Palnadu District News
-
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత
దాచేపల్లి: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జీ. సైదారావు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ నేత సైదారావుకి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు వ్యవహరశైలి నచ్చటంలేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను నేరవేర్చకపోవటం వలన తాను టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరినట్లు సైదారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల జాను, మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహా రావు తదితరులున్నారు. మాకు రక్షణ కల్పించండి జిల్లా ఎస్పీని కలిసేందుకు వచ్చిన కులాంతర ప్రేమ వివాహ దంపతులు నరసరావుపేట: కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న తమను బెదిరిస్తున్న తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని యువతీయువకులు ఇరువురు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కోరేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. వారు మీడియాతో వివరాలు చెప్పారు. పిడుగురాళ్లకు చెందిన వడ్డెర (బీసీ) కులానికి చెందిన అచ్చి వినయకుమార్, కమ్మ (ఓసీ) కులానికి చెందిన అవంతిలు ఇరువురూ బీటెక్ చదువుతూ ప్రేమించుకొని దేవరంపాడు ఆలయంలో వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు తమ ప్రేమ వివాహం తల్లిదండ్రులకు తెలియచేసినా ఇద్దరి కులాలు ఒకటి కాకపోవటంతో వారు నిరాకరించారన్నారు. దీనిపై తాము వివాహం చేసుకోగా తన తల్లి నీ చదువుపై పెట్టిన ఖర్చును తిరిగి ఇవ్వాలి, లేదా అతడిని వదిలిపెట్టి ఇంటికి రావాలంటూ బెదిరించిందని అవంతి చెప్పారు. తాము రక్షణకోసం పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌కు వెళ్లగా వారి సూచన మేరకు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి రక్షణకోరేందుకు వచ్చామని వారు వివరించారు. గుర్తుతెలియని వృద్ధుడు మృతి వినుకొండ(నూజెండ్ల): పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని ఓ నర్సింగ్ హోమ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఓ వృద్ధుడు కొన ఊపిరితో ఉండగా స్థానికులు గమనించి 108 వాహనానికి ఫోన్ చేసి చెప్పారు. వృద్ధుడిని వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 70 నుంచి 75 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
స్టేషన్‌కు రమ్మనమని మాత్రమే పిలిచాం
నరసరావుపేట: కారెంపూడి మండలం కాచవరం గ్రామానికి చెందిన వెంగళరెడ్డి అనే వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని స్థానిక పోలీసులు స్టేషన్‌కు రావాలని పిలిచారే కాని, అతనిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, స్టేషన్‌కు రాలేదని, అతడిపై ఎటువంటి హింస జరగలేదని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. వెంగళరెడ్డిని ఒక కేసులో దోషిగా చేర్చి పోలీసుస్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెట్టడం వలన భరించలేని అతను వేదనతో చనిపోయాడనే వార్త లు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేస్తున్నారన్నారు. దీనిలో ఎటువంటి నిజంలేదు అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. వెంగళరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే తెలుస్తుందన్నారు. అతను విషం తీసుకొని మృతిచెందినట్లుగా బంధువులు చెబుతున్నారన్నారు. ఈనెల రెండోతేదీన గ్రామంలో ముస్లింలు గ్యార్మీ పండగ చేసుకుంటూ ఇతని ఇంటిమీదుగా ఊరేగింపుగా వెళుతుండటంతో వారితో గొడవ పడ్డాడన్నారు. దీనిపై మూడో తేదీన అబ్బాస్ అనే వ్యక్తి తాము అతని ఇంటి ముందుగుండా వెళుతుండగా తమపై అనుచితంగా వ్యవహరించారంటూ పోలీసులకు ఫిర్యాదుచేయటం జరిగిందన్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ నిమిత్తం వెంగళరెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిచారని, అయితే అతను స్టేషన్‌కు రాలేదన్నారు. దీనిపై స్టేషన్‌కు తీసుకొచ్చి వేధించారనేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా ప్రసారం చేసే వారి పై లీగల్ చర్యలు తీసుకుంటామని, పోలీసుల పరంగా వెంగళరెడ్డికి ఎటువంటి అపకారం జరగలేదని ఎస్పీ స్పష్టంచేశారు. బెదిరింపులకు పాల్పడలేదు కారెంపూడి: మండలంలోని కాచవరం గ్రామంలో సోమవారం వెంగళరెడ్డి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని గురజాల డీఎస్పీ బి.జగదీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుగుమందు తాగి చనిపోయాడని అందుకు పోలీసులు కారణమని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. వెంగళరెడ్డి స్టేషన్‌కు రాలేదు స్టేషన్లో చిత్రహింసలు జరగలేదు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వచ్చే వార్తల్లో నిజం లేదు స్పష్టం చేసిన ఎస్పీ శ్రీనివాసరావు -
యువత నైపుణ్యాలను పెంచుకోవాలి
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు నరసరావుపేట ఈస్ట్: యువత నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవటం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులువుగా పొందవ చ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్‌మేళాకు మూడు కంపెనీలు హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 66 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 46 మందిని ఎంపిక చేశారు. ఎన్ఏసీ శిక్షణ కేంద్రం ఇన్చార్జి మేరీజోష్న మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను నిరుద్యోగ యువత సద్వినియోగపరుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి ఎం.రవీంద్రనాయక్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ఎం.వీరాంజనేయు లు, పి.శ్రీకాంత్, ఉపాధి కల్పన కార్యాలయ సిబ్బంది ఈ.శ్రీనివాసరావు, కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. ఏపీ టెట్‌లో నాగరాజుకు 143 మార్కులునరసరావుపేట ఈస్ట్: ఏపీ టెట్ పరీక్షా ఫలితాల్లో శ్రీహరిణి అకాడమీ విద్యార్థి అనుగొండ నాగరాజు 150 మార్కులకు గాను 143 మార్కులతో పల్నాడుజిల్లాలో టాపర్‌గా నిలిచినట్టు అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర సోమవారం తెలిపారు. తమ అకాడమీ నుంచి హాజరైన విద్యార్థులు అందరూ టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. -
రేపు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
నరసరావుపేట:విద్యారంగ సమస్యల పరిష్కారానికి బుధవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ కోరారు. సోమవారం కోటప్పకొండ రోడ్డులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులకు విద్యార్థి వనవాసం దీవెన ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిగ్రీ హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను రూ.3వేలకు పెంచాలని, మెడికల్ సీట్లు అమ్మకాలను వెంటనే ఆపాలని, 107,108 జీవోలను వెంటనే రద్దుచేయాలని కోరారు. జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో కళాశాల నిర్వహించకుండా చూడాలనే డిమాండ్లతో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రోహిత్, యాసీన్, బెనర్జీ, సంతోష్ పాల్గొన్నారు. -
ఆనాడే స్పందించి ఉంటే మళ్లీ పారిపోయే వారు కాదు
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి మండిపాటు నాదెండ్ల: విద్యార్థుల సమస్యలపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు సరిగ్గా స్పందించి ఉంటే విద్యార్థులు పారిపోయే సంఘటనలు చోటు చేసుకోవని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి చెప్పారు. యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సోమవారం ఆమె సందర్శించారు. ఈ పాఠశాలలో గడిచిన నెల రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు విద్యార్థులు గోడ దూకి పారిపోయిన సంఘటన విదితమే. ఈ విషయమై ఆమె రెండోదఫా పాఠశాలను సందర్శించారు. విద్యార్థ్ధులతో మాట్లాడారు. మొదటి దఫా సుమారు 67 మంది, రెండోదఫా ఏడుగురు విద్యార్థులు పరారవటంపై విచారించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్ధంచేసుకుని పరిష్కరించి ఉంటే పరిస్థితి సాధారణంగా ఉండేదని పేర్కొ న్నారు. దీనిపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సిఫార్సు మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారన్నారు. విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టకపోవటం, వారిచే టాయిలెట్లు కడిగించటం వంటి పనులు చేయించటం శోచనీయమన్నారు. దుర్వ్యసనాలకు అలవాటు పడిన ఇరవై మంది విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకుంటే డ్రాపవుట్లుగా మిగిలిపోతారని, కావున త్వరలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి వారిని తిరిగి పాఠశాలలో చేర్చుకుంటామన్నారు. ఉపాధ్యాయులు పాఠశాల క్వార్టర్స్‌లోనే నివశించాలి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాఠశాలలోని క్వార్టర్స్‌లోనే ఉండాలన్నారు. అయితే వీరు వివిధ ప్రాంతాల్లో ఉంటూ రోజూ రాకపోకలు సాగించటంతోనే విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తుందన్నారు. విద్యార్థులను తరచూ పర్యవేక్షించటం, సరైన క్రమశిక్షణ ఉండేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. జిల్లా కోఆర్డినేటర్ పద్మజకు ఈ విషయమై పలు సూచనలు చేసినట్లు చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో రాష్ట్ర బృందం సందర్శన
బెల్లంకొండ: మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగవుతున్న వరి, కంది క్షేత్రాలను సోమవారం ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం రాష్ట్ర బృందం సందర్శించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారితో కలసి స్టేట్ సీనియర్ టిమాటిక్ రాయుడు, గోపీచంద్, స్టేట్ రిసోర్స్‌పర్సన్ రామచంద్రన్ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న మోడల్స్, కాంపాక్ట్ బ్లాక్స్‌లను, పంటలను పరిశీలించారు. ప్రతి రైతు ఈ ప్రకృతి వనరుల కేంద్రంలోని ఽఘన జీవామృతం, ద్రవ జీవామృతం ఉత్పత్తులను వినియోగించుకోవడం ద్వారా రైతులకు పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన విషరహిత ఉత్పత్తుల లభిస్తాయన్నారు. కందిపంట ఏ–గ్రేడ్ మోడల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి కంది పంటలో 5నుండి10 రకాల అంతర పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరి రైతు జీవన విధానం మెరుగుపడుతుందన్నారు. నిరంతరం ఆదాయం ఇచ్చే ఏటిఎం మోడల్, సూర్యమండలం మోడల్లో 27రకాల కూరగాయ పంటలు ఆకుకూరలు, దుంప జాతి ,తీగజాతినూనె, పూల జాతి రకాలను వేసి ఏడాది పొడవునా నెలకు రూ.5వేల నుండీ 10 వేల వరకు ఆదాయం వస్తుందని బృంద సభ్యులకు మహిళా రైతులు తెలిపారు. భూమిలో వివిధ రకాల పంటలు వేయడం వలన జీవవైవిద్యం పెరిగి భూమి సారవంతం, చీడ పీడల ఉధృతి తక్కువగా ఉంటుందని తెలిపారు. వరిలో ఏ–గ్రేడ్ మోడల్ కంపాక్ట్ బ్లాక్‌లోని క్షేత్రాన్ని సందర్శించారు. వరిలో గట్లపై అరటి కొబ్బరి, బొప్పాయి, జామ, బంతి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి మరియు తీగజాతి వేయడం జరిగివదన్నారు. -
No Headline
పేరేచర్లలో ఇ ఎగ్జామ్(స్టాఫ్ సెలక్షన్ కమిషన్)కు వెళ్లిన సమయంలో లోకేష్‌రెడ్డి అనే అతను తాను ఎస్ఐనని పరిచయం చేసుకొని నీకు ఎస్ఐ లేదా డీజీపీ ఆఫీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నా వద్ద నుంచి విడతల వారీగా రూ.25 లక్షలు తీసుకున్నాడు. తప్పుడు మార్కుల లిస్టు, అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించి మోసం చేశాడు. డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టిగా అడిగినందుకు తన మొబైల్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడు. అతడిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –షేక్ మస్తాన్, ఎర్రబాలెం, రెంటచింతల మండలం -
పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
నరసరావుపేట: పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ వ్యక్తి పలు దఫాలుగా తమ వద్ద నుంచి రూ.25లక్షలు తీసుకొని మోసం చేశాడని ఓ యువకుడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎస్పీ అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి హాజరైన ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం, ఘర్షణ, చోరీలు సమస్యలకు సంబంధించి 72 ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశించారు. నాకు న్యాయం చేయండి నా ఎద్దు ఇప్పించండి నాకు రూ.3 లక్షల విలువైన పందెపు ఎద్దు ఉంది. అది ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీ నుంచి కన్పించకుండా పోయింది. దాని కోసం వెతకగా అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు గ్రామంలో బండి మేకల వీరన్న దగ్గర కన్పించింది. ఆ ఎద్దును ఇవ్వమని అడగగా వీరన్న నన్ను ధూషించి నేను ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకో, చంపుతానని బెదిరిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకొని నా ఎద్దు నాకు ఇప్పించండి. –మొక్కపాటి బ్రహ్మయ్య, మాచవరం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఓ యువకుడు 72 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ -
డబ్బులు అడిగితే చంపుతానంటున్నారు
మూడేళ్ల కిందట టి.శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చాను. ప్రామిసరీ నోటు రాయించుకున్నా. నాకు డబ్బులు అవసరమై అడిగితే వినుకొండలో ఉండే నా కుమారుడికి ఇచ్చానని చెప్పాడు. అతడిని అడిగితే నేను ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ నన్ను, నా భార్యపై దౌర్జన్యం చేసి మరోసారి అడిగితే చంపుతానని హెచ్చరించాడు. అతడిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించండి. –కంచర్ల ఆంజనేయులు, ఏనుగుపాలెం, వినుకొండ మండలం -
చేదుకోవయ్యా.. కోటయ్యా..!
నరసరావుపేట రూరల్: కార్తికమాసం తొలి సోమవారం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అయ్యప్ప మాలధారులు అధిక సంఖ్యలో ఆదివారం రాత్రి కొండమీదే నిద్రచేసి సోమవారం తొలిపూజలో పాల్గొన్నారు. అయ్యప్పుల ఓం నమఃశివాయ నామస్మరణతో కొండ మారుమోగింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమయ్యింది. మహిళలు రావిచెట్టు వద్ద, మహనందీశ్వరుడి వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట వద్ద పూజలు నిర్వహించారు. సోపాన మార్గం నుంచి మెట్ల పూజ చేస్తూ భక్తులు కొండమీదకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. నరసరావుపేట, చిలకలూరిపేటల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి యాత్రికులను కొండమీదకు చేరవేశారు. రూరల్ ఎస్ఐ కిశోర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాదాల కొరత... త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రసాదాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రసాదాల కోసం క్యూలైన్లో ఉన్న భక్తులకు లడ్డూలు మాత్రమే సిబ్బంది విక్రయించారు. అరిసె ప్రసాదం సిద్ధంగా లేవని తెలిపారు. కార్తిక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముందస్తుగా ప్రసాదాలు సిద్ధంచేసి భక్తులకు అందజేయాల్సిన అధికారులు విఫలమయ్యారని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
కౌలురైతు ఉసురుతీసిన అప్పులు
అచ్చంపేట: అప్పులబాధతో కౌలురైతు ఇంటి సమీపంలోని గేదెల కొష్టంలో దూలానికి ఉరేసుకుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధిలోని గింజుపల్లితండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బంధువులు అచ్చంపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యా దులో పొందుపరచిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బాణావతు హనుమానాయక్ (40) వ్యవసాయ అవసరాల నిమిత్తం బ్యాంకులలో, పురుగులు, ఎరువుల దుకాణాలలో సుమా రు రూ.15 లక్షల వరకు అప్పుచేశాడు. తనకున్న సొంత భూమి 0.75 సెంట్లతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు వేశాడు. గత రెండేళ్లుకుగా పంటలు సక్రమంగా పండలేదు. ఈ ఏడాది పత్తిబాగున్న సమ యంలో కురిసిన అకాల వర్షాలకు పండిన పంట మొత్తం వర్షార్పణమైంది. అప్పులు తిర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు ఈ ఏడాది రైతుభరోసా కూడా రాలేదు. వర్షాలకు పరిహారం కూడా ప్రభుత్వం రాయలేదు. మృతుడికి భార్య శాంతీభాయ్, ఇద్దరు సంతానం. -
ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం
పీజీఆర్ఎస్లో 70 వినతులు స్వీకరించిన కలెక్టర్, జేసీ నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 70 మంది అర్జీదారులచే వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఇక్కడకి వస్తుంటారని, అటువంటి వారి సమస్యలను సావధానంగా విని, సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మాతో అక్రమ విధులు చేయించవద్దు
నరసరావుపేట: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)తో చేయిస్తున్న అక్రమ విధులను రద్దుచేసి ఎన్నాళ్లుగానో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ వారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ధర్నా చేశారు. దీనికి జిల్లాలో ఉన్న అన్ని మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి బందగీ సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా మా సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా వీఆర్ఏలపై అదనపు భారం మోపే ప్రయత్నం చేస్తుందన్నారు. వీఆర్ఏలను తహసీల్దార్ కార్యాలయాలకు నైట్ వాచ్‌మన్ డ్యూటీలు వేయడం, తహసీల్దార్ ఆర్డీవో కార్యాలయాలలో అటెండర్‌గా ఉపయోగించటం, ఇసుక డంపు వద్ద రాత్రి, పగలు డ్యూటీలు వేయడం, వీఆర్ఏల చేత బీఎల్వోలు డ్యూటీలు చేయించడం లాంటి అక్రమ డ్యూటీలు చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వం వీఆర్ఏల పట్ల ఆలోచన చేసి వారికి పేస్కేలు అమలు చేయాలని, వీఆర్వోగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను వీఆర్ఏల చేత భర్తీ చేయించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈనెల 18న మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరాజు, సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షులు సంజీవరావు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, గురజాల డివిజన్ నాయకులు దైవ సహాయం, శ్రీను, నరసరావుపేట డివిజన్ అధ్యక్షులు ఆనంద్, అన్ని మండల అధ్యక్షులు కార్యదర్శులు వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా -
పేటలో విగ్రహ రాజకీయం
నరసరావుపేటటౌన్: కరవమంటే కప్పకు కోపం.. విడవ మంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది నరసరావుపేట వైద్యాధికారుల పరిస్థితి. తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. అనుమతులు లేని మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల విగ్రహం తొలగించాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు తొలగించారు. తిరిగి యథాస్థానంలో విగ్రహం ఏర్పాటు చేయకుంటే అధికారులను సస్పెండ్ చేయిస్తామంటూ కోడెల వర్గం బెదిరింపులకు దిగింది. దీంతో రెండు వర్గాల అంతర్గత పోరుతో వైద్యశాఖ అధికారులు సతమతమవుతున్నారు. వివరాల్లోకెళితే.. లింగంగుంట్ల ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో స్వర్గీయ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని రెండు నెలల క్రితం ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని కారణంగా విగ్రహాన్ని ప్రారంభించలేదు. ఈ క్రమంలో వారంరోజుల క్రితం విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించిన వైద్యాధికారులు కార్యాలయంలో భద్రపరిచారు. ఈ వ్యవహారంపై కోడెల వర్గీయులు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మంత్రునాయక్ను ఆయన కార్యాలయంలో నిర్భందించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదేశాల మేరకే విగ్రహాన్ని తొలగించామని సూపరింటెండెంట్ ఆ సమయంలో తెలిపారు. విగ్రహ ఏర్పాటుపై ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా సానుకూలంగా స్పందించి కోడెల విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కోడెల వర్గంగా పేరొందిన సుమారు 20 మంది ప్రభుత్వ వైద్యశాలకు సోమవారం చేరుకున్నారు. తొలగించిన తమ నాయకుడు కోడెల విగ్రహం కాల్వలో పడేశారన్న అనుమానం తమకు ఉందని ఎక్కడ ఉందో చూపించాలని వైద్యశాల ఆర్ఎంఓ ఏడుకొండలను ప్రశ్నించారు. కార్యాలయంలో భద్రపరిచిన విగ్రహాన్ని సిబ్బంది వారికి చూపించారు. దీంతో అక్కడ ఉన్న అధికారులను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. రెండు రోజుల వ్యవధిలో తొలగించిన స్థానంలో యథావిధిగా కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేకుంటే సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బందిను సస్పెండ్ చేయిస్తామని బెదిరించారు. తలనొప్పిగా మారిన విగ్రహ రాజకీయం.. వైద్యశాలలో అనుమతులు లేని కోడెల విగ్రహాన్ని తొలగించాలని ఎమ్మెల్యే.. విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని కోడెల వర్గం.. ఇలా రెండు వర్గాలు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్ కోడెల శివరామ్ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. అరవిందబాబుతో కలిసి శివరామ్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. వీరి వర్గపోరు అధికారులకు తంటా తెచ్చిపెట్టింది. సమస్యలు సృష్టిస్తే సహించేది లేదు.. ఈ విషయమై జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ మాజీ స్పీకర్ డాక్టర్ శివప్రసాదరావు విగ్రహం దొంగచాటుగా పెట్టాల్సిన పని లేదని, త్వరలో అనుమతులతో గౌరప్రదంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా కొన్ని శక్తులు సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ పరోక్షంగా కోడెల వర్గానికి చురకలు అంటించారు. వైద్యశాలలో మాజీ స్పీకర్ కోడెల విగ్రహం ఏర్పాటు ఎమ్మెల్మే అరవిందబాబు ఆదేశాలతో తొలగింపు యథాస్థానంలో ఏర్పాటు చేయాలని కోడెల వర్గం బెదిరింపులు రెండు రోజుల్లో అధికారులను సస్పెండ్ చేయిస్తామంటూ అల్టిమేటం జారీ రెండు వర్గాల మధ్య నలిగిపోతున్న వైద్యాధికారులు -
ఫెన్సింగ్, హాకీ అండర్–19 జిల్లా బాల,బాలికల జట్ల ఎంపిక
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ –19 బాల, బాలికల ఫెన్సింగ్, హాకీ జిల్లా జట్ల ఎంపికలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జరిగాయి. ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికలను అండర్ –19 స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి జి.నరసింహారావు పర్యవేక్షించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో లో జరిగే 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని జి.నరసింహారావు తెలిపారు. ఫెన్సింగ్ బాలుర జట్టులో ఈప్పి విభాగంలో ఎం.దేవేందర్, కె.తేజేశ్వర్నాథ్, పి.ఇంద్రసేనారెడ్డి, ఎం.సంతోష్, ఫాయిల్ విభాగంలో డి.డాని జాష్, ఎల్.వివేక్ రాజ్, ఎస్.కిరణేశ్వర్రెడ్డి, ఎన్.గోపీచంద్, సాబర్ విభాగంలో డి.డానియేల్ నిహాల్, ఎస్.గగన్ ధీర్, షేక్.మహీర్, ఆర్.త్రివేంద్రలు ఎంపికయ్యారు. బాలికల జట్టుకు పాయిల్ విభాగంలో పి.పల్లవి, సీహెచ్.హదాష్, పి.బ్యూలా, ఎ.మహేశ్వరి, సాబర్విభాగంలో పి.అనురాధ, కె.నాగజ్యోతి, సీహెచ్.రిజ్పా, పి.జెస్సికా, ఈప్పి విభాగంలో ఈ.అక్షిత, బి.సిరిచందనారెడ్డి, డి.స్వాతి, షేక్.జాస్మిన్లు ఎంపికయ్యారు. హాకీ బాలుర జట్టుకు వై చంటి, షేక్ ఉమర్ ఫరూక్, టి వెంకటకృష్ణ, కె.హరిహరన్, ఎం.శివమణి, కె.సాగర్‌బాబు, కె విజయ చోళుడు, వి.భార్గవ్, వై చిరంజీవి, వి.బాలమణికంఠ, టి మహేష్ బాబు, వి జాకోబ్, షేక్ హనీఫ్, షేక్ రియాజ్, కె.యశస్వి కార్తీక్ కుమార్, షేక్ ఇమాంస, జి సంతోష్, స్టాండ్ బైలుగా వై లక్ష్మీప్రసాద్, పి సాంబశివరావు, పి.సాయి హర్షవర్ధన్ రెడ్డిలు ఎంపికయ్యారు. హాకీ బాలికల జట్టుకు షేక్ జాస్మిన్, ఎన్.ఉమా మాధవి, సీహెచ్ జ్ఞాన శ్రీ అర్చన, ఎన్ రమ్య, కె త్రివేణి,షేక్ ఆసిఫా తబసమ్, షేక్ సుల్తానా, ఎ హారిక, డి స్వరూప, ఆర్ లీలా ప్రసన్న, బి లావణ్య, కె లక్ష్మీదుర్గ, ఎ ఈశ్వరలక్ష్మి, బి దుర్గా మహేశ్వరి, వై శిరీష, కె.గాయత్రి, జి కుసుమ, వి శ్రీనాగ ప్రసన్నలక్ష్మి, స్టాండ్ బైలుగా షేక్ సుహానా, షేక్ ఆసిఫా, పి శ్రావణిలు ఎంపిక య్యారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు లాకు పిచ్చయ్య, బి.అనీల్ దత్తా నాయక్, కాకుమాను.సునీత పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేపట్టాలి
నరసరావుపేటరూరల్: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్జీవోలు ప్రచారం చేపట్టాలని జిల్లా రవాణా అధికారి సంజీవ్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు సేప్టీ ఎన్జీవో కమిటీ సభ్యులు రూపొందించిన పోస్టర్‌ను సోమవారం జిల్లా రవాణా అధికారి సంజీవ్‌కుమార్ ఆవిష్కరించారు. సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, జాతీయ రహదారులపై తప్పని సరిగా వరుస క్రమశిక్షణను పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్జీవో సభ్యులు బంగారయ్య, ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీలో అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకోండి నరసరావుపేట: ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్ చేసేందుకు ఐటీఐ అభ్యర్థులు ఽఈనెల 6వ తేదీ నుంచి 20వ తేదీలోగా ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ వి.నీలిమ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులన్నారు. వీరందరూ జిల్లాల వారీగా www. aprenticerhipindia.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మార్కులు, సీనియార్టీ ప్రకారం ఎంపికలు జరుగుతాయన్నారు. మన్నెసుల్తాన్పాలెంలో మొసలి సంచారం బెల్లంకొండ: మండలంలోని మన్నెసుల్తాన్పాలెంలోని ఊరి చివర బస్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి మొసలి సంచరించడాన్ని స్థానికులు గమనించారు. మొసలి పొలాలలో నుంచి రోడ్డుపైకి వస్తుండగా బైకులపై వెళ్లే ప్రయాణికులు గమనించారు. రోడ్డుమీదకు వచ్చి దాదాపుగా పావుగంట సేపు ఎటు వెళ్లకుండా ఆగిపోయింది. దీంతో వాహనచోదకులు అక్కడే నిలిచిపోయారు. కొంతసేపటి తర్వాత పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. నేటి నుంచి జిల్లాస్థాయి జీపీడీపీ శిక్షణ గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2025–26 వార్షిక ప్రణాళిక రూపకల్పనపై జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులతోపాటు పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై శిక్షణ నిర్వహిస్తున్నట్టు జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025–26లో భాగంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అభివృద్ధి, జిల్లా పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర కార్యాచరణ తయారీకి ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈనెల 5,6వ తేదీల్లో పల్నాడు, 7,8వ తేదీల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని మండలాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు అధికారులు, ఉద్యోగులు హాజరు కావాలని సూచించారు. 40,989 బస్తాల మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్ యార్డుకు సోమవారం 40,989 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 35,381 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 18,300 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 8,500 నుంచి రూ. 17,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,000 నుంచి రూ. 17,800 వరకు ధర పలికింది. -
గతంలో సోషల్ మీడియా కార్యకర్తపై హత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి ప్రభుత్వ అవినీతిని, హామీల అమలులో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. అరెస్టులు చేసి కేసులు పెడుతూ, స్టేషన్‌కు పిలిచి బెదిరింపులకు దిగుతోంది. రెండు రోజులుగా సోషల్‌మీడియా కార్యకర్తలే టార్గెట్‌గా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనలనూ ఉల్లంఘిస్తూ, అర్థరాత్రి వేళ కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులకూ చెప్పకుండా తరలిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానిక తెలుగుదేశం నాయకులతో మాట్లాడుకోవాలని, లేకపోతే ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ పోలీసులే కూటమి ప్రభుత్వం తరపున బెదిరింపులకు దిగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. సోషల్‌మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయపోరాటానికి సన్నద్ధం అయ్యింది. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తోంది. ఇవిగో నిదర్శనాలు సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మేకా వెంకటరామిరెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ● ఈ నెల 2న వైఎస్సార్ సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణినీ పోస్టులు పెట్టారని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా ఆమెకు బెయిల్ లభించింది. ఆమైపె పోలీసు స్టేషన్ వద్ద, కోర్టు వద్ద దాడికి తెలుగు మహిళలు యత్నించారు. గతంలో కృష్ణవేణి భర్త రాజకుమార్‌ను తెలుగుదేశం నాయకులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. లోకేష్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి దానికి దండం పెట్టించి క్షమాపణలు చెప్పించారు. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు వేధిస్తూనే ఉన్నారు. ● తెనాలి నియోజవర్గం కొల్లిపర మండలం వల్లభాపురం చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, రైతు అళ్ళ జగదీష్ రెడ్డిపై కేసు మరీ విచిత్రంగా ఉంది. 2018లో పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై పోస్టు పెట్టారని రెండురోజుల క్రితం విజయవాడ సైబర్ క్రైమ్ సిటీ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. రెండురోజులైనా కోర్టులో హాజరుపరచకపోవడంతో వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రంగంలోకి దిగింది. దీంతో దిగొచ్చిన పోలీసులు ఆయనను వదిలిపెట్టారు. ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి మీద సోషల్ మీడియా కేసు నమోదైంది. లోకేష్ చంద్రబాబు కుటుంబంపై పోస్ట్ చేసినందుకు టీడీపీ తాడికొండ మండలం మోతడక గ్రామ పార్టీ అధ్యక్షుడు రావి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎస్సీ నాయకుడు బండారు జయకుమార్‌పై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆధారాలు లభించకపోవడంతో కారుమూరి రాంబాబు అనే అతని వద్ద రూ.రెండు లక్షలు తీసుకొని డబ్బులు ఎగ్గొట్టి అతనిపై దాడి చేశాడంటూ తప్పుడు కేసు పెట్టారు. ● చిలకలూరిపేట పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి దొడ్డ రాకేష్ గాంధీని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పటి నుంచి అతను అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చింది. ● సత్తెనపల్లి రూరల్ మండలంకు చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా మండల కో–ఆర్డినేటర్ మర్రి శివప్రసాద్‌కు ఇటీవల టీడీపీ నేతల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. గుంటూరు నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన వారు ఫోన్ చేసి మీరు ఏమేమి పోస్టులు పెట్టారో అన్నీ తమ దగ్గర ఉన్నాయని, మళ్లీ పోస్టు పెడితే జైలు ఊచలు లెక్కించక తప్పదంటూ బెదిరించారు. ● డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వినుకొండ మండలం పానకాలపాలెం గ్రామ నివాసి అయిన నన్నపనేని వెంకట్రావు అనుచిత పోస్టుపెట్టాడని జనసేన నేత నిశంకర శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ సీఐ కేసు నమోదు చేశారు. ఆదివారం వెంకట్రావును అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ● మాచర్ల రూరల్ కంభంపాడు గ్రామానికి చెందిన నెమలి దిన్నె రంగారెడ్డి సోషల్ మీడియాలో పో స్టులు పెడుతున్నారంటూ కేసు నమోదు చేశారు. ● గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పప్పుల వెంకటరామిరెడ్డిని సోమవారం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి గురజాలకు తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వాఖ్యలు చేశారని, అందుకే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 15న గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వెన్నా రాజశేఖర్‌రెడ్డిని, పిడుగురాళ్ల మండల సోషల్ మీడియా కన్వీనర్ షేక్ మాబులనూ పోలీసులు అరెస్టు చేశారు. పచ్చ బ్యాచ్ ‘ఎర్ర’ వేషాలు వేధించడమే లక్ష్యం? పోస్టులు పెడుతున్నారంటూ కేసులు వైఎస్సార్ సీపీకి అండగా ఉన్న వారే టార్గెట్ 2018లో పోస్ట్ పెట్టాడంటూ ఆళ్ల జగదీశ్ రెడ్డి అరెస్ట్... మహిళా కార్యకర్తలనూ వదలని వైనం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి అరాచకం వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త, సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన మట్టుపల్లి ఏసుబాబు (మోజస్)పై నందిగామ అడ్డరోడ్డులో జూలై 24న రాత్రి హత్యాయత్నం జరిగింది. స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై మోజెస్ వెళ్తుండగా ఆరుగురు టీడీపీ గుండాలు పథకం ప్రకారం వచ్చి కర్రతలతో దాడి చేశారు. ‘కళ్ళం విజయ భాస్కర్ రెడ్డి అండ చూసుకొని కన్నా లక్ష్మీనారాయణపైనే ఎన్నికలకు ముందు పోస్టులు పెడతావా? ఇప్పుడు నిన్ను చంపితే ఎవడోస్తాడో ఇప్పుడు రమ్మను? చూద్దాం’ అంటూ కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా గాయ పరిచారు. అప్రమత్తమైన స్థానికులు మోజెస్‌ను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు. -
అమరేశ్వరాలయం
తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తిక మాసం. మరీ ముఖ్యంగా పరమ శివుడికి మహా ప్రీతికరమైన మాసం. పవిత్ర కార్తికమాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా కోటప్పకొండలో నెలవైన త్రికోటేశ్వరుని ఆలయం.. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తెల్లవారు జామునే ఆయా ఆలయాలకు చేరుకున్న భక్తులు ఓం.. నమఃశివాయ స్మరణ చేస్తూ పరమ శివుడిని దర్శించుకున్నారు. భక్తజన సంద్రం.. అమరావతి: ప్రపిద్ధ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం కార్తిక సోమవారం సందర్భంగా వేకువజామునుంచే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కృష్ణాజలాలలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలోని దీపారాధనలు చేసి, కార్తిక దామోదరునికి విశేషపూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. శివపంచాక్షరీ నామంతో అమరేశ్వరాలయం ప్రతిధ్వనించింది. సోమవారం ఉదయం సుమారు 50పైగా బస్సులలో పంచారామ క్షేత్ర సందర్శన యాత్రికులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ కార్తిక సోమవారం విశిష్టతను వారికి వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ సునీల్‌కుమార్ భక్తులకు అందించే అన్నదానం, ఉచిత ప్రసాదం ఏర్పాట్లను సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. కార్తిక సోమవారం స్వామివారిని సుమారు 10వేల మంది భక్తులు దర్శించుకున్నారని దేవాలయ అధికారుల అంచనా. అమరావతి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
నిత్యావసరాల ధరలు తగ్గించాలి
నరసరావుపేట: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు డి.శివకుమారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖల జనరల్ బాడీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల విపరీతమైన అధిక ధరల వలన సామాన్య ప్రజల ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 15 వరకు ప్రచార కార్యక్రమం, 15వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో డిసెంబరు ఏడు, ఎనిమిది తేదీల్లో నరసరావుపేటలో నిర్వహించే పార్టీ జిల్లా మొదటి మహాసభల విజయవంతానికి పట్టణ ప్రజలు సహకారం అందజేసి విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో పట్టణ ఒన్‌టౌన్, టూటౌన్ కార్యదర్శులు సిలార్ మసూద్ సయ్యద్ రబ్బాని, సీనియర్ నాయకులు ఏవీకే దుర్గారావు, షేక్ మస్తాన్‌వలి, ధూపం సుభాష్ చంద్రబోస్, మిరపకాయల రాంబాబు, కట్ట కోటేశ్వరావు, జిలాని మాలిక్, సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు. ధరల పెంపుపై నిరసనగా ఈనెల 15న కలెక్టరేట్ ఎదుట ధర్నా సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు శివకుమారి -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
తెనాలిరూరల్: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు గాయాలపాలయ్యారు. తెనాలి మండలం నందివెలుగు–అత్తోట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కొల్లిపర వైపు నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా మితిమీరిన వేగంతో వస్తున్న కారు ఢీ కొట్టడంతో ఒకే కటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. కొల్లిపరకు చెందిన ఎం.ధన కిషోర్, భార్య దేవరాణి, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తి వెళ్లేందుకు తెనాలి రైల్వేస్టేషన్‌కు ఆటోలో బయలుదేరారు. నందివెలుగు పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి వీరి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు ధన కిషోర్, దేవరాణి, వీరి కుమారుడు విజయ భాను, ఆటో డ్రైవర్ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. కిషోర్ కుమార్తె క్షేమంగా బయటపడింది. స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. కారు మితిమీరిన వేగంతో వచ్చి తమ ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీకి పల్నాడు వాసి ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీకి పల్నాడు జిల్లావాసి ఎంపికై నట్లు పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఆదివారం సత్తెనపల్లిలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి సీనియర్ మెన్ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు గోల్‌కీపర్‌గా షేక్ ఇర్ఫాన్ ఎంపికయ్యాడన్నారు. ఇర్ఫాన్‌ను పలువురు అభినందించారు. ఆయనతో పాటు సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ షేక్ మహ్మద్ రియాజ్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఉన్నారు. సీపీఎం కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి అమరావతి: మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామంలో సీపీఎం కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎండ్రాయి గ్రామంలో సీపీఎం కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వృద్ధుడైన నండూరి వెంకటేశ్వరరాజుపై పాత కక్షల నేపధ్యంలో ఎండ్రాయి మెయిన్ రోడ్డుపై టీడీపీ వర్గీయులు గోరంట్ల నాని, గోరంట్ల నాగమల్లేశ్వరరావు రత్నాకర్ ప్రసాద్‌లు దాడిచేశారు. ఈ సంఘటనపై సీపీఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ వయస్సు రీత్యా గౌరవం ఇవ్వకపోగా అకారణంగా అసభ్యపదజాలంతో తిడుతూ రోడ్డు మీద పడేసి కొట్టటం దారుణమన్నారు. అధికారం ఉంది మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. నిన్నుచంపేస్తామని బాధితుడిని బెదిరించారన్నారు.ఈ సంఘటన పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని నిందితులను అరెస్టు చేయాలన్నారు. బాధితుడు వెంకటేశ్వరరాజు స్థానిక 30 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హోరాహోరీగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూలులో జరుగుతున్న 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ అంతర జిల్లాల (అండర్–17) బాలబాలికల వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు రెండోరోజైన ఆదివారం కొనసాగాయి. పోటీల్లో 55 కిలోల బాలుర విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన జి.జయసాయికృష్ణ స్కాచ్‌లో 60 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 90 కిలోలతో సహా మొత్తం 150 కిలోలతో ప్రథమ స్థానం సాధించాడు. కడప, విశాఖకు చెందిన లిఫ్టర్లు ద్వితీయ, తృతీయ బహుహతులను గెలిచారు. బాలికల 40 కిలోల విభాగంలో పశ్చిమగోదావరి, 45 కిలోల విభాగంలో తూర్పుగోదావరి లిఫ్టర్లు ప్రథమస్థానంలో నిలిచారు. ఈ పోటీలకు ఎస్.కోటేశ్వరరావు, సీహెచ్ గోపీనాథ్, ఎ.వెంకటరామిరెడ్డి న్యియనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాగశిరీష, వ్యాయామ అధ్యాపకుడు రమేష్, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఎం.రవికుమార్ పర్యవేక్షించారు. -
వరదలకు పాడైన మోటార్లకు నష్టపరిహారం ఇవ్వాలి
తాడేపల్లి రూరల్: ఆగస్టులో వరదల ముంపునకు గురై పాడైన ఇంజిన్ ఆయిల్ మోటార్లు, మోటార్ పంపు సెట్లను నమోదు చేసి రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరులో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. పలువురు కౌలు రైతులను కలిసి వరదముంపుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. హరిబాబు మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపులో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొందరికే మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని విమర్శించారు. తక్షణమే రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, రైతు సంఘం నాయకులు బొప్పన గోపాలరావు, మేడూరి పాములు, వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు పరిమిశెట్టి శివనాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు పల్లపాటి సుబ్బారావు, పోకల శంకర్, ధనేకుల వేణు, నారంశెట్టి శివశంకరరావు పాల్గొన్నారు. -
మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై హత్యాయత్నం
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): ఆర్థిక లావాదేవిల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాడీపేట ప్రాంతానికి చెందిన గాడిపర్తి మాధవరావు పట్టాభిపురంలోని టెంపుల్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటాడు. శనివారం రాత్రి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది పులుసు రామకృష్ణారెడ్డితో కలిసి రామకృష్ణ అనే మరో స్నేహితుడి వద్దకు ఇద్దరు వెళ్లారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే సుబ్రమణ్యం అనే అతను వచ్చి రామకృష్ణారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. నాపై కోర్టులో దావా వేస్తావా అంత మాగడివా అంటూ రామకృష్ణారెడ్డిని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి, ఈ రోజు ఎలాగైనా చంపేస్తానని తన బాకీ కూడా పూర్తిగా రద్దు అవుతుందని చెప్పి గొడవకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా తన కుమారుడు రిషి రవిచంద్రకు ఫోన్ చేసి రామకృష్ణారెడ్డి దొరికాడని చెప్పి పట్టాభిపురం రావాలని చెప్పాడు. రవిచంద్ర సుమారు 15 మందిని తీసుకుని అక్కడికి చేరుకుని రామకృష్ణారెడ్డిపై దాడికి యత్నించాడు. రవిచంద్ర వెంట వచ్చిన వారు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాధవరావు తమ్ముడు రాము ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఘర్షణకు వచ్చిన వారు పరారయ్యారు. దీంతో మాధవరావు, రామకృష్ణారెడ్డి కారులో పోలీస్‌స్టేషన్‌కు బయలు దేరగా, వీరితోపాటు ద్విచక్రవాహనంపై వస్తున్న రామును సుబ్రమణ్యం కుమారుడు రిషి రవిచంద్ర, స్నేహితులతో కలిసి కారుతో ఢీ కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. రాముకు వాహనంపై నుంచి కిందపడి చిన్నపాటి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో రిషి రవిచంద్ర తన గ్యాంగ్‌తో పరారయ్యారు. మాధవరావు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్ ముందు వాగ్వివాదం మాచర్ల ఎమ్మెల్యే బావమరిది రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడిన సుబ్రమణ్యం తరఫున పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ వద్దకు ఆదివారం రాత్రి టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు చేరుకున్నాడు. పోలీస్‌స్టేషన్ బయట మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దుర్భషలాడాడు. రామకృష్ణారెడ్డితో వచ్చిన వారికి ఎమ్మెల్యే అనుచరుడి మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీన్ని గమనించిన పట్టాభిపురం పోలీసులు స్టేషన్ బయట వాగ్వివాదం జరుగుతుందని తెలుసుకుని బయటకు వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పారు. దీంతో పశ్చిమ ఎమ్మెల్యే అనుచరుడు స్టేషన్ వద్ద నుంచి వెళ్లిపోయాడు. కారుతో ఢీకొట్టి హతమార్చేయత్నం చేసిన వైనం ఆర్థిక లావాదేవిల వల్లే వివాదం రెండు వర్గాలు ఒక పార్టీకి చెందిన వారే కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు -
గాయపడిన యువకుడు మృతి
అద్దంకి రూరల్: అద్దంకి–నార్కెట్‌పల్లి నామ్ రహదిరిపై అద్దంకి సమీపంలో బైకుతో డివైడర్‌ను ఢీకొట్టి గాయాలపాలైన యువకడు ఒంగోలు కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ కేసు నమోదు చేశారు. వివరాలు.. అద్దంకి పట్టణంలోని దామావారి పాలెంకు చెందిన వేముల ప్రసన్నబాబు (39) గత నెల 31వ తేదీ రాత్రి బుల్లెట్ బైకుపై శింగరకొండ నుంచి అద్దంకికి వస్తుండగా మార్గమధ్యంలో కూకట్ల కన్వెక్షన్ వద్దకు రాగానే బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన ప్రసన్నబాబు ఒంగోలు కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. భార్య ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేశారు.