Nada
-
స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పునియాను నాలుగేళ్లపాటు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. నాడా యాంటీ డోపింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 10.3.1ని ఉల్లంఘించిన కారణంగా పూనియాపై వేటు పడింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ పునియా తన యూరిన్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇదే నేరానికి సంబంధించి నాడా ఈ ఏడాది ఏప్రిల్ 23న బజరంగ్ పునియాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ (UWW) కూడా బజరంగ్‌పై నిషేధం విధించింది.ఈ క్రమంలో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది.అందుకు పూనియా స్పందించలేదు. అయితే నాడా మే 7లోపు వివరణ ఇవ్వాలని మళ్లీనోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో ఈ ఏడాది మేలో నాడా అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటిసులకు స్పందించని బజరంగ్ పూనియా.. నాడా యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)కు మాత్రం తన వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మే 31న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. కాగా ఈ ఏడాది జూన్ 23న మరోసారి నాడా బజరంగ్ పునియాకు నోటీసులు ఇచ్చింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొంది. ఈసారి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలకు బజ్రంగ్ జులై 11న వ్రాతపూర్వకంగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ వివాదంపై ఏడీడీపీ ప్యానల్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో అతడు డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిపై నాడా నాలుగేళ్ల పాటు నిషేదం విధించింది. -
రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజర్, ఒలింపిక్ విజేత బజరంగ్ పునియాకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA ) మరోసారి బిగ్ షాకిచ్చింది. బజరంగ్ పూనియాపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. బజరంగ్ పునియా డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు నాడా ఆదివారం సస్పెండ్ చేసింది. అతడికి తాజాగా జాతీయ డోప్ కంట్రోల్ ఏజెన్సీ నోటీసు అందజేసింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చిలో సోనిపట్‌లో జరిగిన ఒలింపిక్స్ ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై బజరంగ్ పునియా ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ పూనియాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్ అతడి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది. కానీ పునియా మాత్రం యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నాడా.. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(వాడా)కు పూనియా వ్యవహరం తెలియజేసింది.దీంతో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది. కానీ పూనియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటకి నాడా మళ్లీ మే 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో గత నెలలో అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటీసులకు స్పదించని పూనియా.. నాడా క్రమశిక్షణ సంఘంకు మాత్రం తన వివరణ ఇచ్చాడు. డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో జూన్4న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే అతడు కావాలనే డోప్ టెస్టు తప్పించుకుంటున్నాడని భావించిన నాడా మరోసారి అతడిపై నిషేదం విధించింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
స్టార్ రెజ్లర్ బజరంగ్‌పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్‌కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్‌తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో.. -
Interim Budget 2024: బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442 కోట్లు
Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు. కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్‌ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు. చదవండి: భారత్‌తో డేవిస్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్లో అనాసక్తి -
రవీంద్ర జడేజాకే అత్యధిక సార్లు! రోహిత్, కోహ్లిలకు మాత్రం.. షాకింగ్ రిపోర్టు!
Ravindra Jadeja's dope samples tested most among Indian cricketers: భారత క్రికెటర్లలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి అత్యధికంగా మూడుసార్లు శాంపిళ్లను సేకరించినట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(NADA) తెలిపింది. ఈ ఏడాది జనవరి- మే మధ్య అతడికి మూడుసార్లు టెస్టులు శాంపిల్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. 2023లో ఇప్పటి వరకు పురుష, మహిళా క్రికెటర్లతో కలిపి మొత్తంగా 55 మంది నుంచి 58 శాంపిళ్లు సేకరించినట్లు నాడా తెలిపింది రోహిత్, కోహ్లిల సంగతేంటి? ఇందులో సగం వరకు మ్యాచ్‌లు లేని సమయంలోనే తీసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పరీక్షలు నిర్వహించకపోవడం విశేషం. హార్దిక్ నుంచి.. ఇక రోహిత్ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథ్య బాధ్యతలు తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా యూరిన్ శాంపిల్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో సేకరించారు. ఈ ఏడాదిలో నాడా అత్యధికసార్లు శాంపిల్స్ సేకరించిన జాబితాలో జడేజా ముందు వరుసలో ఉండగా.. 2021,2022లో రోహిత్‌ను అత్యధికంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. కోహ్లి అంటే అంతేమరి! అయితే, కోహ్లి నుంచి మాత్రం గత రెండేళ్లలో ఒక్కసారి కూడా శాంపిల్స్ తీసుకోకపోవడం గమనార్హం. ఇక మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు మాత్రమే డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 12న వారి నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు. జడ్డూకే అత్యధికసార్లు కాగా మొత్తంగా సేకరించిన 58 శాంపిల్స్‌లో ఏడు మాత్రమే బ్లడ్ శాంపిల్స్ ఉండగా.. మిగతావన్నీ యూరిన్ శాంపిల్స్ అని నాడా తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19, మార్చి 26, ఏప్రిల్ 26న జడేజాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. అదే విధంగా.. టీమిండియా పేసర్ నటరాజన్ నుంచి ఏప్రిల్ 27న యూరిన్, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు నాడా వెబ్సైట్లో వివరాలు పొందుపరిచింది. కాగా జడ్డూ ప్రస్తుతం అమెరికాలో విహరిస్తుండగా.. రోహిత్, కోహ్లి సెలవుల్లో ఉన్నారు. చదవండి: పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ... -
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితకు భారీ షాక్.. నాలుగేళ్ల నిషేధం
CWG Champion Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సంజితా చానుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) గట్టి షాకిచ్చింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నాలుగేళ్లు పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం వెల్లడించింది. కాగా నాడా నిర్ణయంతో సంజితాకు భారీ షాక్ తగలనుంది. జాతీయ క్రీడల్లో వెండి పతకం గెలిచిన ఆమె నుంచి మెడల్ వెనక్కి తీసుకోనున్నారు. ఇక గతేడాది నిర్వహించిన డోపింగ్ టెస్టులో సంజిత పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ డ్రొస్టానొలోన్ మెటాబొలైట్ ఆనవాలు లభించింది. నేషనల్ గేమ్స్ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించారు. అయితే, ఆ సమయంలో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజతం గెలిచింది. ఇప్పుడు ఆమెను దోషిగా తేలుస్తూ నాడా నిషేధం విధించడంతో ఆమె పతకాన్ని కోల్పోనుంది. అంతేగాక నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొననుంది. కాగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2014లో 48 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం గెలిచింది. 2018లో గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కాగా తనపై నిషేధం నేపథ్యంలో సంజితా చాను ఇంతవరకు స్పందించలేదు. చదవండి: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
జావెలిన్ త్రోయర్ శివ్పాల్పై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన భారత అగ్రశ్రేణి జావె లిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల శివ్‌పాల్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని 27వ స్థానంలో నిలిచాడు. 2019 ఆసియా చాంపియన్íÙప్లో అతను రజతం సాధించాడు. -
నాడో’ విధివిధానాలే పాటించనున్న ‘నాడా’
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ముందు క్రికెటర్ల డోప్ టెస్టు విధివిధానాలపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) స్పష్టతనిచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన జాతీయ డోపింగ్ నిరోధక కమిటీ (నాడో)తో కలిసి క్రికెటర్ల శాంపుల్స్ సేకరిస్తామని నాడా తెలిపింది. నమూనాల సేకరణలో ‘నాడో’ విధివిధానాలనే (ఎస్ఓపీ) ఇరు దేశాల డోపింగ్ అధికారులు పాటించనున్నారు. ఐపీఎల్ సీజన్–13 సెప్టెంబర్ 19నుంచి నవంబర్ 10వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో తమ డోపింగ్ నియంత్రణ అధికారుల్ని (డీసీఓ) నాడా యూఏఈ పంపనుంది. అక్కడ వీరంతా వారం పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అనంతరం ఒక కేంద్రాన్ని ఏర్పరచుకొని వీరు తమ విధుల్ని నిర్వర్తించనున్నారు. అధికారుల ప్రయాణ ఖర్చులతో పాటు వసతి, శాంపుల్స్ రవాణా ఖర్చులను ఈసారి నాడానే భరించనుంది. వీరితో పాటు మ్యాచ్ వేదికల్లో ఉండే స్థానిక డీసీఓలు కూడా శాంపుల్స్ సేకరించనున్నారు. ఈ శాంపుల్స్‌ను ఖతర్‌లోని దోహా లాబోరేటరీలో పరీక్షించనున్నారు. ఒక శాంపుల్ పరీక్షించినందుకుగానూ నాడా రూ. 26,184 (350 డాలర్లు) చెల్లించనుంది. ఐపీఎల్ పాలక మండలి టోర్నీపై తుది ప్రకటన చేస్తే మేం మా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతామని ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘మిగతా బీసీసీఐ ఈవెంట్లకు చేసినట్లే ఐపీఎల్‌కు కూడా డోప్ పరీక్షలు నిర్వహిస్తాం. మ్యాచ్ వేదికల్లో మా డీసీఓలు సిద్ధంగా ఉంటారు. మేం యూఏఈకి చెందిన నాడోతో కూడా ఒప్పందం చేసుకున్నాం. ఐపీఎల్ పాలక మండలి తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన తెలిపారు. గతంలో ఐపీఎల్‌కు స్వీడన్‌కు చెందిన ఐటీడీఎం సంస్థతో బీసీసీఐ క్రికెటర్లకు డోప్ పరీక్షలు నిర్వహించేది. శాంపుల్స్ సేకరణ, పరీక్షలు, రవాణా తదితర ఖర్చులన్నీ బీసీసీఐ స్వయంగా భరించింది. నాడా ఆధ్వర్యంలో క్రికెటర్లకు డోప్ పరీక్షలు జరగడం ఇదే తొలిసారి. -
గోమతి డోపీ... సస్పెన్షన్
న్యూఢిల్లీ: గత నెల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోమతి మరిముత్తు విజేత. సరిగ్గా నెలతిరిగేలోపే డోపీ. అప్పుడేమో స్వర్ణం తెచ్చింది. ఇప్పుడేమో భారత క్రీడారంగానికి మచ్చతెచ్చింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో మంగళవారం గోమతిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేశారు. తమిళనాడుకు చెందిన ఈ మహిళా రన్నర్ గత నెల 22న నిర్వహించిన 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలిచింది. దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సందర్భంగా 30 ఏళ్ల గోమతికి నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. ఆమె ‘ఎ’ శాంపిల్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా పట్టుబడింది. ఇప్పుడు మళ్లీ ‘బి’ శాంపిల్‌లోనూ పట్టుబడితే గరిష్టంగా ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి. నిజానికి ఆమె ఫెడరేషన్ కప్‌లోనే దొరికిపోయింది. మార్చిలో పాటియాలాలో జరిగిన ఈవెంట్ సందర్భంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమె రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రిపోర్టులో వచ్చింది. అయితే ‘నాడా’ ఈ విషయాన్ని సంబంధిత క్రీడా సంఘానికి తెలపడంలో విఫలమైంది. అçప్పుడే రిపోర్టు ఇచ్చివుంటే ఆసియా ఈవెంట్‌కు ఎంపిక చేయకుండా ఉండేవారమని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తెలిపింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌ను సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్‌గా నిలిచిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ నిర్ధారించారు. 2017లో మన్‌ప్రీత్ నాలుగు సార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైంది. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన జూలై 20, 2017నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్‌కు ఆమె అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా శాంపుల్ సేకరించిన నాటి నుంచి ఆమె అన్ని ఫలితాలు చెల్లవంటూ ‘నాడా’ ప్యానెల్ తీర్పునివ్వడంతో 2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్ కోల్పోనుంది. షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు మన్‌ప్రీత్ పేరిటే ఉంది. 2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్ కప్, ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఏకంగా నాలుగు సార్లు ‘పాజిటివ్’గా తేలింది. వీటిలో ఒక సారి మెటనొలోన్, మరో మూడు సార్లు డైమిథైల్‌బుటిలమైన్ వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు బయటపడింది. -
సెహ్వాగ్ ‘అప్పీల్స్ ప్యానెల్’ సభ్యుడే కానీ...
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బాధ్యత కలిగిన పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అతన్ని యాంటీ డోపింగ్ అప్పీల్స్ ప్యానెల్ (ఏడీఏపీ) సభ్యుడిగా నియమించింది. జస్టిస్ ఆర్.వి.ఈశ్వర్ నేతృత్వంలోని ఈ కమిటీలో సెహ్వాగ్‌తో పాటు అడ్వొకేట్ విభా దత్త, ఢిల్లీ మాజీ కెప్టెన్ వినయ్ లంబ, డాక్టర్ నవీన్ దంగ్, డాక్టర్ హర్ష్ మహాజన్ ఇతర సభ్యులు. ఈ మొత్తం ప్యానెల్లో ఏకైక సెలబ్రిటీ మాత్రం వీరూ ఒక్కడే. సామాజిక సైట్లలో సందర్భోచిత ట్వీట్స్, పోస్ట్‌ల్లో ఎంతో చురుగ్గా స్పందించే సెహ్వాగ్ ఎందుకనో ప్యానెల్ విచారణలకు మాత్రం గైర్హాజరవుతుంటాడు. గత నవంబర్‌లో ఏర్పాటైన ఈ ప్యానెల్... డోపింగ్‌లో పట్టుబడిన ఆటగాళ్ల నిషేధంపై విచారిస్తుంది. ‘ఇప్పటివరకు పలువురి ఆటగాళ్ల సస్పెన్షన్‌పై ఈ ప్యానెల్ విచారించింది. కానీ ఏ ఒక్కసారి వీరూ హాజరు కాలేదు. అలాగని ఆ పదవికి అతను రాజీనామా చేయలేదు’ అని నాడా అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే నెల 10, 14, 23 తేదీల్లో ఈ ప్యానెల్ విచారణ చేపట్టనుంది. మరి వీటికైనా అతను హాజరవుతాడో లేదో తెలియదని సదరు అధికారి సందేహం వ్యక్తం చేశారు. -
డోపింగ్ చట్టబద్దమా నేరమా?
విశ్లేషణ దేశంలో యాంటీ డోపింగ్ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో లేనందున క్రీడాకారులు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. తాత్కాలికంగా శక్తిని పెంచే ఉత్ప్రేరక మత్తు మందులను వాడి ఆటల్లో గెలిచే అవినీతి విస్తరిస్తున్నది. క్రీడాస్ఫూర్తితో జీవి తాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలనే నీతి సూత్రాలు చిన్నప్పటి పెద్దమాట. ఇప్పుడు ఏదో రకంగా గెలవడమే కర్తవ్యంగా క్రీడాకారులు భావిం చడం విచారకరం. దీన్ని డోపింగ్ అంటున్నారు. తప్పుడు ప్రేరకాల నేరాన్ని (డోపింగ్) అరికట్టడానికి మనం ఏ విధానాన్ని అనుసరిస్తున్నాం? మన విధా నం న్యాయంగా లేదని విమర్శిస్తూ దీపక్ సాంధూ అనే క్రీడాభిమాని ఒక ఆర్టీఐ దరఖాస్తులో విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రాలలోనూ ప్రేరకాల వాడకాన్ని కనిపెట్టి నిరోధించడానికి కఠిన విధానాలను అనుసరించడంలేదని ఆయన అంటున్నారు. ప్రపంచ ప్రేరక వ్యతిరేక సంస్థ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) 2015లో ఒక నియమావళిని రూపొందించింది. పరీక్షలు నిర్వహించి తొండి చేసి గెలవాలని చూసే మోసపూరిత ఆటగాళ్లను పట్టుకొని నిషేధించేందుకు ప్రమాణాలను నిర్దేశించింది. పరిశోధన, రసాయన మందుల పరి మాణం ఎంత ఉండాలని కూడా వివరించింది. క్రీడాకారుని శరీరంలో ప్రవేశించిన మందు పరిమాణాన్ని, అతనికి ప్రేరకం అందిన వనరులను కని పెట్టే ప్రక్రియను కూడా నిర్దేశించింది. మనదేశంలో ఈ ప్రేరకాల నిరోధక పద్ధతులు, ప్రయోగశాలలో కనిపెట్టి అరికట్టే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎందుకు లేవన్నది ప్రధానమైన ప్రశ్న. అందువల్ల జాతీయస్థాయి పోటీలకు చేరుకునే వారు అందుకు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. అంటే పరోక్షంగా జిల్లా, రాష్ట్ర ప్రాంతీయ స్థాయిలలో ప్రేరకాలు వాడి గెలిచేం దుకు మనదేశంలో వీలుంది. దాన్ని చట్ట వ్యతిరేకతగా భావించడానికి వీల్లేదు. అంటే ప్రేరకాల వాడకం జాతీయస్థాయి కింది అన్ని స్థాయిల్లో చట్టబద్ధం, ఆ తరువాత నేరం. మనకు జాతీయ ప్రేరక నిరోధక సంస్థ, జాతీయ ప్రేరక పరీక్షా ప్రయోగశాల ఉన్నాయి. కాని ప్రాంతీయస్థాయిలో ఈ ప్రయోగశాలలు లేక, అక్కడి క్రీడాకారులను పరీ క్షించే విధానం లేక, ప్రేరకాలు వాడే వారు జాతీయస్థాయి దాకా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాడా సంస్థ పరిశీలన ప్రకారం 2015, 2016 సంవత్సరాలలో పోటీనుంచి ఎంతమందిని తప్పించారు? ఎంతమందిని అనుమతించారు? ఎన్ని ప్రయోగాలు జరిపారు, ఎందరు ప్రేరకాలు తీసుకున్నారని తేలింది? వారిపై తీసుకున్న చర్యలు, నిషేధంవంటి వివరాలు కోరారు దీపక్ సాం«ధూ. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గానీ ఏ జవాబూ ఇవ్వలేదు. ప్రజాసమాచార అధికారి కొన్ని సంబంధిత పత్రాల ప్రతులు ఇచ్చినట్టు చెప్పారు. అయితే ఇచ్చిన 122 పేజీల పత్రాలలో ఒక్కటి కూడా ధృవీకరణ లేదని దీపక్ సాంధూ విమర్శించారు. ముంబై ఐబీబీఎఫ్ వారి ప్రజాసమాచార అధికారి సంతకం చేయలేదు, స్టాంపుకూడా కొట్టలేదు. క్రీడా సంస్థల జాబితా ఇచ్చారుగాని వారు 2015–16 సంవత్సరంలో నాడా సంస్థకు రాసిన ఉత్తరాల ప్రతులు ఇవ్వలేదని, 10.8.2017న తాను రాసిన లేఖకు జవాబు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సెక్షన్ 4(1) సి ప్రకారం కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేప్పుడు లేదా ప్రకటించేటప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ఆ విధానాలకు సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రజలముందు తమంత తామే ఉంచవలసి ఉంటుంది. ప్రాంతీయ రాష్ట్రస్థాయిల్లో అసలు ప్రేరకాల వాడకాన్ని నిరోధించే విధానమే ప్రభుత్వం రూపొం దించలేదు. దీనివల్ల జాతీయస్థాయికి వచ్చేదాకా అసలు ఈ పరీక్షే లేకుండా పోయింది. దీనివల్ల ప్రతి భావంతులైన, సహజంగా ఆడగల స్తోమతగల అర్హులైన ఆటగాళ్లు పోటీలో మిగిలే అవకాశమే లేదు. జిల్లాస్థాయిలో ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో చివరకు ప్రాంతీయ స్థాయిలో కూడా ఆటగాళ్లు ఈ ప్రేరకాల ప్రభావంతో ఆడి, సహజంగా ఆడే పోటీదారులపై గెలిచిపోతూ ఉంటారు. ఒకవేళ జాతీయ స్థాయిలో పట్టుబడినా అప్పటికే ఆ క్రీడాకారుడు సహజ క్రీడాకారులను వెనక్కితోసి జాతీయ స్థాయికి చేరి ఉంటాడు. కానీ నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఈ అనారోగ్యకరమైన విధానాన్ని మార్చి అన్ని స్థాయిలలో ప్రేరకాల వాడకాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలని కమిషన్ సిఫార్సుచేసింది. సమాచారం అభ్యర్థించిన దీపక్ సాంధూ అడిగిన విషయాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలనకు సమర్పించాలని, అందులో ఆయన కోరిన పత్రాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. దీపక్ సాంధూ దాఖలుచేసిన అన్ని సమాచార దరఖాస్తులకు సంబంధించిన దస్తావేజులను చూపాలని ఆదేశించింది. (దీపక్ సాంధూ వర్సెస్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఇఐఇ/ అౖఐN/అ/ 2017/140574 కేసులో 21.11.2017 న ఇచ్చిన తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
'క్రికెటర్ల సంగతి వాడా చూసుకుంటుంది'
న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ సంస్థ(వాడా) చూసుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో క్రికెటర్లకు డోపింగ్ పరీక్ష నిర్వహిం చేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖంగా లేని నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని వాడానే చూసుకుంటుందన్నారు. కాగా, క్రికెటర్లు ఓ ప్రైవేటు సంస్థతో డోపింగ్ పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందంటూ దేశంలోని అన్ని క్రీడాసంఘాలు నాడా పరీక్షలను ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 'క్రికెటర్లను డోపింగ్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనేది వాడాకు వదిలేస్తున్నాం. వాడా డోపింగ్ నిబంధనలకు లోబడే ఐసీసీ నమోదైంది. క్రికెటర్లకు డోప్ పరీక్షలు చేయాలా..వద్దా అనేది వాడా నిర్ణయించాలి. డోపింగ్ జరిగినప్పుడు ఆటగాళ్లు, కోచ్‌లే కాదు అభిమానులపై ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి సంస్థలోనూ డోపింగ్ లేకుండా చూసుకోవాలి. క్రికెట్ దానికి మినహాయింపు కాదు' అని రాథోడ్ అన్నారు. -
‘నాడా’ అప్పీల్ ప్యానెల్లో సెహ్వాగ్
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో అరుదుగా క్రికెటర్లకు లభించే అవకాశం భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దక్కింది. ‘నాడా’కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్– ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. అయితే ఆశ్చర్యకంగా 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించడం విశేషం. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు. -
తప్పిన గండం
► తీరం దాటిన నాడా ► బలహీనపడ్డ తుపాన్ ► కడలూరులో ఆనందం ► పలు చోట్ల వర్షాలు ► సాగరంలో మరో ద్రోణి నాడా గండం తప్పింది. బలహీనపడ్డ ఈ తుపాన్ శుక్రవారం కారైక్కాల్ వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నారుు. నాడా తీరం దాటడంతో కడలూరు జిల్లాలోని సముద్ర తీరవాసులు ఆనందంలో మునిగారు. ఈ ఏడాది ఓ గండం నుంచి తాము బయట పడ్డామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇక, సాగరంలో మరో అల్పపీడనం బయలు దేరే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వాతావరణ కేంద్రం ప్రకటించింది. -సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బల పడి తుపాన్‌గా మారడం, అది తమిళనాడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న సమాచారం ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. గత ఏడాది వలే ఈ ఏడాది ఎక్కడ మరో గండాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు, కడలూరు వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. నాడా పేరుతో తరుముకొచ్చిన ఈ తుపాన్ హఠాత్తుగా బలహీన పడింది. అరుునా, తీరం దాటే సమయంలో పెను ప్రళయం ఈదురు గాలుల రూపంలో తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరించారు. కడలూరు -నాగపట్నం మధ్యలో తీరం దాటనుండడంతో జాతీయ విపత్తుల నివారణ బృందాలు సైతం రంగంలోకి దిగారుు. నాడా తీరం దాటే వరకు ఉత్కంఠ తప్పలేదు. అరుుతే, కడలూరు-నాగపట్నం వైపుగా పయనిస్తూ వచ్చిన నాడా, గురువారం అర్ధరాత్రి సమయంలో మరింతగా బలహీన పడింది. అల్పపీడనంగా మారి తన పయన మార్గాన్ని మార్చుకుంది. దీంతో రాత్రంతా పలుచోట్ల సముద్ర తీరాల్లో మోస్తరుగా వర్షం పడింది. క్రమంగా తీరం సమీపించే కొద్ది నాడా ప్రభావం తగ్గుతూ రావడంతో ఉత్కంఠ వీడింది. కారైక్కాల్‌కు పదిహేను కిమీ దూరంలో ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ఎలాంటి ప్రభావం అన్నది చూపకుండా తీరం దాటింది. తుపాన్ గండం తప్పినట్టు వాతావరణ కేంద్రం ప్రకటనతో కడలూరు తీర వాసుల్లో ఆనందం రెట్టింపు అరుుంది. కడలూరులో ఆనందం: ఏటా కడలూరు తుపాన్ రూపంలో గండాల్ని చవిచూస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. అటు పుదుచ్చేరిలో ప్రకంపనలు బయలు దేరినా, ఇటు తమిళనాడులో వాన గండాలు నెలకొన్నా, తొలుత విలవిలలాడే ప్రదేశం కడలూరే. కరువుతో తల్లడిల్లినా, గండాలతో ఇక్కడి ప్రజలు కొట్టుమిట్టాడక తప్పదు. ఏటా ఏదో ఒక ముప్పు తమకు తప్పదన్నట్టుగా ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా నాడా సైతం కడలూరు - నాగపట్నం మధ్యలో తీరం దాటనున్న సమాచారం ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక, అధికార వర్గాల్ని పరుగులు తీరుుంచింది. అరుుతే, గండం తప్పిందన్న సమాచారం అక్కడి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసించడం గమనార్హం. మరో ద్రోణి: నాడా తీరం దాటినా, అల్పపీడనంగా మారిన ఆ ప్రభావంతో సముద్ర తీరాల్లో తెరపించి తెరపించి మోస్తరుగా వర్షం పడుతోంది. చెన్నైలో కాసేపు వర్షం, మరి కాసేపు భానుడు ప్రత్యక్షం, ఇంకాసేపటికి ఆకాశం మేఘావృతం అన్నట్టుగా శుక్రవారం వాతావరణం నెలకొంది. గురువారం అర్ధరాత్రి మహాబలిపురంలో 11సెంమీ, చోళవరంలో ఆరు సెంమీ వర్షం అత్యధికంగా నమోదైంది. కాగా, అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనుంది. ఈ ద్రోణి ప్రభావం ఏమిటో, పయన మార్గం ఎలా ఉంటుందోనన్నది ఆదివారం నాటికి తేలనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర వాతావరణ అధికారులు ఢిల్లీలో ప్రకటించారు. ఈ అల్పపీనడం బల పడ్డ పక్షంలో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా కదిలేందుకు ఆస్కారం ఎక్కువే. ఇందుకు కారణం అండమాన్ సమీపంలోని నెలకొనే అల్పపీడనాలు అత్యధికంగా ఎంచుకున్న మార్గాలు ఈ రెండే. ఇక, నాడా ప్రభావం తగ్గినా, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూనే ఉన్నందున, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వర్గాలు సూచిస్తున్నారుు. శనివారం సాయంత్రం తర్వాత వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లొచ్చని సూచించే పనిలో పడ్డారు. -
తీరం దాటిన నాడా తుపాను
చెన్నై : తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రను వణికించిన నాడా తుఫాను కారైకాల్ వద్ద శుక్రవారం ఉదయం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరి ప్రాంతాల్లో 4 సెం.మీ.ల మేర వర్షం పడే అవకాశముందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో కూడా తేలికపాటి వర్షాలు పడనుందని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నాడా తుపాను తీరం దాటినప్పటకీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. -
నాడా అలర్ట్!
► నేడు తీరం దాటనున్న తుపాన్ ►బలహీనపడినా, గాలితో ముప్పే ►కడలూరుపైనే గురి ►రంగంలోకి రెస్క్యూ టీం ►రాష్ట్రంలో మోస్తరుగా వర్షం! ►భారీ గండం తప్పినట్టేనా..? నాడా తుపాన్ శుక్రవారం కడలూరు - వేదారణ్యం మధ్యలో తీరం దాటనుంది. తుపాన్ బలహీన పడ్డా, తీరం దాటేసమయంలో ఈదురు గాలుల రూపంలో భారీ ముప్పు తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. కడలూరు, నాగపట్నంలలో పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంను రంగంలోకి దించి ఉన్నారు. ఇక, ఈ ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరుగా వర్షం పడింది. సాక్షి, చెన్నై : బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారిన విషయం తెలి సిందే. ఈ తుపాన్‌కు నాడా అని నామకరణం చేశా రు. దీని ప్రభావం అత్యధికంగా రాష్ట్రంలోని సము ద్ర తీర జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, కార్యదర్శి చంద్రమోహన్ల నేతృత్వంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి అధికార వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆయా జిల్లాల్లోని పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. సహాయక బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించారు. ఏదేని ప్రళయం చోటు చేసుకున్న పక్షంలో బాధితుల్ని ఆదుకునేందుకు తగ్గట్టుగా సర్వం సిద్ధం చేశారు. ప్రత్యేకంగా పునరావస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఏదేని ముప్పు వాటిల్లినా తక్షణం సమాచారం అందించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. తుపాన్ తీరం దాటనున్న కడలూరు, నాగపట్నం జిల్లాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు తగ్గట్టు సర్వం సిద్ధం చేశారు. తుపాన్ భయంతో తొమ్మిది జిల్లాల్లో స్కూళ్లకు సైతం శుక్రవారం వరకు సెలవు ప్రకటించేశారు. అరుుతే, తుపాన్ ప్రభావం రాష్ట్రంలో కనిపించలేదని చెప్పవచ్చు. గురువారం భారీ వర్షాలు పడవచ్చని సర్వత్రా ఎదురు చూసినా, అందుకు భిన్నంగా పరిస్థితి మారింది. మోస్తరుగా వర్షం: చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు సముద్ర తీరాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో జనంలో మరో మారు భయం పుట్టుకుంది. గత ఏడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షం పెను ప్రళయానికి దారి తీయడం ఇందుకు కారణం. అరుుతే, భారీ వర్షం అని చెప్పడం కన్నా, మోస్తరుగా వర్షం తెరపించి తెరపించి పడడంతో సర్వత్రా ఊపిరి పీల్చుకున్నారు. కడలూరు, నాగపట్నం, తంజావూరుల్లో కాసేపు భారీ వర్షం పడ్డా, తదుపరి చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూ వచ్చింది. అత్యధికంగా వేదారణ్యంలో ఐదు సె.మీ వర్షం పడింది. చెన్నైలో అప్పుడప్పుడు తెరపించి తెరపించి వర్షం పడ్డా, మధ్యాహ్నం కాసేపు భానుడు ప్రత్యక్షం కావడంతో ఇక వర్షం కనుమరుగైనట్టేనా అన్న ప్రశ్న బయలుదేరింది. సాయంత్రానికి మళ్లీ ఆకాశం మేఘావృతంగా మారింది. అర్ధరాత్రి సమయంలో, శుక్రవారం వర్షం పడొచ్చన్న సంకేతాలు ఉండడంతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఇక, సాగరంలో కెరటాల జడీ మరీ ఎక్కువగా ఉండడంతో సముద్ర తీరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బలహీన పడ్డా...ముప్పే : బుధవారం తుపాన్‌గా మారిన ద్రోణి గురువారం మధ్యాహ్నం కాస్త బలహీన పడింది. అందువల్లే వర్షం తీవ్రత తగ్గినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. తుపాన్ బలహీన పడ్డా, గాలి తీవ్రత కారణంగా తీరం దాటే సమయంలో ముప్పు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. దీంతో తీరం దాటనున్న కడలూరు నుంచి నాగపట్నం వరకు అప్రమత్తంగా వ్యవహరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సమాచార వ్యవస్థకు ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తల్ని తీసుకున్నారు. అన్ని చోట్ల స్పెషల్ స్క్వాడ్‌స ద్వారా కంట్రోల్ రూంకు ఎప్పటికప్పుడు సమాచారాలు అందే విధంగా పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం వేకువ జామున ఈ తుపాన్ తీరం దాటినా, రెండు రోజుల పాటు చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. నాడా తుపాన్ తీరం దాటే క్రమంలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికతో కడలూరు, నాగపట్నం జిల్లాల ప్రజల్లో ఆందోళన బయలు దేరింది. -
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
రియో డి జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ రోజు జరగనున్న పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో 'వాడా' సవాల్ చేసింది. కుట్ర కారణంగానే అతడు డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది. రియో ఒలింపిక్స తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. సీఏఎస్ తీర్పు దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆటగాడిపై చివరి నిమిషంలో నిషేధం విధించడం పట్ల డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బీబీ శరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
టెన్షన్ వదిలేయ్.. పతకం 'పట్టు' : ప్రధాని మోదీ
డోపింగ్ వివాదం నుంచి బయటపడి రిలాక్స్ అవుతున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డోపింగ్ వివాదం, కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడ్డ తర్వాత రియోకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రధాని మోదీని నర్సింగ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని తన పరిస్థితిని వివరించాడు. మోదీతో భేటీ తర్వాత నర్సింగ్ మీడియాతో మాట్లాడారు. మోదీ తనతో మాట్లాడుతూ... 'ఇక ఉత్సాహంగా ఒలింపిక్స్ లో పొల్గొనాలి. టెన్షన్ పడవద్దు.. కుస్తీలో పట్టుపట్టి ఒలింపిక్స్ లో పతకం పట్టుకురావాలి' అని తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారని నర్సింగ్ వెల్లడించాడు. అంతా మంచి జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా తాము చూస్తామని మోదీ ఉత్సాహాన్ని నింపారని నర్సింగ్ తెలిపాడు. ఒలింపిక్స్ లో పాల్గొంటానని తాను బలంగా విశ్వసించానని, దేశం కోసం కచ్చితంగా పతకంతో తిరిగొస్తానని ధీమా వ్యక్తంచేశాడు. డోపింగ్‌లో పట్టుబడిన నర్సింగ్ యాదవ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్కు లైన్ క్లియర్ అయింది. -
కనీసం టీ కూడా తాగడం లేదు..
వారణాసి:గత కొన్ని రోజులుగా డోపింగ్ వివాదంలో చిక్కుకున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు ఉపశమనం లభించడంతో వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గత నెల్లో నర్సింగ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇవ్వడంతో అతని నివాసం సందడిగామారింది. పలువురు అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోగా, నర్సింగ్ యాదవ్ తల్లి భూల్నా దేవి ఆనందం వ్యక్తం చేశారు. నర్సింగ్ పై వచ్చిన డోపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేసిన తల్లి.. ఈ వివాదం అనంతరం తన కుమారుడు కనీసం టీ కూడా తాగడం లేదన్నారు. నర్సింగ్ జీవితంలో అతి పెద్ద దుమారం రేపిన డోపింగ్ ఘటన తరువాత అతను దాదాపు అన్ని అలవాట్లను వదిలేసుకున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నర్సింగ్ కు డోపింగ్ వివాదంలో క్లీన్ చిట్ ఇస్తూ నాడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతను రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది. -
రెజ్లర్ నర్సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో ఇరుక్కున భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది . గత కొన్ని రోజులుగా నర్సింగ్ చుట్టూ అలుముకున్న డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టింది. డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ కు క్లీన్ చిట్ ఇస్తూ నాడా తుది నిర్ణయం తీసుకుంది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు అవకాశం కల్పించింది. దీంతో రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ పాల్గొనేందుకు దాదాపు లైన్ క్లియరయ్యింది. ఈ మేరకు తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్ర ప్రకటించిన నాడా.. డోపింగ్ వివాదంలో నర్సింగ్ తప్పిదం లేదని పేర్కొంది. ఎవరో చేసిన కుట్రకు నర్సింగ్ బలయ్యాడని స్పష్టం చేసింది. ఈ విషయంలో అసలు నర్సింగ్ ప్రమేయం లేదని నమ్మిన కారణంగానే అతనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు నాడా డైరెక్టర్ నవీన్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కి నాడా నివేదించనుంది. గత నెల్లో నర్సింగ్ పై డోపింగ్ వివాదం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గత నెల 5న హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్కు డోపింగ్ పరీక్ష నిర్వహించగా అతను నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలింది. అయితే దీనిపై నర్సింగ్ పలు ఆరోపణలు చేశాడు. తనను కావాలనే కుట్రలో ఇరికించారని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా నాడాను ఆశ్రయించాడు. ఇప్పటికే నర్సింగ్ యాదవ్ వాదనలను పలుమార్లు విన్న నాడా చివరకు అతనికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డోపింగ్ వివాదాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ)కూడా సీరియస్ గా తీసుకుని నర్సింగ్ కు మద్దతుగా నిలిచింది. -
నర్సింగ్పై నిర్ణయం రేపు
న్యూఢిల్లీ: నిర్దోషిగా తేలితే రియో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఆశపడుతున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కోరిక తీరేలా కనిపించడం లేదు! అతని భవిష్యత్తు తేల్చాల్సిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తీర్పును మరోసారి వాయిదా వేసింది. నర్సింగ్పై తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ ప్రకటించారు. -
తీర్పు ఎప్పుడు వస్తుందో!
స్పష్టత ఇవ్వని ‘నాడా’ న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ ఉదంతంపై విచారణ పూర్తి చేసిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పు విషయంలో మాత్రం ఏటూ తేల్చడం లేదు. శని లేదా సోమవారాల్లో తీర్పు వెలువరిస్తామని చెప్పినా ఇందులోనూ స్పష్టత కరువైంది. ఈ విషయంపై నాడా, నర్సింగ్ తరఫు న్యాయవాదులను సంప్రదించినా ప్యానెల్ తీర్పు ఎప్పుడు ఇస్తుందో తమకూ తెలియదని చెప్పారు. దీంతో నర్సింగ్ రియో ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ఈ విషయంపై రెజ్లింగ్ సమాఖ్యకు కూడా ఎలాంటి సంకేతాలు అందడం లేదు. ఒలింపిక్ విలేజ్‌కు భారత్ అథ్లెట్లు రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ కోసం ఇప్పటికే బ్రెజిల్‌కు వచ్చిన భారత అథ్లెట్లు... ఒలింపిక్ విలేజ్‌కు చేరుకుంటున్నారు. భారీ భారత బృందంలో ఇప్పటికే సగం మంది ఇక్కడికి చేరుకున్నారు. అథ్లెట్లు ముందుగా రావడం వల్ల ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడుతున్నారని చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా అన్నారు. ఆగస్టు 2న భారత అథ్లెట్లకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. -
నర్సింగ్కు క్లియరెన్స్ వస్తే..!
న్యూఢిల్లీ: డోపింగ్ టెస్టులో పడిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై ఇంకా విచారణ కొనసాగుతోందని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) స్పష్టం చేసింది. దీనిలో భాగంగా నర్సింగ్ కు మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒకవేళ నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి నర్సింగ్ యాదవ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే అతన్ని రియోకు పంపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే నర్సింగ్ యాదవ్‌కు క్లియరెన్స్ వచ్చిన పక్షంలో అతన్ని పంపించాలా? లేదా? అనేది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుందన్నారు. 'ప్రస్తుతానికి 74 కేజీల విభాగంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాను పంపించేందుకు సిద్ధమయ్యాం. మరోవైపు నర్సింగ్ కేసును కూడా నాడా విచారిస్తోంది. అతనికి మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నారు. నర్సింగ్ కు క్లియరెన్స్ వచ్చి అతన్నే పంపాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ భావిస్తే ఆ రకంగానే చర్యలు తీసుకుంటాం. ఇందుకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐఓసీ అనేది కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాంటింది. మేము సదుపాయాల్ని సమకూర్చే వాళ్ల మాత్రమే. డబ్యూఎఫ్ఐ రానాను పంపాలని నిర్ణయించింది కాబట్టి ఆ సమాచారాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు తెలియజేశాం'అని రాజీవ్ మెహతా తెలియజేశారు. క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాకు రియోకు పంపేందుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. -
నర్సింగ్పై కుట్రలో సుశీల్ హస్తం!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ భారత డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోప్ టెస్టుల్లో పట్టుబడిన తర్వాత తెరమీదకు కొత్త అంశాలు వస్తున్నాయి. డోప్ టెస్టులో పట్టబడ్డ నర్సింగ్ సోదరుడు వినోద్ యాదవ్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించాడు. ఇదంతా మరో రెజ్లర్ సుశీల్ కుమార్, అతని సన్నిహితులు పన్నిన కుట్ర అని ఆరోపించాడు. సోనెపాట్ లోని సాయ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న నర్సింగ్ తినే ఆహారంలో కావాలనే సుశీల్‌కు సంబంధించిన వ్యక్తులు ఏదైనా కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. సాయ్ సెంటర్లో వంటలు చేసే వ్యక్తి సుశీల్ కుమార్ ప్రాక్టీస్ చేసే బృందానికి చెందిన వాడని, దీనిపై సుశీల్ హస్తం ఉంటుందని జాతీయ మీడియాకు వెల్లడించాడు. ఈ కుట్ర పన్నింది కచ్చితంగా సుశీల్ తరఫు వ్యక్తులేనని మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని నర్సింగ్ సోదరుడు వినోద్ పేర్కొన్నాడు. మరోవైపు నర్సింగ్ స్థానంలో మరో రెజ్లర్ ప్రవీణ్ రాణాను రియోకు పంపించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ నిర్ణయించారు.