New Zealand cricket
-
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం..
న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రేస్‌వెల్‌పై ఒక నెల నిషేధం పడింది. అతను మాదకద్రవ్యాలు తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ (ఎన్ఎస్ఐసీ) వేటు వేసింది. ఈ ఏడాది అతను కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. 2011లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్ జింబాబ్వేతో తన తొలి మ్యాచ్‌లో 6/40 బౌలింగ్ గణాంకాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది జనవరి 13న కివీస్ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా వెల్లింగ్టన్ జట్టుతో జరిగిన పోరులో సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్టుకు ఆడిన బ్రేస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.మ్యాచ్ అనంతరం అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో ఎన్ఎస్ఐసీ అతన్ని ముందుగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తర్వాత ఒక నెలకు పరిమితం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి నెలరోజులపాటు అతనిపై నిషేధం విధించారు.34 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు ఆడి 74 వికెట్లు, 21 వన్డేలు ఆడి 26 వికెట్లు, 20 టి20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ‘తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో బాధ్యతతో ప్రవర్తించాలి. ఇలాంటి నిషేధిత ఉ్రత్పేరకాలతో న్యూజిలాండ్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) ప్రతిష్టను మసకబార్చవద్దు’ అని ఎన్‌జడ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ తెలిపారు.చదవండి: కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ -
మక్కాను సందర్శించిన కివీస్ క్రికెటర్ అజాజ్ పటేల్ (ఫొటోలు)
-
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో..పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
-
IND Vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం
భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో కివీస్ జట్టు స్టార్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమి అనంతరం టిమ్ సౌథీ బ్లాక్ క్యాప్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.అతడి స్ధానంలో లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్టుకు కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరమయ్యాడు. శ్రీలంక సిరీస్‌లో గజ్జ గాయానికి గురైన కేన్ మామ.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. రెండో టెస్టు సమయానికి అతడు కోలుకునే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఈ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ మార్క్ చాప్‌మన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. బ్లాక్ క్యాప్స్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తాచాటుతున్న చాప్మన్.. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ మైఖల్ బ్రేస్‌వెల్ కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వనుండడంతో బ్రేస్‌వెల్ తొలి టెస్టు అనంతరం న్యూజిలాండ్‌కు పయనం కానున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్-భారత మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు టెస్టు మాత్రమే), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్ -
న్యూజిలాండ్ కెప్టెన్ సూపర్ ఫిప్టీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ కెప్టెన్ సోఫీ డివైన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగింది.36 బంతులు ఎదుర్కొన్న డివైన్.. 7 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు ప్లిమ్మర్(34), బేట్స్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరుందతి రెడ్డి, శోభనా తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చెప్పకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. -
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ల సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీస్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను వీరిద్దరూ వదులుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఒప్పందాల దృష్ట్యా కాన్వే, అలెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ తమ కాంట్రక్ట్ రెన్యూవల్‌పై సంతకం చేయలేదని కివీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అయితే వీరిద్దరూ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని బోర్డు స్పష్టం చేసింది. ఈ డిసెంబర్లో అలెన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడనుండగా.. కాన్వే వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కాగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మిల్నే వంటి స్టార్ క్రికెటర్లు సైతం బోర్డు కాంట్రాక్ట్‌లను వదులు కున్నారు.కివీస్ సెంట్రల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ నుండి నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా అభ్యర్ధను అంగీకరించినందుకు న్యూజిలాండ్ క్రికెట్‌కు ధన్యవాదాలు. ఈ నిర్ణయం నేను అన్ని ఆలోచించే తీసుకున్నాను. నా కుటంబంతో కొద్ది రోజులు గడపాలనకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్క్లాప్స్ తరపున ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్లో ముఖ్యమైన టెస్టు సిరీస్‌లలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేండుకు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసే ప్రకటనలో డెవాన్ పేర్కొన్నాడు. కాగా అఫ్గానిస్తాన్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లకు కాన్వేకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. -
న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మాజీ క్రికెటర్..
న్యూజిలాండ్ మహిళ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ క్రెయిగ్ మెక్‌మిలన్ ఎంపికయ్యాడు. నెలాఖరులో న్యూజిలాండ్ మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.ఈ టూర్‌తో న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా మెక్‌మిలన్ ప్రయాణం ప్రారంభం కానుంది. మెక్‌మిలన్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2014 నుంచి 2019 వరకు న్యూజిలాండ్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. అతడు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కివీస్ వరుసగా రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా మెక్‌మిలన్ పనిచేశాడు. ఇక న్యూజిలాండ్ తరపున 1997 నుంచి 2007 వరకు మెక్‌మిలన్ 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.ఇంగ్లండ్ పర్యటనకు న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, లారెన్ డౌన్ (వికెట్ కీపర్), ఇజ్జీ గేజ్, మాడీ గ్రీన్, మైకేలా గ్రేగ్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్ , జెస్ కెర్, మెలీ కెర్, మోలీ పెన్ఫోల్డ్ , జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు. -
న్యూజిలాండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లకే రిటైర్మెంట్
న్యూజిలాండ్ మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ బెర్నాడిన్ బెజుడెన్‌హౌట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బెజుడెన్‌హౌట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడంచింది. తను స్థాపించిన ఛారిటబుల్ ది ఎపిక్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించేందుకు బెజుడెన్‌హౌట్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా దక్షిణాఫ్రికాకు చెందిన బెజుడెన్‌హౌట్.. 2014లో తన సొంతదేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కానీ తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2017లో న్యూజిలాండ్‌కు మాకాం మార్చింది. ఈ క్రమంలో 2018లో కివీస్ తరపున ఆమె డెబ్యూ చూసింది. 30 ఏళ్ల బెజుడెన్‌హౌట్ ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 20 వన్డేలు, 29 టీ20లు ఆడింది. అందులో నాలుగు వన్డేలు, 7 టీ20ల్లో సౌతాఫ్రికా ఆమె ప్రాతినిథ్యం వహించింది."న్యూజిలాండ్‌కు క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాడు. వైట్ ఫెర్స్తో నా ప్రయాణం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా విషయాలను నేర్చుకున్నాను. ఈ రోజు నేను క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇకపై ది ఎపిక్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాను. ఈ నా అద్బుత ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది. -
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్(62) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వెల్లింగ్టన్లోని తప సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయన మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. కాగా స్టిర్లింగ్ టెస్టులు, వన్డేల్లోనూ కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1984 నుంచి 1986 మధ్య న్యూజిలాండ్ తరపున 6 టెస్టులు, 6 వన్డేలు ఆడిన స్టిర్లింగ్ ఓవరాల్‌గా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా రిచర్డ్ హ్యాడ్లీ, ఎవెన్ చాట్‌ఫీల్డ్, లాన్స్ కెయిర్న్స్ వంటి దిగ్గజ కివీస్ పేసర్లు అద్భుతంగా రానిస్తున్న సమయంలో.. స్టిర్లింగ్ అరంగేట్రం చేయడంతో పెద్దగా అవకాశాలు పొందలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం స్టిర్లింగ్‌కు మంచి రికార్డు ఉంది. అతడు డొమాస్టిక్ క్రికెట్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్కు ప్రాతినిధ్యం వహించారు. 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టిర్లింగ్ 206 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 65 గేమ్‌లలో 90 వికెట్లు సాధించాడు. స్టిర్లింగ్ రిటైర్మెంట్ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. కివీస్ యువ క్రికెటర్లను తయారు చేయడంలో స్టిర్లింగ్ తన వంతు పాత్రపోషించారు. చదవండి: నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ NZC is deeply saddened by the passing of former Test fast-bowler Derek Stirling, aged 62. "Billy" as he was known, played 6 Tests and 6 ODIs for his country and was a popular member of both the @CDCricket, and @cricketwgtninc sides. Our thoughts are with his family and friends. — BLACKCAPS (@BLACKCAPS) December 13, 2023 -
దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 22న ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్లో కివీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 28న ధర్మశాల వేదికగానే ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు దాదాపు 6 రోజుల బ్రేక్ రావడంతో ధర్మశాలలోని సుందరమైన ప్రదేశాలను కివీస్ జట్టు ఆటగాళ్లు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో బౌధ్దమత గురువు దలైలామాను ఆయన నివాసంలో కివీస్ ఆటగాళ్లు కలిశారు. క్రికెటర్లతో పాటు వారి కుటంబ సభ్యులు కూడా ఉన్నారు. దలైలామాతో కలసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, శాంట్నర్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీ పాయింట్ల పట్టికలో కివీస్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. -
ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్! కేన్ మామ దూరం
వన్డే ప్రపంచకప్-2023 మరో 6 రోజుల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. విలియమ్సన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వార్మప్ మ్యాచ్‌ల్లో మాత్రం కేన్ ఆడుతాడని న్యూజిలాండ్ క్రికెట్ సృష్టం చేసింది. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విలియమ్సన్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అదే విధంగా సోమవారం తిరువనంతపురంలో దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్ రెండూ కేన్ చేసే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2023 తొలి మ్యాచ్ సందర్భంగా కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు స్వదేశానికి వెళ్లి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆటకు విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. కానీ ఫిట్నెస్ సాధించేందుకు అతడు తీవ్రంగా శ్రమించాడు. ఆక్టోబర్ 9న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు విలియమ్సన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: ICC ODI WC 2023: ప్లేయర్స్ ఫీవర్‌తో బాధపడ్డారు.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు -
వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్!
ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లెఫ్ట్మ్ ఆర్మ్ స్పిన్నర్ బెన్ లిస్టర్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. నాలుగు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 10న సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు మిల్నే గాయ పడడం జట్టు మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక ఇదే విషయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "ఆడమ్ మిల్నే మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతుండంతో అతడిని ఈ సిరీస్‌లో ఆడించి రిస్క్ చేయకూడదని భావించాము. అందుకే అతడికి విశ్రాంతిని ఇచ్చాము. వరల్డ్‌కప్‌కు ఆటగాళ్లు గాయపడకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఇక బెన్ లిస్టర్ కూడా ప్రస్తుతం జట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. దీంతో వెంటనే అతడు మిల్నే స్ధానాన్ని భర్తీ చేశాడు. బెన్ యూఏఈ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌లో వార్మప్ మ్యాచ్‌లలో మమ్మల్ని ఆకట్టుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. చదవండి: Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ! -
బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. 10 ఏళ్ల తర్వాత
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కివీస్ మూడు వన్డేలు, రెండు టెస్టులు అతిథ్య బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కివీస్ రెండు దఫాలుగా బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లనుంది. తొలి దశ పర్యటనలో మూడు వన్డేలు న్యూజిలాండ్ ఆడనుంది. అనంతరం రెండో దశలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారింగా దృవీకరించింది. సెప్టెంబర్ 21న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం నవంబర్ 28 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుంది. కాగా వన్డే ప్రపంచకప్ సన్నహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్లు ప్రపంచకప్ కోసం భారత్‌కు రానున్నాయి. ఇక చివరిగా 2013లో కివీస్ బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు రెండు టెస్టుల సిరీస్ డ్రా కాగా.. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 3-0తో కివీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఏకైక టీ20లో మాత్రం న్యూజిలాండ్ విజయం సాధించింది. కాగా న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉంది. ఈ టూర్లో అతిథ్య యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ తలపడుతోంది. ఇప్పటికే దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ ఘన విజయం సాధించింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా -
ప్రపంచకప్‌కు విలియమ్సన్ దూరం! న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొకాలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2023లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో వెంటనే స్వదేశానికి వెళ్లిన కేన్‌మామ మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకోన్నాడు. ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక వేళ ప్రపంచకప్ సమయానికి విలియమ్సన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే.. కివీస్ జట్టను టిమ్ సౌథీ లేదా టామ్ లాథమ్ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. "కేన్ గాయం తీవ్రత గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తెలుస్తోంది. అతడు దాదాపుగా వరల్డ్‌కప్‌కు దూరమమ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ కేన్ అందుబాటులో లేకపోతే ఎవరని సారధిగా నియమించాలని అన్న ఆలోచనలో ఉన్నాం. సౌధీ ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ టామ్ లాథమ్‌కు వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉంది. టామ్ పాకిస్తాన్ పర్యటనలో కూడా జట్టును అద్బుతంగా నడిపించాడు. అయితే జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో వన్డే సిరీస్‌ను కోల్పోయాం. కానీ పరిమత ఓవర్ల కెప్టెన్‌గా లాథమ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే న్యూజిలాండ్ క్రికెట్ టామ్ వైపే మొగ్గు చూపవచ్చు అని విలేకురల సమావేశంలో గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు ఊరట
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) తమ ప్రధాన క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేందుకు మార్గం సుగమం చేసింది. శ్రీలంకతో రెండో టెస్టు తదుపరి వన్డే సిరీస్ నుంచి లీగ్ కాంట్రాక్టు దక్కించుకున్న తమ కీలక ఆటగాళ్లను విడుదల చేయనుంది. కేన్ విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్), టిమ్ సౌతీ (కోల్‌కతా నైట్‌రైడర్స్), డెవాన్ కాన్వే, సాన్‌ట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్)లు ఆయా ఫ్రాంచైజీలతో జట్టు కట్టేందుకు రిలీజ్ చేయాలని ఎన్‌జడ్‌సీ నిర్ణయించింది. లంకతో ఆఖరి టెస్టు ఆడిన వెంటనే వీళ్లంతా భారత్‌కు బయల్దేరతారు. మరో ముగ్గురు క్రికెటర్లు ఫిన్ అలెన్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), ఫెర్గూసన్ (కోల్‌కతా), గ్లెన్ ఫిలిప్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు)లకు 25న ఆక్లాండ్‌లో జరిగే తొలి వన్డే అనంతరం లీగ్‌లో అడేందుకు అనుమతించింది. ఈ సీజన్ ఐపీఎల్ పోటీలు మార్చి 31 నుంచి జరుగనున్నాయి. ఈ లీగ్‌కు ముందు న్యూజిలాండ్–శ్రీలంక జట్ల మధ్య 17 నుంచి 21 వరకు చివరిదైన రెండో టెస్ట్ జరుగుతుంది. ఇది ముగియగానే ఈనెల 25, 28, 31 తేదీల్లో మూడు వన్డేల సిరీస్... ఏప్రిల్ 2, 5, 8 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరగనుంది. -
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ కన్నుమూత
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెల్లింగ్టన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. 1969లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ తమ మొట్టమొదటి టెస్టు విజయంలో ముర్రే కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను 90 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 1968లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముర్రే.. న్యూజిలాండ్ తరపున 13 టెస్టులు ఆడారు. ఈ 13 మ్యాచ్‌ల్లో 29.9 సగటుతో 598 పరుగులు సాధించాడు. అతడు కెరీర్లో 5 హాఫ్‌సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఫస్ట్ క్లాస్ కెరీర్లో వెల్లింగ్టన్ తరపున 102 మ్యాచ్‌లు ఆడిన ముర్రే 6257 పరుగులు సాధించాడు. ఇక బ్రూస్ ముర్రే మనవరాళ్లు అమేలియా కెర్, జెస్ కెర్ ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళ జట్టులో కీలక సభ్యలుగా ఉన్నారు. చదవండి: లంకతో తొలి వన్డే.. సూపర్ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి -
స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్ లు.. షెడ్యూల్ ఇదే..!
-
న్యూజీలాండ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
-
కివీస్‌ను వెంటాడుతోన్న గాయాలు.. మరో స్టార్ బౌలర్ కూడా!
న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో కివీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఈ ట్రై సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫెర్గూసన్ ప్రస్తుతం పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్నాడు. కాగా అతడికి దాదాపు వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు కివీస్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తుండగా.. తాజాగా ఫెర్గూసన్‌కు కుడా గాయం కావడం న్యూజిలాండ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వెటరన్ పేసర్ ఆడమ్ మిల్నే కూడా తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందిస్తూ.. "ఫెర్గూసన్ ప్రస్తుతం పొత్తికడుపు గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదు. న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ టీ20 ప్రపంచకప్ సమయానికి లూకీ పూర్తి ఫిట్నెస్ను సాధిస్తాడని నేను భావిస్తున్నాను. అతడు మా జట్టులో కీలక బౌలర్. గతేడాది ప్రపంచకప్‌లో దురదృష్టవశాత్తూ ఫెర్గూసన్ సేవలు కోల్పోయాం. ఈ సారి అలా జరగదని నేను ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక ట్రై సిరీస్‌ను న్యూజిలాండ్ ఓటమితో ప్రారంభించింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కివీస్ ఓటమిపాలైంది. చదవండి: Women Asia Cup 2022 INDW VS BANW: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్ -
టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ కొత్త జర్సీ చూశారా..?
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కూడా తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ తమ కొత్త జెర్సీలను ధరించి ఉన్న ఫోటోను న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కివీస్ న్యూ జెర్సీ బూడిద, నలుపు రంగు కలయికతో ఉంది. కాగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కివీస్ పరాజాయం పాలైంది. ఇక ఈ ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఔ View this post on Instagram A post shared by BLACKCAPS (@blackcapsnz) ఇక టీ20 ప్రపంచకప్‌లో కివీస్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 22న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌లో న్యూజిలాండ్ తలపడనుంది. టీ20 ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సౌతీ, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్, లాకీ ఫెర్గూసన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, ట్రెంట్ బౌల్ట్, ఫిన్ అలెన్ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా అత్యంత చెత్త రికార్డు! -
అది అస్సలు ఊహించలేదు.. డకౌట్ అయ్యానని చెంపపై కొట్టాడు: టేలర్
ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. కాగా గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మూడేళ్లపాటు సేవలందించిన తర్వాత.. టేలర్‌ను 2011 వేలంలో రాయల్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తను డకౌట్ అయ్యాక రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నారని టేలర్ అన్నాడు. "మెహాలీ వేదికగా రాజస్తాన్ రాయల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. 195 పరుగుల లక్ష్య చేధనలో నేను డకౌట్‌గా వెనుదిరిగాను. మేము ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవి చూసం. కనీసంలక్ష్యం దగ్గరకు కూడా చేరలేక పోయాం. మ్యాచ్ అనంతరం మా జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనంతరం హోటల్‌కు చేరుకున్నాము. ఆ తర్వాత మేము అందరం కలిసి హోటల్ పై అంతస్తులోని బార్‌కు వెళ్లాం. అక్కడ షేన్ వార్న్‌తో పాటు లిజ్ హర్లీ కూడా ఉంది. ఈ సమయంలో రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు నా దగ్గరకు వచ్చారు. రాస్ నువ్వు డకౌట్ అయ్యేందుకు కాదు మేం నీకు మిలియన్ డాలర్లు చెల్లిస్తుందని అన్నాడు. ఈ క్రమంలో అతడు నవ్వుతూ నా చెంపపై మూడు నాలుగు సార్లు కొట్టాడు. అయితే అతడు నన్ను గట్టిగా మాత్రం కొట్టలేదు. అతడు సరదాగా కొట్టాడో లేక ఉద్దేశ పూర్వకంగా చేశాడో నాకు తెలియదు. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్ద సమస్య చేయదలుచుకోలేదు. కానీ జెంటిల్మెన్ గేమ్ పిలిచే క్రికెట్లో మాత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ సీజన్లో రాజస్తాన్ నన్ను భారీ ధరకు కొనుగోలుచేసినందు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఈ సంఘటన జరిగాక ఆర్సీబీ నన్ను సొంతం చేసుకుని ఉంటే బాగున్ను అనిపించింది" అని తన ఆత్మ కథ 'బ్లాక్ అండ్ వైట్'లో టేలర్ పేర్కొన్నాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! -
8 ఏళ్ల తర్వాత విండీస్ టూర్‌కు న్యూజిలాండ్.. కేన్ మామ వచ్చేశాడు..!
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగబోతున్నాడు. అదే విధంగా సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక 2014 తర్వాత కివీస్ కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్ పర్యటనలో భాగంగా కివీస్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 10న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో న్యూజిలాండ్ టూర్ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన కివీస్ తమ సీనియర్ ఆటగాళ్లు లేకుండానే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్టు కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, సోధీ ,టిమ్ సౌథీ చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ కొత్త జట్టును న్యూజిలాండ్ క్రికెట్ సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కివీస్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జాన్2న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక తొలి టెస్ట్‌కు గాయంతో బాధపడుతున్న హెన్రీ నికోల్స్ బ్యాకప్‌గా మైఖేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్ సెలక్టెర్లు ఎంపిక చేశారు. కాగా తొలుత 20 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, , బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను న్యూజిలాండ్ విడుదల చేసింది.. అయితే తొలి ప్రకటించన జట్టులో అవకాశం దక్కని అజాజ్ పటేల్ తిరిగి మళ్లీ చోటు దక్కింది. ఇక తొలి టెస్టుకు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ దూరం కానున్నాడు. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, క్యామ్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్ , అజాజ్ పటేల్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ చదవండి: IPL 2022: రియల్ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా.. Squad News | The 15-man squad to face @englandcricket in the upcoming three-Test series, with the addition of @cricketwgtninc all-rounder Michael Bracewell as 16th man for the first Test starting at the @HomeOfCricket in London on Thursday 🏏 READ MORE | https://t.co/mTC60LJ3Y9 pic.twitter.com/Zh8u9wObfE — BLACKCAPS (@BLACKCAPS) May 30, 2022 -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీగా ఉన్న న్యూజిలాండ్ తొలి టెస్టుకు సిద్దమైంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బౌల్ట్ ప్రస్తుతం ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో భాగమైన్నాడు. ఇక క్వాలిఫయర్ 2లో ఆర్సీబీపై విజయం సాధించి రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం(మే 29) ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. అయితే న్యూజిలాండ్ కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం జరగనున్న తొలి టెస్టుకు బౌల్ట్ సిద్దం కావడం అసాధ్యం. కాబట్టి తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బౌల్ట్ తొలి టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో టిమ్ సౌథీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్ చదవండి: ENG Vs NZ Test Series 2022: ఇంగ్లండ్‌తో టెస్టులకు కివీస్ జట్టును ప్రకటన.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు!