Newborn baby
-
కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు
ఆ పసికందు ఎక్కడ పుట్టాడో తెలీయదు. కన్నవాళ్లు కనీసం గుడి వద్దో, ఆస్పత్రి దగ్గరో వదిలేసిన ఆ నరకం తప్పేదేమో. కానీ, కర్కశంగా చెట్ల పొదల మధ్యకు విసిరేశారు. ఆ దెబ్బకు ఏడురోజుల వయసున్న ఆ పసికందు వీపు చిట్లిపోయింది. కాకులో, ఏ జంతువులో పొడిచాయో తెలియదు. గుక్కపట్టి ఏడ్చేందుకు శక్తిలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని గుర్తించి.. ఎవరో మహానుభావులు ఆస్పత్రిలో చేర్పించారు.ఆగష్టు 26వ తేదీ. యాభైకిపైగా గాయాలతో ఉన్న ఓ పసికందును ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు కొందరు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి విషమించింది. బతుకుతాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు డాక్టర్లు. అక్కడి నుంచి కాన్పూర్ లాలాలజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడా వైద్యులు ఆ బిడ్డ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ, ఏ దేవుడు చల్లగా చూశాడో తెలియదు. రెండు నెలలపాటు ప్రయత్నించి ఆ మగబిడ్డకు పునర్జన్మ పోశారు వైద్యులు.నరకం నుంచి రెండు నెలలకు.. కన్నతల్లి దూరమైనప్పటికీ.. ఆస్పత్రిలో అమ్మ ప్రేమ ఆయాల రూపంలో దొరికింది ఆ బిడ్డకు. మొదట్లో ఈ చిన్నారికి అయిన గాయాల కారణంగా ఎత్తుకునే ప్రయత్నంలోనూ ఏడ్చేవాడట. దీంతో.. ఊయలలో పడుకోబెట్టి దూరం నుంచే లాలించేవారట. ఆ సమయంలో ఆ బిడ్డ ఏడుపు.. అక్కడి సిబ్బందికి కన్నీళ్లు తెప్పించేదట. అయితే గాయాల నుంచి కోలుకునే కొద్దీ ఆ బిడ్డ కూడా వాళ్లకు అలవాటయ్యాడు.ఆగష్టు 26వ తేదీన ఆ బిడ్డ దొరికాడు. ఎవరో బ్రిడ్జి మీద నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తూ చెట్ల పొదల్లో పడ్డాడు ఆ చిన్నారి. అదే రోజు జన్మాష్టమి. అందుకే వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న ఆయాలందరూ.. మగ సిబ్బంది కూడా ఆ కిష్టయ్యను జాగ్రత్తగా చూసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 24వ తేదీన పోలీసుల సమక్షంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు వైద్యులు. కృష్ణ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంటే.. అక్కడున్న సిబ్బంది మొత్తం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆ వెళ్తోంది తమ బిడ్డే భావించి.. అతనికి ఓ మంచి జీవితం దక్కాలని ఆశీర్వదించి పంపించేశారట. -
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్
కన్నడ హీరోయిన్ మిలానా నాగరాజ్.. రీసెంట్గా పుట్టిన కుమార్తె ఫేస్ రివీల్ చేసింది. పరి అనే పేరు పెట్టిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఈమె భర్త డార్లింగ్ కృష్ణ కన్నడలో ఓ హీరో. నటుడు, దర్శకుడు, నిర్మాతగా పలు సినిమాలు చేశాడు.(ఇదీ చదవండి: OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ)పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. 2013 నుంచి సినిమాలు చేస్తోంది. అప్పట్లో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు మాత్రం ఓ వైపు నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 2021లో కృష్ణ-మిలానా పెళ్లి జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఈమెకు పాప పుట్టింది.ఈ క్రమంలోనే పాపని ఇంటికి తీసుకొచ్చిన వీడియోని తొలుత పోస్ట్ చేసింది. తాజాగా పాప-భర్తతో కలిసి తీసుకున్న క్యూట్ అంట్ స్వీట్ ఫొటోల్ని మిలానా షేర్ చేసింది. వీటిని చూసి తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరు కూడా వీడియో, ఫొటోలపై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్) View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ
బెగుసరాయ్: బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురయ్యింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. అందులో ఒక వృద్ధ మహిళ శిశును తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఒక నవజాత శిశువును ఒక వస్త్రంలో చుట్టి తీసుకువెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది.వివరాల్లోకి వెళితే బెగుసరాయ్‌లోని లోహియా నగర్‌కు చెందిన నందనీ దేవి డెలివరీ కోసం ఒక ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ శిశువు అదృశ్యమయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి -
సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..
ఇటీవల సోషల్ మీడియా పిచ్చితే యువత చేసే పనులకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఇలాంటి పిచ్చి ఫీట్లతో కొందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఏకంగా సొంత కొడుకుపై పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి సెలబ్రెటీ అయిపోవాలనుకున్నాడు. నెలల పసికందు అని కూడా చూడకుండా అతడు చేసిన దారుణ కృత్యాలకు బలైపోయింది ఆ చిన్ని ప్రాణం. చివరికీ ఈ విషయం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..? రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం తినడం గురించి చెబుతూ ఎక్కువ మంది యూజర్లను పొందే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని నమ్మడలికి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే తన సొంత కొడుకు పైనే ఇలాంటి చెత్త ప్రయోగాలే చేశాడు. నిజానికి ఒక మనిషి ఆహారం తీసుకుంటేనే బతుకగలడు. కానీ ఈ దుర్మార్గుడు సూర్యరశ్మితో కూడా ఓ మనిషి బతకగలడిని నిరుపించాలనేది మాక్సిమ్ ఆలోచన. అస్సలు ఇది సాధ్యమా..? సూర్యుడి ప్రతాపానికి చెట్టు చేమలు విలవిల్లాడతాయి. సూర్యుడి శక్తి మనకు ఆకలిపుట్టించేలా చేసి చైతన్యవంతం చేస్తుంది. అంతే దానితో బతకాలనుకోవడం అత్యంత పిచ్చి ఆలోచన. కానీ మాక్సిమా తన కొడుకు నెలల పనికందుపై ఈ ప్రయోగం చేశాడు. భార్య ఎంతలా చెప్పిన వినలేదు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నారీతీలో మూర్ఖంగా ప్రవర్తించాడు. బిడ్డకు పాలు ఇవ్వకుండా సూర్మరశ్చిలోనే ఉంచేవాడు. పాపం ఆ భార్య అతడికి తెలియకుండా బిడ్డకు పాలు ఇస్తుండేది. రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. మరోవైపు ఇతడి ఆగడాలు శృతిమించాయి. చల్లటి నీళ్లల్లో బిడ్డను ముంచి ఎండలో ఉంచడం వంటి పిచ్చి పనులు చేసేవాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న కంగకుండా ఆకలిని అధిగమించేలా శక్తిని పొందుతున్నాడని భార్యకు ఏవేవో పిచ్చి కబుర్లు చెప్పేవారు. చివరికీ బాబు ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. దీంతో భార్య ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. మాక్సిమ్ పిచ్చి ప్రయోగాలు ఆ బిడ్డ ప్రాణం బలైపోయింది. వైద్య పరిక్షల్లో ఆ పసికందు నిమోనియా సహా పలు సమస్యల వల్ల చనిపోయినట్లు వెల్లడయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాక్సిమ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని బుకాయించే యత్నం చేశాడు. అయితే అతడి భార్య ఈ బాధను ఓర్చుకోలేక పోలీసులు ముందు జరిగిన విషయం అంతా చెప్పేసింది. దీంతో కోర్టు జరిగిన నేరంలో తల్లి పాత్ర కూడా ఉందని భావించి ఇరువురకి జైలు శిక్ష విధించింది. మాక్సిమ్‌కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. విచిత్రమేమిటంటే తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడలన్నాదే తన ఉద్దేశ్యమని వాదిస్తూనే ఉన్నాడు. అతడి వాదనతో కోర్టు ఏకభవించ లేదు. ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో పచ్చి కూరగాయాలతో మంచి ఆరోగ్యం అని చెప్పే మాక్సిమ్ కస్టడీలో ఉన్నప్పుడూ న్యూడిల్స్, మాంసాహారం అడిగేవాడట. దయచేసి ఇలాంటి పిచ్చి పనులతో సోషల్ మీడియా ఫేమ్ రాదు కదా..! ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నాన్‌వెజ్ తినేవాళ్లకు వ్రతాలు, పూజలు పేరుతో నాన్‌వెజ్‌కి దూరం ఉంటేనే అబ్బా నాలుకు చప్పబడిపోయినా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది పూర్తిగా శాకాహారం అంటే చాలా కష్టం. ఇది వ్యక్తిగతంగా రావాల్సిన మార్పు. అనుకున్నదే తడువుగా చేసేయడం అన్నది సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియా లేదా మరేదైనా క్రేజ్ కోసం అయినా ఏదైనా సాహసం చేయాలనుకుంటే సాధ్యసాధ్యాలు గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి. -
తీవ్ర విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..
అహ్మదాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఈలోపు జీవన్‌దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్ ప్రకటించింది. బ్రెయిన్‌డెడ్ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు.. ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. -
ఏడో నెలలో పుట్టిన శిశువు.. 750 గ్రాములే బరువు.. ప్రాణం పోసిన డాక్టర్లు..
జగిత్యాల: తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు 40 రోజులపాటు చికిత్స అందించి.. ప్రాణాలు నిలిపారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. బతుకుతుందో లేదోనన్న బిడ్డ ఆరోగ్యంగా బయటికి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన శ్రీలత డెలివరీకోసం మార్చి 29న కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. బ్లీడింగ్ అధికంగా కావడంతో అదేరోజు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. ఏడో నెలలో పుట్టిన శిశువు కావడంతో 750 గ్రాముల బరువే ఉంది. శ్వాససంబంధ రుగ్మత, రక్తం ఇన్ఫెక్షన్, తీవ్ర రక్తహీనతతో ఉంది. బతుకుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది. అయితే బంధువులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. పాపను వెంటనే పరీక్షించిన వైద్యులు.. కంటికి రెప్పలా కాపాడుతూ 40 రోజులపాటు వైద్యం అందించారు. దీంతో శిశువు 1,100 గ్రాముల బరువుకు చేరడంతోపాటు, ఆరోగ్యంగా తయారైంది. దీంతో సోమవారం తల్లీబిడ్డను డిశ్చార్జి చేశారు. తమ పాపను కాపాడిన వైద్యులు, సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువుకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని, జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంవో శశికాంత్‌రెడ్డి, ప్రొఫెసర్ అజామ్, డాక్టర్ స్నేహలత, నర్స్‌లు పాల్గొన్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల శిశువు.
భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్షాలుగా నిలిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భూ ప్రళయంలో కన్నుమూసిన వారు ఇప్పటి వరకు 25 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది. మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. తాజాగా హతయ్ ప్రావిన్సులో శిథిలాల కింద మరో మహిళ, నవజాత శిశువు మృత్యంజయులుగా నిలిచారు. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత శిథిలాల నుంచి తల్లితో సహా యాగిజ్ ఉలాస్ అనే పది రోజుల శిశువును అధికారులు రక్షించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మరణాన్ని జయించింది చిన్నారి. అనంతరం దుప్పటిలో చుట్టి హతే ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదే హతే ప్రావిన్స్‌లో భూ ప్రళయం చోటుచేసుకున్న 100 గంటల తర్వాత శిథిలాల నుంచి 3 ఏళ్ల జైనెప్ ఎలా పర్లక్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చదవండి: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..! -
శిథిలాల కిందే ప్రసవం.. ఆట గదరా శివ!
పుట్టుక.. మరణం.. రెండూ రక్తంతో కూడుకున్నవే. అందునా ప్రకృతి ప్రకోపంతో కన్నెర జేస్తే ఫలితం ఎలా ఉంటుందో తాజా భూకంపాలను చూస్తే సుస్పష్టమవుతుంది. అయితే.. లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమని ప్రతీతి. అందునా కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో!. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి. మూగబోయిన సెల్ఫోన్లు.. మంచు కురిసేంత చలికి వణికిపోతూ చేతికి దొరికిన పేపర్లను, అట్ట ముక్కలను, కవర్లను కాల్చుతూ చలి మంట కాచుకుంటున్నారు భూకంప బాధితులు. టర్కీ, సిరియాలో ఎటు చూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. తమవంతుగా సహాయక చర్యల్లో స్థానికులు సైతం పాల్గొని.. ఎందరినో కాపాడుతున్నారు. తాజాగా.. సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే!. దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సిరియాదే అయినా. టర్కీలోనిది అనే ప్రచారం కూడా నడస్తుండడం గమనార్హం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake. May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW — Talha Ch (@Talhaofficial01) February 6, 2023 -
అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అమనుష ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కమలానగర్లో గుర్తు వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. రెండ్ అపార్టమెంట్ల మధ్య ఆవరణలో కేవలం ఒకరోజు వయసున్న శిశువును వదిలి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద పసికందును చూసి చలించిపోయిన ఎస్సై స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని వైద్యం నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పట్ల మానవాత్వం చాటుకున్న ఎస్సైని స్థానికులు కొనియాడారు. చదవండి: పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా -
అంత్యక్రియల్లో జాప్యం.. నిలిచిన ప్రాణం
సాక్షి, హైదరాబాద్: ‘ఆలస్యం.. అమృతం విషం’ అంటారు. కానీ ఇక్కడ ఆలస్యమే అమృతమై పసికందుకు ప్రాణాలు పోసింది. వివరాల్లోకి వెళితే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు చెందిన అన్నం శ్రీకాంత్ భార్య ఘట్కేసర్ హాస్పిటల్లో మగ శిశువుకు ఇటీవల జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 10 రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. వెంటిలేటర్ తీసేస్తే బాబు బతకడని చెప్పిన వైద్యులు, రూ.4 లక్షలు బిల్లు కట్టించుకుని బుధవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకొచ్చాక సమాధి చేసేందుకు ‘వసంత వ్యాలీ’ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో గుంత తవ్వించారు. ఇంతలో కాలనీవాసులు ఇది శ్మశానవాటిక కాదని, ఇందులో సమాధి చేయొద్దని అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అకస్మాత్తుగా పసికందులో కదలికలు ప్రారంభమయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు -
భద్రాచలంలో ‘బాహుబలి’ బేబీ
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ.. బేబీ బాహుబలికి మంగళవారం జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వైద్యులు బుధవారం మీడియాకు వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2.3 కేజీల నుంచి 3.7 కేజీల వరకు బరువుంటారు. కానీ, ఈ పాప ఏకంగా 5 కేజీల బరువుంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ సాకేత తెలిపారు. దుమ్ముగూడెం మండలం దబ్బనుతాళం గ్రామానికి చెందిన గంగా భవానీ ఈనెల 2న ఆస్పత్రిలో చేరగా మంగళవారం సిజేరియన్ చేశారు. (క్లిక్: వస్తామన్న బస్సు రానే వచ్చింది.. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్..) -
Viral Video: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్లో స్వాగతం
పుట్టేదీ ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఆడపిల్ల పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పల్లో పడేసే దారుణాల గురించి కూడా ఎన్నో విన్నాం. ఆడపిల్లగా పుట్టి పెరిగినా సమాజంలో చిన్న చూపు మాత్రం పోలేదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మారింది. పుట్టబోయేది ఎవరైనా సరే తల్లిదండ్రులు వారిని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు. తాజాగా కూతురు పుట్టిందన్న సంతోషంలో ఓ కుటుంబం ఉబ్బితబ్బి అయిపోయింది. కూతురిని ఆసుపత్రి నుంచి ఇంటికి ఆహ్వానించేందుకు వినూత్నంగా ఆలోచించారు. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్‌తో స్వాగతం పలికారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని ఖేడ్ పట్టణానికి చెందిన విశాల్ జరేకర్ అనే న్యాయవాదికి జనవరి 22న పాప పుట్టింది. బోసారి పట్టణంలో జన్మించిన ఆ పాపకు రాజలక్ష్మీ అని నామకరణం చేశారు. కాగా విశాల్ కుటుంబంలో చాలా ఏళ్ల తరువాత ఆడపిల్ల పుట్టింది. దీంతో చిట్టితల్లిని ఇంటిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. చిన్నారిని ఖేడ్‌లోని ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను బుక్ చేశారు. ఇందుకోసం లక్షరూపాయలు ఖర్చు చేశాడు. ఇంటి దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన స్థలం లేకపోవడంతో వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. అలా హెలికాప్ట్ ద్వారా విశాల్ తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం #WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father (Source: Family) pic.twitter.com/tA4BoGuRbv — ANI (@ANI) April 5, 2022 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా అమ్మాయి తండ్రి విశాల్ మాట్లాడుతూ.. ఇంట్లో ఆడపిల్ల పుట్టడాన్ని పండుగలా జరుపుకోవాలనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే మనషులకు విశాల్ ఆదర్శంగా నిలిచాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సహారా మొదటి గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం ఉదయం మృత శిశువు తలను కుక్కలు తీసుకువచ్చాయి. దీనిని గుర్తించిన స్థానిక పాలబూత్ యజమాని కుక్కను తరిమి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మొండెం కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జీజీహెచ్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు సురక్షితం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు సురక్షితంగా ఉన్నాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెహ్రూనగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో..4 రోజుల పసికందును కిడ్నాప్ చేశారు. అయితే, కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ లభించింది. అక్కడ వార్డు బాయ్ మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. -
భార్యాభర్తల మధ్య గొడవ.. 22 రోజుల పసికందు బలి
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో పసికందును బలిచేశారు భార్యాభర్తలు. దంపతుల మధ్య తలెత్తిన గొడవ కాస్త పసికందు ప్రాణం తీసింది. బాలింత అయిన భార్య, రోజుల శిశువుపై నిందితుడు రాజు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 22 రోజుల శిశువుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు పసికందు తల్లిదండ్రులైన రాజేష్ అలియాస్ రాజు, జాహ్నవిలను అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సైదాబాద్ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి) రాజేశ్, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం ఈ దంపతులు వారి తొలి సంతానం.. ఐదు నెలల బాబును మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని కాపాడి.. అతడి సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్ చేర్చారు. రెండో సంతానం కూడా వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పసికందు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. -
చెత్తకుప్పలో నవజాత ఆడశిశువు
నాగర్‌కర్నూల్ క్రైం: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు చెత్తకుప్పలోకి చేరింది. కళ్లు తెరవని పసికందు చెత్తకుప్పల నడుమ ఆకలికేకలతో దర్శనమిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం శివారులోని గొల్లగేరి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తకుప్పల మధ్య ఆదివారం ఓ నవజాత ఆడశిశువు కన్పించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై విజయ్‌కుమార్ శిశువును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని, ఐదురోజుల ఆడశిశువుగా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, డంపింగ్‌యార్డులో శిశువు ను వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన అవివాహిత ప్రైవేట్ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చి పురిటిబిడ్డను శౌచాలయం కిటికీలోంచి విసిరేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. హెసరఘట్టకు చెందిన మహిళ (22) అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి దాఖలయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పురిటిబిడ్డను శౌచాలయంలోని కిటికీలోంచి విసిరేసి పరారైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. -
అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): భర్త వేధింపులు తాళలేక ఓ తల్లి తన కొడుకును డ్రైనేజీలో పడేయగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడలోని కామినేనినగర్ డొంకరోడ్డు కాలనీలో జరిగింది. వల్లెపు మీనాక్షి డొంకరోడ్డు కాలనీకి చెందిన జయరాంను ద్వితీయ వివాహం చేసుకుంది. వీరికి 6 నెలల కిందట సామ్యేలు జన్మించాడు. మీనాక్షిపై భర్తకు అనుమానం పెరిగింది. జయరాంకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉంది. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో విసిగిపోయిన మీనాక్షి బుధవారం ఉదయం 5 గంటలకు సామ్యేలును తీసుకొని కాలనీ పక్కనే ఉన్న గుంటతిప్ప డ్రైనేజీలో పడేసింది. కాలనీ వాసులు సామ్యేలు కోసం డ్రైనేజీలో గాలించారు. సామ్యేలు మృతదేహాన్ని బయటకు తీసి విషయాన్ని పటమట పోలీసులకు చెప్పారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే -
అప్పుడే పుట్టిన పసిబిడ్డ చెత్తకుప్పలో..
కుభీర్(ముథోల్): నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పల్లో పారేశారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనక నిర్మానుష్య ప్రదేశంలో చెత్తకుప్పల నుంచి ఆదివారం ఉదయం ఏడుపు వినిపించడంతో అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న స్థానికులు శిశువును గుర్తించారు. గ్రామస్తులు స్థానిక ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్ సీడీపీవో నాగలక్షి్మ, సూపర్వైజర్ భారతి శిశువును భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం శిశువును ఆదిలాబాద్‌లోని శిశు గృహకు తరలించారు. శిశువును చెత్తకుప్పలో ఎవరు పడేశారన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
కోటనందూరు పీహెచ్సీలో శిశుమరణం
సాక్షి, కోటనందూరు: కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశుమరణం సంభవించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం స్థానిక పీహెచ్సీ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యాధికారి, వైద్య, పారామెడికల్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇదీ పరిస్థితి ఈనెల 26వ తేదీ శనివారం కోటనందూరుకు చెందిన గర్భిణి లక్ష్మీ రాధను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. రెగ్యులర్ స్టాఫ్‌నర్సు సెలవులో ఉండడంతో ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న హెచ్వీ, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు కేసును చేర్చుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారి పర్యవేక్షణలోనే లక్ష్మీరాథ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు నైట్ డ్యూటీ స్టాఫ్‌నర్సు విధులకు హాజరయ్యారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ గర్భిణీ పరిస్థితి అంతా సవ్యంగానే ఉంది. డెలివరీ సమయం సమీపించడంతో హెచ్వీ, ఫార్మాసిస్టు సహకారంతో స్టాఫ్‌నర్సు రాత్రి 10.15 నిమిషాలకు ప్రసవం చేసారు. పసికందు పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడ డాక్టర్లు ధ్రువీకరించారు. ఎటువంటి సమాచారం లేదు: వైద్యాధికారి ఈ విషయంపై వైద్యాధికారి ఇందిరాప్రియదర్శిని వివరణ కోరగా శనివారం అంతా ఎన్సీడీసీడీ సర్వేలో ఉన్నామని, ఈ కేసు సమాచారం తనకు తెలియదని చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాక రాత్రి 12.30 గంటలకు సమాచారమిచ్చారన్నారు. ఆదివారం ఉదయం వచ్చి కేసును పరిశీలించానన్నారు. డీడీఓ వైద్యాధికారి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పనిభారం పెరిగిందని, ప్రసవాల విషయంలో అప్రమత్తంగా ఉంటామని వివరించారు. (చదవండి: అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..) సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం వైద్యాధికారి విధుల్లో లేరని, సిబ్బంది, మెడికల్ అధికారి మధ్య సమన్వయం కొరవడడంతోనే సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శిశువు బొడ్డు దగ్గర ప్రేగు మెడకు చుట్టుకోవడం, చేయి మడత పడి ఉండడం వల్ల శిశువు ఇబ్బందులకు గురైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం స్కానింగు రిపోర్ట్‌లో ఎక్కడా లేకపోవడం, డెలివరీ సమయం సమీపించడంతో ఇక్కడ ప్రసవం చేసామని వివరించారు. స్కానింగ్ రిపోర్ట్ అంతా సవ్యంగా ఉండడంతోనే ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు చెప్పారు. -
బాత్రూంలో ప్రసవం.. భయంతో బిడ్డను
న్యూయార్క్ : ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే కన్నతల్లి తన బిడ్డపై చూపించే ప్రేమ ఒకేలా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా బిడ్డకు మాత్రం హాని తలపెట్టదు. తాను కష్టాలు ఎదుర్కొనైనా సరే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కన్నతల్లి ప్రేమ అలాంటిది. కానీ ఇక్కడ ఒక కన్నతల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును కిటీకీలోంచి విసిరేసి మాతృత్వం అనే పదానికి కళంకం తెచ్చింది. ఈ హృదయవిదారక ఘటన అక్టోబర్ 10న అమెరికాలో న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. (చదవండి : రాక్షసి: గర్భిణిని చంపి, బిడ్డను తీసుకొని...) వివరాలు ... న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో భారత సంతతికి చెందిన అమెరికా 23 ఏండ్ల యువతి సబితా దూక్రమ్ భర్తతో కలిసి నివసిస్తుంది. గర్భవతి అయిన సబితా దూక్రమ్ ఈనెల 10న బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ప్రసవించింది. భయంతో ఏం చేయాలో తెలియక అప్పుడే పుట్టిన పసికందును బాత్రూం వెంటిలేటర్ నుంచి బయటికి విసిరేసింది. అనంతరం బాత్రూంను శుభ్రపర్చి స్నానం చేసి యధావిథిగా వచ్చి బెడ్‌పై పడుకుంది.అయితే పసికందు ఏడుపు శబ్ధం విన్న ఇరుగుపొరుగు వారు ఆ పసికందును ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసవించిన విషయాన్ని కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని అడిగిన ప్రశ్నకు సబితా దూక్రమ్ చెప్పిన సమాధానం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె కన్నతల్లేనా అనే అనుమానం కూడా వస్తుంది. 'నేను బాత్రూం వెళ్లి స్నానం చేస్తుండగా బాబు పుట్టాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. బాత్రూంలో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కట్‌చేసి బాబును బయటికి విసిరేశా. ఆ తర్వాత నా దుస్తులను బాత్రూంలోని వాషింగ్‌మెషిన్‌లో పడేసి, బాత్రూంను శుభ్రంగా కడిగి బయటికి వచ్చి బెడ్రూంలో పడుకున్నా' అని చెప్పింది. అసలు సబితా దుక్రమ్ భయంతో నిజంగానే బిడ్డను పారేసిందా లేక మతిస్థిమితం తప్పి అలా ప్రవర్తించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంలో సబితా దూక్రమ్ను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
16వ బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి
భోపాల్: 16వ బిడ్డకు జన్మనిస్తూ.. ఓ మహిళ చనిపోయింది. విషాదం ఏంటంటే తల్లి మరణించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నవజాత శిశువు కూడా మరణించింది. వివరాలు.. మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాకు చెందిన సుఖ్రాని అహిర్వర్ 16వ సారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమెకు నొప్పులు వచ్చాయి. దాంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గుర్తింపు పొందిన ఆశా కార్యకర్త కల్లో బాయి విశ్వకర్మ సుఖ్రానికి డెలివరీ చేసింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి నిమిషాల వ్యవధిలోనే కన్ను మూసింది. మరి కాసేపటికే నవజాత శిశువు కూడా మృతి చెందింది. (చదవండి: చెన్నూర్‌లో వింత శిశువు జననం) ఈ సందర్భంగా విశ్వకర్మ మాట్లాడుతూ.. ‘డెలివరీ తర్వాత సుఖ్రాని, ఆమె నవజాత శిశువు పరిస్థితి విషమంగా మారటంతో వారిద్దరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాము. అక్కడ చేరిన వెంటనే తల్లి.. కాసేపటికే బిడ్డ చనిపోయినట్లు తెలిసింది. సుఖ్రాని గతంలో 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ వారిలో ఏడుగురు చనిపోయారు’ అని తెలిపింది. దీని గురించి జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది పీటీఐకి తెలపడంతో వెలుగులోకి వచ్చింది. -
చెన్నూర్‌లో వింత శిశువు జననం
సాక్షి, చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. కానీ పుట్టిన గంటకే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అరుణశ్రీ వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంక శనివారం ఉదయం ప్రసూతి కోసం ఆస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవంలో మగ శిశువు పుట్టింది. శిశువు నుదుటిపైన ఒంటి కన్నులాంటి అవయవం ఉండటంతో గంటకే మృతి చెందింది. జన్యుపరమైన లోపంతో ఇలాంటి వింత ఆకారంలో శిశువులు పుడుతారని వైద్యులు తెలిపారు. ఆసంపల్లి ప్రియాంక శంకర్ దంపతులకు మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది, రెండో కాన్పులో మగ బిడ్డ వింత రూపంతో పుట్టడంతో పాటు గంటకే మృతి చెందడంతో దంపతులు కన్నీటి పర్యాంతమయ్యారు. (నాడు తల్లి.. నిన్న తండ్రి మృతి)