not
-
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్‌పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం. ‘సైంధవ్’ రావాలి కానీ... ‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది. ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం. నా సామి రంగ.. వచ్చే ఏడాదే గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవి నుంచి సంక్రాంతికి.. ‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2024 నుంచి నో గ్యాప్ 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. లేట్‌గా డ్యూటీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్ ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది. -
Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మానియానే కనిపిస్తుంది. ప్రభాస్-కృతిసనన్ నటించిన ఈ సినిమా (జూన్ 16) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మూడురోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ అమెరికాలో 'ఆదిపురుష్' తమిళ వెర్షన్ కోసం కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. యూఎస్‌లో 255 థియేటర్లలో మొత్తం 1009 షోలు మొదటిరోజు ప్రదర్శించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి) ఇందులో తెలుగు 552షోలు, హిందీ 436 షోలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. కానీ తమిళ్ వర్షన్‌కు 21 షోలకు గాను కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. ఈ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో కూడా 'ఆదిపురుష్'కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. అక్కడ హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. దీనిని బట్టి వారు సినిమాను వ్యతిరేకిస్తున్నారా? అన్నట్లు ఉంది. ఢిల్లీలో 'ఆదిపురుష్' రేంజ్ మామూలగా లేదు ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్లో 'ఆదిపురుష్' టికెట్ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2200. అక్కడి థియేటర్లో 9.15pm షోకి 'ఆదిపురుష్' (హిందీ) 2D వెర్షన్ చూడాలంటే రూ.2000, చెల్లించాల్సి ఉంది. ఇదే థియేటర్లో 7pm షోకి 3D వెర్షన్ టికెట్ ధర రూ.2250 ఉంది. అంతే కాకుండా బాలీవుడ్లో మొదటిరోజు టిక్కెట్లన్ని సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో దీనినిబట్టే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ నేతలు
-
టీడీపీ అభ్యర్థులైతే తూచ్
కావలి: కావలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిష్పక్షపాతంగా కోడ్‌ను అమలు చేయాల్సిన ఎన్నికల అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నా కోడ్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చామకూరు శ్రీధర్ సబ్‌కలెక్టర్‌గా చేరిన తర్వాత మొదటి ఎన్నికలు కావడంతో కింద స్థాయి సిబ్బందిపై ఆధారపడుతున్నారు. కింద స్థాయి సిబ్బందిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న వారు మితిమీరిన జోక్యం చేసుకుంటూ ఆయన్ని తమ దారిలో తెచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు సమాచారాన్ని అందజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారికి ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థుల ‘హ్యాండ్‌బుక్ ఫిబ్రవరి– 2019’ పేజీ నంబర్ 130లో రూల్ నంబర్ 11.3.2లో వివరింగా పొందుపరిచారు. అయితే కావలి ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నట్లుగా వ్యహరించారు. ఎన్నికల అధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో టీడీపీకి అనుకూలమైన వారి ద్వారానే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల అధికారి పాత్ర విమర్శలకు దారితీసింది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ మాన్యువల్‌లో పేజీ నంబర్ 29లో రూల్‌నంబర్ 4.4లో బీ5 ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర కావలిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ దీనిపై నేటి వరకు ఎన్నికల అధికారి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ మాన్యువల్‌లో పేజీ నంబర్ 144లో రూల్ నంబర్ 22.4 ప్రకారం తాత్కాలిక పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీ సైజు 4 ..8 అడుగులలో మాత్రమే ఉండాలని పొందుపరిచారు. అయితే పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి దగ్గరలో ఏర్పాటు చేసిన టీడీపీ తాత్కాలిక కార్యాలయం వద్ద 5..30 అడుగులతో ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించిన ఖర్చులు వివరాలను ఎన్నికల అధికారి పరిశీలించి అభ్యర్థి లెక్కల్లో నిర్ధిష్టంగా కనబరచాలి. కానీ ఇవేమీ జరగలేదు. ప్రయివేటు విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించకూడదు. కానీ టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కావలిలోని పమిడి స్కూల్ ఆవరణలో భారీ సమావేశం నిర్వహించారు. ‘అభ్యర్థుల హ్యాండ్ బుక్–ఫిబ్రవరి–2019’ పేజీ నంబర్ 89,265లో ప్రయివేటు విద్యాసంస్థల్లో రాజీకీయ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టంగా పొందుపరిచి ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటేయని వారు 1,96,124 : వరంగల్ అర్బన్
సాక్షి, హన్మకొండ అర్బన్: పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎవరికెన్ని ఓట్లు పోలై ఉంటాయని అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలు వేసుకుంటుండగా, జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగిందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా చర్చంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లిన వారి గురించే జరుగుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,96,124 మంది అంటే.. సుమారు 30 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ముఖం చూడలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటర్ లిస్ట్ మార్క్డ్ జాబితా ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,78,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,81,912 మంది ఓటర్లు(71.40 శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినా పెరిగింది.. జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల సమయంలో మొత్తం 6,78,090 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,67,335 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 68.43 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 2018 ఎన్నికల్లో మాత్రం 71.40 శాతం ఓట్లు పోల్ కావడంతో గతంకన్నా 2.97 శాతం పెరిగినట్లయ్యింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సారి పశ్చిమలో 1.46 శాతం పెరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5.56 శాతం పోలింగ్ పెరిగింది. ఇక వరంగల్ తూర్పులో మాత్రం ఊహించని విధంగా పోలింగ్ గతంకన్నా 1.96 శాతం తగ్గింది. మరో విశేషం ఏమిటంటే జిల్లాలో 2014 ఓటర్ల జాబితాలో కన్నా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 54 మంది తక్కువగా ఉన్నారు. వరంగల్ పశ్చిమలో అత్యధికంగా 1,00,471 మంది ఓటు వేయలేదు. ఇక్కడ 41.71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. వరంగల్ తూర్పులో 58,169 మంది పోలింగ్‌కు రాలేదు. ఇక్కడ 27.47 శాతం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. వర్ధన్నపేటలో 37,484 మంది ఓటేయలేదు. ఇక్కడ 16.63 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. మొత్తంగా ఓటర్ల జాబితాలో 2 శాతం వరకు మరణించిన వారివి, మరికొందరివి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు మినహా మిగతావారు ఓటేయలేదని అధికారులు భావిస్తున్నారు. -
ఆగని చిరుత దాడులు
రామాయంపేట(మెదక్): చిరుతల దాడుల పరంపర కొనసాగుతుంది. గత పదిహేను రోజులుగా ప్రతిరోజూ మండలంలోని ఏదో చోట చిరుత దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఆయా గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి చిరుతలు మండలంలోని అక్కన్నపేటలో రెండు, లక్ష్మాపూర్ పరిధిలో ఒక దూడను హతమార్చాయి. అక్కన్నపేటకు చెందిన వెల్ముల లక్ష్మి తన పశువులను అటవీప్రాంతానికి సమీపంలో పంటచేలవద్ద కట్టివేయగా, అర్థరాత్రి చిరుత దాడిచేసి రెండు దూడలను హతమార్చింది. ఉదయం లక్ష్మి తన పంటచేలవద్దకు వెళ్లి చూడగా, ఒక దూడ చనిపోయి ఉండగ, మరో దూడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కొద్దిసేపటి తరువాత మృతిచెందింది. మరో సంఘటనలో లక్ష్మాపూర్ గ్రామశివారులో చింత పోచయ్యకు చెందిన దూడను చిరుత ఎత్తుకెళ్లి హతమార్చింది. దీనితో రైతులు రాత్రి వేళలో పంట చేలవద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిరుతలను బంధించి తమను రక్షించాలని వారు అటవీశాఖ అ«ధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ శాఖ అధికారులు సంఘటనా స్థలిని సందర్శించారు. -
అభివృద్ధి ప్రసంగాల్లేవు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఎన్నికల కోడ్ ప్రభావం కాకినాడ సిటీ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ ప్రభావం జిల్లా కేంద్రంలో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై పడింది. ఏటా కాకినాడ పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరై పతాకావిష్కరణ చేసేవారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనవచ్చని, వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కేవలం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశంపైనే ప్రసంగం ఉండాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ పరంగా సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోల ప్రదర్శన లేకుండా చూడాలని సూచించింది. దీంతో జిల్లా ప్రగతికి సంబంధించిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే శకటాల ప్రదర్శనపై సందిగ్ధం ఏర్పడింది. ఏటా జిల్లా పోలీసు పేరెడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించేవారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో కార్యక్రమాన్ని కాకినాడ పోలీసు పేరెడ్ గ్రౌండ్ నుంచి కాకినాడ రూరల్ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌కు మార్పు చేస్తే ఎలా ఉంటుందనే తర్జనభర్జనలో అధికార యంత్రాంగం ఉంది. పతాకావిష్కరణ జిల్లా ఇన్చార్జి మంత్రి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పతావిష్కరణ జిల్లా ఇన్చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా మంత్రులే పతాకావిష్కరణలు చేశారు. 2014లో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, 2015లో ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, 2016లో మంత్రి చినరాజప్ప పతాకావిష్కరణ చేశారు. -
నిధులుండీ...నిర్లక్ష్యం
– ఎంపీ నిధుల వినియోగంలోరాష్ట్రంలోనే చివరి స్థానం - రూ.17 కోట్లున్నా పట్టించుకోని వైనం - అంత నిర్లక్ష్యమేమిటంటూ ప్రజల ఆగ్రహం - పట్టించుకోని ఎంపీ మురళీ మోహన్ నిధులు ఉన్నాయి...ప్రతి ఏటా ఆ నిధులకు అదనంగా జతై రెట్టింపవుతున్నాయి. గత మూడేళ్లుగా రెండు పదుల కోట్లకు చేరుకున్నాయి. పాత నిధులను కూడా వీటితో కలిపి అభివృద్ధి పనులకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. బాధ్యత ఉన్న ఏ ప్రజా ప్రతినిధి అయినా ఏం చేస్తారు ... కనీసం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రాంతంలోనైనా వెచ్చించి ప్రగతి పూవులు పూయిస్తారు. కానీ ఏడు శాసన సభా నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా ఎంపీ నిధుల కోటా కింద ఏటా రూ.5 కోట్లు చొప్పున గత మూడేళ్లలో రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందనంగా వచ్చి చేరాయి. ఈ లెక్కన మొత్తంగా రూ. 17.15 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. ఇన్ని నిధులు తన ఖాతాలో మూలుగుతున్నా తనకు పట్టనట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ. 2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు గ్రామంలో మహిళలు ఆర్థికంగా సాధికారిత సాధించాలన్న ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఇది. ఇప్పటి వరకు ఇక్కడ వేలాది మంది మహిళలు శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణం భవనం శిధిలావస్థకు చేరింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మూరు గ్రామం వచ్చినప్పుడు భవన సమస్యను అధికారులు వివరించారు. జిల్లా కలెక్టరు నుంచి ప్రజాప్రతినిధులందరికీ విన్నవించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.50 లక్షలతో మరమ్మతులు చేస్తే సరిపోతుందని అంచనా కూడా వేశారు. కానీ రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ఇదేమీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి సమస్యలు అనేకం వెంటాడుతున్నాయి. కానీ వాటిపై ఎంపీ దృష్టి పడటం లేదు. తనకొచ్చిన ఎంపీ నిధులు మురగడం తప్ప ఉపయోగం లేకుండాపోతోంది. సహ ఎంపీలు పోటీపడి ఖర్చు పెడుతున్నా ఈయనకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండడం లేదు. అంతేలే...చుట్టం చూపుకని నియోజకవర్గానికొచ్చే ఎంపీకి సమస్యలు ఎలా పడతాయని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తనకొచ్చిన నిధులను ఏదో ఓ రోజు తనకో, అనుయాయులకో లబ్థి చేకూరేలా ఖర్చు పెట్టేద్దామనుకుంటున్నారేమో గానీ మూడేళ్లగా వచ్చిన నిధుల జోలికి మాత్రం ఆయన పోవడం లేదు. నిధులు విడుదల ఇలా... ఎంపీ మురళీమోహన్‌కు ఏటా రూ.5 కోట్లు చొప్పున మూడేళ్లపాటు రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లెక్కన మొత్తంగా రూ.17.15 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. కానీ మురళీమోహన్‌కు చిత్తశుద్ధే లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇలా వినియోగించుకోవచ్చు... ఈ నిధులతో తాగునీటికి, రోడ్లకు, భవనాలకు, కల్వర్టులకు, విద్యకు, విద్యుత్ సౌకర్యానికి, కుటుంబ ఆరోగ్యానికి, ఇరిగేషన్‌కు, సంప్రప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి, రైల్వే రోడ్లు, రైల్వే వంతెనలకు, శానిటేషన్‌కు, క్రీడలకు, మత్స్యసంపద అభివృద్ధికి, వ్యవసాయానికి హేండ్లూమ్స్కు, పట్టణాభివృద్ధికి ఇలా ... ఎన్నింటికో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్క సమస్య మురళీ మోహన్‌కు పట్టకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నిధులుండీ నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘నిషా’ మహమ్మారిపై నిప్పులు
- సోమవారం అదే హోరు - అమలాపురం పట్టణంలో తెరుచుకోని మద్యం దుకాణాలు - ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ నిరసనలు - జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలు అమలాపురం టౌన్: ద్రవరూపంలోని ‘ఉపద్రవం’పై జనంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. తాగేవాడి కాలేయాన్నీ, వాడి కుటుంబ శ్రేయాన్నీ బలిగొనే మద్యం మాకొద్దంటూ వేలగొంతులు ఘోషిస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల నడుమ, గుడులకు, బడులకు చేరువలో బ్రాందీషాపుల ఏర్పాటుపై ప్రజలు భగ్గుమంటూనే ఉన్నారు. సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మద్యం షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తే, కొన్ని చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామస్తులు, కాకినాడ రూరల్ మండలం వేళంగిలో సిరిపురం కొప్పిశెట్టివారి పేట, జి.భావారం గ్రామస్తులు మహిళలతో నిరసనలకు దిగగా... కాకినాడ-రామచంద్రపురం, రాజోలు ప్రాంతాల్లో మహిళలు రాస్తారోకోచేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేయగా, కాకినాడలో ఎక్సైజ్ డీసీకి వినతిపత్రంఅందజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామస్తులు కాకినాడ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎక్సైజ్ డీసీకి, కాకినాడలో గాంధీనగర్ ప్రాంతీయులు జాయింట్ కలెక్టర్‌కు పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు గ్రామస్తులు పి.గన్నవరంలోని ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు. కోనసీమలో తెరుచుకోని దుకాణాలు... కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో మద్యం కొత్త పాలసీలో బార్లు, దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి ఎదరవుతున్న అభ్యంతరాలు, వ్యతిరేకతలతో ఎక్కడా మద్యం టింగమంటూ బోణి కాలేదు. పట్టణంలో మూడు బార్లు, ఎనిమిది దుకాణాలకు వ్యాపారులు లెసెన్సులు పొంది ఉన్నారు. ఒక్కో బార్‌కు రూ.22 లక్షలు..ఒక్కో దుకాణానికి రూ.11 లక్షలు వంతున ప్రభుత్వానికి చెల్లించేసి ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి బార్లు, దుకాణాలు తెరుచుకుని వ్యాపారాలు చేసుకోవాల్సి ఉంది. నెల మొదలై అప్పుడు మూడు రోజులు గడుస్తున్నా పట్టణంలో ఇప్పటిదాకా బార్లు, దుకాణాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, దుకాణాలే నిర్ధారణ కాలేదు. ఇప్పటికే పది మంది వ్యాపారులు ప్రభుత్వానికి రూ.1.30 కోట్ల మేరు సొమ్ములు చెల్లించేసినా వ్యాపారాలు మొదలు కాకపోవటం ఒక సమస్యయితే ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ ప్రజల నుంచి అభ్యంతరాలు ఎదురు కావటం వారికి తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే పట్టణంలో సావరం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఏర్పాటు చేయబోయే దుకాణంపై అక్కడ ప్రజలు నేరుగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. పట్టణ శివారు పేరూరు వై.జంక్షన్ సమీపంలో 216 జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో పెడుతున్న దుకాణానికి అభ్యంతరాలు అనివార్యమయ్యాయి. మద్యం పాలసీపరంగా పట్టణ పరిధిలోకి వచ్చే పేరూరు గ్రామంలో కూడా దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ ఆ గ్రామానికి చెందిన మహిళలు అమలాపురంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం తరలివచ్చి ధర్నా చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తే సహించేది లేదని అధికారులను మహిళలు హెచ్చరించారు. మద్యం దుకాణాలంటే ఎక్కడో ఓ చోట చిన్న జాగాలో కనీసం షెడ్డులోనైనా ఏర్పాటుచేసుకునే వీలుంటుంది. అదే బార్లకు భవనం ఉండాలి. పట్టణానికి దూరంగా ఆ స్థాయిలో భవనాలు దొరక్క... ఉన్నా బార్లకు అంటే అద్దెకు ఇవ్వక..ప్రజల నుంచి నిరసనలను ఎదుర్కొనలేక బార్ల లైసెన్సుదారులు ఆందోళనలో పడ్డారు. కామనగరువులో దుకాణం తెరుచుకున్నా సమీపంలోనే ఓ విద్యా సంస్థ ఉండటంతో ఆ దుకాణాన్ని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. -
రైతుకు అందని... పెట్టుబడి రాయితీ
- మూడు తుపాన్ల సొమ్ముల ప్రభుత్వం వద్దే - హెలిన్..భారీ వర్షాల పెట్టుబడి రాయితీ ఇవ్వనంటున్న బాబు సర్కార్ - రెండేళ్ల క్రితం తుపాను రాయితీ కూడా అందని తీరు - పెట్టుబడుల కోసం మళ్లీ బయట అప్పులే - కోనసీమలో రైతుల ఆందోళన అమలాపురం : ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్ల రూపాయిల పెట్టుబడి రాయితీ సొమ్ములు హామీలకే పరిమితమైంది. తుపాన్లు రావడం.. పంట నష్టపోవడం.. ఆనక కనీసం పెట్టుబడి రాయితీ సొమ్ములు కూడా రాకపోవడం రైతులకు పరిపాటిగా మారింది. పంట నష్టపోతే పరిహారం భరోసా లేకపోవడం వల్లే డెల్టాలో ముంపు ప్రాంత రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో గడిచిన ఆరేళ్లలో మూడుసార్లు భారీ తుపాన్లు వచ్చి రైతులు రూ.వందల కోట్ల రూపాయిల పంటను కోల్పోయారు. ఆయా సందర్భాలలో సందర్భాలలో ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వేలు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో హెలెన్ తో పాటు భారీ వర్షాలు కారణంగా జిల్లాలో వరితోపాటు వాణిజ్య, కూరగాయ పంటలను రైతులు ఎక్కువగా నష్టపోయారు. హెలెన్‌కు సంబంధించి 1.23 లక్షల మంది రైతులకు రూ.53 కోట్లు, 2013లో భారీ వర్షాలకు సంబంధించి 1.50 లక్షల మంది రైతులకు రూ.71 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. అంతకుముందు నీలం పరిహారం 3.09 లక్షల మంది రైతులకు రూ.144 మంజూరైనా ఇప్పటికీ సుమారు 12 వేల మందికి రూ.ఆరు కోట్లు చెల్లించాల్సి ఉండడం గమనార్హం. వీటికి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలు రావడంతో జీవో జారీ చేయలేదు. కొత్త రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రచారంలో పెట్టుబడి రాయితీని అటకెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిహారం ఇప్పుడెలా ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకుంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 2015–16 తుపాను పరిహారం రూ.162 కోట్లు వరకు జిల్లాకు పెట్టుబడి రాయితీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారాన్ని జూన్ 20 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. తీరా గత ఏడాది కరువు పరిహారం ఇస్తామని చెప్పి అంతకుముందు ఏటా తుపాను పరిహారాన్ని అటకెక్కించే యత్నం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబు ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాయితీగా రైతులకు అందకపోవడం విశేషం. సాధారణం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకూడదని, తరువాత పంటను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీగా సొమ్ములు చెల్లిస్తారు. పంట తరువాత పంటకు అటుంచి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా రైతులను గాలికి వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కనీసం పాత బకాయిలన్నా సాగు ఆరంభానికి ముందు ఇస్తే ఖరీఫ్‌కు కొంత వరకు పెట్టుబడి సొమ్ములు వస్తాయని ఆశించిన రైతులు ప్రభుత్వం మరోసారి నిరాశ పరిచింది. దీంతో వారు బయట అప్పులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వకూడదనే జీవో ఇచ్చి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. రైతులు ఆందోళనలు... పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బుధవారం కోనసీమలో ఆందోళన చేపట్టారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంతోపాటు కోనసీమలోని 16 తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీ, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు నాయకత్వం వహించారు. పెట్టుబడి రాయితీలను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంఘం నాయకులు అప్పారి చిన వెంకటరమణ, అడ్డాల గోపాలకృష్ణ, రేకపల్లి ప్రసాద్, అబ్బిరెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎదురు చూడాలా? ఎక్కడైనా చేరాలా?
-‘నవోదయ’ ప్రవేశపరీక్ష రాసిన విద్యార్థుల సందిగ్ధం -ఐదు నెలలైనా వెల్లడి కాని ఫలితాలు -ఏటా బడులు తెరిచే నాటికే విడుదల రాయవరం (మండపేట) : జవహర్ నవోదయ విద్యాసంస్థలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించి ఐదు నెలలు కావస్తోంది. ఫలితాలు విడుదలైతే నవోదయలో చేరుదామనే ఆశతో వేలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నవోదయ పరీక్ష రాసిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఫలితాల కోసం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నారు. బిడ్డలు నవోదయలో సీటు సాధిస్తే సరేసరి, లేకుంటే వేరే స్కూళ్లో చేర్చడానికైనా ఫలితాలు వస్తే బాగుండుననుకుంటున్నారు. పల్లెల్లోని ప్రతిభావంతుల కోసం.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అధునాతన విద్యావిధానాన్ని అందించడం కోసం 1986లో రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులకు హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో నాణ్యమైన విద్యనందిస్తారు. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. 6వ తరగతిలో పరిమితంగా 80 సీట్లే ఉండడంతో అంతే మంది విద్యార్థులను చేర్చుకుంటారు. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జనవరి 8న నిర్వహించారు. జిల్లాలో 80 సీట్లకు 64 కేంద్రాల్లో 13,600 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పరీక్ష ఫలితాలు విడుదల కాలేదు. గతేడాది పాఠశాలల ప్రారంభ సమయానికి ఫలితాలు విడుదలయ్యాయి. ఆలోచనలో తల్లిదండ్రులు.. గత సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఐదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆరవ తరగతిలో ఎక్కడ చేర్పించాలోనన్న ఆలోచనలో పడ్డారు. నవోదయ పరీక్ష రాసిన విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ చిన్నారులను చేర్చిన అనంతరం నవోదయలో సీటు వస్తే పత్రాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పరీక్ష రాసి ఐదు నెలలైనా.. నేటికీ ఫలితాలు విడుదల కాకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా వీటి ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫలితాలు రాక సందిగ్ధం పాఠశాలల పునఃప్రారంభం నాటికే నవోదయ ఫలితాలు విడుదల చేస్తే ప్రయోజనం ఉంటుంది. మా పాప లీలామాధురి నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష రాసింది. ఐదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. వేరే పాఠశాలలో చేర్పించాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నాం. – కన్నూరి అర్జునుడు, టీచర్, రాయవరం ఇంత ఆలస్యం అనుచితం.. నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ముందుగానే విడుదల చేసేవారు. ఈ ఏడాది బాగా ఆలస్యం అయిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ పాఠశాలలో చేర్పించాలో నిర్ణయించుకోలేక పోతున్నారు. ఫలితాలు త్వరితగతిన విడుదల చేస్తే మంచిది. – పి. సుబ్బరాజు, అధ్యక్షుడు, ఎస్టీయూ -
మన హెచ్1బి వీసాలు మనకే.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: హెచ్ 1బి వీసాల అమెరికా కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. వివాదాస్పద వీసా సమస్యలపై భారతీయ టెక్ నిపుణులు, ఐటీ పరిశ్రమను భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది తప్ప, భారతీయులకు జారీ చేసే వీసాల సంఖ్య తగ్గదని తెలిపారు. ఇప్పటివరకు మనకు లభిస్తున్న హెచ్ 1 బీ వీసాలు మనకు దక్కుతాయని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాలకాలంలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై పుస్తకాన్ని సీతారామన్ శనివారం ఆవిష్కరించారు. అనతరం విలేఖరులతో మాట్లాడుతూ వీసాలపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఐటి పరిశ్రమను కోరారు. హెచ్ 1 బీ వీసాల జారీకి లాటరీ ప్రక్రియలో మార్పులు తేవాలని అమెరికా ప్రయత్నిస్తోందని తాను భావిస్తున్నానన్నారు. అంతే తప్పఇండియన్ టెకీలకు జారీ చేసి వీసాల సంఖ్య తగ్గదన్నారు. వీసా ఆందోళనలు అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉన్నపుడు కూడా ఉన్నాయన్నారు. అయితే వీసా జారీ ప్రక్రియలో మాత్రమే ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్దర్ మార్పు తీసుకొచ్చిందన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికా సహా వివిధ అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్యోగులను విదేశీ ఉద్యోగులకు కాకుండా స్థానికులకు దక్కేలా రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాల జారీలో లాటరీ పద్దతికి స్వస్తి పలికి మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ పాలసీతో భర్తీ చేయాలని కోరుతోందని ఆమె చెప్పారు. అలాగే అమెరికా వీసాల్లో కేవలం 17 శాతం మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్తున్నాయనీ, భారతీయ కంపెనీలు అందిస్తున్న సేవల ద్వారా అనేక అమెరికా కంపెనీలు లబ్ది పొందుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హెచ్ 1బీ వీసాల జారీ రివ్యూపై భారత ఆందోళనలను అమెరికాకు ఇప్పటికే వ్యక్తం చేసినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాల నేపథ్యంలో వీటిని తిరిగి సమీక్షిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలను తయారు చేయడానికి అధిక నైపుణ్యం అవసరమైన చోట ఫస్ట్ గ్రాడ్యుయేట్లను కాకుండా కచ్చితంగా నిపుణులకోసం అమెరికా చూస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
కిరోసిన్‌కు ‘పొగ’
- ఈ నెల కోటాలో కోత - జిల్లాకు ఇవ్వాల్సింది 1800 కిలోలీటర్లు.. ఇచ్చింది 1224 కిలోలీటర్లు - దానినే చౌక దుకాణాలకు సర్దుబాటు చేసిన అధికారులు - చివరిలో వచ్చే కార్డుదారులకు మొండిచేయే.. కాకినాడ సిటీ : చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ఇస్తున్న కిరోసిన్‌కు ‘పొగ’ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డులపై ఇస్తున్న ఒకటి రెండు లీటర్ల కిరోసిన్‌ను రెండు మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. రాష్ట్రాన్ని పొగ రహితంగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో జిల్లాకు కిరోసిన్ కేటాయింపులను ఆలస్యం చేసింది. మామూలుగా ప్రతి నెలా 20వ తేదీలోగానే చౌకదుకాణాలకు తరువాతి నెల సరుకుల కేటాయింపులు పూర్తయ్యేవి. కానీ ఈ నెలలో కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభించిన మూడు రోజులకు ప్రభుత్వం జిల్లాకు కిరోసిన్ కోటా కేటాయింపులు ఇచ్చింది. అది కూడా ఇవ్వాలిన కోటాలో కోత పెట్టింది. జిల్లాలోని మొత్తం 2,647 చౌక దుకాణాల పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెల్ల కార్డుదారులు 16,11,494 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్లు, ఉన్నవారికి ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. దీని ప్రకారం జిల్లాకు 1800 కిలోలీటర్ల కిరోసిన్ కావాలి. కానీ ప్రభుత్వం కోత పెట్టడంతో 1224 కిలోలీటర్ల కిరోసిన్ మాత్రమే ఇంతవరకూ వచ్చింది. అరకొర కేటాయింపులే.. చాలీచాలకుండా వచ్చిన ఆ కిరోసిన్‌ను సర్దుబాటు చేసేందుకు పౌర సరఫరాల అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు జిల్లాకు అరకొరగా వచ్చిన కిరోసిన్‌ను ఒక్కో చౌక దుకాణానికి 75 శాతం చొప్పున కేటాయించారు. దీని ప్రకారం హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు రేషన్ దుకాణాలకు సరుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సగంమంది రేషన్ డీలర్లకు మాత్రమే కిరోసిన్ అందించారు. మిగిలినవారికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికే మరో రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీనినిబట్టి కార్డుదారులకు కిరోసిన్ చేరడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది కార్డుదారులు కిరోసిన్ లేకుండానే ఉన్న సరుకులు తీసుకుని వెళ్లిపోయారు. అరకొర కేటాయింపుల కారణంగా ముందుగా వచ్చేవారికి తప్ప చివరిలో వచ్చేవారికి కిరోసిన్ దొరకని పరిస్థితి ఏర్పడనున్నది. భారమన్న ఉద్దేశంతోనే.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని భారంగా భావిస్తున్న ప్రభుత్వం దానిని ఎలాగోలా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్రం చక్కెర సబ్సిడీని తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఈ నెల పంచదారను విడుదల చేయలేదు. గోదాంలలో ఉన్న అరకొర నిల్వలనే జిల్లా అధికారులు చౌక దుకాణాలకు సర్దుబాటు చేశారు. కిరోసిన్ విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు గతంలో ఇస్తున్న 4 లీటర్ల కిరోసిన్‌ను గత నెల నుంచి 2 లీటర్లకు ప్రభుత్వం కుదించింది. తాజాగా ఈ నెల కేటాయింపుల్లోనే కోత పెట్టింది. కిరోసిన్ పంపిణీ చేపట్టాం జిల్లాలోని కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేపట్టాం. కేటాయింపులు ఆలస్యం కావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. గత నెల సీబీ, ఈ నెల కేటాయించిన కోటా కలుపుకుని చౌకదుకాణాలకు కిరోసిన్‌ను సర్దుబాటు చేశాం. -
పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన
దగాపడిన అన్నదాత రబీ వరి దిగుబడి ఘనం.. ధర చూస్తే దైన్యం ఆరుగాలం శ్రమించినా రైతుకు దక్కని లాభం బస్తా ధాన్యం రూ.900 నుంచి రూ.950కి కొంటున్న దళారులు అంతంతమాత్రంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రకృతి కరుణించి.. నేలతల్లి ఒడిలో పసిడి కంకులు పండించిన వేళ.. సిరుల రాశులు పొంగిపొరలుతాయనుకున్న అన్నదాత.. షరా మామూలుగానే మరోసారి దగా పడ్డాడు. అవసరమైన సమయంలో ప్రభుత్వం తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ఇదే అదునుగా అటు దళారులు, ఇటు ధాన్యం వ్యాపారులు ధర తగ్గించేయడంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. దీంతో అమ్మబోతే అడవి అన్నతీరుగా రైతు పరిస్థితి మారింది. అమలాపురం : అనావృష్టిని అధిగమించి.. ఆరుగాలం శ్రమించి.. డెల్టా రైతులు రబీ వరి సాగు చేశారు. మంచి ధరకు అమ్ముకుంటే లాభాలు కళ్లజూడవచ్చనుకున్నారు. ఏలేరు పరిధిలో నీటి ఎద్దడి వల్ల పోయిన పంట పోగా దక్కిన నాలుగు గింజలతో కనీసం పెట్టుబడులైనా పొందాలని ఆశించారు. కానీ వారి ఆశలను అటు ప్రభుత్వం.. ఇటు దళారులు, ధాన్యం వ్యాపారులు వమ్ము చేశారు. కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో.. లాభాల మాట దేవుడెరుగు.. రైతులు నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 4.75 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది. ఇందులో గోదావరి డెల్టా పరిధిలో 4 లక్షల ఎకరాలు కాగా, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. రెండుచోట్లా కలిపి సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ఏలేరులో నీటి ఎద్దడి వల్ల సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రైతులు రూ.17 కోట్ల మేర నష్టపోయారు. డెల్టాలో ఎకరాకు సగటున 48 బస్తాల దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 55 నుంచి 60 బస్తాల దిగుబడి కూడా రావడంతో లాభాలు పొందవచ్చని రైతులు ఆశించారు. కానీ ధాన్యం అమ్మకాల వద్దకు వచ్చేసరికి వారు నిలువునా మోసపోతున్నారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470 కాగా, 75 కేజీల బస్తా రూ.1,102 చొప్పున, గ్రేడ్-ఎ రకం బస్తా రూ.1,132 చేసి కొనుగోలు చేయాలి. కానీ ఏలేరు, డెల్టాల్లోని పలుచోట్ల సాధారణ రకం బస్తా ధాన్యాన్ని వ్యాపారులు కేవలం రూ.900 నుంచి రూ.950 చేసి మాత్రమే కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.250 చొప్పున ఎకరాకు రూ.9 వేల వరకూ నష్టపోయే దుస్థితి నెలకొంది. దీంతో కొంతమంది రైతులు అమ్మకాలు నిలిపి కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచేశారు. ధాన్యం వ్యాపారులు, దళారుల వద్ద ముందస్తు అప్పులు చేసిన రైతులు మాత్రం.. వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. యంత్రాల ద్వారా కోత కారణంగా ధాన్యంలో తేమ (నెమ్ము) 25 శాతం పైబడి ఉందని వంక పెడుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు. అక్కరకు రాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 285 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ మూడో వంతు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు. పైగా 17 శాతం తేమ వంటి నిబంధనల కారణంగా తెరిచిన ఆ కొద్దిపాటి కేంద్రాలవైపు రైతులు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడికి సరిపోతుంది పండిన పంట పెట్టుబడికి సరిపోతుంది. పెదపూడి గ్రామంలో రెండెకరాల్లో కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. 50 బస్తాలు వస్తుందనుకుంటే చివరిలో దోమ సోకి ఎకరాకు పది బస్తాల దిగుబడి తగ్గింది. యంత్రంతో కోసిన పంట 75 కేజీలు బొండాలు రకానికి రూ.1000, సన్నాలకు రూ.900 చొప్పున ధాన్యం కమిషన్ వ్యాపారులు ఇస్తున్నారు. దీనివల్ల మరింత నష్టపోయేలా ఉన్నాను. - వీవీ రమణ, కౌలురైతు, పెదపూడి -
ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగం
వైద్యశాఖలో కాంట్రాక్టు కొలువు ఏడు నెలలుగా జీతాలు అందని వైనం విధులు మానేస్తామంటున్న సిబ్బంది నిరుద్యోగులకు ఉపాధి అందనిపండే అవుతోంది. ఏదో అదృష్టం కొద్దీ కాంట్రాక్టు ఉద్యోగమైనా దొరికిందనుకుంటే జీతభత్యాల్లేని వెట్టి చాకిరీ కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. వైద్యశాఖలో 14 పోస్టులను తొమ్మిది నెలల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారు. అయితే వారికి ఏడు నెలలుగా జీతాల్లేవు. వారికి జీతాలెవరు ఇచ్చేదీ తేలకుండానే వారి గడువు మరో రెండు నెలల్లో ముగుస్తుండడం విశేషం. చింతూరు: అదిగో ఉద్యోగం.. వేలల్లో జీతం.. అంటూ కళ్లముందు రంగుల ప్రపంచాన్ని చూపుతూ గిరిజన నిరుద్యోగులను ఊహాల్లోకాల్లో విహరింపజేశారు. వాస్తవంలోకి వచ్చేసరికి ఆ రంగుల కల కరిగిపోయింది. తొమ్మిది నెలల కాంట్రాక్టు పద్ధతిపై వైద్యశాఖ విధుల్లో చేరిన వారికి ఏడు నెలలుగా జీతాలు రావడం లేదు. మరో రెండు నెలల్లో వారి గడువు ముగుస్తుండడంతో ఏం చేయాలో వారికి దిక్కుతోచడం లేదు. ఐటీడీఏ, వికాస ద్వారా భర్తీ విలీన మండలాల్లోని నిరుద్యోగుల కోసం గతేడాది సెప్టెంబర్‌లో రంపచోడవరం ఐటీడీఏ, వికాస సంస్థ ద్వారా వైద్యశాఖలో 14 పోస్టులను భర్తీ చేశారు. చింతూరు, కూనవరం, ఏడుగురాళ్లపల్లి, నెల్లిపాక, గౌరిదేవిపేట పీహెచ్‌సీల్లో ఎంఎన్‌వో, ఎఫ్ఎన్వో, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, కుక్, స్వీపర్ పోస్టులకు వారిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ. 12 వేల జీతం ఇస్తామని తొమ్మిది నెలలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లో చేరిన ఈ 14 మందికి ఈ ఏడాది జూన్‌తో కాలపరిమితి ముగుస్తోంది. ఏడు నెలలుగా జీతాల్లేవు తాము విధుల్లో చేరి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్కనెల జీతం కూడా అందుకోలేదని, తమవి వెట్టిచాకిరి బతుకులే అయ్యాయని ఆ కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. తమకు జీతాలు చెల్లించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రంపచోడవరం, చింతూరు పీవోలు, ఆర్డీవో, డీఎం అండ్ హెచ్‌వో, అడిషనల్ డీఎం అండ్ హెచ్వోలను కలసి మొరపెట్టుకున్నామని వారు తెలిపారు. ఏ అధికారి వద్దకు వెళ్లినా బడ్జెట్ లేదు, చూస్తాం, చేస్తాం అన్న మాటలే తప్ప ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు ఎవరివ్వాలనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. తమకు ఉద్యోగాలివ్వడమే పాపం అన్నట్టుగా అధికారుల చీత్కారాలతో విసిగి వేసారి పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొలువులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. తమ ఆశలన్నీ ఆవిరయ్యాయన్నారు. గడువు ముగుస్తుండడంతో తిరిగి తమను కొనసాగిస్తారో లేదో కూడా అనుమానంగా ఉందని వారు వాపోయారు. ఇళ్లలో ఒత్తిడి అధికమవుతోంది ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు. దాంతో ఇళ్లలో సైతం మాపై ఒత్తిడి అధికమవుతోంది. కుటుంబపోషణ కోసం కొలువుల్లో చేరితే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం. -మోసం రాములమ్మ, స్వీపర్, శబరికొత్తగూడెం, కూనవరం మండలం మానేయడమే శరణ్యం ఇతర మండలాల నుండి వచ్చి గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నాం. జీతాలు ఇవ్వకపోతే విధులు ఎలా నిర్వహించాలి? అందుకే అందరం కలసి మూకుమ్మడిగా మానేయాలని ఆలోచిస్తున్నాం. -ఆసు దుర్గాప్రసాద్, ఎఫ్ఎన్వో, రేపాక, కూనవరం మండలం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం 14 మందికి జీతాలు రానిమాట వాస్తవమే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. జీతాలకు సంబంధించిన ఫైల్ పంపమన్నారు. కానీ ఆ ఫైల్ మావద్ద లేదు. -డాక్టర్ శేషిరెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ, చింతూరు -
డీఎడ్ పరీక్షలు నిర్వహించేదెన్నడో?
పూర్తి కావొస్తున్న రెండో సంవత్సరం నేటికీ విడుదల కాని తొలి ఏడాది పరీక్షల షెడ్యూల్ ఆందోళనలో డీఎడ్ విద్యార్థులు రాయవరం (మండపేట) : వారంతా భావి ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులైన అనంతరం విద్యార్థులకు సమయానికి పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న వీరే పరీక్షలు ఎప్పుడు రాయాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. డీఎడ్ మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినా... తొలి సంవత్సరం పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయక పోవడంతో డీఎడ్ విద్యార్థులు(ఛాత్రోపాధ్యాయులు) ఆందోళన చెందుతున్నారు. భిన్నంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ విద్యార్థులు ఏ కోర్సు చదివినా సాధారణంగా జూన్, జూలై నెలల్లో పాఠాలు ప్రారంభించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యా సంవత్సరాన్ని ముగిస్తారు. డీఎడ్ విద్యార్థుల విషయంలో మాత్రం విద్యాశాఖ భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా అడ్మిషన్లు జూన్‌లో ప్రారంభించడం లేదు. అక్టోబరులో తరగతులు ప్రారంభించి సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయలేక పోతున్నారు. రాష్ట్ర విద్యాశాకాధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులకు సంవత్సరం కాలం వృథా అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ జిల్లాలో పరిస్థితి... రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) కళాశాల ఉండగా జిల్లాలో 60 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డైట్ కళాశాలలో 100 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కొన్ని చోట్ల బ్యాచ్‌కు 100 మంది, కొన్ని కళాశాలల్లో బ్యాచ్‌కు 50 మంది చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాలో సుమారుగా 3,900 మంది డీఎడ్ విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగు పెట్టి 11 నెలలు కావస్తున్నా నేటికీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయలేదు. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం పూర్తి చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో జిల్లా విద్యాశాకాధికారుల వద్ద కూడా ఎలాంటి సమాచారం లేదు. విద్యార్థుల సమస్యలివీ.. రెండో సంవత్సరం పూర్తి కావస్తున్నా వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే... రెండో సంవత్సర పాఠ్యాంశాలు చదవాలా..మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలా? అనే సందిగ్దంలో ఉన్నారు. రెండు సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు ఒకే సారి వెంట వెంటనే ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. మా భవిష్యత్తుతో చెలగాటమా? ప్రభుత్వం మా భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పాఠ్య పుస్తకాలను సైతం సకాలంలో అందించలేదు. నేటి వరకూ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. - షేక్ షమీలా బేగం, డీఎడ్ విద్యార్థిని, పలివెల, కొత్తపేట మండలం ఆశ్చర్యంగా ఉంది అకడమిక్ విద్యా సంవత్సరం ప్రకారం గత ఏడాది నవంబరు నాటికే మొదటి సంవత్సరం పూర్తవుతుంది. సెకండియర్ డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. అయినా నేటి వరకూ ఫస్టియర్ పరీక్షలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. - కె.చిరంజీవి, ప్రిన్సిపాల్, పలివెల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది డైట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించని విషయం వాస్తవమే. మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే రెండో సంవత్సరం సిలబస్ చదువుతున్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. - అప్పారి జయప్రకాష్, డైట్ ప్రిన్సిపాల్, బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్ షెడ్యూల్ విడుదల కావాలి డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదలైన వెంటనే పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. గత ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షల గురించి ఇప్పటి వరకూ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి షెడ్యూల్ రాలేదు. - జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ -
గాలింపు చర్యలు ముమ్మరం
లభ్యంకాని యువకుల మృత దేహాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హోంమంత్రి రాజప్ప కాకినాడ రూరల్ : సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకుల జాడ శుక్రవారం రాత్రికి కూడా దొరకలేదు. తాళ్లరేవు మండలం కాపులపాలెం గ్రామానికి చెందిన పితాని గోవిందు కుటుంబ సభ్యులు గురువారం సముద్రంలో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరు యువకులు గల్లంతైన విషయం విదితమే. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మత్స్యశాఖ ఇ¯ŒSస్పెక్టర్ చెల్లే ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. 26 మంది గజ ఈతగాళ్ల, మరో 20 మంది మత్స్యకారులతో పెద్ద వల వేసి గాలిస్తున్నారు. తహసీల్దార్ జె.సింహాద్రి సముద్రపు ఒడ్డునే ఉండి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం హోం మంత్రి కాకినాడ క్రైం : కాండ్రకోట నూకాలమ్మవారి దర్శనం అనంతరం కాకినాడ బీచ్‌కి వెళ్లి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన కలెక్టర్ ఆరుణ్కుమార్తో కలిసి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం పరామర్శించారు. మృతి చెందిన పెద్దలకు రూ. 3 లక్షలు, చిన్నారులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. బీచ్‌లో ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయించాలి్సందిగా కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. కాకినాడ సముద్ర తీరం ఆనుకుని బీచ్‌లో డ్రెడ్జింగ్, పోర్టు కార్యకలాపాలు అధికంగా జరగడంతో సముద్రం లోపల కరెంట్ అధికంగా ఉంటుందని, దీంతో అసాధారణ రీతిలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసి పడుతాయని రాజప్ప చెప్పారు. తీరంలో రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పర్యాటకులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న శీలం శ్రీను, పితాని రమ్య, శీలం తనుకులమ్మను ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్ఎంవో డాక్టర్ సుధీర్‌ను ఆదేశించారు. బంధువులను ఓదార్చారు. బాధితులను పరామర్శించిన వారిలో శాసన మండలి ఉపాధక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుతో పాటూ పలువురు నేతలు ఉన్నారు. రాకాసి కెరటాలకు బలయ్యారు అప్పటి వరకూ అందరం ఆనందంగా గడిపాం. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాం. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. ఒకసారి బీచ్కెళదాం నాన్నా అని నా కూతురు అనిత కోరింది. తర్వాత అందరూ వెళదామన్నారు. సరేనన్నాను. అంతా కలసి బీచ్కెళ్లాం. అందరూ ఆటోల నుంచి కిందకి దిగి గుంపులుగా బీచ్‌లో కెళి్లపోయారు. నేను ఆటో దిగి బీచ్కొస్తుంటే, ఒక్కసారిగా సముద్రం నుంచి హాహాకారాలు వినిపించాయి, గల్లంతవ్వడం, స్థానికులు సముద్రంలోకెళ్లి రక్షించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో నా కుమార్తె అనితతో పాటూ నా తమ్ముడు పితాని శ్రీను, సోదరి పిల్లలు శీలం దేవి మృతి చెందారు. సముద్రంలో గల్లంతైన వారిలో నా కుమారుడు వీరవంశీ, జయకృష్ణ ఉన్నారు. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కళ్లెదుటే నా కుటుంబ సభ్యులను పోగోట్టుకున్నాను. – పితాని గోవిందు -
కొలువులపై విభజన క్రీనీడ
విలీన మండలాల డీఎస్సీ అభ్యర్థుల ఆక్రోశం స్థానికులు కాదంటూ నియామకాలకు అడ్డంకి కోర్టు కరుణించినా ఖాతరు చేయని ఐటీడీఏ! నెల్లిపాక : రాష్ట్ర విభజన గిరిజన నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివిన వారిని స్థానికత కష్టాల పాలు చేసింది. అర్హత ఉన్నా వారికి ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయి. విలీన మండలాల ఏజెన్సీ డీఎస్సీలో ఆ మండలాల అభ్యర్థుల పట్ల ప్రభుత్వ నిర్ణయం వారికి తీరని ఆవేదనను మిగుల్చుతోంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో 2016 అక్టోబర్ 29న ప్రత్యేక డీఎస్సీ అర్హత పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారిని గత ఏడాది డిసెంబర్ 29న ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించారు. అయితే రాష్ట్ర విభజనతో తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన నాలుగు విలీన మండలాల్లోని కొందరు అభ్యర్థులు అర్హత సాధించినా స్థానికత పేరుతో నియామకాలను నిలిపివేశారు. దీంతో వారు గత మూడు నెలలుగా ఉద్యోగాల కోసం పోరాటం చేసూ్తనే ఉన్నారు. కోర్టును కూడా ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు సాధించుకున్నా అధికారుల నుంచి స్పందన లేదని వారు వాపోతున్నారు. విలీన మండలాల్లో మొత్తం 10 మంది అభ్యర్థుల నియామకాలను ప్రస్తుతం నిలిపివేశారు. వీరిలో ఎటపాక మండలంలోని ఆదివాసీ తెగకు చెందిన ముగ్గురు మహిళా అభ్యర్థులు, నలుగురు లంబాడా తెగకు చెందిన వారు కాగా చింతూరు మండలంలో ఒకరు, వీఆర్ పురం మండలంలో ఇద్దరు ఆదివాసీ అభ్యర్థులు ఉన్నారు. వీరి నియామకాలను స్థానికత లేదనే కారణంగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదు. కోడళ్లుగా వచ్చిన వారికీ అడ్డంకే ఆరుగురు ఆదివాïసీ అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ స్థానికత లేదని ఉద్యోగావకాశం కల్పించలేదు. అయితే వీరిలో ఎటపాకకు చెందిన కోర్స సుజాత, పొడియం కౌసల్య, వీఆర్‌పురానికి చెందిన కారం అరుణ, సీహెచ్ వెంకటలక్ష్మి ఈ ప్రాంతానికి కోడళ్లుగా వచ్చారు. మిగతా ఇద్దరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నవారే. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏజెన్సీలోనే ఉంటూ వీరి చదువులు పూర్తి చేశారు. వివాహాలు కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగాయి. ప్రత్యేక డీఎస్సీలో కొలువులు సాధించేందుకు అహర్నిశలు కష్టపడి చదివి అర్హత పొందారు. కానీ వీరిని ఈ ప్రాంతానికి చెందిన వారు కాదని నియామకాలు నిలిపివేయటం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాధించుకున్న ఉద్యోగాలు గత మూడునెలలుగా దూరం కావటంతో వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. -
మన్యంలో పని మైదానంలో ఏంపని..?
పని చేసిన చోటే నివాస సూత్రం ఏమయిందో ఆ సూత్రం చెప్పిన కలెక్టరే ఒత్తిడికి తలొగ్గితే ఎలా? అతిపెద్ద మన్యంపై ఇదేనా శ్రద్ధ? మండిపడుతున్న గిరిజనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘వడ్డించేవాడు మనవాడైతే జీతం ఒక చోట, ఉద్యోగం మరోచోట ఎంచక్కా చేసేయొచ్చు. మన్యం వాసుల ప్రయోజనాలను గాలికొదిలేసి మైదాన ప్రాంతంలో పనిచేస్తున్నా పాలకులుగానీ...సంబంధితాధికారులుగానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేరు. ఎందుకంటారా? ఆయనకున్న పలుకుబడి అటువంటిది మరి. ఏజెన్సీలో అధికారులంతా స్థానికంగానే నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ వైపు గట్టిగా నొక్కి చెబుతారు. దీనికి భిన్నంగా వేలాది మంది గిరిజనుల భూముల వివాదాలను పరిష్కరించే స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారికి కాకినాడలో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అక్కడలా...ఇక్కడిలా...ఇదేమి తీరంటూ గిరిజనులు మండిపడుతున్నారు. మన్యవైపు కన్నెత్తి చూడకపోయినా... రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసేందుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ మన్యం వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకు కారణం ఆయనకు జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడమే. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌ని మైదాన ప్రాంతంలో ఇ¯ŒSఛార్జి బాధ్యతలు అప్పగించడంపై మన్యం వాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన సంక్షేమం కోసం చాలా కీలకమైన పోస్టు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎస్‌డీసీపై ఉంది. ల్యాండ్ ట్రాన్సెక్షన్ రెగ్యులేటరీ పిటిషన్లను పరిష్కరించడం ఈయన ప్రధాన విధి. మన్యంలో విధులు నిర్వర్తించాల్సిన ఆయన జిల్లా పంచాయతీ అధికారిగా కాకినాడలో పని చేస్తున్నారు. ఈ కారణంగా మన్యంలో పెద్ద ఎత్తున కేసులు పేరకుపోయి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో ఆప్షనల్ సూట్ (ఒఎస్) కేసులు 153 ఎకరాలకు సంబంధించి 87, ల్యాండ్ ట్రాన్సేక్షన్ రెగ్యులేటరీ పిటీషన్లో 2,200 ఎకరాలకు సంబంధించి 409 కేసులు, మరో 352 ఎకరాలకు సంబంధించి 180 ఎల్టీఆర్పీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు రికార్డుల్లో నమోదైన వరకు మాత్రమే. ఈ కేసులే పరిష్కారం కాలేదు, ఇక కొత్తగా కేసులు వేసినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం లేక చాలా మంది గిరిజనులు పిటిషన్లు వేసేందుకు వెనుకాడుతున్నారు. లేదంటే కేసుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యేదంటున్నారు. రాజకీయ నేతల్లా వ్యవహరిస్తే ఎలా... ఇంత కాలం పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదనుకునేవారు. ఇప్పుడు బాధ్యత కలిగిన అధికారులు కూడా పాలకుల బాటలో పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎస్డీసీని కాకినాడలో నియమించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇ¯ŒSఛార్జిగా డీపీఓ పనిచేస్తున్న కుమార్ 2012 నవంబరు నుంచి 2015 మార్చి వరకు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎంగా కాకినాడలో పనిచేశారు. ఆ సమయంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక జిల్లా యంత్రాంగం చేతికొచ్చే సమయానికి డీఎం కారణమేమిటో తెలియదు కానీ సెలవులో ఉన్నారు. ఎనిమిది నెలలు తిరగకుండానే 2015 నవంబరు 11న తిరిగి జిల్లా గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌గా రంపచోడవరం వచ్చారు. మన్యంలో ఎస్డీసీగా పని చేస్తున్నప్పుడే కాకినాడలో సర్వశిక్ష అభియాన్ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారిగా 2016 మే 20 నుంచి నవంబరు ఒకటోతేదీ వరకు పనిచేశారు. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఆయన 2016 డిసెంబరు 17న జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే డీపీఓగా కొనసాగుతున్నారు. మన్యంలో కీలకమైన పోస్టింగులో పనిచేయాల్సిన కుమార్‌ను ఇక్కడ డీపీఓగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా కేంద్రం కాకినాడలో ఏ శాఖ అధికారికైనా బాధ్యతలు అప్పగించాల్సిందంటున్నారు. అలా కాకుండా గిరిజనుల ప్రయోజనాలను గాలికొదిలేసి మన్యంలో పనిచేయాల్సిన అధికారికి మైదాన ప్రాంతంలో బాధ్యతలు అప్పగించడమేమిటని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని, అక్కడే పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మన్యంలో పనిచేయాల్సిన ఎస్డీసీకి ఇక్కడ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేమిటని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. -
మన్యంలో పని మైదానంలో ఏంపని..?
పని చేసిన చోటే నివాస సూత్రం ఏమయిందో ఆ సూత్రం చెప్పిన కలెక్టరే ఒత్తిడికి తలొగ్గితే ఎలా? అతిపెద్ద మన్యంపై ఇదేనా శ్రద్ధ? మండిపడుతున్న గిరిజనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘వడ్డించేవాడు మనవాడైతే జీతం ఒక చోట, ఉద్యోగం మరోచోట ఎంచక్కా చేసేయొచ్చు. మన్యం వాసుల ప్రయోజనాలను గాలికొదిలేసి మైదాన ప్రాంతంలో పనిచేస్తున్నా పాలకులుగానీ...సంబంధితాధికారులుగానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేరు. ఎందుకంటారా? ఆయనకున్న పలుకుబడి అటువంటిది మరి. ఏజెన్సీలో అధికారులంతా స్థానికంగానే నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ వైపు గట్టిగా నొక్కి చెబుతారు. దీనికి భిన్నంగా వేలాది మంది గిరిజనుల భూముల వివాదాలను పరిష్కరించే స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారికి కాకినాడలో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అక్కడలా...ఇక్కడిలా...ఇదేమి తీరంటూ గిరిజనులు మండిపడుతున్నారు. మన్యవైపు కన్నెత్తి చూడకపోయినా... రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసేందుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ మన్యం వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకు కారణం ఆయనకు జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడమే. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌ని మైదాన ప్రాంతంలో ఇ¯ŒSఛార్జి బాధ్యతలు అప్పగించడంపై మన్యం వాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన సంక్షేమం కోసం చాలా కీలకమైన పోస్టు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎస్‌డీసీపై ఉంది. ల్యాండ్ ట్రాన్సెక్షన్ రెగ్యులేటరీ పిటిషన్లను పరిష్కరించడం ఈయన ప్రధాన విధి. మన్యంలో విధులు నిర్వర్తించాల్సిన ఆయన జిల్లా పంచాయతీ అధికారిగా కాకినాడలో పని చేస్తున్నారు. ఈ కారణంగా మన్యంలో పెద్ద ఎత్తున కేసులు పేరకుపోయి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో ఆప్షనల్ సూట్ (ఒఎస్) కేసులు 153 ఎకరాలకు సంబంధించి 87, ల్యాండ్ ట్రాన్సేక్షన్ రెగ్యులేటరీ పిటీషన్లో 2,200 ఎకరాలకు సంబంధించి 409 కేసులు, మరో 352 ఎకరాలకు సంబంధించి 180 ఎల్టీఆర్పీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు రికార్డుల్లో నమోదైన వరకు మాత్రమే. ఈ కేసులే పరిష్కారం కాలేదు, ఇక కొత్తగా కేసులు వేసినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం లేక చాలా మంది గిరిజనులు పిటిషన్లు వేసేందుకు వెనుకాడుతున్నారు. లేదంటే కేసుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యేదంటున్నారు. రాజకీయ నేతల్లా వ్యవహరిస్తే ఎలా... ఇంత కాలం పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదనుకునేవారు. ఇప్పుడు బాధ్యత కలిగిన అధికారులు కూడా పాలకుల బాటలో పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎస్డీసీని కాకినాడలో నియమించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇ¯ŒSఛార్జిగా డీపీఓ పనిచేస్తున్న కుమార్ 2012 నవంబరు నుంచి 2015 మార్చి వరకు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎంగా కాకినాడలో పనిచేశారు. ఆ సమయంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక జిల్లా యంత్రాంగం చేతికొచ్చే సమయానికి డీఎం కారణమేమిటో తెలియదు కానీ సెలవులో ఉన్నారు. ఎనిమిది నెలలు తిరగకుండానే 2015 నవంబరు 11న తిరిగి జిల్లా గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌గా రంపచోడవరం వచ్చారు. మన్యంలో ఎస్డీసీగా పని చేస్తున్నప్పుడే కాకినాడలో సర్వశిక్ష అభియాన్ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారిగా 2016 మే 20 నుంచి నవంబరు ఒకటోతేదీ వరకు పనిచేశారు. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఆయన 2016 డిసెంబరు 17న జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే డీపీఓగా కొనసాగుతున్నారు. మన్యంలో కీలకమైన పోస్టింగులో పనిచేయాల్సిన కుమార్‌ను ఇక్కడ డీపీఓగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా కేంద్రం కాకినాడలో ఏ శాఖ అధికారికైనా బాధ్యతలు అప్పగించాల్సిందంటున్నారు. అలా కాకుండా గిరిజనుల ప్రయోజనాలను గాలికొదిలేసి మన్యంలో పనిచేయాల్సిన అధికారికి మైదాన ప్రాంతంలో బాధ్యతలు అప్పగించడమేమిటని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని, అక్కడే పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మన్యంలో పనిచేయాల్సిన ఎస్డీసీకి ఇక్కడ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేమిటని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. -
స్వైపింగ్ మెషీన్లు అలంకారప్రాయమే
రిజస్ట్రేషన్ శాఖకు 32 మెషీన్ల అందజేత దాదాపు అన్నిచోట్లా వినియోగించని సిబ్బంది పట్టించుకోని డిఐజీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : నగదు రహిత లావాదేవీల కోసమంటూ స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖలో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసినా, వాటి వినియోగించింది లేదు. స్థిరాస్థి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఈసీలు, నకళ్లు తీసుకునేందుకు, ఇతర సేవలు పొందేందుకు జిల్లాలోని 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ లక్ష్మీకుమారి ఈ నెల 3న ఈ స్వైపింగ్ మెషీన్లు అందజేశారు.ఈసీలు, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి తీసుకున్న నగదుకు రసీదు ఇవ్వాలి.అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు వాటిని ఇవ్వడం లేదు. దీనివల్ల ఈసీ, నకలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజులపాటు ఈ కార్యాలయం చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వైపింగ్ మిషన్ వినియోగంలో ఉంటే లాభమేమిటి? స్వైపింగ్ మెషీన్ రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగంలో ఉంటే నగదు లావాదేవీలు జరిపే సమయం బిల్లులో వస్తుంది. సిటిజన్ చార్ట్ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న కక్షిదారుడికి కంప్యూటర్ ఈసీ గానీ, నకలు గానీ గంటలోగా ఇవ్వాలి. అదే మాన్యూల్ ఈసీగానీ, నకలు కానీ 24 గంటల్లో అందజేయాలి. ఈ కారణంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు స్వైపింగ్ మెషీన్‌ను పక్కన పెట్టి నగదు రూపంలో సొమ్ము తీసుకుంటున్నారు. నిర్ధేశిత సమయానికి ఇవ్వకపోతే పరిహారం సిటిజన్ చార్ట్ ప్రకారం నకళ్లు, ఈసీలు ఇవ్వాల్సిన సమయాన్ని ఖరారు చేస్తూ 2013లో జీవో నంబర్ 1054ను ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవో ప్రకారం కక్షిదారుడు కంప్యూటర్ ఈసీగానీ, నకలుకుగానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే ఆ ఉద్యోగి ప్రతి గంటకు రూ.10 చొప్పున కక్షిదారుడికి చెల్లించాలి. అలాగే మాన్యూల్ ఈసీగానీ, నకలు గానీ 24 గంటల్లో తిరిగి ఇవ్వకపోతే రూ.50 ఇవ్వాలి. స్వైపింగ్‌ను ఎందుకు ఉపయోగించడం లేదంటే... జిల్లాలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇవ్వడం లేదు. కారణం ఏమిటని కక్షిదారులు ప్రశ్నిస్తుంటే.... స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇస్తుంటే డైరెక్టుగా కక్షిదారులు ఇచ్చే సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆడిట్ జరిగినపుడు ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్ము జమ అయినట్టు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఖాతాకు వెళ్లక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. దీంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది స్వైపింగ్ మెషీన్లను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు ఇలా చిల్లు... 30 ఏళ్ల పైబడినవారు ఈసీ తీసుకుంటే రూ.520 రిజిస్ట్రేషన్‌శాఖకు చెల్లించాలి. 30 ఏళ్ల లోపు వారు ఈసీ తీసుకుంటే రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అయితే నగదు రూపంలో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారుల వద్ద నుంచి రూ.520 ఈసీకు తీసుకుని ప్రభుత్వ ఖాతాకు 30 ఏళ్ల లోపు వ్యక్తి తీసుకున్నట్టు చూపించి రూ.220 మాత్రమే జమ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కక్షిదారుడికి ఈసీ కానీ, నకలు కానీ ఇస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి తీసుకున్న నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. స్వైపింగ్ మెషీన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే కక్షిదారుడికి నష్టం ఉండదు. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడదు. జిల్లాలో అందజేసిన 32 స్వైపింగ్ మెషీన్లను ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని డీఐజీ పట్టించుకుంటే ఈ అక్రమాలను అరికట్టవచ్చు. -
నిర్లక్ష్యపు తుప్పు
అక్కరకు రాని ధాన్యం ఆరబోత యంత్రాలు జిల్లాలో నిరుపయోగంగా 12 డ్రయ్యర్లు రూ.1.92 కోట్ల నిధులు నిరుపయోగం ‘రైతే దేశానికి వెన్నెముక’.. రైతు రాజ్యం రావాలి.. రైతు అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం.. అంటూ ఊదరగొట్టే నాయకుల మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. వాస్తవంలోకి వచ్చే సరికి రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి.. స్వేదాన్ని పసిడి రూపంలోకి మార్చే అన్నదాతలు పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. రైతుల ప్రయోజనం అంటూ వ్యవసాయశాఖ ద్వారా అందజేసిన ధాన్యం ఆర బోత యంత్రాలు (డ్రయ్యర్లు) ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో పంపిణీ చేసిన 12 ఆరబోత యంత్రాలకు నిర్లక్ష్యపు తుప్పు పట్టడంతో రూ.1.92 కోట్లు నిరుపయోగం అయ్యే పరిస్థితి తలెత్తింది. – రాయవరం ఏటా ఖరీఫ్‌లో పంట చేతికంది వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే తుపాన్లు కారణంగా పంట వర్షార్పణం అవుతుంది. ఆ సమయంలో వరి పనలు తడవడం, తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం సరిగ్గా ఆరక పోవడంతో సరైన ధర దక్కక అన్నదాత నష్టపోతున్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయశాఖ ఆరబోత యంత్రాలను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి రైతులకు ఆశాకిరణంగా నిలుస్తాయనుకుంటే నిరాశకు గురిచేశాయి. నాణ్యతాలోపం..రైతుల అవసరాలకు తగినట్లుగా లేకపోవడంతో అక్కరకు రాకుండా పోయాయి. ఫలితంగా వాటికి నిర్లక్ష్యపు తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అప్పట్లో ఏమన్నారంటే.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి మద్దతు ధర లభించాలంటే తేమ 17 శాతం ఉండాలి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు కూడా తేమశాతం ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ఈ పరిస్థితుల్లో 17 శాతం ఆరుదలకు ఆరబోత యంత్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని.. గంటసేపు యంత్రం పనిచేస్తే ఐదు టన్నుల ధాన్యం ఆరబోస్తుందని గతంలో వ్యవసాయశాఖ చెప్పిన మాట. అయితే దీనికి విరుద్ధంగా ఇది పనిచేయడంతో రైతులు విముఖత వ్యక్తం చేశారు. ఆరబోత యంత్రం గంటకు రెండు లీటర్ల డీజిల్ అవసరమవుతున్నా..కనీసం ఐదు బస్తాల ధాన్యం కూడా ఆరబెట్టడం లేదు. ఒక బస్తా ధాన్యం ఆరబోతకు రూ.70లు ఖర్చవుతుంది. దీంతో సొసైటీలు ఈ యంత్రాలను మూలనబెట్టాయి. భారీ యంత్రాలను భద్రపర్చేందుకు కూడా వీలు కాక ఆరుబయటే వదిలివేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి. రూ.1.92 కోట్లు నిరుపయోగం.. జిల్లాలో ఏటా 2.20 లక్షల హెక్టార్లలో వరిసాగు జరుగుతుంది. తద్వారా ఏటా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు 2014 రబీలో ధాన్యం ఆరబోత యంత్రాలను వ్యవసాయశాఖ ద్వారా కొనుగోలు చేశారు. జిల్లాలో సోమేశ్వరం, కరప, కాజులూరు, దుగ్గుదూరు, కొంకుదురు, కొమరిపాలెం, చోడవరం, దేవగుప్తం, జెడ్.మేడపాడు, సామర్లకోట, భీమనపల్లి, జి.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వీటిని రాయితీపై అందించారు. ఒక్కో ఆరబోత యంత్రం విలువ రూ.16 లక్షలు. ఇందులో సహకార సంఘం రూ.4 లక్షలు చెల్లిస్తే..మిగిలిన రూ.12 లక్షల సొమ్మును రాయితీగా వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఒక్క యంత్రం కూడా పనిచేయలేదు. ఫలితంగా రూ.1.92 కోట్ల సొమ్ము నిరుపయోగమైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
నల్లకుబేరులకు మరోసారి గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ: నల్లకుబేరులకు ఆర్థికమంత్రిత్వ శాఖ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. పెద్దనోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో మనీ లాండరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పని గురువారం హెచ్చరించింది. ఆ మేరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్ ద్వారా కఠిన హెచ్చరికను జారీ చేశారు. అక్రమంగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్న వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఈ మేరకు వివిధ చట్ట ఏజెన్సీల సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచామని ఇప్పటికే పలువురిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో భారీ ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఆయన ఆ దాడులు ఇంకా కొనసాగుతాయన్నారు. కాగా నల్లధనంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కఠినమైన ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛందంగా ప్రకటిస్తే 50 శాతం పెనాల్టీ, ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో దొరికితే , జరిమానా, పన్ను కలిసి 85 శాతం చెల్లించాల్సిన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. Those indulging in or colluding with money laundering or converting black money into white will not be spared. — Shaktikanta Das (@DasShaktikanta) December 2, 2016