Padmaja
-
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్‌రెడ్డి -
జగన్‌లాంటి అన్న మీ దేశాల్లో ఉన్నారా!
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్‌లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. -
టీడీపీకి కుర్చీలు మడతపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది: నారమల్లి పద్మజ
-
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు ఏమాత్రం సహించదగినవి కావు
-
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సీఎం జగన్‌ను వారు ఆహ్వనించారు. సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ సిబ్బంది రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు. -
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీవోఏ) సంస్థ 2023కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా.. ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం. పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీవో)తో పాటు బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. వీటిని సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరిగే ‘బయోఫాక్ ఇండియా నేచురల్స్ ఎక్స్ పో’లో ప్రదానం చేయనున్నారు. ప్రకృతి సాగులో ఏపీ బహు బాగు.. కాగా రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది. 700 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తోంది. దీంతో ప్రకృతి సాగు ప్రస్తుతం 3,730 పంచాయతీల పరిధిలో విస్తరించింది. 9.40 లక్షల ఎకరాల్లో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్నారు. ప్రకృతి, సేంద్రియ సాగులను ప్రోత్సహించేందుకు ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుత సీజన్ నుంచే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) సర్టిఫికేషన్ జారీ చేయనుంది. అత్యుత్తమ ఎఫ్‌పీవోగా.. అత్తలూరుపాలెం రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) కేటగిరీలో పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన ‘అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీవో)’కు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ఈ ఎఫ్‌పీవో పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలో ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు. అంతేకాకుండా వారు పండించిన కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, బియ్యం, వంట నూనెలు, పొడులు, పచ్చళ్లను మార్కెటింగ్ చేస్తున్నారు. అలాగే 70 దేశీ ఆవులతో ప్రత్యేకంగా ఆవుల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆవు పాలు, నెయ్యి, మజ్జిగలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. రైతులు మార్కెట్ ధర కంటే అధిక ఆదాయం పొందేలా ఎఫ్‌పీవో కృషి చేస్తోంది. అంతేకాకుండా ప్రకృతి సాగు చేసే రైతులకు అవసరమయ్యే శిక్షణ కూడా అందిస్తోంది. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో గుంటూరు విద్యానగర్‌లో హోటల్‌ను సైతం నడుపుతోంది. గుంటూరు, విజయవాడల్లో ప్రత్యేక స్టోర్ల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. మహిళా రైతుకు జాతీయ అవార్డు.. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళా కేటగిరీలో బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ జైవిక్ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నాలుగేళ్లుగా సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తోంది. పద్మజ సేవలను గుర్తించి ఇటీవల రైతు సాధికార సంస్థ ఆమెను మోడల్ మేకర్‌గా ఎంపిక చేసింది. ఆమె తనకున్న ఎకరంలో ఏటా రూ.లక్షన్నర ఆదాయం ఆర్జిస్తోంది. అలాగే పశువుల పెంపకం ద్వారా రూ.60 వేలు, కషాయాల విక్రయాల ద్వారా మరో రూ.5 వేలు సంపాదిస్తోంది. ఆదర్శంగా తీసుకున్న పలు రాష్ట్రాలు.. ఏపీలో ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి సాగును కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు రైతు బజార్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీక్లీ మార్కెట్ల ద్వారా కూడా ప్రోత్సాహం అందజేస్తోంది. ఈ క్రమంలో ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ముందుకొచ్చిన అమూల్ ఆర్గానిక్స్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాల కోటాలో ఏపీ ఉత్తమ ప్రభుత్వంగా నిలిచి జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైంది. -
అతివల తెగువకు తలవంచిన కిలిమంజారో!
కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు. వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు. -
‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’.. అదేమీ కాదు!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మొదలైన ప్రాంతాల్లో రాజులకు సంబంధించి ఎన్నో విషయాలు వినిపిస్తుంటాయి. ఆ ముచ్చట్లు ‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’ అన్నట్లుగా ఉండేవి. అదేమీ కాదని నిరూపించింది ఉదయ్‌పూర్ రాకుమారి పద్మజ కుమారి మేవార్. ఆమెకు పల్లె గుండె తెలుసు. పక్షులను, పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు... రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రాజకుటుంబంలో పుట్టింది పద్మజ కుమారి మేవార్. అమ్మ, నాన్నమ్మల నుంచి ఎన్నో జానపదకథలు విన్నది. ఆ కథల్లో ఎన్నో అందమైన అడవులు, అపురూపమైన జంతుజాలం ఉండేవి. కాల్పనిక ప్రపంచం దాటి బయటికి వస్తే పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అడవులు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాల గురించి నాన్న మాటల్లో ఎన్నోసార్లు విన్నది. హైస్కూల్ చదువు నుంచి డిగ్రీ వరకు అమెరికాలో చదువుకున్న పద్మజ కుమారి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. చదువు పూర్తయిందో లేదో ఆమె ‘భగీర’ క్యాంపులోకి అడుగుపెట్టింది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం తల్లిదండ్రులు రాణి దుర్గేష్ నందిని, మహారాజా రాజేంద్రసింగ్ ఈ క్యాంపుకు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంప్‌లోని గదులను స్థానికులే, స్థానికంగా దొరికే వనరులతో నిర్మించారు. గోద్వారీ ప్రాంతంలో ఉన్న ఈ క్యాంపు కేంద్రంగా వనసంరక్షణ, స్త్రీ సాధికారత, ఆరోగ్యం, జలసంరక్షణ... మొదలైన కార్యక్రమాలు చేపట్టారు. పద్మజ కుమారి ఈ క్యాంప్‌లోకి అడుగు పెట్టిన తరువాత క్యాంపుకు కొత్త శక్తి వచ్చి చేరింది. ఆమెకు ఆ ప్రాంతంలో ప్రతి ఊరూ కొట్టిన పిండే. గోద్వారీ ప్రాంతం 235 రకాల పక్షులకు, 35 రకాల ఔషధ మొక్కలకు నిలయం. ‘మన దగ్గర అపూర్వమైన సంపద ఉంది. వాటిని పరిరక్షించుకోవాలి’ అంటూ ఊరువాడా తిరిగింది. గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్ మొదలుపెట్డడం ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకువచ్చింది. సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలే కాదు స్థానికులకు ఉపాధి కల్పించే పనులకు శ్రీకారం చుట్టింది. ‘ఈ క్యాంపులోకి అడుగు పెడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఎంతో ధైర్యం వస్తుంది’ అంటారు స్థానికులు. ఇప్పుడు వారికి రకరకాల పక్షుల పేర్లు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, ఔషధ మొక్కల పేర్లు, వాటి ఉపయోగాలు తెలియడం మాత్రమే కాదు వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా బాగా తెలుసు. ‘పెద్ద చదువులు చదువుకున్నావు. ఇక్కడికి ఎందుకు తల్లీ’అని తల్లిదండ్రులు అనలేదు. అదే తనకు మహాబలం అయింది. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగిన పద్మజ కుమారికి, సామాజికసేవలో కొత్త ప్రపంచం కనిపించింది. ఎన్నో లక్ష్యాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్ టూరిజం కేంద్రంగా గోద్వారీ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని. స్థానికుల స్పందన, చైతన్యం పద్మజ కుమారి సంకల్పబలం చూస్తుంటే అదేమీ కష్టం కాదు అనిపిస్తుంది. -
సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కూతురే పద్మజా రాజు. ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా ‘‘గోకులంలో సీత, తొలిప్రేమ’’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర, దివంగత నటులు సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మజా రాజు ఇటీవల ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? -
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా పద్మజ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఓ జీవో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏఆర్ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది. -
నా కూతురేంటో నాకు తెలుసు, అలాంటివి పట్టించుకోను: నిహారిక తల్లి
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పబ్ ఇన్సిడెంట్ తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన నిహారిక ఇటీవలె ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా మారిన నిహారిక తాజాగా తల్లి పద్మజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఇటీవలి కాలంలో నిహారికపై వచ్చిన వార్తలపై నాగబాబు భార్య, నిహారిక తల్లి పద్మజ స్పందించింది. 'మొదట్లో ఇలాంటి వార్తలు రావడం ఇబ్బందిగా అనిపించేది కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఎక్కడికైనా వెళ్లినా నాకేం అనిపించదు. నా కూతురేంటో నాకు తెలుసు. నాకు మా బావగారున్నారు.ఆయన ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
శభాష్.. నిర్మలా సీతారామన్!.. నెటిజన్ల మెచ్చుకోలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోదా, ప్రోటోకాల్ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2022 మే 8 ఆదివారం న్యూఢిల్లీలో మార్కెట్ కా ఏకలవ్య పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరు పద్మజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజా చుండూరు ప్రసంగించడం ప్రారంభించారు. అయితే మార్కెట్‌కు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తున్న క్రమంలో ఆమెకు ఇబ్బంది కలగడంతో మధ్యలో ప్రసంగం ఆపి, మంచి నీళ్ల బాటిల్ ఇవ్వాలంటూ అక్కడున్న హోటల్ సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తున్నారు. పద్మజా చుండూడుకు ఎదురైన ఇబ్బందిని గమనించిన మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తన దగ్గరున్న బాటిల్లో నీటిని ఓ గ్లాసులో పోసి తన కుర్చీ నుంచి లేచి.. పద్మజా దగ్గకు వెళ్లింది. గ్లాసులో నీళ్లు అందించి తాగాలంటూ సూచించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఘటనతో పద్మజతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మలా సీతారామన్ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values. A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8 — Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గంటల తరబడి గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం దిట్ట. అందరికీ అది అంత సులువైన విషయం కాదు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్డడంతో పాటు ఆర్మ నిర్భర్ ప్యాకేజీని సైతం ఆమె గంటల తరబడి సునిశితంగా వివరించారు. అందువల్లే మాట్లాడేప్పుడు వచ్చే ఇబ్బందిని గమనించి.. వెంటనే అక్కడ చాలా సేపుగా మాట్లాడుతున్న మహిలా ఉద్యోగి తాగేందుకు నీళ్ల బాటిల్ అందించారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం -
చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని వైఎస్సార్సీపీ మహిళా నేత నారమల్లి పద్మజ సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోచేసిన అభివృద్ధి శూన్యం. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే చంద్రబాబు పరిమితం. చంద్రబాబు తన పాలనలో ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా?. చంద్రబాబు నైజం చూసే ప్రజలు ఏపీ నుంచి తరిమికొట్టారు. ప్రజా తీర్పును చూసి కూడా చంద్రబాబుకు బుద్దిరాలేదు. స్థాయిలేని వ్యక్తులతో సీఎం జగన్‌ను చంద్రబాబు తిట్టిస్తున్నారు. కొందరు చంద్రబాబు చెంచాలు మాత్రం మద్యం తాగి మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకురాలు అనిత తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. ఆమె తాగే బ్రాండ్ దొరకటం లేదని తెగ బాధ పడుతోంది. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారో జనానికి ఇంకా గుర్తుంది. మాకు సంస్కారం ఉంది. ఆ సంస్కారంతోనే మాట్లాడతాము. ఓటమితో పారిపోయి చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నాడు . టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. కానీ మేము మద్యం తగ్గించాం. టీడీపీ చేసే ఉద్యమాల వెనుక ఎన్నో కుయుక్తులు ఉన్నాయి. పసుపు కుంకుమ పేరుతో మహిళలకి డబ్బులు ఇచ్చి గెలవాలనుకున్నాడు. కానీ రాష్ట్ర మహిళలకు ఎవరు ఎలాంటి వారో తెలుసు' అంటూ నారమల్లి పద్మజ చంద్రబాబుపై మండిపడ్డారు. చదవండి: (వైఎస్సార్సీపీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది: విజయసాయిరెడ్డి) -
‘ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోంది’
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు హద్దు లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నారమిల్లి పద్మజ ధ్వజమెత్తారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దిశ చట్టం గురించి కూడా చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదన్నారు. చదవండి: డైనమిక్ సీఎం వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గడ్కరీ ప్రశంసలు ‘‘టీడీపీ మహిళా నేత అనిత నోరు అదుపులో పెట్టుకోవాలి. దళితులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వనజాక్షి మీద దౌర్జన్యంపై అనిత ఎందుకు మాట్లాడలేదు. కుప్పంలో బీసీ మహిళపై దౌర్జనం మీకు కనిపించలేదా?’’ అంటూ పద్మజ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబుకి ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. పట్టాభితో బోసిడీకే అని తిట్టించారు. దళిత మహిళతో సీఎం జగన్ కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. వివేకా హత్య విషయంలో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్టానికి శాపంలా మారారు. దేశంలో సీఎం జగన్ చేసే కార్యక్రమాల్ని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని’’ నారమిల్లి పద్మజ అన్నారు. -
మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్నకోడలికి ‘పద్మశ్రీ’
సాక్షి, నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లికి చెందిన డాక్టర్ పద్మజారెడ్డికి దేశంలోనే నాలుగో అత్యున్నతమైన ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. కూచిపూడి విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి భార్య అయిన పద్మజారెడ్డి ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో ఉంటుంది. దీంతో కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్ శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిపై మక్కువ పెంచుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్ పద్మజారెడ్డి కూచిపూడిలో ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్ ఆర్ట్ ఫాంను రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్య రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్ రూపొందించారు. అదేవిధంగా సామాజిక అంశాలపైనా నృత్యరూపకాలు రూపొందించి సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించారు. భ్రూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య ప్రదర్శనలు చేశారు. చదవండి: పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం డాక్టర్ పద్మజారెడ్డి సాధించిన అవార్డుల్లో కొన్ని.. ► భారత ప్రభుత్వం నుంచి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ► 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా కళారత్న (హంస) అవార్డు ► శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 2005లో డాక్టరేట్ పట్టా ► 1994లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ నాట్యవిశారద అవార్డు అందజేశారు. ► 1990లో కల్కి కళాకార్ అవార్టు ► 2001లో డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా సంస్కృతి రత్న, అభినయ సత్యభామ అవార్డు అందుకున్నారు. ► అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్ఆర్ గోల్డ్‌మెడల్ అందుకున్నారు. ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2014లో అవార్డు పొందారు. ► యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుంచి అవార్డు ► తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి ది డ్యాన్సింగ్ క్వీన్ అవార్డు ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ లైఫ్‌టైమ్ ఆచీవ్మెంట్తో అవార్డుతో సత్కరించింది. ► 1979లో సర్ శ్రీనగర్ సంసద్ నృత్యవిహార్ అవార్డు అందజేశారు. ► 2007లో త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ విద్వాన్ మంత్‌తో సన్మానించింది. ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్(ఢిల్లీ) జనరల్ అసెంబ్లీ మెంబర్‌గా 2017 వరకు ఉన్నారు. ► 2012లో నేషనల్ టూరిజం అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా వ్యవహరించారు. -
అమ్మ చీరలో పెళ్లి కూతురు
ప్రస్తుతం పెళ్లి సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు నిహారిక. ఈ వేడుకల్లో భాగంగా కట్టుకున్న ఓ చీరను చూసుకుని మురిసిపోతున్నారు. కారణం ఆ చీరకున్న స్పెషాలిటీయే. నిహారిక తల్లి పద్మజ నిశ్చితార్థంలో కట్టుకున్న చీరను ఇప్పుడు తన పెళ్లి సంబరాల్లో కట్టుకున్నారు నిహా. అప్పటి తన తల్లి ఫోటోను, అమ్మ చీరను కట్టుకుని ఇప్పుడు తాను దిగిన ఫొటోను పక్కపక్కనే పెట్టి, ఓ ఫొటోగా షేర్ చేశారు. ‘‘మా అమ్మ నిశ్చితార్థం అప్పటి చీర ఇది. 32 ఏళ్ల నాటి చీర’’ అని క్యాప్షన్ చేశారు నిహారిక. ‘‘మా ఆవిడ అందంగా ఉంది. కానీ నా కూతురు మాత్రం యువరాణిలా ఉంది’’ అని నాగబాబు కామెంట్ చేశారు. వెంకట చైతన్యతో ఈ నెల 9న నిహారిక వివాహం జరగనుంది. -
సరికొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు
-
ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ బాధ్యతలు
ప్రభుత్వ రంగ బ్యాంక్– ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పద్మజ చంద్రూ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె... తాజాగా ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారని గురువారం బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎండీ, సీఈఓలను నియమించగా... ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ ఉన్న విషయం తెలిసిందే. -
కీచకులను ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: దాచేపల్లి ఘటనలో బాధిత బాలికకు న్యాయం చేయాలని పోరాడిన తమ పార్టీ నేత ఆర్కే రోజాపై తెలుగుదేశం నాయకులు సంస్కార హీనంగా మాట్లాడటం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తన అనుయాయులతో ఇలా మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. కీచకులను ప్రోత్సహిస్తూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేని దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బండారు సత్యనారాయణ, పంచమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలను పద్మజ తీవ్రంగా ఖండించారు. కాల్‌మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తున్నారని సీఎంపై మండిపడ్డారు. ఐఏఎస్ అధికారిపై దాడికి పాల్పడిన వారిపైనా, దళిత మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. గడచిన ఐదేళ్ళుగా 12 ఏళ్ల చిన్నారులపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం శోచనీయమన్నారు. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో మిస్టరీలుగా మారుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ఏ సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. -
బాబుది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం: పద్మజ
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో మహిళలపై గంటకో అత్యాచారం జరుగుతోందని.., చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్నది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వమనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. దివ్యాంగులను సైతం టీడీపీ నేతలు విడివకుండా కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో మంగళవారం జరిగిన దారుణ ఘటన సీఎం దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. గుంటూరు జిల్లాలో ఒంటరి మహిళపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడని మండిపడ్డారు. -
ఏపీలో టీడిపీ నేతల దాష్టీకాలకు అంతులేదు
-
‘టీడీపీ నేతలే ఆ లైంగిక దాడులు చేశారు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో గంటకో అత్యాచారం జరుగుతోందని, దివ్యాంగులను సైతం టీడీపీ నేతలు విడిచి పెట్టడం లేదంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ మండిపడ్డారు. కశ్మీర్లో జరిగిన ఘటనపై స్పందిస్తారు.. కానీ మంగళవారం రాజధానిలో జరిగిన దారుణం సీఎం చంద్రబాబు దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన దారుణాలపై స్పందించే చంద్రబాబు.. సొంత రాష్ట్రం ఏపీలో జరిగిన ఏ ఘటనపై కూడా స్పందించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గుంటూరులో నిన్న ఒంటరిమహిళపై దారుణానికి ఒడిగడితే మీ దృష్టికి రాలేదా ? బెల్లంకొండలో 7 ఏళ్ల మూగ బాలికపై జరిగిన సంఘటన, పెసరలంకలో 7 ఏళ్ల బాలికపై, చిలకలూరిపేటలో మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. టీడీపీ నేతలు చింతమనేనిపై 27, దేవినేనిపై 13 కేసులు ఉన్నాయి. కొల్లు రవీంద్ర, కేఈ కృష్ణమూర్తి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, నక్క ఆనందరావు, కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమ, వేద వ్యాస్ లపై వివిద జీవోల ద్వారా కేసులు ఎత్తివేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం.. జైలుకు వెళ్తానన్న భయంతో తనను రక్షించాలని ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిలో ప్రపంచంలోనే చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని ఆరోపించారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో, దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉన్నది నిజం కాదా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. మహిళలకు కనీస భద్రత కల్పించలేని దద్దమ్మ పాలన అవసరమా అని మహిళలు దీనిపై ఆలోచన చేయాలంటూ వైఎస్సార్సీపీ మహిళా నేత పద్మజ పిలుపునిచ్చారు -
ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ క్రీడంటే మక్కువ చూపి శిక్షణ పొందడం మొదలుపెట్టారు. క్రమంగా మెళకువలు నేర్చుకుంటూ జిల్లాలో మొట్టమొదటి ఉమన్ బ్లాక్‌బెల్ట్ ఫస్ట్ డాన్‌గా నిలిచారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు కైవసం చేసుకున్నారు. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను ఇతరులకు కూడా పంచాలనుకుని ఇప్పటి వరకు కొన్ని వందల మంది బాల బాలికలకు, షీ టీంలకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే శిక్షకురాలిగానే కాదు..ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా, చిత్రకారిణిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుతున్న పద్మజపై ‘సాక్షి’ కథనం. ఒంగోలు వన్‌టౌన్: మేదరమెట్ల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఒంగోలులో స్థిరపడిన చిలకమర్తి గోపాలకషమూర్తి, రమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కూతురు పద్మజ. తండ్రి విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కావడంతో పద్మజ తన అన్న చంద్రశేఖర్ (మ్యాథ్స్ లెక్చరర్, హైదరాబాద్) తమ్ముడు కష్ణమోహన్ (ఫార్మాసూట్ సైంటిస్ట్, న్యూయార్క్)తో సమానంగా పెరిగింది. ఒంగోలు శర్మా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పద్మజ 1993లో బీఎస్సీ, బీఈడీ పట్టా తీసుకున్నారు. 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా కొత్తపట్నం మండలం బజ్జిరెడ్డి గమళ్లపాలెం పాఠశాలలో ఉద్యోగినిగా చేరారు. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ రావడంతో ఇంగ్లిష్ టీచర్‌గా మద్దిపాడు మండలం బసవన్నపాలెం ఉన్నతపాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చిన్నగంజాం హైస్కూల్ నందు ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. కరాటే పద్మజ 1980 దశకంలో కరాటే శిక్షణ యువతీయువకులను విపరీతంగా ఆకర్షించింది. పద్మజ డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు మహిళా మండలి వద్ద ప్రతిరోజూ ప్రముఖ కరాటే మాస్టర్ వలిశెట్టి రవి యువకులకు కరాటే శిక్షణ ఇవ్వడం గమనించి, కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని నేరుగా రవి మాస్టర్‌కి తెలిపింది. అలా యుద్ధ నైపుణ్య విద్యలో తొలి అడుగులు వేసిన పద్మజ 1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్‌గా, 2017 జనవరి 8న ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డాన్‌గా నిలిచింది. 2015లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం (హైదరాబాదు)లో జరిగిన నేషనల్ బూడోకాన్ ఈవెంట్లో ‘కట’ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పటికీ స్వార్డ్, స్టిక్, నాన్చక్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా ... ♦ తను పని చేస్తున్న చోట పలువురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా నవోదయ, గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడంలో చేయూతనిచ్చారు. ♦ 2009 నుంచి జిల్లా రీసోర్స్ పర్సన్‌గా కొనసాగుతూ విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణా శిబిరాల్లో ఆంగ్ల బాషా శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. ♦ 2016లో బెంగళూర్‌లో రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లిష్ సౌత్ ఇండియా (ఆర్ఐఇఓస్ఐ) ఆధ్వర్యంలో జరిగిన క్యాంప్‌లో జిల్లా విద్యాశాఖ సహకారంతో సీఈఎల్‌టీ ట్రైనింగ్ తీసుకున్నారు. ♦ 2017 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున స్పాట్ వాల్యుయేషన్‌కి వచ్చిన సుమారు 100 మంది సహచర ఇంగ్లిష్ ఉపాధ్యాయులతో ‘ఇంగ్లిష్–ప్రకాశం’ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 300 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇంగ్లిష్ బోధనలో వచ్చే సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సమన్వయపరచడం. ♦ 2017లో ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బ్రిటీష్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇంగ్లిష్ ట్రైనింగ్ క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశంపై రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వారు నిర్వహించిన క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ప్రేమ వివాహం కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదవడం, పద్మజ తండ్రి వత్తి రీత్యా బయటి ప్రపంచంతో మమేకం కావడంతో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ప్రతి విషయాన్ని అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా మారిన నేపధ్యంలోనే పద్మజ తన సహవిద్యార్థి వై.ఎస్.దిగ్విజయ్‌ను మతాంతర వివాహం చేసేకున్నారు. పెళ్లి జరిగిన తొలి రోజుల్లో ఇద్దరి కుటుంబాల భావ సంఘర్షణ వల్ల ఏర్పడిన అరమరికలు అనతికాలంలోనే సమసిపోయి ఇద్దరి కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. 80 దశకంలో విప్లవ భావాలు యువతలో మెండుగా ఉన్న రోజులు. ప్రేమంటే భావావేశంతో కలిగేదనిపిస్తున్న నేటి ప్రేమ కథలకు భిన్నంగా, భావసారూప్యతతో జీవిత భాగస్వాములైన పద్మజ, దిగ్విజయ్‌లను చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం గురించి ఒంగోలు జక్రయ్య ఆస్పత్రి వీధిలో నివసిస్తోంది పద్మజ కుటుంబం. భర్త వై.ఎస్.దిగ్విజయ్ ఒంగోలు నగరంలోని పేస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు బయాలజీ సైన్స్ టీచర్‌గా సేవలందించిన దిగ్విజయ్ ఒక లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వివేక్ (21) శ్రీకాకుళం డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జన్ (బీడీఎస్) చదువుతున్నాడు. విక్రాంత్ (18) విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. తల్లి వద్ద కరాటే శిక్షణ పొందిన ఈ ఇద్దరు పిల్లలు గ్రీన్ బెల్ట్ పొందారు. ‘సమాజం కోసం నా వంతుగా ... ప్రభుత్వంగానీ, వలంటరీ ఆర్గనైజేషన్స్గానీ నగరంలో ఏదైనా వేదిక ఏర్పటు చేయగలిగితే ఉదయం ఆత్మరక్షణ యుద్ధ నైపుణ్యం శిక్షణ, సాయంత్రం ఇంగ్లిష్ మాట్లాడటం, బోధనా నైపుణ్యం, బాషా సమస్యలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అంటున్న పద్మజ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. ఉపాధ్యాయినిగా.. ఆత్మరక్షణ నైపుణ్య శిక్షకురాలిగా ♦ 1995–96 లో ఖాశీం మెమోరియల్ బాలికలపాఠశాల (దర్శి) విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ♦ 2006లో ప్రకాశం జిల్లా సర్వశిక్ష అభియాన్ పీడీరఘుకుమార్ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు. ♦ 2012 నిర్భయ ఘటన తరువాత ఒంగోలు వాకర్స్‌క్లబ్ లో మాస్టర్ ఎ.రవిశంకర్‌తోపాటు పలువురికిప్రాక్టీస్లో సేవలందిచారు. ♦ 2014 నుంచి స్థానిక జక్రయ్య ఆసుపత్రి ఆవరణలో డా.జాకబ్ జక్రయ్య, డా.సారా జార్జి ల సహకారంతో స్థానికులకు కరాటే శిక్షకురాలిగా నిలిచారు. డా.సారా జార్జి కూడా పద్మజ వద్ద శిక్షణ పొందుతున్నారు. ♦ 2016లో ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలలో మద్దులూరు (సంతనూతలపాడు) హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఆత్మరక్షణ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. ♦ 2016లో తన గురువు వలిశెట్టి రవి స్థాపించిన రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ (హైదరాబాదు) సహకారంతో తెలంగాణలో షీ టీం ఆధ్వర్యంలో అనేక మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్‌కి శిక్షణ ఇచ్చారు. ♦ 2017 నుంచి చిన్నగంజాం ఏడో తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. చిత్రకారిణిగా ఏకకాలంలో ఉపాధ్యాయినిగా, యుద్ధనైపుణ్య శిక్షకురాలిగా , చిత్రాకారిణిగా ,భార్యగా, అమ్మగా, విభిన్న పాత్రలను పోషిస్తున్న «ఈ ధీశాలి తన భావాలకు రూపాలనిస్తూ అనేక చిత్రాలకు జీవం పోశారు. ఆమెను కలవడానికి వచ్చే మిత్రులు, సందర్శకులను ఇంటిలో గోడలను అలంకరించిన ఆమె పెయింటింగ్స్ కచ్చితంగా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2005లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ నిర్వహించిన ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కోర్సును ఫూర్తి చేశారు. 2009 మార్చిలో ఫెవీక్రిల్ సంస్థ ఇచ్చిన ఎక్స్పర్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. -
శైలజకు వైఎస్సార్ సీపీ మహిళా నేత పరామర్శ
చిత్తూరు ,తిరుపతి మంగళం : పెళ్లయిన మొదటి రోజే భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన నవ వధువు శైలజను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ఆదివారం పరామర్శించారు. పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామనీ, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆమె మాట్లాడుతూ శైలజ భర్త రాజేశ్‌ను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి పరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామనీ, శైలజ అంగీకరిస్తే హైదరాబాద్‌లోని మాక్సివిజన్‌లో కళ్లకు అవసరమైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శైలజకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.