Pakistan Cricket Team
-
ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే తీరును కనబరిచింది.ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు. "ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్లో లేవు. దయచేసి భారత్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.ప్రస్తుతం బారత జట్టు మెన్జ్మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్‌లా చెలరేగాడు. అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. -
‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. షాహిన్ ఆఫ్రిది వంటి పాక్ దిగ్గజాలు ఇప్పటికే ఈ విషయం గురించి పాక్ బోర్డుకు సూచనలు చేయగా.. మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా ఇదే మాట అంటున్నాడు. బాబర్‌కు నాయకత్వ లక్షణలు లేవని.. అతడిని ఇకపై సారథిగా కొనసాగించవద్దని సూచిస్తున్నాడు.సరైన నిర్ణయం తీసుకోకపోతేబాబర్ ఆజం స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని బసిత్ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు గనుక కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. పాక్ క్రికెట్ మరింత భ్రష్టుపట్టిపోతుందని హెచ్చరించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులయ్యారు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అనూహ్యంగా షాహిన్‌పై వేటు వేసిన పాక్ బోర్డు.. తిరిగి వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలను బాబర్‌కు అప్పగించింది. అయితే, గత టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన అతడు.. ఈసారి మాత్రం కనీసం సూపర్-8కు చేర్చలేకపోయాడు. ఫలితంగా బాబర్‌పై వేటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. మహ్మద్ రిజ్వాన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. చాంపియన్స్ వన్డే కప్-2024లో అతడు మార్ఖోర్స్ జట్టును నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. బాబర్ బదులు రిజ్వాన్‌ను పాకిస్తాన్ కెప్టెన్ చేయాలని సూచించాడు.బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు‘‘తన కంటే పాకిస్తాన్‌కు మెరుగైన కెప్టెన్ మరొకరు దొరకరు అనేలా రిజ్వాన్ చాంపియన్స్ కప్‌లో జట్టును నడిపిస్తున్నాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ.. మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు. షాన్ మసూద్ కూడా రిజ్వాన్లా జట్టుకు న్యాయం చేయలేడు.ఈసారి గనుక రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించకపోతే పాకిస్తాన్ క్రికెట్‌కు అంతకంటే భారీ నష్టం మరొకటి ఉండదు. రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ చాంపియన్స్ వన్డే కప్‌లో మహ్మద్ రిజ్వాన్ మార్ఖోర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు ఆదివారం నాటి మ్యాచ్‌లో స్టాలియన్స్‌ను 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక బాబర్ ఆజం స్టాలియన్స్ జట్టుకు ఆడుతుండటం కొసమెరుపు. చదవండి: 4,4,4,4,4: బాబర్ ఆజం ఫోర్ల వర్షం.. అంత ఈజీగా ఎలా కొట్టేశాడు! -
బాబర్, రిజ్వాన్, అఫ్రిది వద్దు.. అతడే పాక్ కెప్టెన్ కావాలి: సల్మాన్ బట్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ జట్టు చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై వేటు వేసిన పీసీబీ.. కెప్టెన్సీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టీ20 వరల్డ్‌కప్ ముందు పాక్ జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజం.. మరోసారి ఐసీసీ టోర్నీల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.ఈ జాబితాలోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేరాడు. పరిమిత ఓవర్లలో పాక్ కెప్టెన్సీని స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించాలని బట్ పీసీబీని సూచించాడు. కాగా మసూద్ ప్రస్తుతం టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో కాస్త గందరగోళం నెలకొంది. జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటకి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా లేవు.ఫీల్డ్‌లో వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. పాకిస్తాన్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లో రావాలంటే ఒక్కటే మార్గం. షాన్ మసూద్ అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ అప్పగించాలని"ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్ పేర్కొన్నాడు.చదవండి: లంకతో సిరీస్‌తో రీఎంట్రీ!.. ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్ -
T20 WC: పాక్ కొంపముంచిన అమీర్.. చెత్త బౌలింగ్‌తో
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో జట్లు సమంగా పోరాడనప్పటకి.. సూపర్ ఓవర్లో మాత్రం విజయం యూఎస్ఎనే వరించింది.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.పాక్ కొంపముంచిన అమీర్..ఇక పాకిస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసే బాధ్యతను సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌కు కెప్టెన్ బాబర్ ఆజం అప్పగించాడు. బాబర్ ఆజం నమ్మకాన్ని అమీర్ వమ్ము చేశాడు. సూపర్ ఓవర్ వేసిన అమీర్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. అనంతరం 19 పరుగుల లక్ష్య చేధనలో పాక్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక పాక్ ఓటమికి పరోక్షంగా కారణమైన మహ్మద్ అమీర్‌ను ఆ జట్టు అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అమీర్ కంటే అఫ్రిదికి బౌలింగ్ బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్‌గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్‌లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ కూడా అయిన అజహర్.. పాక్ త్వరలో న్యూజిలాండ్‌తో ఆడబోయే టీ20 సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అజహర్‌ను ప్రస్తుతం ఈ సిరీస్‌కు మాత్రమే కోచ్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్ సిరీస్‌కు టీమ్ మేనేజర్‌గా పాక్ మాజీ బౌలర్ వహాబ్ రియాజ్ నియమించబడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాక్‌లో పర్యటింనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ప్రకటించబడగా.. పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత కొంతకాలంగా ఫుల్‌టైమ్ హెడ్ కోచ్ కోసం అన్వేషిస్తుంది. ఈ పదవిని భర్తీ చేయడం కోసం పీసీబీ పెద్ద కసరత్తే చేసింది. ఒకానొక సమయంలో పాక్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. వాట్సన్ పీసీబీ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో అజహర్ పాక్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. గ్రాంట్ బ్రాడ్‌బర్న్ నిష్క్రమణ తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్ లేడు. ఇదిలా ఉంటే, 49 ఏళ్ల అజహర్ మహమూద్‌కు గతంలోనూ కోచింగ్ అనుభవం ఉంది. అతను 2017 నుంచి 2019 వరకు పాక్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అజహర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పాక్ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడిన అజహర్.. 162 వికెట్లు తీసి 2400 పైచిలుకు పరుగులు సాధించాడు. అజహర్ టెస్ట్‌ల్లో 3 సెంచరీలు కూడా చేశాడు. 2012-2015 మధ్యలో ఐపీఎల్లో పాల్గొన్న అజహర్.. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ తరఫున ఆడాడు. ఐపీఎల్లో 23 మ్యాచ్‌లు ఆడిన అజహర్ 29 వికెట్లు తీసి 388 పరుగులు చేశాడు. అజహర్ ఐపీఎల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. -
న్యూజిలాండ్‌కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
అండర్-19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని పాక్ అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఈస్ట్ లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 25.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పాక్ ఓపెనర్లు షాజైబ్ ఖాన్(80 నాటౌట్), షమీల్ హుస్సేన్(54నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. పాక్ బౌలర్ల దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఉబైద్ షా, ఆరాఫాట్ మిన్హాష్ తలా 3 వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు నవీద్ రెండు,అలీ, జీషన్ ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ గ్రూపు-డి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. చదవండి: IND vs ENG: సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు -
పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్‌కు.. మహ్మద్ రిజ్వాన్‌తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్‌ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగనున్న పీఎస్ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఒకేసారి తప్పుకున్న ముగ్గురు కీలక వ్యక్తులు
పాకిస్తాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. ఆ జట్టుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పీసీబీతో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఈ ముగ్గురు వెల్లడించారు. తమ రాజీనామాలను పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించిందని వారు తెలిపారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుటిక్ ఆయా హోదాల్లో గతేడాదే నియమితులయ్యారు. అంతకుముందు కూడా వీరికి పాక్ జట్టుతో అనుబంధం ఉండింది. అయితే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు పీసీబీ వీరి పదవులను మార్చింది. మిక్కీ ఆర్థర్.. గతంలో పాక్ జట్టు హెడ్ కోచ్‌గా.. బ్రాడ్‌బర్న్ ఎన్సీఏ హై పెర్ఫార్మింగ్ కోచ్‌గా పని చేశారు. ఈ ఇద్దరు ఆయా పదవుల్లో అద్భుతంగా రాణించి, పాక్ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. అయితే కొత్త పదవుల్లోనే మాత్రం వీరు సత్తా చాటలేకపోయారు. ఆర్థర్ డైరెక్టర్‌గా, బ్రాడ్‌బర్న్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం, ఆ తర్వాత ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి.. ఇలా వరుస సిరీస్‌ల్లో పాక్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డే వీరిని తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో (మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే) కోల్పోయింది. పాక్ ఇవాళ (జనవరి 19) న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో తలపడనుంది. -
అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్లో లెజెండ్ అవుతాడు: గంభీర్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజం తన కెరీర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తాడని గంభీర్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్-2023 అనంతరం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. బాబర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న పాక్ టెస్టు జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కీడాతో గంభీర్ మాట్లాడుతూ.. "కెప్టెన్సీని విడిచిపెట్టడం లేదా స్వీకరించడమనేది ఆటగాళ్ల వ్యక్తిగతం. నా వరకు అయితే బాబర్ ఆజం అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వర్క్‌లోడ్ తగ్గింది. పాకిస్తాన్లో మాత్రం ప్రశంసలైనా, విమర్శలైనా కెప్టెన్‌కే దక్కుతాయి. ఇటువంటిది భారత్‌లో కూడా కొంత వరకు ఉంది. బాబర్ ఆజం బ్యాటింగ్‌పై ఎప్పుడూ పెద్దగా విమర్శలు రాలేదు. ప్రతీ సారి అతడి కెప్టెన్సీపైనే ప్రశ్నల వర్షం కురిసేది. ఇప్పుడు అతడు కెప్టెన్సీ విడిచిపెట్టాడు. ఇకపై మనం సరికొత్త బాబర్‌ను చూడవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా బాబర్ నిలిచాడు. అతడికి ఇంకా చాలా వయస్సు ఉంది. బాబర్ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతాడు. కచ్చితంగా అతడు రిటైర్ అయ్యే సమయానికి పాక్ క్రికెట్ చరిత్రలో తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడని పేర్కొన్నాడు. చదవండి: AUS vs PAK: ఫేర్వెల్ టెస్టు సిరీస్ ... పాక్‌పై సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ -
దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు!
పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌లో భాగంగా డిసెంబర్2న అబోటాబాద్, సియాల్కోట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సియాల్కోట్ ఓపెనర్, పాక్ యువ బ్యాటర్ మీర్జా తాహిర్‌ను దురదృష్టం వెంటాడింది. ఎవరూ ఊహించని విధంగా హిట్‌వికెట్‌గా తాహిర్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే..? సియాల్కోట్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్‌లో తాహిర్ బ్యాక్ ఫుట్‌లో నుంచి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు వెనుక్కి వెళ్లి షాట్ ఆడే క్రమంలో అతడి బరువు బ్యాక్‌ఫుట్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా తాహిర్ కుడి కాలి కండరాలు పట్టేసాయి. ఈ క్రమంలో నొప్పితో విల్లావిల్లాడిన అతడు బ్యాలెన్స్ కోల్పోయి స్టంప్స్‌పై పడిపోయాడు. దీంతో 38 పరుగులు చేసిన తహిర్ హిట్‌వికెట్‌గా నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సియాల్కోట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సియాల్కోట్ బ్యాటర్లలో తాహిర్‌దే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో అబోటాబాద్ ఛేదించింది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb — Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023 -
పాకిస్తాన్ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి?
పాకిస్తాన్ క్రికెట్ టీమ్.. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను తలకిందలూ చేస్తూ లీగ్ దశలోనే పాకిస్తాన్ ఇంటిముఖం పట్టింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంతో సరిపెట్టుకుంది. శనివారం ఇంగ్లండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో పాక్ కథ ముగిసింది. దీంతో వరుసగా మూడో సారి వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌కు చేరడంలో పాకిస్తాన్ విఫలమయ్యంది. గత ఆరు వరల్డ్‌కప్ ఎడిషన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే సెమీస్‌కు పాక్ చేరింది. అయితే ఎన్నో అంచనాలతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన పాకిస్తాన్.. సెమీస్‌కు చేరడంలో ఎందుకు విఫలమైందో ఓ లూక్కేద్దం. ఫాస్ట్ బౌలింగ్ వైఫల్యం.. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ కంటే బౌలింగే ఎక్కువ బలం. అటువంటి ఈ ఏడాది టోర్నీలో పాక్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా పేసర్లు దారాళంగా పరుగులు సమర్పించకున్నారు. వరల్డ్ నెం1 బౌలర్ షాహీన్ అఫ్రిది ఆడపదడప వికెట్లు తీసినప్పటికీ.. పరుగులు కట్టడం చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అతడితో పాటు మరో వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్ రవూఫ్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్ ఏకంగా 533 పరుగులిచ్చాడు. ఇక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు రవూఫ్ బౌలింగ్ ప్రదర్శన ఎలా ఉందో. నసీమ్ షా గాయం.. నసీమ్ షా.. పాకిస్తాన్ పేస్ త్రయంలో ఒకడు. షాహీన్ అఫ్రిదితో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. పవర్‌ప్లేలో తన పేస్‌తో వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చేవాడు. అయితే ఈ మెగా టోర్నీకకి ముందు ఆసియాకప్‌లో నసీమ్ షా గాయపడ్డాడు. దీంతో అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. అతడి లేని లోటు పాక్ జట్టులో సృష్టంగా కన్పించింది. నసీం షా స్ధానంలో వెటరన్ పేసర్ హసన్ అలీ వచ్చినప్పటికీ అంత ప్రభావం చూపలేకపోయాడు. సరైన స్పిన్నర్ లేడు.. ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టులో క్వాలిటి స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. మిగితా జట్లలో స్పిన్నర్లు బంతిని బొంగరంలా తిప్పితే.. పాక్ స్పిన్నర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కీలకమైన మిడిల్ ఓవర్లలో పరుగులు లీక్ చేస్తూ తమ జట్టు ఓటమికి కారణమయ్యారు. పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ప్రదర్శన కోసం అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడి 6 కంటే ఎక్కువ ఎకానమీతో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడితో పాటు నవాజ్ కూడా అంతంత ప్రదర్శన మాత్రమే కనబరిచాడు. బాబర్ చెత్త కెప్టెన్సీ.. ఈ వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఇంటముఖం పట్టడానికి మరో కారణం బాబర్ ఆజం కెప్టెన్సీ అనే చెప్పాలి. 9 మ్యాచ్‌ల్లో కూడా బాబర్ కెప్టెన్సీ మార్క్ పెద్దగా కన్పించలేదు. జట్టులో మార్పులు కూడా సరిగ్గా చేయలేదు. టోర్నీ ఆరంభం నుంచే ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ దారుణంగా విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం.. మరో సీనియర్ ఓపెనర్ ఫఖార్ జమాన్ పక్కన పెట్టడం వంటి తప్పిదాలను బాబర్ చేశాడు. మ్యాచ్ మధ్యలో వ్యూహత్మకంగా వ్యవరించడంలో కూడా బాబర్ విఫలమయ్యాడు. క్లిష్టమైన పరిస్ధితుల్లో బాబర్ పూర్తిగా తేలిపోయాడు..వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా బాబర్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 9 మ్యాచ్‌ల్లో 320 పరుగులు మాత్రమే ఆజం చేశాడు. ఇదేమి ఫీల్డింగ్ రా బాబు.. క్రికెట్లో పాకిస్తాన్ జట్టు మెరుగుపడాల్సిన అంశం ఏదైనా ఉందంటే ఫీల్డింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో ఫీల్డింగ్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్ కనబరిచిన పాక్.. అందుకు భారీ మూల్యం చెల్లంచకుంది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మొదటిలోనే డేవిడ్ వార్నర్‌కు అవకాశమివ్వడంతో అతడు భారీ శతకంతో చెలరేగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ ఫీల్డింగ్ కథలు ఎన్నో ఉన్నాయి. చదవండి: ENG vs WI: వెస్టిండీస్ టూర్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా జోస్ బట్లర్ -
టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు: బాబర్ ఆజం
‘‘గత మూడేళ్లుగా.. నాయకుడిగా మా జట్టును ముందుకు నడిపిస్తున్నా. కానీ ఎప్పుడూ ఇలా ఫీల్ అవలేదు. వరల్డ్‌కప్‌లో నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం వల్లే కొంతమంది నా గురించి ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒత్తిడిలో కూరుకుపోయానని వాళ్లే ఊహించుకుంటున్నారు. నిజానికి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. గత రెండున్నర, మూడేళ్లుగా కెప్టెన్‌గా నా ప్రదర్శన ఎలా ఉందో నాకు తెలుసు. అప్పుడు బ్యాటింగ్ చేసింది నేనే.. కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపిందీ నేనే.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నా! అయితే, ఒక విషయాన్ని మనం ఏ కోణం నుంచి చూస్తున్నామన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉండటం సహజం. ఎవరికి వారే తాము ప్రత్యేకం అనుకుంటారు. కానీ.. కొంత మంది మాత్రం తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. ‘అతడు అలా ఆడితే బాగుండు.. ఇలా చేస్తే బాగుండు’ అని తోచింది చెబుతూ ఉంటారు. టీవీల ముందు కూర్చుని మాట్లాడటం సులభమే. నా గురించి మాట్లాడుతున్న వాళ్లందరి దగ్గరా నా ఫోన్ నంబర్ ఉంది. నిజంగా మీరు నాకేదైనా సలహా ఇవ్వాలనుకుంటే నేరుగా నాకు మెసేజ్ చేయండి’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో వ్యక్తిగతంగా తన ప్రదర్శన బాగానే ఉందన్న బాబర్.. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం పడటం లేదని స్పష్టం చేశాడు. తాను పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్నానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్-2023 టోర్నీలో ఆరంభంలో విజయాలు సాధించిన పాకిస్తాన్ ఆ తర్వాత చతికిలపడింది. బ్యాటర్‌గానూ బాబర్ ఆశించిన రీతిలో ఆడలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. కెప్టెన్సీ వదిలేస్తేనే బాబర్ బాగుపడతాడంటూ పాక్ మాజీ క్రికెటర్లు సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లీగ్ దశలో ఆఖరిగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం మీడియాతో మాట్లాడుతూ విమర్శకులకు కౌంటర్ వేశాడు. ఇదిలా ఉంటే.. సెమీస్ రేసులో నిలవాలంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉన్న పాక్‌కు న్యూజిలాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో పాక్ ఇంకా సెమీస్ చేరాలని భావిస్తే ఇంగ్లండ్‌పై 287 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. బాబర్ ఆజం ఈ ప్రపంచకప్‌లో గత నాలుగు ఇన్నింగ్స్‌లో మూడు అర్ధ శతకాలు బాదాడు. -
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ ఘోర ఓటమి.. సెమీస్ రేసులోకి పాకిస్తాన్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ప్రోటీస్ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే? ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడు పాక్ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. అయితే ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరడం చాలా కష్టం. ఈ సమయంలో ఇతర జట్ల ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్ధానంలో కివీస్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు. అప్పుడు ఈ కివీస్, అఫ్గాన్ రెండు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒక వేళ కివీస్ ఒక్క మ్యాచ్, అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ క్రమంలో రన్‌రేట్ పరంగా మూడింటిలో ఒక జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్ధానంలో ఆస్ట్రేలియా సెమీస్‌కు ఈజీగా చేరే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన చాలు. ఎందుకంటే మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి సెమీస్‌కు అసీస్ క్వాలిఫై అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్ధానం కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఖాయమన్పిస్తోంది. చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం -
PAK Vs AFG: పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం.. చరిత్రలోనే తొలిసారి..!
పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ అద్భుత విజయం సాధించింది. పటిష్ట పేస్ దళం ఉన్న బాబర్ ఆజం బృందాన్ని చిత్తుచేసి తాను పసికూన కాదని బెబ్బులిలా గర్జించింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో మూడో విజయం నమోదు చేసి తనను తక్కువ అంచనా వేయొద్దని మేటి జట్లకు సవాలు విసిరింది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఓడించి సత్తా చాటిన అఫ్గాన్ తాజాగా సెమీస్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావిస్తున్న పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించగా వన్ డౌన్ బ్యాటర్ బాబర్ ఆజాం 74 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ లో షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ చెరో 40 పరుగులు సాధించారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ రెండు.. మహమ్మద్ నబీ, అజ్మతుల్లా చెరో వికెట్ దక్కించుకున్నారు. టార్గెట్ ఛేదనలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహమనుల్ల గురుబాజ్ 53 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులతో రాణించాడు. ఇక వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రహమత్ షా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో వీరిద్దరూ ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు. చక్కటి సమన్వయంతో వికెట్ల మధ్య చురుగ్గా కదులుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో రహమత్ 77 పరుగులు, హష్మతుల్లా 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ కు తొలి గెలుపునందించారు. 49వ ఓవర్ ఆఖరి బంతికి హష్మతుల్లా ఫోర్ బాదడంతో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఇబ్రహీం జద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. Creating history, one victory at a time 🇦🇫#CWC23 #PAKvAFG pic.twitter.com/ImtYjnMvIQ — ICC (@ICC) October 23, 2023 -
PAK vs SL: వన్డే ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన పాకిస్థాన్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ అద్బుత విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో పాక్ ఛేదించింది. దీంతో 6 వికెట్లతో విజయభేరి మోగించింది. Tons from Abdullah Shafique and Mohammed Rizwan guide Pakistan to the most successful chase in ICC Men's Cricket World Cup history 🔥#CWC23 #PAKvSL 📝: https://t.co/oVVBdMbGPN pic.twitter.com/Y9xq0o3WOj — ICC Cricket World Cup (@cricketworldcup) October 10, 2023 అయితే 345 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్లోయి పాకిస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో పాక్ జట్టును మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆదుకున్నాడు ఆ జట్టు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్. ఈ ఇద్దరూ ఫస్ట్ స్లోగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిర్మించాక బౌండరీలు బాదారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తరువాత అబ్దుల్లా షఫీక్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 113 పరుగుల వద్ద షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు విజయంలో పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(131), అబ్దుల్లా షఫీక్ (113) కీలక పాత్ర పోషించారు. అయితే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులకి పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్కోర్లు: శ్రీలంక 344-9(50), పాకిస్తాన్ 345-4(48.2) -
'వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని! ఎన్నో కష్టాలు'
హారీస్ రవూఫ్.. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. తన పేస్ బౌలింగ్‌తో ప్యత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలిగే సత్తా ఉన్న స్పీడ్ స్టార్. 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రవూఫ్.. వరల్డ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రవూఫ్ ఈ స్ధాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చదువుకునే రోజుల్లో కనీసం ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోయేవి అంట. ఈ విషయాలను అతడే స్వయంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "పదో తరగతి తర్వాత నేను ఇంటర్మీడియట్లో చేరాను. కానీ మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు. దీంతో నా ఫీజు చెల్లించడానికి ప్రతీ ఆదివారం మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని. వారంలో మిగిలిన రోజుల్లో క్లాస్‌లకు హాజరయ్యేవాడిని. ఆ తర్వాత నేను యూనివర్శిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి. మా నాన్నతో పాటు నేను కూడా ఆ ఫీజులను భరించలేకపోయాను. ఈ సమయంలో టేప్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నాకు బాగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో యూనివర్శిటీ ఫీజు కట్టేవాడిని. పాకిస్తాన్లో టేప్-బాల్ క్రికెట్ ఆడే ఆటగాళ్లు బాగా సంపాదిస్తారు. నెలకు దాదాపు 2 నుంచి 3 లక్షలవరకు సంపాదించవచ్చు. నేను నా ఫీజు కట్టగా.. మిగిలిన డబ్బులను మా అమ్మకు ఇచ్చేవాడిని. నేను ఈ స్ధాయికి చేరుకోవడం వెనక మా అమ్మనాన్న కష్టం కూడా ఉంది. మాది ఉమ్మడి కుటంబం. మొత్తం మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. దీంతో చోటు సరిపోక కొన్ని రోజుల పాటు వంటగదిలో నిద్రపోయేవాళ్లం. నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాను”అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవూఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs NEP: 23 పరుగుల తేడాతో ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా -
ఉప్పల్‌లో పాక్-న్యూజిలాండ్ పోరు.. సర్వం సిద్దం
ప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్నహాక మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులకు బీసీసీఐ అనుమతి నిరాకరిచింది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టు ఇప్పటికే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి. బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. అనంతరం గురువారం(సెప్టెంబర్28)న ఇరు జట్లు నెట్‌ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనున్నాయి. కాగా ప్రస్తుత పాక్ జట్టులో మహ్మద్ నవాజ్, ఆగా సల్మాన్ మినహా మిగితా ఆటగాళ్లకు ఎవరికి భారత పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేన్‌మామ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అదే విధంగా గాయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో మధ్యలో ఇంటిముఖం పట్టిన స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఫిట్నెస్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పాక్ జట్టుకు ఘన స్వాగతం.. ఇక 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై పెట్టిన పాక్ క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల ఆదరణకుపాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పాక్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలను తెలిపారు. హైదరాబాదీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మాకు హైదరబాదీల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. చాలా బాగుంది. భారత్‌లో గడిపే రానున్న నెలన్నర రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మరో పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఓ పోస్ట్ చేశాడు. -
బాబర్ ఆజంకు జరిమానా విధించిన పోలీసులు.. ఎందుకంటే?
అతి వేగంతో కారు నడిపినందుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు పోలీసులు జరిమానా విధించారు. టైమ్స్ ఆఫ్ కరాచీ నివేదిక ప్రకారం.. పంజాబ్ హైవేలో తన ఆడి కారును పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి వేగాన్ని గమనించిన పంజాబ్ మోటర్వే పోలీసులు కారును ఆపి ఫైన్ వేసినట్లు సమాచారం. అయితే ఎంత జరిమానా విధించారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. కాగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం బాబర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో తన కారుకు సరైన నెంబర్ ప్లేటు లేకుండా బాబర్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు. ఇక వరల్డ్‌కప్-2023లో పాల్గోనేందుకు పాకిస్తాన్ జట్టుకు మార్గం సుగమైంది. పాక్ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదముద్ర వేసింది. దీంతో బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయల్దేరే పాక్ టీమ్ దుబాయ్ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాస్ జూనియర్ చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు! The captain of Pakistan, Babar Azam, has been fined by the Punjab Motorway Police 👮♀️ for speeding.#TOKSports | #BabarAzam pic.twitter.com/cGdJ1WW7s3 — TOK Sports (@TOKSports021) September 25, 2023 -
‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు వీసా సమస్య తీరింది. సోమవారం సాయంత్రం జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజూరైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. పాక్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. 48 గంటల్లో భారతదేశానికి బయల్దేరాల్సి ఉన్నా... ఇంకా తమకు వీసాలు రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ అసంతృప్తిని వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ విషయంపై పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. చివరకు సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది. వరల్డ్ కప్‌కు ముందు దుబాయ్‌లో రెండు రోజుల పాటు తమ జట్టుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పాక్ వీసా సమస్య కారణంగా దానిని రద్దు చేసుకుంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి బయల్దేరే పాక్ టీమ్ దుబాయ్ మీదుగా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుంది. శుక్రవారం ఆ జట్టు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడుతుంది. చదవండి: IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్ -
వన్డేల్లో నెం1 జట్టుగా పాకిస్తాన్.. మరి టీమిండియా?
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ అగ్రస్ధానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. మళ్లీ నెం1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాగా 118 రేటింగ్‌తో పాక్ -ఆస్ట్రేలియా జట్లు సమం ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్(2725) ముందంజలో ఉండడంతో అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ నిలిచాయి. సిరీస్ క్లీన్ స్వీప్.. ఇక కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (37 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నవాజ్, అఫ్రిది,అష్రాప్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు -
తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే?
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకుంది. టెస్టు సిరీస్‌ను 1-0తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20 సిరీస్‌పై కన్నేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజాలు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తొలి టి20లో తలపడనుంది. ఐపీఎల్లో ఇరగదీసిన యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు విండీస్‌తో టి20 సిరీస్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే జైశ్వాల్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గిల్, ఇషాన్ కిషన్‌లు వన్డే సిరీస్‌లో అద్బుతంగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీలతో మెరిశాడు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్ ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఫినిషర్స్‌గా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. టి20 క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఇంతకముందు పాకిస్తాన్ మాత్రమే ఈ మార్క్‌ను దాటింది. ఓవరాల్‌గా పాకిస్తాన్ 223 టి20 మ్యాచ్‌లు ఆడింది. దీంతో తొలి టి20 మొదలవ్వగానే ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఈ రికార్డును అందుకోనుండడం విశేషం. కాగా ఇప్పటివరకు 199 టి20 మ్యాచ్‌లాడిన టీమిండియా 127 విజయాలు, 63 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Ishan- Gill: వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! -
Asian Games 2023: 'ఆసియా గేమ్స్ నుంచి తప్పుకొంటున్నా’
పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఆడనున్న పాక్ జట్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. టోర్నీకి పిల్లలను అనుమతించకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిస్మాహ్ మరూఫ్ తెలిపింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రికెటర్లు తమ పిల్లల్ని వెంట తీసుకురావొద్దని ఆసియా గేమ్స్ నిర్వాహకులు నిబంధన పెట్టారు. దీంతో రెండేళ్ల చంటిబిడ్డను వదిలి వెళ్లడం ఇష్టం లేని మరూఫ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక బిస్మాహ్ పాక్ ప్రధాన బ్యాటర్లలో ఒకరు. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆమె పాక్ తరపున 108 వన్డేల్లో 2602 పరుగులతో పాటు 44 వికెట్లు, 108 టి20ల్లో 2202 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది. 2021 ఏప్రిల్‌లో బిస్మాహ్ బిడ్డకు జన్మనివ్వడం కోసం క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ అదే ఏడాది డిసెంబర్లో మైదానంలో అడుగుపెట్టింది. 2022లో బిస్మాహ్ పరుగుల వరద పారించింది. పాక్ మహిళల జట్టు తరఫున ఆ ఏడాది వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు కొట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఒక్క సెంచరీ లేకుండానే వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. ''దురృష్టవశాత్తూ పాక్ జట్టు బిస్మాహ్ మరుఫే సేవల్ని కోల్పోనుంది. పిల్లల్ని వెంట తీసుకురావొద్దనే నియమం కారణంగా ఆమె తన చిన్న పాపతో చైనాకు రాలేని పరిస్థితి'' అని మహిళల జట్టు హెడ్ తానియా మల్లిక్ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. హ్యాట్రిక్ కొట్టేనా..? ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్ జట్టుకు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సార్లు పాక్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. 2010లో చైనాలోని ఇంచియాన్‌లో, 2014లో దక్షిణ కొరియాలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచింది. దాంతో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. చదవండి: వైరల్‌గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే? తమిళ సంప్రదాయ పద్ధతిలో ఆసీస్ ఆల్‌రౌండర్ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
PCB: పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియామకం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియమితుడయ్యాడు. పది మంది సభ్యులతో కూడిన కమిటీకి అతడు నేతృత్వం వహించనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నియామకాలు జరిపినట్లు పీసీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా జకా ఆష్రఫ్ సారథ్యంలోని ఈ కమిటీ నాలుగు నెలల పాటు అధికారంలో కొనసాగనుంది. ఇందులో నలుగురు రీజినల్ రిప్రెజెంటేటివ్స్, నలుగురు సర్వీస్ రిప్రెజెంటేటివ్స్, ప్రధాని చేత నామినేట్ చేయబడిన ఇద్దరు సభ్యులకు చోటు ఉంటుంది. ఈ నేపథ్యంలో జకా ఆష్రఫ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు అధికారికంగా పీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో పీసీబీలో సానుకూల మార్పులు తీసుకురాగలనని ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నా’’ అంటూ తన నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు. కాగా ఆసియాకప్, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కమిటీ గురువారమే లాహోర్‌లో సమావేశం కానుంది. I have Officially Joined PCB as Chairman. Alhamdulillah, You will have Positives Changes in the PCB Upcoming Days In Sha Allah✌️💯. #ZakaAshraf pic.twitter.com/h6rRGkjlKm — Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) July 5, 2023