market capitalization
-
క్యూ1లో వేదాంతా దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా గ్రూప్ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇటీవల దూకుడు చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 28– జూన్ 20 మధ్య గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 2.2 లక్షల కోట్లు ఎగసింది. వెరసి మార్కెట్ విలువ వృద్ధి వేగంలో డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం, కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లను సైతం అధిగమించింది. ఈ కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువకు రూ. 1.4 లక్షల కోట్లు చొప్పున జమయ్యింది. వేదాంతా గ్రూప్‌లోని హిందుస్తాన్ జింక్ షేరు ధర 52 వారాల కనిష్టం నుంచి రెట్టింపైంది. ఇందుకు విడదీత ప్రతిపాదన, రుణభార తగ్గింపుపై యాజమాన్య దృష్టి, మెరుగైన పనితీరు వంటి పలు సానుకూలతలు తోడ్పాటునిచ్చాయి. ఇక ఈ కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 60,600 కోట్లమేర బలపడగా.. ఆర్ఐఎల్ విలువ రూ. 20,656 కోట్లమేర క్షీణించింది. రికార్డ్ రెవెన్యూ గతేడాది(2023–24) వేదాంతా గ్రూప్ రూ. 1,41,793 కోట్ల ఆదాయం సాధించింది. గ్రూప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధికంకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 36,455 కోట్లను తాకింది. 30 శాతం ఇబిటా మార్జిన్లను అందుకుంది. సమీప కాలంలో 10 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించేందుకు వేదాంతా గ్రూప్ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు వీలుగా జింక్, అల్యూమినియం, చమురు–గ్యాస్, విద్యుత్ తదితర బిజినెస్‌ల 50 ప్రభావవంత ప్రాజెక్టులను సమయానుగుణంగా పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం గ్రూప్‌పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.03 శాతం పెరిగి 8.77 శాతానికి చేరింది. దీంతో గత నెల 22న వేదాంతా షేరు రూ. 507 వద్ద, హింద్ జింక్ షేరు రూ. 807 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. బీఎస్ఈలో గురువారం వేదాంతా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 470ను అధిగమించగా.. హింద్ జింక్ షేరు 2.3 శాతం బలపడి రూ. 648 వద్ద ముగిసింది. -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్‌లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్‌లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్‌లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్‌తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
వదంతులపై స్పందించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీల వ్యవహారాలపై మార్కెట్లో పుట్టే వదంతుల విషయంలో లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్పందించాల్సిందేనంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. తొలుత మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు వదంతులపై స్పందించడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ ఏడాది అక్టోబర్ 1 గడువుగా పేర్కొంది. అయితే తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరి 1 వరకూ పొడిగించింది. ఇక టాప్–250 మార్కెట్ క్యాప్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1 నుంచి కాకుండా 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలుకానున్నాయి. -
జాక్‌పాట్ కొట్టిన ఆనంద్ మహీంద్రా.. ఒక్కరోజే రూ.7,672 కోట్లతో
ముంబై: ఫార్మా, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ లాభపడ్డాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ మార్కెట్ భారీ ర్యాలీకి ప్రతిబంధకంగా మారింది. ఈ వారంలో ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, అమెరికా ద్రవ్యోల్బోణ డేటాతో సహా పలు దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య కదలాడుతూ ఊగిసలాట వైఖరిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ ఉదయం 90 పాయింట్లు పెరిగి 65,811 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 65,748 వద్ద కనిష్టాన్ని, 66,068 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 232 పాయింట్లు పెరిగి 65,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 19,577 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,525 – 19,620 పరిధిలో కదలాడింది. ఆఖరికి 80 పాయింట్లు పెరిగి 19,597 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీతో పాటు ఇంధన, రియల్టీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, మెటల్, మీడియా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,893 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,081 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.22 లక్షల కోట్లు పెరిగి రూ.305.38 లక్షల కోట్లకు చేరింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, యూరోజోన్ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అధిక భాగం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►జూన్ క్వార్టర్లో నికర లాభం 56.04% వృద్ధి చెందడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి రూ.1,527 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం దూసుకెళ్లి రూ.1,531 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ విలువ ఒక్క రోజులో రూ.7,673 కోట్లు పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ►యధార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ షేరు లిస్టింగ్ రోజు 11% ర్యాలీ చేసింది. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరత పరిస్థితుల దృష్ట్యా బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.300)తో పోలిస్తే 2% స్వల్ప ప్రీమియంతో రూ.306 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 14% ఎగసి రూ.343 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% లాభంతో రూ.334 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 15.16 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. కంపెనీ విలువ రూ.2,854 కోట్లుగా నమోదైంది. ► తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో బ్రిటానియా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఎన్ఎస్ఈలో రెండున్నర శాతానికి పైగా నష్టపోయి రూ.4,670 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతం క్షీణించి రూ.4618 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని దిగివచ్చింది. నిఫ్టీ–50 సూచీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే కావడం గమనార్హం. -
వన్ అండ్ ఓన్లీ యాపిల్: కీలక మైలురాయిని అధిగమించిన యాపిల్
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం యాపిల్ కీలక మైలురాయిని చేరుకుంది. యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని అధిగమించిన ఏకైక కంపెనీగా నిలిచింది. ఇటీవల యాపిల్ షేర ధర ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ వ్యాల్యూ బాగా పెరిగింది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్ డాలర్ల విలువతో ట్రేడింగ్ డేను ముగించిన పబ్లిక్ కంపెనీగా యాపిల్ నిలిచింది. యాపిల్ శుక్రవారం 1 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 191.34 డాలర్లను తాకాయి. దీంతో యాపిల్ మార్కెట్ క్యాప్ రికార్దు స్థాయికి చేరింది. జనవరి 3, 2022న, ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది కానీ ముగింపులో నష్టపోయింది. ఈ 3 ట్రిలియన్ మార్కును దాటి ఈ ఘనతను సాధించిన ఏకైక కంపెనీ యాపిల్. వచ్చే ఏడాది విక్రయానికి రానున్న విజన్ ప్రో, ఆగ్మెంటెడ్ రియాలిటీ పరికరం ప్రివ్యూ టెక్ ప్రియులను ఆకట్టుకుంది. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కాగా 2022తో పోలిస్తే ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లాభం యాపిల్‌కు కలసి వచ్చింది. 2021 తరువాత తొలిసారి 2023 ప్రారంభంలో మార్కెట్ క్యాప్ స్థాయినుంచి 2 ట్రిలియన్ల దిగువకు పడిపోయింది. ఆతరువాత మార్కెట్ పుంజుకోవడంతో యాపిల్ షేరు ఈ ఏడాది దాదాపు 46 శాతం పెరిగడంతో మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో నిలిచింది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) -
ఇంటర్‌గ్లోబ్ విలువ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండ్ విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. లక్ష కోట్లను తాకింది. వెరసి దేశీయంగా ఈ మైలురాయిని చేరిన తొలి ఎయిర్‌లైన్స్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లడంతో కంపెనీ తాజా ఫీట్‌ను సాధించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 5 శాతమే బలపడటం గమనార్హం! బుధవారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇండిగో షేరు 3.6 శాతం జంప్‌చేసింది. బీఎస్ఈలో రూ. 2,620కు చేరగా.. ఎన్ఎస్ఈలో రూ. 2,621 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,634 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,01,007 కోట్లను అధిగమించింది. సోమవారం ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసింది. తద్వారా ఎయిర్‌బస్ చరిత్రలోనే భారీ కాంట్రాక్టుకు తెరతీసింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగంగా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో ఇండిగో కౌంటర్ జోరందుకుంది. ఇందుకు సరికొత్త గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు సైతం దోహదపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశీయంగా అతిపెద్ద విమానయాన కంపెనీగా నిలుస్తున్న ఇండిగో అంతర్జాతీయంగా విస్తరించేందుకూ ప్రణాళికలు అమలు చేస్తోంది. దేశీయంగా కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికిపైగా నమోదుకావడం విశేషం! -
సత్తా చాటిన యాపిల్: మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ టాప్‌లోకి దూసుకొచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో దిగ్గజ కంపెనీలు మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ మూడింటినీ బీట్ చేసింది. నవంబరు 3 ముగింపు నాటికి యాపిల్ 2.307 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెజాన్, ఆల్ఫాబెట్ మెటాల మొత్తం మార్కెట్ క్యాప్ 2.306 ట్రిలియన్లకు మాత్రమే కావడం గమనార్హం. బిజినెస్ ఇన్సైడర్ అందించిన వివరాల ప్రకారం గత రెండు సెషన్లలో, యాపిల్ షేర్లు 0.16 శాతం పెరిగాయి. మరోవైపు టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్, మెటా , అమెజాన్ షేర్లు పడిపోయాయి. మెటా 7.6 శాతం పడిపోగా, అమెజాన్ 17 శాతం ఆల్ఫాబెట్ షేర్లు 5.7 శాతం క్షీణతనునమోదు చేశాయి.(Elon Musk షాక్‌ల మీద షాక్‌లు: కాస్ట్ కటింగ్‌పై భారీ టార్గెట్) ఫలితంగా అమెజాన్ మార్కెట్ క్యాప్ 939.78 బిలియన్ డాలర్లుగా ఉందని నివేదించింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 240.07 బిలియన్ డాలర్లు.అయితే, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్1.126 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.ఇదిలా ఉంటే చైనీస్ న్యూఇయర్‌కు ముందే ఇండియాలో అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభించాలని యాపిల్ యోచిస్తున్నట్టు సమాచారం. -
వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో ఘనతను సొంతం చేసుకుంది. రూ. 5.03 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్లోఎస్బీఐ ఏడో స్థానాన్ని సాధించింది. దీంతో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన దేశంలో మూడో బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐ రూ. 5-ట్రిలియన్ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. షేర్ ధర సెప్టెంబర్ 14న రికార్డు స్థాయిలో రూ. 573ని తాకింది. బీఎస్ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ. 5ట్రిలియన్ మార్కును తాకింది. బలహీనమైన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉంది. గత మూడు నెలల్లో ఎ స్బీఐ షేరు 26 శాతం ఎగిసింది. ఈ లిస్ట్‌లో ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8.42 ట్రిలియన్లు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.34 ట్రిలియన్లు గా ఉంది. అలాగే గత మూడునెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది. ఈ జాబితాలోని ఇతర ఆరు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.72 ట్రిలియన్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11.82 ట్రిలియన్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ. 8.42 ట్రిలియన్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (రూ. 6.5 ట్రిలియన్), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 6.34 ట్రిలియన్) యూనిలివర్ (రూ. 6.08 ట్రిలియన్లు) ఉన్నాయి -
మార్కెట్ క్యాప్ ఢమాల్: బిలియన్ డాలర్ కంపెనీలు ఔట్
కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్‌మంటున్నాయి. 2021 అక్టోబర్‌లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది. రికార్డ్ స్థాయి నుంచి.. గతేడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా, ఆర్బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!! విలువల నేలచూపు మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది. జాబితాలో వీక్ గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్స్పన్ ఇండియా, హెచ్ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్‌కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి! లాభపడ్డవీ ఉన్నాయ్ కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్ఎఫ్సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్హెచ్ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్‌చేయడం ఇందుకు సహకరించింది. -
యాపిల్‌కి షాక్! నంబర్ వన్ స్థానం గాయబ్!!
మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇప్పటి వరకు వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న యాపిల్‌కి షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ హోదాను కోల్పోయింది. యాపిల్ని వెనక్కి నెట్టి సౌది అరేబియాకు చెందిన సౌదీ అరామ్కో సంస్థ మొదటి స్థానం ఆక్రమించింది. బుధవారం ఈ రెండు కంపెనీల షేర్ల ధరల్లో వచ్చిన హెచ్చు తగ్గులే ఈ మార్పుకి కారణం. మ్యార్కెట్ క్యాపిటలైజేషన్లో మూడు ట్రిలియన్ డాలర్ల విలువని అందుకోవడం ద్వారా యాపిల్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారింది. అయితే ఇటీవల కాలంలో యాపిల్ షేర్ ధరకు కోత పడుతోంది. బుధవారం ఒక్కరోజే షేరు వ్యాల్యూ 5.2 శాతం పడిపోయింది. దీంతో ఒక్కో షేరు ధర 146.50 డాలర్లుగా ఉండగా మార్కెట్ క్యాపిటల్ 2.37 ట్రిలియన్లకు పడిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో ఆయిల్ ఉత్పత్తిదారైన సౌదీ అరామ్కో కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ షేర్లు 28 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫలితంగా బుధవారం అరామ్కో మార్కెట్ క్యాపిటల్ 2.43 ట్రిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. దీంతో యాపిల్‌ను వెనక్కి మార్కెట్ క్యాపిటలైజేషన్లో వరల్డ్ నంబర్ 1గా అధిగమించింది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో ఎలక్ట్రానిక్స్ వంటి విలాస వస్తువులకు డిమాండ్ తగ్గిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేకపోవడంతో ఆయిల్ ధరలు దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వెరసి యాపిల్ మార్కెట్ క్యాప్‌కు కోత పడగా సౌదీఅరామ్కో భారీగా లాభపడింది. చదవండి: వేసవి ప్రయాణానికి రెడీ -
టీసీఎస్‌కు గట్టి షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ నిర్ణయం..!
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మార్ట్గేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కంపెనీ షేర్లు భారీ లాభాలను గడించాయి. కాగా ఈ సంస్థల విలీన నిర్ణయం దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు గట్టి షాక్‌ను ఇచ్చింది. టీసీఎస్ స్థానం గల్లంతు..! ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ సంస్థ టీసీఎస్‌ను అధిగమించి భారత్‌లో రెండో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కల్గిన కంపెనీగా అవతరించనుంది. ఏప్రిల్ 4న ఉదయం 11:15 గంటల నాటికి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి రూ. 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండగా, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 13.95 లక్షల కోట్లుగా ఉంది. 18 నెలలు పట్టే అవకాశం..! ఇరు సంస్థల విలీన ప్రక్రియకు రెగ్యులేటరీ నుంచి అనుమతులు రావడానికి సుమారు 18 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియ 2023–24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం.. దూసుకుపోతున్న షేర్ల ధరలు -
కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్‌లోకి భారత్..!
రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం యూరప్దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూరప్ ఎక్సేఛేంజ్‌లు నేల చూపులు చూస్తున్నాయి. ఇప్పుడిదే భారత్‌కు కలిసొచ్చింది. భారత స్టాక్ మార్కెట్స్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. టాప్-5 క్లబ్‌లోకి..! రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత మార్కెట్‌కు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది. యూరప్ దేశాల మార్కెట్స్ తీవ్రంగా పతనమవ్వడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో తొలిసారిగా భారత్ టాప్-5 క్లబ్‌లోకి చేరింది. తాజాగా భారత్ మార్కెట్ క్యాప్ 3.21 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని రికార్డులను క్రియేట్ చేసింది. యూకే మార్కెట్ క్యాప్ 3.19 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా భారత మార్కెట్లు నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్ క్యాప్ ఐదో స్థానంలోకి చేరుకుంది. అమెరికా నంబర్ 1..! మార్కెట్ క్యాప్ విషయంలో నంబర్ 1 స్థానంలో అమెరికా(47.32 ట్రిలియన్ డాలర్లు)నే కొనసాగుతుంది. రెండో స్థానంలో చైనా(11.52 ట్రిలియన్ డాలర్లు)తో, మూడో స్థానంలో జపాన్(6.00 ట్రిలియన్ డాలర్లు)తో, నాలుగో స్థానంలో హాంగ్ కాంగ్ మార్కెట్లు (5.55 ట్రిలియన్ డాలర్ల)తో కొనసాగుతున్నాయి. పడిలేచిన కెరటంలా..! 2022 ప్రారంభంలో భారత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో మార్కెట్లు బేర్ మంటూ నేల చూపులు చూశాయి. మార్కెట్ క్యాప్‌లో 7.4 శాతం పడిపోయినప్పటికీ, తిరిగి మార్కెట్స్ పుంజుకున్నాయి. మార్కెట్ క్యాప్ విషయంలో రెండు స్థానాలు ఎగబాకింది. భారత మార్కెట్స్ సౌదీ అరేబియా (3.18 ట్రిలియన్ డాలర్లు),కెనడా (3.18 ట్రిలియన్ డాలర్ల) కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌ను కల్గి ఉన్నాయి. టాప్ -5 స్థానంలో ఉండే జర్మనీ మార్కెట్లు పదో స్థానానికి పడిపోయాయి. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి చిక్కులు..! -
రష్యా దాడులు.. యూనైటెడ్ కింగ్‌డమ్‌ని వెనక్కి నెట్టిన ఇండియా
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడులు యూరప్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రష్యా వైఖరిని ఖండిస్తూ యూరప్ దేశాలు ఎడాపెడా ఆంక్షలు పెడుతూ పోతున్నా.. ఆశించిన ఫలితం రావడం లేదు సరికదా అక్కడి ఇన్వెస్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా ఆదేశాలకు సంబంధించిన మార్కెట్ క్యాప్ భారీగా కోతకు గురవుతోంది. బ్లూంబర్గ్ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం యూరప్ ఆర్థిక శక్తులుగా చెప్పుకునే ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్లు కుదేలయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపద మార్కెట్లో హరించుకుపోయింది. ఒక్క ఇంగ్లండ్ మార్కెట్లనే పరిశీలిస్తే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 9 వరకు ఏకంగా 410 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. దీంతో ఆ దేశ మార్కెట్ క్యాప్ తగ్గి 3.11 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. మనకు తప్పలేదు ఇక ఇండియా విషయానికి వస్తే ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో మన స్టాక్‌మార్కెట్లు షేక్ అయ్యాయి. దేశీ సూచీలు తిరోగమనం పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ సొమ్ము వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా మన మార్కెట్ క్యాప్‌కి 357 బిలియన్ల సంపద కరిగిపోయింది. దీంతో మన మార్కెట్ క్యాప్ 3.16 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మార్కెట్ క్యాప్ పట్టికలో యూకేని వెనక్కి నెట్టింది ఇండియా. ఇండియా వెనుక యూకే గత నెల రోజుల్లో వచ్చిన మార్పులతో మార్కెట్ క్యాప్ పరంగా ఇండియా ఇంగ్లండ్‌ను దాటేసింది. ఇంతకాలం ఇండియా కంటే ముందు వరుసలో ఉండే బ్రిటీష్ రాజ్యం మార్కెట్ చరిత్రలో తొలిసారి ఇండియా వెనక నిలవాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇండియా కంటే ఇంగ్లండ్ మార్కెట్‌పై అధిక ప్రభావం చూపడమే ఇందుకు కారణం మెరిసిన సౌదీ మరోవైపు ఏషియా మార్కెట్లలో చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, ఇండియాల తర్వాత స్థానంలో ఉండే సౌదీ అరేబియా మార్కెట్లకు ఈ యుద్ధం కలిసి వచ్చింది. యుద్ధ ప్రభావంతో ఆయిల్ ధరలు ఎగిసిపడటంతో.. వివిధ మార్కెట్లలో ఉన్న సొమ్మంతా సౌదీ అరేబియా వైపు పయణించింది. ఫలితంగా రెండు వారాల వ్యవధిలోనే ఈ మార్కెట్‌కి 442 బిలియన్ డాలర్ల సంపద వచ్చి పడింది. ఫలితంగా సౌదీ అరేబియా మార్కెట్ క్యాప్ 3.25 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది నంబర్ వన్ యుద్ధ అనంతర పరిస్థితుల్లో ఉన్న లెక్కలను పరిశీలిస్తే ఇప్పటికీ మార్కెట్ క్యాప్ విషయంలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ దేశ మార్కెట్ క్యాప్ విలువ ఏకంగా 46 ట్రిలియన డాలర్లుగా నమోదు అయ్యింది. ఆ తర్వాత స్థానంలో డ్రాగన్ కంట్రీ చైనా నిలిచింది. చైనా మార్కెట్ క్యాప్ 11.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. టాప్ 5 మార్కెట్ క్యాప్ విషయంలో ప్రపంచ దేశాల సరళిని గమనిస్తే తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉండగా ఆ తర్వాత వరుసగా జపాన్ 5.7 ట్రిలియన్ డాలర్లు హాంగ్‌కాంగ్ 5.5 ట్రలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 3.25 ట్రిలియన్ డాలర్లు, ఇండియా 3.16 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మన తర్వాత 3.12 ట్రిలియన్ డాలర్లతో కెనడా నిలిచింది. యూరప్ పరిస్థితి యుద్ధం దెబ్బతో యూరప్ స్టాక్‌మార్కెట్లు కంగుతిన్నాయి. ఇక్కడ యూనెటైడ్ కింగ్డమ్ 3.11 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.71 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ2.18 ట్రిలియన డాలర్లుగా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ తరహాలో ప్రమాదం అంచున ఉన్న తైవాన్ మార్కెట్ క్యాప్ 2.06 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి: Russia Ukraine War: రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు..! -
ఆ వ్యక్తి ఏడు నిమిషాలకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు!.. ఎలాగో తెలుసా?
Man Became worlds Richest For 7 Minutes: నిజానికి అపర కుభేరుడుగా మారాలంటే వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంటుంది. ఎన్నో కష్టాలు, త్యాగాలు, సవాళ్లును చవిచూసిన తర్వాత గానీ సాథ్యం కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి కేవలం బిజినెస్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత అతను కంపెనీని మూసేశాడు ఎందుకో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...యూకేకి చెందిన యూట్యూబర్ మాక్స్ ఫోష్ ఒకం కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే యూకేలో కంపెనీ సెటప్ చేయడం చాలా సులభం. అంతేకాదు కంపెనీ హౌస్ అని ఒకటి ఉంది. ఫోష్ కంపెనీ పెట్టే నిమిత్తం ఆ కంపెనీ హౌస్‌కి సంబంధించిన ఫారంని పూర్తి చేశాడు. అంతేకాదు కంపెనీ పేరుకు చివర కచ్చితంగా లిమిటెడ్‌తో ముగియాలి అందుకని ఫోష్ తన కంపెనీ వెంచర్‌కి 'అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్' అని పేరు పెట్టాడు. పైగా తన కంపెనీ షేర్లను 10 బిలినియన్లగా నిర్ణయించి రిజిస్టర్ చేయించాడు. ఆ షేర్లలో ఒకదానిని 50 పౌండ్లకు విక్రయించినట్లయితే, అది అతని కంపెనీకి చట్టబద్ధంగా 500 బిలియన్ పౌండ్లు విలువ ఇస్తుంది. ఈ మేరకు యూట్యూబర్ లండన్ వీధిలో రెండు కుర్చీలు, టేబుల్‌తో తన దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మొదట్లో పెట్టుబడి దారుల కోసం కొంత ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ తర్వాత ఒక మహిళ అతని కంపెనీలో 50 పౌండ్లకు ఒక షేర్ని కొనుగోలు చేసింది. దీంతో అతను ఏడు నిమిషాల పాటు ఎలెన్ మాస్క్‌ని అధిగమించి మరీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అయిపోయాడు. అయితే ఆ తర్వాత అతను అధికారుల నుంచి ఒక లేఖను అందుకున్నాడు. అందులో ఇలా ఉంది. "మాకు అందిన సమాచారం ప్రకారం మనీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ పౌండ్లుగా అంచనా వేయబడింది. ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల, మీరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొవలసి వస్తుంది. అందువల్ల అన్లిమిటెడ్ మనీ లిమిటెడ్‌ను అత్యవసరంగా రద్దు చేయాలని సిఫార్సు చేస్తున్నాం" అని ఉంది. ఆ తర్వాత ఫోష్ ఆ పనే చేశాడు. మార్కెట్ క్యాపిటల్ లోసుగులు వినయోగించి ఇలాంటి పనులకు పాల్పడితే ఇలానే దొరికిపోతారు. అయితే ఈఘటనకు సంబంధించిన వీడియోని ఫోష్ సోషల్ మీడియాలోని నెటిజన్లుతో పంచుకున్నాడు. -
లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!
Zomato On A Bumpy Ride: గత ఏడాది స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన జొమాటో షేర్ ధర ఇప్పుడు భారీగా పడిపోతుంది. జొమాటోలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడుదారులందరూ ఇప్పుడు లబోదిబో అంటున్నారు. బిఎస్ఈలో 9 శాతం పడిపోయి రూ.114.00కు పడిపోతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర 52 వారాల గరిష్టం నుంచి 30 శాతానికి పైగా దిగజారింది. గత ఏడాది జీవనకాల గరిష్ట స్థాయి రూ.160.30కి చేరిన షేర్ ధర, నిన్న(జనవరి 23) అత్యంత కనిష్ట స్థాయి రూ.114కి పడిపోయింది. కేవలం ఈ ఏడాదిలోనే ఈ కంపెనీ షేర్ ధర 20 శాతానికి పైగా పడిపోవడం విశేషం. "జొమాటో కంపెనీ అనేక విధాలుగా స్విగ్గీ నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని రెస్టారెంట్ నెట్ వర్క్, స్విగ్గీ నుంచి ఈ పోటీ ఉంది" అని వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ ఆఫ్ షేర్ ఇండియా డాక్టర్ రవి సింగ్ తెలిపారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లోనే సుమారు రూ.10 వేల కోట్లకు నష్టపోయినట్లు తెలుస్తుంది. అలాగే, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ కూడా రూ.1 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్ఫిట్కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. (చదవండి: బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ!) -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
రెండేళ్లు.. లక్ష కోట్లు.. ఇవి షేర్లా అల్లాఉద్దీన్ అద్భుత దీపమా?
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. కొత్త ఇన్వెస్టర్లు వరదలా దలాల్ స్ట్రీట్‌కి పోటెత్తుతున్నారు. దేశీ సూచీలు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. ఇలా ఎంత పాజిటివ్‌గా చెప్పినా సరే ఈ కంపెనీ షేర్లు ధరలు అంతకు మించిన అన్నట్టుగా ఉన్నాయి. కేవలం రెండంటే రెండేళ్లలోనే ఎవ్వరూ నమ్మలేని రీతిలో ఇన్వెస్టర్లకు లాభాలు అందించింది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) షేర్లు దుమ్ము రేపుతున్నాయి. గిల్లుకుని చూస్తే తప్ప నమ్మలేని రేంజ్లో ఈ కంపెనీ షేర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసాధారణ రీతిలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుండటంతో అత్యంత తక్కువ కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ కంపెనీ షేర్ ధర పెరిగింది. రెండేళ్ల కిందట ఐఆర్సీటీసీ సంస్థ స్టాక్ మార్కెట్లో తొలిసారిగా 2019 సెప్టెంబరులో అడుగు పెట్టింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (ఐపీవో)కి వచ్చినప్పుడు షేర్ ప్రైస్‌బ్యాండ్ ధర రూ. 315 నుంచి 320 మధ్య పలికింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ. 640 కోట్లుగా నమోదు అయ్యింది. లక్ష కోట్లు దాటింది ఈ ఏడాది ఆరంభంన ఉంచి ఐఆర్సీటీసీ షేర్లు మార్కెట్లో హాట్‌కేకుల్లా మారాయి. మరీ ముఖ్యంగా గత రెండు నెలలుగా ఇన్వెస్టర్లు వీటిని ఎగబడి కొంటున్నారు. దీంతో షేర్ విలువ అమాంతం పెరిగిపోతుంది. అక్టోబరు 19న ఐఆర్‌సీటీస షేర్ వ్యాల్యూ రికార్డు స్థాయిలో రూ.6287లకు చేరుకుంది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటింది. మంగళవారం ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటల్ వన్ ట్రిలియన్ మార్క్‌ని రీచ్ అయ్యింది. 20 రెట్ల లాభం రెండేళ కిందట రూ 31,500 పెట్టుబడి ఐఆర్సీటీసీ కంపెనీ షేర్లు వంద కొనుగోలు చేసి వాటిని అలాగే హోల్డ్ చేసిన వారికి లాభల పంట పండింది. ఈ రోజు ఈ షేర్ల విలువ రూ 6,28,700 చేరుకుంది. అంటే కేవలం రెండేళ్లలో ఇరవై రెట్ల లాభాన్ని అందించింది. ఇక ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇంత కంటే ఎక్కువే లాభాలను ఆర్జించిన వాళ్లూ ఉన్నారు. ఇరవై ఏళ్లలోనే భారత ప్రభుత్వం రైల్వేకు అనుబంధంగా 1999లో ఐఆర్సీటీసీని ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో టిక్కెట్టు బుక్ చేయడం, క్యాటరింగ్ సర్వీసులు అందివ్వడం ఈ సంస్థ విధులు. ఇరవై ఏళ్ల తర్వాత మార్కెట్లో లిస్టయ్యింది. రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్‌ను క్రాస్ చేసింది. ప్రభంజనం కరోనా సంక్షోభం తర్వాత ఇండియన్ రైల్వేస్‌లో సంస్కరణలు చేపట్టడం, ప్యాసింజర్ రైళ్లకు కోత పెట్టడం, రాయితీలయు మంగళం పాడటం వంటి చర్యలను కేంద్రం తీసుకుంది. దీనికి తోడు ప్రైవేటు రైళ్లను కూడా పట్టాలపైకి ఎక్కించింది. దీంతో రైల్వేకు అనుబంధంగా ఉన్న ఐఆర్సీటీసీకి కేంద్రం తీసుకున్న చర్యలు మేలు చేశాయి. ఇక ఆన్లైన్ టికెట్ బుకింగ్ పెరగడం, హస్పిటాలిటీ రంగంలోకి సైతం ఐఆర్సీటీసీ విస్తరించడం వంటి చర్యలు మార్కెట్లోకి సానుకూల సంకేతాలు పంపాయి. వెరసి ఐఆర్సీటీసీ స్టాక్మార్కెట్లో ప్రభంజనం మొదలైంది. 9వ కంపెనీ స్టాక్మార్కెట్లో లాభాలు పంట పండించడంలో ప్రైవేటు కంపెనీలు ముందుంటాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ కంపెనీలది వెనుకడుగే. ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ విలువ దాటిన కంపెనీలుగా ఎనిమిది మాత్రమే ఉన్నాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోలిండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, భారత్ పెట్రోలియం, ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన తొమ్మిదవ కంపెనీగా ఐఆర్సీటీసీ చేరింది. చదవండి: లాభాలని మొత్తుకుంటే సరిపోయిందా? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి? -
మార్కెట్లో దూసుకెళ్తున్న బజాజ్ ఫిన్సర్వ్!
ముంబై: ప్రముఖ బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ షేర్లు తొలిసారిగా రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను దాటాయి. నేడు కూడా స్టాక్ మార్కెట్ భారీగా లాభాలు పొందడంతో ఈ మైలురాయిని సాధించిన దేశంలో 18వ సంస్థగా నిలిచింది. ఇంట్రాడే స్టాక్ బిఎస్ఈలో ₹19,107.45 తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 1.04% పెరిగి 61,943.84 పాయింట్లకు చేరుకుంది. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ 7.41% లాభపడతే, ఏడాది నుంచి ఇప్పటి వరకు 114% పెరిగింది. ఇంతకు ముందు వరకు ఆర్ఐఎల్, టీసీఎస్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఒఎన్ జిసి, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఈ మైలురాయిని సాధించాయి. కరోనా మహమ్మారి వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఎదరైనా వృద్ధికి బాగా దోహదపడే అనేక చర్యలు తీసుకుంది. ఇటీవలే బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్)ను స్పాన్సర్ కోసం సెబీ నుండి సూత్రప్రాయ ఆమోదం పొందింది.(చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక!) -
TCS: మార్కెట్ క్యాపిటలైజేషన్లో రికార్డ్ !
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. స్టాక్మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుండటంతో టీసీఎస్ షేర్ల ధరల్లో మంచి పెరుగదల నమోదైంది. దీంతో ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో రెండో అతి పెద్ద కంపెనీగా టీసీఎస్ అవతరించింది. టీసీఎస్ విలువ ఎంత బుధవారం స్టాక్ మార్కెట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు 2.3 శాతం పెరిగాయి. దీంతో షేర్ వాల్యూ రూ.3,694.25కి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రికార్డు స్థాయిలో 13.65 ట్రిలియన్లకు చేరుకుంది. షేర్ల విలువ మరికొద్దిగా పెరిగితే ఏకంగా 14 ట్రిలియన్లకు కంపెనీ విలువ చేరుతుంది. ఇండియా తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ 14.51 ట్రిలియన్ల విలువతో మొదటి స్థానంలో ఉంది. ట్రిలియన్ క్లబ్లో ఉన్న కంపెనీలు ఎన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్లో వంద బిలియన్ డాలర్ల విలువ దాటిన కంపెనీలు ఇండియా తరఫున నాలుగే ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో టీసీఎస్, మూడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో బుల్ జోరు కారణంగా మంగళవారం ఇన్ఫోసిస్ విలువ సైతం 100 బిలియన్ డాలర్లు దాటింది. చదవండి : Mi బ్రాండ్ పేరు మారుతోంది ? కొత్తగా నేమ్ ఇదే ? -
ఆ ఘనత సాధించిన మూడో ఐటీ కంపెనీగా విప్రో
ముంబై: భారత ఐటీ సంస్థ విప్రో గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.3 ట్రిలియన్ ను తాకింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన మూడవ భారత ఐటీ సంస్థగా విప్రో నిలిచింది. మార్కెట్ ప్రారంభంలో విప్రో స్టాక్ ధర రూ.550 తాకింది. బీఎస్ఈలో అంతకుముందు రోజు రూ.543.05 వద్ద ముగిసింది. ప్రస్తుతం విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.01 ట్రిలియన్. మింట్ నివేదిక ప్రకారం, థియరీ డెలాపోర్ట్ సంస్థ సీఈఓ, ఎమ్ డీగా చేరినప్పటి నుంచి విప్రో స్టాక్ పెరిగింది. డెలాపోర్ట్ నాయకత్వంలో జర్మనీ రిటైలర్ మెట్రో నుంచి ఈ సంస్థ 7.1 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఒప్పందాన్ని చేసుకుంది. భారతదేశంలో మొత్తం దీని పేరిట 13 లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. ఇవి రూ.3 ట్రిలియన్ ఎం-క్యాప్‌ను దాటాయి. విప్రో ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశం మొత్తంలో 14వ స్థానంలో ఉంది. విప్రో వాటా కేవలం ఒక సంవత్సరంలోనే 157 శాతం పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 40 శాతం పెరిగింది. ఒక నెలలో విప్రో స్టాక్ 11.44 శాతం పెరిగింది. రూ.14.05 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్, రూ.11.58 మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ట్రిలియన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, రూ.8.33 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారతదేశంలో అత్యంత విలువైన సంస్థలుగా ఉన్నాయి. చదవండి: వాట్సాప్ ఉపాయాలు పన్నుతోంది: కేంద్రం -
టీసీఎస్ మరో ఘనత
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ పరంగా అతివిలువైన రెండవ కంపెనీగా నిలిచింది. సోమవారం టీసీఎస్ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా లాభంతో 2442 వద్ద టీసీఎస్ షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ .9 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో ఆర్ఐఎల్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండవ సంస్థగా టీసీఎస్ రికార్డు సొంతం చేసుకుంది. (పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు) ఐటీ రంగంలో మెరుగైన షేర్లలో టీసీఎస్ స్టాక్ ఒకటని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బీఎసీపీ పారిబాస్ నివేదిక ప్రకారం కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల అద్దెలు, రవాణా లాంటి ఖర్చులను భారీగా తగ్గించుకుని పొదుపు బాటపట్టనుందని అని కాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి గౌరవ్ గార్గ్ అన్నారు. -
ప్రపంచంలోనే నెంబర్ 2 సంస్థగా రిలయన్స్
సాక్షి, ముంబై : ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మూలురాయిని చేసుకుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది. రిలయన్స్ టెలికాం విభాగంరిలయన్స్ జియోలోదిగ్గజ సంస్థలపెట్టుబడులతో రిలయన్స్ అధినేతఇప్పటికే ప్రపంచకు బేరులజాబితాలోఇంతింటై వటుడింతై అన్నట్టుగారోజుకో కొత్త శిఖరానికి ఎగబాకుతున్నారు. తాజాగా రిలయన్స్ కూడా మార్కెట్ క్యాప్ పరంగా కొత్త తీరాలకు చేరింది. రిలయన్స్ షేరు ధర ఇటీవల ఆల్‌టైం హైంకి చేరడంతో ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్‌ను అధిగమించి సౌదీ అరామ్కో తరువాత రెండవ స్థానాన్ని సాధించింది. అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ 8 బిలియన్ డాలర్లను కొత్తగా సాధించడంతో మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎక్సాన్ మొబిల్ 1 బిలియన్ డాలర్లను నష్టపోయింది. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రిఫైనర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎక్సాన్ షేర్లు 39 శాతం క్షీణించగా రిలయన్స్ షేర్లు ఈ ఏడాది 43 శాతం పుంజుకోవడం గమనార్హం. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 1.76 ట్రిలియన్ డాలర్లతో అరాంకో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థగా ఉంది. -
రిలయన్స్ రికార్డుల దూకుడు
సాక్షి, ముంబై: వరుస రికార్డులతో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం కూడా మరో చరిత్రాత్మక గరిష్టాన్ని నమోదు చేసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తాజాగా 14 లక్షల రూపాయలను దాటింది. దీంతో దేశంలో అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. కేవలం 8 ట్రేడింగ్ సెషన్లలో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన ఘనతను రిలయన్స్ సాధించింది. జూలై 13 న రిలయన్స్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్ల రూపాయలను దాటిన మొదటి భారతీయ సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రిలయన్స్ అమెజాన్ భారీ పెట్టుబడుల పెట్టనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల ఆసక్తి నెల కొంది. దీంతో తాజా కొనుగోళ్లతో రిలయన్స్ 2149 రూపాయల వద్ద మరో ఆల్‌టైం గరిష్టాన్నితాకింది.దీంతో దేశంలో అత్యంత విలువైన టాప్ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. 8,07,419.38 కోట్లతో టీసీఎస్ రెండవ స్థానంలో , 6,11,095.46 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో హెచ్డీఎఫ్సీ మూడవ స్థానంలో ఉన్నాయి. -
పెట్టుబడుల సునామీ : టాప్‌లోకి జియో
సాక్షి, ముంబై: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టెలికాం రంగంలో సునామిలా దూసుకొచ్చి అతి తక్కువ టారిఫ్ లతో డేటా సేవలను సామాన్యులకు చేరువ చేసింది. ఫలితంగా కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. తాజాగా జియో భారీ పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద నాల్గవ కంపెనీగా అవతరించింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ భాగస్వామ్యంతో జియో మార్కెట్ క్యాప్ పరంగా ఈ రికార్డు సృష్టించింది. మూడు వారాల వ్యవధిలో మూడు మెగా డీల్స్ సాధించిన జియో దిగ్గజం కంపెనీల వరుసలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్‌లను ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు ఎంటర్ ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో వుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్) జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటా రూ. 11,367 కోట్లకు కొనుగోలు చేయడంతో జియో ఈ ఘనతను సాధించింది. మరోవైపు ఈ డీల్ ప్రకటించిన తరువాత శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 4 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ జియోలో గత మూడు వారాల్లోనే మొత్తం రూ. 60,596 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందిన మూడు దిగ్గజ కంపెనీలు ముందుకురావడం గమనార్హం. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) చదవండి : కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ