Parvathipuram manyam District Latest News
-
అమలు కాని మంత్రి హామీ
ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనూ ఏఎన్ఎంలను నియమిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. పదవీ బాధ్యతలు స్వీకరించగానే మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే చేశారు. ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఏఎన్ఎంలు లేకపోవడం వల్ల పిల్లలకు తరచూ వైద్యపరీక్షలు జరగడం లేదు. కొన్నిచోట్ల వాచ్మెన్ల కొరత ఉంది. పూర్తిస్థాయిలో నిర్వహణ నిధులూ రాకపోవడంతో కనీస సౌకర్యాలను కల్పించలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు, ముగ్గురు చొప్పున పీడీలుగానీ, పీఈటీలు గానీ ఉండాలి. చాలా చోట్ల ఒక్కరే ఉండటం వల్ల పిల్లలకు ఆటపాటలు ఉండటం లేదు. పర్యవేక్షణ కొరవడుతోంది. -
సమస్యల నడుమ వసతిగృహాలు
వసతిగృహాల్లో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేవు. చాలీచాలని వసతే దిక్కవుతోంది. గదుల్లో ఫ్యాన్లు ఉండటం లేదు. చాలా వరకు అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. ఆర్వో ప్లాంట్లు లేవు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. సాలూరు వంటి ప్రాంతాల్లో సరిపడా డైనింగ్‌హాళ్లు లేవు. వర్షం సమయంలో అక్కడే తినడం, పడుకోవడం. వసతిగృహాలకు ఏఎన్ఎంలను నియమించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలి. – బి.పండు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ ● -
మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024
వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. భవితను బంగారుమయం చేసుకునేందుకు.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వసతిగృహాల్లో చదువులు సాగిస్తున్నారు. వీరికి ప్రస్తుతం భద్రత కరువైంది. వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. అధ్వానంగా ఉన్న పరిసరాలు అస్వస్థతకు గురిచేస్తున్నాయి. ప్రహరీలు లేక విషసర్పాల భయం వెంటాడుతోంది. సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడం, వసతి సమస్యలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు హాస్టళ్లను సోమవారం పరిశీలించిన సాక్షికి సమస్యలే స్వాగతం పలికాయి. న్యూస్‌రీల్ -
ఏకాగ్రతతోనే లక్ష్యాల సాధన
విజయనగరం అర్బన్: ఏకాగ్రతతోనే లక్ష్యాల సాధన సాధ్యమని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్ బీసీ అభ్యర్థులకు అందిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణను కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత జీవితంలో ఉన్నత లక్ష్యాల సాధనపై గురిపెట్టాలన్నారు. ఢిల్లీలో సివిల్స్ శిక్షణకు మన రాష్ట్రం నుంచి వేలాది మంది అభ్యర్థులు వెళ్తున్నా శిక్షణపై ఏకాగ్రత చూపకపోవడడంతో పరీక్షలో విఫలమవుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయ నియామక రాత పరీక్షకు సన్నద్ధమవుతూనే జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలపై దృష్టిపెట్టాలన్నారు. పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో తన అనుభవాలను వివరించారు. పరీక్షలో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన మెలకువలు తెలియజేశారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి పెంటోజీ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 182 మందికి రెండునెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఒక్కో అభ్యర్థికి రూ.వెయ్యి విలువచేసే స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు నెలకు రూ.1,500 స్టైఫండ్‌గా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమాధికారి యశోదరావు పాల్గొన్నారు. బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ప్రారంభోత్సవంలో కలెక్టర్ అంబేడ్కర్ -
కలెక్టర్‌ను కలిసిన డీపీఓ
పార్వతీపురం: జిల్లా పంచాయతీ అధికారిగా టి.కొండలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసి, పంచాయతీలకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శవంతంగా నిలవాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. స్వచ్ఛసుందర పార్వతీపురంలో భాగంగా ప్రతి పంచాయతీలో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. కొండలరావు అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీపీఓగా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. పౌరసరఫరాల గోదాం తనిఖీ సీతంపేట: స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న పౌర సరఫరాల గోదాంను ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలు, రికార్డులు పరిశీలించారు. రేషన్‌డిపోలు, అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా అందివ్వాలని సిబ్బందికి సూచించారు. వర్సిటీ అభివృద్ధే లక్ష్యం ● జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ రాజ్యలక్ష్మి విజయనగరం అర్బన్: యూనివర్సిటీ అభివృద్ధే లక్ష్యమని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీ పేరు ఇనుమడింపజేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. యూనివర్సిటీ సమావేశ మందిరంలో వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్నారు. ప్రయత్నిస్తే సాధించలేనిది లేదని, ప్రతి విద్యార్థికి ఉజ్వల భవితను అందించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ మాట్లాడుతూ సమష్టి కృషితో బాధ్యతగా పనిచేస్తే ప్రమాణాలతో కూడిన విద్యను అందించవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ప్రొఫెసర్ జాస్తి ఆనంద్ చందూలాల్, వర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పార్వతీపురం: మరుగుదొడ్ల వినియోగంపై ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10వ తేదీవరకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్, గృహనిర్మాణం, సూర్యఘర్ తదితర అంశాలపై అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు వినియోగంవల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. మరుగుదొడ్లను వినియోగించేవారికి బహుమతులు, ప్రశాంసా పత్రాలను అందించాలని సూచించారు. దీనికి జిల్లా పంచాయతీ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సౌరఘర్ పథకం కింద సౌరవిద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, ఈఈ వేణుగోపాలనాయుడు, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డుమా పీడీ కె.రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి రామ్‌గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు
పార్వతీపురంటౌన్: రాష్ట్రవిద్యాశాఖ అధికారుల తీరు ఉపాధ్యాయుల మీద కక్ష సాధించుకునే విధంగా ఉందని, అందువల్లనే అనవసరమైన విషయాల మీద చర్చకు తావిస్తూ ఉపాధ్యాయులను బలిపశువులుగా చేస్తున్నారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, బాలకృష్ణ్ణ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత పాఠశాలల పని వేళలు దశాబ్దాల నుంచి రోజుకు 7 గంటల చొప్పున శాసీ్త్రయంగా నిర్ణయించారన్నారు. విద్యార్థులు వారి ఇళ్ల వద్ద చదువుకోవడానికి కూడా వెసులుబాటు కలుగుతుందని, ప్రస్తుతం విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల చదువు పట్ల నిజమైన అపేక్ష ఉంటే ఉపాధ్యాయులను పూర్తిగా బోధనేతర పనులనుంచి మినహాయించి విద్యార్థుల పట్ల వారి నిబద్ధతను, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలలో ఒకే శ్లాబ్‌లో ఇంటి అద్దె అలవెనన్స్ పొందుతున్న ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టడానికి జనాభా ప్రాతిపదికన బదిలీల్లో అసమానత్వాన్ని కలిగించడం అనాలోచిత నిర్ణయమన్నారు. ఇలాంటి అనవసరమైన గందరగోళానికి ఉపాధ్యాయులను గురి కానివ్వకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు -
జాతీయ పోటీలకు జిల్లా బాక్సర్ల ఎంపిక
విజయనగరం అర్బన్: ఆంధ్ర యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన జిల్లా బాక్సింగ్ క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అభినందించారు. ఏయూ స్థాయిలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. 46–48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఎస్.తేజస్వి, 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత ఎ.సాయి, 52 కిలోల విభాగంలో రజత పతక విజేత ఎస్.కే.సుల్తానా, 93 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత జి.లిఖిత్ రెడ్డి జేసీని కలిసి వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని జేసీ అభినందిస్తూ జాతీయస్థాయిలో పంజాబ్‌లో డిసెంబర్ 26 నుంచి జరిగే అఖిల భారత విశ్వవిద్యాలయ బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, బాక్సింగ్ కోచ్ ఈశ్వరరావు పాల్గొన్నారు. అభినందించిన జేసీ సేతు మాధవన్ -
పది, ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: సార్వత్రిక విద్యాపీఠం 2024–25 విద్యా సంవత్సరానికి పదవతరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మంగళవారం నుంచి తత్కాల్ పద్ధతిలో అపరాధ రుసుము రూ.600తో ప్రవేశం పొందవచ్చునని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవేశం కోసం ఆన్లైన్లో రుసుము చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీ అని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.ఇన్/ఏపీ ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించవచ్చాన్నారు. ఏమైనా సందేహాలుంటే ఓపెన్ స్కూల్స్ జిల్లా కో–ఆర్డినేటర్, ఎం. సుధాకర రావు, సెల్ 9848223413 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 20న జిల్లాస్థాయి క్రీడాపోటీలుపార్వతీపురంటౌన్: గిరిజన విద్యార్థులకు ఈనెల 20న జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గయాజుద్దీన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించేందకు చర్యలు చేపట్టామని, ఈ పోటీలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాలీబాల్, ఆర్చరీ, జావెలిన్ త్రో తో పాటు వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఏటీడబ్ల్యూఓ పరిధిలో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే ఈ పోటీలకు అర్హులని స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23 నుంచి 26 వరకు విశాఖపట్నంలో జరగనున్న జన జాతీయ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు తెలియజేశారు.20న ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలుసీతంపేట: జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 20న ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల క్లస్టర్ స్థాయిలో ఎంపికై న వారికి ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి క్రీడలు విశాఖపట్నంలో ఉంటాయని పేర్కొన్నారు. అంతర్ వర్సిటీ క్రాస్‌కంట్రీ పోటీలకు సీతం విద్యార్థి ఎంపికవిజయనగరం అర్బన్: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల స్థాయిలో అథ్లెటిక్స్ విభాగంలోని క్రాస్ కంట్రీ ఈవెంట్లో పదివేల మీటర్ల పోటీలకు పట్టణంలోని గాజులరేగ సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎం.సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహరాష్ట్రలోని నాందేడ్‌లో గల ఎస్ఆర్టీఎం యూనివర్సిటీలో జరిగే పోటీలకు జేఎన్టీయూ జీవీ జట్టు తరఫున యశ్వంత్ పాల్గొంటాడని పేర్కొన్నారు. -
మూడు నామినేషన్ల తిరస్కరణ
సీతంపేట: జీసీసీ ఎన్నికలకు సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. మొత్తం 9 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేయగా వివిధ కారణాల వల్ల బి.కృష్ణారావు, పి.ఆదినారాయణ, పి.సింహాచలంల నామినేషన్ స్క్రూట్నీలో తిరస్కరించామన్నారు. మిగతా ఆరుగురు సభ్యుల్లో చైర్మన్, వైస్‌చైర్మన్, నలుగురు బాడీ మెంబర్లను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలువిజయనగరం క్రైమ్: జిల్లాలోని బూర్జవలస పోలీస్‌స్టేషన్‌లో 2021లో నమోదైన పోక్సో కేసులో నేరం నిరూపణ కావడంతో ముద్దాయి దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ లక్ష్మణరావుకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి మూడేళ్ల జైలుశిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ లక్ష్మణరావు 2021లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక వెంటపడి వేధింపులకు పాల్పడుతూ, కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడ్డాడని బూర్జవలస పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కె.రాజేష్ కేసు నమోదుచేశారు. ఆ కేసు దర్యాప్తు పూర్తయ్యాక నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో సకాలంలో సాక్షులను, ఆధారాలను న్యాయస్ధానంలో ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తిచేసి ముద్దాయిని నిర్ధారించి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో పోలీసుల తరఫున మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మావూరి శంకరరావు వాదనలు వినిపించారు. -
విజేతలకు కలెక్టర్ అభినందన
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన జిల్లా స్థాయిలో పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలను కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ సంయుక్తంగా బాలికా సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ సోమవారం తన చాంబర్లో నగదు బహుమతులు అందజేశారు. ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి విజేతకు రూ.5 వేలు, ద్వితీయ బహుమతి విజేతకు రూ.3 వేలు, తృతీయ బహుమతి విజేతకు రూ.2 వేలు వంతున నగదు బహుమతులు అందజేశారు. వక్తృత్వం పోటీల్లో వి.లతాశ్రీ (బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తవలస), టి.లావణ్య (జెడ్పీహెచ్ వంగర), ఎం.రమ్య (కేజీబీవీ, గుర్ల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వ్యాసరచన పోటీల్లో పి.పరిమళ (ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చీపురుపల్లి), పి.ప్రత్యూశ్రీ (ఏపీమోడల్ స్కూల్, షికారుగంజి), పి.భాగ్యశ్రీ (జెడ్పీ హైస్కూల్, కొట్యాడ), చిత్ర లేఖనంలో ఎం.గౌతమ్ (జెడ్పీ హైస్కూల్, దేవాడ) జి.జ్యోతి (కేజీబీవీ, గుర్ల), జి.మేఘన (బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, కొత్తవలస) వరుసగా మూడుస్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు. -
220 లీటర్ల సారా స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 220 లీటర్ల సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సందర్శన నిమిత్తం ఆదివారం రంగుపురం గ్రామానికి వెళ్తుండగా ఆ మార్గంలో అనుమానాస్పదంగా వస్తున్న ఆటోను తనిఖీ చేసి క్యాన్, రబ్బర్ ట్యూబ్‌లో సారాను గుర్తించినట్లు చెప్పారు. ఆటోలో సారా తరలిస్తున్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయడంతో పాటు ఆటోను, సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలియజేశారు. 40 లీటర్ల సారా పట్టివతే జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాలలో అక్రమంగా సారా అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎస్సై అనీష్ తెలిపిన వివరాల ప్రకారం చినమేరంగి పరిసర ప్రాంతాలలో సారా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడంతో అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తి కలిగి ఉన్న 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
బోగస్ ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలపై విచారణ
సీతంపేట: బోగస్ ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలపై ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి తన చాంబర్లో సోమవారం విచారణ చేసి 5 కేసులను పరిశీలించారు. ఫిర్యాదుదారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరువర్గాల వద్ద ఉన్న ఆధారాలను తనిఖీ చేశారు. అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు. కార్యక్రమంలో డీడీ అన్నదొర, సూపరెంటెండెంట్ దేశ్ తదితరులు పాల్గొన్నారు.గుర్తు తెలియనివ్యక్తి మృతిజామి: మండలకేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులు అందించిన వివరాల ప్రకారం భిక్షాటన చేస్తూ తిరుగుతుండే వ్యక్తి భీమసింగి గ్రామంలో ఆదివారం అనారోగ్యంతో పడి ఉండడంతో స్థానికులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతదేహాన్ని విజయనగరం మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా జామి పోలీస్‌స్టేషన్‌లో సమచారం అందించాలని ఎస్సై వీరజనార్దన్ తెలిపారు. వివాహిత ఆత్మహత్యచీపురుపల్లి: పట్టణంలోని జగన్నాథరాజు కాలనీ వినాయక టవర్స్‌లో నివాసం ఉంటున్న టి.నాగమణి(33) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపారు. మృతురాలి భర్త ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సోమవారం ఇంట్లో అందరూ ఉండగానే క్షణికావేశంలో నాగమణి బెడ్రూమ్లోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మృతురాలికి భర్త ప్రసాద్, బాబు నయాన్ష్, పాప గీతాన్ష్ ఉన్నారు. చికిత్స పొందుతూ యువకుడి మృతివిజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందులూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోటీపరీక్షలకు ప్రిపేరవుతూ తన చిన్నాన్న ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న పెనుమజ్జి అనిల్ కుమార్ (30) ఈ నెల 17న మధ్యాహ్నం బైక్‌పై మార్కెట్‌కు వెళ్తుండగా అయ్యన్నపేట జంక్షన్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద వెనుక నుంచి నిర్లక్ష్యంగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు 108 సాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుని చిన్నాన్న పెనుమజ్జి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ చోరీభోగాపురం: మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న స్టేట్ బ్యాంకు–2 ప్రాంతానికి చెందిన ఆర్ ఉమాదేవి భర్త సొంత పనుల నిమిత్తం ఈనెల 15వ తేదీన పల్సర్ బైక్‌పై బయటకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పాపారావు తెలిపారు. బైక్ చోరీపై కేసు నమోదు వంగర: మండల పరిధిలోని శివ్వాం గ్రామంలో ఏనుగుతల వెంకటనాయుడికి చెందిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని ఎస్సై షేక్ శంకర్ సోమవారం తెలిపారు. వెంకటనాయుడు తన రేకుల షెడ్డులో ఆదివారం రాత్రి పార్కింగ్ చేసిన బైక్ సోమవారం ఉదయం చూసేసరికి లేకపోవడంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోక్సో కేసు నమోదువిజయనగరం క్రైమ్: మండల పరిధిలోని జమ్మునారాయణపురంలో ఏడేళ్ల బాలికపై సోమవారం లైంగికదాడి జరిగింది. దీనికి సంబంధించి విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఒంటరిగా ఉన్న ఏడేళ్ల బాలికపై కన్నేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హుటాహుటిన డీఎస్పీతో పాటు దిశ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేశారు. -
108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొర్లి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005వ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 108 అంబులెన్సు వ్యవస్థ దేశంలోని అత్యున్నతమైన ప్రజాసేవగా గుర్తింపు పొందిందన్నారు. అలాంటి వ్యవస్థను ప్రభుత్వం నేరుగా నిర్వహించకుండా ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల లాభాపేక్ష వల్ల సర్వీసుల నాణ్యత పోతోందని ఆవేదన వెలిబుచ్చారు. అంబెలెన్సుల్లో పనిచేస్తున్న చేస్తున్న కార్మికులు ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ సదుపాయాలు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదని వాపోయారు. వాహనాలు ఫిట్నెస్ లేకపోవడంతో ప్రమాదాలు 108 వాహనాలు ఫిట్నెస్ లేకపోవడం వలన ప్రమాదాలకు గురై అనేకమంది ఉద్యోగులు మరణిస్తున్నారని, వారికి ఎలాంటి పరిహారం ప్రభుత్వం గాని, యాజమాన్యం గాని చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలని, ప్రావిడెంట్ ఫండ్ యాజమాన్య వాటా యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై ఇప్పటికే అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారులు, మంత్రులకు విన్నవించుకున్నామని, అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదని ఇప్పటికై నా 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని, లేనట్లయితే ఈనెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దావాల రమణారావు, వై.మన్మథరావు, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, 108 ఉద్యోగుల సంఘం నాయకులు తెర్లి వెంకటరమణ, తెంటు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షల ప్రారంభం ఈనెల 25 నుంచి సమ్మె స్పష్టం చేసిన ఉద్యోగుల సంఘం -
కోడిపందాల నిర్వహణలో పోలీస్ పాత్రపై విచారణ
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎల్.కోట మండలం భీమాలిలో ఇటీవల కోడిపందాలను నిర్వహించిన వారిపై కేసు నమోదుచేయడంలో అలసత్వం ప్రదర్శించిన సంఘటనలో విచారణ కొనసాగుతుందని, అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరంగా కఠినచర్యలు తప్పవని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 27న ఎల్.కోట మండలం భీమాలి గ్రామశివార్లలో కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, వాహనాలు సీజ్ చేయడం, కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తనకు నివేదిక పంపించారన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఎల్.కోట పీఎస్‌లో అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌పై తక్షణమే సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు వెల్లడైతే వారిపై కూడా క్రమశిక్షణ చర్యలతో పాటూ శాఖాపరమైన కఠినచర్యలు తీసుకుంటామని డీఐజీ స్పష్టం చేశారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి -
వినతులకు కచ్చితమైన పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులకు నాణ్యమైన, కచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఏ రోజు వినతులు ఆ రోజే అధికారులు ఓపెన్ చేయాలని ఎక్కువగా రెవెన్యూకు చెందిన వినతులే వస్తున్నాయని తహసీల్దార్లు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావినతుల పరిష్కార వేదికలో భాగంగా ఈ మేరకు అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు, శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే స్కిల్ సెన్సస్ కూడా ఈ నెల నుంచే జరగాలని అందుకు అవసరమైన మాస్కర్ ట్రైనీలకు శిక్షణ కూడా పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 48 రీచ్‌లు అందుబాటులో ఉన్నాయని ప్రతి రీచ్‌కు ఒక గ్రామ కార్యదర్శిని ఇన్చార్జ్గా నియమించామని, ఉచిత ఇసుకను పొందడానికి కార్యదర్శి దగ్గర నుంచి పొందిన రసీదును తీసుకుని ఇసుకను పొందవచ్చని తెలిపారు. లోకాయుక్త కేసులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించుకోవాలని ఆయా అధికారులకు జేసీ సూచించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి అర్జీదారుల నుంచి మొత్తం 205 అర్జీలు స్వీకరించారు. సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలి విజయనగరం క్రైమ్: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారానికి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 31 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్దగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని ఆదేశించారు. తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.లీలారావు, డీసీఆర్బీ ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జిలాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 156 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి దివ్యాంగులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉప కరణాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ సందర్భంగా పలువురు దివ్యాంగులకు ఉపకరణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన టి.నర్సింహులు, గొర్లె వెంకటరావులకు వినికిడి యంత్రాలు, పార్వతీపురానికి చెందిన కె.మోహన్‌రావుకు మూడు చక్రాల సైకిల్‌ను అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వీసులో మంచి అధికారులుగా గుర్తింపు పొందాలి
విజయనగరం క్రైమ్: పోలీస్‌శిక్షణ కళాశాలలో పూర్తిస్థాయిలో శిక్షణ పొంది సర్వీసులో మంచి అధికారులుగా గుర్తింపు పొందాలని పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు పేర్కొన్నారు. కస్టమ్స్ ఇన్స్పెక్టర్లకు రెండు వారాల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం పీటీసీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పీటీసీలో ఇచ్చిన శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాసిన్ అడిషనల్ డైరెక్టర్ జె.ఎం.కిశోర్ మాట్లాడుతూ మంచి నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన వారితో పీటీసీలో ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారి సర్వీసులో ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కరించిన తీరు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్రిమినల్ లా, 2023 గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. శిక్షణ కాలంలో అవుడోర్ శారీరక శిక్షణతో పాటు, ఆయుధాల మీద శిక్షణ, డ్రిల్, ఫైరింగ్ తదితర వాటిపై శిక్షణ ఉంటుందని చెప్పారు. పీటీసీలో ఽఉన్న అధునాతన డ్రైవింగ్ సిమిలేటర్, ఫైరింగ్ సిమిలేటర్పై శిక్షణ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో నాసిన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.గిరిధర్, వైస్ ప్రిన్సిపాల్ పీవీ.అప్పారావు, డీఏపీ టి.రమేష్, ఇండోర్, అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు -
పోరాటానికి సిద్ధం
బొబ్బిలి: పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల మహాసభ ఆదివారం జరిగింది. సభలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి మాట్లాడుతూ విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు సమష్టిగా చేసేందుకు సిద్ధమన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. మహాసభలో యూటీఎఫ్ కార్యవర్గ సభ్యుడు ఆనెం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీ ఈశ్వరరావు, జిల్లా సహాధ్యక్షుడు ప్రసన్నకుమార్, కార్యదర్శి కేశవరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిర్బంధ అరెస్టును ఖండించిన వీఆర్ఏల సంఘం
వేపాడ: నిబంధనలకు విరుద్ధంగా అదనపు విధులు నిర్వహించలేమని తమ సమస్యలు చెప్పుకునేందుకు చలో సీసీఎల్ఏ కార్యక్రమం చేపడితే ప్రభుత్వం నిర్బంధంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు వెంకన్న అన్నారు. ఈ నెల 18న నిర్వహించే చలో సీసీఎల్ఏ రాయబారం కార్యక్రమానికి వెళ్లకుండా వల్లంపూడి పోలీసులు ఆదివారం తనను అరెస్టు చేయడం దారుణమని వాపోయారు. వీఆర్ఏలకు అదనంగా అప్పగిస్తున్న ఇసుక ర్యాంపులు, రైస్‌మిల్లుల డ్యూటీలు రద్దుచేయాలని, తెలంగాణలో అమలయ్యే విధంగా పేస్కేల్ వర్తింపచేయాలని, అటెండర్, వాచ్మెన్, రికార్డు అసిస్టెంట్, తదితర పోస్టుల్లో అర్హులైన వీఆర్ఏలను నియమించాలని తదితర డిమాండ్లతో 18న శాంతియుతంగా మంగళగిరి సీసీఎల్ఏతో సామూహిక రాయబారం కార్యక్రమం నిర్వహించ తలపెట్టామన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా శుక్రవారం సాయంత్రం నుంచి బెదిరింపులు ప్రారంభించి ఆదివారం నిర్బంధంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా రాష్ట్ర సంఘం తరపున ఖండిస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గడిచిన మూడునెలలుగా సీఎం, రాష్ట్ర రెవెన్యూ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి, భూపరిపాలన ముఖ్యకార్యదర్శలను పలుమార్లు కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. శాంతియుతంగా చేపట్టిన రాయబారి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నిర్బంధ అరెస్టుచేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. -
12 కేసుల్లో నిందితుడిపై పీడీయాక్ట్
విజయనగరం క్రైమ్: గడిచిన మూడేళ్లలో 12 కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయిన 22 ఏళ్ల బండి రాజీవ్ అలియాస్ డాడీపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎస్పీ వకుల్ జిందాల్ పీడీయాక్ట్ అమలుచేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయిన పట్టణశివారు పూల్‌బాగ్ కాలనీకి చెందిన బండి రాజీవ్ అలియాస్ డాడీ అనే 22 ఏళ్ల వ్యక్తిపై పీడీయాక్ట్ ప్రయోగించి ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్బంధించి, విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ తెలిపారు. చెడువ్యసనాలకు అలవాటు పడి, ప్రజల పట్ల అహంకారంతో దురుసుగా ప్రవర్తిస్తూ, ఇతరులకు హానికలిగించే విధంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, గత మూడేళ్లలో విజయనగరం వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలో 12 కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయ్యాడని వివరించారు. నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా పీడీయాక్ట్‌ను అమలుచేయాలని కోరుతూ టూటౌన్ పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. వాటిని సిఫార్స్ చేస్తూ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. వివిధ క్రిమినల్ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ -
బాబూ.. మా జాబేది!
ఏరు దాటినంత వరకు ఏటి మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న చందాన వ్యహరిస్తోంది కూటమి ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశతో ఎడాపెడా హామీలు గుప్పించిన కూటమి నాయకులు..తీరా అధికారం చేపట్టాక తామిచ్చిన హామీలు మరిచిపోయినట్లు..తమకేమీ సంబంధం లేనట్లుగా నడుచుకుంటూ ఓట్లు వేసిన ప్రజలను అపహాస్యం చేస్తున్నారని జిల్లా ప్రజలు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. –పార్వతీపురంటౌన్ నిరుద్యోగ యువతపై సర్కారు చిన్న చూపు చూస్తోంది. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆంతవరకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టకపోవడంతో యువతలో ఆందోళన నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువతలో కొందరు ఉద్యోగం లేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటనలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి కోసం జిల్లాలోని యువత ఎదురు చూస్తోంది. జాబ్ క్యాలెండర్‌పై యువకులు గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబునా యుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంతవరకు ‘నిరుద్యోగ భృతి’ ఇవ్వాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని జిల్లాలోని సుమారు 98వేల కుటుంబాల్లో గల నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపక పోవడంతో నిరుద్యోగులంతా ఆవేదనలో ఉన్నారు. అలాగే వలంటీర్ల విధులపై స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లావ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య మరో 5,678 మందికి పెరిగింది. మేనిఫెస్టోలో టాప్‌లో.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మోసం చేస్తారా? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టేవరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నాయకులు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అదే ప్రధానహామీగా పదే పదే ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టాక అయితే అసెంబ్లీ బడ్జెట్లో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధివిధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించలేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014–19లో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఐదేళ్లు పబ్బం గడుపుకుని మొండి చెయ్యి చూపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృమవుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువతపై సర్కారు చిన్నచూపు నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం వలంటీర్ల తొలగింపుతో మరింత పెరిగిన నిరుద్యోగం ఉద్యోగాలు లేక యువకుల ఆందోళన ఇద్దరు నిరుద్యోగుల ఆత్మహత్యాయత్నం జిల్లాలో 98 వేల మంది నిరుద్యోగులు అదే రోజున జియ్యమ్మవలస మండలంలోని చినకుదమ గ్రామానికి చెందిన జయ చంద్రబాబు బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు మోటార్ సైకిల్‌పై జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ నెల 12న పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఎమెస్సీ, బీఈడీ చదివాడు. ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. -
పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారిగా రామ్‌గోపాల్
పార్వతీపురం: సెట్విజ్ సీఈఓ బి.రామ్‌గోపాల్‌ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) జిల్లా నోడల్ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు చేశారు. ప్రభుత్వం పీజీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఇన్న నేపధ్యంలో నోడల్ అధికారిగా తనపై కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారని, అంకిత భావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని రామ్‌గోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. స్వచ్ఛ సుందరంగా పార్వతీపురం అభివృద్ధి ● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పార్వతీపురం: జిల్లాకేంద్రం పార్వతీపురం పట్టణాన్ని స్వచ్ఛ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన కలెక్టరేట్ నుంచి స్వచ్ఛ సుందర పార్వతీపురంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రతకు మారుపేరుగా పార్వతీపురాన్ని నిలపాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికారులు పట్టణంలోని ఒక్కో కూడలిని దత్తత తీసుకుని సామాజిక బాధ్యతగా అభివృద్ధి చేయాలని సూచించారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 21న జిల్లా దివ్యాంగుల రాష్ట్ర క్రికెట్ జట్టు ఎంపికపార్వతీపురంటౌన్: ఈ నెల 21 జిల్లా దివ్యాంగుల రాష్ట్ర క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు దివ్యాంగుల క్రికెట్ క్రీడాభివృద్ధి రాష్ట్ర సెక్రటరీ నాగురు హుస్సేన్ రాజా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తొలిసారిగా డిసెంబర్ 8వ తేదీ నుంచి 11 వరకు విశాఖపట్నంలోని గాజువాకలో గల హిందుస్థాన్ జింక్ మైదానంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా జట్టు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జట్టు ఎంపికకు వచ్చే క్రీడాకారులు తెల్ల దుస్తులతో హాజరు కావాలని కోరారు. ఆసక్తి గల దివ్యాంగ క్రీడాకారులు పార్వతీపురంలో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో 9 గంటలకు హాజరు కాగలరని తెలిపారు. ఆధార్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేశారు. ఆసక్తిగల క్రీడాకారులు మరిన్ని వివరాలకు ఫోన్ 85009 98512, 9959078682, 6374743730నంబర్లను సంప్రదించాలని సూచించారు. గిరిజన హక్కులు కాపాడాలి ● గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పార్వతీపురంటౌన్: జీఓ నంబర్ 3 పునరుద్ధరణ, 1/70,పీసా చట్టం పక్కాగా అమలు చేసి, గిరిజన చట్టాలు, గిరిజన హక్కులు కాపాడాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు నష్టం చేసే నిర్ణయాలు, ఆలోచనలు మానుకోవాలని కోరారు. జిల్లా ఏర్పాటైన తర్వాత పార్వతీపురం ఐటీడీఏ మనుగడ ప్రశ్నర్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ నంబర్ 3 పునరుద్ధరణకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ‘అపార్’ నమోదులో అవస్థలు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అపార్ ప్రక్రియ నమోదుకు గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని, ఆ అవస్థలు తీర్చి ప్రక్రియ సులువుగా, సక్రమంగా జరిగేలా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అపార్ ప్రక్రియ గిరిజన విద్యాసంస్థల్లోనే నేరుగా జరిగే విధంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన సీపీఎం జిల్లా మహాసభలు
● జిల్లా కార్యదర్శిగా తమ్మినేని సూర్యనారాయణ ● 14 మందితో జిల్లా కమిటీ ఎన్నికవిజయనగరం పూల్‌బాగ్: విజయనగరం జిల్లా సీపీఎం కార్యదర్శిగా తమ్మినేని సూర్యనారాయణ ఎన్నికయ్యారు. నగరంలోని ఏచూరినగర్లో గల బుద్ధదేవ్ భట్టాచార్య, రుద్రరాజు సత్యనారాయణ ప్రాంగణంలో రెండురోజులుగా జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు జరిగిన ప్రతినిధుల సభలో 14 మందితో ఏర్పాటైన నూతన జిల్లా కమిటీలో జిల్లా కార్యదర్శిగా తమ్మినేని సూర్యనారాయణను మళ్లీ మహాసభ ఎన్నుకుంది. కార్యదర్శివర్గ సభ్యులుగా రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, పి.శంకర్రావు, వి.లక్ష్మి ఎన్నిక కాగా, జిల్లా కమిటీ సభ్యులుగా ఎ.జగన్మోహన్రావు, జి.శ్రీనివాస్, గాడి అప్పారావు, పి.రమణమ్మ, కె.సురేష్, సీహెచ్ వెంకటేష్, వీఆర్ గోపాల్, బి రాంబాబు ఎన్నికయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వై.వెంకటేశ్వరరావు, లోకనాథం, రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యారావు పాల్గొన్నారు. -
మహిళల్లో పెరుగుతున్న రక్తహీనత
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఇటీవల కాలంలో బాలికలు, గర్భిణులు, సాధారణ మహిళల్లో కూడా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గర్భిణులైతే ప్రసవ సమయంలో రక్తం కోసం అవస్థలు పడుతున్నారు. అదే గ్రూపు రక్తం అందుబాటులో ఉంటే పరవాలేదు... లేదంటే ఇబ్బందులే.. బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. బాలికలు రక్తహీనత వల్ల రుతుస్రావం సమయంలో ఇబ్బంది పడుతున్నారు. రక్తహీనత వల్ల సాధారణ మహిళలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.వేలాది మంది బాలికల్లో రక్తహీనతజిల్లాలో వేలాది మంది బాలికల్లో రక్తహీనత ఉన్న ట్టు నిర్ధారణ అయింది. రక్తహీనత వల్ల బాలికలు అనారోగ్యం పాలవుతున్నారు. పలు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. 10 నుంచి 19 ఏళ్లలోపు బాలికల్లో ఎక్కువగా రక్తహీనతకు గురవుతున్నారు. బాలికల్లో రక్తహీనత అనేది ప్రధాన సమస్యగా మారింది.కారణాలు ఇలా..కడుపులోకి నులి పురుగులు చేరడం వల్ల అవి రక్తా న్ని పీల్చి తాగేయడం వల్ల రక్తహీనతకు గురవుతా రు. బహిరంగ మల విసర్జన వల్ల, చెప్పులు లేకుండా నడవడం వల్ల, మట్టిలో ఆడటం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని తాగేయడం వల్ల రక్తహీనత బారిన పడతారు. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల కూడా రక్తహీనత బారిన పడతారు.సగం మంది బాలికల్లో రక్తహీనతజిల్లాలో 10 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు 53,856 మంది ఉన్నారు. వీరిలో 20,484 మంది బాలికలు బడిబయట ఉన్నారు. 52,914 మంది బాలికలకు వైద్య సిబ్బంది హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించా రు. ఇందులో 26,457 మందికి రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. రక్త పరీక్షల నిర్వహించిన వారిలో సగం మందికి రక్తహీనత ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశం.హెచ్‌బీ శాతాన్ని బట్టి చికిత్సహిమోగ్లోబిన్ (హెచ్‌బీ) శాతాన్ని బట్టి రక్తహీనత ఉన్న వారికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తారు. హెచ్‌బీ 7 గ్రాముల్లోపు ఉంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకి 2 చొప్పున అందిస్తారు. 8 నుంచి 11 గ్రాముల్లోపు ఉంటే రోజుకి ఒక మాత్ర చొప్పన అందిస్తారు. మాత్రలతో రక్తహీనత నివారణ కాదనుకుంటే ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్ ఎక్కిస్తారు. హెచ్ బీ నాలుగైదు గ్రాములు ఉన్న వారికి రక్తం ఎక్కిస్తారు.చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలురక్తహీనత వల్ల తరుచూ అనారోగ్యం బారిన పడతా రు. ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంది. రక్తహీనత వల్ల తరుచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, నిద్ర పట్టకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం జరు గుతుంది. ఛాతిలో నొప్పి, వేగంగా గుండె కొట్టుకో వడం, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, చిన్నచిన్న పనులకే నీరస పడడం జరుగుతుంది. చేసే పని పట్ల ఆసక్తి ఏకాగ్రత లేకపోవడం, నాలుక నొప్పి, చర్మం పాలిపోయినట్లు కనిపించడం జరుగుతుంది. రుతుచక్రంలో అసమానతలు రావడం జరుగుతుంది.చర్యలు తీసుకుంటున్నాం..బాలికలు, గర్భిణులు, సాధారణ మహిళల్లో రక్తహీనత నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటు న్నాం. పాఠశాలల్లో హెచ్‌బీ పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారికి రక్తం పెరిగేందుకు చర్య లు చేపడుతున్నాం. గర్భిణుల్లో హెచ్‌బీ నివారణకు ఐరన్ మాత్రలు అందిస్తున్నాం. సుక్రోజ్ ఇంజక్షన్లు ఎక్కిస్తున్నాం. ఇంకా అవసరమనుకుంటే ఆస్పత్రుల్లో చేర్పించి రక్తంఎక్కిస్తున్నాం.– డాక్టర్ రాణి, డీఎంహెచ్ఓ -
అరకు అందాలు ప్రత్యేకం
డుంబ్రిగుడ: మన్యంలో అరకు అందాలు ప్రత్యేకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎం.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో అరకు పైనరీని సందర్శించారు. మేనేజర్ శేఖర్ వారికి ఘన స్వాగతం పలికారు. పైనరీలో వనాల అందాలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరకులోయ ప్రాంతంలో అద్భుత ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నారు. తమను ఈ అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. పైనరీని పరిశుభ్రంగా ఉంచిన ఉద్యోగులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులతో సిబ్బంది ఫొటోలు దిగారు. అనంతరం అరకు లోయలో గిరిజన మ్యూజియాన్ని కుటుంబ సభ్యులతో కలెక్టర్ సందర్శించారు. పార్వతీపురం మన్యం కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ -
●చివరి ప్రయత్నం
కుమ్మరిగుంటలో టమాటో, అరటి తోటల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపుకొమరాడ: ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే చేతికి వచ్చే సమయంలో గజరాజుల గుంపు సంచారంతో పంటనాశనం అవుతోందని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా ఏనుగులు ఆర్తాం కొండపైకి వెళ్తాన్నాయి. రాత్రిపూట పంటపొలాల్లో సంచరిస్తున్నాయి. పదిహేను రోజులుగా కుమ్మరిగుంట, కందివలస గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. అయితే కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట, గంగిరేగువలస, స్వామినాయుడు, కందివలస, కళ్లికోట, దుగ్గి, గుణానుపురం తదితర గ్రామల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది టమాటో, క్యాబేజీ, చిక్కుడు, వంగతో పాటు జామ, బొప్పాయి, అరటి లాంటి వాణిజ్యి పంటలు పండుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో గజరాజులు పొలాల్లో సంచరించడం వల్ల పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించే ఏర్పాట్లు అధికారులు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోని అటవీశాఖ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాత