panama
-
1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!
మరో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు దక్షిణ అమెరికా దేశంలోని పనామా సిటిలో బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధి తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్‌కి గురయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది. సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధి తోపాటు చాలా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వివరించారు. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అప్పటి ఆచారం ప్రకారం..ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతి పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్ డాక్టర్ జూలియా. కాగా, సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్ మెంటోనెగ్రో చెబుతున్నారు. View this post on Instagram A post shared by Fundación Ciudad del Saber (@ciudaddelsaber) (చదవండి: ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!) -
పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది
మానవ నిర్మితమైన 'పనామా కాలువ' (Panama Canal) పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికాలు విడదీస్తుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణించే దూరం ఏకంగా 9500 కిమీ తగ్గిపోయింది. సాధారణంగా సముద్రం మీద వెళ్లినట్లు ఈ కాలువలో షిప్పులు ప్రయాణించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఇది అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని లాకింగ్ సిస్టం అనే పద్దతి ద్వారా షిప్పులను జాగ్రత్తగా ఒకవైపు నుంచి మరో వైపుకు పంపడం చూడవచ్చు. పనామా కాలువలో షిప్పులు ఎలా ముందుకు వెళతాయి అనేదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్టేట్ నుంచి మరో స్టేజికి వెళ్లాలంటే లాకింగ్ పద్దతిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీటిని ఓకే సమతుల్య స్థానానికి తీసుకు వచ్చిన తరువాత ఇవి ముందుకు కదులుతాయి. ఇలా లాకింగ్ పద్దతిని అనుసరించి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి షిప్పులు కదులుతాయి. How ships cross the Panama Canal.. ❤️pic.twitter.com/G5GeuBxK92 — #NaMo Again 🚩 (@BhaktSanatani_) February 29, 2024 -
పనామా కెనాల్లో ఎలా ఉంటుందంటే.?
-
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్‌బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
FIFA World Cup: ప్రపంచ కప్ టోర్నీకి అమెరికా అర్హత
FIFA World Cup Qatar 2022- స్యాన్ జోస్: గత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన యూఎస్ఏ జట్టు ఈ సారి ఆ అడ్డంకిని అధిగమించింది. ఖతర్‌లో ఈ ఏడాది జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు అమెరికా క్వాలిఫై అయింది. తమ చివరి క్వాలిఫయర్ పోరులో అమెరికా 0–2తో కోస్టారికా చేతిలో ఓడినా ఆ జట్టు ముందంజ వేయడం విశేషం. గత వారం జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సొంతగడ్డపై 5–1 తేడాతో పనామాపై ఘన విజయం సాధించడం అమెరికాకు కలిసొచ్చింది. కనీసం ఆరు గోల్స్ తేడాతో ఓడితే గానీ ఇబ్బంది లేని స్థితిలో బరిలోకి దిగిన యూఎస్...చివరకు పరాజయంపాలైనా వరల్డ్ కప్ అవకాశం మాత్రం దక్కించుకోగలిగింది. నవంబర్ 21నుంచి డిసెంబర్ 18 వరకు ఖతర్‌లో 2022 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. చదవండి: సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు See you in November. 🇺🇸 🗣 @TimHowardGK pic.twitter.com/ZiX4E4JGir — USMNT: Qualified. (@USMNT) March 31, 2022 -
930 భారతీయులు, వాటిల్లో రూ.20వేల కోట్ల అక్రమ నగదు!
న్యూఢిల్లీ: పనామా, ప్యారడైజ్ పేపర్ లీకేజీ ఘటనల్లో దాదాపు 930 భారతీయులకు సంబంధించిన సంస్థల ఖాతాల్లో ఏకంగా రూ.20,353 కోట్లు జమయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ విషయం చెప్పారు. ‘ఈ ఏడాది అక్టోబర్ ఒకటినాటికి ఆయా ఖాతాల్లోని మొత్తాలపై రూ.152.88 కోట్ల పన్నులను వసూలుచేశాం’ అని మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చట్టాలను అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. వీటిపై 52 కేసులు నమోదయ్యాయన్నారు. మరో 130 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిన కొందరు భారతీయుల పేర్లు బహిర్గతమైన విషయం తెల్సిందే. మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎంఏజీ) ఆధ్వర్యంలో కేసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. -
కొస్టారికా, పనామా సరిహద్దుల్లో భూకంపం
-
అజేయ బెల్జియం
కలినిన్‌గ్రాడ్: ప్రపంచకప్ గెలవగల జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం... అదే స్థాయి ఆటతో లీగ్ దశను అజేయంగా ముగించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి 9 పాయింట్లతో గ్రూప్ ‘జి’లో అగ్రస్థానం సాధించింది. గురువారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో నెగ్గింది. జానుజాజ్ (54వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. రెండు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే నాకౌట్ చేరిన నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలు గ్రూప్ టాపర్ ఎవరో తేల్చేందుకే ఉపయోగపడ్డాయి. పనామాపై ట్యూనీషియా విజయం గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో పనామాపై ట్యూనీషియా 2–1తో నెగ్గింది. ట్యూనీషియా ఆటగాడు యాసిన్ మెరాయ్ 33వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో పనామాకు ఆధిక్యం దక్కింది. అయితే, బెన్ యూసెఫ్ (51వ నిమిషం), ఖజ్రీ (66వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు. -
ఇంగ్లండ్ అదరహో
నిజ్నీ నొవ్గోరడ్: ఇంగ్లండ్ కెప్టెన్, స్ట్రయికర్ హ్యారీ కేన్ ‘హ్యాట్రిక్’ తుఫాన్లో పనామా విలవిల్లాడింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తమ అత్యధిక గోల్స్‌తో చరిత్రకెక్కే విజయాన్ని నమోదు చేసింది. కేన్ సేన ఉరిమే ఉత్సాహంతో తొలి అర్ధభాగంలోనే పనామా పనైపోయింది. గ్రూప్ ‘జి’లో ఆదివారం జరిగిన ఈ పోరులో ఇంగ్లండ్ 6–1తో పనామాపై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ తరఫున హ్యారీ కేన్ మూడు గోల్స్ (22వ, 45+1వ, 62వ నిమిషాల్లో) చేయగా... జాన్ స్టోన్స్ రెండు (8వ, 40వ నిమిషాల్లో)... లిన్‌గార్డ్ (36వ నిమిషంలో) ఒక గోల్ సాధించారు. పనామా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను ఫిలిప్ బెలోయ్(78వ ని.) సాధించాడు . ఆరంభం నుంచే ఎదురులేని ఇంగ్లండ్ దాడులకు పనామా చెల్లాచెదురైంది. ఈ మ్యాచ్‌లో ఎక్కడా తగ్గని ఇంగ్లండ్ 8వ నిమిషంలోనే గోల్స్ బోణీ కొట్టింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ కార్నర్ నుంచి ట్రిప్పియెర్ ఇచ్చిన పాస్‌ను కనిపెట్టుకున్న స్టోన్స్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా హెడర్‌తో గోల్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్టోన్స్కిదే తొలి గోల్. అనంతరం ఇంగ్లండ్ తమ జోరు కొనసాగించగా... పనామా డీలా పడిపోయిం ది. గురువారం బెల్జియంతో జరిగే మ్యాచ్ ఫలితంతో గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుంది. బెల్జియం కూడా ఇప్పటికే నాకౌట్‌కు చేరింది. రెండో మ్యాచ్‌ల్లోనే 5 గోల్స్‌తో కేన్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ►5 ఇంగ్లండ్ చరిత్రలో తొలి అర్ధభాగంలోనే ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. ►3 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ చేసిన మూడో ఆటగాడు కేన్. జెఫ్ హర్ట్స్ (1966), గ్యారీ లినేకర్ (1986) హ్యాట్రిక్ సాధించారు. ►1 ఇంగ్లండ్ వరల్డ్‌కప్ చరిత్రలో అతిపెద్ద (6–1) విజయమిది. -
భళా... బెల్జియం
సంచలనమేమీ లేదు... అరంగేట్ర జట్టు ప్రత్యర్థిని నిలువరించనూ లేదు... ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ను కొంత ఆసక్తికరంగానే ప్రారంభించినా కొత్త జట్టు పనామా తర్వాత తప్పులతో తడబడింది. దాని పోరాటం నామమాత్రమే అయింది. క్రమంగా పుంజుకున్న బెల్జియం అసలైన ఆటను బయటకు తీసింది. వరుస దాడులతో ఊపిరి సలపకుండా చేసింది. స్ట్రయికర్లు లుకాకు, మెర్టెన్స్ కళ్లు చెదిరే రీతిలో చేసిన గోల్స్‌తో విజయదుందుభి మోగించింది. సోచి: ప్రారంభ మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్‌లో ఓ ఏకపక్ష మ్యాచ్. అరంగేట్ర పనామాపై బెబ్బులిలా విరుచుకుపడిన బెల్జియం 3–0 తేడాతో సునాయాస విజయం అందుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘జి’ మ్యాచ్‌లో ప్రత్యర్థి అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకున్న ఆ జట్టు పూర్తి ఆధిపత్యం చాటింది. మెరుపులా మెరిసిన స్ట్రయికర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రొమేలు లుకాకు రెండు, డ్రియెస్ మెర్టెన్స్ ఒక గోల్ చేశారు. పోటీతోనే ప్రారంభమైనా... వాస్తవానికి బంతిపై నియంత్రణ, పాస్‌ల చేరవేతతో ప్రారంభంలో పనామా దీటుగా ఆడింది. మంచి డిఫెన్స్‌తో గోల్‌కు అవకాశం ఇవ్వలేదు. అటు బెల్జియం కూడా దాడులు చేయడంలో ఇబ్బందిపడింది. ఓ దశలో ఇద్దరు మినహా ఆ జట్టు ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి వెళ్లారు. అయినా స్కోరు చేయలేకపోయారు. దీంతో మొదటి భాగం గోల్ లేకుండానే ముగిసింది. అయితే, రెండో భాగం ప్రారంభంలోనే ఈ నిరీక్షణకు తెరపడింది. బెల్జియం ఒక్కసారిగా దూకుడు పెంచగా, పనామా క్రమంగా లయ తప్పింది. 47వ నిమిషంలో స్ట్రయికర్ డ్రీస్ మెర్టెన్స్... గోల్ పోస్ట్‌కు కొద్ది దూరంలో అందిన బంతిని చూడచక్కని రీతిలో స్కోరు చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు. ఇక్కడినుంచి గాడి తప్పిన పనామా ఒకటీ, అరా అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా ఎల్లో కార్డ్‌కు గురయ్యారు. మరోవైపు 69వ నిమిషంలో డిబ్రుయెన్ అందించిన క్రాస్‌ను స్ట్రయికర్ లుకాకు... డైవ్ చేస్తూ అద్భుతం అనేలా తలతో గోల్‌గా మలిచాడు. దీన్నుంచి తేరుకునేలోపే 75వ నిమిషంలో మరో దెబ్బకొట్టాడు. డిబ్రుయెన్, విట్సెల్ నుంచి అందిన పాస్‌లను ఈడెన్ హజార్డ్... లుకాకుకు చేరవేయగా అతడు వేగంగా పరుగెడుతూ కీపర్ పెనెడోను తప్పిస్తూ గోల్‌గా మార్చాడు. ఆరు నిమిషాల్లో రెండు గోల్స్ ఇచ్చుకున్న పనామా తర్వాత చేసేదేమీ లేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఐదుగురు ఎల్లోకార్డ్ను ఎదుర్కోవడం గమనార్హం. -
వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర బస్సు ప్రమాదం, 18 మంది మృతి
పనామా సిటీ: ఉత్తర అమెరికా దేశం పనామాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని పనామా సిటీకి నైరుతి దిశగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటన్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో 50 మందికి పైగా కూలీలను తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే 16 మంది మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జోస్ డొండెరిస్ తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతుఉన్నామని ఆయన వెల్లడించారు. -
పన్ను పారదర్శక కూటమిలోకి పనామా
పారిస్: సీమాంతర పన్ను ఎగవేతదారులపై పోరాటానికి ఏర్పడ్డ ప్రపంచ కూటమిలో పనామా దేశం కూడా చేరింది. దీంతో ఈ కూటమిలో దేశాల సంఖ్య 105కు పెరిగింది. ‘పన్ను విషయాల్లో పరిపాలనా పరమైన సహాయంపై బహుపాక్షిక కూటమి’లో సభ్య దేశంగా గురువారం పనామా చేరింది. కూటమిలో సభ్యదేశాలు పన్నులు చెల్లించేవారి సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ ఏడాది ప్రారంభంలో పనామా పేపర్స్ లీక్స్ పేరుతో అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం పలు కంపెనీల బండారం బయట పెట్టడంతో ఒక్కసారిగా పనామా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భారత్ 2012లో చేరింది. -
అది బినామీ కంపెనీయే: పనామా పత్రాలు
పనామా పత్రాలు బయటకొచ్చినప్పడే.. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్(67)కు సంబంధించిన టోగోలోని వాసెం కంపెనీ గురించిన విస్తృత కథనాలు బయటకొచ్చాయి. వాసెమ్ కంపెనీలో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా ఉన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. అయితే కెన్లెమ్ లిమిటెడ్ కంపెనీలో 24 శాతం షేర్లు మోటపర్తి శివరామ ప్రసాద్వే ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ కెన్లెమ్ కంపెనీ యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. దాంతో ఇది బినామీ పేర్ల మీద నడుస్తున్న కంపెనీ అని, దీని అసలు యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు వెల్లడించాయి. టోగోలో ఉన్న వాసెం సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు విదేశీయులవే అని, ఈ షేర్ హోల్డర్లలో ఒకరు మోటపర్తి శివరామ ప్రసాద్ అని పనామా పత్రాలు వెల్లడించాయి. నామమాత్రపు కంపెనీ పేరు మీద పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు దీనిపై ఉన్నాయి. ప్రస్తుతం మోటపర్తి ఘనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించి పన్ను ఎగ్గొట్టే లక్ష్యంతోనే బినామీల పేర్లమీద ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లు పనామా పత్రాలు పేర్కొన్నాయి. అయితే అక్కడ ఉన్న కంపెనీలలో 61 శాతం షేర్ హోల్డర్లు ఎవరనే విషయం టోగో వారికి తెలియదని పనామా పత్రాలు తెలిపాయి. -
'సంబరాలకు వారికి అవకాశం ఉండదు'
కోల్‌కతా: ఇటీవల 'పనామా' వివాదంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తన్న ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. వివరాలు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీకి సంబరాలు చేసుకోవడానికి ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. ఈ కేసును నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని అన్నారు. కోల్‌కతాలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడుతూ... కేసు విచారణలో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారనే కాంగ్రెస్ వాదనను ఖండించారు. ఇది అర్థంలేని ఆరోపణ అని కొట్టి పారేశారు. పనామా వివాదంపై బహుముఖ విచారణ జరుగుతోందని, దోషులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఆదాయపన్ను ఎగ్గొడుతున్న వారి సంఖ్య దేశంలో ఎక్కువగానే ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘పనామా’పై మౌనమేల?
కమల్పూర్(అస్సాం): నల్లధనాన్ని వెనక్కి తెస్తానని పెద్దపెద్ద హామీలిచ్చిన ప్రధానమంత్రి మోదీ అందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చినా..ఎందుకు దర్యాప్తు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అస్సాంలో ఈ నెల 11న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ శుక్రవారంలో పాల్గొన్నారు. పనామాలో నల్లధనం దాచిన అనేక మంది పేర్లు వెలుగు చూశాయని, ఇందులో అభిషేక్‌కు పనామాలో అకౌంట్ ఉందని వెల్లడైందని చెప్పారు. దేశం వదిలి పారిపోయిన మాజీ ఐపీఎల్ చీఫ్ లలిత్‌మోదీని తిరిగి స్వదేశానికి ఎందుకు రప్పించలేదని మోదీని పార్లమెంట్లో ప్రశ్నించానని, అయితే ఆయన నోరు విప్పలేదని అన్నారు. వేల కోట్లు కొల్లగ్గొట్టిన విజయ్‌మాల్యా దేశాన్ని వదిలి పారిపోయే ముందు పార్లమెంట్ హౌస్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారని ఆరోపించారు. -
పనామా లిస్టులోనూ మాల్యా
♦ తాజా లీక్స్‌లో వెల్లడి ♦ రుచి గ్రూపు ప్రమోటర్, ఒబెరాయ్ హోటల్స్ పేర్లూ తెరపైకి ♦ బహమాస్, యూఎఈ, సీషెల్స్లోనూ కంపెనీలు ♦ వీటితోనే విదేశాల్లో ఆస్తుల కొనుగోలు న్యూఢిల్లీ: భారతదేశ బ్యాంకులు ఉద్దేశపూర్వక బకాయిదారుగా గుర్తించిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా రెండు నెలలక్రితమే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో కొత్త కంపెనీని కొన్నట్లు పనామా పేపర్స్ తాజా లీక్‌లో వెల్లడైంది. దీంతో పాటు ప్రముఖ హోటల్స్ కంపెనీ ఒబెరాయ్, 6 బిలియన్ డాలర్ల రుచి గ్రూపు ప్రమోటర్‌తోపాటు ఢిల్లీకి చెందిన దంపతులు, ప్రముఖ తేయాకు వ్యాపారి కోడలితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. భారతదేశ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పు ఉన్న కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని మాల్యాకు బ్రిటిష్ వ ర్జిన్ ఐలాండ్స్‌లో పెద్ద కంపెనీ ఉన్నట్లు వెల్లడైంది. ‘వెంచర్ న్యూ హోల్డింగ్స్ లిమిటెడ్’ అనే కంపెనీ నేరుగా మాల్యా పేరుతోనే ఉందని తేలింది. ఈ కంపెనీని 2016 ఫిబ్రవరి 15నుంచి మాల్యా నిర్వహిస్తున్నట్లు పనామా పేపర్లలో వెల్లడైంది. బెంగళూరులోని విఠల్మాల్యా రోడ్డులోని మాల్యా నివాసం నుంచే ‘వెంచర్ న్యూ హోల్డింగ్స్ లిమిటెడ్’ కంపెనీ వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పీఆర్ఎస్ ఒబెరాయ్, దీపక్ మధోక్ 2010లో ఒబెరాయ్ గ్రూపు, హాంకాంగ్‌లోని అమెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కంపెనీలో 45.8 శాతం (45 మిలియన్ డాలర్ల ఒప్పందం) వాటాలున్నట్లు ప్రకటించింది. అమెక్స్ ద్వారా విదేశా హోటళ్లను నిర్వహిస్తామంది. అయితే పనామా లీకేజీలో మాత్రం అమెక్స్తోపాటు జే అండ్ డబ్ల్యూ ఐఎన్‌సీ (బహమాస్), ఇతర విదేశీ కంపెనీల్లో ఒబెరాయ్ గ్రూపు డెరైక్టర్లుగా ఉన్న పీఆర్ఎస్ ఒబెరాయ్, దీపక్ మధోక్‌కు వాటాలున్నట్లు తెలిసింది. ఉమేశ్ శాహ్రా, ప్రమోటర్ ‘రుచి’ గ్రూపు 6 బిలియన్ డాలర్ల విలువైన రుచి గ్రూపు ప్రమోటర్ ఉమేశ్ శాహ్రాకు పనామాలో రెండు ప్రైవేటు ఫౌండేషన్లతోపాటు మొత్తం 8 విదేశీ కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. వన్ వరల్డ్ ట్రస్ట్, ద త్రీవెల్స్ ఫౌండేషన్లు ఈ గ్రూపులోనివేనంది. 2014లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణంలోనూ ఉమేశ్ శాహ్రా పేరుంది. చేతన్ కపూర్, కబీర్ కపూర్.. పనామా లీక్‌లో చేతన్, కబీర్‌లకు సంబంధించి 499 పత్రాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొసాక్ ఫొన్సెకా సాయంతో పనామాలో 2010లో ‘ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చారిటబుల్ ఫౌండేషన్’ను కొనుగోలు చేశారు. అంతకుముందు 2007లో ఓప్లర్ అనే కంపెనీని 6,750 డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2013 జనవరిలో చేతన్ కపూర్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డుకు 4.9 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించారని పత్రాల్లో వెల్లడైంది. ఐదోరోజు వెల్లడైన మరికొన్ని పేర్లు అమయా కలెక్షన్స్ యజమాని అమృతా ఝవేరీకి సీషెల్స్‌లో కంపెనీలున్నట్లు తెలిసింది. ఢిల్లీ వ్యాపారి సత్యప్రకాశ్ గుప్త మొసాక్ ఫొన్సెకా సాయంతో రస్ అల్‌ఖైమాలో స్టెర్లింగ్ గ్లోబల్పార్ట్నర్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేసినట్లు వెల్లడైంది. అస్సాం తేయాకు పరిశ్రమ రారాజుగా వెలుగొందిన హేమేంద్ర ప్రసాద్ బరూవా కోడలు గార్గికీ పనామాలోని వాకర్స్ ఫౌండేషన్‌ను 2010లో కొన్నారు. ఢిల్లీలోని దామోదర్ సునిధి వెంచర్స్ డెరైక్టర్లు నిమిత్త్ రాయ్ తివారీ, అంకితా సెహగల్(దంపతులు)లకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో సన్సెల్ హోల్డింగ్స్ ఎస్ఏ అనే కంపెనీ ఉంది. కాగా, పనామాతోపాటు టాక్స్ హెవెన్స్‌గా మారిన పలు దేశాలు.. మనీలాండరింగ్ విషయంలో కఠినమైన చట్టాలను అయలు చేయకపోతే ఆంక్షలు తప్పవని యురోపియన్ యూనియన్ హెచ్చరించింది. కాగా, విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల నుంచి తను లాభపడినమాట వాస్తవమేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అంగీకరించారు. -
పనామాలో కేసముద్రం వాసి..?
కేసముద్రం :ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పత్రాల’ వ్యవహారంలో కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి పేరు వినబడడం చర్చనీయూంశమైంది. సదరు వ్యాపారి పేరు బుధవారం వివిధ చానళ్లలో వచ్చింది. ఆ వ్యాపారి కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఓ కంపెనీని నడుపుతూ స్థిరపడ్డాడు. గత రెండు రోజులుగా పనామాలో డబ్బులు దాచుకున్న పలువురు ప్రముఖుల పేర్లు ఐసీఐజే బయటపెట్టడం సంచలనం రేకిత్తించింది. ఇదే క్రమంలో కొందరి తెలుగువారి పేర్లు పనామా వ్యవహారంలో ఉన్నట్లు బుధవారం పలు టీవీ చానళ్లలో రావడం, అందులో కేసముద్రం వాసి పేరు వినిపించడం కలకలం రేపింది. -
‘పనామా’లో విశాఖ నల్లకూబేరుడు!
ఇక్కడా మోటూరు శ్రీనివాస ప్రసాద్ అవినీతి మూలాలు గతంలో బయోడీజిల్ కేసులో అరెస్టు ఆ తర్వాత లభించని ఆచూకీ విశాఖపట్నం: పనామా ప్రకంపనలు జిల్లాలోనూ ప్రతిధ్వనించాయి. పన్నులు ఎగ్గొడుతూ పనామా రాజధాని హవాయిలో నల్లధనాన్ని దాచుకున్న నల్లకుబేరుల జాబితాలో ఉన్న మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ అవినీతి మూలాలు విశాఖలోనూ ఉన్నాయి. ఆయన గతంలో జిల్లాలో పలు అక్రమ వ్యాపారాలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. ఓ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. తరువాత శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారో తెలీదు. తాజాగా పనామా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరు ఉండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ 2006లో దువ్వాడ వీఎస్ఈజెడ్(విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్)లో ఓ బయోడీజిల్ సంస్థను నెలకొల్పారు. యూరోపియన్ దేశాలకు బయోడీజిల్ ఎగుమతి చేసేవారు. అయితే ఈ ముసుగులో ఆయన నిబంధనలకు విరుద్ధంగా అమెరికా నుంచి బయోడీజిల్‌ను దిగుమతి చేసుకుని.. తిరిగి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని 2011 డిసెంబర్లో ఆరోపణలు వచ్చాయి. దీనికోసం నిబంధనలకు విరుద్ధంగా వీఎస్ఈజెడ్ అధికారుల నుంచి ఎగుమతులకు అనుమతి పత్రాన్ని పొందారని కూడా వెల్లడైంది. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయన నిబంధనలకు విరుద్ధంగా బయోడీజిల్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారని నిగ్గుతేల్చారు. అప్పట్లోనే 19,300 టన్నుల బయోడీజిల్‌ను అక్రమంగా ఎగుమతి చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తే గానీ ఈ అక్రమ వ్యాపారం గుట్టు బయటపడదని కూడా భావించారు. ఈ మేరకు వీఎస్ఈజెడ్ అధికారుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు శ్రీనివాస్ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. 2012 ఏప్రిల్ 2న అతన్ని అరెస్టు చేసి కేసు విచారణ కొనసాగించారు. కానీ అప్పటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారో ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా పనామా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యాపార వ్యవహారాలు మొదటి నుంచి కూడా సందేహాస్పదమేనని పోలీసులు చెబుతున్నారు. -
పనామా దోషులకు శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీకైన పనామా పత్రాల ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజాల పేర్లు వరుసగా బయటకు వస్తున్నాయి. ఆ పేర్లను చూసి అరే! వీళ్లున్నారే అంటూ మనం ఆశ్చర్యపడుతున్నాం. చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పేర్లు వెలుగులోకి వచ్చిన వారు సమర్థించుకుంటున్నారు. ఇంతవరకు సరే! భారత్‌లో పన్నులు ఎగవేస్తూ పనామాలో నకిలీ కంపెనీల పేరిట కోట్లాది రూపాయలు దాచుకున్న బిగ్ షాట్స్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఆ అక్రమ డబ్బును వెనక్కి తీసుకొస్తుందా? అన్నది ప్రస్తుతం కోటానుకోట్ల రూపాయల ప్రశ్న. పనామా అంత పెద్ద సంఖ్యలో కాకపోయినప్పటికీ ఇంతకుముందు స్విస్, హెచ్ఎస్బీసీ బ్యాంకుల జాబితాలు వెలువడ్డాయి. వాటి విషయంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కనీసం విచారణ ఏ దశలో ఉందన్న వార్తలు కూడా రావడం లేదే! అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల 70 వేలకోట్ల రూపాయలను భారత్‌కు రప్పిస్తామని బీరాలు పలికిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ దిశగా ఇసుమంతా విజయం సాధించలేదే! అలాంటి బీజేపీ ప్రభుత్వం పనామా విషయంలో ముందుకు కదులుతుందా? అంబానీ, అదానీ లాంటి పెద్దల జోలికి వెళ్లే సాహసం చేస్తుందా ? కార్పొరేట్ దిగ్గజాలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్యన సాన్నిహిత్యం సాగినంతకాలం, నీరా రాడియాలాంటి లాబీయిస్టుల కారణంగా కార్పొరేట్ సానుకూల చట్టాలు రూపొందినంతకాలం ఎన్ని అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా వ్యవస్థలో ఎలాంటి మార్పు కనిపించదు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుని అవినీతిపై చర్యలు తీసుకున్నామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. పనామా లీక్స్ విషయంలో కూడా సరిగ్గా స్పందిస్తామని, ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ట్రీటి అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగస్వామి అవడం మాట అటుంచి, కనీసం ఈ ఒప్పందం పట్ల సానుకూలంగా కూడా స్పందించని పనామా ప్రభుత్వం పట్ల ఈ ట్రీటీ కింద ఎలా చర్యలు తీసుకుంటారో అరుణ్ జైట్లీకే తెలియాలి. పైగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ రూపొందించిన ఈ ఒప్పందంలోనే ఎన్నో లొసుగులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చర్యలు ఉంటాయో ఊహించవచ్చు. పనామాలాంటి అవినీతి కేసుల్లో దర్యాప్తు చాలావరకు అంతర్జాతీయ లేఖలు, ప్రత్యుత్తరాల వరకే పరిమితం అవుతుంది. తాము ఎంత చిత్తశుద్ధితో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా పని జరగడం లేదని, అందుకు అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు వస్తున్నాయని భారత్ లాంటి దేశాలు సాకులు చెప్పి తప్పించుకోవడమూ సహజమే. అడ్డం పడుతున్న ఒప్పందాలు సవరించుకోవచ్చుగదా, వాటి కోసం చిత్తశుద్ధితో కృషి చేయవచ్చుగదా! పనామా చిట్టాల్లో బయటపడ్డ వారిలో ఎక్కువ మంది చట్ట నిబంధనల ప్రకారమే విదేశాల్లో వ్యాపార లావాదేవీలు నెరుపుతుండవచ్చు. చట్టప్రకారమే అయినప్పటికీ వాటిల్లో నైతికతపాలు ఎంతన్నది మనకు ముఖ్యం. నైతికత ఆధారంగా చట్టాలు రూపొందించినప్పుడు, దాని ఆధారంగానే న్యాయవ్యవస్థ తీర్పులు వెలువరించినప్పుడు మాత్రమే ఇలాంటి అంశాల్లో న్యాయం జరుగుతుంది. నైతికత మూలసూత్రంగానే చట్టాలు, శాసనాలతోపాటు ఆర్బీఐ నియంత్రణా వ్యవస్థలో మార్పులు వస్తేగానీ పనామా దోషులకు శిక్ష పడదు. చెట్టాపట్టాలేసుకొని నడుస్తున్న రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను విడదీసి సరైన చట్టాల రూపకల్పనకు మార్గం పడాలంటే, ప్రభుత్వ తీరులో పారదర్శకత కనిపించాలంటే ప్రజల్లో చైతన్యం రావడమే తక్షణ అవసరం. పనామా స్కామ్‌లోనే ఐస్లాండ్ ప్రధాన మంత్రిని గద్దె దించిన అక్కడి ప్రజల చైతన్యమే ప్రస్తుతం మనకు స్ఫూర్తికావాలి. -
మన సొమ్ము బయటకు పోకుండా చూడాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్ : పనామాలోని మొస్సాక్ ఫోన్సెకా నుంచి బయటపడ్డ నల్లధన ఖాతాలు మచ్చుకు కొన్ని మాత్రమేనని లోక్‌సత్తానేత జయప్రకాష్‌నారాయణ అన్నారు. విదేశాల్లో మూలుగుతున్న భారతీయులకు చెందిన 700 మిలియన్ డాలర్లతో పాటు, మనదేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో వృథాగా పడి ఉన్న సంపదను సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఆయన సూచించారు. తద్వారా మనకు భారీ మౌలిక సదుపాయాలు, లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. బయటపడ్డ కేసులపై చర్యలు తీసుకుంటూ నల్లధనాన్ని తిరిగి రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఇక మీదట దేశం నుంచి చట్టవిరుద్ధంగా డబ్బు బయటకుపోకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. -
పనామా పత్రాల సునామీ
చీకటి ఖజానాల్లో నల్లడబ్బు గుట్టలు గుట్టలుగా పోగవుతున్న వైనం మరోసారి బద్దలైంది. మాటలే తప్ప చేతలకు సిద్ధపడని ప్రభుత్వాల నిర్వాకం చివరికెలా పరిణమిస్తున్నదో నిరూపిస్తూ కన్షార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజీ) సంస్థ జగదేక శ్రీమంతుల రహస్యాలను బయటపెట్టింది. వృత్తులు వేరైనా... పౌరసత్వం ఏ దేశానిదైనా...సంపాదనా మార్గం ఎలాంటిదైనా...చెప్పే సిద్ధాంతం ఏమైనా వీరందరి ప్రవృత్తీ ఒక్కటే- లెక్కలకెక్కని నిధుల్ని మూడో కంటికి తెలియ కుండా దాచుకోవడం! ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను అనుసంధా నిస్తూ... కుడి ఎడమల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలుండే ఓ చిన్న దేశం పనా మాలో కొలువుదీరిన మొస్సాక్ ఫోన్సెకా అనే సంస్థ ఇలాంటి శ్రీమంతుల దొంగ డబ్బుకు తోవలు పరుస్తోంది! ఏ దేశంలో, ఏ బ్యాంకులో దాచుకోవాలో... ఏ పేరు పెట్టుకుని ఖాతా తెరవాలో, ఏ పేరుతో బినామీ సంస్థ నెలకొల్పాలో ఇది సలహాలి స్తోంది. డబ్బు దాచినచోట ప్రభుత్వాల విధానాలు మారబోతున్నాయని తెలిసిన మరుక్షణమే నల్ల కుబేరులను అప్రమత్తం చేసి వారి కనుసైగతో డబ్బును వేరే దేశాలకు బదలాయిస్తోంది. మందీ మార్బలం, అనేక నిఘా సంస్థల దన్ను ఉన్న ప్రభుత్వాలను అపహాస్యం చేస్తూ దశాబ్దాలుగా ఈ దొంగపనులన్నిటినీ సమర్ధవం తంగా నిర్వహిస్తున్న ఫోన్సెకాలో నిండా 500మంది సిబ్బంది కూడా లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో దేశాల్లో ఈ సంస్థకు శాఖలున్నా, దీని కార్యకలా పాలపై కన్నేసి ఉంచుతున్నామని ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చెబుతున్నా పాత్రికేయుల పరిశోధనా బృందం దృష్టి పెట్టి వెలికి తీసేవరకూ ఈ చాటుమాటు వ్యవహారాలన్నీ గప్‌చుప్‌గా సాగిపోయాయి. దేశాధినేతలుగా ప్రభుత్వాల విధానా లను నిర్దేశిస్తూనే...కఠినమైన నిబంధనలు పెట్టినట్టు కనిపిస్తూనే ఆ నేతలే చాటు మాటుగా ఇలాంటి అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నారు. ఇప్పటికి వెల్లడైన పేర్లు చూస్తే ఎవరైనా గుండెలు బాదుకోవాల్సిందే. ప్రపం చాన్ని హడలెత్తిస్తున్న మాఫియా డాన్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు సరసనే దేశదేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, బ్రాండ్ అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తల పేర్లుండటం అందరినీ విస్మయపరుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బ్రిటన్ ప్రధాని కామెరాన్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఐస్లాండ్ ప్రధాని డేవిడ్ గన్లాగ్సన్, సౌదీ అరేబియా రాజు, ఉక్రెయిన్, అర్జెంటీనా దేశాల అధ్యక్షులు ఈ ‘నల్ల’ మరకలంటినవారిలో ఉన్నారు. ఈ ఘరానా పెద్దల జాబితాలో మన దేశానికి చెందినవారూ చోటుదక్కించుకున్నారు! బాలీవుడ్ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్, డీఎల్ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ ప్రమోటర్ సమీర్ గెహ్లాట్, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ తనయుడు తదితరులున్నారు. ఇప్పుడు వెల్లడైన పేర్లు చాలా తక్కువే. రాగలరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది గుట్టు రట్టవుతుందంటున్నారు. వివిధ రూపాల్లో ఉన్న మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన కోటీ 15 లక్షల పత్రాలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. ఇదంతా 2.6 టెరాబైట్ల సమాచారం. ఇందులో ఛేదించాల్సిన అంశాలింకా చాలానే ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా మన దేశానికి సంబంధించినంతవరకూ నల్ల కుబేరుల పేర్లు బయటపడటం ఇది మొదటిసారి కాదు. లీచెన్‌స్టీన్ బ్యాంకులో నల్లడబ్బు దాచుకున్న 26మంది భారతీయుల జాబితాను జర్మనీ ప్రభుత్వం 2008లో మన ప్రభుత్వానికి అందించింది. 2011లో ఫ్రాన్స్ 700మంది పేర్లున్న జాబితాను ఇచ్చింది. రెండేళ్లక్రితం మన ప్రభుత్వమే ఇద్దరు ముగ్గురు పేర్లను బయటపెట్టింది. వికీలీక్స్ సంస్థ సైతం కొందరి పేర్లు వెల్లడించింది. నిరుడు ఫిబ్రవరిలో జెనీవాలోని హెచ్ ఎస్బీసీ శాఖలో డబ్బులు దాచిన వేయిమందికిపైగా భారతీయుల జాబితా బయటికొచ్చింది. ఇలా అడపా దడపా అనేకమంది పేర్లు వెల్లడవుతున్నా ప్రభుత్వపరంగా తీసుకొంటున్న చర్యలేమిటో తెలియడం లేదు. 2009 ఎన్నికల సమయంలో బీజేపీ నల్లడబ్బు అంశాన్ని ప్రధానాస్త్రం చేసుకుంది. తాము అధికారంలోకొస్తే అలాంటివారి భరతం పడతామని, ఆ డబ్బంతటినీ వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లో దాన్ని జనం పెద్దగా పట్టించుకో లేదు. కానీ అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పర్య వసానంగా అదే అంశం 2014లో ప్రజల్ని ఆకర్షించింది. నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ విజయపతాక ఎగరేయడానికి అది తోడ్పడింది. కానీ ఈ రెండేళ్లలోనూ ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఏమీ లేవు. మన ప్రభుత్వం సంగతలా ఉంచి అంతర్జాతీయంగా కూడా అవసరమైన పురోగతి లేదు. బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందని, తమ వద్ద డబ్బులు దాచుకున్నవారి వివరాలను వెల్లడించాల్సిందేనని 2009లో లండన్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు తీర్మానించింది. అనంతరకాలంలో అనేక దేశాలు తమ తమ చట్టాలను కఠినం చేశాయి. దానికి సమాంతరంగా పన్ను ఎగవేతదారులకూ, నల్లడబ్బు కూడబెట్టేవారికీ ప్రభుత్వాలు తరచు క్షమాభిక్ష పథకాలనూ, ఇతర వెసులుబాట్లనూ కల్పిస్తుంటాయి. కనుక పట్టుబడితే తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం అన్నిచోట్లా ఉంది. నల్లడబ్బు నానాటికీ పెరగడానికి ప్రధాన కారణం ఇదే. మన దేశానికి సంబంధించినంతవరకూ 2004కు ముందున్న నిబంధనలు ఆ తర్వాత సరళం అయ్యాయి. ఏ ప్రయోజనం కోసమైనా మన పౌరులు విదేశాలకు డబ్బు బదిలీ చేయరాదన్న నిబంధన నీరుగారి 25,000 డాలర్ల వరకూ సరళీకృత చెల్లింపు పథకంకింద పంపవచ్చునన్న నిబంధన వచ్చిచేరింది. అలాగే విదేశాల్లో కంపెనీల ఏర్పాటు విషయంలోనూ నిబంధనలు సులభమయ్యాయి. ఫోన్సెకా ద్వారా ఉనికిలోకొచ్చిన 2,14,000 కంపెనీల్లో ఈ బాపతే అధికం. ఇప్పుడు పేర్లు వెల్లడయ్యాక ఏం చేసినా చట్టబద్ధంగానే చేశామని, తమదేమీ తప్పులేదని పలువురు చెబుతుండటానికి కారణం ఇదే. అందులో అవాస్తవమేమీ ఉండకపోవచ్చు. అయితే చట్టబద్ధమైనదంతా నైతికబద్ధం కాకపోవచ్చునని గుర్తించాలి. అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలనూ మింగేస్తున్న నల్లడబ్బును అదుపు చేయాలంటే అందుకు తావిస్తున్న నిబంధనలు మారి తీరాలి. ఈ పని చేయకుండా ఏం చెప్పినా వ్యర్ధమే.