Minor boy
-
టెక్సాస్‌లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్‌ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
డబ్బుల కోసం బామ్మను చంపేశాడు
న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. -
ఆడుకుంటూ.. అనంత లోకాలకు.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకార.. ఖమ్మం జిల్లాకు చెందిన మూర్తమ్మ కొన్ని సంవత్సరాలుగా సూరారం రాజీవ్ గృహకల్ప 29/27వ బ్లాక్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు తులసీనాథ్ (13) ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు సెలవు కావడంతో తులసీనాథ్ రాజీవ్ గృహకల్ప 27వ బ్లాక్‌లోని భవనంపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలతో బాలుడి తండ్రి కనకరత్నం కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తల్లి మూర్తమ్మ టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. -
క్రికెట్లో గొడవ... బాలుడి ప్రాణం తీసింది
మహారాష్ట్ర, చంద్రాపూర్: మహారాష్ట్రలోని బాగాడ్కిడ్కిలో దారుణం జరిగింది. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా తలెత్తిన వివాదంలో 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో కొట్టి చంపేశాడు. హత్య జూన్ 3న జరిగితే జూన్ 6న మృతుడి తల్లి ఫిర్యాదు చేయగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, అప్పటికే పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు చంద్రాపూర్ పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి... జూన్ 3న బాగాడ్కిడ్కిలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా పిల్లల మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది. అంతలోనే కోపగించిన 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో బలంగా తలపై కొట్టాడు. దీంతో ఆ మైనర్ బాలుడు కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ జూన్ 5న బాలుడు తుదిశ్వాస విడిచాడు. పోలీసులకి విషయం చెప్పకుండా బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాతి రోజున బాలుడి తల్లి చంద్రాపూర్ జిల్లా పోలీసులను ఆశ్రయించి విషయాన్ని వివరించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జూన్ 7న మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షల నిమిత్తం పంపించి, హత్య చేసిన బాలుడిపై ఐపీసీ 302 సెక్షన్‌ను అభియోగించారు. ఇది కూడా చదవండి: చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత -
మైనర్‌కు బండి.. ‘మేజర్’ మిస్టేక్
ఫ్రెండు వాళ్లింటికెళ్లొస్తానని.. కూరగాయలు తీసుకొస్తానని అడిగినా.. లేదా మీరే మరేదో పని అప్పజెప్పి పిల్లలకు వాహనాలిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరూ ఊచల్లెక్కపెడతారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా పట్టుబడిన మైనర్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. పిల్లల సంతోషం, సరదా కోసం వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే వరంగల్ కమిషనరేట్ పోలీసులు కేసులు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నారు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. అందులో 91 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు మైనర్లు వాహనాలు స్పీడ్‌గా, అజాగ్రత్తగా నడపడం కారణంగా జరిగినట్లు పోలీసు అధికారుల సమీక్షలో తేటతెల్ల మైంది. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని, పూర్తిగా నేర్చుకోకముందే రోడ్డె్డక్కి రైడింగ్ చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో మైనర్లు ఎక్కువ మంది ఉండడం దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రమాదాల కారణంగా పలు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన మైనర్లు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈఏడాది 43 మంది పట్టుబడ్డారు. వరంగల్‌లో 69 మంది పట్టుబడగా.. కాజీపేటలో 32 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 91 మందిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో 53 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కిన 1,755 మందికి రూ.1,25,02,700 జరిమానా విధించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 209 కేసులు నమోదు కాగా.. రూ.1,04,500 జరిమానా విధించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 280 కేసులకు రూ.1,40,000, కాజీపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 305 కేసులకు రూ.1,52,500 జరిమానా విధించారు. మొత్తం 794 కేసులు నమోదు కాగా.. వాటికి రూ. 3,97,000 జరిమానా విధించారు. పిల్లలు అడిగినా వాహనాలివ్వొద్దు.. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి బండ్లు ఇస్తున్నారు. దీని వల్ల వారు తెలిసీ తెలియని వయసులో ఎమోషన్స్‌తో స్పీడ్‌ను థ్రిల్‌గా భావించి ప్రమాదాలకు కారణమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిచి్చన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. వాహనాల ఓనర్ ఏ1గా ఉంటే.. మైనర్ ఏ2గా ఉంటాడు. వేసవి సెలవుల్లో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా వాహనాలు తనిఖీలు చేస్తారు. పట్టుపడితే శిక్ష తప్పదు. – ఏవీ.రంగనాథ్, సీపీ -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్‌గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్‌తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
ఎయిర్ రివాల్వర్‌తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం..
సాక్షి, హైదరాబాద్: క్రీడల కోసమంటూ ఖరీదు చేసిన ఎయిర్ రివాల్వర్‌తో ఓ పాతబస్తీ వాసి ఆటలాడాడు. అప్పటి వరకు వీధికుక్కలపై కాల్పులు జరిపిన అతగాడు గోడపై ఉన్న బల్లిని కాల్చాలని ప్రయత్నించాడు. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కావడంతో సమీపంలో ఉన్న బాలుడి వీపులోకి దూసుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పుర పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఎ.శివ కుమార్ వివరాలు వెల్లడించారు. సుల్తాన్‌షాహీ కైసర్ హోటల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం కుమారుడు మహ్మద్ అఫ్జల్ అఫ్సర్ వాటర్ ప్లాంట్, పాన్ షాపు నిర్వహిస్తుంటాడు. ఇతడు 2021 అక్టోబర్ 21న అబిడ్స్‌లోని ఏషియన్ ఆరమ్స్ దుకాణం నుంచి 0.117 క్యాలిబర్ ఎయిర్ రివాల్వర్ ఖరీదు చేశాడు. ఆ సందర్భంలో క్రీడల కోసమంటూ (స్పోర్ట్స్) రూ.17,700 వెచ్చించి దీనిని కొన్నాడు. ఈ రివాల్వర్‌లో చెర్రాలను తూటాల మాదిరిగా వినియోగించే అఫ్సర్ ఇంట్లో గోడలపై ఉన్న బల్లులు, వీధికుక్కలను కాలుస్తుంటాడు. సోమవారం (ఈ నెల 1వ తేదీ) ఉదయం 10.30–11 గంటల మధ్య ఇలానే చేస్తున్న అఫ్సర్‌ను ఓ బాలుడు కలిశాడు. గోడపై ఉన్న బల్లిని కాల్చాల్సిందిగా కోరాడు. ఇతడు అదే పని చేయగా.. గోడకు తగిలిన చెర్రా రికోచెట్ కారణంగా దిశ మార్చుకుని దూసుకుపోయింది. ఇంటి పక్కన ఉండే సయ్యద్ మోహసీన్ అలీ కుమారుడు ఆజాన్ (9) బయటకు ఆడుకుంటున్నాడు. ఈ చెర్రా వేగంగా వెళ్లి ఆజాన్ వీపులోకి దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న క్లీనిక్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై మెరుగైన వైద్య సేవల చికిత్స నిమిత్తం బుధవారం బహదూర్‌పురాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాలుడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి ఆజాన్ తండ్రి సయ్యద్ మెహసీన్ అలీ ఫిర్యాదు మేరకు మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అఫ్సర్ కోసం గాలిస్తున్నారు. ఎయిర్ రివాల్వర్, పిస్టల్, గన్స్కు లైసెన్స్ అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా జంతువులను కాల్చడం, ఎదుటి వారిని గాయపరచడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నిందితుడు చిక్కిన తర్వాత విచారణలో, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడికి బాలుడి కుటుంబానికి మధ్య ఆరి్థక లావాదేవీలు ఉన్నాయని, వీటి నేపథ్యంలోనే కొన్ని స్పర్థలు కూడా వచ్చాయని తెలుస్తోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. -
ఉదయం కార్పెంటర్ షాపులో పని.. రాత్రయితే బస్తీల్లో..
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనాలపై నగరంలో చక్కర్లు కొట్టాలనే ఉద్దేశంతో వాటి చోరీలు మొదలెట్టిన ఓ బాలుడు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. ఇతడి నుంచి ఈ దొంగ వాహనాలు ఖరీదు చేస్తున్న ముగ్గురు రిసీవర్లను పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి శుక్రవారం వెల్లడించారు. జిర్రా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (15) స్కూలు స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. అప్పటి నుంచి ఓ కార్పెంటర్ షాపులో పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనాలపై సిటీలో తిరగాలన్నది అతడి కోరిక. అయితే బైక్స్ ఖరీదు చేయడానికి స్తోమత లేకపోవడంతో వాటిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. గోల్కొండ, హుమాయున్‌నగర్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, ఆసిఫ్నగర్ల్లోని బస్తీల్లో రాత్రి వేళల్లో సంచరించే వాడు. గల్లీల్లో పార్క్ చేసిన వాహనాల్లో హ్యాండిల్ లాక్ వేయని వాటిని గుర్తించేవాడు. అదును చూసుకుని వాటిని తస్కరించే బాలుడు తోసుకుంటూ కొద్దిదూరం వెళ్లేవాడు. ఆపై వైర్లు కలపడం ద్వారా వాటిని స్టార్ట్ చేసుకుని ఉడాయించే వాడు. ఆ వాహనంపై మోజు తీరే వరకు దానిపై చక్కర్లు కొట్టే వాడు. ఆపై ఎలాంటి పత్రాలు లేని వాటిని ఒక్కోటి రూ.10 వేల చొప్పున తన ప్రాంతంలోనే నివసించే సయ్యద్ నబీ, అబ్దుల్ అల్తాఫ్, మహ్మద్ ఫెరోజ్‌లకు విక్రయించాడు. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలను బాలుడు తస్కరించాడు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కె.నర్సింములు, షేక్ బుర్హాన్, కె.శీనయ్య వలపన్ని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ వాహనాలు ఖరీదు చేసిన ముగ్గురినీ అరెస్టు చేసి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని గోల్కొండ పోలీసులకు అప్పగించారు. -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం -
కన్నతల్లి కొనఊపిరితోనే ఉన్నా.. దిగ్భ్రాంతికర విషయాలు
పబ్జీ కోసం కన్నతల్లిని తుపాకీతో కాల్చి చంపిన తనయుడి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని చంపిన తర్వాత స్నేహితులను ఇంటికి పిలిపించుకుని.. వాళ్లతో హ్యాపీగా దావత్ చేసుకున్నాడు మైనర్. అయితే తాజాగా విచారణలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. పబ్జీ విషయంలో కన్నతల్లిపై కోపం పెంచుకుని తుపాకీతో కాల్చి చంపాడు కొడుకు. ఈ కేసులో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని తుపాకీతో కాల్చేసిన తర్వాత ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి తాళం వేశాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణం పోలేదు. అప్పుడే కాదు.. ఆ మరుసటి రోజు ఉదయం వరకూ కూడా ఆమె కొన ఊపిరితోనే ఉంది. ఘటన జరిగిన రాత్రి సమయం నుంచి ఉదయం వరకూ మధ్యమధ్యలో గది తాళం తీసి ఆమె పరిస్థితిని చూస్తూ ఉండిపోయాడు ఆ కొడుకు. ఈ మధ్యలోనే స్నేహితులను ఇంటికి పిలిచి ఆన్లైన్లో ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ పెట్టి మరో గదిలో హ్యాపీగా పార్టీ చేసుకున్నాడు. ఒకవేళ తల్లికి ఇలా జరిగిందనే విషయం ఎవరికైనా చెప్పి ఉంటే.. కనీసం ఆమె బతికి ఉండేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అంతేకాదు.. ఇంటికి వచ్చిన స్నేహిడిని తల్లి శవం మాయం చేసేందుకు సాయం పట్టాలని తుపాకీతో బెదిరించాడు. అంతేకాదు ప్రతిగా ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లో లక్నోలో ఉంటున్న ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి.. తన సర్వీస్ రివాల్వర్‌ను ఇంట్లోనే ఉంచి వెళ్లాడు. కొడుకు పదే పదే పబ్జీ ఆడుతుండడంతో మందలించింది తల్లి సాధన(40). ఆ కోపంలో తుపాకీతో తల్లిని కాల్చేసి.. ఆమెను ఓ గదిలో, చెల్లిని(10) మరో గదిలో ఉంచాడు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంబంధిత వార్త: తల్లి శవం ఓ గదిలో.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్ -
గదిలో తల్లి శవం.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్
సమాజంలో మైనర్ సంబంధిత నేరాలు పక్కదోవ పట్టడానికి కారణాలు అనేకం. అందునా తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్లే జరుగుతున్నాయంటూ విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ, తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టడమే కాదు.. మందలిస్తే వాళ్లపై దాడులకు తెగబడుతోంది ఇప్పటి యువతరం. తాజాగా ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ తనయుడు. యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు సదరు టీనేజర్. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్లో పబ్జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్(16). అది చూసి పట్టరాని కోపంతో తల్లి సాధన(40) మందలించింది. దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్ రివాల్వర్‌తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయంతో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆపై ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆన్లైన్లో ఎగ్‌కర్రీ, ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ చేసుకుని.. సినిమాలు చూస్తూ దోస్తులతో దావత్ చేసుకున్నాడు. తల్లి గురించి అతని స్నేహితులు ఆరాతీయగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని కహానీ చెప్పాడు. అలా రెండు రోజులు గడిచింది. మృతదేహాం దుర్వాసన వస్తుండడంతో రూమ్‌ఫ్రెష్‌నర్ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడంతో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఆ కుర్రాడి తండ్రి ఆర్మీ అధికారి. ప్రస్తుతం బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్ రివాల్వర్‌ను మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారాయన. చదవండి: గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. -
పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు
kissing on lips and fondling are not unnatural offences : మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు. అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడూ నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐతే జస్టిస్ ప్రభుదేసాయి సదరు నిందితుడికి బెయిల్ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది. (చదవండి: వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..) -
పెరుగు కోసం యాక్టివాపై వెళ్లి..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ మైనర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 15 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం రాయలసీమ ప్రాంతం నుంచి వెంకటరామయ్య, అరుణ దంపతులు ఓల్డ్ కర్నూల్ రోడ్డు నేతాజీనగర్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. మేస్త్రీ పని చేస్తున్న వెంకటరామయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు వెంకటమణిదీప్ (14) స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మణిదీప్ పెరుగు తీసుకురావాలని ఇంట్లో చెప్పడంతో తండ్రి యాక్టివా వాహనాన్ని తీసుకుని వెళ్లాడు. పెరుగు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో నేతాజీనగర్‌లోని రోడ్డు డివైడర్‌కు ఢీకొని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తెలివైన విద్యార్థిగా ఆటపాటలలో ముందుండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం వెంకటమణిదీప్ మృతికి సంతాపం తెలిపి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. చదవండి: హైదరాబాద్: కుమారుడికి చిత్రహింసలు ... కాదు కిడ్నాప్ ! -
ఆడుకుంటానని చెప్పి వెళ్లాడు.. ఆపై చేనులో దుస్తులు లేకుండా!
వావీవరుసలు, వయో భేదం లేకుండా.. చివరికి మూగ జీవాలను వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి మానవ మృగాలు. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఓ ఘోరం.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఓ దళిత మైనర్ చిన్నారిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ అవుటర్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం రైతుది. అతని పదేళ్ల కొడుకు సోమవారం మధ్యాహ్నం.. ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతిక్కి.. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ లోపు ఊరి బయట ఆవ చేనులో ఓ బాలుడి మృతదేహాన్ని పనులకు వెళ్లిన ఓ మహిళ గుర్తించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అది కనిపించకుండా పోయిన మైనర్దేనని తేలింది. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. దుస్తులు యాభై మీటర్ల దూరంలో పడేసి ఉన్నాయి. ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో ఆ పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని, కన్నుకి తీవ్రంగా గాయమైందని, ఒంటిపై పంటి గాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ లైంగిక దాడి జరిగిందా? ఎలా హత్య చేశారు? అనే విషయాల నిర్ధారణకై శవపరీక్ష కోసం ఎదురుచూస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని కాన్పూర్ ఏఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు. మరోవైపు చనిపోయింది పదేళ్ల బాలుడు కావడం, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటడంతో.. గ్రామస్థుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కాసేపు రహదారి దిగ్భంధించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆపై పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
అడిక్షన్ సెంటర్‌కి పంపించారన్న కోపంతో...కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కొడుకు
16 Year Old Boy Kills His Parents With An Axe: తల్లిదండ్రులను పిల్లల అబివృద్ధికై అహర్నిశలు పోరాడతారు. వాళ్ల అభివృద్ధిని తమ అభివృద్ధిగా భావించి ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధుల తల్లిదండ్రల పై అత్యంత పాశవికమైన దాడులు చేయడమే కాక క్రూరమైన ఘాతుకాలకు పాల్పడతున్న ఉదంతాలే కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) అసలు విషయంలోకెళ్లితే... రాజస్తాన్‌లోన హనుమాన్‌ఘర్‌లోని ఒక గ్రామంలోని 16 ఏళ్ల మైనర్ బాలుడు మాదక ద్రవ్యాలకు బానిసై అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకు జీవితం బావుండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్‌కి పంపించారు. అయితే సదరు బాలుడు కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకుని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. అంతేకాదు తననెందుకు డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించారంటూ సదరు బాలుడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సదరు బాలుడు తనను మళ్లీ డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించే నిమిత్తమే తనను ఇంటికి తీసువచ్చారన్న కోపంతో నిద్రిస్తున్న తన తల్లిదండ్రలను అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో సమాచరం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు మీడియాకి తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..
సాక్షి, బంజారాహిల్స్: పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకున్న మేనత్త ఆ బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ 20 తులాల బంగారు నగలతోపాటు రూ. 6 లక్షలను బలవంతంగా వసూలు చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఓ మహిళ ఇంట్లో ఇటీవల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అలమారాలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో ఆమె గాలిస్తున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు(14) తాను మేనత్తకు ఒక నెక్లెస్ ఇచ్చానని చెప్పాడు. ఎందుకు ఇచ్చావంటూ తల్లి ప్రశ్నించగా బెంగళూరులో నివసించే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్ ఇర్ఫాన్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉండేదని చెప్పాడు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) తాను చదువుతున్న స్కూల్‌కు వచ్చి తనతో పాటు తీసుకెళ్లి లాడ్జిలో తన వాంఛలు తీర్చుకునేదని ఈ క్రమంలో ఆమె మాజీ భర్త ఇర్ఫాన్ ఈ దృశ్యాలను వీడియో తీసేవాడని ఎవరికైనా ఈ విషయం తెలియజేస్తే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేవాడని... ఇలా మూడుసార్లు తనను లాడ్జికి తీసుకెళ్లిందన్నారు. బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షలు తీసుకురాకపోతే వీడియో బయటపెడతామంటూ బ్లాక్మెయిల్ చేయడంతో దొంగిలించినట్లు బాలుడు తల్లికి చెప్పాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (వివాహేతర సంబంధం.. రాత్రి 11:30 గంటలకు ప్రియుడికి అన్నం తీసుకెళ్లి..) -
చాక్లెట్లు ఇస్తానని చెప్పి 13 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగికదాడి..
సాక్షి, చిలకలగూడ: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్న ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పార్శిగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ (23) సికింద్రాబాద్‌లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని చాక్లేట్లు ఇస్తానని చెప్పి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: ప్రేమ పెళ్లి: రోజూ నరకం చూపిస్తూ.. చివరికి చీర కొనుక్కుందని.. -
11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 11 ఏళ్ల హిందూ బాలుడుని లైంగిక వేధింపులకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు ఆ బాలుడు శవమై ప్రావిన్స్‌లో ఖైర్పూర్ మీర్ ప్రాంతంలోని బబర్లోయ్ పట్టణంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించింది. ఈ మేరకు ఆ బాలుడు బంధువు రాజ్‌కుమార్ మాట్లాడుతూ..."మా కుటుంబం గురునానక్ పుట్టినరోజు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మా పిల్లవాడు ఎప్పుడూ అదృశ్యమయ్యాడో మేము గుర్తించలేకపోయాం." అని చెప్పారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) అంతేకాదు ఆ బాలుడు 2011లో జన్మించాడని, ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్నట్లు ఆ బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా ఆ మైనర్ బాలుడి శరీరంపై చిత్రహింసల తాలుకా గుర్తులు కూడా ఉన్నాయని చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీ సుక్కుర్‌కు చెందిన జుబైర్ మహర్ తెలిపారు. అంతేకాదు గత కొన్ని వారాల్లో ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని మహర్ చెబుతున్నారు. ఈ మేరకు బాబర్లోయి పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) మాట్లాడుతూ.." నిందితులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడే ముందు బాలుడిని గొంతు కోసి చంపినట్లు చెప్పారు. మేము ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. పైగా వారిలో ఒకరు నేరాన్ని అంగీకరించారు" అని ఎస్హెచ్ఓ చెప్పారు. (చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..) -
మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం
సాక్షి, శివమొగ్గ(కర్ణాటక): మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటన శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలో గురువారం వెలుగు చూసింది. శికారిపుర గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. తాలూకాలోని ఒక మారు మూల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలుడు తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న దంపతుల కుమార్తె(3)పై కన్నేశాడు. బాలిక ఆడుకుంటుండగా ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.చిన్నారి తల్లిదండ్రులు గమనించి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై..
సాక్షి,చిన్నశంకరంపేట(మెదక్): ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై పద్నాగేళ్ల బాలుడు లైంగిక దాడికిపాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు లైంగికదాడికి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్క ఇంటిలోఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది. చిన్నారి తల్లిదండ్రులు చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించారు. పాపను మెదక్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీస్‌లు తెలిపారు. కాగా బాలుడు పరారీలో ఉన్నాడని తెలిసింది. మరో ఘటనలో.. యువతి అదృశ్యం నారాయణఖేడ్: కుటుంబం పొలం పనులకు వెళ్లిన సమయంలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నా రాయణఖేడ్ మండలం శేరితండాకు చెందిన ఓ మహిళ అక్టోబర్ 29న తన కూతురును ఇంటిలో ఉంచి కొడుకు, కోడలితో కలిసి అల్లాపూర్ శివారులో కౌలుకు తీసుకున్న చేలో పత్తిని తెంచడానికి వెళ్లింది. పొలం నుంచి సాయంత్రం ఇంటికి రాగా కూతురు కనిపించలేదు. చుట్టుపక్కలవారిని, బంధువులను విచారించినా ఆమె ఆ చూకీ తెలియలేదు. దీంతో యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించడంతో.. బయటకు వెళ్లి.. -
ఈడ్చుకొచ్చి, గొంతు కోసి రేప్ చేయాలని చూశాడు...కానీ
తిరువనంతపురం: అమ్మాయిలు, మహిళలపై కామాంధుల అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. మైనర్ బాలురు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కేరళలోని ఒక యువతి దారికాచి దాడిచేసిన మైనర్‌బాలుడి దుర్మార్గంనుంచి తృటిలో తప్పించుకుంది. కేరళ, మలుప్పురం జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలుడు(15) స్థానిక మహిళ (21) పై దారి కాచి దాడిచేశాడు.సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసులకు వెళ్తున్న మహిళను వెంబడించి మరీ రోడ్డు పక్కనే ఉన్న ప్లాంటేషన్ ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధిత యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎటాక్ చేశాడు. ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. అనంతరం ఆమె దుపట్టాతో చేతులు కట్టి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ క్రమంలో నిందితుడు ఆమె గొంతు కోసేందుకు కూడా ప్రయత్నించాడని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ ఎస్ తెలిపారు. అయితే బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని సమీపంలోని ఇంటికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందన్నారు.నిందితుడిపై కేసునమోదు చేసిన పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ షాక్‌నుంచి బాధితురాలు తేరుకోవడానికి సమయం పడుతుంది కనుక విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు నిందితుడికి మార్షల్ ఆర్ట్ జూడోకూడా తెలుసని, జిల్లా స్థాయి ఛాంపియన్ అని వెల్లడించారు. అయినా ఆమె చాకచక్యంగా తప్పించుకోవడం విశేషమన్నారు. -
ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..
సాక్షి, హిమాయత్‌నగర్: ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ వ్యవహారం ఈ రెండింటినీ భరించలేక మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగు చూసింది. ఎస్ఐ మధుసూదన్ సమాచారం మేరకు... కింగ్ కోఠి పరదాగేట్లో నివాసం ఉంటున్న ఎం.డి.అంజాద్‌ఖాన్, రజ్వీయా సుల్తానా దంపతుల కుమారుడు ఎం.డి.అక్బర్‌ఖాన్(16 ) నగరంలో ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తనకు చదువుపై ఆసక్తి లేదు. ఇటీవల తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇలా ఓ వైపు చదువు మరో పక్క ప్రేమ వ్యవహారం అతన్ని మానిసికంగా కుంగదీశాయి. ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పలేక, ఎవరినీ బాధ పెట్టలేక సోమవారం అర్ధరాత్రి బెడ్రూంలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రజ్వీయా సుల్తానా ఎంత పిలిచినా పలకలేదు. అనుమానం వచ్చి కిటికీ గ్రిల్స్ తొలగించి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. చదవండి: (‘క్షమించండి.. నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి’) -
వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరు బనశంకరిలోని యారబ్‌నగరలో మహిళా టైలర్ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి, మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యాడు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆమె బంధువైన పీయూసీ విద్యార్థే (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే నిందితుని కుటుంబం కొత్త ఇల్లు కడుతోంది. అబ్బాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దామని హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బు ఇవ్వాలని ఆమెను అతడు పీడించాడు. దీంతో గొడవ జరిగింది, అబ్బాయి కత్తెర తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను.. -
మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి!
చెన్నై: మైనర్ బాలుడిని ట్రాప్ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలుడు కాలేజ్‌కు వెళ్లేటప్పుడు.. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేవాడు. దీంతో ఆ యువతితో ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు తీసుకునే వరకు వచ్చింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఏడాది పాటు ఆ యువతి, మైనర్ బాలుడు జాలీగా కలిసి గడిపారు. కాగా, వీరిద్దరి విషయం మైనర్ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా.. యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్చుకోలేదు. తాజాగా, బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి -
నంబర్ ప్లేట్‌పై ‘అప్నా టైమ్ ఆయేగా’.. ఇక నీ టైం అయిపోయింది!
సాక్షి, నల్లకుంట: నంబర్ ప్లేట్‌పై నంబర్ కనిపించకుండా ట్రాఫిక్ వయోలెన్స్‌కు పాల్పడిన ఓ మైనర్‌పై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం ఓయూ ఎన్సీసీ ఎక్స్ రోడ్స్ వద్ద నల్లకుంట సెక్టార్–2 పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విద్యానగర్ చర్చి కాలనీకి చెందిన ఓ మైనర్ (16) హీరో మ్యాస్ట్రో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. వాహనం నంబర్ ప్లేట్‌పై నల్లటి తొడుగు ఉండడంతో ఆ వాహనాన్ని వెంబడించిన పోలీసులు విద్యానగర్ చర్చి వద్ద నిలిపి వేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో పోలీసులు పంపించే ఈ చలానాల నుంచి తప్పించుకోవడానికి వెనుక నంబర్ ప్లేట్‌పై మాస్క్ లాంటి నల్లటి ఓ తొడుగును తొడిగాడు. దానిపై ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే స్లోగన్ రాశాడు. ఆర్సీ చెక్ చేయగా వాహన నంబర్ టీఎస్11ఈసీ 7505 అని ఉంది. ఇక ఏముంది అప్నా టైమ్ ఆయేగా కాదు ఇప్పుడు పోలీసుల టైం వచ్చిందంటూ మోటారు వాహన చట్టం ప్రకారం నల్లకుంట పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.