Passwords
-
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్‌గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్‌కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్‌ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్‌ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్‌ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్‌లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్‌టెన్షన్స్‌ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్‌ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్‌ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్‌లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్‌ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్‌కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
చొరబడితే చేసేదేంటి?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ తర్వాత విద్యాశాఖలో కలవరం మొదలైంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడి ఉన్న ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి, పాఠశాల విద్యలో సాంకేతిక భద్రత ఏ మేరకు ఉందనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వాస్తవానికి విద్యా వ్యవస్థలో పరీక్షల దగ్గర్నుంచీ, పాలనపరమైన విధానాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ప్రతి సందర్భంలో ఏదో ఒక సమస్య తలెత్తుతున్నా, దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లడమే తప్ప ఇప్పటివరకు అందుకు మూల కారణాలను అన్వేషిం చిన దాఖలాల్లేవు. పలు కీలకమైన సందర్భాల్లో సర్వర్లు మొరాయించడమో, ఇతర సాంకేతిక పరమైన సమస్యలు రావడమో జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో బయట వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్నారు కానీ సొంత సంస్థల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితి భవిష్యత్‌లో తమకూ ఇబ్బంది కలిగించవచ్చనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎదురైన సవాళ్ళపై అంతర్గత సమీక్ష చేపట్టారు. పాఠశాల విద్యలో పలుమార్లు సమస్యలు.. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. టెన్త్ పరీక్షలు రాసే వాళ్లు ఏటా దాదాపు 5 లక్షల మంది వరకు ఉంటారు. టీచర్లు 1.05 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు, ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులన్నీ ఈ ఫైలింగ్ ద్వారానే భద్రపరుస్తారు. ఇంత ముఖ్యమైన శాఖలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా చూస్తుంటారు. శాశ్వత ఐటీ నిపుణులంటూ ఎవరూ లేరు. చిన్నచిన్న సమస్యలను కాస్తోకూస్తో కంప్యూటర్, సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్న విద్యాశాఖ సిబ్బందే పరిష్కరిస్తుంటారు. గోప్యంగా ఉండాల్సిన ఫైళ్ళు, ప్రశ్నపత్రాలకు సంబంధించిన కీలక పాస్వర్డ్స్ అన్నీ ముఖ్యుల పర్యవేక్షణలో ఉంటాయి. అయితే ఫైర్‌వాల్స్, రక్షణ వ్యవస్థ మాత్రం వీళ్ళలో చాలామందికి తెలియదు. గత ఏడాది టెట్ నిర్వహించినప్పుడు అనేక తప్పులు దొర్లాయి. 317 జీవోతో జరిగిన బదిలీల సమయంలోనూ రకరకాల తప్పులు బయటకొచ్చాయి. వీటిని సరిచేయడానికి కొన్ని నెలలు పట్టింది. కీలక సమాచారం భద్రతకు వాడే ఫైర్‌వాల్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే వ్యక్తుల సమగ్ర సమాచారం కూడా అధికారుల వద్ద లేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పాస్వర్డ్స్ బయటకెళ్తే సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యలోనూ డొల్లే.. దేశ, విదేశాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ సరి్టఫికెట్లు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటివి ముద్రించే గ్యాంగ్‌లను పట్టుకున్నారు. అయినా ఇవి ఆగడం లేదు. ఏకంగా వర్సిటీల వెబ్‌సైట్లలోకే హ్యాకర్స్ ప్రవేశించే ప్రయత్నం జరిగిందనే వార్తలూ వచ్చాయి. కాగా నకిలీ సర్టఫికెట్ల అదుపునకు పోలీసులు, ఉన్నత విద్యా మండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. విద్యార్థులకు సంబంధించిన కొన్నేళ్ళ సరి్టఫికెట్లను ఈ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే ఈ వెబ్సైట్ ప్రారంభం సందర్భంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి.. ఇలాంటి వెబ్సైట్లకు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రత ఉండాలని సూచించారు. ఉన్నత విద్యా మండలిలో కేవలం ఒకే ఒక వ్యక్తి, అదీ అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటికీ కీలక సమాచారం, గోప్యంగా ఉండాల్సిన పాస్ట్‌వర్డ్స్ భద్రతకు మండలిలో గానీ, విశ్వవిద్యాలయాల్లో గానీ సరైన వ్యవస్థ లేదని అధికారులే అంటున్నారు. -
‘పబ్లిక్ వైఫై’ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా...నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ మొదలు..ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.. అయితే ఇకపై పబ్లిక్ వైఫైలు వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం,, ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లోని వైఫై వాడినట్లయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారం సైతం కొట్టేసే ప్రమాదం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పబ్లిక్ వైఫై వాడకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నమ్మదగిన వీపీఎన్(వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్)ను ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. వీపీఎన్ ఉండడం వల్ల మన ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. -
టాప్ 10 పాస్వర్డ్స్: మీరు ఇలాంటి పాస్వర్డ్లు వాడటం లేదు కదా?
ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్వర్డ్స్. ఆ టాప్‌టెన్ జాబితాను నార్డ్‌పాస్ సంస్థ ప్రచురించింది. ఈజీగా గుర్తుండటం కోసం బలహీనమైన పాస్వర్డ్స్ వాడుతున్నారని నిర్వాహక సంస్థ తెలిపింది. ఇందులో తొలిస్థానంలో ఉన్న Passwordను పాస్‌వర్డ్‌గా 34లక్షల సార్లు ఉపయోగించారు. ఈ జాబితాలో ఉన్న బిగ్‌బాస్కెట్ అనే పాస్‌వర్డ్‌ను కేవలం 5 నిమిషాల్లోనే క్రాక్ చేశారు. దీన్ని జనం 75 వేల సార్లు ఉపయోగించడం విశేషం. అందుకే కఠినమైన పాస్‌వర్డ్‌ను వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ మీరు ఇలాంటి ఈజీ పాస్వర్డ్లు వాడటం లేదు కదా? ♦Password ♦123456 ♦12345678 ♦bigbasket ♦123456789 ♦pass@123 ♦1234567890 ♦anmol123 ♦abcd1234 ♦googledummy -
ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ: సైబర్ దాడులనుంచి రక్షణ, ఇతర సెక్యూరిటీ నిమిత్తం పాస్వర్డ్స్ చాలా కీలకం. సోషల్ మీడియా అకౌంట్స్ ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే పటిష్ట పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోవాలని అందరికీ తెలుసు. అయినా నిర్లక్క్ష్యమే. బలహీనమైన లేదా సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, చాలా కీలకమైన ఫైనాన్షియల్ డేటాను కూడా హ్యాకర్లు ఈజీగా తస్కరించే అవకాశం ఉంది. ప్రతీ ఏడాది లాగానే 2022లో కూడా యూజర్లు చాలా బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని తాజాగా సర్వేలో తేలింది. అందులోనూ భారతీయులు ఇంకా బలహీనమైన పాస్వర్డ్స్ఉపయోగిస్తున్నారని NordPass-2022 అధ్యయనం తేల్చింది. ఆశ్చర్యకరంగా ఏకంగా 75వేల మంది భారతీయులు బిగ్‌బాస్కెట్ అనే పాస్‌వర్డ్‌ను మందికి పైగా భారతీయులు ఉపయోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు ‘‘పాస్వర్డ్" అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. భారతదేశంలో దాదాపు 3.5 లక్షల మంది సైన్ అప్ చేయడానికి పాస్‌వర్డ్‌గా “పాస్వర్డ్”ని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఇండియాతో దాదాపు 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది. ఈ సంవత్సరం టాప్ 10 అత్యంత సాధారణ పాస్వర్డ్లు 123456, bigbasket, పాస్వర్డ్, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy. వీటితోపాటు గెస్ట్, వీఐపీ, 123456 లాంటి పాస్‌వర్డ్‌లను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది, పాస్వర్డ్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ♦ వినియోగదారులు ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి, లేదంటే పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడం, హ్యాక్ చేయడం, యాక్సెస్ చేయడం హ్యాకర్‌కు ఈజీ అవుతుంది. ♦ పుట్టిన రోజులు, పెళ్లి రోజులను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోకుండా ఉండటం మంచింది. (ఈజీగా గుర్తు ఉంటుందని దాదాపు అందరూ అలానే చేస్తారు) అలాగే అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లతో పాస్వర్డ్ కూర్చుకుంటే మంచిదని నిపుణుల సూచన. ♦ప్రతి నెలా పాస్‌వర్డ్‌ను అప్డేట్ చేయడం బెటర్. హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం మంచి పద్ధతి. -
కస్టమర్స్‌కి షాక్ ఇవ్వబోతున్న నెట్‌ఫ్లిక్స్
-
ఇష్టానుసారంగా ఆన్లైన్ సేవలు.. మీ పాస్వర్డ్ ఎంత సేఫ్.. ఇలా చేశారంటే!
Cyber Crime Prevention Tips: ఇ–మెయిల్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్, ఫైల్ షేరింగ్, ఇ–కామర్స్.. ఇలా ప్రతిదానికి రకరకాల పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటాం. వాటిలో సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడం, నిర్వహించడం కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ, ఈ రోజుల్లో సేఫ్టీ పాస్వర్డ్ మేనేజ్మెంట్ను సరిగ్గా నిర్వహించకపోతే చిక్కులు తప్పవు. డిజిటల్ చెల్లింపులు పెరిగిన ఈ రోజుల్లో పాస్వర్డ్ నిర్వహణ లోపిస్తే అధికమొత్తంలో నగదును నష్టపోవాల్సి రావచ్చు. వీరిలో గృహిణులు, వయోజనుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు నివేదికలు కూడా ఉన్నాయి. తమ పాస్‌వర్డ్‌ను ఇతరులకు చెప్పడం ఎంత నష్టమో, సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అకౌంట్స్‌ను నిర్వహించడం కూడా అంతే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఆన్లైన్ సేవలు పొందేవారు ఇష్టానుసారంగా కాకుండా తప్పనిసరి భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి. పటిష్టం చేసే విధానం... పాస్‌వర్డ్‌లో కనీసం 8 అక్షరాలు ఉండాలి. లాగిన్ చేసిన ప్రతి సైట్‌కి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి బేస్, పిన్ విధానాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. ఉదాహరణకి.. primevideo.com ని లాగిన్ చేస్తున్నారనుకుంటే దానికి బేస్ 'rime@', పిన్ ’'home@321' సెట్ చేసుకోవచ్చు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి పాస్వర్డ్ జనరేటర్ సాధనాన్ని ఉపయోగించవచ్చు. వీటిలో చాలా వరకు సర్వీస్ ప్రొవైడర్లు డిఫాల్ట్‌గా అందిస్తాయి. పాస్వర్డ్ మేనేజర్ అప్లికేషన్లు, ఆన్లైన్ సేవల కోసం, పాస్‌వర్డ్‌లను నిల్వ చేయడానికి, రూపొందించడానికి, నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించే ప్రోగ్రామ్ పాస్వర్డ్ మేనేజర్. పాస్‌వర్డ్‌లను రూపొందించడంలో, తిరిగి పొందడంలో, వాటిని ఎన్క్రిప్టెడ్ డేటాబేస్‌లో నిల్వ చేయడం, డిమాండ్‌పై ఉపయోగించడంలో ఇది సహాయం చేస్తుంది. అత్యున్నత స్థాయి భద్రతను అందించే చాలా సేవలు ఆర్మీ గ్రేడ్ ఎఇఎస్256–ఎన్క్రిప్షన్ని కలిగి ఉంటాయి. మూడు రకాల పాస్వర్డ్ మేనేజర్లు... 1. ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్. 2. ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఏదైనా కంప్యూటర్ లేదా పరికరం నుండి యాక్సెస్ చేయవచ్చు. మీ ఆధారాలను నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. 3. మీ ఆధారాలను నిల్వచేయడానికి హార్డ్‌వేర్ పరికరంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది. పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించడం వల్ల... 👉🏾మీ అన్ని ఆధారాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 👉🏾నకిలీ లాగిన్ సందర్భంలో మీకు సమాచారం తెలియజేస్తుంది. 👉🏾మీ ఆధారాలను సులభంగా మార్చుకోవచ్చు. 👉🏾ఇతర గ్యాడ్జెట్స్లోనూ ఒకే పాస్‌వర్డ్‌ను నిర్వహించవచ్చు. కొన్ని ప్రముఖ పాస్వర్డ్ మేనేజర్లు (a)lastpass.com (b) keepass.info (c) keepersecurity.com (d) pwsafe.org (e) dashlane.com రెండు కారకాల ప్రమాణీకరణ 👉🏾రెండు దశలు లేదా ద్వంద్వ కారకాల ప్రమాణీకరణగా కూడా సూచిస్తుంది. ఇది భద్రతా ప్రక్రియ. దీనిలో వినియోగదారులు యాక్సెస్‌ని «ధ్రువీకరించడానికి రెండు వేర్వేరు ప్రమాణీకరణ కారకాలను అందిస్తారు. 👉🏾2ఎఫ్ఎ ఫిషింగ్ వ్యూహాలను ఉపయోగించి పరికరాలు లేదా ఆన్లైన్ ఖాతాల వివరాలను సేకరించి, దాడి చేసేవారికి కష్టంగా ఉండేలా ప్రామాణీకరణ ప్రక్రియకు అదనపు భద్రతను జోడిస్తుంది. 👉🏾ప్రతి 30 సెకన్లకు కొత్త సంఖ్యా కోడ్‌ను అందించే హార్ద్‌వేర్ సాధనాలను హార్డ్‌వేర్ టోకెన్ అంటారు. 👉🏾ఎసెమ్మెస్ టెక్ట్స్ మెసేజ్, వాయిస్ ఆధారిత సందేశం ద్వారా వినియోగదారునకు ఓటీపీ పంపుతుంది. 👉🏾సాఫ్ట్వేర్ టైమ్ ఆధారంగా జనరేట్ అయ్యే టివోటీపి పాస్‌కోడ్ కూడా పంపుతుంది. ∙పోర్టల్స్, అప్లికేషన్లు వినియోగదారునకు ఒక ఫుష్ నోటిఫికేషన్‌ను ప్రామాణీకరణగా పంపుతాయి. ఇక్కడ వినియోగదారుడు ఒకే టచ్‌తో యాక్సెస్‌ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండు దశల ధ్రువీకరణ 👉🏾వినియోగదారుడి గ్యాడ్జెట్‌కు పంపిన పాస్వర్డ్, ఓటీపీ రెండింటినీ నమోదు చేయాలి. రెండు కారకాల ప్రామాణీకరణలో ఉపయోగించిన పద్ధతులలో ఫేసియల్ స్కాన్ టెక్నాలజీతో ఉంటాయి. అలాగే, వీటిని వేలిముద్ర స్కాన్‌తో యాక్సెస్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి... మీ లాగిన్ ఆధారాలను నోట్‌బుక్‌లో రాసుకొని, ట్రాక్ చేసుకోవచ్చు. ∙మీ పాస్వర్డ్లు దొంగిలించబడ్డాయో లేదో ఈ కింది వెబ్సైట్లలో తనిఖీ చేసుకోవచ్చు. (a) passwords.google.com (b) haveibeenpwned.com (c) snusbase.com (d) avast.com/hackcheck 👉🏾మీ పాస్‌వర్డ్‌లో సాధారణ పదాలు, అక్షరాల కలయికలు లేకుండా చూడాలి. అంటే– పాస్వర్డ్, వెల్కమ్, సిటీ నేమ్, పెట్ నేమ్, ఇంటిపేరు... మొదలైనవి. 👉🏾పాస్వర్డ్ పొడవు 8 అక్షరాల్లో ఉండాలి. 👉🏾ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు, పెద్ద అక్షరాలను ఉపయోగించాలి. 👉🏾ప్రతి మూడు నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌ని మార్చుకుని, రీ సెట్ చేసే అలవాటును పెంచుకోవాలి. 👉🏾మీ పాస్‌వర్డ్‌లను రీ సైకిల్ చేయవద్దు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించమని అడిగిన ప్రతిసారి కొత్త సిరీస్‌ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. 👉🏾ఎసెమ్మెస్ ధృవీకరణతో రెండు కారకాల ప్రమాణీకరణ (2ఎఫ్ఎ) ఉపయోగించాలి. 👉🏾పెయిడ్ పాస్వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించడం మేలు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్వర్డ్ అవసరం లేదు!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నెటిజన్లు రోజులో కనీసం 4-5 గంటలు ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు, మనం ఎంత విపరీతంగా ఇంటర్నెట్ వాడుతున్నాము అనేది. అయితే, ఈ ఇంటర్నెట్ వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. మన డేటాను రక్షించుకోవడం కోసం ప్రతి ఖాతాకు పాస్వర్డ్ పెట్టుకుంటున్నాం అనే విషయం అందరికీ తేలిసిందే. ఇలా, పెట్టుకున్న ఖాతా వల్ల మన డేటాకు ఎంత వరకు భద్రత లభిస్తుంది అంటే ఎవరు చెప్పలేము. ఏటా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు కొన్ని సార్లు డేటాను క్లిష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాస్వర్డ్లు ఒక్కోసారి గురుణచుకోవడం కష్టం. హ్యాకింగ్ భారీ నుంచి తప్పించుకోవడానికి తరచుగా పాస్వర్డ్ మార్చాల్సి ఉంటుంది. అలా చాలా తక్కువ మంది మాత్రమే క్రమం తప్పకుండా పాస్వర్డ్ మారుస్తూ ఉంటారు. మనం ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్ ఒక నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు జరుగుతున్నాయి. ఇక నో పాస్వర్డ్ మన సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలకు పాస్వర్డ్ పెట్టుకుంటే ఒక భాద, పెట్టుకోకపోతే ఒక భాద. మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఖాతాలకు పాస్వర్డ్ కాకుండా మరో ప్రత్యామ్నాయం అవసరమా అంటే, ప్రతి ఐదుగురిలో ఒకరు "అవును" అని సమాధానం అని ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఈ పాస్వర్డ్ కష్టాలు, హ్యాకింగ్ భాదల నుంచి తప్పించుకోవడానికి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఇకపై పాస్వర్డ్స్లేకుండా మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో, ఖాతాలో లాగిన్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ దృష్టిసారించింది. పాస్వర్డ్స్లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ అథేంటికేటర్ యాప్, విండోస్ హలో, లేదా వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. (చదవండి: ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు గజగజ..! వారికి మాత్రం కాసుల వర్షమే..!) ఈ లాగిన్ ఫీచర్ విధానంతో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన యాప్స్‌కు వర్తించేలా చేయనుంది. అందులో అవుట్ లుక్ ,వన్‌డ్రైవ్ , మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్స్ లేకుంగా లాగిన్ అయ్యే ఫీచర్‌ను 2019లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కమర్షియల్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్లు యూజర్లు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆప్షన్లో, అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్స్‌లో పాస్‌వర్డ్‌లెస్ అకౌంట్ ఆప్షన్‌ను టర్నఆన్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ అథేంటికేటర్ యాప్స్ నుంచి వచ్చే ఆన్‌స్క్రీన్ ప్రామ్ట్స్'తో లాగిన్ అవ్వచును. ఈ ఫీచర్ ప్రస్తుతం కమర్షియల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ వాడటం ఎలా? మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్స్ తమ ఖాతాలను పాస్వర్డ్లెస్కి మార్చుకోవచ్చు. ముందుగా మీ ఖాతాని అథెంటికేటర్ యాప్‌తో అనుసంధానించాలి. తర్వాత మీ మైక్రోసాఫ్ట్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్డ్ సెక్యూరిటీలో పాస్‌వర్డ్‌లెస్ అష్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు అథెంటీకేటర్ యాప్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఓకే చేస్తూ మీ ఖాతాలోకి లాగిన్ కావచ్చు. ఒకవేళ మీరు తిరిగి పాస్వర్డ్ కావాలనుకుంటే ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌లెస్ అష్షన్ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే పాస్‌వర్డ్‌తో కంటే పాస్‌వర్డ్‌లెస్‌తోనే ఆన్లైన్ ఖాతాలకు ఎక్కువ భద్రత ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు కూడా పాస్వర్డ్కి బదులు అథెంటికేషన్ ద్వారా లాగిన్ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే వీటిని ఉపయోగించలా? వద్దా? అనే నిర్ణయాన్ని వినియోగదారులకు ఇచ్చాయి. (చదవండి: Moto G31: మోటోరోలా నుంచి మరో శక్తి వంతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!) -
12345, ఇవేం పాస్వర్డ్లురా నాయనా! మరీ ఇంత బద్ధకమా?
Most Common Passwords In India: నార్డ్‌పాస్ అనే గ్లోబల్ సంస్థ 50 దేశాల్లో పాస్‌వర్డ్‌ల తీరును, వాటిని ఛేదించడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీనికోసం ఈ సంస్థ 4టీబీ సామర్థ్యమున్న డేటాబేస్‌ను విశ్లేషించింది. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భద్రతపరంగా సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సైబర్ భద్రత పరంగా మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. దేశంలో ఎక్కువ మంది తమ ఖాతాలకు పెట్టుకున్న పాస్వర్డ్ ఏంటంటే.. ‘PASSWORD’. పోలీసులు, భద్రతా సంస్థలు సులభంగా ఛేదించగలిగే పాస్వర్డ్లు పెట్టుకోకుండా సంక్లిష్లమైనవి పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. భారత్‌లో ‘PASSWORD’ తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్వర్డ్లు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty and abc 123 ఇవే అని ఆ అధ్యయనంలో తేలింది. వీటిలో india123 తప్ప మిగిలిన వాటిని ఒక సెకను కన్నా తక్కువ సమయంలోనే హ్యాక్ చేయొచ్చు. india123 పాస్‌వర్డ్‌ను కనుక్కునేందుకు మాత్రం 17 నిమిషాలు పట్టింది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు పెరిగిపోయాయి. బడి, గుడి మొదలుకొని అన్నింటా డిజిటల్ సేవలే. బ్యాంకింగ్, ఈ–కామర్స్ వంటి వాటిలో మరీ ఎక్కువ. కరెన్సీ నోట్ల వాడకం తగ్గింది... కార్డులు, ఫోన్ పేమెంట్లు, ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఆయా సేవలు పొందాలంటే మనకు ఆ సంబంధిత సంస్థ వెబ్సైట్లో అకౌంట్ ఉండాలి. దానికి ఒక పాస్వర్డ్ తప్పనిసరి. అయితే, పాస్వర్డ్ బలహీనంగా ఉంటే మన ఖాతాలు హ్యాక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ జీవితానికి గేట్‌వే ‘పాస్వర్డ్లు అనేవి మన డిజిటల్ జీవితాలకు గేట్‌వే లాంటివి. అదీగాక ఆన్లైన్లో మనం గడిపే సమయం క్రమక్రమంగా పెరిగిపోతోంది. అందువల్ల సైబర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం పాస్వర్డ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని అంటారు నార్డ్‌పాస్ సీఈఓ జొనాస్ కర్క్లీస్. దురదృష్టవశాత్తు చాలామంది బలహీనమైన పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారని, వాటిని కూడా ‘ఆరోగ్యకరంగా’ పెట్టుకోవాలని చెబుతారాయన. ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్‌ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో వరుససంఖ్యలు ఉన్నాయి. 50 దేశాల్లో 123456, 123456789, 12345 తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్వర్డ్లు qwerty, password అని పెట్టుకున్నట్లు గుర్తించారు. మన జీవితాల్లో కీలక పాత్ర పోషించే పాస్‌వర్డ్‌ను పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ అధ్యయనం నొక్కిచెప్పింది. ఇది హ్యాకింగ్‌కు, ఇతరుల ఊహలకు అందకుండా ఉండాలి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే
మనలో చాలా మంది ఇంట్లో వాళ్ల పేర్లు, డేటా ఆఫ్ బర్త్‌లు నచ్చిన నెంబర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తుంటాం. మరికొందరు సైబర్ నేరస్తుల నుంచి సేఫ్‌గా ఉండేందుకు 123లు, abcdలను పాస్‌వర్డ్‌లుగా మార్చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రం వాళ్లకు నచ్చిన హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకోవడం చాలా ప్రమాదమని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హీరోల పేర్లు పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే 'దొంగ చేతికి తాళం' ఇచ్చిట్లవుతుందని తేలింది. మోజిల్లా ఫౌండేషన్ సంస్థ పాస్‌వర్డ్‌లపై రీసెర్చ్ నిర్వహించింది. ఆ రీసెర్చ్‌లో భాగంగా Haveibeenpwned.comలో దొరికిన వివరాల ఆధారంగా పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, వోల్వరైన్, ఐరన్ మ్యాన్, వండర్ ఉమెన్, డేర్ డెవిల్, థోర్, బ్లాక్ విడో, బ్లాక్ పంతార్ పేర్లను పెట్టుకున్న వారి అకౌంట్లు ఈజీగా హ్యక్ అయినట్ల వెల్లడించింది. వీరితో పాటు క్లార్క్ కెంట్, బ్రూసీ వ్యాన్, పీటర్ పార్కర్, హీరోల పేర్లతో పాటు ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, 12345, ఏబీసీడీలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవద్దని హెచ్చరించింది. అలా పెట్టుకున్న వారి అకౌంట్లు హ్యాక్ అయినట్లు స్పష్టం చేసింది. మరి ఎలాంటి పాస్వర్డ్లు పెట్టుకోవాలి హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని మోజిల్లా ఫౌండేషన్ తెలిపింది. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్‌తో పాటు '@#$*' ఇలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని సూచించింది. మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్లు ఇవే ఇక తాము నిర్వహించిన రీసెర్చ్‌లో '12345', '54321' పాస్వర్డ్లు అత్యంత ప్రమాదకరమని మోజిల్లా ప్రతినిధులు తెలిపారు. 2020లో పాస్వర్డ్ మేనేజర్ అయిన 'నార్డ్ పాస్' ప్రకారం '123456' మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్ అని తెలిపింది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించిన అకౌంట్లను హ్యాకర్లు 23 మిలియన్ల సార్లు హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.'123456789' లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే సెకన్ల వ్యవధిలో హ్యాక్ చేస్తారని నార్డ్ పాస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..! -
18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..!
నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌మీడియా, ఇతర యూపీఐ యాప్స్, మరికొన్ని యాప్స్‌లను మనలో చాలా మంది వాడుతుంటాం. మనకు సంబంధించిన ఫోటోలను, డాక్యుమెంట్లను, ఇతర సీక్రెట్ అంశాలను స్మార్ట్ఫోన్లలో, లేదా ఆన్లైన్ యాప్స్‌లో, ఇతరులనుంచి రక్షణ పొందేందుకుగాను ఆయా యాప్స్‌కు, ఆన్లైన్ సర్వీసులకు పాస్‌వర్డ్‌లను కచ్చితంగా ఏర్పాటుచేస్తాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనో, లేక పిన్‌తో బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటుచేస్తాం. చదవండి: భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారు ఇదే..! సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై దాడి..! మనం ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త వ్యూహం..! పాస్‌వర్డ్‌లకు స్వస్తి పలుకుతూ నూతన ఒరవడి సృష్టించాలని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మైక్రోసాఫ్ట్ ముమ్మరం చేస్తోంది. ఇకపై పాస్వర్డ్స్లేకుండా మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో, ఖాతాలో లాగిన్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ దృష్టిసారించింది. పాస్వర్డ్స్లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ అథనిటికేటర్, విండోస్ హలో, లేదా వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ లాగిన్ ఫీచర్ విధానంతో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన యాప్స్‌కు వర్తించేలా చేయనుంది. అందులో ఔట్లూక్ ,వన్‌డ్రైవ్ , మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్స్ లేకుంగా లాగిన్ అయ్యే ఫీచర్‌ను 2019లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కమర్షియల్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్లు యూజర్లు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆప్షన్లో, అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్స్‌లో పాస్‌వర్డ్‌లెస్ అకౌంట్ ఆప్షన్‌ను టర్నఆన్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ అథనికేటర్ యాప్స్నుంచి వచ్చే ఆన్‌స్క్రీన్ ప్రామ్ట్స్ తో లాగిన్ అవ్వచును. ఈ ఫీచర్ ప్రస్తుతం కమర్షియల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! -
ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఈ-మెయిల్ ఐడీ, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, సోషల్ మెసేజింగ్ యాప్స్ వంటి వాటికి పాస్వర్డ్ పెట్టుకోవడం తప్పనిసరి. అయితే, ఇలాంటి కీలకమైన విషయాలలో ప్రజలు చాలా వరకు అజాగ్రత్తగా ఉంటారు. అందుకే, దేశంలో రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరిగి పోతుంది. చాలా మంది తమ ఖాతాలను సులభంగా గుర్తు పెట్టుకోవడం కోసం సులువైన పాస్వర్డ్లు పెట్టుకుంటారు. ఈ అజాగ్రత్తే వారిని సైబర్ మోసాల బారిన పడేలా చేస్తోంది. అయితే, ఇలాంటి సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు) ఎస్బీఐ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఖాతాదారులు అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్లు కలిసి ఉండే విధంగా పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఉదా: aBjsE7uG ఖాతాదారులు నెంబర్లు, సింబల్స్ రెండింటినీ ఉపయోగించి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఉదా: AbjsE7uG61!@ ఫుల్ సెక్యూరిటీ కోసం కనీసం 8 క్యారెక్టర్లు గల పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఉదా: aBjsE7uG సాధారణంగా డిక్షనరీలో ఉండే పదాలు, సులువుగా ఉండే పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. ఉదా: itislocked, thisismypassword ఎస్బీఐ కస్టమర్లు "qwearty" లేదా "asdfg" వంటి కీబోర్డులో వరుసగా ఉండే పదాలను వాడరాదు. దానికి బదులుగా ":)", ":/" వంటి వాటిని వాడవచ్చు. 12345678 లేదా abcdefg వంటి పాస్వర్డ్ లను అసలు పెట్టుకోరాదు. ఖాతాదారులు సులభంగా/ తేలికగా ఊహించగల పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. ఖాతాదారులు మీ పేరు, పుట్టినతేదీ, లేదా మీ కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన తేదీని అసలు పెట్టుకోకూడదు. ఉదా : Ramesh@1967. "మీ పాస్వర్డ్ అనేది ప్రత్యేకంగా ఉండటంతో పాటు బలంగా(Storng) ఉండే విధంగా" పెట్టుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. A strong password ensures higher levels of security. Here are 8 ways in which you can create an unbreakable password and protect yourself from cybercrime. Stay alert & #SafeWithSBI! #CyberSafety #StrongPassword #OnlineSafety #CyberCrime #StaySafe pic.twitter.com/ScSI8H5ApF — State Bank of India (@TheOfficialSBI) August 18, 2021 -
పాస్వర్డ్ సింపులా.. ప్రమాదంలో ఉన్నట్లే
సైబర్ సెక్యూరిటీ.. ఇప్పుడు ఎక్కువగా దీనిపైనే చర్చ.. అందుకే ప్రతిదానికి ఓ రహస్య పాస్వర్డ్. అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. మీ ఖాతా అంత సురక్షితం అన్నట్లు లెక్క. అయితే.. చాలామంది కామన్‌గా ఉండే పాస్ట్‌వర్డ్స్ వాడుతుంటారు.. ఐ లవ్ యూ అని.. 12345 అని ఇలా.. హ్యాకింగ్ చేయడానికి కొందరు ఏదో ఒకటి తగిలేదాకా.. కామన్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పాస్వర్డ్ పెట్టుకుంటే.. మన ఖాతా ప్రమాదంలో పడ్డట్లే. దీనికి సంబంధించి నార్డ్‌పాస్ ఏటా వరస్ట్ పాస్వర్డ్స్ జాబితా విడుదల చేస్తోంది. అంటే.. వాటిని ఈజీగా హ్యాక్ చేయొచ్చని అర్థం. ఇలాంటివి మొత్తం 200 పాస్‌వర్డ్‌ల వివరాలు.. వాటిని హ్యాక్ చేయడానికి పట్టే సమయం వంటివాటిని https://nordpass.com/most commonpasswordslistలోఉంచింది. మీరూ ఓసారి చెక్ చేసుకోండి.. ఒకవేళ మీ పాస్వర్డ్ కనుక ఇందులో ఉంటే.. వెంటనే మార్చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడైతే.. టాప్–8 జాబితా చూద్దాం.. -
ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ
బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వంటి వాటికీ పాస్వర్డ్ ఎంత కఠినంగా ఉంటే మన ఖాతాలు అంత భద్రంగా ఉంటాయి. కానీ చాలా మంది అటు తిప్పి, ఇటు తిప్పి ఇంతక ముందు ఉపయోగించిన పాస్వర్డ్ లను వాడుతుంటారు. దీనివల్ల వారు హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. అందుకే భద్రత నిపుణులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ లను మార్చుకోవాలని సూచిస్తుంటారు. ఎక్కువ శాతం ప్రజలు సులభంగా గుర్తు పెట్టుకోవడానికి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, బండి నెంబర్, క్రీడలు, ఆహారం, ప్రదేశాలు, జంతువులు లాంటి వాటిని పాస్‌వర్డ్స్‌గా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌తో ప్రమాదం చాలా ఎక్కువ. మీ ఖాతాలను కొల్లగొట్టడానికి హ్యాకర్లకు పెద్ద కష్టం కాదు అని గుర్తు ఉంచుకోవాలి. సులభంగా గుర్తు ఉంటాయని పెట్టుకున్నపాస్వర్డ్స్ హ్యాకింగ్ గురి అవుతున్నాయి. డార్క్ వెబ్‌లో ఎక్కువగా కనిపించే పాస్‌వర్డ్స్‌తో ఈ జాబితాను రూపొందించి టెక్ నిపుణులు రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని వర్గాలుగా విభించిన ఎక్కువ శాతం మంది ఉపయోగించిన డార్క్ వెబ్‌లో కనిపించే అత్యంత సాధారణ పాస్వర్డ్లు ఇక్కడ ఉన్నాయి. పేర్లు: మాగీ క్రీడలు: బేస్ బాల్ ఆహారం: కుకీ స్థలాలు: న్యూయార్క్ జంతువులు: నిమ్మకాయ ప్రసిద్ధ వ్యక్తులు/పాత్రలు: టిగ్గర్ మీ పాస్వర్డ్ క్రింద సూచించిన వాటిలో ఉంటే తక్షణమే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్‌పాస్ సూచిస్తుంది. అలాగే ప్రపంచంలో ఎక్కువగా డార్క్ వెబ్‌లో కనిపించే అత్యంత పాస్వర్డ్లు ఇక్కడ ఉన్నాయి. 1) 123456 2) password 3) 12345678 4) 12341234 5) 1asdasdasdasd 6) Qwerty123 7) Password1 8) 123456789 9) Qwerty1 10) 12345678secret 11) Abc123 12) 111111 13) stratfor 14) lemonfish 15) sunshine 16) 123123123 17) 1234567890 18) Password123 19) 123123 20) 1234567 -
2020లో అత్యంత చెత్త పాస్వర్డ్ ఇదే
కంప్యూటర్ యుగం ఇది. ప్రతి చిన్న పనికి మనం టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్‌లలో మన వ్యక్తిగత సమాచారాన్ని దాచుకుంటున్నాం. ఈ సమాచారం అంతా బహిర్గతం కాకుండా ఉంచడంలో పాస్వర్డ్లు కీరోల్ పోషిస్తున్నాయి. అందుకే మనం క్రియేట్ చేసే పాస్ వర్డ్ చాలా కష్టంగా ఉండాలని నార్డ్ పాస్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. తేలికైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేస్తే.. హ్యాకర్లు సులభంగా సమాచారాన్ని తస్కరిస్తారని హెచ్చరించింది. ఇక ఈ ఏడాదికి గాను ప్రపంచంలో అత్యంత చెత్త పాస్వర్డ్లు ఇవేనని కొన్ని రకాల పాస్‌వర్డ్‌లను విడుదల చేసింది. 2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ 123456 అని వెల్లడించింది. దీన్ని హ్యాకర్లు 2.3 కోట్ల సార్లు ఛేదించారట. దీని తర్వాత స్థానంలో 1234567889 ఉంది. మూడో స్థానంలో picture1 అనే పాస్ వర్డ్ నిలిచింది. వీటితో పాటు password,123456, qwerty, ‘111111’, ‘12345678’, ‘123123’, '12345' '1234567890’, ‘1234567’, ‘qwerty, ‘abc123’, ‘Million2’, ‘000000’, ‘1234’, ‘iloveyou’, ‘aaron431’, ‘password1’, ‘qqww1122’లను అత్యంత చెత్త పాస్ట్వర్డ్లుగా ప్రకటించింది. ప్రపంచంలో అనేకమంది ఇలా సాధారణమైన పాస్ వర్డ్ లు పెట్టుకుని హ్యాకర్ల బారినపడుతుంటారని నార్డ్ పాస్ వెల్లడించింది. ఆన్ లైన్ లో మన వ్యక్తిగత సమాచారం, ఆన్ బ్యాంకింగ్ లో మన డబ్బు సురక్షితంగా ఉండాలంటే క్లిష్టంగా ఉండే పాస్ వర్డ్ ను ఎంపిక చేసుకోవాలని, లేదంటే హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. అలాగే ప్రతి 90 రోజులకు ఒకసారి పాస్ట్‌వర్డ్‌లను మార్చు కోవాలని సూచించింది. -
అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితా ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్న తరుణంలో యూజర్‌నేమ్స్, పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద టాస్కే. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఇలా ఒకటా రెండా.. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే కత్తిమీద సామే. అందుకే సులభంగా ఉండేలా 12345 లాంటివి, లేదంటే పుట్టిన రోజు తేదీలను పాస్‌వర్డ్‌లుగా తమ అకౌంట్లకు పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ "123456789," ఐలవ్ యూ" లాంటి హ్యాక్-టు-హ్యాక్ పాస్‌వర్డ్‌లనే వాడుతున్నారట. నార్డ్‌పాస్ సంస్థ 2020 సంవత్సరానికిగాను అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం "123456" టాప్‌లోఉంది. ఈ ఏడాది 2,543,285 మంది ఇదే పాస్వర్డ్ వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ఇదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2015లో 123456 పాస్ వర్డ్ సదరు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత పాస్వర్డ్ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో 123456 అనే పాస్వర్డ్ చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఇంకా పొకేమాన్, చాకొలెట్ లాంటి పాస్వర్డ్లు కూడా ఇంకా వాడుతున్నారు. అయితే ఏడాది ఈ జాబితాలో పిక్చర్1, సెన్హా (పోర్చుగీసులో పాస్వర్డ్ అని అర్థం) అనే రెండు కొత్త పదాలు కొత్తగా చేరాయని తెలిపింది. 10 మోస్ట్ కామన్ పాస్వర్డ్లు 1. 123456 2. 123456789 3. పిక్చర్ 1 4. పాస్వర్డ్ 5. 12345678 6. 111111 7. 123123 8. 12345 9. 1234567890 10. సెన్హా మీ పాస్వర్డ్ జాబితాలో ఉంటే, తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్‌పాస్ సూచిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని, లేదంటే వ్యక్తిగత డేటాతోపాటు, నగదును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
పాస్వర్డ్లు చోరీ అయ్యాయి.. జాగ్రత్త
న్యూఢిల్లీ: నిర్దిష్ట వెబ్సైట్లను ఉపయోగించే వారి పాస్వర్డ్లు చోరీకి గురై ఉంటాయని, వాటిని తక్షణమే మార్చుకోవాలని భారత్‌లోని యూజర్లను టెక్ దిగ్గజం గూగుల్ అప్రమత్తం చేసింది. మీడియా సంస్థలు మొదలుకుని సామాన్య యూజర్ల దాకా చాలా మంది ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ స్క్రీన్లపై గురువారం ఈ మేరకు నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా లీకేజీ కారణంగా పాస్వర్డ్లు చోరీకి గురై ఉంటాయని వీటిల్లో గూగుల్ పేర్కొంది. ఆహారోత్పత్తులు విక్రయించే ఫ్రెష్హోమ్ అనే ఈ–కామర్స్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా వార్నింగ్ పాప్ అప్ వచ్చినట్లు ఓ యూజరు వెల్లడించారు. అలాగే తమ గ్రూప్‌నకు చెందిన ఓ పోర్టల్‌లో లాగిన్ అయ్యే క్రమంలో ఇలాంటి నోటిఫికేషన్ ప్రత్యక్షమైనట్లు ఓ మీడియా సంస్థ వర్గాలు తెలిపాయి. క్రోమ్ 79లో బగ్‌ను గూగుల్ అతికష్టం మీద సరిచేయగా ఇంతలోనే మళ్లీ పాస్‌వర్డ్‌ల చోరీ అలర్ట్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాస్‌వర్డ్‌లకు మరింత భద్రత కల్పించే విధంగా క్రోమ్ 79 బ్రౌజరును గూగుల్ తీర్చిదిద్దింది. -
మందులోళ్లే.. మాయలోళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఇది మందులోళ్ల మాయాజాలం.. మందుల కొను‘గోల్మాల్’.. కమీషన్ల కహానీ. కాసుల కక్కుర్తి.. ఇదీ సర్కార్ ఆసుపత్రుల్లో సాగుతున్న తతంగం. ప్రభుత్వాసుపత్రిలో అవసరమున్నా లేకపోయినా ఇష్టారాజ్యంగా మందులకు ఇండెంట్లు పెట్టడం, తద్వారా కంపెనీల నుంచి కమీషన్లు పొం దడం వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులకు, ఫార్మసిస్టులకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో జరిగిందే నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఘటన. ఈ కేంద్రానికి 500 ట్రెమడాల్ మాత్రలు అవసరంకాగా, ఏకంగా 10 వేల మాత్రలు పంపించారు. ఆ మాత్రల వల్లే ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తేలిందేంటంటే, ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద మం దుల ఇండెంట్ పెట్టేందుకుగాను ఆన్‌లైన్‌కు సంబం ధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కొందరు ఫార్మసిస్టులు దొంగిలించి ఇండెంట్లు పెట్టడం. ఈ వ్యవహా రం ఆ శాఖలో సంచలనంగా మారింది. దీంతో సద రు ఫార్మసిస్టులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. కింది నుంచి పైస్థాయి వరకు కమీషన్ల కక్కుర్తి మందుల కొనుగోలుకు సంబంధించి ప్రతి ఆస్పత్రికి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తారు. అది ఆసుపత్రి ప్రధానాధికారికి మాత్రమే తెలుస్తుంది. గతంలో పీహెచ్‌సీల్లోని మెడికల్ ఆఫీసర్ మందులకు ఇండెంట్ పెడితే అది జిల్లా వైద్యాధికారికి చేరేది. అక్కడి నుంచి ప్రజారోగ్య సంచాలకులకు అవి చేరేవి. బోధనాసుపత్రులైతే వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆసుపత్రులైతే సంబంధిత కమిషనర్‌కు చేరేవి. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు ఇండెంట్ పెట్టేవారు. వారికి కేటాయించిన బడ్జెట్ ఆధారంగా మందుల సరఫరా జరిగేది. దీని స్థానంలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. దీంతో ఏ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మందులు కావాలన్నా నేరుగా టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెడుతున్నారు. అయితే, టీఎస్ఎంఎస్ఐడీసీకి మందుల సరఫరా చేసే కంపెనీలతో ఫార్మసిస్టులు, డాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. అవసరం లేకపోయినా ఫలానా మందు లు కావాలని ఇండెంట్ పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా ఫార్మసిస్టులే ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సేకరించి టీఎస్ఎంఎస్ఐడీసీకి నేరుగా మందుల ఇండెంట్ పెడుతున్నారు. ఆ మందులను వాడకపోతే ఎందుకు తెప్పించారో సర్కారుకు సమాధానం చెప్పాల్సి ఉం టుంది. అందుకే తెప్పించిన మందులను గడువుకు కొద్దినెలలు ముందుగా టీఎస్ఎంఎస్ఐడీసీకి వెనక్కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి మళ్లీ ఏవో కొన్ని పీహెచ్‌సీలకు అవి వెళ్తుంటాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇద్దరు ఫార్మసిస్టులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తస్కరించి టీఎస్ఎంఎస్ఐడీసీకి భారీగా మందుల కొనుగోలు ఇండెంట్ పెట్టారు. విషయాన్ని గ్రహించిన ఎంజీఎం వైద్యాధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఫార్మసిస్టులు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఒక నివేది కను డీఎంఈకి పంపారు. దాని ఆధారంగా ఆ ఫార్మ సిస్టులను సస్పెండ్ చేయాల్సిందిగా డీఎంఈ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆస్ప త్రులు పెట్టే మందుల ఇండెంట్లను పరిశీలించి, పర్యవేక్షించేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీలో ఒక వ్యవస్థ ఉం టుంది. ఆ అధికారులు ఇండెంట్లను పర్యవేక్షించాలి. కానీ వారు కూడా కంపెనీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Government hospitals Pharmacists Passwords Indents Department of Health -
షాకింగ్ న్యూస్ చెప్పిన ఫేస్బుక్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. డేటా భద్రతపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తమ యూజర్ల వందల మిలియన్ల పాస్‌వర్డ్‌లను తమ ఇంటర్నల్ సెర్వర్లలో దాచిపెట్టినట్టు గురువారం ధృవీకరించింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన (ప్లెయిన్ టెక్స్ట్) ఫార్మాట్లోనే సర్వర్లలో నిక్షిప్తం చేసామని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూలో ఈ విషయాన్ని ఫేస్బుక్వెల్లడించింది. అయితే ఈ పాస్వర్డ్లు ఫేస్బుక్ ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని వివరణ ఇచ్చింది. ఫేస్బుక్ ఇంజినీరింగ్, భద్రత, గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి తన ‘బ్లాగ్స్పాట్’లో దీనిపై వివరణ ఇచ్చారు. ఏటా జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలేవీ లేవని, ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన అంగీకరించారు. కాకపోతే ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్వర్డ్లు కలిగి ఉన్నఫేస్బుక్ లైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు త్వరలోనే ఈ విషయమై తగిన హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తామన్నారు. కొత్త పాస్వర్డ్లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు. కాగా క్రెబ్స్ఆన్సెక్యూరిటీ.కామ్ అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్సైట్ ఇంతకుముందెప్పుడో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. గత కొన్నేళ్లుగా 60 కోట్లమంది ఫేస్బుక్ ఖాతాదారుల పాస్వర్డ్లు సాధారణ అక్షరాల్లోనే నిల్వ ఉంచారని, గుప్త అక్షరాల్లో నిక్షిప్తం చేయలేదని, 20వేలమంది ఫేస్బుక్ ఉద్యోగులు వాటిని చూడగలరని తెలిపింది. దీంతో ఫేస్బుక్ గోప్యతపై సర్వత్రా అనుమానాలు తలెత్తాయి. అయితే 2012కు ముందు పెట్టుకున్న పాస్వర్డ్లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయని, ఆ తరువాత పాస్వర్డ్లు మార్చుకున్నవారు, కొత్త యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా క్రెబ్స్ నివేదించింది. -
సేవ్ చేసిన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాలు చోరి
న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో మరో కొత్త మాల్వేర్ విజృంభించింది. ఫైర్‌బాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లలో నిక్షిప్తం చేసుకున్న ఫైనాన్సియల్ డేటాను అది చోరి చేసేస్తోంది. అదే వేగా స్టీలర్. వేగా స్టీలర్ అనే కొత్త మాల్వేర్ యూజర్లు సేవ్ చేసుకున్న అత్యంత కీలకమైన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఫైర్‌బాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ల నుంచి దొంగలిస్తుందని ప్రూఫ్‌పాయింట్ రీసెర్చర్లు పేర్కొన్నారు. చిన్న చిన్నగా చేస్తున్న ఈ దాడులు, భవిష్యత్తులో వ్యాపారాలకు పెనుముప్పుగా పరిణమించనుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. వేగా స్టీలర్ అనేది ఆగస్ట్ స్టీలర్కు వేరియంట్ అని, ఇది అత్యంత కీలకమైన, రహస్యకరమైన డాక్యుమెంట్లను, క్రిప్టోకరెన్సీని, ఇతర ముఖ్యమైన సమచారాన్ని చోరి చేస్తుందని పేర్కొన్నారు. సేవ్ చేసుకున్న కీలకమైన సమాచారాన్ని దొంగలించడంపైనే ఈ మాల్వేర్ ఎక్కువగా ఫోకస్ చేసిందని, గూగుల్ క్రోమ్, ఫైర్బాక్స్ల నుంచి పేమెంట్ సమాచారాన్ని చోరి చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు. కీలకమైన సమాచారంలో పాస్వర్డ్లు, ప్రొఫైల్స్, సేవ్ చేసుకున్న క్రెడిట్ కార్డు వివరాలు, కుకీస్ ఉన్నాయి. కేవలం సమాచారాన్ని దొంగలించడమే కాకుండా.. ప్రభావితమైన డివైజ్‌లను స్క్రీన్షాట్లను తీస్తుందని, .doc, .docx, .txt, .rtf, .xls, .xlsx, or .pdf తో ముగిసే ఫైళ్లను స్కాన్ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్వేర్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్, రిటైల్, తయారీ, మానవ సంబంధాల విభాగాలపై ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. -
వెంటనే ట్విటర్ పాస్వర్డ్లు మార్చేయండి!
ట్విటర్ యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేసుకోవాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ఆదేశించింది. తమ ఇంటర్నల్ కంప్యూటర్ సిస్టమ్‌లో ఒక బగ్ గుర్తించినట్టు ట్విటర్ పేర్కొంది. గురువారం నుంచి కంపెనీ ఈ బగ్‌పై పలు పోస్టులు, ట్వీట్లు చేసింది. ప్రస్తుతం సమస్యను పరిష్కరించామని, అయితే పాస్‌వర్డ్‌లను ఇన్సైడర్లు దొంగలించినట్టు, దుర్వినియోగ పరిచినట్టు ఎలాంటి సంకేతాలు లేవని పేర్కొంది. అయినప్పటికీ పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం వల్ల మరింత జాగ్రత్తగా ఉండొచ్చని సూచించింది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్ నుంచి స్టోర్ చేసిన పాస్‌వర్డ్‌లన్నింటిన్నీ తొలగించామని, ఎవరికీ పాస్వర్డ్లు ఇక కనిపించవని ట్విటర్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ కూడా తాజా బగ్‌పై ట్వీట్ చేశారు. తమ నెట్వర్క్ లోపం వల్ల ఎన్ని పాస్వర్డ్లు ప్రభావితమయ్యాయో మాత్రం ట్విటర్ వెల్లడించలేదు. ప్రస్తుతం ట్విటర్ ప్లాట్‌ఫామ్‌పై 300 మిలియన్ మంది యూజర్లున్నారు. ప్రతి ఒక్కరినీ ఈ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని ట్విటర్ ఆదేశిస్తోంది. ప్రభావితమైన పాస్‌వర్డ్‌ల సంఖ్య గణనీయంగానే ఉంటుందని.. కొన్ని నెలల కిందటి నుంచే వాటిని దుర్వినియోగం చేసి ఉంటారని భావిస్తున్నారు. ట్విటర్ బ్లాగ్ ప్రకారం... హ్యాషింగ్ (పాస్‌వర్డ్‌లను గుర్తులుగా మార్చే ప్రక్రియ)లో సమస్య వచ్చింది. అయితే హ్యాషింగ్ ప్రక్రియకు ముందుగానే ఒక బగ్ పాస్‌వర్డ్‌లను అంతర్గత కంప్యూటర్లలో స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి తాము చాలా చింతిస్తున్నట్లు ట్విటర్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ట్విటర్ చెప్పింది. మీ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్ యూజర్లకు సూచించింది. We recently found a bug that stored passwords unmasked in an internal log. We fixed the bug and have no indication of a breach or misuse by anyone. As a precaution, consider changing your password on all services where you’ve used this password. https://t.co/RyEDvQOTaZ — Twitter Support (@TwitterSupport) May 3, 2018 -
90 శాతం జీమెయిల్ అకౌంట్లకు హ్యాకర్ల ముప్పు
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా అధునాతన హ్యాకర్ల ముప్పు పెరుగుతున్నప్పటికీ, జీమెయిల్ అకౌంట్ యూజర్లు మాత్రం అసలు జాగ్రత్తగా లేరని తెలిసింది. దాదాపు 90 శాతం జీమెయిల్ అకౌంట్ యూజర్లకు సైబర్ దాడి పొంచుకుని ఉందని గూగుల్ తెలిపింది. 10 శాతం మంది కంటే తక్కువ మంది జీమెయిల్ యూజర్లు మాత్రమే హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు రెండు దశల ప్రమాణీకరణను కలిగి ఉన్నారని చెప్పింది. యూజర్ల అకౌంట్ల యాక్సస్‌ను పొందడానికి హ్యాకర్లకు అత్యుత్తమ మార్గం పాస్‌వర్డ్‌లని, ముఖ్యంగా వ్యాపారవేత్తలు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని, వెంటనే రెండు దశల ప్రమాణీకరణను అమలు చేసుకోవాలని గూగుల్ ఇంజనీర్లు తెలిపారు. కేవలం 12 శాతం మంది అమెరికన్లు మాత్రమే తమ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్‌ను కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన న్యూస్ వెబ్సైట్ టెక్ రిపబ్లిక్ రిపోర్టు చేసింది. అకౌంట్లు హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు, పాస్‌వర్డ్‌లను కాపాడుకోవడానికి రెండు దశల ప్రమాణీకరణ ఎంతో ముఖ్యమని తెలిపింది. 2011లో తొలిసారి గూగుల్ ఈ రెండు దశల ప్రమాణీకరణను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పటివరకు ఈ సురక్షిత చర్యలను ఎక్కువ మంది పాటించడం లేదు. లాగిన్ అయిన కొన్ని సెకన్లకే ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. కానీ ఈ ఫీచర్‌ను గూగుల్ యూజర్లందరికీ తప్పనిసరి చేయలేదు. ఇటీవల కాలంలో యూజర్ల భద్రతను మెరుగుపరుచేందుకు గూగుల్ పలు చర్యలను తీసుకుంటోంది. -
బీఎస్ఎన్ఎల్ పై మాలావేర్ ఎటాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ హ్యాకింగ్ బారిన పడింది. దీంతో వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుకు సూచించింది. పలు బ్రాడ్‌బ్యాండ్ సిస్టమ్‌లపై ఇటీవల మాల్వేర్ దాడులు జరగడంతో డిఫాల్ట్ సిస్టమ్ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది పిటిఐ నివేదిక ప్రకారం, దాదాపు 2,000 బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు దాడికి గురయ్యాయి. వెంటనే వీటి డిఫాల్ట్ పాస్వర్డ్ ‘అడ్మిన్’ను మార్చుకోవాలని సంస్థ కస్టమర్లను కోరింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సిస్టంలోని కొంత భాగంగా మాల్వేర్ దాడికి గురైంది. దీంతో తమ సొంత బ్రాడ్ బాండ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. చందాదారులు డిఫాల్ట్ పాస్వర్డ్ మార్చకపోవడం మూలంగానే మాలావేర్ దాడికి గురయ్యాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే పరిస్థితిని చాలావరకు చక్కదిద్దామని, కానీ వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చకోవాలని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ సలహా ఇచ్చారు. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు, ఆందోళన అవసరంలేదని చెప్పారు. అయితే తమ ప్రధాన నెట్ వర్క్, బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థను ప్రభావితం చేయలేదని తెలిపారు. -
‘సోషల్’ పాస్వర్డ్స్ చెబితేనే వీసా!
సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలు వెల్లడిస్తేనే అమెరికాలోకి ఎంట్రీ ► అమలు ప్రయత్నాల్లో ట్రంప్ సర్కారు వాషింగ్టన్: విదేశీయులకు వీసాల జారీని మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. అమెరికాలో పర్యటించాలనుకుంటే ఇక నుంచి సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్స్‌ను చెప్పాల్సి రావచ్చని వైట్‌హౌస్ అధికారులు గురువారం వెల్లడించారు. పాస్వర్డ్స్ సాయంతో ఫేస్బుక్, ట్వీటర్ వంటి ఖాతాల్ని పరిశీలించి వీసా దరఖాస్తుదారుల పూర్వపరాలను అంచనావేస్తామన్నారు. ‘విదేశీ ప్రయాణికుల్ని సోషల్ మీడియా ఖాతాల వివరాలతో పాటు,పాస్‌వర్డ్స్‌ను ఎంబసీ అధికారులు అడగొచ్చు. ఏ వెబ్సైట్లు చూస్తున్నారో వెల్లడించడంతో పాటు పాస్వర్డ్స్ తెలపాల్సిన అవసరముంటుంది.అప్పుడే ఇంటర్నెట్లో వారు ఏం చేస్తున్నారో పరిశీలించగలం’ అని అమెరికా హోం ల్యాండ్ భద్రతా కార్యదర్శి జాన్ కెల్లీ పేర్కొన్నారు. కేవలం ఏడు దేశాలకు చెందిన పౌరులకే ఈ నిబంధన వర్తిస్తుందా? లేక అన్ని దేశాలకా? అన్న దానిపై వైట్‌హౌస్ స్పష్టత ఇవ్వలేదు. దరఖాస్తుదారులు సహకరించకపోతే, అమెరికాకు రాలేరని చెప్పారు. ప్రస్తుతానికి ఇది ఆలోచన దశలోనే ఉందని పేర్కొన్నారు. ఆర్థిక వివరాల్ని ప్రశ్నిస్తాం: వైట్‌హౌస్ ‘అదనపు నిబంధనలు పెట్టనున్నాం. ఆర్థిక వివరాల్ని తెలుసుకుంటారు. జీవనాధారం ఏంటి? డబ్బు ఎవరు పంపారు? వంటి వివరాలు తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. అటార్నీగా సెషన్స్ ఎంపికపై డెమొక్రాట్ల అభ్యంతరం ట్రంప్ అటార్నీ జనరల్‌గా జెఫ్ సెషన్స్ ఖరారయ్యారు. సెషన్స్ అభ్యర్థిత్వంపై డెమొక్రాట్లు అభ్యంతరం తెలపడంతో సెనెట్‌లో దాదాపు 30 గంటల సుదీర్ఘ చర్చ సాగింది. అయితే చివరికి 52–47 ఓట్ల తేడాతో ఆయన గట్టెక్కారు. ఒక దశలో లిబరల్ పార్టీ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ , రిపబ్లికన్ల మధ్య తీవ్ర వాగ్వాదం సాగింది. పౌర, వలసదారుల హక్కుల వ్యతిరేకిగా ముద్రపడ్డసెషన్స్ ను అటార్నీగా ఎలా నియమిస్తారు? అంటూ సెనెట్‌లో డెమొక్రాట్లు ప్రశ్నించారు. 1997 నుంచి అలబామా సెనెటర్‌గా ఉన్న సెషన్స్ 84వ అటార్నీ జనరల్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, అమెరికా, చైనాలకు ప్రయోజనం కలిగేలా నిర్మాణాత్మక సంబంధాలు నెలకొనాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు లేఖ రాశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా రూపొందించిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలంటూ దుకాణ యజమానుల్ని వైట్‌హౌస్ సలహాదారురాలు కెల్లీఅన్నే కోరారు. ఇవాంక తయారుచేస్తున్న దుస్తుల్ని విక్రయించకూడదని ప్రముఖ డిపార్ట్మెంటల్ స్టోర్ నార్డ్స్రూ్టమ్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.