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్‌కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్‌లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
మరో ఛాన్స్ ఇస్తానని దర్శకుడు మాటిచ్చాడు: మంజు వారియర్
మలయాళ భామ మంజు వారియర్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయనే చెప్పాలి. మాతృభాషలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ధనుష్ భార్యగా అసురన్ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత అజిత్ సరసన తుణివు (తెగింపు) చిత్రంలో యాక్షన్ హీరోయిన్గా నటించారు. అది మంచి విజయాన్ని సాధించింది. తాజాగా రజనీకాంత్ సరసన వేట్టైయాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా ఇందులో రజనీకాంత్‌తో కలిసి 'మనసిలాయో' అనే కలర్ ఫుల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో తాజాగా నటుడు విజయ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ చివరిగా తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అక్టోబర్ నెలలో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. ఇది నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు దోహదపడే విధంగా ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. నటీమణుల లిస్ట్ పెరుగుతోంది. ముఖ్యంగా నటి సమంత, శ్రీలీల, సిమ్రాన్, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నటి మంజు వారియర్ పేరు వెలుగులోకి వచ్చింది. తుణివు చిత్రంలో నటిస్తున్నప్పుడే దర్శకుడు హెచ్ వినోద్ తనకు మరో చిత్రంలో అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు నటి మంజు వారియర్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. దీంతో ఆమె విజయ్ సరసన నటించటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాల్సిందే. -
కబాలినే టెన్షన్ పెడ్తున్న హీరోయిన్స్...
-
రజనీకాంత్‌తో హుక్ స్టెప్.. డబుల్ హ్యాపీ: మంజు వారియర్
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘మెరుపై వచ్చాడే’ అంటూ సాగే ‘మనసిలాయో...’ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాదు... ఈ పాటలో అదిరి పోయే స్టెప్పులేసి మంజు వారియర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.(చదవండి: ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ!)ఇక ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘మనసిలాయో...’ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్ సాంగ్‌ను నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఈ తరహా సాంగ్‌లో డ్యాన్స్ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది. అంతమంది డ్యాన్సర్స్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఒకే రిథమ్‌లో హుక్ స్టెప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది.(చదవండి: ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సినిమా)అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌లో నేను చేసిన తొలి పాట కూడా ఇదే. ఇక జ్ఞానవేల్గారి ‘జై భీమ్’ సినిమా చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సమయంలో ‘వేట్టయాన్’ సినిమాతో ఆయన నన్ను అ్రప్రోచ్ అయ్యారు. పైగా రజనీకాంత్‌గారు కూడా ఉంటారని చెప్పారు. దీంతో డబుల్ హ్యాపీ ఫీలయ్యాను. రజనీగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను రజనీగారి భార్య తారగా కనిపిస్తాను. ఇంకా విజయ్ సేతుపతి ‘విడుదలై 2’, మోహన్‌లాల్ ‘ఎల్: ఎంపురాన్’ (లూసిఫర్ సీక్వెల్) చిత్రాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ఇక అక్టోబరులో ‘వేట్టయాన్’తో, డిసెంబరులో ‘విడుదలై 2’తో రెండు నెలల గ్యాప్‌తో తెరపై కనిపిస్తారు మంజు. -
రజినీకాంత్ కి షాక్ ఇచ్చిన మంజు వారియర్
-
త్రిష బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీతో దుమ్మురేపుతున్న బ్యూటీ
-
ఛాన్సులే రావనుకుంటే రీఎంట్రీతో దుమ్మురేపుతున్న వెటరన్ బ్యూటీ
ప్రతిభ కలిగిన వారికి సినీ రంగంలో గ్యాప్ వస్తుందేమో గానీ, మళ్లీ రాణించడం మాత్రం పక్కా. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. ఇండియన్ కథానాయకిగా పేరు గాంచిన ఈమె ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమయ్యారు. త్రిష పని అయిపోయిందీ అనే మాట కూడా చిత్ర వర్గాల్లో వినిపించింది. అలాంటిది పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిశారు. అంతే ఇప్పటికీ విజయ్, అజిత్, కమలహాసన్ వంటి సీనియర్ స్టార్స్‌కు జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నారు.మలయాళ భామ మంజువారియర్ది దాదాపు ఇదే పరిస్థితి. ఈమె కూడా మలయాళంలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే నటుడు దిలీప్‌ను 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత నటనకు గ్యాప్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆ తరువాత మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయారు. అలా 15 ఏళ్ల తరువాత మంజువారియర్ నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ 46 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు సీనియర్ నటులకు ఆప్షన్ కథానాయకిగా మారారు. తమిళంలో బిజీగా నటిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల్లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ సాంగ్ఇంతకుముందు అజిత్‌కు జంటగా తుణివు. ధనుష్ సరసన అసురన్ చిత్రాలలో నటించారు. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై 2 చిత్రంలోనూ, రజనీకాంత్ సరసన వేట్టైయాన్ చిత్రంలోనూ నటించారు. వీటిలో వేట్టైయాన్ చిత్రం అక్టోబర్ 10న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో మంజువారియర్ స్టెప్స్ వేసిన పాట ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ పాటలో మంజువారియర్ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
రమ్యకృష్ణ తర్వాత ఆ ఛాన్స్ మంజు వారియర్‌కు ఇచ్చిన రజనీకాంత్
సీనియర్ హీరోలు కమలహాసన్, రజనీకాంత్, అజిత్ వంటి వారు తమ వయసుకు తగ్గ కథాపాత్రల్లో నటించడం మొదలెట్టి చాలా కాలమే అయ్యింది. నటుడు విజయ్ కూడా లియో చిత్రంతో ఆ తరహా పాత్రల్లో నటించడం మొదలెట్టారు. అలాగు ఈ హీరోలు తమ వయసుకు తగ్గ హీరోయిన్లతోనే నటిస్తున్నారు. అలా నటుడు రజనీకాంత్ సమీపకాలంలో సీనియర్ నటీమణులతోనే నటిస్తున్నారు. ఈయన పీక్ టైమ్‌లో నటించలేని నేటి సీనియర్ నటీమణులు సిమ్రాన్, త్రిష, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ వంటి వారికి ఇప్పుడు అవకాశాలు వరిస్తున్నాయి. కాగా తాజాగా నటుడు రజనీకాంత్ వేట్టైయాన్ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు నటించని నటుడు ఫాహత్ఫాజిల్, రానా దగ్గుపాటి, నటి మంజువారియర్, రిత్వికా సింగ్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా నటుడు ఫాహత్ ఫాజిల్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి చిత్రం అంతా ఉండే వినోదభరిత పాత్రలో నటించినట్లు సమాచారం. అలాగే నటి మంజువారియర్ ఇందులో రజనీకాంత్‌కు భార్యగా నటించనట్లు తనే ఒక కార్యక్రమంలో చెప్పారు. మలయాళంలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇంతకు ముందు తమిళంలో నటుడు అజిత్ సరసన తుణివు, ధనుష్‌కు జంటగా అసురన్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా వేట్టైయాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్‌ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్‌కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్‌కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్‌లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్‌లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్‌గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్‌కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్‌కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలుసు. సొంత భాషలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలోనూ సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. ధనుష్ 'అసురన్' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైన మంజు.. ఆ తర్వాత అజిత్‌తోనూ నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కొత్త మూవీలో యాక్ట్ చేస్తోంది. (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న మంజూ వారియర్.. గతంలో మలయాళ నటుడు దిలీప్ని పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు మంజూ వారియర్ దగ్గరే ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించి మంజూ వారియర్‌కి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. 'ఆ ఒక్కటి అడగొద్దు' అని క్లారిటీ ఇచ్చేసింది. తన బిడ్డతో కలిసి తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈమె తమిళంలో పాటు మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) -
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. విజయ్ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ
మలయాళ నటి మంజు వారియర్‌కు కోలీవుడ్లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్‌కు జంటగా అసురన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్ ఇక్కడ మంచి మార్కెట్ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్ రెండో భాగంలో విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేసి షూటింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్స్‌కు ఛాన్స్
నటుడు రజినీకాంత్ జైలర్ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్ చిత్రం టీజే. జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) ఆ మధ్య దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఇందులో నటి దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్ ముఖ్యపాత్రను పోషించిన లాల్ సలామ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం. -
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈసారి తలైవా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి అలా వదిలేస్తే.. రజినీ తర్వాత మూవీ కోసం భారీ సెటప్ సిద్ధమవుతోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్లానింగ్ అదీ చూస్తుంటే పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్టార్స్ ఎవరెవరు? రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఒకే మూసలో సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. 'జైలర్' మీద పెద్దగా అంచనాల్లేవు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. అయితే ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) నిజమైతే మాత్రం! ప్రస్తుతానికి రూమర్ అయినప్పటికీ.. దాదాపు ఇదే నిజం కావొచ్చని తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలో ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరో రెండు వారాల్లో ప్రకటన రానుందని సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీ పోలీస్ గా కనిపిస్తారట. అందులో భాగంగా తాజాగా హెయిర్ కట్ చేయించుకుని లుక్ మార్చేశారు. నానికి లక్కీ ఛాన్స్? ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమైతే మాత్రం తెలుగు హీరో నాని లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఎందుకంటే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే నాని.. పాన్ ఇండియా ఆశలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. మరి ఈ న్యూస్‌పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
ప్లాన్ మారింది.. స్టార్ హీరోయిన్ వచ్చింది!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైర్సటైల్ నటుడు అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో అని మాత్రమే కాకుండా విలన్, సైడ్ క్యారెక్టర్స్, గెస్ట్ రోల్స్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతున్నాడు. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీలో వెబ్ సిరీసులు అన్నీ కవర్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) ఈ ఏడాది విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో 'విడుదలై-1' ఒకటి. కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ తీసిన మూవీ ఇది. ఇందులో సేతుపతి నటించాడు కాకపోతే ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించారు. రెండో భాగాన్ని చాలావరకు షూట్ చేసిన వెట్రిమారన్.. ఇప్పుడు చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి మళ్లీ చిత్రీకరణ జరుపుతున్నాడట. సీక్వెల్లో విజయ్ సేతుపతికి జోడీని చేర్చారు. ఆ పాత్రని మలయాళ నటి మంజు వారియర్ చేస్తున్నారు. ఈ జంటకి సంబంధించిన సీన్స్‌ని చిరుమలై ప్రాంతంలో తీస్తున్నారు. త్వరలో థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్‌కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్‌ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్‌లో మంజు వారియర్‌కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్‌పై సింగిల్‌గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi)