New laws
-
వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యలు వివాదాస్పదం.. వెనక్కి తగ్గిన కంగనా
వ్యవసాయ చట్టాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వెనక్కి తగ్గారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా అభిప్రాయాలు, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఈ మేరకు కంగనా ఓ వీడియో విడుదల చేశారు.‘నా వ్యాఖ్యలు చాలా మందిని నిరాశకు గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి ఉమ్మడి బాధ్యత’’ అని కంగనా పేర్కొన్నారు. Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind 🇮🇳 pic.twitter.com/wMcc88nlK2— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024కాగా మండి ఎంపీ కంగనా రనౌత్.. రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు రైతులే స్వయంగా డిమాండ్ చేయాలని కోరారు. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి. వీటి కోసం రైతులే డిమాండ్ చేయాలి.ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల ఆందోళనల వల్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. రైతుల మేలు కోసమే ఈ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నా’ కంగనా పేర్కొన్నారు. కంగన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కంగన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. -
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన దురుసు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలు తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చెయ్యాలని తెలిపారు.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండిలో ఆమె మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని కోరారు. ‘ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ మూడు వ్యవసాయ చట్టాలు తిరిగి అమలు చేయాలి. ఇందుకు రైతులు స్వయంగా డిమాండ్ చేయాలి. ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్థంభం. వారి ప్రయోజనాల కోసం చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ అది జరగనివ్వదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. ‘మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దీనిని ఎప్పటికీ అనుమతించం’ అని పేర్కొన్నారు.కాగా 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు. ఆందోళనల్లో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అనంతరం ఈ నేపథ్యంలో తమ నిరసనలను రైతులు నిలిపివేశారు. -
ఎవరిని మభ్యపెట్టాలని ఈ చట్టాలు?
కొత్త న్యాయ చట్టాలను తీసుకు వచ్చామని ఆర్భాటంగా ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి: ఆ చట్టాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందా లేక పాత చట్టాల నుంచి వివిధ అంశాలను స్వీకరించిందా? ఎందుకంటే పేరుకు కొత్త చట్టాలే కాని వీటిలో అధిక భాగాలు పాత చట్టాల నుంచి కాపీ కొట్టినవేనని న్యాయశాస్త్ర కోవిదులు చాలా మంది ప్రకటిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ తరుణబ్ ఖైతాన్ ఈ చట్టాలను ‘టర్ట్ ఇట్ ఇన్’ అనే టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించినప్పుడు బయటపడిన అంశాలు ఈ సందర్భంగా గమనార్హం.1. భారతీయ న్యాయ సంహిత –2023లోని 83 శాతం అంశాలు ఇండియన్ పీనల్ కోడ్ 1860 (పాత బ్రిటిష్ చట్టం) నుంచి కాపీ, పేస్ట్ చేసిందే.2. భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023ను అంతకు ముందున్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్–1973 నుండి 82 శాతం తీసుకున్నదే.3. భారతీయ సాక్ష్య చట్టం–2023 అంతకుముందు అమ లులో ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ చట్టం–1872 నుంచి 82 శాతం మక్కీకి మక్కీ కాపీ కొట్టినదే.ఈ సందర్భంగా కాపీ కొట్టడం గురించి కొంత వివరణ చూద్దాం. నల్సార్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్న ప్పుడు వేపా పార్థసారథి (వీపీ సారథి) అనే అద్భుతమైన ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన సాక్ష్య చట్టంలో ప్రముఖ నిపుణుడు. మొత్తం చట్టం ఒక్కో అక్షరం, పదం, కామా, ఫుల్స్టాప్ వంటి అర్థాలను చక్కగా వివరించేవారు.ఓసారి జడ్జీలకు క్లాస్ చెబుతున్నారు. ‘సాక్ష్య చట్టంలో ఇలా ఉంది సార్’ అని ఓ వ్యాఖ్యానం ప్రతిపాదించారు ఓ జడ్జిగారు. వారు చాలా బాగా అధ్యయనం చేసిన జడ్జి గారు. అప్పుడు సారథిగారు ‘మీరు ఈ కామా గురించి చూడాలి. అందువల్ల దాని అర్థం మారిపోతుంది’ అని వివరించడంతో జడ్జి అవాక్కయ్యారు. అంత సునిశితంగా పరిశీలించే సారథిగారు మన పాత నేర చట్టాలపై తన అభిప్రాయాన్ని ‘పాతదే అయినా మన సాక్ష్య చట్టాన్ని 90 శాతం సవరించాల్సిన అవసరం లేదు, కొన్ని మంచి సంస్క రణల అవసరం ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. ప్రతి పాఠాన్నీ సున్నితమైన హాస్యంతో కలిపి అద్భుతంగా క్రిమినల్ లా సూత్రాలను చెప్పేవారాయన.ఆయన కాపీ కొట్టే విషయంలో ఒక జోక్ చెప్పేవారు. ఓ విద్యార్థికి ఓ అంశం మీద 5 పేజీల వ్యాసం రాయాలని పరీక్ష పెట్టారు. ఆ విద్యార్థి ఎవరిదో పరిశోధనాపత్రంలోని విషయాలను చక్కగా దించేశాడు. కానీ పరిశోధనా పత్రం రాసిన స్కాలర్ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఆ పరీక్ష పేపర్ దిద్దుతున్న ప్రొఫెసర్ అది తన వ్యాసాన్ని కాపీ కొట్టి రాసిన జవాబుగా గుర్తించారు. ప్రశ్నకు 10 మార్కులకు గాను 8 మార్కులు ఇచ్చారు. విద్యార్థి ‘సార్ నేను ఫెయిల్ అవుతాననుకున్నాను. మీరు 8 మార్కులు ఇచ్చారే ఆశ్చర్యం’ అన్నాడా విద్యార్థి క్లాసులో. అందుకు ‘నిజమే, అప్పట్లో మా ప్రొఫెసర్ నే రాసిన ఈ జవాబుకు చాలా తక్కువగా 4 మార్కులే ఇచ్చారు. ఇప్పటికీ నేనే కరెక్టు రాశానని నా నమ్మకం. అదే రాసిన నీకు నేను 8 మార్కులు ఇచ్చాను’ అన్నారట ప్రొఫెసర్. దీంతో విద్యార్థి నోరెళ్ల బెట్టా డట. అటువంటి పార్థసారథిగారు ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన అభిప్రాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి.ఇండియన్ ఎవిడెన్స్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేనే లేదనీ, ఒకవేళ ఎవరైనా మార్చితే దాన్ని ప్రభుత్వాలు దుర్మార్గం చేయడానికే వాడతాయనీ ఆయన అనేవారు. ఎవిడెన్స్ చట్టాన్ని నేను కూడా బోధించే వాడిని. అందుకే నేను కొన్ని మార్పులు, సూచనలు చేశాను. సారథిగారు ఒక రోజంతా చదివి ఆలోచించి, మరునాడు నల్సార్‌లో నా గదికి వచ్చి, ‘మీరన్నది కరెక్టే, కొన్ని మార్పులు చేయడం అవసరమే’ అని ఒప్పుకోవడమే కాకుండా, తరువాత వచ్చే ఎడిషన్‌లో ‘ప్రొఫెసర్ శ్రీధర్ సలహా ఇచ్చారు’ అనిముందుమాటలో నా పేరు రాశారు. ఎంత గొప్పవ్యక్తి ఆయన! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకరి అభిప్రాయమో, లేక పుస్తకం, వ్యాసాల్లో ఉన్న విషయాలనో మనం ఉపయోగించి ఏమైనా రాసేటప్పుడు తప్పనిసరిగా సోర్స్‌ను ఉటంకించడం కనీస ధర్మం. ప్రొఫెసర్ పార్థసారథి చేసింది అదే. ఇంగితం ఉన్న ఎవరైనా చేయాల్సిందీ అదే!పాత బ్రిటిష్ కాలపు క్రిమినల్ చట్టాలను పూర్తిగా సంస్కరించుకునే బంగారంలాంటి అవకాశాన్ని ప్రభుత్వం, పార్లమెంట్, ఎంపీలు పూర్తిగా వదిలేసుకున్నారని మా నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థి... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ప్రొ‘‘ అనూప్ సురేంద్రనాథ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఏమర్థమవు తోంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ కొత్త నేర చట్టాలు?– మాడభూషి శ్రీధర్. వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ఇవి చదవండి: Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు! -
ఉన్నవాడికి చుట్టాలు... పేదవానికి కష్టాలు!
కొత్త నేర చట్టాలను అనుసరించి మొత్తం 90 రోజులు నిందితులను కస్టడీలో పెట్టవచ్చు. పోలీసు కస్టడీ, కోర్ట్ కస్టడీల పేరుతో లాకప్‌లో లేదా జైళ్లలో బంధించేందుకు పోలీస్, న్యాయ వ్యవస్థలకు వీలు కల్పిస్తున్న ఈ చట్టాలు సాధారణ పౌరుల పాలిట శాపాలే అనడం అతిశయోక్తి కాదు. పోలీసులు తలచుకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సకల అధికారాలనూ కట్టబెడుతున్న ఈ చట్టాల వల్ల... ధనవంతులకు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. వారు లంచాలు ఇవ్వగలుగుతారు. ఖరీదైన లాయర్లను నియమించుకొని బెయిల్ పొందగలుగుతారు. ష్యూరిటీలు ఇవ్వగలుగుతారు. కొత్త చట్టాల పుణ్యమా అని రాజకీయనాయకుల ప్రమేయం, డబ్బులు... పోలీస్ కేసుల వ్యవహారంలో మునుపటి కన్నా ఎక్కువ ప్రాము ఖ్యాన్ని సంతరించుకుంటాయి. ఒక వ్యక్తి నేరం చేశాడనే అభియోగంతో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తీరికగా నేర ఆరోపణ చేసి కోర్టుకు పంపిస్తారు. ఆరోపణలపై విచారణకు ఎన్నేళ్లయినా పట్ట వచ్చు. చివరికి ఆరోపించిన నేరం రుజువు కాకపోవచ్చు. అప్పటివరకూ జైల్లో ఉన్న ఆ పౌరుని స్వేచ్ఛ ఖరీదెంత అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఒక వేళ నేరస్థుడు అని కోర్టు తీర్పు ఇస్తే ఇక అప్పీళ్లలో గెలవడం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. వకీళ్లకు సంబంధించిన డబ్బు, లంచగాళ్లను మేపడానికి చెల్లించడాలు ఉండనే ఉంటాయి. పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌తో పోల్చితే కొత్త చట్టాలు (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023) ప్రమాదకరమైనవి. పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973 కింద ‘అత్యధికంలో అధికం’ 15 రోజులకు మించి ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదు. ఇది పార్లమెంట్ చేసిన చట్టం కాదు. అంతకుముందు రాజ్యాంగ నిర్ణాయక సభ 1950లోనే నిర్ణయించిన విషయం. రాజ్యాంగం మూడో భాగంలో అతి కీలకమైన పౌరుని ప్రాథమిక హక్కుల గురించిన వివరాలు ఉన్నాయి. ఇందులో 21వ ఆర్టికల్ జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛల ప్రాముఖ్యాన్ని చెబితే... 22వ ఆర్టికల్ అరెస్ట్, డిటెన్షన్లకు సంబంధించిన వివరాలను పేర్కొంటోంది. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల లోపే కోర్టు ముందు కచ్చితంగా హాజరు పరచాలని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఈ రాజ్యాంగ నిబంధనలను అనుసరించి చేసిన చట్టాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇలా 24 గంటలని ప్రత్యే కంగా పేర్కొనడానికి కారణం... పోలీసుల కస్టడీలో దర్యాప్తు (ఇన్వెస్టి గేషన్)కు ఒక్క 24 గంటలు చాలని భావించడమే! సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను గమనిస్తే ఇదే సంగతి బోధపడుతుంది.అయితే 24 గంటలకు మించి కస్టడీలో ఉంచుకోవడానికి పోలీసులు రకరకాల కారణాలు చెప్పడానికీ, ఏ కారణాలూ ఇవ్వకుండానే అరెస్టు చేసి కస్టడీ చేసేందుకూ పోలీసులకు ఈ నేర చట్టాలు విపరీతమైన అధికా రాలను ఇస్తున్నాయి. సింపుల్‌గా ‘తరువాత చూద్దాంలే, ముందు కస్టడీలో పడేయండి’ అనే అధికారం ఇస్తున్నాయి. ఎంపీలు, డబ్బున్నవారు, ఎమ్మె ల్యేలు, మంత్రుల పలుకుబడి ఉన్నవారు ఈ కస్టడీల నుంచి బయట పడిపోగలుగుతారు. కానీ కనీసం జరిమానా కూడా కట్టలేక, బెయిల్ కండిషన్ల కింద డబ్బు చెల్లించలేక ఎంతోమంది పేద, మధ్యతరగతి పౌరులు జైలు పాలు అయ్యేవారే అధికం అని ఈ చట్ట నిబంధనల వల్ల అర్థమవుతుంది.భారతీయ సురక్ష సంహిత కింద 15 రోజుల నుంచి, విడి విడిగా 40 రోజులు, 60 రోజుల దాకా; ఇంకా కొన్ని కేసుల్లో 90 రోజులూ జ్యుడిషియల్ కస్టడీ (అంటే కోర్టు సమీక్షించే కస్టడీ) పెంచడానికి చట్టాన్ని తయారు చేశారు. పోలీసు కస్టడీ అయితే ఇంకా మరీ ఇబ్బందికరమైనది. పోలీసులు కస్టడీలో ఉంచే కాలం 15 రోజుల నుంచి 60 రోజుల దాకా పెరుగుతుంది. మొదట 15 రోజుల దాకా కస్టడీలో పడే స్తారు. దర్యాప్తు చేయడానికి సమయం చాలలేదని... కస్టడీ సమయాన్ని పొడిగించమని కోరితే సురక్ష సంహిత నియమాల ప్రకారం మరో 15 రోజులు కస్టడీకి పంపుతారు. ఇలా 60 రోజుల దాకా కస్టడీలో ఉంచే అవకాశాన్ని కొత్త చట్టాలు ఇస్తున్నాయి. 10 ఏళ్ల జైలు శిక్ష విధించగలిగిన సెక్షన్ కింద అరెస్ట్ చేస్తే 40 రోజుల దాకా పోలీసులు కస్టడీలో పెట్టుకునే అధికారం పోలీసులకు దఖలుపడుతోంది. పోలీసులకు అపరిమిత అధికారాలు ఇచ్చి, పౌర హక్కులకు భంగం కలిగే అవకాశాన్ని కొత్తచట్టాలు ఇస్తున్నాయనేది మొత్తంగా మనం అర్థం చేసుకోవలసిన అంశం.మాడభూషి శ్రీధర్వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా అని ప్రశ్నించారు. లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపారు.నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని కోరారు. దీంతోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని హె చ్చరించారు. -
మూడేళ్లలో న్యాయం
న్యూఢిల్లీ: సోమవారం నుంచి అమల్లోకి వచి్చన నూతన నేర చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైన మూడేళ్లలోపు కోర్టులో న్యాయం అందేలా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వలస పాలనాకాలం నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) చట్టాలను అమల్లోకి తెచి్చన సందర్భంగా సోమవారం ఢిల్లీలో అమిత్‌షా పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త చట్టాల అమలుతో నేరాలు తగ్గుముఖం పడతాయి. నూతనచట్టాల కింద 90 శాతం వరకు నేరాలు నిరూపించబడి దోషులకు శిక్షలుపడతాయి. జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులపై పోలీసుల ఆన్లైన్ రిజి్రస్టేషన్, ఎస్ఎంఎస్ తదితర విధానంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించి ఘటనాస్థలిని వీడియో తీయడం, బాధితురాలి ఇంటి వద్ద వాంగ్మూలం తీసుకోవడం వంటి ఎన్నో నిబంధనలను కొత్త చట్టాలు తీసుకొచ్చాయి’’ అని షా చెప్పారు. 10 నిమిషాలకే కొత్త చట్టం కింద కేసు ‘‘కొత్త చట్టాలు సోమవారం అర్ధరాత్రి అమల్లోకి వచి్చన 10 నిమిషాలకే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలో కొత్త చట్టం కింద బైక్ దొంగతనం కేసు నమోదైంది. వలసపాలనాకాలంలో బ్రిటిష్ వాళ్లు నేరాలపై శిక్షకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మేం కొత్త చట్టాల ద్వారా న్యాయానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ–ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాల ద్వారా నేరాలపై ఫిర్యాదును మరింత సులభతరం చేశాం. సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరగా న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థకూ కాలపరిమితిని విధించాం. చిన్నారులు, మహిళలపై నేరాలను సున్నితమైనవిగా పరిగణించాం. కొత్త చట్టం ప్రకారం ఈ కేసుల్లో ఏడు రోజుల్లోపు దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సిందే. నేర కేసుల్లో దర్యాప్తు ముగిసిన 45 రోజుల్లోపు కేసు తీర్పు చెప్పాల్సిందే. తొలిసారిగా ఒక కేసు విచారణ మొదలైన రోజు నుంచి 60 రోజుల్లోపు అభియోగాలు దాఖలుచేయాలి.511 సెక్షన్లను 358కి కుదించాం ఒకేలా ఉన్న వేర్వేరు సెక్షన్లను కలిపేశాం. దీంతో 511 సెక్షన్లకు బదులు 358 సెక్షన్లు మిగిలాయి. ఉదాహరణకు 6వ సెక్షన్ నుంచి 52వ సెక్షన్‌లోని నిబంధనలను ఒకే సెక్షన్లోకి మార్చారు. న్యాయం, పారదర్శకత, నిష్పాక్షికత లక్ష్యంగా ఈ మూడు చట్టాలను తెచ్చాం’’ అని షా వివరించారు. -
సెక్షన్లు మారినయ్.. మావల పీఎస్‌లో తొలి కేసు..!
సాక్షి, ఆదిలాబాద్: బ్రిటీష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కొత్తగా రూపొందించిన మూడు నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. జల్లాలోని మావల పీఎస్‌లో తొలి కేసు నమోదైంది. జిల్లాలోని పోలీస్ సిబ్బందికి వీటి పై శిక్షణ దాదాపు పూర్తి చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నూతన చట్టాలతో సత్వర న్యాయం అందే అవకాశముంటుందని చెబుతున్నారు.మావలో తొలి కేసు..మావల పోలీసు స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కాలే జ్ గ్రౌండ్ సమీపంలో సోమవారం క్రాంతినగర్‌కు చెందిన ప్రైవేట్ టీచర్ ఎల్మావార్ నకుల్ రెడ్డి(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి భూమారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చే శాడు. మృతుడి భార్య 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. అప్పటికే మద్యానికి అలవాటుపడ్డ అతను దీని నుంచి తేరుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహ త్య చేసుకున్నాడు.దీనికి సంబంధించి పాత చట్టాల పరంగా సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసేవారు. కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో బీఎన్ఎస్ఎస్ 194 సెక్షన్ కింద మావల పోలీసు స్టేషన్లో సోమవారం రాత్రి కేసు నమోదైంది. ఇక అసహజ మరణాలకు సంబంధించి బీఎన్ఎస్ఎస్ కింద నమోదు చేస్తారు. ఇతర కేసుల్లో ఇది వరకు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యేవి. తాజాగా బీఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు షురూ అయింది.అమల్లోకి..భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ సాక్ష అధినీయమ్ (బీఎస్ఏ), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి జూలై 1నుంచి అమల్లోకి తెచ్చింది. ఇకపై జరిగే నేరాలకు సంబంధించి వీటిలోని సెక్షన్ల ఆధారంగానే కేసులు నమోదు కా నున్నాయి. కొత్త చట్టాల రాకతో భారత శిక్షా స్మృతి (ఐపీసీ), భారత సాక్షాధారాల చట్టం, భారత నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ) కనుమరుగు కానున్నాయి.అయితే జూలై 1వ తేది కంటే ముందు ఏవైనా కేసులు జరిగినట్టు రిపోర్టులు వస్తే పాత సెక్షన్లోనే కేసు నమోదు చేస్తారు. నేరడిగొండ పీఎస్ పరిధిలో సోమవారం ఓ మిస్సింగ్ కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ఆదివారం నుంచి మిస్సింగ్ ఉండడంతో అది పాత సెక్షన్లలోనే నమోదు చేశారు.కొత్త చట్టాల్లోని ప్రధాన అంశాలు..కొత్త చట్టాలపై ప్రజలకు ఇంకా పూర్తిగా అవగాహన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొన్ని అంశాలు పరిశీలిస్తే.. బాధితుడు ఇకపై నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే జరిగిన సంఘటనపై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేసిన పక్షంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి చేయనున్నారు.దీంతో దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు నిర్ధేశిత గడువులోపు పూర్తి కావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. సమన్లు ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు. ఆన్లైన్లో పంపించవచ్చు. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్ములాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.95 శాతం పోలీసులకు శిక్షణ..కొత్త చట్టాలపై 95 శాతం పోలీసు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసినట్లు జిల్లా పోలీసు అధికారి చెబుతున్నారు. 11 బ్యాచుల్లో 535 మందికి ఈ శిక్షణ ఇచ్చారు. సీఐడీ తెలంగాణ నుంచి కూడా వచ్చినవారు ఎస్వోపీ స్టాండింగ్ అంశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కలిగించారు. మొత్తంగా పోలీసు శాఖ నూతన చట్టాల పరంగా ముందుకు కదిలింది.ఠాణా వారీగా అవగాహనకొత్త చట్టాలకు సంబంధించి పోలీసు స్టేషన్ వారీగా ప్రజలకు అవగాహన కల్పించనున్నాం. ఇదివరకు చట్టాలు పనిష్మెంట్ లాగా ఉండేవి. కొత్త చట్టాలు న్యాయం చేకూరుస్తాయి. సిబ్బందికి శిక్షణ దాదాపుగా పూర్తయ్యింది. – గౌస్ ఆలం, ఎస్పీ -
కొత్త చట్టాలు.. దేశంలోనే తొలి కేసు నమోదు!
న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)గా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ్ సంహిత క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్ పట్నాకు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు. -
అమల్లోకి కొత్త నేర చట్టాలు.. ఈ సంగతులు తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచి్చనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. → భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.→ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. → మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.→ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు. -
ఇప్పటికైనా గ్రహిస్తారా?!
సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి. చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు. అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది. 2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్ఎస్ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి. ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్ఎస్లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది. పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్ఎస్ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్ఎస్లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది. అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం. -
Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్ 1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన 146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన 2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్ 3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు 4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి 5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర 6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి..
సాక్షి, ఢిల్లీ: గందరగోళానికి తెర దించుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలవడింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో సందేశం ఉంచారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. దీంతో.. శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. Winter Session, 2023 of Parliament will commence from 4th December and continue till 22nd December having 15 sittings spread over 19 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business and other items during the session.#WinterSession2023 pic.twitter.com/KiboOyFxk0 — Pralhad Joshi (@JoshiPralhad) November 9, 2023 -
బీజేపీకి వరుణ్ గాంధీ షాక్: ఒకనాటి సంచలన వీడియో పోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా గళం విప్పిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తగ్గేదే..లే అంటూ కేంద్రానికి మరోసారి షాకిచ్చారు. మాజీ ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన ఒక సంచలన వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. రైతుల అణచివేతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను గురువారం ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతులకు మద్దతుగా నిలిచిన ఆయన ప్రసంగ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. చదవండి : మిశ్రాను పదవి నుంచి తప్పించండి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల సుదీర్ఘ ఉద్యమం, లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండ నేపథ్యంలో బీజేపీ నేత ట్విట్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. "పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్ చేయడమంటే మోదీ సర్కార్‌కు షాకేనని భావిస్తున్నారు. వరుణ్ గాంధీ షేర్ చేసిన వీడియోలో చట్టలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయడంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాలని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి కేంద్రాన్ని హెచ్చరించడం ఈ క్లిప్పింగ్‌లో చూడొచ్చు. చదవండి : Global Handwashing Day 2021: కరోనాకు చెక్ పెడదాం కాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసపై ఘాటుగా స్పందించిన ఏకైక బీజేపీ ఎంపీవరుణ్ గాంధీ. హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కారుతో ఢీకొట్టి మరీ రైతులను హత్య చేశారన్న ఆరోపణల్లో జూనియర్ హోం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడు. మరోవైపు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మాట్లాడిన నెల రోజులకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడుగా వరుణ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి : Love Your Eyes: ఆ కళ్లను ప్రేమిస్తున్నారా? అయితే ముందు మీ కళ్లను ప్రేమించండి! Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx — Varun Gandhi (@varungandhi80) October 14, 2021 -
ఈ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందట?
ఢిల్లీ: కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను సరైన పద్దతిలో వినియోగించుకుంటే రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఏజెన్సీ బయాన్ అండ్ కంపెనీ వెల్లడించింది. అగ్రిటెక్‌లో పెట్టుబడులు కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి రావడం వల్ల సాగు విధానాల్లో మార్పులు, నూతన సాంకేతికత జోడింపులో వేగం పెరుగుతాయని, ఫలితంగా అగ్రిటెక్ రంగంలో ఉన్న కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తాయని అంచనా వేసింది. 2025 నాటికి అగ్రిటెక్ రంగంలోకి 30 నుంచి 35 బిలియన్ల పెట్టుబడులకు అవకాశం ఉందని లెక్కకట్టింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అగ్రిటెక్ పెట్టుబడుల విలువ కేవలం ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. సాగు రంగంలో మార్పులు అగ్రిటెక్‌లోకి భారీగా పెట్టుబడులు రావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, అమ్మకం వంటి రంగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేసింది. ఇంటిగ్రేటెడ్ అగ్రి ఫ్లాట్‌ఫామ్స్, ఇంక్యుబేషన్ వింగ్స్, న్యూ బిజినెస్ మోడల్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అదే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కొనుగోలులో ప్రస్తుతం అమలవుతున్న పద్దతుల స్థానంలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా కొత్త పద్దతులు అమల్లోకి వస్తాయంటూ బయన్ అండ్ కంపెనీ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో వచ్చే ఈ మార్పులతో రైతుల ఆదాయం రాబోయే రోజుల్లో రెండింతలు అయ్యే అవకాశం ఉందని బయాన్ సూచించింది. స్టార్టప్‌లతో.. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ఆర్థిక నిధులు అందించే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉందని, కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే స్టార్ట్అప్లకు మరింత తోడ్పాటు అందుతుందని బయాన్ కంపెనీ చెప్పింది. వ్యవసాయ రంగానికి టెక్నాలజీ తోడై రాబోయే ఇరవై ఏళ్లలో సాగు రంగంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా టాప్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది. ఆ చట్టాలతో నష్టం మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దులను కేంద్రంగా చేసుకుని ఆరు నెలలకు పైగా పోరాటం చేస్తున్నారు. పంజాబ్. హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రకి చెందిన రైతులు ఈ పోరాటంలో ముందున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే కార్పోరేట్ కంపెనీల చేతుల్లో రైతులు కీలుబొమ్మలు అవుతారంటూ రైతులు ఆందోళనలో పాల్గొంటున్న రైతులు అభిప్రాయ పడుతున్నారు. చదవండి : పెట్టుబడుల లక్ష్యాలపై దృష్టి పెట్టండి -
ఆస్ట్రేలియా-ఫేస్‌బుక్‌ల మధ్య డీల్ కుదిరింది
కాన్బెరా: గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఫేస్‌బుక్‌కు నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వీరి మధ్య సంధి కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫేస్బుక్ పేర్కొంది. త్వరలో మళ్లీ తమ సైట్లో వార్తలు పునరుద్ధరిస్తామని ప్రకటించింది. గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలలో వార్తలు షేర్ చేస్తున్నందుకు వార్తాసంస్థలకు ఆ సంస్థలు డబ్బులు చెల్లించాలన్న చట్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్బుక్ ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. ఫేస్బుక్ వార్తలు నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇక తప్పని పరిస్థితులలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారి ఫ్రైడెన్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఫేస్బుక్ కూడా న్యూస్ పేజీలపై విధించిన నిషేధం తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ తెలిపారు. ఇదిలా ఉంటే గూగుల్ మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియాలోని చిన్న చిన్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం న్యూస్ షోకేస్ అనే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి వార్తా సంస్థలు పోస్ట్ చేసే వార్తలన్నీ అందులో కనిపించేలా కొత్త విధానాలను రూపొందించినట్లు సమాచారం. చదవండి: ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్ మద్దతు..గూగుల్ వైదొలిగేనా? డీహెచ్ఎఫ్ఎల్లో బయటపడ్డ మరో భారీ మోసం -
సాగు చట్టాలపై సుదీర్ఘ పోరు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వ అణచివేతకు నిరసనగా 23న పగాడీ సంభాల్ దివస్, 24న దామన్ విరోధి దివస్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే 26న యువ కిసాన్ దివస్, 27న మజ్దూర్–కిసాన్ ఏక్తా దివస్ నిర్వహిస్తామని పేర్కొంది. కొత్త సాగు చట్టాలు రద్దయ్యే దాకా సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఆ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు: కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్లు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆయన ఆదివారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు రైతు సంఘాల నేతలతో విందు భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలను అమలు చేస్తే దేశంలో వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం
కర్నాల్: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కర్నాల్ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్లో ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్ తికాయత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
మోదీ మిత్రుల కోసమే సాగు చట్టాలు
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సం పన్న మిత్రుల కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. వారి కోసం రాచబాటలు పరుస్తున్నారని దుయ్యబట్టా రు. రైతులను బెదిరిస్తున్న మోదీ చైనాను మాత్రం ఎదిరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజస్తాన్ రాష్ట్రం హనుమాన్‌గఢ్ జిల్లాలోని పిలీబంగా పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల తొలి మహాపంచాయత్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు దేశంలో 40 శాతం జనాభాను ప్రభావితం చేస్తాయన్నారు. కేవలం రైతులే కాకుండా వ్యాపారులు, కార్మికులు కూడా నష్టపోతారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తర్వాత కొత్త వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు మరో పెద్ద దెబ్బేనని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. కార్పొరేట్ వ్యాపారుల గుత్తాధిపత్యమే ‘‘తూర్పు లద్దాఖ్‌లో సైనిక బలగాల ఉపసంహరణపై చైనాతో కుదిరిన ఒప్పందం సరైంది కాదు. పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్ 3, 4 మధ్యనున్న ప్రాంతాన్ని మోదీ ప్రభుత్వం చైనాకు ధారాదత్తం చేసింది. చైనా ముందు నిలబడలేని నరేంద్ర మోదీ మన రైతులను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే ఆయన అసలు రంగు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు అది నల్లధనంపై పోరాటం కాదని చెప్పా. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేనని వివరించా. అయినా అప్పట్లో ప్రజలు అర్థం చేసుకోలేదు. తర్వాత ప్రజల డబ్బు బ్యాంకులకు చేరడం, ముగ్గురు నలుగురు బడా బాబుల రుణాలు మాఫీ కావడంతో అసలు విషయం బయటపడింది. నోట్ల రద్దు తర్వాత జీఎస్టీతో మోదీ ప్రభుత్వం ప్రజల వెన్ను విరిచింది. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు మూతపడడం ఖాయం. రైతుల నుంచి పంటల కొనుగోళ్లను ఇకపై కార్పొరేట్ వ్యాపారులే శాసిస్తారు. వారి గుత్తాధిపత్యమే కొనసాగుతుంది. దేశంలోని మొత్తం పంటలను ఒకే వ్యక్తి కొనుగోలు చేసి, దాచిపెట్టే పరిస్థితి కూడా వస్తుంది. చిరు వ్యాపారుల పరిస్థితేంటి? దేశంలో 40 శాతం జనాభా చేసుకుంటున్న వ్యాపారాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు కట్టబెట్టడమే కొత్త సాగు చట్టాల పరమార్థం. దేశమంతటా ఒకే కంపెనీ పండ్లు, కూరగాయలు, సరుకులు అమ్మితే రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు, సరుకులు అమ్ముకొని, పొట్టపోసుకునే చిరు వ్యాపారుల పరిస్థితి ఏమిటి? కొత్త చట్టాలతో దేశంలో 40 శాతం మంది ఉపాధి కోల్పోతారు. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే రైతులు పోరుబాట పట్టారు. రైతన్నల సంక్షేమం కోసమే కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధాని చెబుతున్నారు. అదే నిజమైతే రైతులు ఎందుకు ఆందోళన సాగిస్తున్నారు? ఈ పోరాటంలో 200 మంది ఎందుకు చనిపోయారు?’’ అని రాహుల్ గాంధీ నిలదీశారు. ప్రధానిమోదీకి, బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై నమ్మకం లేదని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఏడు రైతు మహాసభల్లో పాల్గొననున్న తికాయత్ ఘజియాబాద్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ సోమవారం నుంచి హరి యాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల్లో వరుస గా జరుగుతున్న ఏడు రైతు మహాసభలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 23తో ఇవి ముగుస్తాయని బీకేయూ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ తెలిపారు. చైనాకు అప్పగించారు భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. చైనా ఆగడాలకు ఎదురు తిరగలేని పిరికిపంద నరేంద్ర మోదీ, మన సైనికుల త్యాగాలను ఆయన అవమానిస్తున్నారు అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మన భూమిని పరాయి దేశానికి అప్పగించడాన్ని దేశంలో ఎవరూ అంగీకరించరని చెప్పారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద తాజా పరిస్థితిపై పార్లమెంట్లో ప్రధాని ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిస్తున్నారని తప్పుపట్టారు. ‘‘భారతదేశ భూభాగాన్ని చైనాకు అప్పగించానని మోదీ చెప్పాలి, ఇదే నిజం’’ అని పేర్కొన్నారు. తూర్పు లద్ధాఖ్లోని ఇండియా భూభాగమైన ఫింగర్ 4 వద్ద మన సైనిక పోస్టు ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన సైనిక బలగాలు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3 వద్దకు వచ్చేశాయని అన్నారు. మన ప్రాంతాన్ని చైనాకు ఎందుకు ఇచ్చారో ప్రధానమంత్రి, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెనక్కి మళ్లాలని మన సైన్యాన్ని ఎందుకు ఆదేశించారని అన్నారు. దీనివల్ల మనకు లాభమేంటి? అని ప్రశ్నించారు. వ్యూహాత్మక ప్రాంతాల నుంచి చైనా ఎందుకు వెనక్కి వెళ్లడం లేదన్నారు. దేశ భూభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. -
వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు
వాషింగ్టన్ : కొత్త వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇంటా బయటా ఎందరో మద్దతునిస్తున్న వేళ భారత ప్రభుత్వానికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా అండగా నిలిచింది. ఈ చట్టాలతో భారత్ మార్కెట్ బలపడుతుందని అభిప్రాయపడింది. రైతుల ఆందోళనల్ని చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించింది. శాంతియుతంగా చేసే నిరసనలు ప్రజాస్వామ్య దేశాల లక్షణమని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ సంక్షోభ నివారణకు తాము చర్చల్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించేలా, రైతుల మార్కెట్ పరిధిని పెంచేలా వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలకి బైడెన్ ప్రభుత్వం మద్దతునిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం వెల్లడించారు. సాధారణంగా మార్కెట్లను బలోపేతం చేసే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని, భారత్‌లో వ్యవసాయ సంస్కరణల్ని తమ దేశం స్వాగతిస్తుందన్నారు. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు రైతులకు సంఘీభావంగా ట్వీట్లు చేశారు. రైతు ఆందోళనల్ని భారత్ వైపు నుంచి చూడాలి దేశంలో రైతు నిరసనల్ని పూర్తిగా భారత్ దృష్టి కోణంతో చూడాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ అన్నారు. ఈ దేశంలో రాజకీయాలను అర్థం చేసుకొని అభిప్రాయాలను వెల్లడించాలన్నారు. రైతులతో సమస్య పరిష్కారానికి పలు దఫాలు కేంద్రం చర్చలు జరిపిందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నవంబర్ నుంచి నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులతో సమస్య పరిష్కారానికి చర్చల్ని తాము ప్రోత్సహిస్తామని అమెరికా విదేశాంగ శాఖ చేసిన సూచన పట్ల అనురాగ్ స్పందిస్తూ జనవరి 6న అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి, జనవరి 26న ఎర్రకోటపై దాడిని ఒకేలా చూడాలన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో అమెరికాలో ఎలాగైతే భావోద్వేగాలతో కూడిన ప్రతిస్పందనలు వచ్చాయో ఇక్కడ కూడా అలాగే వచ్చాయన్నారు. ఇక్కడ చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. హింస చెలరేగకుండా ఉండడానికే ఇంటర్నెట్ నిలిపివేశామని స్పష్టం చేశారు. -
పక్షపాతమన్న ప్రశ్నే లేదు : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : మూడు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంలో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ ఏర్పాటులో రైతుసంఘాల ఆరోపణలను తోసిచ్చింది. ఈ కమిటీ ఏర్పాటులో పక్షపాతానికి తావులేదని స్పష్టం చేసింది. అలాగే సుప్రీం నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకున్నందున పునర్నిర్మాణం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకువ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీ, ఇతర నిరసనలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సృష్టం చేసింది. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించడంతో దీన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం కోసమే కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి ఎలాంటి న్యాయాధికారమూ లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే కమిటీలో నిపుణులను నియమించినట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులపై ముద్రలు వేయడం సరికాదు. గతంలో అభిపప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన వారిని నిందించడం తగదని సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అది ఫలితాన్ని ప్రభావితం చేయదని రైతు నేతలకు సూచించారు. ఉత్తమ న్యాయమూర్తులకు కూడా ఒకవైపు నిర్దిష్ట అభిప్రాయాలున్నా... మరొకవైపు తీర్పులు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా సుప్రీం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై ఉద్యమకారులు, రైతు సంఘాలతో కాంగ్రెస్, అకాలీదళ్ సహా ఇతర ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కమిటీలోని నలుగురు సభ్యులు గతంలో వివాదాస్పద చట్టాలకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి, కిసాన్ మహాపాంచాయత్ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారించింది. -
అదే ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 9వ ధపా చర్చలు శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దాదాపు ఐదు గంటలపాటు జరిగాయి. కేంద్రం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ సహా ఉన్నతాధికారులు 41 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. కొత్త సాగు చట్టాల విషయంలో ఇరుపక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది. రైతులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, కాస్తయినా బెట్టు సడలించాలని తోమర్ రైతు సంఘాల నేతలను కోరారు. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని నేతలు తేల్చిచెప్పారు. తమ డిమాండ్ల విషయంలో మార్పు లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. 10వ రౌండ్ చర్చలు 19న మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నాయి. ప్రతిపాదనలతో రండి తదుపరి చర్చల కంటే ముందే రైతులు సాగు చట్టాల విషయంలో తమ ప్రతిపాదనలతో ఒక ముసాయిదాను సమర్పిస్తే, వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. 9వ రౌండ్ చర్చలు విఫలమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు తాము రాతపూర్వక హామీ ఇచ్చామని వెల్లడించారు. కొత్త చట్టాల అమలు విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉంటామని తోమర్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం కోసం న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ తమను పిలిచినప్పుడు వాదనలు వినిపిస్తామన్నారు. రాహుల్‌ని చూసి కాంగ్రెస్ నవ్వుకుంటోంది తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయ సంస్కరణల విషయంలో 2–3 రాష్ట్రాల రైతులు మాత్రమే ధర్నా చేస్తున్నారని నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ప్రస్తుతం శీతాకాలం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల దృష్ట్యా నిరసనకారుల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రకటనలు, ఆయన చర్యలను చూసి మొత్తం కాంగ్రెస్ పార్టీ నవ్వుకుంటోందని తోమర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో–2019లో వ్యవసాయ సంస్కరణలపై వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఈ విషయం మేనిఫెస్టోలో ఉంటే.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి, అప్పుడు అబద్ధాలు చెప్పారో లేక ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారో వివరించాలని సూచించారు. 19న సుప్రీంకోర్టు కమిటీ సమావేశం! సాగు చట్టాల విషయంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మొదటి సమావేశం జనవరి 19వ తేదీన జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత అనే తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేశామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ చెప్పారు. అంతేగాక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరుకాకూడదని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడుతామని, డిమాండ్లపై చర్చిస్తామని ఉద్ఘాటించారు. చర్చలు కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆలిండియా కిసాన్ సంఘర్‡్ష కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు కవితా కురుగంటి తెలిపారు. కమిటీ నుంచి తప్పుకుంటున్నా రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మన్ చెప్పారు. కొత్త సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ కమిటీపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కమిటీలో తనను సభ్యుడిగా చేర్చినందుకు భూపీందర్‌సింగ్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, రైతన్నల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోనని తేల్చిచెప్పారు. భూపీందర్సింగ్కు దూరంగా ఉండాలని బీకేయూ పంజాబ్ యూనిట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఆయన ప్రకటన వెలువడింది. -
కొత్త చట్టాలపై అపోహలొద్దు: జీవీఎల్
సాక్షి, గుంటూరు: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని.. దీని వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడరని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ నూతన చట్టాలపై సూచనలు వింటామని, కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవన్నారు. (చదవండి: విశాఖకు ఎందుకు వలసొచ్చావ్..?) ‘‘చట్టాలు రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నాం. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్ బయట అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డ్‌కు చెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు రైతుకు మిగులుతాయి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర ఉండదని కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసత్యాలను నమ్మొద్దు. రైతులకు అపోహలు కలిగితే వాటిని నివృత్తి చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామని’’ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివరించారు. (చదవండి: సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి) నూతన చట్టాలను స్వాగతించాలి: సోము వీర్రాజు వ్యవసాయాన్ని ప్రవృత్తి గా మార్చుకుని ఎంతోమంది ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పండించే పంటలపైనే రైతుతో ఒప్పందాలు ఉంటాయని, రైతు భూమి సురక్షితమని ఈ బిల్లులో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ దిగుబడి ఖరీదు .. ఒప్పందం ప్రకారం చెల్లింపులు ఉంటాయని తెలిపారు. ఈ చట్టాల గురించి రెండు దశాబ్దాలుగా చర్చ సాగుతూనే ఉంది. ఎన్నో చర్చలు, ఆలోచనలు చేశాకే ప్రధాని మోదీ.. ఈ చట్టాలను తెచ్చారు. నీరు-మీరు అంటూ కోట్లు వెచ్చించారు. కానీ నేడు ఒక్క చెట్టు కూడా కాన రావడం లేదని’ ఆయన విమర్శించారు. సేంద్రీయ వ్యవసాయ విధానాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సోము వీర్రాజు సూచించారు. -
రైతులకు కొత్తచట్టాలు అనుకూలం: జీవీఎల్
సాక్షి, గుంటూరు: దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మిర్చిని పండిస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మిరప సాగుపై చర్చించామని పేర్కొన్నారు. ఏడాదికి 6200 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి జరుగుతోందన్నారు.ఏఏ దేశాలకు ఎగుమతి చేయాలి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, మిర్చి రైతులకు మంచి ధర వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై చర్చించామని జీవీఎల్ వెల్లడించారు. (చదవండి: పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) కేంద్రం చేసిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దారులతో రైతులను అనుసంధానం చేస్తాం. దీంతో మంచి ధర వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విపరీతంగా పురుగు మందులు వాడటాన్ని గమనించామని, అందరితో చర్చించి పురుగు మందుల వాడకాన్ని తగ్గించే విధంగా సిఫార్స్ చేస్తామని చెప్పారు. వాటిని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. స్పైసెస్ పార్కును అందుబాటులో తెచ్చేందుకు అధ్యయనం చేసి చర్యలు తీసుకొంటామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.(చదవండి: ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’) -
అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు
న్యూఢిల్లీ/కోల్‌కతా: కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను తాము ఎప్పుడో తిరస్కరించామని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్ కక్కా బుధవారం చెప్పారు. మరిన్ని సంస్కరణలు తథ్యం వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాలపై రైతులు తదుపరి చర్చల కోసం ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని గుర్తుచేశారు. తదుపరి చర్చల కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఆఫ్ రూరల్ ఇండియా సదస్సులో తోమర్ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 3,13,363 మంది రైతుల సంతకాలతో తనకు లేఖలు వచ్చాయని తెలిపారు. వీరిలో పంజాబ్, హరియాణా రైతులు సైతం ఉన్నారని చెప్పారు. రైతన్నలకు అండగా ఉంటాం: మమతా బెనర్జీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్ ఉల్ హక్ ఢిల్లీలో రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో నేడు భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు గురువారం విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్నా«థ్ కోవింద్‌తో సమావేశమై, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో పాటు మెమోరాండం సమర్పించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంతకాలను సేకరించింది. 25న రైతులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ డిసెంబర్ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
భారత్ ఎందుకొద్దు?
న్యూఢిల్లీ : ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతంలో ఇండియా ఎందుకు? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని అడుగుతున్నారని చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని శనివారం ‘అసోచామ్ ఫౌండేషన్ వీక్–2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. వ్యవసాయ సంస్కరణలు, కొత్త చట్టాలతో రైతన్నలు ప్రయోజనం పొందడం మొదలైందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఎందుకు’ నుంచి ఎందుకొద్దు దాకా.. ‘మనం చేపట్టిన సంస్కరణలు పారిశ్రామిక రంగం ఆలోచనా ధోరణిని మార్చాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ ఎందుకు? నుంచి భారత్ ఎందుకొద్దు? అనే దాకా పరిస్థితి మారిపోయింది. గతంలో పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సందేహించేవారు. సంస్కరణలు, వాటి ప్రభావం వల్ల వారు ఉత్సాహం ముందుకొస్తున్నారు. 1,500 పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. పెట్టుబడుల అంశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ముందుచూపునకు ఇదొక ఉదాహరణ. గతంలో పెట్టుబడిదారులు ఇండియాలో ఉన్న అధిక పన్ను రేట్లను ప్రస్తావించేవారు. ఇండియా ఎందుకు? అని ప్రశ్నించేవారు. మన ప్రభుత్వం పన్ను రేట్లను సరళీకరించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత్‌లోని కఠిన నిబంధనలు, నియంత్రణలను చూసి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గేవారు. మన ప్రభుత్వం అలాంటి నిబంధనలు, నియంత్రణల భారాన్ని తొలగించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అంటున్నారు’. మా మద్దతును విజయంగా మార్చండి ‘అన్ని రంగాల్లో లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగాలి. ఇందుకోసం మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకునే భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం వేగంగా ప్రతిస్పందించాలి. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో జరిగే మార్పులను పసిగట్టడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అందించే మద్దతును ఒక విజయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలదే. భారత ఆర్థి క వ్యవస్థను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలనా విధానాలు, లాభాలు పంచుకొనే విధానాలను పారిశ్రామిక రంగం అందిపుచ్చుకోవాలి. ఇక పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)లోనూ పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం చొరవ తీసుకోవాలి’. రైతుల పోరాటం మరింత ఉధృతం న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. తమ పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామన్నారు. తదుపరి కార్యాచరణను వచ్చే రెండు–మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాలు, పోరాటంపై న్యాయ సలహా తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు శివకుమార్ కక్కా శనివారం చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తామన్న కమిటీలో చేరాలా? వద్దా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం విరమించే ప్రసక్తే లేదని మరో నేత బల్బీర్‌సింగ్ తేల్చిచెప్పారు. వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే గత 23 రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నవారిలో ఇప్పటిదాకా 23 మంది రైతులు మరణించారని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) వెల్లడించింది.