nursing college
-
పీజీ వైద్యవిద్యలో క్లినికల్ కోర్సుల్లో రిజర్వేషన్ 15 నుంచి 20% పెంపు
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటాను క్లినికల్ కోర్సుల్లో 15 నుంచి 20 శాతానికి పెంచుతామని పీహెచ్సీ వైద్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం పీహెచ్ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చర్చించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం వెల్లడించింది. కోటాను 15 నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు అన్ని కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొంది.భవిష్యత్‌లో కోటాలో మార్పులు చేయాల్సివస్తే ముందు వైద్యులతో చర్చిస్తామన్నట్టు తెలిపింది. సర్వీస్‌లోకి రాకముందు పీజీ చేసినవారికి రెండో పీజీ చేయడానికి ప్రభుత్వం మీద భారం లేకుండా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇవే చివరి చర్చలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరించి వైద్యులు సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. అలా కాకుండా జీవో రద్దుచేయాలని మొండిపట్టుతో సమ్మె కొనసాగిస్తే జీవో 85లో ఎటువంటి సవరణలు లేకుండానే పీజీ ప్రవేశాలు చేపడతామని హెచ్చరించింది. ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం 14కు వాయిదా202425 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు వచ్చే నెల (అక్టోబర్) 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) సవరించిన మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్టు వివరించారు.నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపుబీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికారెడ్డి తెలిపారు. ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. -
క్షణికావేశం.. నర్సింగ్ విద్యార్థిని విషాదం!
కరీంనగర్: కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో నర్సింగ్ విద్యార్థిని బానోత్ అక్షయ(19) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. స్థానిక సంతోష్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణిలో ప్రైవేట్ ఓల్వో డ్రైవర్‌గా పనిచేస్తున్న బానోత్ రాజేశం– అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే, సెలవులు ముగిశాయయని, కాలేజీకి వెళ్తానని తన తండ్రికి చెప్పింది. తనకు వేతనం ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కాలేజీ ఫీజు చెల్లించి పంపిస్తానని తండ్రి చెప్పాడు. తనను కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న అక్షయ.. గంట సమయం గడిచినా బయటకు రాలేదు.కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు బోరున విలపించారు. చిన్నవిషయాలకే అలిగిన తమ కుమార్తె చనిపోతుందని తాము ఉహించలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి సోదరి అనిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ఆమె పరీక్ష రాస్తే ఉద్యోగమే..
మెట్పల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటి సాధించడమే కష్టం. అలాంటిది ఈ యువతి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన లాస్యకు మెట్‌పల్లిలోని దుబ్బవాడకు చెందిన జెట్టి నరేందర్‌తో వివాహమైంది. చదువులో చురుకుగా ఉన్న లాస్య ఇంటర్ వరకు నిర్మల్‌లోనే పూర్తి చేశారు. నిజామాబాద్ సమీపంలోని ఓ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ చదివారు. 2022 జనవరిలో సింగరేణి సంస్థ నిర్వహించిన నర్సింగ్‌లో ప్రతిభ చూపారు. అందులో ఉద్యోగానికి ఎంపికై న ఆమె రామకృష్ణాపూర్‌లోని సంస్థకు చెందిన ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. అనంతరం అఖిల భారతీయ వైద్యవిజ్ఞాన సంస్థ నిర్వహించిన పరీక్షలోను మంచి మార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యారు. కొద్దిరోజులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నర్సింగ్ ఉద్యోగ పరీక్షలో బాసర జోన్లో మొదటిర్యాంకు, రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్నారు. భర్త నరేందర్, కుటుంబ సభ్యుల సహకారంతో విజయం సాధ్యమైందని లాస్య పేర్కొన్నారు. సింగరేణి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పోస్టింగ్‌లో జాయిన్ అవుతానని తెలిపారు. -
కీచక ప్రిన్సిపాల్.. అబార్షన్ అయిన యువతి ధైర్యం చేయడంతో..
(విజయవాడపశ్చిమ): విద్యార్థిని బెదిరించి ఆమైపె పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా గర్భస్రావం చేయించిన నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అజిత పేజెండ్ల పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అరెస్టుపై గురువారం కొత్తపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డీసీపీ అజిత పేజెండ్ల మాట్లాడుతూ 2017 నుంచి 2020 వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన యువతి ఫణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో జీఎం నర్సింగ్ కోర్సును అభ్యసించిందన్నారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆ యువతిని భయపెట్టి, బెదిరించి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నెలసరి రాకపోవడంతో మూడు సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. దీంతో నర్సింగ్ చేయలేక, ఆ యువతి స్వగ్రామం వెళ్లిపోయిందని చెప్పారు. ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి మరోమారు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం తెలుసుకున్న ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు ఎన్టీఆర్జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె. ఆదేశాల మేరకు నిందితుడు రవీంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ కె. హనుమంతరావు, కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. డిచ్పల్లి మండలం బర్థిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ కాలేజీలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని సెకండియర్ విద్యా ర్థి నులు ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు జూనియర్లు తమ తల్లి దండ్రులకు తెలియజేయడంతో వారు కాలేజీ వద్దకు వచ్చి మేనేజ్మెంట్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రెషర్స్ పార్టీ చేసుకుంటుండగా సీనియర్ విద్యార్థులు ఫ్లెక్సీ చించివేశారని, అడ్డుకున్న తమను కొట్టారని జూనియర్లు ఆరోపించారు. నలుగురు బయట వ్యక్తుల్ని కాలేజీకి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. విషయం తెలుసుకున్న డిచ్పల్లి ఎస్సై గణేశ్ కాలేజీకి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పారు. జూనియర్లు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తృతీయ సంవత్సరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, సెకండియర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. సీనియర్లను పోలీసులు తీసుకెళ్తుండగా కొందరు జూనియర్లు వారిపైకి చెప్పులు విసిరారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థు లపై చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇ వ్వడంతో జూనియర్లు శాంతించారు. అయితే జూనియర్లను తాము వేధించలేదని సీనియర్లు చెప్పడం కొసమెరుపు. దీనిపై కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా వారు స్పందించలేదు. -
ఒక్క ప్రమాదం.. ఎన్నో పాఠాలు.. ఆ కాస్త దూరం వెళ్లలేక!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అసలేం జరిగిందంటే... బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్‌తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్పైప్రయాణిస్తూ రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కాస్త దూరం వెళ్లలేక... తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్‌భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు. పరిమితికి మించిన వేగం... ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు. హఠాత్తుగా ఇటు రావడంతో... ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్‌భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్లో, రాంగ్ రూట్లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ వాడకపోవడంతోనే... ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
JJ Hospital: ఆస్పత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం
ఒక ఆస్పత్రి భవనం పునాది కింద 132 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లాలో చోటుచేసుకుంది. ముంబైలోని జేజే ఆస్పత్రి అండ్ గ్రాండ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ టన్నెల్‌ని కనుగొన్నట్లు ఆస్పత్రి యజామాన్యం తెలిపింది. ప్రస్తుతం దీన్ని నర్సింగ్ కాలేజ్‌గా మార్చనున్నారు. కాలేజ్‌లో నీరు లీకేజీ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఆస్పత్రి 1890లో నిర్మించినట్లు పునాదిరాయిపై కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ మెడికల్ కాలేజ్ 1843 మార్చి 30న గ్రాండ్ మెడికల్ కాలేజ్ భవనానికి శంకు స్థాపన చేసినట్లు అధికారలు తెలిపారు. రెండేళ్లలోనే భవనం పూర్తి అయ్యి 1845లో ప్రారంభించబడినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపకుడు సర్ జంషెట్జీ జేజీబోయ్ రూ లక్ష రూపాయ విరాళంతో స్కూల్ ఆఫ్ ప్రాక్టీస్ ఏకకాలంలో ఏర్పాటైందని చెప్పారు. ఒక వైద్యురాలు ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం గురించి తెలుసుకునే క్రమంలో ఈ సోరంగం ఆచూకి బయటపడినట్లు తెలిపారు. ఈ సోరంగంపై తదుపరి దర్యాప్తు విషయమై కలెక్టర్ కార్యాలయానికి, పురావస్తు శాఖకు తెలియజేసి ప్రాథమిక వివరాలను నివేదించనున్నట్లు జేజే ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. (చదవండి: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు) -
ఒకేషనల్ కాలేజీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన ఆర్టీసీ సంస్థ మరో ముందడుగు వేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకేషనల్ కాలేజీని అందుబాటులోకి తెస్తోంది. తార్నాకలోని రవాణా సంస్థ ఆసుపత్రికి అనుబంధంగా దీనిని ఏర్పాటు చేస్తోంది. తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్న విషయం తెలిసిందే. 200 పడకల ఈ ఆసుపత్రిలో ఇంతకాలం కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే చికిత్స చేసేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా విస్తరించనున్నారు. ఈ క్రమంలో దానికి అనుబంధంగా ఒకేషనల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. ఒకేషనల్ కళాశాలలో తొలుత మెడికల్ లెబొరేటరీ టెక్నాలజీ(ఎంఎల్టీ), ఫిజియోథెరపీ(పీటీ), మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులను ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల వ్యవ«ది ఉండే ఈ కోర్సులకు 30 చొప్పున సీట్లను కేటాయించారు. ఇందులో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తిగా యువతులకే కాగా, మిగతా రెండింటిని కో–ఎడ్యుకేషన్ క్లాసెస్గానే నిర్వహించనున్నారు. దరఖాస్తుల ఆహ్వానం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరటానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలోనే ఈ కళాశాల కొనసాగుతుంది. ఇటీవల ఇక్కడ ప్రారంభించిన నర్సింగ్ కాలేజీలో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం 5 సీట్లు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఒకేషనల్ కాలేజీలో మాత్రం అలాంటి వెసులుబాటు కల్పించలేదు. ఫీజు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఈ కోర్సులకు ఇంకా ఫీజులను నిర్ధారించలేదు. కానీ, ఫీజులు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. నర్సింగ్ కాలేజీ కోసం అదే ప్రాంగణంలో ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించగా, ఒకేషనల్ కాలేజీకి మాత్రం ఆ వెసులుబాటు లేదు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి ఒకేషనల్ కాలేజీని ఈ విద్యాసంవత్సరమే ప్రారంభిస్తున్నాం. ఆసక్తి ఉన్న అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 73828 35579, 95736 37594 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదంటే నేరుగా తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చి సంప్రదించవచ్చు. – శైలజ, ఆర్టీసీ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతలు కన్సల్టెంట్స్‌కి అప్పగించేందుకు.. డీఎంఈకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని సదుపాయలతో ప్రభుత్వ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐపీహెఎస్, ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. తక్కువ సమయం ఉండటంతో కాలేజీల నిర్మాణాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఈ బాధ్యతలను కన్సల్టెంట్స్‌కి అప్పగించేందుకు డీఎంఈకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తదనుగుణంగా టెండర్లను ఆహ్వానించి ఒక్కో కన్సల్టెంట్స్‌కి ఒక్కో ప్రాజెక్టును అప్పగించినట్టు డీఎంఈ తెలిపింది. నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు వెల్లడించింది. చదవండి: ఏపీలో కొత్తగా 8601 పాజిటివ్ కేసులు -
సీఎం జగన్ స్పందనతో అక్రమాల పుట్ట కదులుతోంది
‘ఒకటే కళాశాల.. రెండు పేర్లు.. భవనం ఒకటే.. అడ్రస్‌లు వేర్వేరుగా ఉంటాయి.. విద్యార్థినులను రెండు కళాశాలల్లో చదువుతున్నట్లు చూపిస్తారు. ఏ కళాశాలకు తనిఖీలకు వస్తే అక్కడి విద్యార్థినులుగా కలరింగ్ ఇస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉండవు..చదువు చెప్పే గురువులు ఉండరు.. ఇంటి పని, వంట పని చేస్తే మార్కులు వేస్తూ విద్యార్థినులకు నరకం చూపించారు. ఏళ్ల తరబడి నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఈ అక్రమాల దందా, నరక కూపం ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి రావటంతో వెలుగులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో విచారించిన అధికారులకు అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి ఉలిక్కిపడుతున్నారు. కళాశాల యాజమాన్యం చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. సాక్షి, తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీలో ఒకే భవనంలో ఎస్వీ, శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారు. కళాశాలల నిర్వాహకురాలు విజయ పెడుతున్న వేధింపులు, గృహహింసపై విద్యార్థినులు కలెక్టర్, అర్బన్ ఎస్పీ, సబ్ కలెక్టర్, తహసీల్దార్లకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు, పోలీసులు కళాశాలకు వచ్చి విద్యార్థినులను విచారించకుండానే యాజమాన్యంతో చర్చలు జరుపుకుని, కాసుల మోజులో అన్యాయం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవటంతో గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గృహహింస, వేధింపులు, కళాశాల అక్రమాలకు సంబంధించి ఆధారాలతో వీడియోలను, ఫిర్యాదును పంపించారు. స్పందించిన సీఎం 24వ తేదీన అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యార్థినుల ఆవేదనను, వారి బాధలతో కూడిన లేఖను చూపించారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విద్య పట్ల, విద్యార్థుల సౌకర్యాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ.. కళాశాలలో జరుగుతున్న అక్రమాలు, ఒకే కళాశాల పేరుతో రెండు కళాశాలలను నడిపిస్తున్న వైనంపై కలెక్టర్ భరత్‌గుప్త విచారణకు ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో విద్య, వైద్య, రెవెన్యూ, తుడా, పంచాయతీరాజ్ శాఖాధికారులు విచారణ జరిపారు. అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలకు సిఫారసు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించారని తెలుసుకున్న ఎస్వీవీ నర్సింగ్ కళాశాల యాజమాన్యం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని అప్రమత్తమయ్యారు. కళాశాల సూచిక బోర్డును తీసివేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసేసినట్లు గేటుకు బోర్డులు వేలాడదీశారు. విద్యార్థినులకు న్యాయం చేసే దిశగా... అక్రమాలకు పాల్పడిన వెంకటేశ్వర, వెంకట విజయ నర్సింగ్ కళాశాలపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముందుగా విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీవెంకటేశ్వర నర్సింగ్ కళాశాల, శ్రీవెంకటవిజయ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న అన్ని సంవత్సరాల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపుకార్డు, అడ్మిషన్ కార్డులతో హాజరుకావాలని కలెక్టర్ భరత్‌గుప్త సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాలపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.\ -
విద్యార్థినిలకు బ్లాక్మెయిల్.. స్పందించిన జగన్
-
నర్సింగ్ కాలేజీలో నరకం.. నిజమే!
సాక్షి, తిరుపతి రూరల్: ‘ఒకే భవనంలో రెండు కళాశాలలు. తరగతి గదులు..హాస్టల్ గదులకు సైతం అదే భవనం.. నాలుగేళ్ల కోర్సును బోధించేందుకు కేవలం ఇద్దరే అధ్యాపకులు. నర్సింగ్ బోధన దేవుడెరుగు.. వంటపని, ఇంటి పని, సొంత పనులతో సహా పొలం పనులను సైతం బలవంతంగా చేయిస్తూ యాజమాన్యం నరకం చూపుతోంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా కరుణించలేదు సరికదా, మా కష్టాలను యాజమాన్యానికి అమ్ముకుని కాసులు దండుకున్నారు. ఈ నరకం నుంచి మమ్మల్ని కాపాడండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తిరుపతి సబ్–కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరు అయ్యారు. తిరుపతికి సమీపంలోని శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులపై విచారణ జరిపేందుకు మంగళవారం తిరుపతి సబ్–కలెక్టర్ మహేష్‌కుమార్ కళాశాలకు వెళ్లారు. కళాశాలను మూసివేస్తున్నట్లు తగిలించిన బోర్డును చూసి ఆశ్చర్యపోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేస్తున్నట్లు యాజమాన్యం అందులో పేర్కొంది. శ్రీ వెంకట విజయ కళాశాలను మూసివేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ కళాశాల లెటర్ ప్యాడ్‌పై కరస్పాండెంట్ బండి. విజయ పేరుతో ప్రకటన విడుదలైంది. సబ్–కలెక్టర్ ఎదుట విద్యార్థినుల కన్నీరు ప్రభుత్వం ఆదేశంతో శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాలలో తిరుపతి సబ్–కలెక్టర్ మహేష్‌కుమార్, జిల్లా డాక్టర్ రామగిడ్డయ్య, డీసీహెచ్‌వో సరళమ్మ, డీఐవో హనుమంతరావు, విచారణ కమిటీ సభ్యులు గీత, లలితాదేవి విచారణ చేశారు. కళాశాల యాజమాన్యం గేటు మూసివేయడంతో బయట ఉన్న విద్యార్థినులతో మాట్లాడారు. దీంతో కళాశాలలో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను వివరించారు. తమను విద్యార్థినులుగా కాకుండా కూలీలుగా చూస్తారని, వంట పని, పెరటి పని, గదుల శుభ్రత నుంచి వారి ఇంట్లో పాచిపని సైతం చేయిస్తారని కాయలు కాసిన చేతులను చూపించారు. కళాశాల నిర్వాహకురాలు విజయకు చెందిన వ్యవసాయక్షేత్రంలో పొలం పనులు చేయాలని, లేకుంటే దారుణంగా శారీరక హింసలకు గురి చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. నాలుగేళ్ల కోర్సులకు కేవలం ఇద్దరు మాత్రమే అధ్యాపకులు ఉన్నారని, కనీస పరిజ్ఞానం కూడా లేకుండా బోధన చేస్తారని వాపోయారు. క్లినికల్ పరిజ్ఞానం లేకుండానే ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై స్టాఫ్ నర్సులుగా బలవంతంగా ఉద్యోగాలు చేయిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అంతా లోపభూయిష్టం: సబ్ కలెక్టర్ ఒకే భవనంలో రెండు నర్సింగ్ కళాశాలలను నిర్వహించడమే కాకుండా నిపుణులైన అధ్యాపకులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు, క్లినికల్ అనుభవం లేకుండానే కోర్సులను తూతూమంత్రంగా పూర్తి చేయిస్తున్నట్లు వెల్లడైందని తిరుపతి సబ్–కలెక్టర్ మహేష్‌కుమార్ మీడియాకు తెలిపారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. తమపై కళాశాల యాజమాన్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు చెప్పినట్లు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి విముక్తి కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం స్పందించకుంటే మాపై ఇంకా వేధింపులు కొనసాగుతునే ఉండేవన్నారు. ఇప్పటికైనా మరో కళాశాలలో విద్యను కొనసాగించేందుకు తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
విద్యార్థినిలకు బ్లాక్మెయిల్..స్పందించిన సీఎం
‘సరస్వతీ నిలయాన్ని జైలుగా మార్చారు. అక్కడ చదువు చెప్పకపోగా.. విద్యార్థినులు చేసే చిన్న తప్పులతో బ్లాక్మెయిల్ చేస్తారు. వారిని తమ కళాశాల అనుమతుల కోసం, అధికారుల అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇంటి నుంచి వంట పనివరకు అన్నీ చేయిస్తారు. అర్ధరాత్రుల్లో హాస్టల్‌కు వచ్చే ప్రైవేటు వ్యక్తులకు సైతం అన్ని రకాల సేవలు చేయాలి. లేకుంటే వేధింపులు తప్పవు. ‘మాకు న్యాయం చేయండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ–మెయిల్ ద్వారా ఆధారాలు అందజేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. అదే కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు తిరుపతి సబ్‌కలెక్టర్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సాక్షి, తిరుపతి : పవిత్రమైన వృత్తి కోసం నర్సింగ్ కోర్సులో చేరిన విద్యార్థినుల జీవితాలతో ఆ కళాశాల యాజమాన్యం ఆడుకుంటోంది. చదువుల నిలయాన్ని నరకకూపంగా మార్చింది. ఈ దారుణాల వేదిక ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీ పరిధిలోని శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాల. విద్యార్థులు సోమవారం తిరుపతి సబ్‌కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ‘వందలాదిమంది ఉన్న శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాల నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరు అధ్యాపకులు బోధన చేస్తారు. కోర్సు పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇప్పిస్తారు. ఇలాంటి సర్టిఫికెట్లతోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో విధులకు పంపుతారు. వచ్చే జీతం సైతం కళాశాల యాజమాన్యమే బలవంతంగా లాక్కుంటుంది. కళాశాలతో పాటు హాస్టల్ భవనాలకు సైతం అనుమతులు ఉండవు. కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న బాధలను భరించలేకపోతున్నాం. వంటతో పాటు పొలంలో పనులు సైతం విద్యార్థినులతో చేయిస్తున్నారు. కళాశాల నిర్వాహకురాలు నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి’ అని విద్యార్థినులు వేడుకున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు ఎస్వీవీ నర్సింగ్ కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న వేధింపులు, గృహహింసపై విద్యార్థినులు కలెక్టర్, అర్బన్ ఎస్పీ, సబ్‌కలెక్టర్, తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు, పోలీసులు సైతం కళాశాలకు వచ్చి విద్యార్థినులను విచారించకుండానే యాజమాన్యంతో చర్చలు జరుపుకుని, కాసుల మోజులో అన్యాయం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గృహహింస, వేధింపులు, కళాశాల అక్రమాలకు సంబంధించి ఆధారాలతో వీడియోలను, ఫిర్యాదును పంపించారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యార్థినుల ఆవేదనను, వారి బాధలతో కూడిన లేఖను చూపించారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్య, విద్యార్థుల సౌకర్యాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు. కళాశాల మూసివేస్తున్నట్లు ప్రకటన విద్యార్థినుల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా స్పందించారని తెలుసుకున్న ఎస్వీవీ నర్సింగ్ కళాశాల యాజమాన్యం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని అప్రమత్తం అయ్యింది. కళాశాల సూచిక బోర్డును తీసివేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేసినట్లు నిర్వాహకురాలు విజయ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కావాలనే కొందరు తమ కళాశాలపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, కళాశాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి తిరుపతి మంగళం: శ్రీవేంకటేశ్వర నర్సింగ్ కళాశాల గుర్తింపును రద్దుచేసి, కరస్పాం డెంట్ బండి విజయపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుపతి సబ్ కలెక్టర్‌కు సోమవారం పలువురు విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత నర్సింగ్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. కళాశాల కరస్పాండెంట్ అన్ని పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ, ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 150 మంది విద్యార్థినులకు కనీస విద్యార్హత లేని ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఏంటని ప్రశ్నించారు. విజయ వేధింపులు తాళలేక పది మంది హాస్టల్ నుంచి బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ ప్రతినిధుల సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. తాము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు విజయ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు వాపోయారు. ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కళాశాలపై ప్రభుత్వ విచారణ తిరుపతిక్రైం: తిరుపతి రూరల్ పరిధిలోని పుదిపట్ల గ్రామంలోని శ్రీ వెంకట విజయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ బండి విజయపై కళాశాల విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కళాశాలలో జరిగే అవినీతి, అక్రమాలు, సౌకర్యాలు లేమిపై పలు వివాదాలు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దీనిపై విచారించాల్సిందిగా కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తను ఆదేశించడంతో శ్రీపద్మావతమ్మ గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలోని ఇద్దరు అధ్యాపకులతో ఈ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో పాటు ముత్యాలరెడ్డి పల్లె పోలీసుల పర్యవేక్షణలో బాధితుల నుంచి ఫిర్యాదులను వీడియో ద్వారా చిత్రీకరించారు. సోమవారం తిరుపతి అర్బన్ జిల్లా కార్యాలయంలో అదనపు ఎస్పీ కలిసిన ఆ కళాశాల నర్సింగ్ విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. వారితో పాటు విచారణ బృందం విద్యార్థులు సమావేశమైంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. దీనిపై దర్యాప్తును కౌనసాగిస్తున్నామని ఎమ్మార్‌పల్లి సీఐ మసూరుద్దీన్ వెల్లడించారు. -
గాంధీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి
గాంధీఆస్పత్రి : గాంధీ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు చెందిన రూ.6.50 లక్షల నిధుల్లో అవకతవకలు జరిగాయని, ఆడిట్లో కూడా ఈ విషయం స్పష్టమైందని తక్షణమే ప్రిన్సిపాల్‌పై చర్యలు చేపట్టి, తమకు డబ్బులు ఇప్పించాలని నర్సింగ్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి, గాం«ధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. గాంధీ ఆస్పత్రికి అనుసంధానంగా బోయిగూడలోని గాంధీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపాల్ మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జమాఖర్చులపై ఆడిట్ చేయాలని డీఎంఈ ఆదేశించారు. బుధవారం రాత్రి ముగిసిన ఆడిట్లో విద్యార్థినులకు చెందిన సుమారు రూ. 6.50 లక్షలు గోల్మాల్ జరిగిందని ఆడిట్లో వెల్లడైందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, అవకతవకలకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎంఈ, సూపరింటెండెంట్లకు ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ఆడిట్ ముగిసినా పూర్తి నివేదిక తమకు అందలేదన్నారు. విచారణ అధికారిగా ఆర్ఎంఓ–1 జయకృష్ణ కొనసాగుతున్నారని, పూర్తి వివరాలు వెల్లడైన తర్వాతే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అవినీతి మోత ఎందుకు ఆగుతుందీ రాత
కాకినాడలోని పలు ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్ మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌నే నమ్ముకున్నాయా? ఏదో ఒకటి చేసి నర్సింగ్ కోర్సును పూర్తి చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇస్తున్నాయా? రూ.లక్షలు తీసుకొని అధికార సిబ్బందిని మేనేజ్ చేసి పరీక్షలను గట్టెక్కిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసానిస్తున్నాయా? ఆ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చేరుతున్నారా? నాణ్యమైన చదువునివ్వకుండా పక్కదారిలో పాస్ చేయించే ప్రయత్నం చేస్తున్నాయా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సును జిల్లాలో 38 నర్సింగ్ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చేరుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇక్కడే హాస్టల్స్‌లో ఉంటూ చదువుతుండగా, మరికొంతమంది పరీక్షలకు మాత్రం వచ్చేలా లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈమేరకు విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు పిండుతున్నాయి. కోర్సు పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్ వస్తే చాలు ఆ తర్వాత ఏదో రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోయి మంచి ఉద్యోగం సాధించి, ఖర్చు పెట్టిన సొమ్మును ఇట్టే సంపాదించవచ్చనే ఆలోచనతోవిద్యార్థులు ఏమాత్రం వెనకాడటం లేదు. దేశ నలు మూలల నుంచి వచ్చి ఇక్కడ వాలిపోతున్నారు. అ లా అని అన్ని నర్సింగ్ స్కూల్స్ చేయడం ఈ రకంగా పక్కదారి పట్టడం లేదు. కొన్ని మాత్రమే అడ్డదా రులు తొక్కి విద్యార్థులను తప్పుతోవ పట్టిస్తున్నా యి. ప్రస్తుతం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతున్న జీఎన్ఎం పరీక్షల్లో వెలుగు చూస్తు న్న స్లిప్పుల భాగోతం చూస్తుంటే పలు నర్సింగ్ స్కూల్స్‌లో చదువు కన్నా సామూహిక చూసి రాతలపైనే ఎక్కువగా తర్ఫీదునిస్తున్నట్టు తెలుస్తోంది. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 38 నర్సింగ్ స్కూల్స్‌కు చెందిన 3494 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇం దులో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులున్నారు. ముందస్తు తనిఖీల్లోనే పెద్ద ఎత్తున స్లిప్పులతో విద్యార్థులను పట్టుకుంటున్నారు. వాటిన్నింటినీ అధికారులు భద్రపరిచి ఉంచారు. మాల్ ప్రాక్టీసుకు అనుకూలంగాపరీక్షా కేంద్రాల ఏర్పాట్లు... తల రాతను మార్చే పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇక్కడ జరుగుతున్న పరీక్షలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. సాధారణ పరీక్షల్లో విద్యార్థుల కోసం టేబుల్స్ ఏర్పాటు చేసి, వాటి మీద పరీక్ష రాసేలా చూస్తారు. వారెటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా ఇట్టే కనబడతారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, ఇక్కడ హేండ్లెస్ కుర్చీలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. టేబుల్స్ అన్నవే ఏర్పాటు చేయలేదు. దీంతో హ్యాండ్‌లెస్ కుర్చీలపై పరీక్షలు రాయడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెచ్చుకున్న స్లిప్పులతో పరీక్షలు రాయడం అంతే సులువు. మరి, ఎవరి అనుకూలం కోసమో...ఎవరికి లబ్ధి చేకూర్చేందుకో తెలియదు గాని దాదాపు 3500 మంది విద్యార్థులు హాజరవుతున్న పరీక్షలను సరైన కుర్చీల్లేకుండా, టేబుల్స్ ఏర్పాటు చేయకుండా చేయడం వెనుక మర్మమేంటోనని చూసినవారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న సంచె చూశారా? ఇందులో ఉన్నవి పరీక్షా ప్రశ్న పత్రాలో? సమాధాన పత్రాలో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చూసి రాసేందుకు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నేరుగా తీసుకొచ్చిన స్లిప్పు (చీటీ)లివీ. అత్యధిక మంది విద్యార్థులు స్లిప్పులు తీసుకొని పరీక్షా హాల్లోకి వస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. ముందస్తు తనిఖీల్లో చాలా వరకు పట్టుబడుతున్నాయి. ఇక, తనిఖీలు చేయలేని విధంగా లో దుస్తుల్లో స్లిప్పులను తీసుకురావడంతో పట్టుకోలేకపోతున్నారు. -
నర్సింగ్ కళాశాలలో వందకు పెరిగిన సీట్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సీట్ల సంఖ్యను 25 నుంచి 100కు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం జీవో (85) జారీ చేశారు. సీట్ల సంఖ్యను పెంచాలని గతేడాది నవంబర్ 2న కళాశాల ప్రిన్సిపల్ నుంచి వినతులు వెళ్లాయి. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచేందుకు అంగీకరించింది. ఇదిలా ఉండగా 1982లో కర్నూలు మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను 25 సీట్లతో ఏర్పాటు చేశారు. పదేళ్ల క్రితం వరకు ఈ మెడికల్ కళాశాలలోనే ఇది కొనసాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా నర్సింగ్ కళాశాలకు సొంత భవనం, వసతి గృహం మంజూరైంది. ప్రస్తుతం ఈ కళాశాల వంద మంది విద్యార్థులకు అనుగుణంగా ఉన్నందున సీట్లను పెంచాలని కళాశాల ప్రిన్సిపల్ కోరారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్లినికల్ సేవలను అందిస్తారు. ఈ మేరకు నాలుగేళ్లకు గాను వచ్చే మూడేళ్లలో 300 మంది విద్యార్థులు ఆసుపత్రిలో సేవలందించే అవకాశం ఉంది. -
మహిళా సాధికారతకు పాటుపడాలి
► దేశంలో మౌలిక సదుపాయాల కొరత ఆందోళనకరం ► సహకార వ్యవస్థల నిర్మాణమే దీనికి పరిష్కారం ► స్పష్టం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాక్షి, హైదరాబాద్: విద్య, ఆర్థిక స్వావలం బనను ప్రోత్సహించడం, సంపూర్ణ సామ ర్థ్యాన్ని ఆవిష్కరించేలా అవకాశాలు కల్పిం చడం ద్వారానే మహిళా సాధికారత సాధ్య మవుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. మహిళా దక్షత సమితి స్థాపిం చిన బన్సీలాల్ మలానీ నర్సింగ్ కళాశాలను శనివారం ఇక్కడ ప్రారంభిం చారు. దేశ సగటు అక్షరాస్యత 74 శాత మైతే, మహిళల అక్షరా స్యత 65% కన్నా తక్కువ ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళా సాధికారత దిశగా మరింత పాటుపడాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాలు శూన్యం.. దేశంలో ఆరోగ్య సంబంధిత మౌలిక సదు పాయాల కొరత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంతో పాటు ప్రభుత్వ, ప్రైవే టు భాగస్వాములతో కూడిన సహకార వ్యవస్థల నిర్మాణమే దీర్ఘకాలిక పరిష్కా రమని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి వంటి లక్ష్యాలను ప్రభుత్వం ఒక్కటే సాధించడం సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో సహకార వ్యవ స్థలు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్రపతి వివరించారు. 2.4మిలియన్ మంది నర్సుల లోటు..: దేశంలో 2.4 మిలియన్ మంది నర్సుల లోటు ఉందని, ఇది ఆందోళన చెందా ల్సిన అంశమని ప్రణబ్ అన్నారు. 2009లో 1.65 మిలియన్ మంది నర్సులు ఉండగా 2015కు ఈ సంఖ్య 1.56 మిలియన్‌కు పడిపోయిందన్నారు. మహిళా సాధికారత దిశగా మహిళా దక్షత సమితి ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. సుమన్ కృష్ణకాంత్, ప్రొ. ప్రమీలా దండావతే, గోవా గవర్నర్ మృదుల సిన్హాల వంటి సమితి వ్యవస్థాపక సభ్యుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. -
నర్సింగ్ కళాశాల ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలో నర్సింగ్ కళాశాలను గురువారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి ఇతోధిక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కాబోయే భర్త ఇంట్లో ఉంటూ.. యువతి అదృశ్యం
మెదక్: కాబోయే భర్త ఇంట్లో నివసిస్తున్న యువతి గత ఆరు రోజులుగా కనిపించకుండాపోయింది. జిల్లాలోని కల్హేర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన నర్సింహులు కుమార్తె సునిత పటాన్‌చెరువులో ఉంటూ.. మదీనగూడలో ఓ నర్సింగ్ కళాశాలలో చదువుకుంటోంది. జేపీకాలనీకి చెందిన ఓ యువకునితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దాంతో ఆమె జేపీకాలనీలో కాబోయే భర్త కుటుంబికులతో కలిసి ఉంటోంది. కానీ ఆరు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఆమె తండ్రి వచ్చి పటాన్చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అరుణకు ఘన నివాళి
- ఓ కళాశాలకు పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటన - అవార్డు నెలకొల్పుతున్నట్లు ప్రకటించిన ఎంపీ సీఎం ముంబై: 42 ఏళ్లపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అరుణా శానబాగ్ జ్ఞాపకార్థం థాణేలోని ప్రముఖ నర్సింగ్ కళాశాలకు ఆమె పెరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. ఆమె స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. కేఈఎమ్ ఆస్పత్రిలోని నాలుగో వార్డుకు అరుణ పేరు పెట్టాలని ఆస్పత్రి అధికారులు బీఎంసీని కోరారు. చికిత్స చేసిన గదిలో ఆమె ప్రతిమను ఉంచారు. ఆ గదికి ఆమె పేరు పెట్టి ఆ గదిని ఆస్పత్రి పనులకు, చికిత్సలకు వాడుకోవాలని నిర్ణయించారు. అరుణ పేరుతో అవా ర్డు నెలకొల్పుతున్న ట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలపై జరుగుతు న్న అన్యాయాలకు వ్య తిరేకంగా పోరాడుతు న్న స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని నిర్ణయిం చారు. ఈ అవార్డు కింది రూ. ఒక లక్ష బహుమతిగా ఇవ్వనుంది. అరుణకు జరిగిన అన్యాయానికి మధ్యప్రదేశ్ సీఎం చింతిస్తూ...ఆమె గౌరవానికి చిహ్నంగా పేర్కొన్నారు. దేశానికి దక్కిన బహుమతి అరుణ దేశానికి దక్కిన గొప్ప బహుమతి అని రచయిత పింకి విరానీ అన్నారు. 1973 నవంబర్ 27 ఘటన అరుణ జీవితాన్ని మార్చి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె చనిపోయినా ఎప్పటికీ తన గుండెలో బతికే ఉందని అన్నారు. -
సీట్లు.. పాట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే రాష్ట్రం దాటాల్సిందే. 13 జిల్లాల కొత్త రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోనూ ఎంఎస్సీ నర్సింగ్ సీట్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కళాశాలలో సీట్లు మంజూరు కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల్లో వేలాది రూపాయలు వెచ్చించి చదవాల్సి వస్తోంది. బీఎస్సీ నర్సింగ్ సీట్ల పెంపును ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో వైజాగ్, కర్నూలులో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనంతపురం, కడప, శ్రీకాకుళం, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. మొత్తం అన్ని కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు లేకపోవడం గమనార్హం. ఈ కోర్సు పూర్తి చేయాలంటే విద్యార్థినులు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కర్నూలులో 1982లో 25సీట్లతో కళాశాలను ప్రారంభించారు. అప్ప ట్లో సొంత భవనం లేకపోవడంతో కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఓ నాలుగు గదుల్లో కళాశాలను కొనసాగించారు. ఇలా దాదాపు 29 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీలోనే నర్సింగ్ కళాశాల నిర్వహించారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయడంతో 2011లో నిర్మా ణం పూర్తయింది. ఆ సంవత్సరం ఆగస్టులో కొత్తభవనంలోకి కళాశాలను మార్పు చేశారు. అయితే సీట్ల పెంపు మాత్రం మరిచారు. కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను 25 నుంచి 60కి పెంచాలని, 30 సీట్లతో ఎంఎస్సీ కోర్సు ను ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. నర్సింగ్ కళాశాలలో అధ్యాపకుల కొరత బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్ పోస్టు, ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్, 10 లెక్చరర్, 10 పీహెచ్ఎన్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆరు అసిస్టెంట్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా రెండు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. 10 లెక్చరర్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. పది పీహెచ్ఎన్ పోస్టుల్లో 8 పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. మొత్తం 26 టీచింగ్ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనలో నాణ్యత కొరవడింది. విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేయాలన్నా, థియరీ వినాలన్నా ఇబ్బందిగా మారింది. హాస్టల్ భవనం లేక ఇబ్బందులు నర్సింగ్ కళాశాలకు సొంత భవనం ఉన్నా అందులో చదివే విద్యార్థినులకు హాస్టల్ వసతి కరువైంది. నాలుగేళ్లకు గాను మొత్తం 100 మంది విద్యార్థినులు ఇక్కడ అభ్యస్తుం డగా 25 మంది డే స్కాలర్, 75 మంది హాస్టల్లో ఉంటున్నారు. గతంలో కలెక్టరేట్ పక్కనున్న నర్సింగ్ క్వార్టర్స్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు వసతి పొందేవారు. నర్సింగ్ స్కూల్‌ను అక్కడికి మార్చడంతో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు ఇబ్బందిగా మారిం ది. ప్రస్తుతం సొంత భవనంలోనే పైఅంతస్తు లో విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నారు. అక్కడా చాలీచాలని వసతులతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పట్టని ప్రజాప్రతినిదులు బీఎస్సీ నర్సింగ్ కళాశాల అభివృద్ధి పట్ల పాలకులు శీతకన్ను వేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నివాసముంటున్న నగరంలోని కళాశాలకే ఈ దుస్థితి ఉండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పడిన ఈ కళాశాలలో సీట్లను పెంచేందుకు, ఎంఎస్సీ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని అధ్యాపకులు, విద్యార్థినులు కోరుతున్నారు. -
నర్సింగ్ కాలేజీలో దారుణాలకు పాతర
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేపై విచారణకు తెర సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై నమోదైన కేసును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన కళాశాలలో విద్యనభ్యసించడానికి వచ్చిన కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆయనపై ఆరోపణలన్నాయి. మహిళల ఆత్మాభిమానానికి భంగం కలిగేలా దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణల కింద నిడదవోలు పోలీసు స్టేషన్లో రామారావుపై 2009లో కేసులు నమోదయ్యాయి. నిడదవోలులో ఉన్న టీవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలోని స్పృహ నర్సింగ్ కాలేజీలో వరుస దారుణాలు జరిగినట్లు 2009 జూన్ 18న వెలుగులోకి వచ్చింది. ఆరోజు రాత్రి కళాశాల హాస్టల్లో కలకలం రేగడం, మేడపైనున్న వాటర్ ట్యాంక్ వద్ద దాక్కున్న టీవీ రామారావును స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు మీడి యా సమక్షంలో పట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి నాలుగు రోజుల ముందు ఆ కళాశాలలో చదువుతున్న కేరళ నర్సింగ్ విద్యార్థినితో రామారావు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు, అడ్డుకోబోయిన మరో విద్యార్థినిపై దాడికి ప్రయత్నించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో విద్యార్థినులు నాటి హోంమంత్రికి ఫిర్యాదు చేయగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మంత్రి, విప్..ఓ ఎమ్మెల్యే!
అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు జిల్లాకు మంజూరు కావడం సంతోషకరం. ఎక్కువ మందికి అనుకూలంగా ఉండేలా వీటిని ఏర్పాటు చేయడమో.. అమలు చేయడమో చేయాలి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇందులోనూ అంతర్గత రాజకీయాలు చొప్పిస్తున్నారు. ఆధిపత్య పోరుకు వీటినే అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. నర్సింగ్ కళాశాల వివాదమే దీనికి నిదర్శనం. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మంత్రి, విప్, శ్రీకాకుళం ఎమ్మెల్యేల మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. చివరికి ‘ముందు మీరు తేల్చుకోండి.. ఆ తర్వాతే నిర్ణయిస్తామని’ సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతులెత్తేసే స్థాయికి వ్యవహారం ముదిరింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ‘నర్సింగ్ కళాశాల’ చిచ్పు రగిలింది. రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలోని ఈ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. రిమ్స్ ఆస్పత్రికి మంజూరైన ఈ కళాశాలను స్థల సమ స్య కారణంగా ప్రస్తుతానికి రిమ్స్ ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. కళాశాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ఒకవైపు అధికారులు అన్వేషణ సాగిస్తుండగా.. మరోవైపు జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఎవరికి వారు తమకు అనువైన స్థలాలు సూచిస్తూ అక్కడే ఏర్పాటు చేయాలని పట్టుపడుతున్నారు. ప్రధానంగా ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్ మధ్య పోరు సాగుతుండగా.. మంత్రి తన వాదన నెగ్గించుకునేందుకు చాకచక్యంగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని తురుపు ముక్కలా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమదాలవలసకు తీసుకెళ్లాలని.. జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌కు మంజూరైన నర్సింగ్ కళాశాలను ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రానికి తీసుకెళ్లాలని అక్కడి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తాను ఎన్నికైనప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆమదాలవలసలోని రాజీవ్ విద్యా మిషన్ స్థలంలో కళాశాల ఏర్పాటవుతుందని స్థానికులకు హామీ కూడా ఇచ్చేశారు. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పర్యటనసందర్భంగానూ ప్రస్తావించారు. అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దీనికి అడ్డుపడ్డారు. ఎచ్చెర్ల కొండపైన, అంపోలు ప్రాంతంలో అధికారులు స్థలాలు చూశారని ఆ రెండింట్లో ఎక్కడో ఓ చోట ఏర్పాటు చేయాలని.. ఆమదాలవలసలో ఏర్పాటుకు అంగీకరించబోమని ఆరోగ్యమంత్రి సమక్షంలోనే స్పష్టం చేశారు. దీంతో మంత్రి శ్రీనివాస్ చేతులెత్తేశారు. ఎక్కడ పెట్టాలో ముందు మీరంతా తేల్చుకోండి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. కుదరని సమన్వయం విప్ కూన రవి, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సమన్వయం కుదరడం లేదు. బయటకు తామంతా ఒకటే అని చెప్పుకొంటున్నా.. లోలోన కత్తులు దూసుకుంటున్నారు. నర్సింగ్ కళాశాల వివాదమూ అందులో భాగమే. తన నియోజకవర్గ కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేయించాలన్న రవి ఆశలపై అచ్చెన్న నీళ్లు చల్లుతున్నారు. శ్రీకాకుళం తన నియోజకవర్గం కాకపోయినా.. నర్సింగ్ కళాశాల అంశంతో నేరుగా సంబంధం లేకపోయినా.. తాను అనుకున్నదే జరిగి తీరాలని ఆయన భావిస్తున్నారు. విప్‌ను దెబ్బ కొట్టేందుకు తెలివిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని రెచ్చగొడుతున్నట్టు తెలిసింది. రిమ్స్ ఆమె నియోజకవర్గ కేంద్రంలో ఉన్నందున ఆమెను వివాదాల ఉచ్చులోకి లాగి తన మాట నెగ్గించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్యశాఖ మంత్రి జరిపిన సమీక్షలో పాల్గొన్న లక్ష్మీదేవి ఈ విషయం ప్రస్తావించనే లేదు. మరోవైపు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆమె వేదికపై కూర్చోవడం, మిగతా ఎమ్మెల్యేలు వేదిక ఎదురుగా కిందనే కూర్చోవడంపై అప్పట్లో చర్చ జరిగింది. మీరేమైనా మాట్లాడతారా అని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రే అడిగినా ఆమె మాట్లాడలేదు. పట్టణాభివృద్ధి విషయంలో ఆమె పాదయాత్రలు చేస్తున్నా మంత్రి సమక్షంలో జరిగిన సమీక్షలో సమస్యలు ప్రస్తావించకుండా మౌనం వహించడంపై టీడీపీ కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరి స్థలంలో ఏర్పాటు చేస్తారో? ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఉన్నట్టుండి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల నిర్ణయం జరిగిందనే రీతిలో మాట్లాడటం వెనుక ‘మరేదో’ జరుగుతోందని చెబుతున్నారు. వివాదాల్లో ఉన్న శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రాంతంలోని 360 సర్వే నెంబర్లోని స్థలంలో కళాశాల ఏర్పటవుతుందని చెప్పడాన్ని తెలుగు తమ్ముళ్లే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే పేర్కొన్న స్థలం ప్రభుత్వ భూమే అయినప్పటికీ వివాదాల్లో ఉన్నట్లు తెలిసింది. దీనికి ఇప్పటికే రెండుమూడుసార్లు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని.. అటువంటి స్థలాన్ని నర్సింగ్ కళాశాలకు ఎంపిక చేయడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూన రవికి దెబ్బ తీసేందుకే అప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి సింగుపురం స్థలం ప్రతిపాదనను తెరపైకి తెప్పించారని పార్టీలోని కొంతమంది నాయకులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడే తెర వెనుక నుంచి ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సమీక్షలకు ఇతర ఎమ్మెల్యేలు రాకపోవడం, అన్ని సమీక్షలతో సంబంధం లేకపోయినా లక్ష్మీదేవి వెళ్తుండడం, నర్సింగ్ కళాశాల ఏర్పాటుపై జరుగుతున్న ఆధిపత్య పోరు ను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
అచ్చెన్న+ కూన
టీడీపీలో అధికార కేంద్రాల మధ్య వర్గపోరు ఆరోగ్య మంత్రి ఎదుటే ఇరువురి సంవాదం గతంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ భేటీలోనూ ఇదే సీన్ ఆమదాలవలసలో పెట్టాలని విప్ కూన రవి పట్టు ఎచ్చెర్ల లేదా అంపోలు ప్రాంతాలను సూచిస్తున్న మంత్రి అచ్చెన్న అంతా కలిసి నిర్ణయించండంటూ దాటవేసిన మంత్రి కామినేని రిమ్స్ క్యాంపస్: రెండు అధికార కేంద్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి మంత్రిగా అచ్చెన్నాయుడుకు.. ప్రభుత్వ విప్‌గా కూన రవికుమార్ నియమితులయ్యారు. పోటాపోటీగా సమీక్షలు నిర్వహిస్తూ హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వీరద్దరి మధ్య నర్సింగ్ కళాశాల అంశం వివాదం రాజేస్తోంది. తాము చెప్పిన చోటే కళాశాలను ఏర్పాటు చేయాలని ఎవరికి వారు పట్టుపడుతున్నారు. చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం రిమ్స్‌లో జరిపిన సమీక్ష సమావేశంలోనూ వీరి మధ్య నెలకొన్న వివాదంబయటపడింది. దీంతో ఇదే చర్చనీయాంశంగా మారింది. కళాశాల మంజూరైనప్పటి నుంచీ.. శ్రీకాకుళంలోని రిమ్స్‌కు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజురైంది. తొలుత రిమ్స్ ఆవరణలోనే దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అం దుకు అవసరమైన ఐదు ఎకరాల స్ధలం రిమ్స్‌లో లేకపోవటంతో అధికారు లు స్థలాన్వేషణలో పడ్డారు. తాత్కాలికంగా రిమ్స్‌లోని స్టాఫ్ నర్సుల క్వార్టర్లను హాస్టల్‌గా మార్చి, వైద్య కళాశాలలోనే నర్సింగ్ కళాశాలను కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు ఎచ్చెర్లలోని కొండపై స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఆమదాలవలసలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా ఆమదాలవలసలోనే నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ అక్కడ జరిగిన పలు సమావేశాల్లో ఆర్భాటంగా ప్రకటించేశారు కూడా. ఇటీవల జరిగిన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశంలో నూ ఈ విషయం ప్రస్తావించారు. ఎచ్చెర్లలో ఇప్పటికే యూనివర్సిటీ, గురుకులంతోపాటు ఎన్నో పరిశ్రమలు ఉన్నందున నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస, ఎచ్చెర్ల రెండూ సమాన దూరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ సమావేశంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందిస్తూ.. అక్కడెక్కడో ఆమదాలవలసలో ఎలా పెడతారని అంటూ.. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేస్తారని బదులిచ్చారు. ఎచ్చెర్లలోనే ఏర్పాటు చేయండంటూ అక్కడే కలెక్టర్‌కు సూచించారు. వీరిద్దరి సంవాదంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నివ్వెరపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి ముందూ అదే తీరు అభివృద్ధి కమిటీ సమావేశంలో మొదలైన వివాదం తిరిగి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముందుకొచ్చింది. రిమ్స్‌పై సమీక్షిస్తున్న సందర్భంగా నర్సింగ్ కళాశాలను త్వరగా ఏర్పాటు చేయాలని రిమ్స్ అధికారులు మంత్రిని కోరారు. వెంటనే కూన రవికుమార్ జోక్యం చేసుకొని ‘సార్ మంత్రిగారు.. నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయం డి’ అని కోరారు. ఆ వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు మైక్ ఆన్ చేసి ‘కళాశాల ఏర్పాటుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అంపోలు దారిలో స్థలం చూశారని.. దాన్ని ఆర్డీవో పరిశీలించారని అంటూ.. వీలైతే అక్కడ ఏర్పాటు చేయండి.. అది కాకపోతే ఎచ్చెర్లలో ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా అచ్చెన్న, రవికుమార్‌లు తమ ప్రతిపాదనకు మద్దతుగా పోటాపోటీగా వాదించడం మొదలుపెట్టారు. వ్యవహారం ముదురుతున్నట్లు గమనించిన మంత్రి కామినేని అందరి ముందు చర్చించటం సరికాదని, వేరేగా కూర్చొని మాట్లాడుకుందామంటూ అడ్డుకట్ట వేశారు. మీరంతా నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో చెబితే.. అక్కడే పెడదామంటూ ఆ అంశాన్ని దాటవేశారు. ఈ వాగ్వాదాన్ని చూసి జిల్లా కలెక్టరుతో సహా రిమ్స్ అధికారులు విస్మయానికి గురయ్యారు. జిల్లాకు ప్రయోజనకారి అయిన నర్సింగ్ కళాశాల ఏర్పాటు విషయంలో ఈ వర్గపోరేంటంటూ పలువురు ముక్కున వేలేసుకున్నారు. -
అడ్డదారులు
ఆదిలాబాద్ క్రైం : వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఒకరి వెంట ఒకరు వెళ్తుండటంతో రిమ్స్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. వైద్యులు వారి భవిష్యత్తు దృష్ట్యా వెళ్తుండగా, స్టాఫ్ నర్సులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారులు తొక్కుతున్నారు. వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విధులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ఒకరి వెంట ఒకరు వెళ్లిపోతుండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు 20 మంది నర్సులు వారి సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. రిమ్స్‌లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్‌లకు చెందిన వారు ఉన్నారు. ఇందులో అత్యధికంగా వరంగల్ జిల్లావారే ఉన్నారు. 240 మంది నర్సులకు 200 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో 20 మంది హెడ్‌నర్సులు, 180 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రిమ్స్‌లో నర్సింగ్ కళాశాల మొదటి బ్యాచ్ తరగతులు నడుస్తుండడంతో తప్పనిసరిగా మరో 20 మంది ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులు అవసరం. వీరు టీచింగ్ ఫ్యాకల్టీ కింద బోధన చేస్తారు. ఇంకా రిమ్స్‌కు 50 మంది స్టాఫ్ నర్సులు అవసరమున్నారు. రిమ్స్‌లోనే వీరి సర్వీస్ అవసరం ఉండగా ఇతర జిల్లాలకు రిలీవ్ చేయకూడదని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు రెండేళ్ల సర్వీస్ తర్వాత సొంత జిల్లాకు వెళ్లేందుకు రిలీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అది కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రిలీవ్ చేస్తారు. అసలైతే ఐదేళ్ల తర్వాత బదిలీ చేయాలనే నిబంధన ఉంది. స్టాఫ్ నర్సులు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ అయ్యేందుకు ఆర్డీ(రీజినల్ డెరైక్టర్, వరంగల్) స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌లో వరంగల్ జిల్లాకు చెందిన నర్సులు సుమారు 80 మంది వరకు ఉన్నారు. ఎవరైనా రిలీవ్, డిప్యూటేషన్ మీద వెళ్లాలంటే రిమ్స్ డెరైక్టర్‌ను సంప్రదించాలి. చాలా మంది ఆర్డీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఓ స్టాఫ్ నర్సు ఆర్డీ నుంచి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకుని వరంగల్‌లోని నర్సింగ్ కళాశాలలో వర్కర్డర్ చేస్తుంది. ఇది డెరైక్టర్ ప్రమేయం లేకుండా జరిగింది. రిలీవ్‌పై పలు అనుమానాలు ఆర్డీ నుంచి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీకాక సదరు నర్సును రిలీవ్ చేసిన ఆర్డీ కూడా ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన వెళ్లిపోతూనే నిబంధనలు పట్టించుకోకుండా రిలీవ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు 20 మంది వరకు నర్సులు రిమ్స్ నుంచి వరంగల్‌కు వెళ్లిపోయారు. వరంగల్‌కు చెందిన స్టాఫ్ నర్సులు ఎక్కువగా ఉండడంతో అందులోంచి కొంత మంది కమ్యునిటీగా ఏర్పడి, నర్సింగ్ కళాశాల ఉన్నతఅధికారులతో పైరవీలు చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డీ కార్యాలయంలో కొంత మంది అధికారులను మచ్చికచేసుకొని వారికి కాసులు ఇస్తూ బదిలీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైన జిల్లాలోని రిమ్స్‌లో అందించాల్సిన సేవలనుపదవీకాలం ముగియకుండానే సొంత జిల్లాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను అడుగగా.. రిమ్స్‌కు మరో 50 మంది వరకు నర్సులు అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది నర్సింగ్ కళాశాల రెండో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులను రిలీవ్ చేసే ప్రసక్తేలేదని పేర్కొన్నారు.