Municipal elections
-
చంఢీగఢ్ మేయర్ ఎన్నికలు: సుప్రీం కోర్టు సీరియస్
చంఢీగఢ్: చంఢీగఢ్‌లో మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్ మనోజ్ సోంకర్ చేతిలో ఓటమి పాలైన ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ ధరోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బాలెట్ పేపర్లు, ఒరిజినల్ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది. చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్‌లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్-కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది. -
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్ -
షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం.. కారణం ఇదే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్లో హసన్పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు. చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత -
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హీట్
-
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన బెదిరిస్తున్నారని, తివారీ హెచ్చరికలు చూస్తుంటే కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ చెయ్యలేక హత్య చేయాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌పై ఎవరైనా దాడి చేయవచ్చని తివారీ అన్న మాటలకు అర్థమేంటని సిసోడియా ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పోలీసు కేసు కూడా పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు మనోజ్ తివారీ ఈ ఆరోపణలను ఖండించారు. ఎన్నికల్లో ఆప్ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. ఆప్ నేత సందీప్ భరద్వాజ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన మరణానికి కారణాలేంటో వెలికి తీయాలన్నారు. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ నేత కన్నుమూత
Congress Leader Harinarayan Gupta.. కాంగ్రెస్ నేత గుండెపోటు కారణంగా అకాల మరణం పొందాడు. ఎన్నికల్లో ఓటమిని భరించలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్‌లు, 298 నగర్ పరిషత్‌లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా, జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే, వీటి ఫలితాలు ఆదివారం వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. గుప్తాకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా బరిలో నిలిచారు. కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై గెలుపొందారు. ఈ క్రమంలో తన ఓటమి వార్త విన్న హరినారాయణ్ ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అములుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సింగ్రౌలీలో విజయం సాధించింది. ఇక, బుర్హాన్పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్‌లలో అధికార బీజేపీ విజయం సాధించింది. #Congress candidate Harinarayan Gupta, contesting in municipal council polls for #Rewa district in #MadhyaPradesh, died of heart attack after his election loss.https://t.co/DHTh5JMwqh — IndiaToday (@IndiaToday) July 17, 2022 ఇది కూడా చదవండి: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
Elections: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
గుహవటి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులకు ఎన్నికలుగా జరుగగా 58 వార్డులను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికలు చివరిసారిగా 2013లో జరిగాయి. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, ఈ విజయంపై అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తన శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. బీజేపీ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. I bow my head to the people of Guwahati for giving @BJP4Assam & its allies a historic win in #GMCElections. With this massive mandate, people have reaffirmed their faith on our development journey under the guidance of Adarniya PM Shri @narendramodi ji.@JPNadda @BJP4India pic.twitter.com/AWZ5mqIhc3 — Himanta Biswa Sarma (@himantabiswa) April 24, 2022 -
ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. కాలి నడకన పోలింగ్ బూత్‌కు..
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన సింప్లిసిటీ వార్తల్లో నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ నంబర్ వార్డులోని ఏరోడ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు ఓటు వేశారు. నవీన్ నివాస్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ పోలింగ్ కేంద్రం ఉండడంతో సీఎం సాధారణ రక్షణ దళం సహాయంతో కాలినడకన ఓటు వేసేందుకు వెళ్లడం విశేషం. (చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు) -
అస్సాం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
గువాహటి: అస్సాంలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 80 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 72 మున్సిపాల్టీలను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కనీసం ఒక్క మున్సిపాల్టీని సైతం దక్కించుకోలేకపోయింది. మరియానీ, హైలాకండీ పురపాలక సంఘాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. మరో ఆరు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఈసీ ఎవరి తొత్తు కాదు.. అన్ని పార్టీలు సమానమే: సీఈసీ సుశీల్ చంద్ర.. నేర చరితులు ఎందరంటే..) -
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్‌పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్‌కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
సీట్లు ఎక్కువ కావాలి.. ఒంటరిగానే పోటీ చేస్తాం
చెన్నై: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సోమవారం ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. (చదవండి: చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే) 'ఇదేమి కష్టమైన నిర్ణయం కాదు. అన్నాడీఎంకే నేతలు ఓ పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయాన్ని జాతీయ నాయకులు ఆమోదించారు. ఇలాంటి ఎన్నికల్లో సీట్ల పంపకం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు 10 శాతం సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే ముందుకు వచ్చింది కానీ మేం ఎక్కువ శాతం సీట్లు కావాలని అడిగామ’ని అన్నామలై తెలిపారు. బీజేపీ నిర్ణయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. కమలం పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకం చర్చలు సామరస్యంగా జరిగినా ఫలప్రదం కాలేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అనేది ఏఐఏడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. కాగా.. సేలం, అవడి, తిరుచ్చి, మదురై, శివకాశి, తూత్తుకుడి మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అన్నాడీఎంకే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. (క్లిక్: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు) -
న్యూయార్క్‌లో డ్రీమర్స్‌కు ఓటు హక్కు
న్యూయార్క్: అమెరికా పౌరసత్వం లేకపోయినప్పటికీ న్యూయార్క్ నగరం డ్రీమర్స్‌కి ఓటు వేసే హక్కు కల్పించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి దేశానికి వచ్చి ఇక్కడే పెరిగిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 8 లక్షలకు పైగా యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డ్రీమర్స్ ఓటు వేయడానికి వీలు కల్పిస్తూ న్యూయార్క్ నగర కౌన్సిల్ నెల రోజుల క్రితమే ఒక బిల్లును ఆమోదించింది. మేయర్ దానిపై ఆమోద ముద్ర వేయడంతో ఆదివారం నుంచి అది చట్టరూపం దాల్చింది. అయితే ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దేశ పౌరసత్వం లేని వారికి ఓటు హక్కు కల్పించిన తొలి అతి పెద్ద నగరంగా న్యూయార్క్ రికార్డు సృష్టించింది. పౌరులు కాని వారు ఇప్పటికీ అధ్యక్ష, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. -
తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2021 సంవత్సరం అఖండ విజయాలను అందించింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో విజయదుందుభి మోగించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాగ్దానాల్లో 95 శాతం హామీలను ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఆయన అమలుచేశారు. ఫలితంగా.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. అందిస్తున్న సుపరిపాలనతో వైఎస్సార్సీపీపై ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాలను (88 శాతం) దక్కించుకున్న వైఎస్సార్సీపీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడమే అందుకు తార్కాణం. 1983 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989లో కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. దొంగ ఓట్లు.. దౌర్జన్యాలు, ప్రలోభాలతో మూడు దశాబ్దాలకు పైగా చంద్రబాబు కుప్పంను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కానీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ తీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మాజీ కమిషనర్ నిమ్మగడ్డ ద్వారా ఏడాదిపాటూ స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అడ్డుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆయన్ను చావుదెబ్బ తీశారు. వంద శాతం కార్పొరేషన్లు వైఎస్సార్సీపీకే.. చివరకు ఈ ఏడాది మార్చి, నవంబర్లలో రెండు విడతలుగా 13 కార్పొరేషన్లు (నగర పాలక సంస్థలు), 86 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు ఎన్నికలను ఎస్ఈసీ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో వంద శాతం అంటే.. 13 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 87 నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో 84 నగర పంచాయతీ, మున్సిపాల్టీల (98 శాతం)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేంద్రంలోని కుప్పం మున్సిపాల్టీలో సైతం వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించడం గమనార్హం. గ్రామ పంచాయతీల్లోనూ పాగా మొత్తం 13,092 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే 80.4 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుందన్న మాట. అదే కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకుగానూ 74 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించి.. టీడీపీ కోటను బద్దలుకొట్టారు. 100% జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీకే.. రాష్ట్రంలో 652 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలు (జెడ్పీటీసీ), 9,717 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు ఎన్నికలు జరిగితే.. 642 జెడ్పీటీసీ స్థానాల (98.46 శాతం)ను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని అఖండ విజయాన్ని సాధించింది. అలాగే, మొత్తం 13 జెడ్పీ చైర్మన్ పదవులనూ ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక 9,717 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,380 స్థానాలు (86.24 శాతం) స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 96 శాతం మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకుగానూ 63 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ‘మండలి’లో సంపూర్ణ ఆధిక్యం శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం, పలువురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం 18 నుంచి 32కు ఒక్కసారిగా పెరిగి సంపూర్ణ ఆధిక్యత సాధించినట్లయింది. దేశ చరిత్రలో రికార్డు..: గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలతోపాటు 13 జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటా వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకునే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. -
ఫుల్ జోష్ లో ఆప్.... తరువాత టార్గెట్ అదే
-
kuppam: పెద్దాయన యంత్రాంగం.. మిథున్ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. తిరుపతి లోక్‌సభ ఎన్నిక, బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో బాధ్యత తీసుకుని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డు ఆయనది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి వరుసగా ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికకు పెద్దాయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కూడా తోడయ్యారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటించారు. దీంతో పాటు తిరుపతి వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సమావేశ నిర్వహణ చూస్తూనే కుప్పం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగానూ తూలనాడారు. అయినా సరే సంయమనం పాటించారు. ఆ సందర్భంలోనే బాబు వ్యాఖ్యలపై స్పందించాలని పెద్దిరెడ్డిని మీడియా కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని, కుప్పంలో గెలిచిన తరువాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు. బాబు విమర్శలకు దీటుగా ప్రచార ఉధృతిని పెంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కుప్పంవాసులకు జరిగిన మేలును వివరించారు. మరోవైపు మిథున్‌రెడ్డి కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. చేతికి గాయమైనప్పటికీ ఆసుపత్రి నుంచి నేరుగా కుప్పం ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కొంతకాలంగా కుప్పంలో ఉంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆత్మస్ఖైర్యం నింపారు. చంద్రబాబు, లోకేష్‌లు కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించారు. అయితే వైఎస్సార్సీపీ శ్రేణులు డీలా పడకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఫలితంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా తండ్రి, తనయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ నేతల సమష్టి కృషితో కుప్పంలో అరుదైన విజయం నల్లేరు మీద నడకలా సాగడం విశేషం. బాబు పతనం ఇలా.. ► 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన బాబు 2019 వరకు గెలుస్తూ వస్తున్నారు. ► తొలిసారిగా 6,918 ఓట్ల మెజారిటీ సాధించిన బాబు.. 1994, 1999లో 60 శాతం వరకు మెజారిటీ సాధించారు. ► 2004లో 42 శాతం, 2009లో 46 శాతం మెజారిటీ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 28 శాతానికి పడిపోయింది. ► 2019లో జరిగిన ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో కేవలం 16 శాతం మెజారిటీ. ► తాజా స్థానికసంస్థల ఎన్నికల్లో శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలను, ఎంపీపీలను, 62 ఎంపీటీసీ, 74 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని చావుదెబ్బ కొట్టింది. -
ఆ వలంటీర్.. ఇక కౌన్సిలర్!
దాచేపల్లి: ఇప్పటికే పలువురు గ్రామ, వార్డు వలంటీర్లు సర్పంచ్‌లుగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అదే కోవలో ఇప్పుడు గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు వలంటీర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 12వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసిన దేవళ్ల లక్ష్మీప్రసన్న.. సమీప టీడీపీ అభ్యర్థి గోళ్ల నారాయణపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు 22 ఏళ్ల కౌన్సిలర్! వల్లూరు(కమలాపురం): వైఎస్సార్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డుకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్వీ నిఖిల్‌రెడ్డి విజయం సాధించారు. అతని వయసు 22 ఏళ్లు మాత్రమే. డిగ్రీ చదివిన నిఖిల్‌రెడ్డి 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. -
కుప్పం ఓటమిపై సైలెంట్.. హైదరాబాద్‌కు చంద్రబాబు
Kuppam Municipal Election Results 2021: మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ చంద్రబాబు ఉండవల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు నుంచి ఉండవల్లిలోనే ఉన్న ఆయన ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోవడంతో ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా రావడంతో ఆయన వాటిపై స్పందించలేదు. కుప్పం మునిసిపాలిటీలో గెలిస్తే మీడియాతో మాట్లాడాలని భావించినట్లు సమాచారం. కానీ అక్కడ చిత్తుగా ఓడిపోవడంతో స్పందించేందుకు ఇష్టపడలేదు. మౌనంగా ఉండవల్లి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొండపల్లి మునిసిపాలిటీ 10వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థిని శ్రీలక్ష్మికి గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. -
టీడీపీ ఓటమి సంపూర్ణం
సాక్షి, అమరావతి: మలి విడత మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తొలి విడత మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ.. తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో టీడీపీ ఓటమి సంపూర్ణమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పనిచేయలేదు. అసత్య ప్రచారం, సానుభూతి కోసం ఆడిన డ్రామాలు విఫలమయ్యాయి. తాజాగా ఒక కార్పొరేషన్, 12 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దర్శి మున్సిపాల్టీలో మాత్రమే గెలిచింది. మరో రెండు చోట్ల పోటీ ఇవ్వగలిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా ఓడిపోయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 25 వార్డులకు ఆరింటిలోనే టీడీపీ గెలిచింది. చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పం తొలిసారి చేజారిపోవడం టీడీపీ శ్రేణులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబే ఓడిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ నాయకుల్లో మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే గెలవలేని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఎలా గెలిపించగలరనే అనుమానాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇష్టానుసారం నోరుపారేసుకున్న చంద్రబాబు.. తాజా ఫలితాల తర్వాత నోరు మెదపకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. నెల్లూరులో టీడీపీకి అవమానం నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లలో ఒక్కటీ టీడీపీకి దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలున్నా వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల, దాచేపల్లిలో ప్రభావం చూపలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నియోజకవర్గంలోని ఆకివీడు మున్సిపాలిటీలో జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగినా వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. అక్కడ 20 వార్డులకు 4 వార్డుల్లో మాత్రమే అతి కష్టంమీద గెలవగలిగారు. వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాల్టీల్లో టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కమలాపురంలో 20 వార్డులకు 5, రాజంపేటలో 20 వార్డులకు 4 వార్డుల్లోనే గెలిచింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 20 వార్డులకు రెండు వార్డులే టీడీపీకి వచ్చాయి. కర్నూలు జిల్లా బేతంచర్లలో 20 వార్డులకు కేవలం ఆరింటిలో టీడీపీ గెలిచింది. అనంతపురం జిల్లా పెనుకొండలోనూ టీడీపీ భంగపడింది. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతమైన ఇక్కడ 20 వార్డులకు రెండే రెండు వార్డులు వచ్చాయి. దక్కింది దర్శి ఒక్కటే ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాల్టీ ఒక్కటే టీడీపీకి దక్కింది. అక్కడ 20 వార్డులకు 13 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాల్టీలో పోటీ ఇవ్వగలిగింది. అక్కడ 29 వార్డులకు 14 టీడీపీ, 14 వైఎస్సార్సీపీ గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీకి టీడీపీ పోటీ ఇచ్చినా గెలవలేకపోయింది. -
నెల్లూరు క్లీన్ స్వీప్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 54 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐల ఉనికే కనిపించలేదు. ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. వైఎస్సార్సీపీకి తిరుగులేదని మరోమారు రుజువైంది. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలు 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కౌన్సిలర్లుగా పట్టం కట్టారు. సీఎం జగన్ రాజకీయాలకు అతీతంగా అందిస్తున్న పాలన, మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కష్టానికి తగ్గ ఫలితంగా మునిసిపల్ ఫలితాలను విశ్లేషకులు వర్ణిస్తున్నారు. రాష్ట్ర నేతలకు చేదు అనుభవం టీడీపీ జాతీయ, రాష్ట్ర నేతలుగా చలామణి అవుతున్న వారందరికి మునిసిపల్ పోరులో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నివాసం ఉంటున్న 20వ డివిజన్ వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సొంత డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. సోమిరెడ్డి స్వగ్రామం అల్లీపురం 2వ డివిజన్ పరిధిలో ఉంది. ఈ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మేకల రామ్మూర్తి విజయం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు ఇంటింటా ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని తీరాలనే దిశగా అనేక ప్రలోభాలకు గురిచేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా అక్కడ సోమిరెడ్డి వర్సెస్ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అన్నట్లుగా ఎన్నికలు సాగాయి. ఇద్దరూ తమ అభ్యర్థులు గెలిపించుకోవాలని పోటాపోటీగా ప్రచారం చేశారు. 889 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామ్మోహన్ విజయం సాధించారు. మాజీ మంత్రి నారాయణ నివాసం ఉంటున్న 12వ డివిజన్ (చింతారెడ్డిపాళెం) వైఎస్సార్సీపీకి ఏకగ్రీవంగా దక్కింది. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నివాసం ఉంటున్న 18వ డివిజన్‌లోను, పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసం ఉన్న 16వ డివిజన్‌లోను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. -
కుప్పకూలిన బాబు కోట
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలతో మొదలైన వైఎస్సార్సీపీ జైత్రయాత్ర తాజాగా జరిగిన రెండో దశ నగరపాలక(కార్పొరేషన్), పురపాలక (మున్సిపాల్టీ), నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్‌తో సహా 12 మున్సిపాల్టీ, నగరపాలక సంస్థలకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. సోమవారం పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఎంపీ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల తరహాలోనే రెండో దశ నగర, పురపాలక ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకుగానూ(ఒకటి ఏకగీవ్రం) అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీకి కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. 25 వార్డులకు కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి వైఎస్సార్సీపీ అభ్యర్థులు 19 వార్డుల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. పెనుకొండ, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, గురజాల, కొండపల్లి, జగ్గయ్యపేట, ఆకివీడు పురపాలక, నగర పంచాయతీలను కూడా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలో మాత్రమే టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్సార్సీపీ 7 వార్డుల్లో, టీడీపీ 13 వార్డుల్లో గెలుపొందాయి. 100 % ఒకే పార్టీకి ఇదే తొలిసారి.. తొలి విడత జరిగిన ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేసింది. ఇక తాజా ఫలితాలతో అధికార పార్టీకి దక్కిన పురపాలక సంస్థల సంఖ్య 74 నుంచి 84కు పెరిగాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వంద శాతం నగర పాలక సంస్థలను, 97.67 శాతం పురపాలక, నగర పంచాయతీలను ఒకే పార్టీ కైవశం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సురిపాలనతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధించి 175 శాసనసభ స్థానాలకుగానూ 151 చోట్ల, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 22 చోట్ల వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఫలాలను అందించడం ద్వారా పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీశారు. పరిపాలన సంస్కరణలను తెచ్చి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకెళ్లారు. రెండున్నరేళ్లలో దాదాపు 15 నెలలు రెండు విడతలుగా కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గంతో పాటు రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా, గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల ఛైర్మన్లు/ఛైర్పర్సన్లుగా 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశమిచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చూపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా.. అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకమైన పరిపాలన అందిస్తుండటంపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులనే ప్రజలు ఆశీర్వదించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణ, నగర ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా ప్రజలు తీర్చిదిద్దారని స్పష్టమవుతోంది. సాగనంపిన కుప్పం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరువు కాపాడుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. వార్డుకో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. మాజీ మంత్రులు, . బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించి ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. తన కుమారుడు లోకేష్‌ను కుప్పం పంపి దౌర్జన్యాలకు దిగేలా శ్రేణులను ప్రేరేపించి భయోత్పాతం సృష్టించారు. డబ్బులు వెదజల్లారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. చివరకు తనదైన రీతిలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారు. ఆయన ఎన్ని చేసినా కుప్పం మున్సిపాల్టీ ప్రజలు ‘ఓటే’ అస్త్రంగా తిరుగులేని తీర్పు చెప్పారు. వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని చేకూర్చి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 261 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 328 డివిజన్లు, వార్డులకు, 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 25 డివిజన్లు, వార్డులకు కలిపి మొత్తం 353 డివిజన్లు, వార్డు స్థానాల ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికెషన్ విడుదల చేసింది. మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏకగ్రీవాలతో కలుపుకుని వైఎస్సార్సీపీ 261, టీడీపీ 82, జనసేన 5, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల గెలుపొందారు. -
ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. చదవండి: CM YS Jagan: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తమను రాజీనామా చేసి రమ్మన అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఏం చేశారు? అని నిలదీశారు. నిజంగా దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 54 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రజలు బాధ్యత పెట్టారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. తాజా మునిసిపల్ ఫలితాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు చిహ్నమని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు సీఎం వైఎస్ జగనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి విరబూస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడని, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారన్నారు. ఇకపై చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రవాసాంధ్రుడిలా విశ్రాంతి తీసుకుంటూ.. రామోజీరావును, రాధాకృష్ణను రోజూ కలుసుకుంటూ భవిష్యత్‌పై చర్చించుకోవచ్చని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఓట్లు పడవని, మంచి చేస్తేనే పడతాయని అన్నారు. ‘తనపై 11 కేసులున్నాయని, అందులో సెక్షన్ 307 కూడా పెట్టారని.. ఏం పీక్కుంటారని లోకేశ్ అడుగుతుంటే కుప్పం పీకేసుకుంటామని ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకు వస్తానని లోకేశ్ అంటున్నాడు. ఇది న్యాయవ్యవస్థను కించపరచటం కాదా. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్ మీద సుమోటోగా విచారణ చేపట్టిæ శిక్షించాలని హైకోర్టుకు నివేదించుకుంటున్నాను’ అన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే.. చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటేమీ మిగల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొన్న మంగళగిరి సీటు పోతే, ఇప్పుడు కుప్పం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందేనన్నారు. కారుపై నిలబడి కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావని.. ప్రజాప్రయోజనాలు కాపాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే విషయాన్ని గుర్తించాలని లోకేశ్‌కు హితవు పలికారు. మాపై బాధ్యత పెంచిన విజయం: మంత్రి ముత్తంశెట్టి ప్రజలిచ్చిన తీర్పును తాము వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం దేశ చరిత్రలో జరగలేదని, మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి ఘనత నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్
-
‘చంద్రబాబులా దౌర్జన్యాలు చేయలేదు’
-
ఎన్నిక ఏదైనా తిరుగులేని వైఎస్సార్సీపీ