Naa Saami Ranga Movie
-
Ashika Ranganath: ఫస్ట్ సినిమా ఫట్.. కానీ చిరంజీవి మూవీలో ఛాన్స్.. అందాల ఆషిక (ఫొటోలు)
-
చీరలో 'నా సామి రంగ' బ్యూటీ.. అందం చూస్తే అసూయ పడతారేమో! (ఫోటోలు)
-
'నా సామిరంగ'లో అది నచ్చలేదు.. ఇలా చేసుంటే కలెక్షన్స్..
నాగార్జున అక్కినేని. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ నా సామిరంగ. ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్‌గా వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో రివ్యూ ఇచ్చాడు. ఆ టెక్నిక్ ఫాలో కావట్లే.. ఆయన మాట్లాడుతూ.. 'సినిమా బాగుంది. కానీ వసూళ్లు అంతగా రాలేవు. ఏ దర్శకుడికైనా, రచయితకైనా, నటుడికైనా సంతృప్తినిచ్చే సినిమాలు కొన్నుంటాయి. ఈ మూవీ ఆ జాబితాలోకే వస్తుంది. దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు టెక్నిక్‌ను చాలామంది యువదర్శకులు ఫాలో అవడం లేదు. ఆయన సినిమాలో ఆఖరి అరగంటే చిత్రానికి గుండెకాయ. అప్పటివరకు ఎలా ఉన్నా చివర్లో మాత్రం ప్రేక్షకులు కన్నార్పకుండా చూసేవారు. కళ్లతో నటించారు నా సామిరంగ మూవీ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో రొమాన్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. నాగార్జున గడ్డం పెంచి, లుంగీ కట్టి కొత్తగా కనిపించారు. కిష్టయ్య పాత్రను ప్రేమించారు. తన పాత్రకు న్యాయం చేశారు. కళ్లతో నటించారు. ఎప్పుడూ కామెడీ పండించే అల్లరి నరేశ్ ఎక్కువ ఫైట్లు చేశాడు. ఇంటర్వెల్లో రావు రమేశ్ పాత్రను ముగించకుండా ఉంటే బాగుండనిపించింది. ఇంటర్వెల్లో ఆయన పాత్ర క్లోజ్ చేయడంతో సెకండాఫ్‌లో కొత్త విలన్ వస్తాడని సగటు ప్రేక్షకుడికి సులువుగా తెలిసిపోతుంది. కూతుర్ని భయపెట్టే క్రమంలో నిజంగానే ఆయన పాత్ర చనిపోతుంది. ఈ పాత్రను అంతం చేయకుండా అలాగే కొనసాగిస్తే సెకండాఫ్ ఇంకా బాగుండేదనిపించింది. ప్రేక్షకులు భరించలేరు అల్లరి నరేశ్ పాత్రను కూడా ముగించకుండా ఉండాల్సింది. ఎందుకంటే హీరో పక్కన ఉన్నవాళ్లను చంపుకుంటూ పోతే ప్రేక్షకులు భరించలేరు. హీరో విలన్లను చంపుకుంటూ పోతే సినిమా సూపర్ హిట్ అవుతుంది, అదే విలన్.. హీరో మనుషులను చంపుకుంటూ పోతే సినిమా దెబ్బతింటుంది. అయినా లక్కీగా ఈ సినిమా బయటపడింది. నాజర్ పాత్ర చివర్లో చేసిన పని కూడా నచ్చలేదు. సెకండాఫ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చుండేవి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: విజయకాంత్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్.. నేను వద్దని తెగేసి చెప్పారు -
ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్
మరో వారం వచ్చేసింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం. నెట్‌ఫ్లిక్స్ • డంకీ (నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది) • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 15 • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 • ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 • సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది • సలార్ (హిందీ వర్షన్) - ఫిబ్రవరి 16 • ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- - ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్ వీడియో • రూట్ నం.17 ( తమిళ్ మూవీ) - ఫిబ్రవరి 15 • అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16 • లవ్‌స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది జీ5 • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 • క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్ అవుతుంది -
ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారంలో ఏకంగా 21 సినిమాలు!
మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద ఈగల్ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. అంతే కాకుండా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు సైతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మరీ ఈ వారంలో ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకోవాలని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేదుకు నాగార్జున వచ్చేస్తున్నాడు. సంక్రాంతికి సందర్భంగా రిలీజైన నా సామిరంగ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది. ఆ రెండు సినిమాలే ప్రేక్షకులకు కాస్తా ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వారంలో అలరించనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ కిల్ మీ ఇఫ్ యూ డేర్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 13 సదర్లాండ్ టిల్ ఐ డై -సీజన్-3(డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 13 టేలర్ టామ్లిన్సన్ : హ్యావ్ ఇట్ ఆల్(కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13 ఏ సోవేటో లవ్ స్టోరీ - ఫిబ్రవరి 14 గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14 లవ్ ఇజ్ బ్లైండ్- సీజన్ 6(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14 ప్లేయర్స్(నెట్‌ఫ్లిక్స్ మూవీ) - ఫిబ్రవరి 14 ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 హోస్ ఆఫ్ నింజాస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నా సామిరంగ(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 జీ5 ది కేరళ స్టోరీ(బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 -
ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అఫీషియల్ ప్రకటన
'నా సామిరంగ' అంటూ సంక్రాంతి బరిలో దిగి అక్కినేని నాగార్జున హిట్ కొట్టారు. విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలకు గట్టి పోటీగా నా సామిరంగ చిత్రం నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి నాగ్ కెరియర్లో మరో హిట్‌ను అందుకున్నారు. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 55 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఓపెనింగ్స్ తొలి మూడు రోజుల్లోనే రూ. 28 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024 -
ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా..
థియేటర్లలో సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరప్పా అనేవాళ్లు చాలామందే! అయితే ఓటీటీలో సిరీస్‌లు, సినిమాలు చూస్తే ఆ మజానే వేరనేవారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. అందుకే ఓటీటీల సంఖ్య పెరిగింది. అవి కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలు, కామెడీ షోలు, ఇంటర్వ్యూలు.. ఇలా రకరకాల కంటెట్‌ను ఒకే ప్లాట్ఫామ్లో వండి వడ్డిస్తున్నాయి. సంక్రాంతి సినిమాల్లో.. థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొన్ని డిజిటల్ ఎంట్రీ గురించి ముందస్తు ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని మాత్రం ఎటువంటి అప్డేట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతికి వచ్చిన సైంధవ్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా గుంటూరు కారం నేటి అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఓటీటీలో నా సామిరంగ తాజాగా నా సామిరంగ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. త్వరలోనే నా సామిరంగ రిలీజ్ చేయనున్నట్లు హాట్‌స్టార్ వీడియో రిలీజ్ చేసింది. డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే కన్నగి అనే తమిళ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే తెలుగు వర్షన్ మాత్రం ఇంకా అందుబాటులోకి వచ్చినట్లు లేదు. KomING to set your screens on fire 🙌 Can you guess the date?#NaaSaamiRangaonHotstar #KingOnHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl @SS_Screens @boselyricist… pic.twitter.com/gsYHL1rPth — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 8, 2024 హారర్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను హడలెత్తించిన నన్ 2 కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ మూవీ ఇదివరకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఫ్రీగా కాకుండా అద్దెకు తీసుకుని చూడవచ్చని కండీషన్ పెట్టింది. ఇప్పుడీ చిత్రం తాజాగా జియో సినిమాలో రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చంటూ జియో సినిమా వీడియో షేర్ చేసింది. దీంతో హారర్ చిత్రాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2018లో వచ్చిన నన్ మూవీకి సీక్వెల్‌గా నన్ 2 తెరకెక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?
సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ శుక్రవారం దాదాపు 8-10 వరకు తెలుగు చిన్న మూవీస్ అన్నీ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. అలానే రాబోయే రెండు మూడు నెలల్లో పెద్ద చిత్రాలేం లేవు. దీంతో మూవీ లవర్స్ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. కొత్తగా ఏమున్నాయి? సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయని తెగ సెర్చ్ చేస్తున్నారు. 'గుంటూరు కారం' విషయానికొస్తే.. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాకు రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్, రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల ప్రేక్షకులు మరీ అంత కాకపోయినా సరే లైట్ తీసుకున్నారు. మహేశ్ యాక్టింగ్ తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏం లేదని చెప్పొచ్చు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) 'హనుమాన్' విషయానికొస్తే.. మహేశ్ మూవీతో పాటు జనవరి 12న రిలీజైన ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల సమస్య వల్ల తొలివారం పర్లేదు గానీ ఆ తర్వాత కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. లెక్క ప్రకారం థియేటర్లలోకి వచ్చిన మూడు-నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు. కానీ టాక్-రెస్పాన్స్ చూసి ప్లాన్ మారింది. మార్చి 2 లేదా 3వ వారం ఓటటీలోకి రావొచ్చని టాక్. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్'.. ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. కంటెంట్, స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్ని ఇది అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటింంచేశారు. నాగార్జున 'నా సామి రంగ' పెద్దగా అంచనాల్లేకుండా సంక్రాంతి బరిలో దిగి పాసైపోయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ రూమర్ డేట్స్ అయినప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
ఓటీటీకి 'నా సామిరంగా'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన కింగ్ నాగార్జున నా సామిరంగా చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పొంగల్ బరిలో గుంటూరు కారం, హనుమాన్,సైంధవ్ చిత్రాలతో పోటీపడి బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అదే జోరును కొనసాగించింది. ఈ మూవీని మలయాళ చిత్రానికి రీమేక్‌గా విజయ్ బిన్నీ దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వతే స్ట్రీమింగ్ కానున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ లెక్కన ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్కు అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించాడు. కాగా.. ఇటీవలే నాసామిరంగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్‌కు సినిమా టీమ్ అంతా హాజరయ్యారు. -
హనుమాన్ పై నాగార్జున హీరోయిన్ కామెంట్స్
-
కొత్త డైరెక్టర్లకు నాగార్జున అవకాశం ఇస్తే.. ఎలా ఉంటుందంటే..!
-
అల్లరి నరేష్ పంచులకు నవ్వులతో దద్దరిల్లిన ఆడిటోరియం
-
సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే అమల పిచ్చి ఎక్కిందా ఇతనికి అని అన్నది
-
ఈమాట చెప్పగానే అమల, చైతన్య ఆశ్యర్యపోయారు: నాగార్జున
‘‘సెప్టెంబరు 20న నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) బర్త్ డే. ఆ రోజు విగ్రహావిష్కరణ పూర్తికాగానే ‘నా సామిరంగ’ షూటింగ్‌కు బయలుదేరాను. ‘ఎందుకంత తొందర.. ఇంకాస్త సేపు ఉండొచ్చుగా’ అని అమల నాతో అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని నేను చెప్పగానే పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. నేను సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తానన్న నమ్మకాలు బయట ఎవరికీ లేవు. నా టీమ్ ముఖాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. సినిమాను రిలీజ్ చేశాం. కీరవాణిగారు బాగా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందర్నీ చాలా మిస్ అవుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నామీనన్ , రుక్సార్ థిల్లాన్ , షబ్బీర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కు ముందుగా థ్యాంక్స్. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. నేను కనపడగానే నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని, కాస్త ఆలస్యంగా మేం చెప్పినప్పటికీ సహకరించిన డిస్ట్రిబ్యూటర్స్‌కు థ్యాంక్స్. నెక్ట్స్ సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కీరవాణి, చంద్ర బోస్గార్లు ఇలానే కలిసి ఉంటూ ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలి’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఓ సినిమా విడుదలై, సక్సెస్ సాధించి, సెలబ్రేషన్స్ షీల్డ్స్ అందుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా నా తొలి సినిమాకే జరగడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘నవరస భరితమైన సినిమాగా ‘నా సామిరంగ’ నిలిచింది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సక్సెస్‌మీట్‌లో పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడారు. ఈ కార్య క్రమంలో నాగార్జున, కీరవాణి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్, చిత్రబృందం షీల్డ్స్ అందుకున్నారు. -
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్‌తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్‌గారు డైరెక్టర్‌గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
మాట మీద నిలబడ్డ నాగ్! నా సామిరంగకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మల్టీస్టారర్ సినిమాలకున్న క్రేజే వేరు. ఇద్దరు హీరోలు తెరమీద కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటిది ఈ సంక్రాంతికి ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాతో సందడి చేశారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున యువ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. ఈ మూవీలో ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించాడు. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా? 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అని చెప్పిన నాగ్ తన మాటను నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో.. వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా ఉందని వెల్లడించింది. నాగార్జున జోరు చూస్తుంటే మరో రెండు,మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా నాగార్జున.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ డైరెక్టర్ నవీన్‌తో సినిమా చేయనున్నాడు. ‘బ్రహ్మస్త్ర 2’ లోనూ భాగం కానున్నాడు. Sankranthi KING #NaaSaamiRanga STORM at BO on Kanuma Day!🔥🔥 Total 3 Days WW gross is 24.8 crores💥 Festive celebrations in theatres will continue on Day 4 too🥳#NaaSaamiRangaJaathara 🎟 https://t.co/1i8BJmy6kJ KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u… pic.twitter.com/ayPwBdQk19 — BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2024 చదవండి: హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, యాంకర్‌గా.. ఈ నెలలో ప్రియుడితో పెళ్లి -
Mirna Menon Latest Photos: నా సామిరంగ ఏముంది...అదిరిపోయే అందాలతో మీరిన మీనన్ (ఫోటోలు)
-
సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?
ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. రిలీజ్ ముందు వరకు చూసుకుంటే ఎప్పుడు లేనంత రచ్చ ఈసారి జరిగింది. చిన్నా పెద్దా అనే అంతరాలు చేసి మాట్లాడటం, థియేటర్ల కేటాయింపు దగ్గర వివాదం.. ఇలా ఊహించని మలుపులతో ప్లాన్ చేసుకున్న నాలుగు మూవీస్ కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. మరి వీటిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవి ఏవి? ప్రస్తుతం ఎంతెంత కలెక్షన్స్ సాధించాయి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'గుంటూరు కారం'.. అలా అలా ఈసారి వచ్చిన వాటిలో భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోనే దీనికి కారణం. మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయని చెప్పడంతో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. తీరా చూస్తే.. మహేశ్ తన వరకు బాగా న్యాయం చేశాడు. స్వాగ్, డ్యాన్సులు రెచ్చిపోయి మరీ చేశాడు. కానీ కథ, డైలాగ్స్, దర్శకత్వం విషయంలో త్రివిక్రమ్ పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు. దీంతో బెన్ఫిట్ షో అయిపోగానే మిక్స్డ్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు వచ్చిన ప్రకటించుకున్నారు. వసూళ్లు అయితే రావొచ్చేమో గానీ మిగతా విషయాల్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందనేది చాలామంది మాట! హనుమాన్.. ఊహించని సక్సెస్ రిలీజ్‌కి ముందే చిన్న సినిమా అని తక్కువ చేసి చూడటం, థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి వాటివల్ల 'హను-మాన్' సినిమాపై సింపతీ పెరిగింది. ఇక స్టోరీ పరంగా కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. హై ఇచ్చే ఎలిమెంట్స్, దేవుడి సెంటిమెంట్ లాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాయి. సినిమాకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. తెలుగులో థియేటర్ల తక్కువ కావడం వల్ల కలెక్షన్స్ తక్కువ వచ్చుండొచ్చు కానీ లాంగ్ రన్లో మిగతా మూడు సినిమాల కంటే దీనికే ఎక్కువ వస్తాయి. (ఇదీ చదవండి: సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?) సైంధవ్.. అంతంత మాత్రమే విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' సినిమాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే టేకింగ్, యాక్టింగ్ పరంగా పెద్దగా వంకపెట్టడానికి ఏం లేదు గానీ స్క్రీన్ ప్లే కాస్త సాగదీత, స్టోరీలో చిన్నచిన్ పారపొట్లు ఈ చిత్రానికి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. అలానే దీనికంటే ముందు 'గుంటూరు కారం', 'హనుమాన్' రావడంతో ఇక అందరి దృష్టి వాటిపైనే ఉండిపోయింది. దీంతో వెంకీమామని పట్టించుకునేవాళ్లు తక్కువైపోయారు. అయితే ఈ సినిమాకు తొలిరోజు రూ.6 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. నా సామిరంగ.. స్లో పాయిజన్ నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'నా సామి రంగ'. విడుదలయ్యేంత వరకు దీనిపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. బడ్జెట్ కూడా తక్కువే. అలా తాజాగా సంక్రాంతికి రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్ అంటున్నారు. పండగ హడావుడిలో పెట్టిన బడ్జెట్లో ఈ మూవీ సేఫ్ అయిపోవచ్చు.ఈ చిత్రానికి కూడా తొలిరోజు రూ.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక నాలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎలా చూసుకున్నాసరే 'హను-మన్' సంక్రాంతి విన్నర్! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
వారి ఆనందం చూస్తుంటే తృప్తిగా ఉంది
‘‘నా సామిరంగ’ సినిమాని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, నా అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది’’ అని హీరో నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నా సామిరంగ’ థ్యాంక్స్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ–‘‘మా చిత్రం సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పం, ప్రేమతో యూనిట్ అంతా పని చేశారు.. అందుకే ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. విజయ్ బిన్నీకి గొప్ప భవిష్యత్ ఉంటుంది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ కుమార్‌లు గొప్ప ప్రోత్సాహం అందించారు. ఆషికా రంగనాథ్‌కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన నటుడు నాగార్జునగారితో నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రని ఇచ్చిన శ్రీనివాసా చిట్టూరి, పవన్‌గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఈ సినిమాలో వింటేజ్ నాగార్జునగారిని చూపిస్తానని మాటిచ్చాను.. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్ బిన్నీ అన్నారు. ఆషికా రంగనాథ్, కెమెరామేన్ దాశరధి శివేంద్ర మాట్లాడారు. -
Thank You Meet: ‘నా సామి రంగ’ థ్యాంక్యూ మీట్లో కింగ్ నాగార్జున (ఫొటోలు)
-
'నా సామి రంగ' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఆ సంస్థతో భారీ డీల్!
ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన చివరి సినిమా 'నా సామి రంగ' కూడా థియేటర్లలోకి వచ్చేసింది. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో డైరెక్టర్ అయ్యాడు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ పార్ట్నర్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. కింగ్ నాగార్జున.. మొన్నటివరకు బిగ్‌బాస్ 7వ సీజన్ హోస్ట్‌గా చేశారు. దీనితోపాటే 'నా సామి రంగ' షూటింగ్ కూడా పూర్తి చేశారు. సెప్టెంబరులో మొదలైన ఈ చిత్రం కేవలం నాలుగు నెలల్లోనే అన్నీ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) ఇకపోతే బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున.. తనకు సదరు ఛానెల్‌తో ఉన్న బాండింగ్ నేపథ్యంలో 'నా సామి రంగ' చిత్రానికి మంచి డీల్ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. అలానే 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారట. అయితే సినిమాని ఓటీటీ సంస్థకు అమ్మిన తర్వాత ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలనేది సంస్థ తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే 'నా సామి రంగ' చిత్రాన్ని 30 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనిబట్టి చూస్తే ఫిబ్రవరి 3వ వారం లేదంటే మార్చి తొలి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రావొచ్చని అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ) -
Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ
టైటిల్: నా సామిరంగ నటీనటులు: నాగార్జున అక్కినేని,అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, రావు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకత్వం: విజయ్ బిన్ని కథ: ప్రసన్నకుమార్ బెజవాడ సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి ఎడిటర్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది: జనవరి 14, 2024 ‘నా సామిరంగ’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1963-88 మధ్య కాలంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేట గ్రామానికి చెందిన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కిష్టయ్యనే అన్ని తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్దాయన(నాజర్)దగ్గరే పనిచేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు(రావు రమేష్) కూతురు వరాలు(ఆషికా రంగనాథ్) అంటే కిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వరాలుకు కూడా కిష్టయ్య అంటే ఇష్టమే కానీ.. పదేళ్ల కిందట(1978) జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యలో అంజికి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి(మిర్నా మీనన్)తో పెళ్లి జరిగి, పాప కూడా పుడుతుంది. ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్(రాజ్ తరుణ్)..పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)తో ప్రేమలో పడతాడు. పండగవేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి దొరికిపోతాడు. ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్ని చంపేందుకు ప్రయత్నించగా.. కిష్టయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన ఆజ్ఞ మేరకు పండగ జరిగేవరకు భాస్కర్‌కు ఎలాంటి హనీ కలగకుండా చూసుకుంటాడు. కట్ చేస్తే..దుబాయ్ నుంచి తిరిగొచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాసు(డాన్సింగ్ రోజ్) కిష్టయ్య, అంజిని చంపేందుకు కుట్రలు పన్నుతాడు. దాసుతో పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు.అసలు దాసు అంజి, కిష్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పదేళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో భాస్కర్ పెళ్లిని కిష్టయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిష్టయ్య కోసం అంజి చేసిన త్యాగమేంటి? అన్నం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కిష్టయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు, కిష్టయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథ పాతదైన.. తెరపై చూస్తే బోర్ కొట్టదు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా.. అది తెరపై కనిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి సినిమానే నా సామిరంగ. కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా.. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని కమర్శియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమాగా తీర్చిదిద్డాడు దర్శకుడు విజయ్ బిన్నీ. (చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) వాస్తవానికి ఇది పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్. ఆ సినిమా చూసిన వారికి తప్పా.. మిగతావారందరికి ఇది అచ్చమైన తెలుగు సినిమానే అనిపిస్తుంది. ఎక్కడ పాట పెడితే ఊపొస్తుంది.. ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజిల్స్ పడతాయి.. ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పూస్తాయి? ఇలాంటి కమర్షియల్ కొలతలు అన్ని వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అలా ఒది గొప్ప కథ.. అద్భుతంగా తీర్చి దిద్దారని చెప్పలేం కానీ.. సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమా అని చెప్పొచు. కిష్టయ్య, అంజిల బాల్యం సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ వెంటనే పాతికేళ్ల ముందు అంటే 1963 నుంచి 1988కి వెళ్తుంది. భారీ ఫైట్ సీన్‌తో నాగార్జున ఎంట్రీ.. తర్వాత భాస్కర్ (రాజ్ తరుణ్) లవ్‌స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది. ఇక కిష్టయ్య, వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక.. ప్రేక్షకుడు కథలో లీనమై పోతాడు. వరాలు, కిష్టయ్య మధ్య జరిగే సంభాషణలు , ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. సంక్రాంతి పండక్కి ముడిపెడుతూ.. కథనాన్ని నడిపించారు. ఒక ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది. (చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వరాలు, అంజి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక క్లైమాక్స్ ఊహకందేలా, సింపుల్‌గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా.. సంకాంత్రి వేళ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. కిష్టయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు. రొటీన్ కథే అయినా.. నాగార్జున ఎనర్జీటిక్ యాక్టింగ్‌తో బోర్ కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేశ్ది. అంజి పాత్రలో నరేశ్ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించాడు. తెరపై నాగార్జున, నరేశ్‌ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది. వరాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్‌గా రాజ్‌తరుణ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నాజర్, మిర్నా, రుక్సర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. (చదవండి: హను-మాన్ రివ్యూ) సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలు ప్రాణం పోశాడు. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నా సామిరంగ’ మూవీ ట్విటర్ రివ్యూ
ఈ సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్నాడు నాగార్జున. ‘ది ఘోస్ట్’ తర్వాత కింగ్ నటించిన చిత్రం ‘నా సామిరంగ’.మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉన్నా.. తమదే అచ్చమైన పండగ సినిమా అని ముందు నుంచి చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది. ఆ దిశగానే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నా సామిరంగ కథేంటి? ఎలా ఉంది? నాగార్జున ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు. ‘నా సామిరంగ’ చిత్రానికి ట్విటర్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని, నాగార్జున హిట్ కొట్టాడని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. సినిమా యావరేజ్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. #NaaSaamiRanga Second half so far already exceeded expectations 💥🎉🔥 After a long time KING NAGARJUNA AKKINENI is back with a bang 💥 Allari Naresh kooda ramp adichadu acting 👍 Blockbuster for me already pic.twitter.com/H2Mafwt1b9 — Professor Puli 🐯 (@professorpuli) January 14, 2024 ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ అంచనాలను మించి పోయింది. చాలా కాలం తర్వాత నాగార్జునకు ఓ భారీ హిట్ పడింది. అల్లరి నరేష్ కూడా ర్యాంప్ ఆడించాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #NaaSaamiRangaOnJAN14#NaaSaamiranga Just completed 1st half 1st half with All emotions... Nag. Mass fights 🔥 Lovestory 👌👌❤️ Intervel oka scene repeat ayyitadhi🔥🔥 pic.twitter.com/vHoYfB2GJN — Karthik (@Karthikbhanu910) January 14, 2024 సామిరంగ మూవీ ఫస్టాఫ్ ఇప్పుడే ఫినిష్ అయింది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ప్రథమార్థం ముగిసింది. నాగార్జున మాస్ ఫైట్ అదిరిపోయింది. లవ్‌స్టోరీ బాగుంది. ఇంటర్వెల్ ఒక సీన్ రిపీట్ అవుతుంది. ఓవరాల్‌గా సినిమా సూపర్ హిట్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. Nag sir Hit kottadu 🔥🔥🔥 But janalu ready unnara nag sir movie chudadanki Let's see Keeravani duty 💥💥💥💥#NaaSaamiRanga — MESSI IS GOAT (@tiredofidiocity) January 14, 2024 #NaaSaamiRanga Excellent 1st Half Blockbuster 2nd Half Sankranthi is Ours Double Hatrick #Sankranthi Hit @iamnagarjuna #Nagarjuna #NaaSaamiRangaOnJAN14 #NaaSaamiRangaOnJan14th — #NaaSaamiRanga #Thandel #Dhootha (@nagfans) January 14, 2024 Nag introduction Allari Naresh performance Nag Ashika scenes interval block pre climax to climax high emotional On screen Songs anni crrct ga set ayyayi... inka audience chethilo undhi range#NaaSaamiRanga హిట్టు బొమ్మ 🔥 pic.twitter.com/ASwULAZ5l2 — arvi (@Arvi_myself) January 13, 2024 ఒక కొత్త డైరెక్టర్ జీరో ప్రమోషన్స్ మూడు నెలల్లో షూటింగ్ Cut Chesthey Blockbuster #NaaSaamiranga, ఇలా ఎవడైనా కొట్టగలడా లేక మళ్లీ మా #Nagarjuna నే కొట్టమంటారా…🔥🔥🙏🙏 pic.twitter.com/PrTKUL9jIg — నా ఇష్టం…🔥 (@Infidel_KING) January 14, 2024 Showtime: #NaaSaamiRanga Have watched the original & loved it ✌️ I hope @vijaybinni4u recreates the essence of the original well 👍 So far, the promos worked 👌 Lesssssgoooooo 🔥#NaaSaamiRangaReview #NSR #AkkineniNagarjuna @itsRajTarun @allarinaresh pic.twitter.com/iRdI19B76Q — Swayam Kumar Das (@KumarSwayam3) January 14, 2024 -
ఈరోజు మాట్లాడుతున్నారంటే కారణం మీరే సార్
-
అలా అనుకుని ఉంటే శివ.. అన్నమయ్య వచ్చేవి కావు
‘‘నా సామిరంగ’ సినిమా కథలోని ప్రేమ, స్నేహం, త్యాగం, ద్వేషం వంటి నాలుగు అంశాలు నాకు బాగా నచ్చాయి. కథలో ఇవే మూల స్తంభాలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హీరో నాగార్జున. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రధారులు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు. ► ‘నా సామిరంగ’ సినిమా షూటింగ్ 72 రోజులు జరిగితే నా భాగం 60 రోజుల్లో పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులకు 5 నెలలు పట్టింది. సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువ అవుతాయి. ప్రీప్రోడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే ఎవరికైనా ఇంత వేగంగా పూర్తి చేయడం సాధ్యపడుతుంది. పైగా కీరవాణిగారు షూటింగ్‌కి ముందే మూడు పాటలు, ఫైట్ సీక్వెన్స్‌కి నేపథ్య సంగీతం చేశారు. ఇంత వేగంగా, భారీ బడ్జెట్లో సినిమా చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం. ఇందులోని ఏడు పాటలూ అద్భుతంగా ఉంటాయి. ► మనకి సంక్రాంతి పెద్ద పండగ. పైగా ఇది 1980 నేపథ్యంలో జరిగే కథ. తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్థం నేపథ్యాన్ని తీసుకొస్తున్నాం. ఇది పేరుకే మలయాళ రీమేక్. తెలుగు ప్రేక్షకులకు తగినట్లు కథలో మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రెడిట్ దర్శకుడు విజయ్ బిన్నీకి, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడకి దక్కుతుంది. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. పాటలోనే కథని చెప్పే నేర్పు తనలో ఉంది. స్పష్టత ఉన్న దర్శకుడు.. చెప్పింది చెప్పినట్టు తీశాడు. ► ఈ సినిమాలో నా ఊతపదం నా సామిరంగ. సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు వచ్చింది. అందులో 15 నిమిషాలు కట్ చేయడానికి కష్టపడ్డాం.. ఎందుకంటే ప్రతి సీన్ ముఖ్యమైనదిగానే కనిపించింది. నా ప్రతి సినిమానీ ఎడిటింగ్ జరిగాక చూస్తా. అవసరం అనుకుంటే సలహా ఇస్తాను.. కావాలని మార్పులు చెప్పను. అలా చెబితే వాళ్ల క్రియేటివిటీని తక్కువ చేసినట్లవుతుంది. కథకు అవసరం కాబట్టి ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మాస్ లుక్‌లో కనిపించాను. ► ఈ చిత్రంలో కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నాకు, ఆషికాకి మధ్య 12 ఏళ్ల నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. చాలా వైవిధ్యమైన ప్రేమకథ ఇది. ఈ మూవీలో సోదర భావం ఉన్న పాత్రకు ‘అల్లరి’ నరేశ్ సరిపోతాడనిపించి తీసుకున్నాం. రాజ్ తరుణ్‌ది కీలకమైన పాత్రే. అలాగే మిర్నా, రుక్సార్ల పాత్రలూ బాగుంటాయి. ► సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో మేం అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ అప్పుడూ ఇదే సమస్య. ఆ సినిమాను 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా 300 థియేటర్లలో విడుదలవుతోంది. ► నా నూరవ సినిమా స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్‌గా చేయాలనే ఆలోచన లేదు. కెరీర్‌లోని మైలురాయి సినిమాలు స్టార్ హీరోలతో కలిసి చేయాలనుకుని ఉంటే నా నుంచి ‘శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా’ వంటి సినిమాలు వచ్చేవి కావు. వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. రొటీన్‌గా ఉండటంతో చేయడం లేదు. నాగచైతన్యకి వచ్చిన ‘దూత’ లాంటి కథ కుదిరితే చేస్తాను. నేను, నాగచైతన్య, అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నేను, మహేశ్‌బాబు కలసి నటించి, నాగేశ్వరరావు–కృష్ణగార్ల వారసత్వాన్ని కొనసాగించాలని గతంలో ట్వీట్ చేశాను. రాజమౌళిగారి సినిమాని మహేశ్ పూర్తి చేశాక దాని గురించి ఆలోచించాలి (నవ్వుతూ) ∙నా తర్వాతి సినిమా శేఖర్ కమ్ములగారి దర్శకత్వంలో ఉంటుంది. తమిళ డైరెక్టర్ నవీన్‌తో ఓ సినిమా ఉంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ‘బ్రహ్మస్త్ర 2’ మొదలు పెట్టే చాన్స్ ఉంది.